fearless
-
కింగ్ కోబ్రాకు కిస్.. నెటిజన్లు ఫైర్.. వీడియో వైరల్..
ఫేమస్ అయిపోవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు పోస్టు చేసి లైక్స్, వ్యూస్ చూసి తమ పలుకుబడి ఎంత ఉందో అంచనా వేసుకుంటారు. రాత్రికి రాత్రే ఫేమస్ కావడానికి ప్రాణాల మీదకు వచ్చే పనులు కూడా చేస్తుంటారు. అయితే.. ఇందులో కొందరు సహజంగా విభిన్నమైన టాలెంట్‌ను ప్రపంచానికి చూపించే వారు కూడా ఉండకపోరు. తాజాగా ఓ వ్యక్తి కింగ్ కోబ్రాకు కిస్ పెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. పాములంటే ఎంత భయం. చూడగానే వన్నులో వణుకు వస్తుంది. కానీ కొందరు వాటితో కూడా స్నేహం చేసే వారు ఉంటారు. ఈ కోవకే చెందిన వ్యక్తేనేమో నిక్. తను ఓ కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు. చాలా పొడవు ఉన్న ఆ పాము పడగ విప్పిన వేళ.. దానికి వెనకు నుంచి ధైర్యంగా ముద్దు పెట్టాడు. కానీ ఆ కింగ్ కోబ్రా ఆయన్ని ఏమీ అనలేదు. ఈ వీడియోను నిక్ తన ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు భారీగా స్పందించారు. నిక్ ధైర్యాన్ని మెచ్చుకున్నారు కొంత మంది నెటిజన్లు. పాములపై తమ భయాన్ని వెలిబుచ్చారు మరికొందరు. 'పోతావ్ రేయ్..' అంటూ మరికొంత మంది క్రేజీగా స్పందించారు. ఏదేమైనా పాములకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ వీడియోకు వారం రోజుల్లోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఇదీ చదవండి: ఇద్దరు యువతులు పెళ్లి.. లింగమార్పిడి చేసుకుని.. -
ఆనకొండతో ఆడుకుంటున్న డేర్ అండ్ డాషింగ్ గర్ల్ హిమజ! (ఫొటోలు)
-
మొసలిని వణికించిన కుక్క
-
మొసలిని వణికించిన కుక్క
బలం కన్నా ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నవారిని విజయం వరిస్తుంది. ఈ సూత్రం మనుషులకేకాక జంతువులకూ వర్తిస్తుంది. ఇందుకు తాజా ఆస్ట్రేలియాలోని గోట్ ఐర్లాండ్ తీరంలో జరిగిన ఘటనే నిదర్శనం. ఆకలితో ఉన్న ఒక భారీ మొసలి ఆహారం కోసం తీరం ఒడ్డుకు వచ్చింది. పచ్చటి గడ్డి మీద ఎవరికీ కనిపించకుండా.. జంతువు కోసం ఎదురు చూస్తోంది. ఏ జంతువైనా అక్కడి వచ్చింటే.. మొసలి చేతిలో చచ్చేదే. మొసలి చేష్టలను ఒక కుక్క దూరంనుంచి గమనిస్తూనే ఉంది. కొన్ని క్షణాల తరువాత కుక్క.. అత్యంత వేగంగా మొసలి తోక మీద దాడి చేసింది. కుక్క దాడికి భయపడ్డ మొసలి నీటిలోకి జారుకుంది. నార్తరన్ టెరిటరీకి చెందిన కేసీ అనే వ్యక్తి నది ఒడ్డున విహరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన కుక్క పోరాటాన్ని వీడియో తీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. -
తుపాకీతో బెదిరించిన దొంగను ఉతికి ఆరేసింది!
ఓ దొంగోడు వచ్చి తుపాకీని పాయింట్ బ్లాంక్‌లో పెట్టి బెదిరిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? భయపడతారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. దొంగ ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ భారతీయ మహిళ మాత్రం అలా భయపడలేదు. తుపాకీ చూపినా దొంగకు లొంగిపోలేదు. క్యాష్ బాక్స్ ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన అతడిపై అపర కాళికలా విరుచుకుపడింది. తుపాకీని పక్కకుతోసేసి ఆ కుర్ర దొంగను చితకబాదింది. అంతటితో ఆగకుండా చేతికందిన సుత్తెతో రాణిరుద్రమ్మలా దాడికి ఉద్యుక్తం కావడంతో బెదిరిపోయిన ఆ దొంగ క్యాష్ బాక్స్ వదిలేసి పరుగులంకించుకున్నాడు. ఈ ఘటన అమెరికాలోని కీస్విల్లెలో జరిగింది. కీస్విల్లేలోని ఓ కిరాణ దుకాణంలో భూమిక పటేల్ అనే భారతీయ మహిళ క్యాషియర్‌గా పనిచేస్తుంది. 17 ఏళ్ల క్రిష్టియన్ డకోటా ఆమె దుకాణంలో దొంగతానికి ప్రయత్నించాడు. తుపాకీని పాయింట్ బ్లాంక్‌లో పెట్టి డబ్బు ఇచ్చేయమంటూ బెదిరించాడు. కానీ వాడిని బెంబేలెత్తిస్తూ.. భూమిక పటేల్ అపర చండిక అవతారమెత్తింది. 'నన్ను కాలుస్తావా.. కాల్చేయ్' మంటూ ఎదురుదాడి చేసింది. తుపాకీని బేఖాతరు చేస్తూ చేతికందిన వస్తువుతో చితకబాదింది. అంతటితో ఆగకుండా ఓ సుత్తెతో ఆమె దాడికి ఉద్యుక్తం కావడంతో డకోటా తన దుండగాన్ని మానుకొని పరుగులు లంకించాడు. అపర చండికలా వీరోచిత సాహసాన్ని ప్రదర్శించిన భూమిక పటేల్ ఇప్పుడు స్థానికంగా పెద్ద ఐకాన్ అయ్యారు. ఆమె గురించి స్థానిక మీడియా గొప్పగా కథనాలు ప్రచురిస్తోంది. ఆమె దొంగను చితకబాదిన సీసీటీవీ కెమెరా వీడియోను స్థానికులు ప్రత్యేకంగా వచ్చి మరీ తిలకిస్తున్నారు. ఆమె ధైర్యసాహసాలను మెచ్చుకుంటున్నారు.