chase
-
యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌ని తలపిస్తూ..కొత్త పెళ్లికొడుకు సాహసం, వైరల్ వీడియో
కాబోయే భార్యను తలచుకుంటూ ముసి ముసి నవ్వులతో పెళ్లి కొడుకు దేవ్ కుమార్ గుర్రమెక్కి పెళ్లి మంటపానికి బందు మిత్ర సపరివారంగా తరలి వెళ్లాడు. బాజా భజంత్రీల సమక్షంలో అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశాడు. కొత్తభార్యతో ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. మెడలో మెరిసిపోతున్న కరెన్సీ మాలను చూసుకుంటున్నాడు. ఇంతలో ఎక్కడనుంచి వచ్చాడో తెలియదు ఆగంతకుడు. పెళ్లి కొడుకు మెడలోని కరెన్సీ దండలోని 100 రూపాయలనోటను అమాంతం ఎగరేసుకుపోయాడు ఘొక మినీ ట్రక్ డ్రైవర్ కాజేశాడు. ఒక్క క్షణం బిత్తరపోయినా, వెంటనే తేరుకుని అత్యత సాహసంగా అతణ్ణి వెంబడించి పట్టుకున్నాడు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్‌గా సాగిన ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.పియూష్ రాయ్ అనే జర్నలిస్టు ఈ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీని ప్రకారం. తన మెడలోని నోట్ల దండను ట్రక్ డ్రైవర్ కొట్టేయడంతో వెంటనే అప్రమత్తమైన వరుడు పెళ్లీ, గిళ్లీ తరువాత చూద్దాం అనుకున్నాడో ఏమో గానీ, నగదు దండను చోరీ చేసిన డ్రైవర్‌ను పట్టుకునేందుకు రంగంలోకి దిగిపోయాడు. హైవేపై ట్రక్‌ను వెంబడించాడు. అత్యంత సాహసంతో స్టంట్మ్యాన్లాగా ట్రక్‌పైకి దూకాడు. చాకచక్యంగా క్యాబిన్లోకి ప్రవేశించి అతగాడిని దొరకబుచ్చుకున్నాడు. నాలుగు తగిలించాడు. ఇంతులో అతని వెనకాలే ఫాలో అయిన స్నేహితులు, చుట్టుపక్కల వాళ్లు కూడా తోడయ్యాడు. దీంతో పొరపాటు జరిగిందని వదిలేయాలంటూ లబోదిబో మన్నాడు. దీంతో దేవ్ కుమార్ హీరోగా అయిపోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు పన్నీ కామెంట్లను షేర్ చేశారు. దెబ్బకి పెళ్లి కూతురు ఫిదా అని ఒకరు, కొత్త పెళ్లి కూతురు స్పైడర్ మాన్ స్పైడర్ మాన్ నా మనసు దోచేశావ్ అని పాడుకుంటుందేమో అని మరికొందరు వ్యాఖ్యానించారు. మరోవైపు పెళ్లి రాత్రిని తప్పించుకోవడానికి వరుడు ఇలా ప్లాన్ చేసి ఉంటాడని కొందరు, ఇంత చేసినా అమ్మాయి ఇంప్రెస్ అవుతుందా అని ఇంకొందరు ఫన్నీగా కమెంట్ చేశారు. <Video of the year! In UP's Meerut, groom Dev Kumar was happily getting home after the wedding when a pick up driver pinched a note from his currency tucked garland. What followed was a near Bollywood, daring chase for justice! Groom Dev Kumar asked for lift from a motorist,… pic.twitter.com/libIH8PRTT— Piyush Rai (@Benarasiyaa) November 25, 2024రవాణా సంస్థ ప్రకటనట్రక్ స్థానిక రవాణా సంస్థకు చెందినది, దీని యజమాని మనీష్ సెహగల్ ఈ సంఘటనపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ట్రక్ డ్రైవర్ దొంగ కాదని, దొంగతనంతో అతనికి ఎటువంటి సంబంధం లేదని వాదించారు. అతని వాహనానికి వ్యతికేంగా వేగంగా దూసుకురావడం వల్లే పెళ్లి ఇలా చేశాడని ఆరోపించారు. ఎలాంటి సంబంధం లేనప్పటికీ వరుడు , అతని స్నేహితులు డ్రైవర్‌పై దాడి చేశారని సెహగల్ ఆరోపించారు. దీంతో ఏం జరిగిందో స్పష్టత లేక బుర్ర గోక్కుంటున్నారట స్థానిక పోలీసులు. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. -
పట్టపగలే దారుణం.. యువతిని నడిరోడ్డుపై వెంబడించి మరీ..
ఆధునిక యుగంలోనూ రోజురోజుకీ మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. హత్యలు, అత్యాచార ఘటనలు, లైంగిక దాడులు, పైశాచికదాడులు నానాటికీ పెరిగిపోతూనే ఉన్నాయి. పాత చట్టాలకు తోడుగా నిర్భయ, గృహహింస వంటి చట్టాలను తీసుకువచ్చినా మృగాళ్ల ఆగడాలకు కళ్లెం పడడం లేదు. అతివలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో చోట దాడులు జరుగుతూనే ఉన్నాయి తాజాగా మహారాష్ట్ర పట్టపగలే దారుణం వెలుగు చూసింది. ప్రేమను ఒప్పుకోవడం లేదనే కారణంతో యువతిని బహిరంగంగా రోడ్డుపై వెంబడించి మరీ దాడి చేశాడో యువకుడు. ఈ ఘటన పుణెలోని సదాశివ్ పేట్ ప్రాంతంలో జరిగింది. రద్దీగా ఉన్న రోడ్డు మీద టూ వీలర్‌పై వెళ్తున్న 20 ఏళ్ల యువతిని యువకుడు అడ్డగించాడు. వెంటనే తన వద్ద ఉన్న పదునైన కత్తి వంటి ఆయుధాన్ని తీసి యువతిపై దాడికి యత్నించాడు. అతడి బారి నుంచి తప్పించుకునేందుకు స్కూటీ వదిలేసి యువతి వీధుల్లో పరుగెత్తింది. యువకుడు ఆమె వెంటే పరుగెత్తాడు. ఈ క్రమంలో ఆమె వీపుపై దాడి చేయడంతో కింద పడింది. మళ్లీ లేచి పరుగెత్తుండగా.. ఆ వ్యక్తి ఆమెపై దాడి చేస్తూనే ఉన్నాడు. ఇంతలో రోడ్డుపై వెళుతున్న కొంతమంది అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానికులు యువకుడిపై రళ్లు రువ్వారు. ఎట్టకేలకు యువతిని రక్షించి, దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వీడియో కోసం క్లిక్ చేయండి దాడికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీటీవీలో రికార్డయ్యాయి. పంజాబీ డ్రెస్, ముఖానికి స్కార్ఫ్ ధరించిన యువతి భుజంపై బ్యాగ్‌తో రోడ్డుపై పరుగెత్తడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. వైట్ షార్ట్, ప్యాంట్ వేసుకున్న యువకుడు ఆమె వెనకాల వెంబడించడం కూడా తెలుస్తోంది. కాగా నిందితుడిని అరెస్ట్ చేసి హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పుణె డీసీపీ సందీప్ సింగ్ తెలిపారు. నిందితుడిని శాంతను లక్ష్మణ్ జాదవ్‌గా గుర్తించారు. యువతిని 20 ఏళ్ల ప్రీతి రామచంద్రగా పోలీసులు పేర్కొన్నారు. అయితే నిందితుడు గత కొంతకాలంగా ప్రేమ పేరుతో యువతిని వేధిస్తున్నట్లు ఆమె తల్లి ఆరోపించారు. ఈ విషయంపై యువకుడి తండ్రికి కూడా ఫిర్యాదు చేశామని అయినా ఈ రోజు తన కూతురిని చంపడానికి ప్రయత్నించాడని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారడంతో యువతిని కాపాడేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు. Dear Delhites, watch and learn: How we save the honor of women in the land of Shivaji Maharaj 🚩 A man, armed with a machete, attacked a girl student in Pune injuring her. A few bravehearts in the area caught the man and handed him over to the Police.🫡 pic.twitter.com/jnZzKfVn36 — Pune City Life (@PuneCityLife) June 27, 2023 -
వరుడు పెళ్లి టైంలో హ్యండిచ్చి పారిపోతే..ఆ వధువు ఏకంగా..
చాలామంది పెళ్లి పేరుతో వంచన చేయడం లేదా పెళ్లి రేపు అనగా పరారవ్వడం గురించి విన్నాం. ఆ తర్వాత వధువు కుటుంబసభ్యులు భోరుమని కన్నీళ్లుపెట్టుకోవడం వంటి కథలే చూశాం. మోసపోతే కన్నీళ్లతో కూలబడిపోవడం కాదని, తెగించి మరీ ఆ మోసగాడిని పట్టుకుని కిక్కుమరనకుండా చేయాలని నిరూపించింది ఓ వధవు. పెళ్లిమండపం వద్ద భయానక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న వధువు చేసిన సాహసం చూసి ఆశ్చర్యపోక మానరు. ఆమెను ప్రశసించకుండా ఉండలేం. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వధువు పెళ్లిరోజున వరుడు పెళ్లికి నిరాకరించి..చెప్పపెట్టకుండా పెళ్లిమండపం నుంచి వెళ్లిపోయాడు. వరుడు కోసం ఎదురు చూస్తూ కూర్చొన్న వధువు ఈ షాకింగ్ ఘటనను జీర్ణించుకోలేకపోయింద. ఏమైన సరే అతన్ని వెతికి తెచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకోసం ఆమె పెళ్లి డ్రస్‌లోనే అతడిని వెదకడం ప్రారంభించింది. అతడు ఫోన్లో వాళ్ల అమ్మను తీసుకురావడానికే వెళ్లానంటూ చెప్పినా అమె నమ్మలేదు. ఏకంగా 20 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ అతడ్ని పట్టుకుంది. అతడు సరిగ్గా బరేలీ పోలీస్టేషన్ సమీపంలోని బస్సులో దొరికాడు. అతడ్ని పెళ్లిమండపానికి వెంట బెట్టుకుని తీసుకొచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాల అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించి సదరు వదువరులిద్దరికి పెళ్లి చేశారు.నిజానికి అతడు ఆ జంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సరిగ్గా పెళ్లి టైంకి అతడి హ్యాండివ్వడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఎలాగైనా వెదిక పట్టుకునైనా అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మరీ ఇంతటి సాహసం చేసింది ఆ నవ వధువు. తన వివాహాన్ని నిలబెట్టుకునేందుకు ఆమె కనబర్చిన ధైర్యానికి అందరిచే ప్రశంసలు అందుకుంది. (చదవండి: రూ.2 వేల నోటు మార్పిడికి తంటాలు) -
డిజిటల్ రుణాల రంగానికి స్వీయ నియంత్రణ సంస్థ !
న్యూఢిల్లీ: చట్టవిరుద్ధ రుణాల యాప్‌లపై కేంద్రం కొరడా ఝుళిపిస్తున్న నేపథ్యంలో డిజిటల్ రుణాల యాప్‌లకు (డీఎల్ఏ) స్వీయ నియంత్రణ సంస్థ (ఎస్ఆర్వో) ఉండాలని రీసెర్చ్ సంస్థ చేజ్ ఇండియా ఒక నివేదికలో ప్రతిపాదించింది. సక్రమమైన డీఎల్ఏల వ్యాపార కార్యకలాపాలు, విధానాలకు చట్టబద్ధత లభించడంతో పాటు వాటికి తగిన నియంత్రణ విధానాలను నిర్దేశించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. అలాగే, డీఎల్ఏలకు ప్రామాణికమైన నైతిక నియమావళిని కూడా నిర్దేశించాలని సూచించింది. పరిశ్రమ వర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాలతో చేజ్ ఇండియా ఈ నివేదికను రూపొందించింది. దేశీయంగా డిజిటల్ రుణాల వ్యవస్థ స్థిరత్వానికి, వృద్ధికి తోడ్పడటంతో పాటు అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకోతగిన ప్రతిపాదనలతో దీన్ని తీర్చిదిద్దింది. రుణ వ్యవస్థలను పటిష్టం చేసేందుకు పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ (పీసీఆర్)ను రూపొందించాలని చేజ్ ఇండియా పేర్కొంది. డిజిటల్ రుణాల విభాగం ఎదుగుతున్నప్పటికీ పర్యవేక్షణ లేకుండా డీఎల్ఏలు పాటించే విధానాలు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ కౌశల్ మహాన్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే బాధ్యతాయుతంగా వ్యవహరించే సంస్థలను ప్రోత్సహించడంతో పాటు నవకల్పనలకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల ఇటు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ అటు పరిశ్రమ వృద్ధి మధ్య సమతౌల్యత సాధించవచ్చని వివరించారు. -
Tiger Cub: కారు డిక్కీలో పులి పిల్ల.. పోలీసులు షాక్..
మెక్సికో సిటీ: పోలీసులు రోడ్డుపై సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఓ కారు వచ్చింది. వీళ్లను చూసి ఆపకుండా అది అలానే ముందుకుపోయిది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమ వాహనంతో వెంబడించి ఆపారు. అనంతరం కారు డిక్కీ ఒపెన్ చేసి చూసి షాక్ అయ్యారు. డిక్కీలో సూట్‌కేస్, బ్యాగుల మధ్యన పులిపిల్లను చూసి అవాక్కయ్యారు. కారు డిక్కీలో పులి పిల్లతో పాటు తుపాకులు, బుల్లెట్లు కూడా ఉన్నాయి. దీంతో వెంటనే కారులోని దంపతులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ పులి పిల్లను వన్యప్రాణుల సంరక్షణ కేంద్రానికి తరలించారు. మెక్సికోలో డ్రగ్ ట్రాఫికర్లకు పులులు పెంచుకోవడం అంటే సరదా. అక్రమంగా వాటిని కొనగోలు చేసి పెంపుడు జంతువుల్లా ఇళ్లలో పెంచుకుంటారు. అయితే పులులు, సింహాలను పెంచుకోవడం అక్కడ నేరమేమీ కాదు. కాకపోతే అధికారిక డీలర్లు, బందిఖానాలో జన్మించిన వాటిని మాత్రమే కొనుగోలు చేసే వెసులుబాటు ఉంది. 2020లోనూ రోడ్డుపై తిరిగుతున్న ఓ బెంగాల్ టైగర్‌ను పోలీసులు సీజ్ చేశారు. 2019లో ఓ ఇంట్లో సింహాలను స్వాధీనం చేసుకున్నారు. సింహాల గర్జనకు బెంబేలెత్తిపోయిన పొరుగింటివారు ఫోన్ చేయడంతో అక్కడకు వెళ్లి వాటిని తరలించారు. చదవండి: Viral: జారిపోతున్న కార్లు.. అమెరికా మంచు తుఫాన్ వీడియోలు వైరల్.. -
ఎరక్కపోయి ఇరుక్కున్నారుగా!.. సినిమాను తలపించే సీన్
చండీగఢ్: ఆయుధాలతో హల్చల్ చేస్తున్న క్రిమినల్స్‌కు పోలీసులు ఎదురుపడ్డారు. ఇరువురి ఎస్యూవీ వాహనాలు ఎదురుపడటంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా పరిస్థితులు వేడెక్కాయి. పోలీసులను గమనించిన క్రిమినల్స్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ఛేజింగ్ చేశారు.ఈ సంఘటన పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గురువారం మధ్యాహ్నం జరిగింది. ఈ సంఘటనలో క్రిమినల్ రికార్డ్ ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. స్థానిక సీసీటీవీ కెమెరాలో నమోదైన ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. క్రిమినల్స్ ఉన్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు బయలుదేరారు. అమృత్‌సర్‌లోని ఓ మార్కెట్లోని ఇరుకు రోడ్డులో ఇరువురి వాహనాలు ఎదురుపడ్డాయి. పోలీసులను గమనించిన వెనుక సీటులోని వ్యక్తి ముందుగా దిగి పరారయ్యాడు. ఆ తర్వాత డ్రైవర్ సైతం పరుగులు పెట్టాడు. వారిని పట్టుకునేందుకు సుమారు ఆరుగురు పోలీసులు ఛేజ్ చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ తర్వాత ఓ అధికారి తిరిగి వచ్చి వాహనంలో ఇంకా ఎవరైనా ఉన్నారా? అని తనిఖీ చేశారు. ఛేజింగ్ తర్వాత వివరాలు వెల్లడించారు పోలీసులు. ఇద్దరు క్రిమినల్స్ రవి, రాబిన్‌లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ‘ఇరువురిపై 5-6 క్రిమినల్ కేసులు ఉన్నాయి. వారి నుంచి 5 ఆయుధాలు, లైవ్ క్యాట్రిడ్జ్‌ను స్వాధీనం చేసుకున్నాం. తదుపరి విచారణ చేపట్టాం.’ అని అమృత్సర్ పోలీసు కమిషనర్ జస్కరన్ సింగ్ తెలిపారు. #WATCH | Punjab Police arrested two criminals in Amritsar and recovered 5 weapons and live cartridges from them. (CCTV footage confirmed by police) pic.twitter.com/vqo1czNWHR — ANI (@ANI) December 1, 2022 ఇదీ చదవండి: ‘భారత్ జోడో యాత్రతో చచ్చిపోతున్నాం’.. కమల్‌నాథ్ వీడియో వైరల్ -
ఛేజింగ్ సమయంలో అనుహ్య ఘటన.... మంటల్లో చిక్కుక్కున్న వాహనదారుడు
ట్రాఫ్రిక్ నియమాలను ఉల్లంఘించి కొంతమంది పోకిరీలు ర్యాష్ డ్రైవింగ్‌తో రోడ్లపై హల్చల్ చేస్తుంటారు. పోలీసులు వారిని ఛేజింగ్ చేసి పట్టుకునేందుకు యత్నించినా కూడా దొరకకుండా వెళ్లిపోతుంటారు. అచ్చం అలానే ఇక్కడొక వ్యక్తి తప్పించుకునే క్రమంలో మంటల్లో చిక్కుకుని తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకెళ్తే...అమెరికాలో ఒక వాహనదారుడు నెంబర్‌ప్లేట్ లేకుండా రోడ్డుపై హల్చల్ చేయడంతో పోలీసులు అతన్ని పట్టుకునేందుకు యత్నించారు. ఐతే సదరు వాహనదారుడు పోలీసులకు దొరక్కుండా పారిపోయేందుకు యత్నించే క్రమంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించాడు. దీంతో పోలీసులు అతన్ని నియంత్రించే క్రమంలో టేజర్ అనే ఎలక్ట్రిక్ గన్సాయంతో కాల్పులు జరిపారు. ఐతే ఆ వ్యక్తి ఆ సయంలో తన వీపుకి గ్యాసోలిన్ ప్యాక్‌ని తగిలించుకున్నాడు. వారి నుంచి తప్పించుకునే క్రమంలో బైక్ నుంచే దూకేశాడు. దీంతో పోలీసులు టేజర్‌తో నియంత్రించేందుకు యత్నించారు. అంతే ఒక్కసారిగా ఆ వాహనదారుడు చట్టు భగ్గుమని మంటలు వ్యాపించాయి. ఆ వాహనదారుడు పూర్తిగా మంటల్లో చిక్కుకుపోయాడు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక యంత్రంతో ఆ మంటలను ఆర్పి తక్షణమే హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తులో సదరు వాహనదారుడిని 38 ఏళ్ల క్రిస్టోఫర్ గేలర్గా గుర్తించారు. అతను ఇన్సూరెన్స్ చేయని బైక్‌పై డ్రైవింగ్ లైసెన్సు లేకుండా నిర్లక్షపూరితంగా డ్రైవ్ చేస్తున్నట్లు తేలింది. అతను బ్యాక్‌ప్యాక్‌లో ఒక గ్యాలన్ గ్యాసోలిన్‌ని తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. మరికొద్దిరోజుల్లో సదరు వాహనదారుడు పూర్తిగా కోలుకునే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు. (చదవండి: డ్రోన్లతో కుక్కలను దింపి దాడులు.. దెబ్బకు శత్రువు ఆటకట్టు) -
టీమిండియాతో టీ20 సిరీస్.. ఐర్లాండ్‌కు భారీ షాక్..!
టీమిండియాతో టీ20 సిరీస్‌కు ముందు ఐర్లాండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పీటర్ చేజ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. 2014లో ఐర్లాండ్ తరపున పీటర్ చేజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఐర్లాండ్ తరపున 43 మ్యాచ్‌లు మ్యాచ్‌లు ఆడిన చేజ్.. 63 వికెట్లు పడగొట్టాడు. ఇక 2018లో భారత్‌తో జరగిన టీ20 మ్యాచ్‌లో తన కెరీర్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 35 పరుగులు ఇచ్చి చేజ్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఈ సిరీస్‌లో అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లిని రెండు సార్లు ఔట్ చేశాడు. కాగా ఈ ఏడాది జూన్ అఖరిలో భారత జట్టు ఐర్లాండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. చదవండి: IND vs SA: 'క్యాచ్ వదిలితే.. అట్లుంటది మనతో మరి' -
అర్ధరాత్రి హైవేపై.. సినిమాను తలపించే రీతిలో
టంగుటూరు (ప్రకాశం జిల్లా): ఇటీవల జాతీయ రహదారిపై వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో సింగరాయకొండ సీఐ శ్రీనివాసరావు, టంగుటూరు ఎస్ఐ నాయబ్ రసూల్‌లు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి స్థానిక టోల్‌ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. ఓ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు యువకులను పోలీసులు ఆపినా ఆపకుండా తప్పించుకుని పోయారు. అప్రమత్తమైన పోలీసులు సుమారు అరగంట పాటు జాతీయ రహదారిపై ఛేజింగ్ చేశారు. దొంగలు తప్పించుకునే క్రమంలో పోలీసుల వాహనాన్ని గుద్దారు. ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి తూర్పునాయుడుపాలెం గ్రామంలోకి చోరబడ్డారు. పోలీసులు, గ్రామస్తులు రెండు గంటల పాటు గ్రామాన్ని జల్లెడ పట్టినా నిందితులు తృటిలో తప్పించుకున్నారు. ద్విచక్ర వాహనం, రెండు సెల్ఫోన్లు, మారణాయుధాలు స్వా«దీనం చేసుకున్నారు. దొంగల ఆచూకీ కనుగొన్నామని, అతి త్వరలోనే వారిని పట్టుకుంటామని పోలీసులు విశ్వాసం వ్యక్తం చేశారు. చదవండి: బావిలో నుంచి కేకలు.. అసలు ఏం జరిగిందంటే..? కరోనా కల్లోలం: ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి -
మహిళా జర్నలిస్ట్ సాహసం..
న్యూఢిల్లీ: మొబైల్ దొంగతనం చేయాడనికి ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను ఓ మహిళా జర్నలిస్ట్ వీరోచితంగా వెంబడించి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాలు.. దురదర్శన్‌లో పని చేస్తోన్న మహిళా జర్నలిస్ట్ శనివారం మధ్యాహ్నం దక్షిణ ఢిల్లీలోని మాలవీయ నగర్ వెళ్లడానికి ఆటో ఎక్కింది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు బైక్ మీద వచ్చి ఆమె చేతిలోని మొబైల్‌ని లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించారు. కానీ సదరు మహిళ ధైర్యంగా వారిని వెంబడించడం ప్రారంభించింది. ఆ కంగారులో నిందితుల వాహనం పోలీసు బారికేడ్లకు తగిలి కింద పడ్డారు. ఆటో డ్రైవర్ సాయంతో సదరు జర్నలిస్ట్ నిందితులిద్దరిని దగ్గర్లోని పోలీసులకు అప్పగించింది. విచారణలో నిందితులిద్దరు తుగ్లకాబాద్‌కు చెందిన వారిగా తెలిసింది. డ్రగ్స్‌కు అలవాటు పడిన వీరు డబ్బు కోసం అప్పుడప్పుడు ఇలాంటి దొంగతనాలు చేస్తామని పోలీసులకు తెలిపారు. నిందితులిద్దరిని ధైర్యంగా వెంబడించి పోలీసులకు అప్పగించినందుకు గాను సదరు విలేకరిని అధికారులు అభినందించారు. (చదవండి: డబ్బులిస్తావా.. మ్యారేజ్ హాల్ తగలబెట్టనా?) -
పర్యటనకు వెళ్తే.. పరుగులు పెట్టించింది
బెంగళూరు: సరదాగా పర్యటించడానికి పార్కుకు వెళ్లిన వారికి ఒక్కసారిగి మృత్యువు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యింది. దాంతో ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని పరుగందుకున్నారు. మృగరాజు పర్యటనకు వచ్చి వారిని వెంటాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటక బళ్లారిలోని అటల్ బిహారీ వాజ్‌పేయి జూలాజికల్ పార్కులో ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాలు... నలుగురు పర్యటకులు పార్కులో పర్యటించేందుకు సఫారిలో వెళ్లారు. ఇంతలో అనుకోకుండా ఓ సింహం సఫారి వైపే పరిగెత్తుకుంటూ రాసాగింది. ఇది గమనించిన వ్యక్తులు మొదట్లో దీన్ని సరదాగా తీసుకుని నెమ్మదిగా వెళ్లడం ప్రారంభించారు. కానీ సింహం వేగంగా సఫారివైపు దూసుకువస్తుండటంతో మృత్యు దేవతే తమను తరుముతున్నట్లు భయంతో వణికిపోయారు. వెంటనే సఫారి వేగాన్ని పెంచి ముందుకు దూకించారు. కానీ మృగరాజు మాత్రం కొద్ది దూరం పాటు ఆ సఫారిని వెంబడించి.. ఆ తర్వాత దాని వేగాన్ని అందుకోలేక ఆగిపోయింది. దాంతో సఫారిలో ఉన్నవారిగా ఒక్కసారిగా బతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇంతకు సింహం పర్యటకుల వాహనాన్ని ఎందుకు వెంబడించిందనేది మాత్రం తెలియలేదు. మూడు రోజుల క్రితం యూట్యూబ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పటికే లక్షలో వ్యూస్, కామెంట్స్ సంపాదించింది. -
8 మంది దొంగలు.. 8 బృందాలు
సాక్షి, హైదరాబాద్ : నాలుగు రోజుల క్రితం నగరంలోని తిరుమలగిరిలో జరిగిన దోపిడి కేసును ఛేదించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. దోపిడికి పాల్పడిన 8 మంది దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ అంజన్ కుమార్ మాట్లడుతూ ‘ఈ నెల 1న తిరుమలగిరిలో దోపిడి జరిగింది. దొంగతనానికి వచ్చిన వ్యక్తులు ఇంటి యజమాని పేరు అడుగుతూ వచ్చి దోపిడికి పాల్పడ్డారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన తర్వాత పోలీసులు మొత్తం 8 బృందాలుగా విడిపోయి గాలింపు చేపట్టారు. చివరకూ నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు వీరిని అరెస్ట్ చేశార’ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘ఈ గ్యాంగ్‌లో మొత్తం ఎనిమంది ఉన్నారు. ఆర్థిక పరిస్థితులు చితికి పోవడంతోనే ఈ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నారు. దొంగతనం చేయడం కోసం ఓ కారును కూడా వాడనట్లు తెలిసింది. వీరంతా దోపిడి సమయంలో మాస్క్‌లు ధరించి ఉన్నారు. ఈ గ్యాంగ్‌కి సయ్యద్ మూజుద్ లీడర్‌గా వ్యవహరించాడు. ఈ దోపిడి కేసులో సయ్యద్ జమీల్ ఏ1గా, సయ్యద్ ముజీద్‌ను ఏ2గా ఉన్నారు. ఏ1, ఏ2లపై గతంలో కేసుల కూడా ఉన్నాయి. ఈ కేసులో ఏ1 అయిన సయ్యద్ జమీల్ గతంలో సనత్ నగర్లో జరిగిన హత్య కేసులో నిందుతుడిగా ఉన్నాడ’ని తెలిపారు. ఈ గ్యాంగ్ నుంచి 30 గ్రాముల బంగారం, 450 గ్రాముల వెండి, 11 మొబైల్ ఫోన్స్‌తో పాటు మహీంద్ర కారును కూడా స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
ఎమ్మెల్యేను తరిమి కొట్టిన జనాలు..!?
జైపూర్ : ప్రజాస్వామ్య దేశంలో అప్పుడప్పుడు నాయకులు ఓటరు దేవుళ్ల అసంతృప్తిని చవిచూడక తప్పదు. కానీ ఓటర్లు రెబల్‌గా మారి నేతలను తరిమి కొట్టడం మాత్రం ఎప్పుడు చూడలేదు. ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. రాజస్థాన్ ప్రజలు ఒక ఎమ్మెల్మేను తరిమి తరిమి కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అంతేకాక ఈ వీడియోలో ఉన్న నేత రాజస్థాన్ దౌసా ప్రాంతానికి చెందిన శంకర్ లాల్ శర్మ అనే బీజేపీ ఎమ్మెల్యేగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జులై 13నుంచి ఇప్పటి వరకూ ఈ వీడియోను దాదాపు 60 వేల మంది చూశారు. అయితే అసలు విషయం తాజాగా బయటపడింది. ఆ వీడియోలో తెల్లని కుర్తా పైజామా ధరించిన వ్యక్తి ఒక మాజీ ఎమ్మెల్యే అని.. కానీ అతను దౌసా ప్రాంత బీజేపీ ఎమ్మెల్యే మాత్రం కాదని వెల్లడైంది. వీడియోలో జనాలు వెంటబడి మరి తరుముతున్న వ్యక్తి గంగాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అని బయటపడింది. ఈ విషయం గురించి దౌసా బీజేపీ ఎమ్మెల్యే శంకర్ లాల్ శర్మ స్పందిస్తూ.. ‘నా పేరు మీద ప్రచారం అవుతున్న ఈ వీడియో ఏప్రిల్ నుంచి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. కానీ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు. వైరల్ టెస్ట్‌లో ఈ విషయం తెటతెల్లమయ్యింది. నా పేరు మీద ఇలా నకిలీ వీడియోలను ప్రచారం చేసినందుకు గాను మా పార్టీ కార్యకర్తలు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట నిరసన కూడా తెలిపారు. వీడియోలో ఉన్నది నేను కాదు. ఆ వీడియోలో జనాలు తరిమికొడుతున్న వ్యక్తి ఎవరో తెలుసుకోమని నా పార్టీ కార్యకర్తలకు చెప్పాను. వారి పరిశీలనలో జనాలు తరుముతున్న వ్యక్తి గంగాపూర్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రంకేశ్ మీనా అని తేలింది. ఈ వీడియోను భారత్ బంద్ సందర్భంగా తీశారు. సుప్రీంకోర్టు ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధ చట్టానికి వ్యతిరేకంగా తీర్పు వెలువరించిన నేపధ్యంలో నిరసన తెలుపుతుండగా తీసిన వీడియో ఇది. ఈ వీడియోలో జనాలు తరిమికొడుతున్నది కాంగ్రెస్ నేత రంకేశ్ మీనానే’ అని తెలిపారు. రంకేశ్ మీనా 2009లో బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అయితే ఈ వీడియో విషయం గురించి రంకేష్ను సంప్రదించగా అతడు దీని గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. -
మొసలిని వణికించిన కుక్క
-
మొసలిని వణికించిన కుక్క
బలం కన్నా ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉన్నవారిని విజయం వరిస్తుంది. ఈ సూత్రం మనుషులకేకాక జంతువులకూ వర్తిస్తుంది. ఇందుకు తాజా ఆస్ట్రేలియాలోని గోట్ ఐర్లాండ్ తీరంలో జరిగిన ఘటనే నిదర్శనం. ఆకలితో ఉన్న ఒక భారీ మొసలి ఆహారం కోసం తీరం ఒడ్డుకు వచ్చింది. పచ్చటి గడ్డి మీద ఎవరికీ కనిపించకుండా.. జంతువు కోసం ఎదురు చూస్తోంది. ఏ జంతువైనా అక్కడి వచ్చింటే.. మొసలి చేతిలో చచ్చేదే. మొసలి చేష్టలను ఒక కుక్క దూరంనుంచి గమనిస్తూనే ఉంది. కొన్ని క్షణాల తరువాత కుక్క.. అత్యంత వేగంగా మొసలి తోక మీద దాడి చేసింది. కుక్క దాడికి భయపడ్డ మొసలి నీటిలోకి జారుకుంది. నార్తరన్ టెరిటరీకి చెందిన కేసీ అనే వ్యక్తి నది ఒడ్డున విహరిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆయన కుక్క పోరాటాన్ని వీడియో తీయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. -
ఆర్నాల్డ్‌కు ప్యాంటు తడిసింది!
సఫారీ: ఇనుప మనిషిలాగా టర్మినేటర్ వంటి చిత్రాల్లో నటించిన ప్రముఖ హాలీవుడ్ హీరో, ఇనుప కండల వీరుడు ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ కు ఓ ఏనుగు గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. జీపులో వెళుతున్న వారికి అనూహ్యంగా ఎదురుపడి భయంతో వణికిపోయేలా చేసింది. అంతేకాదు వారి వాహనాన్ని వెంబడించి ఇక చచ్చాం రా దేవుడా అనుకునేలా చేసింది. అంతేకాదు.. ఈ సంఘటన తర్వాత ఆ బృందంలో కొంతమంది తమ ప్యాంట్లు కూడా మార్చుకున్నారంట. పూర్తి వివరాల్లోకి వెళితే ఆర్నాల్డ్ తన మిత్రులతో సౌత్ ఆఫ్రికాలోని సఫారీ పార్క్‌కి వెళ్లాడు. అలా రహదారిపై వెళుతున్న వారికి అనూహ్యంగా ఓ ఏనుగు తారసపడటంతో తమ వాహనాన్ని ఆపేశారు. అయితే, రోడ్డు దాటి వెళ్లకుండా భారీ పొడవైన దంతాలతో ఉన్న ఆ ఏనుగు వారిని సమీపించింది. దాంతో అందులోని వారంతా కుక్కిన పేనులాగా కదలకుండా కూర్చున్నారు. అది కాసేపు తొండంతో ఆ వాహనాన్ని తడిమి వెనుకకు అడుగులు వేసుకుంటూ వెళ్లింది. అప్పటికీ వారు అలాగే తమ శ్వాసను కాసేపు ఆపేసి సింహంలా మీదకు దూకుతుందా అని భయంతో చూస్తున్నారు. అయితే, ఆ ఏనుగు పక్కకు వెళ్లింది. అంతా హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఆర్నాల్డ్ మాత్రం దాని ఆలోచనను ముందే పసిగట్టాడు. అది తమపై దాడి చేసేందుకు వస్తుందని చెప్పాడు. నిజంగానే ఆ ఏనుగు అన్నంత పనిచేసింది. వేగంగా వారి కారువైపు వెనుక నుంచి దూసుకొచ్చింది. దీంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి సచ్చాం బాబోయ్ అన్నట్లు కారు ఎంత వేగంతో ఎక్స్ లేటర్ తొక్కి పోనిచ్చాడు. అప్పటికీ ఏనుగు కూడా గుర్రం మాదిరిగా తన పరుగును పెంచింది. అదృష్టవశాత్తు వారు అలా ఏనుగు నుంచి తప్పించుకున్నారు. ఈ అనుభవాన్ని చూసిన ఆర్నాల్డ్ తన అభిప్రాయం పంచుకుంటూ 'ఈ సంఘటన గురించి చెప్పలేకపోతున్నాను. బహుషా సినిమా అయితేనే బాగుండేదేమో. నేను నిజంగా ఇలాంటి ఓ జంతువును చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా. అది ఎంత బలమైన ఏనుగంటే.. మాలో కొంతమంది ప్యాంట్లు కూడా మార్చుకున్నారు' అని చెప్పారు. 'మనం ఏనుగులను చంపేయడం మానాలి. ఒక ఫోటో తీసుకోవాలి తప్ప కాల్చడం కాదు' అని ఆయన ఒక సందేశం కూడా ఇచ్చారు. -
ఎక్స్‌ప్రెస్‌వేలో మహిళను వెంటాడి..
న్యూఢిల్లీ: అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఆగ్రహించిన ఓ మహిళను దుండగులు వేటాడి, ఆమెపై కాల్పులు జరిపారు. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్‌వేలో ఈ దారుణం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి ఢిల్లీకి చెందిన ఆరుగురు స్కార్పియో వాహనంలో వెళ్తున్నారు. వీరిలో సిద్దాంత్ ఠాకూర్, దేవిశ్రీ, అసిస్టెంట్ జైలర్ సునీల్ కుమార్, ఆడిటర్ సంజీవ్ కుమార్ మరో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. దారి మధ్యలో ఓ మద్యం షాపు వద్ద ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్న మహిళల పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. దీంతో కారులో ఉన్న మహిళ ఎదురుతిరిగి ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పుడు ఏమీ మాట్లాడకుండా వెళ్లిన అపరిచితులు కాసేపటి తర్వాత మరో ఇద్దరిని తీసుకుని స్కార్పియోను వెంబడించారు. ఐఫ్కో చౌక్ వద్ద దుండగులు స్కార్పియో అద్దాలను బేస్ బాల్ బ్యాట్లతో పగలగొట్టారు. లోపల ఉన్న సిద్ధాంత్, దేవిశ్రీలపై కాల్పులు జరిపి పారిపోయారు. సందీప్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన సిద్ధాంత్, దేవిశ్రీ గురుగ్రామ్‌లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
ఆకట్టుకుంటున్న ఆస్ట్రిచ్ రేస్...
ఒకప్పుడు కార్టూన్లలో చూసి థ్రిల్ గా ఫీల్ అయిన రోడ్ రన్ షో... ఇప్పుడు కళ్ళెదుటే కనిపించింది. తోడేలు నుంచి తప్పించుకునేందుకు కార్టూన్లో పరిగెట్టిన పక్షి... దక్షిణాఫ్రికాలోని సైక్లిస్టుల ముందు నిజంగానే ప్రత్యక్షమైంది. అనుకోని సన్నివేశం ఎదురవ్వడం వారికి ఓ ప్రత్యేక అనుభూతిని కూce కలిగించింది. అందుకే ఆ దృశ్యాన్ని వీడియోలో బంధించిన ఒలేక్సియ్ మిశ్చెంకో అనే ఓ వినియోగదారుడు మార్చి 5న యూట్యూబ్ లో పోస్టు చేశాడు. ఇప్పుడు ఆ వీడియో యూజర్లను అమితంగా ఆకట్టుకుంటోంది. దక్షిణాఫ్రికాలోని కోప్ ఆఫ్ గుడ్ హోప్ ప్రాంతంలో సైక్లిస్టుల ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో ఓ ఆస్ట్రిచ్ వారిని వెంబడించింది. అనుకోని సన్నివేశం ఎదురైనా కాస్త తేరుకున్న సైకిలిస్టు... అతివేగంగా పరిగెట్టే ఆ పక్షితోనే పోటీ పెట్టుకున్నాడు. ఆ వీడియో ఇప్పుడు వీక్షకులను కట్టి పడేస్తోంది. మనుషులైతే నాకేంటి అంటూ ఆ పక్షి.. సైకిలిస్టును ఛేజ్ చేయడం యూట్యూబ్ లో కనువిందు చేస్తోంది. అయితే కాళ్ళు కూడదీసుకొని సైకిల్ పై వెళ్ళే ఇద్దరిని ఎంతోదూరం వెంబడించిన ఆ పక్షిరాజం... ఇక లాభం లేదనుకుందో ఏమో చివరికి కాస్త వెనక్కి తగ్గినట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ప్రపంచంలోనే అతి పెద్ద సైకిల్ రేస్ జరుగుతున్న కోప్ ఆర్గస్ టూర్ ప్రాంతంలో ఆస్ట్రిచ్.. మిశ్చెంక్ కళ్ళపడింది. ఇలా పక్షిని గమనించానో లేదో అలా సెకన్లలో రోడ్డుపైకి దూకి వెంటనే సైకిల్ తో స్నేహితుల వెంటపడ్డానని, ఆ తర్వాత ఎంతో నవ్వొచ్చిందని మిశ్చెంక్.. తన యూట్యూబ్ పోస్ట్ లో రాశాడు. అయితే గంటకు సుమారు 50 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే రైడర్స్ కు ఆస్ట్రిచ్ వల్ల పెద్దగా భయం లేదన్నాడు. అదృష్టం కొద్దీ అది పరుగు విరమించుకొని పక్కదారి పట్టిందని, 'కోప్ ఆఫ్ గుడ్ హోప్' దగ్గర మార్గం ముగిసిపోతుందని, నిజంగా ఆ పక్షి తనను వెంబడించి ఉంటే ఏమయ్యుండేదో అంటూ ఒకింత భయాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఇటువంటి సందర్భం ఎదురైనప్పుడు చాలామంది నిజంగానే భయపడతారు. కానీ మిశ్చెంక్ మాత్రం దానికి కాస్త హ్యూమరసాన్ని జోడించాడు. కచ్చితంగా ఆ పక్షి.. తన గాల్ ఫ్రెండ్ కు సత్తా చూపించేందుకే తనతో పోటీ పడిందని, ఆమె నిజంగానే ఫ్లాట్ అయిపోయి ఉంటుందంటూ కామెంట్ చేశాడు. అంతేకాదు... అది తన సత్తా చూపించుకుందో లేదోగాని, ప్రపంచంలోనే అతి వేగంగా పరిగెత్తే ఆస్ట్రిచ్ తో పోటీపడి తాను మాత్రం మంచి ట్రైనింగే తీసుకున్నానన్నాడు. -
కేరళ నుంచి తమిళనాడు వరకు పరుగో పరుగు
కొచ్చి: అచ్చం సినిమాలో కనిపించే చేజింగ్ లాంటి సీన్.. ఇంకా ఎంత దూరం చేయాలని వెంబడిస్తున్నవారికి చిరాకు. పోని ఎటువైపు వెళుతున్నారో అనే ఆలోచన చేద్దామా అనుకునే లోగానే అంచనాకు అందకుండా దిశమారుతోంది.. అయితే, ఇక్కడ జరిగింది మాత్రం దొంగా-పోలీస్ చేజింగ్ కాదు. మీడియా పోలీసు చేజింగ్.. చేతిలో కెమెరాలతో మీడియా సోదరులు తెగ అలసిపోయారు. కేరళ నుంచి తమిళనాడు సరిహద్దు వరకు పోలీసు జీపును వెంబడించారు. ఎందుకని అనుకుంటున్నారా అందులో ఉన్నది కీలక నేరస్తుడు మరి. కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ స్కాంలో ప్రధాన నిందితుడు బిజు రాధాకృష్ణన్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమెన్ చాందీకి సంబంధించి ఓ కీలక వీడియో పోలీసులకు ఇస్తానని చెప్పడంతో కెమెరా కళ్లని ఆ జీపుపైనే పడ్డాయి. మధ్యాహ్నం 3గంటల ప్రారంభమైన ఆ పరుగు తమిళనాడులోని కోయంబత్తూర్ వైపుగా సాగింది. పూర్తి వివరాల్లోకి వెళితే కేరళలో సంచలనం సృష్టించిన సోలార్ స్కాం కేసులో పోలీసులు బిజు రాధాకృష్ణన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కమిషన్ ముందు గతవారం అతడు హాజరైన సందర్భంలో గురువారం ఒక కీలక వీడియోను అందజేస్తానని చెప్పాడు. ఆ వీడియోలో ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ ఆయన కేబినెట్ మంత్రులు, తన లివింగ్ పార్ట్నర్ సరితా నాయర్ తో సన్నిహితంగా ఉన్న వీడియో ఉందని చెప్పారు. అయితే, గురువారం కమిషన్ వద్దకు వచ్చిన బిజు తన వద్ద మొత్తం మూడు వీడియో కాపీలు ఉండగా ఒకటి దేశం వెలుపల ఉందని, మరొకటి తనను 2013లో అరెస్టు చేసినప్పుడు పోలీసులు తీసుకున్నారని, మరొకటి మాత్రం తన స్నేహితుడి వద్ద భద్రంగా ఉందని చెప్పాడు. దీంతో వెంటనే ఆ వీడియోను తీసుకొని రావాల్సిందిగా కమిషన్ పోలీసులకు ఆదేశాలిచ్చి తన తరుపున ఇద్దరు అధికారులను ఇచ్చి పంపించింది. దీంతో మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో అతడిని పోలీసులు జీపులో ఎక్కించుకొని బయలుదేరగానే ఆ వీడియో కోసం మీడియా ప్రతినిధులు కూడా పోలీసులను చేజింగ్ చేశారు. -
చైన్ స్నాచర్ ని బైక్‌తో ఢీకొట్టాడు..
అనంతపురం: మహిళ మెడలో గొలుసు తెంపుకుని పారిపోతున్న దుండగులను పట్టిచ్చిన యువకుడిని పోలీసులు ఘనంగా సన్మానించారు. అనంతపురం నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఎం.పద్మావతి(48) సోమవారం మధ్యాహ్నం నడిచి వెళ్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో గొలుసును తెంపుకొని పోయారు. దీంతో బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. అదే సమయంలో ఎదురుగా బైక్‌పై వస్తున్న గీతాప్రసాద్ అనే యువకుడు ఆమె కేకలు విని అప్రమత్తమయ్యాడు. దుండగుల బైక్‌ను తన బైక్‌తో ఢీకొట్టాడు. దీంతో ఆగంతకులు పడిపోయారు. వెంటనే చుట్టుపక్కల వారు వారిద్దరినీ పట్టుకుని, బంధించారు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను నగరానికి చెందిన షేక్ సర్వర్ వలీ, మహ్మద్ అలీగా గుర్తించారు. గీతాప్రసాద్ సమయస్ఫూర్తిని అందరూ మెచ్చుకున్నారు. సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్పీ రాజశేఖర్‌బాబు.. యువకుడు గీతాప్రసాద్‌కు రూ.5 వేలు రివార్డుగా అందజేసి, ఘనంగా సత్కరించారు. జాతీయ అవార్డుకు గీతా ప్రసాద్ సాహసకృత్యాన్ని సిఫారసు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
కుక్కముందు తోకముడిచిన చిరుత
ముంబయి: సరిగ్గా అర్థరాత్రి రెండు గంటల ప్రాంతం. ఆ బంగ్లాలో ఉన్నవారంతా నిద్రపోతున్నారు. ఇంటికి కాపలా కాసే కుక్క కూడా గుర్రు పెట్టి నిద్రతీస్తుంది. ఈలోపు ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఆ ఇంటి ప్రాంగణంలోకి చిరుత పులి ప్రవేశించింది. బాగా ఆకలితో ఉన్నదనుకుంటా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కసిగా కుక్కపై దాడి చేయాలనుకుంది. కాని, ఆ కుక్క ఇంటిలోపలికి వెళ్లే ప్రవేశ ద్వారానికి ముందున్న గదిలో ఉంది. లోపలికి దూరిపోదామంటే మొత్తం ఇనుపచువ్వలు పెట్టి కట్టారు. దీంతో ఆ గది చుట్టే అటూ ఇటూ తిరుగుతూ చివరికి తన పంజాను ఇనుపచువ్వల నుంచే దూర్చే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలోనే గాండ్రుమంటూ శబ్దం చేసింది. ఇంతలో కుక్కకు మెలకువ వచ్చి విశ్వాస విశ్వరూపాన్ని చిరుతకు చూపించింది. ఏమాత్రం జంకూబొంకూ లేకుండా చెవులు చిల్లులుపడేలా దానికి ఎదురపడి అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపులకు చిరుత జంకి అక్కడి నుంచి తోకముడిచి పారిపోయింది. ఇదంతా ముంబయి శివారు ప్రాంతంలోని ఓ బంగ్లాలో చోటు చేసుకుంది. ఆ బంగ్లాకు వెలుపల బిగించిన సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యం నమోదైంది. రోజువారి తనిఖీలో భాగంగా చూసిన ఇంటి యజమానులు ఆ సీన్ చూసి అదిరిపడ్డారు. ఒక వేళ నిజంగా చిరుత ఇంట్లోకి వచ్చినట్లయితే అనుకుని భయపడిపోయారు. ఆ వీడియోను యూట్యూబ్‌లో పెట్టగా అది నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది. -
చైన్ స్నాచర్కు దేహశుద్ధి!
-
ఎందుకు వెంటాడారు?
యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో, హాలీవుడ్ స్టంట్స్ తరహా సీక్వెన్స్‌తో వస్తున్న చిత్రం ‘చేజ్'. రామ్ దివ్యేష్, స్పందన జంటగా ఈ చిత్రాన్ని మోహన్ నిమ్మకాయల స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. మోహన్ మాట్లాడుతూ ‘‘చిత్రంలో ఎవరు ఎవర్ని, ఎందుకు వెంటాడారు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మార్చి ప్రథమార్ధంలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. సంగీత దర్శకుడు శంకర్ పాటలకు స్పందన వస్తోంది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: ట్రాయ్బక్ వేల్, కథ: రాజేష్ జగన్నాథం, స్టంట్స్: టామ్ ెహ న్రీ, సమర్పణ: పద్మలత. -
అమెరికాలో ఛేజ్!
రామ్ దివ్యేష్, స్పందన అల్లూరి ముఖ్య తారలుగా పద్మలత సమర్పణలో స్వీయదర్శకత్వంలో మోహన్ నిమ్మకాయల నిర్మిస్తున్న చిత్రం ‘చేజ్’. ప్రస్తుతం నిర్మాణా నంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శక, నిర్మాత మోహన్ మాట్లాడుతూ -‘‘హాలీవుడ్ చిత్రం ‘సమ్‌టైమ్స్ ఇన్ లైఫ్’కి నిర్మాతగా, సెకండ్ యూనిట్ డెరైక్టర్‌గా చేశాను. ఈ చిత్రం మొత్తం అమెరికాలోనే తీశాం. ఓ చేజ్ నేపథ్యంలో సాగే ఈ కథ ఆద్యంతం ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇందులోని యాక్షన్ సన్నివేశాలను ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ టామ్ హెన్రి ఆధ్వర్యంలో చిత్రీకరించాం. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. -
పోలీసులను పరుగు పెట్టించిన తాబేలు
తాబేలును పట్టుకోవడానికి పోలీసులు ఛేజింగ్ చేయాల్సి వచ్చిందంటే.. ముక్కున వేలేసుకుని నవ్వుకోవాల్సిందే. అయితే అమెరికాలో ఓ తాబేల్ ను పట్టుకోవడానికి అక్కడి పోలీసులు చిన్న ఛేజింగ్ చేయాల్సి వచ్చిందట. అమెరికాలోని అల్హంబ్రా నగరంలో 150 పౌండ్లున్న తాబేల్ రోడ్డుపై తిరుగుతూ పోలీసులకు కనిపించింది. అయితే తాబేలు అంత సులువుగా పోలీసుల చేతికి చిక్కకపోవడం కథలో ఓ ట్విస్ట్. రోడ్డుపైన తిరుగుతూ కనిపించిన తాబేల్ పట్టుకోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు చిన్నపాటి ఛేజింగ్ చేయాల్సి వచ్చిందని అల్హంబ్రా పోలీసుల విభాగం ఫేస్ బుక్ లో వెల్లడించింది. చివరకు లాస్ ఎంజెలెస్ కౌంటీ డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనిమల్ కేర్ అండ్ కంట్రోల్ వారికి అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. పోలీసులు, తాబేలు లో వేగం ఎవరిది? తాబేల్ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కాని తాబేలు కంటే పోలీసులు వేగంగా పరిగెత్తి పట్టుకున్నారు. దాని బరువు 150 పౌండ్లు ఉంది. అని ఫేస్ బుక్ లో వెల్లడించారు.