![UP Bride Chases Runaway Groom Over 20 km And Marry Him - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/24/woman.jpg.webp?itok=jx0-fDFD)
చాలామంది పెళ్లి పేరుతో వంచన చేయడం లేదా పెళ్లి రేపు అనగా పరారవ్వడం గురించి విన్నాం. ఆ తర్వాత వధువు కుటుంబసభ్యులు భోరుమని కన్నీళ్లుపెట్టుకోవడం వంటి కథలే చూశాం. మోసపోతే కన్నీళ్లతో కూలబడిపోవడం కాదని, తెగించి మరీ ఆ మోసగాడిని పట్టుకుని కిక్కుమరనకుండా చేయాలని నిరూపించింది ఓ వధవు. పెళ్లిమండపం వద్ద భయానక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న వధువు చేసిన సాహసం చూసి ఆశ్చర్యపోక మానరు. ఆమెను ప్రశసించకుండా ఉండలేం.
ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వధువు పెళ్లిరోజున వరుడు పెళ్లికి నిరాకరించి..చెప్పపెట్టకుండా పెళ్లిమండపం నుంచి వెళ్లిపోయాడు. వరుడు కోసం ఎదురు చూస్తూ కూర్చొన్న వధువు ఈ షాకింగ్ ఘటనను జీర్ణించుకోలేకపోయింద. ఏమైన సరే అతన్ని వెతికి తెచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకోసం ఆమె పెళ్లి డ్రస్‌లోనే అతడిని వెదకడం ప్రారంభించింది. అతడు ఫోన్‌లో వాళ్ల అమ్మను తీసుకురావడానికే వెళ్లానంటూ చెప్పినా అమె నమ్మలేదు.
ఏకంగా 20 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ అతడ్ని పట్టుకుంది. అతడు సరిగ్గా బరేలీ పోలీస్టేషన్ సమీపంలోని బస్సులో దొరికాడు. అతడ్ని పెళ్లిమండపానికి వెంట బెట్టుకుని తీసుకొచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాల అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించి సదరు వదువరులిద్దరికి పెళ్లి చేశారు.నిజానికి అతడు ఆ జంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సరిగ్గా పెళ్లి టైంకి అతడి హ్యాండివ్వడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఎలాగైనా వెదిక పట్టుకునైనా అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మరీ ఇంతటి సాహసం చేసింది ఆ నవ వధువు. తన వివాహాన్ని నిలబెట్టుకునేందుకు ఆమె కనబర్చిన ధైర్యానికి అందరిచే ప్రశంసలు అందుకుంది.
(చదవండి: రూ.2 వేల నోటు మార్పిడికి తంటాలు)
Comments
Please login to add a commentAdd a comment