groom
-
అవును వాళ్లిద్దరికీ పెళ్లైంది : అదిరే స్టెప్పులతో పెళ్లి వీడియో వైరల్
మన దేశంలో పెళ్లి అంటే కేవలం వేడుక, ఆనందం మాత్రమేకాదు ఆడంబరం, ఆర్బాటం కూడా. ఎంత ఖర్చైనా పరవాలేదు విలాసవంతంగా మూడు ముళ్ల వేడుక పూర్తి కావాల్సిందే. ఇదీ నేటి ప్రజ తీరు. దీనికి తోడు ఇలాంటి వివాహ వేడుకలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటం క్రేజీగా మారిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అంటే ముందుగా గుర్తొచ్చే నెటిజన్లు కమెంట్లే గదా. తాజాగా ఒక పెళ్లికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది.అయితే ఈ పెళ్లి వెనుక విశేషం ఇదే అంటూ ఇంటర్నెట్ యూజర్లు కమెంట్లతో హోరెత్తించారు. ఇంతకీ విషయం ఏమిటంటే.ఈ వైరల్ వీడియోలో వధువు గ్రాండ్ జర్జోజీ వర్క్‌తో తయారైన మెరూన్ కలర్ లెహంగాలో అందంగా ముస్తాబైంది. డబుల్ దుపట్టాలతో మరింత అందంగా కనిపించింది.ఆకర్షణీయమైనమేకప్, చోకర్,నెక్లెస్‌లు,చెవిపోగులు ఇలా సర్వహంగులతో పెళ్లికూతురి లుక్‌లో స్టైలిష్‌గా కనిపిస్తోంది. మరోవైపు, వరుడు కూడా ఐవరీ కలర్ షేర్వానీలో బాగానే తయారయ్యాడు. ఇద్దరూ ఆనందంగా డ్యాన్స్ చేస్తారు. మరీ ముఖ్యంగా పెళ్లి కూతురు చాలా ఉత్సాహంగా స్టెప్పులేసింది. అటు 40 ఏళ్ల పెళ్లి కొడుకుగా సిగ్గుపడుతూ ఆమెతో జత కలిశాడు. View this post on Instagram A post shared by mayank Kumar Patel (@mayank_kumar_patel473)అసలు స్టోరీ ఇదట! వరుడు వయసు 46, వధువు వయసు 24.తనకంటే పదహారు సంవత్సరాలు పెద్దవాడిని సంతోషంగా వివాహం చేసుకుంది. వయసులో చాలా తేడా ఉన్నా కూడా ఆమె ఆనందంగా కనిపిస్తోంది. వరుడు గవర్నమెంట్ టీచర , సురక్షితమైన ప్రభుత్వ ఉద్యోగం అందుకే ఇలా అంటూ గత ఏడాది డిసెంబరులో చేసిన పోస్ట్‌లో వెల్లడించింది. వీడియో అప్లోడ్ కాగానే కమెంట్ సెక్షన్‌ను నెటిజన్లు చమత్కారాలు, వ్యంగాలతో నింపేశారు. కొంతమంది పెళ్లి కొడుకు వయస్సును ఎగతాళి చేయగా, మరికొందరు గవర్నమెంట్ ఉద్యోగం బాబూ అని వ్యాఖ్యానించారు. పెళ్లి చేయాలంటే అందం, కులంతోపాటు, వయసు, హోదాకూడా పరిశీలిస్తారు పెద్దలు సాధారణంగా. సమయాన్నిబట్టి, తమ సౌలభ్యాన్ని వీటిల్లో అనేక మినహాంపులతో పెళ్లిళ్లు జరిగిపోతాయి. దాదాపు వీరంతా చాలా హ్యాపీగా జీవితాలను గడుపుతూ ఉంటారు. అయితే సోషల్ మీడియా యూజర్లు మాత్రం, చమత్కారాలతో, మీమ్స్ సందడిచేస్తూనే ఉంటారు. ‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు’ అన్న సామెత వీళ్లు అసలు పట్టించుకోరు. -
‘ప్లీజ్ మామ నాకు కట్నం వద్దు’.. సోషల్ మీడియాలో పెళ్లి కుమారుడి ఫొటోలు వైరల్
మామ బంగారంలాంటి మీ అమ్మాయే నాకు పెద్ద కట్నం.. ఇంక నాకు ఈ కట్నకానుకలు ఎందుకు చెప్పు. ఇదిగో నువ్విచ్చిన కట్నం నువ్వే తీసుకో. ఆచార ప్రకారం ఒక కొబ్బరికాయ, ఒక రూపాయి మాత్రమే ఇస్తే చాలు’ అంటూ పిల్లనిచ్చిన మామ తనకు ఇచ్చిన రూ.5,51,00 కట్నాన్ని వెనక్కి ఇచ్చాడు. దీంతో పెళ్లి కుమార్తె తండ్రి మా అల్లుడు వెరిగుడ్’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.వివరాల్లోకి వెళితే..రాజస్థాన్‌లోని జైసల్మేర్ జిల్లాకు చెందిన పరంవీర్ రాథోర్ సివిల్ సర్వీస్ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ తరుణంలో ఫిబ్రవరి 14న కరాలియా అనే గ్రామంలో పిజీ చదువుతున్న నికితా భాటిను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత వధువు తండ్రి పలు బహుమతులతో పాటు ఎర్రటి గుడ్డను అలంకరించిన ప్లేట్లో రూ. 5,51,000 నగదు తెచ్చాడు. ఆ మొత్తాన్ని అల్లుడికి ఇచ్చాడు. కానీ అల్లుడు వెంటనే ఆ డబ్బును తిరిగి వెనక్కి ఇచ్చాడు. కట్నం ఇస్తే.. ఎందుకు తిరిగిచ్చారని పరంవీర్‌ను ప్రశ్నిస్తే.. నా పెళ్లి జరిగే సమయంలో కట్నం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, ఇలాంటి దురాచారాలు సమాజంలో ఇంకా కొనసాగుతుండటం చూసి నాకు బాధ కలిగింది. అందుకే పెళ్లి జరిగిన తర్వాత నా తండ్రితో, కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆ డబ్బును తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను.నేను సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నా. నిజమైన మార్పు తెచ్చే బాధ్యత చదువుకున్న మన మీద ఉంది. విద్యావంతులైన మనం మార్పు కోసం ముందుకు రాకపోతే మరెవరు రారు? మార్పు ఎక్కడో ఒకచోట ప్రారంభమవ్వాలి. ఆ మార్పు నా నుంచే మొదలవ్వాలి. నేను తీసుకున్న నిర్ణయాన్ని నా తల్లిదండ్రులు సమర్ధించారు. మనం ఈ తప్పుడు సంప్రదాయాలను ఆపకపోతే సమాజంలో మార్పు ఎలా వస్తుంది?’అని అన్నారు. పరంపవీర్ తండ్రి ఈశ్వర్ సింగ్ మాట్లాడుతూ.. నేను రైతును. ఆచార ప్రకారం ఒక కొబ్బరికాయ, ఒక రూపాయి మాత్రమే తీసుకున్నాను. వరకట్న వ్యవస్థను పూర్తిగా నశింపజేయాలి’ అని పిలుపునిచ్చారు. ప్రస్తుతం, ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. -
గుర్రంపై ఊరేగుతూ ప్రాణాలొదిలిన పెళ్లికొడుకు
ష్యోపూర్(ఎంపీ): పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్న ఓ పెళ్లికొడుకు హఠాన్మరణం అక్కడి వారందరినీ హుతాశులను చేసింది. మధ్యప్రదేశ్‌లోని ష్యోపూర్ జిల్లాలో పెళ్లివేడుకలో ఈ విషాదం చోటుచేసుకుంది. పెళ్లి సందర్భంగా గుర్రంపై ఊరేగుతూ శుక్రవారం రాత్రి వరుడు విగతజీవిగా మారిన వైనం శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సూన్స్‌వాడా గ్రామానికి చెందిన 26 ఏళ్ల ప్రదీప్ జాట్ పెళ్లివేడుక శుక్రవారం కన్నుల పండువగా జరిగింది. ఈ సందర్భంగా అక్కడి వేదికవైపు ప్రదీప్ పెళ్లికొడుకు దుస్తుల్లో గుర్రంపై బయల్దేరారు. ఇదే సమయంలో హఠాత్తుగా ముందుకు ఒరిగి అలాగే గుర్రంపై కూలబడిపోయారు. ఇది గమనించిన బంధువులు వెంటనే ప్రదీప్‌ను జాగ్రత్తగా కిందకు దింపి హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణం పోయిందని జిల్లా ఆస్పత్రి సివిల్ సర్జన్ డాక్టర్ ఆర్బీ గోయల్ ధృవీకరించారు. గుండెపోటు కారణంగా పెళ్లికొడుకు ప్రాణాలు కోల్పోయి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. పెళ్లికొడుకు ప్రదీప్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ)కి ష్యోపూర్ జిల్లా అధ్యక్షునిగా గతంలో పనిచేశారు. -
సిబిల్ స్కోర్ చూసి పెళ్లి క్యాన్సిల్ చేశారు
సిబిల్ స్కోర్ తక్కువగా ఉంటే లోన్స్ క్యాన్సిల్ చేసే బ్యాంక్స్ గురించి విని ఉంటారు. కానీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని పెళ్లి క్యాన్సిల్ చేసిన ఘటన గురించి ఎక్కడైనా విన్నారా? అయితే ఈ కథనం తప్పకుండా చదవాల్సిందే..ఒకప్పుడు పెళ్లి చేయాలంటే.. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసేవారు. ఇప్పుడు కాలం మారింది. అబ్బాయి ఉద్యోగం, బ్యాంక్ బ్యాలెన్స్ వంటివి చూస్తున్నారు. అయితే తాజాగా వరుడి సిబిల్ స్కోర్ తక్కువగా ఉందని మహారాష్ట్రలోని ముర్తిజాపూర్లో ఒక వధువు కుటుంబం ఏకంగా వివాహాన్నే రద్దు చేసింది.మహారాష్ట్రలోని ముర్తిజాపూర్కు చెందిన యువతికి, అదే ప్రాంతానికి చెందిన యువకుడితో పెద్దలు పెళ్లి నిర్చయించారు. ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. కానీ పెళ్ళి జరగటానికి కొన్ని రోజుల ముందు, వధువు మేనమామ.. వరుడి సిబిల్ స్కోర్ చెక్ చేయాలని పట్టుబట్టాడు. ఇక చేసేదేమీ లేక సిబిల్ స్కోర్ చేసారు.సిబిల్ స్కోర్ చెక్ చేస్తే.. ఆ యువకుడు అనేక బ్యాంకుల నుంచో లోన్స్ తీసుకున్నట్లు తెలిసింది. అంతే కాకుండా అతని సిబిల్ స్కోర్ కూడా చాలా తక్కువ ఉందని గుర్తించారు. ఇప్పటికే ఆర్ధిక ఇబ్బందుల్లో యువకుడు.. అమ్మాయికి ఆర్ధిక భద్రతను ఎలా కల్పిస్తాడు? అనే ప్రశ్న లేవనెత్తారు. చివరకు పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది.ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు నెటిజన్లు ఇలా అయితే ఇక అబ్బాయిలకు పెళ్లి అయినట్టే అని చెబుతుంటే.. ఇంకొందరు అమ్మాయి కుటుంబం తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. అమ్మాయికి పెళ్లి చేయాలంటే.. ఆ మాత్రం జాగ్రత్త అవసరమని చెబుతున్నారు.సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?సిబిల్ స్కోర్ అనే పదాన్ని ఎప్పుడూ వినేవారికి కూడా.. బహుశా సిబిల్ స్కోర్ అంటే ఏమిటో తెలిసుండకపోవచ్చు. క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్(CIBIL) అనే క్రెడిట్ బ్యూరో.. మీ ఆర్థిక పరిస్థితి ఏంటని తెలుసుకుని మీకు ఇచ్చే రేటింగ్‌నే సిబిల్ స్కోర్ అంటారు.ఇదీ చదవండి: ఐఆర్సీటీసీ టికెట్ ధరలలో తేడా: రైల్వే మంత్రి సమాధానమిదే..సిబిల్ స్కోర్ అనేది 300 నుంచి 900 వరకు ఉంటుంది. ఈ స్కోర్ అనేది 900కి దగ్గరగా ఉంటె మంచి సిబిల్ స్కోర్ అంటారు. 750 కంటే తక్కువ ఉంటే మంచి సిబిల్ స్కోర్ కాదని చెబుతారు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే.. కొంత తక్కువ వడ్డీకి బ్యాంకులు లోన్ ఇస్తాయి. తక్కువ స్కోర్ ఉంటే.. కొన్ని బ్యాంకులు లోన్ ఇవ్వవు. ఒకవేళా ఇచ్చినా.. వడ్డీ రేటు భారీగా ఉంటుంది. -
మాములు పెళ్లి వింత కాదు..! వరుడే పండితుడిగా మారి..
పెళ్లితంతులో పలు విచిత్రమైన ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు చూశాం. వధువు లేదా వరుడు విలక్షణంగా ఉండాలని చేసిన చిత్ర విచిత్రమైన పనులు చూశాం. కానీ ఇలాంటి వింతను ఏ పెళ్లితంతులో చూసి ఉండరు. వామ్మో వరుడికి మరీ ఇంతటి ఆత్మనిర్భరత అని విస్తుపోతారు. ఆఖరికి పెళ్లి విషయంలో ఇంతలానా అంటూ విస్తుపోయారు బంధువులు. పూజరి ఉన్నా సరే కాదని మరీ పెళ్లితంతు జరిపించాడు. ఎలాగో తెలుసా..!ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో చోటు చేసుకుంది. సహరాన్‌పూర్‌లోని రాంపూర్‌కు చెందిన వివేక్ కుమార్ అనే వ్యక్తి తన పెళ్లికి తానే పండితుడయ్యాడు. వధువు పక్కన కూర్చొని వరడే(Groom) తన వివాహా మంత్రాలు అతడే జపిస్తూ పెళ్లితంతుని విజయవంతంగా పూర్తి చేశాడు. ఇది చూసి అక్కడున్న వాళ్లందరికీ నోట మాటరాలేదు. మంత్రాలు చక్కగా వల్లిస్తూ(Chants Mantras) ప్రతి తంతుని అందరినీ ఆశ్చర్యపరిచేలా పూర్తి చేశాడు. ఈ వివాహ తంతుని చూస్తే ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) చెప్పిన ఆత్మనిర్భర్ భారత్ గుర్తుకొస్తుంది. దీని అర్థం స్వావలంబన భారతదేశం. దీన్ని ప్రధాని మోదీ 2020లో ప్రారంభించారు. భారతీయులు స్వతంత్రంగా స్వావలంబనగా ఉండటానికి ప్రోత్సహించే కార్యక్రమం ఇది. ఆయన ఉద్దేశ్యం ప్రకారం ఆత్మనిర్భర్ భారత్‌కి 'ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, వ్యవస్థ, వైబ్రెంట్ డెమోగ్రఫీ అనేవి ఐదు మూల సంభాలని ఆ దిశగా మనమంతా ఏ దేశంపై ఆధాపడకుండా ఎదగాలనేది ఆయన ఆంతర్యం. అందుకే మోదీ ఆత్మనిర్భర్ భారత్ అని నినదించారు. అందుకు అర్థం వచ్చేలా ఈ వరడు తన పెళ్లికి తానే పండితుడిగా మారి వివాహం చేసుకున్నాడు. మోదీ భారత్ తొందరలో ఆత్మ నిర్భర్‌గా మారుతుందని తరుచుగా అనేవారు. ఔను..! అనేలా ఈ వరుడు ఇలా చేతల్లో చూపించాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనం ఈ వ్యక్తి అని ఒకరు, తన పెళ్లిని అద్భుతంగా ఉండాలని ఇలా చేశాడంటూ మరొకరు కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.Groom Becomes Priest: #Saharanpur Man Conducts His Own Wedding Rituals pic.twitter.com/keHAABXD77— Genzdigest (@Genzofficia_l) January 25, 2025 (చదవండి: అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ..! ఏకంగా 150నుంచి 68 కిలోలు..) -
ఇలా అయితే మగపిల్లలకి పెళ్లి అవుద్దా..!
"పెళ్లి ఎప్పుడవ్వుతుంది బాబు..నీకు పిల్ల ఏడ దొరుకుతుంది బాబు".. అని పాడుకోవాల్సిన పరిస్థితి ఎదురవ్వుతోంది మగపిల్లలున్న తల్లిదండ్రులకు. విజ్ఞానం గొప్ప జ్ఞానం ఇవ్వాలే గానీ అతి తెలివి, అత్యాశని ఇవ్వకూడదు. ఆ విధంగా విద్యను ఆర్జించకూడదు కూడా. కానీ ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచనలు ఇలానే ఉన్నాయి. వారి కోరికలకు అంతులేదు. వారి అంచనాలకు సరితూగలేకపోతున్నామనే వ్యధలో పెళ్లికానీ ప్రసాదులుగా మిగిలిపోతున్నారు చాలామంది. చెప్పాలంటే వివాహం ఓ వ్యాపారంగా మారిపోయింది. ఈడు జోడు అన్న మాటకు తావులేకుండా పోయింది. ఇంతకుముందు కట్నలు ఇవ్వలేక లభోదిభోమనే ఆడపెళ్లివారే డిమాండ్ చేసే స్థాయికి చేరిపోయింది పరిస్థితి. ఈ పరిణామం బాగుందనిపించినా..వాస్తవికతకు అద్దం పెట్టేలా సమంజసమైనా డిమాండ్లు ఉంటే బావుండు..ఇదేంటిది అని పారిపోయేలా ఉంది పరిస్థితి. అస్సలు మగవాళ్లకి పెళ్లి అవుద్దా?. మ్యాచ్ సెట్ అవుద్దా..? అనే సందిగ్ధ స్థితికి వచ్చేసింది. సింపుల్‌గా చెప్పాలంటే ఏ కుర్రాడికైనా పెళ్లి కుదిరిందంటే..అదృష్టవంతుడివిరా అనాల్సి వస్తోంది. అంతలా పెళ్లి కరువు తాండవిస్తోంది మగపిల్లలకి. ఎందుకిలా..? ఇది మంచి పరిణమామేనా అంటే..ఒకప్పుడు పెళ్లిళ్లు ఇరువైపుల పెద్దలు ఈడు-జోడు, స్థాయిలు చూసుకుని చక్కగా కుదర్చుకునేవారు. ఈజీగా పిల్లలకు ముడిపెట్టేసేవారు. హైరానా పడేవారు కాదు. కానీ ఇప్పుడు పెళ్లి అనే రెండక్షరాల పదమే భయానకం అనేలా హడలెత్తిస్తోంది. ముఖ్యంగా మగపిల్లల తల్లిదండ్రులు భయంగుప్పిట్లో బతుకీడుస్తున్నారు. ఒకప్పడు మా అబ్బాయి ఈ ఉద్యోగం చేస్తున్నాడు..కట్నం ఇంత అని డిమాండ్ చేసే నోళ్లు కాస్త తడబుడుతున్నాయి. అమ్మాయినిస్తే అదే పదివేలు అనే పిరిస్థితికి వచ్చేశారు. ఎందుకిలా అంటే..పెరుగుతున్న టెక్నాలజీ మనకు విజ్ఞానం ఇస్తోందో లేదో చెప్పలేకపోతున్నా..బంధాలను కాలరాసుకునే అజ్ఞానాన్ని సముపార్జిస్తున్నాం అని కచ్చితంగా చెప్పొచ్చు. ఈ టెక్నాలజీ సాయంతోనే కడుపులో ఉంది ఆడపిల్ల ? మగపిల్ల అని ముందుగా తెలుసుకుని వాళ్లని భూమ్మీద పడనీయకుండా చేశాం. దీంతో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోయింది. అదే నేటి ఈ దుస్థితికి కారణం కూడా. అందువల్లే పిల్లనిచ్చేవాళ్లు దొరకడం లేదని చెప్పొచ్చు. అలాగే ఇప్పుడు ఆడపిల్లలు కూడా మగపిల్లలతో పోటీ పడి మరీ చదువుకుంటున్నారు. వారికంటే మెరుగ్గా ఉండేస్థాయికి చేరుకుంటున్నారు. వారి కాళ్లపై వారు నిలబడి బతికే స్థాయిలో ఉంటున్నారు కూడా. ఇది మంచి శుభపరిణామమే కానీ..దీన్నే చూసుకుని ఆడిపిల్లలు తల్లిదండ్రులు అంచనాలు ఓ రేంజ్‌కి వెళ్లిపోతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే "గొప్ప" కాస్తా ఇగోగా మారిపోయింది. మా అమ్మాయి మీ అబ్బాయికి తక్కువ కాదు అనేస్థితికి వచ్చేసి.. అణుకువకు తిలోదాకాలు ఇచ్చి "అహాం" తలెకెక్కించుకుంటున్నారు. అంటే విద్యావంతులుగా మారుతున్నాప్పుడు తక్కువ ఎక్కువలకు చోటిస్తే..అది చివరకు ఏ స్థాయికి తీసుకొస్తుందో ఊహించలేం. ఇక్కడ సరిజోడికి తావివ్వకపోయినా..కనీసం ఒక్కటవ్వనున్న జంట ఇష్టాలకు ప్రాధాన్యత, వారి ఫైనాన్షియల్ స్థితి చూస్తే బాగుండు. కానీ అంతకు మించి అంటున్నారు ఆడిపిల్లల తల్లిదండ్రులు. జస్ట్ 25 నుంచి 30 ఏళ్లలోపు ఏ మగపిల్లవాడైనా..మహా అయితే రూ. 30-50 వేలు లేదా లక్షలోపు సంపాదించగలరు. ఎక్కడో మహా ఇంటిలిజెంట్స్ లక్షల్లో వేతనాలు అందుకోగలరు. దాన్ని ఆలోచింకుండా ఓ కారు, బంగ్లా, లక్షల్లో జీతాలు, అత్తమామలు పక్కన ఉండకూదు అనే అంచనాలు ఉంటే..పెళ్లి అనే పదం బరువైపోతుంది. చెప్పాలంటే ఈ అంచనాలను చేరుకోవడం అందరికీ సాద్యం కాకపోవచ్చు. ప్రస్తుతం ఉన్న జీవనవిధానానికి ఇరువురు ఉద్యోగాలు చేస్తే కుటుంబాన్నిబ్యాలెన్స్ చేయగలరా లేదా అన్నదానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మన అమ్మాయిని మంచిగా చూసుకోగలడా, బాధ్యతయుతంగా ప్రవర్తించగలడా అన్నది పరీక్షించండి అంతే తప్ప ఇలా గొంతెమ్మ కోరికల లిస్ట్ ముందే పెడితే..ఏ వరుడి తల్లిదండ్రులు ముందుకు రాగలరు. ఈ కారణాలతోనే చాలామంది అబ్బాయిలకు పెళ్లి అవ్వడం కష్టమవుతుంది. ఇక్కడ ఆలోచించాల్సింది ఇంకొకటి కూడా ఉంది. పెళ్లితో బాధ్యతలు తెలుసుకుని సంసారాన్ని చక్కబెట్టే స్థాయికి వచ్చిన వాళ్లు ఉన్నారనే విషయాన్ని గుర్తు ఎరగండి. సర్దుకుపోవడం, అణుకువ, బాంధవ్యాన్ని నిలబెట్టుకోవడం వంటి విలువైన పదాలకు వాల్యు ఇవ్వండి అప్పుడూ పెళ్లికి అర్థం..పరమార్థం ఉంటుంది. ఇలా పిచ్చి పిచ్చి అంచనాలతో పెళ్లిళ్లు చేయడం..అవతలవాళ్లు పెళ్లి కోసం అబద్ధాలు చెప్పడం...చివరికి ఒకరికొకరు మోసం పోయామని అరవడం..కోర్టుల చుట్టూ తిరగడం..మన వివాహ వ్యవస్థ గొప్పది..అది వ్యాపారంగా మార్చుకోవద్దు. భవిష్యత్తులో హాయిగా ఉంచే ఓ గొప్ప ఇన్వెస్టెమంట్గా చూడొద్దు. జీవితం అనేది ఎంతో విలువైనది..ఏరోజు ఎవరంటారో తెలియని స్థితి..ఉన్నన్నిరోజులు సంతోషంగా హాయిగా ఉండేలా వర్తమానానికి విలువ ఇద్దాం. ప్రస్తుతం ఈ విషయమే నెట్టింట తెగ వైరల్ అయ్యి చర్చనీయాంశంగా మారింది. నెటిజన్లు కూడా పోస్ట్‌లలో ఇదే ఏకరవు పెడుతున్నారు కాబట్టి పెద్దలు ఆలోచనా తీరు మార్చుకోండి..వయసు దాటక ముందే పిల్లలకు పెళ్లి చేసి హాయిగా ఉండండి. Salary expectations of groom during wedding matches is insane … <1L / month are not even being considered if person is in IT Mindset of parents requires RESET. How can 28 year old earn 1-2L, have own car and a house ??Your generation had all these for retirement#Life— Vineeth K (@DealsDhamaka) January 6, 2025 (చదవండి: సేద్యంలో మహిళా సైన్యం!) -
షహర్ కా షాన్ షేర్వానీ
నవాబుల కాలం నుంచి ఇప్పటి దాకా షేర్వానీకి ఏమాత్రం క్రేజ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు రాజ కుటుంబీకులు, సంపన్నవర్గాలకే షేర్వానీ పరిమితమయ్యేది. రానురాను పేద, ధనిక అందరూ షేర్వానీ అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. పెళ్లిళ్లు, పేరంటాల్లో కుటుంబ సభ్యులంతా చిన్నాపెద్దా తేడా లేకుండా షేర్వానీ ధరించాల్సిందే.. బ్రాండెడ్ దుస్తులు మార్కెట్‌ను రాజ్యమేలుతున్నా.. రాజుల కాలం నాటి షేర్వానీలు పండగలు, శుభకార్యాలకు సరికొత్త శోభను తీసుకువస్తున్నాయి. ఇదే ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది. అభిరుచులకు అనుగుణంగా షేర్వానీ డిజైన్లలోనూ మార్పులొచ్చాయి. రాకుమారులు.. సినీహీరోలు.. రాజకీయ నాయకులు ఇలా సెలబ్రెటీలంతా భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా షేర్వానీని ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు. కేవలం మన సంస్కృతే కాదు.. పాశ్చాత్య డిజైన్ల సమ్మేళనంగా సరికొత్త షేర్వానీలు మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి. హైదరాబాద్‌లో కేవలం నిజాం నవాబులు, ముస్లిం, మార్వాడీ సమాజంలోనే షేర్వానీ ఆహార్యం కనిపించేంది. ఇప్పుడు ఈ ఫ్యాషన్ అందరి ఒంటి మీదకు చేరింది. మొదట్లో కేవలం పెళ్లి కుమారుడే షేర్వానీతో ఊరేగేవాడు.. ఇప్పుడు వరుడే కాదు.. పెళ్లి బరాత్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఈ డ్రెస్ వేర్‌ను వాడటం పరిపాటిగా మారింది. విభిన్న రకాలతో షేర్వానీలతో బరాత్కే కొత్త అందం వస్తుందనే ప్రచారంతో వివాహంలో షేర్వానీ డ్రెస్ కోడ్‌గా మారింది. షేర్వానీ అంటే మక్కువ ఇండో వెస్టన్ డిజైన్స్‌తో వినియోగదారులకు నచ్చే విధంగా షేర్వానీలు తయారు చేస్తున్నాం. నేటి యువత మాములు డిజైన్ షేర్వానీలకు కాకుండా స్టైయిలి‹Ùగా కనబడటానికి కొత్త డిజైన్స్‌ను ఫాలో అవుతున్నారు. మారుతున్న డిజైన్స్‌కు అనుగుణంగా మా వద్ద షేర్వానీలు తయారవుతాయి. ప్రస్తుతం అన్ని మతాలు, వర్గాల వారు వీటిని ధరిస్తున్నారు. వారి వారి సంప్రదాయల డిజైన్లలో తయారు చేస్తున్నాం. షేర్మానీలు ధరించి శుభకార్యాలకు వెళితే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. శుభకార్యాలు పెళ్లిళ్లు విందుల్లో షేర్వాణి ధరించి వెళ్లే వారివైపే అందరి చూపు ఉంటుంది. నేటి యువత వీటిని ధరించడానికి మక్కువ చూపుతున్నారు. – ఇబ్రాహీమ్ బుఖారీ, జహాపనా డిజైనర్స్ వ్యవస్థాపకుడు బనారస్ పట్టుతో తయారీ షేర్వానీల తయారీలో బనారస్ పట్టుదే పైచేయి. ఈ పట్టుతోనే వీటిని ఉత్పత్తి చేసే అవకాశమున్నందున.. ఫ్యాషన్‌లో బనారస్ షేర్వానీలదే హవా. పురుషులు వ్రస్తాలలో పట్టుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం షేర్వానీలలో మాత్రం ఈ పట్టుకే పట్టం కడుతున్నారు. ఇలా వస్త్ర నాణ్యతకు అనుగుణంగా వీటి ధరల్లో హెచ్చు తగ్గులున్నాయి. రూ.2వేల నుంచి రూ.2 లక్షల వరకు షేర్వానీలు లభ్యమవుతున్నాయంటే వీటికి మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. వీటికి ఉన్న ఆదరణ దష్ట్యా షేర్వానీ ప్రియులు కస్టమైజ్డ్ డిజైన్లు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా డిజైనర్లు సైతం పుట్టుకొచ్చారు. నగరంలో బుఖారీ ఫ్యామిలీ జహాపనా డిజైనర్స్ పేరుతో షేర్వానీ రంగంలో విప్లం తీసుకొచి్చంది. యుత్‌కు నచ్చే స్టయిల్స్‌తో పాటు అన్ని కట్స్‌లో షేర్వానీలు తయారవుతున్నాయి. -
పెళ్లికొడుకు గెటప్‌లో రణబీర్ కపూర్ సందడి (ఫొటోలు)
-
చేపల కూర, మాంసం లేదని.. పెళ్లిలో కర్రలతో దాడి!
పెళ్లి అంటే విందులో నాన్ వెజ్ వంటకాలు ఉండాల్సిందే. అయితే వివాహ విందులో చేపల కూర, మాసం పెట్టకపోవటంతో వరుడు తరఫు బంధవులు, వధువు తరఫులు బంధవుల మధ్య పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది. విందులో చేపలు మాంసం లేకపోవటంతో కోపోద్రుక్తులైన వరుడి బంధువులు.. కర్రలో వధువు తరఫు బంధువలపై దాడి చేశారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకొగా.. అలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులుతెలిపిన వివరాల ప్రకారం.. దినేష్ శర్మ కుమార్తె సుష్మను వివాహం చేసుకోవడానికి అభిషేక్ శర్మ, ఆయన బంధువులు డియోరియా జిల్లాలోని ఆనంద్ నగర్ గ్రామానికి వచ్చారు. అయితే విందులో మాంసాహారం లేదనని.. వధువు తరఫువాళ్లు వరుడి బంధువులకు తెలియజేశారు. దీంతో పెళ్లి కొడుకు తండ్రి సురేంద్ర శర్మ, మిగతా బంధువులో కలిసి మాసం పెట్టకపోవటంపై పెళ్లికూతురు తరఫువాళ్లను దారుణంగా తిట్టారు. ఇరువర్గాల వారు చైర్లు విసిరేసుకుంటూ గొడవకు దిగారు. అక్కడి ఆగకుండా పెళ్లికూతురు ఫ్యామిలి, బంధవులపై వధువు బంధువులు పిడిగుద్దులు గుద్దుతూ, కర్రలతో దాడి చేశారు. దీంతో పెళ్లి ఆగిపోయింది. అక్కడి నుంచి పెళ్లి కొడుకు వెళ్లిపోయారు. అనంతరం పెళ్లి కూతురు తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లి కొడుకు, అతని ఫ్యామిలి తమపై తీవ్రంగా దాడి చేసి, రూ. 5 లక్షల కట్నం డిమాండ్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. -
స్టేజ్‌పైనే వధువుకి ముద్దుపెట్టిన వరుడు.. తర్వాత ఏం జరిగిందంటే!
పెళ్లంటే ఎన్నో పనులు, హడావిడీ, బంధువుల సందడి.. పవిత్రమైన వివాహ బంధం ద్వారా ఇద్దరు వ్యక్తులు ఒక్కటవ్వడమే కాకుండా.. రెండు కుటుంబాలను దగ్గర చేసే వేడుక. అయితే కాలం మారుతున్న కొద్దీ పెళ్లి పద్దత్తుల్లోనూ అనేక మార్పులు జరుగుతున్నాయి. ఈ మధ్య పెళ్లికి ముందే ఫోటో, వీడియో షూట్లు చేసుకోవడం ఎక్కువైపోయింది. పెళ్లిలో తాళి కట్టే సమయంలోనూ వరుడు, వధువు నుదుటిపై ముద్దు పెట్టిస్తున్నారు. ఇలా తమకు నచ్చిన విధంగా, జీవితాంతం గుర్తిండిపోయేలా పెళ్లి చేసుకుంటున్నారు.పాపం ఇలాగే ఆలోచించిన ఓ పెళ్లికొడుకు వేదిపైనే ఏకంగా వధువుకు ముద్దు పెట్టాడు. ఇంకేముంది వరుడి చర్య ఇరు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ విచిత్ర ఘటన ఉత్తరప్రదేశ్‌లో హాపూర్‌లో చోటుచేసుకుంది. అశోక్ నగర్లో శనివారం ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు జరిపించాడు. మొదటి పెళ్లి ఎలాంటి అవంతరాలు లేకుండా పాఫీగా జరిగింది. అయితే రెండో కూతురు పెళ్లి మాత్రం గందరగోళంగా మారింది. తాళి కట్టిన తరువాత ఇద్దరు దండలు మార్చుకుంటుండగా ఒక్కసారిగా వరుడు, వధువుకు ముద్దులు పెట్టాడు. ఎలాగో భార్యే కదా అని అనుకున్నాడో ఏమో బంధువుల సమక్షంలోనే ముద్దు పెట్టుకున్నాడు. అయితే ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఇది చూసిన వేదికపై ఉన్న వధువు కుటుంబ సభ్యులు.. వరుడి బంధువులపై దాడి చేశారు. దీంతో వివాహ వేదిక రణరంగంగా మారింది. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపటికే వధువు కుటుంబ సభ్యులు కర్రలు పట్టుకుని వేదికపైకి ఎక్కి వరుడి కుటుంబీకులను కొట్టారు. ఈ ఘర్షణలో వధువు తండ్రి సహా ఆరుగురికి గాయాలయ్యాయి. చివరికి ఈ పంచాయితీ పోలీసుల వద్దకు చేరడంతో ఇరు కుటుంబాలకు చెందిన ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే వరుడు వధువును వేదికపై బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించగా.. వరమాల తర్వాత తనను ముద్దు పెట్టుకోవాలని వధువే పట్టుబట్టిందని వరుడు చెప్పాడు. ఈ కేసులో ఇరు కుటుంబాల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వ్రాతపూర్వక ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని హాపూర్ సీనియర్ పోలీసు అధికారి రాజ్‌కుమార్ అగర్వాల్ తెలిపారు. ఇక ఈ ఘటన తర్వాత రెండు కుటుంబాలు పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాయి. -
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలీవుడ్ భామ జాన్వీకపూర్. త్వరలోనే మిస్టర్ అండ్ మిసెస్ మాహీ చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా మారిపోయింది ముద్దుగుమ్మ. తాజాగా బుధవారం ఈ సినిమా నుంచి దేఖా తెను అనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఓ ప్రెస్మీట్లో పాల్గొన్న జాన్వీకి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. మిమ్మల్ని చేసుకునేవారికి ఎలా ఉండాలో చెప్పగలరా? అని అడిగారు. అయితే దీనికి జాన్వీ కపూర్ ఆసక్తికర సమాధానమిచ్చింది. అదేంటో మీరు చూసేయండి.జాన్వీ కపూర్ మాట్లాడుతూ..' నా కలలను తనవిగా భావించేవాడు. నాకు అండగా నిలిచేవాడు. ఎల్లప్పుడు నాకు సంతోషాన్ని ఇచ్చేవాడు. నన్ను ఎప్పుడు నవ్విస్తూ ఉండేవాడు. నేను ఏడ్చినప్పుడు నా పక్కనే ఉండి ధైర్యం చెప్పేవాడు. అలాంటి లక్షణాలున్న వ్యక్తి కావాలి' అంటూ తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.కాగా.. బాలీవుడ్ భామ తన స్నేహితుడు శిఖర్ పహారియాతో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరు జంటగా చాలాసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అంతే కాకుండా తన పెళ్లి కూడా తిరుమలలోనే జరుగుతుందని ఇప్పటికే వెల్లడించారు. చాలా సింపుల్‌గా శ్రీవారి ఆలయంలో పెళ్లి చేసుకుంటానని తెలిపింది. మరోవైపు జాన్వీకపూర్ దేవర మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఆ తర్వాత రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వచ్చే మూవీలో నటించనున్నారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
పెళ్లి రోజున ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా!..ఊహకే రాని బహుమతి!
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి జరిగే గొప్ప ఘట్టం. అది అందరికి ఓ మర్చిపోని గొప్ప మధురానుభూతి. అలాంటి గొప్ప క్షణాన్ని పదిలంగా ఉంచుకునేలా కొందరూ బహుమతులు ఇచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఓ వరుడు అలానే ఓ బహుమతిని వధువకి ఇచ్చాడు. అయితే ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేసి చూసిన వారందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. ఇలాంటి గిఫ్ట్‌లు కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోయారు. చెప్పాలంటే అది ఊహకే అందని బహుతి అది. ఇంతకీ ఆ వధువుకి ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే..ఈ అరుదైన ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది. పెండ్లి రోజున పాకిస్తానీ వరుడు తన కాబోయే భార్యకు ఓ విచిత్రమైన గిఫ్ట్‌ని అందజేశాడు. ఆమె ఆనందంగా ఆ గిప్ట్ ఏంటని తెరిచి చూసి ఒక్కసారిగి నివ్వెరపోయింది. అది పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటో. తాను ఊహించని ఆ బహుమతిని చూసి ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ ఫోటోలకి ఆనందంగా ఫోచ్చింది. ఆ వేదిక వద్ద ఉన్న అతిథులు సైతం ఆ ఫోటో ఫ్రైమ్ని చూసి ఆశ్చర్యపోతు వారిపై పూల వర్షం కురిపించిగా..ఆ వధువరులిద్దరు ఆ ఫోటో ప్రేమ్‌ని కలిసి పట్టుకుని ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. దీన్ని చూసి నెటిజన్లు విమర్శలు కురిపించగా, మరికొంందరూ జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ విడిపించేందుకు పాక్‌లోని కొందరు ప్రజలు చేస్తున్న ఎత్తుగడ అని కామెంట్లు చేశారు. కాగా, 2018 నుంచి 2022 వరకు ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు గానూ అతనికి, ఇమ్రాన్ భార్యకు 14 సంవత్సరాల జైలు శిక్షతో సహా పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. Becoming a common occurrence now. How long before they put a ban on this? pic.twitter.com/c0BJHjTdkQ— Mahvish- (@halfbakedtruths) April 30, 2024 (చదవండి: ఆ మహిళ ఏకంగా 69 మంది పిల్లలకు జన్మనిచ్చిందా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
Voting urgent than marriage: ఓటుకు సుముహూర్తం!
మధ్యాహ్నం 2 గంటలకు వివాహ సుముహూర్తం. వధువు నుదుటిపై జీలకర్ర బెల్లం పెట్టాల్సిన వరుడు కంగారుగా పోలింగ్ స్టేషన్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అతడిని కొందరు అనుసరిస్తున్నారు. అక్కడున్న వారికి అతడు కొత్త పెళ్లి కొడుకు అని తెలుస్తోంది. అయినా కానీ, ఏంటా! అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. పెళ్లి ఎవరికైనా జీవితంలో అత్యంత ముఖ్యమైన ఘట్టం. ఈ విషయం అతడికీ తెలుసు. కానీ, పెళ్లితోపాటు, ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం కూడా అంతే ముఖ్యమని భావించడమే ఈ వరుడి ప్రత్యేకతగా చెప్పుకోవాలి. మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో వదార్పుర ప్రాంతంలో కనిపించింది ఈ దృశ్యం. రెండో దశలో భాగంగా మహారాష్ట్రలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ నిర్వహించారు. షేర్వాణీ, తలపాగా ధరించిన నవ వరుడు ఆకాశ్‌ను పోలింగ్ స్టేషన్ ముందు ఏఎన్ఐ వార్తా సంస్థ పలకరించింది. అతడు తన ఓటింగ్ కార్డు చూపిస్తూ, ఓటు వేసేందుకు వచి్చనట్టు చెప్పాడు. తల్లితోపాటు, మామయ్య అతడి వెంట ఉన్నాడు.‘‘పెళ్లి వేడుక ముఖ్యమే. మరి ఓటు?. మధ్యాహ్నం 2 గంటలకు పెళ్లి’’అని ఆకాశ్ చెప్పడంతో తోటి ఓటర్లు శభాష్ అని మెచ్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలపైకి చేరగా, యూజర్లు ఎవరికి తోచిన తీరులో వారు స్పందిస్తున్నారు. ఓటు విలువను గుర్తు చేసిన ఆకాశ్‌ను అభినందిస్తున్నారు. మరొకరు అయితే.. కాబోయే వధువుఆలోచనల్లో తేలిపోతూ ఓటును విస్మరించేవారేమో! – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్యా సీన్ హై.. వధువుకి పాదాభివందనం చేసిన వరుడు
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో మధురమైంది. అది ప్రేమ పెళ్లి అయినా పెద్దల అంగీకారంతో చేసుకునే పెళ్లి అయినా ఎప్పటికీ గుర్తిండిపోవాలనుకునే విధంగా ఆనందంగా జరుపుకోవాలనుకుంటారు. అచ్చం అలాగే అస్సాం రాజధాని గౌహతిలో ఓ పెళ్లి కార్యక్రమం జరుగుతోంది. అతిథులంతా వచ్చేశారు. పెళ్లి ఘనంగా జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యుల హడావిడీతో మండపం అంతా సందడి వాతావరణం నెలకొంది. హిందూ సంప్రదాయంలో పెళ్లి తర్వాత వరుడి పాదాలను వధువు తన రెండు చేతులతో తాకి నమస్కరించడం ఆనవాయితీ. అందుకు తగ్గట్లే వధువు వరుడి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంది. అయితే అనంతరం పెళ్లి కొడుకు కల్లోల్ దాస్ కూడా తన భార్య పాదాలను తాకి శిరస్సు వంచి నమస్కరించాడు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్యర్యానికి లోనవుతూ చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. ఈ వీడియోను స్వయంగా కల్లోల్ దాస్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా ఆమరింది. రెండు మిలియన్లకు పైగా వ్యూస్ లభించాయి. ఈ వ్యవహారాన్ని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు విమర్శలు చేస్తున్నారు. అయితే తన భార్యను ఎంతగానో గౌరవిస్తున్నానని, అందులో భాగంగానే పెళ్లిలో ఆమెకు పాదాభివందనం చేశానని కల్లోల్ దాస్ ప్రతిస్పదించాడు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. అతడిని తన భార్య కాళ్లు పట్టుకోకుండా ఎవరూ ఆపలేదు. వాస్తవానికి ఇంకా అతన్ని ప్రోత్సహించారు. అవును ప్రతి పెళ్లి ఇలాగే ఉండాలి. సమాన గౌరవం, సమానమైన విలువ ఉండాలి. మీ ఇద్దరిని దేవుడు ఆశిర్వదించాలి’ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: కేంద్రం ఆఫర్ తిరస్కరణ.. సమస్య మళ్లీ మొదటికి! -
వధువు ఎంట్రీ మాములుగా లేదుగా!ఐడియా అదుర్స్
ఇటీవల యువత వివాహంలో ఏదో ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్నారు. వెడ్డింగ్ కార్డుల దగ్గర నుంచి వివాహ తంతు వరకు ఏదో ఒక విషయంలో వినూత్న రీతిలో ప్రత్యేకత చూపిస్తున్నారు. అవన్నీ అదరహో అనేలా ఉంటున్నాయి. అబ్బా! ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది అనేంతగా ప్రత్యేకతను సంతరించుకుంటున్నాయి ఆ డిఫరెంట్ ఐడియాలు. ఇక్కడ కూడా ఓ జంటా అలానే చేసి బంధువులంతా వావ్! అని ఆశ్చర్యపోయేలా చేసింది. ఓ జంట కళ్యాణ మండపానికి ఇచ్చిన ఎంట్రీ ఓ రేంజ్లో ఉంది. అక్కడ ఉన్నవాళ్లంతా వధువుని అలా చూసి స్టన్ అయిపోయారు. ఆ ఆలోచనే చాలా కొత్తగా ఉంది. ఓ మహారాణి మాదిరిగానే వచ్చింది. కాకపోతే కొంచెం డిఫెరెట్గా వచ్చింది. మాములుగా రాణుల వచ్చేటప్పడూ వెనక వైపు పొడుగుగా ఉండే క్లాత్‌ని సేవకులు మోస్తు తీసుకొస్తారు. ఔనా! కానీ ఇక్కడ బెలూన్ల సాయంతో ఆ క్లాత్‌ని పైకెత్తించి తీసుకువచ్చారు. ఆ వధువు స్టయిలిష్‌గా అలా వరుడు చేతిలే చేయి వేసి వస్తుంటే..బంధువలంతా నోరెళ్లబెట్టి..చూస్తుండిపోయారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి. (చదవండి: ఆ ఒక్క సంజ్ఞతో..ఆ ఆవుల మందను కదలకుండా చేశాడు!) View this post on Instagram A post shared by Surrey Memes 🇨🇦 (@thesurreymemes) -
నా పెళ్లి జరగనివ్వండి.. మహా ప్రభో
సాక్షి, వరంగల్: ట్రాఫిక్ జామ్ కావడంతో పెండ్లి ముహూర్తం దాటిపోతోందని వరుడు కారు నుండి దిగి అధికారులను ట్రాఫిక్ క్లియర్ చేయాలని వేడుకున్న ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామ శివారు ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడి సహాయక చర్యలు చేపట్టిన అధికారులు మూడు భారీ క్రేన్లతో ఆయిల్ ట్యాంకర్ లారీని తీయడానికి ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై రెండు వైపులా వాహనాలను నిలిపి లారీని తీస్తుండగా వరంగల్ నుండి తొర్రూర్‌కు వెళ్తున్న పెండ్లి కొడుకు కారు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది ఉదయం 10 గంటలకు వివాహ ముహూర్తం ఉండటంతో పెండ్లి కుమారుడు ముహూర్తం దాటిపోతోందని ట్రాఫిక్ క్లియర్ చేయాలని కారు దిగి రోడ్డుపై నడిచాడు. భారీ క్రేన్ల వద్దకు చేరుకొని అధికారులను త్వరగా వాహనాలను పంపించాలని పెండ్లి ముహూర్తం దాటిపోతుందని వేడుకున్నాడు. దీంతో అధికారులు పెట్రోల్ ట్యాంకర్ ఉండటంతో ఇబ్బంది ఏర్పడిందని కాస్త సమయం కావాలని సూచించారు. ట్రాఫిక్ క్లియర్ కావడం లేదని భావించిన పెండ్లి కుమారుడు కారును మళ్లీ వెనక్కి తిప్పి కొంత దూరం ప్రయాణించాడు. ఇంతలోనే వాహనాలు కదిలి ముందుకు వెళ్లడంతో మళ్లీ వెనక్కి వచ్చి తొర్రూర్‌కు వెళ్లిపోయాడు. చదవండి: ఒంగోలు బ్యూటీపార్లర్ కేసు: మార్గదర్శి మేనేజర్ భార్య అరెస్ట్ -
పెళ్లిలో యువతుల జోరు.. బ్లాక్ డ్రెస్‌లో కుమ్మేశారు..!
పెళ్లిలో వధువు లేదా వరుని స్నేహితుల డ్యాన్సులు చాలా ప్రత్యేకం. ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్పెషల్‌గా ప్లాన్ చేస్తుంటారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే ఓ పెళ్లి వేడుకలో జరిగింది. స్నేహితురాల్ని సర్ప్రైజ్ చేస్తూ ప్రత్యేక దుస్తుల్లో చిందులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వధువు స్నేహితులు పెళ్లికి వెళ్లారు. ఆమెను సర్ప్రైజ్ చేయడానికి ప్రత్యేకమైన డ్యాన్సులు చేశారు. ప్రత్యేకమైన విషధారణతో వేడుకకు హాజరైన బంధుమిత్రులను ఆశ్చర్యానికి గురిచేశారు. నల్లని డ్రెస్ వేసుకున్న అమ్మాయిలు, తెల్లని దుస్తులు ధరించిన అబ్బాయిలు కలిసి డ్యాన్సులతో అబ్బురపరిచారు. View this post on Instagram A post shared by Betty Who (@bettywho) వేదికమీదకు ఎక్కి ఉత్తరకొరియాకు చెందిన పింక్ వీనోమ్ సాంగ్‌ని ప్లే చేశారు. ఆ ట్యూన్‌కు దగ్గట్టుగా మెలికలు తిరుగుతూ చిందులు వేశారు. ఆ డ్యాన్సును వరునికి డిడికేట్ చేస్తున్నట్లు ప్రకటించారు. సదరు వధువు స్నేహితుల డ్యాన్సులు చూసిన నెటిజన్లు అద్భుతం అంటూ కామెంట్లు పెట్టారు. ఈ వీడియోను సంగీతకారుడు బెట్టీ హూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో అమెరికన్ గాయకుడు స్కాట్ హోయింగ్, కొరియోగ్రఫీ జంట ఆస్టిన్, మారిడెత్లను ట్యాగ్ చేశారు. ఈ వీడియోకు ఒక్క రోజులోనే రెండు లక్షల వ్యూస్ వచ్చాయి. వేదికపై డ్యాన్సులు చేసిన వారి వేషధారణ చాలా బాగుందని కొందరు నెటిజన్లు స్పందించారు. ప్రోఫెషనల్ డ్యాన్స్ అంటూ మరికొందరు కామెంట్ పెట్టారు. బ్లాక్ పింక్ డ్యాన్స్‌కు ఫిదా అయినట్లు స్పందించారు. ఇదీ చదవండి: బస్సులో సీటు కోసం మహిళ ఫీట్లు -
వెరైటీ వెడ్డింగ్ పార్టీ.. చూస్తేనే గుండె గుబుల్..!
పెళ్లిరోజు మరుపురాని రోజు. అంతే ప్రత్యేకంగా గుర్తుండిపేయేలా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకుంటారు. మంచి దుస్తులు ధరిస్తారు. రొమాంటిక్ సెటప్ చేసుకుని పార్టీ చేసుకుంటారు. మరికొందరు సాంప్రదాయానికి ప్రముఖ్యతనిస్తారు. కానీ మనం తేలుసుకోబోయే జంట మాత్రం తమ వెడ్డింగ్ రోజునే సాహసాలు చేశారు. వెడ్డింగ్‌కి వచ్చిన బంధువులతో ఈ విన్యాసాలు చేశారు. వీడియో ప్రకారం.. పెళ్లి కూతురు, పెళ్లి కుమార్తె ఇద్దరు వెడ్డింగ్ డ్రస్‌లో ఉన్నారు. అది చూడటానికే భయంకరమైన లొకేషన్లా ఉంది. లోతైన లోయలో స్కై డైవింగ్ చేస్తూ హౌరా..! అనిపించారు. ప్రిస్సిల్లా యాంట్, ఫిలిప్పో లెక్వెర్స్ అనే పేర్లు గల జంట పెళ్లితో ఒక్కటయ్యారు. అదే రోజున థ్రిల్లింగ్ కోసం ఇలా సాహసాలు చేశారు. రయ్.. రయ్ మంటూ రివ్వున లోయలోకి దూసుకెళ్లారు. ఈ వీడియోను తమ ఇన్‌స్టాలో పంచుకున్నారు. View this post on Instagram A post shared by La libreta morada | Mariana (@lalibretamorada) ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. ఇంత భయంకరమైన స్కై డైవింగ్ పెళ్లి రోజునే ఎందుకు బ్రో అంటూ కామెంట్లు పెట్టారు. 'జర భద్రం ర అయ్యా..!' అంటూ మరికొందర ఫన్నీగా కామెంట్లు పెట్టారు. కొత్తజంట సాహసాలు మీరూ చూసేయండి మరి..! ఇదీ చదవండి: మనసులు గెలుచుకున్న పారా కరాటే ఛాంపియన్ -
‘పెళ్లిళ్లే నా ఆరోగ్య రహస్యం’.. ఐదో పెళ్లి చేసుకున్న 90 ఏళ్ల వరుని స్టేట్మెంట్
సౌదీ అరబ్ మీడియాలో 90 ఏళ్ల వృద్ధుని వివాహం హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ 90 ఏళ్ల వృద్ధుడు తాజాగా ఐదవ వివాహం చేసుకుని, సౌదీ అరబ్‌లో అత్యధిక వయసు కలిగిన వరునిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ వృద్ధుడు తన ఐదవ భార్యతో హనీమూన్ ఎంజాయ్ చేస్తూ, భవిష్యత్‌లోనూ ఇలానే మరిన్ని పెళ్లిళ్ఘు చేసుకుంటానని చెబుతున్నాడు. గల్ఫ్‌న్యూస్‌కు చెందిన ఒక రిపోర్టు ప్రకారం నాదిర్ బిన్ దహైమ్ వాహక్ అల్ ముర్షీదీ అల్ ఓతాబీ తాజాగా సౌదీలోని అఫీస్ ప్రాంతంలో తన ఐదవ వివాహం చేసుకున్నాడు. సోషల్ మీడియాలో ఈ వృద్ధ పెళ్లికొడుకుకు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో అతిథుల ఆ వృద్ధ వరునికి ఐదవపెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆ వృద్ధ వరుడు అపరిమితమైన ఆనందంతో ఉప్పొంగిపోతూ కనిపిస్తున్నాడు. ఈ వీడియోలో ఒక మనుమడు తన తాతకు వివాహ శుభాకాంక్షలు తెలియజేయడం కనిపిస్తుంది. సౌదీకి చెందిన ఈ వృద్ధ పెళ్లికొడుకు అరేబియా టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ అవివాహితులంతా తప్పకుండా వివాహం చేసుకోవాలనే సందేశాన్నిచ్చాడు. ఈ పెళ్లి తరువాత కూడా మరో పెళ్లి చేసుకుంటానని అన్నాడు. వైవాహిక జీవితం ఎంతో శక్తివంతమైనదని, పెళ్లి చేసుకోవడంవలన జీవితంలో ప్రశాంతత దొరుకుతుందని అన్నారు. తన దీర్ఘాయుష్షకు కారణం తాను చేసుకున్న పెళ్లిళ్లేనని తెలిపాడు. 90 برس کی عمر میں پانچویں شادی رچانے والے معمر ترین سعودی دلہا نے کنوارے نوجوانوں کا کیا مشورہ دیے، ویڈیو دیکھیےhttps://t.co/laYvvZpxUy pic.twitter.com/da0hb4WE3w — العربیہ اردو (@AlArabiya_Ur) July 13, 2023 ఇది కూడా చదవండి: ప్రియునితో ఉండగా పిన్నికి దొరికిపోయింది.. కంగారులో బ్రిడ్జిపై నుంచి దూకేసి.. -
పెళ్లి పీటలపై బయటపడ్డ వరుడి బట్టతల
-
అత్త నిర్వాకానికి బిత్తరపోయిన అల్లుడు.. పెళ్లి కాన్సిల్
లక్నో: కాసేపట్లో పెళ్లి జరగబోతోందనగా కాస్త ముందుగానే కళ్యాణ మండపానికి వచ్చిన వరుడికి సూపర్ షాకిచ్చింది వధువు తల్లి. కళ్యాణ మండపానికి వధువుని వెంటబెట్టుకుని వచ్చే క్రమంలో డాన్సులు చేస్తూ ఒక చేత్తో సిగరెట్ కాలుస్తూ కనిపించిన అత్తగారిని చూసి కాబోయే అల్లుడు హతాశుడయ్యాడు. అత్తగారి విచిత్ర ధోరణికి మండిపడి పెళ్లి పెటాకులు చేసుకుని మరీ వెళ్ళిపోయాడు. ఉత్తరాదిలో పెళ్లిళ్లంటే ఆ ధూమ్ ధామ్ సందడే వేరు. పెళ్ళికి ముందు నుంచే ప్రతిరోజూ పెళ్లే అన్నంత కోలాహలంగా ఉంటుంది వాతావారణం. హల్దీ, మెహందీ, సంగీత్, షాదీ ఇలా పెళ్ళి పేరుతో పెద్ద తంతే నడుస్తుంది. ఇక అక్కడి పెళ్లిళ్లలో లింగ భేదం లేకుండా విందు చేయడం చిందులేయడం సర్వసాధారణం. కానీ ఎందుకో ఈ పధ్ధతి రుచించక వరుడు పెళ్లి వద్దనుకుని వెళ్ళిపోయాడు. తర్వాత ఇరుపక్షాల పెద్దలు కూర్చుని పంచాయతీ జరిపిన తర్వాత పెళ్ళికి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. వివరాల్లోకి వెళ్తే.. యూపీలోని సంభాల్ జిల్లాకు చెందిన వరుడికి, రాజ్ పురకు చెందిన వధువుకి జూన్ 27న వివాహం జరగాల్సి ఉంది. వివాహ వేదిక వద్ద ఏర్పాట్లన్నీ ఘనంగా చేశారు. పెళ్లిలో సందడి చేయడానికి డీజే కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోందనగా వరుడు బంధువర్గ సపరివారసమేతంగా ముందే కళ్యాణ మండపానికి ఊరేగింపుగా వచ్చి వధువు కోసం ఎదురు చూస్తున్నాడు. అంతలోనే వధువు తరపు బృందం ఊరేగింపుగా వచ్చారు. కానీ వధువు పల్లకికి ముందు వధువు తల్లి సిగరెట్ కాలుస్తూ తన్మయత్వంతో చిందులేస్తూ కనిపించింది. వధువు కోసం వేచి ఉన్న వరుడు అత్తని అలా చూసి షాక్ కి గురయ్యాడు. కోపోద్రిక్తుడై పెళ్లి వద్దనుకుని పెళ్లి మటపం నుంచి వెళ్ళిపోయాడు. అనంతరం రెండువర్గాల పెళ్లి పెద్దలు జోక్యం చేసుకుని నచ్చజెప్పడంతో వరుడు పెళ్ళికి అంగీకరించాడు. తర్వాత పెళ్లి కార్యక్రమం యధాతధంగా కొనసాగింది. ఇది కూడా చదవండి: ఇప్పుడు మాది డబుల్ ఇంజిన్ కాదు, ట్రిపుల్ ఇంజిన్ సర్కార్.. షిండే -
ఇదేం ఆచారం.. వధువు నెత్తి కొట్టుకుంది..
-
పందిట్లోనే పెళ్ళికొడుకు పరువు తీసిన పెళ్లికూతురు
-
వరుడి మొబైల్‌కు వధువు పర్సనల్ వీడియో.. ఆగిన వివాహం
సాక్షి, కృష్ణా జిల్లా: ఫేస్బుక్ పరిచయం ఓ యువతి జీవితాన్ని నాశనం చేసింది. స్నేహం, సానిహిత్యం పేరుతో ఓ వ్యక్తికి దగ్గరైన యువతి.. అతనితో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడింది. అయితే ఏం జరిగిందో ఏమో కానీ అతన్ని కాదని యువతి మరో వ్యక్తికి పెళ్లికి సిద్ధమైంది.అతినితోనూ శారీరకంగా దగ్గరైంది. చివరికి యువతికి చెందిన పర్సనల్ వీడియోలు బయటకు రావడంతో ఆమెతో నిశ్చయమైన పెళ్లిని రద్దు చేసుకున్నాడు సదరు యవకుడు. ఈ ఘటన జిల్లాలోని గుడివాడలో చోటుచేసుకుంది. బాధితురాలు గుడివాడ పోలీసులను ఆశ్రయించడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుడివాడ బంటుమిల్లి రోడ్డుకు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన కర్రా న్యూటన్ బాబుతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో అతడి కోరిక మేరకు ఆమె నగ్నంగా వీడియో కాల్ చేసింది. ఈ క్రమంలో యువతికి ఇటీవల ఏలూరు జిల్లా మండవల్లికి చెందిన గుర్రం పరంజ్యోతితో వివాహం నిశ్చయమైంది. కాబోయే భర్త పరంజ్యోతితోతో కూడా యువతి శారీరకంగా దగ్గరైంది. ఈనెల 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. చదవండి: ‘నా వల్ల కావట్లేదు..’ భర్తమామల్ని ఫేస్బుక్ లైవ్‌లో పెట్టి మరీ సనా.. అయితే న్యూటన్ బాబు యువతితో మాట్లాడిన న్యూడ్ వీడియోను పెళ్లి కొడుకు పరంజ్యోతికి నగ్న వీడియోలు పంపాడు. ఈ వీడియోను వరుడు తన కుటుంబానికి పంపి ఈ పెళ్లి వద్దని నిరాకరించాడు. ఈ క్రమంలో పెళ్లి పెద్ద అయిన ఓ వ్యక్తి సదరు వీడియోను యువతి కుటుంబానికి పంపి పెళ్లి రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ఇక ఇదే వీడియో తమ బంధువుల్లోని కొంతమందికి సైతం చేరడంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన గుడివాడ టూ టౌన్ పోలీసులు న్యూటన్ బాబు అతని బంధువులు బాపట్ల కోటేశ్వరరావు, కొండ్రు రణధీర్ళు మరికొందరికి షేర్ చేసినట్లు గుర్తించారు. నూటన్బాబుపై అత్యాచారయత్నం కేసు, పరంజ్యోతిపై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు మరో ముగ్గురు పై 109,120b ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు. -
మటన్ కర్రీ కోసం వరుడి గొడవ.. పెళ్లిని రద్దు చేసిన వధువు..
ఒడిశా:మటన్ కర్రీపై గొడవ కారణంగా పెళ్లిని రద్దు చేసింది ఓ వధువు. వరుడు అతని స్నేహితులు మటన్ కోసం తన కుటుంబంపై దురుసుగా ప్రవర్తించిన కారణంగా వధువు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన ఒడిశా సంబల్పూర్ జిల్లాలోని ధామా ప్రాంతంలో జరిగింది. స్థానిక వివరాల ప్రకారం.. అంగరంగవైభవంగా పెళ్లి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పూలు, పందిళ్లు, బంధువులతో ఇళ్లంతా సందడిగా ఉంది. రుచికరమైన వంటకాలు వడ్డించారు. పెళ్లికి వచ్చినవారికి లేదనకుండా భోజనాలు పెట్టారు. పెళ్లి అయ్యాక రాత్రిలో వరుడి స్నేహితులు ఆరుగులు భోజనాలకు వచ్చారు. అప్పటికే మటన్ కర్రీ అయిపోయింది. దీంతో వారు పెళ్లికూతురు కుటుంబంపై వాగ్వాదానికి దిగారు. మటన్ కూర పెట్టాల్సిందేనని వధువు తండ్రిని అవమానించారు. వరుడు కూడా అతని స్నేహితులకు వంత పాడాడు. దీంతో వధువు పెళ్లిని రద్దు చేసింది. అయితే.. వరుడు జాతీయ స్థాయి బ్యాంకులో పనిచేస్తాడని స్థానికులు తెలిపారు. 'పెళ్లి అంతా బాగానే అయింది. మటన్‌తో పాటు అన్ని వంటకాలు అందరికీ సరిపోయాయి. చివరగా వచ్చిన ఓ ఆరుగురికి మాత్రం సరిపోలేదు. రాత్రి అయినందున వడ్డించలేకపోయాము. పెళ్లికొడుకుతో సహా అతని స్నేహితులు మా కుటుంబాన్ని అవమానించారు. నాన్నపై దురుసుగా ప్రవర్తించారు. కుటుంబంలో పెద్దవారిని గౌరవించలేనివారితో నేను ఎలా భద్రతను పొందగలను?' అని వధువు అంటోంది. ఇదీ చదవండి:యువకుల పిచ్చిచేష్టలు.. స్నేహితుడిని నగ్నంగా చేసి -
రైతు బిడ్డగా ఓ వరుడి ఆలోచన..మండపానికి ఏకంగా 51 ట్రాక్టర్లతో..
ఓ వరుడి వినూత్న ఆలోచన అందర్నీ ఆలోచింపచేసేలా చేసింది. తమ వివాహాన్ని వెరైటీగా లగ్జరీగా జరుపుకోవాలనుకుంటారు చాలామంది. ఐతే దానికో విలువ, అర్థం వచ్చేలా జరుపుకునేవారు కొందరే. ఇక్కడ ఓ వరుడు తమ ప్రధానవృత్తి వ్యవసాయం అందుకు తగ్గట్టగుగా తన వివాహ ఊరేగింపు ఉండాలనుకున్నాడు. అందుకోసం ఒకటి రెండు కాదు ఏకంగా 51 ట్రాక్టర్లతో పెద్ద ఎత్తున్న ఊరేగింపుగా వెళ్లాడు. ఇందులో ఓ ట్రాక్టర్ని వరుడే స్వయంగా నడపగా..మిగతావి బంధవులు స్నేహితులు నడిపారు. ఈ ఘటన రాజస్తాన్ బార్మర్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే..గూడమలాని గ్రామానికి చెందిన ప్రకాష్ చౌదరికి రోలి గ్రామానికి చెందిన మమతతో వివాహం నిశ్చయం అయ్యింది. వధువు ఇల్లు వరుడి ఇంటికి సుమారు 51 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో వరడు వధువు గ్రామానికి అంతే సంఖ్యలో 51 ట్రాక్టర్లతో పెద్ద ఊరేగింపుగా వెళ్లి సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు. వారంతా అలా రావడం చూసి వధువు తరుపు వారు కూడా ఆశ్చర్యపోయారు. ఈ మేరకు వరుడు ప్రకాశ్ మాట్లాడుతూ..నా కుటుంబం ప్రధాన వృత్తి వ్యవసాయం. అందరూ వ్యవసాయమే చేస్తారు. అలాగే ట్రాక్టర్‌ను రైతుకు గుర్తింపుగా భావిస్తారు. మా నాన్న పెళ్లి ఊరేగింపుకి ఒక ట్రాక్టర్ ఉపయోగించారు. నేనెందుకు 51 ట్రాక్టర్లు ఉపయోగించకూడదు అని అనుకుని ఇలా చేసినట్లు వివరించాడు వరుడు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు తండ్రి జేతారామ్ మాట్లాడుతూ..ట్రాక్టర్‌ను భూమి కొడుకుగా పరగణిస్తాం. మా నాన్న, తాతయ్యల ఊరేగింపు ఒంటెలపై సాగింది. అదీగాక మా కుటుంబంలో ఇప్పటికే 20 నుంచి 30 ట్రాక్టర్లు ఉన్నాయి. నా రైతు మిత్రులతో కలిసి ఇన్ని ట్రాక్టర్లను ఏర్పాటు చేశాం. ట్రాక్టర్లతోనే వ్యవసాయం చేస్తున్నప్పుడూ వాటిపై ఎందుకు ఊరేగింపు చేయకూడదన్న ఆలోచనతో ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు జేతారామ్. #WATCH | Rajasthan: A bridegroom arrived with 51 tractors as part of his wedding procession, from Sewniyala to Borwa village in Barmer district. The 1-km long wedding procession had around 150 guests and was led by the bridegroom who himself was driving a tractor. (08.06.2022) pic.twitter.com/euK16AO9LQ — ANI (@ANI) June 9, 2022 (చదవండి: దోమలు మిమ్మల్నే కుడుతున్నాయా? ఒక సారి మీ సబ్బు సంగతి తేల్చండి) -
ఫేషియల్ పేరుతో వరుడు జంప్.. తరువాత జరిగిందిదే..
పెళ్లికి ముందురోజు వరుడు ఫేషియల్ చేయించుకుంటానని బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు ఫోను చేసేందుకు ప్రయత్నించగా స్విచ్ఆఫ్ అని వచ్చింది. విషయం వధువు తరపువారికి తెలియడంతో నానా హంగామా జరిగింది. అనంతరం వధువు తరపువారు వరుని తండ్రి నుంచి కట్నం డబ్బులను తిరిగి తీసుకోవడంతోపాటు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియా జిల్లాలో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. పెళ్లికి సరిగ్గా ఒకరోజు ముందు వరుడు ఫేషియల్ చేయించుకుంటాననే నెపంతో బయటకు వెళ్లి ఇక తిరిగి రాలేదు. తరువాత ఈ వ్యవహారం వివాహం రద్దు చేసుకునేవరకూ దారితీసింది. ఈ ఉదంతం బఘౌచ్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక యువకునికి వివాహం నిశ్చయమయ్యింది. జూన్ ఆరున వరుడిని పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం జరిగింది. జూన్ 11 వివాహ వేడుకలో భాగంగా కుషీనగర్ జిల్లాలోని ఫాజిలా నగర్ పరిధిలోని ఒక గ్రామానికి వరునితో పాటు అతని బంధువర్గమంతా చేరుకోవాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. బ్యాండు మేళం వారు కూడా వచ్చేశారు. ఇంతలో వరుడు ఫేషియల్ చేయించుకుంటానని బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ వరుడు రాకపోవడంతో కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలయ్యింది. ఎన్నిచోట్ల వెదికినా అతని ఆచూకీ తెలియలేదు. చిన్న కుమారునితో వివాహం చేయిస్తామన్నా... ఈ విషయం వధువు ఇంటిలోని వారికి తెలిసింది. వారు పరుగుపరుగున వరుని ఇంటికి చేరుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం తరువాత వరుని తండ్రి వధువు తరపువారితో తన చిన్న కుమారునితో ఈ వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. అయితే ఇది వధువు తరపువారికి ఎంతమాత్రం నచ్చలేదు. తాము ఈ వివాహాన్ని రద్దు చేసుకుంటున్నామని చెబుతూ తాము ఇచ్చిన కట్నం సొమ్ముతోపాటు కానుకలను కూడా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై గ్రామంలో పంచాయితీ జరిగింది. పంచాయతీ పెద్దల తీర్మానం మేరకు వరుని తరపు వారు తాము తీసుకున్న కట్న కానుకలను తిరిగి ఇచ్చేశారు. దీంతో ఈ పెళ్లి రద్దయ్యింది. కాగా వరుడు ఒక ఫుడ్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి వేరే యువతితో సంబంధం ఉన్న కారణంగానే పెళ్లి వేడుక ముందురోజు ఇంటి నుంచి పరారయ్యాడని స్థానికులు చెప్పుకుంటున్నారు. ఇది కూడా చదవండి: గుర్రం మీద రావాల్సిన వరుడు అలా వచ్చేసరికి.. -
వరునిపై పడిన సీలింగ్ ఫ్యాన్.. తరువాత?
ఒక రోజు క్రితమే ఆ యువకునికి వివాహం అయ్యింది. తన గదిలో పూలతో అందంగా అలంకరించిన మంచంపై పడుకున్నాడు. ఉన్నట్టుండి పైనుంచి సీలింగ్ ఫ్యాన్ ఆ యువకునిపై ధడాలున పడింది. అంతే అతను బాధతో కేకలు పెట్టాడు. అంతవరకూ ఆనందం తాండవమాడిన ఆ ఇంటిలో విషాదం నెలకొంది. రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలో ఆందళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. పైనుంచి సీలింగ్ ఫ్యాన్ ఉన్నట్టుండి పడిపోవడంతో ఒక యువకుని మెడ తెగిపోయింది. వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ఆ యువకునికి తక్షణ చికిత్సనందిస్తూ, మొత్తం 26 కుట్లు వేసి, అతని ప్రాణాలు కాపాడారు. ఒకరోజు క్రితమే ఆ యువకునికి వివాహం అయ్యింది. మక్రానా పరిధిలోని గౌడాబాస్ ప్రాంతంలో ఉంటున్న యువకునిపై సీలింగ్ ఫ్యాన్ పడింది. ఈ ఘటనలో ఆ యువకుని గొంతుకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మార్బల్ వ్యాపారి రమ్జాన్ సిసోడియా కుమారుడు ఇక్రామ్(27)కు జూన్ 9న వివాహం జరిగింది. అనంతరం సంప్రదాయంలో భాగంగా వధువు జన్నత్ తన పుట్టింటికి వెళ్లింది. వరుడు విశ్రాంతి తీసుకుంటుండగా... ఇక్రామ్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నట్టుండి ఇక్రామ్ బాధతో కేకలుపెట్టాడు.వెంటనే కుటుంబ సభ్యులు ఆ గదిలోకి వెళ్లి చూడగా, ఇక్రామ్ రక్తపు మడుగులో పడి ఉన్నాడు. అతని గొంతు, చేయికి తీవ్రంగా రక్తసస్రావం అవుతోంది. సీలింగ్ ఫ్యాన్ కిందపడివుంది. వేగంగా తిరుగుతున్న ఫ్యాన్ అతనిమీద పడటంతో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యులు ఇక్రామ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతనికి చికిత్స అందించిన వైద్యులు డాక్టర్ ఫారూక్ మాట్లాడుతూ బాధితుని గొంతుకు ఇరువైపుల గల రక్తనాళాలు తెగిపోయాయి. వాటి నుంచి తీవ్ర రక్తస్రావం అయ్యింది. వెంటనే అతనిని ఆపరేషన్ చేశాం. తెగిపోయిన రక్తనాళాలను తిరిగి జోడించాం ఇందుకోసం 26 కుట్లు వేయాల్సివచ్చింది. బాధితుని ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదన్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందగానే మక్రానా పోలీస్టస్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆసుపత్రికి చేరుకున్నారు. ఇక్రామ్ వాంగ్మూలం తీసుకున్నారు. తరువాత అతని ఇంటిలో ఇక్రామ్ పడుకున్న గదిని పరిశీలించారు. ఇక్రామ్ పంజాబ్‌లోని అంబాలాలో మార్బల్ వ్యాపారం చేస్తున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: లుధియానాలో రూ. 7 కోట్ల దోపిడీ -
సత్తుపల్లి అమ్మాయి..అమెరికా అబ్బాయి
-
నవదంపతులుగా గదిలోకి.. ఎంత సేపటికీ రాలేదు.. తీరా లోపలకి వెళ్లి చూస్తే
లక్నో: పెళ్లినాడు అగ్ని సాక్షిగా జీవితాంతం తోడుగా ఉంటారని వధూవరులు ప్రమాణం చేస్తుంటారు. ఓ జంట మాత్రం ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకుంది. మరణంలో కూడా ఒకరిని మరొకరు విడిచిపెట్టలేదు. కొత్తగా పెళ్లైన ఆ జంట.. నవదంపతులుగా గదిలోకి వెళ్లి.. శవాలుగా బయటకు వచ్చారు. దీంతో వధూవరుల మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 30న ప్రతాప్ యాదవ్, పుష్పకు ఘనంగా వివాహం జరిగింది. సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత రోజు ఈ కొత్త జంట బుధవారం సాయంత్రం వరుడి ఇంటికి చేరుకున్నారు. నవదంపతులు ఆ రాత్రి ఒకే గదిలో కలిసి నిద్రించారు. అయితే గురువారం ఎంత సేపు గడుస్తున్న ఈ కొత్త దంపతులు గది నుంచి బయటకు రాకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులు తలుపులు బద్ధలు కొట్టి లోనికి వెళ్లారు. గదిలోకి వెళ్లి చూడగా.. వారిద్దరూ శవాలుగా కనిపించారు. కాగా, కుటుంబ సభ్యులు దీని గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలిందని పోలీసులు తెలిపారు. ఆ జంట శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, ఆ గదిలోకి ఎవరూ కూడా బలవంతంగా వెళ్లిన ఆనవాళ్లు లేవని అన్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా పెళ్లైన యువ దంపతులు శోభనం తర్వాత రోజు ఒకేసారి గుండెపోటుతో చనిపోవడం మిస్టరీగా ఉందన్నారు. దీనికి కారణం ఏమిటి అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: వివాహం జరిగిన నెల రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య -
వరుడు పెళ్లి టైంలో హ్యండిచ్చి పారిపోతే..ఆ వధువు ఏకంగా..
చాలామంది పెళ్లి పేరుతో వంచన చేయడం లేదా పెళ్లి రేపు అనగా పరారవ్వడం గురించి విన్నాం. ఆ తర్వాత వధువు కుటుంబసభ్యులు భోరుమని కన్నీళ్లుపెట్టుకోవడం వంటి కథలే చూశాం. మోసపోతే కన్నీళ్లతో కూలబడిపోవడం కాదని, తెగించి మరీ ఆ మోసగాడిని పట్టుకుని కిక్కుమరనకుండా చేయాలని నిరూపించింది ఓ వధవు. పెళ్లిమండపం వద్ద భయానక చేదు అనుభవాన్ని ఎదుర్కొన్న వధువు చేసిన సాహసం చూసి ఆశ్చర్యపోక మానరు. ఆమెను ప్రశసించకుండా ఉండలేం. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక వధువు పెళ్లిరోజున వరుడు పెళ్లికి నిరాకరించి..చెప్పపెట్టకుండా పెళ్లిమండపం నుంచి వెళ్లిపోయాడు. వరుడు కోసం ఎదురు చూస్తూ కూర్చొన్న వధువు ఈ షాకింగ్ ఘటనను జీర్ణించుకోలేకపోయింద. ఏమైన సరే అతన్ని వెతికి తెచ్చి మరీ పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకోసం ఆమె పెళ్లి డ్రస్‌లోనే అతడిని వెదకడం ప్రారంభించింది. అతడు ఫోన్లో వాళ్ల అమ్మను తీసుకురావడానికే వెళ్లానంటూ చెప్పినా అమె నమ్మలేదు. ఏకంగా 20 కిలోమీటర్లు చేజ్ చేసి మరీ అతడ్ని పట్టుకుంది. అతడు సరిగ్గా బరేలీ పోలీస్టేషన్ సమీపంలోని బస్సులో దొరికాడు. అతడ్ని పెళ్లిమండపానికి వెంట బెట్టుకుని తీసుకొచ్చింది. ఆ తర్వాత రెండు గంటల పాటు సాగిన నాటకీయ పరిణామాల అనంతరం ఇరువురు కుటుంబ సభ్యులు వివాహానికి అంగీకరించి సదరు వదువరులిద్దరికి పెళ్లి చేశారు.నిజానికి అతడు ఆ జంట రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సరిగ్గా పెళ్లి టైంకి అతడి హ్యాండివ్వడంతో ఆమె తట్టుకోలేకపోయింది. ఎలాగైనా వెదిక పట్టుకునైనా అతడినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని మరీ ఇంతటి సాహసం చేసింది ఆ నవ వధువు. తన వివాహాన్ని నిలబెట్టుకునేందుకు ఆమె కనబర్చిన ధైర్యానికి అందరిచే ప్రశంసలు అందుకుంది. (చదవండి: రూ.2 వేల నోటు మార్పిడికి తంటాలు) -
నా కలర్ ఏంటి.. ఆయన ఏజ్ ఎంత.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన వధువు
వారిద్దరికీ పెళ్లి నిశ్చయమైంది. కాసేపట్లో పెళ్లి మండపంలో వివాహం జరుగనుంది. వందల సంఖ్యలో బంధువులు వేడుకకు హాజరయ్యారు. తీరా.. తాళికట్టే సమయానిక వరుడికి వధువు ఊహించని షాకిచ్చింది. వరుడు నల్లగా ఉన్నాడని, వయసులో తనకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడని చెప్పి వివాహానికి నిరాకరించింది. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ షాకింగ్ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. భగల్పూర్లోని కహల్గావ్లో స్థానికంగా నివసించే వినోద్ మండల్ కుమార్తె కిట్టూ కుమారి(20)కి.. ధనౌరా ప్రాంతానికి చెందిన డాక్టర్ వీరేంద్ర సింగ్ తనయుడు నీలేశ్ కుమార్ సింగ్(38)తో పెద్దలు వివాహం నిశ్చయించారు. వీరికి మే 15వ తేదీన పెళ్లి ముహుర్తం ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో పెళ్లి రోజురానే వచ్చింది. వివాహానికి ఇరు కుటుంబాలకు చెందిన బంధువులు వచ్చారు. వరుడు ఊరేగింపుగా వివాహ వేదిక ఉన్న ప్రాంతానికి వచ్చాడు. కొద్దిసేపట్లో దండలు మార్చుకునే కార్యక్రమం జరగాల్సి ఉండగా.. వరుడు వివాహ వేదిక పైకి విచ్చేశాడు. ఇంతలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. కాబోయే భర్తను చూడగానే వధువు ముఖం చాటేసింది. ఈ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. వరుడి మెడలో దండ వేసేందుకు నిరాకరించింది. అతడికి తిలకం పెట్టేందుకు ససేమిరా అంది. ఈ క్రమంలో వధువలిద్దరి పేరెంట్స్ ఆమెను ప్రశ్నించారు. దీంతో, ఆమె మాట్లాడుతూ వరుడు నల్లగా ఉన్నాడని, తన కన్నా వయసులో చాలా పెద్దవాడని బదులిచ్చింది. అందుకే ఈ పెళ్లి తనకు ఇష్టంలేదని చెప్పుకొచ్చింది. ఈ సమాధానం విని అక్కడున్న వారంతా మరోసారి షాకయ్యారు. అనంతరం.. వధువు పేరెంట్స్ ఆమెతో పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా యువతి వినలేదు. కుటుంబ సభ్యులు ఆమెను మందలించే ప్రయత్నం చేశారు. కొందరైతే గట్టిగా బెదిరించారు. వధువు వెనక్కి తగ్గడం అటుంచితే.. మరింత మొండిగా ప్రవర్తించింది. వెంటనే వేదిక నుంచి దూరంగా వచ్చేసింది. తన గదికి వెళ్లిపోయింది. దీంతో, పెళ్లి కాస్తా పెటాకులు అయ్యింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇది కూడా చదవండి: భార్య కోసం చిన్నారిని నిద్రలోనే గొంతు నులిమి.. -
పెళ్లి పూర్తయ్యే టైంలో సినిమాని తలపించే సీన్..వరుడు అర్థాంతరంగా పెళ్లిని ఆపేసి..
బిహార్‌లో ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో వధువరుల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతోంది. బంధవులంతా ఆనందోత్సహాలతో వేడుకను తిలకిస్తున్నారు. ఇక దండలు మార్చుకుంటే పెళ్లి తంతు ముగిసిపోతుందనంగా.. వరుడు అర్థాంతరంగా పెళ్లిని ఆపించేశాడు. తాను ఒకరిని ప్రేమించానంటూ పెద్ద బాంబు పేల్చాడు. దీంతో అక్కడ ఉన్న బంధువులందరికీ ఒక్క క్షణం ఏ జరుగుతుందో అర్థం కాలేదు. తీరా చూస్తే.. తాను వధువు చెల్లిని ఇష్టపడ్డానంటూ ఆమెనే పెళ్లి చేసుకుంటానని మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం తలెత్తింది. అన్నిట్లకంటే బిగ్ ట్విస్ట్ ఏంటంటే వధువు చెల్లికి, వరుడుకి ముందునుంచే పరిచయముందని, ఆమె పరీక్షలు పూర్తి అయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇంకో జుగప్సకరమైన ట్విస్ట్ ఏంటంటే వధువు చెల్లి తన అక్క రింకూని పెళ్లి చేసుకుంటే భవనంపై నుంచి దూకేస్తానని చెప్పిందని, అందువల్ల తననే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టాడు వరుడు. దీంతో అక్కడ వాతావరణమంతా ఒక్కసారిగా ఘర్షణగా మారిపోయింది. బంధువులు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరుపక్షాలకు సద్ది చెప్పారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులను ప్రేమికులను ఒకటి చేయాలని నిర్ణయించుకున్నారు. (చదవండి: కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..) -
ఎంత విషాదం.. పెళ్లి రిసెప్షన్ నుంచి వెళ్తుండగా ఊహించని ప్రమాదం
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. ఎన్నో ఆశల మధ్య కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న జంటపై విధికి కన్ను కుట్టిందేమో.. వారి సంతోషం ఎంతసేపు నిలవలేదు నిండైన మనసుతో మనువాడి గంటలు గడవకముందే ఊహించని ప్రమాదం వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది. రోడ్డు ప్రమాదంలో వధువు మరణించగా.. వరుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలోని సౌత్ కరోలినాకు చెందిన 34 ఏళ్ల వధువు సమంతా హచిన్సన్, ఆరిక్ హచిన్సన్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఉంగరాలు మార్చుకొని ఒకటయ్యారు. కొత్త జంట సంతోషంగా వివాహ రిసెప్షన్ నుంచి గోల్ఫ్ కార్టులో(మోటరైజ్డ్ వాహనం) ఊరేగింపుగా బయల్దేరారు. ఇంతలోనే వేగంగా దూసుకువచ్చిన ఓ కారు వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు గోల్ఫ్కార్టు దాదాపు 90 మీటర్ల దూరం ఎగిరి పడింది. ఈ ఘటనలో వధువు అక్కడికక్కడే మరణించింది. వరుడు తీవ్రంగా గాయపడ్డాడు. కారు డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని తేలింది. వరుడి మెదడుకు గాయమైందని, ఎముకలు విరిగిపోయాయని, రెండు బలమైన శస్త్రచికిత్సలు చేయవలసి వచ్చిందని అతని తల్లి తెలిపింది. వీరితోపాటు మరో ఇద్దరు గాయపడగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంది. పెళ్లైన అయిదు గంటల్లోనే ఇదంతా జరిగిపోయిందని, అరిక్ తన జీవితంతో ప్రేమను కోల్పోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. చదవండి: మహిళల కోసమే 102 అంతస్తుల భవనం! కేవలం వారు తప్ప.. కోడలు అంత్యక్రియలకు, కొడుకు వైద్య బిల్లులను చెల్లించడానికి సహాయం కోసం ఫండ్ రైసింగ్ మొదలు పెట్టింది.. ఇప్పటి వరకు 385,053 డాలర్ల కంటే ఎక్కవే లభించాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి కారణమైన డ్రైవర్ జామీ కొమెరోస్కి(25)ను అరెస్ట్ చేశారు. కాగా పెళ్లైన తరువాత కొత్త జంట బంధువుల మధ్య సంతోషంగా నడుస్తున్న ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లి రోజే ఇంతటి ఊహించని ఘోరం జరగడంతో రెండు కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగాయి. చదవండి: ఇదేం విడ్డూరం.. 16 ఏళ్ల బాలికను పెళ్లాడిన 65 ఏళ్ల మేయర్! -
వర్షం సాక్షిగా వర్షంలో పెళ్లి
-
పెళ్లికూతురు ముందు పరువు పోగొట్టుకున్న పెళ్లికొడుకు.. వీడియో వైరల్..
పెళ్లి వేడుక అంటేనే ఆహ్లాదకరంగా సందడి వాతావరణం ఉంటుంది. అయితే ఒక్కోసారి వేదికపైనే నవ్వూలు పూయించే ఘటనలు జరుగతుంటాయి. అక్కడున్న వారిని పొట్టచెక్కలయ్యేలా నవ్వేలా చేస్తాయి. ఓ విహవా వేడుకలో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. కొత్త పెళ్లి కొడుక్కు తన జీవిత భాగస్వామి ముందే ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. ఆ సమయంలో అతడ్ని చూసి ఆమె పొట్టచెక్కలయ్యేలా నవ్వింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఈ వీడియోలో పెళ్లి అనంతరం పూలదండలు మార్చుకుంటున్నారు వధూవరులు. అయితే పెళ్లికూతురు మెడలో దండ వేసే సమయంలో పెళ్లికొడుకు పైజామా జారిపోయింది. అతను మాత్రం గమనించలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్నవాళ్లతో పాటు పెళ్లికూతురు కూడా నవ్వడంతో వెంటనే తేరుకుని ప్యాంటు పైకి లాక్కున్నాడు. ఈ సమయంలో అతను సిగ్గుపడటం చూసి పెళ్లికి వచ్చిన వారంతా కడుపుబ్బా నవ్వుకున్నారు. ये दूल्हे के साथ क्या हो गया !!! 😂😂😂😂😂😂😂 pic.twitter.com/RSELxUTzQ9 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) March 16, 2023 ఈ వీడియోపై స్పందిస్తూ.. పాపం ఈ పెళ్లికొడుకుకు ఏమైంది? అని నెటిజన్ నవ్వులు పూయించాడు. ప్యాంటు లూస్‌గా ఉన్నట్టుంది బ్రో.. కొంచెం చూసుకోవాలి కదా అంటూ మరో యూజర్ చమత్కరించాడు. అయ్యో.. పెళ్లికూతురు ముందు పరువుపాయే.. మున్ముందైనా జర చూసుకో.. అంటు మరో యూజర్ సలహా ఇచ్చాడు. చదవండి: ఇన్స్టాంట్ ఖర్మ అంటే ఇదే.. గేదెను తన్ని బైక్‌పై నుంచి జారి.. -
విధి వైపరిత్యం అంటే ఇదేనేమో.. కూతురు పెళ్లై 24 గంటలు గడవకముందే!
సాక్షి, సిద్దిపేట జిల్లా: ఆ ఇంట పెళ్లిసందడి ముగియకముందే చావుబాజా మోగింది. పెద్దకూతురు పెళ్లి జరిగి 24 గంటలు గడవకముందే తల్లి గుండెపోటుతో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బంజార గ్రామానికి చెందిన జగిలి స్వరూప(35)కు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురుకు శుక్రవారం వివాహం జరిగింది. ఇంటిల్లిపాది పెళ్లిసందడిలో ఆనందంగా ఉన్నారు. శనివారం ఉదయం కూతుర్ని అత్తగారింటికి పంపేందుకు ఒకవైపు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే తల్లి సర్వూప ఒక్కసారిగా గుండెపోటుతో తుది శ్వాస విడిచింది. దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదఛాయలు నెలకొన్నాయి. పెద్దకూతురికి కన్యాదానం చేసి, చిన్నకూతురుతో తలకొరివి పెట్టించుకుందంటూ కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. -
అప్పటి పెళ్లి సరదా వేడుకలు ఉన్నాయా?
పెళ్లంటె ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలు, ఉద్వేగాలు, సరదాల సమ్మేళనం. హిందూమత ప్రకారం జరిగే పెళ్లిలో ఒకప్పుడు కనిపించిన ఆచార సంప్రదాయాలు ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదు. భవిష్యత్తులో ఇవి పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. హిందూ కుటుంబాల్లో పెళ్లిరోజుకు ఒక రోజు ముందర ‘స్నాతకం’ అనే ముఖ్య మైన కార్యక్రమం జరుపుకోవడం ఆచారం. పెళ్ళి కుమారుడి ఇంట్లో కానీ, కల్యాణ మండపంలో కానీ లేదా విడిది (ఆడ పెళ్ళివారు ఏర్పాటుచేసిన అతిథిగృహం)లో కానీ, పురోహితులు స్నాతక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి, అన్ని ప్రాయశ్చిత్తాల కోసం, శరీర శుద్ధి కోసం బ్రాహ్మణులు వరుడితో గోత్ర ప్రవరలు చేయిస్తారు. స్నాతకం అనే ఈ ‘సంస్కారం’, ప్రధానంగా, వరుడిని ‘బ్రహ్మచర్యం’నుండి గురువు (ఇక్కడ పురోహితుడు) ఆదేశంతో, అంగీకారంతో ‘గృహస్థాశ్రమం’ స్వీకరించడానికి సిద్ధం చేస్తున్న వేడుక. ఆ సమ యంలో గురువు చేయాల్సిన హితబోధ తైత్తిరీయోపనిషత్తులోని ‘సత్యాన్న’ అన్న ఒక శ్లోక రూపంలో ఉంటుంది. ‘సత్యం, ధర్మం, తెలివితేటల విషయాల్లో పొరపాటు పడవద్దు’ అన్న ఆదేశం అది. పెద్దవారి నుంచి ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని, వారు అనుసరించిన మార్గాన్ని ఎంచుకోమని అంటూ... ‘వరుడికి శుభం కలుగుగాక’ అని ఆశీర్వదించి గురువు వరుడిని గృహస్థాశ్రమానికి సిద్ధం చేస్తాడు. స్నాతకానికి ‘సమావర్తనం’ అన్న పేరు కూడా ఉంది. సమావర్తనమంటే, తిరిగి రావడమని అర్థం. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, గురువు హిత బోధతో పాదయాత్ర చేస్తూ తిరిగి రావడాన్నే సమావర్తనం అంటారు. హోమ కార్యాలు నిర్వర్తించి, దండాన్ని ధరించి, గొడుగు పట్టుకొని కాశీ యాత్రకు బయలుదేరే ఘట్టం మరో ముఖ్యమైన ఆచారం. వరుడు కాశీ ప్రయాణం, బాజా భజంత్రీల మధ్య గొడుగు పట్టుకొని, చేత్తో కర్ర పుచ్చుకొని, కాళ్లకు పావుకోళ్లు ధరించి, మెడలో పసుపు బట్టను వేసుకొని, సన్యాసం స్వీకరించేందుకు కాశీకి పోతున్నానని చెప్పి బయలుదేరుతాడు. కాశీ యాత్రా ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నాననీ; దానికి బంధు, మిత్రుల అనుజ్ఞ కావాలనీ వరుడు కోరతాడు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం సరైందికాదనీ, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మబద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించాలనీ పురోహితుడు హితవు పలుకుతాడు. వధువు సోదరుడు వచ్చి ‘అయ్యా, బ్రహ్మచారిగారూ! మీ కాశీ ప్రయాణం విరమించుకోండి. మా సోదరిని వివాహం చేసు కొని గృహస్థుగా జీవించండి’ అని చెప్పి బొట్టు పెట్టి, బెల్లం (తీపి పదార్థం) నోటికి రుచి చూపించి, నూతన వస్త్రాలను ఇచ్చి వరుడిని వెనుకకు తీసుకొని వస్తాడు. శాస్త్రం ప్రకారం కాబోయే బావమరిదికి వరుడు నూతన వస్త్రాలను బహుకరిస్తాడు. ఆనాటి పెళ్లిళ్లలో ఇదొక ప్రధానమైన వేడుక. చాలా కోలాహలంగా పెళ్ళికి ‘తరలి పోయే ముందర’ జరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధు, మిత్రులందరూ బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించుకోవడం, పల్లకీ లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. శుభకార్యానికి బయలుదేరుతున్నామనీ, వెనక్కు పిలవడం, నిందించడం, దగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా ఉండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు. పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ; స్నాతకం, అంకు రార్పణల రోజున గానీ పెళ్ళికొడుకును, పెళ్ళికూతురును (సిద్ధం) చేయడం ఒక ఆచారం. మంగళ స్నానాలతో ఆ ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూవరుల ఇళ్లలో, ఉదయం తెల తెలవారుతుండగానే, మంగళ వాద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగు తుంది. వధువుకు, కన్యాదాత దంపతులకు, తోటి పెళ్ళి కూతు రుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ముందే, ముత్తయిదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. అలానే వరుడికీ, తల్లితండ్రులకూ, తోటి పెళ్ళికొడుకుకూ (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. అంకురార్పణగా పిలిచే ఆ వేడుకకు కన్యాదాత దగ్గరి బంధు వులందరూ వస్తారు. నవధాన్యాలను మట్టి మూకుళ్లలో పుట్ట మన్నులో కలిపి మొలకెత్తే విధంగా అమర్చడాన్ని ‘అంకురార్పణ’ అంటారు. అలనాటి మంగళ స్నానాలు, మామిడితోరణాలు, స్నాతకం, కాశీయాత్ర లాంటి వేడుకలు ఇంకా ఉన్నాయా? అక్కడక్కడా ఉండవచ్చునేమో! వనం జ్వాలా నరసింహారావు వ్యాసకర్త తెలంగాణ సీఎం సీపీఆర్ఓ -
పెళ్లి కోసం వరుడు పాట్లు..రాత్రంత కాలినడకన వెళ్లి మరీ తాళి కట్టాడు!
డ్రైవర్ల సమ్మె కారణంగా వరడు నానాపాట్లు పడ్డాడు. పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడ్డాడు. చివరికి వరుడు కుటుంబం కాలినిడకన వధువు ఇంటికి చేరుకుని మరీ ఆ వధవరులకు వివాహం జరిపించారు. ఈ ఘటన ఒడిశాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..ఒడిశాలోని కల్యాణ్ సింగ్‌పూర్ బ్లాక్ పరిధిలోని సునఖండి పంచాయతీలో నివసిస్తున్న వరుడు 28 కి.మీ దూరంలో ఉన్న దిబలపాడు గ్రామానికి రాత్రంతా నడిచి మరి వధువు ఇంటికి చేరుకుని పెళ్లి చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐతే శుక్రవారం ఆ జంటకి వివాహం ఘనంగా జరిగింది. ఇదిలా ఉండగా, ఒడిశాలో డ్రైవర్లు భీమా, ఫించన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు తదితరాలను కావాలని డిమాండ్ చేస్తూ డ్రైవర్ ఏక్తా మహాసంఘ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మే చేపట్టింది. 90 రోజులుగా జరుగుతున్న నిరవధిక సమ్మెని తమ డిమాండ్లన్నీ నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నిలిపేశారు. రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పి కె జెనా, డీజేపీ ఎస్ కే బన్సక్ సమ్మెను ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేసిన కొద్ది గంటలే డ్రైవర్ల ఏక్తా మహాసంఘ్ సమ్మెను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దాదాపు రెండు లక్షల మంది డ్రైవర్ల సమ్మె కారణంగా కార్యాలయాలకు వెళ్లేవారు, పర్యాటకులు, సామాన్యులు ఎంతగానే ఇబ్బందిపడ్డారు. ఈ సమ్మె కారణంగా ధరలు కూడా ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి కూడా. (చదవండి: మద్యం మత్తులో కళ్యాణ మండపానికి వెళ్లడం మర్చిపోయిన వరుడు) -
పెళ్లిలో రెచ్చిపోతున్న హిజ్రాలు.. డబ్బులు ఇవ్వకుంటే అసభ్యకర ప్రదర్శనలు
రెండు రోజుల కిందట కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నగరానికి చెందిన ఓ పెద్ద వ్యాపారి కొడుకు వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు హిజ్రాలు అక్కడికి చేరుకున్నారు. ఫంక్షన్‌హాల్ లోపలికి వెళ్లి వేదికపైకి వచ్చారు. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. డబ్బులివ్వాలంటూ అసభ్య పదజాలం వాడారు. దీంతో పెళ్లి కుమారుడి తండ్రి రూ.5 వేలు ఇచ్చాడు. ‘మాకు అవి సరిపోవు. రూ.50 వేలు కావాలి. అవి ఇస్తేనే ఇక్కడ నుంచి వెళ్లి పోతాం’ అని వీరంగం స్పష్టించారు. ఎంత చెప్పినా వినకుండా పెళ్లి మండపంపైనే కూర్చున్నారు. చేసేది ఏమీ లేక వధువు వరుడు తరఫున రూ.50 వేలు ఇచ్చి అక్కడి నుంచి పంపించారు. ఇలా ఒక్క కరీంనగర్‌లోనే కాదు.. ఉమ్మడి జిల్లాలోని అన్ని ఫంక్షన్ హాళ్లలో హిజ్రాలు ఇలానే హల్చల్ చేస్తున్నారు. ఒక్కో పెళ్లికి రూ.5 వేల నుంచి రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ సమీప మండలంలోని ఓ గ్రామంలో సర్పంచ్ బంధువు వివాహం జరిగింది. రాత్రి బరాత్ జరుగుతున్న సమయంలో కొందరు హిజ్రాలు వచ్చి వీరంగం సృష్టించారు. పెళ్లి కుమారుడిని డబ్బులు డిమాండ్ చేశారు. అతను నిరాకరించడంతో రెచ్చిపోయి నగ్నంగా డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడున్న వారు పారిపోయారు. దీంతో వధూవరుల తల్లిదండ్రులు తమ బంధువులు, స్నేహితుల ముందు హేళన కావొద్దని అడిగినంత ముట్టజెప్పారు. తిమ్మాపూర్(మానకొండూర్): పెళ్లంటే జీవితంలో ఒక్కసారి వచ్చే వేడుక. దీన్ని పేదవారు సైతం తమకు ఉన్నంతలో గొప్పగా జరుపుకోవాలని అనుకుంటారు. కానీ.. ఈ మధ్య హిజ్రాల కారణంగా భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. మామూళ్లు ఇవ్వకుంటే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ శుభకార్యాల్లో అలజడి సృష్టిస్తున్నారు. సామాన్య కుటుంబాలకు చెందినవారు డబ్బు ఇచ్చేందుకు నిరాకరిస్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. ఫలితంగా శుభకార్యానికి వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు భయపడుతున్నారు. ఎవరైనా హిజ్రాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తే వారితో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అందరూ జంకుతున్నారు. దౌర్జన్యాలకు పాల్పడితే కఠిన చర్యలు కొంతమంది ట్రాన్స్జెండర్లు ఎక్కడ శుభకార్యం జరిగినా వారి ఇంటి ముందు వాలిపోయి ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తూ, దౌర్జన్యంగా వేలకు వేలు డబ్బులు గుంజుతున్న సంఘటనలు దృష్టికి వస్తున్నాయి. ఎవరైనా చనిపోయిన సందర్భంలో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంలో ఉండగా శ్మశాన వాటిక వద్దకు కూడా చేరిపోయి.. వదిలిపెట్టడం లేదు. వేలకు వేలు డబ్బులు గుంజుతున్నట్టుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికైనా వారు తమ వైఖరి మార్చుకోవాలి. లేని ఎడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా ఇటువంటి వేధింపులకు గురైతే బాధితులు వెంటనే డయల్ 100 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి వివరాలు తెలియజేయాలి. ఐదు నిమిషాల్లో దగ్గరలో ఉన్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది, పెట్రో కార్ సిబ్బంది చేరుకునేలా చర్యలు తీసుకుంటాం. జీవనోపాధి కోసం గౌరవంగా ఉండే ఏదైనా వృత్తిని.. లేక చిన్నచిన్న పనులు చేసుకొని జీవించాలి . ఇటీవల వారికి బ్యాంక్ రుణాలు కూడా మంజూరయాయి. వాహనాలు నడుపుకునేందుకు డ్రైవింగ్ లైసెన్స్‌లు కూడా ఇచ్చారు. – ఎల్.సుబ్బారాయుడు, పోలీస్ కమిషనర్ -
ఫుల్‌గా తాగి పెళ్లి మండపంలోనే నిద్రపోయిన వరుడు.. ఆ తర్వాత..
ఇటీవల కాలంలో పెళ్లిళ్లు పెళ్లి పీటలపైనే సడెన్‌గా ఆగిపోతున్న పలు ఉదంతాలను చూస్తున్నాం. జరుగుతోంది వివాహం, ఇద్దరి వ్యక్తుల కొత్త జీవితానికి సంబంధించింది అన్న భావన లేకుండా కొందరూ వ్యక్తులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ తర్వాత వారి పనుల కారణంగా పెళ్లి రద్దు చేసుకుని ఇరు కుటుంబాలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అచ్చం అలాంటి విస్తుపోయే ఘటనే అస్సాంలో చోట చేసుకుంది. (చదవండి: Love Marriage: మాచారెడ్డి అబ్బాయి వెడ్స్ అమెరికా అమ్మాయి) వివరాల్లోకెళ్తే..అస్సాంలోని నల్బరీ జిల్లాలో వరుడు అతిగా మద్యం సేవించి కళ్యాణ మండపానికి వచ్చాడు. ఆ తర్వాత అక్కడ పెళ్లి పీటలపై కూర్చొని పంతులు చెప్పే మంత్రాలు చెప్పలేక నానాపాట్లు పడ్డాడు. కొద్దిసేపటికే కూర్చొన్న చోటే నేలపై పడుకుండిపోయాడు. దీంతో ఒక్కసారిగా వధువు తరుఫు వారు కంగుతిన్నారు. ఆఖరికి వరుడి తండ్రి, అతని కుటుంబసభ్యులు తాగి ఉన్నారు. ఇక ఏం చేయలో కూడా పాలుపోలేదు వధువు తరఫు వారికి. ఐతే పెళ్లి కూతురు కూడా అతన్ని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీంతో వధువు కుంటుంబ సభ్యులు వరుడు తరుపు గ్రామ పెద్దను సంప్రదించి పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు కనీసం కారులోంచి కూడా దిగలేకపోయినట్లు సమాచారం. వరుడు, అతడి కుటుంబం తీరు కారణంగా పెళ్లి ఆగినందుకు నష్టపరిహారం చెల్లించాలంటూ వధువు కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. (చదవండి: Sudha Murthy: కేరళ పొంగళ వేడుకల్లో సుధామూర్తి.. ఆమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు) Video: "Drunk" Groom Sleeps At His Own Wedding. This Happened Next https://t.co/e29q2ZgBBm pic.twitter.com/LEZgRtXbJc — NDTV (@ndtv) March 11, 2023 (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. అంతటితో ఆగకుండా..) -
కట్నం సరిపోలేదని వరుడికి షాకిచ్చిన వధువు.. పెళ్లికి గంట ముందు..
సాక్షి, మేడ్చల్ జిల్లా: జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. కట్నం సరిపోలేదని ఓ వధువు ముహూర్తానికి గంట ముందు పెళ్లి రద్దు చేసుకుంది. హైదరాబాద్ శివారులోని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగింది. వివరాలు.. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన ఓ యువకుడికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరఫు వారు అమ్మాయికి రూ.2 లక్షలు కట్నం ఇచ్చేలా కులపెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది. గురువారం రాత్రి 7:21 గంటలకు పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబ సభ్యులు ఘట్కేసర్లోని ఓ ఫంక్షన్హాల్లో పెళ్లి జరుగుతుందని ఆహ్వాన పత్రికలు బంధుమిత్రులకు పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే అబ్బాయి, కుటుంబసభ్యులు, బంధువులు, మిత్రులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. అమ్మాయి, వారి కుటుంబసభ్యులు రాకపోవడంతో వరుడి తరఫు వారు ఆరాతీశారు. అబ్బాయి తరఫున ఇచ్చే కట్నం సరిపోవడం లేదని, అదనంగా కావాలని వధువు డిమాండ్ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసింది. వరుడి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వారు అమ్మాయి కుటుంబ సభ్యులను పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2 లక్షలు సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. చదవండి: మహిళతో బీజేపీ ఎంపీ అనుచిత వ్యాఖ్యలు!.. నీ భర్త బతికే ఉన్నాడు కదా అంటూ.. -
గుండెపోటుతో నవ వరుడు హఠాన్మరణం
సాక్షి, అన్నానగర్: గుండెపోటుతో నవ వరుడు మృతిచెందిన ఘటన ఈరోడ్‌లో జరిగింది. నసియానూర్ కన్నవేలం పాళయానికి చెందిన ప్రకాష్ (36)కు ఈ నెల 23వ తేదీ వివాహం జరిగింది. శనివారం అత్తగారి ఇంటికి వెళ్లిన ప్రకాష్ మటన్ తిన్నాడు. తన భార్యతో అమ్మగారి ఇంటికి వచ్చాడు. రాత్రి మరోసారి మటన్ తిని పడుకున్నాడు. ఆదివారం వేకువజామున 2 గంటలకు శరీరమంతా దురద పుడుతోందని చెప్పాడు. కొద్ది సేపటికే గుండెపోటు వచ్చింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన పెరుందురై ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. కాంజీకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: లంక నావికాదళం ఓవరాక్షన్.. సీఎం స్టాలిన్ ఫైర్) -
పెళ్లి మండపంలో షాకింగ్ ఘటన.. వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు..
మైలార్‌దేవ్‌పల్లి: మరి కొద్దిసేపట్లో వధువు మెడలో తాళి కట్టాల్సిన వరుడు...కటకటాల పాలయ్యాడు. తనను ప్రేమించి..పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ మరో యువతి పెళ్లి మండపం వద్దకు పోలీసుల్ని పంపింది. ప్రియుడ్ని అరెస్టు చేయించింది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటన శుక్రవారం మైలార్‌దేవ్‌పల్లిలో జరిగింది. ఇన్స్పెక్టర్ పి.మధు, బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం లక్ష్మిగూడ ప్రాంతానికి చెందిన తుమ్మల పృథ్వీరాజ్ ముదిరాజ్‌కు మంచిరేవుల ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ మేరకు శుక్రవారం అజీజ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్ హాలులో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొద్దిసేపట్లో వివాహం జరగనుండగా..ఓ యువతి పృథ్వీరాజ్ తనను ఆరేళ్లుగా ప్రేమించి..పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసి ఫంక్షన్ హాలు వద్దకు పోలీసుల్ని పంపింది. ఈ మేరకు పోలీసులు పృథ్వీరాజ్‌ను అరెస్టు చేసి...వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. కాగా పృథ్వీరాజ్ ఆస్తులపై కన్నేసిన యువతి కుటుంబ సభ్యులు తప్పుడు కేసు పెట్టి పెళ్లి ఆపించారని అతని తరపు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకునేందుకు పృథ్వీరాజ్ సిద్ధపడినా కులం పేరు చెప్పి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని వారు పేర్కొన్నారు. -
వధువుకు యాక్సిడెంట్.. ఆస్పత్రి బెడ్ మీదే పెళ్లాడిన వరుడు
కొన్ని విచిత్రమైన పెళ్లిళ్లు సినిమాల్లోనే జరుగుతాయి తప్ప రియల్ లైఫ్‌లో అసాధ్యం అనిపిస్తాయి. కానీ సాధ్యమే అని నిరూపించాడు ఇక్కడొక వ్యక్తి. అతన్ని చూస్తే ఇంకా మంచి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. వివరాల్లోకెళ్తే..మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని భేరుఘాట్లో నివాసం ఉంటున్న సౌదాసింగ్కు కుమారుడు రాజేంద్రకు జుల్వానియా గ్రామానికి చెందిన సుభాష్ కుమార్తె శివానితో వివాహం నిశ్చయమైంది. వధువరులిద్దరి బంధువులు ఖాండ్వాలోని భగవాన్పురా నివాసితులు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు వివాహ వేడుకను ఖాండ్వాలో నిర్వహించాలని అనుకున్నారు. ఇంతలో అనుకోకుండా వధువు ప్రమాదం బారిన పడింది. దీంతో ఆమె కాళ్లకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఐతే వరుడు రాజేంద్ర సినిమాలో మాదిరి హిరోలా ఆమెకు అండగా నిలవాలనుకున్నాడు. దీన్ని అపశకునంగా భావించకుండా తమ పెద్దలు అనుక్నున్న ముహుర్తానికే ఆస్పత్రిలోనే ఆమెను పెళ్లిచేసుకున్నాడు. పెళ్లికి ముందు రోజే శివాని కాలికి చేతికి ఆపరేషన్ జరగడం గమనార్హం. సాధారణ వార్డును పెళ్లి వేడుకగా మార్చి..పండితుడి సమక్షంలో దండలు మార్చుకుని వివాహం చేసుకున్నారు. వరుడు తల్లిదండ్రులు కోడలికి కూతురికి మధ్య ఉన్న అంతరం తోలగించాలనే ఈ పెళ్లిని ఆపకుండా అనుకున్న ముహుర్తానికే జరిపించామని చెప్పారు. అలాగే తమ కూతురికే ఇలాంటి పరిస్థితి ఎదురై పెళ్లి ఆగిపోతే తమకు కూడా అలానే బాధగా ఉంటుందన్నారు. తమ కోడలికి నయం అయ్యేంతవరకు ఆస్పత్రిలో చికిత్సను కూడా అందిస్తామని చెప్పారు. ఈ మేరకు పెళ్లి కూతురు తండ్రి మాట్లాడుతూ.."మా కూతురికి మంచి సంబంధం కుదిరింది. అల్లుడు, వారి బంధువులు ఈ పెళ్లికి సహకరించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది." అంటూ ఆనందబాష్పాలతో చెప్పుకొచ్చారు. दुल्हन हुई घायल तो अस्पताल पहुंची बारात, बेड पर ही दूल्हे ने रचाई शादी | Unseen India pic.twitter.com/A8ENcxVuis — UnSeen India (@USIndia_) February 20, 2023 (చదవండి: రింగ్ మాస్టర్‌కు ఝలక్.. నువ్వు లక్కీఫెలో భయ్యా!) -
వైరల్ వీడియో: ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు..
-
ఈ పెళ్లికొడుకు చాలా రిచ్.. బంధువుల కోసం విమానం బుక్ చేశాడు..
బంధుమిత్రులను తన పెళ్లికి తీసుకెళ్లేందుకు ఏకంగా విమానాన్నే బుక్ చేశాడు ఓ పెళ్లికొడుకు. వాళ్లతో కలిసి ఆకాశమార్గంలో ప్రయాణించి ఇంటికి చేరుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. అది వైరల్‌గా మారింది. ఈ వరుడి పేరు భువన్. చాలా రిచ్. అందుకే ఖర్చు గురించి ఆలోచించకుండా విమానం మొత్తాన్ని బుక్ చేశాడు. ఇతనితో పాటు ప్రయాణించిన బంధువులు ఫుల్ జోష్‌లో కన్పించారు. కెమెరాకు లవ్ సింబల్‌తో పోజులిచ్చారు. View this post on Instagram A post shared by Bhuwan and Shagun - #ShuBh (@theshubhwedding) భువన్ కూడా తన హావభావాలతో నవ్వులు పూయించాడు. చేతులకు మెహిందీ కూడా పెట్టుకున్నాడు. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెట్టారు. నువ్వు రిచ్ ఆ కాదా చెప్పనవసరం లేదు, ఇలా విమానం బుక్ చెస్తే చాలు అందరికీ అర్థమయిపోతుంది అని ఓ నెటిజన్ స్పందించాడు. మరో నెటిజన్ స్పందిస్తూ జీవితంలో ఇంత డబ్బు ఉంటే చాలు హ్యాపీగా బతికేయొచ్చు అని రిప్లై ఇచ్చాడు. చదవండి: పెళ్లి దుస్తుల్లో వెళ్లి పరీక్ష రాసిన వధువు.. వీడియో వైరల్.. -
Viral Video: పెళ్లి కొడుకుతో పారిపోయిన గుర్రం.. షాక్‌లో బంధుమిత్రులు..
పెళ్లంటే జీవితకాల జ్ఞాపకం.. ఇద్దరు వ్యక్తలు కలిసి కొత్త జీవితాన్ని ఆరంభించేందుకు వేదిక. ఇలాంటి గొప్ప రోజును అందంగా మలుచుకునేందుకు నేటి యువత ఆసక్తి చూపుతున్నారు. హల్దీ, మెహందీ ఫంక్షన్, సంగీత్ అంటూ కొత్తకొత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. సర్ప్రైజ్లు, సరదాలు, ముఖ్యంగా డ్యాన్స్ కార్యక్రమం లేకుండా అసలు పెళ్లిళ్లే జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇక పెళ్లి వేడకలో ఫన్నీ మూమెంట్స్, షాకింగ్, ఆశ్చర్యకర ఘటనలకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో ప్రత్యమవుతూనే ఉన్నాయి. తాజాగా ఓ వరుడికి సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. తన స్పెషల్ ఎంట్రీతో వధువును సర్ప్రైజ్ చేయాలనుకున్న వరుడి ఆశలు తలకిందులయ్యాయి. అసలేం జరిగిందంటే.. పెళ్లి కోసం అదంగా ముస్తాబైన వరుడు గుర్రంపై ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. అదే సమయంలో బంధువులు టపాసులు పేల్చారు. బాంబులు పేలిన సౌండ్‌కు ఒక్కసారిగా బెదిరిన గుర్రం అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. దీంతో ఆ గుర్రాన్ని పట్టుకోవడానికి దాని యజమాని వెనకాలే పరుగులు పెట్టాడు. అయితే గుర్రంపై కూర్చున్న వరుడు కూడా అటే వెళ్లడంతో బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియ రాలేదు గానీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటి వరకు 9.7 లక్షల మంది వీక్షించారు. దీనిని చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. చదవండి: Viral: ప్రేమకు వేదికైన కళాశాలలోనే పెళ్లి చేసుకున్న జంట View this post on Instagram A post shared by memes comedy (@ghantaa) -
పెళ్లికి పది రోజులు ఉండగా.. ఉన్నటుండి వరుడు..
సాక్షి, ద్వారకాతిరుమల: ఏం కష్టం వచ్చిందో తెలియదు గానీ.. తన పెళ్లికి ఇంకా పది రోజులు మాత్రమే సమయం ఉందనగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన పంగిడిగూడెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఇంటి పుష్పవతి నాల్గో కుమారుడు హరీష్‌బాబు (33) ఢిల్లీలోని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. అతడికి ఇటీవల పెళ్లి నిశ్చయమైంది. సంక్రాంతికి ఇంటికి వచ్చిన హరీష్‌బాబు అప్పటినుంచి ఇక్కడే ఉంటూ పెళ్లి పనులు చూసుకుంటున్నారు. ఈనెల 16న వివాహం జరగాల్సి ఉండగా శనివారం పెళ్లి బట్టలు కొనేందుకు తల్లితో కలిసి ఏలూరు వెళ్లాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఉదయం అతడు ఇంట్లోని ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నారు. కొద్దిసేపటికి తల్లి వచ్చి తలుపు తట్టగా హరీష్‌బాబు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కేకలు వేసింది. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి తలుపులు పగలగొట్టగా హరీష్‌బాబు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. కిందకు దింపి చూడగా అప్పటికే అతడు మృతి చెందాడు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు. (చదవండి: పెళ్లీడు వచ్చినా పెళ్లి చేయటం లేదన్న కోపంతో అన్నని..) -
వధువు కావాలా.. నాయనా?
హిందూ వివాహాల్లో పెళ్లి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు, వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం. ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది. ఇదివరకు బంధువులు, పరిచయస్తులు మధ్యవర్తిగా ఉండి ఇరు కుటుంబాల వారికీ అమ్మాయి, అబ్బాయిని చూపించి.. పెళ్లి సంబంధాలు కుదుర్చేవారు. అయితే చదువు పూర్తిచేసి.. ఉద్యోగంలో స్థిరపడిన తర్వాతే పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో వయసు దాటిన తర్వాత పెళ్లికి సిద్ధమైతే వధువు దొరకడం లేదు. ఇటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని రాజమండ్రికి చెందిన కొంతమంది మ్యారేజ్ బ్యూరో పేరుతో రంగంలోకి దిగుతున్నారు. ఫొటో ఒకరిది చూపి.. డబ్బు రాబట్టుకుని.. పెళ్లి మరొకరితో చేయడానికి ప్రయత్నిస్తూ.. వరుడి తరఫు కుటుంబాలను మోసం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. సాక్షి, అనంతపురం: జిల్లాలో ఎంతోమంది యవకులు వయసు మీదపడుతున్నా కల్యాణ గడియలు కలసిరావడం లేదు. అమ్మాయిలు తమకు కాబోయే జీవిత భాగస్వామి ఎంపికలోనూ మార్పు వచ్చింది. ఉన్నత చదువు.. మంచి ఉద్యోగం.. మెరుగైన వేతనం.. ఆస్తిపాస్తులు.. కుటుంబ నేపథ్యం బాగుండాలని ఆశిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా కుమార్తెల అభిప్రాయానికి విలువనిచ్చి.. అలాంటి వారిని ఎంపిక చేసుకోవడంపై దృష్టిసారిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పలు వ్యాపారాలు, ఉద్యోగాలు, స్వయం ఉపాధి, వ్యవసాయ రంగాల యువకులకు అమ్మాయిలు దొరకడం కష్టమవుతోంది. ఎంతలా అంటే కన్యాశుల్కం అంటే.. అమ్మాయికే ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్తున్నారు. ఇలాంటివి జిల్లాలో అక్కడక్కడా జరుగుతున్నాయి. అమ్మాయిలు దొరక్క విసిగివేసారిపోయిన యువకులు, వారి తల్లిదండ్రులు మ్యారేజ్ బ్యూరోలను సంప్రదిస్తున్నారు. కొందరు బ్యూరో నిర్వాహకులు డబ్బు కోసం మోసాలకు పాల్పడుతున్నారు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా నిలువునా మోసపోక తప్పదని పలు ఘటనలు హెచ్చరిస్తున్నాయి. మ్యారేజ్ బ్యూరో మోసాల్లో మచ్చుకు... అనంతపురంలో నివాసం ఉంటున్న రాముడు (పేరుమార్చాం) సెల్‌ఫోన్ షాపు నిర్వహిస్తున్నాడు. రాముడు తన సోదరుడికి పెళ్లి సంబంధం కుదుర్చుకోవడానికి రాజమండ్రికి చెందిన మహిళా పెళ్లిళ్ల పేరయ్య (బ్రోకర్)ను సంప్రదించారు. మొదట ఒక అమ్మాయి ఫొటో చూపించారు. పెళ్లికొడుకు సమ్మతి తెలపడంతో.. రూ.5 లక్షల నగదును పెళ్లికూతురు తండ్రికి ఇవ్వాలని.. పెళ్లి నిర్వహణ పెళ్లికొడుకు వారే బాధ్యత తీసుకోవాలని బ్రోకర్ చెప్పారు. వారు ఒప్పుకుని నగదు చెల్లించారు. తర్వాత 15 రోజులకు పెళ్లికొడుకు కుటుంబ సభ్యులతో కలిసి 20 మంది దాకా పెళ్లి అనుకున్న సమయానికి రెండు రోజుల ముందే రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడ పెళ్లి కూతురు మారిపోయింది. తొలుత తమకు ఫొటోలో చూపించిన అమ్మాయి కాదు కదా అని పెళ్లి కుమారుడి వారు ప్రశి్నస్తే.. ‘ఆ అమ్మాయి తండ్రికి ఆరోగ్యం బాగోలేదు. పెళ్లి చేయడం ఇప్పుడు కుదరదు. కావున ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోండి’ అని మహిళా బ్రోకర్ తాపీగా సమాధానమిచ్చారు. చేసేది లేక పెళ్లి కొడుకు కుటుంబం వెనక్కు వచ్చేసింది. ఇలా పెళ్లికాని యువకులను లక్ష్యంగా చేసుకుని మోసగించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. పెళ్లి సంబంధాలు కుదుర్చుతామంటూ వల వేసి భారీగా నగదు, బంగారు నగలు గుంజుతున్నారు. చివర్లో ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు. జిల్లాలో యువకుల గణాంకాలు 20 నుంచి 29 సంవత్సరాల్లోపు వారి సంఖ్య 3,25,218 30 నుంచి 39 సంవత్సరాల్లోపు వారి సంఖ్య 5,86,395 బ్రోకర్ల మాట నమ్మొద్దు అమ్మాయిల కొరతను ఆసరాగా చేసుకుని పెళ్లిళ్ల పేరుతో కొందరు బ్రోకర్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు. బ్రోకర్ల వలకు చిక్కకుండా మనమే జాగ్రత్తగా ఉండాలి. రెండు కుటుంబాలు ఒక అభిప్రాయానికి వచ్చాక మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా మాట్లాడుకోవాలి. బ్రోకర్లను ఒక పరిధి వరకే పరిమితం చేయాలి. –మేడా రామలక్ష్మీ, సీడబ్ల్యూసీ చైర్ పర్సన్, అనంతపురం (చదవండి: విధివంచితులు) -
హనీమూన్‌లో విషాదం.. గుర్రపు స్వారీ చేస్తూ కిందపడ్డ నవ వరుడు
ముంబై: పెళ్లి అనంతరం భార్యతో హనీమూన్‌కు వెళ్లిన నవ వరుడు గుర్రపు స్వారీ చేస్తూ కందపడి ప్రాణాలు కోల్పోయాడు. కట్టుకున్న భార్యకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాడు. మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లాలోని మాథెరాన్ పర్వత ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడి పేరు ఇంతియాజ్ షేక్. వయసు 23 ఏళ్లు. ఇటీవలే వివాహమైంది. ఈ జంట మరో జంటతో కలిసి హనీమూన్‌కు వెళ్లింది. నలుగురు సన్ అండ్ షేడ్ హోటళ్లో దిగారు . అయితే సరదాగా గుర్రపు స్వారీ చేసేందుకు నలుగురూ నాలుగు గుర్రాలపై హోటల్ నుంచి బయల్దేరారు. 70 మీటర్ల దూరం వెళ్లాక ఇంతియాజ్ గుర్రం ఒక్కసారిగా వేగంగా పరుగెత్తింది. దీంతో దానిపై నియంత్రణ కోల్పోయి ఇంతియాజ్ కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలయ్యాయి. సృహ కోల్పోయాడు. ఇంతియాజ్‌ను మొదట మాథెరాన్ మున్సిపల్ కౌన్సిల్ నిర్వహించే బీజే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు ఉల్లాస్‌నగర్‌లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ ఫలితం లేకపోయింది. తలకు తీవ్ర గాయాల వల్ల అతను ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. ఇదే తొలిసారి.. ఇలాంటి ఘటనలు ఇప్పటివరకు జరగలేదని పోలీసులు తెలిపారు. గుర్రంపై నుంచి పడి పలువురు గాయపడిన సందర్భాలు ఉన్నాయి కానీ, ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇదే తొలిసారి అని చెప్పారు. అయితే గుర్రం వేగంగా ప్రయాణించడం వల్లే అతను కిందపడిపోయాడా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయం నిర్ధరించుకోవాల్సి ఉందని పోలుసుల పేర్కొన్నారు. మరోవైపు గుర్రపు స్వారీ చేసే పర్యటకులకు కచ్చితంగా హెల్మెట్ ఇవ్వాలనే నిబంధన ఉంది. కానీ అలా జరగడం లేదని అధికారులు తెలిపారు. కొంతమంది పర్యటకులు హెల్మెట్ ఇచ్చినా ధరించడం లేదని పేర్కొన్నారు. గుర్రాలు సమకూర్చిన వారి తప్పు ఉందని తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: భార్యను హత్య చేసి ఢిల్లీకి పరార్..విచారణలో అతడు.. -
వరుడుకి డబ్బులు లెక్కించడం రాదని..పెళ్లికి నిరాకరించిన యువతి
ప్రతి ఒక్కరి వివాహం అనగా తమకు కాబోయే వరుడు లేదా వధువు ఇలా ఉండాలనే కొన్ని అంచనాలు, ఆశలు ఉంటాయి. అది సహజం. మనం ఊహించినట్లగానే జరిగితే అందరికీ సంతోషమే కానీ చాలా మటుకు అలా కుదరుదు. ఒక్కోసారి మనం అనుకున్న అంచనాలకు విభిన్నంగా కూడా ఉండవచ్చు. అయినప్పటికీ కొందరూ సర్దుకుని పెళ్లి అయ్యాక నెమ్మదిగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు. కానీ ప్రస్తుతం యువత అలా లేదు. ప్రతీదీ చాలా స్పీడ్‌గా అయిపోవాలి. నచ్చలేదంటే అప్పటికప్పుడూ పీటల మీద పెళ్లైనా ఆపేసి బంధువుల్ని, తల్లదండ్రుల్ని షాక్ గురి చేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఫారుఖాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గీతా సింగ్ అనే యువతికి, భరత్ అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది. మంచి ఘనంగా వివాహ తంతు సాగుతుంది. ఇంకాసేపట్లో వివాహం అనంగా పెళ్లికూతురు చేసుకోనంటే చేసుకోను అని తెగేసి చెప్పింది. వరుడి పద్ధతి చాలా విచిత్రంగా ఉందని, అతనికి లెక్కలు సరిగా రావని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో అమ్మాయ తరుఫు కుటుంబ సభ్యులు వరుడు వద్దకు వచ్చి పది రూపాయాల కరెన్సీ నోటులు మూడు ఇచ్చి లెక్కించమని పరీక్షించారు. పాపం ఆ వరుడు ఆ చిన్న పరీక్షలో నెగ్గలేకపోయాడు. అతను కరెన్సీ లెక్కించడంలో విఫలమవ్వడంతో అక్కడ ఉన్నవారందూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ యువతి మాత్రం నాకు అతను వద్దంటే వద్దని బీష్మించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఆఖరికి పోలీసులు సైతం జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినా.. పెళ్లికూతురు ససేమిరా అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో చేసేది లేక వరుడు, అతడి కుటుంబ సభ్యులు అక్కడ నుంచి భారంగా భనిష్క్రమించారు. (చదవండి: నడిరోడ్డుపై కారు ఆపినందుకు..ఊహించని రేంజ్లో జరిమానా!) -
వైరల్ వీడియో: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు
-
Video: వధువుని ఎత్తుకొని కిందపడ్డ వరుడు.. ఆమెకు ముద్దు పెట్టి!
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది. ఇటీవల కాలంలో వివాహాలు.. ఎంటర్టైన్మెంట్కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఆటలు, పాటలు,స్టెప్పులతో చాలా సరాదగా జరుపుకుంటున్నారు. పెళ్లిలో చిన్న చిన్న చిలిపి పనులు, ఫన్నీ మూమెంట్స్ లేకుంటే సరదా ఏముంటుంది చెప్పండి. అప్పుడప్పుడు ఈ వేడుకల్లో కొన్ని చిత్ర విచిత్ర ఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో వీటికి సంబంధించిన వీడియోలే ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి నెట్టింట్ వైరల్‌గా మారింది. పెళ్లి తర్వాత ఎలాగూ బరువు బాధ్యతలు తప్పవనుకున్నాడో ఏమో గానీ ఓ వరుడు వివాహం అనంతరం భార్యను చేతుల్తో ఎత్తుకొని స్టేజ్ నుంచి కిందకు వచ్చాడు. వధువును ఎత్తుకొని వేదిక మెట్లు దిగుతుండగా వరుడు జారి కిందపడిపోయాడు. కానీ వధువును మాత్రం కింద పడిపోకుండా తన చేతుల్లోనే గట్టిగా పట్టుకున్నాడు. అయితే కిందపడినప్పటికీ పెళ్లి కొడుకు ఏమాత్రం అవమానకరంగా, ఇబ్బందిగా ఫీల్ అవ్వలేదు. వెంటనే అతను లేచి నిలబడి నవ్వుతూ భార్యను ముద్దుపెట్టుకొని ఆమెను ఓదార్చాడు. అంతేగాక ఏం పర్వాలేదు.. ఇలాంటి జరుగుతుంటాయి అంటూ ఆమెలో ఉత్సాహాన్ని నింపాడు. జోయా జాన్ అనే అనే యూజర్ దీనిని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. చదవండి: భళా బామ్మ! సాఫ్ట్‌వేర్‌ను మించిన ఆదాయం, 15 రోజులకే 7 లక్షలు! View this post on Instagram A post shared by joya jaan (@joyajaan816) -
నిజామాబాద్: పెళ్లికుమార్తె రవళి ఆత్మహత్య కేసులో వరుడు అరెస్ట్
-
పెళ్లికి ముందు రోజే రవళి ఆత్మహత్య.. కేసులో కీలక పురోగతి
నవీపేట్(నిజామాబాద్ జిల్లా): నవీపేట్లో నవ వధువు ర్యాగల్ల రవళి ఆత్మహత్య కేసులో వేధింపులకు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రా జారెడ్డి బుధవారం తెలిపారు. వివరాలు.. డిసెంబ ర్ 11న పెళ్లికి ముందు రోజు ర్యాగల్ల రవళి ఉరేసు కుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెను వేధింపులకు గురి చేసిన నిజామాబాద్ నగరానికి చెందిన సంతోష్‌పై మృతురాలి తండ్రి ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండటంతో సీడీఆర్ సహాయంతో బుధవారం అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. కోర్టు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. చదవండి: కోర్టులో మహిళ షాకింగ్ ట్విస్ట్.. భర్త కోసం ఎంతకు తెగించిందంటే? -
కొత్త పెళ్లి కొడుకు షాకింగ్ ట్విస్ట్.. బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి..
రాజవొమ్మంగి(అల్లూరి సీతారామరాజు జిల్లా): వివాహ సందడి ఇంకా ముగియలేదు. పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు ఇంకా వారి ఇళ్లకు చేరుకోలేదు. అంతలోనే ఆ ఇంట పెనువిషాదం నెలకొంది. ఏం కష్టం వచ్చిందో గాని వివాహం జరిగి మూడు రోజులు గడవకుండానే పెళ్లి కొడుకు చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక సంఘటన రాజవొమ్మంగి మండలం బోర్నగూడెంలో సోమవారం జరిగింది. జడ్డంగి ఎస్ఐ షరీఫ్ అందజేసిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలెం నాగభూషణం (30) అదే గ్రామంలో ఇంటికి కొంత దూరంలో ఏటిగట్టుపై ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని మరణించాడు. గ్రామస్తులు కొంత మంది చూసి మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. ఈనెల 17న మండలంలోని సింగంపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని పెద్దల నిశ్చయం ప్రకారం ఓ ఆలయంలో నాగభూషణం వివాహం చేసుకున్నాడు. సోమవారం బహిర్భూమికి వెళ్లి వస్తానని భార్యకు చెప్పి ఎదురుగా ఉన్న కాలువవైపు వెళ్లి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చదవండి: వివాహేతర సంబంధాలకు కారణాలివే.. సర్వేలో షాకింగ్ విషయాలు పెళ్లి కుమారుడు పెద్ద తండ్రి దాసరి ఏసుబాబు ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమారా్టనికి అడ్డతీగల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని స్థానిక సీఐ రవికుమార్ సందర్శించి, ఆరా తీశారు. వీఆర్వో నాగేశ్వరరావు తదితరుల సమక్షంలో పంచనామా నిర్వహించారు. -
అర్జెంటీనా జెర్సీలో వరుడు.. ఫ్రాన్స్ జెర్సీలో వధువు..
తిరువనంతపురం: క్రికెట్‌కు అంతులేని ఆదరణ ఉన్న మన దేశంలో ఈ నూతన వధూవరులు ఫుట్‌బాల్‌పై అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. కేరళకు చెందిన సచిన్.ఆర్, ఆర్.అథీరా ఆదివారం పెళ్లి చేసుకున్నారు. ప్రపంచ కప్ ఫుట్‌బాల్ ఫైనల్ మ్యాచ్ కూడా అదే రోజు జరిగింది. అర్జెంటీనా స్టార్ అటగాడు మెస్సీకి సచిన్ వీరాభిమాని. అథీరాకు ఫ్రెంచ్ టీమ్ అంటే ప్రాణం. ఫైనల్‌కు కొన్ని గంటల ముందే కొచ్చిలో వీరి పెళ్లి జరిగింది. దాంతో సంప్రదాయ దుస్తులు, నగలతోపాటు అర్జెంటీనా కెప్టెన్ మెస్సీ జెర్సీని సచిన్, ఫ్రెంచ్ స్టార్ ఎంబాపె జెర్సీని అథీరా ధరించి పెళ్లి పీటలపై కూర్చున్నారు. వివాహమై విందు పూర్తియన వెంటనే క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు కొత్త దంపతులు కొచ్చి నుంచి 206 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురంలోని వరుని ఇంటికి ఆగమేఘాలపై చేరుకున్నారు. సచిన్‌కు ఇష్టమైన అర్జెంటీనా సంచలనం విజయం సాధించడంతో చివరికి ఇరువురూ సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా, అర్జెంటీనా గెలిస్తే ప్రజలకు ఉచితంగా బిర్యానీ వడ్డిస్తానని కేరళలోని త్రిసూర్‌లో ఓ హోటల్ యజమాని ముందే ప్రకటించాడు. చెప్పినట్లుగానే తన హోటల్‌కు వచ్చిన వారందరికీ ఉచితంగా బిర్యానీ పంపిణీ చేసి మాట నిలుపుకున్నాడు! చదవండి: మెస్సీ అసోంలో పుట్టాడు..! -
దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన కాబోయే భార్య... దెబ్బకు వరుడు అరెస్టు
రేపు పెళ్లి అనంగా ఒక వ్యక్తి అరెస్టు అయ్యాడు. అతని నిజ స్వరూపాన్ని కాబోయే భార్య బట్టబయలు చేసింది. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రీలో నివాసం ఉంటున్న హసిన్ సైఫీ అనే వ్యక్తి ఒక ఒక మహిళకు తన పేరు ఆశిష్ ఠాకూర్‌గా(నకిలీ పేరుతో) పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులు ఇద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఒక రోజు ఆమెకు ఉద్యోగం పోయింది. దీన్నే అవకాశంగా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఆశిష్ ఆమె ఉంటున్న ఫ్లాట్‌కి వచ్చి ఉండటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే గాక కొద్దిరోజులకే పెళ్లి చేసుకోవాలంటూ ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చాడు. దీంతో ఆమె అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు వారి పెళ్లి ఈ నెల డిసెంబర్ 12న జరగాల్సి ఉంది. ఐతే ఆ జంట ఇంట్లో లేనప్పుడు ఒక పెద్దాయన తన కొడుకు హసన్ ఆచూకీ కోసం ఇరుగుపోరుగు వారిని ఆరా తీశాడు. ఐతే ఇక్కడ ఆశిష్ అనే వ్యక్తి ఇటీవలే కొత్తగా వచ్చి ఉంటున్నాడని హసన్ కాదని వారు చెప్పారు. ఈ విషయం సదరు మహిళ తెలుసుకుని ఆ పెద్దాయనను కలుసుకుంది. ఆయన ద్వారా అతడి పేరు ఆశిష్ కాదని హసీన్ సైఫీ అని తెలుసుకోవడమే గాక అతడి చేసిన మోసం అంతా తెలుసుకుని షాక్ తింటుంది. దీంతో ఆమె తనను మోసం చేయడమేగాక బలవంతంగా పెళ్లిచేసుకునేలా ఒత్తిడి తీసుకువచ్చి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సదరు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) దినేష్ కుమార్ తెలిపారు. (చదవండి: పెళ్లైపోతుందనంగా... వధువు తండ్రి ఆనందంగా డ్యాన్స్ చేస్తూ...) -
పెళ్లిలో వధువుకు ‘గాడిద’ను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. ఎందుకో తెలుసా!
-
Video: పెళ్లిలో వధువుకు ‘గాడిద’ను గిఫ్ట్‌గా ఇచ్చిన వరుడు.. ఎందుకో తెలుసా!
పెళ్లిళ్లకు హాజరయ్యేటప్పుడు నూతన వధూవరులకు కట్నకానుకలు అందించడం కామన్. కానీ ఇందుకు భిన్నంగా పెళ్లి మండపంలోనే ఓ వ్యక్తి తనకు కాబోయే భార్యకు వినూత్న గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఇంతకీ వరుడు ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే.. అజ్లాన్ అనే వ్యక్తి వరిషా అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లిమండంలోనే వధువుకు ఓ బహుమతి ఇవ్వాలని అజ్లాన్ నిర్ణయించుకున్నాడు. దీంతో వరుడు వధువుకి ఓ గాడిద పిల్లను గిఫ్ట్‌గా ఇచ్చాడు. దానిని చూసిన వధువు షాక్ అవ్వలేదు. ఎందుకంటే అతనికి ముందే తెలుసు వధువు జంతు ప్రేమికురాలని. అందుకే చిన్న గాడిద పిల్లను ఆమెకు వివాహ కానుకగా ఇవ్వాలనున్నట్లు వరుడు అజ్లాన్ చెప్పాడు. కాబోయే భార్యకు ఈ ప్రత్యేకమైన బహుమతిని ఇచ్చే సమయంలో తీసిన ఫొటోలు, వీడియోలను వరుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వీడియోలో పెళ్లిలో బహుమతిగా ఈ గాడిదను ఎందుకు ఎంచుకున్నావు అని వధువు అడిగితే ఒకటేమో అదంటే నీకు ఇష్టం, రెండోది గాడిద అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టపడే, అత్యంత ప్రేమగా ఉండే జంతువు అని వరుడు బదులిచ్చాడు. అంతేగాక గాడిద పిల్లను దాని తల్లి నుంచి వేరు చేయలేదని.. తల్లి కూడా ఈ పిల్ల గాడిదతోనే ఉందని తెలిపాడు. తనకు జంతువులు అంటే చాలా ఇష్టమని, జనాలు ఏమైనా అనుకోనివ్వండి. వారిశాకు ఇదే నా బహుమతి అంటూ పేర్కొన్నాడు. అజ్లాన్ మాటలు విన్న వధువు వారిశా తాను దీన్ని కేవలం గాడిదలా చూడటం లేదని తెలిపింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఊహించని గిఫ్ట్‌ను చూసి కొందను నవ్వుతుంటే.. మరికొందరు మీరిద్దరూ చూడముచ్చటగా ఉన్నారు.. ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని నూతన జంటకు శుభాకాంక్షలు తెలపుతున్నారు.. అలాగే గాడిద పిల్ల కూడా క్యూట్‌గా అందంగా ఉందంటూ, ఎవరు ఏమనుకుంటారనే దాని గురించి పట్టించుకోవద్దని కామెంట్ చేస్తున్నారు. -
పెళ్లి పీటలెక్కాల్సిన వరుడు.. ఆసుపత్రి బెడ్‌పై కొన ఊపిరితో..!
లఖ్‌నవూ: కొద్ది గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. పెళ్లి కోసం అంతా సిద్ధం చేసుకుని వధువు ఇంటికి బయలుదేరిన వరుడు తరపు బంధువులను మార్గ మధ్యలోనే మృత్యువు కబళించింది. ట్రక్కు రూపంలో వారికి మృత్యువు ఎదురైంది. వారు వెళ్తున్న జీపు ట్రక్కును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫతెపుర్ సిక్రి సమీపంలో ఆగ్రా-జైపూర్ హైవేపై శనివారం తెల్లవారు జామున 5 గంటలకు జరిగింది. జీపు డ్రైవర్ నిద్ర మత్తులోకి జారుకోవటంతో కొరాయి టోల్ ప్లాజా వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. టోల్ ప్లాజా సిబ్బంది, స్థానికులు హుటాహుటిన స్పందించి క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించినట్లు చెప్పారు. రాజస్థాన్‌లోని అజ్మెర్‌కు చెందిన వరుడి కుటుంబం పెళ్లి కోసం బిహార్‌లోని పట్నాకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. వరుడి కుటుంబంలోని ముగ్గురు చనిపోగా.. జీపు డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. క్షతగాత్రులు ఆగ్రాలోని సీహెచ్‌సీ, ఎస్ఎన్ మెడికల్ కళాశాలలో చికిత్స పొందుతున్నట్లు ఆగ్రా ఎస్పీ సత్యజీత్ గుప్తా తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఇదీ చదవండి: ఢిల్లీ అల్లర్ల కేసులో నిర్దోషిగా జేఎన్‌యూ స్టూడెంట్ లీడర్ ఉమర్ ఖలిద్! -
300 మంది ముందు ముద్దు పెట్టాడని పెళ్లి రద్దు చేసుకున్న వధువు
లక్నో: పెళ్లైన ఆనందంలో వరుడు చేసిన కొంటెపని అతని కొంప ముంచింది. పెళ్లిమండపంలోనే అందరి ముందు వధువుకు ముద్దు పెట్టడం అతని కలలను కల్లోలం చేసింది. వరుడి తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన పెళ్లికూతురు మండపం నుంచి లేచి వెళ్లిపోయింది. ఇలాంటి వాడు తనకు వద్దే వద్దని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెళ్లికొడుకు తల పట్టుకున్నాడు. ఉత్తర్‌ప్రదేశ్ సంభల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఏం జరిగిందంటే..? యూపీ బాదాయు జిల్లా బిస్లీ గ్రామానికి చెందిన అబ్బాయి, సంభల్ జిల్లా పవాసకు చెందిన అమ్మాయి గతవారం పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి దండలు మార్చుకున్న తర్వాత వధువుకు వరుడు ముద్దు పెట్టాడు. దీంతో ఆమెకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే స్టేజీ పైనుంచి లేచి గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. 300 మంది ముందు అందరూ చూస్తుండగానే తనకు ముద్దు పెట్టిన వరుడి తీరు అసలు బాగాలేదని, ఇతను తన భర్తగా వద్దని వధువు పోలీసులకు చెప్పింది. ఇలాంటి వాడితో జీవితాంతం కలిసి బతకలేదని స్పష్టం చేసింది. వరుడి కుటుంబసభ్యులు కూడా వధువు వెనకాలే పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఆమెకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. రెండు కుటుంబాలు ఈ విషయంపై గొడవపడ్డాయి. పోలీసులు చెప్పినా వినలేదు. తనకు అతడు వద్దే వద్దని వధువు తేల్చిచెప్పింది. బెట్ కట్టిందని చెప్పిన వరుడు అయితే తాను కావాలని ముద్దు పెట్టలేదని, వధువే తనతో బెట్ కట్టిందని వరుడు పోలీసులకు చెప్పాడు. అందరి ముందు ముద్దు పెడితే రూ.1500 ఇస్తానని ఆమె చెప్పిందని, ఒకవేళ తాను ఓడిపోతే రూ.3000 ఇవ్వాలని చెప్పిందని వివరించాడు. వధువు మాత్రం అసలు తాను బెట్ కట్టలేదని చెప్పింది. అసలు ఇలాంటి ప్రస్తావనే తమ మధ్య రాలేదని స్పష్టం చేసింది. వరుడితో వెళ్లేందుకు వధువు నిరాకరించడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇద్దరికీ పెళ్లి జరిగింది కాబట్టి తామేమీ చేయలేమని, చట్ట ప్రకారం కోర్టులోనే విడాకులు తీసుకోవాలని సూచించారు. చదవండి: 'శ్రద్ధను చంపాననే బాధ లేదు.. చాలా మంది అమ్మాయిలతో డేటింగ్ చేశా' -
వర్క్ ఫ్రం హోమ్ తెచ్చిన తంటా!..ఆఖరికి పెళ్లి పీటలపై కూడా
వర్క్ ఫ్రం హోమ్ మనుషులను ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకువచ్చిందంటే వాళ్ల వ్యక్తిగత విషయాలకు కూడా టైం కేటాయించలేని స్థితికి తీసుకు వచ్చింది. ఈ కరోనా మహమ్మారి కారణంగా 2020 నుంచి చాలా వరకు కార్పోరేట్ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ వెసులబాటు ఇచ్చినట్లు ఇచ్చి గొడ్డు చాకిరీ చేయించుకోవడం ప్రారంభించాయి. ఆఖరికి ఇంటి వద్దనే కదా ఉండేదని వారాంతపు సెలవులను కూడా తగ్గించేశాయి కొన్ని కంపెనీలు. ఆ కరోనా మహమ్మారి నుంచి బయటపడ్డాక కూడా చాలా కంపెనీలు ఉద్యోగులను ఆఫీసుకి వచ్చేయమని చెప్పాయి. అయినప్పటికీ చాలామంది ఉద్యోగులు దీనికి అలవాటుపడిపోయి ఆఫీసుకు రండి బాబు అని కంపెనీలు బతుమాలుకోవాల్సి వచ్చింది. కానీ కొన్ని కంపెనీలు ఇదే బెటర్ అంటూ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే కొంతమంది దీనికే అలవాటు పడిపోయి తమ వ్యక్తిగత పనులకు కూడా సమయం కేటాయించకుండా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలానే ఇక్కడొక పెళ్లి కొడుకు తన పెళ్లి సమయంలో కూడా ల్యాప్‌టాప్‌పై ఏదో వర్క్ చేసుకుంటున్నాడు. ఈ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది. అక్కడ కళ్యాణ మండపంలో ఇద్దరు పూజారులు మంత్రాలు చదువుతుండగా సదరు పెళ్లికొడుకు పెళ్లీపీటలపై కూడా ల్యాప్‌టాప్‌లో ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. అతను ల్యాప్‌టాప్‌లో ఏం చేస్తున్నాడనేది క్లారిటీ లేకపోయినప్పటికీ ఏదో ఎమర్జెన్సీ వర్కే చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట హల్చల్ చేసింది. దీంతో నెటిజన్లు మండిపడుతూ..ఇలాంటిది నేను ఎక్కడ చూడలేదు. ఏ కంపెనీ కూడా ఆఖరికి పెళ్లి సమయంలో కూడా పనిచేయమని అడగరు. ఇతని జీవితాన్ని, కెరియర్ని బ్యాలెన్స్ చేసుకోవడం తెలియడం లేదు అంటూ ఫైర్ అయ్యారు. మరికొందరు అతడికి వచ్చే భార్య ఎవరో ఆమెకు ఆల్ ద బెస్ట్ చెప్పండి అంటూ కామెంట్లు చేస్తూ ట్వీట్ చేశారు. View this post on Instagram A post shared by Calcutta Instagrammers (@ig_calcutta) (చదవండి: తన జుట్టును తానే తింటున్న బాలిక.. చివరికి ఆహారం....) -
పోయేకాలం అంటే ఇదే!.. శవపేటికలో పెళ్లి మండపానికి వచ్చిన వరుడు
సాధారణంగా పెళ్లి మండపానికి వరుడు ఎలా వస్తాడు...? మనదేశంలో ఉత్తరాదిన అయితే గుర్రం మీద వస్తాడు. దక్షిణాదిన అయితే ప్రత్యేక వాహనంలో తీసుకొస్తారు. కొన్నిచోట్ల బావమరుదులు మండపానికి ఎత్తుకొని వస్తారు. ఎబ్బే... ఇంత ట్రెడిషనల్‌గా బాగలేదు అనుకున్నాడేమో ఈ వరుడు. అందరికంటే భిన్నంగా ట్రై చేశాడు. మండపానికి ఏకంగా శవపేటికలో వచ్చాడు. అతని స్నేహితులు ఆరుగురు ఆ శవపేటికను మండపానికి మోసుకొచ్చారు. పెళ్లి మండపం వద్దకు రాగానే శవపేటికను మోసుకువెళ్లి ఒక చోట ఉంచారు. అది ఓపెన్ చేయగానే పెళ్లి కొడుకు బయటికి రావడంతో ఆశ్చర్యపోవడం అతిథుల వంతయ్యింది. అంతేనా.. చివరకు అందరూ ఆ శవపేటిక పక్కన వరుసలో నిలబడి ఫొటో కూడా తీసుకున్నారు. చదవండి: Video: మంచి చెప్పడమే ఆమెకు శాపమైంది! యువతిపై పిడుగుద్దులు.. ఇదంతా జరిగింది ఎక్కడన్నది తెలియనప్పటికీ.. ఈ వివాహానికి హాజరైన ఒకరు వీడియో తీసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.80 లక్షల మంది చూశారు. అయితే దీనిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శుభమాని పెళ్లి చేసుకుంటూ.. ఇలా శవపేటికలో రావడమేంటని మండిపడుతున్నారు. -
కాసేపట్లో పెళ్లి.. పీటలపై ఊహించని ట్విస్ట్‌తో వరుడికి షాకిచ్చిన వధువు
పెళ్లి సమయం దగ్గర పడింది. ఇరు కుటుంబ సభ్యులు ఏర్పాట్ల బిజీలో నిమగ్నమయ్యారు. పెళ్లికొచ్చిన చుట్టాలు, మామిడి తోరణాలతో ఇల్లంతా పండుగ వాతావరణం నెలకొంది. కన్నుల జరిగే పెళ్లిని చూసేందుకు అందరూ ఎదురుచూస్తున్నారు. కానీ.. ఊహించని ట్విస్ట్ తో వైభవంగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. భార్యతో కొత్తజీవితాన్ని ప్రారంభించాలని కలలు కంటున్న వరుడితోసహా.. అందరికీ వధువు గట్టి షాకిచ్చింది. వరుడు కుటుంబం ఖరీదైన లెహంగా కొనలేదనే కారణంతో వధువు పీటల మీద పెళ్లిని ఆపేసింది. ఈ వింత ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని హల్ద్వానీలో వెలుగుచూసింది. రాజ్‌పురాకు చెందిన యువతికి ఈ జూన్‌లో ఓ యువకుడితో ఎంగేజ్మెంట్ జరిగింది. నవంబర్ 5న పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో సంప్రదాయం ప్రకారం వరుడు తరుపు వారు వధువుకి వివాహం దుస్తులు కొనిచ్చారు. పెళ్లి రోజు రానే వచ్చింది. అందంగా ముస్తాబైన వధూవరులు తమ కుటుంబాలతో వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో తన పెళ్లి లెహంగా కోసం వరుడు ఫ్యామిలీ కేవలం రూ. 10 వేలు ఖర్చు చేశారనే విషయం వధువుకి తెలిసింది. దీంతో ఆగ్రహం చెందిన యువతి పచ్చటి పందిట్లో ఈ వివాహం తనకొద్దంటూ తేగేసి చెప్పింది. షాకైన వరుడు తండ్రి అమ్మాయి వద్దకు వచ్చి తనకు నచ్చిన లెహంగా కొనుక్కోవాలని ఏటీఎం కార్డు కూడా ఇచ్చాడు. అంతేగాక యువతి లెహంగాను ప్రత్యేకంగా లక్నో నుంచి తీసుకొచ్చామని వరుడి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయినప్పటికీ ఆమె అందుకు అంగీకరించలేదు. ఇక ఈ విషయం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. పోలీసులు, బంధువులు ఎంత సర్ధిచెప్పాలని చూసిన ప్రయోజనం లేకుండాపోయింది. అనేక గొడవల అనంతరం చివరికి పెళ్లిని రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. చదవండి: స్నేహితుడి పెళ్లిలో చీరలో మెరిసిన అమెరికన్స్.. ఎంత సక్కగున్నారో! -
6 అడుగుల ఎత్తు.. 30 లక్షల ఉద్యోగం ఉన్నోడే కావాలి..!
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ల ద్వారా తమ జీవిత భాగస్వాములను వెతుక్కోవడం ఈరోజుల్లో సర్వసాధరణమైంది. తాను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి ఎలాంటి అర్హతలు ఉండాలి, ఫ్యామిలీ బ్యాంక్గ్రౌండ్ ఎలా ఉండాలనే విషయాలను ప్రొఫైల్‌లో క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. అయితే ఓ అమ్మాయి తనకు కాబోయే వాడు ఎలాంటి వాడు అయి ఉండాలో పూస గుచ్చినట్లు చెబుతూ వివరించింది. వయసు, జీతం ఎంతుండాలి, విద్యార్హతలు ఎలా ఉండాలనే విషయాలను ఓ రెజ్యూమేలా తయారు చేసి పెట్టింది. ఈమె డిమాండ్లు చూసిన ఓ యువకుడికి మైండ్ బ్లాంక్ అయ్యింది. వెంటనే ఆమె ప్రొఫైల్ స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్లో షేర్ చేయగా.. అది తెగ వైరల్ అయ్యింది. ఆ డిమాండ్లు ఏంటో తెలిస్తే మీరు కూడా నోరెళ్లబెడతారు ఈ యువతికి కాబోయే వాడు 1992 జున్ తర్వాతే జన్మించి ఉండాలంట. డిగ్రీ, ఇంజినీరింగ్, ఎంబీఏ ఇలా ఏం చదివినా పర్వాలేదు. కానీ దేశంలోని అగ్ర విద్యాసంస్థల్లోనే చదువు పూర్తి చేసి ఉండాలంట. ఐఐటీ, ఐఐఎం, బిట్స్ పిలానీ, ఐఐఎస్సీ, డీటీయూ, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతా, బాంబే, ఢిల్లీ, రూర్కీ, ఖరగ్‌పూర్ ఇలా దేశంలోని ముఖ్య నగరాల యూనివర్సిటీల నుంచే డిగ్రీ పొంది ఉండాలట. ఈ కాలేజీల జాబితాను కూడా ఆ అమ్మాయి క్షుణ్నంగా ఫ్రొపైల్లో పొందుపరిచింది. అంతేకాదు జీతం ఏడాదికి కనీసం రూ.30లక్షలు ఉండాలట. కార్పొరేట్ సెక్టార్లోనే పనిచేయాలట. వరుడికి తోబుట్టువులు ఇద్దరికంటే ఎక్కువ ఉండొదట. బాగా చదువుకున్న కుటుంబం అయితే ప్రాధాన్యం ఇస్తుందట. ముఖ్యంగా వరుడి ఎత్తు 5.7 అడుగుల నుంచి 6 అడుగులు ఉండాలట. మిశ్రమ స్పందన.. ఈ యువతి డిమాండ్లను చూసి నెటిజన్ల నుంచి భిన్న స్పందన లభించింది. ఆమె డిమాండ్లలో తప్పేముంది, ఎలాంటి వాడు కావాలో కోరుకునే స్వేచ్ఛ ఆమెకు ఉంది.. అని కొందరు సమర్థించారు. మరికొందరు మాత్రం ఈమె పెళ్లి చేసుకుంటుందా లేదా భర్తను హైర్ చేస్కుంటుందా అని మండిపడ్డారు. ఒకవేళ ఇవే డిమాండ్లను ఒక అబ్బాయి పోస్టు చేసి ఉంటే ఎంత వివాదం అయ్యేదో ఓసారి ఊహించుకోండి అని మరో యూజర్ అభిప్రాయపడ్డాడు. మరో నెజిటన్ స్పందిస్తూ.. ఈమెకు కావాల్సింది పెళ్లికొడుకు కాదు, బ్యాంక్ అని ఛలోక్తులు విసిరాడు. What is your take on this? pic.twitter.com/FWO1YGyxge — Dr.D G Chaiwala (@RetardedHurt) October 17, 2022 చదవండి: రైలులో గొడవ.. యువకుడ్ని కిందకు తోసేసిన తోటి ప్రయాణికుడు -
ప్రేమ పెళ్లి చేసుకున్నారని దారుణం.. పెళ్లి ఫోటోలు వాట్సాప్‌లో పెట్టడంతో.
సాక్షి, నల్గొండ: తుర్కపల్లి మండలంలోని గంధమల్ల గ్రామానికి చెదిన యువతీయువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ఇష్టం లేని అమ్మాయి తరఫు కుటుంబ సభ్యులు ఆగ్రహంతో అబ్బాయి ఇంటికి నిప్పు పెట్టారు. వివరాలు.. గంధమల్ల గ్రామానికి చెందిన వేముల భాను అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయి కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం వీరిద్దరూ ఇంట్లో చెప్పకుండా బయటికి వెళ్లి గుడిలో వివాహం చేసుకున్నారు. అనంతరం పెళ్లికి సంబంధించిన ఫొటోలను భాను అదే గ్రామానికి చెందిన ఓ వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ పెళ్లి విషయం తెలుసుకున్న అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనై యువకుడి ఇంటికి నిప్పు పెట్టారు. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవండతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఇబ్రహీంపట్నం ఘటన.. డాక్టర్ శ్రీధర్ సస్పెన్షన్‌ను రద్దు చేసిన హైకోర్టు -
అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి.. ఫ్రాన్స్ యువతిని పెళ్లాడిన తమిళ యువకుడు
సాక్షి, చెన్నై: ఫ్రాన్స్ దేశానికి చెందిన యువతిని తమిళనాడుకు చెందిన ఓ యువకుడు పెళ్లి చేసుకున్నాడు. హిందూ సంప్రదాయం ప్రకారం వేదమంత్రాల నడుమ ఆ యువతికి తాళి కాట్టాడు. వివరాలు.. శివగంగ జిల్లా కారైకుడి సమీపంలోని అమరావతి పుదూర్‌కు చెందిన తంగరాజ్ ఫ్రాన్స్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని కొడుకు కలైరాజన్ ఫ్రాన్స్‌లో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నప్పుడు, అదే పాఠశాలలో సైకాలజీ చదువుతున్న ఫ్రాన్స్ యువతి కయల్తో పరిచయం ఏర్పడింది. మొదట్లో స్నేహితులుగా ఉన్నారు. ఆ తర్వాత ప్రేమించుకున్నారు. పెద్దల అంగీకారంతో తమిళనాడుకి వచ్చి కారైకుడి సమీపంలోని అమరావతి బుదూర్ కలైరాజా ఇంట్లో హిందూ సంప్రదాయం ప్రకారం సోమవారం పెళ్లి చేసుకున్నారు. ఫ్రెంచ్ అమ్మాయి కయల్‌కు కళైరాజన్ బంధువుల సమక్షంలో తాళి కట్టాడు. బంధువులు, గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చి వధూవరులను ఆశీర్వదించారు. ఫ్రెంచ్ యువతి మాట్లాడుతూ మూడేళ్లుగా ప్రేమించుకున్నామని, తమిళనాడులో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. -
మీ కోసం తెచ్చిన కేక్ పక్కోడు కట్ చేస్తే?.. అచ్చం ఇలాగే ఉంటుంది కదూ!
మీ బర్త్‌డే కేక్ పక్కోడు కట్ చేస్తే ఎలా ఉంటుంది? ఇక్కడ జరిగింది కూడా అదే. చిత్రంలోని హేలీ అనే ఆమె తన స్నేహితురాలి పెళ్లికి వెళ్లింది. వేదిక మీద వెడ్డింగ్ కేక్ ఉంది. అదేంటి.. వధూవరులు కేక్ కట్ చేసి.. అతిథులకు ప్లేట్లల్లో ఇవ్వడం మరిచిపోయారనుకుని.. కత్తి తీసుకుని.. కేక్‌ను కట్ చేసింది. తర్వాత ఏం జరిగి ఉంటుందనేది మీరు ఊహించుకోవచ్చు. ఆ కేక్ కటింగ్ వీడియోను హేలీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘ఇది నా ఫ్రెండ్ పెళ్లి. వధూవరులకు నా క్షమాపణలు. నిజానికి వాళ్లు కట్ చేయడం మర్చిపోయారనుకుని నేను కట్ చేశాను’ అంటూ వివరణ ఇచ్చుకుంది. వైరల్ అవుతున్న వీడియోపై కొందరు నెటిజన్స్ ఫన్నీగా స్పందిస్తే మరికొందరు సీరియస్ అయ్యారు. పెళ్లి కూతురు మాత్రం ‘నేను క్షమించాను.. పెళ్లిలో ఎలా ఉండాలో మర్యాద కూడా నేర్పించాను’ అని కామెంట్ చేసింది. -
మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు
గుత్తి రూరల్ (అనంతపురం/కర్నూలు): ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడు. మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితురాలు, వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం ఇసురాళ్లపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చదవండి: మీరు తింటున్న చికెన్ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు ఇసురాళ్లపల్లికి చెందిన రమేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ యువతి ఇసురాళ్లపల్లిలో బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో రమేష్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె కూడా ప్రేమకు అంగీకరించింది. కొంతకాలం ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే.. అతను ప్రేమించిన యువతిని మోసం చేసి, జిల్లాలోని పెద్దవడుగూరు మండలం వీరేపల్లికి చెందిన మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. బుధవారం ఇసురాళ్లపల్లిలోని ఆనందాశ్రమంలో వివాహం జరుగుతున్న విషయం బాధితురాలికి తెలిసింది. వెంటనే ఆమె గుత్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రమేష్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు కూడా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయాన్ని దాచి తమనూ మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరువురి ఫిర్యాదు మేరకు వరుడు రమేష్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
పెళ్లి కొడుకుకి షాక్ ఇచ్చిన ప్రియురాలు
-
పెళ్లి మండపంలోకి ప్రియురాలి ప్రవేశం.. తాళి కట్టే సమాయానికి
సాక్షి, మంచిర్యాల: ఆర్భాటంగా పెళ్లి జరుగుతోంది. మరో రెండు నిమిషాల్లో వరుడు తాళి కట్టే సమయం.. ఇంతలో వరుడి ప్రియురాలి ప్రవేశం.. అంతే పీటలపైనే పెళ్లి ఆగిపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గద్దెరాగిడి భీమా గార్డెన్స్‌లో జరిగిన ఈ సంఘటనపై బాధితురాలు తెలిపిన వివరాలివి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నివాసం ఉంటున్న రమీణా గతంలో రామకృష్ణాపూర్లో ఉండేది. సింగరేణి కార్మికుడి కూతురైన ఆమె ఇక్కడ ఉంటున్న సమయంలో.. బొద్దుల రాజేష్‌తో ప్రేమలో పడింది. ఆమెకు 2012లో మరో వ్యక్తితో వివాహం కాగా ఇద్దరూ మనస్పర్థలతో కొద్దిరోజులకే విడిపోయారు. హైదరాబాద్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రాజేష్ హన్మకొండలో ఫార్మసీ చేస్తున్న రమీణాతో మళ్లీ సాన్నిహిత్యం కొనసాగించి శారీరకంగా లొంగదీసుకున్నాడు. రాజేశ్ వేరే యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకున్న రమీణా బుధవారం ఏకంగా పెళ్లి మండపానికి వచ్చి పెళ్లిని అడ్డుకుంది. ఆమె ఫిర్యాదుపై పోలీసులు రంగప్రవేశం చేశారు. మరోవైపు పెళ్లికూతురు బంధువులు రాజేశ్ ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. కేసు నమోదు చేసినట్టు మందమర్రి సీఐ ప్రమోద్‌రావు తెలిపారు. చదవండి: నాలుగు నెలల క్రితమే ప్రేమ వివాహం.. ఎస్సై పరీక్ష సరిగ్గా రాయలేదని -
Hyderabad: నిత్య పెళ్లికొడుకు లీలలు, 8 మందిని పెళ్లి చేసుకున్న మాయగాడు..
-
Hyderabad: నిత్య పెళ్లికొడుకు లీలలు, 8 మందిని పెళ్లి చేసుకున్న మాయగాడు..
సాక్షి, హైదరాబాద్: మహిళలకు మాయమాటలు చెప్పి ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్ళి చేసుకుంటున్న నిత్య పెళ్ళి కొడుకు బండారం అతని ఇద్దరు భార్యలు బయటపెట్టారు. ఇప్పటివరకు 8 వివాహాలు చేసుకున్నట్లు, ఆ 8 మంది వివిధ పోలీస్స్టేషన్లలో ఇతనిపై కేసుపెట్టినట్లు నిర్ధారించారు. భాధిత మహిళలు బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన అడప శివశంకర్ బాబు.. మ్యాట్రిమోనీ ద్వారా వివాహమై భర్తను వదిలేసి డైవర్స్ తీసుకున్నవారు, డైవర్స్ కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉన్నవారిని, ఉన్నత విద్య చదివినవారు, ఆర్థికంగా ఉన్నవారిని ఎంచుకుంటాడు. తనకుకూడా వివాహమైందని వివిధ కారణాలతో విడిపోయామని నకిలీ విడాకుల పత్రం చూపించి సంబంధం కలుపుకుంటాడు. తాను పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తానని నకిలీ ఐడీకార్డులు చూపిస్తాడు, నకిలీ పేస్లిప్ తయారు చేసి 2లక్షలు జీతం అని చెపుతాడు. తన తల్లిదండ్రులు చనిపోయారని నమ్మిస్తాడు. పెళ్ళి సమయంలో ప్రస్తుతం సమావేశానికి వచ్చిన నాలుగో భార్య 26 లక్షలు, ఐదవభార్య 35 లక్షలు నగదు, బంగారం రూపంలో కట్నంగా ఇచ్చినట్లు తెలిపారు. నాకు 2లక్షల జీతం ఇంకా నీవు ఉద్యోగం చేయడం ఎందుకని వారిని ఇంట్లోనుండి బయటకు రాకుండా ఉద్యోగాలు మాన్పిస్తాడు. పెళ్ళైన రెండు నెలల్లోనే ఆఫీస్ నుండి అమెరికావెళ్లే అవకాశం వచ్చిందని పెళ్ళి రిజిస్ట్రేషన్ కూడాచేయిస్తాడు. అమెరికా వెళ్లేదుకు డబ్బులు కావాలంటూ తిరిగి డబ్బులకోసం వేధిస్తుంటాడని వారు తెలిపారు. బయటపడింది ఇలా .. నాలుగవ భార్యవద్ద అమెరికా వెళదామ ని డబ్బు తీసుకోవడం, నైట్ డ్యూటీ, డే డ్యూటీ అంటూ ఇంటికి సరిగ్గా రాకపోవడంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీయండంతో నీకు రావల్సిన డబ్బులునీకు ఇచ్చేస్తానుఅని శివశంకర్ చెప్పాడు. దీంతో బాధిత మహిళ ఆర్.సీ పురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. స్టేషన్‌కు రా వాలని పోలీసులు ఒత్తిడి తేవడంతో ఐద వ భార్యను తీసుకుని స్టేషన్‌కు వెళ్లగా ఇద్ద రు భాధిత మహిళలు మాట్లాడుకుని ఇత ని గుట్టుమొత్తం బయటపెట్టారు. ఐదవ భార్యకూడా గట్టిగా మందలించడంతో ఈ నెల 7వ తేదీన ఆరవ భార్యను తీసుకుని వెళ్లిపోయినట్లు భాధిత మహిళ తెలిపింది. 8వ తేదీన గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేయించినట్లు ఆమె పేర్కొంది. గుంటూరులో ఇతని తల్లిదండ్రులు ఉన్నారని మొదటి భార్య కూడా అక్కడేఉందని తెలిపారు. చదవండి: ఖైదీ నెంబర్ 2001.. నాగేశ్వర్రావు రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు -
పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చిన వధువు.. రెండడుగులు కలిసి నడిచి..
లక్నో: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడుతాయంటారు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితాంతం కలిసి ఉంటామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లయ్యాక విడాకుల బాట పట్టే జంటలు ఎక్కువవుతున్నాయి. అంతేగాక మెడలో మూడు మూళ్లు పడకముందే పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. కారణాలు ఏవైనా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఎటావా జిల్లా భర్తనా పట్టణానికి చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఓ మంచి మూహుర్తం చూసి పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. అతిథులను పిలిచి, అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చివరికి వివాహం జరగుతుండగా నాకు ఈ పెళ్లి వద్దు అంటూ వధువు షాకిచ్చింది. పెళ్లి చూపుల సమయంలో చూసిన వ్యక్తి ఇతను కాదని పెళ్లి పీటలపై వివాహాన్ని రద్దు చేసింది. ‘ఫోటోలో చూసిన వ్యక్తి ఇతను కాదు. అతను చాలా అందంగా ఉన్నాడు. ఇతను నల్లగా ఉన్నాడు. వీళ్లు నన్ను మోసం చేశారని బోరున విలపించింది. ఫోటోలో తెల్లగా ఉన్న వ్యక్తిని చూపించారని, పీటల మీద వరుడు మారిపోయాడని ఆరోపించింది. అయితే వధువును ఒప్పించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా యువతి మాత్రం ససేమిరా అంది. చదవండి: Heavy Rains Forecast: కుండపోత వర్షాలు.. ఈ నగరాలకు రెడ్ అలెర్ట్ జారీ ఈ పంచాయితీ కాస్తా చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు దాదాపు ఆరుగంటల పాటు రెండు కుంటుంబాలకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరికి పెళ్లి రద్దు చేశారు. పెళ్లి ఆగిపోవడంతో ఆగ్రహించిన వరుడు కుంటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు శారు. పెళ్లి సమయంలో ఇచ్చిన నగలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. -
పెళ్లి బారాత్‌లో పైసల లొల్లి.. ఇజ్జత్ తీసిండ్రు.. ఇక నేనుండ!
లక్నో: పెళ్లి బారాత్‌లో జాంజాం అని వెళ్లిన నూతన వరుడు అక్కడున్నవారందరికీ షాకిచ్చాడు. తన మాట కాదంటారా? అంటూ కోపంతో ఊగిపోతూ అక్కడి నుంచి ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్పూర్లో జరిగింది. ఇంతకూ విషయం ఏంటంటే.. ధర్మేంద్ర అనే వ్యక్తి పెళ్లి మంగళవారం జరగాల్సి ఉంది. కార్యక్రమంలో భాగంగా కంపిల్ నుంచి మీర్జాపూర్‌కు బ్యాండ్ మేళంతో బారాత్ చేరుకుంది. బ్యాండ్ బృందం వరుడి తరపువారిని సంభావన ఇవ్వాలని అడిగారు. అయితే, వధువు తరపువారే ఆ మొత్తం చెల్లించాలని.. అదే ఆనవాయితీ అని వరుడి తరపువారు స్పష్టం చేశారు. కానీ, ఇందుకు పెళ్లి కూతురు తరపువారు ససేమిరా అన్నారు. దీంతో పది మందిలో తన పరువుపోయిందని కొత్త పెళ్లికొడుకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. మెడలో ఉన్న పూలదండను నేలకేసి కొట్టి.. ఎవరు చెప్పినా వినకుండా పెళ్లి పందిట్లోంచి వెళ్లిపోయాడు. ఈ విషయమై ఇరుపక్షాల మధ్య మాటామాటా పెరిగి వివాదం మరింత ముదిరింది. పెళ్లి ఆగిపోవడంపై పరస్పరం తమకు ఫిర్యాదులు అందాయని మీర్జాపూర్ స్టేషన్ ఆఫీసర్ అరవింద్‌కుమార్ సింగ్ ఓ వార్త సంస్థకు తెలిపారు. చదవండి👇 బెంగుళూరు ప్రధాని పర్యటన.. బీబీఎంపీ ఖర్చు రూ.23 కోట్లు అమెరికాలో కాల్పులు.. నల్గొండ వాసి కన్నుమూత -
ఒకేసారి ఇద్దరు యువతులను పెళ్లాడిన వ్యక్తి.. కారణం ఏం చెప్పాడో తెలుసా?
రాంచీ: ఓ వ్యక్తి ఒకేసారి ఇద్దరు యువతులను వివాహం చేసుకున్నాడు. అంతేగాక ఈ పెళ్లి ముగ్గురి ఏకాభిప్రాయంతో జరగడం విశేషం. ఈ ఆశ్చర్యకర ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. వివరాలు..లోహర్దగాలోని భాంద్రా బ్లాక్‌లోని బండా గ్రామానికి చెందిన సందీప్, కుసుమ్ లక్రా అనే యువతి మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లికి ముందే వీరికి ఒక బిడ్డ కూడా జన్మించింది. అయితే ఏడాది క్రితం సందీప్ ఇటుక బట్టీలో పనిచేసేందుకు పశ్చిమబెంగాల్‌కు వలస వెళ్లాడు. దీంతో వీరి ప్రేమకథ మరో ములుపు తిరిగింది. అక్కడ పనిచేయడానికి వచ్చి స్వాతి కుమారితో సందీప్‌కు పరిచయం ఏర్పడింది. స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఎవరి ఇంటికి వారు తిరిగి వెళ్లిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య సంబంధాలు కొనసాగాయి. ఈ విషయాన్ని చివరికి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దల వద్దకు పంచాయితీకి తీసుకువెళ్లారు. అనేక గొడవలు, వాగ్వాదాలు తరువాత సందీప్‌కు ఇద్దరినీ ఇచ్చి పెళ్లి చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. యువతులిద్దరూ, కుటుంబ సభ్యులు కూడా అడ్డు చెప్పకపోవడంతో ఇద్దరి మెడలో తాళి కట్టి భార్యలుగా స్వీకరించాడు. చదవండి: తప్పతాగి రెచ్చిపోయిన యువతి.. నడిరోడ్డుపై పోలీస్ కాలర్ పట్టుకొని.. పెళ్లి తర్వాత, సందీప్ ఇండియా మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు మహిళలను కలిసి వివాహం చేసుకోవడం ద్వారా చట్టపరమైన సమస్య ఉండవచ్చు.. కానీ నేను వారిద్దరినీ ప్రేమిస్తున్నానని, ఇద్దరినీ విడిచి పెట్టి ఉండలేనని తెలిపారు. -
బుల్డోజర్ని నడుపతూ వచ్చిన వరుడు! ఫోటో వైరల్
ఇటీవలకాలంలో యువత పెళ్లితంతును చాలా వెరైటీగా చేసుకుంటున్నారు. ఎవరూ చేసుకోని విధంగా, ఊహించని విధంగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం యువత కొత్తట్రెండ్ సృష్టిస్తున్నారనే చెప్పాలి. ఇటీవలే ఒక వధువు కళ్యాణ మండపానికి ట్రాక్టర్ పై వచ్చి షాకిచ్చింది. ఆ ఘటన మరువుక మునుపే ఇక్కడో పెళ్లికొడుకు బుల్డోజర్ పై వచ్చి సందడి చేశాడు. వివరాల్లోకెళ్తే...పెళ్లి చేసుకునేందుకు వరుడు పెళ్లి కూతురు ఇంటికి మంచి కారులోనో లేదంటే మంచి ఖరీదైన బైక్‌లోనో రావడం జరుగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక యవకుడు తన పెళ్లిని అందరూ గుర్తించుకునేలా ప్రత్యేకంగా ఉండాలని ఏకంగా బుల్డోజర్ పై డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు. దీంతో పెళ్లికూతురి గ్రామంలోని వాళ్లంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ తర్వాత అందరూ ఆ వరుడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. ఈ మేరకు వరుడు మాట్లాడుతూ...తాను తన పెళ్లిని గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చుకోవాలనే ఇలా చేశానని అన్నాడు. పైగా గ్రామమంతా పండుగా వాతావరణం చోటు చేసుకుందంటూ తెగ సంబరపడిపోయాడు. ప్రస్తుతం పెళ్లికొడుకు బుల్డోజర్పై వచ్చిన ఫోటో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది (చదవండి: సినిమాలో హీరో మాదిరి కింద పడేశాడు!) -
అట్టహాసంగా లగ్జరీ కారుల్లో డ్యాన్స్‌లు చేస్తూ... పెళ్లి ఊరేగింపు...సీన్ కట్ చేస్తే...
ఇటీవల యువత చాలా అట్టహాసంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. చాలా డబ్బు ఖర్చుపెట్టి మరీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకుంటున్నారు. ఐతే ఇక్కడోక ఉత్తరప్రదేశ్‌కి చెందిన వరడుకి కేవలం పెళ్లి ఊరేగింపుకే రెండు లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఎందుకో తెలుసా! వివరాల్లోకెళ్తే....ముజఫర్నార్ హరిద్వార్ జాతీయ రహదారిపై ఒక పెళ్లి బృందం వరుస లగ్జరీ అడీ కార్లలతో సందడి చేసింది. వరుడు అతని స్నేహితుల బృందం టాప్‌లెస్ కారులో డ్యాన్స్‌లు చేశారు. మరికొంతమంది కారు కిటికిలోంచి వేలాడుతూ సెల్పీలు తీయడం వంటి పనులు చేశారు. ఐతే ఇలాంటి స్టంట్లు తోటి ప్రయాణికుల భద్రతను ఎలా దెబ్బతీస్తుందో తెలియజేస్తూ అంకిత్ కుమార్ అనే వ్యక్తి ట్విట్టర్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియోని పోస్ట్ చేశారు. అతను ట్విట్టర్లో... తాను హరిద్వార్ నుంచి నోయిడా వెళ్తున్న సమయంలో.. ముజఫర్ నగర్ జిల్లాలో కొంతమంది తమ వినోదం కోసం ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ఈ విషయాన్ని ట్రాఫిక్ పోలీసులు గ్రహిస్తారని ఆశిస్తున్న అని ట్వీట్ చేశారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. సదరు పెళ్లి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడమే కాకుండా ఆ ఊరేగింపులో ఉపయోగించిన తొమ్మిది కార్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు కారు యజమానులపై రూ. 2 లక్షలు జరిమాన విధించారు కూడా. ➡️हाइवे पर गाडियों से स्टंट करने वाले वाहनों के विरुद्ध मुजफ्फरनगर पुलिस द्वारा की गयी कार्यवाही। ➡️कुल 09 गाडियों का 02 लाख 02 हजार रुपये का चालान।@Uppolice @The_Professor09 @ankitchalaria pic.twitter.com/VqaolvazhO — MUZAFFARNAGAR POLICE (@muzafarnagarpol) June 14, 2022 (చదవండి: వీడియో: దిగజారిపోతున్న పుతిన్ ఆరోగ్యం? వణికిపోతూ.. నిలబడలేక!) -
ఈ జంట మరీ వైల్డ్! స్టంట్ కాదు...పాములతో నిజమైన పెళ్లి!
అబ్బాయి మెడలో చిన్న పాము, అమ్మాయి మెడలో పైథాన్... పై ఫొటో సాహస స్టంట్‌ను తలపిస్తోంది కదా! కానీ అక్కడ పెళ్లి జరుగుతోంది. పెళ్లికి ఎవరైనా పూల దండలు వేసుకుంటారు. మరీ పైసలెక్కువైతే నోట్ల దండలేసుకుంటా రు. కానీ వీళ్లేంటి మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నారనుకుంటున్నారా? వాళ్లిద్దరూ మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన వైల్డ్ లైఫ్ ఆఫీసర్స్ సిద్ధార్థ్ సోనావానే, సృష్టి ఔసర్మాల్. 2010 నవంబర్ 12న వాళ్ల పెళ్లి జరిగింది. అసలే వన్యప్రాణి సంరక్షణ అధికారులు. పూలదండలు మార్చుకుంటే ఏం బాగుంటుంది? అనుకున్నారేమో. పాములనే దండలుగా మార్చుకున్నారు. వధువు సృష్టి ఔసర్మాల్ వరుడికి ఓ చిన్నపామును మెడలో వేస్తే... ‘నేనేం తక్కువ’ అంటూ వరుడు ఏకంగా పైథాన్నే వధువు మెడలో వేశాడు. ఆ తరువాత వాటిని అడవిలో వదిలేశారనుకోండి. అయితే ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది... కానీ ఆ పాములు కాస్త వైల్డ్‌గా రియాక్ట్ అయి ఉంటే? ఏమయ్యేది అని నెటిజన్స్ వాపోతున్నారు. (చదవండి: నన్నే పెళ్లాడతా.. యువతికి షాక్!.. అడ్డుకుని తీరతామంటూ..) -
వికారాబాద్: పెళ్లయిన 20 రోజులకే..
సాక్షి, వికారాబాద్: పెళ్లి అయిన 20 రోజులకే వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మోమిన్‌పేట మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపిన ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మైపాల్(28)కు ఈ నెల 6న శిరీషతో వివాహమైంది. కాగా ఈ నెల 25న మైపాల్ భార్య శిరీష, తమ్ముడు అనిల్‌తో కలిసి భోజనం చేశాడు. అనంతరం బయటకు వెళ్లి వస్తానని చెప్పి తలుపు గడిపెట్టుకోవాలని చెప్పాడు. రాత్రి 11గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో తమ్ముడు ఫోన్ చేశాడు. బస్టాండ్ వద్ద ఉన్నానని సమాధానం ఇచ్చాడు. తర్వాత ఫోన్ చేసినా స్పందించలేదు. గురువారం ఉదయం బేగరి మల్లేశం వారి పొలానికి వెళ్లగా మైపాల్ తన పొలంలోని వేపచెట్టుకు ఉరేసుకుని వేలాడుతూ కన్పించాడు. దీంతో మల్లేశం వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి అప్పులు ఉన్నాయని వాటిని ఎలా తీర్చాలని బాధపడుతుండే వాడని భార్య శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: పెళ్లయిన యువతికి మాజీ ప్రేమికుడి వేధింపులు.. అత్తమామలకు ఫోటోలు పంపించి.. -
పెళ్లి మండపంలోనే పెళ్లి వద్దని తెగేసి చెప్పిన వధువు... వీడియో వైరల్
ఎంతో సాంప్రదాయబద్ధంగా చేసుకునే వివాహల్లో ఈ మధ్య కాస్త అపసృతులు చోటు చేసుకుంటున్నాయి. ఏవో చిన్న చిన్న వాటికే పెళ్లి మండపంలోనే అందరుముందు వధువరులు కొట్టుకుంటున్న ఘటనలు చూశాం. మర్యాదలు మంచిగా లేవంటూ మరికొంతమంది పెద్దలు పెళ్లిమండంపంలోనే గొడవపడి నరుక్కునేంతవరకు వెళ్లిన ఉదంతాలు గురించి విన్నాం. అవన్ని ఒకతంతు ఐతే వాటన్నింటికి భిన్నంగా ఒడిశాలో జరిగిన వివాహతంతులో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒడిశాలో జరిగిన వివాహతంతులో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. బాలాసోర్ జిల్లా బలియాపాల్ పరిధిలోని రేము గ్రామంలో అంగరంగ వైభవంగా వివాహతంతు జరుగుతోంది. ఇంతలో ఏమైందో ఏమో వధువు అకస్మాత్తుగా లేచి తాను వేసుకున్న నగలు, గాజులు తీసేసి ఈ పెళ్లి వద్దని చెబుతుంది. దీంతో ఆ మండపం వద్ద ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అక్కడ ఉన్న పెద్దలు పెళ్లి కూతురిని తిడుతూ బలవంతంగా కూర్చొబెట్టేందుకు యత్నిస్తుంటారు. ఈ తంతంగాన్ని చూసి తట్టుకోలేక వరుడు స్పృహ తప్పి పడిపోతాడు. దీంతో అక్కడ ఉన్నావారంతా భయాందోళనకు గురవుతారు. ఐతే వరుడు కాసేపటికి తేరుకుని మరో అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. ప్రస్తుతం ఈ విషయం తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: యజమాని కోసం ప్రాణాలను పణంగా పెట్టి సింహంతో పోరాడిన కుక్క) -
పెళ్లి సమయంలో పెళ్లికి నిరాకరించిన వధువు.. కుప్పకూలిన వరుడు
-
12 ఏళ్ల ప్రేమ.. వరుడికి ‘వరకట్న’ వేధింపులు.. సొంత తల్లిదండ్రులకు షాక్!
ఒకప్పటి కాలంలో పెళ్లి అంటే ఏదో సాధాసీదాగా జరిపించేవాళ్లు. ఒక్క రోజులో వేడుక అయిపోయిది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వదలకుండా పండుగలా చేసుకుంటున్నారు. పెళ్లి వేడుకలో ఎన్ని మార్పులు వచ్చినా కట్నకానుకల విషయంలో మాత్రం ఏలాంటి మార్పు రాలేదు. రోజులు గడుస్తున్న కొద్దీ కట్నం విలువ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. అబ్బాయి తరపున వారు లక్షల్లో అడుగుతుండటంతో కూతురు సంతోషంగా ఉంటే అదే చాలని భావించిన వధువు తల్లిదండ్రులు అప్పులు చేసి మరి కట్న కానుకలు ముట్టజెపుతున్నారు. తాజాగా పెళ్లి, కట్నం విషయంలో ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మీరట్ జిల్లా కంకర్‌ఖేరా పోలీస్ స్టేషన్ పరిధిలోని రోహతాలో ముప్పై ఏళ్ల యోగేష్ కుమార్ తన తల్లిదండ్రులతో నివాసముంటున్నాడు. అయితే ఆయన 26 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా పెళ్లికి ఓకే చెప్పారు. కానీ వధువు నుంచి భారీగా కట్నం కావాలని షరతు పెట్టారు. వధువు కుటుంబ సభ్యులు అంతగా ఇచ్చుకోలేమని చెబుతున్నా.. ఎంతకీ వినిపించుకోవడం లేదు. దీంతో పెళ్లి కాస్తా సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తోంది. చదవండి: జ్ఞానవాపి మసీదు వివాదం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు దీంతో కట్నం కారణంగా పెళ్లి వాయిదా పడుతోందని వరుడు తన తల్లిదండ్రులపై జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ‘నా గర్ల్‌ఫ్రెండ్ మా తల్లిదండ్రులను కాదని నన్ను పెళ్లిచేసుకోలేదు. అలాగే మా తల్లిదండ్రులు కట్నాన్ని తగ్గించేందుకు సిద్దంగా లేరు. వాళ్లు కేవలం డబ్బు మాత్రమే కాదు, ఇంట్లో వస్తువులు కూడా కావాలంటూ పెద్ద లిస్ట్ ఇచ్చారు. కానీ నా ప్రియురాలి కుటుంబం అంతగా ఆర్థికంగా ఉన్నవారు కారు. ఈ సమస్యకు పరిష్కారం చూపి, నా పెళ్లి జరిపించాలి’ అంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే దీనిపై విచారణ చేయాలంటూ మీరట్ జిల్లా ఎస్పీ కంకర్‌ఖేరా పోలీసులను ఆదేశించారు. యువకుడు తన తల్లిదండ్రులపై కొన్ని ఆరోపణలు చేశాడని, ప్రథమిక విచారణ అనంతరం ఎఫ్ ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయంపై యోగేష్ మాట్లాడుతూ.. అయిదుగురు అన్నదమ్ముల్లో నేను పెద్దవాడిని. నా తమ్ముళ్లందరు పెళ్లి చేసుకొని స్దిరపడ్డారు. 12 సంవత్సరాలుగా యువతిని ప్రేమిస్తున్నాను. తన చెల్లెలికి కూడా పెళ్లి అయిపోయింది. తల్లిదండ్రులు అధికంగా కట్నం ఇచ్చుకోలేరని తెలిసి యువతి ఇంకా నాకోసం ఎదురుచూస్తుంది. నేను కోర్టులో లేదా ఎప్పుడో ఇంటి నుంచి పారిపోయి ఆ అమ్మాయిని వివాహమాడొచ్చు. కానీ నేను అలా చేస్తే నా తమ్ముళ్లు కూడా అదే నేర్చుకున్నారు. అందుకే అలా చేయలేదు. నా తల్లిదండ్రులు నన్ను కొట్టి ఇంటి నుంచి బయటకు పంపించేశారు. నా సమస్యకు పోలీసులు పరిష్కారం చూపుతారని ఆశిస్తున్నాను’ అని తెలిపారు. కాగా తమ 30 ఏళ్ల పోలీస్ సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ రాలేదని ఓ పోలీస్ అధికారి తెలిపారు. అయితే మొత్తం ఈ విషయంపై యువకుడి తల్లిదండ్రులు ఏం స్పందించలేదు. చదవండి: Assam Floods: కొనసాగుతోన్న వరదల బీభత్సం.. 9 మంది మృతి -
మనువుల ‘రేవు’: వరుడికి తాళికట్టిన వధువు..
వజ్రపుకొత్తూరు రూరల్(శ్రీకాకుళం జిల్లా): శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామం గురువారం సామూహిక వివాహాలతో కళకళలాడింది. తరతరాలుగా వస్తోన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ 47 జంటలు ఒకే ముహూర్తానికి ఒక్కటై దాంపత్య జీవితంలో అడుగు పెట్టాయి. వరుడు తలవంచితే.. వధువు మూడు ముళ్లు వేసింది. చదవండి: చికెన్ 312 నాటౌట్.. చరిత్రలోనే ఆల్‌టైం రికార్డు -
వరుడి నిర్వాకం... ఊహించని షాక్ ఇచ్చిన వధువు
Father of a bride married her daughter to one of his relatives: ప్రతి ఒక్కరి జీవితంలోని అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. ఆ విషయాన్ని చాలా తేలిగ్గ తీసుకుని మద్యం మత్తులో చిందులేస్తూ ఉన్నాడు ఇక్కడొక వ్యక్తి. ముహుర్త సమయానికి చేరుకోకపోవడంతో వరుడికి ఊహించిన షాక్ ఇచ్చాడు పెళ్లి కూతురు తండ్రి. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మల్కాపూర్ పాంగ్రా గ్రామంలో పెళ్లి జరగాల్సి ఉంది. వధువు తల్లితండ్రులు పెళ్లికి కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. పెళ్లి మండపం వద్ద వరుడు రాక కోసం పెళ్లి కూతురు తరుఫు బంధువులంతా వేచి చూస్తున్నారు. ముహుర్తం సాయంత్రం నాలుగు గంటలకు ఐతే ఎనిమిదవుతున్న రాకపోయేసరికి వధువు తండ్రి బంధువులను సంప్రదించి వేరే వ్యక్తితో తన కుమార్తె వివాహం జరిపించాడు. ఇంతలో తాగుతు మండపానికి చేరిన వరుడు, అతని స్నేహితులు ఈ తంతు చూసి గొడవకు దిగారు. దీంతో వధువు తల్లిదండ్రులు ముహుర్త సమయానికి రాలేక పోవడంతోనే మా బంధువుల్లోని వ్యక్తితో వివాహం జరిపించామని తెగేసి చెప్పాడంతో చేసేదిలేక అవమానంతో వెనుదిరిగారు వరుడు తరుఫువారు. (చదవండి: సృష్టించిన వాడినే అంతం చేసేందుకు యత్నించిన మైక్రోవేవ్) -
అదృశ్యమైన కొత్త పెళ్లి కొడుకు
-
కొత్త పెళ్లికొడుకు ప్రాణం తీసిన శోభనం..?
సాక్షి, తాడేపల్లి రూరల్: ఓ నవ వరుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల ప్రకారం... మాచర్ల సాగర్ రింగ్‌రోడ్‌కు చెందిన సత్యనారాయణరాజు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు పత్తిగుడుపు కిరణ్‌కుమార్ (32)కు ఈ నెల 11వ తేదీ తెనాలి వించిపేటకు చెందిన యువతితో వించిపేటలో వివాహం జరిగింది. 12వ తేదీ భార్యను తీసుకుని మాచర్ల వెళ్లాడు. 16వ తేదీ మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. దీంతో తెనాలి వచ్చేందుకు బయలుదేరిన కిరణ్‌కుమార్ గుంటూరు బస్టాండ్‌లో నాలుగు గంటల సమయంలో దిగగానే ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. చదవండి: (బాలికతో వ్యభిచారం కేసులో మరో 10 మంది అరెస్ట్) రాత్రి అయినా రాకపోవడంతో అతని సెల్‌ఫోన్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్చాఫ్‌లో ఉండటంతో కిరణ్‌కుమార్ బంధువులకు సమాచారం అందించారు. అనంతరం తెనాలి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో మృతదేహం ఉందని తాడేపల్లి పోలీసులకు సమాచారం అందడంతో బయటకు తీసి పరిశీలించారు. పూర్తిగా కుళ్లిపోయి కనిపించింది. మృతుడి జేబులో ఉన్న సెల్ఫోన్లో సిమ్‌ను తీసి పరిశీలించి బంధువులకు సమాచారం ఇవ్వగా తల్లి విజయలక్ష్మి తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని తన కుమారుడేనని గుర్తించింది. ఫస్ట్‌నైట్ అంటే భయపడ్డాడని, వారి స్నేహితులు ధైర్యం చెప్పినప్పటికీ ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడి కట్టుకున్న భార్యను, మమ్మల్ని అన్యాయం చేశాడని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. జరిగిన ఈ సంఘటనపై తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ►మనిషికి ఉండేది ఒక్కటే జీవితం. ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
పెళ్లి వేడుకలో వరుడికి దిమ్మతిరిగే షాకిచ్చిన వధువు.. వీడియో వైరల్
లక్నో: ప్రతీరోజు సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫన్నీ వీడియోలు చూస్తుంటాం. అందులో పెళ్లికి సంబంధించిన కపుల్స్ ఫన్నీ వీడియోలు చాలానే చూసి ఉంటారు. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాసేపట్లో పెళ్లి జరగబోతోందని అందరూ ఎంతో సంతోషంగా ఉండగా.. వరుడికి వధువు షాకిస్తూ అందరి ముందే చెంపచెళ్లుమనిపించింది. దీంతో వరుడికి దిమ్మతిరింది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో జరిగిన వివాహ వేడుకలో వధువు... వరుడి చెంప చెళ్లుమనిపించింది. పెళ్లి మండపంలో వరువు.. వధువు మెడలో పూల దండ వేవబోతుండగా.. ఆమె ఒక్కసారిగా పెళ్లికొడుకు చెంపపై కొట్టింది. ఏకంగా మూడు, నాలుగు సార్లు చెంపవాయిస్తూనే ఉంది. దీంతో అక్కడున్నా వారంతా షాకయ్యారు. అనంతరం ఆమె పెళ్లి మండపం దిగి వెళ్లిపోయింది. ● A #video has surfaced in which a bride can be seen slapping the groom in #Hamirpur ● As per reports, the groom was in a drunken state that's why the bride took this step pic.twitter.com/C5Cg5zjQSj — Taaza TV (@taazatv) April 18, 2022 ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. వధువుపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పెళ్లిలో వరుడు మద్యం సేవించి ఉండటం వల్లే ఆమె ఇలా చేసిందని ట్విట్టర్ యూజర్ తెలుపగా.. వధువుకు ఈ పెళ్లి ఇష్టంలేకనే అలా చేసిందని ఆమె బంధువులు చెబుతున్నారు. ఇది చదవండి: ఏపీలో టూరిస్ట్ స్పాట్‌గా ఉబ్బలమడుగు.. బ్రిటిష్ కాలంలో ఎంతో ఫేమస్ -
మూడు రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలో వధువు..
తిరువొత్తియూరు: చెన్నై ఆవడిలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. చెన్నై ఆవడి గోవర్ధనగిరి నగర్‌కు చెందిన ఉదయ (24) ఎంబీఏ పూర్తి చేసి పూందమల్లి సమీపం కాట్టుపాక్కంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. ఇతను అదే కంపెనీలో పని చేస్తున్న పూందమల్లి కుమరన్ నగర్‌కు చెందిన బీఏ గ్రాడ్యుయేట్ అనిత (26)ను రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. విషయం తెలిసి అనిత తల్లిదండ్రులు కుమార్తెకు మరో యువకుడితో వివాహం చేయాలని నిర్ణయించారు. దీంతో అనిత ఈనెల 6వ తేదీన చెన్నై రాయపురంలో ఉన్న రిజిస్టర్ కార్యాలయంలో ఉదయను ప్రేమ వివాహం చేసుకుంది. వధూవరులు గోవర్ధనగిరి నగర్‌లోని ఉదయ ఇంటి మిద్దెపై ఉంటున్నారు. ఈ క్రమంలో అనిత శుక్రవారం రాత్రి ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న ఆవడి పోలీసులు అక్కడికి చేరుకుని అనిత మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం చెన్నై కీల్పాక్కం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆవడి పోలీసులు, తిరువళ్లూరు ఆర్డీవో విచారణ చేస్తున్నారు. మూడు రోజుల్లోనే నవవధువు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. -
వరుడి మెడలో నోట్ల దండ.. పక్కన ఫ్రెండ్ ఏం చేశాడంటే!
ఇటీవల పెళ్లి వీడియోలు వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. అయితే అందులో వరుడు, వధువు డ్యాన్స్‌లు, లేదా వింత ఆచారాలు పాటించడం లాంటివి వల్ల వైరల్‌గా మారి వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఓ పెళ్లిలో వరుడి మెడలోని కరెన్సీ దండ నుంచి కొన్ని నోట్లను అతడి స్నేహితుడు దొంగిలించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అందులో.. పెళ్లి తతంగం జరుగుతూ ఉంటుంది. అక్కడ కూర్చున్న వరుడి మెడలో బంధువులు కరెన్సీ దండలను వేసుంటారు. పెళ్లి కొడుకు అతిథులు ఏదో చెప్తుంటే బుద్ధిగా వింటుంటాడు. ఆ సమయంలో పక్కన కుర్చీలోనే కూర్చొన్న అతడి స్నేహితుడు ఆ కరెన్సీ దండల నుంచి చోరీకి ప్లాన్ వేస్తాడు. అనుకున్నదే తడువుగా అమలుకు ప్రయత్నిస్తాడు. అంతలో వరుడు అతని స్నహితుడి వైపు తలతిప్పి చూస్తాడు. ఆ వ్యక్తి వెంటనే ఎవరికీ అనుమానం రాకుండా తన చేతిని వెనక్కి లాక్కుంటాడు. అయితే వరుడు పెళ్లి తంతులో మళ్లీ బిజీ కావడంతో ఈ సారి కొన్ని నోట్లు దొంగలించి మెల్లగా తన ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. అయితే ఇదంతా ఆ పరిసరాల్లో ఉన్న ఒకరు వారి ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కూడా మిశ్రమంగా కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఆ గర్వం తలకెక్కింది.. ఇప్పుడు నేనేంటో తెలిసొచ్చింది: కచ్చా బాదామ్ సింగర్ -
పెళ్లి రోజునే..హంతకుడిగా మారిన పెళ్లికొడుకు
సాక్షి, ఆదిలాబాద్ (నిర్మల్ రూరల్): ఇరువురి మధ్య పాతకక్షలు పెళ్లిరోజున పెళ్లికొడుకును హంతకుడిగా మార్చాయి. ఆనందంగా సాగాల్సిన వివాహ బారాత్ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అప్పటి వరకు రెండు పెళ్లిళ్లతో సందడిగా ఉన్న ఆ గ్రామం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఇదంతా.. ఈనెల 23న రాత్రి దిలావర్పూర్ మండలం కాల్వతండాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు శనివారం జిల్లాకేంద్రంలోని తన కార్యాలయంలో డీఎస్పీ ఉపేంద్రరెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. ఆ రోజు ఏం జరిగిందంటే.. ఈనెల 23న కాల్వతాండకు చెందిన బానావత్ సాయికుమార్ వివాహం లోకేశ్వరం మండలం పుస్పూర్‌లో జరిగింది. అదే తండాకు చెందిన మెగావత్ రాజు పెళ్లి లోకేశ్వరం మండలంలోని నగర్తండాలో నిర్వహించారు. వివాహాల అనంతరం అదేరోజు రాత్రి కాల్వతండాలో రెండు పెళ్లిళ్లకు సంబంధించిన బారాత్‌లను వేర్వేరుగా నిర్వహించారు. బానావత్ సాయికుమార్, మెగావత్ రాజు కుటుంబాల మధ్య కొన్నేళ్లుగా భూతగాదాలు ఉన్నాయి. ఈక్రమంలో రాజు వాళ్ల కంటే తన బారాత్ బాగా జరగాలని సాయికుమార్ తన పదోతరగతి మిత్రులను పిలిపించుకున్నాడు. వారికి మద్యం తాగించాడు. రాత్రి 11గంటల సమయంలో బారాత్ అనంతరం సాయికుమార్ ఇంటికి చేరుకున్నాడు. రాజు బారాత్ తనకంటే బాగా జరగడంతో ఆగ్రహానికి లోనయ్యాడు. అప్పటికే వెళ్లిపోయిన తన డీజే వాహానాన్ని వెనక్కి రప్పించాడు. కావాలని రాజు వాళ్ల దగ్గరికి తీసుకువెళ్లి, సౌండ్ ఎక్కువ పెట్టి తన స్నేహితులతో డ్యాన్స్ చేశాడు. మధ్యలో వచ్చి ప్రాణాలు కోల్పోయి.. సాయికుమార్ విపరీతంగా డీజేసౌండ్ పెట్టడంతో కొంచెం తగ్గించుకోవాలని రాజు బంధువైన మెగావత్ నవీన్(26) వాళ్ల దగ్గరికి వచ్చి కోరాడు. అప్పటికే రాజుపై ఆగ్రహంతో ఉన్న సాయికుమార్ పాతకక్షలనూ దృష్టిలో ఉంచుకుని మధ్యలో వచ్చిన నవీన్‌తో గొడవపడ్డాడు. తన స్నేహితులతో కలిసి ఆయనను కిందపడేసి, కాళ్లతో తొక్కారు. దీంతో స్పహతప్పిన నవీన్‌ను కుటుంబసభ్యులు వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి, అప్పటికే నవీన్ చనిపోయాడని ధ్రువీకరించారు. మృతి చెందిన నవీన్‌కు భార్య, మూడేళ్లలోపు ఇద్దరు పిల్లలు ఉన్నారు. రెండు కుటుంబాల మధ్యలో ఉన్న పాతకక్షలు అమాయకుడైన నవీన్‌ను బలిగొన్నాయి. సీసీ కెమెరాల ఆధారంగా.. జిల్లాలో సంచలనం సృష్టించిన ఈ కేసులో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టినట్లు డీఎస్పీ వివరించారు. గ్రామంలోని సీసీకెమెరాల ఆధారంగా దర్యాప్తు చేశారు. ఈమేరకు నవీన్ మరణానికి కారకులైన బానావత్ సాయికుమార్, అతడి స్నేహితులైన పడిగెల భూమేష్, చినీట్ల దిలీప్, తుమ్మ సాయికుమార్, గాంధారి రాకేష్, చాçకపురం లక్ష్మణ్, నూక మహేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ వివరించారు. సుప్రీంకోర్టు నిబంధనలు పాటించాలి.. డీజే నిర్వాహకులు సుప్రీంకోర్టు నిబంధనలు తప్పకుండా పాటించాలని డీఎస్పీ తెలిపారు. ఉదయం 6నుంచి రాత్రి 10గంటల వరకు మాత్రమే డీజేలకు అనుమతి ఇస్తామన్నారు. డీజే ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పకుండా పోలీసుల అనుమతి తీసుకోవాలని సూచించారు. యువత క్షణికావేశంతో భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. కాల్వతండా ఘటనలో డీజేలను బైండోవర్ చేసి, కేసు నమోదు చేశామన్నారు. సమావేశంలో రూరల్ సీఐ వెంకటేశ్, దిలావర్పూర్, సారంగాపూర్ ఎస్సైలు పాల్గొన్నారు. -
పెళ్లి పీఠలపైనే పెళ్లి కూతుర్ని చితకొట్టిన పెళ్లి కొడుకు..!!
-
వైరల్ వీడియో: పెళ్లిలో వధువు చెంప చెళ్లుమనిపించిన వరుడు
ఇటీవల సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియోల్లో దాదాపు పెళ్లికి సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే వీటిలో కొన్ని డ్యాన్స్, ఎంజాయ్‌మెంట్‌తో సరదాగా ఉంటే మరికొన్ని పెళ్లిని పెటాకులు చేసే సీరియస్ వీడియోలూ ఉన్నాయి. తాజాగా పెళ్లిలో చోటుచేసుకున్న ఓ షాకింగ్ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కోపంతో ఊగిపోయిన వరుడు ఒక్కసారిగా వధువు చెంపపై లాగి ఒకటిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. పెళ్లి అనంతరం దండలు మార్చుకునే సందర్భంలో వరుడు, వధువు ఎదురెదురుగా నిల్చొని ఉన్నారు. ఇంతలో వుధువుకి వరుడు స్వీట్ తినిపిస్తుండగా.. ఆమె నిరాకరించింది. దీంతో అతను స్వీట్‌ను కోపంతో పెళ్లి కూతురు ముఖంపై విసిరాడు. పెళ్లి కొడుకు చేసిన పనికి కోపం తెచ్చుకున్న వధువు కూడా స్వీట్స్‌ను అతని ముఖంపై విసిరింది. ఇంకేముంది ఇప్పటికే కోపంతో రగిలిపోతున్న వరుడికి ఆవేశం మరింత ఎక్కువై అతిథులందరి ముందే పెళ్లి కూతురి చెంపచెళ్లుమనిపించాడు. చదవండి: అక్కడ యాక్సిడెంట్ ఫొటోలు, వీడియోలు తీస్తే జైలుకే! ఈ ఘటన ఎక్కడ జరిగిందో క్లారిటీ లేదు గానీ.. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఫేస్బుక్లో పోస్టు చేయగా 2 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. 23వేల లైకులు, 1500 కామెంట్లు వచ్చి చేరాయి. అయితే కొంతమంది వీడియోను చూసి నవ్వుకుంటుంటే మరికొంతమంది వధువును కొట్టే అధికారం వరుడికి లేదంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: సినిమా రేంజ్లో గాల్లోకి ఎగిరిపడ్డ ట్రక్! వైరల్ వీడియో -
అదుపు తప్పి నదిలో పడ్డ కారు.. వరుడు సహా 9 మంది మృతి
-
పెళ్లి దుస్తుల్లో పోలింగ్ కేంద్రానికి.. పెళ్లి కొడుకు ఏమన్నాడంటే..
లక్నో: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ గురువారం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రంలోని 11 జిల్లాలోని 58 నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో శామ్లీ, మీరట్, హాపూర్, ముజఫర్ నగర్, ఘజియాబాద్, అలీగడ్, ఆగ్రా, బాఘ్‌పత్, గౌతమ్ బుద్ధానగర్, మథుర, బులంద్ షహర్ జిల్లాలలోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి పెళ్లి దుస్తుల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. యూపీలోని ముజ్ఫర్ నగర్‌లోని ఓ పోలింగ్ బూత్ వద్ద ఈ సంఘటన జరిగింది. అంకుర్ బాల్యన్ అనే వ్యక్తి పెళ్లి నేడు. కొద్ది గంటల్లో తన పెళ్లి ఉన్నప్పటికీ.. ఓటు వేయడం బాధ్యతగా భావించి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు..ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందు ఓటు వేయడం ముఖ్యమని తెలిపారు. ఓటు తరువాతే పెళ్లి, భార్య, ఇంకే పనైనా అని బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పెళ్లి రోజు పోలింగ్ బూతుకు వచ్చి విధిగా ఓటు హక్కు వినియోగించుకున్న అంకుర్ బల్యాన్‌పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: వైరల్ వీడియో: రెస్టారెంట్లో ఉడుము ప్రత్యక్షం.. బోరున ఏడ్చిన మహిళ.. చివరికి! #WATCH | "Pehle matdaan, uske baad bahu, uske baad sab kaam," says Ankur Balyan, a bridegroom who had come to cast his vote at a polling booth in Muzaffarnagar ahead of his wedding today.#UttarPradeshElections2022 pic.twitter.com/KaYsv5s2Bb — ANI UP/Uttarakhand (@ANINewsUP) February 10, 2022 -
‘ఊ అంటావా మావా.. ఊహు అంటావా’ అంటున్న వధూవరులు..వీడియో వైరల్
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా బ్లాక్బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమాలోని బన్నీ నటన, పాటలు, డైలాగులకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుతూనే ఉన్నాయి. ఇక సమంత తొలిసారి ఆడిపాటిన ఐటమ్ సాంగ్ టాలీవుడ్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మార్పోగిపోతుంది. సోషల్ మీడియా, ఇన్‌స్టా రీల్స్ అన్నీంటిలోనూ ‘ఊ అంటావా మావా ఊహు అంటావా మావా’ అనే పాటనే ఊపేస్తోంది. తాజాగా ఓ పెళ్లిలో వధూవరులిద్దరూ ఈ పాటకు డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో రోనక్ షిండే, ప్రాచీ మోర్ అనే నూతన దంపతులు తమ పెళ్లి వేడుకలో ‘ఊ అంటావా మావా ఊహు అంటావా’ అంటూ డ్యాన్స్ చేశారు. సంప్రదాయ మరాఠీ పెళ్లి దుస్తులు ధరించి ఎంతో అందంగా ఎనర్జిటిక్‌గా స్టెప్పులేశారు. వీరిద్దరితోపాటు చుట్టూ బంధువులు కూడా డ్యాన్స్ చేసినప్పటికీ అందరిలోనూ వధువు డ్యాన్స్ స్టెప్స్ నెటిజన్లను బాగా ఆకర్షించింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఇప్పటి వరకు రెండు మిలియన్లకు పైగా వ్యూవ్స్ సంపాదించింది. వధువు డ్యాన్స్‌కు ఫిదా అయిన నెటిజన్లు ఆమెను ప్రశంసలతో మంచెత్తుతున్నారు. క్యూట్ కపూల్, క్రేజీ, లవ్లీ స్టెప్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.. చదవండి: ఇలాంటి ఆధార్ కార్డును ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియా ఫిదా View this post on Instagram A post shared by Chemistry Studios (@chemistrystudios) -
అరెరే ఎంతపనాయే.. బెడిసికొట్టిన వెడ్డింగ్ ఫోటోషూట్.. ఫోటోలు వైరల్
ప్రస్తుత కాలంలో ఫోటో షూట్లు సర్వసాధారణం అయిపోయాయి. వివాహాలు, పుట్టినరోజు, ఫంక్షన్లు ఇలా ఏ వేడుక అయినా ఫోటోషూట్ మరింత అందాన్ని తీసుకొస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలోని మధుర క్షణాలను భవిష్యత్తులో జ్జాపకంగా మలుచుకునేందుకు ఏకైక మార్గం ఫోటోలు, వీడియోలే.. ముఖ్యంగా ప్రతి జంట పెళ్లికి ముందు వెడ్డింగ్ షూట్లు నిర్వహించుకుంటున్నారు, మంచి లొకేషన్, క్యాస్టూమ్స్‌తో ఫోటోలు, వీడియోలకు రెడీ అవుతున్నారు. తాజాగా కజకిస్థాన్‌కు చెందిన ఓ జంట ఇలాగే ఆలోచించి వెడ్డింగ్షూట్ ఏర్పాటు చేసుకున్నారు. అయితే అద్భుతంగా ఊహించుకున్న వీరి ఫోటో షూట్ అంతే లెవల్లో బెడిసికొట్టింది. అసలేం జరిగిందంటే.. మురత్ జురాయేవ్, కమిల్లా అనే వధూవరులు పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబై ఫోటోషూట్ కోసం అవుట్డోర్ లొకేషన్‌కు వెళ్లారు. బ్లాక్ అండ్ వైట్ సూట్లో కెమెరాకు పోజులిస్తుండగా.. ప్రమాదవశాత్తూ కాలుజారి బురద గుంటలో పడిపోయారు. దీంతో వధువు తెలుపు రంగు గౌన్ అంతా బురదతో నిండిపోయింది. ఇక ఇక చేసేందేం లేక జరిగింది తల్చుకొని నవ్వూతూ అక్కడి నుంచి తిరగొచ్చేశారు. చదవండి: వైరల్: ఫోటోలో చిరుత ఎక్కడుందో గుర్తుపట్టండి.. కష్టంగా ఉందా? అయితే బురదలో పడిన దృశ్యాలను సైతం వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించాడు. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వీటిని చూస్తుంటే అనుకోకుండా బురదలో పడినట్లుగా కనిపించడం లేదు. కావాలనే బురదలో తీసుకున్నట్లు ఎంతో చక్కగా ఉన్నాయి. బురదలో పడిన సమయంలో ఇద్దరి ముఖాల్లో హావాభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. చదవండి: రాకాసి పీత!.. గోల్ఫ్ స్టిక్‌ని చెకోడీలు విరిచినట్లు పటపట విరిచేసింది! View this post on Instagram A post shared by 𝐀𝐒𝐊𝐀𝐑 𝐁𝐔𝐌𝐀𝐆𝐀 (@bumagaz) -
వధువు కంటే వరుడు పెద్దవాడయి వుండాలా!
రామాయణ కాలం నుంచీ వధూవరులు సమానమైన వయస్సు, నడవడి, శీలము, ఉత్తమ గుణాలు కలిగిన వారై ఉండాలని సీతారాముల అన్యోన్యార్హతను వివరిస్తూ వాల్మీకి రచించిన ‘తుల్యశీల వయో వృత్తాం...’ అనే శ్లోకం వల్ల తెలుస్తోంది. ఆ మాటకొస్తే సీత... రాముడి కంటే పెద్దదని జనశ్రుతి. కానీ ధర్మశాస్త్రాలలో వరుడు వధువు కంటే పెద్దవాడయి వుండాలనీ, వరహీనమైతే పురుషుడికి ఆయుఃక్షీణమనీ చెప్పారు. ఈ నియమం మన వివాహ వ్యవస్థలో అన్ని కులాలలోనూ పాటింపబడుతోంది. పెళ్లికూతురు కంటే పెళ్లికొడుకు కనీసం అయిదేళ్లయినా పెద్దగా ఉండాలనే ఆచారాన్ని నిన్నటి పురుషా ధిక్య సమాజం స్వార్థంతో దుర్వినియోగం చేసింది. ‘అష్ట వర్షాత్ భవేత్ కన్యా’ అని కన్యా లక్షణానికి హద్దుల్ని నిర్ణయించి ఆడపిల్లలకు ఎనిమిదేళ్ల లోపే పెళ్లి చేస్తే పుణ్యం వస్తుందని భావించారు. అలాంటి మూఢ విశ్వాసంతో శారదా చట్టం (1929లో బాలికల వివాహ వయస్సు 14 సంవత్సరాలు) అమలులో ఉన్న కాలంలో కూడా ఆ చట్టం వర్తించని ప్రదేశాలకు తీసుకెళ్లి బాలికలకు వివాహాలు చేశారు. ఇదే అదనుగా ముసలివాళ్లు కూడా కన్యాశుల్కాన్ని చెల్లించి ముక్కు పచ్చలారని పసిపిల్లలకు మూడుముళ్లు వేసి వాళ్ల భవిష్యత్తులను అంధకారమయం చేశారు. అలాంటి అభాగినులకు బాసటగా గురజాడ, కందుకూరి మొదలైన కవులూ, సంస్కర్తలూ నిలిచి బాల్య వివాహాలను రూపుమాపడానికీ, వితంతు వివాహాలను ప్రోత్సహించడానికీ కృషి చేశారు. బాల్య వివాహాల దురాచార దశ దాటిన తర్వాత కూడా ఆడపిల్లల అగచాట్లు అంతం కాలేదు. 1978లో ప్రభుత్వం అబ్బాయిలకు 21 ఏళ్లు, అమ్మాయిలకు 18 ఏళ్లు కనీస వివాహ వయస్సులుగా నిర్ణయించినా అమ్మాయిలు మైనర్లుగా ఉండగానే వాళ్ల ఇష్టా నిష్టాలతో సంబంధం లేకుండానే చాలామంది తల్లి దండ్రులు వాళ్లకు మూడుముళ్లు వేయించి బాధ్యత తీరిపోయిందనుకునేవారు. వయోభేదం కంటే జాత కాలకు ప్రాధాన్యాన్నిచ్చి పెళ్లికూతురు కంటే రెట్టింపు వయసున్న పెళ్లికొడుకులకు కూడా కట్టబెట్టేవాళ్లు. ‘కన్యాశుల్కం’ నాటకంలో అగ్నిహోత్రా వధాన్లు చెప్పినట్టు పెళ్లి కోసం యిచ్చే ఆ జాతకాల్లో కూడా నిజాలు ఉండేవి కావు. ఆస్తులు బయటకు పోకుండా ఉండాలని బలవంతంగా కట్టబెట్టిన మేనరికాలు... అక్క చనిపోతే వయసుతో తేడాను లెక్క చేయకుండా పిల్లల తండ్రి అయిన బావకు ముడిపెట్టిన రెండో పెళ్లిళ్లు... రెండో పెళ్లి వాడయినా మూడో పెళ్లి వాడయినా సంపన్నుడయిన అల్లుడు ముందుకొస్తున్నాడని అతని కూతురు వయసు కూడా లేని పడుచు పిల్లను కన్యాదానం చేసే పేద తల్లిదండ్రుల దీనావస్థకు చెందిన పెళ్లిళ్లు– ఇలా అనేక సందర్భాలలో గత్యం తరం లేక కన్నె పిల్లలు బలి పశువులయ్యేవారు! పైన పేర్కొన్న అన్ని రకాల పెళ్లిళ్లలోనూ వయస్సులో పెద్దవాళ్లయిన ‘మొగుళ్ల’ను కట్టుకుని ముద్దు ముచ్చట లేకుండా ‘అరిటాకు – ముల్లు’ సామెతగా జీవితంలో వసంతం లాంటి యవ్వనానికి దూరమైంది ఆడ పిల్లలే! కాలం మారింది. కన్యాశుల్కమే కాదు, వరకట్నం కూడా తగ్గుముఖం పట్టింది. ఆడపిల్లలు చదువుకొని మగవాళ్లతో సమంగా ఉద్యోగాలు చేస్తున్న వర్తమాన సమాజంలో సంప్రదాయ వివాహాలతో పాటు ప్రేమ వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు కూడా గణనీయంగానే జరుగుతున్నాయి. ‘జగత్తులో నేడు సగం దగాపడుట మానుకొంది’ అని దాశరథి గారన్నట్టు జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఆడపిల్ల అభిప్రాయం తెలుసుకోవలసిన అవసరమేమిటి అనే రోజులు పోయాయి. వివాహానంతరం కూడా భర్తతో సరిపడకపోతే నవ వధువు రాజీ ధోరణి విడిచి, విడాకుల కోసం కోర్టును ఆశ్రయిస్తోంది. ఈలోగా అవసరమైతే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడానికి కూడా వెనకాడటం లేదు. డేటింగులూ, సహజీవనాలూ కూడా మన వివాహ వ్యవస్థలో చొరబడిన ఈ కాలంలో ప్రేమ వివాహాలకు సంబంధించినంతవరకూ అమ్మాయి అబ్బాయి పుట్టిన తేదీ తెలుసుకుని ప్రేమించడం లేదు. పెద్దలు ఏర్పాటు చేస్తున్న పెళ్లిళ్లలో కూడా పెళ్లి కూతురు తన కంటే ఒకటి రెండేళ్లు మాత్రమే పెద్ద వాడయిన వరుణ్ణి కోరుకుంటోంది. పెద్దలు అంగీకరిస్తే అన్ని విధాలా అనుకూలమైన సంబంధమైతే పెళ్లికొడుకు ఒకటి రెండేళ్లు చిన్నయినా చేసుకోవడానికి సిద్ధమంటోంది. శాస్త్రీయ దృక్పథంతో ఆలోచిస్తే కొన్ని సందర్భాలలో జంట మధ్య స్వల్పమైన వయోభేదం వల్ల వచ్చే నష్టమేమీ లేదనిపిస్తోంది. ఆడపిల్ల అబ్బాయి కంటే శారీరకంగానూ, మానసికంగానూ త్వరగా ఎదుగుతుంది. ఇల్లు చక్కదిద్దుకునే నేర్పు, పరిణతి ఆడపిల్లకు తక్కువ వయస్సులోనే అలవడ తాయి గనుక పెళ్లికొడుకు కంటే పెళ్లికూతురు చిన్నదిగా ఉండాలనే నియమాన్ని మన పెద్దలు ఏర్పరిచి ఉండొచ్చు. వెయ్యి అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలనే ఆలోచనలకు కాలం చెల్లి, దాంపత్య జీవితంలో అపస్వరాలు వినిపించకుండా వివాహానికి ముందే అన్ని నిజాలూ చెప్పడం మంచిదనే అభిప్రాయాలు నేడు ఇరుపక్షాల్లోనూ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయసును మగవారితో సమంగా 21 ఏళ్లకు పెంచుతూ సవరణ బిల్లును తీసుకురావడం హర్షదాయకం. ప్రభుత్వం ఆదేశంతో పెద్దలు కూడా మారి వైవాహిక జీవితానికి ఈడూ జోడూ ముఖ్యమనే ఆడపిల్లల అభిప్రాయంతో ఏకీభవించి, వారిని ఆశీర్వ దిస్తారని ఆశిద్దాం. – పి. మానసారెడ్డి సామాజిక విశ్లేషకులు, దుబాయ్ (కేంద్ర ప్రభుత్వం ఆడపిల్లల కనీస వివాహ వయసును 21 ఏళ్లకు పెంచేలా బిల్లు తెచ్చిన సందర్భంగా) -
కట్నం డబ్బుతో వరుడు పరార్.. ఇంకెవరూ తనలా మోసపోకూడదని ఏం చేసిందంటే!
సాక్షి,సంగారెడ్డి అర్బన్: కట్నం డబ్బుతో వరుడు పరారవడంతో ఈనెల 12న జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది. కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వరుడు న్యాయవాది మాణిక్‌రెడ్డి కట్నం డబ్బులతో పరారయ్యాడని ఆరోపిస్తూ కంది మండలం చిమ్నాపూర్ గ్రామానికి చెందిన వధువు సింధురెడ్డి ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని రూరల్ పోలీస్ స్టేషన్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. తాను మోసపోయినట్లుగా ఎవరూ మోసపోకూడదని మూడు రోజులపాటు న్యాయపోరాటం చేసింది. వాట్సప్ గ్రూపుల్లో ప్రచారం, వధువు ఫిర్యాదు మేరకు వరుడిని పట్టుకొని పెళ్లికి ఒప్పంచినట్లు ఎస్ఐ సుభాష్ తెలిపారు. వివాహానికి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, కంది ఎంపీటీసీ నందకిషోర్, టీఆర్ఎస్ నాయకుడు కొత్తకాపు శ్రీధర్‌రెడ్డి, పలువురు న్యాయవాదులు, పెళ్లి పెద్ద దేవేందర్, ప్రకాశం హాజరయ్యారు. మరో ఘటనలో.. స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నూతన జిల్లాలలో ఉద్యోగుల వర్గీకరణలో భాగంగా స్థానికత ఆధారంగా ఉద్యోగా నియామకాలు చేపట్టాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సంఘం జిల్లా సమావేశంలో భూపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకున్నవారు ఇతర జిల్లాలకు వలసలు వెళ్లాల్సి రావడం ఇబ్బందికరమన్నారు. స్థానికంగా ఉన్న వారికి ఆ జిల్లాలోనే అవకాశం కల్పించాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. 317 జీవో స్థానిక ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు. అపరిష్కృతంగా ఉన్న ఎన్నో సమస్యలు ఉన్నా జీవో 317 ముందుకు తీసుకోచ్చి ఉపాధ్యాయులకు బలవంతంగా జిల్లాల కేటాయింపు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు రంగారావు, శ్రీధర్, శ్రీనివాస్, రవీందర్‌రెడ్డి, ఉండ్రాళ్ల రాజేశం, గురువయ్య, యాదగిరి, ఎల్లయ్య, రాజు, శ్రీనాథ్, రాములు, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: కిక్కులేకుంటే రోడ్డెక్కలేరా.. గాడితప్పుతున్న జీవితాలు -
వరుడ్ని చితకబాదిన వధువు బంధువులు.. అసలు ఏం జరిగిందంటే..
లక్నో: వరకట్న వేధింపులు అనేవి పురాతన కాలం నుంచి ఆడపిల్లలను, వారి తల్లిదండ్రులను పట్టి పీడిస్తున్న సమస్య. ఇవే వేధింపులు ఎక్కువగా మారి హత్యలు, ఆత్మహత్యలకు దారితీసిన ఘటనలు కూడా బోలెడు ఉన్నాయి. తాజాగా ఓ వరుడు అదనపు కట్నం కావాలని అడిగినందుకు పెళ్లి మండపలోనే వధువు తరపు బంధువులు చితకబాదారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ముందు చెప్పిన దానికంటే వరుడి తండ్రి కట్నంగా రూ. 10 లక్షలు ఇవ్వాలని వధువు తల్లిదండ్రులను డిమాండ్ చేశాడు. అడిగిన మొత్తాన్ని ఇవ్వకపోతే పెళ్లిని రద్దు చేస్తానని బెదిరించాడు. అయితే వధువు కుటుంబీకులు ఇప్పటికే రూ.3 లక్షల నగదు, రూ.లక్ష విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారు. అయితే అది సరిపోదని తాము అడిగినంత ఇవ్వాల్సిందేనంటూ వరుడు తండ్రి పట్టుబట్టారు. పెండ్లి సజావుగా జరగాలని వధువు తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. వరుడితోపాటు అతని కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన పెండ్లి కుమార్తె కుటుంబ సభ్యులు పెండ్లి కొడుకుపై దాడి చేశారు. అందరు చూస్తుండగానే ఆ వరుడిని చితకబాదారు. ఇదంతా కొందరు వీడియోలో చిత్రీకరించగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్లి వరుడి కుటుంబం కేసు నమోదైంది. చదవండి: Vicky Kaushal: పెళ్లైన పది రోజులకే.. ఏంది భయ్యా? విక్కీ కౌశల్‌కు నెటిజన్ల ప్రశ్నలు -
పెళ్లిలో ముద్దాడిన వరుడు, వధువు.. చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోయి
ఒకప్పటి కాలంలో పెళ్లి అయ్యే వరకు వధువు, వరుడికి అస్సలు పరిచయం ఉండేది కాదు. పెళ్లి మండపంలోనే ఒకరినొకరు చూసుకునే పద్దతులు ఉండేవి. కానీ కాలం మారింది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లతోపాటు లవ్ మ్యారేజ్లు, పెళ్లికి ముందే డేటింగ్లు, లివింగ్ ఇన్ రిలేషన్లు పుట్టుకొచ్చాయి. ఎన్ని మారినా పెళ్లి జరిపించే పద్దతులు మాత్రం మారలేదు. ఎవరి సాంప్రదాయలు, పద్దతులకు అనుగుణంగా పెళ్లిలు జరిపిస్తున్నారు. తాజాగా హిందూ ఆచారం ప్రకారం జరుగుతున్న ఓ పెళ్లిలో వరుడు వధువుని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. వీడియోలో పెళ్లితంతును ముగించిన తురువాత వధువుని ముద్దు పెట్టుకోవాలని మండపం వద్ద ఉన్న అతిథులు వరుడిని కోరారు. దీంతో పెళ్లి వేదిక వద్ద కుటుంబ సభ్యలు, బంధువులు ఉన్నప్పటికీ సిగ్గుపడకుండా వరుడు, పెళ్లి కూతురు ముఖాన్ని దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టాడు. వధువు కూడా వరుడు వద్దకు జరిగి అతని భుజంపై చేతులు వేసి కిస్ చేసింది. చదవండి: Viral Video: మోడల్స్‌ను జంతువులుగా చూపించారు.. తీవ్ర విమర్శలు రావడంతో.. తమ చుట్టూ మనుషులు, కెమెరాలు ఉన్న విషయం మర్చిపోయి ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఇప్పుడు అన్నీ పెళ్లిళ్లో ఇలాంటివి కామన్ అయపోయాయని మద్దతిస్తుంటే.. మరికొందరు ఏంటి ఈ దారుణం.. పెళ్లి అయ్యే వరకు కూడా ఆగాలేరా.. పద్దతులను మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు..అంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.. చదవండి: ఓరి నీ యేషాలో.. యాపిల్ పకోడీ అట! వీడియో వైరల్ View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_viralclips) -
గుర్రపు బండిపై వరుడి ఊరేగింపు.. ఒక్కసారిగా మంటలు చుట్టుముట్టడంతో..
గాంధీనగర్: సాధారణంగా వివాహాలంటే పెళ్లి ఊరేగింపులు, బరాత్‌లు, సందడి డీజేలు సహజం. ఎందుకుంటే జీవితంలో మనం జరుపుకునే ముఖ్యమైన కార్యక్రమాలలో పెళ్లి కూడా ఒకటి. అందుకే ఆ వేడుక ఎప్పటకీ గుర్తుండిపోవాలని ఇలాంటి హంగామాలు ఏర్పాటు చేసుకుంటారు. అయితే అలాంటి పెళ్లి రోజే అనుకోకుండా ఓ విషాదకర ఘటన గుజరాత్‌లోని పంచమహల్ జిల్లాలో చోటు చేసుకుంది. తన పెళ్లి రోజు ఆనందం ఎప్పటికీ గుర్తుండి పోవాలనుకున్న ఆ వరుడికి చేదు జ్ఞాపకంగా మారింది. అసలు ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే? ఓ వరుడి గుర్రపు బండిలో పెళ్లి ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఊరేగింపు అంటే తెలిసిందే.. ధూంధాంగా డాన్స్‌లు, డీజే, ఒకటే సందడి సందడిగా ఉంటుంది. వీటితో పాటు కొందరు బాణసంచాలు పేలుస్తూ ముందుకు కదులుతున్నారు. అయితే కొన్ని బాణాసంచాలు వరుడి గుర్రపు బండిలో కూడా ఉండడంతో అంతలో ఓ టపాకాయి అనుకోకుండా వెళ్లి వరుడి బండిలో పడింది. దీంతో అందులో ఉన్న టపాకాయిలు ఒక్కసారి పేలడంతో ఆ బండి మంటలో మొదలయ్యి, క్షణాల వ్యవధిలో బండి మొత్తం మంటలు వ్యాపించాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను అదుపు చేయడంతో ప్రమాదం నుంచి వరుడితో పాటు అందులో ఉన్న చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారు. అలాగే బండి నుంచి గుర్రాలను సైతం విడదీసి, నీటిని చల్లి మంటలను ఆర్పి వేశారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. A horse carriage caught fire during a wedding procession in #Gujarat's Panchmahal. The groom had a narrow escape but no one was injured in the incident. pic.twitter.com/vsryXvWYFD — India.com (@indiacom) December 15, 2021 చదవండి: వేల కిలోమీటర్ల నుంచి వస్తున్నాం.. కొన్ని రోజులు ఉండి వెళ్లిపోతాం.. ప్లీజ్! -
పెళ్లిలో బళ్లాలదేవ సింహాసనంపై ఊరేగిన వరుడు.. వీడియో వైరల్
ప్రతి ఒక్కరూ తమ పెళ్లిని జీవితంలో ఎప్పటికీ తీపి జ్జాపకంలా గుర్తిండిపోయేలా జరుపుకోవాలనుకుంటారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు అందరి సమక్షంలో వైభవంగా సంబరాలు చేసుకుంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం పెళ్లిళ్లలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈతరం యువత కొంచెం ట్రెండ్ మార్చి కొత్తగా ట్రై చేస్తున్నారు. మెహందీ పార్టీ, హల్దీ ఫంక్షన్, డ్యాన్స్‌లతో హడావిడీ చేస్తున్నారు. . తాజాగా ఓ కుంటుంబం తన కొడుకుని పెళ్లి వేడుకలను వినూత్నంగా నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వరుడిని పెళ్లి ఊరేగింపులో భాగంగా ద్వారకాతిరుమలలో కేరళ సంప్రదాయంలో వాయిద్యాలను ఏర్పాటు చేశారు. అంతేగాక పెళ్లి కుమారుడుని బాహుబలి సినిమాలో బళ్లాల దేవుడు సింహాసనంపై కూర్చోబెట్టారు. ఈ సింహాసనంపై వరుడు ఊరేగింపుగా వెళుతుంటే అక్కడున్న వారంతా అతన్ని ఆశ్చర్యంగా చూశారు. అయితే వరుడికుటుంబ సభ్యులు మాత్రం ఇలా తీసుకెళ్లినందుకు గర్వంగా ఫీలవుతున్నారు. తమ ఇంటి పెళ్లి సందడిలో ప్రత్యేకత ఉండాలని, అందుకే ఇలా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చదవండి: పెరుగు కోసం ట్రైన్ ఆపిన లోకో పైలట్, తరువాత ఏం జరిగిందంటే.. చదవండి: సెల్ఫీ పిచ్చి...జాలి పడాలా? మీరే చూడండి! -
మరో వ్యక్తితో ప్రేయసి పెళ్లి.. సడెన్‌గా మాజీ ప్రేమికుడి ఎంట్రీ.. చివరికి
లక్నో: నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు సినిమా స్టోరీలకు ఏమాత్రం తీసిపోవు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పెళ్లిలో సినిమాను మించి పోయే ఘటన చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో బంధు మిత్రుల సమక్షంలో వివాహా వేడుక జరుగుతోంది. ఇంతలో పెళ్లి మండపంలోకి కండువా కప్పుకున్న ఓ యువకుడు సడెన్‌కు ఎంటర్ అయ్యాడు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటుండగా వెంటనే వారి మధ్యలోకి దూరి వధువు నుదుటిపై కుంకుమ దిద్దడానికి ప్రయత్నించాడు. చదవండి: రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!! ఇది గమనించిన వధువు తన ముఖంపై పరదా కప్పుకునేందుకు ప్రయత్నించగా, బలవంతం ఆమె నుదుటిపై సింధూరాన్ని దిద్దాడు. పెళ్లి వేడుకను ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే వధువుకి కుంకుమ దిద్దిన వ్యక్తి ఆమె మాజీ ప్రేమికుడని తెలిసింది. అతను కొన్ని నెలల క్రితం పని నిమిత్తం వేరే ఊరుకువెళ్లాడు. ఇంతలో తన ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్న యువకుడు హుటాహుటినా మండపానికి చేరుకున్నాడు. తన ప్రేయసి పెళ్లి పెళ్లి ఆపేందుకు ఇలా ప్లాన్ చేయగా.. చివరికి యువకుడిని పట్టుకొని బంధువులు చితకబాదారు. అయితే ఈ రచ్చ అక్కడితో ముగియలేదు. ఇదంతా జరిగిన మరుసటి రోజు పెద్దలు కుదిర్చిన వరుడితోనే యువతి పెళ్లి జరిగింది. మరోవైపు చేసేందేం లేక మాజీ ప్రియుడు సైతం తన ఇంటికి వెళ్లి పోయాడు. చదవండి: గూగుల్‌లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా? -
వరుడికి చేదు అనుభవం.. వాంతి చేసుకుని కళ్లు తిరిగిపడిపోయిన వధువు
వాషింగ్టన్: పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో అందమైన మధుర జ్ఞాపకం. వివాహ వేడుకను జీవితాంతం మరచిపోలేని అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలని కలలు కంటారు. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఇక పెళ్లి అంటే బోలేడు పనులు. ఇంట్లో సాయం చేసేవారు ఎవరు లేకపోతే.. పాపం కాబోయే వధువరులే ఆ పనులన్ని చూసుకోవాలి. ఇలా పనుల ఒత్తిడిలో పడి అలసిపోతే.. ఎలాంటి చేదు అనుభవాలు ఎదురవుతాయో ఈ వార్త చదివితే తెలుస్తుంది. ఈ జంటకు ఎదురైన కష్టాలు చూస్తే.. పాపం వీరంత దురదృష్టవంతులు ఈ భూమ్మీద ఇంక ఎవరు లేరనిపిస్తుది. ఆ వివరాలు.. అమెరికా, మిన్నెసోటాకు చెందిన హోలీ లిన్నియా-కోలెండా డార్నెల్లు వివాహం చేసుకుందామని భావించారు. డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఇక పెళ్లి పనులన్ని వారిద్దరే చక్కబెట్టుకున్నారు. పెళ్లికి ఒకరోజు ముందు వరకు కూడా వారు పనులతో బిజీగానే ఉన్నారు. పెళ్లి నాడు ఉదయం హోలీకి చాలా అలసటగా అనిపించడంతో పాటు కాస్త అనారోగ్యంగా కూడా అనిపించింది. దీని గురించి కాబోయే భర్తకు చెప్పింది. కానీ అతడు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. (చదవండి: మహిళా వెడ్డింగ్ ప్లానర్స్ ఆకాశమే హద్దు...) మరికొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని.. ఇప్పుడు అనారోగ్య కారణంగా దాన్ని వాయిదా వేయడం బాగోదని భావించింది హోలీ. ఎలాగోలా ఓపిక చేసుకుని.. రెడీ.. అయ్యి మంటపానికి వచ్చింది. అప్పటికే ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. పెళ్లి తంతు జరుగుతుండగా.. హోలీకి కళ్లు తిరిగాయి. కిందపడిపోతుండగా.. ఆమె కాబోయే భర్త పట్టుకున్నాడు. ముఖం మీద నీళ్లు చల్లితే హోలీ స్పృహలోకి వచ్చింది. దాన్నుంచి తేరుకునేలోపే ఆమెకు వాంతికి అయ్యింది. బయట బాగా వేడిగా ఉండటం వల్లనే హోలీకి ఇలా అయి ఉంటుందని భావించిన ఆమె సోదరి.. ఫ్యాన్ ఆన్ని చేద్దామని పైకి లేచింది. ఈ క్రమంలో చేతిలో ఉన్న పిల్లాడిని హోలీకి అప్పగించి ఆమె ఫ్యాన్ దగ్గరకు వెళ్లింది. వాడికి అప్పుడే గుర్తొచ్చిందేమో.. పెళ్లి కుమార్తె అని కూడా చూడకుండా.. హోలీ మీద మల విసర్జన చేశాడు. జరిగిన అన్ని సంఘటనలతో హోలీకి ఒకలాంటి విరక్తి కలిగింది. (చదవండి: మరికొద్ది నిమిషాల్లో పెళ్లి .. కారు దిగగానే వధువుకు షాక్!) త్వరగా పెళ్లి తంతు ముగుంచుకుని.. ఆస్పత్రికి వెళ్లింది హోలీ. ఆమెను పరీక్షించిన వైద్యులు.. లో బీపీ, రక్తహీనతతో బాధపడుతుందని.. అందుకే కళ్లు తిరిగి పడిపోయిందని తెలిపారు. ఇక విహానికి ముందు బాగా అలసిపోవడం.. ఆ రోజంతా నీళ్లు తాగకుండా ఉండటం వల్ల డీహైడ్రేషన్‌కు గురై వాంతి చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా హోలీ దంపతులు మాట్లాడుతూ.. ‘‘పెళ్లి అంటే అందరికి చాలా మంచి అనుభూతులు ఉంటాయి. మాకు ఎదురైన అనుభవాలు తల్చుకుంటే.. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం అలా జరిగిపోయింది. ఇప్పుడే ఇవే సంఘటనలను మా ముందు తరాలకు చెప్పాలి. కనీసం వారు అయినా జాగ్రత్త పడతారు’’ అని చెప్పుకొచ్చారు. చదవండి: ఖాకీలు చేసిన కల్యాణం: 'ఒకరిని విడిచి, మరొకరం ఉండలేమని..' -
మరికొద్ది నిమిషాల్లో పెళ్లి .. కారు దిగగానే వధువుకు షాక్!
పట్నా: సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించుకుంటారు. దీనికోసం బంధువులు, స్నేహితులను ఆహ్వానించి అంగరంగ వైభవంగా వివాహ వేడుకను నిర్వహిస్తారు. అయితే, ఒక్కొసారి పెళ్లివేడుకలలో అనుకోకుండా విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటాయి. బిహార్‌లో జరిగిన పెళ్లింట విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోని వచ్చింది. పశ్చిమ చంపారన్ జిల్లాలోని బెట్టియా పరిధిలోని చరద్వాలి గ్రామానికి చెందిన చందేశ్వర్ కుమారుడు మనీష్ గిరికి, యోగాపట్టిలోని అమేథియా గ్రామానికి చెందిన చందా అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. గత సోమవారం (నవంబరు29)న ఆడపెళ్లివారింటికి.. మగ పెళ్లివారు ఊరేగింపుగా వచ్చారు. వధువు తరపువారు పెళ్లి ఏర్పాట్లను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో.. పెళ్లి కొడుకు, పెళ్లికూతురు కారులో ఊరేగింపుగా బ్యాండ్ మేళంతో మండపానికి చేరుకున్నారు. బంధువులు, స్నేహితులంతా పెళ్లి వేడుకను ఉల్లాసంగా చూస్తున్నారు. అందరి కళ్లు కొత్త జంటను ఆసక్తిగా చూస్తున్నారు. అందరు చూస్తుండగానే కారునుంచి దిగిన వరుడు.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడివారు షాకింగ్‌కు గురయ్యారు. కళ్లు తిరిగి పడుంటారని అందరు భావించారు. వరుడి ముఖంపైన నీళ్లు చల్లారు. ఎంత సేపటికి వరుడు లేవకపోవడంతో వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. వరుడిని పరిశీలించిన వైద్యులు.. అప్పటికే గుండెపోటుతో చనిపోయినట్లు తెలిపారు. కనీసం కాళ్ల పారాణి కూడా ఆరకముందే వరుడు చనిపోవడంతో పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఈ సంఘటన తెలిసి వధువు కూడా కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. -
హ్యాపీ ఫ్రేమ్స్: వెడ్డింగ్ హాల్‌కు వెళుతూ వెరీ క్యూట్ డ్యాన్స్!
‘మాకు డ్యాన్స్ అంటే ప్రాణం.. మాకు అవకాశం రావాలే కానీ డ్యాన్స్‌తో హావభావాల్ని ఇట్టే పలికించగలం. ఇదొక కళ.. ఏ ఒక్కరికో పరిమితమైంది కాదు.. డ్యాన్స్‌తో పరవశించపోగలం.. పరవశించేలా చేయగలం అంటున్నారు నేటితరం పెళ్లికూతుళ్లు. ఇటీవల కాలంలో జరుగుతున్న పెళ్లిల్లో పెళ్లి కూతుళ్లు తమ డ్యాన్స్‌తోనే ఆ వేడుకకు ఒక అందం తీసుకువస్తున్నారు.. ఇప్పుడు భారత్‌లో ఇదొక ట్రెండ్‌గా మారిపోయిందంటే అతిశయోక్తి కాదేమో. తాజాగా ఓ పెళ్లి కూతురు డ్యాన్స్ చేసి తనలోని కళాకారిణిని బయటకు తీసుకొచ్చింది. తమ కుటుంబ సభ్యులతో పెళ్లి మండపంలోకి వెళుతూనే క్రేజీ క్రేజీ డ్యాన్స్‌తో ఆకట్టుకుంది వధువు. వెడ్డింగ్ స్టేజ్‌పైకి వెళ్లే సమయంలో అలా నడుచుకుంటూ వెళుతూ పెళ్లి కొడుకును చూస్తూ బాలీవుడ్ మూవీ ‘సీక్రెట్ సూపర్ స్టార్’ లోని ఓ సాంగ్‌కు సొగసైన డ్యాన్స్ వేసింది వధువు. అదే సమయంలో పెళ్లి పీటలపై కూర్చొన్న వరుడు.. ఆమెను చూస్తూ మురిసిపోతాడు. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. పెళ్లి మండపానికి వచ్చిన వధువుకు మోకాళ్లపై కూర్చొని రింగ్‌ను తొడుగుతాడు పెళ్లికొడుకు. ఆ సమయంలో వరుడ్ని కాసేపు ఆట పట్టించిన ఆ వధువు చివరకు రింగ్ తొడిగించుకుంటుంది. View this post on Instagram A post shared by Happyframes (@happyframes_) -
వైరల్: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ బొక్కబోర్లా పడ్డ వధూవరులు..
పెళ్లిలో పెళ్లి కూతురు సిగ్గు పడుతూ కూర్చునే రోజులు పోయాయి. ట్రెండ్ మారింది. తల వంచుకుని అడుగులో అడుగు వేసుకుంటూ, పెళ్లి పీటలమీద కూర్చునేది వధువు.. ఇప్పుడు సంగీత్‌లో, పెళ్లిలో స్టెప్పులతో ఇరగదీస్తున్నారు. పెళ్లి కూతురికి తానేం తక్కువ తీసిపోకుండా వరుడు సైతం డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో పెళ్లిలో డ్యాన్స్ వీడియోలు కామన్‌గా మారిపోయాయి. ఈ క్రమంలో ఓ జంట కూడా పెళ్లికి వచ్చిన వారందరిని సందడి చేయాలని అనుకుంది. ఇందుకు పెళ్లి దుస్తుల్లో ముస్తాబై కుటుంబ సభ్యుల మధ్య డ్యాన్స్ వేశారు. చదవండి: వైరల్: నీళ్లలో పాముల సయ్యాట.. ఒళ్లు జలదరించాల్సిందే కొత్త దుస్తుల్లో మెరిసిపోతూ ఒకరి కళ్లల్లో మరొకరు చూస్తూ నెమ్మదిగా డ్యాన్స్ వేయడం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్న ఇక్కడే పొరపాటు జరిగింది. వధూవరులిద్దరూ కలిసి రొమాంటిక్‌గా డ్యాన్స్ చేస్తుండగా పొరపాటున కాలు జారీ.. స్టేజీ మీద నుంచి పడిపోయారు. ఊహించని విధంగా జరగడంతో అతిథులంతా షాకయ్యారు. ఈ సంఘటన ఎక్కడ జరిగింది తెలియరాలేదు గానీ.. దీనికి సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్‌గా మారింది. చదవండి: గిఫ్ట్ బాక్స్ చూసి షాక్ అయిన వధువు.. ఇంతకీ అందులో ఏమందంటే..! View this post on Instagram A post shared by 🇭🇹 MARIE BLANCHARD🇭🇹 (@haitianbeauty25) -
Viral Video: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి..
-
వైరల్: వరుడిని చూసి పట్టరాని సంతోషం.. గాల్లో ముద్దులు పంపి..
పెళ్లి.. ఈ రెండక్షరాల పదం రెండు వ్యక్తుల జీవితాలను ఎల్లకాలం ముడిపెడుతుంది. రెండు కుంటుంబాలను ఒక్కటి చేసుంది. ముఖ్యంగా అమ్మాయిల జీవితంలో పెళ్లి అనేది కొత్త సవాళ్లకు నాంది పలుకుతుంది.. అత్తారిల్లు అనే కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసి ఎన్నో బంధాలు, బాధ్యతలను నేర్పుతోంది. అలాంటి పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతిగా నిలిచిపోవాలనే అందరూ కోరుకుంటారు. చదవండి: వైరల్: ‘వార్నీ ఎంత అన్యాయం.. చేతులతో ఎత్తి పైకి పంపిస్తే.. చేయిచ్చారు’ ఇప్పుడిదంతా ఎందుకంటే తాజాగా పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో హడావిడీ చేస్తోంది. అసలిందులో ఏముందంటే.. పెళ్లి కోసం అందంగా ముస్తాబైన వధువు తనకు కాబోయే వాడికోసం ఆత్రుతగా ఎదురుచూస్తూ ఉంటుంది. అంతలోనే మగపెళ్లి వారంతా వధువు ఇంటి వద్దకు చేరుకుంటారు. ఊరేగింపుతో వరుడు వస్తుండగా బాల్కనీలో నుంచి చూస్తూ పెళ్లి కూతురు తెగ సంబరపడిపోతుంటుంది. చదవండి: వైరల్: మనోడి లక్ బాగుంది.. లేకుంటే క్షణాల్లో ప్రాణాలు గాల్లోకి..! అయితే ఆమెను వరుడు చూడకపోవడంతో అక్కడున్న వేరే వారికి సైగలు చేసి చివరికి అతను చూసేలా చేస్తుంది. ఇంకేముంది వరుడు చూడటంతో సంతోషం పట్టలేక గాల్లో అతనికి ఫ్లైయింగ్ కిసెస్ ఇస్తూ తన ప్రేమను తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను ఓ వెడ్డింగ్ పేజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరలవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘హార్ట్ ఎమోజీని జతచేస్తూ, వారిద్దరు ఎంతో అదృష్టవంతులు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. -
వైరల్: పెళ్లిలో వధువు సర్ప్రైజ్ డ్యాన్స్.. ఎమోషనల్ అయిన వరుడు
నిజమైన ప్రేమను ఏ రూపంలో వ్యక్తపరిచినా అది ఎదుటివారికి తప్పక చేరుతుంది. ప్రతి పనిలోనూ మనం చూపించే ప్రేమ వారి హృదయాలను తాకుతుంది.. ఆ ప్రేమను పొందే ఆనంద క్షణాలు మాటల్లో వర్ణించలేనివి. సరిగ్గా ఇలాంటి దృశ్యమే ఓ పెళ్లిలో చోటుచేసుకుంది. ఎక్కడ, ఎప్పుడూ జరిగిందో తెలియదు కానీ ఓ వివాహ వేడుకలో వధువు తన ప్రేమను వరుడికి తెలిపి అతన్ని ఆశ్చర్యపరచాలని అనుకుంది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన పెళ్లి కూతురు నేను నీ దాన్ని అనేలా ఓ పాటకు వరుడు ముందు డ్యాన్స్చేసింది. సర్దార్ కా గ్రాండ్సన్ సినిమాలోని ‘మెయిన్ తేరి హో గయి’ పాటకు స్టెప్పులేసింది. చదవండి: ఫ్రెండ్స్‌తో కలిసి స్టెప్పులేసిన వధువు.. వావ్ వాట్ ఏ డ్యాన్స్ అంటున్న నెటిజన్స్! అయితే వధువు ఇచ్చిన సర్ప్రైజ్తో వరుడు మెస్మరైజ్ అయ్యాడు. భార్య డ్యాన్స్ చూసిన వరుడు ఎమోషనల్ అయ్యాడు. ఆనందంతో కంటనీరు పెట్టుకున్నాడు. అనంతరం వధువు వుడిని చేయిపట్టుకొని స్టేజ్ మీదకు తీసుకెళ్లి కన్నీళ్లు తుడిచింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వరుడి భావోద్వేగం విలువకట్టలేనిదని.. క్యూట్ కపుల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: Viral Video: డ్యాన్స్ ఇరగదీసిన వధువు.. అంతా ఫిదా, అయితే వరుడు మాత్రం..! View this post on Instagram A post shared by WedAbout.com (@wedabout) -
Viral: ‘వధువును అవమానించిన వరుడు.. విడిపోవటం మంచిది’
వివాహ వేడుకలో వధువరులు ఉత్సాహంగా ఉంటూ.. అన్ని కార్యక్రమాల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తారు. వధువు, వరుడు ప్రవర్తించే తీరు.. వివాహానికి వచ్చినవారికి కూడా ఉత్సాహన్ని కలిగిస్తుంది. వధువరులు ఇద్దరూ ఒకరిపైఒకరు సంతోషంతో పెళ్లి వేడుకలోనే ప్రేమను కురిపిస్తారు. అయితే కొంతమంది మాత్రం పెళ్లిలో విచిత్రంగా ప్రవర్తిస్తారు. అలా ప్రవర్తించిన వధువరుల వివాహాలు మధ్యలోనే ఆగిపోయినట్లు పలు వార్తల్లో చూశాం. కొన్ని జంటల్లో తమకు వివాహం జరుగుతుందన్న ఆసక్తి అసలు కనిపించదు. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో వధువుపై వరుడు ప్రవర్తించిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన రిషెప్షన్ వేదికపై పెళ్లి దండలు మార్చుకునే క్రమంలో పెళ్లి కొడుకు విచిత్రంగా ప్రవర్తించాడు. ఇద్దరు వేదికపై నిల్చోని ఉంటారు. మొదటిగా పెళ్లి కూతురు.. వరుడి మెడలో దండ వేసి అలా నిల్చోని ఉంటుంది. అనంతరం వరుడు దండ వేయటం ఇష్టం లేదన్నట్లుగా దూరం నుంచే వధువుపైకి విసురుతాడు. దీంతో ఆ పూల దండ కిందపడుతుంది. ఇంత జరిగినా వధువు మాత్రం ఎటువంటి స్పందన లేకుండా మౌనంగా అలా నిల్చుండి పోయింది. ఈ ఘటనను చూసిన వివాహానికి వచ్చినవాళ్లు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే ఈ వీడియోను అఫిషియల్ వైరల్ క్లిప్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 8వేల మంది వీక్షించారు. ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు వరుడు ప్రవర్తించినపై కామెంట్లు చేస్తున్నారు. ‘వరుడు.. వధువును అవమానించాడు’, ‘వరుడు చాలా దారుణమైన వ్యక్తిగా ఉన్నాడు.. మీరు ఇప్పుడే విడిపోవటం మంచిది’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_viralclips) -
అప్పగింతల వేళ వెక్కివెక్కి ఏడ్చిన పెండ్లి పిలగాడు
వివాహ వ్యవస్థకు మన సమాజంలో చాలా ప్రాధాన్యత ఉంది. పెళ్లి వేడుక అంటే మన దగ్గర ఎంత లేదన్నా.. మూడు, నాలుగు రోజలు పాటు కొనసాగుతుంది. ఇక పెళ్లి ఇంట్లో సరదాలు, సందళ్లకు కొదవే ఉండదు. అయితే కాలంతో పాటుగా పెళ్లిలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు కూడా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో పెళ్లి మంటపాల్లో చోటు చేసుకుంటున్న వెరైటీ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతోన్న సంగతి తెలిసిందే. ఈ కోవకు చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. సాధారణంగా పెళ్లి తర్వాత జరిగే అప్పగింతల వేడుకల సమయంలో వధువు ఏడుస్తుంది. కన్నవారిని.. తోబుట్టువులను.. స్నేహితులను వదిలి.. పుట్టినింటిని వదిలి మెట్టినింటికి వెళ్తున్న వేళ.. ఆడపిల్లలు ఏడవడం సహజం. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వీడియో ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ అప్పగింతల వేళ.. వధువు చాలా ఉత్సాహంగా, సంతోషంగా అందరికి వీడ్కోలు పలుకుతుండగా.. వరుడు మాత్రం.. కన్నీరు పెట్టుకుంటాడు. అది గమనించిన వధువు.. అతడిని తట్టి.. ఏం జరిగిందని ప్రశ్నిస్తుంది. (చదవండి: ఇదేం విడ్డూరం: మంచి భర్త రావాలంటే గుండు చేయించుకోవాల్సిందే) కన్నీరు పెడుతున్న పెండ్లి కుమారుడిని చూసి అక్కడున్నవారంతా నవ్వుతారు. ఇక పెళ్లి కుమార్తె అతడిని చిన్నగా కొడుతుంది. ఆ తర్వాత అతడు కూడా కళ్లు తుడుచుకుని.. నవ్వుతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ‘‘ఇతగాడికి పెళ్లైన మొదటి రోజునే ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అర్థం అయినట్లుంది’’.. ‘‘ఇంత బాగా ఏడ్చే పెళ్లి కుమారుడిని నేను ఇంతవరకు చూడలేదు’’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. చదవండి: ప్రీవెడ్డింగ్ షూట్ కల్చర్: పెళ్లింత.. తుళ్లింత -
ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య
సాక్షి, నిర్మల్(ఆదిలాబాద్): నిర్మల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏడురోజుల్లో వివాహం అనగా.. పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కుబీర్ మండలం దోడర్న తండా 4వ గ్రామానికి చందిన రాజేందర్ అనే యువకుడికి కొన్ని రోజుల క్రితం నల్గొండ ప్రాంతానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈనెల 21వ తేదిన రాజేందర్ వివాహం జరగాల్సి ఉంది. ఈక్రమంలో ప్రస్తుతం రాజేందర్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే, ఆ పెళ్లి ఇష్టంలేక రాజేందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుంటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: పదే పదే తిడుతున్నారని గుడిసెకు నిప్పు.. సజీవ దహనం -
పెళ్లిలో వరుడి చెంప చెళ్లుమనిపించిన వధువు.. అంతా షాక్!
పెళ్లి అనేది కొత్త జీవితానికి నాంది. ప్రతి ఒక్కరూ తమ పెళ్లిపై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వివాహం జీవితాంతం గుర్తుండిపోయేలా అందమైన జ్ఞాపకంగా మలుచుకోవాలనుకుంటారు. కానీ అన్ని అనుకున్నట్లు జరగవు. కొన్నిసార్లు పెళ్లిలో ఊహించని సంఘటనలు సైతం జరుగుతుంటాయి. తాజాగా ఇలాంటి ఘటనే నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. పెళ్లి మండపం మీద వధూవరులు కూర్చొని ఉండగా వారి చుట్టూ బంధువులు చేరారు. అప్పటి వరకు అంతా ఉత్సాహంగా ఉన్న కార్యక్రమంలో ఒక్కసారిగా వధువు ముఖం కోపంగా పెట్టింది. చదవండి: మొబైల్ ఫోన్‌ను ఎత్తుకుపోయిన చిలుక.. ఫన్నీవీడియో దీనికి కారణం తనకు కాబోయే భర్త పొగాకునములుతున్నాడని ఆమెకు తెలిసింది. దీంతో ఏమాత్రం ఆగకుండా ఆగ్రహంతో వరుడి చెంపచెల్లుమనిపించింది. అతనితోపాటు తన ఎదురుగా ఉన్న వ్యక్తిని సైతం కొట్టింది. పెళ్లి కూతురు చర్యతో కంగుతున్ని వరుడు వెంటనే అక్కడి నుంచి లేచి నోటిలోని పొగాకును ఉమ్మేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవ్వడంతో వధువు చర్యను ప్రశంసిస్తున్నారు. పెళ్లి పీటలపై పొగాకు తింటున్న వరుడిపై మండిపడుతున్నారు. అయితే ఇది నిజంగా జరిగిందా లేక కావాలనే చేశారా అన్నది మాత్రం తెలియరాలేదు. చదవండి: 8 కేజీల వెడ్డింగ్ లెహంగాతో వధువు పుష్ అప్స్.. వీడియో వైరల్ View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
ప్రేమ ఒకరితో.. పెళ్లి మరొకరితో.. పెళ్లి దుస్తుల్లోనే..
పొదిలి/దర్శి టౌన్: అది పొదిలిలోని ఆంజనేయ స్వామి ఆలయం. వివాహ వేడుక సందర్భంగా సోమవారం ఆలయ ఆవరణ మొత్తం వధూవరుల బంధువులు, అతిథులతో సందడిగా ఉంది. కళ్యాణ ఘట్టం పూర్తి చేసేందుకు వేద పండితుడు మంత్రాలు ఉచ్ఛరిస్తున్నాడు. కాసేపు ఆగితే పెళ్లి తంతు ముగిసేది! ఇంతలో పిలవని పేరంటానికి వచ్చిన చుట్టాల్లా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ‘‘పోలీసులు ఎందుకొచ్చారబ్బా..’’ అని అంతా సంశయించేలోపే పెళ్లి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడిపై చీటింగ్ కేసు నమోదు చేశారు. దర్శి ఎస్సై చంద్రశేఖర్ కథనం మేరకు.. దర్శి మండలం చౌటపాలెం గ్రామానికి చెందిన రవీంద్రబాబు అనే యువకుడు బేల్దారి పనులకు వెళ్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మేనమామ కూతురు సరస్వతిని ప్రేమించాడు. వీరి పెళ్లి విషయమై రెండు కుటుంబాల మధ్య ఇటీవల సంప్రదింపులు నడిచాయి. చదవండి: యువతలో ఇడియట్స్ అయితే డిగ్రీ చదువుతున్న కూతురికి బేల్దారి పనికి వెళ్లే రవీంద్రతో వివాహం చేసేందుకు యువతి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. దీంతో యువకుడి తల్లిదండ్రులు పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయించారు. సోమవారం పొదిలిలోని ఆంజనేయస్వామి ఆలయంలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21వ తేదీన తనకు తాళి కట్టిన యువకుడు పొదిలిలో మరొకరిని వివాహం చేసుకుంటున్నాడని, తనను మోసం చేస్తున్నాడని సరస్వతి దర్శి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు.. పొదిలి ఎస్సై శ్రీహరితో కలిసి వివాహం జరుగుతున్న ఆలయం వద్దకు వెళ్లారు. పరిస్థితిని పెళ్లి కుమార్తె తరఫు వారికి వివరించారు. అనంతరం రవీంద్రను పెళ్లి దుస్తుల్లోనే దర్శి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు దర్శి ఎస్సై తెలిపారు. చదవండి: దుప్పిని మింగిన కొండచిలువ -
అత్తగారి అదిరిపోయే డాన్స్: చూస్తూ ఉండిపోయిన వధువు!
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లలో సంగీత్‌లు, బారాత్‌లు, డ్యాన్స్‌లు సర్వసాధారణంగా మారిపోయాయి. అంతేకాదు ఇలాంటి వేడుకల్లో వధూవరులతోపాటు, బంధువులు, స్నేహితులు స్టెప్పులతో ఇరగదీయడం కూడా చాలా కామన్‌గా మారి పోయింది. ఇటీవల ‘బుల్లెట్టు బండి’ పాటతో ఒక తెలుగింటి నవ వధువు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. తాజాగా వీటన్నింటికీ భిన్నంగా వరుడి తల్లి చేసిన డ్యాన్స్ టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. చదవండి : Bullet Bandi Song: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా ‘బుల్లెట్టు బండి’ వధువు చర్చకు దారి తీసిన ఆనంద్ మహీంద్ర వైరల్ వీడియో వరుడి తల్లి పంజాబీ పాటకు భాంగ్రా నృత్యంతో పెద్ద సంచలనమే సృష్టించింది. దీనికి తోడు ఆమె పాటకు ఆమె బంధువులు డబ్బుల వర్షం కురిపించడం విశేషం. అటు అత్తగారి పెర్ఫామెన్స్‌కు వధువు ముచ్చటగా అలా చూస్తూ ఉండి పోయింది. ఈ వయసులో కూడా ఎంత ఎనర్జటిక్ స్టెప్స్! అంటూ నెటిజన్లు ఫిదా. చదవండి : Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా View this post on Instagram A post shared by 𝔖aͥɴaͣmͫ (@i.am.sanam) -
భావోద్వేగం: వధువుని అలా చూసి కంటతడి పెట్టిన వరుడు
పెళ్లి అనేది జీవితంలో ముఖ్య ఘట్టం. ప్రతి జంట తమ పెళ్లిని సమ్‌థింగ్ స్పెషల్‌గా నిర్వహించుకోవాలని కోరుకుంటారు. అలాగే వారు కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవాలని ఆశిస్తారు. తమతో జీవితాంతం కలిసి జీవించే వారికి కొత్తగా, అందంగా కనిపించాలనుకుంటారు. అచ్చం ఇలాగే వధువు తన వివాహ వేడుక ప్రారంభమయ్యే ముందు వరుడిని ఆశ్చర్యపరచాలని నిర్ణయించుకుంది. ఆఖరికి అనుకున్నది సాధించింది. పెళ్లి దుస్తుల్లో అందంగా ముస్తాబైన వధువు వేదిక వద్దకు వయ్యారంగా నడుచుకుంటూ రావడాన్ని చూసిన వరుడు మంత్రుముగ్ధుడయ్యాడు. వధవును చూడటానికి తనకు రెండు కళ్లు చాలలేదంటే అతిశయోక్తి కాదు. ఆమెను చూసిన ఆ వరుడి కళ్లు ఆనందంతో నిండిపోయాయి. పుత్తడిబొమ్మలా తనవైపు నడిచొస్తున్న వధువుని చూసి ఫిదా అయిన వరుడు భావోద్వేగానికి లోనై సంతోషంతో కంటతడి పెట్టుకున్నాడు. ఈ భావోద్వేగ క్షణాలను కెమెరాలో బంధించారు. దీనికి సంబంధించిన వీడియోను వెడ్డింగ్ వైర్ ఇండియా అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ షేర్ చేసింది. చదవండి: అఫ్గాన్ల దుస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలు! ‘ఒకరినొకరు కలిసి జీవించాలనుకునే మీ కల ఇప్పుడు ఏ క్షణంలోనైనా నిజమవుతోందని తెలిసిన క్షణాన ఆ భావానికి అభినందనలు. వరుడు తన వధువు వైపు చూసే విధానం పూర్తిగా మన హృదయాలను తాకుతోంది’ అని కామెంట్ పోస్టు చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో వీక్షించిన నెటిజన్లు సైతం తమ హృదయాలను కరిగిస్తోందని, కన్నీళ్లు తెప్పిస్తుందని కామెంట్ చేస్తున్నారు. చదవండి: తాలిబన్ల ఆధీనంలో అప్గన్ పార్లమెంట్, వీడియో వైరల్ View this post on Instagram A post shared by WeddingWire India (@weddingwireindia) -
పూల వ్యాపారి స్మార్ట్ ఆలోచన.. ఫిదా అవుతున్న వధూవరులు
సాక్షి, చెన్నై: కరోనా కష్టకాలంలో తప్పనిసరిగా ధరించాల్సిన ఫేస్ మాస్క్‌ల కష్టాలగురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఊపిరాడదని కొందరు, కరోనా వచ్చాక ఏమో గానీ, మాస్క్ పెట్టుకుంటే ఊపిరి అందక ముందే చచ్చిపోతామంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేసిన సందర్భాలు కోకొల్లలు. అయినా కోవిడ్-19 మహమ్మారి ఉధృతిని అడ్డుకోవాలంటే మాస్క్ ధరించడం తప్పనిసరి. ముఖ్యంగా పెళ్లి పీటల మధ్య ముసి ముసి నవ్వులతో మురిసిపోవాల్సిన వధూవరులకు కూడా ఇది తప్పదు. అందుకే తమిళనాడుకు చెందిన ఒక పూల వ్యాపారి చాలా స్మార్ట్‌గా ఆలోచించి చక్కటి మాస్క్‌లను రూపొందించారు. ఈ ఫోటోలు ఇపుడు పలువురిని ఆకట్టుకుంటున్నాయి. చక్కటి పరిమళాలు వెదజల్లుతూ ఇదేదో బాగుందే.. అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులకనుగుణంగా స్మార్ట్‌గా ఆలోచించడం కొంతమందికే సాధ్యం. తమిళనాడులోని పూల వ్యాపారి ఈ విషయాన్ని నిరూపించారు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్యంతో సరికొత్త మాస్క్‌లను తయారు చేసి, ప్రత్యేకతను చాటుకున్నారు. కరోనా సెకండ్ వేవ్‌లో పట్టుచీరకు మ్యాచింగ్‌గా వధువు పట్టు, వెండి, బంగారం, వజ్రాల మాస్క్‌లను ధరించడం చూశాం. కానీ ఖరీదైనవి. అందుకే మదురై స్వామికన్నిగైకు చెందిన పూల వ్యాపారి మోహన్ తన ఆలోచనకు పదుపెట్టారు. ముఖ్యంగా వధూవరులకోసం ప్రత్యేకంగా తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. మూడు పొరలతో మల్లె , లిల్లీ, గులాబీ పూలతో ఫేస్ మాస్క్ తయారు చేశారు. వివాహ కార్యక్రమాల్లో కరోనాపై అవగాహన కల్పించేలా వధూవరులకు పూలతో మాస్కు తయారుచేశానని మోహన్ వెల్లడించారు. ఫ్లవర్ మాస్క్ ఆర్డర్లు ఇప్పుడు చాలా వస్తున్నాయని దీంతో ఒకవైపు వ్యాపారం, మరోవైపు కరోనాపై అవగాహన పెంచడానికి తమ వంతు కృషి చేస్తున్నందుకు సంతోషంగా కూడా ఉందని పేర్కొన్నారు. అంతేకాదు పూల మాస్క్ ధరించిన వధువును చూడటానికి అందంగా ఉంటుందనీ, ఫోటోలు కూడా కరోనా కాలానికి సంబంధించిన అందమైన జ్ఞాపకంగా ఉంటాయంటున్నారు. Tamil Nadu | Mohan, a flower vendor in Madurai makes floral masks exclusively for brides, grooms to raise awareness about COVID-19 "Despite govt orders, people don't wear masks at weddings. I make these floral masks to encourage brides, grooms to wear them," he said (10.08) pic.twitter.com/1gJKK3S68p — ANI (@ANI) August 11, 2021 -
మరికొద్ది గంటల్లో పెళ్లి.. గన్‌తో వరుడి బంధువుల రచ్చ..!
ఓ వైపు పెళ్లి పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు చుట్టాలతో ఇళ్లంతా సందడిగా ఉంది. ఓ వైపు బ్యాండ్ బాజా మోగుతోంది. ఇంతలో అలజడి మొదలైంది. ఇదేం పద్ధతి అంటూ కేకలు మొదలయ్యాయి. చుట్టూ చుట్టాలు మూగే సమయానికి పెళ్లి వద్దని వధువు తెగేసి చెప్పింది. లక్నో: మరికొద్ది గంటల్లో పూర్తి కావాల్సిన పెళ్లి అర్థాంతరంగా ఆగిపోయింది. వివరాల్లోకి వెళితే.. వివాహ వేడుక వద్ద వరుడి తరపున బంధువులు జరిపిన కాల్పుల్లో వధువు మామ గాయపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో చోటు చేసుకుంది. దీంతో పెళ్లి కొడుకు బంధువుల ప్రవర్తనకు విస్మయం చెందిన వధువు పెళ్లి వద్దని తెగేసి చెప్పింది. వధువు తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత పెళ్లి కూరుతు తరపున బంధువులు వరుడి కుటుంబం పై దాడి చేసి, కారును పగలగొట్టి అతని బంధువులను బందించారు. దీంతో పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై వధువు ఇరామ్ స్పందిస్తూ.. ‘‘ నా కుటుంబం మొత్తం ఉన్నప్పుడే.. వాళ్ల కుంటుంబ ఈ విధంగా ప్రవర్తిస్తే.. ఇక నేను వాళ్ల ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎలా ప్రవర్తిస్తారు?’’ అంటూ ఆందోళన వ్యక్తం చేసింది. కాల్పులు జరిపిన వారిని గుర్తించడానికి పెళ్లి వేడుక వీడియో దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు ఖార్ఖోడా పోలీస్ స్టేషన్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్ర పలావత్ తెలిపారు. వరుడు షాజాద్ అతని సోదరుడు పప్పు, సానుపై సెక్షన్ 307 (హత్యాయత్నం) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లైసెన్స్ కలిగి ఉన్న ఆయుధం నుంచి బుల్లెట్ పేలితే, ఆయుధ లైసెన్స్ రద్దుకు నివేదిక పంపిస్తారని తెలిపారు. ఇక గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఫోటోషూట్‌లో ఆ ఫోజుకు సిగ్గుపడి.. వరుడిని కొలనులో తోసేసింది
ప్రస్తుతం పెళ్లంటే వధూవరుల ఫొటోషూట్ కంపల్సరీగా మారింది. ఇక వీటి కోసం ఎవరి అభిరుచికి తగ్గట్లు వారు లొకేషన్ల ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అడవులను, ఆకాశాన్ని కూడా వెడ్డింగ్ ఫొటోషూట్లకు వాడేసుకుంటున్నారు. కొందరు మితిమీరిన పైత్యానికి పోయి సోషల్ మీడియాలో ట్రోల్ కాగా, మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోషూట్ జరుగుతుండగా పలు సందర్భాల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఆ తరహా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఓ కొలను మధ్యలో ఉన్న వేదికపై వెడ్డింగ్ ఫొటోషూట్ జరుగుతోంది. ఆ ఫొటోగ్రాఫర్ వధూవరులను రకరకాల ఫోజులలో ఫొటోలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫోటోగ్రాఫర్‌కి ఓ ఫోజు గుర్తించింది. అది వధూవరులిద్దరూ ఒకరినొకరు అల్లుకుని నిలబడాల్సిన రొమాంటిక్ ఫోజు. ఇంకేముంది వెంటనే ఎలా నిలబడాలో వివరించడానికి వరుడి దగ్గరగా వెళ్లి చేసి చూపిస్తున్నాడు. అది చూసిన వధువు సిగ్గు ఆపుకోలేకపోయింది. ఫొటోగ్రాఫర్‌ను, వరుడిని ఇద్దరినీ కలిపి కొలను నీళ్లలోకి తోసేసింది. వాళ్లిద్దరూ నీళ్లలోపడిపోగానే పగలబడి నవ్వకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by hepgul5 (@hepgul5) -
వెరైటీ ఆచారం: వధువు వరుడుగా.. వరుడు వధువుగా..
ఆ వంశస్తుల ఇంట పెళ్లంటే సందడే కాదు.. తరతరాలుగా వస్తున్న విచిత్ర సంపద్రాయాల మేళవింపు.. అందుకే నల్లజర్ల మండలం పోతవరంలో గన్నమని వారింట పెళ్లంటే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. పెళ్లి కుమారుడు పట్టుచీర కట్టుకుని, నడుముకు వడ్డాణం, చేతికి అరవంకి పెట్టుకుంటే చుట్టూ చేరిన అమ్మలక్కలు అతనిని చూసి మురిసిపోతారు. ఇక ఆ ఇంట అమ్మాయి పెళ్లికూతురైతే టిప్‌టాప్‌గా ప్యాంటు, షర్టు వేసుకుని చలువ కళ్లద్దాలు పెట్టుకుని ఠీవిగా పోజులిస్తుంది. పెళ్లికి ఒకరోజు ముందు జరిగే ఈ తంతు కనువిందుగా సాగిపోతుంది. అమ్మవారి మొక్కు తీర్చుకునే క్రమంలో చేపట్టే ఈ వేషధారణను ఆ వంశస్తులు కాపాడుకుంటూ వస్తున్నారు. జిల్లాలో గన్నమని ఇంటి పేరున్న అమ్మాయి పెళ్లి జరిగితే అబ్బాయిగా అలంకరిస్తారు. ఆ ఇంటి పేరున్న అబ్బాయికి పెళ్లయితే అమ్మాయిగా ముస్తాబు చేస్తారు. పెళ్లికి ఒకరోజు ముందు ఇలా అలంకరించి కులదేవతకి బోనం సమర్పిస్తారు. నల్లజర్ల: పెళ్లంటే పందిళ్లు, సందళ్లు, తాళాలు, తలంబ్రాలే కాదు.. వింత ఆచారాల కలయిక. ఒక్కో ప్రాంతంలో ఒక్కో కుటుంబానికి ఒక విలక్షణ ఆచారం కొనసాగింపుగా వస్తుంది. జిల్లాలోని గన్నమని ఇంటి పేరున్న వారు కాకతీయుల కాలం నుంచి విభిన్న ఆచారం పాటిస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని నేటి తరం కూడా ఆచరిస్తూ కనువిందు చేస్తోంది. గన్నమని వారింట వివాహం జరిగితే ఆ ఇంటి పేరున్న అమ్మాయిని అబ్బాయిగా అలంకరిస్తారు. అలాగే గన్నమని ఇంటిపేరున్న అబ్బాయికి పెళ్లి జరిగితే పెళ్ళికి ముందు రోజు అమ్మాయిగా ప్రత్యేక దుస్తుల్లో అలంకరిస్తారు. కులదేవత ఆలయానికి లేదా గ్రామ దేవత ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి మొక్కులు తీర్చుతారు. ఈ ఆచారాన్ని బోనంగా పిలుస్తారు. పెళ్ళికుమార్తెకు ప్యాంటు, షర్టు కట్టి వరుడి వేషం వేయిస్తారు. అబ్బాయికైతే పట్టుచీర, జాకెట్ కట్టి ఆభరణాలు అలంకరించి తెలుగింటి పెళ్లికూతురిగా ముస్తాబు చేస్తారు. అలా ముస్తాబు చేసిన వధువు లేదా వరుడ్ని బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామమంతా ఊరేగిస్తారు. గ్రామ దేవత ఆలయానికి తీసుకెళ్ళి ప్రత్యేక పూజలు చేయిస్తారు. గొర్రెను బలిచ్చి అన్నంతో కుంభం సమర్పిస్తారు. ముడుపులు, మొక్కుబడి చెల్లించుకుంటారు. పోతవరంలో వరుడి వేషంలో పెళ్లికుమార్తె(ఫైల్)- పెళ్ళికుమార్తె వేషధారణలో ప్రభుప్రసాద్(ఫైల్) కాకతీయుల కాలం నుంచీ ఆచారంగా.. ఈ ఆచారం కాకతీయుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోంది. రుద్రమదేవి వద్ద గన్నమని వంశస్తుల మూల పురుషుడు సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడు. ఆయన హయాంలో సైన్యంలో ఉన్న మగవారు యుద్ధంలో ఎక్కువగా చనిపోవడంతో మహిళలు మగవారి వేషధారణలో సైన్యంలో విధులు నిర్వర్తించేవారు. ఈ విషయం బయటకు తెలియకుండా కాపాడమని కులదేవతను వేడుకునేవారు. పెళ్లి సమయంలో ఆడవారికి మగ వేషం, మగవారికి ఆడవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని ప్రార్థించేవారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోంది. సంప్రదాయాన్ని కాపాడుకుంటున్న యువత ఈ విచిత్ర ఆచారాన్ని గన్నమని ఇంట నేటి యువత ఎంతో ఆసక్తి అనుసరిస్తున్నారు. తమ వంశాచారం పాటించడానికి ఎలాంటి ఇబ్బందీ లేదని చెబుతున్నారు. వారి వంశంలో ఎవరి ఇంట పెళ్ళైనా ఇదే ఆచా రాన్ని పాటిస్తామంటున్నారు. మా ఆచారాన్ని మర్చిపోం ఎన్ని చదువులు చదివి ఏ దేశానికి వెళ్లి ఉద్యోగం చేస్తున్నా మా సంస్కృతీ సంప్రదాయాన్ని మరిచిపోం. అందుకే పెద్దలు చెప్పినట్లుగా విని పెళ్లిలో మా వంశాచారం పాటిస్తున్నాం. – భాను ప్రసాద్, అనంతపల్లి సంప్రదాయాన్ని గౌరవించాలి భారతీయ సంప్రదాయాలపై పాశ్చాత్య దేశాల్లోనూ చాలా గౌరవం ఉంది. మన సంప్రదాయాన్ని మనం గౌరవించాలి. పెళ్లిలో వేషధారణ గురించి పెద్దవాళ్ళు చెప్పారు. మేం కూడా ఆ ఆచారాన్ని అలా కొనసాగిస్తున్నాం. – డాక్టర్ మానస, పోతవరం అనాదిగా వస్తున్న ఆచారం ఈ ఆచారం కొనసాగడానికి మరో కథ కూడా ప్రచారంలో ఉంది. గన్నమని ఇంటి ఆడపడుచు రోజూ పుట్టెడు బియ్యం తినేది. పురుషుడి వలే ప్రవర్తించేది. ఎవరూ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. అపుడు గ్రామ దేవతకు మొక్కి తమ కుమార్తెకు వివాహం జరిగితే మగవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని తల్లిదండ్రులు వేడుకున్నారు. ఆమెకు పెళ్లి ముందురోజు పెళ్లికొడుకు వేషం వేసి ఆలయానికి ఊరేగింపుగా గుడికి వెళ్ళి మొక్కులు చెల్లించిన ట్లు పూర్వీకులు చెబుతారు. అప్పటి నుంచి అదే ఒరవడి కొనసాగుతుంది. – గన్నమని రాము, పోతవరం సంతానం నిలవడం కోసం.. గన్నమని వంశంలో పుట్టిన మగపిల్లలు అందరూ చనిపోయే వారు. పుట్టిన సంతానం నిలవడం కోసం గ్రామ దేవతకు మొక్కుకోవడంతో వారి కోరిక ఫలించింది. అప్పటి నుంచి మగపిల్లలకు ఆడవేషం, ఆడపిల్లలకు మగవేషం వేసి గ్రామదేవత గుడికి ఊరేగింపుగా వెళ్ళి మొక్కులు చెల్లిస్తున్నాం. ఆ సమయంలో పొట్టేలు బలి ఇస్తారు. – రామ దుర్గాప్రసాద్, అనంతపల్లి -
విషాదం: పెళ్లి బృందంపై పిడుగు.. 16 మంది మృతి
ఢాకా: నవవధువు, వరుడిని ఆశీర్వదించాలని వెళ్లిన అతిథులను మృత్యువు పిడుగు రూపంలో వెంటాడింది. సంతోషంతో సంబరాలు చేసుకోవాల్సిన సమయంలో క్షతగాత్రులను కాపోడుకోవడానికి పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఈ విషాదం ఘటన బంగ్లాదేశ్‌లో చోటుచేసుకుంది. చపైనవాబ్‌గంజ్ జిల్లాలో ఓ వివాహానికి వచ్చిన బృందం పడవ దిగి నదీ సమీపంలోని షిబ్‌గంజ్ నగరంలో తమ విడిది ప్రాంతానికి వెళ్తున్నారు. అంతలో హఠాత్తుగా రుతుపవనాల కారణంగా భారీ వర్షంతో పాటు పిడుగులు పడటం మొదలైంది. దీంతో పడవలో నుంచి ఒక్కొక్కరు దిగివస్తుండగా ఆ పెళ్లి బృందంపై సెకన్ల వ్యవధిలోనే పిడుగు పడింది. ఈ ప్రమాదంలో 16 మంది సభ్యులు మృతి చెందగా, పలువరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో వరుడికి తీవ్రగాయాలు కాగా వధువు ప్రమాద జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో లేకపోవడంతో క్షేమంగా బయటపడింది. అందులో గాయపడిన వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్‌ను వర్షాలు వణికిస్తున్నాయి. వారంరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఈశాన్య జిల్లా కాక్స్ బజార్లో ఆరుగురు రోహింగ్యా శరణార్థులతో సహా 20 మంది మృతి చెందారు. -
పెళ్లి పీటలు ఎక్కాల్సిన జంట మృత్యుఒడిలోకి
సాక్షి,చెన్నై: పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ జంట మృత్యుఒడిలోకి చేరింది. బంగారం కొనేందుకు బైక్‌పై వెళ్తూ ఎదురుగా వచ్చిన మరో మోటారు సైకిల్ రూపంలో మృత్యువాత పడ్డారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం కారమడైకు చెందిన సుబ్రమణియన్ కుమారుడు అజిత్(23), అన్నురుకు చెందిన కరుప్పుస్వామి కుమార్తె ప్రియాంక(22)లకు నిశి్చతార్థం జరిగి సెపె్టంబరు మొదటి వారంలో పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మంగళవారం ఆడిపెరుక్కు సందర్భంగా ప్రియాంకకు బంగారం కొనివ్వడానికి అజిత్ నిర్ణయించాడు. ప్రియాంక, ఆమె బంధువు తాలత్తురుకు చెందిన సెవ్వాని(23)లతో కలిసి మేట్టుపాళయంకు వెళ్లాడు. పనులు ముగించుకుని తిరుగు పయనం అయ్యారు. అన్నురు మెయిన్ రోడ్డులో వెళుతుండగా ఎదురుగా వచ్చిన మరో మోటారు సైకిల్ వీరి బైక్‌ను ఢీకొంది. ఈప్రమాదంలో అజిత్ అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రియాంకకు తీవ్రగాయాలయ్యాయి. సెవ్వాని çస్పృహ తప్పింది. స్పృహలోకి వచ్చిన సెవ్వాని ఇచ్చిన సమాచారంతో ఇరు కుటుంబాలు పరుగులు తీశాయి. ప్రియాంకను కోయంబత్తూరు ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి ఆమె మృతిచెందింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ జంట మృత్యుఒడిలోకి చేరడం రెండు కుటుంబాల్ని విషాదంలోకి నెట్టింది. తప్పిన పెనుప్రమాదం.. కన్యాకుమారికి చెందిన వినో పడవను చిన్నముట్టంకు చెందిన జ్ఞానసెల్వన్ సముద్రంలోకి వేట నిమిత్తం తీసుకెళ్లాడు. 14 మందితో కలిసి వేటను ముగించుకుని మంగళవారం అర్ధరాత్రి ఒడ్డుకు తిరుగు పయనం అయ్యారు. పడవలో సాంకేతిక లోపంతో మంటలు చెలరేగడంతో అందులో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో మరో పడవ అటు రావడంతో ఆ పడవను ఆశ్రయించారు. అయితే, వినోకు చెందిన రూ. కోటి విలువగల పడవ పూర్తిగా దగ్ధమైంది. అగ్నిప్రమాదం.. చెన్నై మదురవాయిల్ బైపాస్‌లో ఓ ప్రైవేటు స్థలంలో సినిమా సెట్టింగ్‌లకు ఉపయోగించే వస్తువుల్ని భద్రపరిచారు. ఇక్కడ షార్ట్‌షర్క్యూట్ కారణంగా బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. అగి్నమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటల్ని అదుపుచేయడానికి ప్రయతి్నంచాయి. పక్కనే ఉన్న కార్ల విడి భాగాల తయారీ పరిశ్రమను సైతం మంటలు చుట్టుముట్టడంతో ఆందోళన నెలకొంది. కొన్ని గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపు లోకి తెచ్చారు. -
10 రోజుల్లో పెళ్లి.. అంతలోనే కాబోయే వరుడు..?
గుత్తి రూరల్: యల్లనూరు మండలం శింగవరం గ్రామానికి చెందిన శివశంకర్ ప్రసాద్‌రెడ్డి మూర్ఛ వ్యాధితో మృతి చెందాడు. కర్నూలు జిల్లా పత్తికొండకు చెందిన ఓ యువతితో ఈ నెల 13వ తేదీన వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో గుత్తిలో ఉన్న బంధువులు, స్నేహితులకు ఆహ్వాన పత్రికలు పంచేందుకు వచ్చాడు. పత్రికలు ఇచ్చి అందరినీ ఆహ్వానించిన అనంతరం స్వగ్రామం బయల్దేరాడు. అయితే ఎంగిలిబండ శివారుకు చేరుకోగానే మూర్ఛ రావడంతో శివశంకర్ రోడ్డు పక్కకు వాహనం ఆపేసి కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు, వాహనదారులు అతడు కోలుకునేందుకు సపర్యలు చేయగా.. శివశంకర్ ఆలోపే మృతి చెందాడు. దీంతో పెళ్లింట విషాదం ఏర్పడింది. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో చావు డప్పు మోగుతోంది. -
నెట్టింట వైరల్: మండపంపై పెళ్లి కొడుకు వర్క్ ఫ్రమ్ హోమ్
మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచమంతా కొన్నాళ్లు ఇంటి నుంచి పని చేసే విధానం (వర్క్ ఫ్రమ్ హోమ్) అమల్లో ఉంది. ప్రస్తుతం కరోనా కొంత అదుపులోకి రావడంతో పలు రంగాల ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తున్నారు. కానీ సాఫ్ట్వేర్ ఉద్యోగులు మాత్రం ఇంకా వర్క్ ఫ్రమ్ విధానంలోనే విధులు నిర్వహిస్తున్నారు. పైగా కరోనా మూడో దశ వ్యాప్తి వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో మరికొన్నాళ్లు ఇంట్లో నుంచే పని చేయనున్నారు. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌తో ఎన్ని లాభాలు ఉన్నా అన్నేసి కష్టనష్టాలు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణే ఈ వీడియో. చివరకు పెళ్లి చేసుకునేందుకు కూడా కంపెనీ వాళ్లు అవకాశం ఇవ్వకపోవడంతో మండపంలో పెళ్లి పీటలపై కూర్చొని వర్క్ ఫ్రమ్ చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరుడు ల్యాప్‌టాప్‌లో పని చేస్తుండగా బంధుమిత్రులు అది చూసి నవ్వుకుంటున్నారు. ఇక వధువు అయితే పగలబడి నవ్వుతోంది. ఈ వీడియో దుల్హానియా అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో దర్శనమిచ్చింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మామూలు కాదని ఆ కష్టం తెలిసిన వారు కామెంట్లు చేస్తున్నారు. వెంటనే ఆ ఉద్యోగానికి రాజీనామా చేసేయ్ అని సలహా ఇస్తున్నారు. అయితే అతడు తన పెళ్లిని వర్చువల్‌గా బంధువులు చూసేందుకు కెమెరాలు సెట్ చేస్తున్నాడని తెలిపారు. ఏది ఏం చేస్తున్నా అతడు చేసిన పని తెగ నవ్వులు తెప్పిస్తోంది. ఈ సంఘటన మహారాష్ట్రలో జరిగింది. -
బరాత్‌లో పేలిన పటాకులు: పెళ్లి కొడుకుతో గుర్రం పరార్
జైపూర్ (రాజస్థాన్): బంధుమిత్రులతో కలిసి వివాహ మండపానికి వరుడు ఊరేగింపుగా వెళ్తున్నాడు. ఈ సందర్భంగా డప్పుచప్పుళ్ల మధ్య ఉత్సాహంగా వరుడు అశ్వంపై కూర్చొని బయల్దేరాడు. బంధువులు డ్యాన్స్‌లు చేస్తూ సంబరంగా వెళ్తూ మధ్యలో బాణసంచా కాల్చారు. పటాకుల చప్పుడుకు గుర్రం అదిరింది. వరుడితో పాటు గుర్రం పరుగులు పెట్టింది. అలా నాలుగు కిలోమీటర్ల దాక లాకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా రాంపుర గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం నిశ్చయమైంది. పెళ్లి నసీరాబాద్‌లో ఉండడంతో గ్రామం నుంచి ఊరేగింపుగా బంధుమిత్రులతో వరుడు అశ్వంపై బయల్దేరాడు. మార్గమధ్యలో రంగురంగుల కాగితాలు వచ్చేలా ఉండే బాంబు పేల్చారు. భారీ శబ్ధంతో అవి పేలడంతో గుర్రం అదిరింది. భయాందోళనతో గుర్రం పరుగులు పెట్టేసింది. గుర్రంతో పాటు పైన కూర్చున్న వరుడిని కూడా తీసుకెళ్లింది. దీంతో బంధువులంతా కంగారు పడ్డారు. గుర్రాన్ని ఆపేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేయగా అది అతివేగంతో ఉరుకులు ఉరికింది. ఆ విధంగా గుర్రం ఏకంగా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వెళ్లింది. ఇంత జరిగినా కూడా ఆ వరుడికి గాయాలేమీ కాలేదు. దీంతో బంధువులు, వధువు తరఫు వారు ఊపిరి పీల్చుకున్నారు. చివరకు వరుడు మండపానికి వెళ్లి పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన ఇటీవల జరిగింది. -
పెళ్లిలో వరుడి చిలిపి పని.. ఒక్కసారిగా అందరు షాక్..!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. అయితే, వివాహ వేడుకలలో ఏదో ఒక ట్విస్ట్ జరిగి ఆ పెళ్లి కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఓ పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియోలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పెళ్లి మండపంలో వరుడుకు ఎదరుగా వధువు కూర్చుని ఉంది. చుట్టూ కుటుంబ సభ్యలు, బంధువులు, స్నేహితులు నిల్చొని ఉన్నారు. ఇంతలో.. అకస్మాత్తుగా వరుడు వధువును ముద్దు పెట్టుకుంటాడు. అయితే ఈ సంఘటన చూసిన వారంతా నవ్వుకుంటారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది..అక్కడ వివాహ సాంప్రదాయల్లో భాగంగా వధువు నోటిలో పాన్ ఉంచుతారు. వరుడు దాన్ని చేతితో తాకకుండా పాన్‌ను వధువు నోటిలో నుంచి తీయాలి. కాబట్టి వరుడు వధువు నోటి నుంచి పాన్ లాగడానికి ప్రయత్నించినప్పుడు, అతను ఆమెను ముద్దు పెట్టుకుంటాడు.ఈ సన్నివేశాన్ని అక్కడ ఉన్న వారు చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో హల్చల్ చేస్తుంది. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
వధువుకి వరుడి స్నేహితుల సర్ఫ్రైజ్ గిఫ్ట్; కోపంతో నేలకేసి కొట్టింది!
వైభవంగా జరుగుతున్న పెళ్లి వేడుకలో వరుడు స్నేహితులు ఇచ్చిన సర్ప్రైజ్ గిఫ్ట్‌ను చూసి వధువు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అందులో ఊహించని విధంగా ఇబ్బందికరమైన వస్తువు ఉండటంతో వెంటనే కోపంతో దాన్ని బయటకు విసిరేస్తుంది. మరి వరుడు స్నేహితులు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లిపోదాం.. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ వధూవరులిద్దరూ పెళ్లి వేదికపై కూర్చొని ఉంటారు. అంతలోనే అక్కడకు పెళ్లి కొడుకు స్నేహితులు వచ్చి నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతారు. అలాగే ప్యాక్ చేసి ఉన్న ఓ గిఫ్ట్‌ను సరదాగా వధువుకి అందిస్తారు. గిఫ్ట్‌ను పెళ్లి కూతురు అక్కడే తెరిచి చూడగా అందులో చిన్న పిల్లలకు పాలు తాగించే బాటిల్ ఉంటుంది. తనకిచ్చిన ఫన్నీ గిఫ్ట్ నచ్చకపోవడంతో వెంటనే దాన్ని వధువుకు విసిరేసింది. దీనిని చూసిన అక్కడి వారంతా పడిపడి నవ్వుతూనే.. మళ్లీ అదే బాటిల్ ఉన్న గిఫ్ట్‌ను వధువుకివ్వడంతో ఈసారి వధువుకు చిర్రెత్తింది. ఈ విషయాన్ని గమనించిన పక్కన ఉన్న మరో మహిళా ఆ వస్తువును వెంటనే లాక్కుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో బంటి ఠాగూర్ అనే వ్యక్తి పోస్టు చేశాడు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ పోస్టుకు వేలల్లో లైకులు, కామెంట్లు వస్తున్నాయి. ‘ప్రతి ఒక్కరిని గౌరవించాలి. సరదా కోసం ఎవరిని హర్ట్ చేయొద్దు’ అంటూ నెటిజన్లు హితవు పలుకున్నారు. -
వార్నీ, వధువును పక్కన పెట్టుకుని నిద్రపోయిన పెళ్లికొడుకు: వైరల్
కరోనా వ్యాప్తి కారణంగా దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా పలు వివాహాలు వాయిదా పడ్డాయి. ఇక వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో వివాహాల జోరు మొదలైంది. ఇటీవల ఉత్తరాన జరుగుతున్న వివాహ వేడుకలు ఏదో ఓ సంఘటన మూలాన అవి వార్తల్లోకెక్కుతున్నాయి. ఈ జాబితాలో.. ఓ వధువు స్వీటు తినిపిస్తుంటే వరుడు తినకపోవడంతో ఆమె కోపంతో విసిరి కొట్టగా, మరో ఘటనలో వరుడు గుట్కా నమిలాడని వధువు వివాహాన్నే వద్దనేసింది. ఇక తాజాగా ఓ వరుడు తన పెళ్లి రిసెప్షన్లో ఏకంగా నిద్రపోతూ కెమెరాకు కనిపించి అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. భారతీయల వివాహాలంటే ఎన్నో సంప్రదాయాలు, కార్యక్రమాలు, వేడుకలంటూ అబ్బో.. చెప్పాలంటే ఓ పెద్ద జాబితానే ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాలలో పెళ్లిళ్ల కార్యక్రమాలు వింతగా కూడా ఉంటాయ్. పెళ్లికి ముందు జరిగే వేడుకల్లోనూ వధూవరులు పాలుపంచుకోవాల్సి ఉంటుంది. కాగా ఈ ప్రక్రియలో ఆ కొత్త జంట అలిసిపోతుంటారు. అలా అలసట తీరలేదేమో.. ఓ వరుడు అతని వివాహ వేడుకలోనే రిసెప్షన్ సాగుతుండగానే నిద్రలోకి జారుకున్నాడు. దీన్ని గమనించిన బంధువులు తట్టిలేపినా ఆ పెళ్లి కొడుకు లేవక అలానే గుర్రుగా నిద్రపోతూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు కురిపిస్తున్నారు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
వరుడి కోసం.. రాత్రికి రాత్రి వంతెన నిర్మించి అవాక్కయ్యేలా చేశారు
Bamboo bridge For Groom: ఇటీవల ఉత్తరాన జరిగే వివాహాలు చర్చనీయాంశమవడమే గాక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో ఓ వరుడు అత్తగారి ఇంటి నుంచి వధువును తన భుజాలపై ఎత్తుకుని వాగు దాటించగా, మరో ఘటనలో వధువును ఆమె కుటుంబ సభ్యులు పడవలో అత్తారింటికి సాగనంపారు. తాజాగా అలాంటి ఘటనే బీహార్‌లో వెలుగుచూసింది. అరారియాలో ఫుల్సర గ్రామంలోని అమ్మాయికి ఇటీవలే పెళ్లి నిశ్చయమైంది. దీంతో ఆ యువతి పెళ్లికి ముందు రోజు గ్రామంలోని కాలువపై వంతెన నిర్మాంచారు అది కూడా రాత్రికి రాత్రే. అసలు వివాహానికి వంతెనకు లింకేంటి అనుకుంటున్నారా? పుల్సర గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో, గ్రామస్తులు కాలువ గుండా ప్రయాణించే వారు. వివాహాది శుభకార్యాలకు విషయానికొస్తే ఎన్నో వ్యయ ప్రయాసలతో జరిగేవి. కొందరు గ్రామస్తులు తమ కుమార్తెలను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వివాహం జరిపించేవారు. అటువంటి పరిస్థితుల్లో తాజాగా గ్రామానికి చెందిన బతేష్ తన కుమార్తె రాఖీ కుమారి వివాహం కారణంగా ఆ ఇబ్బందులు తీరింది. అమ్మాయి తరపు వాళ్లు పెళ్లి తేది వరకు అన్ని సన్నాహాలు పూర్తి చేశారు. కాని ఇక్కడ ప్రధాన సమస్యగా .. వరుడిని అతడి బంధుమిత్రులను ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ గ్రామానికి తీసుకురావడం. దీంతో వారు ఈ సమస్యకు పరిష్కారం కోసం చర్చించారు. చివరికి వెదురు వంతెన నిర్మించాలని తీర్మానించుకున్నారు. ఇంకేముంది టైం తక్కువ ఉండడంతో అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రే నిర్మాణం మొదలుపెట్టి పూర్తి కూడా చేశారు. వంతెన బలంగా లేనప్పటికీ, ఊరేగింపుగా వరుడిని తీసుకొచ్చేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు. దీంతో పెళ్లి కొడుకుని బైక్ మీద ఎక్కించుకుని వంతెనను దాటించి ఇంటికి తీసుకువచ్చారు. వరుడితో పాటు, అతడి బంధుమిత్రులు కూడా వెదురు వంతెన సాయంతో కాలువ దాటి గ్రామానికి చేరుకుని వివాహానికి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ పెళ్లి , వరుడి కోసం వంతెన నిర్మించడం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి హల్ చల్ చేస్తోంది. -
మరీ ఇంత దిగజారాలా; వధువుపై యువకుడి ముద్దుల వర్షం!
ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ హవా నడుస్తుండడంతో రకారకాల వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఆతాజాగా వరుడు పక్కన ఉండగానే ఒక యువకుడు వధువు పక్కన కూర్చొని ఆమెకు ముద్దులు పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఇది చూడడానికి ఫన్నీగా కనిపిస్తున్న పెళ్లికొడుకు ముఖం చూస్తుంటే జాలి కలుగుతుంది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదో కానీ ఈ వీడియో మాత్రం నవ్వులు పూయిస్తుంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి. విషయంలోకి వెళితే.. రిసెప్షన్ సందర్భంగా వరుడు, వధువు స్టేజీపై కూర్చొని ఉన్నారు. ఇంతలో ఒక యువకుడు వేదిక మీదకు వచ్చి ఇద్దరి మధ్యలో కూర్చుని వధువుకు ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ ఘటనను చూసి అక్కడున్న వారందరూ షాకయ్యారు. ఆ వ్యక్తి తన భార్యను ఏం చేస్తున్నాడోనని పక్కనే ఉన్న వరుడు ఆసక్తిగా గమనించడం విశేషం. ఆ సమయంలో యువకుడు చర్యలకు వరుడు ముఖం పాలిపోవడం స్పష్టంగా కనిపించింది. అయితే పెళ్లికొడుకును ఏడిపించడానికే అమ్మాయి తరపు బంధువులు ఇలా ప్లాన్ చేసి ఉంటారని నెటిజన్లు భావిస్తున్నారు. ఏదేమైనా మరీ ఇంతలా దిగజారి ప్రవర్తించాలా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. నిరంజన్ మహాపాత్ర అనే వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
వధువును భుజాలపై ఎత్తుకొని నదిని దాటిన వరుడు.. వైరల్ వీడియో
పట్నా: భారతీయ వివాహంలో సంప్రదాయం ప్రకారం అమ్మాయి మెడలో మూడు ముళ్లు పడగానే ఆమె ఇక తనలో సగభాగం అని భర్త భావిస్తాడు. ఆమెకు ఏం కష్టమొచ్చినా తానే ముందుండి నిలబడాలంటూ భర్తను అగ్నిసాక్షిగా ప్రమాణం చేయిస్తారు. తాజాగా బిహార్‌లో పెళ్లికూతురును తన భుజాలపై ఎత్తుకొని వరుడు నది దాటిన వీడియో వైరల్‌గా మారింది. వివరాలు.. బిహార్‌లోని కిసాన్‌గంజ్ జిల్లాకు చెందిన శివకుమార్ సింగ్‌కు ఉన్న పక్కనే ఉన్న పల్సా గ్రామానికి చెందిన యువతితో వివాహం జరిగింది. అయితే వీరువరి గ్రామాలు కంకై నది తీరానికి అటుపక్క.. ఇటుపక్కగా ఉంటాయి. ఇరు గ్రామాల మధ్య రాకపోకలు సాగాలంటే కంకై నదిని దాటి వెళ్లాల్సిందే. కాగా యువతిని పెళ్లి చేసుకున్న శివకుమార్ తన బంధువులతో కలిసి పడవలో తన సొంత గ్రామానికి బయలుదేరాడు. ఇంకా కొంతదూరం వెళితే ఊరికి చేరతామని అనుకుంటున్న తరుణంలో వారి పడవ ఇసుకలో కూరుకుపోయి ఆగిపోయింది. దీంతో శివకుమార్ సహా ఇతర బంధువులు పడవ దిగారు. వారితో పాటే పెళ్లికూతురు కూడా దిగే ప్రయత్నం చేయగా.. వరుడు శివకుమార్ వద్దని వారించి.. ఆమెను తన భుజాలపై ఎత్తుకొని ఆమెను మోసుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఈ పరిణామంతో పెళ్లికూతురు సిగ్గుతో ముసిముసినవ్వులు నవ్వగా.. శివ కుమార్ బంధువులు వారిద్దరిని ఉత్సాహపరుస్తూ వచ్చారు. దీనిపై వరుడు శివకుమార్ స్పందిస్తూ.. ' కొత్తగా పెళ్లి చేసుకొని వచ్చిన ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టంలేదు. అందుకే ఎంత కష్టమైన ఆమెను నా భుజాలపై ఇంటివరకు మోసుకెళ్లాను. చూసేవారికి ఇది ఆనందంగా కనిపించొచ్చు. కానీ మా బాధలు వర్ణణాతీతం. ఇలాంటి ఘటనలు రోజు చూస్తూనే ఉన్నాం. పదేళ్ల క్రితం నితీష్ కుమార్ ప్రభుత్వం కంకై నదీ తీరానికి బ్రిడ్జి కడతామని హామీ ఇచ్చింది. అప్పటినుంచి ఏనాటికైనా బ్రిడ్జి కట్టకపోతారా అనే ఆశతోనే బతుకుతున్నాం.ఈ పదేళ్లలో ఎన్నో పడవ ప్రమాదాలు చోటుచేసుకొని ప్రాణాలు కూడా కోల్పోయారు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఎంతలా ఉందో మా ఆవేదన చూస్తే మీకు అర్థమవుతుంది'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రిన్సెస్ డయానా కారు వేలం; వామ్మో అంత ధర! -
వరుడికి బంపరాఫర్.. స్టేజిమీదే ముద్దు పెట్టిన మరదలు
మన దేశంలో పెళ్లి వేడుక అంటే ఆ హాడావుడే వేరు. సంతోషం, సరదాలు, ఆటపట్టించడం, కన్నీళ్లు ఇలా రకరకాల ఎమోషన్స్‌తో జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా నిలిచి పోతుంది. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో వివాహ వేడుక సందర్భంగా వరుడిని ఆటపట్టించడం ఆనవాయితీగా వస్తుంది. కాబోయే బావని మరదళ్లు, బావమరుదుల ఆటపట్టిస్తారు. కానీ ఇప్పుడు మనం చేప్పుకోబోయేది అంతకు మించిన సరదా. ఇక్కడ పెళ్లి కుమార్తె సోదరి ఏకంగా మంటంపంలో అందరి ముందు వరుడికి ముద్దు పెట్టేసింది. అనుకోని చర్యకు సదరు పెళ్లికుమారుడు బిత్తరపోయి.. బిక్కమొహం వేశాడు. ప్రస్తుతం ఇదుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు.. ఈ పెళ్లి వేడుక ఎక్కడ జరిగింది.. ఏంటి అనే వివరాలు తెలియదు. నిరంజన్ ఎం 87 అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ తన అకౌంట్లో షేర్ చేసిన ఈ వీడియోలో స్టేజీమీద పెళ్లి కుమారుడు, కుమార్తె, మిగతా బంధువులు ఉంటారు. ఫోటోలు దిగే కార్యక్రమం జరుగుతుంటుంది. దానిలో భాగంగా పెళ్లి కుమార్తె చెల్లెలు కొత్త దంపతులతో ఫోటో దిగడం కోస వారి పక్కన కూర్చుంటుంది. ఫోటో తీస్తుండగా సడెన్‌గా పెళ్లి కుమార్తె సోదరి బావకు ముద్దు పెడుతుంది. అనుకోని ఈ సంఘటనకు వరుడు షాకవుతాడు. ఆమెను విడిపించుకునేందకు ప్రయత్నించినప్పటికి కుదరదు. పాపం మరదలి దెబ్బకు జడుసుకుంటాడు. ఆ అమ్మాయి చర్యకు అక్కడ ఉన్న వారందరు పడి పడి నవ్వుతారు. చదవండి: జీతం ఎంతో చెప్పాలంటూ కాబోయే అల్లున్ని గదిలో బంధించి... -
పెళ్లిలో గుట్కా నమిలిన వరుడు.. వధువు ఏం చేసిందంటే?
లక్నో: ఇటీవల కొన్ని వివాహాలు మంటపాల్లోనే పలు కారణాల వల్ల రద్దవుతున్నాయి. ఇదే తరహా ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బాలియా జిల్లాలో వెలుగు చూసింది. ముహుర్తం సమయానికి ముందు వరుడు గుట్కా నములుతున్న విషయాన్ని గ్రహించిన వధువు ఏకంగా పెళ్లినే రద్దు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మిశ్రౌలి గ్రామానికి చెందిన యువతితో కేజూరి గ్రామానికి చెందిన యువకుడికి జూన్ 5న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లి రోజు ముహూర్త సమయానికి వరుడితో పాటు బంధువులు ఊరేగింపుగా మంటపానికి చేరుకున్నాడు. అదే సమయంలో వరుడు గుట్కా నములుతూ వధువుకు కనిపించాడు. దీంతో తనకు వరుడు గుట్కా నమలడం నచ్చలేదంటూ, వివాహం వద్దని తల్లిదండ్రులకు తెగేసి చెప్పేసింది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి జరగాలని వధువుకు ఎన్ని రకాలుగా నచ్చజెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ యువతి పెళ్లికి ససేమిరా అనేసింది. చివరికి చేసేదేమి లేక ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లికి ముందు ఇచ్చిపుచ్చుకున్న కట్నకానుకలను తిరిగి ఇచ్చేశారు. కాగా ఉత్తర ప్రదేశ్‌లో ఒక వారంలో ఇలాంటి రెండవ సంఘటన ఇది. గత వారం, ప్రతాప్‌ఘర్ జిల్లాలో ఓ వధువు వరుడు తాగి వచ్చి అతనితో కలిసి నృత్యం చేయమని బలవంతం చేయగా, విసుగు చెందిని వధువు ఇలానే పెళ్లి ఆపేసిన సంగతి తెలిసిందే. చదవండి: వ్యాక్సిన్ వేసుకున్న వారికి బ్యాంకుల బంపర్ ఆఫర్! -
ఆ వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావాలంట.. వధువు ప్రకటన వైరల్
కరోనా వేళ.. ఓ వింత ప్రకటన సోషల్ మీడియాలో చకర్లు కొడుతోంది. ఓ వధువు.. తనకు కాబోయే వరుడు కోసం పెళ్లి ప్రకటన చేసింది. ఇందులో అశ్చర్యం ఏముంది అనుకుంటున్నారా..? పెళ్లి ప్రకటనకు ఎవరైనా వధువు లేదా వరుడు వివరాలు ఇస్తారు. కానీ ఆ వధువు తన క్రియేటివికి పదును పెట్టింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న తనకు.. కోవిషీల్డ్ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న వరుడే కావాలంటూ వివాహ ప్రకటన ఇచ్చింది. ఇదే ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పెళ్లాడిబోయే వరుడి కోసం ఆమె చేసిన క్రియేటివ్ ఆలోచన ఫన్నీగా నవ్వులు కురిపిస్తోంది. అంతే కాదండోయ్ వరుడులో ఏయే క్వాలిటీస్ ఉండాలో స్పష్టంగా చెప్పి.. పైన పేర్కొన్న అర్హత ఉన్నవారు సంప్రదించవచ్చునని పేర్కొంటూ.. వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం కొసమెరుపు. చదవండి: ల్యాప్‌టాప్‌కు అంత్యక్రియలు.. తర్వాత ఏం జరిగిందంటే బహుశా ఈ పిల్లికి భయానికి మీనింగ్ తెలియదు అనుకుంటా ..! -
తప్పతాగి వధువుకి బదులు కాబోయే అత్త మెడలో..
పెళ్లిలో వరుడు చేసిన బిత్తిరి పనికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు. అతగాడి అవతారం చూసి.. పెళ్లినాడే ఇలా ఉంటే.. ఇక జీవితాంతం ఎలా ఉంటాడు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ వరుడు చేసిన ఘనకార్యానికి సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. ఇంతకు అతగాడు వెలగబెట్టిన ఆ ఘనకార్యం ఏంటో తెలియాలంటే ఇది చదవాల్సిందే. నిరంజన్ మహామాత్ర అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో పెళ్లి జరుగుతుంటుంది. ఇక వరుడు తప్పతాగి మంటపానికి చేరుకుంటాడు. ఫుల్లుగా తాగి ఉండటంతో వరమాల మార్చుకునే సమయంలో.. వధువుకి బదులు ఆమె తల్లి.. అంటే కాబోయే అత్త మెడలో దండ వేయబోతాడు. పక్కనున్న వారు ప్రమాదాన్ని గ్రహించి పెళ్లికొడుకుని పక్కకు జరపుతారు. ఆ తర్వాత వరుడి స్నేహితులు అతడిని పట్టుకుని.. వధువు మెడలో వరమాల వేయించే ప్రయత్నం చేస్తారు. కానీ ఫుల్లుగా తాగి ఉండటంతో వధువు మెడలో వరమాల వేయకుండానే స్టేజీ మీదే పడిపోతాడు. పెళ్లికి వచ్చిన వారంతా వరుడి బిత్తరి చర్యకు షాక్ అయ్యారు. ఈ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది అనే దాని గురించి ఎలాంటి వివరాలు లేవు. ఇక పాతదే అయినా ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా ‘‘వీడికిందే పోయే కాలం.. పెళ్లి నాడు కూడా తప్పతాగి వచ్చాడు’’ అంటూ విమర్శిస్తున్నారు. చదవండి: పెళ్లిలో వధువు చేసిన పనికి వరుడు షాక్.. వైరల్ వీడియో View this post on Instagram A post shared by Niranjan Mahapatra (@official_niranjanm87) -
పెళ్లిలో వధువు కాళ్లు మొక్కిన వరుడు.. ఎందుకో తెలుసా
దేశంలో కరోనా ఉధృతి అధికంగా ఉంది. ప్రభుత్వం కఠిన నియమ నిబంధనలు అమలుపరుస్తున్నా కూడా కరోనాను కట్టడి చేయలేకపోతోన్నారు. ఇప్పుడు వచ్చేది పెళ్లిళ్ల సీజన్ కావడతో ఎంత ఆర్భాటం ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే పెళ్లి అంటే ఆకాశమంతా పందిరి అనే మాటలు ఇప్పుడు వినిపించవు. కరోనా దెబ్బకు పెళ్లిళ్ల రూపు రేఖలే మారిపోతోన్నాయి. తక్కువ సంఖ్యలో అతిథులు హాజరవుతున్నారు. అలా పెళ్లిళ్లు గుట్టుచప్పుడు కాకుండా చేసేసుకుంటున్నారు. కాగా పెండ్లి వేడుకల్లో వధువరూలే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. ఇదిలా ఉండగా పెళ్లిలో వధువుతో వరుడి కాళ్లు మొక్కించడం తెలిసిన విషయమే.. తాళి కట్టినప్పుడు, అక్షింతలు వేసినప్పుడు, గౌరీ పూజ జరిగేటప్పుడు ఇలా చాలా సార్లు వధువు చేత వరుడి కాళ్లకు దండం పెట్టిస్తారు. కానీ తాజాగా ఓ పెండ్లి వేడుకలో మాత్రం పూర్తిగా అందుకు భిన్నంగా వరుడే వధువు కాళ్లపైపడి దండం పెట్టాడు. వివాహ తంతు పూర్తయ్యి పెండ్లి కొడుకు, పెండ్లి కూతరు దండలు మార్చుకుంటున్న సమయంలో పెండ్లి కొడుకు అకస్మాత్తుగా పెండ్లి కూతురు కాళ్లపై పడ్డాడు. ఈ అనూహ్య పరిణామానికి ఫంక్షన్‌కు హాజరైన బంధు మిత్రులంతా ఆశ్యర్చపోయారు. అయితే అతడు ఇలా చేయడానికి ఓ కారణం ఉందంట.. తన వంశాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నది కాబట్టి ఆమె కాళ్లకు దండం పెట్టడం తన బాధ్యత అన్నాడు. తనను కన్నవాళ్లను, తోబుట్టువులను వదిలి నాకోసం, తన సంతోషం కోసం మా ఇంట్లో అడుగుపెట్టబోతున్న ఆమె కాళ్లకు దండం పెట్టడంలో తప్పేముందని ప్రశ్నించాడు. ప్రస్తుతం వరుడు వధువు కాళ్లపైపడ్డ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తున్నది. చదవండి: ఆమెను చీరలో చూడాలి.. ఫేర్వెల్ చేసుకోనివ్వండి.. ప్రధానికి ట్వీట్ -
పెళ్లి కుమార్తెను చూసి పడి పడి నవ్విన వరుడు
వివాహం జరగబోయే ఇల్లు ఎంత సండిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంధువుల హడావుడి, బావ మరదళ్ల సరసాలు.. మనవలు, మనవరాళ్ల అల్లరితో సరదగా సాగిపోతుంటుంది. ఇక పెళ్లింట్లో ప్రాంక్ చేస్తే ఆ మాజానే వేరు. జీవితాంతం ఆ సరదా సన్నివేశం అలా గుర్తుండిపోతుంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజనులు కడుపుబ్బ నవ్వించారు.. బెస్ట్‌ఫ్రెండ్‌కి.. బెస్ట్ గిఫ్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రఫి పినెడా రోజాస్ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో పెళ్లి కుమారుడు గోడవైపు తిరిగి వధువు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు. ఇంతలో పెళ్లి దుస్తులు ధరించి.. అందంగా ముస్తాబైన వధువు అక్కడకు వస్తుంది. వెనక్కి తిరిగిన పెళ్లి కుమారుడు... వధువు మేలి ముసుగు తొలగించి.. ఆమె ముఖం చూసి ఒక్కసారిగా షాకవుతాడు. ఆ వెంటనే తేరుకుని పడి పడి నవ్వుతాడు. అతడు అంతలా నవ్వడానికి కారణం ఏంటంటే పెళ్లి కుమార్తె గెటప్‌లో వచ్చింది అమ్మాయి కాదు.. అబ్బాయి. వరుడి బెస్ట్ ఫ్రెండ్ అతడిని ఆటపట్టించడం కోసం ఇలా పెళ్లి కుమార్తెలా తయారయి వచ్చి.. విజయవంతంగా ప్రాంక్ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. చదవండి: గడ్డకట్టే చలిలో.. బికినీ ధరించి బాల్కనీలో View this post on Instagram A post shared by Raphi Pineda Rojas🤍 (@raphirojas) -
‘కరోనా అని ముందే తెలుసుకుంటే బావ బతికేవాడు’
రోలుగుంట/విశాఖపట్నం: ఇక మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా పెళ్లి కుమారుడు కరోనాతో మృతి చెందడంతో ఆ ఇంట విషాదం అలుముకుంది. మృతుడి బంధువులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోలుగుంట మండలం అర్ల గ్రామానికి చెందిన యువతికి తన మేనమామ కుమారుడైన చింతపల్లి మండలం రాకోట గ్రామానికి చెందిన దేశగిరి రజనీకాంత్ (24)తో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 26న వీరి వివాహం జరగాల్సి ఉంది. రజనీకాంత్ పరవాడలో పోస్టల్ డిపార్టుమెంటులో ఉద్యోగం చేస్తున్నాడు. వరుడు ఈ నెల 13న పెళ్లి పనుల నిమిత్తం అర్ల గ్రామానికి వచ్చాడు. అప్పటికే కొద్దిపాటి జ్వరం ఉండడంతో నర్సీపట్నంలో ఓ ప్రయివేటు ఆస్పత్రిల్లో వైద్యం చేయించుకుని అర్ల వచ్చి ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నాడు. మరునాడు 14వ తేదీన ఫీల్డ్‌కు వచ్చిన హరిబాబు అనే హెల్త్ అసిస్టెంట్ రజనీకాంత్ పరిస్థితి తెలుసుకొని ఆందోళన చెందొద్దని.. మూడు రోజుల్లో తగ్గిస్తానని చెప్పి రూ. 1500కు ఫీజు మాట్లాడుకొని అతనే సొంతంగా వైద్యం ప్రారంభించాడు. సెలైన్ బాటిల్స్ ఎక్కించి, మూడు రోజులపాటు వైద్యం అందించాడు. పరిస్థితి విషమించడంతో ప్రభుత్వం ఆస్పత్రికి కాకుండా నర్సీపట్నంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ స్కానింగ్, ఇతర పరీక్షలు చేయించి, కరోనా పాజిటివ్ వచ్చిందని రూ.5 వేలు వసూలు చేశాడు. అప్పటికే ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి, పరిస్థితి విషమించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ రజనీకాంత్ శనివారం మృతి చెందాడు. హెల్త్ అసిస్టెంట్ వైద్యం కారణంగానే రజనీకాంత్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపిస్తున్నారు. ముందుగానే టెస్ట్‌లు చేసి నిర్ధారించి తగిన చికిత్స అందించి ఉంటే తనను వివాహం చేసుకోవలసిన తన బావ బతికే వాడని పెళ్లి కుమార్తె, బంధువులు బోరున విలపిస్తున్నారు. వివరణ కోరేందుకు హెల్త్ అసిస్టెంటుకు సాక్షి విలేకరి ఫోన్ చేసినా ఆయన లిఫ్ట్ చేయలేదు. చదవండి: అగ్గిపెట్టి వివాదం.. హత్యకు దారితీసింది ‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు -
వైరల్: వరుడి చెంప పగలగొట్టిన వధువు
లక్నో: ఘనంగా పెళ్లి జరిగింది. రిసెప్షన్‌కు అంతా సిద్ధమైంది. కొద్దిసేపట్లో ఫంక్షన్ ప్రారంభమవుతుందనగా వరుడు ఓ మెలిక పెట్టాడు. దానికి వధువు కుటుంబసభ్యులు ససేమిరా అన్నారు. అయినా కూడా వరుడు పట్టుబట్టడంతో విసుగు చెందిన పెళ్లికూతురు పెళ్లి మండపంపైనే అతడి చెంప ఛల్లుమనిపించింది. ఈ ఘటనతో వివాహానికి హాజరైన అతిథులు, బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమేథి జిల్లా సలీమ్‌పూర్ గ్రామానికి చెందిన నాసిమ్ అహ్మద్ కుమార్తెకు మహమ్మద్ ఇమ్రాన్ సాజ్‌తో మే 17వ తేదీన వివాహమైంది. బరాత్ అనంతరం విందు ఏర్పాటు చేశారు. అందంగా ముస్తాబై వేదికపై పెళ్లి కుమారుడు ఇమ్రాన్ సాజ్ కూర్చున్నాడు. అయితే ఈ సమయంలో వరకట్నం కింద తనకు బుల్లెట్ వాహనం ఇవ్వాలని వరుడు డిమాండ్ చేశాడు. అల్లుడి విజ్ఞప్తిని వధువు కుటుంబసభ్యులు తమకు కుదరదు.. అంత స్తోమత లేదని బతిమిలాడారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇదంతా గమనిస్తున్న వధువు తీవ్ర ఆవేశానికి గురయ్యింది. వెంటనే వరుడి వద్దకు వెళ్లి చెంపపై కొట్టింది. రెండు, మూడుసార్లు చేయి చేసుకుంది. ఆమె చర్యను అభినందించిన గ్రామస్తులు వరుడి కుటుంబసభ్యులపై దాడికి పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఇరువర్గాలను సర్ది చెప్పేందుకు ప్రయత్నించగా వినిపించుకోలేదు. మనస్తాపానికి గురైన వరుడు విడాకులు కావాలని పట్టుబట్టారు. పంచాయతీ ఎటూ తేలకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: బైక్ దొంగ చేసిన పనికి డ్రైనేజీలోకి పోలీసులు చదవండి: జనం చస్తుంటే.. జాతర చేస్తారా.. -
అక్క బలవంతంతో చెల్లెలి మెడలో కూడా తాళి, కట్ చేస్తే
కోలారు: ముళబాగిలు తాలూకాలోని వేగమడుగు గ్రామంలో 7వ తేదీన అక్కా చెల్లెలిని పెళ్లాడిన ఉమాపతిపై ముళబాగిలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పిల్లల రక్షణ కేంద్రం, తహశీల్దార్ సోమవారం గ్రామానికి వెళ్లి విచారించారు. ఒక పెళ్లికూతురు వయసు 16 ఏళ్లేనని తెలిసింది. దీంతో వరుడు ఉమాపతి, అతని తల్లిదండ్రులు దొడ్డలక్ష్మమ్మ, చిక్క చిన్నరాయప్ప, వధువు తల్లిదండ్రులు రాణెమ్మ, నాగరాజప్ప, పెండ్లిపత్రిక ముద్రించిన గాయత్రి ప్రింటర్స్ యజమాని, అర్చకుల పైన సిడిపిఓ ఎం.రమేష్ నంగలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వరున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి ఎంజి పాలి తెలిపారు. చదవండి: పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే.. చదవండి: (ఇదో విడ్డూరం: ఇద్దరు భామల ముద్దుల మొగుడు) -
రేపు పెళ్లిపీటలు ఎక్కాల్సిన వరుడు అంతలోనే..
మైసూరు: మరో రెండు రోజుల్లో అతడికి పెళ్లి జరగాల్సి ఉంది. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇంతలో కరోనా బలి తీసుకుంది. వివరాలు.. మైసూరు హెబ్బాళు నివాసి నవీన్ (31) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. మార్చి 7న ఓ యువతితో నిశి్చతార్థం జరిగింది. మే 19, 20 తేదీల్లో పెళ్లి ముహూర్తం. ఇంతలో నవీన్‌కు దగ్గు రావడంతో కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. శ్వాస తీసుకోలేకపోయాడు. దీంతో జిల్లా కోవిడ్ ఆస్పత్రికి తరలించగా సోమవారం మరణించాడు. నవీన్ ఇంట్లో అతని అన్న, వదినకు కరోనా సోకింది. పెళ్లి ఇంట రోదనలు మిన్నంటాయి. చదవండి: ప్రభుత్వ టీచర్ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా చదవండి: కరోనాతో టీవీ ఛానల్ ఎండీ కన్నుమూత -
విచిత్ర సంఘటన.. డ్రైవర్‌గా మారిన పెళ్లికొడుకు
సాక్షి, మహబూబ్‌నగర్: కరోనా సమయంలో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. పెళ్లికుమార్తె ఇంటికి వెళ్లేందుకు డ్రైవర్లు రాకపోవడంతో పెళ్లికుమారుడే డ్రైవర్‌గా మారాడు. నారాయణపేట జిల్లా మాగనూర్ మండలంలోని ఓబ్లాపూర్‌కు చెందిన మూర్తికి కృష్ణా మండలం హిందుపూర్‌కు చెందిన యువతితో వరుడి స్వగ్రామంలో శుక్రవారం వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తమ కుటుంబసభ్యులతో పెళ్లి కూతురు స్వగ్రామానికి వెళ్లడానికి లాక్డౌన్ ఉండడంతో డ్రైవర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో పెళ్లి కుమారుడు తన సొంత వాహనంలో పెళ్లి కుమార్తెను పక్కన కూర్చొబెట్టుకుని, మిగతా కుటుంబ సభ్యులను వాహనం వెనక ఎక్కించుకుని, పెళ్లికుమార్తె గ్రామానికి వెళ్లాడు. పెళ్లికుమారుడే వాహనం నడుపుకుంటూ రావడంతో గ్రామస్తులు ఆశ్చర్యంగా చూశారు. చదవండి: మేడమ్.. అలా వచ్చారు.. ఇలా మార్చారు..! -
వైరల్ వీడియో: పర్ఫామెన్స్ ఇరగదీస్తున్న పెళ్లికొడుకు
-
వైరల్ : పెళ్లి కూతురు సిగ్గు, పర్ఫామెన్స్ ఇరగదీస్తున్న పెళ్లికొడుకు
కరోనా వ్యాప్తితో దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయి. పెళ్లిళ్ల సీజన్ కావడంతో మీరు పెళ్లి చేసుకోండి.. కాకపోతే కరోనా నిబంధనల్ని పాటించాలంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో జరగాల్సిన పెళ్లితంతు పూర్తిగా మారిపోయింది. కరోనాకు ముందు పెళ్లంటే.. పెళ్లి మండపాల్లో చుట్టాలతో కళకళలాడేవి. మేళ తాళాలు కొత్త జీవితానికి శుభం పలుకుతూ ఆహ్వానించేవి. అతిథులు సమక్షంలో నూతన వధూవరులు ఒక్కటయ్యేవారు. కానీ, ఇప్పుడు అదేం లేదు. పెళ్లిళ్లు కళతప్పి ఎవరి పెళ్లి వాళ్లే చేసుకుంటున్నారు. అతిథులు లేకుండానే శుభకార్యాలు జరిగిపోతున్నాయి. తాజాగా జరిగిన ఓ పెళ్లిలో పెళ్లి కొడుకు తన పెళ్లికి తానే డప్పుకొట్టుకుంటున్నాడు. ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ఆ వీడియోను షేర్ చేయడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి తంతు అనంతరం వధూవరులు పెళ్లి మండపం నుంచి ఇంటికి వచ్చే క్రమంలో డప్పు చప్పుళ్లతో, మేళతాళాలతో ఆహ్వానిస్తారు. కానీ రూపిన్ శర్మ షేర్ చేసిన వీడియోలో పెళ్లి తర్వాత పెళ్లి కుమారుడు డప్పు వాయిస్తుంటే పెళ్లి కుమార్తె అతని వైపు చూస్తూ సిగ్గుపడుతుంది. ప్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పెళ్లి కొడుకే కానీ పక్కా ప్రొఫెషనల్ డ్రమ్స్ వాయిస్తున్నాడని ఓ నెటిజన్ అంటుంటే.. నా పెళ్లికి నేను డప్పు కొట్టుకుంటున్నా.. మీ పెళ్లికి మీరే డప్పు కొట్టుకోవాలంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. పెళ్లికూతురు సిగ్గుపడుతుంటే, పెళ్లికొడుకు పర్ఫామెన్స్ ఇరగదీస్తున్నాడంటూ మరోనెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టాడు. -
షాకింగ్: ఒంటి నిండా కట్లు.. షార్ట్ మీద వచ్చిన వరుడు
జకర్తా: వివాహం.. ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైన వేడుక. లైఫ్‌లో ఒక్కసారే జరిగే ఈ వేడుకని (అఫ్కోర్స్.. కొందిరి జీవితంలో రెండు, మూడు పెళ్లిల్లు కూడా ఉంటాయి)మరపురాని మధుర జ్ఞాపకంగా మలుచుకోవాలని భావిస్తారు చాలా మంది. అందుకే శక్తికి మించి ఖర్చు చేస్తారు. పెళ్లి మంటపం.. నుంచి తినే భోజనాల వరకు ప్రతీది ప్రత్యేకంగా ఉండాలని చూస్తారు. ఇక వివాహ సమయంలో ధరించే వస్త్రాల పట్ల చాలా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. వేలు, లక్షలు ఖర్చు చేసి మరి ప్రత్యేకంగా డిజైన్ చేయించుకుంటారు. వివాహ సమయంలో ప్రతి ఒక్కరి దృష్టి తమ మీద ఉండాలని ఆశిస్తారు. సాధారణంగా ఏ పెళ్లిలో అయినా కనిపించే దృశ్యాలు ఇవి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబేయే వార్త ఇందుకు భిన్నం. ఇక్కడ ఓ వరుడు చేతికి కట్టుతో.. ఒంటి మీద చొక్కా లేకుండా కేవలం షార్ట్ ధరించి పెళ్లికి హాజరయ్యారు. కాళ్లు, చేతులకు కట్లు కట్టి ఉన్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఈ సంఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది. ఈ పెళ్లి వేడుకలో వరుడి శరీరం మీద కట్లతో.. ఒంటి మీద చొక్కా కూడా లేకుండా హాజరైతే.. వధువు మాత్రం బుట్టబొమ్మలా తయారయి వచ్చి పెళ్లి కుమారిడి పక్కన కూర్చుంది. ఈ వేడుకకు బంధువులు కూడా బాగానే హాజరయ్యారు. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన వారంతా ‘‘పాపం ఆ యువకుడికి పెళ్లి అంటే ఇష్టం లేదేమో.. కొట్టి మరి ఇలా పెళ్లి చేస్తున్నారు’’ అని కామెంట్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం ‘‘ప్లీజ్ ఈ ఫోటోల వెనక స్టోరీ షేర్ చేయండి’’ అని కామెంట్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై సదరు పెళ్లి కుమార్తె స్పందించింది. ‘‘మా ఇద్దరికి ఈ వివామం ఇష్టమే. అయితే పెళ్లికి కొద్ది రోజుల ముందు నా భర్తకు యాక్సిడెంట్ అయ్యింది. పెట్రోల్ తీసుకురావడం కోసం వెళ్లి ప్రమాదానికి గురయ్యాడు. దాంతో ఇలా ఒళ్లంతా గాయాలయ్యాయి. బట్టలు వేసుకోవడానికి రావడం లేదు. అందుకే ఇలా షార్ట్ మీద వచ్చాడు’’ అని తెలిపింది. చదవండి: పెళ్లిలో భర్త పర్మిషన్తో లవర్ని.. -
అందమైన యువతుల ఫొటోలతో ఎర, గొంతులు మార్చి..
సాక్షి, సిటీబ్యూరో: తెలుగు మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతుల ఫొటోలు నిక్షిప్తం చేసి విదేశీ వరులను నమ్మించి బంగారు ఆభరణాలు, చీరలు కొనాలంటూ లక్షల్లో డబ్బులు దండుకొని మోసం చేస్తున్న యువతిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆమె నుంచి రూ.5,16,920 నగదుతో పాటు ఒక ల్యాప్‌టాప్, నాలుగు సెల్ఫోన్లు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సైబర్‌క్రైమ్ ఏసీపీ హరినాథ్ కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెల్లూరు జిల్లా ఇనమడుగుకు చెందిన కొర్రెమ్ స్వాతి అలియాస్ అర్చన, అలియాస్ జూటూరి వరప్రసాద్ అర్చన, అలియాస్ జూటూరి ఇందిరా ప్రియదర్శిని, అలియాస్ పుస్తయి ఎస్వీ యూనివర్సిటీలో ఎంబీఏ చదివింది. ఆ తర్వాత నెల్లూరులో ఓ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేసే సమయంలో ఏర్పడిన పరిచయంతో రంగనాయకులపేటకు చెందిన కొరమ్ దుర్గా ప్రవీణ్‌ను వివాహం చేసుకుంది. వేతనాలు సరిపోకపోవడంతో ఆర్థిక సమస్యల కారణంగా మోసాలకు తెరలేపింది. గూగుల్ ఫొటోలు సేకరించి.. గూగుల్ వెబ్సైట్ల నుంచి సేకరించిన ఫొటోలతో పాటు విదేశీ వరుడు మాత్రమే కావాలంటూ తెలుగు మ్యాట్రిమోనీ సైట్లలో వివరాలు పొందుపరిచింది. రెండో లైన్ మొబైల్ అప్లికేషన్ల ద్వారా వచ్చిన వర్చువల్ నంబర్(విదేశీ)ను సంప్రదించాలంటూ పేర్కొంది. దీనికి స్పందించిన వరుడు, అతడి తల్లిదండ్రులతో ఆడ, మగ అన్ని స్వరాలతో సెల్ లో నిక్షిప్తం చేసిన అడ్కామ్ వాయిస్ మాడులేషన్ సాఫ్ట్వేర్ ద్వారా మాట్లాడేది. వారు నమ్మారని అనుకున్నాక స్వాతి వారి పెళ్లి ప్రతిపాదనలకు ఓకే చెప్పేది. ఆ తర్వాత వారితో కొన్నిరోజులు చాటింగ్ చేశాకా అమెరికా నుంచి మరికొన్ని రోజుల్లో వస్తానంటూ చెప్పడంతో రాగానే కలుస్తామంటూ వరుడు, వారి తల్లిదండ్రులు ఆసక్తి చూపేవారు. బంగారు ఆభరణాలు.. చీరలు కావాలంటూ.. భారత్‌కు వస్తున్నానని చెప్పిన ఆమె పెళ్లి కోసం బంగారు ఆభరణాలు, చీరలు కావాలంటూ తియ్యటి మాటలతో వరుడు, అతడి తల్లిదండ్రులతో చెప్పేది. పెళ్లయ్యాక మీ ఇంటికే కదా వచ్చేది.. ఒకవేళ డబ్బులు ఎక్కువైతే తిరిగి మీకే ఇచ్చేస్తామంటూ లక్షల్లో డబ్బులు బురిడీ కొట్టించేది. ఆ తర్వాత నుంచి వారికి స్పందించడం మానేసేది. ఇలా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలో ఐదుకుపైగా కేసుల్లో ఆమె అరెస్టయ్యింది. తాజాగా రాచకొండలో మరో వరుడికి దాదాపు రూ.1.10 లక్షలు మోసం చేసింది. కేసు నమోదు చేసిన రాచకొండ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ఆర్.వెంకటేష్ సాంకేతిక సాక్ష్యాలతో నిందితురాలు స్వాతిగా గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. చదవండి: భర్తపై కోపంతో పిల్లలకు వాతలు అమానుషం.. ఫ్రెండ్ తల్లిపైనే అఘాయిత్యం