మరో వ్యక్తితో ప్రేయసి పెళ్లి.. సడెన్‌గా మాజీ ప్రేమికుడి ఎంట్రీ.. చివరికి | Viral Video Of Man Puts Sindoor On Bride In Front Of Groom On Wedding | Sakshi
Sakshi News home page

Viral Video: ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి.. సడెన్‌గా మాజీ ప్రేమికుడి ఎంట్రీ.. చివరికి

Published Mon, Dec 6 2021 6:49 PM | Last Updated on Tue, Dec 7 2021 9:53 AM

Viral Video Of Man Puts Sindoor On Bride In Front Of Groom On Wedding - Sakshi

లక్నో: నిజ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు సినిమా స్టోరీలకు ఏమాత్రం తీసిపోవు. తాజాగా ఉత్తర ప్రదేశ్‌లోని ఓ పెళ్లిలో సినిమాను మించి పోయే ఘటన చోటుచేసుకుంది. గోరఖ్‌పూర్‌లోని హర్‌పూర్‌లో బంధు మిత్రుల సమక్షంలో వివాహా వేడుక జరుగుతోంది. ఇంతలో పెళ్లి మండపంలోకి కండువా కప్పుకున్న ఓ యువకుడు సడెన్‌కు ఎంటర్‌ అయ్యాడు. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు దండలు మార్చుకుంటుండగా వెంటనే వారి మధ్యలోకి దూరి వధువు నుదుటిపై కుంకుమ దిద్దడానికి ప్రయత్నించాడు.
చదవండి: రెండు వేల ఏళ్లనాటి సమాధుల్లో... బంగారపు నాలుక!!

ఇది గమనించిన వధువు తన ముఖంపై పరదా కప్పుకునేందుకు ప్రయత్నించగా, బలవంతం ఆమె నుదుటిపై సింధూరాన్ని దిద్దాడు. పెళ్లి వేడుకను ఓ వ్యక్తి వీడియో తీస్తుండగా ఈ దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.అయితే వధువుకి కుంకుమ దిద్దిన వ్యక్తి ఆమె మాజీ ప్రేమికుడని తెలిసింది. అతను కొన్ని నెలల క్రితం పని నిమిత్తం  వేరే ఊరుకువెళ్లాడు. ఇంతలో తన ప్రేయసికి మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని తెలుసుకున్న యువకుడు హుటాహుటినా మండపానికి చేరుకున్నాడు.

తన ప్రేయసి పెళ్లి పెళ్లి ఆపేందుకు ఇలా ప్లాన్‌ చేయగా.. చివరికి యువకుడిని పట్టుకొని బంధువులు చితకబాదారు. అయితే ఈ రచ్చ అక్కడితో ముగియలేదు. ఇదంతా జరిగిన మరుసటి రోజు పెద్దలు కుదిర్చిన వరుడితోనే యువతి పెళ్లి జరిగింది. మరోవైపు చేసేందేం లేక మాజీ ప్రియుడు సైతం తన ఇంటికి వెళ్లి పోయాడు. 
చదవండి: గూగుల్‌లో ఇది చూశారా? దాని వాల్యూ ఎంతో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement