ప్రతి ఒక్కరి వివాహం అనగా తమకు కాబోయే వరుడు లేదా వధువు ఇలా ఉండాలనే కొన్ని అంచనాలు, ఆశలు ఉంటాయి. అది సహజం. మనం ఊహించినట్లగానే జరిగితే అందరికీ సంతోషమే కానీ చాలా మటుకు అలా కుదరుదు. ఒక్కోసారి మనం అనుకున్న అంచనాలకు విభిన్నంగా కూడా ఉండవచ్చు. అయినప్పటికీ కొందరూ సర్దుకుని పెళ్లి అయ్యాక నెమ్మదిగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారు.
కానీ ప్రస్తుతం యువత అలా లేదు. ప్రతీదీ చాలా స్పీడ్‌గా అయిపోవాలి. నచ్చలేదంటే అప్పటికప్పుడూ పీటల మీద పెళ్లైనా ఆపేసి బంధువుల్ని, తల్లదండ్రుల్ని షాక్ గురి చేస్తున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని ఫారుఖాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గీతా సింగ్ అనే యువతికి, భరత్ అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది. మంచి ఘనంగా వివాహ తంతు సాగుతుంది. ఇంకాసేపట్లో వివాహం అనంగా పెళ్లికూతురు చేసుకోనంటే చేసుకోను అని తెగేసి చెప్పింది. వరుడి పద్ధతి చాలా విచిత్రంగా ఉందని, అతనికి లెక్కలు సరిగా రావని కుటుంబ సభ్యులకు చెప్పింది.
దీంతో అమ్మాయ తరుఫు కుటుంబ సభ్యులు వరుడు వద్దకు వచ్చి పది రూపాయాల కరెన్సీ నోటులు మూడు ఇచ్చి లెక్కించమని పరీక్షించారు. పాపం ఆ వరుడు ఆ చిన్న పరీక్షలో నెగ్గలేకపోయాడు. అతను కరెన్సీ లెక్కించడంలో విఫలమవ్వడంతో అక్కడ ఉన్నవారందూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ యువతి మాత్రం నాకు అతను వద్దంటే వద్దని బీష్మించింది. దీంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. ఆఖరికి పోలీసులు సైతం జోక్యం చేసుకుని ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి సర్ధి చెప్పేందుకు ప్రయత్నించినా.. పెళ్లికూతురు ససేమిరా అని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో చేసేది లేక వరుడు, అతడి కుటుంబ సభ్యులు అక్కడ నుంచి భారంగా భనిష్క్రమించారు.
(చదవండి: నడిరోడ్డుపై కారు ఆపినందుకు..ఊహించని రేంజ్‌లో జరిమానా!)
Comments
Please login to add a commentAdd a comment