![Woman Refuses To Marry Dark Complexioned man in Uttar Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/07/9/marriage.jpg.webp?itok=C-SIHHi-)
లక్నో: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడుతాయంటారు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితాంతం కలిసి ఉంటామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లయ్యాక విడాకుల బాట పట్టే జంటలు ఎక్కువవుతున్నాయి. అంతేగాక మెడలో మూడు మూళ్లు పడకముందే పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. కారణాలు ఏవైనా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాలు.. ఎటావా జిల్లా భర్తనా పట్టణానికి చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఓ మంచి మూహుర్తం చూసి పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. అతిథులను పిలిచి, అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చివరికి వివాహం జరగుతుండగా నాకు ఈ పెళ్లి వద్దు అంటూ వధువు షాకిచ్చింది. పెళ్లి చూపుల సమయంలో చూసిన వ్యక్తి ఇతను కాదని పెళ్లి పీటలపై వివాహాన్ని రద్దు చేసింది.
‘ఫోటోలో చూసిన వ్యక్తి ఇతను కాదు. అతను చాలా అందంగా ఉన్నాడు. ఇతను నల్లగా ఉన్నాడు. వీళ్లు నన్ను మోసం చేశారని బోరున విలపించింది. ఫోటోలో తెల్లగా ఉన్న వ్యక్తిని చూపించారని, పీటల మీద వరుడు మారిపోయాడని ఆరోపించింది. అయితే వధువును ఒప్పించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా యువతి మాత్రం ససేమిరా అంది.
చదవండి: Heavy Rains Forecast: కుండపోత వర్షాలు.. ఈ నగరాలకు రెడ్ అలెర్ట్ జారీ
ఈ పంచాయితీ కాస్తా చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు దాదాపు ఆరుగంటల పాటు రెండు కుంటుంబాలకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరికి పెళ్లి రద్దు చేశారు. పెళ్లి ఆగిపోవడంతో ఆగ్రహించిన వరుడు కుంటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు శారు. పెళ్లి సమయంలో ఇచ్చిన నగలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment