dark complexion
-
భార్య నల్లగా ఉందని విడాకులు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: చర్మరంగుపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మనుషుల చర్మ రంగు విషయంలో మానవ ధృక్పథం మారాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌లో భార్య నలుపు రంగులో ఉందని చెబుతూ ఓ వ్యక్తి విడాకుల దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 2005లో వివాహమైన సదరు వ్యక్తి విడాకుల పిటిషన్‌ను తిరస్కరిస్తూ కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. శుక్రవారం హైకోర్టులో విచారణ సందర్భంగా తన భార్య తనను విడిచి వెళ్లినట్లు భర్త వాదించాడు. అయితే తన నలుపు రంగు కారణంగ భర్త వేధింపులకు గురిచేసినట్లు, ఇంటి నుంచి గెంటేసినట్లు భార్య తెలిపింది. దీంతో ఆమె తరపున నిలిచిన న్యాయస్థానం భర్తకు చివాట్లు పెట్టింది. ఈ కేసులో తీర్పు ద్వారా ఇతరులు కూడా చర్మ రంగు ఆధారంగా ఎంపిక చేసుకునే మనస్తత్వాన్నిప్రోత్సహించలేమని జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్ దీపక్ కుమార్ తివారీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. చర్మ రంగు ఆధారంగా వివక్షను నిర్మూలించాలని పిలుపునిచ్చింది. చర్మం రంగు ప్రాధాన్యతను ప్రోత్సహించలేమని పేర్కొంది. వివాహ సమయంలో భాగస్వామ్యుల ఎంపికవ విషయంలో చర్మం రంగు ప్రాధాన్యత, ఫేయిర్ నెస్ క్రీములపై జరిగిన లోతైన అధ్యయనాలను కోర్టు ప్రస్తావించింది. ముదురు రంగు చర్మం గల(మహిళలు) వారిని తక్కువగా చూపించడం, చర్మాన్ని కాంతివంతం చేసే సౌందర్య సాధనాలలో ఎక్కువ భాగం మహిళలను లక్ష్యంగా చేసుకుంటాయని తెలిపింది. తక్కువ రంగు చర్మం కలిగిన స్త్రీలను తక్కువ కాన్ఫిడెంట్‌గా చూపించే ప్రయత్నం చేయడంతో పాటు జీవితంలో సక్సెస్ అవ్వలేరని చూపించే వారని కోర్టు పేర్కొంది. కాబట్టి నల్లటి రంగు కంటే ఫెయిర్ స్కిన్‌కి ప్రాధాన్యత ఇవ్వాలనే సమాజం మనస్తత్వం మారాలని కోర్టు తెలదిపింది. ఈ కేసులో భర్త విడాకులను ఆమోదించలేమని కోర్టు చెప్పింది. -
వరుడు రంగు తక్కువగా ఉన్నాడని...
ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబిలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక పెళ్లి కుమార్తె తనకు కాబోయే భర్తలోని ఒక లోపాన్ని ఎత్తి చూపుతూ పెళ్లికి నిరాకరించింది. దీంతో ఇదెక్కడి గోలరా అనుకుంటూ అక్కడున్నవారంతా కంగుతిన్నారు. వధువు తనకు కాబోయే భర్త మెడలో దండ వేసేందుకు వివాహ వేదికపైకి వచ్చింది. అతనిని పరిశీలనగా చూసి పూల దండ వేసేందుకు నిరాకరించింది. వధువు నిర్ణయాన్ని విన్న అక్కడున్నవారంతా నిర్ఘాంత పోయారు. వరుడు రంగు తక్కువగా ఉన్నాడని అతనిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీనికితోడు ఆ యువకుడు వయసు మీదపడినవానిలా కనిపిస్తున్నాడని కూడా వధువు ఆరోపించింది. వధువు ఈ విధంగా మాట్లాడేసరికి కల్యాణమండపంలో కలకలం చెలరేగింది. పెళ్లికి వచ్చిన పెద్దలు ఎంతనచ్చజెప్పినా ఆమె ససేమీరా అనడంతో వరుడు కల్యాణమండపం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన మే 29న జరిగింది. పిపరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్పురాలో ఉంటున్న యువకునికి చర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయ్యింది. 29న వరుడు తమ తరపు పెద్దలతో పాటు పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. వధువు తరపువారంతా పెళ్లి కొడుకుకు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. తరువాత వరమాల కార్యక్రమానికి సన్నాహాలు చేశారు. చదవండి: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే.. వధువు పూల దండ తీసుకుని వివాహ వేదికపైకి వచ్చింది. అయితే అతనిని పరిశీలనగా చూసి, అతనికి పూల దండ వేసేందుకు నిరాకరించింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. వరుడు కూడా ఆందోళకు లోనయ్యాడు. పెళ్లికి వచ్చిన పెద్దలు వధువును కారణం అడగగా వరుడు రంగు తక్కువగా ఉన్నాడని, వయసు ఎక్కువగా కనిపిస్తున్నదని, అందుకే తాను ఈ వివాహం చేసుకోబోనని తేల్చిచెప్పేసింది. దీంతో వారు ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినా ఆమె వారి మాట వినలేదు. దీంతో ఈ వివాదం పరిష్కారానికి గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. అక్కడున్నవారంతా ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె తనకు ఈ పెళ్లి వద్దంటూ తెసేసి చెప్పేసింది. వధువు తరపువారు చేసేదేమీ లేక వెనుకకు తిరిగి వెళ్లిపోయారు. -
పెళ్లి పీటలపై వరుడికి షాకిచ్చిన వధువు.. రెండడుగులు కలిసి నడిచి..
లక్నో: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడుతాయంటారు. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ జీవితాంతం కలిసి ఉంటామని పెళ్లిలో ప్రమాణం చేస్తారు. కానీ ఈ మధ్య కాలంలో పెళ్లయ్యాక విడాకుల బాట పట్టే జంటలు ఎక్కువవుతున్నాయి. అంతేగాక మెడలో మూడు మూళ్లు పడకముందే పెళ్లిని పెటాకులు చేస్తున్నారు. కారణాలు ఏవైనా పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనే తాజాగా ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఎటావా జిల్లా భర్తనా పట్టణానికి చెందిన యువతికి ఓ యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. ఓ మంచి మూహుర్తం చూసి పెళ్లి కూడా ఫిక్స్ చేశారు. అతిథులను పిలిచి, అంగరంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. చివరికి వివాహం జరగుతుండగా నాకు ఈ పెళ్లి వద్దు అంటూ వధువు షాకిచ్చింది. పెళ్లి చూపుల సమయంలో చూసిన వ్యక్తి ఇతను కాదని పెళ్లి పీటలపై వివాహాన్ని రద్దు చేసింది. ‘ఫోటోలో చూసిన వ్యక్తి ఇతను కాదు. అతను చాలా అందంగా ఉన్నాడు. ఇతను నల్లగా ఉన్నాడు. వీళ్లు నన్ను మోసం చేశారని బోరున విలపించింది. ఫోటోలో తెల్లగా ఉన్న వ్యక్తిని చూపించారని, పీటల మీద వరుడు మారిపోయాడని ఆరోపించింది. అయితే వధువును ఒప్పించేందుకు ఇరు కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా యువతి మాత్రం ససేమిరా అంది. చదవండి: Heavy Rains Forecast: కుండపోత వర్షాలు.. ఈ నగరాలకు రెడ్ అలెర్ట్ జారీ ఈ పంచాయితీ కాస్తా చివరికి పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు దాదాపు ఆరుగంటల పాటు రెండు కుంటుంబాలకు సర్ధిచెప్పేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరికి పెళ్లి రద్దు చేశారు. పెళ్లి ఆగిపోవడంతో ఆగ్రహించిన వరుడు కుంటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు శారు. పెళ్లి సమయంలో ఇచ్చిన నగలను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. -
అబ్బాయి నల్లగా ఉన్నాడు.. నాకీ పెళ్లొద్దు!
మరి కొద్ది సేపట్లో పెళ్లి ఉందనగా.. బిహార్‌లోని బక్సర్ జిల్లాలో ఓ యువతి తనకు చూపించిన పెళ్లికొడుకు నల్లగా ఉన్నాడని, తనకు సరిపోయేంత అందంగా లేడని చెప్పి పెళ్లికి నిరాకరించింది. తనకు భార్య అవుతుందనుకున్న అమ్మాయి తన రంగు చూసి తనను నిరాకరించిన విషయం తెలిసి పెళ్లికొడుకు షాకయ్యాడు. ఈ ఘటన పట్నాకు 125 కిలోమీటర్ల దూరంలోని రామ్ రేకా నగరంలో గల ఓ కళ్యాణమండపంలో జరిగింది. ఎలాగోలా పెళ్లికూతురుతో మాట్లాడి పెళ్లికి ఒప్పించాలని తన తరఫు బంధువులను, కుటుంబ సభ్యులను ప్రాధేయపడ్డాడు. ఇది సమాజంలో తన గౌరవానికి సంబంధించిన విషయమని చెప్పాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం నల్లటి అబ్బాయిని పెళ్లి చేసుకునేది లేదని స్పష్టం చేసిందని జిల్లా పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నిజానికి పెళ్లి తంతు జరిగే క్రమంలో మొదట్లో ఆ అమ్మాయి సంతోషంగానే కనిపించింది. కానీ, ఉన్నట్టుండి తన కుటుంబ సభ్యులను, స్నేహితులను పిలిచి అబ్బాయి అంజనీ చౌహాన్ నల్లగా ఉన్నాడు కాబట్టి తాను పెళ్లి చేసుకోనని చెప్పింది. దాంతో పెళ్లికొడుకుకు సంబంధించిన ఇద్దరు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి విషయాల్లో తాము ఏమీ చేయలేమని, అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేయించడం కుదరదని వాళ్లు తెగేసి చెప్పారు. బిహార్‌లో గత రెండు వారాల్లో ఇలా జరగడం ఇది రెండోసారి. ఏప్రిల్ చివరివారంలో కూడా ఇలాగే ఓ ఘటన జరిగింది. సమస్తిపూర్ జిల్లాలో ఇలాగే ఓ అబ్బాయి నల్లగా ఉన్నాడని ఓ అమ్మాయి పెళ్లికి నిరాకరించింది. పెళ్లికొడుకులు అందంగా లేరని, నిరక్షరాస్యులని, తాగుబోతు అని, డ్రగ్స్ అలవాటు ఉందని, చెవుడు ఉందని, లేదా నిరుద్యోగి అని.. ఇలా రకరకాల కారణాలతో అమ్మాయిలు సంబంధాలు నిరాకరిస్తున్నారు. రోజులు మారిపోయాయని, అమ్మాయిలు ఉద్యోగాలు కూడా చేసుకుంటున్నారని, ఇక వాళ్లు ఎందుకు రాజీ పడతారని పెళ్లికి వచ్చిన ఓ పెద్దాయన వ్యాఖ్యానించారు.