
ఉత్తరప్రదేశ్‌లోని కౌషాంబిలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక పెళ్లి కుమార్తె తనకు కాబోయే భర్తలోని ఒక లోపాన్ని ఎత్తి చూపుతూ పెళ్లికి నిరాకరించింది. దీంతో ఇదెక్కడి గోలరా అనుకుంటూ అక్కడున్నవారంతా కంగుతిన్నారు. వధువు తనకు కాబోయే భర్త మెడలో దండ వేసేందుకు వివాహ వేదికపైకి వచ్చింది. అతనిని పరిశీలనగా చూసి పూల దండ వేసేందుకు నిరాకరించింది. వధువు నిర్ణయాన్ని విన్న అక్కడున్నవారంతా నిర్ఘాంత పోయారు. వరుడు రంగు తక్కువగా ఉన్నాడని అతనిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. దీనికితోడు ఆ యువకుడు వయసు మీదపడినవానిలా కనిపిస్తున్నాడని కూడా వధువు ఆరోపించింది.
వధువు ఈ విధంగా మాట్లాడేసరికి కల్యాణమండపంలో కలకలం చెలరేగింది. పెళ్లికి వచ్చిన పెద్దలు ఎంతనచ్చజెప్పినా ఆమె ససేమీరా అనడంతో వరుడు కల్యాణమండపం నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. ఈ ఘటన మే 29న జరిగింది. పిపరీ పోలీస్ స్టేషన్ పరిధిలోని షేర్‌పురాలో ఉంటున్న యువకునికి చర్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం అయ్యింది. 29న వరుడు తమ తరపు పెద్దలతో పాటు పెళ్లి ఊరేగింపుతో వధువు ఇంటికి చేరుకున్నాడు. వధువు తరపువారంతా పెళ్లి కొడుకుకు ఘనంగా స్వాగత సత్కారాలు చేశారు. తరువాత వరమాల కార్యక్రమానికి సన్నాహాలు చేశారు.
చదవండి: కోరమండల్ ఎక్స్‌ప్రెస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందంటే..
వధువు పూల దండ తీసుకుని వివాహ వేదికపైకి వచ్చింది. అయితే అతనిని పరిశీలనగా చూసి, అతనికి పూల దండ వేసేందుకు నిరాకరించింది. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం నెలకొంది. వరుడు కూడా ఆందోళకు లోనయ్యాడు. పెళ్లికి వచ్చిన పెద్దలు వధువును కారణం అడగగా వరుడు రంగు తక్కువగా ఉన్నాడని, వయసు ఎక్కువగా కనిపిస్తున్నదని, అందుకే తాను ఈ వివాహం చేసుకోబోనని తేల్చిచెప్పేసింది. దీంతో వారు ఆమెకు నచ్చజెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించారు. అయినా ఆమె వారి మాట వినలేదు. దీంతో ఈ వివాదం పరిష్కారానికి గ్రామంలో పంచాయతీ నిర్వహించారు. అక్కడున్నవారంతా ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె తనకు ఈ పెళ్లి వద్దంటూ తెసేసి చెప్పేసింది. వధువు తరపువారు చేసేదేమీ లేక వెనుకకు తిరిగి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment