Bride absconded with her lover on wedding day, then father took this decision - Sakshi
Sakshi News home page

వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ!

Published Sat, Jun 10 2023 10:19 AM | Last Updated on Sat, Jun 10 2023 11:03 AM

bride absconded with her lover on wedding day - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో వధువు మాయమయ్యింది. విషయం తెలుసుకున్న వధువు తండ్రి నిర్ఘాంతపోయాడు. కొద్దిసేపటికి తేరుకుని ఆయన చేసిన పనికి అక్కడున్నవారంతా అతనిని అభినందనలతో ముంచెత్తారు.

ఉత్తరప్రదేశ్‌లోని బాందాలోని ఒక ఇంటిలో పెళ్లి వేడుక జరుగుతోంది. ఇంతలో వధువు తన ప్రియునితో పరారయ్యింది. విషయం తెలియగానే వధువు తండ్రితో పాటు పెళ్లికి హాజరైనవారంతా ఆందోళనకు లోనయ్యారు. అయితే వధువు తండ్రి తన చిన్న కుమార్తెను అదే వరునికి ఇచ్చి వివాహం చేశాడు. అలాగే తన పెద్ద కుమార్తెను తీసుకువెళ్లిపోయిన యువకునిపై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం తిద్వారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తె వివాహం జూన్‌ 8న నిశ్చయించామన్నాడు. కన్నౌజ్‌ జిల్లా నుంచి మగపెళ్లివారు వచ్చారన్నారు. ఇంతలో గ్రామానికి చెందిన ఒక యువకుడు తన కుమార్తెను తీసుకువెళ్లిపోయాడని ఫిర్యాదు చేశాడు.అతనిపై తక్షణం చర్యలు చేపట్టాలని కోరాడు. 

పెద్ద కుమార్తె వెళ్లిపోయిందని, చిన్న కుమార్తెతో..

మగపెళ్లివారు కల్యాణమండపానికి చేరుకున్నంతలో వధువు తన ‍ప్రియునితో పరారైన విషయం అక్కడున్నవారందరికీ తెలిసింది. వెంటనే వధువు తండ్రి తన చిన్న కుమార్తెతో ఈ వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అతని చిన్న కుమార్తె, వరునితో పాటు అతని తరపువారంతా  సమ్మతించారు. దీంతో వివాహ వేడుక యధావిధిగా జరిగింది.

పోలీసులు ఏమన్నారంటే..

ఈ ఉదంతం గురించి పోలీసు అధికారి అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఒక యువతిని ఒక యువకుడు తీసుకుని వెళ్లిపోయాడంటూ ఫిర్యాదు అందింది. ఆ యువతి తండ్రి దీనిపై ఫిర్యాదు చేశాడన్నారు. ఆ యవతీ యువకులను వెదికేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని పోలీసులు తెలిపారు.

ఇది కూడా చదవండి: హిందూ యువకుని ముస్లిం ‘వ్యవహారం’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement