jump
-
అయ్యో దేవుడా! అంత్యక్రియలకు రూ. 30 లక్షలా?
మానవ సంబంధాలన్నీ ఆర్థికమైనవే అని కార్ల్‌మార్క్స్ చాలాకాలం క్రితమే తేల్చేశాడు కానీ.. ఈ సూత్రానికి మినహాయింపులూ చాలానే ఉన్నాయి. సమాజం మాట కాకపోయినా.. తల్లిదండ్రులు.. దగ్గరి బంధువులతో సంబంధాలను, డబ్బుతో ముడి పెట్టకుండా చూసుకునేవారు చాలామందే కనిపిస్తారిప్పుడు. అయితే.. కెనెడాలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉన్నట్లు తాజా వార్తలను బట్టి తెలుస్తోంది. దహన సంస్కారాలకు ఎక్కువ ఖర్చు అవుతోందన్న కారణంగా చాలామంది శవాలను మార్చురీల్లో కుళ్లిపోయేలా చేస్తున్నారని చెబుతున్న ఈ వార్తలు అయ్యో అనిపించేవి.అంత్యక్రియలు అనేది మరణించిన వారి గౌరవార్థం నిర్వహించే కర్మ. ఎవరి ఆచారానికి తగ్గట్టు, ఎవరి ఆర్థిక స్థోమతకు తగ్గట్టు అంత్యక్రియలు నిర్వహించడం పరిపాటి. కానీ కెనడాలోదారుణ పరిస్థితులునెలకొన్నాయి. ఒక్కో మృత దేహానికి నిర్వహించే అంత్యక్రియలు ఖర్చు రూ. 27 నుంచి 30లక్షల దాటి పోతుండటంతో ఏం ఏయాలో తోచక అయోమయంలో పడిపోతున్నారు జనం.ఒకవైపు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న దుఃఖం, మరోవైపు పరలోకానికి చేరిన తమ ఆత్మీయులకు కూడా అంత్యక్రియలు నిర్వహించలేక అనాథ శవాల్లా వదిలివేస్తున్న వైనం ఆందోళన కరంగా మారింది. ఎందుకంటే అక్కడ ఏరియాను బట్టి, అంత్యక్రియల ఖర్చు ఏకంగా రూ. 30 లక్షలకుపై మాటే.. అంతసొమ్ము భరించడం తమవల్ల కాకపోవడంతో చేసేది లేక దిక్కులేని శవాల్లా వాటిని వదిలేస్తున్నారు. దీంతో అనాథ మృతదేహాల సంఖ్య పేరుకు పోతోందిట.దాదాపు దేశమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కెనడాలో, స్థానాన్ని బట్టి శ్మశానవాటిక ప్లాట్ల ధరలలో గణనీయమైన వ్యత్యాసం ఉంది. కెనడాలో అంత్యక్రియలకు సగటున 3 వేల డాలర్లకు పైనే అవుతోంది. మిడ్‌టౌన్ టొరంటోలో భారీగా ధర (రూ. 27 లక్షలు.) చెల్లించాల్సి వస్తోంది. ఇతర ఖర్చులు కలిపి మొత్తం వ్యయం రూ. 30 లక్షలు దాటేస్తోంది. అంటారియో ప్రావిన్సులో 2013లో 242 అనాథ శవాలను గుర్తించగా పదేళ్లు తిరిగేసరికి అంటే 2023 ఆ సంఖ్య 1,183కు చేరుకుంది. క్యూబెక్‌లో, 2013లో 66గా ఉన్న క్లెయిమ్ చేయని మృతదేహాల సంఖ్య 2023లో 183కి పెరిగింది. అల్బెర్టాలో, 2016లో 80 ఉన్న మృతదేహాల సంఖ్య 2023లో 200కి పెరిగింది. మృతదేహాల వద్ద లభించిన ఆధారాలను బట్టి అవి తమవారివేనని కుటుంబ సభ్యులు గుర్తించినప్పటికీ, అంత్యక్రియల ఖర్చుకు భయపడి తీసుకెళ్లేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై ప్రతి పక్షాలు విచారం వ్యక్తం చేశాయి. -
దీన్నే పిచ్చి అంటారు..మారండి ప్లీజ్! వైరల్ వీడియో
లేని పోని ప్రయోగాలకు పోతూ ప్రాణాలకు మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా వేగంగా కదులుతున్న ట్రైన్లోంచి ఒక బాలిక దూకేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. విపరీత పోకడలతో సాహసాలు చేయొద్దని ఎంత చెప్పినా ప్రయోజనం ఉండటంలేదు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఒక బాలిక చాలా వేగంగా కదులుతున్న రైలు ద్వారం దగ్గర నిలబడి ఉంటుంది.. మెల్లిగా మెట్లు దిగుతూ సడెన్‌గా పట్టాలపైకి దూకేసింది. అయితే ఆమెను నివారించాల్సిన వారు వీడియో తీయడం విమర్శలకు తావిచ్చింది. ఇది కావాలనే చేశారా? లేదా ఆమె ఆత్మహత్యకు యత్నించిందా? ఎక్కడ జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానం లేదు. అయితే ఆమె తీవ్ర గాయాలతో బతికే ఉందని మాత్రం కొంత మంది కమెంట్ చేశారు. Girl jumps from a running train expecting to get off like in Bollywood 🤦♂️🤦♂️🤦♂️ pic.twitter.com/5ktDKMus6o — Pagan 🚩 (@paganhindu) April 12, 2024 -
హైబ్రిడ్ ఫండ్స్‌కు భారీ డిమాండ్
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకాలకు గత నెలలో భారీ డిమాండ్ నెలకొంది. దీంతో 2024 జనవరిలో పెట్టుబడులు 37 శాతం జంప్ చేశాయి. రూ. 20,634 కోట్లను తాకాయి. డెట్ ఫండ్స్‌పై పన్ను చట్టాలలో మార్పులరీత్యా ప్రత్యామ్నాయ పెట్టుబడి అవకాశంగా నిలుస్తుండటంతో ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2023–24) తొలి 10 నెలల్లో(ఏప్రిల్–జనవరి) హైబ్రిడ్ ఫండ్స్‌లో మొత్తం పెట్టుబడులు రూ. 1.21 లక్షల కోట్లకు చేరాయి. అయితే గతేడాది(2022–23) హైబ్రిడ్ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు వెనక్కి మళ్లిన సంగతి తెలిసిందే. హైబ్రిడ్ ఫండ్స్ అంటే హైబ్రిడ్ ఫండ్స్‌కు చెందిన మ్యూచువల్ ఫండ్ పథకాలు సాధారణంగా ఈక్విటీ, రుణ సెక్యూరిటీలు రెండింటిలోనూ ఇన్వెస్ట్ చేస్తాయి. కొన్ని సందర్భాలలో బంగారం తదితర ఆస్తులలోనూ పెట్టుబడులకు ప్రాధాన్యత ఇస్తుంటాయి. కాగా.. 2023 ఏప్రిల్ నుంచి హైబ్రిడ్ ఫండ్స్ పెట్టుబడిదారులను తమవైపు తిప్పుకున్నాయి. ఇందుకు ప్రధానంగా ఏప్రిల్ నుంచి డెట్ ఫండ్స్ పన్ను చట్టాలలో నెలకొన్న సవరణలు ప్రభావం చూపుతున్నాయి. అంతక్రితం మార్చితో ముగిసిన ఏడాదిలో రూ. 12,372 కోట్ల పెట్టుబడులు తరలిపోవడం గమనార్హం! మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) తాజా గణాంకాల ప్రకారం జనవరిలో హైబ్రిడ్ పథకాలు రూ. 20,637 కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. అంతకుముందు డిసెంబర్లో లభించిన రూ. 15,009 కోట్లతో పోలిస్తే భారీగా ఎగశాయి. ప్రధానంగా ఆర్బిట్రేజ్ ఫండ్స్, మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు అత్యధిక పెట్టుబడులు ప్రవహించాయి. ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు రూ. 10,608 కోట్లు లభించగా.. మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్‌కు రూ. 7,080 కోట్ల పెట్టుబడులు తరలి వచ్చాయి. గత ఆరు నెలల్లోనూ ఇన్వెస్టర్లు తమ మొత్తం పెట్టుబడుల్లో ఆర్బిట్రేజ్ ఫండ్స్‌కు 50–70 శాతాన్ని కేటాయించారు. ఇందుకు పన్ను మార్గదర్శకాలలో మార్పులు కారణమవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఆర్బిట్రేజ్ ఫండ్స్ స్ప్రెడ్ సుమారు 8 శాతానికి చేరడం పెట్టుబడి అవకాశాలకు దారి చూపుతున్నట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ వెల్లడించారు. ఫోలియోలు ప్లస్ జనవరిలో హైబ్రిడ్ ఫోలియోలు 3.36 లక్షలు కొత్త గా జత కలిశాయి. దీంతో మొత్తం హైబ్రిడ్ ఫోలియోల సంఖ్య 1.31 కోట్లకు చేరింది. వెరసి మొత్తం 16.95 కోట్ల ఫోలియోలలో వీటి వాటా 7.7 శాతా న్ని తాకింది. తక్కువ రిస్క్ భరించే ఇన్వెస్టర్లకు హై బ్రిడ్ ఫండ్స్ ఉపయుక్తంగా ఉంటాయి. ఈక్విటీ మా ర్కెట్లలో పెట్టుబడులు ఆటుపోట్లకు లోనయ్యే సంగతి తెలిసిందే. అయితే ఫిక్స్డ్ ఆదాయంలో లభించే స్థిరత్వాన్ని ఇవి కల్పిస్తుండటంతో పెట్టుబడు లను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఫిక్స్డ్ ఆదా యం మార్గాలలో ఇన్వెస్ట్ చేయదలచినవారు హైబ్రి డ్ ఫండ్స్వైపు చూస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. -
కరూర్ వైశ్యా లాభం హైజంప్
ముంబై: ప్రైవేట్ రంగ సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ. 412 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో కేవలం రూ. 289 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 2,013 కోట్ల నుంచి రూ. 2,497 కోట్లకు చేరింది. స్థూల మొండిబకాయిలు(ఎన్పీఏలు) 1.12 శాతం మెరుగుపడి 1.58 శాతానికి చేరాయి. గత క్యూ3లో 2.7 శాతంగా నమోదయ్యాయి. నికర ఎన్పీఏలు సైతం 0.9 శాతం నుంచి 0.42 శాతానికి దిగివచ్చాయి. వృద్ధి, లాభదాయకత, రుణాల నాణ్యత తదితర అంశాలలో మరోసారి నిలకడైన, పటిష్ట పనితీరును ప్రదర్శించగలిగినట్లు బ్యాంక్ ఎండీ, సీఈవో బి.రమేష్ బాబు పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో శనివారం కరూర్ వైశ్యా బ్యాంక్ షేరు బీఎస్ఈలో 0.3 శాతం బలపడి రూ. 170 వద్ద ముగిసింది. -
లాభాల్లోకి టాటా మోటార్స్.. షేర్ల ధరకు రెక్కలు
న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) తొలి త్రైమాసికంలో టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో రూ. 3,301 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 4,951 కోట్ల నికర నష్టం ప్రకటించింది. లగ్జరీకార్ల బ్రిటిష్ అనుబంధ సంస్థ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్ఆర్)తోపాటు వాణిజ్య వాహన బిజినెస్ పుంజుకోవడం కంపెనీ పటిష్ట పనితీరుకు దోహదపడ్డాయి. ఇక మొత్తం ఆదాయం సైతం రూ. 71,228 కోట్ల నుంచి రూ. 1,01,528 కోట్లకు జంప్‌చేసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 77,784 కోట్ల నుంచి రూ. 98,267 కోట్లకు ఎగశాయి. ఈ కాలంలో టాటా మోటార్స్ స్టాండెలోన్ నష్టం రూ. 181 కోట్ల నుంచి రూ. 64 కోట్లకు తగ్గింది. మొత్తం ఆదాయం రూ. 14,793 కోట్ల నుంచి రూ. 15,733 కోట్లకు బలపడింది. జేఎల్ఆర్ జూమ్... ప్రస్తుత సమీక్షా కాలంలో జేఎల్ఆర్ ఆదాయం 57 శాతం జంప్‌చేసి 6.9 బిలియన్ పౌండ్లను తాకగా.. 43.5 కోట్ల పౌండ్ల పన్నుకు ముందు లాభం ఆర్జించింది. కొత్త ఏడాదిని పటిష్టంగా ప్రారంభించినట్లు జేఎల్ఆర్ కొత్త సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు. క్యూ1లో రికార్డ్ క్యాష్‌ఫ్లోను సాధించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మొత్తం క్యూ1 స్థాయి పనితీరు చూపగలమని విశ్వసిస్తున్నట్లు గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ పేర్కొన్నారు. ఇదీ చదవండి ➤ SEBI Notices To Yes Bank Ex CEO: యస్ బ్యాంక్ రాణా కపూర్‌కు సెబీ నోటీసు.. రూ. 2.22 కోట్లు కట్టాలి కాగా.. వాణిజ్య వాహన విభాగం ఆదాయం 4.4 శాతం పుంజుకుని రూ. 17,000 కోట్లను తాకింది. దేశీయంగా హోల్‌సేల్ అమ్మకాలు 14 శాతం క్షీణించి 82,400 యూనిట్లకు చేరగా.. రిటైల్ విక్రయాలు ఇదే స్థాయిలో నీరసించి 77,600 యూనిట్లకు పరిమితమయ్యాయి. ప్రయాణికుల వాహన విభాగం ఆదాయం 11 శాతం ఎగసి రూ. 12,800 కోట్లను తాకినట్లు కంపెనీ ఈడీ గిరీష్ వాగ్ తెలియజేశారు. అమ్మకాలు 8 శాతం వృద్ధితో 1,40,400 యూనిట్లకు చేరినట్లు వెల్లడించారు. బలమైన జూన్ త్రైమాసిక ఆదాయాలతో బుధవారం (జులై 26) ట్రేడింగ్‌లో ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్ షేర్లు 4 శాతానికి పైగా జంప్ చేసి 52 వారాల గరిష్ట స్థాయి రూ.665.40కి చేరుకున్నాయి. -
'కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చావడం మేలు'
నాగ్‌పూర్:కాంగ్రెస్‌లో చేరడం కంటే.. బావిలో దూకి చనిపోవడమే మేలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కాంగ్రెస్‌లో చేరవలసిందిగా దివంగత కాంగ్రెస్ నేత శ్రీకాంత్ జిచ్కర్ కోరినప్పుడు తాను ఈ మేరకు ఆఫర్‌ను తిరస్కరించినట్లు చెప్పారు. కాంగ్రెస్ 60 ఏళ్లలో చేసిన పనికంటే బీజేపీ 9 ఏళ్లలోనే రెండింతల పని చేసినట్లు చెప్పారు. బీజేపీ 9 ఏళ్ల పాలనపై మహారాష్ట్రలోని బాంధ్రాలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. ఈ క్రమంలో తన రాజకీయ జీవతం తొలినాళ్ల నాటి విషయాలను పంచుకున్నారు. అయితే..గడ్కరీ రాజకీయ జీవితం అంతా ఆర్ఎస్ఎస్తో ముడిపడి ఉంది. ఏబీవీపీ నుంచి విద్యార్థి నాయకునిగా మొదలైన ఆయన ప్రస్థానం ఆర్ఎస్ఎస్ విలువలతో రాజకీయ జీవితం ప్రారంభమైంది. పార్టీ కోసం నిజాయితిగా కష్టపడి పనే చేసే కార్యకర్తగా నితిన్ గడ్కరీ మంచి పేరు సంపాదించుకున్నారు. 'మనదేశ ప్రజాస్వామ్య చరిత్రను మర్చిపోవద్దు. గతం నుంచి మనం నేర్చుకోవాలి. కాంగ్రెస్ గత 60 ఏళ్లలో గరీబి హఠావో అనే నినాదాన్ని ఇచ్చింది. కానీ నెరవేర్చలేకపోయింది. స్వప్రయోజనాల కోసం మాత్రమే పనిచేసింది.'అని గడ్కరీ అన్నారు. దేశాన్ని అసలైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడంలో ప్రధాని మోదీ సఫలుడయ్యాడని కొనియాడారు. ఇదీ చదవండి:ఉద్రిక్తతలకు దారితీసిన దర్గా కూల్చివేత.. పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు.. -
వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ!
పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో వధువు మాయమయ్యింది. విషయం తెలుసుకున్న వధువు తండ్రి నిర్ఘాంతపోయాడు. కొద్దిసేపటికి తేరుకుని ఆయన చేసిన పనికి అక్కడున్నవారంతా అతనిని అభినందనలతో ముంచెత్తారు. ఉత్తరప్రదేశ్‌లోని బాందాలోని ఒక ఇంటిలో పెళ్లి వేడుక జరుగుతోంది. ఇంతలో వధువు తన ప్రియునితో పరారయ్యింది. విషయం తెలియగానే వధువు తండ్రితో పాటు పెళ్లికి హాజరైనవారంతా ఆందోళనకు లోనయ్యారు. అయితే వధువు తండ్రి తన చిన్న కుమార్తెను అదే వరునికి ఇచ్చి వివాహం చేశాడు. అలాగే తన పెద్ద కుమార్తెను తీసుకువెళ్లిపోయిన యువకునిపై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం తిద్వారీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో చోటుచేసుకుంది. ఇదే ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన కుమార్తె వివాహం జూన్ 8న నిశ్చయించామన్నాడు. కన్నౌజ్ జిల్లా నుంచి మగపెళ్లివారు వచ్చారన్నారు. ఇంతలో గ్రామానికి చెందిన ఒక యువకుడు తన కుమార్తెను తీసుకువెళ్లిపోయాడని ఫిర్యాదు చేశాడు.అతనిపై తక్షణం చర్యలు చేపట్టాలని కోరాడు. పెద్ద కుమార్తె వెళ్లిపోయిందని, చిన్న కుమార్తెతో.. మగపెళ్లివారు కల్యాణమండపానికి చేరుకున్నంతలో వధువు తన ప్రియునితో పరారైన విషయం అక్కడున్నవారందరికీ తెలిసింది. వెంటనే వధువు తండ్రి తన చిన్న కుమార్తెతో ఈ వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకు అతని చిన్న కుమార్తె, వరునితో పాటు అతని తరపువారంతా సమ్మతించారు. దీంతో వివాహ వేడుక యధావిధిగా జరిగింది. పోలీసులు ఏమన్నారంటే.. ఈ ఉదంతం గురించి పోలీసు అధికారి అనిల్ కుమార్ మాట్లాడుతూ గ్రామానికి చెందిన ఒక యువతిని ఒక యువకుడు తీసుకుని వెళ్లిపోయాడంటూ ఫిర్యాదు అందింది. ఆ యువతి తండ్రి దీనిపై ఫిర్యాదు చేశాడన్నారు. ఆ యవతీ యువకులను వెదికేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఆ యువతీయువకుల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నదని పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: హిందూ యువకుని ముస్లిం ‘వ్యవహారం’ -
నడుస్తున్న ట్రక్కు నుంచి మేకల చోరీ.. ఆ తర్వాత కారుపై జంప్..
ముంబై: మహారాష్ట్రలో సినీ ఫక్కిలో చోరీ జరిగింది. ధూమ్ సినిమాను తలపించేలా ఓ దొంగ నడుస్తున్న ట్రక్కు నుంచి మేకలను దొంగిలించాడు. స్పీడుగా వెళ్తున్న లోడు నుంచి చాలా మేకలను రోడ్డుపై పడేస్తూ వెళ్లాడు. ఆ తర్వాత ఓ కారు వచ్చింది. ట్రక్కు వెనకాలే దాని వేగంతో మ్యాచ్ అవుతూ ముందుకు సాగింది. దీంతో ట్రక్కుపై నుంచి దొంగ ఎంచక్కా కారుపైకి దిగాడు. ఆ తర్వాత బిందాస్‌గా ఎస్కేప్ అయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మొదట ఈ చోరీ ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్‌లో జరిగిందని ప్రచారం జరిగింది. దీంతో ఉన్నావ్ పోలీసులు వీడియో పరిశీలించారు. అయితే ఘటన జరిగిన ప్రదేశం ఉన్నావ్ కాదని, మహారాష్ట్రలోని ఇగత్పురి-ఘోతి హైవే అని వెల్లడించారు. దీంతో మహారాష్ట్ర పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. कानपुर उन्नाव हाइवे पे ट्रक से बकरे चोरी करने वाला गिरोह जो लग्जरी कार से चोरी कर रहा.... वीडियो गौर से देखिए........@Uppolice pic.twitter.com/ytC6m6owgI — Mohit Sharma (@Mohit_Casual_) April 30, 2023 ఈ వీడియోను చూసిన పులువురు నెటిజన్లు దొంగ సాహసాన్ని చూసి షాక్ అయ్యారు. అచ్చం సినిమాలో చూసినట్లుగా చోరీ ఉందని, నడుస్తున్న ట్రక్కునుంచి కారుపైకి ఎలా దిగాడని అంటున్నారు. బహుశా ధూమ్ సినిమాను చూసి ఇన్స్పైర్ అయి ఉంటాడని జోకులు పేల్చారు. చదవండి: బైక్‌ల చోరీకి పాల్పడుతున్న యువకుల అరెస్ట్ -
షాపింగ్ మాల్స్ ఆపరేటర్లకు ఈ ఏడాది పండగే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో షాపింగ్ మాల్ ఆపరేటర్ల ఆదాయం 7-9 శాతం అధికం కానుందని క్రిసిల్ రేటింగ్స్ వెల్లడించింది. కోవిడ్ ముందస్తు కాలం 2019-20 ఆదాయంలో ఇది 125 శాతానికి సమానమని వివరించింది. రిటైల్ విక్రయాలు బలంగా ఉండడం, అద్దెలు పెరగడం ఈ వృద్ధికి కారణమని తెలిపింది. (డిస్కౌంట్ ఇస్తే తప్పేంటి? కానీ...! పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు) ‘ప్రయాణ నియంత్రణలను ఎత్తివేసిన తర్వాత సామాజికంగా సాధారణ స్థితికి రావడంతో 2022-23లో మాల్స్‌కు కస్టమర్ల రాకలో గణనీయమైన వృద్ధికి దారితీసింది. రాబడి 60 శాతం పెరిగి కోవిడ్ ముందస్తు స్థాయి ఆదాయంలో ఇది 116 శాతానికి చేరుకుంది. అధిక ఆక్యుపెన్సీ స్థాయిలు, వ్యయ నియంత్రణ చర్యలు, బలమైన బ్యాలెన్స్ షీట్ల మద్దతుతో ఘనమైన లాభదాయకత కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మాల్ ఆపరేటర్ల క్రెడిట్ రిస్క్ ప్రొఫైల్స్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. 2022–23లో లీజింగ్ రేటు చదరపు అడుగుకు 12–14 శాతం దూసుకెళ్లింది’ అని వివరించింది. పుంజుకునే అవకాశం.. ఈ రంగంలో ఆరోగ్యకర పనితీరును పరిగణనలోకి తీసుకుంటే మూలధన వ్యయం మధ్యస్థ కాలానికి దగ్గరలో పుంజుకునే అవకాశం ఉంది. ఇందులో గణనీయమైన భాగం ప్రపంచ పెట్టుబడిదారుల నుండి ఈక్విటీ ద్వారా సమకూరవచ్చు. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో మందగమనం ప్రభావం, గతంలో రెపో రేటు పెంపుదలతో వెనుకబడిన ప్రభావం రిటైల్ అమ్మకాలతో సహా విచక్షణతో కూడిన వ్యయాన్ని తగ్గించగలదని క్రిసిల్ తెలిపింది. (ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) క్రిసిల్ రేటింగ్స్ దేశవ్యాప్తంగా 28 మాల్స్‌ను విశ్లేషించింది. ఇవి 17 నగరాల్లో 1.8 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజుకు స్థలాన్ని కలిగి ఉన్నాయి. వీటికి మొత్తం రూ.8,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయి. సాధారణంగా మాల్ ఆపరేటర్లు లీజు ఒప్పందాల ప్రకారం తమ ఆదాయంలో దాదాపు 85 శాతాన్ని కనీస హామీ అద్దెల నుండి సమకూర్చుకుంటారు. మిగిలినది అద్దెదారుల ఆదాయ పని తీరుతో ముడిపడి ఉంటుంది. (నెలకు రూ.7లక్షలు స్టైఫెండ్: టెక్ సీఈవోలు, ఐపీఎల్ ఆటగాళ్లను మించి .!) -
సొంత కొడుక్కే షాకిచ్చిన తండ్రి.. ఇంటికొచ్చిన ప్రియురాలితో కలిసి..
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ విచిత్రమైన ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడి ప్రియురాలు అతని తండ్రితో జంప్ అయ్యింది. ఏడాది క్రితం యువతిని ప్రియుడు తన ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి కమలేష్‌తో పరిచయం కాగా, తర్వాత అతనితో ఆ యువతి పారిపోయింది. కమలేష్ కుమారుడికి 20 ఏళ్ల యువతితో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ యువతి తరచుగా ప్రియుడి ఇంటికి వచ్చేది. ప్రియుడు ఇంట్లో లేని సమయంలో ప్రియుడి తండ్రి కమలేష్‌తో ఆమెకు చనువు ఏర్పడింది. ఆ బంధం ప్రేమగా మారింది. వారు ఇద్దరూ పారిపోవాలని నిర్ణయించుకున్నారు. 2022 మార్చిలో ఇంటి నుండి పరారీ అయ్యారు. చదవండి: బెట్టింగ్‌లో భారీ నష్టం.. అయ్యో మధు! యువతి కుటుంబ సభ్యులు చకేరి పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు పెట్టారు. కమలేష్ కుమారుడిని పోలీసులు విచారించగా.. ఆ యువతి కమలేష్‌ను కలిసేందుకు వచ్చేదని కుమారుడు చెప్పడంతో నిజం వెలుగు చూసింది. ఏడాదిపాటు వేట సాగించిన పోలీసులు కమలేష్, ఆ యువతిని ఢిల్లీలో గుర్తించారు. కమలేష్, యువతి సహజీవనం సాగిస్తున్నారు. ఇష్టపూర్వకంగానే కమలేష్‌తో వెళ్లినట్లు యువతి చెప్పడంతో షాక్ అయిన పోలీసులు.. వారిని అదుపులోకి తీసుకున్నారు. చదవండి: చిట్టీ.. నాకు ఎప్పుడో తెలుసు.. నేను లేకుండా నువ్వు బిందాస్‌గా ఉండగలవని.. -
ఎగిరి దూకిన సింహాలు..వచ్చాడండి రాకీ భాయ్
-
80 చెంపదెబ్బలు కొట్టిన సీనియర్లు.. రెండో అంతస్తు నుంచి దూకిన విద్యార్థి
దిస్పూర్: అస్సాం డిబ్రూగఢ్ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది. సీనియర్ల టార్చర్ భరించలేక ఓ విద్యార్థి హాస్టల్ రెండో అంతస్తు నుంచి కిందకు దూకాడు. తీవ్రగాయాల పాలైన అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుడ్ని శివసాగర్ జిల్లా అమ్గూరికి చెందిన ఆనంద్ శర్మగా గుర్తించారు. ఈ యూనివర్సిటీలో ఎంకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే తమ కుమారుడ్ని సీనియర్లు వారం రోజులుగా వేధిస్తున్నారని అతని తల్లి తెలిపింది. ఆదివారం కూడా 80 చెంపదెబ్బలు కొట్టారని, కర్రలు, బాటిళ్లతో టార్చర్ చేశారని వెల్లడించింది. అది భరించలేకే తన కుమారుడు భవనం పైనుంచి దూకేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ర్యాగింగ్ విషయం గురించి హాస్టల్ వార్డెన్‌ను ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆనంద్ శర్మ తల్లి వాపోయింది. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జితెన్ హజారికా చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం స్పందన.. ఈ ఘటనకు సంబంధించి మొత్తం ముగ్గురిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే ప్రధాన నిందితుడు ఇంకా పరారీలోనే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు విద్యార్థులు ర్యాగింగ్‌కు దూరంగా ఉండాలని సీఎం హిమంత బిశ్వ శర్మ సూచించారు. పోలీసులు తక్షణమే విచారణ చేపట్టి ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చదవండి: పెళ్లి చేసుకోకపోతే.. ముక్కలు ముక్కలు చేస్తా.. అమ్మాయికి బెదిరింపులు.. -
ప్రియురాలికి న్యాయం చేయాలంటూ భవనంపై నుంచి దూకేశాడు
పుణె: 43 ఏళ్ల వ్యక్తి ప్రియురాలికి న్యాయం చేయాలంటూ ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. ఈ ఘటన దక్షిణ ముంబైలోని మహారాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న ప్రభత్వ ప్రధాన కార్యాలయం అయిన మంత్రాలయ భవనం వద్ద చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు సదరు వ్యక్తి సేఫ్టి నెట్లో పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపన కథనం ప్రకారం....బీడు జిల్లాకు చెందిన బాపు నారాయణ మోకాషి తన గర్లఫ్రెండ్‌కి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం పై నుంచి దూకేశాడు. అతని గర్లఫ్రెండ్ అత్యాచారానికి గురైందని, ఆ తర్వాత ఆమె అవమానంతో 2018లో ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అప్పటి నుంచి సదరు వ్యక్తి తన ప్రియురాలికి న్యాయం జరగాలంటూ పోలీస్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. ఐతే పోలీసులు సరిగా దర్యాప్తు జరపకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. అదీగాక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండ్‌ని కలిసి ఈ విషయం చెప్పి న్యాయం చేయాలని అభ్యర్థించేందుకు నవంబర్ 17 గురువారం మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయానికి వచ్చాడు. ఐతే క్యాబినేట్ సమావేశం ఉండటంతో బాపుకి షిండేని కలిసే అవకాశం దక్కలేదు. దీంతో తీవ్ర అసహనానికి గురై అతను మంత్రాలయం ప్రభుత్వ కార్యాలయం ఆరో అంతస్తు నుంచి దూకేశాడు. అక్కడ సేఫ్టి నెట్ ఉండటంతో అతను స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సదరు వ్యక్తిని అదపులోకి తీసుకుని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. #Maharashtra: प्रेमिका को न्याय दिलाने के लिए प्रेमी ने लगाई छठी मंजिल से छलांग, नेट पर गिरने से बची जान#Mantralaya #Mumbai #WATCH #viralvideos2022 pic.twitter.com/c8dsn5Aufd — VDTV Bharat (@vdtv_bharat) November 18, 2022 (చదవండి: కాలేజీ ర్యాగింగ్‌లో వికృతక్రీడ.. స్టూడెంట్ పైశాచికత్వం!) -
Viral Video: పావురం బ్యాక్ జంప్!..చూస్తే అవాక్కవ్వాల్సిందే
ఇంతవరకు పక్షులకు సంబంధించిన పలు వీడియోలు చూశాం. కొన్ని పక్షులు మనుషుల వలే మాట్లాడటం వంటివి కూడా విన్నాం. నిపుణుడి పరివేక్షణలోనూ లేదా ఏ సర్కస్‌లోనూ ఆయా సంరక్షకుల సమక్షంలో విన్యాసాలు చేయడం చూసి ఉంటాం. అంతే గానీ వాటంతట అవి చేయడం జరగదు. కానీ ఈ పావురం తనంతట తాను విచిత్రమైన విన్యాసం చేసింది. వివరాల్లోకెళ్తే... ఒక తెల్లటి పావురం తనంతట తానుగా ఒక్కసారిగా రెక్కలు విప్పుతూ.. అనుహ్యంగా వెనుకకు జంప్ చేస్తుంది. ఏదో అనుకోకుండా చేసింది అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే అది అలా మూడుసార్లు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వావ్ భలే జిమ్నాస్టిక్స్ చేసింది అంటూ ఆ పావురాన్ని ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. Wow🕊😍 pic.twitter.com/jpq2f4VDhJ — Hana (@magicthings7) July 28, 2022 (చదవండి: వీడియో: రియల్ బాహుబలి.. ఇలా చేయాలంటే గట్స్ ఉండాలి) -
కొత్త ప్రాజెక్టు పెట్టుబడులు 24 శాతం జంప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022-23) తొలి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టు పెట్టుబడులు దాదాపు 24 శాతం ఎగశాయి. ఏప్రిల్-జూన్ (క్యూ1)లో రూ. 3.64 లక్షల కోట్లను తాకాయి. గతేడాది (2021-22) క్యూ1తో పోలిస్తే పెట్టుబడులు పుంజుకున్నప్పటికీ జనవరి-మార్చి(క్యూ4)తో పోలిస్తే 38 శాతంపైగా క్షీణించినట్లు బ్రిక్‌వర్క్ రేటింగ్స్ రూపొందించిన నివేదిక తెలియజేసింది. అయితే గత క్యూ4లో ప్రాజెక్టు ఇన్వెస్ట్మెంట్స్ వార్షిక ప్రాతిపదికన 130 శాతం జంప్ చేసినట్లు నివేదిక పేర్కొంది. రూ. 5.91 లక్షల కోట్లకు చేరినట్లు వెల్లడించింది. కరోనా ఎఫెక్ట్ కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో ప్రాజెక్ట్ పెట్టుబడులు క్షీణిస్తూ వచ్చాయి. తదుపరి గతేడాది క్యూ4 నుంచి మాత్రమే పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. అయితే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కొన‘సాగు’తుండటంతో తలెత్తిన అనిశ్చితులు, వీటితో ఆంక్షల విధింపు వంటి అంశాలు ఇన్వెస్ట్మెంట్ సెంటిమెంటును దెబ్బ తీస్తున్నాయి. అంతేకాకుండా కొనసాగుతున్న చిప్‌ల కొరత, వడ్డీ రేట్ల పెరుగుదల సైతం వీటికి జత కలుస్తున్నాయి. ప్రభావం క్యూ1లో కొత్త ప్రాజెక్టులపై పడింది. వెరసి వీటి సంఖ్య సగానికి పడిపోయింది. అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే 545 నుంచి 247కు వెనకడుగు వేశాయి. ఇదేవిధంగా ప్రభుత్వం నుంచి కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు సైతం 59 శాతం క్షీణించి రూ. 32,700 కోట్లకు పరిమిత మయ్యాయి. ఇక ప్రయివేట్ రంగంలో మాత్రం కొత్త ప్రాజెక్టుల సంఖ్య 188కు ఎగశాయి. వీటి ప్రతిపాదిత పెట్టుబడులు రూ. 3.3 లక్షల కోట్లకు చేరాయి. క్యూ4లో ప్రయివేట్ రంగ పెట్టుబడి వ్యయాలు రూ. 3.9 లక్షల కోట్లుకాగా.. ప్రభుత్వం నుంచి రూ. 2.1 లక్షల కోట్లుగా నమోదైనాయి. ఆర్థిక పరిస్థితులతో బడ్జెట్లో కేంద్రం గరిష్ట స్థాయిలో పెట్టుబడి వ్యయాలు ప్రతిపాదించినప్పటికీ నీరసించిన ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ద్యవ్యోల్బణ ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. వడ్డీ రహితం (సున్నా రేటు)లో రాష్ట్రాలకు రూ. లక్ష కోట్ల రుణాలను అందించడంలో తాత్సారం చేస్తోంది. మరోపక్క రాష్ట్రాలు సైతం కొత్త ప్రాజెక్టులపై పెట్టుబడులకు వెనకడుగు వేస్తున్నాయి. ప్రభుత్వాలు ప్రకటించిన కొత్త ప్రాజెక్టులలో రాష్ట్రాల వాటా 8 శాతమే కావడం గమనార్హం! ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం బడ్జెట్లో రూ. 7.5 లక్షల కోట్ల పెట్టుబడి వ్యయాలను ప్రతిపాదించింది. గతేడాది సవరించిన అంచనాలతో పోలిస్తే ఇవి 24.5 శాతం అధికం!! -
హైహీల్స్‌తో జంప్ చేసి గిన్నిస్ రికార్డు సాధించిన మహిళ!.. ఫిదా అవుతున్న నెటిజన్లు!
ఇంతవరకు మనం గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కిన చాలా మంది గురించి విన్నాం. పైగా వారంతా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రపంచ రికార్డులను సృష్టించారు. ఆ కోవకు చెందినదే ఈ మహిళ కూడా. కానీ ఈ మహిళ చేసిన విన్యాసం చేస్తే కచ్చితంగా నోరెళ్లబెడతారు. ఎందుకంటే ఆ విన్యాసం చాలా జాగ్రత్తగా చేయాలి. ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పిన ఇక అంతే. వివరాల్లోకెళ్తే...అమెరికాలోని కాలిఫోర్నియాలోని శాంటా మోనికా బీచ్‌లో ఓల్గా హెన్రీ అనే క్రీడాకారిణి హైహిల్స్ ధరించి మరీ తాడుపై నైపుణ్యంగా దూకింది. హైహిల్స్ వేసుకుని నడవాలంటేనే కష్టంగా ఉంటుంది. అలాంటిది ఆమె వాటిని వేసుకుని మరీ ఆగకుండా తాడుపై జంప్ చేసింది. దీంతో ఆమె ప్రపంచ రికార్డును సృష్టించడమే కాక గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతుంది. దీంతో నెటిజన్లు ఆమె ప్రతిభను చూసి ఆశ్చర్యపోవడమే కాక ఇది చేయడం చాలా కష్టం అంటూ రకరకాలు పోస్ట్‌లు పెట్టారు. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) (చదవండి: ఆర్కిమెడ్స్కి సూత్రమే ఆ ఏనుగుని రక్షించింది!) -
మెట్రో స్టేషన్ పిల్లర్ పై నుంచి దూకే ప్రయత్నం
-
పెట్రోలు,డీజిల్‌పై పన్నువసూళ్ల రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో నింగిని తాకుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో పుంజుకున్నాయి. అంతర్జాతీయ చమురు ధరల నేపథ్యంలో పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి రామేశ్వర్ లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. వాస్తవానికి ఇది ఇంకా పెరగాల్సి ఉందని అయితే కరోనా మహమ్మారి, లాక్డౌన్ ఆంక్షల సంక్షోభం కారణంగా విక్రయాలు లేక రాబడి క్షీణించిందన్నారు. అయితే కరోనా మహమ్మారి డిమాండ్ భారీగా పడి పోయినప్పటికీ 2020-21లో (ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు) పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర ప్రభుత్వ పన్ను వసూళ్లు 88 శాతం పెరిగి రూ .3.35 ట్రిలియన్లకు చేరుకున్నాయని మంత్రి ప్రకటించారు. గత ఏడాది రూ .1.78 ట్రిలియన్ల నుంచి ఈ మేరకు పెరిగిందని మంత్రి చెప్పారు. కరోనా వైరస్,లాక్డౌన్, రవాణా ఆంక్షలు ఇంధన అమ్మకాలను దెబ్బతీసాయనీ చెప్పారు. ఈ ఏడాది ఏప్రిల్-జూన్నెలల్లో ఎక్సైజ్ వసూళ్లు మొత్తం రూ.11.1 ట్రిలియన్లని ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. ఇందులోపెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఏటీఎఫ్, నేచురల్ గ్యాస్ ఎక్సైజ్ సుంకం కలిసి ఉందన్నారు. 2020-2021లో మొత్తం ఎక్సైజ్ ఆదాయం రూ .3.89 ట్రిలియన్లు. కాగా 2018-19లో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ వసూళ్లు రూ.2.13 ట్రిలియన్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి 10 నెలల్లో పెట్రోల్, డీజిల్ వసూళ్లు రూ .2.94 లక్షల కోట్లగా ఉంది. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ .19.8 నుంచి రూ .32.9 కు, డీజిల్‌పై రూ.15.83 నుంచినుంచి రూ. 31.8 మేరక రికార్డు స్థాయికి పెంచిన సంగతి తెలిసిందే. -
పారిపోలేక.. పోలీస్ స్టేషన్ పైనుంచి దూకాడు
రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆదివారం పోలీసు స్టేషన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. నిడిగొండ గ్రామానికి చెందిన వంగాల సోమ నరసయ్య ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్నాడు. ఈనెల 13న ఉగాది కి అతను కుటుంబంతో స్వగ్రామానికి వచ్చాడు. ఆ రోజు రాత్రి ఆరు బయట నిద్రిస్తుండగా, నరసయ్య కొడుకు దినేష్‌ను సుబ్రహ్మణ్యం గొడ్డలితో నరికి చంపాడు. సోమ నరసయ్యకు తమ్ముడి భార్య లక్ష్మీబాయితో ఆస్తితగాదాలు ఉండడంతో ఆమె తన అక్క కొడుకు సుబ్రహ్మణ్యంతో నరసయ్యను హత్య చేయించాలని నిర్ణయించింది. అయితే సుబ్రహ్మణ్యం సరిగా పోల్చుకోలేక నరసయ్యకు బదులు దినేష్‌ను హత్య చేశాడు. పరారీలో ఉన్న సుబ్రహ్మణ్యంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అతను స్టేషన్‌పైకి వెళ్లి అక్కడ నుంచి దూకగా కాలు విరిగింది. అతడిని జనగామలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యంను రిమాండ్‌కు తరలించే క్రమంలో పారిపోయేందుకు ప్రయత్నించాడని జనగామ రూరల్ సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు. అది సాధ్యం కాక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెప్పారు. (చదవండి: బావ గొంతుకోసిన బావమరిది: అందుకే చంపేశానంటూ ) -
బస్సాపండంకుల్ ప్లీజ్..!
ర్యాంకులు, గ్రేడ్లు, పర్సెంటైల్స్ ఏవో ఉంటాయి.. అవన్నీ ధైర్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్లి చదివొచ్చినందుకు అనిపిస్తుంది ఫలితాలు వెల్లడైన రోజు తల్లిదండ్రులకు. వాళ్లనింకా పిల్లలనే అనాలి. ఇంటర్లోకి అడ్మిషన్ తీసుకున్నారు కనుక ఫస్ట్ డే, ఫస్ట్ బెల్తోనే పెప్పర్ స్ప్రేని పట్టుకోవడం చేతనౌతుందా! ఇన్నాళ్లూ ఇంటి దగ్గరి స్కూలు. ఇప్పుడు ఊరికి దూరంగా ఉండే కాలేజి. భద్రంగా వెళ్లి రావాలన్నది ఇంట్లో ఫస్ట్ లెసన్. బయట కుదురుగా ఉండాలనేది నాన్–డీటెయిల్డ్. అమ్మ చెబుతుంది ఒంటి మీది బట్టలు సరిచేస్తూ.. డీటెయిల్స్ అవసరం లేని పాఠం. పిల్లలకూ అర్థం కానిదేం కాదు. లోకంలో జరిగేవి వింటూనే, చూస్తూనే కదా రోజూ ధైర్యంగా స్కూల్‌కి వెళ్లొస్తున్నారు, టెన్త్ పూర్తి చేస్తున్నారు, ధైర్యంగా ఇంటర్లో జాయిన్ అవుతున్నారు, ధైర్యంగా కాలేజ్‌కి వెళ్లొస్తున్నారు. ధైర్యం కావాలిప్పుడు ఆడపిల్లలకు సర్టిఫికెట్ చేతిలోకి రావడానికి. ర్యాంకులు, గ్రేడ్లు, పర్సెంటైల్స్ ఏవో ఉంటాయి.. అవన్నీ ధైర్యంగా ఇంట్లోంచి బయటికి వెళ్లి చదివొచ్చినందుకు అనిపిస్తుంది ఫలితాలు వెల్లడైన రోజు తల్లిదండ్రులకు. గ్రేటర్ నోయిడాలో ఇద్దరు పిల్లలు కాలేజ్‌కి వెళ్లేందుకు బస్సెక్కారు. ప్రైవేటు బస్సు. రోజూ వెళ్లొచ్చే రూట్లోనే చేతికి అందిన బస్సు. బస్సులో వీళ్లిద్దరు ఉన్నారు. వీళ్ల ముందు సీట్లలో నలుగురు అబ్బాయిలు ఉన్నారు. ఆ అబ్బాయిలు ఈ ఇద్దరు అమ్మాయిల కన్నా వయసులో కొంచెం పెద్దవాళ్లు. కాలేజ్‌మేట్స్ కాదు. ఎవరో. బస్సు ఎక్కినప్పట్నుంచీ ఆపకుండా వీళ్లపై కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ‘చిక్కావు చేతిలో చిలకమ్మా..’ టైప్ కామెంట్స్. అమ్మాయిలకు భయం వేసింది. చూసి చూసి ఇక ధైర్యంగా ఉండలేక బస్సు ఆపమని డ్రైవర్ దగ్గరికి వెళ్లి రిక్వెస్ట్ చేశారు. ‘ఎక్కడపడితే అక్కడ ఆగదమ్మా..’ అన్నాడు డ్రైవర్. కనీసం బీరంపూర్ బస్టాప్లోౖనైనా బస్సును ఆపాలి. ఆ స్టాప్‌లో బస్ ఎక్కడం కోసం ఈ ఇద్దరమ్మాయిల క్లాస్మేట్స్ నిలబడి ఉన్నారు. ‘అంకుల్ ఆపండి ప్లీజ్..’ అన్నారు వీళ్లు. అక్కడా ఆపలేదు. ఆ స్టాప్ దాటితే బులంద్‌షహర్ స్టాప్. వీళ్లు దిగాల్సింది బులంద్ షహరే. ఇంకా కొంత దూరం ఉంది. బస్సు పోతూనే ఉంది. బస్సు ఆపమని వీళ్లు అడుగుతుండడం, డ్రైవర్ ఆపకపోవడం చూసి అబ్బాయిలకు ఉత్సాహం వచ్చేసింది. ‘ఈరోజు బస్సు ఆగదు’ (‘ఆజ్ తో నహీ రుకేగీ బస్’) అని ఒక అబ్బాయి అన్నాడు. అప్పుడు మొదలైంది ఈ పిల్లలకు వణుకు. ఆగని బస్సుల్లో ఏం జరిగే ప్రమాదం ఉంటుందో వాళ్ల ఊహకు వచ్చి ఉండాలి. ‘అంకుల్.. బస్ ఆపండి’ అని పెద్దగా అరిచారు. బస్సు ఆగలేదు. వేగం తగ్గలేదు. ఆ వేగంలోనే బస్ డోర్ నెట్టుకుని ఒకరి వెనుక ఒకరు బయటికి దూకేశారు! వాళ్లలో ఒకమ్మాయి తలకు, నడుముకు బలమైన దెబ్బలు తగిలాయి. పాదం, మణికట్టు నలిగిపోయాయి. ఇంకో అమ్మాయి కాలు, చెయ్యి ఫ్రాక్చర్ అయ్యాయి. అదృష్టం.. వీళ్లు కిందపడ్డ క్షణంలో వెనుక నుంచి వాహనాలేమీ రాలేదు. పెద్దవాళ్లొచ్చి పిల్లల్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పిల్లల్ని ఏడిపించిన అబ్బాయిలు దొరకలేదు. బస్సు ఆపని డ్రైవర్ మీద ఎఫ్.ఐ.ఆర్. రిజిస్టర్ అయింది. ఐపీసీ లోని ఓ మూడు సెక్షన్ల కింద కేసు పెట్టారు. బండిని వేగంగా నడపడం, తీవ్ర గాయాలకు కారణమవడం, వ్యక్తులకు దెబ్బలు తగిలించడం.. సెక్షన్ 279, 338, 337. కామెంట్స్ చేసిన ఆ మగపిల్లలపై కేసులు వద్దనుకున్నారు ఆడపిల్లల పేరెంట్స్. మళ్లీ ఆ దారిలోనే కదా పిల్లలు రోజూ వెళ్లిరావాలి! లోకంలోకి అప్పుడప్పుడే అడుగు పెడుతున్న ఇద్దరు ఆడపిల్లలు ఏ కారణంగానో భయపడి బస్సును ఆపమని బతిమాలినా ఆపకుండా బస్సును పోనిచ్చినందుకు అంటూ డ్రైవర్‌పై పెట్టడానికి ఐపీసీలో ప్రత్యేకంగా ఒక సెక్షన్ ఉండదు. ఉన్న సెక్షన్లలోనే కాస్త దగ్గరగా ఉన్న వాటిని చూసి ఆ సెక్షన్ల కింద డ్రైవర్‌ను అరెస్టు చేస్తారు. నోయిడా పోలీసులూ అంతవరకే చేయగలిగారు. అసలైతే డ్రైవర్‌పై ‘నిర్భయ’ కేసు పెట్టాలి. ఎనిమిదేళ్ల క్రితం ఢిల్లీలో రాత్రి 10 గంటలకు బస్సులో జరిగిన ఆ ఘటనకు, వారం క్రితం నోయిడాలో పగలు 10 గంటలకు బస్సులో జరిగిన ఈ ఘటనకు తేడా ఏం లేదు. ‘ఈరోజు బస్సు ఆగదు’ అన్నాక, ఆ మగపిల్లల్లో ఇంకొకరు ‘మజాగా ఉంటుందిక’ (‘మజా ఆగయా’) అనడం విని డ్రైవర్‌కి కూడా మజా వచ్చి ఉంటే బస్సు ఏ ఒంటరి ప్రదేశం లోనికో మలుపు తిరిగి ఉండేది. మహిళల రక్షణకు, భద్రతకు చట్టం గట్టి కాపలాల్నే పెట్టింది. బయటే కాదు, సొంత ఇంట్లోనైనా ఆమెపై ఏదైనా జరగబోతుంటే ఒక్క కాల్‌తో పోలీసులు వచ్చేస్తారు. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇచ్చేలా అబ్బాయిల్ని పెంచే తల్లిదండ్రుల ‘న్యూ ఎరా’ ఒకటి కూడా ఆల్రెడీ గర్ల్స్‌కి బాయ్స్ చేత నమస్తే పెట్టిస్తోంది. మరింకేంటి?! గట్టి చట్టం, బుద్ధి కలిగిన బాయ్స్. హ్యాపీనే కదా. కాదు! స్టీరింగ్ గర్ల్స్ చేతుల్లో ఉండాలి. లెజిస్లేచర్, జుడీషియరీ, ఎగ్జిక్యూటివ్, ప్రెస్ అనే ఫోర్–వీలర్ స్టీరింగ్‌ని గర్ల్స్ తమ చేతుల్లోకి తీసుకోవాలి. నోయిడాలో ఆ బస్సు స్టీరింగ్ ఒక మహిళ చేతిలో ఉండి ఉంటే ఏం జరిగి ఉండేదో ఊహించండి. అమ్మాయిల్ని వేధించినందుకు.. ‘బస్ ఆపండి ఆంటీ ప్లీజ్.. దిగిపోతాం’ అని అబ్బాయిలు ప్రాధేయపడుతుండేవాళ్లు.. బస్సు పోలీస్ స్టేషన్ వైపు మలుపు తిరుగుతుంటే. – మాధవ్ శింగరాజు -
ఆశ్చర్యపర్చిన యస్ బ్యాంకు ఫలితాలు
సాక్షి, ముంబై : వివాదాల సంక్షోభం, మూలధన సమస్యల్లో ఇరుక్కున్న ప్రైవేటు రంగ బ్యాంకు యస్ బ్యాంకు మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో మెరుగైన ఫలితాలతో అటు ఇన్వెస్టర్లను, ఇటు ట్రేడర్లను ఆశ్చర్య పర్చింది. దీంతో గురువారం నాటి నష్టాల మార్కెట్లో బ్యాంకు షేరు లాభాలతో దూసుకపోతోంది. రూ .2,629 కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడంతో యస్ బ్యాంకు షేర్లు నష్టాల మార్కెట్లో భారీగా లాభపడుతున్నాయి. రూ. 31.60 వద్ద షేర్ ధర ఈరోజు 20 శాతం పుంజుకుంది. ఎన్ఎస్ఇ, బీఎస్‌ఇలలో 39.39 మిలియన్ షేర్లు చేతులు మారాయి. (నష్టాల్లో మార్కెట్ : యస్ బ్యాంకు జంప్) ఎస్ బ్యాంకు పునరుద్ధరణలో ఆర్బీఐ గైడెడ్ బెయిలౌట్ సహాయంతో ఇప్పుడు కోలుకుంటున్ బ్యాంకు, ఈ పరిణామాల తరువాత తన మొదటి ఫలితాలను ప్రకటించింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోరూ. 18,560 కోట్ల నష్టాన్ని, జనవరి-మార్చి త్రైమాసికంలో రూ .1,506 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. నికర వడ్డీ ఆదాయం దాదాపు సగం తగ్గి రూ.1,274 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి రూ.16,418 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోల్చితే తక్కువ జారడం వల్ల వరుసగా 19.6 శాతం వృద్ధి. రూ .32,878 కోట్ల స్థూల నిరర్ధక ఆస్తులను (స్థూల ఎన్‌పిఎ), నికర నిరర్ధక ఆస్తులను (నెట్ ఎన్‌పిఎ) 862,37 కోట్ల రూపాయలుగా నివేదించింది. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం ప్రొవిజన్లు రూ .24,766 కోట్లతో పోలిస్తే రూ .4,872 కోట్లకు తగ్గాయి. చాలా మంది విశ్లేషకులు ఊ హించిన దాని కంటే ఆదాయాలు మెరుగ్గా ఉండం విశేషం. కోటక్ సెక్యూరిటీస్ రూ .4,404 కోట్ల నికర నష్టాన్ని అంచనా వేసింది, (యస్ బ్యాంక్‌కు ఆర్బీఐ 60 వేల కోట్లు) యస్ బ్యాంకు వివాదంతో జోక్యం చేసుకున్న ఆర్బీఐ మారటోరియం, నగదు విత్‌డ్రాపై ఆంక్షలకు దిగింది. బోర్డును రద్దు చేసి, 30 రోజుల తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ఆ తరువాత బ్యాంకు బోర్డును పునరుద్ధరించిన అనంతరం 2020 మార్చి18 నుండి అన్ని బ్యాంకింగ్ సేవలను తిరిగి ప్రారంభించింది. అలాగే బ్యాంకు పునరుద్దరణ చర్యల్లో భాగంగా ఎస్ బీఐ, హెచ్డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాంటి ఏడు ప్రైవేట్ బ్యాంకుల నుండి 10,000 కోట్ల రూపాయల ఈక్విటీ మూలధనాన్ని సమీకరించిన సంగతి తెలిసిందే. (యస్పై మారటోరియం ఎత్తివేత) -
ఉత్పత్తి కోత ఆశలతో పుంజుకున్న చమురు ధర
సాక్షి, ముంబై: అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు పుంజుకున్నాయి. కరోనా సంక్షోభం, ప్రపంచ దేశాలు ఆర్థికమాంద్యం ఆందోళనల నేపథ్యంలో చమురు ఉత్పత్తి కోతకు ఒపెక్ దేశాలు సమ్మతించవచ్చనే అంచనాలమధ్య బుధవారం చమురు ధరలు ఎగిసాయి. ఒపెక్ సభ్య దేశాలు, రష్యా మధ్య ఉత్పత్తి తగింపునకు నిర్ణయించనున్నారనే ఆశలమధ్య ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తిగా చూపిస్తున్నారు. దీంతో ఇవాళ బ్రెంట్ క్రూడ్ 75 సెంట్లు (2.5శాతం) పెరిగి బ్యారెల్ ధర 32.62 డాలర్లకు చేరింది. నైమెక్స్ కూడా 5 శాతం ఎగిసింది. మంగళవారం బ్రెంట్ క్రూడ్ 3.6 శాతం క్షీణించింది. అంతకుముందు సెషన్లో క్రూడాయిల్ ధర దాదాపు తొమ్మిదిన్నర శాతం తగ్గింది. కరోనా మహమ్మారి ప్రభావంతో ముడి చమురు ధరలు గత కొంతకాలంగా భారీగా పడిపోతున్న సంగతి తెలిసిందే. దీంతో సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఒపెక్ దేశాలు, రష్యాలు రంగంలోకి దిగాయి. ఇందులో భాగంగా గురువారం ఒపెక్ సభ్యులు, రష్యాలు సమావేశం కానున్నాయి. ఆ సమావేశంలో చమురు ఉత్పత్తి తగ్గింపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తాజా సమావేశంలో తీసుకోబోయే నిర్ణయంతో సౌదీ అరేబియా, రష్యాల మధ్య చమురు ధరల యుధ్దానికి తెరపడే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సౌదీ అరేబియా, ఒపెక్ సభ్యదేశాలు, రష్యాలు చమురు ఉత్పత్తిని తగ్గించడానికి అవకాశముందని చెబుతున్నారు. అయితే ఉత్పత్తి కోత నిర్ణయంలో అమెరికా పాత్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెరికా ముడి ఉత్పత్తి 4.70 లక్షల బీపీడీ తగ్గిందని, 2020లో మరో 1.3 మిలియన్ బీపీడీ తగ్గుతుందని ఇటీవలే అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. మంగళవారం విడుదల చేసిన అమెరికన్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్ (ఏపీఐ) గణాంకాల ప్రకారం అమెరికాలో పెట్టుబడులు ఏప్రిల్ 3 వరకు 11.9 మిలియన్ బారెల్స్ మేర పెరిగి 473.8 మిలియన్ బారెల్స్ కు చేరుకున్నాయి. వైరస్ వ్యాప్తి భయాలతో చమురుకు డిమాండ్ తగ్గడంతో,ఆయిల్ రంగ షేర్లు 9.4 మిలియన్ బారెల్స్ పెరిగాయి. ఇది జనవరి 2017తరువాత ఒక వారంలో అతిపెద్ద లాభంమిదేనని ఏపీఐ తెలిపింది. -
భారీగా పుంజుకున్న చమురు ధర
సోమవారం నాటి భారీ పతనం నుంచి చమురు ధరలు భారీగా ఎగిసాయి. కోవిడ్-19 (కరోనా వైరస్) భయాలకు తోడు, రష్యా సౌదీ అరేబియా ప్రైస్ వార్ నేపథ్యంలో 29 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన చమురు మార్కెట్లు మంగళవారం పుంజుకున్నాయి. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాల సంస్థ (ఒపెక్) తో చర్చలు కొనసాగవచ్చని రష్యా సూచనలతో ముడి చమురు ధర 11శాతం పెరిగింది. ముడి చమురు ప్రస్తుతం బ్యారెల్‌కు 38 డాలర్లుగా వుంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (డబ్ల్యుటిఐ) 11 శాతం పెరిగి బ్యారెల్‌కు 34 డాలర్లకు చేరుకుంది. కరోనావైరస్ మహమ్మారి ప్రభావాన్ని ఎదుర్కోవడానికి చర్యలు తీసుకుంటున్నామని రష్యా ఇంధన మంత్రి ఆశావహ వ్యాఖ్యలతో పాటు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కూడా మార్కెట్లకు భారీ ఊరటనిచ్చింది. అటు గ్లోబల్ మార్కెట్లు కూడా భారీ పతనంనుంచి కాస్త తెప్పరిల్లాయి. డౌజౌన్స్ 900 పాయింట్లు జంప్ చేసింది. ఎస్ అండ్ పీ 3.5 శాతం, నాస్డాక్ 3.6 శాతం ఎగిసింది. కాగా దేశీయ స్టాక్‌మార్కెట్లకు హోలీ సందర్భంగా మంగళవారం సెలవు. తాజా పరిణామాల నేపథ్యంలో కీలక సూచీలు రేపు (బుధవారం) భారీగా రికవరీ సాధించే అవకాశం ఉంది. -
అదరగొట్టిన డీమార్ట్, మార్కెట్ క్యాప్ జూమ్
సాక్షి, ముంబై: ముంబైకి చెందిన డీమార్ట్ సూపర్‌మార్కెట్ చెయిన్ అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేరు మరోసారి అదరగొట్టింది. సోమవారం నాటి నష్టాల మార్కెట్లో కూడా 11శాతం ఎగిసి రికార్డు గరిష్టాన్ని నమోదు చేశాయి. లిస్టింగ్ ధర నుంచి ఏకంగా నాలుగు రెట్లు ఎగిసింది. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.55 లక్షల కోట్లకు పైగా పెరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా డీమార్ట్ బీఎస్ఇలో 18 వ అత్యంత విలువైన సంస్థగా నిలిచింది. తద్వారా మార్కెట్ క్యాప్ పరంగా బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే లను అధిగమించింది కాగా గత వారం, అవెన్యూ సూపర్‌మార్ట్స్, 4,098 కోట్ల వరకు సేకరణకుగాను అర్హత కలిగిన సంస్థాగత ప్లేస్మెంట్ (క్యూఐపి)ప్రారంభించింది. ఈ క్యూఐపీ ద్వారా 20 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి 1,999.04 చొప్పున విక్రయిస్తామని స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో కంపెనీ తెలిపింది. ఈ క్యూఐపి ద్వారా 20 మిలియన్ షేర్లను ఒక్కొక్కటి రూజ1,999.04 చొప్పున విక్రయిస్తామని తెలిపింది. ఈ నిధులను తన స్టోర్ నెట్‌వర్క్‌ను విస్తరించడానికి, సరఫరా గొలుసులో పెట్టుబడులు పెట్టడానికి, రుణాలు తిరిగి చెల్లించడానికి వినియోగించనుంది. కాగా 2002 లో ముంబైలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించగా, డిసెంబర్ 31, 2019 నాటికి కంపెనీకి 196 దుకాణాలు డిమార్ట్ సొంతం. డిసెంబర్ త్రైమాసికంలో మొత్తం రెవెన్యూ అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆదాయం రూ. 6,809 కోట్లుగా ఉంది, రూ. గతేడాది ఇదే కాలంలో 5,474 కోట్లు. నికర లాభం రూ. 384 కోట్ల నికర లాభాలను సాధించింది. -
350 పాయింట్లు జంప్ చేసిన స్టాక్‌మార్కెట్లు
సాక్షి, ముంబై : అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో బలహీనంగా ప్రారంభమైన దేశీ స్టాక్ మార్కెట్లు లాభాల హై జంప్ చేశాయి. 100 పాయింట్లకుపైగా క్షీణించిన సెన్సెక్స్ ప్రస్తుతం ట్రిపుల్ సెంచరీకి పైగా లాభాలతో దూసుకుపోతోంది. సెన్సెక్స్ 319 పాయింట్లు ఎగసి 39,442 వద్ద, నిఫ్టీ సైతం 97 పాయింట్లు పుంజుకుని 11,796 వద్ద ట్రేడవుతోంది. దాదాపు అన్ని షేర్లు లాభాల దౌడు తీస్తున్నాయి. ప్రధానంగా మెటల్, రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్స్, ఆటో సెక్టార్లు లాభపడుతున్నాయి. బీపీసీఎల్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎంఅండ్ఎం, హిందాల్కో, ఆర్ఐఎల్, బ్రిటానియా, యాక్సిస్, పవర్‌గ్రిడ్, టాటా స్టీల్ టాప్ విన్నర్స్‌గా ఉండగా. జీ, ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంక్, ఎల్అండ్టీ, సన్ ఫార్మా, ఇండస్ఇండ్, హెచ్‌సీఎల్ టెక్, ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్ స్వల్పంగా నష్టపోతున్నాయి. -
మార్కెట్లు జంప్ : నిఫ్టీ 11300 ఎగువకు
సాక్షి, ముంబై : దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. వరుస నష్టాలనుంచి కోలుకున్న సెన్సెక్స్ లాభాల డబుల్ సెంచరీ చేసింది. అయితే స్వల్ప ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్న సెన్సెక్స్ ప్రస్తుతం 179 పాయింట్లు జంప్‌చేసి 37,572 కు చేరగా.. నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 11,302 వద్ద ట్రేడవుతోంది. తద్వారా నిఫ్టీ 11300 ఎగువకు చేరింది. రియల్టీ, బ్యాంక్స్ సహా మీడియా, రియల్టీ అన్ని రంగాలూ లాభపడుతున్నాయి. మరోవైపు అమెరికాలో రేట్ల కుంభకోణం, ఫలితాల నేపథ్యంలో స్వల్పంగా నష్టపోతోంది. ప్రెస్టేజ్, డీఎల్ఎఫ్, బ్రిగేడ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఇండియాబుల్స్, శోభా , మీడియా స్టాక్స్‌లో జీ, పీవీఆర్, ఐనాక్స్, టీవీ 18, ఈరోస్, నవనీత్, సన్ టీవీ 4-1.2 శాతం మధ్య పెరిగాయి. బ్లూచిప్స్ షేర్లలో బజాజ్ ఫైనాన్స్, యస్ బ్యాంక్, ఐబీ హౌసింగ్, హీరో మోటో, కోల్ ఇండియా, ఎంఅండ్ఎం, మారుతీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో 4-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హిందాల్కో, బీపీసీఎల్, ఐవోసీ, డాక్టర్ రెడ్డీస్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 3-0.5 శాతం మధ్య క్షీణించాయి. అరబిందో 5 శాతం, కేడిలా, మదర్సన్ తదితరాలునష్టపోతున్నాయి. -
నష్టాలకు చెక్ : పసిడి ధర జంప్
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. మూడు రోజుల వరుస నష్టాలకు చెక్ చెప్పి తిరిగి 10గ్రా. ధర 32వేల స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా ఇటలీ సంక్షోభం నేపథ్యలో ఇన్వెస్టర్లు పెట్టుబడులు విలువైన లోహం పుత్తడి వైపు మళ్లాయి. జ్యుయలర్స్ కొనుగోళ్లు, అంతర్జాతీయధరల్లో సానుకూలత దేశీయంగా కలిసి వచ్చిందని ట్రేడర్లు చెప్పారు. ఇటలీలోని రాజకీయ సంక్షోభంతో జ్యువెలర్ల కొనుగోళ్లు ప్రపంచ మార్కెట్లలో తేలికపాటి లాభాలు దేశీయంగా పసిడి లాభపడుతోందని వాణిజ్యవేత్తలు పేర్కొన్నారు. ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 230 పుంజుకుని పది గ్రా. రూ. 32,090వద్ద, 99.5 శాతం స్వచ్ఛత గల పసిడి రూ.31,940గా ఉంది. . బంగారం ధరలు రూ. గత మూడు సెషన్లలో రూ. 615 క్షీణించింది. కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ. 40,700 స్థాయికి చేరింది. వీక్లీ ఆధారిత డెలివరీ రూ. 335 పుంజుకుని రూ. 39,785 వద్ద ఉంది.అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 0.1 శాతం పెరిగి 1,298.86 డాలర్లకు చేరింది. జూన్ డెలివరీ కోస అమెరికా బంగారు ఫ్యూచర్స్ పెద్దగా మార్పులేదు. ఎంసీక్స్ మార్కెట్లో మాత్రం 230 రూపాయలు క్షీణించిన బంగారం ప్రది గ్రా. రూ. 30,958 పలుకుతోంది. ఆరు ప్రధాన కరెన్సీలకు పోలిస్తే డాలర్ ఇండెక్స్ఆరెన్నర గరిష్టం వద్ద ఉంది. దేశీయ కరెన్సీ డాలరు మారకంలో రూపాయి విలువ 40 పైసలు పుంజుకుని 67.47 వద్ద స్థిరపడింది. మంగళవారం 67.86 వద్ద ముగిసింది. మరోవైపు యూరోజోన్‌లోని మూడో అతిపెద్ద ఆర్ధికవ్యవస్థలో, జూలై నాటికి మళ్లీ ఎన్నికలు రానున్నాయనీ, వాస్తవిక ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చునని పెట్టుబడిదారులు భయపడుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. -
అంతా పథకం ప్రకారమే..
గుత్తి : తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు, చే బదులుగా ఇచ్చిన నగదుతో ముత్తూట్ ఫిన్‌కార్ప్ మేనేజర్ రవికుమార్ ఉడాయించాడు. బాధితులు తమ సొమ్ము కోసం ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని ముత్తూట్ ఫిన్‌కార్ప్ మేనేజర్ రవికుమార్ తమవద్దకు వచ్చే ఖాతాదారులతో పరిచయం పెంచుకుని, వారిని తన బుట్టలో వేసుకున్నాడు. తనకు సంస్థ టార్గెట్ కేటాయిచిందని, మీ బం గారు ఆభరణాలు ఇస్తే.. తర్వాత తిరిగి ఇస్తానని తెలపడంతో దాదాపు 12 మంది అమాయకులు అతడి మాటలు నమ్మి 30 తులాలమేర ఆభరణాలతోపాటు, చేతి బదులు కింద రూ.5 లక్షల నగదు అప్పగించారు. అయితే వారికి ఎటువంటి రసీదూ మేనేజర్ ఇవ్వలేదు. అలా కొద్దిరోజులు గడిచాక తమ సొమ్ము తెచ్చుకునేందుకు కస్టమర్లు కార్యాలయం వద్దకు వస్తున్నారు. అయితే మేనేజర్ లేడని సిబ్బంది చెప్పి పంపుతూ ఉన్నారు. మేనేజర్ ఇంటికి తాళం పడి ఉండటం.. సెల్‌ఫోన్ స్విచాఫ్ కావడం, ఇరవై రోజులు దాటినా లేడని సిబ్బంది నుంచి సమాధానం వస్తుండటంతో ఓపిక నశించిన బాధిత కస్టమర్లు గౌరమ్మ, సరోజ, రంగయ్య(గుత్తి), నరసింహులు( గుత్తి ఆర్ఎస్), విరూపాక్షిరెడ్డి(ఇసురాళ్లపల్లి) మరికొంతమంది మంగళవారం కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ప్రస్తుత మేనేజర్ నౌషద్ స్పందించిత్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పేకాట చూసేందుకు వెళ్లి..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): జక్కంపూడి కాలనీలో ఓ యువకుడు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌పై నుంచి పడి మృతి చెందాడు. ఘటనపై మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జక్కంపూడి వైఎస్సార్ కాలనీలోని కోతాడి పాండురంగారావు(29) భార్య సీత, ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటున్నాడు. పాండురంగారావు పందులు పెంపకంతో పాటు చేపలు విక్రయించుకుని జీవనం సాగిస్తుంటాడు. గురువారం సాయంత్రం పాండురంగారావు తన బ్లాక్ సమీపంలోని 272 బ్లాక్ పక్కన నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్‌పైకి ఎక్కాడు. అయితే అదే బ్లాక్‌లో కొంత మంది పేకాట ఆడుతున్నారు. కాలనీలోని అవుట్ పోస్టు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటు వైపు రాగా బ్లాక్ కింద ఉన్న వారు పోలీసులు, పోలీసులు అని గట్టిగా కేకలు వేశారు. మేడపై ఉన్న వారు భయంతో పరుగులు తీశారు. దీంతో అపార్టుమెంట్‌పై ఉన్న పాండురంగారావు కంగారుగా కిందకు దిగుతూ రెండో అంతస్తు పై నుంచి జారిపడ్డాడు. దీంతో పాండురంగారావు తల రాయికి తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పాండురంగారావు భార్య, పిల్లలు , ఇతర బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. కొత్తపేట సీఐ మురళీకృష్ణ, ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ప్రాణభయంతో విమానం రెక్కలోంచి దూకేశారు
డల్లాస్ : ప్రాణ భయంతో విమానం రెక్కలోంచి ప్రయాణికులు దూకేసిన ఘటన అల్బుకర్క్యూ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్(మెక్సికో)లో చోటు చేసుకుంది. పెద్ద శబ్దంతో విమానం ల్యాండ్ కాగా.. పేలిపోతుందన్న భయంతో ప్రయాణికులు ఈ పనికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. సౌత్ వెస్ట్ ఎయిర్వేస్కు చెందిన విమానం ఆదివారం రాత్రి ప్రయాణికులతో ఫోయెనిక్స్(అరిజోనా) నుంచి లవ్ ఫీల్డ్(డల్లాస్)కు బయలుదేరింది. అయితే కాసేపటికే క్యాబిన్లో ఏదో వాసన వస్తున్న విషయాన్ని గమనించిన సిబ్బంది విషయాన్ని పైలెట్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంతలో వేడి ఎక్కువగా ఉందంటూ ప్రయాణికులు గగ్గోలు పెట్టారు. క్యాబిన్లో పొగలు రావటం ప్రారంభం కాగా.. ప్రమాద సంకేతాలు కనిపించటంతో పైలెట్ విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్‌కు సిద్ధమయ్యాడు. అల్బుకర్క్యూ ఇంటర్నేషనల్ సన్‌పోర్ట్‌లో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయ్యింది. విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులంతా బయటకు వస్తున్న క్రమంలో.. ఇద్దరు ప్రయాణికులు మాత్రం విమానం రెక్క వద్ద ఉన్న ఎమర్జెన్సీ డోర్ నుంచి రన్‌వే పైకి దూకేశారు. అది గమనించిన ఓ ప్రయాణికుడు వారిద్దరూ అలా దూకటాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సుమారు 8 అడుగుల ఎత్తు నుంచి దూకటంతో వారికి గాయాలైనట్లు ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ప్రయాణికులందరినీ వేరే విమానంలో తరలించిన ఎయిర్వేస్.. గాయపడిన వాళ్లను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. A flight to remember. Something I hope I never experience again. You see these things in movies and never expect it to happen to you! Most importantly everyone is safe but man what a scare! @CNN @NBCDFW @CBS @wfaa @PhilthaThrill pic.twitter.com/BvwAqqIOZC — Brandon Cox (@brandoncox91) 12 March 2018 -
సింహం ఎన్‌క్లోజర్‌లో దూకేశాడు..
తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురం జూలో బుధవారం కాసేపు భయోత్పాత వాతావరణం నెలకొంది. ఉన్నట్టుండి ఓ వ్యక్తి సింహపు ఎన్‌క్లోజర్‌లోకి దూకి సింహం వైపు దూసుకెళ్లాడు. పొద్దున్నే ఎవరి ముఖం చూశాడో గానీ సింహం అతనిని గమనించకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. వ్యక్తి ఎన్‌క్లోజర్‌లో దూకడం గమనించిన వాచ్‌మన్ అలారం మోగించడంతో జూసిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే జూ సిబ్బంది చాకచక్యంగా సింహాన్ని ఎన్‌క్లోజర్‌లో ఉన్న గదిలోకి పంపించడంతో ప్రాణాపాయం తప్పింది. సిబ్బంది వెంటనే ఎన్‌క్లోజర్‌లోకి దిగి అతనిని పట్టుకున్నారు. ఎన్‌క్లోజర్‌లోకి దూకిన వ్యక్తి ఒట్టుప్పాలానికి చెందిన మురుగన్(45)గా గుర్తించారు. వెంటనే అతనిని చికిత్స నిమత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే మురుగన్ ఎందుకు ఎన్‌క్లోజర్‌లోకి దూకాడనే వివరాలు మాత్రం తెలియాల్సిఉంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మతిస్థిమితం సరిగా లేక ఎన్‌క్లోజర్‌లోకి దూకాడా లేక ఆత్మహత్య చేసుకోవడానికే ఎన్‌క్లోజర్‌లోకి దిగాడా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. -
మండుతున్న చమురు ధరలు
సాక్షి, న్యూఢిల్లీ: ముడి చమురు ధరలు మరింత మండుతున్నాయి. ఆయిల్ ఫ్యూచర్స్ 0.96 శాతం పుంజుకుని బారెల్ ధర రూ.4084ను తాకింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మండుతున్న నేపథ్యంలో దేశీయంగా ఈ ప్రభావం పడనుందన్న విశ్లేషకుల అంచనాలను బీట్ చేస్తూ చమురు ధరలు పరుగు తీస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్లో ఫిబ్రవరిలో డెలివరీ ముడి చమురు ధర రూ. 39 పుంజుకుని రూ.4,084 వద్ద ఉంది. అదేవిధంగా, మార్చ్ నెలలో డెలివరీ ధర రూ. 38 లేదా 0.94 శాతం ఎగిసి బ్యారెల్ ధర రూ. 4,085 వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 69.41 డాలర్ల వద్ద ఉంది. గత ముగింపుతో పోలిస్తే 0.55 శాతం పుంజుకుంది. ప్రపంచ మార్కెట్ల స్థిరమైన వృద్ది, డాలర్ బలహీన చమురు ధరలకు ఊతమిస్తోందని మార్కెట్ వర్గాల అంచనా. దీనికి తోడు ఐ ఎంఎఫ్ ఆరోగ్యకరమైన ఆర్థికాభివృద్ధి అంచనాలు, రష్యా, ఒపెక్ దేశాల ఎగుమతిదారుల గ్రూప్‌లో కొనసాగుతున్న సరఫరా నియంత్రణ చమురు ధరలు పెంచిందని ఎనలిస్టులు భావిస్తున్నారు. -
టాప్ లేపిన ఎం అండ్ ఎం
సాక్షి, ముంబై: దేశీయ టాప్ సెల్లింగ్ యుటిలిటీ వెహికల్ మేకర్ మహీంద్రా అండ్ మహీంద్రా సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలను నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో అంచనాలను మించి ఫలితాలను నమోదు చేసింది. నికర లాభాల్లో24.79 ఎగిసి రూ. 1,332 కోట్లను సాధించింది. గత ఏడాది త్రైమాసికంలో ఎం అండ్ ఎం నికర లాభం రూ .1,067 కోట్లు. ఈ త్రైమాసికంలో మొత్తం ఆదాయం రూ.12,182.07 కోట్లగా ఉంది. గత ఏడాది ఇదే కాలంలో రూ .11,446.14 కోట్లు ఆర్జించింది. ఈ క్వార్టర్లో 1,29,754 యూనిట్లు విక్రయించింది. ఇందులో ట్రాక్టర్ల విభాగంలో 76,984 యూనిట్ల విక్రయించగా, 11,755 యూనిట్లను ఎగుమతి చేసింది. ఈ త్రైమాసికంలో ఈబీఐటీడీఏ 45.6 శాతం పెరిగి రూ. 1729.8 కోట్లుగా ఉండగా, ఈబీఐటీడీఏ మార్జిన్ 14.2 శాతంగా ఉంది. ఆటో బిజినెస్‌లో ఎం అండ్ ఎం మంచి పురోగతి సాధించింది. ముఖ్యంగా పాసింజర్, యుటిలిటీ వెహికల్, ట్రక్కుల విభాగంలో వరుసగా 13.4శాతం, 27శాతం 86శాతం వృద్ధిని నమోదు చేసింది. దీంతోపాటు సాధారణ రుతుపవనాల కారణంగా ట్రాక్టర్ల వ్యాపారం కూడా 37 శాతం పెరుగుదలను సాధించింది. ఈ ఏడాది జూలై నుంచి జీఎస్టీ అమలు కారణంగా ఈ గణాంకాలు పోల్చదగినవికాదని కంపెనీ బిఎస్ఇ ఫైలింగ్‌లో పేర్కొంది. అలాగే 1: 1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయాలని బోర్డు డైరెక్టర్లు సిఫార్సు చేసినట్టు తెలిపింది. రూ. 5 బోనస్ చెల్లించనున్నట్టు తెలిపింది. పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాటాదారుల ఆమోదాన్ని కోరనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇటీవల కాలంలో ఆర్థిక వృద్ధి మందగించిందని కంపెనీ పేర్కొంది. అయితే కొన్ని స్వల్పకాలిక కారకాల ప్రభావాలను మినహాయించి, జీఎస్టీ అమలు నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ సర్దుబాటు అనంతరం వృద్ధి ఊపందుకుంటుందని భావిస్తున్నామని తెలిపింది. -
గోడ దూకిన కిరణ్ బేడీ
సాక్షి, చెన్నై : ధైర్య సాహసాలకు మరోపేరైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి మరో సాహసం చేశారు. గురువారం ఆమె కరైకల్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సమయంలోనే అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలోని సౌకర్యాలు, రోగులకు అందుతున్న సదుపాయాల గురించి అక్కడివారిని అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో.. ఆమె అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఉన్న ‘అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్‘ గదిని గమనించారు. ఆ గదికి చుట్టూ 4 అడుగుల మేర ఇటుక గోడ నిర్మించి ఒక గేట్ పెట్టారు. అవర్ లేడీ ఆఫ్ లార్డ్స్ గదిని సందర్శించాలని కిరణ్ బేడీ ఆసుపత్రి అధికారులకు తెలిపారు. గేట్ చాలాకాలం పాటు మూసివుంచడంతో.. తాళం చెవులు ఎక్కడపెట్టారో అధికారులు మర్చిపోయారు. కొద్దిసేపు తాళం చెవుల కోసం ఎదురు చూసిన కిరణ్ బేడి.. చివరకు గోడను ఎక్కి అవతలకు దూకి షెడ్లోకి వెళ్లారు. దీంతో చేసేదీలేక.. కరైకల్ కలెక్టర్ ఆర్. కేశవన్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వీజే చంద్రన్, మరికొందరు అధికారులు కూడా గోడ దూకి షెడ్లోకి వెళ్లారు. -
జియో కిక్: రిలయన్స్ హై జంప్
ముంబై: బిలియనీర్ ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలియన్స్ జియో జోష్‌తో మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్ ) బుధవారం నాటి మార్కెట్లో దూసుకుపోతోంది. ముఖ్యంగా ప్రైమ్ కస్టమర్లకు జియో ప్రకటించిన తాజా ఆఫర్ రిలయన్స్ కౌంటర్‌కి కిక్ ఇచ్చింది. ఇన్వెస్టర్ల భారీ కొనుగోళ్లతో ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాల్లో ట్రేడ్ అవుతోంది. ఆరంభంలోనే భారీ లాభాలతో 2 శాతం ఎగిసి 1524 వద్ద తొమ్మిదేళ్ల గరిష్టాన్ని నమోదు చేసింది. అనంతరం వెనక్కి తగ్గినా 1.86 శాతం లాభంతో మార్కెట్లను లీడ్ చేస్తోంది. రూ. 399 ప్లాన్‌తో 3 నెలల పాటు డేటా పొందవచ్చంటూ జియో కొత్త ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ వంటి కంపెనీలు అన్నీ 3 నెలల పథకాలను చవకధరలకే ప్రకటిస్తుండడంతో.. తన రూ. 309 ప్లాన్‌ను సవరించినట్టు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కాగా పూర్తిగా ఉచిత వాయిస్ కాలింగ్, డేటాప్లాన్‌తో టెలికా మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రిలయన్స్ జియో తరువాతికాలంలో తన ప్లాన్లను సవరించుకుంటూ వచ్చింది. ముఖ్యంగా పూర్తి ఉచితం నుంచి తక్కువ టారిఫ్ ప్లాన్లను, ప్రైమ్ మెంబర్ షిప్‌ను ప్రకటించింది. అనంతరం ధనాధన్ ఆఫర్ ను లాంచ్ చేసింది. ఇలా ప్లాన్లను పెంచుకుంటూ వచ్చిన జియో తొలుత సమ్మర్ సర్ప్రైజ్ ఆఫర్ రూ.300, ధనాధన్ ఆఫర్ రూ.309 నుంచి తాజాగా రూ.399కి (84జీబీ 4 జీ డేటా 84 రోజులు) పెంచడం గమనార్హం. -
1000 డాలర్ల మార్కును చేధించిన ఆ కరెన్సీ
లండన్ : ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి అధికార నియంత్రణ సంస్థలేని కరెన్సీగా ప్రాముఖ్యంలోకి వచ్చిన బిట్ కాయిన్ ధర సోమవారం భారీగా ఎగిసింది. మూడేళ్లకు పైగా గరిష్టస్థాయిలో వెయ్యి డాలర్ల మార్కును చేధించింది. 2013 నవంబర్ నుంచి ఇదే అత్యధిక గరిష్ట స్థాయని కాయిన్ డెస్క్ డేటా రిపోర్టు చేసింది. దీన్ని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా 16 బిలియన్ డాలర్లకు పైగా ఎగిసినట్టు పేర్కొంది. యువాన్ విలువను డీవాల్యుయేషన్ చేయడం, భౌగోళిక అంశాలు, అసెట్ క్లాస్‌పై పెట్టుబడిదారులు ఎక్కువగా శ్రద్ధ చూపించడం వంటివి బిట్ కాయిన్ విలువను గత కొద్దీ నెలలుగా పైకి పెరగడానికి దోహదం చేస్తున్నాయని విశ్లేషకులు చెప్పారు. చైనాలో ఎక్కువగా బిట్‌కాయిన్‌లోనే ట్రేడింగ్ జరుపుతున్నారని తెలిసింది. యువాన్‌ను డీవాల్యుయేషన్ చేయడం మూలధనం నియంత్రణపై ఆందోళనలు రేకెత్తించిందని, దీంతో డిజిటల్ కరెన్సీపై పెట్టుబడిదారులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నట్టు రిపోర్టులు పేర్కొన్నాయి. ప్రభుత్వ జోక్యం లేకపోవడంతో ఎంతో సురక్షిత సాధనంగా దీనికి బాగా గుర్తింపు లభిస్తోంది. కేవలం కంప్యూటర్‌తోనే లావాదేవీలను చకాచకీగా ముగించేయొచ్చు. ఇటీవల కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్టు ప్రకటించడం కూడా దేశీయంగా పెట్టుబడిదారులను ఈ కరెన్సీపై ఎక్కువగా దృష్టిసారించేలా చేసింది. -
ముగ్గురు బిడ్డలతో బావిలోకి దూకింది!
ముంబై: తన ముగ్గురు బిడ్డలను బావిలోకి తోసేసిన ఓ మహిళ.. ఆ తర్వాత తాను కూడా దూకేసింది. ఈ మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో చోటుచేసుకుంది. నాందేడ్ జిల్లాలోని బెస్తవాంగీ గ్రామంలో నివాసం ఉంటున్న ప్రియాంక బాలాజీ వాంఖడే (28) అత్తమామలు అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కలత చెంది ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. గ్రామశివారులో గల బావిలోకి తన బిడ్డలు ప్రతీక్ (3), కపిల్ (5), సాక్షి (7) లను ప్రియాంక తోసేసి ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు సోనేఖడ్ పోలీసులు వివరించారు. లక్ష రూపాయలను అదనపు కట్నంగా తేవాలంటూ అత్తింటివాళ్లు ఒత్తిడి చేస్తుండటమే ఆమె మృతికి కారణమని తెలిపారు. ప్రియాంక భర్త బాలాజీ, మామయ్య గణపతి, అత్తయ్య లీలావతులను అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కేసును విచారించిన కోర్టు నిందితులను 5 రోజుల రిమాండ్ కు అప్పగించినట్లు తెలిపారు. -
పెళ్లి సమయానికి వరుడు జంప్
-
అందుకే విశ్వాస జీవి అంటారు
న్యూయార్క్: విశ్వాసం అనగానే మనుషులకంటే ముందు కుక్కలే గుర్తుకొస్తాయి. అలా గుర్తుకు రావడం తప్పుకాదని, అదే నిజమనే విషయాన్ని మరోసారి రుజువు చేసిందో శునకం. వాయు వేగంతో వస్తున్న బస్సు ఢీకొనే ప్రమాదం నుంచి కళ్లు కనిపించని తన యజమానురాలిని ప్రాణం తెగించి మరి కాపాడింది. చిన్న కాలిగాయంతో బయటపడి ప్రస్తుతం చికిత్స పొందుతోంది. అది చేసిన సాహసపనికి అక్కడి వారంతా శబాష్ అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ లోని పుత్నాం రాష్ట్రంలో ఆండ్రీ స్టోన్ అనే మహిళ తాను ముద్దుగా పెంచుకుంటున్న ఫిగో అనే కుక్కను పెంచుకుంటుంది. వాకింగ్ కోసం దానితో కలిసి బయటకు వెళ్లగా ఓ స్కూల్ బస్సు వారివైపు వేగంగా దూసుకొచ్చింది. అది గమనించిన ఫిగో తన యజమానురాలిని పక్కకు బలంగా నెట్టేసి బస్సు డ్రైవర్ దృష్టి పడేలా ఎదురుగా ఆ క్రమంలో దాని ఓకాలి ఎముక విరగగా.. కాలి చీలమండలం, మోచేయికి స్పల్ప గాయాలతో ఆండ్రీ ప్రాణాలతో బయటపడింది. అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది దానిని ఎంతో ప్రేమగా చేరదీసి ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. -
నిషేధించకపోతే...దూకేస్తా
ఆగ్రా: ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయ వాది చిమన్ లాల్ జైన్ గాంధీ జయంతి రోజు యమునా నదిలో దూకి ప్రాణ త్యాగం చేస్తానని హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ లోని తాజ్ సిటీ ఆగ్రాలో మద్యాన్ని నిషేధించకపోతే వచ్చే అక్టోబర్ 2న ఆత్మహత్య చేసుకుంటానన్నారు. మద్యానికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న ఆయన, మంగళవారం ఉదయం ఈ ప్రకటన చేశారు. దాదాపు 600 మంది మహిళలు, పురుషులతో కలిసి ఖతీక్ పారా బస్తీలో మద్యపాన వ్యతిరేక శిబిరాన్ని నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. తాజ్ సిటీలో మద్యాన్ని నిషేధించేవరకూ తన పోరాటం ఆగదని చిమన్లాల్ స్పష్టం చేశారు. మద్య వ్యతిరేక ప్రచారానికి సంబంధించి చిమన్ లాల్ రూపొందించిన ఒక కార్యక్రమం ఆకాశవాణిలో మంగళవారం రాత్రి 9 గంటలకు ప్రసారం కానుందని సామాజిక వేత్త రాజీవ్ సక్సేనా ప్రకటించారు. తాజ్ మున్సిపల్ మ్యూజియానికి తన చరఖాను బహుమతిగా ఇచ్చారని ఆయన తెలిపారు. -
పెరగనున్న కూరగాయలు,పప్పు దినుసుల ధరలు
-
అసెంబ్లీలో కాంగ్రెస్ దూకుడే!
హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై సర్కారు తీరును ఎండగడుతూ అసెంబ్లీ సమావేశాలను వేడెక్కించాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. తొలిరోజు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చేసే ప్రసంగాన్ని సైతం అడ్డుకోవాలన్న ఆలోచనతో ఆ పార్టీ ఉన్నట్లు సమాచా రం. హైకోర్టు నోటీసులిచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై, గవర్నర్ కూడా మౌనంగా ఉండడంపై సభలో నిలదీయాలని సీఎల్పీ నిర్ణయించింది. పార్టీ ఫిరాయింపులపై అధికారపక్షం తీరును ఎండగట్టేందుకు దూకుడుగా ముందుకెళ్లాలని అభిప్రాయపడుతోంది. శుక్రవారం అసెంబ్లీ కమిటీ హాలు లో ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు సీఎల్పీ సుదీ ర్ఘంగా సమావేశమైంది. సీఎల్పీ నేతలు కె.జానారెడ్డి, డి.శ్రీనివాస్, పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమా ర్క, ఎంపీలు వి.హనుమంతరావు, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇతర నేత లు హాజరయ్యారు. ఎమ్మెల్యేల్లో జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినహా మిగతావారం తా హాజరయ్యారు. రైతుల ఆత్మహత్యలు, కరెంట్, నీళ్లు, సచివాలయం తరలింపు, ఛాతీ ఆసుపత్రి తరలింపు, ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూపంపిణీ, ప్రభు త్వ భూముల అమ్మకం, కేజీ టు పీజీ అమలు, శాంతిభద్రతలు, ఉద్యోగాల భర్తీ వంటి ప్రధానమైన 28 అంశాలను ప్రస్తావించాలని నిర్ణయించారు. సబ్జెక్టుల వారీగా ఎమ్మెల్యేలు అధ్యయనం చేసి సన్నద్ధం కావాలని నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశాల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టి సమస్యల పరిష్కారానికి ఒత్తిడిని తీసుకురావాల్సి ఉందని జానారెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. అధికారపక్షంపై యుద్ధానికి సిద్ధం: రాష్ర్ట ప్రభుత్వం పట్ల ఇంతవరకు కొంత మెతక వైఖరిని అవలంభించామని, ఇకపై దూకుడుగా యుద్ధానికి సన్నద్ధం కావాలని, అసెంబ్లీలో అధికారపక్షాన్ని తూర్పారబట్టాలనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయంలో సీఎల్పీ నేత జానారెడ్డి కూడా గట్టిగా వ్యవహరించాలని, మరింత జోరును పెంచేలా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని కొందరు ఎమ్మెల్యేలు సూచించారు. సభా నియమాలకు అతీతంగా అధికారపక్షం వ్యవహరిస్తే అడ్డుకోవాలని భట్టి విక్రమార్క సూచించారు. పలు తీర్మానాల కోసం పట్టు కేంత్రం తలపెట్టిన భూసేకరణచట్ట సవరణ, రైల్వే, సాధారణ బడ్జెట్ ప్రతిపాదనల్లో కోతలు, ప్రజావ్యతిరేక నిర్ణయాలపై అసెంబ్లీ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించేలా సర్కారుపై ఒత్తిడిని తీసుకురావాలని సీఎల్పీ నిర్ణయించింది. కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో రాష్ర్టం రూ. 9 వేల కోట్లు నష్టపోయిందని, ఈ అన్యాయాన్ని సరిదిద్దేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలనే అభిప్రాయం వ్యక్తమైంది. కాగా, హైకోర్టు విభ జనకు కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని సీఎల్పీ నిర్ణయించింది. యూపీఏ హయాంలో చేసిన ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఈ సందర్భంగా తీర్మానాన్ని ఆమోదించింది. యాదగిరిగుట్టను యాదాద్రిగా చేస్తామని చెబుతూ భద్రాద్రిని పట్టించుకోకపోతే ఎలాగని ఎమ్మె ల్సీ పొంగులేటి సుధా కర్‌రెడ్డి ప్రశ్నించారు. దీంతో దీనిపై సీనియర్ నేతలతో చర్చించి కార్యాచరణను రూపొందిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నట్లు తెలిసింది. గతంలో ఏర్పాటు చేసిన వ్యూహరచన కమిటీని పునరుద్ధరించుకుని, వ్యూహాలను సిద్ధం చేసుకోవాలన్న అభిప్రాయానికి వచ్చారు. సమావేశం ప్రారంభంలో వీహెచ్‌కు, ఎమ్మెల్సీ ఎం.రంగారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే మరో ఎంపీ పాల్వాయి తీరును కొందరు ఎమ్మెల్యేలు విమర్శించారు. అనంతరం ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మీడియాతో మాట్లాడుతు రాజకీయాలకంటే, ప్రజా సంక్షేమమే కాంగ్రెస్‌కు ముఖ్యమన్నారు. మిగతా పక్షాలతో సమన్వయం చేసుకుని పోరాడతామన్నారు. -
పెళ్ళైన ఆరు గంటలకే.. పరారయ్యాడు!
-
ఫ్లై ఓవర్ నుంచి దూకేసిన మహిళ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బసంతి అనే మహిళ ఫ్లై ఓవర్ నుంచి దూకేసింది. కుటుంబ సమస్యల వల్ల ఆదివారం ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. చికిత్స నిమిత్తం బసంతిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె రెండు కాళ్లు విరిగాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. పశ్చిమ ఢిల్లీలోని పీరా గరి ఫ్లై ఓవర్ నుంచి దూకింది. ఇదే ప్రాంతంలోని నజఫ్‌గడ్‌లో బసంతి నివసిస్తోంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల ఆమె మానసిక ఒత్తిడికి గురైనట్టు పోలీసులు వెల్లడించారు. -
టాప్‌లేపుతున్న స్మార్ట్‌ఫోన్ విక్రయాలు
న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు దుమ్ము రేపుతున్నాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో స్మార్ట్‌ఫోన్ విక్రయాలు 219 శాతం వృద్ధితో 1.45 కోట్లకు పెరిగాయని అంతర్జాతీయ రీసెర్చ్ సంస్థ, సైబర్ మీడియా రీసెర్చ్ మంగళవారం తెలిపింది. వీటిల్లో 68 శాతం 3జీ ఎనేబుల్ ఫోన్లేనని అంటున్న ఈ సంస్థ స్మార్ట్ఫోన్ల విక్రయాలపై వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు...., గత ఏడాది మొదటి మూడు నెలల కాలంలో 66 లక్షల స్మార్ట్ఫోన్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు 1.42 కోట్ల స్మార్ట్ఫోన్లు విక్రయమయ్యాయి. ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో మొత్తం 5.89 కోట్ల మొబైల్ ఫోన్లు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రాతిపదికన 9 శాతం వృద్ధి, మూడు నెలల ప్రాతిపదికన చూస్తే 16 శాతం క్షీణత నమోదైంది. కాగా గత ఏడాది ఇదే కాలానికి మొత్తం 7.04 కోట్ల మొబైళ్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది జనవరి-మార్చి కాలానికి 4.75 కోట్లుగా ఉన్న ఫీచర్ ఫోన్ల విక్రయాలు ఈ ఏడాది జనవరి-మార్చి కాలానికి 7 శాతం క్షీణించి 4.44 కోట్లకు తగ్గాయి. గత ఏడాది అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ విక్రయాలు(5.62 కోట్లు)తో పోల్చితే 21 శాతం తగ్గాయి. వివిధ రకాల పనులను చేసుకోవడానికి మొబైల్స్ ఉపయోగించుకోవడం పెరుగుతుంది. డేటా సర్వీసులకు భవిష్యత్తులో మరింత డిమాండ్ పెరుగుతుంది. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 43% వాటాతో శామ్సంగ్ తొలి స్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో మైక్రోమ్యాక్స్(18%), కార్బన్ (5%)లు నిలిచాయి. మొత్తం ఫోన్ల మార్కెట్‌ను పరిగణనలోకి తీసుకున్నా, శామ్‌సంగ్‌దే (20% మార్కెట్ వాటా)అగ్రస్థానం, ఆ తర్వాతి స్థానాల్లో నోకియా(18%, మైక్రోమ్యాక్స్(11 శాతం)లు నిలిచాయి.