
ముత్తూట్ ఫైనాన్స్ సిబ్బందితో వాగ్వాదం చేస్తున్న బాధితులు, ఉడాయించిన రవి కుమార్
గుత్తి : తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు, చే బదులుగా ఇచ్చిన నగదుతో ముత్తూట్ ఫిన్‌కార్ప్ మేనేజర్ రవికుమార్ ఉడాయించాడు. బాధితులు తమ సొమ్ము కోసం ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని ముత్తూట్ ఫిన్‌కార్ప్ మేనేజర్ రవికుమార్ తమవద్దకు వచ్చే ఖాతాదారులతో పరిచయం పెంచుకుని, వారిని తన బుట్టలో వేసుకున్నాడు. తనకు సంస్థ టార్గెట్ కేటాయిచిందని, మీ బం గారు ఆభరణాలు ఇస్తే.. తర్వాత తిరిగి ఇస్తానని తెలపడంతో దాదాపు 12 మంది అమాయకులు అతడి మాటలు నమ్మి 30 తులాలమేర ఆభరణాలతోపాటు, చేతి బదులు కింద రూ.5 లక్షల నగదు అప్పగించారు. అయితే వారికి ఎటువంటి రసీదూ మేనేజర్ ఇవ్వలేదు.
అలా కొద్దిరోజులు గడిచాక తమ సొమ్ము తెచ్చుకునేందుకు కస్టమర్లు కార్యాలయం వద్దకు వస్తున్నారు. అయితే మేనేజర్ లేడని సిబ్బంది చెప్పి పంపుతూ ఉన్నారు. మేనేజర్ ఇంటికి తాళం పడి ఉండటం.. సెల్‌ఫోన్ స్విచాఫ్ కావడం, ఇరవై రోజులు దాటినా లేడని సిబ్బంది నుంచి సమాధానం వస్తుండటంతో ఓపిక నశించిన బాధిత కస్టమర్లు గౌరమ్మ, సరోజ, రంగయ్య(గుత్తి), నరసింహులు( గుత్తి ఆర్‌ఎస్), విరూపాక్షిరెడ్డి(ఇసురాళ్లపల్లి) మరికొంతమంది మంగళవారం కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ప్రస్తుత మేనేజర్ నౌషద్ స్పందించిత్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment