gutti
-
ముళ్లు లేని బ్రహ్మజెముడు.. పశుగ్రాసంతో పాటు ఆహార పంటగా! పాలలో వెన్నశాతం పెరిగి
Spineless Cactus: ముళ్లులేని బ్రహ్మజెముడు కరువు పాంతాల్లో వేసవి పశుగ్రాస పంటగా ఉపయోగపడుతోంది. అతి తక్కువ నీటితోనే బ్రహ్మజెముడు మొక్క బతుకుతుంది. ఇతర ఏ ఇతర పశుగ్రాస పంటల కన్నా తక్కువ నీటితోనే బతకగలదు. మెక్సికో, జోర్దాన్ వంటి దేశాల్లో కరువు/ఎడారి ప్రాంతాల వ్యవసాయ ఆర్థిక వ్యవస్థల్లో అంతర్భాగంగా మారిన ఈ పంట ఇప్పుడు మన దేశంలోనూ అందుబాటులోకి వచ్చింది. అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు పుణే కేంద్రంగా పనిచేస్తున్న బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ ఇందుకోసం విశేష కృషి చేస్తుండటం విశేషం. ఒక్కసారి నాటుకుంటే దశాబ్దాల తరబడి నిరంతరం పశుగ్రాసం అందుబాటులో ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రయోగాత్మకంగా సాగు చేసిన తర్వాత అనంతపురం జిల్లాలో రైతులకు ఈ పంటను ‘సెర్ప్’ సహాయంతో నాలుగేళ్ల క్రితం పరిచయం చేశారు. బ్రహ్మజెముడు పశుగ్రాస పంట మాత్రమే కాదు, ఆహార పంట కూడా. దీని ఆకులను కూరగా వండుకొని కూడా తింటారు. ముళ్లు లేని బ్రహ్మజెముడు సాగు ఇలా.. నాటే కాలం: వర్షాకాలం తర్వాత అక్టోబర్ నుంచి మార్చి వరకు. స్థల ఎంపిక: నీరు నిలవని తేలికపాటి నేలలు అనుకూలం. ఏ ఇతర పంటలు పండని నిస్సారమైన సాగు భూములు, బంజరు భూములు, రాళ్ల భూములు, ఇసుక భూముల్లోనూ ముళ్లులేని బ్రహ్మజెముడు పెరుగుతుంది. 2 అడుగుల వెడల్పు, 1 అడుగు ఎత్తులో మడుల (బెడ్స్)ను సిద్ధం చేసి ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులు నాటాలి. ఆకులను నాటడానికి సిద్ధం చేయటం: కనీసం ఒక సంవత్సరం వయసున్న ముళ్లులేని బ్రహ్మజెముడు మొక్కల ఆకులనే కోసి, నాటుకోవచ్చు. నాటడానికి ముందు వాటిని నీడలో 15 రోజులు ఉంచాలి. కోసిన వెంటనే నాటకూడదు. వడపడి తేమ తగ్గిన తర్వాత నాటాలి. శుద్ధి చేసి నాటాలి: శిలీంద్ర తెగుళ్లు నివారించడానికి జాగ్రత్తవహించాలి. నాటడానికి ముందు ట్రైకోడెర్మా విరిడి ద్రావణంలోద్రావణంలో ఆకులను ముంచిన తర్వాత నాటాలి. నాటే దూరం: సాళ్ల మధ్య 3 మీటర్లు, మొక్కల మధ్య 2 మీటర్ల (667 మొక్కలు/ఎకరం) దూరంలో నాటాలి. ఆకును చెట్టు నుంచి కోసిన భాగం మట్టిలోకి వెళ్లేలా నాటాలి. ఎత్తుమడిపై ఈ ఆకుపై ఎండపడే విధంగా తూర్పు వైపు తిప్పి నిటారుగా ఉండేలా నాటండి. ఎరువు: నాటేటప్పుడు ఎకరానికి 2 టన్నుల చొప్పున బాగా కుళ్ళిన పశువుల ఎరువుతో పాటు 60:30:30 ఎరువులు వేయండి. నాటిన ఏడాది తర్వాత నుంచి ఆకులు కోసుకొని పశువులకు మేపవచ్చు లేదా తిరిగి నాటుకోవచ్చు. ∙నీటి నిర్వహణ: మొక్కలు (ఆకులు) నాటిన 10 రోజుల వరకు మొక్కలకు నీరు పెట్టవద్దు. తర్వాత 15 రోజుల వ్యవధిలో మొక్కకు 1–2 లీటర్ల నీరు పోయాలి. మొదటి ఏడాది కలుపు తీసెయ్యాలి. ఆకుల దిగుబడి: నాటిన తర్వాత ఏడాది తర్వాత నుంచి ఆకులు కోసుకోవచ్చు. కింది వైపు ఉండే రెండు, మూడు ఆకులు అలాగే ఉంచి ఆ పైన పెరిగిన ఆకులను చాకుతో కోయాలి. మేపటం: ముళ్లు లేని బ్రహ్మజెముడు ఆకులను చిన్న ముక్కలుగా కోసి మేకలు/గొర్రెలు/పశువులకు ఇతర పచ్చి మేతకు బదులుగా 30% మేరకు తినిపించవచ్చు. చౌడు, నల్ల భూములు పనికిరావు! పశుగ్రాసం కొరతను అధిగమించడానికి పశువులు, గొర్రెలు, మేకలు పెంచుకునే కరువు ప్రాంతాల్లోని చిన్న, సన్నకారు రైతులతో ముళ్లులేని బ్రహ్మజెముడు సాగు చేయిస్తున్నాం. నీటి ఎద్దడి ఉండే ప్రాంత భూముల్లో ఈ మొక్కలు నిశ్చింతగా పెరుగుతాయి. నీరు నిల్వ ఉండే నల్ల నేలలు, చౌడు భూముల్లో ఈ మొక్కలు పెరగవు. 2018 నుంచి అనంతపురం జిల్లాలో 82 మంది రైతులకు ముళ్లులేని బ్రహ్మజెముడు నాటిస్తున్నాం. వీటి ఆకులు నాటితే చాలు. పుణే లోని బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ నుంచి 4 రకాల ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులను తెప్పించి ‘సెర్ప్’ ఆధ్వర్యంలో రైతులకు పంచాం. ముళ్లులేని బ్రహ్మజెముడును మార్చి వరకు నాటుకోవచ్చు. నాటుకోవడానికి ఆకులు కావాలనుకునే రైతులు సంప్రదించవచ్చు. టిష్యూకల్చర్ పద్ధతిలో నర్సరీ పెంచుకునే ఆసక్తి ఉన్న వాళ్లకు శిక్షణ ఇస్తాం. – సురేష్ (99892 04816), బిఎఐఎఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ ప్రతినిధి, అనంతపురం ఎండాకాలంలో ఏపుగా పెరుగుతుంది ముళ్లులేని బ్రహ్మజెముడును మూడేళ్ల క్రితం వేసవిలో నాటాను. ఒక ఎకరంలో ఎత్తుమడులు నాటాను. 5 ఎకరాల జామ తోట చుట్టూతా అడుగు ఎత్తున సరిహద్దు గట్టు వేసి దానిపైన కూడా నాటాము. ఒక సంవత్సరం పాటు 15 రోజులకు ఒకసారి నీరు పోశాం. తర్వాత నుంచి నీరు పోయటం లేదు. మూడేళ్లకు ఇప్పుడు 6 నుంచి 8 అడుగుల ఎత్తు పెరిగాయి. ఈ మొక్కలు వర్షాకాలంలో పెద్దగా పెరగవు. ఎండాకాలంలో ఏపుగా పెరుగుతాయి. నీరు నిల్వ ఉండకూడదు. ఎంత ఎత్తు మీద అంత మంచిది. ఒక సంవత్సరం పెరిగిన తర్వాత నుంచి బ్రహ్మజెముడు ఆకులు కోసి, ముక్కలు చేసి.. ఆవులు, గేదెలతో పాటు 100 పొట్టేళ్లకు కూడా ఇతర పశుగ్రాసం లేనప్పుడు మేతగా వేసేవాళ్లం. ముళ్లులేని బ్రహ్మజెముడు ఆకులు మంచి పశుగ్రాసం. పశువులు ఏవైనా ఇష్టంగా తింటాయి. ఆవుల పాలలో వెన్న 1–2% వరకు పెరిగింది. రైతులు కొందరు ఇంతకు ముందే ఈ ఆకులను తీసుకెళి నాటుకున్నారు. ఆకును రూ. 20కి ఇస్తున్నాను. – అలవల వెంకటేశ్వర రెడ్డి , ఫోన్: 90006 16717, ముళ్లులేని బ్రహ్మజెముడు రైతు, గుత్తి, అనంతపురం జిల్లా – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ చదవండి: Sagubadi: తినడానికి పనికొచ్చేదని అప్పట్లో తెలీదు.. సముద్రపు పాలకూర.. ప్రొటీన్లు పుష్కలం... Bio Fence: వారెవ్వా.. అప్పుడు ఖర్చు 40 వేలు.. ఇప్పుడు 1500.. కోతుల బెడద లేదు! కాకర, చిక్కుడు.. అదనపు ఆదాయం కూడా.. -
Peddavadugur: గాంధీజీ మెచ్చిన ఊరు
అనంతపురం జిల్లా గుత్తికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘పెద్ద వడుగూరు’ గ్రామం స్వాతంత్య్ర ఉద్యమంలో గొప్ప పాత్ర పోషించింది. ఆ ఊళ్లో గొప్ప పారిశ్రామికవేత్త కె. చిన్నారప రెడ్డి. ఎన్నో ఆదర్శ భావాలు కలిగినవాడు. ఆయన పనిపై మద్రాస్ వెళుతూ ఉండేవారు. 1934లో ఒకరోజు ఆయన మద్రాసు మెరీనా బీచ్‌లో మహాత్మాగాంధీ ఉపన్యాసం విన్నారు. ఆ రోజు గాంధీ ఉపన్యసిస్తూ స్వాతంత్ర పోరాటానికి నిధులు కొరతగా ఉన్నాయనీ, దాతలు సహాయం చేయాలనీ విజ్ఞప్తి చేశారు. ఆ మాటలు నారపరెడ్డిని ఆలోచనలో పడవేశాయి. తమ ఊరికి రావాలని గాంధీజీని సంప్రదించారు. స్వాతంత్రోద్య మానికి రూ. 12 వేల నిధి ఇస్తే వస్తానని హామీ ఇచ్చారు. అన్నట్టుగానే బాపు 1934 సెప్టెంబర్ 21న మద్రాసు నుండి రైలులో ఉదయం 7 గంటలకు గుత్తి రైల్వేస్టేషన్లో దిగారు. ప్రజలు పెద వడుగూరుకు ఘన స్వాగతం పలికారు. చిన్నారప రెడ్డే గాంధీకి వసతి చేకూర్చారు. తిరుపతిరావు అనే వ్యక్తి గాంధీజీని తన భుజస్కంధాలపై ఎత్తుకొని వేదికపైకి చేర్చాడు. హిందీ పండిట్ సత్యనారాయణ... గాంధీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు. నిధులు అందించి స్వాతంత్ర పోరాటాన్ని విజయవంతం చేయాలని అక్కడ చేరిన ప్రజలను కోరారు గాంధీ. అందరూ కలిసి దాదాపు రూ. 27 వేలు ఇచ్చారు. సభాస్థలికి 11 కిలోమీటర్ల దూరం నుంచి విచ్చేసిన భూస్వామి హంపమ్మ రూ. 1,116 అంద జేశారు. ఆమె అంతటితో ఆగకుండా మరో అరగంట గడుస్తుండగా తన ఒంటిపై ఉన్న బంగారు నగలన్నీ విరాళంగా ఇచ్చేశారు. అలా ఒకరికొకరు పోటీలు పడుతూ దాదాపు 5 కేజీల బంగారాన్ని గాంధీకి ఇచ్చారు. ఈ ఊరిని కేంద్రంగా చేసుకుని గాంధీ అనేక గ్రామాలు సందర్శించారు. ఉరవకొండ, హిందూపురం, కదిరి సమావేశాల్లో కూడా ప్రసంగించారు. రాత్రి అయ్యే సరికి తిరిగి పెద్ద వడుగూరులోని తన విడిది గృహానికి చేరుకునేవారు. ఈ నాలుగు రోజులూ గాంధీ చిన్నారప రెడ్డి కారులోనే తిరిగేవారు. ఆఖరు రోజున చిన్నారప రెడ్డి తనకున్న 32 ఎకరాల పొలాన్ని, తన కారును కూడా విరాళంగా ప్రకటించి గొప్ప మనసును చాటుకున్నారు. గాంధీజీని గ్రామానికి పిలవద్దని కూడా అప్పట్లో బ్రిటిష్‌వాళ్లు ఆయనను బెదిరించారు. అయినా ఆయన భయపడకుండా ధైర్యంగా నిలబడి తన నిర్ణయాన్ని అమలుపరిచారు. ఇక్కడ ఇల్లూరి కేశమ్మ అనే మహిళను కూడా మనం స్మరించుకోవాలి. ఇల్లూరు కేశమ్మ పోలీసుల బెదిరింపులకు భయపడకుండా గ్రామ గ్రామం తిరిగి, గాంధీ సభలకు రావాల్సిందిగా వేసిన కరపత్రాలు పంచింది. ఆమెను ఒకసారి అరెస్టు కూడా చేశారు. అయినా జడవక విడుదల కాగానే తిరిగి ప్రచారం మొదలు పెట్టింది. గాంధీ వెంట నారాయణమ్మ, సుభద్రమ్మ అనే మహిళలు సైతం 4 రోజులు తిరిగారు. ఆరోజు గాంధీ సభకు తోరణాలు కట్టి, అలంకరణ చేసి అందరికీ మంచినీళ్లు అందించిన వెంకటరెడ్డి వయసు నేడు 110 ఏళ్లు. ఆ గ్రామానికి 3 దశాబ్దాలు సర్పంచ్‌గా సేవలందించిన శరభా రెడ్డి కూడా ఆ కాలంలో గాంధీకి రూ. 1,116 విరాళంగా ఇచ్చారు. ఆయన కొడుకు సూర్యనారాయణరెడ్డి (88 ఏళ్ళు)... గాంధీ తమ ఊరికి వచ్చినపుడు తాను చిన్న పిల్లవాడిననీ, అప్పటి విశేషాలు ఎన్నో తన మనసులో దాగివున్నాయనీ పూస గుచ్చినట్లు వివరించారు. 1947 ఆగస్టు 15న గ్రామమంతా పండుగ చేసుకున్నామనీ, అందరికీ పిప్పరమెంట్లు, బోరుగులు పంచామనీ చెప్పుకొచ్చారు. గాంధీజీ పెద వడుగూరును ప్రశంసిస్తూ తన డైరీలో ప్రత్యేకంగా రాసుకున్నారనీ ఆయన అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఆనాటి కోట్లాదిమందిని స్మరిస్తూ, జీవించివున్న స్వాతంత్య్ర సమరయోధులకు పాదాభివందనాలు తెలియజేద్దాం. (క్లిక్: ఉద్యమ వారసత్వమే ఊపిరి) - డాక్టర్ సమ్మెట విజయ్‌కుమార్ సామాజిక శాస్త్రవేత్త -
మరో యువతితో పెళ్లి.. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు షాకిచ్చిన ప్రియురాలు
గుత్తి రూరల్ (అనంతపురం/కర్నూలు): ప్రేమించిన అమ్మాయిని మోసం చేశాడు. మరో అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలిసి బాధితురాలు, వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం ఇసురాళ్లపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. చదవండి: మీరు తింటున్న చికెన్ బిర్యానీలో ఏముందో తెలుసా?.. భయంకర వాస్తవాలు ఇసురాళ్లపల్లికి చెందిన రమేష్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ యువతి ఇసురాళ్లపల్లిలో బంధువుల ఇంటికి వచ్చి వెళ్తుండేది. ఈ క్రమంలో రమేష్ ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె కూడా ప్రేమకు అంగీకరించింది. కొంతకాలం ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. అయితే.. అతను ప్రేమించిన యువతిని మోసం చేసి, జిల్లాలోని పెద్దవడుగూరు మండలం వీరేపల్లికి చెందిన మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. బుధవారం ఇసురాళ్లపల్లిలోని ఆనందాశ్రమంలో వివాహం జరుగుతున్న విషయం బాధితురాలికి తెలిసింది. వెంటనే ఆమె గుత్తి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు రమేష్‌ను స్టేషన్‌కు పిలిపించి విచారించారు. విషయం తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు కూడా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమ విషయాన్ని దాచి తమనూ మోసం చేశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరువురి ఫిర్యాదు మేరకు వరుడు రమేష్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
అనంతపురం జిల్లాలో ప్రేమ..పెళ్లి హైడ్రామా
-
చరిత్రకు ఆనవాలు..మన సువర్ణగిరి....అదే నేటి జొన్నగిరి
సాక్షి, కర్నూలు(సెంట్రల్): చరిత్రకు ఆనవాలుగా నిలిచిన అశోకుని శిలా శాసనాలు తుగ్గలి మండలం జీ ఎర్రగుడి-జొన్నగిరి గ్రామాల మధ్య ఉన్నాయి. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో తన సువిశాలమైన మౌర్య సామ్రాజ్యాన్ని నాలుగు భాగాలుగా విభజించాడు అశోకుడు. గాంధార రాజ్యానికి తక్షశిల, కళింగ రాజ్యానికి తోసలి, పశ్చిమ రాజ్యానికి ఉజ్జయిని, దక్షణ భారత రాజ్యానికి సువర్ణగిరి రాజధానిగా (నేటి జొన్నగిరి) ఏర్పాటు చేశారు. తిరుగులేని రారాజుగా వెలుగొందిన మౌర్యవంశానికి చెందిన అశోక చక్రవర్తి పత్తికొండ నియోజక వర్గంలో రెండు చోట్ల శాసనాలు నిర్మించారు. పత్తికొండ నుంచి గుత్తికి వెళ్లే మార్గంలో జొన్నగిరి నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని పడమటి దిక్కున ఉన్న ఏనుగు కొండల్లో రాతి బండలపై శాసనాలు చెక్కించారు. కళింగ యుద్ధంలో లక్షలాది మంది చనిపోతారు. వారిలో తన అనునూయులు కూడా ఉండడం చూసి వ్యధకోర్చిన అశోకుడు తర్వాత ఆచార్య ఉపగుప్తుడు ఆధ్వర్యంలో బౌద్ధమతం స్వీకరిస్తాడు. అప్పటి నుంచి చెడు మార్గాలకు దూరంగా ఉండి ధర్మ ప్రచారం చేపడుతాడు. 365 రోజులు దేశ సంచారం చేసి ధర్మ బోధనలు చేస్తారు. తల్లి దండ్రులను పెద్దలను ప్రేమించాలని, భూతదయ కలిగి ఉండాలని, సత్యమును మాత్రమే పలకాలని హిత బోధ చేస్తాడు. రోడ్లు వేయించడం, చెట్లు నాటించడం వంటివి చేశాడు. (చదవండి: శవమే శివం.. భోజనం 2 పూటలే.. శుభకార్యాలకు దూరం) మగధ సామ్రాజ్యానికి రెండో రాజధాని జోన్నగిరి... భారత దేశంలో అశోకుడు పలు ప్రాంతాల్లో చిన్నరాతి పలక శాసనాలు చెక్కించినట్లు కథనం. అందులో జొన్నగిరి వద్ద, పత్తికొండ సమీపంలోని రాజుల మండగిరి వద్ద అశోకుని శిలాశాసనాలు ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లో కూడా శాసనాలు చెక్కించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. శాసనాలు ప్రాకృత (పాలీ) భాషలో ఉన్నాయి. జొన్నగిరిలో ఉన్న శాసనాలు సింధూ లిపిని పోలి(సర్పలేఖన పద్ధతి) ఉండటంతో ప్రత్యేకత సంతరించు కుందని పేర్కొంటారు. మగధ సామ్రాజ్యంలో జొన్నగిరిని రెండో రాజధానిగా చేసుకొని పాలన సాగించి నట్లు చరిత్రకారుల అభిప్రాయం. దీంతో జొన్నగిరిని సువర్ణగిరి అని పిలుస్తుండే వారని, ఇక్కడ వజ్రాలను రాశులుగా పోసి అమ్మే వారని నానుడి. అందుకు నిదర్శనం జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఏటా తొలకరి చినుకులకు విలువైన వజ్రాలు లభ్యమవడం. వజ్రాలవేట కోసం వివిధ జిల్లాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనం వస్తుంటారు. కొంతమంది ఇక్కడే కొన్ని నెలల పాటు ఉంటూ ప్రతిరోజు పొలాల వెంబడి వజ్రాల కోసం అన్వేషిస్తుంటారు. అంతే కాకుండా ఈ ప్రాంతంలో విశేషంగాబంగారు నిక్షేపాలు ఉన్నాయి. బంగారం వెలికి తీసేందుకు ఇక్కడ కంపెనీ ఏర్పాటు చేయాలని జియో మైసూర్ సర్వీసెస్ ప్రవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వ అనుమతులు పొందింది. ఎకరా రూ.12 లక్షల చొప్పున 300 ఎకరాలు కొనుగోలు చేయాలని రైతులతో ఒప్పందం చేససుకొని కంపెనీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీంతో అశోకుని శిలాశాసనాల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడకు చేరుకోవడానికి సిమెంటు రోడ్డు కాస్త మెరుగుపర్చాలి. శాసనాలను రక్షించేందుకు సంరక్షకులను నియమించారు. శాసనాలను చూసేందుకు ఆదోని–గుత్తి మార్గం గుండా వెళ్లే పర్యాటకులు తరచూ వస్తుంటారు. పర్యాటకులను ఆకర్షించేలా తగు చర్యలు ప్రభుత్వ తీసుకుంటే ఈ ప్రాంతం మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. (చదవండి: ఊపిరాడట్లే.. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు!) -
అనంతపురం జిల్లా గుత్తి సమీపం లో రోడ్డుప్రమాదం
-
బైక్ అంబులెన్సులు.. ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రతిభ
గుత్తి: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని గేట్స్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు బైక్ అంబులెన్సులను రూపొందించారు. అత్యవసర సమయాల్లో కరోనా రోగులకు ఉపయోగపడేలా వీటిని తయారు చేశారు. ఆక్సిజన్ సిలిండర్, వీల్ చైర్, ఎమర్జెన్సీ మెడికల్ కిట్ ఇందులో ఉంటాయి. పూణేకు చెందిన డసల్ట్ సిస్టమ్స్ కంపెనీ ప్రతినిధి సుహాస్ ప్రీతిపాల్ పర్యవేక్షణలో మెకానికల్ సెకండియర్ చదువుతున్న గుత్తికి చెందిన యశ్వంత్, ఎజాజ్ అహ్మద్ 45 రోజులు శ్రమించి బైక్ అంబులెన్సులను రూపొందించారు. ఇప్పటిదాకా తయారైన పది బైక్ అంబులెన్సులను త్వరలోనే సచివాలయాలకు ఉచితంగా అందజేస్తామని గేట్స్ కాలేజీ ఎండీ గజ్జల రఘునాథ్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఒక్కో అంబులెన్స్ తయారు చేయడానికి దాదాపు రూ.50 వేలు ఖర్చయ్యిందని, కరోనా రోగులకు అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే వీటిని రూపొందించామని విద్యార్థులు యశ్వంత్, ఎజాజ్ అహ్మద్ చెప్పారు. -
మూగజీవాల మృత్యుఘోష ..
సాక్షి, అనంతపురం(గుత్తి): మండల పరిధిలోని ఊటకల్లు వద్ద కురుబ రాజు మామిడి తోటలో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆవు తీవ్రంగా గాయపడింది. వివరాలు ఇలా ఉన్నాయి. మామిడి తోటలోని ఓ ప్రాంతంలో ప్లాస్టిక్ కవర్లో 22 కేఫ్‌లు (పేలుడు పదార్థాలు) ఉంచారు. టమాట పండ్ల మాదిరి ఉండటంతో అటువైపు వెళ్లిన రైతు నారాయణరెడ్డికి చెందిన ఆవు తినడానికి ప్రయత్నించింది. దీంతో ఒక కేఫ్ పెద్ద శబ్దంతో పేలింది. ఆవు తల భాగం ఛిద్రమైంది. గ్రామస్తులు వెంటనే గుత్తి సీఐ రాముకు సమాచారం ఇచ్చారు. ఆయనతో పాటు తాడిపత్రి డీఎస్పీ చైతన్య, ఎస్ఐ సుధాకర్ యాదవ్, పోలీసు సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పేలని 21 కేఫ్‌లను గుర్తించారు. ఈ సందర్భంగా కొందరు రైతులు మాట్లాడుతూ సాధారణంగా కేఫ్‌ను అడవి పందులను చంపడానికి వినియోగిస్తారని చెప్పారు. అయితే అడవ పందులను చంపడానికైతేఅక్కడక్కడా ఒకటి చొప్పున మాత్రమే ఉంచుతారు. ఒకేచోట 22 ఎందుకు ఉంచారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లా రొళ్లపాడు, గుడిసెల గ్రామాలకు చెందిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనతో ఊటకల్లు గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎక్కడెక్కడ ఈ తరహా పేలుడు పదార్థాలు ఉంచారోనని భయపడుతున్నారు. గ్రామంలో ఎవరినైనా టార్గెట్ చేశారా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. కేఫ్ పేలితే సుమారు కిలో మీటరు దూరం వరకు శబ్ధం వినిపిస్తుందని పోలీసులు చెబుతున్నారు. మూగజీవాల మృత్యుఘోష అనంతపురం–కదిరి జాతీయ రహదారిపై మండల పరిధిలోని రామాంజులపల్లి బస్‌షెల్టర్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదు ఎద్దులు మృతి చెందాయి. మరో ఏడు ఎద్దులు తీవ్రంగా గాయపడ్డాయి. ప్రమాదానికి గురైన మూగజీవాలు విలవిలలాడడం చూసి స్థానికులు చలించిపోయారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బళ్లారి నుంచి చెన్నైకు ఎద్దులను తరలిస్తున్న కంటైనర్ లారీ తెల్లవారుజామున రామాంజులపల్లి బస్‌షెల్టర్ వద్దకు రాగానే డ్రైవర్ నిద్ర మత్తులో తూగాడు. దీంతో లారీ అదుపుతప్పి ఎదురుగా ఉన్న బస్‌షెల్టర్‌ను వేగంగా ఢీ కొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులోని 12 ఎద్దులలో ఐదు అక్కడికక్కడే మృతి చెందాయి. మిగిలిన ఏడు కొమ్ములు, కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాయి. అవి విలవిలలాడుతుండడంతో చుట్టుపక్కల గ్రామాల వారు అక్కడికి చేరుకుని రక్షించే ప్రయత్నం చేశారు. లారీలోనే మృతి చెందిన ఎద్దులను జేసీబీ సాయంతో తొలగించారు. లారీ వేగంగా ఢీ కొనడంతో బస్‌షెల్టర్ సైతం దెబ్బతింది. సమాచారం అందుకున్న పశువైద్యాధికారి గుర్నాథరెడ్డి గోపాలమిత్రలను సంఘటనా స్థలానికి పంపి గాయపడిన పశువులకు చికిత్స చేయించారు. అనంతరం వాటిని చెన్నైకు తరలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు. -
భర్తకు విషం ఇచ్చిన నవ వధువు
సాక్షి, కర్నూలు: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన వారం రోజులు కూడా గడవక ముందే తన వైవాహిక జీవితానికి ఓ నవ వధువు స్వస్తి పలకాలనుకుంది. అత్తవారి ఇంటికి వచ్చిన భార్య.. భర్తకు విషం ఇచ్చిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు వారం రోజుల క్రితం మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా లింగమయ్యతో నాగమణి పెళ్లి చేశారు. ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో అత్తవారింటికి వచ్చిన నాగమణి భర్తకు మజ్జిగలో విషం కలిపి ఇచ్చింది. వీటిని తాగిన లింగమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గుత్తి పోలీసులు ఈ కేసును దర్యాప్తులో భాగంగా జొన్నగిరి పోలీసు స్టేషన్‌కు బదలాయించారు. -
గుత్తిలో డిగ్రీ విద్యార్థిని దారుణహత్య
-
తన ప్రేమను ఒప్పుకోలేదని చంపేశాడు..
సాక్షి, అనంతపురం : గుత్తిలోని తురకపల్లి రోడ్డు కాలనీలో నివాసం ఉండే కారు డ్రైవర్ రాజు కుమార్తె మేరీ జోత్స్న అరుణ కుమారి (18) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో రంగస్వామి అనే వ్యక్తి అరుణ కుమారిని దారుణంగా గొంతునులిమి చంపినట్లు పోలీసులు నిర్థారించారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని అరుణకుమారి ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఇళ్ల వారు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయితే ఇంటికి సమీపంలోని డ్రైనేజీ కాలువ దగ్గర అపస్మారకస్థితిలో పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి మెడపై రెండు పెద్ద గాట్లు ఉండటం, తలకు వెనుక భాగంలో గాయాలుండటంతో ఆమె మృతిపై అనుమానం రేకెత్తాయి. ఉద్దేశ పూర్వకరంగా ఎవరైనా చంపారా? లేక కాలు జారి రాళ్లపై పడిందా? అనే కోణంలో దర్యాప్తు నిర్వహించగా హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు రంగస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. -
గుత్తిలో ఏడు ఇళ్లలో చోరీ
సాక్షి, అనంతపురం(గుత్తి) : గుత్తిలో దొంగలు హల్చల్ చేశారు. శనివారం అర్ధరాత్రి తర్వాత ఏడు ఇళ్లల్లో చోరీలకు తెగబడ్డారు. రూ. 11.50 లక్షల నగదుతో పాటు ఐదు తులాల బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు, దుస్తులు అపహరించుకుపోయారు. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు... గుత్తిలోని బండగేరిలో నివాసముంటున్న రిటైర్డ్ విద్యుత్ లైన్‌మన్ ప్రసాద్ ఇంటిలోకి ప్రవేశించిన దుండగులు బీరువాలోని రూ.11 లక్షల నగదును ఎత్తుకుపోయారు. అనంతరం ఇదే వీధిలోని సుబ్బరాయుడు, పుల్లయ్య ఇళ్లల్లోకీ చొరబడి కొంత నగదు, విలువైన వస్తువులు, దుస్తులు ఎత్తుకెళ్లారు. కమాటం వీధిలో చీరెల వ్యాపారి గాయత్రి ఇంటిలోకి ప్రవేశించిన దొంగలు బీరువాలోని రూ.50వేల నగదుతో పాటు మూడు తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయారు. సమీపంలోని ఇర్ఫాన్ ఇంటిలోనూ విలువైన వస్తువులు, దుస్తులు ఎత్తుకెళ్లారు. అలాగే గుత్తి ఆర్ఎస్లోని కర్నూల్ రోడ్డులో నివాసముంటున్న రిటైర్డ్ రైల్వే పాయింట్స్మన్ నారాయణస్వామి ఇంటిలో దొంగలు పడి బీరువాలోని రెండు తులాల బంగారు ఆభరణాలతో పాటు విలువైన చీరలు ఎత్తుకెళ్లారు. ఇదే కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ ఇంటిలో దొంగలు పడి విలువైన దుస్తులు, వస్తువులు చోరీ చేశారు. చోరీలు జరిగిన ఇళ్లను సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఎస్ఐ రాజేష్‌లతో పాటు అనంతపురం క్లూస్ టీం సభ్యులు, వేలి ముద్ర నిపుణులు , డాగ్ స్క్వాడ్ ఆదివారం పరిశీలించారు. -
రైలు నుంచి విద్యార్థి తోసివేత
సాక్షి, గుత్తి(అనంతపురం) : రైల్లోంచి ఇంటర్ విద్యార్థిని గుర్తుతెలియని ప్రయాణికుడు కిందకు తోసేశాడు. ఈ ఘటనలో విద్యార్థి రెండు కాళ్లు కోల్పోయాడు. జక్కలచెరువు రైల్వే స్టేషన్లో సోమవారం ఈ ఘటన జరిగింది. జీఆర్పీ పోలీసులు, స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన మైన్స్ వ్యాపారి రాజేశ్వరరెడ్డి, ఆదిలక్ష్మి దంపతుల కుమారుడు నిరంజన్‌రెడ్డి విజయవాడలోని నారాయణ కాలేజీలో ఇంటర్మీడియెట్ సెకడియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులను చూడాలని విజయవాడ ఎక్స్‌ప్రెస్ రైల్లో తాడిపత్రికి బయల్దేరాడు. గాఢ నిద్రలో ఉండటంతో తాడిపత్రిలో దిగలేదు. జక్కల చెరువు రైల్వే స్టేషన్లో రైలు వెళ్తున్న సమయంలో లేచి ఏ ఊరో తెలుసుకోవాలని డోర్ దగ్గరకు వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి అతన్ని కిందకు తోసేశాడు. దీంతో నిరంజన్‌రెడ్డి రెండు కాళ్లు రైలు చక్రాల కింద పడ్డాయి. దీంతో రెండు కాళ్లు కట్ అయ్యాయి. సమీపంలోని వారు వెంటనే స్పందించి కట్ అయిన కాళ్లను ఓ సంచిలో వేసుకుని నిరంజన్‌రెడ్డిని 108 వాహనంలో హుటాహుటిన గుత్తి ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ జిల్లా సీనియర్ నాయకులు పేరం నాగిరెడ్డి హుటాహుటిన గుత్తికి వచ్చి నిరంజన్‌రెడ్డిని పరామర్శించారు. కాళ్లు కోల్పోయిన కుమారుడిని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గుత్తి జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు నాయక్, పీసీ వాసు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో కారు బోల్తా
-
ఉద్యమాల పుట్టినిల్లు...గుంతకల్లు
ఉద్యమాల పుట్టినిల్లుగా గుంతకల్లుకు ప్రత్యేక ఖ్యాతి ఉంది. 1942లో మహాత్ముడి పిలుపునందుకుని బ్రిటీష్ వారిని భారతదేశం వదలి పొమ్మంటూ చేపట్టిన క్విట్ ఇండియా ఉద్యమంలో విజయమో.. వీరస్వర్గమో అంటూ ఈ నియోజకవర్గంలోని గుత్తి, పామిడి, గుంతకల్లు వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆ సమయంలో మిత్రులతో కలసి గుంతకల్లు రైల్వేస్టేషన్‌ను ధ్వంసం చేసిన ఘటనలో కసాపురానికి చెందిన మహమ్మద్ రసూల్ ఆరుమాసాల జైలు శిక్షను అనుభవించారు. నాటి స్వాతంత్య్రోద్యమం మొదలు నేటి ప్రత్యేక హోదా సాధన పోరు వరకూ గుంతకల్లు నియోజకవర్గ ప్రజలు చూపిన ఉద్యమ స్ఫూర్తి అనితర సాధ్యం. చైతన్యవంతులైన ఈ నియోజకవర్గ ప్రజలు అధికార మార్పు కోరుతూ ఓటు హక్కును వినియోగించుకుంటూ వస్తున్నారు. ఒకసారి గెలిచిన అభ్యర్థిని మళ్లీ ఎన్నికల్లో దూరం పెట్టేస్తూ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ వచ్చారు. అయితే నియోజకవర్గ ప్రజలను దగా చేస్తూ పారిశ్రామిక ప్రగతిని టీడీపీ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దీంతో పరిశ్రమలకు కేంద్రంగా భాసిల్లుతున్న గుంతకల్లు నియోజకవర్గంలో కార్మికుల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. గుంతకల్లు.. 1957 నుంచి 2009 వరకూ గుత్తి నియోజకవర్గంలో ఉండేది. నియోజకవర్గం ఆవిర్భావం నుంచి 2014 వరకు జరిగిన ఎన్నికలు ఈ నియోజకవర్గ ప్రజల చైతన్యానికి ప్రతీకగా నిలిచాయి. 13 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులు నాలుగేసి సార్లు గెలుపొందగా, ఒకసారి సీపీఐ, మరో మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థులకు పట్టం కట్టారు. కరుడుకట్టిన కమ్యూనిస్ట్ యోధుడు వీకే ఆదినారాయణరెడ్డి 1962లో గుత్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పట్లో గుత్తి నియోజకవర్గంలో తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలంలోని సగం పల్లెలు ఉండేవి. అలాగే గుంతకల్లులోని పలు గ్రామాలు ఉరవకొండ నియోజకవర్గంలో ఉండేవి. ఈ గందరగోళానికి తెరవేస్తూ మొత్తం పెద్దవడుగూరు మండలాన్ని తాడిపత్రిలోకి, తాడిపత్రి, ఉరవకొండ నియోజవర్గాల పరిధిలోని పామిడి మండలాన్ని సంపూర్ణంగాను, గుంతకల్లు మండలంలోని పూర్తి పల్లెలను కలుపుతూ 2009లో గుంతకల్లు నియోజకవర్గంగా చేశారు. పరిశ్రమలు కనుమరుగు గుంతకల్లులోని ఏసీఎస్ మిల్లు ఒకప్పుడు ఆసియాలోనే అతిపెద్దదిగా ఖ్యాతి గడించి, రాయలసీమకే తలమానికంగా నిలిచింది. ఇక చలనచిత్రాల డిస్ట్రిబ్యూషన్ కంపెనీలూ గుంతకల్లులో పెద్ద సంఖ్యలో ఉండేవి. చిత్ర పరిశ్రమలో రాయలసీమ సీడెడ్ కంపెనీగా గుంతకల్లు అప్పట్లో విరాజిల్లింది. ఇక స్లీపర్ ఫ్యాక్టరీ, లైఫ్‌బాయ్ సబ్బులు ఫ్యాక్టరీ, ఇతర చిన్నతరహా పరిశ్రమలెన్నో గత ప్రభుత్వాల హయాంలో ఉండేవి. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమలపై ఇస్తున్న రాయితీలకు మంగళం పాడేసింది. దీంతో నిర్వహణ భారమై పరిశ్రమలు ఒకదాని తర్వాత ఒకటి మూతపడుతూ వచ్చాయి. సెంటిమెంట్ ఫలించేనా? గుంతకల్లు నియోజకవర్గానికి ఓ ప్రత్యేక రాజకీయ సెంటిమెంట్ ఉంది. ఇక్కడ ఒకసారి గెలిపించిన అభ్యర్థికి మరోసారి ఆ అవకాశమివ్వరు. గత ఎన్నికలు పరిశీలిస్తే ఇవే ఫలితాలు స్పష్టమవుతాయి. గత ఎన్నికల్లో ఓడిన అభ్యర్థి మళ్లీ ఎన్నికల్లో బరిలో నిలిస్తే అతనికే నియోజకవర్గ ప్రజలు ఓటేస్తారు. ఈ తరహా రాజకీయ సెంటిమెంట్ బలంగా ఉన్న గుంతకల్లు నియోజకవర్గం అభివృద్ధిలో మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఒక్క గాదిలింగప్ప తప్ప రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందిన వారు ఎవరూ లేరు. ఈ రెండు విడతల మధ్యలో ఒక టెర్మ్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గుత్తి/గుంతకల్లు నియోజకవర్గం నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలు వీరే.. మండలాలు : గుంతకల్లు, గుత్తి, పామిడి నియోజకవర్గం : గుంతకల్లు మొత్తం ఓటర్లు పురుషులు మహిళలు ఇతరులు 2,38,0 1,18,7 1,19,2 62 గత ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేకపోయారు. గుంతకల్లులో పాలిటెక్నిక్ కళాశాల, గుంతకల్లు–నాగసముద్రం డబుల్ రోడ్డు, కసాపురం రైల్వే బ్రిడ్జి విస్తరణ, గుంతకల్లు ప్రభుత్వ ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు, గుత్తిలో ఫైర్‌స్టేషన్ ఏర్పాటు, గుత్తి కోటకు పర్యాటక కేంద్రం గుర్తింపు తదితర హామీలిచ్చి ఆచరణలో విఫలమయ్యారు. – నియోజకవర్గంలోని చెరువులకు కృష్ణా జలాల మళ్లింపు సాధనలో ఘోరంగా విఫలమయ్యారు. మహిళా ఓటర్లే కీలకం గుంతకల్లు నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. 2014 ఎన్నికలతో పోల్చుకుంటే 2019 నాటికి 472 మంది మహిళల ఓటర్ల సంఖ్య పెరిగింది. 2019 జనవరి 11 నాటికి ఎన్నికల అధికారులు ప్రకటించిన మేరకు ఈ నియోజకవర్గంలో 2,38,010 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఐదేళ్లలో 15,745 మంది కొత్తగా ఓటు హక్కు పొందిన వారు ఉన్నారు. కేవలం ఈ మూడు నెలల్లో 18 సంవత్సరాలు పైబడిన యువత 8 వేలకు పైగా ఓటు హక్కు నమోదు చేసుకోవడం గమనార్హం. గత ఎన్నికల్లో 242 పోలింగ్ కేంద్రాలుండగా, ప్రస్తుతం వీటి సంఖ్య 288కు చేరుకుంది. -
అనంతపురం జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
-
నేను తలచుకుంటే.. నువ్వు, నీ అమ్మ ఉండరు: జేసీ
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గుత్తిలో హల్చల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే మధుసూదన గుప్తాతో కలిసి గుత్తిలో పర్యటించిన ఆయన గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ తులసమ్మ తనయుడు శీనుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘నేను తలచుకుంటే నువ్వు, నీ అమ్మ, గుత్తి మున్సిపల్ కమిషనర్ ఉండరంటూ’ దుర్భాషలాడుతూ శీనుని జేసీ బెదిరించారు. అయితే మధుసూదన గుప్తాతో కలిసి జేసీ పర్యటించడంపై గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. టీడీపీ సభ్యత్వం లేని గుప్తాను తనకు పోటీగా తెచ్చేందుకే జేసీ ఇలా చేస్తున్నారేమోనని గౌడ్ అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
గుత్తి ముథూట్ ఫిన్‌కార్ఫ్ బ్రాంచ్‌లో గోల్మాల్
-
అంతా పథకం ప్రకారమే..
గుత్తి : తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు, చే బదులుగా ఇచ్చిన నగదుతో ముత్తూట్ ఫిన్‌కార్ప్ మేనేజర్ రవికుమార్ ఉడాయించాడు. బాధితులు తమ సొమ్ము కోసం ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. గుత్తిలోని ముత్తూట్ ఫిన్‌కార్ప్ మేనేజర్ రవికుమార్ తమవద్దకు వచ్చే ఖాతాదారులతో పరిచయం పెంచుకుని, వారిని తన బుట్టలో వేసుకున్నాడు. తనకు సంస్థ టార్గెట్ కేటాయిచిందని, మీ బం గారు ఆభరణాలు ఇస్తే.. తర్వాత తిరిగి ఇస్తానని తెలపడంతో దాదాపు 12 మంది అమాయకులు అతడి మాటలు నమ్మి 30 తులాలమేర ఆభరణాలతోపాటు, చేతి బదులు కింద రూ.5 లక్షల నగదు అప్పగించారు. అయితే వారికి ఎటువంటి రసీదూ మేనేజర్ ఇవ్వలేదు. అలా కొద్దిరోజులు గడిచాక తమ సొమ్ము తెచ్చుకునేందుకు కస్టమర్లు కార్యాలయం వద్దకు వస్తున్నారు. అయితే మేనేజర్ లేడని సిబ్బంది చెప్పి పంపుతూ ఉన్నారు. మేనేజర్ ఇంటికి తాళం పడి ఉండటం.. సెల్‌ఫోన్ స్విచాఫ్ కావడం, ఇరవై రోజులు దాటినా లేడని సిబ్బంది నుంచి సమాధానం వస్తుండటంతో ఓపిక నశించిన బాధిత కస్టమర్లు గౌరమ్మ, సరోజ, రంగయ్య(గుత్తి), నరసింహులు( గుత్తి ఆర్ఎస్), విరూపాక్షిరెడ్డి(ఇసురాళ్లపల్లి) మరికొంతమంది మంగళవారం కార్యాలయంలో ఆందోళనకు దిగారు. ప్రస్తుత మేనేజర్ నౌషద్ స్పందించిత్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
గుత్తి కేంద్రంగా మట్కా
ఒకప్పుడు గుత్తి పేరు వింటే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది మట్కా! కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ మట్కా పెద్ద ఎత్తున జరిగేది. లాడ్జీలు, చిన్నపాటి గదులు ఎటు చూసినా.. మట్కా బీటర్లు, జూదం ఆడేందుకు వచ్చిన వారితో కిటకిటలాడేవి. అయితే పోలీసుల చర్యలతో ఇది కాస్త కనుమరుగైంది. ఇటీవల కొంత కాలంగా గుత్తిలో మట్కా నిర్వాహకులు మళ్లీ చెలరేగారు. సిండికేట్‌గా ఏర్పడి పొరుగున ఉన్న కర్పూలు జిల్లాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించారు. ఈ విష యం గురువారం పోలీసులు జరిపిన మెరుపుదాడిలో బహిర్గతం కావడంతో పలువురిలో ఆందోళన చోటు చేసుకుంది. మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు గుత్తి కేంద్రం కాబోతుందా అనే భయం వ్యక్తమవుతోంది. – గుత్తి గుట్టు చప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిని రమణారావు, వెంకటేష్, నరేష్‌గా గుర్తించారు. వీరి నుంచి రెండు సెల్ఫోన్లు, రూ. 90,150, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను విలేకరుల సమావేశంలో ఎస్ఐ వలీబాషుతో కలిసి సీఐ ప్రభాకర్ గౌడ వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన కటిక రమణారావు, గుత్తి ఆర్ఎస్ నివాసి వెంకటేష్, గుంతకల్లుకు చెందిన నరేష్ గ్రూపుగా ఏర్పడి డోన్‌లో పెద్ద ఎత్తున మట్కా కంపెనీ నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు తమ స్థావరాన్ని అప్పుడప్పుడూ మార్చేవారు. గుత్తి ఆర్ఎస్లోని తన ఇంటినే మట్కా స్థావరంగా వెంకటేష్ మార్చుకుని పోలీసుల కళ్లుగప్పి పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తూ వస్తున్నాడు. రోజూ రూ. లక్షల్లో టర్నోవర్‌తో కూలీలు, నిరుపేదలను మట్కాకు బానిసలుగా చేస్తూ వచ్చాడు. నిరంతరం బీటర్ల రాకపోకలు, కొత్త వ్యక్తుల సంచారం ఎక్కువ కావడంతో చుట్టుపక్కల వారు ఇబ్బంది పడుతూ వచ్చారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సైతం నిఘా పెంచారు. ఈ క్రమంలో రమణారావు, నరేష్ గురువారం వెంకటేష్ ఇంటికి డబ్బు, పట్టీలతో వచ్చారు. అప్పటికే కాపుకాచిన పోలీసులు.. వెంకటేష్ ఇంటిపై మెరుపుదాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు, సెల్ఫోన్లు, మట్కాపట్టీలు స్వాధీనం చేసుకున్నారు. మట్కా మూలాలను పసిగట్టి నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు రవి, ఆదిశేఖర్, రామకృష్ణ, సురేష్, సివిల్ కానిస్టేబుళ్లు నరేష్, కుళ్లాయప్పను ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్ గౌడ ప్రత్యేకంగా అభినందించారు. తన సర్కిల్ లిమిట్స్‌లో మట్కా మూలాలు లేకుండా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా సీఐ పేర్కొన్నారు. మట్కా, జూదాలు నిర్వహిస్తున్న వారిపై సమాచారం అందివ్వాలని పిలుపునిచ్చారు. సమాచారం ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
అనంతలో దోపిడీ దొంగలు బీభత్సం
-
అనంతలో దోపిడీ దొంగలు బీభత్సం
సాక్షి, గుత్తి : అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తన ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలను అడ్డుకునే క్రమంలో ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని గుత్తి కుమ్మరవీధిలోని ఓ ఇంట్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఇంట్లో బీరువాలు, లాకర్లు వెతుకుండగా ఇది గమనించిన ఇంటి యజమాని దొంగలను అడ్డుకున్నారు. కానీ దోపిడీ దొంగలు యజమానికి హత్యచేసి 25 తులాల బంగారం, రూ. 5లక్షల నగదుతో ఉడాయించారు. స్థానికుల నుంచి సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
కారులో తిప్పుతూ అత్యాచారం
మూడురోజులపాటు మైనర్ బాలికపై ఇద్దరు కామాంధుల అఘాయిత్యం అనంతపురం జిల్లా గుత్తిలో ఘటన నిందితులపై నిర్భయ–పోక్సో చట్టం కింద కేసు.. గుత్తి (గుంతకల్లు): ఆలయం నుంచి ఇంటికి వెళుతున్న ఓ మైనర్ బాలికను ఇద్దరు కామాంధులు కిడ్నాప్ చేసి.. మూడురోజులపాటు కారులో వివిధ ప్రాంతాల్లో తిప్పుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడిన అమానుష సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో ఆలస్యంగా వెలుగు చూసింది. దుండగుల చెర నుంచి బయటపడిన బాలిక తల్లిదండ్రులతో కలసి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇందుకు బాధ్యులైన నిందితులిద్దరిపై పోలీసులు నిర్భయ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. గుత్తి ఎస్ఐ సుధాకర్ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి.. గుత్తి జంగాలకాలనీకి చెందిన పదమూడేళ్ల బాలిక స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఈ నెల 5న శ్రీరామనవమి పండుగ సందర్భంగా సాయంత్రం ఆరు గంటల సమయంలో రామాలయానికి వెళ్లింది. స్వామిని దర్శించుకున్న అనంతరం రాత్రి 7.30 గంటల సమయంలో ఇంటికి నడుచుకుంటూ వెళుతోంది. బుడగ జంగం కాలనీకి చెందిన అశోక్, యంగన్నపల్లికి చెందిన సురేష్‌లు ఆ బాలికను అటకాయించి, నోటిలో గుడ్డలు కుక్కి కారులో తీసుకెళ్లారు. గుడి కెళ్లిన బాలిక పొద్దుపోయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఎక్కడా కనిపించకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ జాడ కనుక్కోలేకపోయారు. ఈ క్రమంలో ఈనెల 8న (శనివారం) తెల్లవా రుజాము 3 గంటల సమయంలో గుత్తిలోని రవితేజ హోటల్ వద్ద కిడ్నాపర్లు బాలికను వదిలివెళ్లారు. తిప్పలు పడి ఇంటికి చేరుకున్న బాలిక తల్లిదండ్రులతో కలసి పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన ఉదంతాన్ని పోలీసులకు తెలియజేసింది. తనను కిడ్నాప్ చేశాక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారని చెప్పింది. మూడు రోజులపాటు కారులో నిర్బంధించి వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం కొనసాగించారని, తర్వాత కారులోనే తీసుకొచ్చి గుత్తిలోని రవితేజ హోటల్ వద్ద వదిలేసి వెళ్లిపోయారని విలపించింది. నిందితుడు అశోక్ పట్టణంలోని అన్నపూర్ణ హోటల్లో వంటమనిషి అని, మరో నిందితుడు సురేష్ ఆటోడ్రైవర్ అని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఇద్దరిపై నిర్భయ కేసుతోపాటు సెక్షన్ 366 (కిడ్నాప్), 342 (నిర్బంధం), 376బీ (అత్యాచారం), 109 (అత్యా చారాన్ని ప్రోత్సహించడం), 5 లేదా 6 (పోక్సో– నిర్భయ చట్టం) కింద కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన్‌గౌడ్, ఎస్ఐ సుధాకర్ తెలిపారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం అనంతపురం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. -
హత్యకేసులో నిందితునికి రిమాండ్
రాజంపేట: రాజంపేట పట్టణంలో గత నెల 25న రాత్రి జరిగిన హత్యకేసుకు సంబంధించి నిందితుడు శేఖర్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ అశోక్‌కుమార్ తెలిపారు. అనంతపురం జిల్లా గుత్తికి చెందిన నల్లప్ప అనే వ్యక్తి హత్య కేసులో శేఖర్ నిందితుడన్నారు. -
ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరి మృతి
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకోగా, ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతపురం జిల్లా గుత్తి ప్రాంతంలోని రంగంపేటకు చెందిన గుర్రప్ప(32)జీవనోపాధి కోసం వచ్చి రాజంపేటలో నివసిస్తున్నారు. గాలివీడుక చెందిన శేఖర్, గుర్రప్ప మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇందులో గుర్రప్ప మృతి చెందాడు. ఇద్దరూ మద్యం మత్తులో గొడవ పడినట్లు సమాచారం. తన భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించావని శేఖర్.. గుర్రప్పతో వాదనకు దిగడంతోనే ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. రాయితో కొట్టడం వల్లే మృతి చెంది ఉంటాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. పట్టణ ఎస్ఐ రెడ్డప్ప సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
గుత్తిలో చైన్‌స్నాచింగ్
గుత్తి: రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన అనంతపురం జిల్లా గుత్తిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మహిళ రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని మూడున్నర తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
పాముకాటుతో తల్లి.. ఆమె పాలు తాగి బిడ్డ మృతి
గుత్తి రూరల్: పాముకాటుతో తల్లి, ఆమె పాలు తాగి బిడ్డ మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లింగన్న, చంద్రకళ దంపతులు పశు పోషణతో జీవనం సాగించేవారు. వీరికి జగదీశ్ (3), ఏడాదిన్నర వయసున్న వంశీ అనే ఇద్దరు చిన్నారులున్నారు. గురువారం వేకువజామున చంద్రకళ పేడ ఎత్తుతుండగా ఆమె కాలిపై పాము కాటు వేసింది. అయితే, కాలికున్న పట్టీ గుచ్చుకుందని ఆమె భావించింది. పని ముగించుకొన్న తర్వాత వంశీకి పాలిచ్చింది. దీంతో చిన్నారి కూడా విషప్రభావానికి గురయ్యాడు. ఉదయం 10 గంటల సమయంలో గుండెల్లో నొప్పిగా ఉందని చంద్రకళ కిందపడిపోయింది. ఆమెతో పాటు కుమారుడి పరిస్థితిని గమనించిన లింగన్న వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ చంద్రకళ మృతి చెందింది. బాలుణ్ని మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీనితో అతను దిక్కుతోచని స్థితిలో పడి గుండెలవిశేలా రోదించాడు. ఈ సంఘటన స్థానికులనూ కంటతడి పెట్టించింది. -
తాళాలు బద్దలుకొట్టి భారీగా సొత్తు చోరీ
గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో దొంగలు అదను చూసుకుని ఓ ఇంట్లో భారీగా సొత్తును చోరీ చేశారు. జెండా వీధిలో ధనుంజయ్ అనే వ్యక్తి, తన భార్యతో కలసి ఇంటికి తాళం వేసి శనివారం రాత్రి డాబాపై నిద్రించారు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అర్ధరాత్రి ఇంటి తాళం పగులగొట్టుకుని లోపలికి ప్రవేశించారు. 25 తులాల బంగారు ఆభరణాలు, రూ.20వేల నగదు ఎత్తుకుపోయారు.ఆదివారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భర్తను కాపాడబోయి మంటల్లో చిక్కుకున్న భార్య
గుత్తి (అనంతపురం) : అతిగా మద్యం తాగిన భర్త ఒంటిపై కిరోసిన్ పొసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గుర్తించిన భార్య అతన్ని కాపాడటానికి ప్రయత్నించి మంటల్లో చిక్కుకుంది. గమనించిన స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించగా.. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రంలో ఆదివారం చోటుచేసుకుంది. నెల్లూరుకు చెందిన మునికృష్ణ(32) ,గౌరి(28) భార్యాభర్తలు. కొన్నేళ్ల కిందట గుత్తికి వచ్చి స్థిరపడ్డారు. మునికృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్‌లో డ్రైవర్‌గా పని చేస్తూ.. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కాగా ఆదివారం మద్యం సేవించిన మునికృష్ణ స్నేహితులను వెంటపెట్టుకొని ఇంటికి వచ్చి మళ్లీ మద్యం తాగుతున్నాడు. ఇది చూసిన గౌరి అతని మీద కేకలు వేసింది. దీంతో కోపోద్రిక్తుడైన మునికృష్ణ ఇంట్లో ఉన్న కిరోసిన్‌ను ఒంటిపై పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది చూసిన స్నేహితులు పారిపోగా.. భార్య అతన్ని కాపాడటానికి ప్రయత్నించి మంటల్లో చిక్కుకుంది. ఇది గమనించిన స్థానికులు మంటలు ఆర్పి వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. దాదాపు 80 శాతం శరీరాలు కాలిపోయాయని వైద్యులు తెలిపారు. -
స్వామి దర్శనానికి వెళ్లి కానరాని లోకాలకు
గుత్తి (అనంతపురం) : ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన నాగార్జున నాయుడు (10వ తరగతి విద్యార్థి) ఆంజనేయస్వామి మాలను ధరించి స్వామిని దర్శించుకుని తిరిగి వెళుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. తిమ్మాపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వెంకట సురేంద్ర, నాగార్జున, చంద్రశేఖర్, రమణ తదితరులు 20 మంది ఆంజనేయస్వామి మాలను ధరించారు.ఈ నెల 21న జీప్‌లో కసాపురం బయలుదేరారు. కసాపురంలో స్వామిని దర్శించుకుని తిరిగి మంగళవారం సొంత ఊరుకు వెళుతుండగా మార్గమధ్యంలోని గుత్తిలో నాగార్జున నాయుడుకు ఆయాసం ఎక్కువైంది.దీంతో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్థారించారు. నాగార్జున నాయుడు మృతి చెందిన విషయాన్ని తిమ్మాపురంలోని మృతుని తల్లిదండ్రులు గుర్రప్ప,నాగలక్ష్మమ్మలకు సమాచారమిచ్చారు.వారు హుటాహుటిన గుత్తికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని తిమ్మాపురం తరలించారు. -
అంతర్ రాష్ట్ర ఏటీఎం దొంగ అరెస్ట్
గుత్తి (కర్నూలు) : గత ఏడాది కాలంగా కర్నూల్,అనంతపురం జిల్లాల వాసులను భయభ్రాంతులకు గురిచేసిన అంతర్ రాష్ట్ర ఏటిఎం దొంగను గుత్తి పోలీసులు శుక్రవారం చాకచక్యంగా పట్టుకున్నారు.ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను సీఐ మధుసూదన్‌గౌడ్ తన చాంబర్లో విలేఖరులకు వివరించారు. కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన సిద్ధేశ్ చదువును మధ్యలోనే మానుకున్నాడు.గత ఏడాది కాలంగా అల్లరి చిల్లరిగా తిరిగేవాడు.ఈ క్రమంలో ఏటీఎంలపై కన్నుపడింది.ఏటీఎంల వద్ద కాపు కాచేవాడు.ఎవరైనా చదువుకోనివారు డబ్బులు డ్రా చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటే వారికి సహాయం చేసేవాడిగా నటిస్తూ ఏటీఎంలలో డబ్బు డ్రా చేసుకునేవాడు. కస్టమర్ల ఏటీఎం కార్డు తీసుకుని డబ్బు డ్రా చేస్తానని నమ్మబలుకుతాడు. బ్యాలెన్స్ చూసి సీక్రెట్ నంబరు గుర్తు పెట్టుకుంటాడు. వెంటనే కస్టమర్ ఏటీఎంను జేబులో వేసుకుని డూప్లికేట్ ఏటీఎం కార్డును వారికి ఇచ్చేవాడు.వారు అక్కడి నుంచి వెళ్లాక ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డబ్బు డ్రా చేసుకునేవాడు.ఈ క్రమంలో కర్నూల్ నగరంలో నాలుగు ఏటీఎంలలో,అదేవిధంగా గుత్తిలో రెండు, గుంతకల్‌లో ఒక ఏటీఎంలో అమాయకుల ఏటీఎం సీక్రెట్ నంబర్లు తెలుసుకుని డబ్బు డ్రా చేసుకుంటూ జల్సాలు చేశాడు. గత నెలలో గుత్తి ఎస్బిఐ ఏటీఎంలో ఎస్ఎస్పల్లికి చెందిన సుమంగళమ్మ, బసినేపల్లి తాండాకు చెందిన తిరుపాల్‌నాయక్, గుంతకల్‌కి చెందిన కుమార్ అనే కస్టమర్ల ఏటీఎం కార్డులు కాజేసి రూ.60 వేలు డ్రా చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఏటీఎం దొంగ ఆచూకీ కోసం గత వారం రోజులుగా అన్ని ఏటీఎంల వద్ద నిఘా వేశామన్నారు.ఈ నేపథ్యంలో గుత్తి పట్టణంలోని జయలక్ష్మి పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఎస్బిఐ ఏటీఎం వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న సిద్ధేశ్ అనే యువకుడిని పట్టుకుని విచారించామన్నారు.విచారణలో గత ఏడాది కాలంగా కర్నూల్,అనంతపురం జిల్లాల్లో ఏటీఎంల నుంచి అక్రమంగా డబ్బును కాజేస్తున్న దొంగ అతనేని తేలిందన్నారు.దీంతో అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.24 వేలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితున్ని కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు చాంద్‌బాషా, రామాంజనేయులు, ఎఎస్ఐలు ప్రకాష్, ప్రభుదాస్,శివారెడ్డి,హెడ్‌కానిస్టేబుళ్లు నరసింహులు, శ్రీశైలం, పలువురు పీసీలు తదితరులు పాల్గొన్నారు. -
ఐదోతరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం
గుత్తి (అనంతపురం) : పాఠశాల ముందు ఉన్న దుకాణంలో తినుబండారాలు కొనుక్కోవడానికి వెళ్లిన విద్యార్థినిని గుర్తుతెలియని యువకుడు బలవంతంగా ఎత్తుకెళ్లి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు ఉపాధ్యాయులను అప్రమత్తం చేయడంతో.. దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం గుత్తిఆర్‌ఎస్‌లో శుక్రవారం జరిగింది. స్థానిక ఉర్దూ మీడియం పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల ముందు దుకాణం వద్దకు వెళ్లి వస్తుండగా.. ముఖానికి కర్చీఫ్ కట్టుకున్న ఓ యువకుడు ఆ అమ్మాయిని ఎత్తుకుని అదే పాఠశాలలోని ఒక గదిలోకి తీసుకెళ్లి తలుపులేశాడు. ఇది గుర్తించిన తోటి విద్యార్థినులు తలుపులు బాదడంతోపాటు ఉపాధ్యాయులకు విషయం చెప్పడంతో.. దుండగుడు అక్కడినుంచి పరారయ్యాడు. దీనిపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న దుండగుడి కోసం గాలింపు చేపడుతున్నారు. -
పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
స్కూల్లో టీచర్ మందలించడంతో మనస్తాపం చెందిన ఓ పదో తరగతి విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. గుత్తి పట్టణానికి చెందిన దినేష్ రెడ్డి సోమవారం ట్యూషన్ కు వెళుతున్నానని చెప్పి.. బయటికి వెళ్లాడు. రాత్రి పొద్దుపోయేవరకూ ఇంటికి తిరిగి రాకపోయేసరికి తల్లిదండ్రులు అతడి కోసం గాలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కర్నూలు రోడ్డు రైల్వే గేటు సమీపంలో పట్టాలపై దినేష్ రెడ్డి మృత దేహాన్ని గుర్తించారు. ఇటీవలే స్కూల్లో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో సరిగా రాయలేదని.. దీంతో ఫిజిక్స్ టీచర్, కరస్పాండెంట్ దినేష్ ను మందలించారని తెలిసింది. అంతే కాకుండా.. తల్లిదండ్రులకు చెబుతామని అనటంతో భయపడిన దినేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక సమాచారం. -
బస్సు ఢీకొని 15 మందికి గాయాలు
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి మండలం కరిటికొండ గ్రామం వద్ద బస్సు అదుపుతప్పి బస్సు షెల్టర్ లోకి దూసుకుపోవడంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం జరిగింది. గుత్తి నుంచి డోన్ వైపు వెళుతున్న డోన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు టైరు పంక్చర్ అవడంతో పక్కనున్న బస్ షెల్టర్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటనలో బస్సు స్టాప్ లో ఉన్న 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (గుత్తి) -
'మంత్రి పదవి కావాలని బాబును అడగలేదు'
గుత్తి: ‘కాంగ్రెస్ హయాంలో కూడా పేదలకు ఉచితంగా పండుగ సరుకులను అందజేశాము. అయితే అప్పుడు ఇంతగా ప్రచారం చేసుకోలేదు. ఇప్పుడు మాత్రం చంద్రన్న కానుక సరుకులపై విపరీతమైన ప్రచారం జరుగుతోంది..’ అని అనంతపురం లోక్‌సభ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో శనివారం స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే జితేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో ‘చంద్రన్న కానుక’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సరుకుల గురించి ఇప్పుడింతగా ప్రచారం ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తానెప్పుడూ మంత్రి పదవి ఆశించలేదని చెప్పారు. ఇప్పించండని చంద్రబాబును అడగలేదని, భవిష్యత్తులో కూడా అడగబోనని పేర్కొన్నారు. చంద్రబాబుతో మాట్లాడే ధైర్యం తనకు తప్ప మరెవరికీ లేదన్నారు. ‘రాష్ట్రంలో ఖజానా దివాళా తీసింది. రాష్ట్రం విడిపోయాక ఆర్థిక ఇక్కట్లు ఎక్కువయ్యాయి. రాజకీయ పరిస్థితుల కారణంగానే చంద్రబాబు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చారు. అయితే.. వాటిని దశల వారీగా అమలు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం చంద్రబాబును కలిసి పింఛన్ మొత్తాన్ని రూ.వెయ్యికి ఎందుకు పెంచావని అడిగా. పింఛన్ రాలేదని చాలామంది మథనపడుతున్న విషయాన్నీ చెప్పా. రూ.500కు పెంచి ఉంటే అందరికీ ఇచ్చే అవకాశం ఉండేది..’ అని పేర్కొన్నారు. తన ప్రసంగంలో జేసీ పదేపదే ‘మా కాంగ్రెస్ పార్టీ’ అనడంతో అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. -
పాదచారులపైకి దూసుకెళ్లిన కారు
అనంతపురం: అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని పెట్రోల్ బంక్ రోడ్డులో ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు... రహదారి వెళ్తున్న పాదచారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి కారు డ్రైవర్‌ను పట్టుకుని... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దౌర్జన్యంతోనే టీడీపీ విజయం:వై. వెంకటరామిరెడ్డి
అనంతపురం:జిల్లాలోని గుత్తి చైర్మన్ ఎన్నిక రసాభాసగా మారింది. తొలుత వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలిపిన నలుగురు ఇండిపెండెంట్లను టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తమ వైపుకు తిప్పుకోవడంతో ఆ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. దీంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పార్టీకి మద్దతిచ్చిన ఇండిపెండెంట్ కౌన్సిలర్ అభ్యర్థులను జేసీ ప్రలోభ పెట్టి టీడీపీ వైపు లాక్కున్నారని వైఎస్సార్ సీపీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిపై వైఎస్సార్ సీపీ అభ్యర్థులు జేసీతో వాగ్వావాదానికి దిగారు. టీడీపీ అరాచకాలకు ఇదొక పరాకాష్ట అని వైఎస్సార్ సీపీ నేత వై. వెంకటరామిరెడ్డి మండిపడ్డారు.కేవలం టీడీపీ దౌర్జన్యంతోనే విజయం సాధించిందని ఆయన విమర్శించారు. -
'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదు'
-
'వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదు'
గుత్తి: వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్త కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తిలో జరిగిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. ఎన్నికలు రాగానే చంద్రబాబు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని జగన్ విమర్శించారు. రూ.2కే కిలో బియ్యం పథకాన్ని నిర్వీర్యం చేసి.. కిలో రూ.5.25కి పెంచిన ఘనత చంద్రబాబుదేనని ఎద్దేవా చేశారు. నీ పాలనలో ప్రజలు అనుభవించిన కష్టాలు మరిచిపోయావా చంద్రబాబూ అని ప్రశ్నించారు. ఆయన అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా సిద్ధంగా ఉన్నారు. రైతు రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ గురించి చంద్రబాబు ఇప్పుడు చాలా హామీలిస్తున్నారు. తాను అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో వాటిని ఎందుకు చేయలేదు? అని నిలదీశారు. వైఎస్ఆర్కు ముందు ఎందరో సీఎంలు వచ్చారు కాని ప్రజలకు గుర్తుండే సీఎం వైఎస్సార్ మాత్రమేనని అన్నారు. తాము అధికారంలోకి వస్తే రాజన్న రాజ్యం తెస్తామని జగన్ హామీయిచ్చారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.