తన ప్రేమను ఒప్పుకోలేదని చంపేశాడు.. | Women Brutually Murdered By Her Lover In Anantapur | Sakshi
Sakshi News home page

గుత్తిలో డిగ్రీ విద్యార్థిని దారుణహత్య

Published Sun, Oct 6 2019 11:01 AM | Last Updated on Sun, Oct 6 2019 11:23 AM

Women Brutually Murdered By Her Lover In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : గుత్తిలోని తురకపల్లి రోడ్డు కాలనీలో నివాసం ఉండే కారు డ్రైవర్‌ రాజు కుమార్తె మేరీ జోత్స్న అరుణ కుమారి (18) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో రంగస్వామి అనే వ్యక్తి అరుణ కుమారిని దారుణంగా గొంతునులిమి చంపినట్లు పోలీసులు నిర్థారించారు. 

వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని అరుణకుమారి ఓ ప్రైవేట్‌ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఇళ్ల వారు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయితే ఇంటికి సమీపంలోని డ్రైనేజీ కాలువ దగ్గర అపస్మారకస్థితిలో పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు అప్పటికే  మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి మెడపై రెండు పెద్ద గాట్లు ఉండటం, తలకు వెనుక భాగంలో గాయాలుండటంతో ఆమె మృతిపై అనుమానం రేకెత్తాయి. ఉద్దేశ పూర్వకరంగా ఎవరైనా చంపారా? లేక కాలు జారి రాళ్లపై పడిందా? అనే కోణంలో దర్యాప్తు నిర్వహించగా హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు రంగస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు  సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement