Aruna kumari
-
తీన్మార్ మల్లన్న హద్దులు దాటాడు..
సాక్షి, హైదరాబాద్: తన యూట్యూబ్ చానల్లో సైకోలా ప్రవర్తిస్తూ.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్న క్యూన్యూస్ అధినేత, తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని న్యాయవాది తూడి అరుణ కుమారి బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించిన అనంతరం మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా.. పంజాగుట్ట కేసులో ఓ మహిళను ఇంటర్వ్యూ చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ అన్ని రకాల హద్దులు దాటాడని అరుణ కుమారి ఆరోపించారు.(చదవండి: 139 మంది అత్యాచారం: ‘భూమి’కి న్యాయం చేయండి) తన ఇంటర్వ్యూలో సభ్యసమాజం తలదించుకునే విధంగా బాధితురాలికి ప్రశ్నలు వేశాడని మండిపడ్డారు. 139 మంది నిందితుల కోసం 139 బుల్లెట్లు రెడీ చేసుకోవాలని సిటీ కమిషనర్‌కు ఆదేశాలివ్వడం ఏంటని, అతను సైకోలా ప్రవర్తిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా గతేడాది జరిగిన ‘దిశ’ ఎన్కౌంటర్ ఫేక్ అంటూ మల్లన్న వ్యాఖ్యానించడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. ఈ విషయంలో నవీన్ సుప్రీంకోర్టుతో పాటు ‘నిర్భయ’ చట్ట నిబంధనలను అతిక్రమించాడని, అతడిపై తగినచర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. యూట్యూబ్ చానెల్ రిపోర్టర్ కిడ్నాప్.. విడుదల! దుండిగల్: ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టర్ అనుమానాస్పద స్థితిలో కిడ్నాప్ అయ్యాడు. దుండిగల్ సీఐ వెంకటేశం తెలిపిన మేరకు..న్యూషాపూర్‌నగర్‌కు చెందిన హజ్మత్ అలీ యూట్యూబ్ చానల్ రిపోర్టర్. మంగళవారం రాత్రి మరో యూట్యూబ్ చానల్ రిపోర్టర్ సలీం.. అలీకి ఫోన్ చేసి రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి ఆటోలో రేషన్ బియ్యం తరలిస్తున్నారనే అనుమానంతో కైసర్‌నగర్ చౌరస్తా లోని బాచుపల్లి రోడ్డు వరకు ఓ ఆటోను వెంబడించారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని డబ్బులు డిమాండ్ చేశారు. అయితే వారు అందుకు ఒప్పుకోకుండా ఆటోను మియాపూర్ వైపు పోనిచ్చారు. ఈ క్రమంలో సదరు ఆటోను బాచుపల్లి పోలీసులు కోకకోలా చౌరస్తాలో పట్టుకున్నారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న రేషన్ బియ్యం తరలింపు ముఠా సభ్యులు ఇన్నోవా కారులో వచ్చి సలీంను ఎత్తుకెళ్లడానికి యత్నించగా అతను తప్పించుకోవడంతో హజ్మత్ అలీని తమ వెంటకు తీసుకువెళ్లారు. దీంతో హజ్మత్ అలీ కుటుంబ సభ్యు బుధవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం హజ్మత్ అలీ దుండిగల్ పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. తనను కిడ్నాపర్లు వదిలేశారని, బస్సులో ఇంటికి చేరుకున్నానని పోలీసులకు చెప్పాడు. పోలీసులు కిడ్నాపర్లు ఉపయోగించిన ఇన్నోవా కారును స్వాధీనం చేసుకొని పోలీసులు రేషన్ బియ్యం ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. -
గుత్తిలో డిగ్రీ విద్యార్థిని దారుణహత్య
-
తన ప్రేమను ఒప్పుకోలేదని చంపేశాడు..
సాక్షి, అనంతపురం : గుత్తిలోని తురకపల్లి రోడ్డు కాలనీలో నివాసం ఉండే కారు డ్రైవర్ రాజు కుమార్తె మేరీ జోత్స్న అరుణ కుమారి (18) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో రంగస్వామి అనే వ్యక్తి అరుణ కుమారిని దారుణంగా గొంతునులిమి చంపినట్లు పోలీసులు నిర్థారించారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని అరుణకుమారి ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఇళ్ల వారు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయితే ఇంటికి సమీపంలోని డ్రైనేజీ కాలువ దగ్గర అపస్మారకస్థితిలో పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి మెడపై రెండు పెద్ద గాట్లు ఉండటం, తలకు వెనుక భాగంలో గాయాలుండటంతో ఆమె మృతిపై అనుమానం రేకెత్తాయి. ఉద్దేశ పూర్వకరంగా ఎవరైనా చంపారా? లేక కాలు జారి రాళ్లపై పడిందా? అనే కోణంలో దర్యాప్తు నిర్వహించగా హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు రంగస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. -
ఆన్లైన్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి
డీఈఓ అరుణకుమారి విజయనగరం అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది అంశాలను ఎప్పటికప్పుడు క్రోడీకరించే విధంగా ఆన్లైన్ వ్యవస్థను ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ ఎస్.అరుణకుమారి తెలిపారు. శుక్రవారం స్థానిక కస్పా మున్సిపాల్ ఉన్నత పాఠశాలలో జరిగిన ’నేషనల్ ప్రొగ్రాం ఆన్ స్కూల్ స్టాండర్డ్స, ఎవాల్యూషన్’ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాఠశాల స్థారుు స్థితిగతులను ప్రతి రోజూ నమోదు చేసుకుని ఆన్లైన్లో పొందుపరచాలని సూచించారు. ఉపాధ్యాయుల స్వీయ మూల్యాంకనలో పారదర్శకత లోపించకూడదని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓలు బి.లింగేశ్వరరెడ్డి, ఎ.గౌరీశంకర్రావు, ఎ.డి సత్యనారాయణ, రీసోర్స్పర్సన్లు ఏవీ రమణ, కూర్మారావు, వాసు, ఉమామహేశ్వరావు, ఎంపిక చేసిన ప్రధానోపాధ్యాయులు 40 మంది పాల్గొన్నారు. -
ఒకే చాంబర్లో ఇద్దరు ఆరోగ్యాధికారులు
కాకినాడ : కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారి (ఎంహెచ్ఓ) చేరికపై నెలకొన్న ప్రతిష్టంభన కిందిస్థాయి సిబ్బందికి తలనొప్పిగా మారింది. చాంబర్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు కొత్త ఎంహెచ్ఓ అందుబాటులో ఉంటుండగా... ఆమె వెళ్లాక సాయంత్రం సమయంలో పాత ఎంహెచ్ఓ విధులకు హాజరవుతుండడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఇంతకు తమకు ‘ఎంహెచ్ఓ’ ఎవరో? తెలియక ఎవరితో మాట్లాడితే ఎవరికి కోపం వస్తుందోననే అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కాకినాడ నగరపాలక సంస్థ ఆరోగ్యాధికారిగా డాక్టర్ సత్యనారాయణ సుమారు ఏడాదిగా పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తున్నారు. ఖాళీగా ఉన్న ఈ పోస్టులో ముమ్మిడివరం ప్రభుత్వాస్పత్రి మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ బి.శైలజను నియమిస్తూ డెరైక్టర్ ఆఫ్ పబ్లిక్‌హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ ఎస్.అరుణకుమారి ఈ నెల 10న ఉత్తర్వులు జారీ చేశారు. కౌన్సిలింగ్ ద్వారా జరిగిన ఈ ఎంపికలో డాక్టర్ శైలజను 11న విధులకు రిపోర్టు చేయాల్సిందిగా ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతవరకు బాగానే ఉన్నా ఉత్తర్వులు పట్టుకుని కాకినాడ వచ్చిన ఆమెకు గడచిన ఐదు రోజులుగా ఇక్కడ చుక్కలుచూపిస్తున్నారు. ఆమెకు కమిషనర్ గోవిందస్వామి ప్రొసిడింగ్స్ ఇవ్వాల్సి ఉండగా, ఆయన పుష్కరాల విధులకు నర్సాపురం వెళ్లడంతో ఆమె నేరుగా కార్పొరేషన్ ప్రత్యేకాధికారి, కలెక్టర్ అరుణ్‌కుమార్ కలిశారు. వెంటనే విధుల్లో చేరాల్సిందిగా కలెక్టర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు. కమిషనర్ లేరన్న నెపంతో ఆమెకు ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా జాప్యం చే శారు. కలెక్టర్ ఆదేశాలతో ఎంహెచ్ఓ డాక్టర్ శైలజ కార్పొరేషన్‌లోని తన చాంబర్‌కు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం ఎంహెచ్‌ఓగా పూర్తి అదనపు బాధ్యతలతో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ సత్యనారాయణ ఆమె కార్యాలయం నుంచి వెళ్లాక సాయంత్రం సమయంలో ఆయన కూడా అదే చాంబర్లో విధులకు హాజరై రిజిష్టర్‌లో సంతకాలు చేస్తుండడం సిబ్బందిని గందరగోళంలోకి నెడుతోంది. ఉదయం పూట ఉన్న ఎంహెచ్ఓతో ఇన్స్పెక్టర్లు, సిబ్బంది మాట్లాడితే వారిపై సదరు పాత అధికారి కక్ష కట్టి వేధిస్తున్నారంటూ సిబ్బంది వాపోతున్నారు. ఈ నెల 10న పాత ఎంహెచ్వో డాక్టర్ సత్యనారాయణ పుష్కర విధులకు వెళ్తూ రిలీవై ఇప్పుడు మళ్లీ చాంబర్‌కు వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కమిషనర్ కూడా అందుబాటులో లేకపోవడంతో ఈ సమస్యకు పరిష్కారం దొరక్క మధ్యలో సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. -
అన్నంలో రాళ్లు, కూరలో పురుగులు
బస్కీ హాస్టల్లో గాడి తప్పిన మెనూ భోజనం చేయలేమన్న విద్యార్థులు హెచ్ఎం, వార్డెన్‌పై ఎంపీపీ ఆగ్రహం అరకులోయ : మండలంలోని బస్కీలోని గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహంలో మెనూ పూర్తిగా గాడి తప్పింది. సోమవారం అరకులోయ ఎంపీపీ కె. అరుణకుమారి హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించడంతో ఈ విషయం వెలుగుచూసింది. విద్యార్థుల వంటకాలను పరిశీలించగా అన్నంలో రాళ్లు, కూరలో పురుగులు ఉండడం చూసి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజూ ఇలాగే భోజనాలు పెడుతున్నారా అని ఎంపీపీ విద్యార్థులను అడుగగా పిల్లలు అవునని చెప్పడంతో పాఠశాల హెచ్ఎం వెంకటరావు, డెప్యూటి వార్డెన్ బాలీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇటువంటి తిండి తిం టారా? అని వారిని నిలదీ శారు. దీనికితోడు వారం రోజుల నుంచి కోడిగుడ్లు, అరటిపండ్లు, ఇతర స్నా క్స్ ఇవ్వడం లేదని విద్యార్థులు ఎంపీపీకి తెలిపారు. కూర లో పురుగులు ఉండడంతో మధ్యాహ్నం రెండు గంటలకు కూడా విద్యార్థులు ఖాళీ కంచాలు పట్టుకుని భోజనం చేయడానికి నిరాకరించి కూర్చొన్నారు. విద్యార్థులకు వేరే కూర వండించమని ఎంపీపీ చెప్పడంతో అప్పటికప్పుడు బెండకాయ కూర వండారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే సహించేదిలేదని ఎంపీపీ అరుణకుమారి హెచ్చరించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో, పాడేరు డీడీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ఎంపీపీ తెలిపారు. కుళ్లిన గుడ్లు సరఫరా చేయడం వల్ల వండి పెట్టలేదని వార్డెన్ బాలీ చెప్పడంతో స్టోర్ రూంను సందర్శించి చూడగా అందులో సరిపడ గుడ్లు కూడా లేకపోవడం గమనార్హం. వార్డెన్ వినిపించుకోవడం లేదు : హెచ్ఎం మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని తాను ఎంత చెప్పినా వార్డెన్ విని పించుకోవడం లేదని దీంతో నిత్యం విద్యార్థులకు ఇబ్బందులు తప్ప డం లేదని, వార్డెన్‌ను వెం టనే మార్పు చేయాలని కోరు తూ బస్కీ పాఠశాల హెచ్ఎం వెంకటరావు లిఖిత పూర్వకంగా ఎంపీపీని కోరారు. ఈ తనిఖీలో వైఎస్సార్ సీపీ నా యకులు శెట్టి అప్పాలు, కె.సత్యానందం, బాబూరావు, సీహెచ్ అప్పలరాజు పాల్గొన్నారు. -
అతడు - ఆమె
కథ ఏంబా! ఎట్టుండావు? పిలకాయలు ఎట్టుండారు? బాగా సదవతాండారా? పెతి ఆదివారమూ ఆస్టలు కాడికి పోయి పిలకాయల్ని చూసి, మాటాడి, వోల్లకేం గావాల్నో అడిగి తీసిచ్చేసి వొస్తాండావు గదా! ఇంటికాడ... మనిద్దరి దెగ్గిరా ముదిగారంగా పెరగాల్సిన బిడ్డలు... అట్టా... దిక్కు మొక్కు లేని అనాదలు మాద్రి ఆస్టల్లో పడి వుండారు. తల్సుకొంటే బాదగా ఉంటాది గానీ తప్పదు గదా! వానదేముడు పగబట్టినట్టు వాన చినుకే ఇదల్చక పాయ! అప్పో సప్పో చేసి బూదేవమ్మ గుండికాయను ఎంత లోతుగా చీల్చినా సుక్క నీరు కనబడలా! కయ్యా, చేనూ బీడు పెట్టుకొని అంబోమని అల్లాడతాంటిమి. అదో! ఆ టైంలోనే ఆ దేముడే అంపించినట్టు సవుదీ నుండి మనూరి రెడ్డెప్ప కోడాలు రానెక్క వొచ్చింది. ఆ అక్క సానా మంచిది. పెగ్గి లేకుండా అందుర్నీ మాట్లాడిస్తాది. ఒగదినం మనింటికొచ్చి ‘ఏమ్మే! ఎట్టుండారు? బాగుండారా?’ అని అడిగే. ‘‘ఏం బాగులేకా! సావ లేక, బతక లేకా పీనుగుల మాదిరి పడుండాం. పిలకాయలకు మూడు పూట్లా బువ్వగ్గ్గడా కస్టమైపోతాండాది. బడికి సెలవంటే బయమేస్తాంది. బడుంటే మద్దేనం ఆడే తినేస్తారు గదా!’’ బోరోమని ఏడిస్తి. నా బాద, యింటి పరిస్తితులు, పిలకాయల్ని చూసి రానెక్క గడా చానా బాదపడింది. ‘‘పోనీ! నువు సవుదీ కొచ్చీగడదా?’’ అనింది. అక్క సీరలు, నగలు, వాళ్లింట్లో ఉండే బీరువాలు, మంచాలు, సోపాలు, కుర్చీలు, రకరకాల వొస్తువుల కన్వాగడా నాన్యంగా, సుఖంగా, ఆరోగ్గిరంగా, సంతోషంగా వుండే వాల్ల పిలకాయలు... అక్క అంపించే దుడ్లను భద్రంగా, చిక్కనంగా కర్సుపెడ్తూ వడ్డీలకు తిప్పి దుడ్లు సంపాదిస్తాండే రానెక్క ఇంటాయన... ఇయ్యన్నీ చూస్తాంటే ముందు నుంచీ నాగ్గడా సవుదీకి పావల్లని చానా ఆసగా వున్యాగడా నువ్వొప్పుకోవని గమ్మునుంటి. కాని అక్క అడిగేయాలకు ‘సరేకా’ అనేస్తి గబక్కన. కానీ... పొయ్యేదానికి దుడ్లు ఎట్ల? నెర్రెలిచ్చి బీడు పడుండే మన చేనును అడుమానమో, కొనేదో ఎవురు? అసలకు ముందు నువ్వొప్పుకోవల్ల గదా. ‘‘రానెక్కా! నా బిడ్లకు కూరా కూడు వొద్దు. వేలకు కడుపుకింత బువ్వ... పస్తుల్లేకుండా పెట్టుకొంటే సాలు. సావకుండా సాకేస్తే... మల్లా వాల్ల తలరాతలు ఎట్టుంటే అట్టా బతకతారు...’’ అంటాంటే దుక్కం ఎగదన్నుకొచ్చింది. ‘‘నువ్వే ఎట్లన్నా నన్ను తొడ్కోపోకా! మీ ఇంటాయనకు చెప్పి దుడ్లిప్పీకా! ఆడ పన్లో చేరినంక... నెల నెలా జీతం దుడ్లతో ముందు నీ అప్పే కడతాము.’’ ‘‘సర్లేమ్మే! నువు ఏడవగాకు. ముందు మీ ఇంటాయన్ని అడుక్కో. సవుదీకి పొయ్యే ఆడోల్లంటే ఆయనకు మంట గదా! నోటికొచ్చినట్టల్లా మాటాడతాంటాడు. ఒగ విసియం నువు గడా గ్యాపకం పెట్టుకో. మన అవుసరానికి, మనం దుడ్లు సంపాయించేదానికి అంత దూరం పోతాండాం. ఆడ వాల్లు ఏ పని చెప్పినా చెయ్యల్ల. ఏం చేసినా గమ్మున పడుండల్ల. అట్టగాదు, ఇట్టగాదు అనేదాన్కి లేదు. ముందుగానే నేను చెప్పలేదనీ అనొద్దు మల్ల. అన్నింటికీ సరేననుకొంటేనే ఎలబారల్ల! మల్ల నువు గాని, మీ ఇంటాయన గాని నన్నేమన్నా అంటే ఒప్పుకోను. అయినా గడా తలపెట్టేదే రోట్లోనే ఐతే రోకలి దెబ్బ తప్పదని తెలీదా యేంది?’’ రానెక్క గూడంగానే అన్నీ ఇప్పరించి చెప్పింది. ఏమన్నా గానీ... సవుదీకి పోవల్ల! నా బిడ్లు బాగుండల్లని నేను తెగాయిస్తి. వారం దినాలు యింట్లో ఒగటే కొట్లాట. నెత్తురు కారేట్లు, ఒల్లు వాసేట్లు కొడ్తివి. ‘‘ఆడది ఎట్లన్నా సంపాయించల్లనుకొంటే అంత దూరం పోవల్నా? ఈడగడా సంపాయించొచ్చులే!’’ అని బండ బూతులు తిడ్తివి. దాంతో నాకు యింగా మొండితన వచ్చేస. ‘నువు చూస్కో పోతే బిడ్లను మా అమ్మోల్లింట్లో ఒదిలేసి నేను పొయ్యేది పొయ్యేదే’నని పట్టుబడ్తి. ‘‘ఇన్ని దినాలు సవుదీకి పోయిన ఆడోల్లను కన్న బూతులు తిట్టి... ఇబ్బుడు నా పెల్లాన్నే అంపిస్తే నాకెంత అగుమానమో ఆలోసిత్తివా? నన్నంతా గేలి చెయ్యరా? నేనే మొగం పెట్టుకొని మందిలో తిరుగుడు’’ అంటూ కాల్లబేరానికొస్తివి. తప్పో ఒప్పో, నిజమో అపద్దమో... తెలిసీ తెలీకుండా ఎవుర్నన్నా నీచంగా మాటాడి అగుమానం చేస్తే... ఆ బాద ఎట్టుంటాదో... తన దాకా వస్తేనే గదా తెల్సేది? అందుకే పెద్దోలు ‘కాలు జారినా తీసుకోవచ్చు. నోరు జారితే తిరిగి తీస్కోలేం’ అంటారు. నీ బాద నాకర్థమైనా ఏం చేసేది! ‘‘సూడుబా! మంది కోసరమని, మానం కోసరమని కడుపున పుట్టిన బిడ్లను సంపుకొంటామా యేంది? అంటే అంటార్లే! ఎన్ని దినాలంటారు? ఐనా గడా ఆ అనేటోల్లలో ఒగరన్నా... మనకో పొద్దన్నా... ఒగ ముద్ద బువ్వన్నా పెడ్తారా? మన అగసాట్లేవో మనం పడల్లగనీ!’’ అని నేను నచ్చ చెప్పేయాలనుకున్నా నువు గమ్మునుండి పోతివి. గమ్మునుండక ఏం చేస్తావు మల్ల! నయా పైసా వరుమానం లేదు. ఆడా ఈడా వడ్డీలకు పెరక్కొచ్చిన అప్పులు దప్ప ఏముండాది తిని బతికేదానికి? పాల దుడ్లతో పానాలు నిలుపుకొంటుండాం. మేపు లేకుండా ఆవు గొడ్లు మాత్రం లీటర్లకు లీటర్లు పాలు ఎట్లిస్తాయి? సరి! మొండి ధైర్నంతో రానెక్క వాల్ల దెగ్గిరే అప్పు దీసుకొని సవుదీకి పోతి. రానెక్కే నన్నో సావుకారింట్లో పనికి పెట్టే! రాత్రింబవుళ్లు రెక్కలు ముక్కలయ్యే పనులు! ఎంత కస్టపడ్తినో... ఎంత బాదపడ్తినో... ఎంత ఏడిస్తినో... ఎంతగా మనుసు సంపుకొంటినో... నాకు... ఆ బగుమంతునికే దెల్సు. అన్నీ దెల్సి అద్దానంలో పడ్తినా అని అల్లాడి పోతి. బిడ్డల్ని, వాల్ల బవిస్యత్తును గ్యాపకం పెట్టుకొని మెలిమెల్లిగా అన్నిటికీ అలవాటు పడిపోతి. ‘కస్టపడల్ల! దుడ్లు సంపాయించి యింటికి అంపించల్ల! అంతే! ఇంగో ఆలోసనే వుండగూడద’ని గుండె రాయి చేస్కొంటి. అందుకే అప్పులన్నీ దీరిపోయి మన కుటుంబరం ఒక గాట్లో పడేదాంకా వ్రుదాగా దుడ్లు కర్సు పెట్టగూడదని... బిడ్ల పైన ఎంత కలవరమైనా, ఒగపారి వొచ్చి సూడల్లని మనుసు గింజకపోతున్నా... ఈ అయిదేండ్లు ఇంటికి రానేలేదు. నేనొచ్చేసిన తొలి దినాల్లో ‘పక్కన నువు లేకండా నిద్దరే రానంటాంది మే!’ అని నువు గుసగుసలాడ్తాంటే నా కండ్లు నీటి కడవలయ్యేటివి. పచ్చి మాదిరి ఎగిరొచ్చి నిన్ను వాటేసుకొని బొరోమని ఏడవాలన్పించేది. ‘నా మొగుడు సీరామచెందురుడ’ని మనుసు సంతోసపడేది. రాన్రాను నువు గడా నేను లేని బాదకు అలవాటు పడిపోతివేమో మల్ల ఎబ్బుడూ అంత ప్రీతిగా మాటాడలా! ఈ బాదలన్నీ ఇంగో ఐదేండ్లు కస్టపడ్తే తీరిపోతాయిలే! పిలకాయల సదువులు, పాప పెండ్లికి సంపాయించుకొంటే చాలు. ఇబ్బుడు నువు గడా పొట్లేండ్ల యాపారం చేస్తాండావుగదా. పిలకాయల బాద్దెతలు తీరిపోతే... మనకెంత గావల్ల! తిని ఆయిగా వుండొచ్చులే, అనుకొంటి! అంతా మనమనుక్నొట్లే జరిగిపోతే ఇంగేముంది? బగమంతున్ని ఎట్టా తలస్తాము? అవునుబా! అనుకోకండా... నడినెత్తిన పిడుగు పడినట్లు ఈ పెబుత్వం ‘నితాఖత్’ చట్టం చేసింది. నువ్వూ యినే వుంటావు ఈ పాటికి. టీవి వార్తల్లో గడా చూసింటావు. విజిట్ వీసాలో ఈ దేసానికొచ్చినవాల్లు ఏ పనన్నా చేస్కొనే అక్కు వుండేదంట. అదిబ్బుడు చెల్లదంట. కాబట్టి ఆ వీసాతో ఈడికొచ్చినోల్లంతా తిరిగెల్లి పావల్లని చెప్పినారు. దాంతో ఎంతోమంది గగ్గోలు పడిపోతాండారు. కొంతమందైతే పాపం... ఉన్న చెలకా, చేనూ అమ్ముకొచ్చినోల్లు, లచ్చలకు లచ్చలు అప్పులు చేసి వొచ్చినోల్లు... యింగా పనులకు కుదురుకోనేలేదు. ఒగ దీనారు గడా సంపాయించనే లేదు. తిరిగెల్లమంటే విమానం టికెట్ల కన్నా దుడ్లెట్లని దొల్లి దొల్లి ఏడస్తాండారు. మన పెబుత్వం గడా కొంచెం గడువిమ్మంటే ఒగ మూడు నెల్లు గడువిచ్చిందీ పెబుత్వం. ఆ వరకు అంతా తట్టా బుట్టా సద్దుకోవాల్సిందే! లేపోతే జైల్లో పెడ్తారంట. బయటే యిన్ని బాదలుండె. ఇంగా జైల్లో ఎన్ని నరక బాదలుంటాయో! తల్సుకొంటేనే బయమేస్తాంది. అయినాగడా... మనం ఎంత ఆసపడ్నా గానీ మనకు ఏది, ఎక్కడ, ఎంత రుణమో అంతే దక్కతాదని మనుసు నిమ్మలం చేస్కొంటి. ఏడ్చి... ఏడ్చి అల్సిపోతిమల్ల! నీకు ఎన్ని తూర్లు పోన్ చేస్తాన్నా... ఆ నెంబరే లేదని తిరుగు జవాబొస్తాంది. ఏమైంది నీ పోనుకు? రిపేరైతే... పోన్ బూతునుండన్నా చెయ్యల్ల గదా! ఎట్లా... ఇంటికొచ్చేస్తాండా గదా... నేనిన్ని దినాలు చెప్పల్లని... చెప్పలేకపోయిన విసయాలన్నీ జాబు రాద్దామనుకొంటి. ఇబ్బుడు నా మనుసు కొంచెం తేటపడింది. కొత్త ఇంటిలో, పిలకాయల్తో, నీతో కలిసి మల్లీ ‘కొత్త బతుకు’ ఆరంబించల్లని నా మనుసిప్పుడు ఆత్రపడ్తాంది. నీకు దెల్సు కదా... పెతి నెలా నాకొచ్చిన జీతమంతా... అట్లే నీకంపించేస్తాంటి గదా! నా దెగ్గిర ఒక్క రూపాయ గడా లేదు. నువ్వు బిన్నే దుడ్లు సరిచేసి అంపించు. విమానం టికెట్టు ముందుగానే తీసుకోవల్ల గదా! జనాలెక్కువ. మల్ల దొరకతాదో లేదో! కాబట్టి నువు ఈ జాబు అందిన వెంటనే పోనుచెయ్యి. దుడ్లంపించు. లేపోతే పోతే జైలుకు, వల్లకాకపోతే వల్లకాటికే పోవల్లంతే! ఇట్లు సుసీల సుసీలా! నన్ను చమించుమే! నేను నీకు ఒగ రూపాయి గడా అంపించలేను. నిజింగా నా దెగ్గిర లేదు. అవును సుసీలా! నువు దుడ్లే లోకమని ఆ దేసంలో వుండిపోతివి. నువు అంపించే దుడ్లు నాకీ లోకాన్ని, సుకాలను సూపించింది. అడిగే వోల్లు లేరు. అడ్డం చెప్పేవాల్లూ లేరు. చేతి నిండా దుడ్లు బుద్దిని గడ్డి తిన్పించి అన్ని అలవాట్లూ... అనుబోగంలోకి తెచ్చినాయి. అనుబగించిన సుకాలు... ఒంట్లో నోరిడిసి చెప్పుకోలేని రోగాల్ని దెచ్చినాయి. రానీ మల్లా నీకు చెప్తాదని వాల్ల అప్పు మాత్రమే తీర్చిన. మిగతా అప్పులట్లే వుండాయి. కొత్త బోరు ఎయ్యలా! పక్క మడి కొన్లా! ఇల్లు కట్లా! పిలకాయల పేర్లతో బేంకులో దుడ్లు ఎయ్యలా! ఏ చీటీలు కట్లా! ఆకిరికి పిలకాయల్ని ఆస్టల్లో గడా చేర్చలా! మనూరి బళ్లోనో సదవతాండారు. నీతో సెప్పద్దని వాల్లని బయపెట్టింటి. సుసీలా! నీ దుడ్లంతా తినేస్తారని మాయమ్మ, అయ్యల్ని తనీ కాపరం పెట్టమంటివి గాని... ఇబ్బుడు మాయమ్మే నా బిడ్లకింత బువ్వ పెడ్తాంది. సుసీలా! దుడ్లతో దునియాలో దేన్నన్నా కొనచ్చనుకొంటివి గానీ... కొనలేనివి వుంటాయి. ముక్యంగా ప్రేమల్ని, ఆరోగ్గిరాల్ని, ఆయుసును, గడ్సిపోయిన కాలాన్ని కొనలేమని తెలుసుకో! ఇయ్యన్నీ నీకు ఎట్టా చెప్పాలనుకొంటుండగనే గోరు సుట్టు మీద రోకటి పోటు మాదిరి ఈ ‘నితాఖత్’ చట్టం గురించి తెల్సి, నేను చాలా కుంగిపోయినాను. నువు పోను చేస్తే ఏమని చెప్పల్లో దిక్కు తోచక కార్డు తీసేస్తి. ఆ బగుమంతుడు నా ఒంట్లో ప్రానాన్ని తొరలోనే తీసేస్తాడని తెల్సుగానీ... నేను నీకు చేసిన అన్నీయానికి బదులుగా నా ప్రానాలు ఇబ్బుడే తీసేసుకొంటాండా! నన్ను చమించు సుసీలా! ఇట్లు, జగన్నాదం -
బాబుకు చంద్రగిరి సెగ
హైదరాబాద్‌లో పంచాయితీ అరుణమ్మ పార్టీలోకి వద్దని నియోజకవర్గ నాయకుల ఫిర్యాదు ఎంిపీ శివప్రసాద్‌పై ఆగ్రహం మంత్రి వేధింపులకు బలయ్యామని తమ్ముళ్ల ఆవేదన తిరుపతి రూరల్, న్యూస్‌లైన్ : మంత్రి గల్లా అరుణకుమారిని టీడీపీలోకి తీసుకోవద్దని అధినేత చం ద్రబాబు వద్ద చంద్రగిరి తమ్ముళ్లు మొరపెట్టుకున్నారని తెలిసింది. నియోజకవర్గంలోని తమ్ముళ్లు గురువారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొంత మంది టీడీపీ మం డల నాయకులు పార్టీ కార్యాలయంలో ఉన్న చంద్రబాబును శుక్రవారం రాత్రి కలిశారు. గల్లా చేరికపై వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్ట్టు విశ్వసనీయ స మాచారం. ఎంపీ శివప్రసాద్ తీరు పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెట్టే విధంగా ఉందని వాపోయారు. నిత్యం గల్లాను పొగుడుతూ నాయకులను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని బాబుకు చెప్పినట్టు తెలిసింది. తిరుపతి రూరల్ మండలానికి చెందిన టీడీపీ నాయకుడు శ్రీధర్‌నాయుడును అ రుణకుమారి ఆర్థికంగా దెబ్బతీసిన విషయాన్ని చెప్పి వాపోయినట్టు తెలిసింది. టీడీపీలోకి చేరుతున్నట్టు ప్రచారం జరుగుతున్న సమయంలోనే శ్రీధర్‌నాయుడును ఆమె తీవ్రంగా మందలించారని వాపోయారు. అరుణకుమారి కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలు, వర్గాలను ప్రోత్సహించారని అలాంటి నాయకురాలు పార్టీలోకి వస్తే మరింతగా గ్రూపులు తయారవుతాయని ఆవేదనను వెళ్ల గక్కారు. ఎంపీ శివప్రసాద్ సైతం పార్టీ నాయకులను పట్టించుకోవడం లేదని, మంత్రి అనుచరులకే పెద్ద పీట వేస్తున్నారని తీవ్రస్థాయిలో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. 15 ఏళ్లుగా అరుణకుమారి పార్టీ నాయకులపై కేసులు పెట్టి వేధించారని ఫి ర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అరుణకుమారిని తీ సుకోకుంటేనే పార్టీ బతుకుతుందని అధినాయకు డి వద్ద వాపోయినట్టు సమాచారం. అదేవిధంగా ఎంపీని కట్టడి చేయకుంటే ద్వితీయశ్రేణి నాయకు ల్లో అసంతృప్తిని చల్లార్చచడం కష్టమని బాబు వద్ద కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్పినట్లు తెలుస్తోంది. ‘అన్నీ నేను చూసుకుంటా. నాకు వదిలేయండి, మీరు కలిసి పనిచేయండి చాలు’ అని బాబు తనదైన శైలిలో నాయకులకు చెప్పి పంపారని తెలిసింది. అధినేత నుంచి సమాధానం దాటవేత ధోరణిలో ఉండడంతో తమ్ముళ్లు చేసేదిలేక అసహనంతో వెనుతిరిగినట్టు తెలిసింది. -
టీడీపీలో ‘గల్లా’ ముసలం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ముందు భారీ ప్యాకేజీలతో కొత్తవారిని పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహానికి సొంత పార్టీ సీనియర్లే చెక్ పెడుతున్నారు. ఇన్నేళ్లుగా సేవ చేస్తున్న తమనొదిలి ఆర్థికంగా బలంగా ఉన్నారన్న కారణంతో కొత్తవారికి ఎన్నికల్లో అవకాశం కల్పించడాన్ని వారు జీర్ణించుకోలేపోతున్నారు. ఆ విషయంలో అధినేతకు ఎదురు చెప్పేందుకు వారు వెనకాడటం లేదు. మాజీ మంత్రి, చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు గల్లా అరుణకుమారితో పాటు ఆమె కుమారుడు జయదేవ్, ఆయన బంధువులను పార్టీలో చేర్చుకునే ఉద్దేశంతో.. జయదేవ్‌కు గుంటూరు లోక్‌సభ, గల్లా అరుణకు చంద్రగిరి అసెంబ్లీ, జయదేవ్ మామ ఆది శేషగిరిరావుకు తెనాలి అసెంబ్లీ టికెట్లు ఇచ్చేందుకు చంద్రబాబు ఒప్పందం కుదుర్చుకున్నారన్న సమాచారం తాజాగా వెలుగులోకి వచ్చింది. తెనాలి నుంచి ఆది శేషగిరిరావుకు టికెట్ ఇవ్వాలన్న నిర్ణయం అయిపోయినందున, గుంటూరు (పశ్చిమ) లేదా మంగళగిరి నుంచి పోటీ చేయాలని గతంలో తెనాలి నుంచి పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను ఒప్పించే ప్రయత్నం జరిగింది. ఈ మేరకు జిల్లా పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ గరికపాటి మోహన్‌రావు ఆలపాటితో చర్చలు జరిపారు. తాజా పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆలపాటి.. గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ఇప్పటికే 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, ఆ మొత్తం తిరిగి ఇచ్చేస్తే తనదారి తాను చూసుకుంటానని స్పష్టంగా చెప్పడంతో గరికపాటి వెనుదిరిగినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. జయదేవ్‌కు పోటీగా చంద్రశేఖర్ అలాగే, గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి జిల్లాకు కొత్తవాడైన జయదేవ్‌ను నిలపాలనుకోవడంతో ఆయనకు పోటీగా ఆర్థికంగా బలమైన, తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరును జిల్లాకు చెందిన కోడెల శివప్రసాద్, ఆలపాటి రాజాలతో పాటు మరికొందరు నేతలు తెరపైకి తెచ్చారు. చంద్రశేఖర్ పార్టీకి రూ. 50 లక్షల విరాళం కూడా ఇచ్చారని, చంద్రశేఖర్‌కు గుంటూరు వీలుకాని పక్షంలో నర్సరావుపేట లోక్‌సభ టికెట్ ఇవ్వాలని వారు చంద్రబాబును కోరారు. ఈ ప్రతిపాదనపై సూటిగా చెప్పకుండా చంద్రబాబు చూద్దాం అని మాత్రమే చెప్పి పంపినట్టు పార్టీ వర్గాలు చెప్పాయి. జయదేవ్ పార్టీలోకి రావడాన్ని కోడెల వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, జిల్లాలోని ఆయన వ్యతిరేక వర్గం ఆహ్వానిస్తోంది. కాగా, తెనాలి, బుర్రిపాలెం మధ్య ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఒక భవనాన్ని కూడా జయదేవ్ నిర్మిస్తుండటం గమనార్హం.