అన్నంలో రాళ్లు, కూరలో పురుగులు | Rice stones, worms kuralo | Sakshi
Sakshi News home page

అన్నంలో రాళ్లు, కూరలో పురుగులు

Published Tue, Aug 19 2014 1:11 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM

Rice stones, worms kuralo

  •     బస్కీ హాస్టల్‌లో గాడి తప్పిన మెనూ
  •      భోజనం చేయలేమన్న విద్యార్థులు
  •      హెచ్‌ఎం, వార్డెన్‌పై ఎంపీపీ ఆగ్రహం    
  • అరకులోయ :  మండలంలోని బస్కీలోని గిరిజన సంక్షేమ బాలుర వసతిగృహంలో మెనూ పూర్తిగా గాడి తప్పింది. సోమవారం అరకులోయ ఎంపీపీ కె. అరుణకుమారి హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించడంతో ఈ విషయం వెలుగుచూసింది. విద్యార్థుల వంటకాలను పరిశీలించగా అన్నంలో రాళ్లు, కూరలో పురుగులు ఉండడం చూసి ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

    రోజూ ఇలాగే భోజనాలు పెడుతున్నారా అని ఎంపీపీ విద్యార్థులను అడుగగా పిల్లలు అవునని చెప్పడంతో  పాఠశాల హెచ్‌ఎం వెంకటరావు, డెప్యూటి వార్డెన్ బాలీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఇటువంటి తిండి తిం టారా? అని వారిని నిలదీ శారు. దీనికితోడు వారం రోజుల నుంచి కోడిగుడ్లు, అరటిపండ్లు, ఇతర స్నా క్స్  ఇవ్వడం లేదని విద్యార్థులు ఎంపీపీకి తెలిపారు. కూర లో పురుగులు ఉండడంతో మధ్యాహ్నం రెండు గంటలకు కూడా విద్యార్థులు ఖాళీ కంచాలు పట్టుకుని భోజనం చేయడానికి నిరాకరించి కూర్చొన్నారు.

    విద్యార్థులకు వేరే కూర వండించమని ఎంపీపీ చెప్పడంతో అప్పటికప్పుడు బెండకాయ కూర వండారు. ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే  సహించేదిలేదని ఎంపీపీ అరుణకుమారి హెచ్చరించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్, పాడేరు ఐటీడీఏ పీవో, పాడేరు డీడీ దృష్టికి తీసుకువెళ్లనున్నట్టు ఎంపీపీ తెలిపారు. కుళ్లిన గుడ్లు సరఫరా చేయడం వల్ల వండి పెట్టలేదని వార్డెన్ బాలీ చెప్పడంతో స్టోర్ రూంను సందర్శించి చూడగా అందులో సరిపడ గుడ్లు కూడా లేకపోవడం గమనార్హం.
     
    వార్డెన్ వినిపించుకోవడం లేదు : హెచ్‌ఎం
     
    మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని తాను ఎంత చెప్పినా వార్డెన్ విని పించుకోవడం లేదని దీంతో నిత్యం విద్యార్థులకు ఇబ్బందులు తప్ప డం లేదని, వార్డెన్‌ను వెం టనే మార్పు చేయాలని కోరు తూ బస్కీ పాఠశాల హెచ్‌ఎం వెంకటరావు లిఖిత పూర్వకంగా ఎంపీపీని కోరారు. ఈ తనిఖీలో వైఎస్సార్ సీపీ నా యకులు శెట్టి అప్పాలు, కె.సత్యానందం, బాబూరావు, సీహెచ్ అప్పలరాజు పాల్గొన్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement