ఆన్‌లైన్ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి
డీఈఓ అరుణకుమారి
విజయనగరం అర్బన్ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ది అంశాలను ఎప్పటికప్పుడు క్రోడీకరించే విధంగా ఆన్‌లైన్ వ్యవస్థను ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ ఎస్.అరుణకుమారి తెలిపారు. శుక్రవారం స్థానిక కస్పా మున్సిపాల్ ఉన్నత పాఠశాలలో జరిగిన ’నేషనల్ ప్రొగ్రాం ఆన్ స్కూల్ స్టాండర్‌డ్‌స, ఎవాల్యూషన్’ శిక్షణ తరగతులకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పాఠశాల స్థారుు స్థితిగతులను ప్రతి రోజూ నమోదు చేసుకుని ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. ఉపాధ్యాయుల స్వీయ మూల్యాంకనలో పారదర్శకత లోపించకూడదని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓలు బి.లింగేశ్వరరెడ్డి, ఎ.గౌరీశంకర్‌రావు, ఎ.డి సత్యనారాయణ, రీసోర్స్‌పర్సన్లు ఏవీ రమణ, కూర్మారావు, వాసు, ఉమామహేశ్వరావు, ఎంపిక చేసిన ప్రధానోపాధ్యాయులు 40 మంది పాల్గొన్నారు.