rangaswamy
-
ఏమీ చేయలేక సీఎం కుర్చీలో ఉన్నా!
సాక్షి, చెన్నై : తాను ఏమీ చేయలేని పరిస్థితులలో ఈ కుర్చీలో ఉన్నానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో నియమితులైన నర్సులు తమ ఉద్యోగాలను పరి్మనెంట్ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంగళవారం సీఎం రంగస్వామిని కలిసేందుకు వచ్చిన నర్సులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వద్ద వీరు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అటు వైపుగా వచ్చిన డీఎంకే ఎమ్మెల్యేలు వారికి మద్దతు ఇచ్చారు. సీఎం రంగస్వామిని కలిసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా నర్సులతో రంగస్వామి మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లగక్కడం గమనార్హం. గతంలో ఉన్న పాలన వేరు, ప్రస్తుతం ఉన్న పాలన వేరని వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో నియమించిన నర్సులను తొలగించాలని అధికారులు తనకు సూచించారని గుర్తుచేశారు. అయితే, తానే మూడు నెలలకు ఒక పర్యాయం కాంట్రాక్టు కాలాన్ని పొడిగిస్తూ వచ్చానని వివరించారు. ఇక్కడున్న వారి ముందు చెప్పడంలో సంకటంగా ఉందంటూ, సీఎం కురీ్చలో ఎందుకు ఉన్నానో అని అసహనం వ్యక్తం చేశారు. సీఎం చెబితే గతంలో అధికారులు చేసే వారని, ఇప్పుడు అలా చేయడం లేదన్నారు. ప్రభుత్వ కార్యాక్రమాలకు వెళ్లినా, శిలాఫలకంలో తన పేరు ఉందా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అధికారులు అయితే, వీఆర్ఎస్ ఇవ్వాలని కోరుతున్నారని వివరించారు. విద్యుత్ శాఖలో సెలవులపై అనేక మంది అధికారులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. తన చేతిలో అధికారం ఉంటే, కరోనా కాలంలో సేవలు అందించిన నర్సుల కాంట్రాక్టు ఐదేళ్లకు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నానని, తన చేతిలో ఏమీ లేదని, అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం. -
నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు: పుదుచ్చేరి సీఎం
సాక్షి, చైన్నె: తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, తాను సైతం ప్రజలతో కలిసే వెళ్తానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి పోలీసులను సోమవారం ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం రంగస్వామి ప్రజలతో మమేకమైతిరిగే నాయకుడు. ఆయన తరచూ మోటారు సైకిల్‌పై సైతం చక్కర్లు కొడుతుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయనకు పోలీసులు భద్రతను పెంచారు. ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను ఆపేస్తున్నారు. రోజూ గోరిమేడులోని ఇంటి నుంచి సచివాలయం వెళ్లే సమయంలో అనేక ప్రాంతాల కూడలిలో వాహనాలు నిలుపుదల చేస్తూ వస్తున్నారు. తన కారణంగా స్థానికులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఇబ్బందులు ఎదురు అవుతుండడాన్ని సీఎం పరిగణించారు. దీంతో తన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ఇకపై ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని పోలీసులను ఆదేశించారు. ప్రజల వాహనాలతో పాటే తన వాహనం కూడా ముందుకెళ్తుందని, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ప్రజల వాహనాలను కూడా ఆపొద్దని పోలీసులకు ఆయన సూచించడం విశేషం. చదవండి: వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి! -
ఈ సినిమాలో నాకు ఛాన్స్ రాలేదని బాధగా ఉంది.. సుమన్
నరసింహాచారి, డా.సకారం మారుతి, భాస్కర్‌రెడ్డి, చిత్రం శ్రీను, మీనాక్షిరెడ్డి, పల్సర్ బైక్ ఝాన్సీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రంగస్వామి’. డ్రీమ్ సినిమా పతాకంపై స్వీయ దర్శకనిర్మాణంలో నరసింహాచారి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రాన్ని సీనియర్ నటుడు సుమన్ వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘యువత డ్రగ్స్ ఉపయోగించినప్పుడు ఎంత ఆనందిస్తున్నారో.. ఆ తర్వాత అంతగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.. ఆ విషయాన్ని ఇందులో చక్కగా చూపించారు. యువతకు మంచి సందేశాన్నిస్తుంది. ట్రైలర్ చూశాక ఎక్కడా కాంప్రమైజ్ కాలేదనిపించింది. ఎమోషన్స్ పండించడం చాలా కష్టం. ఈ చిత్రంలో దానికే ఎక్కువ మార్కులు పడతాయి. ఇలాంటి చిత్రంలో నాకు పాత్ర రాలేదని కాస్త బాధగా ఉంది. సినిమా చూశాక మెండ్ ఫ్రెష్ అయినట్లు అనిపించింది. ఇలాంటి కథలు రావడం ఈ సమాజానికి అవసరం’’ అని అన్నారు. నటుడు సకారం మారుతి మాట్లాడుతూ ‘‘దర్శకుడు చెప్పినట్లు చేశాం. మట్టిని పిండి బొమ్మగా మలచినట్లు మా నుంచి చక్కని నటన రాబట్టారు. ఆ క్రెడిట్ అంతా దర్శకుడిదే. సినిమాలపై ఎంతో అవగాహన, అనుభవం ఉన్న సుమన్‌గారు సినిమా చూసి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో మా సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. పైగా ఈ సినిమా నచ్చి మా టీం చేసే తదుపరి చిత్రంలో తప్పకుండా అవకాశం ఇవ్వాలని సుమన్ మమ్మల్ని కోరడం చాలా ఆనందంగా అనిపించింది’’ అని అన్నారు. -
కొలువుదీరిన మంత్రివర్గం: సీఎం చేతిలో 13 శాఖలు
సాక్షి, చెన్నై: రెండు నెలల అనంతరం పుదుచ్చేరి మంత్రి వర్గం శాఖల కేటాయింపుతో పూర్తి స్థాయిలో కొలువుదీరింది. ఐదుగురు మంత్రులకు సీఎం రంగస్వామి ఆదివారం శాఖల్ని కేటాయించారు. గత నెల 27న బీజేపీకి చెందిన ఇద్దరు, ఎన్ఆర్ కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, వీరికి శాఖల కేటాయింపుల్లో జాప్యం తప్పలేదు. ముఖ్యశాఖలపై బీజేపీ కన్నేయడంతోనే ఈ జాప్యం నెలకొంది. ఎట్టకేలకు శాఖల కేటాయింపు ప్రక్రియను సీఎం రంగస్వామి ఎల్జీ తమిళిసై సౌందరరాజన్ ఆమోదంతో ముగించారు. సీఎం రంగస్వామి చేతిలో సాధారణ, స్థానిక పాలన, ఆరోగ్యం, దేవదాయ, హార్బర్, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా 13 శాఖలు ఉన్నాయి. బీజేపీ మంత్రి నమశ్శివాయంకు హోం, విద్యుత్, పరిశ్రమలు, విద్య, క్రీడలు సహా ఆరు శాఖలు కేటాయించారు. మరో బీజేపీ మంత్రి సాయి జె శరవణకుమార్‌కు పౌరసరఫరాలు, డీఆర్డీఏ, అగ్ని మాపక, మైనారిటీ వ్యవహారాలు సహా ఆరు శాఖలు అప్పగించారు. ఇక, ఎన్ఆర్ కాంగ్రెస్ మంత్రులు లక్ష్మీనారాయణన్‌కు ప్రజాపనులు, పర్యాటకం, మత్స్య, న్యాయ, సమాచార శాఖలు, తేని జయకుమార్‌కు వ్యవసాయం, అటవీ, సాంఘిక సంక్షేమ, వెనుకబడిన సామాజిక వర్గం, మహిళా, శిశు సంక్షేమ శాఖలు, చంద్ర ప్రియాంకాకు రవాణా, ఆది ద్రావిడ, గృహ నిర్మాణ, సాంస్కృతిక శాఖ లను కేటాయించారు. -
రంగస్వామి రికార్డు.. పుదుచ్చేరి సీఎంగా నాలుగో సారి
సాక్షి, పుదుచ్చేరి : పుదుచ్చేరి 20వ ముఖ్యమంత్రిగా ఎన్. రంగస్వామి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఇన్చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. రంగస్వామి తమిళ భాషలో దేవుడ్ని స్మరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగో సారి. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ద్వారా పోటీ చేసిన ఎన్ఆర్ కాంగ్రెస్ 10, బీజేపీ 6 సీట్లను గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను సాధించిన సంగతి తెలిసిందే. -
బీజేపీ కూటమి గెలుపు: రంగన్నకే పుదుచ్చేరి
పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ కూటమి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమైంది. ఈ కూటమి అధిక స్థానాల్లో విజయ కేతనం ఎగుర వేసింది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుదుచ్చేరిలో పాగా వేయడం లక్ష్యంగా బీజేపీ ఆది నుంచి వ్యూహాల్ని పదును పెడుతూనే వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒకరి తర్వాత మరొకరు రాజీనామా చేసి బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్‌ల వైపుగా వెళ్లడంతో సీఎం నారాయణ స్వామి ప్రభుత్వం కుప్పకూలింది. దీంతో పుదుచ్చేరిలో రాజకీయం రసవత్తరంగా మారింది. తేలని నేతృత్వం.. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్, బీజేపీ-అన్నాడీఎంకేలు కూటమిగా ప్రకటించుకున్నా, నేతృత్వంపై మాత్రం సందిగ్ధం నెలకొంది. అయితే, రంగస్వామి నేతృత్వంలోనే కూటమి అని, ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రకటించుకుంది. అయితే, బీజేపీ వర్గాలు ఈ విషయంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఎన్నికల అనంతరం నేతృత్వం గురించి చర్చించుకుందామని, సీఎం అభ్యర్థిని ఎంపిక చేసుకుందామని బీజేపీ నేతలు పేర్కొంటూ వచ్చారు. ఈ పరిస్థితుల్లో పుదుచ్చేరి రంగన్నకు చిక్కే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 30 స్థానాలతో కూడిన పుదుచ్చేరిలో ఎన్‌ఆర్‌కాంగ్రెస్ తొమ్మిది చోట్ల విజయ ఢంకా మోగించింది. ఓ చోట ఫలితం తేలాల్సి ఉంది. ఇక, బీజేపీ మూడు చోట్ల గెలవగా, రెండు చోట్ల ఫలితం తేలాల్సి ఉంది. ఈ సారి ఇక్కడ అన్నాడీఎంకే ఖాతా తెరవలేదు. ఆపార్టీ డిపాజిట్లు గల్లంతు కావడం ఇదే ప్రపథమం కావడం గమనార్హం. ఇక, ఇతరులు ఆరుగురు విజయకేతనం ఎగుర వేసి ఉండడం రంగస్వామికి కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా, డీఎంకే – కాంగ్రెస్ కూటమికి ఆశించిన గెలుపు దక్కలేదు. అయితే, డీఎంకే మూడు చోట్ల గెలవగా, రెండు చోట్ల ఫలితం తేలాల్సి ఉంది. కాంగ్రెస్ రెండు చోట్ల గెలిచింది. ఈ పరిణామాల నేపథ్యంలో అత్యధికంగా ఎమ్మెల్యేల్ని రంగస్వామి దక్కించుకున్న దృష్ట్యా, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేనా..? లేదా కేంద్ర పెద్దలు ఏదేని మెలిక పెట్టేనా..? అన్నది వేచి చూడాల్సిందే. చదవండి: తమిళనాడు: కమలనాథుల జేబులో కీలక సీటు -
గుత్తిలో డిగ్రీ విద్యార్థిని దారుణహత్య
-
తన ప్రేమను ఒప్పుకోలేదని చంపేశాడు..
సాక్షి, అనంతపురం : గుత్తిలోని తురకపల్లి రోడ్డు కాలనీలో నివాసం ఉండే కారు డ్రైవర్ రాజు కుమార్తె మేరీ జోత్స్న అరుణ కుమారి (18) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా తన ప్రేమను ఒప్పుకోలేదన్న కారణంతో రంగస్వామి అనే వ్యక్తి అరుణ కుమారిని దారుణంగా గొంతునులిమి చంపినట్లు పోలీసులు నిర్థారించారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని అరుణకుమారి ఓ ప్రైవేట్ డిగ్రీ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతోంది. శనివారం సాయంత్రం నుంచి ఆమె కనిపించడం లేదు. దీంతో కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల ఇళ్ల వారు ఆమె ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. అయితే ఇంటికి సమీపంలోని డ్రైనేజీ కాలువ దగ్గర అపస్మారకస్థితిలో పడి ఉంది. ఇది గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి మెడపై రెండు పెద్ద గాట్లు ఉండటం, తలకు వెనుక భాగంలో గాయాలుండటంతో ఆమె మృతిపై అనుమానం రేకెత్తాయి. ఉద్దేశ పూర్వకరంగా ఎవరైనా చంపారా? లేక కాలు జారి రాళ్లపై పడిందా? అనే కోణంలో దర్యాప్తు నిర్వహించగా హత్య విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడు రంగస్వామిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. -
బ్రహ్మోత్సవాలకు వేళాయే!
- 5 నుంచి లక్ష్మీరంగనాథుని బ్రహ్మోత్సవాలు - 14 వరకు వేడుకలు - 12న స్వామివారి రథోత్సవం జూపాడుబంగ్లా: ఎనిమిది శతాబ్దాల క్రితం చెక్కబొమ్మరూపంలో దర్శనమిచ్చి అనంతర కాలం నుంచి కొలిచిన వారికి కొంగుబంగారంగా వెలుగొందుతున్న తర్తూరు శ్రీలక్ష్మీరంగనాథస్వామి.. బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వతేదీన నిర్వహించే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తర్తూరు బ్రహోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆ మేరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయచరిత్ర.. సుమారు 720 ఏళ్లక్రితం జూపాడుబంగ్లా మండలం తర్తూరు ఉల్ఫా వంశానికి చెందిన రాజారెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా పెబ్బేరు మండలం శ్రీరంగాపురానికి చెందిన రంగమ్మను పెళ్లి చేసుకున్నారు. ఏటా హోలీ పౌర్ణమినాడు శ్రీరంగాపురంలో జరిగే శ్రీలక్ష్మిరంగనాథస్వామి వారి ఉత్సవాలకు దంపతులు వెళ్లేవారు. వేడుకల అనంతరం ఆడ బిడ్డకు పుట్టింటివారు ఒడిబియ్యం పెట్టడం ఆనవాయితీ. ఒడిబియ్యంలో ఆడరూపంలోని ఓ చెక్కబొమ్మను పెట్టి వచ్చే ఉత్సవాలకు పండంటి బిడ్డను ఎత్తుకుని రావాలని ఆకాంక్షించేవారు. ఆ దంపతులు తర్తూరుకు వచ్చి ఒడిబియ్యాన్ని విప్పిచూడగా అందులోని చెక్కబొమ్మ మగరూపంలోకి మారేది. దీంతో మెట్టినింటివారు కోడలిని మందలించేవారు. అలాగే ఏటా వారి వంశస్తులు ఎవ్వరో ఒకరు చనిపోవడంతోపాటు అనారోగ్యాలకు గురయ్యేవారు. ఇలా మూడు, నాలుగు పర్యాయాలు జరగడంతో ఆగ్రహించిన వారు ఆ చెక్కబొమ్మను పశువులగాడిలోకి విసిరివేయగా స్వామివారు పూనకం వచ్చి తాను శ్రీరంగనాథస్వామిగా పేర్కొన్నాడు. తాను తర్తూరులోనే కొలువుంటానని, ఏటా జాతర నిర్వహించి భక్తితో కొలిస్తే అష్టైశ్వర్యాలు, వంశాభివృద్ధి ప్రసాదిస్తానని చెబుతాడు. అప్పటినుంచి ఉల్ఫా వంశస్తులు స్వామివారు కొలువుదీరిన ఇంటితోపాటు 60 ఎకరాల పొలాన్ని స్వామివారికి దారాదత్తం చేసి ఏటా జాతర నిర్వహించేవారు. అలా ప్రారంభమైన జాతరకు రాష్ట్రవ్యాప్తంగా పేరుంది. జాతర ప్రత్యేకత.. తర్తూరు జాతర అనగానే కలప, ఎద్దుల విక్రయాలు గుర్తుకొస్తాయి. జాతరలో కడుపేదవాడి నుంచి ధనికుని వరకు అవసరమైన వంటింటి, వ్యవసాయ పనిముట్లు లభిస్తాయి. ప్రస్తుతం అటవిశాఖ అధికారులు నిషేధం విధించడంతో కలప పనిముట్ల స్థానంతో ఇనుముతో తయారుచేసిన వాటిని అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే జాతరలో విక్రయించే కడ్డీల మాంసానికి అధిక డిమాండ్ ఉంది. ఈ మాసంపు కడ్డీలను తినడానికి భక్తులు ప్రత్యేకంగా జాతరకు వస్తుంటారు. దేవుని ప్రసాదంగా భావించి ఇళ్లకు తీసుకెళ్లి ఆరగిస్తుంటారు. కళ తప్పుతున్న జాతర.. పన్నెండేళ్ల క్రితం వరకు తర్తూరు జాతర నెలరోజుల పాటు జరుగుతుండేది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక ప్రాంతం నుంచి సైతం భక్తులు, రైతులు భారీ సంఖ్యలో వచ్చేవారు. స్వామివారికి మొక్కులు తీర్చుకోవడంతో పాటు వారికి అవసరమైన వ్యవసాయ పనిముట్లు, ఎద్దులు కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం జాతరలో కలప విక్రయాలు, రైతులు ఎద్దులబండ్లపై రావడాన్ని అటవీ అధికారులు నిషేధించడంతో క్రమంగా ప్రాధాన్యం తగ్గిపోతోంది. 12న రథోత్సవం.. ఈనెల 5న ప్రారంభమయ్యే తర్తూరు శ్రీలక్ష్మిరంగనాథస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 12వతేదీన స్వామివారి రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన పూజారి వెంకటరెడ్డి, ఈఓ సుబ్రమణ్యంనాయుడు, చైర్మన్ రాయపుచిన్నరంగారెడ్డి తెలిపారు. మొదటి రోజు 5న పూలచపురం, 6న సింహవాహనసేవ, 7 హంససేవ, 8నాగేంద్రునిసేవ, 9 హనుమంతునిసేవ, 10 గరుడసేవ, 11 గజవాహనసేవ, 12 రథోత్సవం, 13 పారువేట, 14 తీర్థావళితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
వివాహిత ఆత్మ'హత్య'
► హత్య చేసి.. ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ ► ఆత్మహత్య చేసుకుందంటూ పుట్టింటికి తప్పుడు సమాచారం ► మా బిడ్డను భర్త, అత్తమామలే కొట్టి చంపారని హతురాలి తండ్రి ఆరోపణ ► అనుమానాలు బలం చేకూర్చుతున్న నిందితుల పరారీ ఉదంతం అనంతపురం: హత్య చేసి ఆత్మహత్య గా చిత్రికరించిన సంఘటన అమరాపురం మండలంలోని వీరాపురంలో వెలుగులోకి వచ్చింది. సుధ(33) అనే వివాహిత ఆత్మ'హత్య' కలకలం రేపింది. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆమె ఉరికి వేలాడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. మృతురాలి ఒళ్లంతా గాయాలుండడం. భర్త, అత్త, మామ పరారీ కావడం అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఇది కచ్చితంగా హత్యేనని మృతురాలి తండ్రి సహా బంధువులు, గ్రామస్తులు అంటున్నారు. గ్రామానికి చెందిన బొప్పన్న కుమార్తె సుధ వివాహం వీరాపురం గ్రామానికి చెందిన రంగస్వామితో పదేళ్ల కింద జరిగింది. వారికి రాకేశ్ అనే ఒక కుమారుడు ఉన్నాడు. పెళ్లైనప్పటి నుంచి దంపతులు బతుకుదెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లారు.అక్కడి ఓ ఫ్యాక్టరీలో పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఉగాదికి ఊరికొచ్చి... ఉగాది పండుగ కోసం సుధ, రంగస్వామి, వారి కుమారుడు వీరాపురానికి మంగళవారం వచ్చారు. గురువారం ఆమె తన పుట్టింటికెళ్లింది. భర్త పిలుపుతో ఆమె తన కుమారుడు, మరో బంధువుతో కలసి వీరాపురానికి శుక్రవారం సాయంత్రం బైక్‌లో వచ్చింది. అంతలోనే ఆత్మహత్య అంటూ ఫోన్.. శనివారం తెలతెలవారుతుండగానే అల్లుడి నుంచి బొప్పన్నకు ఫోన్ వచ్చింది. మీ కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందంటూ తెలిపాడు. బొప్పన్న సహా బంధువులు వెంటనే బయలుదేరి వీరాపురం చేరుకున్నారు. మృతురాలి ఒంటిపై గాయాలుండడం చూసి వారు నిశ్చేష్టులయ్యారు. తమ బిడ్డను అల్లుడు, అత్త, మామలే కొట్టి చంపేశారని బొప్పన్న ఆరోపించారు. ఇదే విషయాన్ని ఆయన రాతమూలకంగా ఏఎస్ఐ ఈరన్నకు ఫిర్యాదు చేశారు. నిందితుల పరారీ మృతదేహాన్ని వదిలేసి రంగస్వామి, అతని తల్లిదండ్రులు పరారీ కావడం అనుమానాలకు బలం చేకూర్చింది. ఇది కచ్చితంగా హత్యేనని గ్రామస్తులు కూడా ఆరోపించారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మడకశిర ఆస్పత్రికి తరలించారు. -
కట్టెల కోసం వెళ్లి శవమయ్యాడు...
ఉరవకొండ: అనంతపురంజిల్లా విడపనకల్లు మండలం పరిధిలోని ఉండబండ గ్రామానికి చెందిన కూలీ విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం రంగస్వామి అనే కూలీ కట్టెలు కొట్టుకురావడానికి వెళ్లాడు. రాత్రి అయినా భర్త రాకపోవడంతో ఆమె బంధువులతో కలిసి గాలించింది. రెండు రోజుల పాటు వెతికినా ప్రయోజనం లేకపోయింది. చివరకు శుక్రవారం ఉదయం కొందరు గ్రామస్తులకు గ్రామం సమీపంలోని పొలం వద్ద ముళ్లపొదల్లో శవమై కనిపించాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబీకులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. రంగస్వామి కట్టెలు కొట్టేందుకు చెట్టుపైకి ఎక్కాడని, చెట్టుపై ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలను గమనించక పోవడంతో అవి తగిలి విద్యుదాఘాతానికి గురై చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతునికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
13 నుంచి డిగ్రీ తరగతులు పునఃప్రారంభం
అనంతపురం (బుక్కరాయసముద్రం) : అనంతపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 13 నుంచి తరగతులు పునః ప్రారంభం అవుతాయని ప్రిన్సిపల్ రంగస్వామి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 19 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు. 19 నుంచి మొదటి సంవత్సరం విద్యార్థులకు ప్రాక్టికల్స్ జరగనున్నట్లు చెప్పారు. -
విద్యుత్ ఇంజినీర్ల కార్యదర్శిగా రంగస్వామి
కర్నూలు : విద్యుత్ శాఖ ఇంజినీర్ల సంఘం (ఏపీఎస్‌ఈబీఈఏ) జిల్లా కార్యదర్శిగా జి. రంగస్వామి ఎన్నికయ్యారు. 2016–18 (రెండేళ్లు) పీరియడ్‌కు గాను నూతన కమిటీని ఎన్నుకునేందుకు ఈనెల 19న స్థానిక బాబా బృందావన్ నగర్‌లోని ఇంజినీర్ల సంఘం అతిథి గృహంలో ఎన్నికల జరిగాయి. జిల్లా కార్యదర్శికి కర్నూలు టౌన్ ఎస్పీడీసీఎల్ ఏడీఈ–1గా పనిచేస్తున్న జి. రంగస్వామి, ట్రాన్స్‌కో ఎంఆర్టీ ఏడీఈగా పనిచేస్తున్న గోపాల్, కోశాధికారిగా డీపీఈ ఏఈ జగదీశ్వర రెడ్డి, ట్రాన్స్‌కో ఏఈ రమణ పోటీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏపీ ఎస్పీడీసీఎల్, ట్రాన్స్‌కో సంస్థ ఇంజనీర్లు 171 మంది ఉండగా, 161 మంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఎలక్షన్ ఆఫీస ర్, హెచ్‌టీ మీటర్స్ విభాగ ఏడీఈ యు. ప్రభాకర్ సమక్షంలో ఓట్ల లెక్కించగా జిల్లా కార్యదర్శికి 146 ఓట్లు పోల్ కాగా వాటిలో జి. రంగస్వామికి 112, గోపాల్‌కు 34 వచ్చాయి. కోశాధికారికి 113 ఓట్లు పడగా జగదీశ్వరరెడ్డికి 85, రమణకు 28 వచ్చాయి. దీంతో జి ల్లా కార్యదర్శిగా రంగస్వామి 78, కోశాధికారిగా జగదీశ్వర రెడ్డి 57 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కర్నూలు బ్రాంచ్ సెక్రట రీగా గంగన్న, అడిషనల్ సెక్రటరీగా ముఖేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
కానిస్టేబుల్ రెండో కాపురం చిచ్చు
భర్త రెండో కాపురం ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది. మొదటి భార్యపై భర్త తరఫు బంధువులు దాడి చేశారు. ఈ ఘటన శనివారం రాత్రి 11 గంటల సమయంలో అనంతపురంలోని గౌరవ గార్డెన్ సమీపంలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు... గంగాధర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తూ ఇటీవల హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది కళ్యాణదుర్గం స్టేషన్‌కు బదిలీ అయ్యాడు. డెప్యూటేషన్‌పై త్రీటౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని కోర్టు మానిటరింగ్ విభాగంలో పని చేస్తున్నాడు. ఈయనకు భార్య కొండమ్మ, కుమారులు నితీష్, రుతిక్ ఉన్నారు. అయితే, గంగాధర్ సుమారు ఏడాదిన్నరగా వేరే మహిళతో కాపురం పెట్టాడు. మొదటి భార్యకు విడాకులివ్వలేదు. ఈ విషయమై భార్యభర్తలు పలుమార్లు గొడవపడ్డారు. ఈ క్రమంలో శనివారం రాత్రి రెండో కాపురం పెట్టిన మహిళతో ఉన్నాడనే సమాచారం అందుకున్న కొండమ్మ, అన్న రంగస్వామి, తల్లితో కలిసి వెళ్లింది. వీరు వచ్చిన విషయం తెలుసుకున్న గంగాధర్ లోపల గడియపెట్టుకుని బయటకు రాలేదు. తన బంధువులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని కొండమ్మ, రంగస్వామిపై దాడి చేశారు. దీంతో రంగస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఎస్ఐ రెడ్డప్ప ఘటనాస్థలానికి చేరుకుని దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు.