ఏమీ చేయలేక సీఎం కుర్చీలో ఉన్నా! | Puducherry CM Rangasamy Anguish Jobs permanent | Sakshi
Sakshi News home page

ఏమీ చేయలేక సీఎం కుర్చీలో ఉన్నా!

Published Wed, Jun 28 2023 9:38 AM | Last Updated on Wed, Jun 28 2023 9:39 AM

Puducherry CM Rangasamy Anguish Jobs  permanent - Sakshi

సాక్షి, చెన్నై : తాను ఏమీ చేయలేని పరిస్థితులలో ఈ కుర్చీలో ఉన్నానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. కరోనాకాలంలో నియమితులైన నర్సులు తమ ఉద్యోగాలను పరి్మనెంట్‌ చేయాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మంగళవారం సీఎం రంగస్వామిని కలిసేందుకు వచ్చిన నర్సులను పోలీసులు అడ్డుకున్నారు. సచివాలయం వద్ద వీరు ఆందోళనకు దిగారు. అదే సమయంలో అటు వైపుగా వచ్చిన డీఎంకే ఎమ్మెల్యేలు వారికి మద్దతు ఇచ్చారు. సీఎం రంగస్వామిని కలిసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈసందర్భంగా నర్సులతో రంగస్వామి మాట్లాడుతూ తన ఆవేదనను వెల్లగక్కడం గమనార్హం.

 గతంలో ఉన్న పాలన వేరు, ప్రస్తుతం ఉన్న పాలన వేరని వ్యాఖ్యలు చేశారు. కరోనా కాలంలో నియమించిన నర్సులను తొలగించాలని అధికారులు తనకు సూచించారని గుర్తుచేశారు. అయితే, తానే మూడు నెలలకు ఒక పర్యాయం కాంట్రాక్టు  కాలాన్ని పొడిగిస్తూ వచ్చానని వివరించారు. ఇక్కడున్న వారి ముందు చెప్పడంలో సంకటంగా ఉందంటూ, సీఎం కురీ్చలో ఎందుకు ఉన్నానో అని అసహనం వ్యక్తం చేశారు. సీఎం చెబితే గతంలో అధికారులు చేసే వారని, ఇప్పుడు అలా చేయడం లేదన్నారు.

ప్రభుత్వ కార్యాక్రమాలకు వెళ్లినా, శిలాఫలకంలో తన పేరు ఉందా అని చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు అధికారులు అయితే, వీఆర్‌ఎస్‌ ఇవ్వాలని కోరుతున్నారని వివరించారు. విద్యుత్‌ శాఖలో సెలవులపై అనేక మంది అధికారులు వెళ్లిపోయారని గుర్తు చేశారు. తన చేతిలో అధికారం ఉంటే, కరోనా కాలంలో సేవలు అందించిన నర్సుల కాంట్రాక్టు ఐదేళ్లకు పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నానని, తన చేతిలో ఏమీ లేదని, అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేయడం గమనార్హం.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement