
సాక్షి, పుదుచ్చేరి : పుదుచ్చేరి 20వ ముఖ్యమంత్రిగా ఎన్. రంగస్వామి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఇన్‌చార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆయనతో పదవీ ప్రమాణం చేయించారు. రంగస్వామి తమిళ భాషలో దేవుడ్ని స్మరిస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టడం ఇది నాలుగో సారి. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ద్వారా పోటీ చేసిన ఎన్‌ఆర్ కాంగ్రెస్ 10, బీజేపీ 6 సీట్లను గెలుపొంది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను సాధించిన సంగతి తెలిసిందే.