![Puducherry Cm N Rangasamy Says Do Not Stop Traffic For Convoy - Sakshi](/styles/webp/s3/article_images/2023/05/23/cm.jpg.webp?itok=rgO_drpN)
సాక్షి, చైన్నె: తన కాన్వాయ్ కోసం ట్రాఫిక్‌ను ఆపొద్దని, తాను సైతం ప్రజలతో కలిసే వెళ్తానని పుదుచ్చేరి సీఎం రంగస్వామి పోలీసులను సోమవారం ఆదేశించారు. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి సీఎం రంగస్వామి ప్రజలతో మమేకమైతిరిగే నాయకుడు. ఆయన తరచూ మోటారు సైకిల్‌పై సైతం చక్కర్లు కొడుతుంటారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయనకు పోలీసులు భద్రతను పెంచారు.
ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను ఆపేస్తున్నారు. రోజూ గోరిమేడులోని ఇంటి నుంచి సచివాలయం వెళ్లే సమయంలో అనేక ప్రాంతాల కూడలిలో వాహనాలు నిలుపుదల చేస్తూ వస్తున్నారు. తన కారణంగా స్థానికులకు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఇబ్బందులు ఎదురు అవుతుండడాన్ని సీఎం పరిగణించారు. దీంతో తన కాన్వాయ్ వెళ్లే మార్గాల్లో ఇకపై ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని పోలీసులను ఆదేశించారు. ప్రజల వాహనాలతో పాటే తన వాహనం కూడా ముందుకెళ్తుందని, ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ ఆపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక ప్రజల వాహనాలను కూడా ఆపొద్దని పోలీసులకు ఆయన సూచించడం విశేషం.
చదవండి: వేదికపై ఫ్రెండ్స్ చేసిన పనికి.. వరుడికి షాకిచ్చిన వధువు, గదిలోకి వెళ్లి!
Comments
Please login to add a commentAdd a comment