cm
-
ఆంధ్రప్రదేశ్ ప్రజలను తప్పుదోవ పట్టించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్ర రాజకీయాలు.. డైవర్షన్ పాలిటిక్స్‌పై జనం ఆగ్రహం
-
ఒడిశాకు తప్పిన తుఫాను ముప్పు: సీఎం మోహన్
న్యూఢిల్లీ:'దానా' తుఫాను ఒడిశా తీరం దాటిన నేపధ్యంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ పరిస్థితిని సమీక్షించారు. ఇకపై రాష్ట్రం సురక్షితమని, అధికారుల టీమ్ వర్క్ కారణంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు.విలేకరుల సమావేశంలో సీఎం మాఝీ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ‘ఒడిశా ఇప్పుడు సురక్షితంగా ఉంది. తుఫాను తాకిడి తరువాత, పరిస్థితిని సమీక్షించాము. అధికారుల సమిష్టి కృషి కారణంగా, ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. మేము ఎనిమిది లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. సహాయ కేంద్రాల్లో వారికి వసతి కల్పించాం. విద్యుత్ లైన్ల మరమ్మతు పనులు జరుగుతున్నాయి. 1.75 లక్షల హెక్టార్లలో పంటలు నాశనమైనమయ్యాయి. బుధబలంగ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది’ అని పేర్కొన్నారు. The deep depression (remnant of severe cyclonic storm “DANA”) over north Odisha remained practically stationary during past 6 hours, weakened into a Depression over the same region and lay centred at 2330 hrs IST of yesterday, the 25th October near latitude 21.4°N and longitude… pic.twitter.com/Bb7LrXjHTT— India Meteorological Department (@Indiametdept) October 25, 2024'దానా' తుఫాను గంటకు ఏడు కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతున్నట్లు భారత వాతావరణ శాఖ ఒక పోస్ట్‌లో ఒకటి తెలిపింది. ఇది ఉత్తర ఒడిశా మీదుగా పశ్చిమ దిశలో పయనించి, రానున్న 12 గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. తుఫాను ప్రభావం గురించి భారత వాతావరణ శాఖ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సోమనాథ్ దత్తా మాట్లాడుతూ ఒడిశాలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక తుపాను ప్రభావం గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.ఇది కూడా చదవండి: అందరి చూపు షిల్లాంగ్ వైపే -
4న సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్న కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈనెల 4న (శుక్రవారం) సీఎం నివాసాన్ని ఖాళీ చేయనున్నారు. ఇకపై కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ అశోక్ మిట్టల్ ఇంట్లో ఉండనున్నారు. అశోక్ మిట్టల్ ఇల్లు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉంది. ఇది కేజ్రీవాల్‌కు వివిధ పనులు నిర్వహణకు ఎంతో అనువుగా ఉండనున్నదని తెలుస్తోంది. అరవింద్ కేజ్రీవాల్ త్వరలోనే ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేయనున్నారని, ఆయన కొత్త ఇంటి కోసం వెదుకులాట జరుగుతోందని పార్టీ ఇటీవలే ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపధ్యంలో కేజ్రీవాల్ న్యూ ఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి సమీపంలో ఉండే ఇంటికోసం వెదికారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున కేజ్రీవాల్ తన సమయాన్ని, వనరులను ఉపయోగించుకునేందుకు అనువుగా ఉండే ఇంటి కోసం వెదికారు. మాజీ సీఎం కేజ్రీవాల్‌కు ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, కార్మికులు, వివిధ సామాజిక, రాజకీయ ప్రముఖులు వసతి కల్పించేందుకు ముందుకువచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. డిఫెన్స్ కాలనీ, పితంపురా, జోర్‌బాగ్, చాణక్యపురి, గ్రేటర్ కైలాష్, వసంత్ విహార్, హౌస్ ఖాస్‌తో సహా నగరంలోని అనేక ప్రాంతాలలో అరవింద్ కేజ్రీవాల్‌కు వసతి కల్పిస్తామంటూ అనేక ప్రతిపాదనలు వచ్చాయి. అయితే కేజ్రీవాల్ తన అసెంబ్లీ నియోజకవర్గం ప్రజలను కలిసే సౌలభ్యం ఉండే అశోక్ మిట్టల్ ఇంటిని ఎంచుకున్నారు.కేజ్రీవాల్ జాతీయ పార్టీ అధినేత పదవిలో ఉన్నందున ఆయనకు అధికారిక నివాసం కల్పించాలని పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేజ్రీవాల్ తన భార్య, పిల్లలు, వృద్ధ తల్లిదండ్రులతో కలసి ఉంటున్నారు. రాజకీయాల్లోకి రాకముందు కేజ్రీవాల్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లోని కౌశాంబిలో ఉన్నారు. 2013లో తొలిసారిగా ఢిల్లీ సీఎం అయ్యాక తిలక్ లేన్‌లోని బంగ్లాలో నివాసమున్నారు. 2015లో రెండోసారి ఢిల్లీ సీఎం అయిన తర్వాత నుంచి ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో నివాసం ఉంటున్నారు.ఇది కూడా చదవండి: HCA: అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు -
శ్రీవారి లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ ఆరోపణల విషయంలో వాస్తవాలు నిర్ధారణ కాక ముందే కల్తీ జరిగినట్లు సీఎం చంద్రబాబు రాజకీయ ప్రకటనలు చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీం కోర్టు
-
వాడని నెయ్యి.. తయారుకాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’ గోల
-
మహారాష్ట్ర భావి ముఖ్యమంత్రి రష్మీ ఠాక్రే?
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముంబైలోని మాతోశ్రీ (ఉద్ధవ్ ఠాక్రే నివాసం)లో రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రికి సంబంధించి కొత్త పేరు వినిపిస్తోంది. ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ ఆమె చిత్రంతో కూడి పెద్దపెద్ద బ్యానర్లు ఏర్పాటు చేశారు. అయితే ఏమైందోఏమో వాటిని కొద్దిసేపటికే తొలగించారు.బ్యానర్ల కలకలంమాతోశ్రీలో రష్మీ ఠాక్రేను సీఎం చేయాలనే బ్యానర్ పెట్టడంతో రాష్ట్రంలో రాజకీయ కలకలం రేగింది. గంట వ్యవధిలో శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన యువ కార్యకర్తలు మాతోశ్రీలోని ఆ బ్యానర్లను తొలగించారు.నేడు రష్మీ ఠాక్రే పుట్టినరోజుఇటీవలే మహారాష్ట్రలో మహిళా ముఖ్యమంత్రి అంశంపై చర్చ ప్రారంభమైంది. ఈరోజు (సోమవారం) రష్మీ ఠాక్రే పుట్టినరోజు. దీనిని దృష్టిలో ఉంచుకుని శివసేన యువసేన మాతోశ్రీ వెలుపల రష్మీ ఠాక్రే కాబోయే ముఖ్యమంత్రి అంటూ పోస్టర్లు ప్రదర్శించింది. ఈ పోస్టర్లు పెట్టిన కొద్దిసేపటికే పార్టీ అగ్రనేతలు హడావుడిగా వాటిని తొలగించారు. ఈ పరిణామాల నేపధ్యంలో ఉద్ధవ్ ఠాక్రే భార్య రష్మీ ఠాక్రేను సీఎం చేయాలని పార్టీలో ఒక వర్గం భావిస్తోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలుమరికొద్ది నెలల్లో మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. మహావికాస్ అఘాడీ, మహాయుతి దళ్ నాయకులు తమ సత్తా చాటేలా ఇప్పటికే ఎన్నికల సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించడం మొదలుపెట్టారు.ఇది కూడా చదవండి: ‘హంగ్’ రావొద్దనే... కాంగ్రెస్‌తో పొత్తుపై ఒమర్ -
హిమాచల్ సీఎం సుఖూకు అస్వస్థత
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ అస్వస్థతకు గురయ్యారు. ఈ మేరకు ఆయన సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నారు. ఆయనను పరీక్షించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ నేపధ్యంలో సీఎం జమ్మూ ఎన్నికల పర్యటన వాయిదా పడింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం సీఎం సుఖూ శనివారం ఉదయం ఐజీఎంసీలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేయడంతో పాటు వైద్యులు అతని రక్త నమూనాలు కూడా తీసుకున్నారు. సీఎం ఆరోగ్యంపై ఐజీఎంసీ ఎంఎస్ డాక్టర్ రాహుల్ రావు ఓ ప్రకటన విడుదల చేశారు.సీఎం సుఖూ తనకు కడుపు పైభాగంలో నొప్పి వస్తోందని తెలిపారని, ఈ నేపధ్యంలోనే అతనికి అల్ట్రాసౌండ్ చేయించామన్నారు. దీని రిపోర్టు నార్మల్ గా ఉందని, అయితే ముందుజాగ్రత్తగా రక్తపరీక్ష కూడా చేశామన్నారు. ఈ రిపోర్టు ఇంకా రావాల్సి ఉందన్నారు. కాగా గత ఏడాది సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖూ కడుపునొప్పితో బాధపడుతూ వారం రోజుల పాటు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు.ఇది కూడా చదవండి: తెరుచుకున్న జార్ఖండ్- బెంగాల్ సరిహద్దు -
రేపే సీఎం పదవికి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రేపే (సెప్టెంబర్ 17) తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందులో భాగంగా రేపు లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనాతో భేటీ అయ్యేందుకు అపాయిట్మెంట్ అడిగినట్లు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సన్నిహిత వర్గాలు తెలిపాయి.కేజ్రీవాల్ రేపు సాయంత్రం 4:30 గంటలకు సక్సేనాను కలిసే అవకాశం ఉందని, ఆ తర్వాత ఆయన రాజీనామాను సమర్పించవచ్చని సమాచారం. ఇదిలా ఉండగా, పార్టీ తదుపరి చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికి ఆప్ సీనియర్ నాయకులు ఈరోజు సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారు.లిక్కర్ పాలసీ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆప్ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. తన తొలి ప్రసంగంలో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నాను . ప్రజలు తీర్పు ఇచ్చేంత వరకు సీఎం సీట్లో కూర్చోను. ప్రతి ఇంటికి, ప్రతి వీధికి వెళ్తాను.. తప్ప సీఎం కుర్చీలో కూర్చోను. ప్రజల నుంచి నాకు తీర్పు వస్తుంది’ అని ఆయన అన్నారు.ఇదీ చదవండి : గణేష్ నిమజ్జనం.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు -
ఆయన తప్పకుండా సీఎం అవుతారు: ది గోట్ నటుడు కామెంట్స్
కోలీవుడ్ నటుడు ప్రేమ్గీ అమరేన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. విజయ్ మూవీ ది గోట్ రిలీజ్ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వచ్చే 2026 ఎన్నికల్లో దళపతి విజయ్ తమిళనాడు సీఎం అవుతారని అమరేన్ జోస్యం చెప్పారు. నా ఓటు కూడా విజయ్‌కే వేస్తానని.. తప్పకుండా 2026లో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని హామీ ఇస్తున్నా అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.కాగా.. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT)'ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. ఈ చిత్రంలో ప్రేమ్గీ స్నేహాకు సోదరుని పాత్రలో నటించినట్లు ఆయన తెలిపారు. తనకు తలైవా, సూపర్‌స్టార్ రజినీకాంత్ అంటే విపరీతమైన అభిమానం అని వెల్లడించారు. అజిత్, విజయ్లంటే అమితమైన ప్రేమ అని.. కానీ నా ఆల్ టైమ్ ఫేవరెట్ సూపర్ స్టార్ మాత్రమేనన్నారు.కాగా.. 'గోట్' చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. అయితే విజయ్ ఇప్పటికే తమిళగ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీని ప్రారంభించారు. 2026లో తమిళనాడు రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
Madhya Pradesh: ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’
ఉజ్జయిని: ‘నేను ముఖ్యమంత్రిని మాత్రమే కాదు. నా ప్రియతమ సోదరీమణులకు ప్రధాన సేవకుడిని’ అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ అన్నారు. వెంటనే అక్కడున్న ఆడపడుచులంతా ‘మా అందరి అన్నయ్య.. మోహన్ అన్నయ్య’ అంటూ నినాదాలు చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నేడు (సోమవారం) రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మోహన్ యాదవ్ మాట్లాడుతూ కుటుంబమంతటి శ్రేయస్సును ఇంటి ఆడపడుచులు కోరుకుంటారని, వారు సంతోషంగా ఉంటే కుటుంబమంతా సంతోషంగా ఉంటుందని అన్నారు. భారతీయ సంస్కృతిలో సోదరీమణులను ఎప్పటి నుంచో దేవతలుగా పూజిస్తున్నారని, ఇందుకు ఉదాహరణగా పలు పండుగలు నిలుస్తున్నాయని అన్నారు. రాఖీ సందర్భంగా సీఎంకు పలువురు మహిళలు రాఖీ కట్టారు. సీఎం రాష్ట్ర ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. -
18వసారి జెండా ఎగురవేసిన సీఎం నితీష్ కుమార్
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్వాతంత్య్ర దినోత్సవ వేళ అరుదైన రికార్డు సాధించారు. రాజధాని పట్నాలోని గాంధీ మైదాన్‌లో నితీశ్ కుమార్ 18వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ ఘనత సాధించిన తొలి బీహార్ సీఎంగా ఆయన ఘనత సాధించారు. జాతీయ జెండాను ఎగురవేసిన అనంతం ఆయన ఆ జెండాకు వందనం చేశారు.ఈ సందర్భంగా సీంఎ నితీష్ కుమార్ మాట్లాడుతూ నేడు మనం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని, కొన్ని వందల మంది త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు. అనంతం ఆయన బీహార్ ప్రభుత్వం సాధించిన అభిృద్ధి గురించి వివరించారు. బాలికల విద్య, పోలీసుశాఖలో మహిళల నియామకం, ఉపాధ్యాయుల నియామకంలో ప్రభుత్వం ఎంతో చొరవచూపిందన్నారు. బీపీఎస్సీ ద్వారా రెండు లక్షల 20 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని తెలిపారు.రోగులకు ఆహారం అందించేందుకు రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో దీదీకి రసోయ్‌ను ప్రారంభించామని సీఎం నితీశ్‌కుమార్ పేర్కొన్నారు. 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాట్నాలో ఎయిమ్స్ నిర్మాణానికి ఆమోదం తెలిపారని, దీని నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. పట్నాలో ట్రాఫిక్ జామ్ సమస్య పరిష్కారానికి ఎలివేటెడ్ రోడ్లు, ఓవర్ బ్రిడ్జిలతో సహా అనేక కొత్త రోడ్లను నిర్మించామని తెలిపారు. Patna, Bihar: On the occasion of the 78th Independence Day, Chief Minister Nitish Kumar hoisted the flag at his residence on 1 Anne Marg pic.twitter.com/I8CqqCULsO— IANS (@ians_india) August 15, 2024 -
సీఎం అపాయింట్మెంట్ కోసం యత్నించాం: టాలీవుడ్ నిర్మాత కామెంట్స్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ దర్శక, నిర్మతా తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తాము సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని వెల్లడించారు. కానీ సీఎంఓ ఆఫీస్ నుంచి తమకు ఎలాంటి పిలుపు రాలేదని స్పష్టం చేశారు. అందువల్లే సీఎంను కలిసే అవకాశం దక్కలేదని తమ్మారెడ్డి తెలిపారు.గద్దర్ పేరుతో అవార్డ్స్ తీసుకోవడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇప్పటికే సీఎం అపాయింట్మెంట్ కోసం రెండు, మూడుసార్లు కాల్ చేసినా ఎవరూ స్పందించలేదన్నారు. మీరు ఎప్పుడు రమ్మంటే.. అప్పుడు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మిస్ కమ్యూనికేషన్ లోపం వల్ల ఇలా జరిగిందని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఎలాంటి రెస్పాన్స్ రాలేదు.. సీఎం రేవంత్ రెడ్డికాగా.. అంతకుముందే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై తన అసహనాన్ని బయటపెట్టారు. సి.నారాయణ రెడ్డి 93వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.కాగా.. ఈ ఏడాది జనవరిలో ప్రతిష్టాత్మక నంది అవార్డులని.. గద్దర్ అవార్డులతో భర్తీ చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కొత్త కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఎలా అమలు చేయాలనే విషయమై అభిప్రాయాలు, సూచనలు అందించాలని తెలుగు సినీ ఇండస్ట్రీని కోరారు. అయితే దీని గురించి టాలీవుడ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోయేసరికి.. సినీ పరిశ్రమ మౌనంగా ఉంది, తెలుగు చిత్ర పరిశ్రమలో చేసిన కృషికి, విజయాలకు గౌరవంగా గద్దర్ అవార్డులని ప్రకటించామని, కానీ ఇండస్ట్రీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి అన్నారు. -
బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. 10 మంది మృతి?
ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అలకనంద నదిలో ఒక టెంపో వాహనం పడిపోయింది. ఈ టెంపోలో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, వారిలో 10 మంది వరకూ మృతి చెందివుంటారని సమాచారం.రుద్రప్రయాగ్‌కు ఐదు కిలోమీటర్ల దూరంలో హైవేపై రతౌలీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్తులు పోలీసులు, పరిపాలనా అధికారులు, డీడీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. టెంపో నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి, హెలికాప్టర్ ద్వారా గుప్తకాశీలోని ఆస్పత్రికి తరలించారు.ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, పరిపాలనా అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై ఆయన ఒక ట్వీట్లో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తేలితే అతనిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. VIDEO | Uttarakhand: Around eight people lost their lives after a tempo, they were travelling in, fell into a gorge on Rishikesh-Badrinath national highway. More details are awaited.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/DrcaPhTfBX— Press Trust of India (@PTI_News) June 15, 2024 -
ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. వెలగపూడి సచివాలయంలో సాయంత్రం సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు.అనంతరం మెగా డీఎస్సీ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు ఫైల్‌పై రెండో సంతకం, పింఛన్లు రూ.4 వేలకు పెంపు ఫైల్‌పై మూడో సంతకం చేశారు. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సస్‌పై ఐదో సంతకం చేశారు.కాగా, ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. సీఎంగా చంద్రబాబు.. మంత్రిగా పవన్ కల్యాణ్ ప్రమాణం చేశారు. వీరి ఇద్దరితో పాటు మరో 23 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. -
నేడు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
సాక్షి, అమరావతి/గన్నవరం: ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు గన్నవరం ఐటీ పార్కు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైంది. మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చేలా ప్రమాణ స్వీకార వేదికపైనే సంబంధిత ఫైలుపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుకు సంబంధించిన అంశంపైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. హాజరుకానున్న ప్రధాని, రాజకీయ ప్రముఖులుఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్‌షా, నడ్డా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులను తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు అతిథులుగా ఆహ్వానించగా చిరంజీవి కుటుంబంతో సహా ఇప్పటికే విజయవాడ వచ్చారు. ఐటీ పార్కు ప్రాంగణం సిద్ధం ప్రమాణ స్వీకారానికి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల ప్రాంగణాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ, మిగిలిన 11.5 ఎకరాల్లో నాయకులు, ప్రజల కోసం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, వెలుపల ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్ ప్రధాన గేటుకు సమీపంలోనే ఉన్న సభా వేదిక వద్దకు ప్రధాని, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునే సౌకర్యం కల్పించారు.వీఐపీల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. నాయకులు, కార్యకర్తల కోసం 36 గ్యాలరీలుగా విభజించారు. ఈ కార్యక్రమానికి వచ్చే బస్సులు, కార్లు, ఇతర వాహనాల కోసం గన్నవరం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు, పారిశుధ్యం వంటి పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం కోసం 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ సమన్వయాధికారి ప్రద్యుమ్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సమావేశం నిర్వహించారు.రద్దీగా మారిన గన్నవరం ఎయిర్పోర్టుప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది వీఐపీలు వస్తుండడంతో గన్నవరం ఎయిర్ పోర్టు రద్దీగా మారిపోయింది. ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల నుంచి పలు ప్రత్యేక విమానాల్లో అతిథులు రావడంతో గన్నవరం ఎయిర్‌పోర్టు సందడిగా మారింది. బుధవారం ఉదయం ఇంకా రద్దీగా మారే పరిస్థితి ఉండడంతో ఎయిర్‌పోర్టులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని, కానీ ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని సూచిస్తున్నారు.తిరుమల వెళ్లనున్న చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. -
ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ మాఝీ
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ అధిష్ఠానం.. మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభా పక్షం మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ఎన్నుకుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ మాఝీకి బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించింది. డిప్యూటీ సీఎంలుగా కనకవర్థన్ సింగ్ దేవ్, ప్రవతి పరిడా ఎన్నికయ్యారు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం తరఫున కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్‌లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు. -
ఒడిశా సీఎం ఎంపిక.. ఇద్దరు నేతలకు టాస్క్
న్యూఢిల్లీ: ఒడిశా సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఒడిశా బీజేపీ కీలక నేత మాజీ కేంద్ర మంత్రి నేత ధర్మేంద్ర ప్రదాన్‌కు మోదీ3.0 కేబినెట్లో మళ్లీ బెర్త్ దక్కింది. దీంతో సీఎం రేసు నుంచి ఆయన తప్పుకున్నట్లయింది. మిగిలిన సీనియర్ నేతలు పదవి కోసం పోటీ పడుతున్నారు.సీఎం ఎవరనేది తేల్చడానికి బీజేపీ హైకమాండ్ ఇద్దరు అగ్రనేతలను సోమవారం(జూన్10) పరిశీలకులుగా నియమించింది. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు భూపేందర్‌యాదవ్‌కు ఈ పని అప్పగించింది. 11న భువనేశ్వర్‌లో ఒడిషా బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. 12న కొత్త సీఎం ప్రమాణస్వీకారం చేయనున్నారని ఒడిషా బీజేపీ ఇంఛార్జ్ విజయ్‌పాల్‌సింగ్ తోమర్ తెలిపారు. సీఎం పదవి రేసులో బ్రజరాజ్‌నగర్ ఎమ్మెల్యే సురేష్ పూజారీ, బీజేపీ స్టేట్ చీఫ్ మన్మోహన్ సమాల్‌తో పాటు సీనియర్ నేతలు కేవీ సింగ్, మోహన్ మాజీలు ఇప్పటివరకు ముందున్నారు. కాగా, రాష్ట్రంలోని 21 ఎంపీ సీట్లలోనూ బీజేపీ 20 గెలుచుకుంది. వరుసగా 24 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బిజూజనతాదల్‌ను మట్టి కరిపించి బీజేపీ ఒడిశా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. -
9న చంద్రబాబు ప్రమాణస్వీకారం
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి సీఎం పీఠం ఎక్కనున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం సమీపంలో సభ ఏర్పాటుచేసి ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత ప్రమాణస్వీకారం, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.తన ప్రమాణస్వీకారానికి మోదీ, బీజేపీ పెద్దలు, ఎన్డీఏ ముఖ్యులను చంద్రబాబు ఆహ్వానిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీచేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాబు ప్రమాణస్వీకారోత్సవం సమయంలోనే జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్యనేతలు ఒకరిద్దరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. మలివిడతలో మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబును నియమించేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.ఈ మేరకు చంద్రబాబుతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు టీడీపీ వర్గాలు లీకులిచ్చాయి. బాబు ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవడం, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏలో ఆ పార్టీ కీలకంగా మారింది. దీంతో బాబును కన్వీనర్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫలితాలు వెల్లడైన తర్వాత చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌చేసి అభినందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు మంగళవారం జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు. -
ఓటు వేశాక పంజాబ్ సీఎం భార్య ఏమన్నారంటే..
లోక్‌సభ ఎన్నికల చివరి దశలో పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాలకు ఈరోజు(శనివారం) పోలింగ్ జరుగుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ తన భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో కలిసి సంగ్రూర్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో పంజాబ్ సీఎం భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ మాట్లాడుతూ సాధారణంగా మహిళల ఓటింగ్ ఎప్పుడూ తక్కువగానే ఉంటుంది. అయితే ఈసారి మహిళలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఈ విషయంలో కొత్త చరిత్ర సృష్టిస్తూ, నూతన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కోరారు.పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా మీడియాతో మాట్లాడారు. పంజాబ్ ప్రజలకు ఓటు హక్కుపై పూర్తి అవగాహన ఉందని, వారు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని భావిస్తున్నానని అన్నారు. పంజాబీలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చి, ఓటు హక్కు వినియోగించుకుని బాధల్లో, సంతోషాల్లో అండగా ఉండే మంచి ప్రతినిధులను ఎన్నుకోవాలని అన్నారు. అలాంటి వారు లోక్‌సభ మెట్లు ఎక్కినప్పుడే మంచి చట్టాలు కూడా వస్తాయన్నారు.పంజాబ్‌లోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గతంలో 70 నుంచి 80 శాతం ఓటింగ్ నమోదైందని, ఇప్పుడు కూడా ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. గడచిన 25 రోజుల్లో తాను 122 ర్యాలీలు నిర్వహించానని, ఏ సీటునూ తేలిగ్గా తీసుకోలేదని అన్నారు. తాను అందించిన కరెంటు, నీళ్లు, ఉద్యోగాలు లాంటి సంక్షేమ పథకాల పేరుతో ఓట్లు అడిగానన్నారు. తన మీద ఎన్నికల కమిషన్‌కు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదన్నారు. -
విదేశాల నుంచి ఆప్ ఎంపీ .. సీఎం కేజ్రీవాల్‌తో భేటీ
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఆయన గత కొన్ని నెలలుగా బ్రిటన్‌లో ఉన్నారు. అక్కడ ఆయనకు కంటి శస్త్రచికిత్స జరిగింది. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ సమయంలో రాఘవ్ చద్దా ఇక్కడ లేరు. రాఘవ్ చద్దా గైర్హాజరుపై ప్రతిపక్షాలు ఆమ్ ఆద్మీ పార్టీపై నిరంతరం విమర్శలు గుప్పిస్తున్నాయి.ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల్లో రాఘవ్ చద్దా ఒకరు. ఆయన బహిరంగ వేదికలపై పార్టీకి మద్దతుగా మాట్లాడేవారు. కొన్ని నెలల క్రితం ఆయన కంటి ఆపరేషన్ చేయించుకునేందుకు బ్రిటన్ వెళ్లారు. ఆ దరిమిలా ఆమ్ ఆద్మీ పార్టీ పలు సమస్యలను ఎదుర్కొంది. మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. దీనిపై పార్టీ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.ఆమ్ ఆద్మీ పార్టీలో గందరగోళం నెలకొన్న ప్రస్తుత తరుణంలో రాఘవ్ చద్దా విదేశాల నుంచి తిరిగి వచ్చారు. ఇటీవల రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ సీఎం పీఏ విభవ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతను తనను కొట్టారని, సీఎం సభలో దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు.కాగా స్వాతి ఇదంతా బీజేపీ డైరెక్షన్లో చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. స్వాతి మలివాల్ సీఎం సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారని, వారిని బెదిరించారని ఆప్ నేత అతిషి ఆరోపించారు. -
ఓటు వేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్‌లో లోక్‌సభ నాల్గవ దశ పోలింగ్ ఈరోజు(సోమవారం) జరుగుతోంది. ఈ దశలో రాష్ట్రంలోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 74 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఉజ్జయిలోని ఒక పోలింగ్ బూత్‌లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఓటు వేశారు. #WATCH | After casting his vote fro #LokSabhaElections2024 , Madhya Pradesh CM Mohan Yadav says "I am very happy that I could cast my vote. I want to appeal to the people of the state to come out and cast their votes. BJP is going to win with a huge majority and we are going to… pic.twitter.com/EqbNEgwkRu— ANI (@ANI) May 13, 2024 అనంతరం ఆయన మాట్లాడుతూ తాను తన ఓటు హక్కు వినియోగించుకున్నంటుకు చాలా సంతోషిస్తున్నానని, రాష్ట్రంలోని ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని, రాష్ట్రంలో బీజేపీ 29 సీట్లు గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వివిధ పోలింగ్ కేంద్రాల వద్దకు ఉదయం ఏడు గంటలకే ఓటర్లు తరలివచ్చారు. #WATCH | Indore, Madhya Pradesh: Free breakfast and ice cream are being distributed to early voters at the city's famous 56 Dukan restaurant. pic.twitter.com/KTos1zpi79— ANI (@ANI) May 13, 2024 -
ఢిల్లీలో పంజాబ్ సీఎం ఎన్నికల ప్రచారం!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు కొనసాగున్నాయి. వివిధ పార్టీలు మ్యానిఫెస్టోలు విడుదల చేసి, ప్రచారాలు ముమ్మరం చేశాయి. దేశరాజధాని ఢిల్లీలో జరిగే లోక్‌సభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరపున ప్రచారం చేయనున్నారు.సీఎం భగవంత్ మాన్ మే 11న తూర్పు ఢిల్లీ, దక్షిణ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఇందుకోసం సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఢిల్లీలో రోడ్ షో నిర్వహించారు. ఢిల్లీ సీఎం జైలుకు వెళ్లిన తర్వాత సునీతా కేజ్రీవాల్ రాజకీయాల్లో చురుకుగా మారారు.ఈసారి ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. ఆప్ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్ మూడు స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలకు మే 25న ఆరో దశలో ఓటింగ్ జరగనుండగా, జూన్ 4న ఫలితాలు రానున్నాయి. ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ను మే 21న ఈడీ అరెస్టు చేసింది. అప్పటి నుంచి కేజ్రీవాల్ తీహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. -
స్టార్ హీరో ఇంటికెళ్లిన సీఎం.. !
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కలిశారు. కాల్పుల ఘటనపై ఆయనను కలిసి ఆరా తీశారు. సల్మాన్ ఖాన్ ఇంటికెళ్లిన ముఖ్యమంత్రి భద్రతా గురించి అడిగి తెలుసుకున్నారు. ఫైరింగ్ ఘటనపై పోలీసుల తీసుకున్న చర్యలపై సల్మాన్‌తో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ఈనెల 14న కాల్పులు జరిపిన వారిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ముంబైలోని సల్మాన్ గెలాక్సీ అపార్ట్మెంట్స్ వద్ద ఇద్దరు దుండగులు ఆరు రౌండ్ల కాల్పులు జరిపి ఆపై మోటార్ సైకిల్ ద్వారా పారిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కాల్పుల ఘటనలో విక్కీ గుప్తా(24), సాగర్ పాల్ (21) నిందితులుగా గుర్తించిన ముంబై పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో వారిద్దరిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కాల్పులు జరిపింది తామేనని బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. #WATCH | Mumbai: Maharashtra CM Eknath Shinde arrived at the residence of actor Salman Khan. pic.twitter.com/ncJUz4n6C9 — ANI (@ANI) April 16, 2024 #WATCH | Mumbai | Maharashtra CM Eknath Shinde met actor Salman Khan at his residence. Inside visuals from the residence. (Source: Eknath Shinde office) pic.twitter.com/lbMmfCOBNm — ANI (@ANI) April 16, 2024 -
జేఎంఎంకు సీతా సోరెన్ రాజీనామా!
జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎమ్మెల్యే సీతా సోరెన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాజాగా ఓటుకు నోటు కేసులో సీతా సోరెన్ పేరు తెరపైకి వచ్చింది. సీతా సోరెన్ జేఎంఎం చీఫ్ శిబు సోరెన్‌కు పెద్ద కోడలు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు వదిన. ఆమె దుమ్కాలోని జామా అసెంబ్లీ స్థానం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో శిబు సోరెన్ పెద్ద కుమారుడు. నాటి జేఎంఎం ప్రధాన కార్యదర్శి దుర్గా సోరెన్ బొకారోలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. అప్పటికి అతని వయస్సు కేవలం 39 సంవత్సరాలు. దుర్గో సోరెన్ మృతికి అతని కిడ్నీ ఫెయిల్యూర్ కారణమని చెబుతుంటారు. సోదరుని మరణానంతరం పార్టీలో హేమంత్ సోరెన్ స్థాయి పెరిగింది. కాగా రాష్ట్రంలో జరిగే అక్రమ మైనింగ్, రవాణా సమస్యపై సీతా సోరెన్ తరచూ తన గొంతు వినిపించేవారు. ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో జన్మించిన సీతా సోరెన్ 12వ తరగతి వరకు చదువుకున్నారు. ఆమె తండ్రి పేరు బోడు నారాయణ్ మాంఝీ. తల్లి పేరు మాలతీ ముర్ము. అక్టోబర్ 2021లో ఆమె కుమార్తెలు రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తమ తండ్రి పేరిట పార్టీని స్థాపించారు. దీనికి దుర్గా సోరెన్ సేన అని పేరు పెట్టారు. రాష్ట్రంలోని అవినీతి, నిర్వాసిత, భూ దోపిడీ తదితర సమస్యలపై పోరాడటమే తమ లక్ష్యమని రాజశ్రీ సోరెన్, జయశ్రీ సోరెన్ తెలిపారు. రాజశ్రీ బిజినెస్ మేనేజ్మెంట్, జయశ్రీ లా కోర్సు చదువుకున్నారు. -
స్టైలిష్‌గా ఉన్న ఈయన ఓ రాష్ట్ర సీఎం.. ఎవరో తెలుసా?
ఇక్కడ స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈయన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె సంగ్మా (Meghalaya CM Conrad Sangma). మౌడియాంగ్డియాంగ్లో నిర్మాణమవుతున్న మేఘాలయ శాసనసభ నూతన భవనాన్ని ఆయన తాజాగా పరిశీలించారు. స్పీకర్ థామస్ సంగ్మా, డిప్యూటీ స్పీకర్ తిమోతీ డి షిరా, ఉప ముఖ్యమంత్రి ప్రిస్టోన్ టైన్సాంగ్ నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. మేఘాలయ శాసనసభ నూతన భవన నిర్మాణం ఆ రాష్ట్ర చరిత్రలో గొప్ప మైలురాయి. నిర్మాణం చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో శాసనసభ భవనం ప్రారంభోత్సవం కోసం మేఘాలయ పౌరులలో నిరీక్షణ పెరిగింది. ఈ మైలురాయి రాష్ట్ర అభివృద్ధి పథంలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. నిత్యం ప్రజా సమస్యలు, రాజకీయాలతో క్షణం తీరిక లేకుండా గడిపుతుంటారు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అయితే కొందరు సీఎంలు మాత్రం ఏదో ఒక వ్యాపకంతో ప్రత్యేకత చాటుతూ ఉంటారు. అలాంటి వారిలో మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా ఒకరు. ఐరన్ మైడెన్ పాటకు ఆయన ఎలక్ట్రిక్ గిటార్‌పై వాయిస్తున్న వీడియో కొన్ని నెలల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సంగీతం తనకు అంతులేని ఉత్సాహాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుందని సీఎం సంగ్మా చెబుతుంటారు. తాను ఎప్పుడూ సంగీతంలోనే ఉంటానని, అవకాశం దొరికినప్పుడల్లా ఎలక్ట్రిక్ గిటార్ ప్లే చేస్తానని చెప్పారు. క్యాబినెట్ సహచరులతో ఉన్నప్పుడు, ముఖ్యమైన సమావేశాలు, కార్యక్రమాల అనంతరం లైవ్ ప్రదర్శన ఇవ్వడానికి ఇష్టపడుతుంటానని తెలిపారు.