ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని తన నివాసంలో ఆ కార్మికుల కుటుంబాలతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అందరి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ కార్మికుల కుటుంబాలతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. డెహ్రాడూన్‌లోని సీఎం నివాసం వద్ద పటాకులు పేల్చారు. అనంతరం సీఎం ఆ కార్మికుల కుటుంబాలను సన్మానించారు. ఈ వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు.
దీపావళి రోజున జరిగిన ఈ ప్రమాదంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబాలవారు దీపావళి జరుపుకోలేదు. అందుకే డెహ్రాడూన్‌లోని సీఎం నివాసంలో వారంతా ఇప్పుడు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రెస్క్యూ తర్వాత చిన్యాలిసాన్ సీహెచ్‌సీలో చేరిన కార్మికులకు సీఎం ధామి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు.
ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లోనూ అయోధ్య.. ఇక్కడి రాజే రాముని అవతారం!
#WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami and family members of the 41 workers have dinner together at his residence in Dehradun during 'Igas Bagwal' celebrations. pic.twitter.com/MUzO60jlRG
— ANI (@ANI) November 29, 2023
Comments
Please login to add a commentAdd a comment