Pushkar Singh Dhami
-
ముఖ్యమంత్రులు రాజులేం కాదు: సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వాధినేతలైన ముఖ్యమంత్రులు తమను తాము పూర్వకాలంలో రాజులు మాదిరిగా భావించుకోవద్దని, మనం పెత్తందారీ వ్యవస్థలో లేమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.రాష్ట్ర అటవీ మంత్రి, కీలక అధికారుల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ ఏకపక్ష ధోరణితో ఒక ఐఎఫ్ఎస్ అధికారిని రాజాజీ టైగర్ రిజర్వు డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని సీఎంను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రనా ఏమైనా చేయగలరా? అని న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, పీకే మిశ్రా, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది.’ఈ దేశంలో జన విశ్వాస సిద్ధాంతం లాంటిది ఉంది. కార్యనిర్వాహక అధిపతులుగా ఉన్న సీఎం పాత రోజుల్లో రాజుల మాదిరిగా వ్యవహరించకూడదు. ఆ కాలంలోవారు ఏం చేప్తే అది చేసేశారు. కానీ మనం ఫ్యూడల్ యుగంలో లేము. కేవలం ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఏమైనా చేయగలరా? బాధ్యతలు అప్పగించిన ఐఎఫ్ఎస్ అధికారిపై శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉందని, అలాంటి అధికారిపై ముఖ్యమంత్రికి ఎందుకు అంత ప్రత్యేక ప్రేమ?ఆయన్ను నియమించొద్దంటూ ప్రత్యేక నోట్ ఉంది. దాన్ని డిప్యూటీ సెక్రటరీ నుంచి మంత్రి దాకా అంతా ఆమోదించారు. అయినా సీఎం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు’ అని ధర్మాసనం మండిపడింది. దీంతోసెప్టెంబర్ 3నే రాహుల్ నియామక ఉత్తర్వులను ఉపసంహరించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.రాహుల్ అనే ఐఎఫ్ఎస్ అధికారి కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు అధిపతిగా ఉండేవారు. అయితే, పులులు సంచరించే అడవిలో అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనుమతించారన్న ఆరోపణలతో రెండేండ్ల కిందట ఆయన్ని పదవీచ్యుతుణ్ని చేస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పుడు అదే రాహుల్‌ను రాజాజీ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్‌గా ధామీ నియమించారు. దీనిని సీనియర్ అధికారులు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. -
ప్రభుత్వాధినేతలు రాజుల్లా ఉండకూడదు
న్యూఢిల్లీ: ప్రభుత్వాధినేతల రాజుల్లా ప్రవర్తించకూడదని, మనం పెత్తందారీ వ్యవస్థలో లేమని సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేసింది. అటవీ మంత్రి, అధికారుల అభిప్రాయాలను బేఖాతరు చేస్తూ ఒక ఐఎఫ్ఎస్ అధికారిని రాజాజీ టైగర్ రిజర్వు డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీని నిలదీసింది. ‘‘ఆయన్ను నియమించొద్దంటూ ప్రత్యేక నోట్ ఉంది. దాన్ని డిప్యూటీ సెక్రటరీ నుంచి మంత్రి దాకా అంతా ఆమోదించారు. అయినా సీఎం ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారు?’’ అని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. ‘‘సీఎం అయినంత మాత్రాన ఏదైనా చేసేయగలరా? ఒక అధికారిపై ఎందుకంత మమకారం? ’’ అంటూ నిలదీసింది. రాహుల్‌పై శాఖాపరమైన విచారణ కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేసింది. రాహుల్ నియామక ఉత్తర్వులను ఈ నెల 3నే ఉపసంహరించుకున్నామని ఉత్తరాఖండ్ సర్కారు కోర్టుకు విన్నవించింది. -
అల్లం టీ పెట్టిన సీఎం.. మురిసిపోయిన జనం
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఏదో ఒక విషయమై తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. మరోవైపు సీఎం నిరాడంబరతను చాలామంది మెచ్చుకుంటుంటారు. ప్రస్తుతం ఆయన నైనిటాల్లో బస చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఒక పని ప్రజల దృష్టిని ఆకర్షించింది.ధామీ క్రమంతప్పక మార్నింగ్‌వాక్ చేస్తుంటారు. తాజాగా ఆయన మార్నింగ్ వాక్ సమయంలో రోడ్డు పక్కగా ఉన్న ఒక టీ దుకాణాన్ని గమనించారు. తరువాత అక్కడికి వెళ్లి, స్వయంగా అల్లాన్ని తరిగి టీ పెట్టారు. దీనిని గమనించిన అక్కడున్న వారంతా సీఎం చుట్టూ చేరారు. సీఎం వారిని కుశలప్రశ్నలు వేశారు. ఇంతటి సింప్లిసిటీ కలిగిన సీఎం దొరకడం తమకు లభించిన వరమని అంటూ అక్కడున్నవారంతా మురిసిపోయారు. అనంతరం సీఎం ఆ పక్కనే మైదానంలో ఆడుకుంటున్న క్రీడాకారులను పలుకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. -
తెరుచుకున్న కేదార్నాథ్ ఆలయ తలుపులు.. మోదీ పేరుమీద మొదటి పూజ
డెహ్రాడూన్: భారతదేశంలోని పవిత్ర పుణ్యక్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ ఆలయం తలుపులు ఈ రోజు ఓపెన్ చేశారు. ఆరు నెలల విరామం తరువాత ఆలయ తలుపులు తెరిచి పూజలు నిర్వహించారు. మొదటి పూజ ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద నిర్వహించినట్లు ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సమక్షంలో ఆలయ తలుపులు తెరిచి భక్తులందరికీ స్వాగతం పలికారు. చార్ధామ్ తీర్థయాత్రకు బయలుదేరే వారందరికీ సురక్షితమైన, సంతృప్తికరమైన ప్రయాణం కోసం ప్రార్థనలు చేశారు.దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భక్తులు, యాత్రికులు ఈ తీర్థ యాత్ర కోసం వేచి ఉంటారు. ఈ కారణంగానే చాలామంది భక్తులు పెద్ద ఎత్తున దర్శనం కోసం వచ్చారు. వారందరికీ నా శుభాకాంక్షలు సీఎం ధామి శుభాకాంక్షలు తెలిపారు.నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి బాబా కేదార్ ఆలయ పునరాభివృద్ధికి సంబంధించిన పనులు మూడు దశల్లో జరుగుతున్నాయి, ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడానికి తాము కృషి చేస్తున్నట్లు ధామి పేర్కొన్నారు. చలికాలంలో ఆరు నెలల విరామం తరువాత దైవ దర్శనానికి ఆలయ తలుపు తెలిచారు. అయితే బద్రీనాథ్ ఆలయ తలుపులు మే 12న ఓపెన్ చేస్తారు.#WATCH | Rudraprayag: After the opening of the doors of Shri Kedarnath Dham temple, Uttarakhand CM Pushkar Singh Dhami says, "Devotees and pilgrims keep waiting for this Yatra. That holy day arrived day and the doors opened. Devotees have arrived here in large numbers. All… pic.twitter.com/dC50GyXSTC— ANI (@ANI) May 10, 2024 -
ఉత్తరాఖండ్ అడవుల్లో కార్చిచ్చు.. రంగంలోకి దిగిన ఆర్మీ
ఉత్తరాఖండ్‌లోని అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు నైనిటాల్ నగరం వరకు విస్తరిస్తోంది. మంటల కారణం పొగ కమ్ముకుంటుంది. ప్రస్తుతం మంటలు నైనిటాల్ హైకోర్టు కాలనీవైపు విస్తరిస్తున్నాయి. దీంతో అప్రత్తమైన ఉత్తరఖండ్ ప్రభుత్వం మంటలు ఆర్పడానికి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాయం కోరింది. దీంతో మంటలు ఆర్పడానికి ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ రంగంలో దిగింది. ఆర్మీ అధికారులు హెలికాప్టర్ల సాయంతో చెలరేగతున్న మంటలపై నీటిని వెదజల్లుతూ ఆర్పుతున్నారు. నైనిటాల్ లేక్‌లో బోటింగ్ సేవలు నిలిపిస్తున్నట్లు అధికారాలు ప్రకటన విడుదల చేశారు.‘ఇప్పటివరకు హైకోర్టు కాలనీకి ఎటువంటి నష్టం వాటిల్లలేదు. కానీ మంటలు ప్రమాదకారంగా పలు భవనాలకు సమీపంగా చేరుకుంటుంది’ అని హైకోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రాటర్ తెలిపారు. నైనిటాల్ జిల్లాలోని లారియా కాంటా అడవుల్లో కూడా మంటలు వ్యాపించగా.. అక్కడి ఐటీఐ భవనం పాక్షికంగా దెబ్బతింది. అడవులకు నిప్పు పెట్టారన్న అనుమానాలు ఉన్న ముగ్గురు వ్యక్తులను రుద్రప్రయాగ్‌లో అరెస్ట్ చేసినట్లు ఫారెస్ట్ డివిజినల్ అఫీసర్ అభిమాన్యూ తెలిపారు.ఈ క్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి అడవుల్లో చెలరేగిన మంటలపై శనివారం సమీక్ష నిర్వహించారు. మంటలు ఆర్పడానికి చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. గడిచిన వారం రోజుల్లో అడవుల్లో కార్చిచ్చు ప్రమాదాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో సుమారు 31 కొత్త అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. -
ప్రధాని మోదీ లక్ష్యం అదే.. ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్: లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లకు పైగా గెలుపొందాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ దిశగానే అభ్యర్థులు కూడా అడుగులు వేస్తున్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 'పుష్కర్ సింగ్ ధామి' దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజలపైన విశ్వాసం ఉండటం వల్ల 400 సీట్లకు గెలుస్తామని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని పుష్కర్ సింగ్ అన్నారు. మీ కృషి, అంకితభావం బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మార్చాయని అన్నారు. 2014, 2019 కంటే ఈసారి బీజేపీని మరింత పెద్ద విజయాన్ని సాధించేలా ప్రతిజ్ఞ చేయాలని పార్టీ కార్యకర్తలను ఆయన కోరారు. ప్రధాని మోదీని మూడవసారి అధికారంలోకి తీసుకురావడానికి మన వంతు సహకారం అందించాలని, అందుకు రాష్ట్రంలోని ఐదు లోక్‌సభ స్థానాలను మరింత ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని ధామి అన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక సంచిక కూడా విడుదల చేశారు. उत्तराखण्ड फिर चुनेगा मोदी सरकार अबकी बार 400 पार.. बंडिया, खटीमा (ऊधम सिंह नगर) में भाजपा नौसर मण्डल द्वारा आयोजित 'जनमिलन कार्यक्रम' में सम्मिलित हुआ। इस अवसर पर बड़ी संख्या में मातृशक्ति, बुजुर्गों एवं युवाओं द्वारा मिले असीम प्रेम एवं अपार जनसमर्थन से अभिभूत हूँ। pic.twitter.com/cP06b2RzkB — Pushkar Singh Dhami (Modi Ka Parivar) (@pushkardhami) April 6, 2024 -
ఉత్తరాఖండ్ సీఎం హోలీ డ్యాన్స్ - వీడియో
దేశంలో హోలీ సంబరాలు మొదలైపోయాయి. సాధారణ ప్రజల మాదిరిగానే.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి 'పుష్కర్‌సింగ్ ధామి' కూడా తన కుటుంబ సభ్యులతో హోలీ జరుపుకున్నారు. తన తల్లి విష్ణదేవి, భార్య గీతా ధామితో కలిసి హోలీ పాటకు డ్యాన్స్ చేశారు. హోలీని ప్రేమ, సోదరభావం, సామరస్యానికి సంబంధించిన వేడుకగా సీఎం పుష్కర్‌సింగ్ ధామి అభివర్ణించారు. ఉత్తరాఖండ్‌లో హోలీకి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని ఆయన అన్నారు. సీఎం ధామి హోలీ జరుపుకున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి హోలీ రేపు (మార్చి 25) జరగాల్సి ఉండగా.. దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించారు. పండుగ ముందు హోలికా దహన్ పేరుతో భోగి మంటలను వెలిగించే ఆచారం ఉంటుంది. ఇది హోలికా అనే రాక్షసిని దహనం చేసే కార్యక్రమం. ఆనందోత్సాహాల మధ్య, సాంప్రదాయ స్వీట్లు పంచుకుంటారు, ప్రజలలో స్నేహం, ఐక్యత భావాన్ని ఈ పండుగల ద్వారా పెంపొందించుకుంటారు. #WATCH | Dehradun | On the occasion of Holi, Uttarakhand Chief Minister Pushkar Singh Dhami dances to a Holi song with his mother Vishna Devi, wife Geeta Dhami and others. pic.twitter.com/p8JeSNSm8A — ANI UP/Uttarakhand (@ANINewsUP) March 24, 2024 -
ఆ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం చరిత్రాత్మక నిర్ణయానికి వేదికైంది. స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. యూసీసీ బిల్లుకు ( UCC Bill Uttarakhand ) ఆ రాష్ట్ర అసెంబ్లీ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి సమక్షంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలంతా స్వీట్లు పంచుకుని సంబురాలు చేసుకున్నారు. తీవ్ర చర్చనీయాంశంగా మారిన.. ఉమ్మడి పౌరస్మృతి చట్టాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఇక నుంచి ఆ రాష్ట్రంలో మతాలకు అతీతంగా పౌరులందరికీ ఒకే తరహా వివాహ, విడాకుల, భూమి, ఆస్తి, వారసత్వ చట్టాలు వర్తిస్తాయి. సహ జీవనంలో పుట్టిన పిల్లలకు కూడా చట్టపరమైన గుర్తింపును కల్పించడం... సహ జీవనాన్ని రిజిస్టర్ చేసుకోకపోతే 6 నెలల జైలు శిక్ష వంటి అంశాలను ఈ బిల్లులో పొందుపరిచారు. అలాగే.. షెడ్యూల్డ్ తెగలను బిల్లు పరిధి నుంచి తప్పించారు. #WATCH | Dehradun: Uttarakhand Assembly MLAs celebrate and share sweets as the Uniform Civil Code 2024 Bill, introduced by Chief Minister Pushkar Singh Dhami-led state government was passed in the House today. pic.twitter.com/eDq6cZbf4H — ANI (@ANI) February 7, 2024 ఇదిలా ఉంటే.. యూసీసీ బిల్లు రూపకల్పనలో అక్కడి బీజేపీ ప్రభుత్వం రాజకీయ విమర్శలు ఎదుర్కొంది. విపక్షాల ఆందోళనల నడుమే మంగళవారం ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామి దీన్ని ప్రవేశపెట్టారు. ఆపై గందరగోళ పరిస్థితుల నడుమ సభ వాయిదా పడగా.. చివరకు చర్చ జరిపిన అనంతరం ఓటింగ్ నిర్వహించగా.. ఆమోదం లభించింది. స్వాతంత్య్రానంతరం దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. దేశంలో.. గోవాలో పోర్చుగీసు పాలన నుంచి ఉమ్మడి పౌరస్మృతి ఉంది. #WATCH | Dehradun: In the Uttarakhand Assembly, CM Pushkar Singh Dhami speaks on UCC, "... After the independence, the makers of the Constitution gave the right under Article 44 that the states can also introduce the UCC at appropriate time... People have doubts regarding this.… pic.twitter.com/KDfLUdtBbG — ANI (@ANI) February 7, 2024 రెండేళ్ల కసరత్తు తర్వాత.. ఇదిలా ఉంటే.. యూసీసీని ఉత్తరాఖండ్ బీజేపీ 2022 ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో చేర్చింది. అధికారంలోకి రాగానే.. సీఎం పుష్కర్‌సింగ్ ధామి ఇందుకోసం ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రెండేళ్ల పాటు సుదీర్ఘ కసరత్తులు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 70కి పైగా సమావేశాలు నిర్వహించి 60వేల మందితో మాట్లాడింది. ఆన్లైన్లో వచ్చిన 2.33లక్షల సలహాలు, సూచనలను పరిశీలించింది. అనంతరం ముసాయిదాను రూపొందించి ఇటీవల సీఎంకు సమర్పించింది. -
Uttarakhand Ucc Bill: యూసీసీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అక్కడి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) పూర్తిగా హిందూ కోడ్ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. ఈ విషయమై బుధవారం ఢిల్లీలో ఆయన స్పందించారు. హిందువుల కోడ్ అయిన యూసీసీని ముస్లింలతో పాటు ఇతర మతాల వాళ్లకు వర్తింపజేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. కోడ్‌లో హిందూ అవిభక్త ఫ్యామిలీ(హెచ్‌యూఎఫ్)ను ఎందుకు ముట్టుకోలేదని ప్రశ్నించారు. ఇతర మతాల వాళ్ల సంప్రదాయాలను ముస్లింలు ఆచరించాలని చట్టంలో పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు తమ మతాచారాలను ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నప్పుడు గిరిజనులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నపుడు అక్కడి సీఎం పుష్కర్ సింగ్ యూసీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి సమస్యను పక్కదారి పట్టించడంపై ఒవైసీ విమర్శలు గుప్పించారు. వదరలు వచ్చి రాష్ట్ర ప్రజలు చాలా సమస్యల్లో ఉంటే పుష్కర్ సింగ్‌కు యూసీసీ ఎందుకు ప్రాధాన్యత కలిగిన అంశంగా కనిపిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్‌లో ఈడీ రెయిడ్స్.. ఆ పార్టీ నేతే టార్గెట్ -
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో యూసీసీ బిల్లు
డెహ్రాడూన్: అత్యంత కీలకమైన ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంలో బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. యూసీసీ బిల్లును సీఎం పుష్కర్‌సింగ్ ధామీ మంగళవారం అసెంబ్లీ ప్రవేశపెట్టారు. అధికార బీజేపీ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేయగా విపక్ష సభ్యులు వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఉమ్మడి పౌరస్మృతి బిల్లుపై మంగళవారమే చర్చ, ఓటింగ్ జరగాల్సి ఉండగా, విపక్షాల నిరసనల వల్ల అది సాధ్యం కాలేదు. చర్చ జరగకుండానే బిల్లును ఆమోదించుకోవడానికి ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్ష ఎమ్మెల్యే యశ్పాల్ ఆర్య మండిపడ్డారు. యూసీసీ బిల్లుపై ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఒకటి రెండు రోజుల్లో చర్చ, అనంతరం ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. సభలో ప్రభుత్వానికి తగిన సంఖ్యాబలం ఉండడంతో బిల్లు ఆమోదం పొందడం, గవర్నర్ సంతకంతో చట్టంగా మారడం లాంఛనమేనని చెప్పొచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ చరిత్ర సృష్టించింది. ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ ఉమ్మడి పౌరస్మృతి బిల్లును తీసుకొచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు దేశంలో ప్రస్తుతం గోవాలో మాత్రమే ఉమ్మడి పౌరస్మృతి చట్టం అమలవుతోంది. అక్కడ పోర్చుగీసు పాలనా కాలంలోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఉమ్మడి పౌరస్మృతి బిల్లులో ఏముంది? ► ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్న ప్రజలతోపాటు ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న ఉత్తరాఖండ్ పౌరులకు ఈ బిల్లు వర్తిస్తుంది. ► గిరిజన వర్గాల ప్రజలను బిల్లు నుంచి మినహాయించారు. ► భారత రాజ్యాంగంలోని పార్ట్–21 కింద తమ హక్కుల రక్షణ పొందుతున్న వ్యక్తులకు, సమూహాలకు కూడా మినహాయింపు ఉంటుంది. ► సహజీవనాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ► సహజీవనం ద్వారా జన్మించిన పిల్లలకు చట్టబద్ధంగా గుర్తింపు లభిస్తుంది. ► వివాహం, విడాకులు, భూమి, ఆస్తి, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో మతాలకు అతీతంగా ప్రజలందరికీ ఒకే చట్టం అమలు చేస్తారు. ► మతాలతో సంబంధం లేకుండా బహుభార్యత్వంపై నిషేధం అమలవుతుంది. ఒక్కరు ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ► ఎవరి మతాచారం ప్రకారం వారు వివాహం చేసుకోవచ్చు. ► సహజీవనం చేసే స్త్రీపురుషుల వయసులు వరుసగా 18, 21 ఏళ్లకు పైబడి ఉండాలి. ► సహజీవనం ప్రారంభించిన తర్వాత నెల రోజులలోపు ప్రభుత్వ రిజి్రస్టార్‌కు సమాచారం ఇవ్వాలి. రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. లేకపోతే వారికి ఆరు నెలల దాకా జైలుశిక్ష లేదా రూ.25 వేల జరిమానా లేదా ఈ రెండు శిక్షలూ విధిస్తారు. ► సహజీవనంపై రిజిస్ట్రార్‌కు తప్పుడు సమాచారం ఇస్తే భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ► సహజీవనం సాగిస్తున్న మహిళను పురుషుడు వదిలేస్తే బాధితురాలు కోర్టును ఆశ్రయించవచ్చు. అతడి నుంచి జీవనభృతి పొందవచ్చు. ► పెళ్లి కాని జంటల మధ్య సహజీవనాన్ని అరికట్టేలా బిల్లులో పలు కీలకాంశాలు జోడించారు. -
ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వం రద్దు!
డెహ్రాడూన్: బీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో బహుభార్యత్వంపై నిషేధంతో పాటు సహజీవనాన్ని ధ్రువీకరిస్తూ డిక్లరేషన్‌నూ తప్పనిసరి చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలుకు సంబంధించిన ముసాయిదాను జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్ కమిటీ శుక్రవారం సీఎం పుష్కర్ సింగ్ ధామికి సమరి్పంచింది. అందులో కీలక ప్రతిపాదనలు చేసింది. ‘‘రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లినీ విధిగా రిజిస్ట్రర్ చేయించాల్సిందే. విడాకులు కోరే హక్కులు భార్యభర్తలకు సమానంగా ఉంటాయి. భార్య జీవించి ఉండగా భర్త మరో పెళ్లి చేసుకోవడం చట్టప్రకారం నేరం. బహు భార్యత్వంపై నిషేధం అమలు చేయాలి. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకూ వారసత్వ హక్కులుంటాయి. సహజీవనం చేస్తుంటే దానిని అధికారికంగా ధ్రువీకరిస్తూ స్త్రీ, పురుషులిద్దరూ డిక్లరేషన్‌ను సమరి్పంచాలి’’ అని పేర్కొంది. ఈ నిబంధనల నుంచి షెడ్యూల్ తెగలకు మినహాయింపు ఇవ్వనున్నారు. యూసీసీ ముసాయిదా రూపకల్పన కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం 202లో ఈ కమిటీని వేసింది. 2022 అసెంబ్లీ ఎన్నికల హామీ అమలు దిశగా ఇదో కీలక అడుగని ధామీ అభివరి్ణంచారు. ముసాయిదాను క్షుణ్నంగా పరిశీలించాక అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. ఫిబ్రవరి 5 నుంచి 8వ తేదీ వరకు జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో యూసీసీ బిల్లును తెచ్చి ఆమోదించి చట్టం చేస్తామన్నారు. యూసీసీ అమలైతే వివాహం, విడాకులు, ఆస్తి, వారసత్వం వంటి అంశాల్లో పౌరులందరికీ మతంతో సంబంధం లేకుండా సమాన చట్టాలు అమలవుతాయి. మేమూ అదే బాటలో: అసోం సీఎం బహుభార్యత్వం విధానాన్ని రద్దుచేయనున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి çహిమంత బిశ్వ శర్మ కూడా ప్రకటించారు. ‘‘అసోంలో యూసీసీ అమలుపై గతేడాదే మాకు నివేదిక అందింది. దానిని న్యాయశాఖ పరిశీలిస్తోంది. కుదిరితే ఫిబ్రవరి ఐదున మొదలయ్యే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లుగా ప్రవేశపెట్టి చట్టంగా తెస్తాం’’ అని హిమంత అన్నారు. -
ప్రాణాలకు తెగించి పనిచేశాం.. కానీ!’ ర్యాట్ హోల్ మైనర్ల ఆవేదన
ర్యాట్ హోల్ మైనర్స్.. ఉత్తరాఖండ్ టన్నెల్ ప్రమాదానికి ముందు ఈ పేరును ఎవరూ ఎక్కువగా విని ఉండరు. కానీ టన్నెల్లో ఇరుకున్న కార్మికులను రక్షించడంలో వీరు చేసిన కృషి తర్వాత అందరికీ సుపరిచితులుగా మారారు. కార్మికులను విజయవంతంగా బయటకు తీసుకురావడంలో ర్యాట్ హోల్ మైనర్లది కీలక పాత్ర. ఈ క్రమంలోనే వీరి సేవలకు ప్రతిఫలంగా ముఖ్యమంత్రి ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ గురువారం 12 మంది ర్యాట్ హోల్ మైనర్లను ఒక్కొక్కరికి రూ. 50,000 చెక్కులతో సత్కరించారు. అయితే ర్యాట్ హోల్ మైనర్స్.. తాజాగా తమ నిరాశను వ్యక్తం చేశారు. సీఎం తమకు ఇచ్చిన రూ. 50 వేల చెక్కులను క్యాష్‌గా మార్చుకోవడానికి నిరాకరించారు. కార్మికులను రక్షించడంలో తాము పడ్డ కష్టానికి ప్రభుత్వ సాయానికి ఏ మాత్రం పొంతన లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బుల విషయంలో తాము నిరాశ చెందినట్లు తెలిపారు. ఆ చెక్కులను తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు. యంత్రాలు కూడా చేయని పనిని తాము పూర్తి చేశామని.. ఎటువంటి షరతులు పెట్టకుండా మా ప్రాణాలను పణంగా పెట్టి శిథిలాలను మాన్యువల్‌గా డ్రిల్ చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన పనిని అభినందిస్తున్నాము కానీ మాకు అందించిన మొత్తంతో సంతృప్తి చెందలేదని ర్యాట్ హోల్ మైనర్ల బృందానికి నాయకత్వం వహించిన వకీల్ హసన్ చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ర్యాట్ హోల్ మైనర్ల పాత్ర వీరోచితమైనదని, కానీ వారు ప్రభుత్వం నుంచి పొందిన డబ్బు సరిపోదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సన్మానించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు.. తమకు అందించిన చెక్కులను క్యాష్ చేయకూడదని సమిష్టిగా నిర్ణయించుకున్నారని ఆయన చెప్పారు. ‘చెక్కులు అందజేసిన రోజే ముఖ్యమంత్రికి మా అసంతృప్తిని తెలియజేశాను. మా విషయంపై రెండురోజుల్లో ప్రకటన చేస్తానని అధికారులు హామీ ఇవ్వడంతో తిరిగివచ్చాం. ఆ హామీ నిలబెట్టుకోకుంటే.. చెక్కులను తిరిగి ఇస్తాం. ఆపరేషన్‌లో సహకరించిన మైనర్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాశ్వత ఉద్యోగాలు తాము ఆశిస్తున్నాం’ అని చెప్పారు. కాగా ఉత్తరకాశీలో నిర్మాణంలో ఉన్న సిల్క్యారా టన్నెల్లో పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తూ కొంతభాగం కూలిపోయి నవంబర్ 12వ తేదీన 41 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి వాళ్లను బయటకు తెచ్చేందుకు సహాయక బలగాలు నిర్విరామంగా కృషి చేశాయి. కార్మికులను కాపాడేందుకు రకరకాల ప్రయాత్నాలు చేసినా.. విదేశాల మిషన్లతో ప్రయత్నించినా సాధ్యపడలేదు. చివరికి ర్యాట్ హోల్ మైనర్స్ రంగంలోకి దిగి వారిని రక్షించారు. -
కార్మికులతో ఉత్తరాఖండ్ సీఎం విందు
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలోని నిర్మాణంలో ఉన్న సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా బయటకు రావడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఈ నేపధ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి డెహ్రాడూన్‌లోని తన నివాసంలో ఆ కార్మికుల కుటుంబాలతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరి ముఖాల్లో ఆనందం స్పష్టంగా కనిపించింది. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఆ కార్మికుల కుటుంబాలతో కలిసి డ్యాన్స్ కూడా చేశారు. డెహ్రాడూన్‌లోని సీఎం నివాసం వద్ద పటాకులు పేల్చారు. అనంతరం సీఎం ఆ కార్మికుల కుటుంబాలను సన్మానించారు. ఈ వేడుకలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మహేంద్ర భట్‌తో పాటు పలువురు బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారు. దీపావళి రోజున జరిగిన ఈ ప్రమాదంలో 41 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబాలవారు దీపావళి జరుపుకోలేదు. అందుకే డెహ్రాడూన్‌లోని సీఎం నివాసంలో వారంతా ఇప్పుడు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. రెస్క్యూ తర్వాత చిన్యాలిసాన్ సీహెచ్‌సీలో చేరిన కార్మికులకు సీఎం ధామి లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందించారు. ఇది కూడా చదవండి: థాయ్‌లాండ్‌లోనూ అయోధ్య.. ఇక్కడి రాజే రాముని అవతారం! #WATCH | Uttarakhand CM Pushkar Singh Dhami and family members of the 41 workers have dinner together at his residence in Dehradun during 'Igas Bagwal' celebrations. pic.twitter.com/MUzO60jlRG — ANI (@ANI) November 29, 2023 -
వాళ్లు సొరంగాన్ని జయించారు!.. ఎప్పుడేం జరిగింది?
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా మతాలకు అతీతంగా కోట్లాది మంది చేసిన ప్రార్థనలు ఫలించాయి. 17 రోజుల సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది. ఉత్కంఠకు తెరపడింది. ప్రమాదవశాత్తూ సొరంగంలో చిక్కుకొని ఆశ నిరాశల మధ్య క్షణమొక యుగంలా బిక్కుబిక్కుమంటూ గడిపిన 41 మంది కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. 60 మీటర్ల పొడవైన ఎస్కేప్ రూట్లో ఏర్పాటు చేసిన స్టీల్ పైపు గుండా కార్మికులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. గుహ లాంటి సొరంగం నుంచి బయటకు వచ్చిన కార్మికులు బాహ్య ప్రపంచాన్ని కళ్లారా తిలకించి, గుండెనిండా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఉత్తరాఖండ్‌లో సిల్క్యారా సొరంగంలో సహాయక చర్యలు మంగళవారం పూర్తయ్యాయి. ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు సొరంగం లోపల మిగిలిన 12 మీటర్ల మేర శిథిలాల డ్రిల్లింగ్ పనులు పూర్తిచేశారు. వెంటనే భారీ స్టీల్ పైపును ఏర్పాటు చేసి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కార్మికుల వద్దకు చేరుకున్నారు. ఒక్కొక్కరిని స్ట్రెచ్చర్లపై బయటకు చేర్చారు. స్టీల్ పైపు నుంచి బయటకు రాగానే కార్మికులకు వైద్య సిబ్బంది కొన్ని పరీక్షలు చేశారు. వారందరి ఆరోగ్యం మెరుగ్గానే ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీ చెప్పారు. అయినప్పటికీ వారిని ఇళ్లకు పంపించడానికి ముందు కొన్నిరోజులపాటు వైద్యుల పరిశీలనలో ఉంచాలని నిర్ణయించామని తెలిపారు. 41 మంది కార్మికులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించారు. సహాయక ఆపరేషన్‌లో పాల్గొన్నవారికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మద్దతు లేకుంటే ఈ ఆపరేషన్ ఇంత త్వరగా విజయవంతమయ్యేది కాదని పుష్కర్‌సింగ్ ధామీ అన్నారు. ఘటనా స్థలంలో ఉద్వి గ్న వాతావరణం సొరంగం ముఖద్వారం వద్ద మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కార్మికులకు కేంద్ర మంత్రి వి.కె.సింగ్, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కొందరు కార్మికులతో ఫోన్లో మాట్లాడారు. ఘటనా స్థలంలో ఉద్వి గ్న వాతావరణం నెలకొంది. హర హర మహాదేవ, భారత్ మాతాకీ జై అనే నినాదాలు మిన్నంటాయి. సొరంగం బయట ఉన్నవారంతా పరస్పరం ఆలింగనాలతో ఆనందం పంచుకున్నారు. కార్మికుల కుటుంబ సభ్యులు సైతం అభినందనలు తెలుపుకున్నారు. సహాయక సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. భగవంతుడు తమ మొర ఆలకించాడని చెమర్చే కళ్లతో వారు చెప్పారు. అధికారులు అప్పటికే సిద్ధంగా ఉంచిన అంబులెన్స్‌ల్లో కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఆసుపత్రిలో కార్మికుల కోసం ఇంతకుముందే 41 పడకలతో ప్రత్యేక వార్డు సిద్ధం చేశారు. ఈ నెల 12వ తేదీన కార్మికులు సిల్ క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై, కార్మికులు క్షేమంగా బయటకు రావడం పట్ల దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు. సహాయక సిబ్బందిని అభినందిస్తూ సోషల్ మీడియాలోనూ నెటిజన్లు పోస్టులు పెట్టారు. చదవండి: ఆ నలుగురు.. సొరంగం రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పాత్ర వీరిదే.. ‘ర్యాట్–హోల్’పై నిషేధం.. అదే ప్రాణాలు కాపాడింది ఎలుకలాగా కలుగును తవ్వేసే ర్యాట్–హోల్ మైనింగ్ అనేది నిజానికి చట్టవిరుద్ధమే. కానీ, సిల్క్యారా టన్నెల్లో ఇదే ప్రక్రియ 41 మంది కార్మికుల ప్రాణాలు కాపాడిందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్(రిటైర్డ్) సయ్యద్ అతా హస్నెయిన్ మంగళవారం వెల్లడించారు. ఈ సొరంగంలో ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులు 12 మీటర్ల శిథిలాలను 24 గంటల వ్యవధిలో తవ్వేశారని చెప్పారు. వారి కృషి వల్లే కార్మికులు త్వరగా బయటకు వచ్చారని ప్రశంసించారు. బొగ్గు గనుల్లో 3 నుంచి 4 అడుగుల ఎత్తయిన సొరంగాలను అడ్డంగా తవ్వడానికి ర్యాట్–హోల్ మైనింగ్ టెక్నాలజీ వాడుతుంటారు. కేవలం ఒక్క మనిషి పట్టేందుకు వీలుగా ఈ సొరంగాలు ఉంటాయి. మేఘాలయ బొగ్గు గనుల్లో ఈ సాంకేతికతను వాడడాన్ని 2014లో జాతీయ హరిత ట్రిబ్యునల్ నిషేధించింది. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో ర్యాట్–హోల్ మైనింగ్‌పై నిషేధం అమలవుతోంది. కానీ, ఇతర నిర్మాణ పనుల్లో అనధికారికంగా ఉపయోగిస్తూనే ఉన్నారు. సిల్క్యారా సొరంగంలో మట్టి శిథిలాలను తవ్వడానికి 12 మంది ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. ఎప్పుడేం జరిగింది? నవంబర్ 12 దీపావళి పండుగ రోజే ఉదయం 5.30 గంటలకు సిల్క్యారా–దందల్‌గావ్ మధ్య నిర్మాణంలో ఉన్న సొరంగం కూలిపోయింది. 41 మంది కార్మికులు అందులో చిక్కుకుపోయారు. అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. సొరంగంలోకి ఎయిర్–కంప్రెస్డ్ పైపుల ద్వారా ఆక్సిజన్, విద్యుత్, ఆహార పదార్థాలు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బీఆర్ఓ, ఎన్హెచ్ఐడీసీఎల్, ఐటీబీపీ తదితర సంస్థలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. నవంబర్ 13 సొరంగంలో ఉన్న కార్మికులతో మాట్లాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆక్సిజన్ కోసం ఉద్దేశించిన పైపుల గుండా అధికారులు మాట్లాడారు. క్షేమంగా ఉన్నామని కార్మికులు బదులిచ్చారు. అదేరోజు సొరంగం పైభాగం నుంచి మట్టి కూలింది. టన్నెల్ లోపల 60 మీటర్ల మేర మట్టి విస్తరించింది. నవంబర్ 14 దాదాపు 900 మిల్లీమీటర్ల వ్యాసార్ధం ఉన్న స్టీల్ పైపులను సొరంగం వద్దకు చేర్చారు. మట్టి శిథిలాల గుండా సొరంగంలోకి ఈ పైపులను పంపించాలని నిర్ణయించారు. సొరంగంలో పైభాగం నుంచి మరింత మట్టి కూలడం ఆందోళన కలిగించింది. ఇద్దరు కార్మికులు స్వల్పంగా గాయపడ్డారు. నవంబర్ 15 కార్మికులను బయటకు తీసుకురావడానికి డ్రిల్లింగ్ యంత్రంతో తవ్వకం పనులు చేపట్టారు. అవి సవ్యంగా సాగకపోవడంతో అత్యాధునిక అగర్ మెషీన్‌ను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. ఢిల్లీ నుంచి విమానంలో తీసుకొచ్చారు. నవంబర్ 16 అగర్ మెషీన్‌తో డ్రిల్లింగ్ పనులు ప్రారంభించారు. నవంబర్ 17 సొరంగంలో 57 మీటర్ల మేర మట్టి శిథిలాలు ఉండగా, 24 మీటర్ల మేర తవ్వకాలు జరిపారు. నాలుగు ఎంఎస్ పైపులను శిథిలాల గుండా పంపించారు. ఐదో పైపునకు అవరోధాలు ఎదురుకావడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. మరో అగర్ మెషీన్‌తో పనులు ప్రారంభించారు. ఐదో పైపును అమర్చే క్రమంలో సొరంగంలో భారీగా పగుళ్ల శబ్ధాలు వినిపించాయి. సొరంగం మొత్తం కుప్పకూలే అవకాశం ఉండడంతో ఆ పనులు వెంటనే నిలిపివేశారు. నవంబర్ 18 1,750 హార్స్పవర్ కలిగిన అమెరికన్ అగర్ మెషీన్ వల్ల టన్నెల్ లోపల ప్రకంపనలు పుట్టుకొస్తున్నట్లు గుర్తించారు. ప్రత్యామ్నాయం కోసం అన్వేíÙంచారు. సహాయక చర్యల్లో ఆలస్యం జరుగుతుండడంతో ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఐదు రకాల మార్గాలపై దృష్టి పెట్టారు. టన్నెల్ ఉపరితలం నుంచి లోపలికి నిలువుగా డ్రిల్లింగ్ చేయాలని నిర్ణయించారు. నవంబర్ 19 ఘటనా స్థలంలో సహాయక చర్యలను కేంద్ర మంతి నితిన్ గడ్కరీ స్వయంగా సమీక్షించారు. నిలువుగా కాకుండా అగర్ మెషీన్‌తో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తే బాగుంటుందని సూచించారు. నవంబర్ 20 సహాయక చర్యలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టన్నెల్లో అడ్డంగా డ్రిల్లింగ్ చేస్తుండగా, అగర్ మెషీన్‌కు పెద్ద రాయి అడ్డుపడింది. పనులు నిలిచిపోయాయి. నవంబర్ 21 సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల మొదటి వీడియోను అధికారులు విడుదల చేశారు. ఆహారం తీసుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ కార్మికులు కనిపించారు. తమ కుటుంబ సభ్యులతోనూ వారు మాట్లాడారు. సిల్కియారా వైపు నుంచి అగర్ యంత్రంలో అడ్డంగా డ్రిల్లింగ్ పనులను అధికారులు పునఃప్రారంభించారు. నవంబర్ 22 800 వ్యాసార్ధం కలిగిన స్టీల్ పైపులను శిథిలాల గుండా 45 మీటర్ల వరకు పంపించారు. మరో 12 మీటర్లే మిగిలి ఉంది. ఇంతలో మరో అవాంతరం వచ్చిపడింది. అగర్ మెషీన్‌కు కొన్ని ఇనుప కడ్డీలు అడ్డం వచ్చాయి. నవంబర్ 23 అడ్డంగా ఉన్న ఐరన్ రాడ్లను తొలగించారు. శిథిలాల్లో అడ్డంగా 48 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయ్యింది. ఇక్కడ మరో ఉపద్రవం తప్పలేదు. అగర్ మెషీన్‌ను ఏర్పాటు చేసిన వేదికకు పగుళ్లు వచ్చాయి. నవంబర్ 24 పగుళ్లను సరిచేసి, డ్రిల్లింగ్ మళ్లీ ప్రారంభించారు. ఈసారి మెటల్ గిర్డర్ అడ్డుపడింది. దాన్ని తొలగించారు. నవంబర్ 25 అగర్ మెషీన్ బ్లేడ్లు శిథిలాల్లో ఇరుక్కున్నాయి. దీంతో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి కావడానికి మరికొన్ని వారాలు పడుతుందని భావించారు. మరో 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ మిగిలి ఉంది. కానీ, ఆ పనులు ఆపేయాలని నిర్ణయించారు. నవంబర్ 26 కార్మికులను క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రత్యామ్నాయ మార్గం కోసం 19.2 మీటర్ల మేర నిలువుగా డ్రిల్లింగ్ పూర్తిచేశారు. 700 మిల్లీమీటర్ల వ్యాసార్ధం కలిగిన పైపులు పంపించే పనులు ప్రారంభించారు. నవంబర్ 27 12 మీటర్ల మేర డ్రిల్లింగ్ కోసం ర్యాట్–హోల్ మైనింగ్ నిపుణులను రప్పించారు. అదే సమయంలో టన్నెల్ పై భాగం నుంచి నిలువుగా డ్రిల్లింగ్ 36 మీటర్ల మేర పూర్తయ్యింది. నవంబర్ 28 సాయంత్రం 7 గంటలకల్లా డ్రిల్లింగ్ ఆపరేషన్ మొత్తం పూర్తయ్యింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది స్టీల్ పైపు గుండా కార్మికుల వద్దకు చేరుకున్నారు. వీల్డ్–్రస్టెచ్చర్లపై ఒక్కొక్కరిని భద్రంగా బయటకు తీసుకొచ్చారు. -
ఆయన సపోర్టు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు : ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ విజయం సాధించింది. 41 మంది కార్మికులను సురక్షితంగా సొరంగంనుంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. 17 రోజులు సుదీర్ఘ నిరీక్షణ తరువాత వారంతా ఈసంక్షోభం నుంచి బైటపడటంతో కార్మికుల కుటుంబాలు, రెస్క్యూ సిబ్బందితోపాటు, దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి మోదీ నిరంతరం తనతో టచ్‌లో ఉంటూ, రెస్క్యూ ఆప్‌కు సంబంధించిన అప్డేట్లు తెలుసుకున్నారనీ పలు సలహాలిచ్చారని సీఎం వెల్లడించారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) ఎలాగైనా అందరినీ క్షేమంగా రక్షించడమే కర్త్యవ్యంగా పెట్టుకున్నాననీ, ఈ విషయంలో ప్రధాని సపోర్టు లేకుంటేఇది సాధ్యమయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కార్మికులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించి, క్షేమంగా ఇళ్లకు చేరేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని మోదీ తనను ఆదేశించారని వెల్లడించారు. కాగా ఈ విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిమోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని ప్రకటించారు. (ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర) (అద్భుతం..ఉద్వేగమైన క్షణాలివి: ఆనందోత్సాహాల వెల్లువ) #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami says, " I want to thank all the members who were part of this rescue operation...PM Modi was constantly in touch with me and was taking updates of the rescue op. He gave me the duty to rescue everyone safely… pic.twitter.com/TldZLK6QEB — ANI (@ANI) November 28, 2023 -
UCC CODE: ఉత్తరాఖండ్‌లో ఉమ్మడి పౌర స్మృతి!
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చల్లో నిలుస్తూ వస్తున్న ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్–యూసీసీ)ని హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్ త్వరలో అమలు చేయనున్నట్టు సమాచారం. వచ్చే వారమే ఈ దిశగా చర్యలు చేపట్టబోతోందని తెలుస్తోంది. తద్వారా దేశంలో యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా అది నిలవనుంది. యూసీసీపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ సారథ్యంలో ఏర్పాటైన కమిటీ ఒకట్రెండు రోజుల్లో సీఎం పుష్కర్‌సింగ్ ధామికి నివేదిక సమరి్పంచనుంది. దీపావళి అనంతరం రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై యూసీసీ బిల్లును ఆమోదించనుంది. తద్వారా దానికి చట్టబద్ధత కలి్పంచనుంది. ఎన్నికల వాగ్దానం: ఉత్తరాఖండ్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఎన్నికల వాగ్దానాల్లో యూసీసీ అమలు ప్రధానమైనది. ఆ మేరకు జస్టిస్ దేశాయ్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేస్తూ తొలి కేబినెట్ భేటీలోనే సీఎం ధామీ నిర్ణయం తీసుకున్నారు. డ్రాఫ్ట్ తయారీ కోసం రాష్ట్రంలో దాదాపు 2.3 లక్షల మందితో కమిటీ చర్చలు జరిపింది. యూసీసీ డ్రాఫ్ట్ కమిటీలో కూడా ఆమె సభ్యురాలు. ఏమిటీ ఉమ్మడి పౌర స్మృతి? ► కులం, మతం, ఆడ–మగ వంటి తేడాలు, లైంగిక ప్రవృత్తులతో నిమిత్తం లేకుండా దేశ పౌరులందరికీ ఒకే రకమైన వ్యక్తిగత చట్టాలను వర్తింపజేయడం ఉమ్మడి పౌర స్మృతి ప్రధానోద్దేశం. ► ఇది అమలైతే ప్రస్తుతం అమల్లో ఉన్న పలు మత, ఆచార, సంప్రదాయ ఆధారిత వ్యక్తిగత చట్టాలన్నీ రద్దవుతాయి. ► వివాహాలు, విడాకులు, వారసత్వం, దత్తత తదితరాలతో పాలు పలు ఇతర వ్యక్తిగత అంశాలు కూడా యూసీసీ పరిధిలోకి వస్తాయి. ► రాజ్యాంగంలోని 44వ అధికరణం ఆధారంగా దీన్ని తెరపైకి తెచ్చారు. ► 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందే బీజేపీ పాలిత గుజరాత్ కూడా ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయనుందని చెబుతున్నారు! ► గోవాలో ఇప్పటికే గోవా పౌర స్మృతి అమల్లో ఉంది. ఇది చాలా రకాలుగా యూసీసీని పోలి ఉంటుంది. రాజ్యాంగం ఏమంటోంది? ‘‘దేశవ్యాప్తంగా పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేయాలి’’ అని రాజ్యాంగంలోని 4వ భాగం స్పష్టంగా నిర్దేశిస్తోంది. అయితే దీన్ని రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల్లో భాగంగా పేర్కొన్నారు. కనుక దీని అమలు తప్పనిసరి కాదు. ఆ దృష్ట్యా యూసీసీ అమలుకు కోర్టులు ఆదేశించజాలవు. సుప్రీంకోర్టు కూడా... అత్యున్నత న్యాయస్థానం కూడా పలు తీర్పుల సందర్భంగా యూసీసీ అమలు ఆవశ్యకతను నొక్కిచెప్పింది. అయితే 2018లో మోదీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు యూసీసీపై లోతుగా పరిశీలించిన కేంద్ర లా కమిషన్ మాత్రం భిన్నాభిప్రాయం వెలిబుచ్చడం విశేషం. ‘‘ఈ దశలో దేశానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరమూ లేదు. అభిలషణీయమూ కాదు’’ అంటూ కేంద్రానికి ఏకంగా 185 పేజీల నివేదిక సమరి్పంచింది! పారీ్టల్లో భిన్నాభిప్రాయాలు... యూసీసీ అమలుపై రాజకీయ పక్షాల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. బీజేపీ దీన్ని గట్టిగా సమరి్థంచడమే గాక అధికారంలోకి వస్తే దేశమంతటా యూసీసీని కచి్చతంగా అమలు చేస్తా మని 2019 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో హా మీ కూడా ఇచ్చింది. ఇక కాంగ్రెస్, మజ్లిస్ తదితర పక్షాలు యూసీసీని వ్యతిరేకిస్తున్నాయి... ► ప్రధాని మోదీ తొలినుంచీ యూసీసీ అమలును గట్టిగా సమరి్థస్తూ వస్తున్నారు. రెండు రకాల చట్టాలతో దేశం ఎలా నడుస్తుందని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రశ్నించారు. ► ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ తదితరులు కూడా పలు సందర్భాల్లో యూసీసీని సమరి్థంచారు. ‘‘దేశ పౌరులందరికీ ఉమ్మడి పౌర స్మృతి ఉండాలన్నదే మన రాజ్యాంగ నిర్మాతల ఉద్దేశం కూడా. దాని అమలుకు ఇదే సమయం’’ అని ధన్‌ఖడ్ అభిప్రాయపడ్డారు. ► యూసీసీ పేరుతో ద్రవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి పెను సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడమే మోదీ లక్ష్యమని కాంగ్రెస్ దుయ్యబడు తోంది. ► రాజ్యాంగంలోని 29వ అధికరణానికి యూసీసీ విరుద్ధమని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆక్షేపించారు. ‘‘బహుళత్వం, వైవిధ్యమే మన దేశ సంపద. యూసీసీ పేరుతో వాటికి తూట్లు పొడిచేందుకు మోదీ ప్రయ తి్నస్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ► యూసీసీ వస్తే తమ సాంప్రదాయిక ఆచారాలకు అడ్డుకట్ట పడుతుందేమోనని దేశవ్యాప్తంగా 30 పై చిలుకు గిరిజన సంఘాలు కూడా ఇప్పటికే సందేహం వెలిబుచ్చాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కళ్లముందే ఘోరం.. 16 మంది మృతి, రాష్ట్రపతి ముర్ము దిగ్భ్రాంతి
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో సంభవించిన విద్యుదాఘాత ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అనూహ్య ప్రమాదంలో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాక్షించారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు. కాగా, చమోలీ జిల్లాలోని అలకనంద నది ఒడ్డున ఉన్న చమోలీ బ్రిడ్జిపై ట్రాన్స్ఫార్మర్ పేలి విద్యుత్ ప్రసరించింది. ఆ సమయంలో బ్రిడ్జిపై ఉన్నవారికి షాక్ తగిలి 16 మంది ప్రాణాలు విడిచారు. నమామి గంగా ప్రాజెక్టులో భాగంగా అలకనంద నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. బుధవారం ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. (దంచికొట్టిన వాన.. గంటల్లోనే 30 సెం.మీ వర్షం.. రిజర్వాయర్లకు హై అలర్ట్) మృతుల్లో ముగ్గురు గార్డులు, ఒక పోలీసు వ్యక్తి కూడా ఉన్నారు. కళ్లముందే కరెంట్ షాక్‌తో అంతమంది విగతజీవులుగా మారడం స్థానికంగా భయోత్పాతం సృష్టించింది. తీవ్రంగా గాయపడ్డవారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సీఎం విచారం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటన చమోలీ ఘటనపై ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల వైద్య ఖర్చులకు రూ.1 లక్ష చొప్పున అందిస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఉత్తరాఖండ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ వెల్లడించింది. ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని చమోలీ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. సత్వర విచారణ చేపట్టాలని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సీఎం ధామితో ఫోన్లో మాట్లాడారు. చమోలీ ఘటనపై ఆరా తీశారు. ప్రధాని మోదీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. (డిప్యూటీ స్పీకర్‌పై పేపర్లు విసిరిన 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సస్పెండ్..) -
Chandan Ram Das: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి..
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సాంఘీక సంక్షేమ, రవాణా శాఖ మంత్రి చందన్ రామ్ దాస్(63) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. బగేశ్వర్ జిల్లా ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. ఆయన మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. చందన్ రామ్ దాస్ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. 'నా కేబినెట్ మంత్రి హఠాన్మరణం విస్మయానికి గురి చేసింది. ఆయన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. సామాజిక సేవ, రాజకీయాల్లో ఆయన లోటు పూడ్చలేనిది.' అని ధామీ ట్వీట్ చేశారు. मंत्रिमंडल में मेरे वरिष्ठ सहयोगी श्री चंदन राम दास जी के आकस्मिक निधन के समाचार से स्तब्ध हूं। उनका निधन जनसेवा एवं राजनीति के क्षेत्र में अपूरणीय क्षति है। ईश्वर पुण्यात्मा को अपने श्रीचरणों में स्थान एवं परिजनों व समर्थकों को यह असीम कष्ट सहन करने की शक्ति प्रदान करें। ॐ… pic.twitter.com/BMTuaI62sr — Pushkar Singh Dhami (@pushkardhami) April 26, 2023 కాగా.. మంత్రి మృతికి సంతాపంగా బుధవారం నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజులపాటు సంతాపదినాలు ప్రకటించింది. చందన్ రామ్ దాస్ 2007 నుంచి వరసగా నాలుగు సార్లు బగేశ్వర్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ధామీ కేబినెట్లోనే తొలిసారి ఆయనకు మంత్రి అవకాశం దక్కింది. చదవండి: సీఎం ఇంటి రిపేర్ల కోసం రూ.45 కోట్లు..! మరి మోదీ రూ.8,400 కోట్ల విమానం సంగతేంటి..? -
చార్ధామ్ యాత్ర ప్రారంభం
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయాలు ఆరు నెలల అనంతరం తిరిగి తెరుచుకోవడంతో చార్ధామ్ యాత్ర మొదలైంది. గంగోత్రి ఆలయ తలుపులను శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు, యమునోత్రి గుడిని 12.41 గంటలకు ఆలయ కమిటీ సభ్యులు తెరిచారు. ఈ సందర్భంగా గంగోత్రి ఆలయంలో, యమునా దేవత శీతాకాల నివాసమైన ఖర్సాలీలో కూడా ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి పూజలు చేశారు. అనంతరం యమునా దేవిని అందంగా అలంకరించిన పల్లకీలో ఊరేగింపుగా యమునోత్రికి తీసుకువచ్చారు. చార్ధామ్ యాత్రకు ఇప్పటికే 16 లక్షల మంది యాత్రికులు పేర్లను నమోదు చేసుకున్నారు. ఈనెల 25న కేదార్నాథ్, 27న బదరీనాథ్ ఆలయాలు తిరిగి తెరుచుకోనున్నాయి. హిమాలయాల్లోని ఈ నాలుగు పుణ్యక్షేత్రాల్లో రోజువారీ భక్తుల సందర్శనపై పరిమితం విధించాలన్న ప్రతిపాదనను విరమించుకున్నట్లు సీఎం ధామి ప్రకటించారు. -
జోషిమఠ్ పగుళ్లు.. ఉత్తరాఖండ్ సీఎం కీలక ప్రకటన
డెహ్రాడూన్: బ్రదినాథ్ లాంటి పుణ్యక్షేత్రానికి ద్వారంగా పేరున్న ఉత్తరాఖండ్ పట్టణం జోషిమఠ్ కుంగిపోతుండడం, ఇళ్లకు పగుళ్లు రావడంపై ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కీలక ప్రకటన చేశారు. జోషిమఠ్ ప్రభావిత కుటుంబాలకు ఇవాళ(గురువారం) సాయంత్రంకల్లా పరిహారం అందజేస్తామని స్పష్టం చేశారు. అలాగే.. జోషిమఠ్‌లో కేవలం 25 శాతం ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయని ఆయన ప్రకటించారు. జ్యోతిమఠ్ కుంగిపోతుండడంతో.. కేవలం నాలుగోవంతు ఇళ్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయి. బాధిత కుటుంబాలకు లక్షన్నర రూపాయల సాయాన్ని ఇవాళ సాయంత్రంకల్లా అందజేస్తాం. పూర్తి నివేదికలు అందిన తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నాం. అలాగే.. ఇతర ఊళ్లలోనూ ఇలాంటి సమస్య ఉందేమో ప్రభుత్వం పరిశీలిస్తుంది. దానిని బట్టి నిర్ణయాలు తీసుకుంటాం అని సీఎం ధామి ప్రకటించారు. అంతకు ముందు జోషిమఠ్‌లో స్వయంగా పర్యటించిన ఆయన.. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. బాధితులను అధైర్యపడొద్దని చెబుతూ.. సురక్షిత ప్రాంతాల తరలింపునకు అధికారులను ఆదేశించారు కూడా. ఆ మరునాడే ఆయన కీలక ప్రకటన చేయడం గమనార్హం. జోషిమఠ్‌లో గత కొన్నేళ్లుగా భూమి కుంగిపోతూ వస్తోంది. ప్రకృతి వైపరీత్యాలకు మానవ తప్పిదాలు తోడు కావడంతోనే.. పరమ పవిత్ర ప్రాంతం కుంగుబాటుకు లోనవుతోంది. ఇళ్లకు, రోడ్లకు పగుళ్లు వస్తున్నాయి. జనాలు కొంతవరకు ఖాళీ చేసి వెళ్లిపోగా.. ఆరువందలకు పైగా ఇళ్లు, హోటళ్లలతో 20వేల మందికిపైగా ప్రభావితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ప్రమాదకారకంగా ఉన్న భవనాలను పడగొట్టి.. వాళ్లకు తక్షణం తాత్కాలిక సదుపాయాల్ని అందజేస్తోంది ప్రభుత్వం. ఇదిలా ఉంటే.. చైనా సరిహద్దులో కీలకంగా భావించే ఆర్మీ బేస్‌కి కూడా పగుళ్లు వస్తున్నాయి. గ్లేసియర్లు కరగడం, కన్స్ట్రక్షన్ పనులు, కొండల తవ్వకం, భూభాగం కిందుగా నీటి ప్రవాహం.. తదితర కారణాలతో ఈ పరిణామాలు సంభవిస్తున్నాయని పరిశోధకులు ఇప్పటికే ఓ అంచనాకి వచ్చారు. అభివృద్ధి పేరిట ఇక్కడ జరిగిన పనుల వల్లే.. 2021లో సంభవించిన ఆకస్మిక వరదల్లో 200 మంది బలైయ్యారనే విమర్శ ఒకటి ఉంది. -
మరిన్ని ‘జోషి మఠ్’లు!
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో ఇళ్లు పగుళ్లివ్వడానికి విపరీతమైన వర్షాల వల్ల భూమి క్రమక్షయం, నేల లోపలి భాగం గుల్లబారడం వంటివి కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘వీటితో పాటు ఇష్టారాజ్యంగా తవ్వకాలు, ఇళ్లతో పాటు డ్యాముల వంటి భారీ నిర్మాణాలు కూడా సమస్యకు కారణమే. అయితే భూమి లోపలి పొరల్లోని (టెక్టానిక్) కదలికలే దీనికి ప్రధాన కారణం. ఇటీవల ఇది వేగం పుంజుకుంది. దీన్ని అడ్డుకోవడం మన చేతుల్లో లేదు ’’ అని వారంటున్నారు. రాష్ట్రంలోని నైనిటాల్, ఉత్తరకాశి, చంపావత్ తదితర పట్టణాలకూ ఇలాంటి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని సున్నితం, బలహీనమైన నేల, దాని లోపలి పొరలతో ఎప్పటికైనా ప్రమాదమేనని చెబుతున్నారు. మరోవైపు, జోషి మఠ్‌ను కొండచరియలు విరిగిపడే ముప్పున్న ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా 60కి పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. మరో 90 కుటుంబాలను కూడా తరలించనున్నారు. కలెక్టర్ సారథ్యంలో ప్రభావిత ఇళ్ల పరిశీలన కొనసాగుతోంది. పట్టణంలోని 4,500 పై చిలుకు ఇళ్లలో 610 ఇళ్లు పగుళ్లిచ్చి నివాసానికి పనికిరాకుండా పోయినట్టు గఢ్వాల్ కమిషనర్ సుశీల్‌కుమార్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం పుష్కర్‌సింగ్ ధామితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలపై నివేదిక కోరారు. ప్రధాని కార్యాలయం కూడా ఆదివారం దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపింది. ప్రజల క్షేమమే తొలి ప్రాధాన్యమని ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఐటీ రూర్కీ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులు కూడా సమీక్షలో పాల్గొన్నారు. జోషి మఠ్ పరిస్థితిపై హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఇమేజరీ ద్వారా అధ్యయనం చేయనున్నాయి. -
సుప్రీంకోర్టు కీలక ఆదేశం, 50వేల మందికి ఊరట.. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు?
సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే వాళ్లంతా ఈ పాటికి రోడ్డున పడేవాళ్లే. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయేవాళ్లే. ఎముకలు కొరికే చలిలో చంటిపిల్లలు, వృద్ధులు, గర్భిణులతో నానా అంతా అగచాట్లు పడేవారే. ‘ఇది రైల్వే స్థలం. మీరు వారం రోజుల్లోగా ఖాళీ చేయాలనేది’ హైకోర్టు ఆదేశం అని స్థానిక అధికారులు చెప్పగానే వాళ్లంతా నెత్తినోరూ బాదుకున్నారు. ‘‘మానవత్వం ఉన్న వాళ్లు ఎవరైనా ఇలా ప్రవర్తిస్తారా? నిలువ నీడ లేకుండా చేస్తారా?’’ అని మొత్తుకున్నారు. ప్రార్థనలు చేశారు. బైఠాయించారు. ప్రభుత్వం దృష్టికి తమ గోడును తీసికెళ్లేందుకు కొవ్వొత్తుల ప్రదర్శన వంటి నిరసన కార్యక్రమాలు కూడా చేశారు. ఎవరు వీరు? ఎక్కడి వాళ్లు? ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీ రైల్వే స్టేషన్ పక్కన ఉన్న ప్రదేశంలో అనేక మంది కాపురం ఉంటున్నారు. వాటిని గఫూర్ బస్తీ, ఢోలక్ బస్తీ, ఇందిరానగర్ అని పిలుస్తారు. అక్కడ ఇళ్లే కాదు. ప్రభుత్వ పాఠశాలలున్నాయి. నాలుగు గుళ్లు, పది మసీదులు, ఒక బ్యాంకు, కొన్ని షాపులు ఉన్నాయి. వాళ్లంతా నిరుపేదలు. అందులో ఎక్కువ మంది ముస్లింలు. దాదాపు నాలుగువేల కుటుంబాలు. మొత్తం 50వేల మంది దాకా ఉంటారు. ఇవన్నీ ఒక్క రోజులో వచ్చినవి కాదని చూసిన వాళ్లకు ఎవరికైనా అర్థం అవుతుంది. కొన్ని దశాబ్దాలుగా ఉంటున్న వాళ్లు హఠాత్తుగా ఆక్రమణదారులు ఎలా అవుతారు. ముందూ వెనక చూడకుండా, ఒక ప్రత్యామ్నాయం అనేది చూపకుండా ప్రభుత్వం వాళ్లని ఖాళీ చేయమని ఎలా చెబుతుంది? రైల్వే శాఖ ఏం చెబుతోంది? కొంత మంది అక్కడ భూమిని లీజుకు తీసుకున్నారు. కొంత మంది భూమిని ప్రభుత్వవేలంలో కొనుక్కున్నారు. జిల్లా కోర్టుల్లో దీనికి సంబంధించిన అర్జీలు కూడా ఉన్నాయి. చాలా మంది దగ్గర చట్టబద్ధమైన పత్రాలున్నాయని కూడా చెబుతున్నారు. ఈశాన్య రైల్వేశాఖ ఈ భూమి విషయంలో పొంతనలేని వాదనలు చేస్తోంది. ఒకసారి 78 ఎకరాలు ఆక్రమించారని చెబితే, మరోసారి 29 ఎకరాలు ఆక్రమణ పాలయిందని చెబుతోంది. 2014లో ఈ అంశంపై ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలయినప్పుడు అక్కడ నిర్వాసితులను ఆక్రమణదారులు అని పేర్కొనకపోవటం గమనార్హం. గతంలో ఈ వివాదాన్ని పరిష్కరించటానికి ఒక ఎస్టేట్ అధికారిని నియమించారు. ఆయన ఈ స్థలం రైల్వేదని తేల్చేశారు. 2017లో కూడా హైకోర్టు ఒకసారి అక్కడున్నవారిని ఖాళీ చేయించాలని ఆదేశిస్తే, అప్పుడు బాధితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఏం చెప్పింది? ఈ భూమిపైన హల్ద్వానీ నివాసితులకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కులేదని భావించిన ఉత్తరాఖండ్ హైకోర్టు తక్షణం వారిని తొలగించాలని ఆదేశించింది. అవవసరమైతే సాయుధ బలగాల సహకారం తీసుకునయినా అక్కడున్న వాళ్లని తరిమివేయటానికి, రైల్వే అధికారులకు, జిల్లా యంత్రాంగానికి అనుమతులిచ్చింది. దీనిని సుప్రీంకోర్టులో సవాలు చేసిన సామాజిక కార్యకర్త, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని కోరారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్.ఎ.నజీర్, పి.ఎస్.నరసింహతో కూడిన బెంచీ దీనికి సానుకూలంగా స్పందించింది. ‘‘ఇది మానవీయ సమస్య. దీనికి ఆచరణ యోగ్యమైన పరిష్కారం కనుగొనాలి’’ అని సూచించింది. ఈ మేరకు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఒక పద్ధతి ప్రకారమే మేం ముందుకు వెళుతున్నామని రాష్ట్రప్రభుత్వం పేర్కొన్నా, దశాబ్దాలుగా ఉంటున్న వారిని సాయుధ పోలీసు బలగాలు ఉపయోగించి ఎలా ఖాళీ చేయిస్తారని న్యాయమూర్తులు నిలదీశారు. ఆశ్రయం పొందే హక్కు (రైట్ టు షెల్టర్): ఆశ్రయం పొందే హక్కుఅనేది భారతదేశంలో వివాదాస్పదమైన హక్కుగా చెప్పుకోవాలి. పునరావాస కల్పన అనే దాన్ని ప్రభుత్వాలు కూడా అంతగా పట్టించుకోవు. ఆశ్రయం పొందే హక్కు అనేది రాజ్యాంగంలోని 21వ అధికరణ కింద ప్రతి ఒక్కరికీ లభించే హక్కు. సుప్రీంకోర్టు 1996లో ఒక కేసులో ( చమేలి సింగ్ vs స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్) ఈ మేరకు తీర్పునిచ్చిన విషయం గమనార్హం. పునరావాసం, ఆశ్రయం పొందే హక్కులను సంబంధించి 1990లో ఇచ్చిన మరో తీర్పును కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జంతువులు ఆశ్రయం కల్పించటం అనేది వాటి శరీరానికి రక్షణ కల్పిస్తే చాలు, అదే మనుషులయితే వారికి తగిన వసతి కల్పించాలి. వారు శారీరకంగా, మానసికంగా, తెలివితేటలపరంగా ఎదగటానికి అవసరమైన చర్యలు చేపట్టవలసి ఉంటుందని పేర్కొంది. హల్ద్వానీ కేసులో ప్రభుత్వం వారిని అక్కడ నుంచి తొలగించటానికి ముందు వారికి ప్రత్యామ్యాయనివాసాలు చూపించవలసి ఉంది. దశాబ్దాలుగా వారు అక్కడ నివసిస్తున్నారన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దూకుడుగా వ్యవహరించటం ఎంత మాత్రం సమర్థనీయం కాదు. మరో వైపు హల్ద్వానీ కేసు సుప్రీంకోర్టుకు ఒక గొప్ప అవకాశాన్ని అందించింది. స్థానిక రాజకీయ ప్రాధాన్యతల మేరకు ప్రభుత్వాలు నిర్ణయాలు చేయకుండా మార్గదర్శకాలు అందించటానికి అది వీలుకల్పించింది. ప్రస్తుతానికి గండం గడిచినట్టే. హల్ద్వానీవాసులకు ఎలాంటి ముప్పు లేదు. వచ్చేనెలలో సుప్రీంకోర్టు విచారణ చేపడుతుంది. అప్పుడు నివాసితులు ఆశించిన పూర్తి న్యాయం లభిస్తుందని కోరుకుందాం. -
జోషిమత్: ఊరికి ఊరే కుంగిపోతోంది! ఎందుకో తెలుసా?
అది పరమ పవిత్ర ప్రాంతం. హిందువులకు బద్రీనాథ్, సిక్కులకు హేమకుండ్ సాహిబ్ లాంటి పుణ్యక్షేత్రాలకు చేరువగా ఉండే నిలయం. హిమాలయాల పర్వతారోహకులకు అదొక ద్వారం. పైగా చైనా సరిహద్దులో భద్రత విషయంలో భారత కంటోన్మెంట్ ఏరియాగా కూడా కీలకంగా వ్యవహరిస్తోంది. అలాంటి ఊరు కుంగిపోతోంది. ఉన్నట్లుండి వందల ఇళ్లకు.. రోడ్లకు పగుళ్లు వచ్చాయి. ఏడాది కాలంగా పునరావాసం కోసం ఎదురు చూపులు చూస్తున్నారు ఆ ఊరి ప్రజలు. రాష్ట్ర రాజధాని నుంచి కేవలం 300 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో.. ముఖ్యమంత్రి తమకు ఓ పరిష్కారం చూపిస్తారని భావించారు. కానీ, అది జరగలేదు. అందుకే పోరాటాన్ని ఉధృతం చేశారు. డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ పవిత్ర పట్టణంగా పేరున్న జోషిమత్(చమోలీ జిల్లా)లో భూభాగం కుంగిపోతూ వస్తోంది. వంద సంఖ్యలో ఇళ్లకు బీటలు వారాయి. అయినప్పటికీ ఉండడానికి మరో చోటులేక అక్కడే ఉండిపోతున్నారు. తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వం వద్ద గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటికే అరవైకిపైగా కుటుంబాలు ఆ పట్టణాన్ని విడిచి వెళ్లిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి. మరికొందరి ఇళ్లు మరీ దారుణంగా తయారు అయ్యాయి. దీంతో 29 కుటుంబాలను అధికారులే దగ్గరుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయినా మరో 500 కుటుంబాలు అక్కడే భయం భయంగా గడుపుతున్నాయి. ఏ క్షణాన ఏం జరుగుతుందో అనుకుంటూనే.. ఎక్కడ ఉండాలో తెలియక.. ఆవాసం కోసం బిక్కచూపులు చూస్తున్నాయి. ప్రభుత్వ స్పందన.. జోషిమత్‌లో భూమి కుంగడం, ఇళ్లకు పగళ్లు రావడంపై ఎట్టకేలకు ఉత్తరాఖండ్ స్పందించింది. ఐఐటీ రూర్కీ బృందం ఈ ప్రాంతంలో పర్యటించి ఓ నివేదికను రూపొందించబోతోంది. ఆ నివేదిక ఆధారంగా కార్యాచరణను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భావిస్తున్నారు. అంతేకాదు త్వరలోనే ఆయన ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించబోతున్నారట. మూడు వేల మంది జనాభా ఉంటున్న ఈ ప్రాంతం.. ముప్పు ముంగిట ఉండడం వెనక కారణాల కోసం అన్వేషిస్తోంది ప్రభుత్వం. జోషిమత్‌లో ఇళ్లు మాత్రమే కాదు.. రోడ్లు కూడా దారుణంగా నాశనం అయ్యాయి. రవిగ్రామ్, గాంధీనగర్, మనోహర్‌బాగ్, సింగ్‌ధర్, పర్సారీ, ఉప్పర్‌బజార్, సునీల్, మార్వాడీ, లోయర్ బజార్.. ఇలా జోషిమత్‌లో పలు ఏరియాల్లో ఇళ్లకు పగళ్లు వచ్చాయి. అయినప్పటికీ పునరావాసం లేక అక్కడే ఉండిపోతున్నారు జోషిమత్ ప్రజలు. వెదరు బొంగులు, బరువైన వస్తువులను కుంగిపోతున్న నేలకు, గోడలకు సపోర్ట్‌గా ఉంచుతూ.. సునామీకి గొడుగు అడ్డుపెట్టే యత్నాలు చేస్తున్నారు. ఏడాది కాలంగా ఇక్కడి పరిస్థితిపై నివేదిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సేవ్ జోషిమత్ కమిటీ కన్వీనర్ అతుల్ సతి ఆరోపిస్తున్నారు. తాజాగా ఆధ్వర్యంలో ఈ పవిత్ర ప్రదేశాన్ని, తమను కాపాడాలంటూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కారణాలు అవేనా? అయితే ఈ ప్రకృతి వైపరిత్యానికి గల సరైన కారణాలను తేల్చాల్సి ఉందని జోషిమత్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పవార్ చెబుతున్నారు. కానీ, జోషిమత్ భూకంపాలకు సంభావ్యత ఉన్న ప్రాంతం. చమోలీ జిల్లాకు ఆరు వేల ఫీట్ల ఎత్తులో ఉంటుంది. హై రిస్క్ జోన్(జోన్-5) పరిధిలో ఉంది ఈ చోటు. పైగా భూగర్భంలో జలప్రవాహం నేపథ్యంలోనే ఇలా జరుగుతుందోనేమోనని డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగం ఒక అంచనా వేస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిని చమోలీ జిల్లా జాయింట్ మేజిస్ట్రేట్ దీపక్ సైనీ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. జోషిమత్‌కు పరమ పవిత ప్రాంతంగా వేల ఏళ్ల చరిత్ర ఉంది. అంతేకాదు.. ఇక్కడ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఆది శంకరాచార్య నలు దిక్కుల నెలకొల్పిన నాలుగు పీఠాల్లో ఒకటి జోషిమత్(జ్యోతిర్మఠ్). ఉత్తరామ్నాయ మఠ్ పీఠం ఇది. (మిగతావి శృంగేరి, పూరీ, ద్వారకా). ఆదిశంకరాచార్య మఠంతో పాటు భవిష్య కేదార్ టెంపుల్, నార్సింగ్ ఆలయం, తపోవన్, గారి భవాని ఆలయం వీటితో పాటు ఔలీ ప్రాంతానికి అనుసంధానం చేస్తూ ఆసియాలోనే అతిపెద్ద రోప్‌వే ఇక్కడ ఉంది. 2021 ఉత్తరాఖండ్ వరదలతో తీవ్రంగా ప్రభావితం అయ్యింది ఈ ప్రాంతం. 2013 వరదల్లో ఇక్కడ కంటోన్మెంట్‌ను బేస్ క్యాంప్‌గా సహాయక చర్యలకు ఉపయోగించారు కూడా. -
పంత్‌ను పరామర్శించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్‌ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి పరామర్శించారు. ఆదివారం డెహ్రాడూన్‌లోని మాక్స్ ఆస్పత్రికి వెళ్లిన పుష్కర్ సింగ్.. పంత్ ఆరోగ్యపరిస్థితి గురించి డాక్టర్ల ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అదే విధంగా పెను ప్రమాదం నుంచి కాపాడిన హరియాణా బస్సు డ్రైవర్ సుశీల్ మాన్ జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్కరించాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. అతడు పూర్తి స్థాయిలో కోలుకోవడానికి దాదాపు 6 నుంచి 8 నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. కాగా అతి తక్కువ కాలంలోనే అత్యుత్తమ క్రికెటర్‌గా ఎదిగిన పంత్‌ను పుష్కర్ సింగ్ సర్కార్ గతేడాది తమ రాష్ట్ర అంబాసిడర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. చదవండి: Team india Schedule 2023: ఈ ఏడాదైనా భారత్‌కు కలిసోచ్చేనా? టీమిండియా పూర్తి షెడ్యూల్ ఇదే? -
Rishabh Pant: ఉదయమే పంత్ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా
Rishabh Pant- Car Accident- Pray For Speedy Recovery: టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ప్రార్థించాడు. పంత్‌కు ప్రాణాపాయం తప్పిందన్న లక్ష్మణ్ త్వరగా కోలుకో చాంపియన్ అంటూ 25 ఏళ్ల ఈ వికెట్ కీపర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కాగా శుక్రవారం ఉదయం రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్‌కి నుంచి ఢిల్లీ నుంచి వస్తున్న సమయంలో రూర్కీ సమీపంలో ఈ ఘటన చేసుకుంది. డివైడర్‌ను ఢీకొట్టిన కారు పూర్తిగా కాలిపోయింది. అయితే, పంత్ ముందే కారు నుంచి దూకేయడంతో ప్రాణాలతో బయటపడగలిగాడు. కానీ, ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పంత్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తుండటంతో #RishabhPant ట్రెండ్ అవుతోంది. లక్ష్మణ్ ట్వీట్ ద్వారా.. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ మేరకు బిగ్ అప్డేట్ అందించాడు. ‘‘పంత్ కోసం ప్రార్థిస్తున్నా. దేవుడి దయ వల్ల అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు’’ అని లక్ష్మణ్ ట్విటర్లో పేర్కొన్నాడు. Praying for Rishabh Pant. Thankfully he is out of danger. Wishing @RishabhPant17 a very speedy recovery. Get well soon Champ. — VVS Laxman (@VVSLaxman281) December 30, 2022 స్పందించిన క్రీడా వర్గాలు రిషభ్ పంత్ కారు ప్రమాదం గురించి తెలుసుకున్న క్రికెట్ వర్గాల ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ‘‘వీలైనంత త్వరగా కోలుకో డియర్ పంత్’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. Wishing dear @RishabhPant17 a super speedy recovery. Bahut hi Jald swasth ho jaao. — Virender Sehwag (@virendersehwag) December 30, 2022 ఉదయమే తన గురించి ఆలోచించా ఇక.. ‘‘ఈరోజు ఉదయమే రిషభ్ పంత్ గురించి ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతలోనే ఇలా.. తను బాగుండాలి. త్వరగా కోలుకోవాలి’’ అని క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ బిల్లింగ్స్ సైతం.. రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. కాగా పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. Thinking about Rishabh Pant this morning and desperately hoping he is fine and recovers soon. — Harsha Bhogle (@bhogleharsha) December 30, 2022 ఉత్తరాఖండ్ సీఎం ఆదేశాలు రిషభ్ పంత్ కారు ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ పంత్ ప్రమాదానికి గురయ్యాడన్న ఆయన.. వైద్య సహాయం అందించి, ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కాగా ఈ ఏడాది పంత్‌ను తమ రాష్ట్ర అంబాసిడర్‌గా నియమిస్తూ పుష్కర్ సింగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్‌బాల్ అంటే కేవలం.. Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు.. టి20 కెప్టెన్‌గా