Uttarak​hand Ucc Bill: యూసీసీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు | AIMIM Chief Asaduddin Owaisi Slams Over UCC Bill | Sakshi
Sakshi News home page

యూసీసీపై ఎంఐఎం చీఫ్‌ కీలక వ్యాఖ్యలు

Published Wed, Feb 7 2024 1:52 PM | Last Updated on Wed, Feb 7 2024 2:55 PM

Mim Chief Owaisi Slams Ucc Bill - Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తాజాగా అక్కడి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్‌ కోడ్‌(యూసీసీ) పూర్తిగా హిందూ కోడ్‌ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ అభివర్ణించారు. ఈ విషయమై బుధవారం ఢిల్లీలో ఆయన స్పందించారు. హిందువుల కోడ్‌ అయిన యూసీసీని ముస్లింలతో పాటు ఇతర మతాల వాళ్లకు వర్తింపజేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. కోడ్‌లో హిందూ అవిభక్త ఫ్యామిలీ(హెచ్‌యూఎఫ్‌)ను ఎందుకు ముట్టుకోలేదని ప్రశ్నించారు. 

ఇతర మతాల వాళ్ల సంప్రదాయాలను ముస్లింలు ఆచరించాలని చట్టంలో పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు తమ మతాచారాలను ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నప్పుడు గిరిజనులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలన్నారు. 

ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నపుడు అక్కడి సీఎం పుష్కర్‌ సింగ్‌ యూసీసీ బిల్లు అసెం‍బ్లీలో ప్రవేశపెట్టి సమస్యను పక్కదారి పట్టించడంపై ఒవైసీ విమర్శలు గుప్పించారు. వదరలు వచ్చి రాష్ట్ర ప్రజలు చాలా సమస్యల్లో ఉంటే పుష్కర్‌ సింగ్‌కు యూసీసీ ఎందుకు ప్రాధాన్యత కలిగిన అంశంగా కనిపిస్తోందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్‌లో ఈడీ రెయిడ్స్‌.. ఆ పార్టీ నేతే టార్గెట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement