Owaisi
-
Bihar: ఎంఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు
పాట్నా: బిహార్‌లో ఎంఐఎం పార్టీకి చెందిన మరో నేతను దుండగులు కాల్చి చంపారు. గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. రైలెక్కేందుకు రైల్వేస్టేషన్‌కు బంధువుతో కలిసి బైక్‌పై వెళుతున్న ఎంఐఎం నేత సలామ్‌పై రెండు మోటార్‌సైకిళ్లపై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్ర గాయాల పాలైన సలామ్‌ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో సలామ్ ఎంఐఎం తరపున గోపాల్‌గంజ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కాల్పుల ఘటనపై దర్యాప్తునకుగాను ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్లు గోపాల్‌గంజ్ జిల్లా ఎస్పీ ప్రభాత్ తెలిపారు. పార్టీ నేత దుండగుల కాల్పుల్లో చనిపోవడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కుర్చీ కోసం పాకులాట తప్ప నితీశ్‌కుమార్‌కు బిహార్‌లో శాంతిభద్రతలు కాపాడటం చేతకావడం లేదని ఒవైసీ మండిపడ్డారు. తమ పార్టీ నేతలే ఎందుకు టార్గెట్ అవుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత ఏడాది డిసెంబర్లో సివాన్ జిల్లా ఎంఐఎం అధ్యక్షుడు ఆరిఫ్ జమాల్‌ను దుంగులు కాల్చి చంపారు. ఇదీ చదవండి.. మొదలైన ఢిల్లీ ఛలో.. పోలీసుల హై అలర్ట్ -
Uttarakhand Ucc Bill: యూసీసీపై ఒవైసీ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ ప్రభుత్వం తాజాగా అక్కడి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) పూర్తిగా హిందూ కోడ్ అని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభివర్ణించారు. ఈ విషయమై బుధవారం ఢిల్లీలో ఆయన స్పందించారు. హిందువుల కోడ్ అయిన యూసీసీని ముస్లింలతో పాటు ఇతర మతాల వాళ్లకు వర్తింపజేస్తున్నారని ఒవైసీ మండిపడ్డారు. కోడ్‌లో హిందూ అవిభక్త ఫ్యామిలీ(హెచ్‌యూఎఫ్)ను ఎందుకు ముట్టుకోలేదని ప్రశ్నించారు. ఇతర మతాల వాళ్ల సంప్రదాయాలను ముస్లింలు ఆచరించాలని చట్టంలో పేర్కొనడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం తమకు తమ మతాచారాలను ఆచరించే హక్కు ఉందని గుర్తు చేశారు. ఈ చట్టం అందరికీ ఒకేలా ఉండాలన్నప్పుడు గిరిజనులకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితుల్లో ఉన్నపుడు అక్కడి సీఎం పుష్కర్ సింగ్ యూసీసీ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి సమస్యను పక్కదారి పట్టించడంపై ఒవైసీ విమర్శలు గుప్పించారు. వదరలు వచ్చి రాష్ట్ర ప్రజలు చాలా సమస్యల్లో ఉంటే పుష్కర్ సింగ్‌కు యూసీసీ ఎందుకు ప్రాధాన్యత కలిగిన అంశంగా కనిపిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి.. ఉత్తరాఖండ్‌లో ఈడీ రెయిడ్స్.. ఆ పార్టీ నేతే టార్గెట్ -
ఒవైసీ ఫ్యామిలీ ది గ్రేట్@61 నాటౌట్
తెలంగాణలో కొన్ని రాజకీయ కుటుంబాల ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తుంది. వాటిలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ కుటుంబం గురించి ముందుగా తెలుసుకోవాలి. అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ 1962 నుంచి 2004 వరకు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు నిర్వహిస్తే, 1994లో అసద్ రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ కొనసాగుతున్నారు. 1999 నుంచి అసద్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఎమ్మెల్యేగా వరుసగా గెలుస్తున్నారు. ఆ రకంగా అరవై ఒక్క సంవత్సరాలుగా ఒవైసీ కుటుంబం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడం విశేషం. ఆ కుటుంబం పదిమార్లు లోక్‌సభకు సలావుద్దీన్ 1962 నుంచి ఐదుసార్లు శాసనసభకు, ఆరుసార్లు ఎంపీగా హైదరాబాద్ నుంచి గెలుపొందారు. అసద్ రెండుసార్లు చార్మినార్ నుంచి అసెంబ్లీకి, తదుపరి 2004 నుంచి నాలుగుసార్లు హైదరాబాద్ నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇక అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట నుంచి 1999 నుంచి వరుసగా ఐదుసార్లు గెలిచారు. 1999లో తండ్రి లోక్ సభకు, ఇద్దరు కుమారులు అసెంబ్లీకి ఎన్నికవడం ఒక ప్రత్యేకత. సలావుద్దీన్, అసద్ కలిసి ఇంతవరకు పదిసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారన్నమాట. తండ్రి, ఇద్దరు కుమారులు కలిసి పన్నెండుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. -
ప్రతిపక్షాల భేటీపై ఓవైసీ విసుర్లు.. ఆ నాయకుల చరిత్రేంటో తెలియదా?
ప్రతిపక్షాల భేటీపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఏఐఎమ్ఐఎమ్ అధ్యక్షుడు అసదుద్ధీన్ ఓవైసీ. ఈ సమావేశానికి హాజరైన నాయకుల చరిత్ర ఏంటో తెలుసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ వల్లనే బీజేపీ అధికారంలోకి వచ్చిందనేది సత్యం కాదా? అని ప్రశ్నించారు. బీజేపీని గద్దె దింపడానికి ఐక్యమత్యంగా పోరాడటం సరైన విధమే అయినప్పటికీ భేటీ జరిగిన ప్రదేశం, నేతృత్వం వహించిన నాయకుల తీరును ఆయన ఆక్షేపించారు. 'నితీష్ చరిత్ర ఎటువంటిది..?' ప్రతిపక్షాలకు నేతృత్వం వహించిన నితీష్ కుమార్ గత ఏడాది వరకూ బీజేపీతో కలిసి మహాఘట్ బంధన్‌గా ఏర్పడి ప్రభుత్వాన్ని పంచుకున్న వ్యక్తేనని ఓవైసీ గుర్తుచేశారు. అధికారం కోసం బీజేపీ నుంచి విడిపోయి.. మళ్లీ కలిసి.. మళ్లీ విడిపోయిన చరిత్ర ఆయనదని అన్నారు. గోద్రా అల్లర్లు జరిగినప్పుడు రైల్వే మంత్రిగా నితీష్ ఉన్నది నిజం కాదా? అని ప్రశ్నించారు. గుజరాత్లో మారణకాండ జరిగిన కాలంలో బీజేపీతో నితీష్ కలిసి ఉన్నారని ఓవైసీ అన్నారు. 'ఉద్ధవ్, కేజ్రీవాల్ ఎలాంటివారు..?' 'ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన లౌకిక పార్టీనా? బాబ్రీ మజీద్‌ను కూలదోయడం మేము గర్వంగా భావిస్తున్నామని అన్నది ఉద్ధవ్ ఠాక్రే కాదా? రాజ్యాంగ విలువల్ని తుంగలో తొక్కి ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలపలేదా? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు నేతృత్వం వహించేది ఎవరు?' అని ఓవైసీ ప్రశ్నించారు. ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండానే 540 సీట్లలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేయాల్సిన అవసరం ఉందని ఓవేసీ చెప్పారు. ప్రతిపక్షాల భేటీ.. పట్నా వేదికగా బిహార్ సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో 15 ప్రతిపక్ష పార్టీల నాయకులు నేడు సమావేశమయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి బీజేపీని ఓడించి అధికారాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. దేశంలో ప్రముఖ పార్టీ నాయకులైన రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, మమతా బెనర్జీ, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్ ఒమర్ అబ్ధుల్లా, హేమంత్ సొరేన్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: పట్నాలో ముగిసిన ప్రతిపక్షాల సమావేశం.. సిమ్లాలో మరోసారి భేటీకి నిర్ణయం.. -
భారత్ ఓటమికి మహమ్మద్ షమీని టార్గెట్ చేశారు: ఒవైసీ
-
ప్రజాసేవే నా జీవిత ఆశయం: అక్బరుద్దీన్
హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మజ్లిస్ పార్టీ శాసనసభాపక్షనేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనారోగ్యం నుంచి పూర్తిగా కోలుకున్న అనంతరం ఆయన చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని రియాసత్‌నగర్ జమాల్కాలనీలో నిర్మించనున్న ఒవైసీ జూనియర్ కాలేజీ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. మరోసారి చావు దగ్గరకు వెళ్లిన తనను ప్రజల ఆశీస్సులే బతికించాయన్నారు. ప్రజలకు సేవే జీవిత లక్ష్యమని, అందుకే తాను తిరిగి వచ్చానన్నారు. మళ్లీ పునర్జన్మ ప్రసాదించడమంటే ప్రజలకు తాను చేయాల్సింది ఇంకా ఎంతో ఉందన్న మాట అని పేర్కొన్నారు.తాను చనిపోయానంటూ కొందరు సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి తెరలేపి ఆనందపడ్డారని, ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు అలాంటివారి ఆశలు నెరవేరబోవన్నారు. వెయ్యిమందికి ఉచితవిద్య ఏదో ఒకరోజు చావడం ఖాయమని, అప్పటివరకు ప్రజల నడుమ ఉంటూ ప్రజల గుండెల్లో గూడు కట్టుకోవడమే తన కర్తవ్యమని అక్బరుద్దీన్ అన్నారు. ఇప్పటికే వెయ్యిమంది విద్యార్థులకు ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో ఉచితంగా విద్యను అందిస్తున్నామని, ఇంటర్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. విద్యతోనే మనకు అన్ని రకాల గుర్తింపు లభిస్తుందని, ప్రతి కుటుంబంలోని పిల్లలందరూ ఉన్నత చదువులు చదవాలన్నారు. నియోజకవర్గంలో మరి న్ని ఎడ్యుకేషనల్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. తన కుమార్తెను లండన్‌లో లా చదివి స్తున్నానని, ఆ యూనివర్సిటీలోనే టాపర్‌గా నిలిచిందని చెప్పారు. తాను ఉన్నా లేకున్నా ఈ విద్యాసంస్థలను తన కుమారుడు, కుమార్తె చూసుకుంటారని తెలిపారు. -
కేసీఆర్ అభివృద్ధి గ్రాఫిక్స్‌లోనే: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎలాంటి ఫలితాలు వచ్చా యో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అలాంటి ఫలితాలే వస్తాయని బీజేపీ సికింద్రాబాద్ లోక్‌సభ అభ్యర్థి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఎన్నికలు దేశ ప్రధానిని ఎన్నుకునేవి కాబట్టి ఇందులో టీఆర్ఎస్ ఎంపీలు ఓడినా, గెలిచినా ప్రజలకు లాభం లేదన్నారు. ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాల్సిన అవసరం లేదని, మోదీని ప్రధానిని చేసేందుకు బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ సభ తరువాత తెలంగాణ ప్రజలు మరోసారి మోదీనే ప్రధాని కావాలని కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలను ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్రం అనేక చర్యలు చేపడుతోందన్నారు. పాతబస్తీలో మెట్రో ప్రారంభం కాకపోవడానికి కేసీఆర్, ఒవైసీనే కారణమన్నారు. కేసీఆర్ అభివృద్ధి అంతా గ్రాఫిక్స్‌లోనే ఉంటుందన్నారు. శవాల చుట్టూ గద్దలు తిరిగినట్లు ప్రధాని కుర్చీ చుట్టూ విపక్ష నేతలు తిరుగుతున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ పచ్చి అబద్దాలు మాట్లాడారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ కాలేదన్నారు. పైగా అక్కడ రైతుల నోట్లో మట్టి కొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రఫేల్ యుద్ధ విమానాలు కొనడానికి డబ్బు లేదన్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు అధికారంలోకి వస్తే కనీస ఆదాయ పథకాన్ని ఎలా అమలు చేస్తుందని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను టీఆర్ఎస్లో విలీనం చేయడమో లేక రద్దు చేయడమో చేయాలన్నారు. రేపు కాంగ్రెస్ ఎంపీలు గెలిచినా టీఆర్ఎస్లోకి పోవడం ఖాయమన్నారు. సికింద్రాబాద్‌లో బీజేపీ మంచి మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
మతాల మధ్య విషం చిమ్ముతున్నారు
-
అసదుద్దీన్ మెడపై కత్తిపెట్టి...
ముంబైః మహరాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే 48వ పుట్టిన రోజు కార్యక్రమంలో తనదైన తీరును ప్రదర్శించారు. అభిమానుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ఆయన..ఆయన మద్దతుదారులు తెచ్చిన ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ చిత్రంతోకూడిన కేక్ ను ముందుగా పీకదగ్గర కట్ చేసి, తన శైలిని చాటుకున్నారు. మహరాష్ట్రకు వ్యతిరేకంగా మాట్లాడేవారిని సైతం ఇలా కేక్ ముక్కల్లా కట్ చేస్తామని కూడ రాజ్ థాకరే అన్నట్లు తెలుస్తోంది. ముంబై దాదర్ లోని తన నివాసం కృష్ణ కుంజ్ లో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న రాజ్ థాకరే... అసదుద్దీన్ ఫొటోతో కూడిన కేక్ ను కట్ చేసి తనదైన శైలిలో మరోసారి వివాదానికి తెరతీశారు. తాను కట్ చేసిన కేక్ ను అభిమానులందరికీ పంచిన ఆయన... మహరాష్ట్రను వ్యతిరేకించేవారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన మెడమీద కత్తి పెట్టినా భారత్ మాతాకీ జై అనేది లేదని చెప్పిన ఒవైసీ పై గతంలో మండిపడ్డ థాకరే.. పార్టీ నిర్వహిస్తున్న మొదటి గుడిపడ్వా ర్యాలీ సందర్భంగా చిత్రంలోని ఒవైసీ మెడపై కత్తిపెట్టి కేక్ కట్ చేశారు. ఇదిలా ఉంటే అసదుద్దీన్ కేక్ ను కట్ చేసిన ఘటనను ఏఐఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ ఖండించారు. కేక్ కట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పోనీ భారత్ అమ్మీ అంటారా?
న్యూ ఢిల్లీః భారత్ మాతాకీ జై అనే నినాదాన్ని నిరాకరిస్తున్న మజ్లిస్-ఇ-ఇతెహాదుల్ ముస్లిమీన్ పార్టీ నాయకుడు అసదుద్దీన్ ఒవైసీపై ప్రముఖ నటి షబానా అజ్మి సూటి ప్రశ్నలు సంధించారు. భారత్ మాతా కీ జై అన్న నినాదాన్ని పలకడంలో అభ్యంతరం ఉంటే.... పోనీ భారత్ అమ్మీ అంటారా అంటూ ఒవైసీపై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. భర్త జావెద్ అఖ్తర్ అడుగుజాడల్లో నడిచే షబానా.. దేశ రాజధానిలో జరిగిన ఓ సమావేశం సందర్భంలో భారత్ మాతాజీ జై అన్న నినాదాన్ని నిరాకరిస్తున్న ఒవైసీని గురించి ప్రస్తావించారు. ఒవైసీ సాహెబ్ ను నేను ఒక్కటే అడగదల్చుకున్నానని, ఒకవేళ ఆయనకు 'మాతా' అని పలకడంలో అభ్యంతరం ఉంటే 'భారత్ మాతాకీ జై' బదులుగా 'భారత్ అమ్మీకి జై' అంటారా అంటూ ప్రశ్నించారు. ఇదిలా ఉంటే మంగళవారం ఓ సందర్భంలో రచయిత, షబానా అజ్మీ భర్త జావేద్ అఖ్తర్... ఒవైసీ నామాన్ని ప్రస్తావించకుండానే ఆయనపై విమర్శలు ఎక్కు పెట్టారు. హైదరాబాద్ ఎంపీ అని ప్రస్తావిస్తూ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. ఆ ఎంపీ భారత్ మాతాకీ జై అని పలకనంటున్నాడని, పైగా రాజ్యాంగంలో లేదంటున్నాడని... అయితే రాజ్యాంగంలో ఆయన్ను టోపీ, షార్వానీ ధరించమని కూడ లేదని అన్నారు. భారత్ మాతాకీ జై అనడం మన విధా, కాదా అన్నది ముఖ్యం కాదని అది మన హక్కు అని మరచిపోకూడదని ఆయన సూచించారు. -
ఒవైసీ పౌరసత్వం రద్దుచేయండి
శివసేన డిమాండ్ ముంబై: ‘భారత్ మాతాకీ జై’ అని నినదించేందుకు నిరాకరిస్తానన్న మజ్లిస్ పార్టీ చీఫ్ ఒవైసీ భారత పౌరసత్వాన్ని రద్దుచేసి.. చట్టపరంగా ఉరితీయాలని శివసేన డిమాండ్ చేసింది. ఈ పార్టీ అధికార పత్రిక ‘సామ్నా’ సంపాద కీయంలో ఒవైసీపై నిప్పులు చెరిగింది. ఒవైసీలాగా వ్యవహరించే అందరికీ పౌరసత్వాన్ని రద్దుచేసి.. ఓటింగ్ హక్కులు తొలగించాలని డిమాం డ్ చేసింది. ‘మహారాష్ట్రలోకి వచ్చి ఇలాంటి విద్వేష వ్యాఖ్యలు చేస్తే.. అతను తిరిగి ఎలా వెళ్లగలిగారు? ఇందుకు సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమాధానం చెప్పాలి? హార్దిక్ పటేల్ అనుకోకుండా జాతీయపతాకాన్ని అవమానపరిస్తే.. జైలుకు పంపించాం కదా! కానీ ఇప్పుడు భారతమాతను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసినందుకు ఒవైసీని చట్టపరంగా ఉరితీయాలి’ అని పేర్కొంది. ముస్లింలు ఇంకా వెనుకబడి ఉండేందుకు ఒవైసీ లాంటి వ్యక్తులే కారణమని.. పేర్కొంది. మరోవైపు, తాజా పరిణామాలతో ఉత్తరప్రదేశ్‌లో జరగాల్సిన ఒవైసీ పర్యటను అనుమతి రద్దుచేస్తున్నట్లు లక్నో మెజిస్ట్రేట్ ఆదేశించింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశాలున్నందునే మజ్లిస్ చీఫ్ రెండ్రోజుల పర్యటనకు అనుమతులు ఇవ్వటం లేదని స్పష్టం చేసింది. కాగా, సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వంపై ఎంఐఎం తీవ్ర విమర్శలు చేసింది. మజ్లిస్ పార్టీ ఎదుగుదలను అడ్డుకునేందుకే అనుమతులు ఆపారని ఆరోపించింది. -
కుటుంబ పాలనకు స్వస్తి పలుకుదాం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కేటీఆర్ ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇస్తామని ఇప్పుడు చెబుతున్నాడు. కానీ అతను పుట్టక ముందు నుంచే హైదరాబాద్ ప్రజలు నల్లా నీళ్లు తాగుతున్నారు. దిల్సుఖ్నగర్: సీఎం కేసీఆర్ హైదరాబాద్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. నగరాన్ని రెండు కుటుంబాల (కేసీఆర్, ఓవైసీ) పాలన నుంచి కాపాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్కేపురం డివిజన్లో సీనియర్ సిటిజన్స్ కాలనీ అసోసియేషన్ సమావేశం గురువారం స్థానిక పద్మావతి కళ్యాణ మండపంలో నిర్వహించారు. దీనికి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్, ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కుటుంబాలే బాగుపడ్డాయని విమర్శించారు. ఈ కుటుంబాల పాలనకు స్వస్తి పలకాలని ప్రజలను కోరారు. బంగారు తెలంగాణ రాలేదు కానీ, కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారమైందన్నారు. బీజేపీని గెలిపిస్తే ఈ రెండు కుటుంబాల పాలన నుంచి ప్రజలకు, హైదరాబాద్‌కు రక్షణ కల్పిస్తామన్నారు. ‘కేటీఆర్ ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇస్తామని ఇప్పుడు చెబుతుండు. అతను పుట్టక ముందు నుంచే హైదరాబాద్ ప్రజలు నల్లా నీరు తాగుతున్నార’ని కిషన్‌రెడ్డి కేటీఆర్‌కు కౌంటర్ వేశారు. డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామంటూ, ఒక ఇల్లు కట్టించి గ్రాఫిక్స్‌తో ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా రాష్ట్రంలో ఏ పథకాలు అమలు కావని గుర్తుంచుకోవాలన్నారు. దేశంలో 90 శాతం కార్పొరేషన్లను బీజేపీ పాలిస్తోందని, నగరంలో కూడా మిత్రపక్షాలను గెలిపిస్తే ఉగ్రవాదం, వినాశక శక్తుల నుంచి హైదరాబాద్‌ను కాపాడుకుంటామన్నారు. మంచికి మారుపేరుగా నిలిచిన ఆర్కేపురం డివిజన్ అభ్యర్థి రాధా ధీరజ్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కిషన్‌రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ నాయకులు పలువురు బీజేపీలో చేరారు. కార్యక్రమంలో బొక్క నర్సింహారెడ్డి, పిట్ట ఉపేందర్ రెడ్డి, ధీరజ్ రెడ్డి, జంగయ్య యాదవ్, ప్రభాకర్జీ, కార్నాటి ధనుంజయతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
అసదుద్దీన్ ఒవైసీ అరెస్ట్; విడుదల
-
వికార్ ముఠా ఎన్‌కౌంటర్‌పై ‘సిట్’ విచారణ
లోక్‌సభలో ఒవైసీ ప్రశ్నకు కిరణ్ రిజ్జు సమాధానం న్యూఢిల్లీ: తెలంగాణలో జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ముఠా ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా విచారణ జరిపిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజ్జు ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు. -
ఆగ్రాలోనూ కుదరదు..
ఆగ్రా: ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి మరోసారి భంగపాటు ఎదురైంది. ఆగ్రాలో ఈ నెలలో నిర్వహించ తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు జిల్లా అధికారులు. స్థానిక ఎంఐఎం నేతలు మార్చి 29న ఆగ్రాలో ర్యాలీ, బహిరంగసభను ఏర్పటు చేశారు. దీనికి ఓవైసీ హాజరుకానున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. పాఠశాలల ఫైనల్ పరీక్షల కారణంగా బహిరంగ నిర్వహించడం సాధ్యంకాదని జిల్లా అధికారి రాజేష్ శ్రీవాస్తవ తెలిపారు. అయితే ఓవైసీ సభకు అనుమతిస్తే నగరంలోని ప్రశాంతవారణానికి విఘాతం కలిగే అవకాశ ఉందనీ...అనుమతి నిరాకరించాలని కోరుతూ భజరంగ దళ్, వీహెచ్‌పీ, హిందూజాగరణ్ మంచ్ లాంటి సంస్థలు స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో కూడా ఒవైసీ ర్యాలీకి అనుమతి నిరాకరించారు. -
కేసీఆర్‌ను కలిసిన ఒవైసీ బ్రదర్స్
ప్రభుత్వంలో మజ్లిస్ భాగస్వామి కాదని వెల్లడి సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ గురువారం టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ తొలిముఖ్యమంత్రిగా పదవిని చేపట్టబోతున్న కేసీఆర్‌కు అసదుద్దీన్ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్‌తో, అసద్ అరగంటపాటు సమావేశ మయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్, హరీశ్‌రావు, అక్బరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అసదుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్న కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపామని చెప్పారు. అయితే ప్రభుత్వంలో భాగస్వాములు కాబోమని స్పష్టంచేశారు. కేసీఆర్ హయాంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మతకలహాల నిరోధక చట్టాన్ని వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర నూతన చిహ్నంలో చార్మినార్‌ను చేర్చాలని కోరామన్నారు. ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తించాలని ప్రతిపాదించామని చెప్పారు. అదేవిధంగా కృష్ణానది నీరును హైదరాబాద్ ప్రజలకు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. నేషనల్ ఆకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్‌ను పాతబస్తీలో ఎర్పాటు చేయాలన్నామని తెలి పారు. అంతేకాక గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను రద్దుచేసి గతంలో మాదిరిగా 100 డివిజన్లతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏ ర్పాటు చేయాల్సిందిగా కోరామన్నారు. మైనార్టీలకు ఫీజ్ రీయింబర్స్మెంట్ కొనసాగింపు, సబ్‌ప్లాన్ ఏర్పాటు అంశాన్ని కూడా కోరామని ఆయన చెప్పారు. కేసీఆర్‌ను కలిసిన ప్రముఖులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న కేసీఆర్‌కు అభినందనల వెల్లువ కొనసాగుతోంది. గురువారం కర్ణాటక లోకాయుక్త జస్టిస్ వై. భాస్కర్, మాజీ క్రికెటర్ అజహరుద్దీన్, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం కన్వీన ర్ నిమ్మ నారాయణ. రాజ్యసభ మాజీ సభ్యుడు హరికృష్ణ, సినీ నటులు కైకాల సత్యనారాయణ, కల్యాణ్ రామ్‌తో పాటు పలువురు ప్రముఖులు కేసీఆర్‌ను కలిశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి, కార్యదర్శులు బి. వెంకటేశం, పార్థసారధి, నాగిరెడ్డి తదితరులు కూడా ఆయనను కలిశారు. -
తెలంగాణలో టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీ!!
-
తెలంగాణ బిల్లులో సవరణలు చేయాలి: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
దారుషిఫా, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనకు సంబంధించిన తెలంగాణ ముసాయిదా బిల్లు సవరణలు (మార్పులు చేర్పులు) చేయకుండా పార్లమెంటులో ప్రవేశపెడితే తాము మద్దతు ఇవ్వమని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ తేల్చి చెప్పారు. శుక్రవారం రాత్రి సర్వర్‌నగర్ జిర్రాలో మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఒకవేళ పార్లమెంటు ఈ బిల్లును ఆమోదిస్తే తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, తెలంగాణ ముసాయిదా బిల్లు అప్రజాస్వామ్యమని, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని ఈ బిల్లు ఎన్నో తప్పులతో, అసంపూర్తిగానూ ఉందన్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం వీటిని సరి చేయకపోతే మజ్లిస్ పార్టీ పార్లమెంటులో దీనిని వ్యతిరేకిస్తుందని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన లా అండ్ ఆర్డర్, కంట్రోల్ గవర్నర్‌కు అప్పగించలేమన్నారు. ఇదీ రాజ్యాంగం, చట్ట విరుద్ధమన్నారు. గవర్నర్‌కు అధికారాలు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ముసాయిదా బిల్లులో వెంటనే మార్పులు చేర్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. మజ్లిస్ పార్టీ రెండు రాజధానులను కూడా వ్యతిరేకిస్తుందన్నారు. కాంగ్రెస్ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర విభజన చేస్తుందని ఆరోపించారు. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఈ బిల్లుపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి ఇందులో ఉన్న లోపాలను సరి చేయాలన్నారు. పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీని ఓడించగలమన్నారు. టీడీపీ రాబోయే ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కవుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాబోయే ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బీజేపీ ్రపభుత్వం గెలుస్తుందని అపోహలో ఉన్నారని ఇదీ సాధ్యం కాదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ముందస్తు ప్రణాళిక ప్రకారం వ్యవహరించి పార్టీ విజయానికి దోహదపడాలని సూచించారు.