
వికార్ ముఠా ఎన్‌కౌంటర్‌పై ‘సిట్’ విచారణ
లోక్‌సభలో ఒవైసీ ప్రశ్నకు కిరణ్ రిజ్జు సమాధానం
న్యూఢిల్లీ: తెలంగాణలో జరిగిన ఉగ్రవాది వికారుద్దీన్ ముఠా ఎన్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సిట్ ద్వారా విచారణ జరిపిస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజ్జు తెలిపారు. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన వివరాలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మంగళవారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కిరణ్ రిజ్జు ఈ మేరకు లిఖితపూర్వకంగా బదులిచ్చారు.