Special Investigation Team (SIT)
-
రెడ్‌బుక్ కుట్రకే ‘పచ్చ’ సిట్!
సాక్షి, అమరావతి: రెడ్ బుక్ కుట్రలో తాజా అంకానికి చంద్రబాబు ప్రభుత్వం తెరతీసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం కొనుగోళ్లపై అక్రమ కేసు నమోదు చేసిన సీఐడీ చేతులెత్తేయడంతో టీడీపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దాంతో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ పేరిట కొత్త పన్నాగం పన్నింది. తాము చూసి రమ్మని చెబితే.. కాల్చి వచ్చేసేంతటి టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో సిట్‌ను నియమించడం గమనార్హం. సిట్ చీఫ్‌గా నియమించిన ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్బాబుతోపాటు అందులోని సభ్యుల ట్రాక్ రికార్డే చంద్రబాబు ప్రభుత్వ కుట్రను తేటతెల్లం చేస్తోంది. తాము లక్ష్యంగా చేసుకున్న వైఎస్సార్సీపీ నేతలకు వ్యతిరేకంగా తప్పుడు నివేదికలు ఇప్పించి, అక్రమ కేసులతో వేధించడమే ధ్యేయంగా సిట్‌ను నియమించారన్నది సుస్పష్టం. అందుకే సిట్‌కు అపరిమిత అధికారాలు కట్టబెడుతూ మరీ కుతంత్ర కార్యాచరణకు ఉపక్రమించింది. సిట్ సభ్యుల ట్రాక్ రికార్డు ఇలా ఉంది.అక్రమ కేసులు పెట్టడంలో అందెవేసిన చేయి అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఒక మెతుకు పట్టి చూస్తే చాలు అన్నట్టుగా సిట్ చీఫ్‌ను చూస్తే చాలు చంద్రబాబు ప్రభుత్వ కుట్ర తేటతెల్లమవుతుంది. టీడీపీ వీర విధేయుడిగా గుర్తింపు పొందిన అత్యంత వివాదాస్పద అధికారి ఎస్వీ రాజశేఖర్ బాబు. అనంతపురం జిల్లాలో పోస్టింగు నుంచి నేటి వరకు ఆయన టీడీపీకి అత్యంత అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు. ఆ ముద్రను తొలగించుకునేందుకు ఆయన ఏనాడూ ప్రయత్నించక పోవడం గమనార్హం. గత ఏడాది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఆయన్ను ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్‌గా నియమించింది. అప్పటి నుంచి ఆయన రెడ్‌బుక్ కుట్రను అమలు చేయడమే ఏకైక లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసుల నమోదు వెనుక మాస్టర్‌మైండ్‌గా పని చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 111 కింద వ్యవస్థీకృత నేరాల చట్టాన్ని ప్రయోగించడం దేశ వ్యాప్తంగా విస్మయ పరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసుల్లో 75 శాతం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే నమోదు కావడం గమనార్హం. అక్రమంగా నిర్బంధించి రోజుల తరబడి శారీరకంగా హింసించడం పోలీసుల బరితెగింపునకు నిదర్శనం. ఇలా కేసుల నమోదు చెల్లదని హైకోర్టు స్పష్టం చేయడంతో రాజశేఖర్‌బాబు అక్రమ కేసుల కుట్రకు తెరపడింది. ఇక వలపు వల (హనీట్రాప్) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే నేర చరిత్ర ఉన్న ముంబయికి చెందిన కాదంబరి జత్వానీని అడ్డం పెట్టుకుని అక్రమ కేసులను దగ్గరుండీ పర్యవేక్షించిందీ రాజశేఖర్ బాబే. చంద్రబాబు ఆదేశాలతో ఆయన చేసిన నిర్వాకంతో ప్రముఖ పారిశ్రామికవేత్త, జేఎస్‌డబ్ల్యూ గ్రూపు అధినేత సజ్జన్ జిందాల్‌ను వేధించారు. దాంతో హడలిపోయిన జేఎస్‌డబ్ల్యూ గ్రూపు రాష్ట్రంలో పెట్టాల్సిన రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులను మహారాష్ట్రకు తరలించేసింది. ఇలా ప్రభుత్వ పెద్దలు చెబితే చాలు ఎంతటి అక్రమానికైనా తెగించే ఏకైక అర్హతతోనే రాజశేఖర్ బాబును సిట్ చీఫ్‌గా నియమించారు.పట్టుబట్టి తెలంగాణ నుంచి రప్పించి..సిట్‌లో మరో సభ్యుడు ఎల్.సుబ్బారాయుడు టీడీపీ వీరవిధేయ కుటుంబీకుడు. అనంతపురం జిల్లాకు చెందిన ఆయన కుటుంబం టీడీపీ తరఫున రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. అందుకే తెలంగాణ క్యాడర్‌కు చెందిన సుబ్బారాయుడును పట్టుబట్టి చంద్రబాబు మరీ ఏపీకి రప్పించుకున్నారు. అనంతరం రెడ్‌బుక్ కుట్ర కేసుల నమోదు బాధ్యతలను అప్పగించారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలతో ఆయన హడలెత్తించారు.ఇటీవల తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ ప్రక్రియలో తొక్కిసలాట జరిగి, ఆరుగురు భక్తులు దుర్మరణం పాలవ్వడం పూర్తిగా పోలీసు వైఫల్యమే. అందుకు సుబ్బారాయుడిని సస్పెండ్ చేయాల్సిన ప్రభుత్వం కేవలం బదిలీతో సరిపెట్టింది. అది కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా నియమించి చిత్తూరు జిల్లాలోనే పోస్టింగ్ ఇచ్చింది. తాజాగా సిట్‌లో సభ్యుడిగా నియమించింది. టీడీపీ ఎంతంటే అంతే..సిట్‌లో మరో సభ్యుడు నంద్యాల డీఎస్పీ పి.శ్రీనివాస్ తీరు మొదటి నుంచి అత్యంత వివాదాస్పదం. సత్యసాయి జిల్లా కదిరికి చెందిన ఆయన కుటుంబం టీడీపీలో క్రియాశీలకంగా ఉంది. ఎస్సై, సీఐగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధులు నిర్వహించిన శ్రీనివాస్.. టీడీపీకి అనుకూల అధికారిగా ముద్ర పడ్డారు. గత ఏడాది ఎన్నికల ముందు కూడా ఆయన పలువురు పోలీసు అధికారులకు ఫోన్లు చేసి మరీ టీడీపీకి అనుకూలంగా పని చేయాలని ఒత్తిడి తేవడం వివాదాస్పదమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శ్రీనివాస్ మాటే నంద్యాల జిల్లాలో శాసనంగా మారింది. జిల్లాలో సీఐలు, ఎస్సైల పోస్టింగుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. అసాంఘికాలకు ఊతంఒంగోలు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగం అదనపు ఎస్పీగా ఉన్న కొల్లి శ్రీనివాస్‌ను కూటమి ప్రభుత్వం సిట్‌లో సభ్యునిగా నియమించింది. గతంలో విజయవాడలో అదనపు డీసీపీగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఆయన సొంతం. స్పాలలో అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించడం వెనుక ఆయనదే ప్రధాన పాత్ర. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆయన్ను బదిలీ చేసి వీఆర్‌కు పంపింది. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఆయన్ను సిట్ సభ్యునిగా నియమించింది. అక్రమంగా కాల్ రికార్డ్స్ ఆయన ఘనతసిట్లో మరో సభ్యుడు ప్రస్తుతం సీఐడీ అదనపు ఎస్పీగా ఉన్న ఆర్. శ్రీహరి బాబు ట్రాక్ రికార్డు మరింత వివాదాస్పదం. గతంలో ఆయన గురజాల డీఎస్పీగా ఉన్నప్పుడు పలువురు ఎమ్మెల్యేల కాల్ రికార్డుల వివరాలను అక్రమంగా సేకరించి ఇతరులకు చేరవేశారు. బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే ఉద్దేశంతోనే కాల్ రికార్డుల డేటాను అక్రమంగా సేకరించడం అప్పట్లో తీవ్ర వివాదాస్పదమైంది. ఈ కాల్ రికార్డుల కుట్ర వెనుక సూత్రధారి నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కావడం గమనార్హం. దాంతో శ్రీహరిబాబును వైఎస్సార్సీపీ ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనకు ఫోకల్ పోస్టింగు ఇవ్వకుండా పక్కన పెట్టింది. ఇలాంటి ట్రాక్ రికార్డు కలిగిన శ్రీహరి బాబును సిట్ సభ్యునిగా చేర్చడం కూటమి ప్రభుత్వం కుట్రకు తార్కాణం. -
AP: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్
సాక్షి, విజయవాడ: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్ ఏర్పాటైంది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే, ‘సీజ్ ది షిప్’ ఎపిసోడ్‌పై విచారణను మాత్రం సిట్‌కి అప్పగించలేదు. గత నెల, ఈ నెలలో జరిగిన బియ్యం అక్రమ రవాణా అంశాలను సిట్ పరిధికి ప్రభుత్వం అప్పగించలేదు.స్టెల్లా, కెన్ స్టార్ షిప్‌లలో బియ్యం రవాణా అంశాన్ని సిట్‌కి అప్పగించని ప్రభుత్వం.. జూన్, జులైలో నమోదైన రేషన్ బియ్యం రవాణా కేసుల విచారణను మాత్రమే సిట్‌కి అప్పగించింది. 13 ఎఫ్ఐఆర్లు నమోదైన కేసులు సిట్‌కి అప్పగించింది. సిట్ జీవోలో ఎక్కడా కూడా సీజ్ ది షిప్ ఎపిసోడ్ ప్రస్తావన లేదు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు -
కస్టడీలో మహిళకు చిత్రహింసలపై సిట్
న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో ట్రెయినీ వైద్యురాలి హత్యాచారాన్ని నిరసిస్తూ ఆందోళనల్లో పాల్గొన్న ఓ మహిళను లాకప్‌లో ఉంచి చిత్రహింసలు పెట్టిన ఘటనపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)ను ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఘటనపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కలకత్తా హైకోర్టు ఇచి్చన తీర్పును సవరిస్తూ సోమవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ల ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ప్రతి అంశాన్నీ సీబీఐకి బదిలీ చేయలేమని పేర్కొన్న ధర్మాసనం.. దర్యాప్తు బాధ్యతలను సీనియర్ ఐపీఎస్ అధికారులకు అప్పగించాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన అధికారులతో ఏర్పాటయ్యే సిట్ తమ విచారణ పురోగతిపై వారం వారం కలకత్తా హైకోర్టు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కేసు తీర్పు కోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని కూడా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ధర్మాసనం సూచించింది. కస్టడీలో మహిళను చిత్రహింసలకు గురిచేసిన ఘటనపై ఏర్పాటయ్యే ఏడుగురితో కూడిన ఐపీఎస్‌ల సిట్‌లో ఐదుగురు మహిళలు కూడా ఉండాలని నవంబర్ 11న జరిగిన విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఘటనపై దర్యాప్తునకు సమర్థులైన అధికారులుండగా హైకోర్టు మాత్రం పొరపాటున సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందంటూ రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తుతో రాష్ట్ర పోలీసుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. నిరసనల్లో పాల్గొన్నారనే కారణంతో సెపె్టంబర్ 7వ తేదీన తమను కోల్‌కతాలోని ఫల్టా పోలీసులు అరెస్ట్ చేసి, కొట్టారంటూ రెబెకా ఖాతూన్ మొల్లా, రమా దాస్ అనే వారు పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలు నిజమేనని తేలి్చన కలకత్తా హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ అక్టోబర్ 8న ఆదేశించింది. -
సుప్రీం కోర్టు నిర్ణయాలతో వణికిపోతోన్న చంద్రబాబు నాయుడు అండ్ కో
-
బాబు సిట్' క్లోజ్
-
స్వతంత్ర సిట్ నిజాలు నిగ్గుతేల్చుతుందా ?
-
సిట్ విచారణ నిలిపివేత
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఆ ఆరోపణలపై విచారణ కోసం ఆయనే ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ నిలిచిపోయింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమలలో మంగళవారం ప్రకటించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఆరోపణలపై సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని.. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండటం వల్ల దర్యాప్తును ఆపుతున్నామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీస్, టీటీడీ విజిలెన్స్ అధికారులతో తిరుమలలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడిన కేసు తీవ్రత వల్లే సిట్ వేశామని.. మూడు రోజుల పాటు టీటీడీలో సిట్ దర్యాప్తు సాగిందన్నారు. ప్రస్తుతానికి సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం దర్యాప్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 3 రోజుల దర్యాప్తు వివరాలను సిట్ చీఫ్ తమకు అందజేశారని చెప్పారు.బ్రహ్మోత్సవాల్లో పటిష్ట భద్రత బ్రహ్మోత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని డీజీపీ తెలిపారు. 5,145 మంది పోలీస్ సిబ్బందిని బ్రహోత్సవాలకు వినియోగిస్తున్నామన్నారు. గరుడ వాహనం రోజున ప్రత్యేకంగా మరో 1,264 మందిని భద్రత కోసం నియమిస్తున్నట్టు చెప్పారు. తిరుమలలో 24 ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను గుర్తించామని, వీటిలో 8 వేల వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చన్నారు. దసరాకు 6,100 ప్రత్యేక బస్సులు భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా తిరుమలకు అదనంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. దసరా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. వీటిలో అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని చెప్పారు. -
ఏఆర్ ఫుడ్స్‌పై ఫిర్యాదులో జాప్యం ఎందుకు: ‘సిట్’ ఆరా
సాక్షి,తిరుపతి: తిరుమల లడ్డూ వివాదంపై ఏర్పాటైన సిట్ మూడోరోజు విచారణను సోమవారం(సెప్టెంబర్30) కొనసాగిస్తోంది. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై తిరుమల మార్కెటింగ్ జీఎం రెండు నెలల తర్వాత ఫిర్యాదు చేయడంపై సిట్ ఆరా తీస్తోంది.నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ ఫుడ్స్‌పై ఫిర్యాదు చేయడంలో జాప్యంపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. లడ్డూ తయారీకి సంబంధించి భాగమైన ఫ్లోర్‌మిల్, ల్యాబ్, ఇతర ముడిసరుకుల నాణ్యతను సిట్ పరిశీలించింది.ఇదీ చదవండి: తిరుమల లడ్డూ వివాదం..సుప్రీంకోర్టులో విచారణ -
కల్తీ నెయ్యి వ్యవహారం పై జోరు పెంచిన సిట్ ..ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు
-
కల్తీ నెయ్యి వ్యవహారం పై జోరు పెంచిన సిట్ ..ఏఆర్ ఫుడ్స్ కు నోటీసులు
-
ఇది చంద్రబాబు బీ టీం.. సిట్ పై మల్లాది విష్ణు విమర్శలు
-
తిరుమల లడ్డూ ఎపిసోడ్ పై కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
-
తిరుపతిలో నేడు రెండవ రోజు సిట్ బృందం విచారణ
-
సిట్.. బాబు స్కిట్.. ఏదో తేడా కొడుతోంది
-
హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు సిట్ ఏర్పాటు
సాక్షి, విశాఖపట్నం: హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తాజాగా హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు విచారణకు విశాఖపట్నం సీపీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. విశాఖ సీపీ రవిశంకర్ ఆధ్వర్యంలో 20 మందితో సిట్ బృందం ఏర్పడింది. జాయింట్ సీపీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, 12 మంది హెడ్ కానిస్టేబుళ్లతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ కేసును లోతుగా దర్యాప్తు చేయనుంది. మరోవైపు.. ఆపరేషన్ కంబోడియా విజయవంతమైంది. 360 మంది భారతీయులను ఎంబసీ అఫ్ ఇండియా కాపాడింది. సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్: + 855 10642777 సంప్రదించాలని అధికారులు కోరారు. అయితే.. విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. అక్కడ నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్’ ద్వారా వీడియో సందేశాలు పంపించిన విషయం తెలిసిందే.విదేశాల్లో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్ విజయ్‌కుమార్ సోషల్ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్ బాధితులను రిసీవ్ చేసుకొని కంబోడియాలో పాయిపేట్ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్ వీసా చేయించి ఆ గ్యాంగ్ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు.అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు.ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్ కమిషనర్ ఫకీరప్ప సారథ్యంలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. -
బదిలీలతో బరితెగింపు
సాక్షి, అమరావతి: ఎన్నికల వేళ పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో విధ్వంస కాండను అరికట్టడం, అనంతరం కేసుల దర్యాప్తులో పోలీసు అధికారులు విఫలమయ్యారని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) నిర్ధారించింది. నిందితులపై కీలక సెక్షన్ల కింద కేసులు నమోదు చేయకపోవడాన్ని ప్రస్తావించింది. మూడు జిల్లాల్లో హింసాత్మక సంఘటనలపై విచారించిన సిట్ బృందం ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్ ప్రాథమిక నివేదికను సోమవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తాకు అందచేశారు. రెండు రోజుల పాటు విస్తృతంగా విచారణ నిర్వహించిన సిట్ అధికారుల బృందం పోలీసుల వైఫల్యాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. పూర్తి నివేదిక అందించేందుకు మరికొంత సమయం పడుతుందని పేర్కొంది. బదిలీ చేసిన జిల్లాల్లోనే హింసపోలింగ్‌కు ముందు చంద్రబాబు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల కమిషన్ (ఈసీ)పై ఒత్తిడి తెచ్చి పల్నాడు నుంచి అనంతపురం వరకు ఏకంగా 39 మంది పోలీసు అధికారులను బదిలీ చేయించిన విషయం తెలిసిందే. వారి స్థానాల్లో పురందేశ్వరి సమర్పించిన జాబితాలోని అధికారులనే ఈసీ నియమించడం గమనార్హం. ఈ క్రమంలో పోలింగ్ రోజు మే 13న, అనంతరం టీడీపీ గూండాలు యథేచ్చగా విధ్వంసానికి పాల్పడ్డారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు శాంతి భద్రతల పరిరక్షణలో దారుణంగా విఫలమయ్యారు. అనంతరం కేసుల నమోదు, దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించారు.అదనపు సెక్షన్లు చేర్చండి..విధ్వంస కాండపై పోలీసుల దర్యాప్తు తూతూ మంత్రంగా ఉందని సిట్ స్పష్టం చేసింది. నిందితులను పట్టుకునేందుకు అదనపు బృందాలను ఏర్పాటు చేయడంతోపాటు అదనంగా మరికొన్ని సెక్షన్లు జోడించాలని సూచించింది. అందుకోసం న్యాయస్థానాల్లో మెమో దాఖలు చేయాలని పేర్కొంది. నిందితులను త్వరగా అరెస్టు చేయడంతోపాటు ముందస్తు తేదీతో చార్జ్షీట్లను దాఖలు చేయాలని పేర్కొంది. పోలింగ్ సందర్భంగా దాడుల కేసుల దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సిట్ స్పష్టం చేసింది.నాలుగు బృందాలు..పోలింగ్ సందర్భంగా హింసాత్మక సంఘటనలపై సిట్ విస్తృతంగా దర్యాప్తు చేసింది. వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ నాలుగు బృందాలుగా ఏర్పడి శని, ఆదివారాల్లో విచారణ నిర్వహించింది. పల్నాడు జిల్లాలో రెండు బృందాలు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఒక్కో బృందం పర్యటించి హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రదేశాలను పరిశీలించాయి. బాధితులతో మాట్లాడి వారి నుంచి ఫిర్యాదులు స్వీకరించాయి. పోలీసు అధికారులను విచారించడంతోపాటు మొత్తం పరిస్థితిని సమీక్షించాయి.కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారని వైఎస్సార్సీపీ పేర్కొంది. పోలింగ్ రోజు, అనంతరం టీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. దాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్ డేటా సేకరించి విచారణ నిర్వహించాలని కోరింది. ఈ కేసులపై విచారణ నిర్వహిస్తున్న సిట్ ఇన్చార్జ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం సోమవారం కలిసింది. టీడీపీ నేతలు, ఆ పార్టీ గూండాలు పక్కా పన్నాగంతో ఎలా దాడులకు పాల్పడ్డారో వివరిస్తూ ఆధారాలను అందచేసింది. మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేశ్‌తోపాటు వైఎసార్సీపీ నేతలు పేర్ని నాని, రావెల కిషోర్ బాబు, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్, లేళ్ల అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. అనంతరం డీజీపీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.బదిలీలు చిన్న విషయం కాదు: అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రిచంద్రబాబు, పురందేశ్వరి ఈసీపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల ముందు పోలీసు అధికారులను మార్చి అల్లరి మూకలను దాడులకు పురిగొల్పారు. క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉన్న పోలీసు అధికారులను బదిలీ చేయించడంతో టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడ్డాయి. అధికారులను బదిలీ చేసిన ప్రాంతాల్లోనే దాడులు, విధ్వంసం చోటుచేసుకున్నాయి. అప్పటికప్పుడు ఐపీఎస్ అధికారులను మార్చడం చిన్న విషయం కాదు. టీడీపీ పన్నాగంలో పోలీసు అధికారులు పావులుగా మారడం దురదృష్టకరం.అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసులు దాడి చేసి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ పరిస్థితులు కుదుట పడలేదు. మా పార్టీ నేతలపై జరిగిన దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు పెట్టడం లేదు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడమే తడవు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు.ప్రజాబలంతో ఎదుర్కొలేక గూండాగిరి: మంత్రి జోగి రమేష్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కుట్రలకు బరి తెగించారు. ప్రజల మద్దతులేని టీడీపీ కూటమి ఎన్నికలను ఎదుర్కోలేక దౌర్జన్యాలకు తెర తీసింది. అరాచకాలు, దౌర్జన్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. టీడీపీ నిర్వాకంతో ఈ ఎన్నికలు రాష్ట్ర చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోయాయి.హక్కులు కాలరాశారు: రావెల కిషోర్ బాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు టీడీపీ విధ్వంసకాండకు పాల్పడింది. వారిని గ్రామాల నుంచి తరిమేశారు. అంబేడ్కర్ అందించిన రాజ్యాంగ హక్కులను కాలరాసిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 33 కేసులు.. 1,370 మంది నిందితులుపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ సందర్భంగా దాడులు, దౌర్జన్యకాండపై ఇప్పటివరకు 33 కేసులు నమోదు చేశారు. పల్నాడు జిల్లాలో 22,అనంతపురం జిల్లాలో 7, తిరుపతి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి. మొత్తం 1,370 మందిని నిందితులుగా పేర్కొనగా ఇప్పటివరకు 124 మందిని అరెస్ట్ చేశారు. మరో 94 మందికి సెక్షన్ 41 ఏ కింద నోటీసులు జారీ చేశారు. -
సత్తెనపల్లిలో సిట్ టీమ్
-
సిట్ వద్ద కీలక ఆధారాలు.. విచారణ అడ్డుకునే కుట్ర
-
చివరి అంకానికి సిట్ దర్యాప్తు
-
సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు
-
సిట్ దర్యాప్తు ముమ్మరం
సాక్షి, అమరావతి/నరసరావుపేట/రెంటచింతల/తాడిపత్రి: రాష్ట్రంలో పోలింగ్ అనంతరం హింసాత్మక సంఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో దాడులు, అల్లర్ల పూర్వాపరాలు విచారిస్తూ ఆ ఘటనలపై కేసులు నమోదు చేసిన తీరును విశ్లేíÙస్తోంది. ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ ఒత్తిడితో ఈసీ హడావుడిగా డీఐజీలు, ఎస్పీలు, ఇతర పోలీసు అధికారులను బదిలీ చేసిన పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లోనే పోలింగ్ రోజున, అనంతరం భారీగా విధ్వంసకాండ చెలరేగడం తెలిసిందే. వీటిపై ఏర్పాటైన సిట్‌కు నేతృత్వం వహిస్తున్న అదనపు డీజీ వినీత్ బ్రిజ్‌లాల్ తమ అధికారులను మూడు బృందాలుగా విభజించి శనివారం ఉదయానికే పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాలకు పంపారు. మరోవైపు ఆయన డీజీపీ హరీశ్ కుమార్ గుప్తాతో శనివారం సమావేశమై సిట్ కార్యాచరణ గురించి చర్చించారు. అనంతరం ఆ మూడు జిల్లాల్లో విచారణ చేపట్టిన పోలీసు అధికారుల బృందాలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏఏ అంశాలపై దృష్టి సారించాలనే అంశాన్ని వారికి స్పష్టం చేశారు. దాంతో పల్నాడు, అనంతపురం జిల్లాల్లో దాడులు సంభవించిన ప్రాంతాల్లో సిట్ సభ్యులు పర్యటించారు. గురజాల, మాచర్ల, నరసారావుపేట, సత్తెనపల్లి, తాడిపత్రి పోలీసు స్టేషన్లల్లో పోలీసు అధికారులను విచారించారు. దాడులు సంభవించిన తీరు, సమాచారం అందిన వెంటనే పోలీసు అధికారులు స్పందించిన తీరు, నమోదు చేసిన కేసులు, అందులో పేర్కొన్న సెక్షన్లు తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ఎఫ్ఐఆర్ కాపీలు, కేసు ఫైళ్లు, దాడుల వీడియో రికార్డింగులను పరిశీలించారు. దాడుల తీవ్రతను అంచనా వేసి, ఆ మేరకు తగిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారా.. లేక తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసి చేతులు దులిపేసుకున్నారా.. అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. దాదాపు అన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్లే ఆయా జిల్లాల్లో జరిగిన దాదాపు అన్ని సంఘటనల్లోనూ హత్యాయత్నం, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించడం తదితర నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు సిట్ బృందాలు గుర్తించినట్టు సమాచారం. 144 సెక్షన్ అమలులో ఉన్నా సరే అంత మంది ఎలా గుమిగూడగలిగారు? మాచర్ల నియోజకవర్గంలో పక్కా పన్నాగంతో దారి కాచి మరీ ఎలా దాడులు చేయగలిగారు? ఎలా వెంటపడి తరమగలిగారు? తాడిపత్రిలో వందలాది మంది ఒకేసారి వచ్చి ఎలా రాళ్ల దాడి చేయగలిగారు..? అనే కోణాల్లో సిట్ అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం. సత్తెనపల్లి, గురజాల నియోజకవర్గాల్లో దాడుల బాధితులు రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గుడిలో ఆశ్రయం పొందాల్సినంత పరిస్థితి ఎందుకు ఏర్పడింది.. దీనిపై పోలీసులకు సమాచారం ఉందా లేదా.. పోలీసులు ఆ బాధితులకు అండగా నిలబడేందుకు వెంటనే గుడి వద్దకు ఎందుకు వెళ్లలేకపోయారు.. అనే కోణాల్లో సిట్ అధికారులు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సమస్యాత్మక, అతి సమస్యాత్మకంగా గుర్తించిన పోలింగ్ కేంద్రాల వద్ద ఈసీ మార్గదర్శకాల మేరకు బందోబస్తుపై సిట్ అధికారులు సమీక్షించారు. ఆ కేంద్రాల వద్ద తగినంతగా కేంద్ర బలగాలను మోహరించలేదనే విషయాన్ని సిట్ అధికారులు గుర్తించినట్టు సమాచారం. కాగా, ఎన్నికల సందర్భంగా హింసాత్మక సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుగానే నేర చరిత్ర కలిగిన వారిపై చేపట్టిన చర్యల గురించి సిట్ అధికారులు ప్రశి్నంచినట్లు తెలుస్తోంది. పీడీ యాక్ట్ కింద కేసుల నమోదులో నిర్లక్ష్యంగా వ్యవహరించారా.. అనే కోణంలోనూ విచారిస్తున్నారు. దాడులు అరికట్టడంలో వైఫల్యం చెందారని ఈసీ సస్పెండ్ చేసిన, బదిలీ చేసిన అధికారులను కూడా సిట్ అధికారులు ప్రశి్నంచనున్నారు. వారి వివరణను కూడా నమోదు చేస్తారు. ఈసీ బదిలీ చేసినా ఆయనదే పెత్తనమా!? హింసాత్మక సంఘటనలను కట్టడి చేయడంలో విఫలమయ్యారని ఈసీ బదిలీ చేసిన కొందరు ఉన్నతాధికారులు ఇంకా ఆ జిల్లాలో ప్రభావం చూపిస్తుండటం విస్మయ పరుస్తోంది. అనంతపురం జిల్లాల్లో ఈసీ సస్పెండ్ చేసిన ఓ అధికారే ప్రస్తుతం సిట్ దర్యాప్తు కోసం సమరి్పంచిన రికార్డుల వ్యవహారాలను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. పోలీసు రికార్డుల విభాగంలో అత్యంత వివాదాస్పద డీఎస్పీ స్థాయి అధికారి అందుకు సహకరిస్తుండటం పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది. దాడులను అరికట్టడంలో ఎవరైతే విఫలమయ్యారని ఈసీ భావించిందో.. ఆ అధికారి కనుసన్నల్లోనే సిట్ పరిశీలనకు అవసరమైన రికార్డులు సమర్పిస్తే పారదర్శకత, నిష్పాక్షికత ఎక్కడ ఉంటుందని అధికార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. తాడిపత్రిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసంపై పోలీసులే దాడి చేయడం, ఆస్తులను ధ్వంసం చేయడం, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా విరుచుకుపడటం గమనార్హం. దీన్ని ఈసీ తీవ్రంగా పరిగణించి, అందుకు బాధ్యులైన అధికారిని బదిలీ చేసి.. సిట్ విచారణకు ఆదేశించింది. కాగా ఆ అధికారే సిట్ దర్యాప్తునకు అవసరమైన రికార్డులను పరోక్షంగా రూపొందిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. మరి దీనిపై సిట్, ఈసీ ఎలా స్పందిస్తాయన్నది చూడాలి. ఇదిలా ఉండగా సిట్ అధికారులు ఆదివారం తిరుపతిలో పర్యటించనున్నారు. అల్లర్లు సంభవించిన ప్రాంతాల్లో పర్యటిస్తారు. దాడులు చెలరేగినప్పుడు పోలీసులు తీసుకున్న చర్యలను సమీక్షిస్తారు. రేపు ప్రాథమిక నివేదిక ఇంతటి సున్నితమైన అంశంపై కేవలం రెండు రోజుల్లోనే ప్రాథమిక నివేదిక సమరి్పంచాలని ఈసీ ఆదేశించడంతో సిట్‌కు సమయం చాలా తక్కువగా ఉంది. దాంతో సోమవారం ఉదయం తొలుత ప్రాథమిక నివేదికను ఈసీకి సమర్పించాలని భావిస్తోంది. దాడులు జరిగిన తీరు, వాటిపై పోలీసులు తీసుకున్న చర్యల గురించి ఈ ప్రాథమిక నివేదికలో పొందు పరచనుంది. పూర్తి స్థాయిలో విచారణకు మరింత సమయం కావాలని కోరే అవకాశాలున్నాయి. సిట్ ప్రాథమిక నివేదిక పరిశీలించిన అనంతరం ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్ని కేసులు.. ఎంత మంది అరెస్ట్?ఏసీబీ అదనపు ఎస్పీ సౌమ్యలత ఆధ్వర్యంలోని సిట్ బృందం శనివారం నరసరావుపేటలో పర్యటించింది. మధ్యాహ్నం మూడు గంటలకు నరసరావుపేట చేరుకున్న బృందం నేరుగా టూ టౌన్ పోలీసు స్టేషన్‌ను సందర్శించింది. ఆ స్టేషన్ పరి«దిలో నమోదైన ఐదు కేసుల వివరాలను అధికారులు పరిశీలించారు. సీఐ భాస్కర్‌తో చర్చించారు. ఎవరెవరిపై కేసులు నమోదు చేశారు.. ఎవరిని అరెస్టు చేశారు.. దర్యాప్తు ఎంతవరకు వచి్చంది.. అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గృహంపై దాడిచేసి ఇద్దరిని గాయపర్చి మూడుకార్లు ధ్వంసంపై నమోదైన కేసు, బాలికోన్నత పాఠశాలలో ఏజెంట్లుగా కూర్చున్న వైఎస్సార్సీపీ నాయకులు గంటెనపాటి గాబ్రియేలు, గోపిరెడ్డి డ్రైవర్ హరిపై టీడీపీ అభ్యర్థి అరవిందబాబు, అతని అనుచరులు చేసిన దాడి కేసు, అరవిందబాబు కారుపై జరిగిన దాడి కేసు, మల్లమ్మసెంటర్‌లో బొలేరో వాహనాన్ని తగులపెట్టిన కేసు, రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలో పమిడిపాడు, దొండపాడు గ్రామాల్లో జరిగిన సంఘటనలపై నమోదైన కేసుల వివరాలను ఆయా స్టేషన్ పోలీసుల నుంచి సేకరించారు. రబ్బరు బుల్లెట్లతో ఎందుకు ఫైరింగ్ చేయాల్సి వచి్చందో వివరణ తీసుకున్నట్లు తెలిసింది. కాగా, ఇద్దరు సిట్ బృందం అధికారులు శనివారం రాత్రి రెంటచింతల పోలీసు స్టేషన్‌కు వచ్చి రికార్డులను పరిశీలించారు. మండల పరిధిలోని తుమృకోట, రెంటచింతల, పాలువాయిగేటు, రెంటాల, జెట్టిపాలెం గ్రామాలలో చోటుచేసుకున్న పరిణామాల గురించి ఆరా తీశారు. ఆయా ఘటనల్లో నిందితులుగా ఉన్న వారు స్వచ్ఛందంగా లొంగిపోయి, గ్రామాలలో ప్రశాంత వాతావరణానికి సహకరించాలని అడిషనల్ ఎస్పీ రమణమూర్తి కోరారు. సిట్ బృందం తాడిపత్రిలో కూడా విచారించింది. ఏసీబీ డీఎస్పీ వి.శ్రీనివాసరావు, గుంటూరు రేంజ్ ఇన్స్పెక్టర్ వి.భూషణం, ఏసీబీ ఇన్స్పెక్టర్ జీఎల్ శ్రీనివాస్‌లు తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని కేసుల గురించి ఆరా తీశారు. డీఐజీ షిమోసీ వాజ్‌పాయ్‌తో మాట్లాడిన తర్వాత స్థానిక పోలీసులతో కలసి తాడిపత్రిలో అల్లర్లు జరిగిన ఓంశాంతి నగర్, టీడీపీ నేత సూర్యముని నివాసం, జూనియర్ కళాశాల మైదానం, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం, మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసం తదితర ప్రాంతాలను పరిశీలించారు. -
అల్లర్లపై రంగంలోకి దిగిన సిట్
-
లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
బెంగళూరు: లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. అసభ్య వీడియోలు సోషల్ మీడియాలో వైరలైన అనంతరం ఆయన దేశం వదిలి జర్మనీ వెళ్లిపోయారు. ఇప్పటికే లైంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది.‘ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేశాం. ఇంటర్‌పోల్ అన్ని దేశాలకు సమాచారం పంపించింది. ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడ ఉన్నా పట్టుకోవాలని ఇంటర్‌పోల్ ఇతర దేశాల పోలీసులకు ఆదేశించింది’ అని కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆదివారం పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణను భారత్‌కు తీసుకురావడానికి సిట్ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసు పంపాలని సిట్(SIT)సీబీఐకి విజ్ఞప్తి చేసింది.ఇప్పటికే సిట్.. ప్రజ్వల్ రేవణ్ణపై రెండుసార్లు లుక్ అవుట్ నోటీసుల జారీచేసింది. మరోవైపు.. మహిళా కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తండ్రి హెడ్డీ రేవణ్ణను శనివారం పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించినవి వైరల్ అయిన అసభ్యకర వీడియోలు, ప్రజ్వల్, ఆయన తండ్రిపై నమోదైన లైంగిక ఆరోపణల కేసు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది.బ్లూ కార్నర్ నోటీసులు అంటే?బ్లూ కార్నర్ నోటీసు ఇంటర్ పోల్ నోటీసుల్లో ఒక భాగం. ఇది ప్రపంచ వ్యాప్తంగా నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సమాచారం కోసం ఇతర దేశాలతో హెచ్చరికలు, అభ్యర్థనలకు అనుమతి ఇస్తుంది. ఇతర దేశాల్లోని పోలీసులతో సమన్వయమై.. కీలకమైన నేర సంబంధిత సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతి ఇవ్వబడుతుంది. మొత్తం ఏడు రకాల నోటీసులు ఉంటాయి. రెండ్, ఎల్లో, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఆరెంజ్, పర్పుల్. నేర దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి సంబంధించి అదనపు సమాచారం సేకరించడానికి, వ్యక్తి గుర్తింపు, ఎక్కడ ఉన్నాడో తెలిపే లొకేషన్ వంటి కీలకమైన విషయాలను తెలుసుకోవడానికి ‘బ్లూ కార్నర్’ నోటీసులు జారీ చేస్తారు. -
PrajwalRevannavideo: త్వరలో భారత్‌కు ప్రజ్వల్ రేవణ్ణ..?
బెంగళూరు: మహిళలపై లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో సస్పెండైన జేడీఎస్ ఎంపీ రేవణ్ణ జర్మనీ నుంచి త్వరలో ఇండియా వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మే 3-4 తేదీల మధ్య రేవణ్ణ బెంగళూరుకు చేరుకోవచ్చని కర్ణాటక పోలీసు వర్గాలు చెబుతున్నాయి.లైంగిక వేధింపుల వీడియోల వ్యవహారంలో కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు ఇవ్వడంతో ప్రజ్వల్ భారత్‌కు రావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ కేసులో ప్రజ్వల్ తండ్రి ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణకు కూడా సిట్ నోటీసులు ఇచ్చింది. కాగా, ప్రజ్వల్ రేవణ్ణ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వీడియోలు గత వారం హసన్ ప్రాంతంలో వైరల్ అయ్యాయి. మొత్తం 2,976 వీడియోలున్న పెన్‌డ్రైవ్ బయటపడడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోలన్నీ 2019-2022 మధ్య బెంగళూరు, హసన్‌లలోని రేవణ్ణ నివాసాలలో చిత్రీకరించినవనిప్రాథమికంగా తేలింది. తనపై ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఒక మహిళ చేసిన ఫిర్యాదుతో అతడిపై ఐపీసీలోని పలు సెక్షన్ల కిందపోలీసులు కేసు నమోదు చేశారు.లైంగిక వేధింపుల వీడియోలు వెలుగు చూసి వివాదం పెద్దదైన నేపథ్యంలో రేవణ్ణ ఏప్రిల్ 27న బెంగళూరు నుంచి జర్మనీ వెళ్లిపోయాడు. కాగా, రేవణ్ణ జేడీఎస్ తరపున హసన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇక్కడ ఏప్రిల్ 26న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో ఇద్దరి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మాజీ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, ఎన్స్పెక్టర్ గట్టు మల్లును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వీరిని గురువారం హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు, ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు. కాగా ప్రణీత్‌రావుపై కేసు నమోదుకాగానే రాధాకిషన్‌రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్‌కు తిరిగివచ్చారు. ప్రణీత్ రావు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభాకర్‌రావుతో సమానంగా రాధాకిషన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో రాధాకిషన్ గట్టుమల్లు కీలకపాత్ర వహించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై వీరు నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో బుధవారం వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. చదవండి: ఎస్ఐబీలో నడిచిన ఓఎస్డీల రాజ్యం.. -
Adani-Hindenburg case: ‘అదానీ’కి భారీ ఊరట
న్యూఢిల్లీ: ప్రముఖ కార్పొరేట్ సంస్థ ‘అదానీ గ్రూప్’నకు మరో విజయం లభించింది. స్టాక్ ధరల్లో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ సంస్థపై కొనసాగుతున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) లేదా సీబీఐకి అప్పగించేందుకు సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అదానీ గ్రూప్‌పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా(సెబీ) కొనసాగిస్తున్న దర్యాప్తు పట్ల న్యాయస్థానం సంతృప్తి వ్యక్తం చేసింది. సెబీ సమగ్ర దర్యాప్తు జరుపుతోందని వెల్లడించింది. ఈ దశలో సెబీ దర్యాప్తుపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దర్యాప్తును సెబీ నుంచి సిట్ లేదా సీబీఐకి బదిలీ చేయాలన్న వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దీవాలా, మనోజ్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 46 పేజీల తీర్పు వెలువరించింది. అదానీ గ్రూప్‌పై పెండింగ్‌లో ఉన్న రెండు దర్యాప్తులను 3 నెలల్లోగా పూర్తి చేయాలని సెబీని ఆదేశించింది. సెబీ దర్యాప్తును అనుమానించలేం అదానీ గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీల షేర్ల ధరలను కృత్రిమంగా పెంచిందని, మదుపర్లను మోసగించిందని ఆరోపిస్తూ అదానీ–హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ వివాదం తర్వాత సుప్రీంకోర్టులో నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. న్యాయవాదులు విశాల్ తివారీ, ఎంఎల్ శర్మ, కాంగ్రెస్ నేత జయ ఠాకూర్, అనామికా జైశ్వాల్ ఈ పిటిషన్లు దాఖలు చేశారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ నివేదిక వచి్చన తర్వాత ఆ కంపెనీ షేర్లు భారీగా పతనమయ్యాయని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సెబీ చట్టంలో చేసిన మార్పుల కారణంగా అదానీ గ్రూప్ అవకతవకలు బయటపడడం లేదని పిటిషనర్లు ఆరోపించారు. సెబీని పటిష్టం చేయాలని కోరారు. ఈ నాలుగు పిటిషన్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. పత్రికల్లో వచి్చన వార్తలు లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్టు(ఓసీసీఆర్పీ) వంటి థర్డ్ పార్టీ సంస్థల నివేదికల ఆధారంగా సెబీ దర్యాప్తును అనుమానించలేమని స్పష్టం చేసింది. అలాంటి నివేదికలను కేవలం ఇన్‌పుట్స్‌గా పరిగణించవచ్చని అభిప్రాయపడింది. సెబీ దర్యాప్తును అనుమానించడానికి అలాంటివి ఆధారాలుగా ఉపయోగపడవని పేర్కొంది. చట్టబద్ధమైన సంస్థ అయిన సెబీ కొనసాగిస్తున్న దర్యాప్తును మరో సంస్థకు బదిలీ చేసే అధికారం కోర్టుకు లేదని పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల్లోనే మాత్రమే అలా బదిలీ చేయగలమని తేలి్చచెప్పింది. నిర్ధారణ కాని సమాచారంపై ఆధారపడొద్దు అదానీపై గ్రూప్‌పై 24 ఆరోపణలు రాగా, సెబీ ఇప్పటికే 22 ఆరోపణలపై దర్యాప్తు పూర్తి చేసిందని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. అదానీ గ్రూప్‌పై ఆరోపణలు చేయడానికి, కోర్టుకెక్కడానికి నిర్ధారణ కాని సమాచారంపై పిటిషనర్లు ఆధారపడినట్లు తెలుస్తోందని వెల్లడించింది. వారు తగిన పరిశోధన కూడా చేయకుండానే కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారని ఆక్షేపించింది. ఇకపై ఇలాంటివి పునరావృతం కాకూడదని సూచించింది. న్యాయవాదులు గానీ, పౌర సమాజం సభ్యులు గానీ అప్రమత్తంగా ఉండాలని, నిర్ధారణ కాని సమాచారం లేదా థర్డ్‌పార్టీ నివేదికల ఆధారంగా ఇష్టారాజ్యంగా పిటిషన్లు వేయడం సరైంది కాదని తేలి్చచెప్పింది. ఇదిలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సానుకూల సంకేతాలు రావడంతో బుధవారం స్టాక్ మార్కెట్లో అదానీ గ్రూప్‌లోని నమోదిత కంపెనీల షేర్ల ధరలు పైకి ఎగబాకాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, ఎన్డీటీవీ, అదానీ టోటల్ గ్యాస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ విల్మార్, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ వంటి సంస్థల షేర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. సత్యమేవ జయతే: గౌతమ్ అదానీ సుప్రీంకోర్టు తీర్పుపై అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ స్పందించారు. సత్యమే జయిస్తుందన్న నిజాన్ని ఈ తీర్పు మరోసారి నిరూపించిందని అన్నారు. భారతదేశ ప్రగతి చరిత్రలో తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉంటామని చెప్పారు. ప్రతికూల సమయంలో తమకు అండగా నిలిచినవారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ‘సత్యమేవ జయతే’ అంటూ గౌతమ్ అదానీ బుధవారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు తీగ లాగితే నారా, నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలైంది. అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి వారి భూములు కొల్లగొట్టడం కోసం నల్లధనం తరలించేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం బయటపడింది. బంధువులు, బినామీలు, సన్నిహితులు, తమ ఉద్యోగుల పేరిట అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టయింది. అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆ నల్లధనం నెట్‌వర్క్‌ను ఛేదించింది. అసైన్డ్ భూముల జాబితాలోని కేటగిరీ 1 నుంచి 4 వరకు ఉన్న 617.65 ఎకరాలను కొట్టేసేందుకు ఏర్పాటు చేసుకున్న ‘నల్ల’మార్గాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేసింది. బినామీల పేరిట అసైన్డ్ భూములు కొల్లగొట్టిన ముఠా జాబితా తవ్వుతుంటే.. చంద్రబాబు, లోకేశ్, నారాయణ, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా ఇలా టీడీపీ పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. నల్లధనం కోసం కంపెనీ ఏర్పాటు నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసమని ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములు కొల్లగొట్టడం కోసమే నారాయణ కుమార్తె సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్‌స్పైర కంపెనీని నెలకొల్పారు. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్‌స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ. 613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. దీంతో రెండు విడతల్లో ఎన్‌స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎన్‌స్పైర టు రామకృష్ణ హౌసింగ్ నారాయణ సమీప బంధువు కేవీపీ అంజని కుమార్ రంగంలోకి వచ్చారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నల్లధనం తరలింపునకు మార్గంగా చేసుకున్నారు. అక్రమ నిధులను ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పటికే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, మరికొందరిని తమ బినామీలుగా ఎంపిక చేసుకున్నారు. రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి ఆ బినామీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. వారు ఆ నగదు డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను అప్పటికే భయపెట్టారు. తద్వారా ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు తమ బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్టు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ. 3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. జీపీఏ, సేల్డీడ్ల ద్వారా హస్తగతం కేటగిరీ 1 నుంచి 4 వరకు 617.65 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసైన్డ్ రైతుల జాబితా, సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లను పరిశీలిస్తే అక్రమాల బాగోతం బయటపడుతోంది. ఈ జాబితాలో చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, వారి సన్నిహితులు, బంధువులు, బినామీలే బయటపడుతున్నారు. అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 617.65 ఎకరాల అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦ నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ రాజధానిలో నారాయణ బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలు ఉన్నట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందుకోసం నారాయణ రూ.16.50 కోట్లను అక్రమంగా తరలించారు. అందుకు ప్రతిగా 148 ఎకరాలను పొందారు. ఆ 148 ఎకరాలకు సీఆర్డీఏ భూసమీకరణ కింద ఇచ్చింది రూ.816 కోట్లు విలువైన స్థలాల ప్యాకేజీ. ఆ భూములకు పదేళ్లపాటు కౌలు కూడా పొందగలుగుతారు. బినామీ రైతులకు సీఆర్డీఏ ఇప్పటికే చెల్లించిన కౌలు మొత్తం రూ. 50 లక్షలు మళ్లీ రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అక్కడ నుంచి ఆ మొత్తాన్ని మళ్లీ నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం గమనార్హం. అంటే అసైన్డ్ భూములు దక్కించుకుంది నారాయణే అన్నది స్పష్టమైంది. అదే రీతిలో చంద్రబాబు, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, ఇతర టీడీపీ పెద్దలు, వారి బంధువులు బినామీల ద్వారా 617 ఎకరాల్లో ఎంత భారీ దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది. -
‘రింగ్’ అంతా లోకేశ్‌దే
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారు పేరిట జరిగిన భూ దోపిడీలో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుమారుడు లోకేశ్ కీలక పాత్ర పోషించినట్లు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. ఈమేరకు ఈ కేసులో లోకేశ్‌ను ఏ–14గా చేర్చినట్లు న్యాయస్థానానికి సమర్పించిన మెమోలో పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్ పేరిట చంద్రబాబు, లోకేశ్ క్విడ్ ప్రోకోకు పాల్పడ్డారని, తద్వారా తమ కుటుంబానికే చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు, లింగమనేని కుటుంబానికి చెందిన భూముల విలువ అమాంతం పెరిగేలా అక్రమాలకు పాల్పడ్డారని నిర్ధారించింది. 129 ఆధారాలతో దొరికిన లోకేశ్ ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పుల ద్వారా భారీ అక్రమాలకు పాల్పడిన కేసులో సిట్ అధికారులు లోకేశ్ పాత్రకు సంబంధించి కీలకమైన 129 ఆధారాలను గుర్తించి, జప్తు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వాటిలో సీఆర్డీఏ, మున్సిపల్, రెవెన్యూ శాఖలకు చెందిన కీలక పత్రాలు, ఈమెయిల్ సందేశాలు, మ్యాపులతోపాటు మరికొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు.. టీడీపీ ప్రభుత్వంలో పని చేసిన అధికారులు, ప్రైవేటు ఏజెన్సీల ప్రతినిధుల వాంగ్మూలాలను కూడా సిట్ అధికారులు నమోదు చేశారు. వారిలో కొందరు కీలక అధికారులు సంబంధిత నోట్ ఫైళ్లలో తాము లిఖితపూర్వకంగా తెలిపిన అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారని పేర్కొనడం గమనార్హం. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో కీలక పాత్ర పోషించిన ప్రైవేటు ఏజెన్సీలు కూడా ఇదే విషయాన్ని తెలిపాయి. నిబంధనలకు విరద్ధంగానే ఐఆర్ఆర్ ఎలైన్‌మెంట్‌ను నిర్ధారించారని సిట్ అధికారులకు ఈమెయిళ్లు పంపాయి. ఐఆర్ఆర్ అలైన్మెంట్ కోసం నిర్వహించిన సర్వే నివేదికను కూడా సిట్ అధికారులు జప్తు చేశారు. వీటన్నింటిలో లోకేశ్‌దే కీలక పాత్ర అని సిట్ సేకరించిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. లింగమనేనితో క్విడ్ ప్రోకో.. హెరిటేజ్‌కు భూములు టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు అధికారిక నివాసంలోనే లోకేశ్ కూడా నివసించారు. రాజధాని ఎక్కడ నిరి్మస్తారన్నది ముందుగానే తెలియడంతో తాడేపల్లి, తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ముందుగానే భూముల కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఇక లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్‌ప్రోకోకు పాల్పడ్డారు. అందులో భాగంగా అమరావతిలో భూములు పొందారు. 2014 జులై 1న 7.21 ఎకరాలను కొనుగోలు చేస్తూ హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం 2014 జులై 7న ఆ భూములు రిజి్రస్టేషన్ చేయించారు. అనంతరం లింగమనేని రమేశ్ కుటుంబ సభ్యుల నుంచి 4.55 ఎకరాలు కొనుగోలు పేరిట దక్కించుకున్నారు. ఆ విషయం బయటకు పొక్కడంతో ఆ 4.55 ఎకరాలకు సేల్ అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నారు. అనంతరం అధికారులపై ఒత్తిడి తెచ్చి లింగమనేని, హెరిటేజ్ ఫుడ్స్ భూములకు దూరంగా వెళుతున్న ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మార్పించారు. లింగమనేని రమేశ్ కుటుంబానికి చెందిన 355 ఎకరాలు, హెరిటేజ్ ఫుడ్స్ భూములను ఆనుకొని ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. దాంతోపాటు చంద్రబాబు బినామీల పేరిట భారీగా కొల్లగొట్టిన భూములు, ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారాయణ కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొల్లగొట్టిన 148 ఎకరాల విలువ అమాంతంగా పెరిగేలా కుట్రకు పాల్పడ్డారు. క్విడ్‌ప్రోకో కింద లింగమనేని రమేశ్ కృష్ణా నది కరకట్ట మీద ఉన్న బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. ఈ వివరాలన్నింటినీ పేర్కొంటూ సిట్ అధికారులు సమగ్రంగా దర్యాప్తు నిర్వహించి పూర్తి ఆధారాలతో న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. దాంతో ఈ కేసులో తదుపరి పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. హెరిటేజ్ అంటేనే నారా కుటుంబం హెరిటేజ్ ఫుడ్స్ అంటే నారా చంద్రబాబు కుటుంబం.. చంద్రబాబు కుటుంబం అంటే హెరిటేజ్ ఫుడ్స్ అనేది బహిరంగ రహస్యం. అందుకే చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు అనేక ప్రయోజనాలు కలిగించారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్చడం ద్వారా హెరిటేజ్ ఫుడ్స్‌కు అడ్డగోలుగా కల్పించిన ప్రయోజనం పెద్ద కుంభకోణమే. అందుకే ఈ కేసులో హెరిటేజ్ ఫుడ్స్‌ను ఏ–6గా సీఐడీ పేర్కొంది. ఈ కేసులో ఏ–1 చంద్రబాబు సతీమణి అయిన నారా భువనేశ్వరి హెరిటేజ్ ఫుడ్స్‌కు వైస్ చైర్పర్సన్, ఎండీగా ఉండగా, ఏ–14గా ఉన్న లోకేశ్ భార్య బ్రాహ్మణి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ)గా ఉన్నారు. వారి ద్వారా హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీ వ్యవహారాలను పూర్తిగా చంద్రబాబు, లోకేశే నిర్వహిస్తున్నారు. 56 శాతానికిపైగా షేర్లు ఉండటంతో ఆ సంస్థ డైరెక్టర్ల బోర్డు అంతా ఆ కుటుంబం ఆధిపత్యంలోనే ఉంది. 23,66,400 షేర్లతో 10.20 శాతం వాటా లోకేశ్ పేరునే ఉంది. ఇక హెరిటేజ్ ఫుడ్స్ వైస్ చైర్పర్సన్ నారా భువనేశ్వరి 53,30,826 షేర్లతో 22.98 శాతం వాటా కలిగి ఉన్నారు. లోకేశ్ భార్య బ్రాహ్మణి పేరిట 1,01,00 షేర్లు, నందమూరి బాలకృష్ణ పేరిట 6,820 షేర్లు ఉన్నాయి. వారి సమీప బంధువులు వి.గంగరాజు నాయుడుకు 0.25 శాతం, ఆయన భార్య వి.సుధా శారదకు 5.28 శాతం, మెగాడిడ్ కంపెనీకి 5.28 శాతం, నిర్వాణ హోల్డింగ్స్‌కు 11.09 శాతం వాటా ఉన్నాయి. సంస్థ డైరెక్టర్ల బోర్డులో సభ్యులుగా ఉన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, తుమ్మల వెంకటేశ్వరరావు మెగాడిడ్, నిర్వాణ హోల్డింగ్స్‌లోనూ డైరెక్టర్లుగా ఉండటం గమనార్హం. ఇలా హెరిటేజ్ ఫుడ్స్ మొత్తం చంద్రబాబు కుటుంబం చేతిలోనే ఉంది. -
చంద్రబాబు ఏ–1.. లోకేశ్ ఏ–14
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు సహకార డెయిరీలను దెబ్బతీసి తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫుడ్స్ వ్యాపారం, ఆస్తులను అమాంతం పెంచగా ఆయన తనయుడు లోకేశ్ రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్డు(ఐఆర్ఆర్) అలైన్మెంట్ ఖరారులో అక్రమాలతో హెరిటేజ్ ఫుడ్స్ కోసం భూములను కొల్లగొట్టారు. తమ బినామీ, సన్నిహితుడు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్‌ప్రోకోకు పాల్పడి భారీ భూదోపిడీకి తెగబడటంలో చంద్రబాబు, లోకేశ్ చక్కటి సమన్వయం కనబరిచారు. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు కరకట్ట నివాసాన్ని తీసుకోగా హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ హోదాలో లోకేశ్ భూములను కొల్లగొట్టారు. ఈ అవినీతి భూబాగోతాన్ని సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా బట్టబయలు చేసింది. క్విడ్ ప్రోకో కింద చంద్రబాబు పొందిన కరకట్ట నివాసాన్ని, నారాయణ కుటుంబ సభ్యులు సీడ్ క్యాపిటల్‌లో పొందిన 75,888 చ.గజాల ప్లాట్లు, కౌలు మొత్తంగా పొందిన రూ.1.92 కోట్లను అటాచ్ చేయాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈమేరకు న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఈ కేసులో ఇప్పటికే ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణను పేర్కొన్న సిట్ నారా లోకేశ్‌ను ఏ–14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో మంగళవారం ప్రత్యేక మెమో దాఖలు చేసింది. లింగమనేని రమేశ్, రాజశేఖర్‌లతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ సంస్థను కూడా ఈ కేసులో నిందితులుగా పేర్కొంది. ఐఆర్ఆర్ అలైన్మెంట్లో అవినీతి మెలికలు.. అమరావతి ముసుగులో చంద్రబాబు సాగించిన భారీ భూదందాలో ఐఆర్ఆర్ కుంభకోణం ఓ భాగం! మాజీ మంత్రి పొంగూరు నారాయణతోపాటు లోకేశ్ ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు తమ బినామీ, సన్నిహితుడైన లింగమనేని రమేష్‌తో క్విడ్ ప్రోకోకు పాల్పడి ఆయన భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. అందుకు ప్రతిగా బినామీల పేరిట భారీగా భూములను పొందడమే కాకుండా కరకట్ట నివాసంతోపాటు హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు కానుకగా దక్కించుకున్నారు. నాడు సీఆర్డీఏ అధికారులు రూపొందించిన 94 కి.మీ. అమరావతి ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌పై చంద్రబాబు, నారాయణ మండిపడ్డారు. ఆ అలైన్మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెదపరిమి, నిడమర్రు, చినవడ్లపూడి, పెదవడ్లపూడి మీదుగా వెళ్తుంది. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి చెందిన భూములకు 3 కి.మీ. దూరం నుంచి దాన్ని నిర్మించాల్సి వస్తుంది. దీంతో తమ భూముల విలువ అమాంతం పెరగదని వారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారి ఆదేశాలతో సీఆర్డీయే అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో మార్పులు చేశారు. చంద్రబాబు, లింగమనేని కుటుంబానికి చెందిన వందలాది ఎకరాలున్న తాడికొండ, కంతేరు, కాజాను పరిగణలోకి తీసుకున్నారు. అందుకోసం ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను 3 కిలోమీటర్లు దక్షిణానికి జరిపారు. హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని కుటుంబానికి కంతేరు, కాజాలో ఉన్న భూములను ఆనుకుని ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా 97.50 కి.మీ. అలైన్‌మెంట్‌ను రూపొందించారు. అయితే ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అనంతరం సింగపూర్‌కు చెందిన సుర్బాన జ్యురాంగ్ కన్సల్టెన్సీని రంగంలోకి తెచ్చి అప్పటికే ఖరారు చేసిన ఇన్నర్ రింగ్ రోడ్ డిజైన్‌ను అమరావతి మాస్టర్ ప్లాన్‌లో చేర్చారు. ఎస్టీయూపీ అనే కన్సల్టెన్సీని నియమించి మాస్టర్ ప్లాన్‌లో పొందుపరిచిన అలైన్‌మెంట్‌కు అనుగుణంగా ఉండాలని ఆదేశించారు. అప్పటికే సీఆర్డీయే అధికారుల ద్వారా తాము ఖరారు చేసిన అలైన్‌మెంట్‌నే ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ద్వారా ఆమోదించేలా చేశారు. ఈ క్రమంలో తాడికొండ, కంతేరు, కాజాలో హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూములను ఆనుకుని అలైన్‌మెంట్‌ను ఎస్టీయూపీ కన్సల్టెన్సీ ఖరారు చేసింది. హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములు ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను మెలికలు తిప్పడం ద్వారా లింగమనేని కుటుంబం భూముల విలువను భారీగా పెరిగేలా చేశారు. కంతేరు, కాజాలో లింగమనేని కుటుంబానికి ఉన్న 355 ఎకరాలను ఆనుకునే అలైన్‌మెంట్‌ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా అదే ప్రాంతంలో హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను పొందారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని కంతేరులో హెరిటేజ్ ఫుడ్స్‌కు 10.4 ఎకరాలు పొందగా 2014 జూన్ నుంచి సెప్టెంబరు మధ్యలో కొనుగోలు చేసినట్టు చూపించారు. లింగమనేని కుటుంబ నుంచి మరో 4.55 ఎకరాలను కొనుగోలు పేరిట హెరిటేజ్ ఫుడ్స్ దక్కించుకుంది. అప్పటికే ఈ కుంభకోణం గురించి బయటకు పొక్కడంతో ఆ సేల్ డీడ్‌ను రద్దు చేసుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని లింగమనేని కుటుంబానికి చెందిన 355 ఎకరాలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్ భూములు ఉండటం గమనార్హం. లోకేశ్ కీలక ‘భూ’మిక క్విడ్‌ప్రోకోకు పాల్పడి హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను దక్కేలా చేయడంలో లోకేశ్ కీలక భూమిక పోషించారు. ఆయన 2008 జూలై 1 నుంచి 2013 జూన్ 29 వరకు హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా ఉన్నారు. అనంతరం 2017 మార్చి 31 వరకు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను ఆనుకుని కొనుగోలు పేరిట భూములను దక్కించుకోవాలని నిర్ణయించిన హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో లోకేశ్ కూడా పాల్గొన్నారు. క్విడ్ ప్రోకో కింద భూములను పొందే ప్రక్రియలో ఆయన కీలక భూమిక పోషించారు. లోకేశ్ పేరిట హెరిటేజ్ ఫుడ్స్‌లో 23,66,400 షేర్లు ఉన్నాయి. అంటే హెరిటేజ్ ఫుడ్స్‌లో లోకేశ్‌కు 10.20 శాతం వాటా ఉంది. బాబుకు కరకట్ట నివాసం క్విడ్‌ప్రోకోలో భాగంగా లింగమనేని రమేశ్ విజయవాడ వద్ద కృష్ణా కరకట్టపై ఉన్న తన బంగ్లాను చంద్రబాబుకు ఇచ్చారు. దీనిపై కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారాన్ని మసిపూసేందుకు చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. ఆ బంగ్లాను అద్దెకు ఇచ్చానని లింగమనేని రమేశ్ బుకాయించారు. కానీ ఆయన అద్దె వసూలు చేసినట్టుగానీ, చంద్రబాబు చెల్లించినట్టుగానీ ఆదాయపన్ను వివరాల్లో లేవు. తరువాత ఆ ఇంటిని ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చానని చెప్పారు. మరి చంద్రబాబు ప్రభుత్వం నుంచి హెచ్ఆర్ఏ ఎందుకు పొందారన్న ప్రశ్నకు సమాధానం లేదు. దీంతో ఆ బంగ్లాను చంద్రబాబుకు వ్యక్తిగతంగా క్విడ్‌ప్రోకో కింద ఇచ్చారని స్పష్టమైంది. లింగమనేని నుంచి కానుకగా స్వీకరించిన కరకట్ట ఇంట్లోనే చంద్రబాబు, లోకేష్ దర్జాగా నివసించడం గమనార్హం. పవన్‌కూ వాటా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కూడా ఈ అవినీతి పాపంలో పిడికెడు వాటా ఇచ్చారు. కాజాకు సమీపంలో ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌కు చేరువలో పవన్‌కల్యాణ్‌కు 2.4 ఎకరాలున్నాయి. లింగమనేని కుటుంబం నుంచి ఆ భూములను ప్రభుత్వ ధర ప్రకారం ఎకరా రూ.8 లక్షలు చొప్పున కొనుగోలు చేసినట్లు చూపించారు. ల్యాండ్ పూలింగ్ నుంచి మినహాయింపు కల్పించిన భూమినే పవన్ కల్యాణ్‌కు ఇవ్వడం గమనార్హం. భారీగా పెరిగిన విలువ ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారుకు ముందు లింగమనేని కుటుంబం ఆ ప్రాంతంలో ఎకరా భూమి రూ.8 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. మార్కెట్ ధర ప్రకారమైతే ఎకరా రూ.50 లక్షలు ఉంది. అంటే ఆ భూముల మార్కెట్ విలువ రూ.177.50 కోట్లు. ఇక ఇన్నర్‌రింగ్ రోడ్డు అలైన్మెంట్ ఖరారు తరువాత ఎకరం రూ.36 లక్షల రిజిస్టర్ విలువ చొప్పున విక్రయించింది. అంటే రిజిస్టర్ విలువే నాలుగున్నర రెట్లకుపైగా పెరిగింది. మార్కెట్ ధర ప్రకారం ఎకరా రూ.2.50 కోట్లు పలికింది. 355 ఎకరాల విలువ మార్కెట్ ధర ప్రకారం అమాంతంగా రూ.887.50 కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో ఎకరా విలువ రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూముల విలువ ఎకరా రూ.6 కోట్లకు చేరుతుందని అంచనా వేశారు. అంటే అమరావతి నిర్మాణం పూర్తయితే ఆ 355 ఎకరాల విలువ ఏకంగా రూ.2,130 కోట్లకు చేరుతుందని అంచనా. ఆ ప్రకారం మార్కెట్ ధరను బట్టి హెరిటేజ్ ఫుడ్స్ 10.4 ఎకరాల మార్కెట్ విలువ రూ.5.20 కోట్ల నుంచి రూ.41.6 కోట్లకు కోట్లకు పెరిగింది. అమరావతి నిర్మాణం పూర్తయితే రూ.62.4 కోట్లకు చేరుతుందని తేలింది. హెరిటేజ్ ఫుడ్స్ ఒప్పందం చేసుకుని రద్దు చేసినట్టు చూపిన మరో 4.55 ఎకరాల విలువ కూడా రూ.27.3 కోట్లకు చేరుతుంది. ఇక చంద్రబాబు బినామీల పేరిట ఉన్న వందలాది ఎకరాల విలువ అమాంతం పెరిగింది. -
మరో 15 రోజులు రిమాండ్ పొడిగించండి
సాక్షి, అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోరుతూ సీఐడీ ఆదివారం ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. తదుపరి దర్యాప్తు నిమిత్తం చంద్రబాబు రిమాండ్‌ను పొడిగించడం తప్పనిసరి అని అందులో పేర్కొంది. స్కిల్ కుంభకోణంలో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, పలు కీలక డాక్యుమెంట్లను సేకరించాల్సి ఉందని, పలువురు సాక్షులను కూడా విచారించాల్సి ఉందని సీఐడీ తెలిపింది. ఈ కేసులో ప్రధాన సాక్షులైన పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని దర్యాప్తు సంస్థకు అందుబాటులో లేకుండా పరారీలో ఉన్నారని నివేదించింది. ఈ కేసుతో వారిద్దరికీ చాలా దగ్గర సంబంధం ఉందని పేర్కొంది. పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని పరారీ వెనుక చంద్రబాబు ప్రధాన అనుమానితుడిగా ఉన్నారని తెలిపింది. దుర్వినియోగమైన నిధులు అంతిమంగా ఎక్కడకు వెళ్లాయి? షెల్ కంపెనీల ద్వారా నగదు రూపంలో ఎవరికి చేరాయి? అనే వివరాలు వీరిద్దరికీ తెలుసని సీఐడీ తన మెమోలో పేర్కొంది. సాక్షులపై ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారు.. చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిన అవసరం ఉందని, అప్పుడు మాత్రమే ఈ కుంభకోణంలో చంద్రబాబు పాత్ర గురించి మాట్లాడే సాక్షులకు రక్షణ ఉంటుందని సీఐడీ తెలిపింది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేష్ దర్యాప్తును పక్కదారి పట్టించేలా మీడియాలో మాట్లాడారని నివేదించింది. సాక్షులపై చంద్రబాబు, ఆయన మద్దతుదారులు ఆ స్థాయిలో ప్రభావం చూపుతున్నారని వివరించింది. ఈ కేసును డ్యామేజ్ చేసేందుకు చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంది. సాక్షులను బెదిరించడం, భయపెట్టడం, ప్రభావితం చేస్తూ, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చే వారిని ప్రలోభపెట్టడం, బెదిరించడం లాంటివి చేస్తూ దర్యాప్తులో జోక్యం చేసుకునే అవకాశం ఉందని సీఐడీ తన మెమోలో తెలిపింది. దర్యాప్తు సంస్థకు, కోర్టుకు వాస్తవాలను తెలియనివ్వకుండా చేస్తున్నారని, వీటిని పరిగణలోకి తీసుకుని చంద్రబాబు రిమాండ్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలని కోర్టును అభ్యర్థించింది. సరిహద్దు చెక్‌పోస్టులోముమ్మర తనిఖీలు జగ్గయ్యపేట: ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని గరికపాడులో రాష్ట్ర సరిహద్దు వద్ద జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక బలగాలతో తెలంగాణ నుంచి ఏపీకి వస్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేశారు. మైలవరం ఏసీపీ, సరిహద్దు చెక్‌పోస్టు ఇన్చార్జ్ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ నుంచి టీడీపీ ఐటీ విభాగం తరఫున మాజీ సీఎం చంద్రబాబుకు మద్దతు పలికేందుకు హైదరాబాద్ నుంచి కార్లలో ర్యాలీగా రాజమండ్రి వస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేశామన్నారు. వాహన ర్యాలీకి అనుమతుల్లేవని నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మళ్లీ ఆవు కథే!
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం: రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం చంద్రబాబు రెండు రోజుల సీఐడీ విచారణ ఆదివారం ముగిసింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టుగా నకిలీ ఒప్పందంతో నిబంధనలకు విరుద్ధంగా రూ.371 కోట్లు విడుదల చేసి రూ.241 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కొల్లగొట్టిన కేసులో ప్రధాన ముద్దాయి చంద్రబాబు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాలతో సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆయన్ని రెండు రోజులపాటు కస్టడీలోకి తీసుకుని విచారించింది. పక్కా పన్నాగంతో ‘స్కిల్’ కుంభకోణానికి పాల్పడ్డ చంద్రబాబు సీఐడీ విచారణను కూడా పక్కదారి పట్టించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. రెండు రోజుల విచారణలోనూ ఆయన ఏమాత్రం సహకరించనందున చంద్రబాబు కస్టడీని పొడిగించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. 14 ఏళ్లు సీఎంనంటూ సీఐడీ విచారణలో చంద్రబాబు సంబంధం లేని సంగతులు చెబుతూ తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు స్కిల్ కుంభకోణానికి సంబంధించి సిట్ అధికారులు ఏ ప్రశ్నలు వేసినా చంద్రబాబు ఒకటే చెబుతూ వచ్చారు. రాజకీయాల్లో తాను 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని... 14 ఏళ్లు సీఎంగా చేశానంటూ కాలయాపన చేసేందుకే ప్రయత్నించారు. దీంతో ఆయన రాజకీయ అనుభవం గురించి తమకు కూడా తెలుసని, ఏపీఎస్ఎస్డీసీ ప్రాజెక్ట్ జీవో, ఒప్పందాలను ఏ ప్రాతిపదికన చేశారు? బిల్లులు చెల్లింపుల్లో హేతుబద్ధత ఏమిటీ? నిధుల మళ్లింపులో పాత్రధారులతో సంబంధాలు ఏమిటీ? అనే అంశాలకు సూటిగా సమాధానాలు చెప్పాలని సిట్ అధికారులు పదేపదే పట్టుబట్టాల్సి వచ్చింది. వ్యూహాత్మక ప్రశ్నావళి.. కొంతవరకు సఫలీకృతం మొదటి రోజు చంద్రబాబు విచారణకు ఏమాత్రం సహకరించకపోవడంతో రెండో రోజు సిట్ అధికారులు ప్రశ్నావళిలో కొన్ని మార్పులు చేశారు. వరుస క్రమంలో కాకుండా ఓ అంశం నుంచి మరో అంశానికి జంబ్లింగ్ విధానంలో ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే సీఐడీ, ఈడీ అరెస్ట్ చేసిన సుమన్‌బోస్, వికాస్ వినాయక్ కన్విల్కర్లతోపాటు నిధుల అక్రమ తరలింపులో షెల్ కంపెనీలతో చంద్రబాబు సంబందాలు, ఉత్తర ప్రత్యుత్తరాల గురించి కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. నిధుల అక్రమ మళ్లింపులో కీలక పాత్రధారులైన చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తాలతో చంద్రబాబు, లోకేశ్ లావాదేవీలపై కీలక ఆధారాలను ప్రదర్శిస్తూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సీఐడీ నోటీసులు జారీ చేయగానే పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్థసాని పరారు కావడంపై సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. వెరసి రెండు రోజుల విచారణలో వ్యూహాత్మకంగా ప్రశ్నలు సంధించడం ద్వారా సీఐడీ అధికారులు కొంతవరకు సఫలీకృతమైనట్టు తెలుస్తోంది. న్యాయస్థానం ఆదేశాల మేరకు చంద్రబాబు విచారణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేశారు. మధ్యవర్తుల సమక్షంలో ఆయన వాంగ్మూలాన్ని నమోదుచేశారు. విచారణ సాగిన తీరు, వీడియో రికార్డింగ్ తదితర ఫైళ్లను న్యాయస్థానానికి సిట్ అధికారులు సమర్పించనున్నారు. మరింత విచారించాల్సిన అవసరం విచారణ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించి కాలహరణం చేసినందున చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలో విచారించేందుకు అనుమతించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరాలని సీఐడీ నిర్ణయించింది. మరోవైపు ఈ కేసులో సిట్ నోటీసులు జారీ చేసిన ఇద్దరు కీలక వ్యక్తులు విదేశాలకు పరారు కావడం వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లు నివేదించనుంది. ఈ కేసులో గతంలో విచారించిన సాక్షులను ప్రభావితం చేసిన ఉదంతాలను కూడా న్యాయస్థానం దృష్టికి మరింత వివరంగా తీసుకెళ్లనుంది. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో కుట్రకోణానికి సంబంధించి పూర్తి వాస్తవాలను రాబట్టేందుకు చంద్రబాబును మరి కొద్ది రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని న్యాయస్థానానికి సిట్ అధికారులు విజ్ఞప్తి చేయనున్నారు. -
కిలారు.. పరారు!
సాక్షి, అమరావతి: మాజీ సీఎం చంద్రబాబు హయాంలో సాగించిన కుంభకోణాల్లో పాత్రధారుల పరారీ పరంపర కొనసాగుతోంది. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో టీడీపీ సర్కారు అవినీతి బాగోతాలు బయటపడుతున్న కొద్దీ పరారవుతున్న వారి జాబితా పెరుగుతూ వస్తోంది. తాజాగా నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడైన కిలారు రాజేశ్ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఎప్పుడూ లోకేశ్ వెన్నంటే ఉండే రాజేశ్ కొద్ది రోజులుగా కనిపించడం లేదు. లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండగా రాజేశ్ మాత్రం ఎక్కడున్నాడో ఎవరికీ అంతుబట్టడం లేదు. చంద్రబాబు, లోకేశ్ ఆదేశాలతోనే అతడు పరారైనట్లు టీడీపీ వర్గాలే చెబుతుండటం గమనార్హం. నిధుల తరలింపులో పాత్రధారి.. నారా లోకేశ్‌కు కిలారు రాజేశ్ అత్యంత సన్నిహితుడన్నది బహిరంగ రహస్యం. చినబాబు తరపున అన్ని వ్యవహారాలను నెరిపేది రాజేశే. కొన్ని వ్యవహారాల్లో చంద్రబాబు మాట కంటే రాజేశ్ చెప్పిన దానికే లోకేశ్ మొగ్గు చూపుతారని టీడీపీ వర్గాలు చెబుతుండటం గమనార్హం. రాజేశ్ పరోక్షంగా టీడీపీ వ్యవహారాలన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారు. టీడీపీ అనుకూల ఎన్నారైలతో మంతనాలు జరపడంతోపాటు పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నీ రాజేశ్ కనుసన్నల్లోనే సాగుతున్నాయి. పార్టీలో ఏదైనా పదవి కావాలంటే చంద్రబాబు కంటే రాజేశ్ వద్దకు వెళితేనే పని అవుతుందన్న అభిప్రాయం సర్వత్రా నెలకొంది. లోకేశ్ యువగళం పాదయాత్రకు రాజేశ్ నిర్వాహకుడిగా వ్యవహరిస్తున్నాడు. షాడో మంత్రి.. నెట్‌వర్క్‌లో కీలకం టీడీపీ హయాంలో లోకేశ్ మంత్రిగా ఉన్నప్పుడు రాజేశ్ షాడో మంత్రిగా చెలరేగిపోయాడు. అన్ని ఫైళ్లను అనధికారికంగా అతడే చూసేవాడని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు, లోకేశ్ సూత్రధారులుగా సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ రాజేశ్ కీలక పాత్రధారిగా ఉన్నాడు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణ కాంట్రాక్టుల ఖరారు, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్, ఫైబర్ నెట్ టెండర్ల ఖరారు.. ఇలా అన్ని కుంభకోణాల్లోనూ ప్రధానంగా వినిపించిన పేరు కిలారు రాజేశ్. అక్రమంగా కాంట్రాక్టులు కట్టబెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా నిధుల విడుదల, షెల్ కంపెనీల ద్వారా అక్రమ నిధుల తరలింపు కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన నెట్‌వర్క్‌కు కిలారు రాజేశ్ సంధాన కర్తగా వ్యవహరించాడు. అదే విషయం సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. చంద్రబాబు, లోకేశ్ ప్రధాన నిందితులుగా ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అసైన్డ్ భూముల కేసుల్లో కిలారు రాజేశ్‌ను కూడా విచారిస్తామని సీఐడీ అదనపు ఎస్పీ సంజయ్ ఇప్పటికే ప్రకటించారు. అతడి పాత్రపై పూర్తి ఆధారాలు లభించడంతోనే విచారించాలని సీఐడీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కిలారు రాజేశ్ అదృశ్యం కావడం గమనార్హం. మూడుకు చేరుకున్న అదృశ్యాలు.. కిలారు రాజేశ్‌ను విచారించాలని సీఐడీ నిర్ణయించడంతో చంద్రబాబు, లోకేశ్ బెంబేలెత్తారు. అతడిని సీఐడీ విచారిస్తే టీడీపీ హయాంలో సాగించిన మరెన్నో కుంభకోణాలు బయటకు వస్తాయని ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో రాజేశ్‌ను అజ్ఞాతంలోకి పంపించాలని నిర్ణయించిన చంద్రబాబు అదే విషయాన్ని ములాకత్లో తనను కలిసిన యనమల రామకృష్ణుడుకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రాజేశ్ అదృశ్యమయ్యాడు. అతడు దేశంలోనే ఎక్కడైనా అజ్ఞాతంలో ఉన్నాడా...? విదేశాలకు పరారయ్యాడా? అన్నది తెలియరాలేదు. దీంతో చంద్రబాబు ఆదేశాలతో పరారైన వారి సంఖ్య మూడుకు చేరుకుంది. స్కిల్ కుంభకోణంలో విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసులు జారీ చేయగానే చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అమెరికాకు, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ పార్థసాని దుబాయ్‌కు పరారైన విషయం తెలిసిందే. -
మాజీమంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్
విజయవాడ: ఇన్నర్‌రింగ్ స్కాం కేసులో భాగంగా ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు పిటిషన్ దాఖలు చేశారు. ఇన్నర్‌రింగ్ స్కాంలో ఇప్పటికే నారాయణకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది హైకోర్టు. అయితే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు నారాయణ. దీనికి సంబంధించి నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ,ఏ–6 లోకేశ్ ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణాన్ని సిట్ పూర్తి ఆధారాలతో బట్టబయలు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడి (ఏ–1)గా చంద్రబాబు, ఏ–2గా నారాయణ, ఏ–6గా లోకేశ్‌పై కేసు నమోదు చేసింది. చంద్రబాబు, నారాయణ బినామీలు లింగమనేని రమేశ్‌ను ఏ–3గా, లింగమనేని రాజశేఖర్ ఏ–4గా, రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ డైరెక్టర్ అంజని కుమార్‌ను ఏ–5గా పేర్కొంది. చదవండి: ‘ఇన్నర్ రింగ్ రోడ్డు’ అక్రమాల కేసు.. పీటీ వారంట్! -
చంద్రబాబు అరెస్టు
నంద్యాల: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఆర్కే పంక్షన్ హాల్ వద్ద ఆయన్ను అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఈ రోజు(శనివారం) తెల్లవారుజామున చంద్రబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ ఇచ్చిన సీఐడీ.. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబు అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఏ-1గా చంద్రబాబు ఉండగా, ఏ-2గా అచ్చెన్నాయుడు ఉన్నారు.చంద్రబాబు పై 120(బి), 166, 167,418, 420, 465, 468, 201, 109, రీడ్‌విత్ 34 and 37 ఐపీసీ సెక్షన్ ల కింద కేసులు నమోదు చేశారు. చంద్రబాబు అరెస్ట్ సమాచారం అందుకున్న టీడీపీ నాయకులు భారీగా చేరుకొని పోలీసులను అడ్డుకునేందుకు యత్నించారు . చంద్రబాబును కలువ నీయకుండా అడ్డుగా నిలబడి పోలీసు అధికారులతో టిడిపి నాయకులు వాగ్వాదానికి దిగారు . తమ నాయకుడు చంద్రబాబు విశ్రాంతిలో ఉన్నాడని, ఉదయం కలవండి అంటూ అధికారులతో టిడిపి నాయకులు వాధించారు. ఉదయం 6 గంటల తర్వాత చంద్రబాబునుకలవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు వైద్యులను పిలిపించారు పోలీసులు. చంద్రబాబుతో పాటు పలువురు టిడిపి నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. చదవండి: ప్రజాధన కుంభకోణం.. అరెస్టు.. పదేళ్ల జైలు! చంద్రబాబుపై అభియోగాలు.. 👉ప్రభుత్వ డబ్బు రూ.371 కోట్లు అవినీతి 👉షెల్ కంపెనీల ద్వారా రూ. 241 కోట్ల కుంభకోణం 👉 కేబినెట్‌ను తప్పుదారిపట్టించి ఆ తర్వాత ఒప్పందంలో మరొకటిపెట్టి… డబ్బులు కాజేశారని అభియోగాలు. 👉స్కిల్ డెవలప్మెంట్ పేరిట స్కాం ఇది. 👉ఈడీ, సెబీ… ఇలా ఏజెన్సీలన్నీ కూడా దర్యాప్తుచేసిన స్కాం ఇది. 👉దోచేసిన సొమ్మును విదేశాలకు అక్కడనుంచి తిరిగి దేశంలోకి వచ్చింది. 👉చంద్రబాబుగారు జూన్ 2014లో అధికారం చేపట్టిన 2 నెలలకే ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాంకు ఊపిరి. 👉ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లని, ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం అని, 90 శాతం సీమెన్స్ పెట్టుకుంటుందని చెప్పారు. అంటే దాదాపుగా రూ.౩వేల కోట్ల రూపాయలు సీమెన్స్ ఇస్తుందని చెప్పారు. 👉తమకు తాముగా తయారుచేసుకున్న అంచనా వ్యయాన్నే డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్‌డెవల్‌మెంట్ నుంచి నోట్ పెట్టించారు. ఇక ప్రభుత్వంలో సెక్రటరీ స్థాయి, ఆపైస్థాయి అన్నింటినీ ఓవర్‌రూల్ చేస్తూ కేబినెట్లోకి ఈనోట్‌ను తీసుకొచ్చారు. అదీ ఒక స్పెషల్ ఐటెంగా. కేబినెట్లోకి అలా రావడం, వెంటనే దానికి ఓకే చెప్పడం, తర్వాత జీవో విడుదల కావడం... అన్నీ ఆగమేఘాలమీద జరిగిపోయాయి. 👉ఈ పద్ధతిలో కేబినెట్‌కు నోట్ పెట్టడం అన్నది నియమాలకు, నిబంధలనకు, రూల్స్‌కు పూర్తిగా విరుద్ధం. 👉ఇక ఒప్పందం విషయానికొస్తే.. జీఓ ఒకలా ఉంటుంది, ఒప్పందం ఇంకోలా ఉంటుంది. 👉జీవోలో ఉన్నది... ఒప్పందంలో లేనప్పుడు సంతకాలు చేశారు?. 👉సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఒక్కపైసాకూడా రాకుండానే 5 దఫాలుగా ప్రభుత్వం రూ. 371 కోట్లు ఎలా విడుదలచేసింది. 👉డబ్బు విడుదలపై ఆర్థికశాఖ అధికారులు కొర్రీలు పెడితే… విడుదల చేయమని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. 👉ఈ విషయాన్ని స్వయంగా అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్‌ఫైల్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదలచేయమని ఆదేశాలు ఇచ్చినట్టుగా రాశారు. 👉సీఎంగారు చెప్పారు కాబట్టి విడుదలచేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైలుపై రాశారు. 👉అన్నికంటే ముఖ్యంగా ప్రభుత్వం నుంచి విడుదలచేసిన ఈ డబ్బు పోయింది 👉మన అధికారులేకాదు… సీమెన్స్ సంస్థకూడా ఇంటర్నల్ ఎంక్వయిరీ చేసి… 164 సీఆర్పీసీ కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. 👉ప్రభుత్వం జారీచేసిన జీవోకు, ఎంఓయూకు ఎలాంటి సంబంధం లేదని వాళ్లు కోర్టుకు తెలిపారు. 👉తమ కంపెనీలో పనిచేసే సుమన్‌బోస్ అనే వ్యక్తి మేనేజ్‌మెంట్‌నుగాని, లీగల్‌టీమ్‌కాని సంప్రదించలేదని సీమెన్స్ వాళ్లు ఏకంగా కోర్టుకు తెలియజేశారు. 👉ఈ డబ్బు 70కిపైగా షెల్ కంపెనీల ద్వారా చేతులు మారి మారి తిరిగి వచ్చింది, 👉వాస్తవంగా ఈ స్కిల్‌డెవలప్‌మెంట్ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీ రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి ఒక విజిల్‌బ్లోయర్ ఈ రకంగా జూన్ 2018న ఒక హెచ్చరిక జారీచేశారు. విచారణ మొదలుపెట్టి… దాన్ని ముందుకు కొనసాగించనీయకుండా పక్కనపెట్టేశారు. 👉ఇది ఎప్పుడైతే జరిగిందో… వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నోట్‌ఫైల్స్‌ను మాయంచేసేశారు. 👉స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ/స్కిల్లర్, డిజైన్‌టెక్ … 👉ఈరెండు కంపెనీలు సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా సెన్‌వాట్‌కోసం క్లెయిమ్ చేశాయి. ఇన్ని కోట్ల రూపాయల మేర క్లెయిం చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చి... ఆ కంపెనీ లావాదేవీలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు. డబ్బులు హవాలా మార్గంలో తరలించినట్టు వెల్లడైంది. 2017లోనే ఇది బయటపడింది. అప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం స్పందనలేదు. -
బాబు ముఠా పరార్
సాక్షి, అమరావతి: తన అవినీతి బండారం బట్ట బయలు కావడంతో మాజీ సీఎం చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. షెల్ కంపెనీల ద్వారా ప్రజాదనాన్ని కాజేసిన వైనం ఆధారాలతో సహా వెలుగు లోకి రావడంతో ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులు రాత్రికి రాత్రే విదేశాలకు పరారయ్యారు. బాబు తరఫున అన్నీ తామై వ్యవహరించిన తన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెని ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తాలకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేయడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. దీంతో చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్ పార్థసాని హఠాత్తుగా విదేశాలకు పరారయ్యారు. మరో బినామీ యోగేశ్ గుప్తా ఆచూకీ తెలియడం లేదు. ఆ ముగ్గురే కీలకం.. తన అవినీతి పాపాలు పండటంతో చంద్రబాబు రోజుకో ఎత్తుగడ వేస్తున్నారు. తాను అధికారంలో ఉండగా యథేచ్ఛగా సాగించిన అవినీతి వ్యవహారాలను కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు ఒక్కొక్కటిగా వెలికి తీయడంతో తప్పించుకునే దారి లేక సానుభూతి నాటకాలకు తెర తీశారు. రాజధాని అమరావతిలో తాత్కాలిక భవనాలు, పేదల టిడ్కో ఇళ్ల నిర్మాణాల్లో రూ.8 వేల కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టుల కేటాయింపులో షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ముడుపులు అందుకున్న వైనాన్ని ఆదాయపన్ను శాఖ ఆధారాలతో సహా వెలికి తీసిన విషయం తెలిసిందే. ఇందులో కీలక పాత్ర పోషించిన బాబు బినామీలైన ముగ్గురు నిందితులే రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణంలో కూడా షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేటతెల్లం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో నిధుల తరలింపులో కీలకంగా వ్యవహరించారని నిగ్గు తేల్చింది. వారు ముగ్గురూ చంద్రబాబు బినామీలేనని తేలడంతో నోటీసులు జారీ చేసింది. మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాలను ఈ నెల 11న, పెండ్యాల శ్రీనివాస్‌ను ఈ నెల 14న విజయవాడలో విచారణకు హాజరుకావాలని ఈ మెయిల్ ద్వారా నోటీసులు పంపింది. ఈ క్రమంలో ఆ ముగ్గురూ హఠాత్తుగా అదృశ్యం కావడం, ఇద్దరు నిందితులు ఏకంగా దేశం విడిచి పరారు కావడం ఈ కుంభకోణాలకు సూత్రధారి చంద్రబాబేనని స్పష్టం చేస్తోంది. పాత్రలు ఫినిష్..! అక్రమ నిధులు తరలించేందుకు తాను ఏర్పాటు చేసుకున్న అవినీతి నెట్‌వర్క్‌ను కేంద్ర ఆదాయపన్ను శాఖ, సీఐడీ సిట్ ఛేదించడంతో చంద్రబాబుకు దారులు మూసుకుపోయాయి. అప్పటికే మనోజ్ పార్థసాని, యోగేశ్ గుప్తాల వాంగ్మూలాన్ని ఆదాయ పన్ను శాఖ నమోదు చేసింది. తాము చంద్రబాబు పీఎస్ శ్రీనివాస్ ద్వారా ఆయనకు భారీగా ముడుపులు అందించినట్లు వాంగ్మూలంలో వారు అంగీకరించారు. ఈ నేపథ్యంలో అక్రమ ఆదాయంపై ఆదాయ పన్ను శాఖ సమాచారంతో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇంతలో స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో తన బినామీలు ముగ్గురికీ సిట్ నోటీసులు జారీ చేస్తుందని చంద్రబాబు ఊహించలేదు. దీంతో ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చని ఆయన ఊహించారు. అందుకే తనను రెండు రోజుల్లో అరెస్టు చేయవచ్చంటూ తాజాగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను అరెస్టు చేస్తే రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని ఆయన టీడీపీ శ్రేణులకు పరోక్షంగా సందేశమిచ్చారు. ఒకవైపు ఈ కుట్రలకు వ్యూహ రచన చేస్తూనే మరోవైపు తన బినామీలు మనోజ్ వాసుదేవ్ పార్థసాని, యోగేశ్ గుప్తా, పెండ్యాల శ్రీనివాస్ సిట్ విచారణకు హాజరైతే అక్రమాల చిట్టా బద్ధలవుతుందనే భయంతో వారిని విదేశాలకు పారిపోవాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం. అమెరికాకు శ్రీనివాస్... దుబాయ్‌కి మనోజ్ చంద్రబాబు ఆదేశాలతో ఆయన పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ అప్పటికప్పుడే హఠాత్తుగా అమెరికాకు పరారయ్యారు. సిట్ నోటీసులు అందినట్లు ఆయన కుమార్తె తెలిపారు. నోటీసులపై ఆమె సంతకం కూడా చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో చంద్రబాబు పీఎస్ అందుబాటులో లేకుండా పోయారు. ఆ తరువాత అమెరికా వెళ్లిపోయారు. అంటే నోటీసులు అందడంతోనే పెండ్యాల శ్రీనివాస్ పరారైనట్లు స్పష్టమవుతోంది. ఇక మనోజ్ పార్థసాని దుబాయ్ ఉడాయించారు. ఆయన ముంబై నుంచి దుబాయ్ వెళ్లిపోయారు. తనకు సీఐడీ నోటీసులు జారీ చేసిందనే విషయం తెలియగానే ఆయన అందుబాటులో లేకుండా పోయారు. అనంతరం హడావుడిగా దుబాయ్‌కి పరారయ్యారు. అక్కడ నుంచి ఆయన ఎక్కడకు వెళ్తారన్నది సన్నిహితులకు కూడా చెప్పకుండా అత్యంత గోప్యంగా ఉంచారు. మరోవైపు షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా ఆచూకీ తెలియడం లేదు. ఆయన ఎక్కడ ఉన్నారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సీఐడీ నోటీసులు జారీ చేసిన వెంటనే చంద్రబాబు బినామీలు ముగ్గురూ హఠాత్తుగా అదృశ్యం కావడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ హయాంలో చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారన్న దానికి ఇదే తిరుగులేని నిదర్శనమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా పరిణామాలతో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సీఐడీ అధికారులు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. -
వియ్యంకుల వారి భూ విందు
సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెలికి తీసింది. టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. బినామీల ఖాతాల్లోకి డబ్బులు.. వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు. అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారు చౌకగా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్ భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు. రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్ రైతులు అసైన్డ్ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగేలా చేశారు. అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది. కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూములను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసుకున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. -
బాబు బంగ్లాకే ముడుపులు.. మళ్లీ ఆ ముగ్గురే
సాక్షి, అమరావతి: తీగ లాగితే డొంకంతా కదులుతోంది! ముడుపుల చిట్టాలన్నీ చంద్రబాబు బంగ్లాకే దారి తీస్తున్నాయి!! అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలు, టిడ్కో ఇళ్ల కాంట్రాక్టుల్లో ప్రజాధనాన్ని లూటీ చేసిన వ్యవహారంలో ఆదాయపన్ను (ఐటీ) శాఖ తీగ లాగితే... చంద్రబాబు కనుసన్నల్లో సాగిన ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) కుంభకోణం పునాది బయటపడుతోంది. కుంభకోణాలు వేర్వేరైనా కొల్లగొట్టిన ప్రజాధనాన్ని షెల్ కంపెనీల ద్వారా తరలించడంలో పాత్రధారులు మాత్రం వారే. ఆ అక్రమార్జన అంతా చివరకు చేరింది సూత్రధారి చంద్రబాబు చెంతకే అన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో భవన నిర్మాణ ప్రాజెక్టుల కాంట్రాక్టులను కట్టబెట్టడంలో అక్రమార్జనకు సంబంధించి చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసుల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆ కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్న మనోజ్ వాసుదేవ్ పార్థసాని, చంద్రబాబు పీఏస్ పెండ్యాల శ్రీనివాస్, యోగేశ్ గుప్తా ఏపీఎస్ఎస్డీసీ అవినీతి బాగోతంలోనూ కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది. ఇప్పటికే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం కేసు దర్యాప్తులో కీలక ప్రగతి సాధించిన సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజా పరిణామాలతో తక్షణం రంగంలోకి దిగింది. ముడుపుల తరలింపులో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ వాసుదేవ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్‌లను విచారించాలని నిర్ణయించింది. ఈమేరకు వారికి నోటీసులు జారీ చేసి దర్యాప్తును వేగవంతం చేసేందుకు సిద్ధమైంది. బాబు అవినీతి ‘స్కిల్’... టీడీపీ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాన సూత్రధారిగా ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణం జరిగినట్లు ‘సిట్’ ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించింది. జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీకి ఏమాత్రం తెలియకుండా ఆ కంపెనీ పేరుతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా మోసగించి ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు ఆధారాలతో సహా నిరూపించింది. రూ.3,300 కోట్ల ప్రాజెక్టును కాగితాలపై చూపించి సీమెన్స్ కంపెనీ 90 శాతం నిధులు సమకూరుస్తుందని బుకాయించి రాష్ట్ర ప్రభుత్వం 10 శాతం నిధులను కేటాయించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. సీమెన్స్ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే ప్రభుత్వ వాటా 10 శాతం కింద జీఎస్టీతో కలిపి మొత్తం రూ.371 కోట్లను అడ్డగోలుగా చెల్లించేశారు. అలా నిధులు చెల్లించడం నిబంధనలకు విరుద్ధమని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుతోపాటు మరో ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులు వారించిన ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఖాతరు చేయలేదు. ఏకపక్షంగా రూ.371 కోట్లను సీమెన్స్ భాగస్వామ కంపెనీగా ఒప్పందంలో చూపించిన డిజైన్ టెక్ కంపెనీకి విడుదల చేశారు. అందులో రూ.241 కోట్లను పలు షెల్ కంపెనీలను సృష్టించి హవాలా మార్గంలో టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేత కొల్లగొట్టారు. ఈ కేసులో సిట్ అధికారులు 8 మందిని అరెస్టు చేశారు. హవాలా మార్గంలో నల్లధనాన్ని చలామణిలోకి తెచ్చినందున కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని నిర్ధారించి ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయడంతోపాటు డిజైన్ టెక్ కంపెనీకి చెందిన రూ.31.20 కోట్లను అటాచ్ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. షెల్ కంపెనీలు.. బోగస్ ఇన్వాయిస్లు టీడీపీ ప్రభుత్వంలో అమరావతిలో తాత్కాలిక నిర్మాణాల కాంట్రాక్టులను కట్టబెట్టిన కుంభకోణంలో పాత్రధారులుగా ఉన్నవారే ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలోనూ కీలక పాత్ర పోషించారని సిట్ గుర్తించింది. షాపూర్జీ– పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ పార్థసాని, షెల్ కంపెనీల సృష్టికర్త యోగేశ్ గుప్తా, చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్.. ఈ ముగ్గురూ అమరావతి భవన నిర్మాణాల కాంట్రాక్టు అవినీతి సొమ్మును చంద్రబాబుకు చేర్చడంతో కీలకంగా వ్యవహరించారన్నది ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. రూ.8 వేల కోట్ల విలువైన నిర్మాణాల కాంట్రాక్టుల్లో భారీ అవినీతికి పాల్పడి ఆ నల్లధనాన్ని మనోజ్ వాసుదేవ్ పార్థసాని షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేర్చారు. అందుకోసం షెల్ కంపెనీలను సృష్టించడంలో యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించారు. ఆయన నివాసంలో ఐటీ శాఖ అధికారులు సోదాలు కూడా నిర్వహించారు. మరోవైపు ఆ షెల్ కంపెనీల పేరుతో మళ్లించిన నిధులను డ్రా చేసి మనోజ్ వాసుదేవ్ పార్థసాని నగదు రూపంలో చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు హైదరాబాద్‌లో అందించారు. ఆ విధంగా చంద్రబాబుకు చేరిన అక్రమార్జనలో రూ.118 కోట్లకు సంబంధించి లెక్కలు చెప్పాలని ఐటీ శాఖ నోటీసులు జారీ చేయడం జాతీయస్థాయిలో చర్చనీయాంశంగా మారింది. బాబుకు ముడుపులు చేరాయిలా... అమరావతిలో తాత్కాలిక నిర్మాణ కాంట్రాక్టుల అవినీతి దందాలో సూత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్ ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో ప్రధాన భూమిక పోషించిన తీరు ఇదీ.. ► ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టేందుకు యోగేశ్ గుప్తా పలు షెల్ కంపెనీలను సృష్టించాడు. ముంబై, పుణే కేంద్రాలుగా సృష్టించిన షెల్ కంపెనీల పేరిట నకిలీ ఇన్వాయిస్లను సమర్పించారు. ఆ ఇన్వాయిస్ల ఆధారంగా షెల్ కంపెనీలకు ఏపీఎస్ఎస్డీసీ రూ.371 కోట్లను విడుదల చేసింది. దీనిపై ఆధారాలు సేకరించిన అనంతరం సిట్ అధికారులు ఏపీఎస్ఎస్డీసీ కుంభకోణంలో కేసులో యోగేశ్ గుప్తాను ఏ–22గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. ► నకిలీ ఇన్వాయిస్ల ఆధారంగా షెల్ కంపెనీలకు చేరిన రూ.371 కోట్లను యోగేశ్ గుప్తా డ్రా చేసి మనోజ్ పార్థసానికి అందించాడు. ఆయన అందులో రూ.241 కోట్లను ముంబై నుంచి హైదరాబాద్‌కు తరలించాడు. రూ.241 కోట్ల నగదు మొత్తాన్ని హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు అందించాడు. ► ఆ రూ.241 కోట్ల నగదు మొత్తం పెండ్యాల శ్రీనివాస్ ద్వారా చివరకు హైదరాబాద్‌లో చంద్రబాబు నివాసానికి చేరినట్లు స్పష్టమవుతోంది. ఆ ముగ్గురికీ సిట్ నోటీసులు ఏపీఎస్ఎస్డీసీ నిధులను కొల్లగొట్టడంతో పాత్రధారులుగా వ్యవహరించిన యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసాని, పెండ్యాల శ్రీనివాస్‌లకు సిట్ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. విజయవాడలో సిట్ అధికారుల ఎదుట వచ్చే సోమవారం విచారణకు హాజరు కావాలని యోగేశ్ గుప్తా, మనోజ్ పార్థసానికి నోటీసులిచ్చారు. చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ ఈనెల 14న విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. -
TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్న వారంతా కేసు నుంచి తప్పించుకోవడానికి నానాతంటాలు పడుతున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన భార్యాభర్తలు సిమ్ కార్డులు మార్చి పుణ్యక్షేత్రాలకు తిరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కేసులో తప్పించుకోలేమని తెలుసుకొని ఎట్టకేలకు సిట్ ఎదుట లొంగిపోయారు. అంతేగాక కేసు నుంచి తప్పించుకునేందుకు మరో 15 మంది ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. కాగా ఇప్పటివరకు ఈకేసులో 90 మందిని పైగా అరెస్టు చేసిన సిట్ అధికారులు.. ఈ నెలాఖరులో మరో 10 మందిని అరెస్టు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఫోరెన్సిక్ నివేదిక అందగాగానే రెండో ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి సిట్ సిద్ధమైంది. ఇక పేపర్ లీకేజ్ కేసులో అసలు సూత్రధారులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిగా సిట్ తేల్చింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మి కంప్యూటర్ నుంచి ప్రవీణ్ పేపర్‌ను తీసుకొని ఆమె డైరీలో ఉన్న సాస్‌వర్డ్, యూజర్‌నేమ్ ద్వారా పేపర్ లీక్ జరిగినట్లు సిట్ అధికారులు గుర్తించారు. -
TSPSC Case: ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సిట్.. ఏముందంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీ కేసును కేసీఆర్ సర్కార్ సీరియస్‌గా తీసుకుంది. దీంతో, దర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేసింది. కాగా, ఈ కేసులో సిట్ తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే, సిట్ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారం.. పేపర్ లీకేజీ కేసులో ఇప్పటి వరకు రూ.1.63కోట్ల లావాదేవీలు జరిగాయి. పేపర్ లీక్ కేసులో ఇప్పటికి 49 మంది అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో 16 మంది మధ్యవర్తులుగా వ్యవహరించారు. మరో నిందితుడు ప్రశాంత్ రెడ్డి న్యూజిలాండ్‌లో ఉన్నాడు. ఎనిమిది మంది అభ్యర్థులకు డీఏఓ పేపర్ లీకైంది. ఏఈ పేపర్ 13 మందికి, గ్రూప్-1 ప్రిలిమ్స్ పేపర్ నలుగురికి లీకైంది. ఏఈఈ పేపర్ ఏడుగురు అభ్యర్థులకు లీకైంది. ఏఈఈ పరీక్షలో మరో ముగ్గురు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్స్, ఇతర పరికరాలను రామాంతపూర్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీకి పంపించామని సిట్ పేర్కొంది. ఇది కూడా చదవండి: బీజేపీ బిగ్ ప్లాన్.. ఈటల రాజేందర్‌కు కీలక బాధ్యతలు! -
విపక్షాల ‘పని’ మీదనే సీబీఐ ఉంది కదా సార్! నిజమే! సిట్ బెటర్!
విపక్షాల ‘పని’ మీదనే సీబీఐ ఉంది కదా సార్! నిజమే! సిట్ బెటర్! -
ప్రిలిమ్స్ వాయిదా లేదు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 11న గ్రూప్–1 ప్రిలిమ్స్ నిర్వహించేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ పరీక్షను వాయిదా వేసేందుకు నిరాకరించింది. మార్చిలో నోటిఫికేషన్ ఇచ్చి, పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఇప్పుడు వాయిదా కోరుతూ పిటిషన్లు వేయడం సరికాదంది. ఆ పిటిషన్లను కొట్టివేసింది. పేపర్ లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్–1 పరీక్షలు ఆపాలని విజ్ఞప్తి చేస్తూ హైకోర్టులో ఐదు పిటిషన్లు దాఖలయ్యాయి. టీఎస్పీఎస్సీ సిబ్బందిలో ఎంతమందికి లీకేజీతో సంబంధం ఉందో తెలియకుండా అదే కమిషన్ పరీక్షలు నిర్వహించడం సరికాదని పిటిషనర్లు పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ ముమ్మినేని సుధీర్‌కుమార్ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అవినాశ్ దేశాయ్, న్యాయవాది పల్లె నాగేశ్వర్రావు వాదించగా, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. యూపీఎస్సీతో పరీక్ష నిర్వహించాలి.. ‘టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు ఇంకా పూర్తికాలేదు.. కొనసాగుతోంది. కమిషన్‌లో పనిచేసే వారికి లీకేజీతో సంబంధం ఉందని కొందరిని సస్పెండ్ చేశారు. దర్యాప్తు పూర్తి అయితేగానీ ఇంకా ఎవరైనా ఉన్నారా? లేదా? అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. దాదాపు 11 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన గ్రూప్–1 పరీక్ష నిర్వహిస్తోంది. 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు గ్రూప్–1 కోసం ఎదురుచూశారు. ఈ పరీక్ష ద్వారా ప్రభుత్వంలో కీలకమైన పోస్టుల్లో అధికారుల నియామకం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష పటిష్టంగా, పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుత కమిషన్ ఆధ్వర్యంలో పరీక్ష సాగుతున్నప్పుడే లీకేజీ జరిగింది. అలాంటప్పుడు అదే కమిషన్ తిరిగి ఎలా పరీక్ష నిర్వహిస్తుంది? యూపీఎస్సీ లాంటి ఏదైనా థర్డ్ పార్టీ కమిషన్‌తో నిర్వహిస్తే ఎవరికీ ఎలాంటి అనుమానం, అభ్యంతరం ఉండదు. ’అని అవినాశ్ దేశాయ్ తెలిపారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.. ‘పేపర్ లీకేజీ విషయం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించి పరీక్షలను రద్దు చేసింది. ఇది ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనం. ఇప్పటివరకు టీఎస్పీఎస్సీలోని ఇద్దరు శాశ్వత ఉద్యోగులు, ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులకు లీకేజీతో సంబంధం ఉందని తేలడంతో వారిని సస్పెండ్ చేశారు. వారిని దర్యాప్తు అధికారులు అరెస్టు కూడా చేశారు. పరీక్ష రద్దు చేసినప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన లేకుంటే త్వరగా నిర్వహించమని అడగాలి తప్ప.. వాయిదా కోరడం సరికాదు. జూన్ 11న పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3.18 లక్షల మంది గ్రూప్–1కు దరఖాస్తు చేయగా, ఇప్పటికే 1.13 లక్షల మంది హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మిగతావారు కూడా ఒకట్రెండు రోజుల్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 995 సెంటర్లలో ఏర్పాట్లు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్ష వాయిదా వేయాలని కోరడం సమంజసం కాదు...’ అని బీఎస్ ప్రసాద్ నివేదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. వచ్చే ఆదివారమే పరీక్ష ఉన్న నేపథ్యంలో వాయిదా వేయలేమని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. -
TSPSC Case: ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసి మాస్ కాపీయింగ్.
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజ్‌తోపాటు హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పాల్పడిన నీటిపారుదల శాఖ పెద్దపల్లి ఏఈ పూల రమేష్ విచారణలో కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. సిట్ అధికారులు ఇతడిని బుధవారం కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు ప్రస్తావించారు. హైటెక్ మాస్ కాపీయింగ్ ద్వారా ఇతడు రూ.1.1 కోటి వరకు ఆర్జించినట్లు తేల్చారు. ఒక్కో అభ్యర్ధితో రూ.20–30 లక్షల వరకు ఒప్పందం కుదుర్చుకుని, ఏడుగురితో ఏఈఈ, డీఏఓ పరీక్షలు రాయించినట్లు పేర్కొన్నారు. కొంత మొత్తం అడ్వాన్సుగా తీసుకున్న ఇతడు మిగిలింది ఫలితాల తర్వాత తీసుకోవాల్సి ఉందని అందులో చెప్పారు. కాగా, భార్యను హత్య చేసినట్లు రమేశ్‌పై ఆరోపణలున్నాయి. ఆస్పత్రిలో డాక్టర్ ద్వారా పరిచయం పెద్దపల్లిలో ఇరిగేషన్ ఏఈగా పనిచేస్తున్న రమేశ్‌కు గతంలో నార్కట్‌పల్లి వద్ద ప్రమాదం జరిగింది. అప్పట్లో అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా... డాక్టర్ ద్వారా టీఎస్పీఎస్సీ ఉద్యోగి సురేష్ పరిచయం అయ్యాడు. ఆపై ఇద్దరూ స్నేహితులుగా మారడంతో నగరంలోని రమేష్ ఇంట్లో సురేష్ అద్దెకు దిగాడు. ఆపై ఇద్దరి మధ్యా స్నేహం బలపడింది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం మానేసిన సురేష్ పేపర్ల లీకేజ్‌లో కీలకంగా మారాడు. ఇతడి ద్వారా ఏఈ పరీక్షలకు సంబంధించిన పేపర్లు రమేష్‌కు అందాయి. వీటిని ఇతడు 30 మందికి విక్రయించాడు. ఇలా వచ్చిన సొమ్ములో సగం సగం తీసుకుందామని సురేష్ ప్రతిపాదించాడు. దీనికి అంగీకరించని రమేష్... తనకు 70 శాతం ఇచ్చేలా సురేష్‌ను ఒప్పించాడు. అభ్యర్థులను వెతికి పట్టుకోవడం, విక్రయించడం లాంటి రిస్కులు తనవే అని, అందుకే ఎక్కువ వాటా కావాలన్నాడు. దీంతో సురేష్ ఏఈఈ, డీఏఓ పేపర్ల లీకేజ్ విషయం ఇతడికి చెప్పలేదు. దీంతో ఏడుగురితో ఒప్పందం చేసుకుని హైటెక్ మాస్ కాపీయింగ్‌కు పథకం వేశాడు. ఇతడు అనుసరించిన హైటెక్ కాపీయింగ్‌కు ఓ సినిమానే స్ఫూర్తిగా నిలిచింది. చదవండి: తెరపైకి కొత్త సీపీ.. సీఎంవోలో పని చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారి ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ చిత్రం చూసిన రమేష్ అందులోని కాపీయింగ్ పంథాను కాస్త హైటెక్‌గా మార్చి టీఎస్పీఎస్సీ పరీక్షలకు వినియోగించాడు. కాపీయింగ్‌కు రమేష్ భారీ స్కెచ్ వేశాడు. ఇంటర్నెట్ నుంచి అత్యాధునికమైన చెవిలో ఇమిడిపోయే బ్లూటూత్, సిమ్‌కార్డు ఆధారంగా పని చేసే చిన్న రిసీవర్, ట్రాన్స్‌మీటర్ తదితరాలు ఖరీదు చేశాడు. బ్లూటూత్ డివైజ్ ఎవరికీ కనిపించకుండా చెవిలో పెట్టించాడు. వారి చొక్కా కింది భాగంగా ప్రత్యేకంగా కుట్టించిన జేబులో రిసీవర్ ఉంచాడు. ఏడుగురు అభ్యర్థులు కచ్చితంగా ఇన్‌షర్ట్ చేసుకునేలా సూచించి తనిఖీల్లో దొరక్కుండా చేశాడు. ఓ పరీక్ష కేంద్రం నిర్వాహకుడితో ఒప్పందం చేసుకున్న రమేష్ పరీక్ష పత్రం బయటకు పంపేలా ప్రేరేపించాడు. ఆయా పరీక్షలకు గైర్హాజరైన వారి ప్రశ్నపత్రాలు అన్ని సిరీస్‌లవి ఫొటోలు తీసి ఈ నిర్వాహకుడు వాట్సాప్ ద్వారా రమేశ్‌కు పంపాడు. అప్పటికే ఇతడు సిద్ధం చేసుకున్న బృందానికి వీటిని పంపాడు. వాళ్లు చాట్‌జీపీటీ యాప్ ద్వారా ఆయా ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి.. వాటిని తమ వద్ద ఉన్న ట్రాన్స్‌మీటర్ ద్వారా ఏడుగురు అభ్యర్థులకు చెప్పారు. ఒక సిరీస్ తర్వాత మరో సిరీస్‌లోని ప్రశ్నల జవాబులను వీళ్లు చెప్పారు. రమేశ్‌తోపాటు ముగ్గురు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్ మిగిలిన నిందితుల కోసం గాలిస్తోంది. అరెస్టయిన ఇతర నిందితులను కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. ‘లీకేజీ’ వ్యవహారంలో 50 మంది డిబార్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కఠిన చర్యలకు ఉపక్రమించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన పలువురిని సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా అరెస్టయి కస్టడీలో ఉన్న అభ్యర్థులను టీఎస్పీఎస్సీ పరీక్షల నుంచి డిబార్ చేసింది. ఆయా అభ్యర్థులను ఇప్పటికే టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షల్లో అనర్హులుగా ప్రకటించగా... భవిష్యత్తులోనూ వారిని పరీక్షలకు అనుమతించబోమని తేల్చింది. ఇలా 50మందిని పరీక్షల నుంచి డిబార్ చేస్తూ టీఎస్పీఎస్సీ ఉత్తర్వులు జారీ చేసింది. డిబార్ చేసిన అభ్యర్థులు వివరణ సమర్పించాలని భావిస్తే రెండ్రోజుల్లోగా కమిషన్‌కు సమరి్పంచాల్సి ఉంటుందని వెబ్‌నోట్ ద్వారా వెల్లడించింది. అయిన అభ్యర్థులు వీరే.. పులిదిండి ప్రవీణ్‌కుమార్, అట్ల రాజశేఖర్‌రెడ్డి, రేణుక రాథోడ్, లవడ్యావత్ దాఖ్య, కే.రాజేశ్వర్, కే.నీలేశ్ నాయక్, పి.గోపాల్‌నాయక్, కే.శ్రీనివాస్, కే.రాజేందర్ నాయక్, షమీమ్, ఎన్.సురేశ్, డి.రమేశ్‌కుమార్, ఏ.ప్రశాంత్‌రెడ్డి, టి.రాజేంద్రకుమార్, డి.తిరుపతయ్య, సాన ప్రశాంత్, వై.సాయిలౌకిక్, ఎం.సాయి సుష్మిత, కోస్గి వెంకట జనార్థన్, కోస్గి మైబయ్య, కోస్గి రవి, కోస్గి భగవంత్ కుమార్, కొంతం మురళీధర్ రెడ్డి, ఆకుల మనోజ్ కుమార్, ఆది సాయిబాబు, పొన్నం వరున్‌కుమార్, రమావత్ మహేశ్, ముదావత్ శివకుమార్, దానంనేని రవితేజ, గున్రెడ్డి క్రాంతికుమార్ రెడ్డి, కొంతం శశిధర్‌రెడ్డి, అట్ల సుచరితారెడ్డి, జీపీ పురేందర్, నూతన్ రాహుల్ కుమార్, లవ్‌డ్యా శాంతి, రమావత్ దత్తు, అజ్మీరా పృథీ్వరాజ్, జాదవ్ రాజేశ్వర్, పూల రవికిశోర్, రాయపూర విక్రమ్, రాయపురం దివ్య, ధనావత్ భరత్ నాయక్, పాశికంటి రోహిత్‌కుమార్, గాదె సాయిమధు, లోకిని సతీశ్‌కుమార్, బొడ్డుపల్లి నర్సింగ్‌రావు, గుగులోత్ శ్రీనునాయక్, భుక్య మహేశ్, ముదావత్ ప్రశాంత్, వడిత్య నరేశ్, పూల రమేశ్‌కుమార్. -
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్ చేయాలని నిర్ణయించింది. సిట్ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని టీఎస్పీఎస్సీ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్పీఎస్సీ నోటీసులు జారీ చేసింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో కొత్త కోణం..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన విద్యుత్ శాఖ డీఈ పేరు కొత్తగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖ డీఈ కనుసన్నల్లో ఏఈ పేపర్ చేతులు మారినట్లు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో విద్యుత్ శాఖ జూనియర్ అసిస్టెంట్ రవికిషోర్‌ను సిట్ అరెస్ట్ చేసింది. ఆయన 20 మందికి పశ్నాపత్రాలు విక్రయించినట్లు సిట్ బృందం గుర్తించింది. డీఈ ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఓ కోచింగ్ సెంటర్లో శిక్షకుడిగా పనిచేస్తున్నాడని, అభ్యర్థులతో పరిచయం పెంచుకుని ఈ దందాకు తెరలేపినట్లు సిట్ అధికారులు గుర్తించారు. టాప్ మార్కులు వచ్చిన వారి వివరాలను సిట్ బృందం సేకరిస్తోంది. కాగా, ప్రశ్నపత్రాల లీకేజి కేసులో సిట్ అధికారులు గురువారం మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయగా, దీంతో ఈ కేసులో నిందితుల సంఖ్య 43కి, అరెస్ట్ అయిన వారి సంఖ్య 42కు చేరింది. ఈ వ్యవహారంలో సూత్రధారులుగా ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు పులిదిండి ప్రవీణ్‌కుమార్, రాజశేఖర్‌రెడ్డి ద్వారా అనేక ప్రశ్నపత్రాలు ఒకప్పుడు కమిషన్‌లో పని చేసిన వీరి స్నేహితుడు సురేశ్‌కు చేరాయి. చదవండి: రవికిశోర్ ద్వారా మరో ముగ్గురికి.. ఇతడు వీటిలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లను తన అపార్ట్మెంట్లో నివసించే వారికి మధ్యవర్తి ద్వారా విక్రయించాడు. ఈ వ్యవహారంలో నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పూల రవికిశోర్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. సురేశ్ గతంలోనే అరెస్టు కాగా.. రవికిశోర్‌తోపాటు ఏఈ, డీఏఓ పేపర్లు ఖరీదు చేసిన అన్నాచెల్లెళ్లు రాయపురం విక్రమ్, దివ్యలను బుధవారం అరెస్టు చేశారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ: తవ్వేకొద్దీ బయటపడుతున్న నిజాలు..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. డీఏవో పరీక్ష టాప్ స్కోరర్లుగా ఉన్న రాహుల్, శాంతి, సుచరితలను సిట్ విచారిస్తోంది. నిందితులను విచారించేందుకు 3 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. చంచల్ గూడ నుండి నిందితులను కస్టడీని తీసుకుని సిట్ విచారిస్తోంది. మరో వైపు సిట్ ముందు విచారణకు రేణుకా హజరుకానుంది. ఇప్పటికీ యుజర్ ఐడి, పాస్ వర్డ్ వ్యవహారం కొల్లిక్కి లేదు. కస్టోడియన్ శంకర్ లక్ష్మిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటి వరకు శంకర్ లక్ష్మి కేవలం సాక్షిగా సిట్ పరిగణించింది. తవ్వేకొద్దీ నిందితుల పాత్ర బయట పడుతోంది. ఇప్పటి వరకు 37 మందిని సిట్ అరెస్ట్ చేసింది. మరికొంత మందికి పరీక్ష కంటే ముందే పేపర్ వెళ్లినట్టు సిట్ గుర్తించింది. అరెస్ట్‌ల సంఖ్య 50కి చేరుకునే అవకాశం ఉంది. చదవండి: కాంగ్రెస్.. మోదీ.. మధ్యలో కేటీఆర్ అదిరిపోయే ఎంట్రీ కాగా, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బోర్డుపై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చినా సరైన సమాచారం ఇవ్వలేదని సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు సహకరిచకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. కాన్ఫిడెన్షియల్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మీ అంశంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. శంకర్ లక్ష్మీ కాల్ డేటా వివరాలు సేకరించిన సిట్.. లీకేజీ అంశంలో శంకర్ లక్ష్మీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బోర్డుపై సిట్ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో బోర్డుపై సిట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు ఇచ్చినా సరైన సమాచారం ఇవ్వలేదని సిట్ అధికారులు సీరియస్ అయ్యారు. దర్యాప్తుకు సహకరిచకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని బోర్డుకు వార్నింగ్ ఇచ్చారు. కాన్ఫిడెన్షియల్ ఇంచార్జ్ శంకర్ లక్ష్మీ అంశంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. శంకర్ లక్ష్మీ కాల్ డేటా వివరాలు సేకరించిన సిట్.. లీకేజీ అంశంలో శంకర్ లక్ష్మీ ప్రమేయం ఉన్నట్లు గుర్తించింది. కాగా 2015 నుంచి శంకర్ లక్ష్మీ టీఎస్పీఎస్సీలో విధులు కొనసాగిస్తున్నారు. DAO, AEE, AE, పేపర్ల అంశంలో టీఎస్పీఎస్సీ వివరాలు దాచిపెట్టనట్లు సిట్ గుర్తించింది.పేపర్లు వాల్యుయేషన్ చేయలేదని TSPSC తప్పుడు వివరాలు ఇచ్చినట్లు తేలింది. మరోవైపు రాథోడ్ వ్యవహారంలో సిట్ కీలక సమాచారం సేకరించింది. బుధవారం మరో సారి విచారణకు రావాలని రేణుకకు నోటీసులు అందించింది. రేణుక నుంచి ప్రవీణ్‌కు పేపర్ మొదటగా వెళ్లింది. రేణుక రాథోడ్ నుంచి గంబిరాం రాహుల్‌కు గ్రూప్ పేపర్ చేరింది. అతన్ని సొంత వాహనంలో హైదరాబాద్‌త ఈసుకొచ్చిన రేణుక.. సిటీలోని సీక్రెట్ రూమ్ బుక్‌చేసుకొని లీకైన పేపర్ ప్రిపేర్ చేయించింది. అయితే ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ సిట్‌కు ఇచ్చిన వివరాల్లో తేడాలు ఉన్నట్లు సిట్ అనుమానిస్తోంది. TSPSC వివరాల కోసం సిట్ RTI దాఖలు చేయలేదని సిట్ స్పష్టం చేసింది. RTI దాఖలు చేసినట్లువ స్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. చదవండి: వంట మనిషి కొడుకు ‘సివిల్స్’ కొట్టాడు.. -
ఒకటి... రెండు... మూడు! అరెస్టు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించిన డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పరీక్షల్లో అత్యధిక మార్కులు పొంది, రాష్ట్ర స్థాయిలో తొలి మూడు ర్యాంకులు సాధించింది ‘లీకు వీరులుగా’తేలింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజేశ్వర్‌కు మొదటి ర్యాంకు, అతడి భార్య శాంతికి రెండో ర్యాంకు, మరో నిందితురాలు లవడ్యావత్ రేణుక స్నేహితుడు రాహుల్ కుమార్‌కు మూడో ర్యాంకు వచ్చాయి. ఈ ముగ్గురూ లీౖకైన మాస్టర్ ప్రశ్నపత్రం ఆధారంగానే పరీక్షలు రాసినట్లు అధికారులు తేల్చారు. ఇప్పటికే అరెస్టయిన రాజేశ్వర్‌కి బెయిల్ కూడా వచ్చింది. దీంతో శాంతి, రాహుల్‌తో పాటు టీఎస్పీఎస్సీ మాజీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ రాజశేఖర్‌రెడ్డి భార్య సుచరిత, నాగార్జునసాగర్‌కు చెందిన దళారి రమావత్ దత్తులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. రేణుక ద్వారా రాహుల్‌కు.. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న రాహుల్‌కు కొన్నేళ్లుగా లీకేజీలో కీలక సూత్రధారి అయిన ప్రవీణ్‌కుమార్ స్నేహితురాలు రేణుకతో పరిచయం ఉంది. డీఏఓ పరీక్ష రాస్తున్నాడనే విషయం తెలిసిన రేణుక ఈ ఏడాది ఫిబ్రవరిలో రాహుల్‌ను కలిసి డీఏఓ మాస్టర్ పేపర్‌ను చూపించింది. అందులో ఉన్న ప్రశ్నలు–జవాబులను రాహుల్ తన వద్ద ఉన్న నోట్ బుక్‌లో రాసుకున్నాడు. వీటి ఆధారంగా పరీక్షకు సిద్ధమైన అతడు మూడో ర్యాంకు సాధించాడు. ఇదే పేపర్‌ను రేణుక భర్త డాక్యా నుంచి తీసుకుని రాజేశ్వర్, అతడి భార్య శాంతి పరీక్ష రాశారు. తొలి పది ర్యాంకులు వచ్చిన వారిపై దృష్టి లీకేజ్ కేసు దర్యాప్తు ప్రారంభించిన సిట్ అధికారులు వివిధ కోణాల్లో ముందుకు వెళ్తున్నారు. ప్రతి పరీక్షలోనూ అధిక మార్కులు, మొదటి పది ర్యాంకులు సాధించిన వారి వివరాలను సేకరించి విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డీఏఓ పరీక్షల్లో ర్యాంకులు, మార్కులు సాధించిన వారిపై దృష్టి పెట్టిన పోలీసులు శాంతి, రాహుల్, సుచరిత, రాజేశ్వర్‌ల వ్యవహారం గుర్తించారు. రాజేశ్వర్ గతంలోనే ఈ కేసులో అరెస్టు అవడంతో బుధవారం రాహుల్, శాంతి, సుచరిత, దత్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వీళ్లు విషయం అంగీకరించడంతో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ పేపర్ వీరి నుంచి మరెవరికైనా చేరిందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం ఈ నలుగురినీ కస్టడీకి కోరాలని సిట్ అధికారులు నిర్ణయించారు. ఈ అరెస్టులతో కలిసి ఇప్పటి వరకు లీకేజ్ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య 34కు చేరింది. -
‘టీఎస్పీఎస్సీ లీకేజ్’ కేసులో మరో ముగ్గురు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ కేసులో మరో ముగ్గురు నిందితులను ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మంగళవారం అరెస్టు చేసింది. వీళ్లు ఏఈఈ, డీఏఓ పరీక్ష పత్రాలు ఖరీదు చేసిన అభ్యర్థులని అధికారులు ప్రకటించారు. వీరితో ఇప్పటి వరకు అరెస్టు అయిన వారి సంఖ్య 30కి చేరింది. కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్‌కుమార్ నుంచి ఏఈఈ పేపర్లు వరంగల్, హైదరాబాద్‌లకు చెందిన దళారులు మనోజ్‌కుమార్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డిలకు చేరాయి. వీటిని ఏడుగురికి విక్రయించారు. ఒక్కోక్కరితో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకుని రూ.1 లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు అడ్వాన్సులు తీసుకుని పేపర్లు అందించారు. మనోజ్, మురళీ విచారణలో వీరి నుంచి పేపర్లు ఖరీదు చేసిన వారి పేర్లు వెలుగులోకి వచ్చాయి. దీంతో గత వారం నలుగురిని అరెస్టు చేసిన సిట్ మంగళవారం క్రాంతి, శశిధర్‌రెడ్డిలను పట్టుకుంది. ఈ ద్వయం మురళీధర్‌రెడ్డి నుంచి ఏఈఈ పేపర్లు ఖరీదు చేసినట్లు గుర్తించింది. మరోపక్క ప్రవీణ్ కుమార్ రూ.6లక్షలు తీసుకుని ఖమ్మంకి చెందిన భార్యాభర్తలు సాయి సుస్మిత, సాయి లౌకిక్లకు డీఏఓ పేపర్ విక్రయించాడు. వీరిని సిట్ అధికారులు గత నెలలోనే అరెస్టు చేశారు. సాయి లౌకిక్ ఆ పేపర్‌ను తన స్నేహితుడైన రవి తేజకు విక్రయించాడు. దర్యాప్తులో ఈ విషయం గుర్తించిన పోలీసులు మంగళవారం రవితేజను కటకటాల్లోకి పంపారు. మంగళవారం అరెస్టయిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. తదుపరి విచారణ నిమిత్తం వీరిని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సిట్ నిర్ణయించింది. పేపర్ లీకేజీపై ఈడీకి బీఎస్పీ ఫిర్యాదు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వెనుక ఉన్న అసలైన సూత్రధారులను అరెస్టు చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు ఈడీకి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ రాసిన లేఖను పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు వెంకటేష్ చౌహాన్, అరుణ, సంజయ్‌లు ఈడీ కార్యాలయంలో సంబంధిత అధికారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకున్న విచారణ జరపాలని ఈడీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. -
ఇచ్చిపుచ్చుకున్నారు.. చంద్రబాబు క్విడ్ ప్రో కో గుట్టురట్టు
సాక్షి, అమరావతి: కృష్ణా నది కరకట్టపై చంద్రబాబు నివాసం.. అమరావతిలో చంద్రబాబు క్విడ్ ప్రోకో కు ఓ మచ్చు తునకని నిగ్గు తేలింది. అమరావతిలోని సీడ్ క్యాపిటల్‌లో నారాయణ బినామీల పేరిట ఉన్న 75,888 చదరపు గజాల స్థలాలు టీడీపీ భూబాగోతానికి నిదర్శనమని నిర్ధారణ అయ్యింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో టీడీపీ పెద్దల అవినీతి బట్టబయలైంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే చంద్రబాబు, నారాయణ, లింగమనేని, వారి బంధువులు, బినామీలు భారీ భూ దోపిడీకి బరితెగించారని ఆధారాలతో సహా వెల్లడైంది. చంద్రబాబు అండ్ గ్యాంగ్ అమరావతిలోని అవినీతి సామ్రాజ్యాన్ని సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బట్టబయలు చేసింది. దాంతో టీడీపీ ప్రభుత్వంలో అమరావతి కేంద్ర బిందువుగా ఏ–1 నారా చంద్రబాబు, ఏ–2 పొంగూరు నారాయణ యథేచ్ఛగా సాగించిన భారీ భూ దోపిడీపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. అమరావతిలో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడిన అక్రమాలు, అవినీతిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించడం సరైనదేనని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దాంతో తన అవినీతి బట్టబయలు కాకుండా చంద్రబాబు కొన్నేళ్లుగా అడ్డుకుంటున్న కుట్రలకు తెరపడింది. ఈ నేపథ్యంలో రాజధాని ల్యాండ్ పూలింగ్, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లలో పచ్చ ముఠా అక్రమాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. బాబు, నారాయణవి అక్రమ ఆస్తులే అక్రమ మార్గంలో సంపాదించిన ఆస్తులను అటాచ్ చేసేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పిస్తున్న క్రిమినల్ లా ఆర్డినెన్స్ ప్రకారం అనుమతించాలని సీఐడీ కోరింది. ఈ మేరకు అవినీతి నిరోధక చట్టం–1988 ప్రకారం లింగమనేని కుటుంబం క్విడ్ ప్రో కో కింద చంద్రబాబుకు ఇచ్చిన కరకట్ట నివాసం.. సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో నారాయణ బినామీల పేరిట పొందిన 75,888 చదరపు గజాల స్థలాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ రెండు వేర్వేరు జీవోలు జారీ చేసింది. దాంతో సీఐడీ ఆ విషయాన్ని ఏసీబీ న్యాయస్థానానికి నివేదించి, ఆ ఆస్తులను అటాచ్ చేసేందుకు ఉపక్రమించనుంది. తదుపరి దశల్లో మరిన్ని కఠిన చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేస్తోంది. భారీ అవినీతికే ‘మాస్టర్ ప్లాన్’ అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనలోనే ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీ అవినీతికి పునాది వేశారు. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే అప్పటి టీడీపీ ప్రభుత్వం, సింగపూర్‌కు చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజస్‌తో ఒప్పందం చేసుకుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు కన్సల్టెన్సీ ఎంపిక కోసం కనీసం టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టకుండా సింగపూర్ కంపెనీకి నామినేషన్ పద్ధతిలో అడ్డగోలుగా అప్పగించేశారు. దాంతో చంద్రబాబు, నారాయణ కనుసన్నల్లోనే మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ కంపెనీ రూపొందించింది. లింగమనేని రమేశ్, లింగమనేని రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్, చంద్రబాబు బినామీలకు చెందిన భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా.. వారి భూముల వెలుపలి నుంచే ల్యాండ్ పూలింగ్ చేసేలా మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేశారు. అందుకు ప్రతిగా చంద్రబాబు కుటుంబానికి లింగమనేని కుటుంబం భారీగా ప్రతిఫలాన్ని ముట్టజెప్పింది. క్విడ్ ప్రోకో కిందే కరకట్ట నివాసం చంద్రబాబు, లింగమనేని క్విడ్ ప్రో కో కింద పరస్పరం భారీగా అవినీతికి పాల్పడినట్టు సిట్ నిర్ధారించింది. లింగమనేని కుటుంబ సభ్యుల భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా చేసినందుకు చంద్రబాబుకు భారీగా ముట్టజెప్పారు. ఇన్నర్‌రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములను హెరిటేజ్ ఫుడ్స్‌కు ‘అమ్మినట్టు’ ఇవ్వడంతో సరిపెట్టలేదు. లింగమనేని కృష్ణానది కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూడా చంద్రబాబుకు ఇవ్వడం గమనార్హం. పక్కా క్విడ్ ప్రో కోలో భాగంగానే కరకట్ట నివాసం చంద్రబాబుకు ఉచితంగా ఇచ్చేశారని సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కరకట్ట నివాసంపై బాబు కట్టుకథలు కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జీతంతోపాటు హౌస్ రెంట్ అలవెన్స్ (ఇంటి అద్దె అలవెన్స్) కూడా తీసుకున్నారు. అంటే ప్రజాధనం నుంచి సీఎంగా ఇంటి అద్దె అలవెన్స్ తీసుకున్నారు. కానీ చంద్రబాబు 2017 నుంచి తాను ఉంటున్న కరకట్ట నివాసానికి అద్దెను లింగమనేని కుటుంబానికి చెల్లించినట్టు ఎక్కడా బ్యాంకు లావాదేవీలు లేవు. చంద్రబాబు నుంచి తీసుకున్న అద్దెకు లింగమనేని ఎక్కడా జీఎస్టీ చెల్లించనే లేదు. అంటే ఇంటి అద్దె అలవెన్స్‌ను ప్రజాధనం నుంచి తీసుకుంటున్న చంద్రబాబు.. తాను నివసిస్తున్న ఇంటికి మాత్రం అద్దె చెల్లించడమే లేదన్నది నిర్ధారణ అయ్యింది. క్విడ్ ప్రో కోలో భాగంగా ఆ నివాసం చంద్రబాబుకు లింగమనేని ఇచ్చారు కాబట్టే అద్దె చెల్లించలేదు. దేశ భక్తితో ఇచ్చారట! కరకట్ట నివాసంపై న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేందుకు లింగమనేని కూడా యత్నించారు. తాను దేశభక్తితోనే కరకట్ట నివాసాన్ని అప్పటి ప్రభుత్వం వాడుకునేందుకు ఉచితంగా ఇచ్చానని లింగమనేని రమేశ్ న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. మరి ఉచితంగా ఇచ్చిన ఇంటికి చంద్రబాబు ప్రజాధనం నుంచి ఇంటి అద్దె అలవెన్స్‌ను ఎలా తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానమే లేదు. దేశభక్తితో ఉచితంగా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి గానీ చంద్రబాబుకు వ్యక్తిగతంగా ఇవ్వడం ఏమిటి? ప్రభుత్వానికే ఉచితంగా ఇచ్చి ఉంటే.. చంద్రబాబు సీఎం పదవి నుంచి దిగిపోగానే ఆ ఇంటిని ఖాళీ చేయాలి. ఆ ఇంటిని ప్రభుత్వానికి అప్పగించాలి. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ఖాళీ చేయాలి. ఆ నివాసం ప్రభుత్వానికి చెందుతుంది. కానీ 2019లో సీఎం పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా చంద్రబాబు అదే కరకట్ట నివాసంలో ఉంటున్నారు. అంటే లింగమనేని దేశ భక్తితో ప్రభుత్వానికి ఉచితంగా ఇచ్చారన్నది అవాస్తవం. క్విడ్ ప్రో కోలో భాగంగానే ఆయన చంద్రబాబుకు ఇచ్చారన్నది దీనినిబట్టి కూడా నిర్ధారణ అయ్యింది. లింగమనేని నుంచి హెరిటేజ్ ఫుడ్స్‌కు భూమి 2014లో లింగమనేని కుటుంబ సభ్యుల నుంచి హెరిటేజ్ ఫుడ్స్ 4 ఎకరాలను ‘కొనుగోలు చేసినట్టు’ చూపించడం గమనార్హం. అమరావతి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూమినే హెరిటేజ్ ఫుడ్స్ కొనుగోలు చేసింది. ఆ పేరుతో ఆ భూమిని హెరిటేజ్ ఫుడ్స్‌కు బదలాయించారు. ఆ మేరకు అప్పట్లోనే నారా లోకేశ్ డైరెక్టర్‌గా ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీర్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్సీగా ఎన్నికై, మంత్రి కూడా అయిన లోకేశ్ అదే లింగమేని కుటుంబం ఇచ్చిన కరకట్ట మీద నివాసంలోనే నివసించారు. సీడ్ క్యాపిటల్‌లో వేళ్లూనుకున్న అవినీతి ► అమరావతిలో అత్యంత ప్రధానమైన సీడ్ క్యాపిటల్‌లో కూడా ఏ–1 చంద్రబాబు, ఏ–2 నారాయణ భారీగా భూ అక్రమాలకు పాల్పడ్డారు. ఎందుకంటే శాసనసభ, సచివాలయం మొదలైన ప్రధాన విభాగాలన్నీ కూడా సీడ్ క్యాపిటల్ పరిధిలోనే నిర్మించాలని నిర్ణయించారు. ► ఆ ప్రాంతంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయి కాబట్టి, సీడ్ క్యాపిటల్‌లో పూర్తిగా తమ వాటా భూములే ఉండేట్టుగా చంద్రబాబు, నారాయణ పన్నాగం పన్నారు. సింగపూర్ కంపెనీ సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వానికి 2015 జూలైలోనే సమర్పించింది. కానీ ఆ ప్లాన్‌ను బహిర్గతం చేయకుండా, ఆమోదించకుండా మూడు నెలలపాటు కాల యాపన చేశారు. ► ఆ సమయంలోనే నారాయణ తమ బినామీలు, బంధువులైన పొత్తూరి ప్రమీల, రాపూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో 65.50 ఎకరాలు కొనుగోలు చేశారు. అందుకోసం నారాయణ భార్య రమాదేవి, అల్లుడు డైరెక్టర్లుగా ఏర్పాటు చేసిన ఎన్‌స్పైరా కంపెనీ నుంచి నిధులను తమ బంధువులు, బినామీల ఖాతాల్లోకి మళ్లించారు. వారి పేరున సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. ► రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరును బినామీగా పెట్టుకుని కూడా నారాయణ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారు. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ బాం్యకు ఖాతాకు నిధులు బదిలీ చేశారు. ఆ నిధులతో ఆ కంపెనీ ఉద్యోగుల పేరున భూములు కొనుగోలు చేశారు. ► కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఉద్యోగులను సిట్ అధికారులు ప్రశ్నించగా తాము నారాయణ బినామీలుగానే భూములు కొనుగోలు చేశామని వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా నారాయణ తమ బంధువులు, బినామీల పేరిట సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. ► అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కింద సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చదరపు గజాల స్థలాలు పొందారు. వాటిలో 7,620 చదరపు గజాలు, 8,880 చదరపు గజాలు, 6,550 చదరపు గజాలు, 25 వేల చదరపు గజాల స్థలాలు కూడా ఉన్నాయి. అవి నేరుగా సీడ్ యాక్సెస్ రోడ్డుకు అనుసంధానించి ఉండటం గమనార్హం. ► భవిష్యత్‌లో స్టార్ హోటళ్లు, షాపింగ్ మాల్స్, ఇతర భారీ వాణిజ్య సముదాయాల నిర్మాణానికి అనుకూలమైన విలువైన స్థలాలను పొందారన్నది స్పష్టమవుతోంది. పూలింగ్ ప్యాకేజీ కింద ఏటా సీఆర్డీఏ ఇప్పటి వరకు చెల్లించిన రూ.1.92 కోట్ల కౌలు మొత్తం ఎన్‌స్పైరా ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఆ భూములు కొనుగోలు చేసి సీఆర్డీఏకే ఇచ్చినట్టు పేర్కొన్న పొత్తూరి ప్రమీల, రా>పూరి సాంబశివరావు, ఆవుల ముని శంకర్, వరుణ్ కుమార్ కొత్తప్ప పూర్తిగా నారాయణ బినామీలేనన్నది నిర్ధారణ అయ్యింది. వారి భూముల వద్దే ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలో 75 మీటర్ల ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను రూపొందించడంలో చంద్రబాబు, నారాయణ యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడ్డారు. వారి భూములను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్‌ను రూపొందించారు. లింగమనేని కుటుంబం, హెరిటేజ్ ఫుడ్స్, నారాయణ విద్యా సంస్థల సమీపం నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా చంద్రబాబు, నారాయణ ప్రత్యేకంగా పర్యవేక్షించారు. తమ భూముల నుంచి కాకుండా సామాన్య రైతుల భూముల నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్‌ను ఖరారు చేయడం గమనార్హం. అందుకోసం ముందుగానే ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఇళ్ల నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వకుండా సీఆర్డీయే నిలుపుదల చేసింది. అంటే కన్సల్టెన్సీ సంస్థ అలైన్‌మెంట్‌ను రూపొందించకముందే చంద్రబాబు, నారాయణ ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలా నిర్మించాలో నిర్ణయించేశారు. అప్పటికే నిర్ణయించిన అలైన్‌మెంట్‌ను ఖరారు చేసేందుకే ఓ కన్సల్టెన్సీని నియమించి కనికట్టు చేశారు. చదవండి: దిగజారుడు పాత్రికేయానికి మరో మచ్చుతునక వాస్తవానికి విజయవాడలోని కామినేని ఆస్పత్రి వద్ద ఉన్న తాడిగడప– ఎనికేపాడు మీదుగా ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని కన్సల్టెన్సీ సంస్థ ఎస్టీయూపీ అలైన్‌మెంట్‌ను రూపొందించింది. అలా నిర్మిస్తే నారాయణ విద్యా సంస్థలతోపాటు హెరిటేజ్ ఫుడ్స్, లింగమనేని భూముల మీదుగా రోడ్డును నిర్మించాల్సి వస్తుంది. దీనిపై అప్పటి సీఆర్డీయే వైస్ చైర్మన్‌గా ఉన్న నారాయణ సీఆర్డీయే సమావేశంలోనే అధికారులపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తాడిగడపకు 3 కి.మీ. దూరంగా తూర్పు వైపు నుంచి పెనమలూరు– నిడమానూరు మీదుగా ఇన్నర్‌రింగ్ రోడ్డు నిర్మించేలా అలైన్‌మెంట్‌ను మార్పించారు. -
TSPSC: పేపర్ లీక్‌లో మరో ట్విస్ట్.. ఎంపీడీవో ఆఫీసు ఉద్యోగి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, పేపర్ లీకేజీ కేసులో సిట్ స్పీడ్ పెంచింది. ఈ కేసులో తాజాగా మరో ఇద్దరిని సిట్ అరెస్ట్ చేసింది. వికారాబాద్ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతడి తమ్ముడు రవికుమార్‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వివరాల ప్రకారం.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితుడిగా ఉన్న డాక్యా నాయక్ నుంచి ఏఈ పేపర్‌ను తన తమ్ముడు రవి కోసం భగవంత్ కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని అరెస్ట్ చేసినట్టు సిట్ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డాక్యా నాయక్ ఖాతాలను విశ్లేషించగా.. రూ.2లక్షలకు భగవంత్ ఏఈ పేపర్ కొనుగోలు చేసిన విషయం బయటపడినట్లు సిట్ వెల్లడించింది. కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో నిందితులకు రూ.33.4 లక్షలు అందినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఇది కూడా చదవండి: పొంగులేటి, జూపల్లితో భేటీపై ఈటల రాజేందర్ ఏమన్నారంటే? -
బాబు అక్రమాలపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం శుభ పరిణామమే
ఆంధప్రదేశ్‌లో 2014 నుంచి 2019 వరకు పాలన సాగించిన తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణకు సుప్రింకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేష పరిణామమే. కాని ఇప్పటికి మూడేళ్లపాటు ఈ విచారణ ముందుకు సాగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడ్డుకోగలిగారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై జరుగుతున్న విచారణ చేయకుండా ప్రాధమిక దశలోనే హైకోర్టు స్టే ఇవ్వడాన్ని సుప్రీం ఆక్షేపించింది. దీనిని ఎవరైనా స్వాగతించవలసిందే. అప్పట్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చాలా విమర్శలు వచ్చాయి. గత ప్రభుత్వ నిర్ణయాలను కొత్త ప్రభుత్వం సమీక్షించకూడదంటే, గత పాలన హయాంలో జరిగిన అవినీతిని ఆ తర్వాత ప్రభుత్వం విచారించకూడదని న్యాయ వ్యవస్థ నిర్ణయం చేస్తే, ఎదురయ్యే దుష్పపరిణామాలపై చాలా చర్చ జరిగింది. నిజానికి ఈ కేసు లో పిటిషన్లు వేసిన వారికి ఈ స్కామ్ లతో నేరుగా సంబంధం లేదు. వారు ధర్డ్ పార్టీ అవుతారు. వారితో హైకోర్టులో పిటిషన్ వేయించి , ఇంతకాలం విచారణ జరపకుండా ఆటంకాలు సృష్టించిన టీడీపీ ఇకపై కూడా రకరకాల వ్యూహాలు అనుసరించి,కేసు ముందుకు సాగకుండా యత్నించవచ్చు. గౌరవ హైకోర్టు వారు ఇలాంటి అవినీతి కేసుల దర్యాప్తు మొదలు కాకుండానే ఎఫ్.ఐ.ఆర్.కొట్టివేసే పరిస్థితి వస్తే భవిష్యత్తులో ఎవరు ప్రభుత్వంలో ఉన్నా యధేచ్చగా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉంటుందన్న అభిప్రాయం ఏర్పడింది. అమరావతి భూముల స్కామ్ , ఫైబర్ నెట్ స్కామ్, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్, అమరావతి అస్సైన్డ్ భూముల కుంభకోణం , అమరావతి రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు వంటి పలు ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. వీటిపై కొత్తగా అదికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ద్వారా పరిశీలన చేయించింది. తదుపరి ఉప సంఘం సిఫారస్ మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను (సిట్ ) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సిట్ తమ పని మొదలు పెట్టిందో, లేదో తెలుగుదేశం పార్టీ వారు హైకోర్టును ఆశ్రయించడం ఆరంబించారు. అప్పట్లో హైకోర్టులో కూడా పలు ఉత్తర్వులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన క్రమంలో ఈ విషయంలో కూడా ఎదురుదెబ్బే తగిలింది. అయితే ఏపీ ప్రభుత్వం ఈ అవినీతి కేసుల విచారణను రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఈడీ, సీబీఐ వంటివాటితో చేయించడానికి అభ్యంతరం లేదని చెప్పినా హైకోర్టు ఒప్పుకోలేదు. కారణం ఏమైనా , అలాంటి తీర్పులు సమాజానికి మేలు చేస్తాయా?లేదా? అన్న మీమాంస ఏర్పడింది. ఈ తీర్పుల ఆధారంగా టీడీపీ రెచ్చిపోయి, అసలు అవినీతే జరగలేదని కోర్టు తమకు సర్టిఫికెట్ ఇచ్చేసినంతగా ప్రచారం చేసుకునేది . జగన్ కాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు కాని చేసిన ఆరోపణలలో పస లేదని అనేవారు. విశేషమేమిటంటే కేసులు పెట్టకపోతే మీరు ఏమి పీకారు? ఒక్క దానిలో కూడా కేసు పెట్టలేకపోయారు? ఒక్క కేసు కూడా రుజువు చేయలేకపోయారు!అని వ్యాఖ్యానించేవారు. అదే కేసు పెట్టగానే ఇంకేముంది ఈ ప్రభుత్వం కక్ష కట్టిందని సానుభూతి కోసం మాట్లాడేవారు .ఇలా డబుల్ గేమ్ ఆడుతూ వచ్చిన టీడీపీకి ఇప్పుడు సుప్రింకోర్టు షాక్ ఇచ్చినట్లయింది. వారు ఇది ఊహించని విషయమే అయి ఉంటుంది. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. సిట్ దర్యాప్తునకు అభ్యంతరాలు తొలగిపోవడంతో అదికారులు తమ విచారణను వేగవంతం చేయవచ్చు.ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో సహా పలువురు మంత్రులు ఈ కేసుల్లో చంద్రబాబు కూడా అరెస్టు అవక తప్పదని అంటున్నారు. అది ఎంతవరకు జరుగుతుందనేది అప్పుడే చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబును తక్కువ అంచనా వేయజాలం. ఆయా వ్యవస్థను మేనేజ్ చేయడంలో ఆయన సిద్దహస్తుడన్న పేరు ఉంది. అరెస్టు సంగతి ఎలా ఉన్నా, ఇప్పటికే ఆయనపైన, ఆయన అనుచరులపైన నమోదైన కేసులలో విచారణకు స్వయంగా హాజరు కాక తప్పకపోవచ్చు. చంద్రబాబును ఒక విచారణాధికారి ముందు కూర్చోబెట్టి ప్రశ్నించగలిగితే అదే గొప్ప విషయం గా అనుకునే పరిస్థితి ఉంది.అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ అయినా ఆయా కేసులలో విచారణ ఎదుర్కున్నారేమో కాని, పస్తుత అధ్యక్షుడు బిడైన్ ఇంటిలో ఎఫ్ బి ఐ అదికారులు సోదాలు జరిపారేమో కాని, చంద్రబాబుపై ఎన్ని ఆరోపణలు ఉన్నా, ఎవరూ ఆయన దాకా వెళ్లలేకపోయారు. చదవండి: విచారిస్తేనే వెలుగులోకి! బాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు మన దేశంలో ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ,ఎమ్.పిలకు ముడుపులు చెల్లించారన్న అభియోగం లో పివి నరసింహారావు వంటి మాజీ ప్రధానులు ,కొన్ని అవినీతి కేసులలో కొందరు మాజీ ముఖ్యమంత్రులు కూడా దర్యాప్తులకు అతీతంగా లేరు. కాని చంద్రబాబు మాత్రం ఏదో రకంగా రక్షణ పొందడమే ఆయన ప్రత్యేకత అని చెప్పాలి.ఉదాహరణకు ఓటు కు నోటు కేసును తీసుకోవచ్చు చార్జీషీట్ లో ముప్పైఆరుసార్లు చంద్రబాబు పాత్రపై ప్రస్తావన ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆ కేసులో చంద్రబాబును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడని అనేవారు. కాని అంతిమంగా చంద్రబాబుపై ఎఫ్ ఐ ఆర్ కూడా పెట్టలేకపోయారు. అది చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్ అని చాలా మంది అబిప్రాయపడ్డారు. వైసిపి ప్రభుత్వం వచ్చాక పలు ఆరోపణలపై చంద్రబాబు,మంత్రి నారాయణ, తదితరులపై కేసులు పెట్టినా అడుగు ముందుకు పడుతుందా?లేదా? అన్న సంశయం కలిగించగలిగారు.న్యాయ వ్యవస్థకు చెందిన కొందరు ప్రముఖుల బంధువులు కూడా ఇన్వాల్వ్ అయిన మరో కేసును హైకోర్టు కొట్టివేసింది. చదవండి: చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే? అది కూడా పెద్ద చర్చే అయింది. ఇలా ఎన్నో ప్రతికూలతలను ఎదుర్కొన్నా, పట్టుదలతో ప్రభుత్వం ముందుకు సాగి ఈ కేసుల దర్యాప్తు సాగించడానికి ఇప్పటికి ఒక కొలిక్కి తీసుకు వచ్చినట్లు అనిపిస్తుంది. హైకోర్టులో టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లు వేసిన మెయిన్ పిటిషన్ లపై మూడు నెలల్లో విచారణ పూర్తి కావల్సి ఉంది. ఆ పిటిషన్ లు పెండింగులో ఉన్నా సిట్ దర్యాప్తుకు ఇబ్బంది లేదని చెబుతున్నారు. ఆ పిటిషన్ లను హైకోర్టు కొట్టివేస్తే ప్రభుత్వం మరింత చురుకుగా ముందుకు వెళ్లవచ్చు.భిన్నమైన తీర్పు వస్తే మాత్రం మళ్లీ అడ్డంకులు ఏర్పడతాయి. కాని సుప్రింకోర్టు ఇచ్చిన తీర్పులోని కొన్ని అంశాలు ,ప్రత్యేకించి అసలు దర్యాప్తు ప్రాధమిక దశలో ఉండగానే స్టే ఇవ్వడం ఏమిటని సుప్రింకోర్టు ప్రశ్నించిన తీరు ప్రభావం హైకోర్టు విచారణలో ఎంతో కొంత పడుతుంది. సిబిఐ విచారణకు సిద్దపడడం కూడా రాష్ట్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూరే అంశం అవుతుంది. అవినీతి ఆరోపణల కేసులలో న్యాయ వ్యవస్థ ఒక్కోసారి ఒక్కోరకంగా స్పందిస్తోందన్న భావన ఏర్పడడం మంచిది కాదు. చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడిందన్నది ఆరోపణ. దళితులకు సంబంధించిన వందల ఎకరాలను అక్రమంగా టీడీపీ నేతలు కాజేశారన్నది మరో అబియోగం. వీటిపై ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీలో చర్చించారు. పలు ఆధారాలు కూడా ప్రభుత్వం ప్రదర్శించింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో అయితే ముఖ్యమంత్రి జగన్ పూసగుచ్చినట్లు స్కామ్ జరిగిన తీరును వివరించారు. ఇంత చెప్పిన తర్వాత కూడా వాటిపై విచారణ జరిపి ఒక అర్ధవంతమైన ముగింపు తేలేకపోతే వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా పోతుంది. ప్రభుత్వం తాను అనుకున్నట్లు ఈ కేసులలో వేగం పెంచగలుగుతుందా?లేక చంద్రబాబు మేనేజ్ మెంట్ స్కిల్ మరోసారి బయటకు వస్తుందా అన్నది తేలడానికి మరికొంత సమయం పడుతుంది. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ చైర్మన్ -
చంద్రబాబు సర్కారు కుంభకోణాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు తప్పుగా అన్వయించింది. గత సర్కారు నిర్ణయాలను రద్దు చేసినట్లుగా హైకోర్టు పరిగణించిందన్న రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ న్యాయవాది వాదనలు సమర్థనీయంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను పరిశీలిస్తే.. గత సర్కారు తీసుకున్న నిర్ణయాలపై సమీక్షించటాన్ని రద్దు చేస్తున్నట్లుగా భావించలేం. – ‘సుప్రీం’ ధర్మాసనం సాక్షి, అమరావతి: ఇన్నాళ్లూ సాంకేతిక కారణాలతో తప్పించుకుని తిరుగుతున్న మాజీ సీఎం చంద్రబాబు బృందం అక్రమాలపై ‘స్టే’లను కొట్టివేస్తూ విచారణ కొనసాగించేందుకు వీలుగా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ సర్కారు హయాంలో చోటు చేసుకున్న అవినీతి బాగోతాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా విచారణకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం తదితరాల విషయంలో సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. గత సర్కారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, అవినీతి ఆరోపణలు, ఉల్లంఘనలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు మంత్రివర్గ ఉపసంఘం, సిట్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు 2020లో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను తాజాగా అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అసలు హైకోర్టు ఆ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చి ఉండాల్సింది కాదని వ్యాఖ్యానించింది. కేసు మొత్తం ఇంకా ప్రాథమిక దశలోనే ఉండగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం ఎంత మాత్రం సరికాదంది. ఈ జీవోలపై తదుపరి చర్యల నిలుపుదలకు హైకోర్టు చెప్పిన కారణాలు ఈ వ్యవహారానికి ఎంత మాత్రం సంబంధించినవి కావని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అంతేకాక గత ప్రభుత్వ నిర్ణయాలను ఆ తరువాత వచ్చే కొత్త ప్రభుత్వం సమీక్షించడానికి వీల్లేదన్న హైకోర్టు ఉత్తర్వులను సైతం సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఈ విషయం అసలు ప్రధాన కేసుకు ఎంత మాత్రం సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఈమేరకు సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్‌ల ధర్మాసనం బుధవారం 13 పేజీల తీర్పును వెలువరించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మనుసింఘ్వి, నిరంజన్‌రెడ్డి వాదించగా, ప్రతివాదులు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్దార్ధ దవే వాదనలు వినిపించారు. కేంద్రం, ఈడీని ప్రతివాదిగా చేర్చాలి.. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు, తిరగరాసేందుకే మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటైనట్లు హైకోర్టు తప్పుగా భావించిందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రెండు జీవోలను పరిగణలోకి తీసుకుంటే గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించేందుకు, తిరగరాసేందుకు అవి జారీ అయ్యాయని ఎంత మాత్రం చెప్పజాలమంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉల్లంఘనలు, అవినీతి ఆరోపణలపై విచారణ జరిపేందుకే మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటయ్యాయని సుప్రీంకోర్టు తెలిపింది. అలాగే జీవోలను సవాల్ చేస్తూ టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కేంద్ర ప్రభుత్వం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. హైకోర్టు ఆ పని చేసి ఉండకూడదని వ్యాఖ్యానించింది. ప్రధాన వ్యాజ్యాలను ఇంకా పరిష్కరించకుండా, సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్రం రాసిన లేఖపై కేంద్రం నిర్ణయం తీసుకోక ముందే హైకోర్టు ప్రభుత్వ అనుబంధ పిటిషన్‌ను కొట్టేయడం సరికాదంది. అసలు ప్రభుత్వ జీవోలను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు చేసిన టీడీపీ నేతలే కేంద్రం, ఈడీలను ప్రతివాదులుగా చేర్చి ఉండాల్సిందని స్పష్టం చేసింది. టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కేంద్ర ప్రభుత్వం, ఈడీలు తప్పనిసరిగా అవసరమైన పార్టీలని తేల్చి చెప్పింది. వారిని హైకోర్టు ముందున్న వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా చేర్చాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాక కేంద్రం, ఈడీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలంది. చట్ట ప్రకారం కేసు పూర్వాపరాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని టీడీపీ నేతలు దాఖలు చేసిన వ్యాజ్యాలను మూడు నెలల్లో పరిష్కరించాలని హైకోర్టుకు సూచించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లను అనుమతించింది. నిగ్గు తేల్చిన ఉపసంఘం, సిట్... టీడీపీ హయాంలో జరిగిన అమరావతి భూ కుంభకోణం, ఏపీ ఫైబర్ నెట్ స్కామ్‌లతో పాటు నాటి విధానపరమైన నిర్ణయాలు, చేపట్టిన ప్రాజెక్టులపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ఉల్లంఘనలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమిస్తూ 2019లో జీవో 1411 జారీ చేసింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలతో పాటు పలు అంశాలపై సమీక్ష జరిపిన మంత్రి వర్గ ఉప సంఘం పలు ప్రాథమిక ఆధారాలతో ప్రభుత్వానికి ఓ నివేదికను సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు, ఉల్లంఘనలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2020లో జీవో 344 జారీ చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సిట్ ఈ కుంభకోణాలు చాలా విస్తృతమైనవని, ఇందులో చాలా కీలక అంశాలు ముడిపడి ఉన్నందున దీనిని సీబీఐ దర్యాప్తునకు ఇవ్వడం సమంజసంగా ఉంటుందని ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ లేఖ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఓ లేఖ రాసి, ఈ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. పార్టీ ప్రయోజనం కోసమే వేశామన్నా పట్టించుకోని హైకోర్టు... రాష్ట్ర ప్రభుత్వ లేఖపై కేంద్రం నిర్ణయం తీసుకోక ముందే టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం, సిట్ ఏర్పాటు జీవోలను సవాలు చేశారు. ఈ వ్యాజ్యాల్లో వారు ఉద్దేశపూర్వకంగానే సీబీఐ, ఈడీలను ప్రతివాదులుగా చేర్చలేదు. తమ పార్టీ ప్రయోజనాల కోసమే పిటిషన్లు దాఖలు చేశామని వర్ల రామయ్య లిఖితపూర్వంగా కోర్టుకు చెప్పారు. టీడీపీ నేతలు వేసిన ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు విచారణ జరిపారు. అసలు మంత్రివర్గ ఉప సంఘం, సిట్ ఏర్పాటు వల్ల పిటిషనర్లు వ్యక్తిగతంగా ఏ విధంగానూ ప్రభావితం కావడం లేదని, వారు దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. అంతేకాకుండా సీబీఐ, ఈడీలను ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదులుగా చేర్చాలంటూ అనుబంధ వ్యాజ్యాలను దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయమూర్తి రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చారు. టీడీపీ నేతలు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. జీవోల్లో తదుపరి చర్యలన్నీ నిలిపేశారు. గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం కొత్త ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పేశారు. హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఉండాల్సింది.. 2020లో హైకోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ పిటిషన్‌పై విచారణ చేపట్టి తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ షా ధర్మాసనం బుధవారం తమ ఉత్తర్వులను వెలువరించింది. మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసిన ప్రధాన ఉద్దేశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకుని ఉండాల్సిందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించిన పలు న్యాయపరమైన అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని ధర్మాసనం ఆక్షేపించింది. సీబీఐ దర్యాప్తు కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాసిన లేఖను హైకోర్టు ఏ మాత్రం పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. కేసు విచారణ సందర్భంగా ‘సుప్రీం’ వ్యాఖ్యలివీ – పారదర్శకంగా ఉన్నప్పుడు సిట్ దర్యాప్తునకు ఎందుకు భయపడుతున్నారు? – గత ప్రభుత్వ అవినీతిని సమీక్షించకూడదంటే వందశాతం ఇమ్యునిటీ ఇచ్చినట్లే కదా? – పాలనలో దురుద్దేశం ఉన్నప్పుడు విచారణ జరగాలి కదా? – సీబీఐ విచారణకు స్వీకరించలేదంటే తప్పు జరగలేదని ముందే ఎలా ఊహించుకుంటారు? – ప్రతి ఒక్కరూ చీకట్లోనే వెతుకుతారు? విచారణ జరిగితే అన్నీ వెలుగులోకి వస్తాయి -
చంద్రబాబుకు బిగ్ షాక్.. ఈ కేసులో మొదటి నుంచీ ఏం జరిగిందంటే?
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై సిట్ దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. అసలు ఈ కేసులో మొదట నుంచీ ఏం జరిగిందో ఒకసారి పరిశీలిస్తే.. ►చంద్రబాబు ప్రభుత్వంలో అక్రమాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ప్రభుత్వం ►2019 జూన్ 26న కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ►చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలు, ప్రాజెక్టులు, కార్యక్రమాలు, కార్పొరేషన్లు, సొసైటీలు, కంపెనీలపై తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు ►విధానపరమైన లోపాలు, న్యాయపరమైన తప్పిదాలు, ఆర్థిక అక్రమాలు, మోసపూరిత లావాదేవీలను గుర్తించిన కేబినెట్ సబ్ కమిటీ ►సీఆర్డీయే సహా పలు ప్రాజెక్టుల్లో అక్రమాలు జరిగాయని గుర్తించిన కేబినెట్ సబ్ కమిటీ ►డిసెంబర్ 27, 2019న తొలినివేదిక ఇచ్చిన కేబినెట్ సబ్ కమిటీ చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక ►కేబినెట్ సబ్ కమిటీ నివేదికపై తదుపరి రాష్ట్ర అసెంబ్లీలో చర్చ. కేబినెట్ సబ్ కమిటీ గుర్తించిన అంశాలపై చర్చ ►దీనిపై దర్యాప్తు జరిపించాలని ఆదేశించిన స్పీకర్. సిట్‌తో విచారణ జరిపించాలని ప్రభుత్వం నిర్ణయం ►ప్రభుత్వ నిర్ణయం మేరకు ఫిబ్రవరి 21, 2020లో సిట్ ఏర్పాటు ►10 మంది సభ్యులతో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ►సిట్ గుర్తించిన అంశాలపై దర్యాప్తు చేసి కేసులు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేసే అధికారాన్ని సిట్‌కు అప్పగించిన ప్రభుత్వం ►అవసరమైన పక్షంలో కేంద్ర దర్యాప్తు సంస్థలతో సమాచారాన్ని పంచుకోవడం, దర్యాప్తులో వారితో సమన్వయం చేసుకోవాలని సిట్‌కు నిర్దేశించిన ప్రభుత్వం ►ఎరినైనా విచారణ చేయడానికి, సీఆర్పీసీ ప్రకారం వారి స్టేట్మెంట్లను నమోదు చేయడానికి సిట్‌కు అధికారం ►దర్యాప్తునలో ఏ అంశానికైనా సంబంధించి ఏ రికాక్డునైనా పరిశీలించే అధికారం సిట్‌కు ఉంది కోర్టుకెక్కిన టీడీపీ: ►సిట్ ఏర్పాటును, దర్యాప్తును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన తెలుగు దేశం పార్టీ. టీడీపీ నాయకులు వర్లరామయ్య, ఆలపాంటి రాజేంద్ర ప్రసాద్ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు ►తమ పార్టీ ప్రయోజనాలకోసమే పిటిషన్లు దాఖలు చేశామని వెల్లడించిన వర్ల రామయ్య ►మార్చి 4, 2020న హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ జనరల్ సెక్రటరీ వర్ల రామయ్య ►మార్చి 10న మరో రిట్ పిటిషన్ దాఖలు చేసిన వర్ల రామయ్య జీవోలను పక్కనపెట్టాలని పిటిషన్దాఖలు ►మార్చి 23, 2020న కేంద్ర ప్రభుత్వానికి లేఖ. అమరావతి వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి లేఖ అప్పుడు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇలా: ►సెప్టెంబరు 16, 2020న ఈకేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అంతకుముందు మీడియాలో వార్తలు కూడా ప్రసారం చేయవద్దంటూ ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు. ►అమరావతి ప్రాంతంలో ఎవరెవరు ఎంతెంత భూములు కొన్నారో… వివరాలను కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం ►సీబీఐ దర్యాప్తునకు రాసిన లేఖనూ కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం ►ఈడీ ఈసీఐఆర్ నమోదుచేసిన విషయాన్నీ కోర్టు ముందు ఉంచిన ప్రభుత్వం ►ఈ కారణంగా - కేంద్ర ప్రభుత్వం, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను ప్రతివాదులుగా చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థననూ తోసిపుచ్చిన కోర్టు ►ప్రత్యేక కోర్టు ఏర్పాటు లాంటి రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనలను కొట్టిపారేసిన జస్టిస్ డీవీ సోమయాజులు ►గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్న హైకోర్టు ►రాష్ట్ర ప్రభుత్వం అధికారాల ప్రయోగానికి పరిమితులు ఉన్నాయన్న హైకోర్టు ►గత ప్రభుత్వ విధానాలను తప్పనిసరిగా అనుసరించాలని, నిర్దిష్టమైన, బలమైన కారణాలు ఉన్నప్పుడు మాత్రమే పక్కకు తప్పుకోవాలన్న కోర్టు ►గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించాలంటే శాసనపరమైన అధికారం ఉండాలే తప్ప, స్వతఃసిద్ధ అధికారాలు లేవన్న హైకోర్టు ►ప్రభుత్వానికి ఇలాంటి అధికారులు కట్టబెడుతూ ఎలాంటి చట్టం లేదన్న కోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే..? ►హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ►ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చిన ప్రభుత్వం ►దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదన ►ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి అని విచారణ సందర్భంగా ప్రశ్నించిన సుప్రీంకోర్టు ►గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని విచారణ సమయంలో వ్యాఖ్యానించిన సుప్రీం ►సిట్ నియామకంపై హై కోర్ట్ ఇచ్చిన స్టే ను కొట్టి వేసిన సుప్రీం కోర్టు ►ఆదేశాలు ఇచ్చిన జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ ఎం.ఎం.సుందరేష్ ధర్మాసనం ►చంద్రబాబు ప్రభుత్వం లోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ►దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు ►సిబిఐ , ఈడీ దర్యాప్తుకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదు ►సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదు ►జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదన్న సుప్రీం ►పిటిషన్ ను తాజాగా విచారించే సమయంలో , ఈ కేసును సిబిఐ, ఈడీకి పంపుతామన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను హై కోర్ట్ పరిగణలోకి తీసుకోవాలన్న సుప్రీంకోర్టు. చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట -
అవినీతి మొత్తం బయటకు తీస్తాం.. అరెస్టులు కూడా జరుగుతాయి: సజ్జల
సాక్షి, తాడేపల్లి: అమరావతి పేరుతో భారీ అవినీతి జరిగిందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. జరిగిన అవినీతి మొత్తం బయటకు తీస్తామని తెలిపారు. సిట్ దర్యాప్తుతో మరిన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పారు. కచ్చితంగా అరెస్టులు కూడా జరుగుతాయని అన్నారు. సుప్రీంకోర్టులోఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ విజయం దక్కిందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. విధానపరమైన నిర్ణయాలతో రాష్ట్రానికి నష్టం కలిగిస్తే తప్పేనని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులను తప్పకుండా సమీక్ష చేయాల్సిందేనని తెలిపారు. రాష్ట్ర సంపదకు నష్టం కలిగించే కుట్రలను బయటకు తీస్తామన్నారు. టీడీపీ హయాంలో తప్పు చేయకపోతే వారికి భయమెందుకని ప్రశ్నించారు. చదవండి: సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట స్కిల్ డెవలప్మెంట్ స్కాంలోనూ చంద్రబాబు హస్తం ఉందని సజ్జల పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ స్కాంకు రాజధాని పేరు పెట్టారని.. అమరావతి పేరు చెప్పి దోచుకోవాలనుకున్నారని మండిపడ్డారు. అరచేతిలో స్వర్గం చూపించి రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత్కాలిక నిర్మాణాల్లోనూ అవినీతికి పాల్పడ్డరన్నారు. టీడీపీ హయాంలో దేశంలోనే అతిపెద్ద భూ కంభకోణం జరిగిందన్నారు. నిజనిజాలను బయటకు తీసేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రాజధాని పేరుతో చంద్రాబాబు ముఠా దోచుకున్నారని సజ్జల దుయ్యబట్టారు. తప్పు చేయకపోతే స్టే కోసం కోర్టులకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. టీడీపీ సహా చంద్రబాబు ముఠాకు ఎందుకంత భయమని అన్నారు. టీడీపీ హయాంలో అక్రమాలపై సిట్ ఏర్పాటు జరిగిందని, సిట్ దర్యాప్తుపై స్టే తెచ్చుకుంటే అందులో ఏదో మతలబు ఉన్నట్లేనని అన్నారు. టీడీపీ నేతల్లో ఒకవైపు భయం, మరోవైపు అహంకారం కనిపిస్తోందన్నారు. సిట్ ఏర్పాటు కక్ష సాధింపు కానే కాదని స్పష్టం చేశారు. చదవండి: ‘రాజధాని దొంగల’పై సంచలన నివేదిక -
సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వానికి భారీ ఊరట
ఢిల్లీ: సుప్రీం కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వ ఏర్పాటు చేసిన సిట్‌కు లైన్ క్లియర్ అయ్యింది. ఈ క్రమంలో హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం కొట్టేస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో కీలక విధాన నిర్ణయాలు, అమరావతి భూ కుంభకోణం సహా భారీ ప్రాజెక్టులలో అవకతవకలు జరిగినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది. అయితే.. ఆ సిట్ నియామకంపై టీడీపీ నేతలు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో హైకోర్టు స్టే విధించింది. ఈ స్టేను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. దర్యాప్తు ప్రాథమిక దశలోనే స్టే ఇవ్వడం సరైంది కాదన్న సుప్రీం కోర్టు.. సీబీఐ , ఈడీ దర్యాప్తునకు సైతం ఏపీ ప్రభుత్వం పంపేందుకు సిద్ధమైన ఈ కేసులో స్టే అవసరం లేదని పేర్కొంది. సిట్ ఏర్పాటు కోసం ఇచ్చిన జీవోలు గత ప్రభుత్వ విధానాలను మార్చడానికి ఇవ్వలేదని, జీవోలో ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ హైకోర్టు పరిశీలించలేదని సుప్రీం బెంచ్ ప్రస్తావించింది. ఈ తరుణంలో.. హైకోర్టును తీర్పును పక్కనపెడుతున్నట్లు జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం లోని అక్రమాలపై దర్యాప్తుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయ్యింది. మరోవైపు అమరావతి భూ కుంభకోణం సహా కీలక ప్రాజెక్టులు విధానాల లో జరిగిన అవినీతిపై దర్యాప్తునకు ఆటంకాలు తొలిగాయి. ఇక కేసు విచారణ సమయంలో.. సుప్రీం కోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ప్రభుత్వ విధాన నిర్ణయాలలో ప్రజాధనం దుర్వినియోగం, వృధా , దురుద్దేశం.. తదితర అంశాలపై దర్యాప్తు చేస్తే తప్పేంటి?. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అంటే వంద శాతం ఇమ్యూనిటీ ఇచ్చినట్టు కాదా? అని వ్యాఖ్యానించింది బెంచ్. బలంగా ఏపీ ప్రభుత్వ వాదనలు.. ఇక ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని, ఈ కేసును సీబీఐ అప్పగించాలని కోరామన్న విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఏపీ ప్రభుత్వం. అలాగే.. దర్యాప్తు చేయొద్దని హైకోర్టు బ్లాంకెట్ ఆర్డర్ ఎలా ఇస్తుందని వాదనలు వినిపించింది. దీంతో ఏపీ ప్రభుత్వ వాదనలతో జస్టిస్ ఎం. ఆర్. షా నేతృత్వంలోని ధర్మాసనం ఏకీభవిస్తూ.. ఏపీ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇదీ చదవండి: ఎన్టీఆర్‌ను నిజంగా అంత అభిమానిస్తే అలా ఎలా చేశావ్? -
TSPSC పేపర్ లీక్ కేసు విచారణ జూన్‌కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. సిట్ దర్యాప్తు నిదానంగా సాగుతున్నట్లు అనిపిస్తుందని వ్యాఖ్యానించిన ఉన్నత న్యాయస్థానం.. జూన్ 5వ తేదీ వరకు ఈ కేసు విచారణ వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం వెల్లడించింది. పేపర్ లీక్ కేసులో ఇవాళ్టి విచారణ సందర్భంగా.. సిట్ ఏసీపీ నర్సింగ్ రావ్ హైకోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో.. ఎప్పటిలోపు దర్యాప్తు పూర్తి చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీలో ఉన్న అవుట్సోర్సింగ్ సిబ్బంది అందరినీ విచారించారా?.. ఏ -16 ప్రశాంత్ రోల్ ఏంటి?. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న రేణుక భర్త డాక్యా నాయక్ నుండి డబ్బులు పెట్టీ పేపర్ కొన్న వాళ్ళు.. మళ్ళీ ఎవరికైనా అమ్మారా?.. అంటూ వరుసగా ప్రశ్నలు గుప్పించింది. ఈ క్రమంలో.. సిట్ దర్యాప్తు నిదానంగా సాగుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించింది బెంచ్. అయితే.. సిట్ ఏసీపీ నర్సింగ్ రావ్, అడ్వొకేట్ జనరల్‌లు ఆ ప్రశ్నలపై కోర్టుకు వివరణ ఇచ్చారు. వివరణపై సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు.. ఎప్పటి లోపు దర్యాప్తు పూర్తి చేస్తారని మరోసారి ప్రశ్నించింది. అయితే.. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుండి రిపోర్ట్ రావాల్సి ఉందని అడ్వొకేట్ జనరల్ వివరణ ఇచ్చారు. ఇక కేసును సీబీఐకి అప్పగించాలని కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ సంతృప్తికరంగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసిన తెలంగాణ హైకోర్టు.. కేసును సీబీఐకి అప్పగించడంపై కేసు దర్యాప్తు దశలో ఉన్నందున ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని తెలిపింది. తదుపరి విచారణ జూన్ 5వ తేదీకి వాయిదా వేస్తూ.. ఆ తేదీన పేపర్ లీక్ కేసు దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్‌ను సమర్పించాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇదీ చదవండి: తెలంగాణలో ఊహకందని స్థాయిలో పంట నష్టం! -
కవిత స్పందన బ్లేమ్గేమ్లా ఉంది
సాక్షి, న్యూఢిల్లీ: తన క్లయింట్ సుకేశ్ చంద్రశేఖర్ లేవనెత్తిన ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత స్పందించిన తీరు మీడియా, రాజకీయ పార్టీలపై బ్లేమ్ గేమ్ (పరిష్కారం కోసం చూడకుండా నిందలు వేయడం)లా ఉందని న్యాయవాది అనంత్ మాలిక్ విమర్శించారు. సుకేశ్ ఎవరో తనకు తెలియదంటూ కవిత విడుదల చేసిన ప్రకటనపై స్పందించారు. ఈ మేర కు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ‘సుకేశ్ చంద్రశేఖర్ లేవనెత్తిన అంశాలపై కవిత జారీ చేసిన ప్రకటన చిన్నపిల్లల వ్యవహారంలా ఉంది. సుకేశ్ తన ఆరోపణలను అఫిడవిట్ రూపంలో ఇచ్చారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 65బీ కింద ధ్రువపత్రం కూడా ఇచ్చారు. ఈ విషయంలో న్యాయమైన విచారణను స్వాగతించకుండా అస్పష్టమైన ఆరోపణలతో దర్యాప్తు నుంచి తప్పించుకోవాలని యత్నించడం నీటిని ఒడిసి పట్టుకొని ఉంచాలనుకోవడమే. అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడెవరైనా విచారణ స్వాగతించేవారు. కవిత స్పందన చూస్తుంటే దాగుడుమూతలు ఆడడంలో ఉన్న నైపుణ్యం కనిపిస్తోంది. ఈ అంశం ప్రత్యేక దర్యాప్తు సంస్థల ప్రత్యేక పరిశోధనకు సంబంధించినదే కానీ, ప్రజల్లో ప్రజాదరణ కోసం పోటీ కాదు. అయితే నా క్లయింట్ కూడా ఈ వారంలోనే పూర్తిస్థాయిలో స్పందిస్తారు’ అని అనంత్ తెలిపారు. -
నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఈడీ
-
సీబీఐ అక్కర్లేదు.. తెలంగాణ హైకోర్టులో సిట్
సాక్షి, హైదరాబాద్: సంచలనం సృష్టించిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజ్ కేసులో తమ దర్యాప్తు సజావుగానే సాగుతోందని, సీబీఐ అవసరం లేదని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(SIT) తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. పేపర్ లీకేజ్ కేసులో దర్యాప్తు రిపోర్ట్‌ను మంగళవారం హైకోర్టుకు సమర్పించింది సిట్. ఆ స్టేటస్ రిపోర్ట్‌లో కీలకాంశాలను ప్రస్తావించింది. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తు ఆధారంగా.. మొత్తం 250 పేజీల రిపోర్ట్‌తో పాటు ఎంక్లోజర్స్ను సైతం తెలంగాణ హైకోర్టుకు సమర్పించింది సిట్. ‘‘పేపర్ లీక్ కేసులో.. రూ.40 లక్షల నగదు బదిలీ జరిగినట్లు దర్యాప్తులో గుర్తించాం. పేపర్ కొనుగోలు చేసిన 15 మందిని అరెస్ట్ చేశాం. శంకర్ లక్ష్మిని సాక్షిగా పరిగణించాం. సాక్షులు, నిందితులు, టీఎస్పీఎస్సీ చైర్మన్, కమిషన్ మెంబర్‌ను సైతం ప్రశ్నించాం. వాళ్ల నుంచి సేకరించిన స్టేట్మెంట్స్ ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించాం. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చాం. కానీ, పొలిటికల్ లీడర్స్ నుంచి ఎలాంటి కీలక సమాచారం అందలేదు. గతంలో ఎన్నో సెన్సేషన్ కేసుల్ని డీల్ చేశాం. ఈ పేపర్ లీక్ కేసును సైతం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నాం. కాబట్టి.. ఈ కేసు విచారణలో సీబీఐ అవసరం లేదు. కేసులో కీలకమైన ఎఫ్ఎస్ఎల్(FSL) రిపోర్ట్ రావాల్సి ఉంది. అది వస్తే.. కేసులో మరింత పురోగతి సాధించొచ్చు అని హైకోర్టుకు సమర్పించిన కేసు స్టేటస్ రిపోర్ట్‌లో సీబీఐ పేర్కొంది. ఇదీ చదవండి: బండి సంజయ్ మూడు సింహాల ప్రమాణంపై రియాక్షన్ -
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసు.. కీలక ఘట్టానికి సిట్ విచారణ..
సాక్షి, హైదరాబాద్: టీఎస్సీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజ్ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ ఇందులో కీలక ఘట్టమైన క్రాస్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించింది. ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలను సరిపోల్చి చూడటం ద్వారా అడ్డదారిలో లబి్ధపొందిన అభ్యర్థులు ఇంకా ఎవరైనా ఉన్నారా? అనేది తేల్చనుంది. మరోపక్క మంగళవారం హైకోర్టుకు సమర్పించేందుకు సమగ్ర స్టేటస్ రిపోర్టు సిద్ధం చేస్తోంది. ఇందులో ఇప్పటివరకు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు, తీసుకున్న చర్యలను వివరించనుంది. కమిషన్ నిర్వహించే ఆరు రకాలైన పరీక్షలకు సంబంధించిన 15 క్వశ్చన్ పేపర్లు లీకైనట్లు ఇప్పటికే సిట్ నిర్ధారించింది. వీటిలో గ్రూప్–1 ప్రిలిమ్స్ సహా నాలుగు పరీక్షలను కమిషన్ రద్దు చేయగా మూడింటిని వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న కమిషన్ కార్యదర్శి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పి.ప్రవీణ్‌కుమార్, టీఎస్పీఎస్సీ మాజీ నెట్వర్క్ అడ్మిన్ ఎ.రాజశేఖర్‌రెడ్డి సహా మొత్తం 17 మంది నిందితులను సిట్ అరెస్టు చేసింది. వీరిలో డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్ ఖరీదు చేసిన ఖమ్మం జంట మినహా మిగిలిన 15 మందినీ సిట్ అధికారులు న్యాయస్థానం అనుమతితో తమ కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రవీణ్, రాజశేఖర్ సహా నలుగురి విషయంలో అదనపు కస్టడీ ప్రక్రియా జరిగింది. కాగా ఈ కేసు దర్యాప్తులో వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు బృందాలుగా మారి నిందితులను విచారించారు. దాదాపు 37 ప్రశ్నలతో కూడిన క్వశ్చనీర్ ఆధారంగా ముందుకు వెళ్లారు. తొలుత నిందితులను విడివిడిగా, ఆపై ఒకరిద్దరిని కలిపి ఇలా వేర్వేరు పంథాల్లో విచారించిన అధికారులు ప్రతి ఒక్కరి నుంచి ప్రతి సందర్భంలోనూ వాంగ్మూలాలు నమోదు చేశారు. వీటన్నింటినీ సమగ్రంగా అధ్యయనం చేయడం కోసం ఓ ప్రత్యేక క్రాస్ వెరిఫికేషన్ బృందం సిట్‌లో ఏర్పాటైంది. వాంగ్మూలాల్లో తేడాలు తేల్చేందుకే.. వాంగ్మూలాల మధ్య ఎక్కడైనా తేడాలు ఉన్నాయా? ఒకే వ్యక్తి చెప్పిన, వేర్వేరు నిందితులు ఒకే అంశంపై ఇచి్చన సమాచారంలో అనుమానాస్పద అంశాలు ఉన్నాయా? అనేది ఈ ప్రక్రియ ద్వారా గుర్తించనున్నారు. అలాగే నిందితుల కాల్ డిటెయిల్స్, వాట్సాప్ చాటింగ్స్లతో పాటు బ్యాంకు లావాదేవీలు, యూపీఐ విధానంలో జరిగిన నగదు బదిలీలు, ఆయా సమయాల్లో వీరి లొకేషన్స్ ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ క్రాస్ వెరిఫికేషన్ నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా దర్యాప్తులో మిస్సైన లింకులతో పాటు అడ్డదారిలో లబి్ధపొందిన అభ్యర్థులను గుర్తించాలని సిట్ నిర్ణయించింది. ఖమ్మం జంటను కస్టడీలోకి తీసుకుని విచారించడం మినహా మిగతా దర్యాప్తు దాదాపు పూర్తయింది. తదుపరి న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలను బట్టి సిట్ అధికారులు ముందుకు వెళ్లనున్నారు. చదవండి: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ -
డేటా లీకుపై పోలీసుల దూకుడు
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన డేటా చౌర్యం కేసులో సైబరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. గత నెల రోజుల వ్యవధిలో సైబరాబాద్ పోలీసులు నాలుగు డేటా చౌర్యం, విక్రయం, నకిలీ కాల్ సెంటర్ నిర్వహణ కేసులను ఛేదించారు. వీటిల్లో 30 మంది నిందితులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కేసులలో నిందితులు విక్రయానికి పెట్టిన వ్యక్తిగత సమాచారం థర్డ్ పార్టీ ఏజెన్సీలు, ఈ–కామర్స్ సంస్థల నుంచి లీకైనట్లు గుర్తించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయా కంపెనీలను విచారించాలని నిర్ణయించింది. ఇప్పటికే బిగ్ బాస్కెట్, ఫోన్‌పే, ఫేస్బుక్, క్లబ్ మహీంద్రా, పాలసీ బజార్, యాక్సిస్ బ్యాంక్, అస్ట్యూట్ గ్రూప్, మ్యాట్రిక్స్, టెక్ మహీంద్రా, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. తాజాగా మరో పది కంపెనీలకూ తాఖీదులు జారీ చేసింది. ఇప్పటికే సిట్ ముందు హాజరైన కంపెనీలు.. కస్టమర్ల డేటా, సమీకరణ, భద్రతా విధానాలు, థర్డ్ పార్టీ ఏజెన్సీలు తదితరాలపై సమగ్ర సమాచారాన్ని సమర్పించాయి. ఆయా సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు మరికొంత అదనపు సమాచారం కోసం మరోసారి నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. నాలుగు రాష్ట్రాల్లో గాలింపు.. ప్రధానంగా హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన వినయ్ భరద్వాజ్ దేశంలోని 70 కోట్ల మంది వ్యక్తులు, సంస్థలకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, విక్రయానికి పెట్టడం సంచలనం సృష్టించింది. ఇందులో 2.60 లక్షల మంది రక్షణ శాఖ ఉద్యోగుల సమాచారంతో పాటు విద్యుత్, ఇంధనం వంటి ప్రభుత్వ శాఖలు, విద్యార్థులు, ప్రవాసులు, గృహిణులు, బ్యాంకు ఖాతాదారుల సమాచారం ఉండటం గమనార్హం. ఈ కేసులో నిందితుడు వినయ్ భరద్వాజ్ ఈ డేటాను గుజరాత్‌కు చెందిన అమీర్ సోహైల్, మదన్ గోపాల్ అనే వ్యక్తుల నుంచి కొనుగోలు చేసినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. దీంతో వారి కోసం సిట్ బృందాలు గాలిస్తున్నాయి. ఢిల్లీ, రాజస్తాన్, హరియాణా, పశ్చిమ బెంగాల్లో నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నట్లు తెలిసింది. -
TSPSC Case: ప్రియురాలి కోసం పేపర్ కొనుగోలు.. ఇద్దరు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సాయి లౌకిక్, సుష్మితలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలు సుష్మిత కోసం లౌకిక్ డీఏఓ(డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ నుంచి రూ. 6 లక్షలకు లౌకిక్ ఈ పేపర్ కొన్నట్లు నిర్ధారించారు. ఫిబ్రవరి 26న డీఏఓ పరీక్ష జరగ్గా.. పేపర్ లీక్ అంశం తెరపైకి వచ్చిన తరువాత టీఎస్పీఎస్సీ ఈ పరీక్షను కూడా రద్దు చేసింది. తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో చైర్మన్‌కు నోటీసులు పంపకుండా స్వయంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. సిట్ చీఫ్‌గా ఉన్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సీసీఎస్ ఏసీపీ కె.నర్సింగ్‌రావుతో కూడిన బృందం టీఎస్పీఎస్సీకి వెళ్లి మూడు గంటలకుపైగా చైర్మన్‌ను ప్రశ్నించింది. ఈ మేరకు సిట్‌కు జనార్దన్‌రెడ్డి వివరణ ఇచ్చారు. -
సిబ్బందే లీక్ చేస్తారని ఊహించలేదు
సాక్షి, హైదరాబాద్: కమిషన్‌లో పనిచేస్తున్న వ్యక్తులే పేపర్ల లీకేజీకి పాల్పడతారని ఊహించలేకపోయినట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి సిట్ అధికారుల విచారణలో పేర్కొన్నారు. ఇప్పటివరకు తమ దృష్టికి వచ్చిన దాని ప్రకారం ప్రవీణ్, రాజశేఖర్, రమేష్, షమీమ్‌లపై గతంలో ఎలాంటి ఆరోపణలు లేవని... ఈ నేపథ్యంలో ఇలాంటి లీకేజీ జరుగుతుందని ఊహించలేదని వివరణ ఇచ్చారు. టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ స్కాంను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో చైర్మన్‌కు నోటీసులు పంపకుండా స్వయంగా టీఎస్పీఎస్సీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. సిట్ చీఫ్‌గా ఉన్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సీసీఎస్ ఏసీపీ కె.నర్సింగ్‌రావుతో కూడిన బృందం టీఎస్పీఎస్సీకి వెళ్లి మూడు గంటలకుపైగా చైర్మన్‌ను ప్రశ్నించింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్, రాజశేఖర్‌రెడ్డి నుంచి స్వా«ధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లను అధికారులు తమ వెంట తీసుకువెళ్లారు. ప్రధానంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల తయారీ, వాటి భద్రత తదితర అంశాలపైనే జనార్దన్‌రెడ్డిని విచారించారు. పర్యవేక్షణ బాధ్యత నాదే: చైర్మన్ ప్రశ్నపత్రాల తయారీ, భద్రత పర్యవేక్షణ తనదేనని విచారణ సందర్భంగా చైర్మన్ పోలీసులకు తెలిపారు. ప్రతి పరీక్షకు సంబంధించి ప్రశ్నపత్రాల తయారీకి సెట్టర్స్‌గా పిలిచే నిపుణుల సహాయం తీసుకుంటామని, వారినే వ్యక్తిగతంగా కాన్ఫిడెన్షియల్ విభాగానికి ఆహ్వానిస్తామని వివరించారు. అక్కడకు వచ్చే వరకు ఒక సెట్టర్ విషయం మరొకరికి తెలియకుండా జాగ్రత్తలు ఉంటాయన్నారు. వారు రూపొందించిన ప్రశ్నపత్రం కాపీలను కస్టోడియన్ శంకరలక్ష్మి కంప్యూటర్లో భద్రపరుస్తారని, ఓ డిజిటల్ కాపీని సెక్షన్‌లోని లాకర్లో ఉంచడం ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ అని జనార్దన్‌రెడ్డి సిట్ అధికారులకు తెలియజేశారు. తనతోపాటు కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారులే ప్రశ్నపత్రం తయారీలో ప్రత్యక్షంగా పాల్గొంటారని ఆయన వివరించారు. లీకేజీ వ్యవహారంలో కస్టోడియన్ నిర్లక్ష్యం సహా వివిధ అంశాలపై అంతర్గత విచారణ కూడా జరుగుతోందని, అది పూర్తయ్యాక వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చైర్మన్ పేర్కొన్నారని తెలిసింది. వాంగ్మూల పత్రాలపై ఆయన సంతకాలు తీసుకున్న దర్యాప్తు అధికారులు వాటిని కోర్టులో దాఖలు చేయనున్నారు. పరీక్షలు రాసిన ఉద్యోగులపైనా ఆరా పరీక్షలకు హాజరైన టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో ఎందరు అనుమతి పొందారనే అంశాన్నీ సిట్ సేకరిస్తోంది. కమిషన్ ఉద్యోగులు, సభ్యులకు బంధువులు, స్నేహితులు, కుటుంబీకుల్లో ఎవరైనా టీఎస్పీఎస్సీ పరీక్షలు రాశారా? వారి పరిస్థితి ఏంటి? తదితర వివరాల పైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తోంది. కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సిట్ అధికారులు కాన్ఫిడెన్షియల్ సెక్షన్, కస్టోడియన్ ఛాంబర్‌తో పాటు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రమేష్, షమీమ్‌లు కూర్చునే సీట్ల వద్దా తనిఖీలు చేశారు. అక్కడ నుంచి కొన్ని రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. భద్రత పెంచాలని సూచించాం.. మా దర్యాప్తులో టీఎస్పీఎస్సీలో ఉన్న అనేక లోపాలను గుర్తించాం. ల్యాన్లో మార్పుచేర్పులు, యాక్సస్ కంట్రోల్, త్రీ స్టెప్ వెరిఫికేషన్ ఇలా అనేక ఆవశ్యకతలను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లాం. సైబర్ ఆడిట్ సిఫార్సుల ప్రకారం భద్రత పెంచాలని సూచించాం. – ఓ ఉన్నతాధికారి -
TSPSC: 40 లక్షలకు మూడు ఏఈ పేపర్లు లీక్.. సినిమా రేంజ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో సిట్ ఇప్పటికే స్పీడ్ పెంచింది. కాగా, తాజాగా టీఎస్పీఎస్సీ నిందితుల విచారణలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈ పేపర్ లీక్‌లో కేతావత్ రాజేశ్వర్ కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు గుర్తించారు. అయితే, మూడు ఏఈ పేపర్లను రాజేశ్వర్ రూ.40 లక్షలకు అమ్మినట్టు విచారణలో తేలింది. ఇందుకు రూ. 25 లక్షలను రాజేశ్ అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. మిగిలిన డబ్బును పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత వచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో నిందితుల నుంచి పోలీసులు.. రూ. 8.5 లక్షలను రికవరీ చేశారు. ఈ క్రమంలో ప్రవీణ్ కుమార్.. రేణుకకు పేపర్ లీక్ చేశాడు. నమ్మకమైన వారికి పేపర్ అమ్మాలని రేణుకకు సూచించాడు. ఈ సందర్బంగా రూ. 10లక్షలకు రేణుకతో బేరం కుదుర్చుకున్నాడు. దీంతో, రేణుక వద్ద నుంచి ప్రవీణ్ అడ్వాన్స్‌గా రూ. 5లక్షలు తీసుకున్నాడు. ఇక, ఈ పేపర్లను రేణుక తన భర్త డాక్యానాయక్ ద్వారా అమ్మకానికి పెట్టింది. వారి సమీప బంధువైన రాజేశ్వర్‌కు పేపర్ విషయం చెప్పి అమ్మాలని సూచించారు. రంగంలోకి దిగిన రాజేశ్వర్.. మధ్యవర్తులు గోపాల్, నీలేష్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు రూ. 40 లక్షలకు పేపర్లను విక్రయించాడు. వారి వద్ద నుంచి అడ్వాన్స్‌గా రూ. 23 లక్షలు తీసుకున్నాడు. అనంతరం, రూ.10లక్షలు డాక్యానాయక్‌కు ఇచ్చిన రాజేశ్వర్. ఇక, ఇందులో నుంచి మరో రూ.5లక్షలను ప్రవీణ్‌కు డాక్యా నాయక్ ఇచ్చాడు. అయితే, రాజేశ్వర్ తల్లి గండీడ్(మండలం) మన్సూర్‌పల్లి తండా సర్పంచ్. పేపర్లు అమ్మగా వచ్చిన డబ్బుతో రూ. 8లక్షలు వెచ్చించి ఊరిలో రాజేశ్వర్ అభివృద్ధి పనులు చేశారు. ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరయ్యాక రూ.8లక్షలు తీసుకుందామని రాజేశ్వర్ ప్లాన్ చేసుకున్నాడు. -
అమ్ముడైంది 40లక్షలకు.. అందింది 23లక్షలు!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో ‘ఆర్థికాంశాలు’ కొలిక్కివచ్చాయి. ఈ పత్రాల విక్రయంలో కేతావత్ రాజేశ్వర్ కీలకపాత్ర పోషించినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అసిస్టెంట్ ఇంజనీర్ (ఏఈ) నియామక పరీక్షకు సంబంధించిన మూడు ప్రశ్నపత్రాలను రూ.40 లక్షలకు విక్రయించారని, ఇప్పటికే నిందితులకు రూ.23 లక్షలు ముట్టగా మిగతా సొమ్ము పరీక్ష ఫలితాలు వచ్చాక ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. ఇందులో ఇప్పటికే రూ.8.5 లక్షలు రికవరీ చేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్లను పంచుకున్నారే తప్ప అమ్ముకోలేదని అధికారులు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన పులిదిండి ప్రవీణ్ కుమార్, మాజీ నెట్వర్క్ అడ్మిన్ అట్ల రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ పేపర్లు తస్కరించినట్లు ఇప్పటికే సిట్ స్పష్టం చేసింది. ఏఈ పరీక్ష పేపర్లను ప్రవీణ్ తన స్నేహితురాలైన రేణుక రాథోడ్, ఆమె భర్త లవడ్యావత్ డాక్యాలకు ఇచ్చాడు. నమ్మకమైన వారికే వీటిని విక్రయించాలని చెప్పాడు. తనకు రూ.10 లక్షలు ఇవ్వాలని చెప్పి రూ.5 లక్షలు అడ్వాన్సుగా తీసుకున్నాడు. డాక్యా ఈ పేపర్ల గురించి సమీప బంధువైన కేతావత్ రాజేశ్వర్‌కు చెప్పాడు. ఇతడు ఏర్పాటు చేసుకున్న మధ్యవర్తుల ద్వారానే గోపాల్, నీలేశ్, ప్రశాంత్, రాజేంద్రకుమార్‌లకు రూ.40 లక్షలకు విక్రయించాడు. వీరి నుంచి రూ.23 లక్షలు వసూలు చేసిన రాజేశ్వర్.. అందులోంచి డాక్యాకు రూ.10 లక్షలిచ్చాడు. తన వాటాగా వచ్చిన దీని నుంచి ఇతగాడు మరో రూ.5 లక్షలు ప్రవీణ్‌కు ఇచ్చాడు. ప్రవీణ్ తన వద్దకు వచ్చిన డబ్బులోంచి (మొత్తం రూ.10 లక్షలు) రూ.4 లక్షలు ఇంట్లోనే ఉంచుకుని, రూ.3.5 లక్షలు తన సమీప బంధువుకు ఇచ్చాడు. ఓ బీమా పాలసీకి సంబంధించి రూ.1.2 లక్షలు చెల్లించాడు. మిగిలిన మొత్తం ఇతర ఖర్చులకు వాడేశాడు. ఈ సొమ్ములో సిట్ అధికారులు రూ.7.5 లక్షలు రికవరీ చేశారు. గ్రామానికి రూ.8 లక్షలు వెచ్చించిన రాజేశ్వర్ గతంలో చిట్టీల వ్యాపారం చేసిన రాజేశ్వర్ నష్టాలు రావడంతో ఆపేశాడు. ఇతడి తల్లి ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్‌పల్లి తండాకు సర్పంచ్‌గా ఉన్నారు. ఈమె తరఫున గ్రామంలో అభివృద్ధి పనులను ఇతడే పర్యవేక్షిస్తుంటాడు. పేపర్లు విక్రయించగా వచ్చిన మొత్తంలో డాక్యాకు ఇచ్చింది మినహా మిగిలింది తన వద్దే ఉంచుకున్నాడు. పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత చేతికందే రూ.17 లక్షల నుంచి మిగిలిన వారికి వాటాలు ఇవ్వాలనుకున్నాడు. తన వద్ద ఉన్న సొమ్ములో రూ.8 లక్షలు వెచ్చించి గ్రామంలో అభివృద్ధి పనులు చేశాడు. వీటికి సంబంధించిన బిల్లులు ప్రభుత్వం మంజూరు చేశాక ఆ మొత్తం తాను తీసుకోవాలని భావించాడు. నిందితుడి విచారణలో సిట్ అధికారులకు ఈ విషయం తెలిసింది. దీంతో ఆ బిల్లులకు సంబంధించిన మొత్తం తమకు అందేలా చర్యలు తీసుకోవాలని సిట్ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు. అలా వచ్చిన మొత్తాన్ని సీజ్ చేసి కోర్టుకు సమర్పించాలని భావిస్తున్నారు. చైర్మన్‌కు నోటీసులు ఇవ్వకుండా... సిట్ అధికారులు శనివారం కమిషన్ కార్యదర్శి అనిత రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని ప్రశ్నించి వాంగ్మూలాలు నమోదు చేశారు. టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాలకు సంబంధించిన కాన్ఫిడెన్షియల్ సెక్షన్ చైర్మన్ ఆధీనంలోనే పని చేస్తుంది. ఈ స్కామ్ మొత్తం ప్రశ్నపత్రాలకు సంబంధించిందే కావడంతో చైర్మన్ వాంగ్మూలం నమోదు అనివార్యంగా మారింది. అయితే కార్యదర్శి, సభ్యులు, ఉన్నతోద్యోగుల మాదిరిగా చైర్మన్‌కు నోటీసులు జారీ చేయడం సాధ్యం కాదని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఈ పోస్టు రాజ్యాంగ బద్ధమైంది కావడంతోపాటు ప్రస్తుత చైర్మన్ సీనియర్ ఐఏఎస్ అధికారిగా గుర్తింపు పొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేయడానికి బదులు స్టేట్మెంట్ తీసుకోవాలని సిట్ అధికారులు నిర్ణయించారు. సోమవారమే దీన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. -
TSPSC: పేపర్ లీక్ కేసులో కీలక ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించిన విషయం తెలిసిందే. తీగ లాగితే డొంక కదిలింది అన్న చందంగా ఈ కేసులో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. కమిషన్‌లో ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. మరోవైపు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సిట్ కీలక నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి స్టేట్మెంట్ను రికార్డు చేయాలని సిట్ భావిస్తున్నట్టు సమాచారం. ఇక, పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిని సిట్ శనివారం విచారించింది. వీరిద్దరినీ వేరువేరుగా 2 గంటలపాటు సిట్ విచారించింది. ఇక, విచారణ సందర్బంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ గ్రూప్-1 పరీక్ష రాసినట్టు తనకు తెలుసని సిట్‌కు అనితా రామచంద్రన్ తెలిపారు. అయితే, పరీక్షల్లో ప్రవీణ్ అర్హత సాధించకపోవడంతో అతడిపై అనుమానం రాలేదని ఆమె చెప్పారు. మరోవైపు, లింగారెడ్డి మాత్రం తన పీఏ రమేష్ గ్రూప్-1 పరీక్ష రాసినట్లు తనకు తెలియదని అన్నారు. ఇక, మొత్తం పరీక్షల నిర్వహణను కాన్ఫిడెన్షియల్‌గా సిట్ సేకరించింది. సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం.. అంతకు ముందు.. అనిత రామ్‌చంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్‌లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. -
TSPSC: పేపర్ల లీకేజీలో మీ నిర్లక్ష్యం లేదా?
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ‘సిట్’ శనివారం కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డిలను ప్రశ్నించింది. సిట్ ఇన్చార్జ్గా ఉన్న అదనపు సీపీ (నేరాలు) ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం ఇరువురినీ వేర్వేరుగా దాదాపు రెండు గంటల చొప్పున విచారించింది. కమిషన్ నిర్వహణ తీరు, లోపాలు, నిబంధనలు సహా అనేక అంశాలపై 27 ప్రశ్నలు సంధించి వాంగ్మూలాలు నమోదు చేసింది. అనిత కార్యాలయానికి వెళ్లి విచారించాలని సిట్ అధికారులు భావించగా తానే సిట్ ఆఫీసుకు వస్తానని చెప్పిన అనిత.. అన్నట్లుగా శనివారం ఉదయం వచ్చారు. లింగారెడ్డి మధ్యాహ్నం సిట్ అధికారుల ముందు హాజరుకాగా ఇద్దరినీ దాదాపు 2 గంటల చొప్పున ప్రశ్నించారు. ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కమిషన్ నిర్లక్ష్యం లేదా? అనే అంశంపై కొంత సమాచారం సేకరించారు. సిబ్బందే లీక్ చేస్తారనుకోలేదు.. జాగ్రత్తలన్నీ తీసుకొనే ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నామని... కానీ కమిషన్‌లో పనిచేసే సిబ్బందే లీకేజీకి పాల్పడతారని ఊహించలేదని అనితా రాంచంద్రన్, లింగారెడ్డి స్పష్టం చేశారు. నిందితులు కొన్నాళ్లుగా వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్నందున ఏ సందర్భంలోనూ వారిపై అనుమానం రాలేదని సిట్‌కు తెలిపారు. సైబర్ ఆడిటింగ్‌లో గుర్తించిన లోపాలను సరిచేయకపోవడానికిగల కారణాలపైనా సిట్ అధికారులు వారిద్దరినీ ప్రశ్నించారు. కమిషన్ పరిధిలోని అంశాలపై ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నామని, ప్రభుత్వ, ఇతర శాఖల పరిధిలోని అంశాల్లోనే జాప్యం జరుగుతోందని వివరణ ఇచ్చారు. కమిషన్‌లో చైర్మన్ నుంచి ఉన్నతోద్యోగుల వరకు ఎవరి బాధ్యతలు ఏమిటన్నది అగడటంతోపాటు వాటిని సంబంధిత వ్యక్తులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా? దానిపై నిత్యం పర్యవేక్షణ ఉంటోందా? అనే అంశంపైనా సిట్ అనిత, లింగారెడ్డిల నుంచి సమాచారం సేకరించింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ నిర్వహణ, యాక్సెస్ కంట్రోల్ లేకపోవడం, కస్టోడియన్ల ఎంపిక తదితర విషయాలపైనా ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. కీలక బాధ్యతల్లో ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించుకోవడంపైనా పోలీసులు ప్రశ్నించారు. అయితే విధానపరమైన నిర్ణయాలు ఏ ఒక్కరో తీసుకోరని, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తామని అనిత, లింగారెడ్డి సిట్ దృష్టికి తీసుకువెళ్లారు. టీఎస్పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, సభ్యుల వద్ద వ్యక్తిగత సహాయకులుగా పనిచేస్తున్న వాళ్లు కమిషన్ నిర్వహించే పోటీ పరీక్షలు రాయవచ్చా? అనే అంశంపై సిట్ అనితను ప్రశ్నించింది. ఇలా రాయకూడదని ఎలాంటి నిబంధన లేదన్న ఆమె గతంలోనూ అనేక మంది ఉద్యోగులు రాశారని వివరించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డితోపాటు మిగిలిన సభ్యులు, ఉన్నతాధికారులకు సైతం త్వరలో నోటీసులు ఇచ్చి విచారించడం ద్వారా వాంగ్మూలాలను నమోదు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించారు. సిట్ అదుపులో ఉన్న మాజీ ఉద్యోగులపై ఆగ్రహం... అనిత రామ్‌చంద్రన్, లింగారెడ్డి సిట్ కార్యాలయానికి వచ్చిన సమయంలో పోలీసు కస్టడీలో ఉన్న కమిషన్ మాజీ ఉద్యోగులు షమీమ్, రమేష్, సురేష్‌లు అక్కడే ఉన్నారు. వారిలో షమీమ్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా, రమేష్ సభ్యుడు లింగారెడ్డికి వ్యక్తిగత సహాయకుడిగా అరెస్టు అయ్యే వరకు పనిచేశారు. వారిని సిట్ కార్యాలయంలో చూసిన అనిత, లింగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది. మీ చర్యల వల్ల కమిషన్ పరువుపోవడంతోపాటు వేలాది మంది నిరుద్యోగుల పరిస్థితి దయనీయంగా మారిందని మండిపడ్డట్లు తెలుస్తోంది. కమిషన్ ఉద్యోగులు, వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు అందించాలని సిట్ అనితను కోరింది. వారి మధ్య ఏమైనా సంబంధాలు ఉన్నాయా? ఉంటే ఏమిటి? తదితర అంశాలు సరిచూడటానికి ఈ కోణంలో ముందుకు వెళ్తున్నారు. -
సిట్ ఆఫీస్‌లో ముగిసిన అనిత విచారణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో సిట్ దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇంతకాలం లీకేజీ రాయులు, అభ్యర్థులు, టీఎస్పీఎస్సీ ఉద్యోగులనే ప్రశ్నించిన దర్యాప్తు బృందం, ఇప్పుడు ఏకంగా కమిషన్‌లోని సభ్యులపైనే దృష్టిసారించింది. ఈ క్రమంలో.. ఇవాళ కమిషన్ సెక్రెటరీ అనితా రామచంద్రన్(ఐఏఎస్)ను సిట్ విచారించింది. శనివారం ఉదయం హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు అనితా రామచంద్రన్. సుమారు రెండు గంటలపాటు ఆమెను సిట్ చీఫ్ ఏఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలోని టీం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సిట్ అధికారులు ఈ మేరకు ఆమె నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. ప్రశ్నాపత్రాల తయారీ, వాటిని భద్రపర్చడం తదితర వ్యవహరాలన్నీ కాన్ఫిడెన్షియల్ విభాగం పరిధిలోనే ఉంటాయి. ఈ విభాగం పూర్తిగా సెక్రెటరీ అయిన అనిత పర్యవేక్షణలోనే ఉంటుంది. అయితే కాన్ఫిడెన్షియల్ విభాగంలో పని చేసే శంకర్ లక్ష్మి కంప్యూటర్ని హ్యాక్ చేసి.. ప్రశ్నాపత్రాలు కొట్టేసినట్లు సిట్ ఇదివరకే ధృవీకరించుకుంది. ఈ నేపథ్యంలోనే అనితా రామచంద్రన్‌ను సిట్ విచారించింది. మరోవైపు పేపర్ లీకేజ్‌లో నిందితుడిగా ఉన్న రమేష్, కమిషన్ సభ్యుడైన లింగారెడ్డికి పీఏగా తెలుస్తోంది. వీరిద్ధిరి మధ్య సత్సబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో.. అనితకు, లింగారెడ్డిలకు సీఆర్పీసీ సెక్షన్ 91, సెక్షన్ 160ల ప్రకారం వీళ్లిద్దరికీ సిట్ నోటీసులు జారీ చేసింది. అనితా రామచంద్రన్, లింగారెడ్డిలు అందించే వివరాలను బట్టి.. సిట్ కమిషన్‌లోనే మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. -
టీఎస్పీఎస్సీకి సిట్ టెస్ట్.. పేపర్ల లీకేజీలో సెక్రెటరీ, సభ్యుడికి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ల లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డి, చైర్మన్ జనార్దనరెడ్డిల వాంగ్మూలాలను నమోదు చేయాలని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ణయించింది. ఇందులో భాగంగా అధికారులు శుక్రవారం అనితా రామచంద్రన్, లింగారెడ్డిలకు నోటీసులు జారీ చేశారు. జనార్దనరెడ్డికి నోటీసులు ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ముగ్గురికీ అనువైన సమయంలో సిట్ అధికారులే టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వెళ్లి వాంగ్మూలాలు తీసుకోనున్నారు. ఇక లీకైన పేపర్ల ‘మారి్పడి’ మొత్తం హార్డ్‌కాపీల (ప్రింటెడ్ కాపీల) రూపంలోనే జరిగిందని.. కేవలం ఇద్దరికి మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా అందిందని సిట్ అధికారులు తేల్చారు. రాజశేఖర్‌రెడ్డి తనకు కంప్యూటర్ యాక్సెస్ ఇచ్చినందుకు ప్రతిఫలంగా అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్ఓ) షమీమ్‌కు గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అందించాడని గుర్తించారు. ప్రతి అంశాన్ని పరిశీలిస్తూ.. సిట్ అధికారులు ఏప్రిల్ 11న హైకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమరి్పంచాల్సి ఉంది. దీంతో ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రతి అంశంలో న్యాయ నిపుణులు, న్యాయ సలహాదారుల అభిప్రాయం తీసుకుంటున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి చైర్మన్ నేతృత్వంలో పనిచేయడంతో పాటు కార్యనిర్వాహక బాధ్యతలను పర్యవేక్షిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి వాంగ్మూలాలు కేసులో కీలకమని సిట్‌కు న్యాయ నిపుణులు సూచించడంతో.. కార్యదర్శికి నోటీసులు జారీచేశారు, చైర్మన్‌కూ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక గ్రూప్–1 ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో అరెస్టైన డేటా ఎంట్రీ ఆపరేటర్ డామెర రమేశ్‌కుమార్ ఇంతకుముందు కమిషన్ సభ్యుడు లింగారెడ్డి వద్ద వ్యక్తిగత సహాయకుడిగా పనిచేశారు. ఈ క్రమంలో లింగారెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు.. మిగతా సభ్యుల విషయమై న్యాయ సలహా తీసుకుంటున్నారు. కేవలం ప్రింటెడ్ పత్రాలే ఇస్తూ.. లీకైన పేపర్లలో గ్రూప్–1 ప్రిలిమ్స్, ఏఈ ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు చేరాయని సిట్ అధికారులు చెప్తున్నారు. ఇవి మొత్తం తొమ్మిది మందికి చేరాయని ఇప్పటివరకు తేలి్చనట్టు సమాచారం. కస్టోడియన్ కంప్యూటర్ నుంచి ప్రవీణ్, రాజశేఖర్ చేజిక్కించుకున్నవి సాఫ్ట్కాపీలే. అయినా ఈ ‘వాట్సాప్ జమానా’లో కూడా వారు ప్రశ్నపత్రాల ఆన్లైన్ షేరింగ్ జోలికి పోలేదు. న్యూజిలాండ్‌లో ఉన్న రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌రెడ్డి, టీఎస్పీఎస్సీ సభ్యుడి వద్ద పీఏగా పనిచేసిన రమేశ్‌కు మాత్రమే ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా సాఫ్ట్‌కాపీలు ఇచ్చారు. మిగతా వారికి ప్రింట్‌ఔట్స్ రూపంలో ఉన్న మాస్టర్ క్వశ్చన్ పేపర్ల పత్రాలే అందించారు. ఎక్కడా సాంకేతిక ఆధారాలు చిక్కకూడదనే ఇలా చేసినట్టు సిట్ అధికారులు భావిస్తున్నారు. కంప్యూటర్ యాక్సెస్ కోసం పేపర్ ఇచ్చి.. రాజశేఖర్ తన పెన్‌డ్రైవ్‌లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని ప్రశాంత్‌రెడ్డికి ఎనీడెస్క్ అప్లికేషన్ ద్వారా పంపినా.. ఇందుకోసం తన కంప్యూటర్ను నేరుగా వినియోగించలేదు. ఎవరైనా సహోద్యోగులు చూసే ప్రమాదం ఉందని, సాంకేతిక ఆధారాలు చిక్కకూడదని భావించాడు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేíÙంచిన అతడికి తన స్నేహితురాలైన ఏఎస్ఓ షమీమ్ కూడా గ్రూప్–1 రాస్తున్నట్టు తెలిసింది. ఆమెను సంప్రదించిన రాజశేఖర్.. తాను ఇచ్చే పెన్‌డ్రైవ్‌ను ఇంటికి తీసుకువెళ్లి ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేయాలని, ఎనీడెస్క్ ద్వారా న్యూజిల్యాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు యాక్సెస్ ఇవ్వాలని కోరాడు. ఇలా చేసినందుకు అందులో ఉన్న ప్రశ్నపత్రాన్ని పేపర్ తీసుకోవచ్చని.. ఈ విషయం ఎవరికీ తెలియదని భరోసా ఇచ్చాడు. రాజశేఖర్ ఇచి్చన పెన్‌డ్రైవ్‌ను తీసుకువెళ్లిన షమీమ్ తన ఇంటివద్ద ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసింది. తర్వాత రాజశేఖర్ సూచనల ప్రకారం నిరీ్ణత సమయంలో ఎనీడెస్క్ ద్వారా ఈ ల్యాప్‌టాప్‌ను యాక్సెస్ చేసిన ప్రశాంత్‌రెడ్డి.. ఆ పెన్‌డ్రైవ్‌లో ఉన్న గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాన్ని తన కంప్యూటర్లోకి కాపీ చేసుకున్నాడు. తర్వాత రమేశ్‌కు ప్రవీణ్ ఇదే పంథాలో తన కంప్యూటర్ నుంచి ఎనీడెస్క్ ద్వారా ప్రశ్నపత్రం అందించాడు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు సైతం ఇలానే చేజిక్కించుకోవాలని పథకం వేసిన ప్రవీణ్.. ఎక్కడా లీకేజ్ వ్యవహారం బయటపడకూదని, సాంకేతిక ఆధారాలు ఉండకూడదనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నాడని సిట్ అధికారులు చెప్తున్నారు. ఫోరెన్సిక్ పరీక్షలకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ షమీమ్, రమేశ్, సురేశ్‌లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సిట్ అధికారులు.. ఈ అంశాలను నిర్ధారించుకోవడంతోపాటు న్యూజిలాండ్‌లో ఉన్నది మినహా మిగతా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లను స్వా«దీనం చేసుకున్నారు. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపనున్నారు. మరోవైపు సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్‌లో 100 కంటే ఎక్కువ మార్కులు వచి్చన 121 మందినీ ప్రశి్నస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం నాటికి 103 మందిని విచారించామని, ఎలాంటి అనుమానాస్పద అంశమూ తమ దృష్టికి రాలేదని సిట్ అధికారులు చెప్తున్నారు. చదవండి: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్ -
Tspsc Paper Leak: రేవంత్ ఆరోపణలపై సిట్ రియాక్షన్
సాక్షి,హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపణలపై సిట్ స్పందించింది. డేటా ఎవరికీ ఇవ్వలేదని సిట్ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వంద మందిని విచారించాం. రూ.4 లక్షల నగదు సీజ్ చేశామని తెలిపారు. కాగా, పేపర్ల లీకేజీ వ్యవహారంలో సిట్ దూకుడు ప్రదర్శిస్తోంది. టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఛైర్మన్నూ కూడా సిట్ విచారించనుంది. ఇంటి దొంగల పాత్రపై సిట్ ఫోకస్ పెట్టింది. పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌ను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. చదవండి: కేటీఆర్ ఏమైనా రకుల్ సినిమాకు సైన్ చేసినట్టా..! రేవంత్ రెడ్డి ఫైర్ -
టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ కేసులో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సంచలనంగా మారిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకంపై.. టీఎస్పీఎస్సీ మెంబర్లను విచారించాలని సిట్ నిర్ణయించింది. టీఎస్పీఎస్సీలో ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. కాగా, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌ను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, పేపర్ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్‌తో వీరికి ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో, అరెస్ట్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. చదవండి: ఆ ఆరు పరీక్షలపై దృష్టి -
Telangana: 15 పేపర్లు అవుట్!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ కేసు దర్యాప్తులో వెలుగు చూస్తున్న అంశాలు నివ్వెరపరుస్తున్నాయి. మొత్తం ఆరు రకాల పరీక్షలకు సంబంధించి ఏకంగా 15 క్వశ్చన్ పేపర్లు ముందే బయటకు వచ్చినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తేల్చింది. గ్రూప్–1 పేపర్ లీక్ ఐదుగురికే పరిమితమైందని, ఏఈ ప్రశ్నపత్రం పలువురికి విక్రయించారని, మిగతావి పెన్‌డ్రైవ్‌కే పరిమితమైనట్లు స్పష్టమైంది. గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన పేపర్లు తస్కరించేందుకు కూడా నిందితులు పథకం వేసినట్లు బయటపడింది. అన్నీ మాస్టర్ ప్రశ్నపత్రాలే.. ఈ స్కామ్‌లో సూత్రధారులుగా ఉన్న కమిషన్ కార్యదర్శి మాజీ పీఏ ప్రవీణ్ కుమార్, నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్‌రెడ్డితో పాటు 13 మంది నిందితులను పోలీసులు వివిధ కోణాల్లో విచారించారు. గతేడాది అక్టోబర్ మొదలు గత నెల ఆఖరి వారం వరకు సాగిన ఈ లీకేజ్ వ్యవహారంపై కీలక ఆధారాలు సేకరించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్‌ను ప్రవీణ్.. సురేష్, రమేష్‌లకు కూడా ఇచ్చాడు. రాజశేఖర్‌రెడ్డి.. షమీమ్‌కు, న్యూజిలాండ్‌లో ఉండే తన సమీప బంధువు ప్రశాంత్ రెడ్డికి ఇచ్చాడు. ఈ ఐదుగురికి మినహా మరెవరికీ ఈ ప్రశ్నపత్రం చేరినట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని సిట్ అధికారులు చెబుతున్నారు. గత నెల 5న జరిగిన ఏఈ పరీక్ష పత్రాలు నీలేష్, గోపాల్, ప్రశాంత్, రాజేంద్రకుమార్ ఖరీదు చేశారని తేల్చారు. వీరి ద్వారా మరికొందరికి చేరే అవకాశాలు తక్కువని చెప్తున్న అధికారులు.. ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌లో మొత్తం ఆరు పోస్టులకు సంబంధించిన పరీక్షల పత్రాలు ఉన్నట్లు గుర్తించారు. గ్రూప్–1 ప్రిలిమ్స్, అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) టౌన్ ప్లానింగ్ బిజినెస్ ఓవర్సీర్ (టీపీబీఓ), జూనియర్ లెక్చరర్ (జేఎల్), డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) పేపర్లు పెన్‌డ్రైవ్‌లో ఉన్నాయని, ఇవన్నీ మాస్టర్ క్వశ్చన్ పేపర్లని సిట్ అధికారులు చెప్తున్నారు. వీటిల్లో ఆయా ప్రశ్నలతో పాటు సమాధానాలు కూడా ఉంటాయి. ఈ కారణంగానే గ్రూప్–1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలు తీసుకున్నవారు, ఏఈ పేపర్‌ను ఖరీదు చేసిన వారు.. సిద్ధం కావడం తేలికైంది. లేనిపక్షంలో సమాధానాలు వెతుక్కోవడానికి, ఆపై సిద్ధం కావడానికి మరికొంత సమయం అవసరమై ఉండేదని అంటున్నారు. గ్రూప్–1 మెయిన్స్ పేపర్లు కొట్టేసేందుకూ ప్లాన్ గ్రూప్–1, ఏఈఈ మినహా మిగిలినవి ప్రవీణ్ వద్దే ఉండిపోయాయని, ఖరీదు చేసే వాళ్ల కోసం ప్రయత్నాలు జరుగుతుండగానే స్కామ్ వెలుగు చూసిందని సిట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రవీణ్, రాజశేఖర్‌లు గ్రూప్–1 మెయిన్స్ పరీక్షలకు సంబం«ధించిన పేపర్లు కూడా కస్టోడియన్ కంప్యూటర్ నుంచి తస్కరించాలని పథకం వేశారని, ఈ మేరకు షమీమ్, సురేష్, రమేష్, ప్రశాంత్‌రెడ్డిలకు సమాచారం ఇచ్చారని ఓ ఉన్నతాధికారి చెప్పారు. 8 గంటల పాటు విచారణ పోలీసు కస్టడీలో ఉన్న ముగ్గురు నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌లను సిట్ పోలీసులు రెండోరోజు గురువారమూ 8 గంటల పాటు ప్రశ్నించారు. ఎల్బీనగర్, సైదాబాద్, ఉప్పల్ ప్రాంతాల్లోని వారివారి ఇళ్లకు వెళ్లి ఆధారాల కోసం సోదాలు చేశారు. గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించి మాస్టర్ ప్రశ్నపత్రాల కాపీలు స్వాధీనం చేసుకున్నారు. కస్టోడియన్ శంకరలక్ష్మి వాంగ్మూలం గురువారం మరోసారి నమోదు చేశారు. ఆ 15 ప్రశ్నపత్రాల జాబితా ఇది... 1. గ్రూప్–1 జనరల్ స్టడీస్ 2. ఏఈఈ సివిల్ ఇంజనీరింగ్ 3. ఏఈఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 4. ఏఈఈ మెకానికల్ ఇంజనీరింగ్ 5. డీఏఓ జనరల్ స్టడీస్ 6. డీఏఓ మేథమెటిక్స్ 7. జనరల్ స్టడీస్ డిప్లొమా ఏఈ 8. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 9. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 10. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ 11. మెకానికల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్–2 12. సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా ఏఈ పేపర్–2 13. టీపీబీఓ ఒకేషనల్ జనరల్ స్టడీస్ పేపర్–1 14. టీపీబీఓ ఇంటర్మీడియట్ ఒకేషనల్ పేపర్–2 15. జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్ -
HYD: డేటా చోరీ కేసులో బిగ్ ట్విస్ట్.. ఈడీ ఎంట్రీ!
సాక్షి, హైదరాబాద్: డేటా చోరీ కేసు తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసు నమోదు చేసింది. ఈ కేసులో సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసినట్టు తెలిపింది. ఇదిలా ఉండగా, అంతకుముందు.. దేశంలోనే అతి పెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రజల వ్యక్తిగత డేటాను విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 16.80 కోట్ల మంది డేటా చోరీ అయినట్లు గుర్తించారు. మరో 10 కోట్ల మంది డేటా చోరీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. వెంటనే ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్‌ను ఏర్పాటు చేసింది. డేటా చోరికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వివరించారు. డేటా చోరీ కేసు దర్యాప్తులో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఈ రోజు మీడియాకు వెల్లడించారు. డేటా చోరి స్కామ్‌లో పలు బ్యాంకుల క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించామన్నారు. దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. పలు కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని వెల్లడించారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా చోరీకి గురైందని తేల్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే 7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డులను సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: ‘దిశ’ కేసులో వాయిదాలు సరికాదు -
పని పూర్తి చేయమంటే 'పేపర్ అమ్మమన్నాడు'!
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం పనుల ఆలస్యంపై ఓ సర్పంచ్ కుమారుడిని ప్రశ్నించడంతోనే తిరుపతయ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్ష పేపర్ల లీకేజీ స్కామ్‌లో భాగస్వామి అయ్యాడని తెలుస్తోంది. ఇతడితో పాటు ఇద్దరు అభ్యర్థులను అరెస్టు చేసిన సిట్ అధికారులు వీరిని తమ కస్టడీలోకి తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క లీకేజీ కేసులో జైలుకు వెళ్లిన టీఎస్పీఎస్సీ మాజీ ఉద్యోగులు షమీమ్, సురేశ్, రమేశ్‌లను పోలీసులు బుధవారం తమ కస్టడీలోకి తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ నుంచి రేణుక, ఆమె భర్త డాక్యాలకు ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలు అందిన విషయం తెలిసిందే. వీటిని విక్రయించడానికి ఈ భార్యాభర్తలు ఏర్పాటు చేసుకున్న దళారుల్లో తమ స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం మన్సూర్‌పల్లి తండాకు చెందిన కేతావత్ రాజేశ్వర్ అలియాస్ రాజు ఒకరు. రాజేశ్వర్ తల్లి మన్సూర్‌పల్లి తండాకు సర్పంచ్‌గా పని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ తండాకు సంబంధించిన అభివృద్ధి పనులను రాజేశ్వర్ పర్యవేక్షించేవాడు. సల్కర్‌పేట గ్రామానికి చెందిన తిరుపతయ్య ఉపాధి హామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఇతడు ఎనిమిదేళ్లుగా గండీడ్ మండలంలో పని చేస్తున్నాడు. దీంతో తిరుపతయ్య, రాజేశ్వర్ మధ్య పరిచయాలు ఉన్నాయి. మన్సూర్‌పల్లి తండాలో జరిగే ఓ అభివృద్ధి పనిని తిరుపతయ్య పర్యవేక్షిస్తున్నాడు. అది నిర్ణీత సమయానికి పూర్తికాకపోవడంతో ఆలస్యానికి కారణం ఏమిటంటూ రాజేశ్వర్‌ను ప్రశ్నించాడు. అప్పటికే ఏఈ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల వేటలో ఉన్న రాజేశ్వర్ అదే విషయం తిరుపతయ్యకు చెప్పి, ఆ బిజీలో ఉండటంతో అభివృద్ధి పనిని పర్యవేక్షించడం సాధ్యం కాలేదని, ఎవరైనా అభ్యర్థులు ఉంటే తీసుకురావాలని సూచించాడు. ప్రశ్నపత్రం విక్రయించగా వచ్చిన సొమ్ములో కమీషన్ ఇస్తానని చెప్పాడు. దీనికి అంగీకరించిన తిరుపతయ్య.. ఉపాధి హామీ పథకంలో పరిచయమైన రాజేంద్రకుమార్, ప్రశాంత్‌ను సంప్రదించాడు. వీరిని రాజేశ్వర్ వద్దకు తీసుకువెళ్లి, డాక్యా ద్వారా కర్మన్‌ఘాట్‌లోని ఓ లాడ్జి వద్ద ప్రశ్నపత్రం ఇప్పించాడు. వీరి నుంచి అడ్వాన్సుగా రూ.8 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. కస్టడీకోసం కోర్టులో సిట్ పిటిషన్ ఈ కేసులో వీరిని మరింత లోతుగా ప్రశ్నించడంతో పాటు నగదు రికవరీ కోసం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ సిట్ పోలీసులు బుధవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ప్రకారం గ్రూప్–1 ప్రిలిమ్స్ పేపర్ ప్రవీణ్, రాజశేఖర్ల ద్వారా ఈ ముగ్గురితో పాటు రాజశేఖర్ సమీప బంధువు ప్రశాంత్‌రెడ్డి వద్దకు మాత్రమే వెళ్లింది. రమేశ్, సురేశ్‌లకు ప్రవీణ్ ఇవ్వగా.. షమీమ్‌తో పాటు ప్రశాంత్‌రెడ్డిలకు రాజశేఖర్ ఇచ్చాడు. అయితే ఆ పేపర్ ఈ ఐదుగురితో పాటు ఇంకా ఎవరికైనా చేరిందా? అనే కోణంలో సిట్ వీరిని ప్రశ్నించనుంది. సిట్ అధికారులు గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షల్లో 100కు పైగా మార్కులు సాధించిన 121 మందిని ప్రశ్నించడం కొనసాగిస్తున్నారు. బుధవారం నాటికి 84 మందిని ప్రశ్నించారు. కాగా, ఏఈ ప్రశ్నపత్రం మాదిరిగా గ్రూప్–1 పేపర్ వ్యవహరంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
TSPSC Paper Leak: పేపర్ లీక్ వ్యవహారంలో మరో ట్విస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ దూకుడు పెంచింది. పేపర్ లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్‌ను సిట్ ఐదు రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక, ముగ్గురు నిందితుల్లో ఇద్దరు టీఎస్పీఎస్సీ ఉద్యోగులే కావడం గమనార్హం. అయితే, పేపర్ లీకేజీలో నిందితులు కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. మరోవైపు, పేపర్ కేసు ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్‌తో వీరికి ఉన్న సంబంధాలపై సిట్ ఆరా తీయనుంది. ఇక, ఈ కేసులో ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. దీంతో, అరెస్ట్‌ల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: పేపర్ లీకేజీ దొంగలకు కేటీఆర్ అండ! -
TSPSC పేపర్ లీకులో వరుస అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగుల్ని కుదిపేసి.. రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టించిన పేపర్ల లీక్ వ్యవహారంలో వరుస అరెస్టులు చోటు చేసుకుంటున్నాయి. నిందితులు ఒకరికి తెలియకుండా మరొకరు పేపర్లు అమ్ముకుని.. ఒక్కొక్కరుగా బయట పడుతున్నారు. తాజాగా.. ఈ కేసులో మరొకరిని అరెస్ట్ చేసింది సిట్. మహబూబ్‌నగర్ గండీడ్‌కు చెందిన తిరుపతయ్య అనే అభ్యర్థిని సిట్ అరెస్ట్ చేసింది. దీంతో.. పేపర్ లీక్ కేసులో అరెస్టుల సంఖ్య 15కి చేరింది. మొదట.. ఈ కేసులో ఒకేసారి తొమ్మిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ తొమ్మిది మంది సిట్ విచారణలో ఇచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఆపై మరో ఇద్దరినీ, తాజాగా తిరుపతయ్యను అరెస్ట్ చేసింది సిట్. డాక్యా నాయక్ నుంచి తిరపతయ్య ఏఈ పేపర్‌ను కొనుగోలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అంతేకాదు ఈ కేసులో నిందితురాలు రేణుక, తిరుపతయ్య ఒకే ప్రాంతానికి చెందిన వాళ్లు కావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సిట్ ఇవాళ నిందితులను మళ్లీ కస్టడీలోకి తీసుకోనుంది. దీంతో మరిన్నిపేర్లు బయటపడొచ్చని, అరెస్టులు జరగొచ్చని అర్థమవుతోంది. గ్రూప్ -1(Group 1) ప్రిలిమ్స్‌లో(రద్దైంది) 100కుపైగా మార్కులు వచ్చినవాళ్లను సిట్ పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం. వాళ్లకు 15 అంశాలతో కూడిన ప్రశ్నావళి రూపొందించి సమాధానాలు ఇవ్వాలని కోరుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో నిందితుల విచారణ కొనసాగుతోంది. ప్రవీణ్ , రాజశేఖర్ , డాక్య నాయక్ , కేతావత్ రాజేశ్వర్ లను రెండో రోజు కస్టడీలోకి తీసుకుని సీసీఎస్ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నారు సిట్ అధికారులు. ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల నడుమ మరో వందేభారత్ -
నోటీసులపై స్పందించిన బండి సంజయ్.. సిట్‌కు లేఖ.. ఏం చెప్పారంటే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణను పట్టి కుదిపేస్తున్న టీఎస్సీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రాజకీయంగా మరింత వేడిపెంచింది. ఈనేపథ్యంలోనే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలకుగానూ ఆధారాలను వ్యక్తిగతంగా హాజరై.. తమకు సమర్పించాలంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు సిట్ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సిట్ నోటీసులపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఈమేరకు ఆయన సిట్ అధికారికి ఆదివారం లేఖ రాశారు. ‘నాకు సిట్ మీద నమ్మకం లేదు. పార్లమెంట్ సమావేశాల కారణంగా బిజీగా ఉన్నాను అని ఇప్పటికే తెలిపాను. అయినా మళ్ళీ నోటీస్ లు ఇచ్చారు. మీ పరిస్థితి ని అర్థం చేసుకోగలను. ఆ బాధ్యత గల మంత్రి ఇద్దరు మాత్రమే ఉన్నారు అని అన్నారు. లీక్ లో చాలా మంది ఉన్నారని సిట్ హెడ్ గా మీకు తెలుసు. స్కాం ను తక్కువ చేసి చుపెట్టే ప్రయత్నం మొదటి నుండి జరుగుతుంది. రాజకీయాల ను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షి తో ఆలోచించండి. ఈ స్కాం తో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారు. ఒక గ్రామం నుండి ఎక్కువ మంది గ్రూప్ వన్ కి సెలెక్ట్ అయ్యారని సమాచారం నాకు వచ్చింది. దాన్ని ప్రజల ముందు పెట్టాను. ప్రజా ప్రతినిధి గా వివిధ మార్గాల నుండి సమాచారం వస్తుంది.. ఈ సమయం లో పూర్తి వివరాలను బహిర్గతం చేయడం భావ్యం కాదని అనుకుంటున్నాను. అసలు విషయం పై విచారణ జరపకుండా. మీరు నాకు నోటీస్ లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యం లో నేను హాజరు కావడం లేదు’ అని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. -
సిట్ విచారణకు బండి సంజయ్ గైర్హాజరు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ రేపు(ఆదివారం) సిట్ విచారణకు గైర్హాజరు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో తాను చేసిన వ్యాఖ్యలకుగానూ ఆధారాలను వ్యక్తిగతంగా హాజరై.. తమకు సమర్పించాలంటూ సిట్ నోటీసుల ద్వారా ఆయన్ని కొరిన సంగతి తెలిసిందే. అయితే గతంలో జారీ చేసిన నోటీసులు తనకు అందలేదని ఆయన విచారణకు గైర్హాజరు కాగా.. తాజాగా ఇవాళ ఆయనకు సిట్ మళ్లీ నోటీసులు జారీ చేసింది. అయితే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో హైదరాబాద్ లిబరేషన్ కార్యక్రమంతో పాటు.. ఎన్నికల ప్రచార కార్యక్రమంలలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం బీదర్(కర్ణాటక) వెళ్లనున్నట్లు సమాచారం. దీంతో ఆయనకు బదులు లీగల్‌టీం సిట్ విచారణకు హాజరు కావొచ్చని తెలుస్తోంది. -
పేపర్ లీక్ కేసు: సిట్ కస్టడీ రిపోర్ట్‌లో కీలకాంశాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ TSPSC పేపర్ లీకేజ్ కేసులో నలుగురు నిందితులను మాత్రమే అదీ మూడు రోజుల సిట్ కస్టడీకి అనుమతించిన నాంపల్లి కోర్టు. శనివారం సాయంత్రం ఈ కేసులోని నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి.. ఆరు రోజుల కస్టడీకి కోరింది సిట్. అయితే.. ఈ కేసులోని ఏ -1 ప్రవీణ్,ఏ -2 రాజశేఖర్, ఏ -4 డాక్య, ఏ -5 కేతావత్ రాజేశ్వర్ నిందితులను మాత్రమే సిట్ కస్టడీ అనుమతించింది కోర్టు. దీంతో రేపటి నుంచి మంగళవారం వరకు వీళ్లను కస్టడీకి తీసుకుని విచారించనున్నారు సిట్ అధికారులు. అయితే మిగిలిన ముగ్గురు(ఏ-10 షమీమ్, ఏ -11, సురేష్, ఏ -12 రమేష్) కస్టడీ పిటిషన్‌ను మాత్రం సోమవారానికి వాయిదా వేసింది కోర్టు. కస్టడీ రిపోర్ట్‌లో కీలకాంశాలు ఇక పేపర్ లీకేజీ కేసులో.. సిట్ కస్టడీ రిపోర్ట్‌లో కీలకాంశాలను పేర్కొంది. ‘‘నిందితులు విచారణకు సహకరించడం లేదు. పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. పేపర్ లీకేజీ వ్యవహారంలో.. చైన్ ప్రాసెస్‌పై నోరు మెదపడం లేదు. కేవలం ముగ్గురి పేర్లే చెప్పారు. ఇందులో మిగతా వారి పాత్ర కూడా బయటపడాలి. నిందితులు వాడిన పరికరాలపై ప్రశ్నించాలి. ప్రవీణ్, రాజశేఖర్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. షమీమ్, రమేశ్, సురేష్లను అరెస్ట్ చేశాం. పేపర్ లీకేజీ వ్యవహారంలో.. ఇంకా దర్యాప్తు పూర్తి కాలేదు. కాబట్టి.. నిందితుల కస్టడీ అత్యంత కీలకం అని పేర్కొంది. ఇక నిందితులలో నలుగురిని.. నాంపల్లి కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిదని సిట్ అధికారులు తెలిపారు. -
బండి సంజయ్ ఇంటికి సిట్ అధికారులు.. మరోసారి నోటీసులు!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇంటికి వెళ్లారు. పేపర్ లీక్ కేసులో ఆధారాలు ఇవ్వాలని మరోసారి ఆయనకు నోటీసులు అందజేశారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని తెలిపారు. కాగా పేపర్ లీకేజీ వ్యవహారంలో గతంలో ఆయనకు మొదటిసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 24న తమ ముందు హాజరు కావాలని కోరారు. అయితే పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ సిట్ విచారణకు గైర్హాజరయ్యారు. సిట్ విచారణకు బండి సంజయ్ హాజరు కాని నేపథ్యంలో.. ఇవాళ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు సిట్ అధికారులు. తనకు నోటీసులు అందలేదని, మీడియాలో వచ్చిన వార్తల మేరకు స్పందించానని బండి సంజయ్ పేర్కొన్నారు. సిట్ విచారణపై నమ్మకం లేదన్న ఎంపీ.. తన దగ్గర ఉన్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదల్చుకోలేదని తెలిపారు. తనకు నమ్మకమున్న సంస్థలకే సమాచారం ఇస్తానని.. ఈ కేసును సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు.