సాక్షి, విజయవాడ: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్ ఏర్పాటైంది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే, ‘సీజ్ ది షిప్’ ఎపిసోడ్‌పై విచారణను మాత్రం సిట్‌కి అప్పగించలేదు. గత నెల, ఈ నెలలో జరిగిన బియ్యం అక్రమ రవాణా అంశాలను సిట్ పరిధికి ప్రభుత్వం అప్పగించలేదు.
స్టెల్లా, కెన్ స్టార్ షిప్‌లలో బియ్యం రవాణా అంశాన్ని సిట్‌కి అప్పగించని ప్రభుత్వం.. జూన్, జులైలో నమోదైన రేషన్ బియ్యం రవాణా కేసుల విచారణను మాత్రమే సిట్‌కి అప్పగించింది. 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన కేసులు సిట్‌కి అప్పగించింది. సిట్ జీవోలో ఎక్కడా కూడా సీజ్ ది షిప్ ఎపిసోడ్ ప్రస్తావన లేదు.
ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు
Comments
Please login to add a commentAdd a comment