Kakinada port
-
కేవీరావుపై పరువు నష్టం దావా వేస్తా: విజయసాయిరెడ్డి
సాక్షి,హైదరాబాద్:కాకినాడ సీ పోర్టు అమ్మకం విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముగిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీసు నుంచి బయటికి వచ్చిన విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.‘నన్ను మొత్తం 25 ప్రశ్నలు అడిగారు. కర్నాటి వెంకటేశ్వర్ రావు(కేవీరావు) ఫిర్యాదు మీద విచారణ చేశారు. ఏపీ సీఐడీ ఎఫ్ఐఆర్ మీద ఈడీ కేసు నమోదు చేసింది. విక్రాంత్ రెడ్డికి కాకినాడ సీ పోర్ట్ గురించి కేవీ రావుతో మాట్లాడాలని నేను చెప్పినట్లు ఆరోపించారు. కేవీ రావు ఎవరో నాకు తెలియదు. అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు.ప్రజా ప్రతినిధిగా నా వద్దకు ఎంతో మంది వస్తారు.కానీ కాకినాడ సీ పోర్ట్ విషయంలో నేను ఎవరికి ఫోన్ చేయలేదు. కేవీరావు తిరుమలకు వచ్చి దేవుడి ముందే నిజాలు చెప్పాలి. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం. కాకినాడ పోర్ట్ షేర్ ట్రాన్స్‌ఫర్‌కు నాకు సంబంధం లేదు. కేవీరావు మీద సివిల్ డిఫమేషన్ వేస్తాను. నాకు సంబంధం లేని విషయంలో నా పై ఆరోపణలు చేశారు.సండూరు పవర్ పెట్టుబడులపై వెరిఫై చేసి మళ్లీ పిలిస్తే సమాధానం చెప్తానని చెప్పను. విక్రాంత్‌రెడ్డి సుబ్బారెడ్డి కొడుకుగానే తెలుసు ఆయనతో నాకేం సంబంధం’అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందినా స్టేట్మెంట్ ఈడి అధికారులు రికార్డ్ చేశారుడిడి అధికారులు నన్ను 25 ప్రశ్నలు అడిగారుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందికేవీ రావు నాకు తెలియదు అని చెప్పానుఅతనికి నాకు ఎలాంటి సంబంధం లేదుకాకినాడ సీ పోర్ట్ విషయం లో కేవీ రావు కు ఎక్కడ నేను ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను తిరుమల కు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పానునేను తప్పు చేస్తే ఏ శిక్ష కైనా నేను సిద్ధంమే నెల 2020 లో నేను ఫోన్ చేసానని కేవి రావు చెపుతున్నాడుకాల్ డేటా తీసి నేను కాల్ చేశాను లేదో చూసుకోవచ్చునేను ఎక్కడ కూడా కేవీ రావు కు ఫోన్ చెయ్యాలేదుకేవీ రావు ను ఈడీ విచారణ కు పిలవండి అని కోరానురంగనాధ్ కంపెనీ నీ ప్రభుత్వం కి ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించిందినాకు సంబంధం లేదు అని చెప్పానునేను ఒక సాధారణ మైన ఎంపీ నీ మాత్రమేశ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీ ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పానుశరత్ చంద్ర రెడ్డి తో ఉన్న సంబంధాలు కూడా అడిగారుకుటుంబ రీలేషన్ అని చెప్పానుకాకినాడ సీ పోర్ట్ విషయం లో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారులుక్ ఔట్ నోటీసుల ఫై నేను ఢిల్లీ హైకోర్టు కు వెళ్ళానుకేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీ కి చెప్పానువిక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారువిక్రాంత్ రెడ్డి తో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదుసండుర్ పవర్ కంపెనిలో 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారుకొన్ని సంవత్సరాల క్రితం జరిగిన ట్రాన్సాక్షన్స్ గురించి ఇప్పుడు చెప్పడం కుదరదు అని చెప్పాను -
కొంప ముంచిన డిప్యూటీ సీఎం సీజ్ ది షిప్!
-
Pawan Kalyan సీజ్ ద షిప్.. ప్చ్!
కాకినాడ, సాక్షి: సీజ్ ద షిప్.. పోర్టులో కొద్ది రోజుల కిందట కాకినాడ పోర్టులో బియ్యం తనిఖీల నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan kalyan) అన్న మాట వైరల్‌గా మారింది. ఎంతలా అంటే.. ఆయన హార్డ్‌కోర్ అభిమానులకు ఆ డైలాగ్ నిద్రలేకుండా చేసింది. తమ అభిమాన నటుడు.. ప్రియతమ నేత రంగంలోకి దిగి మరీ అధికారులపై శివాలెత్తిపోయి ఆదేశాలివ్వడంతో మురిసిపోయారంతా. ఆ వెంటనే సోషల్ మీడియాలో వాళ్లు ఇచ్చిన ఎలివేషన్లు.. ఎక్స్‌లో #Seizetheship హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి రావడం.. మాములుగా సాగలేదా హడావిడి. అయితే ఆ వ్యవహారంలో తాజా పరిణామం.. ఆయన అభిమానులకు మింగుడు పడనివ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైన నౌక ‘స్టెల్లా ఎల్- పనామా- ఐఎంవో 9500687’. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ షిప్‌ను అయితే సీజ్ చేయమని చెప్పారో.. ఆ షిప్ త్వరలో ఇంటి ముఖం పట్టబోతోంది. ఈ నెల 5 లేదంటే 6వ తేదీల్లో స్లెల్లా నౌక కాకినాడ నుంచి బయల్దేరనుందని సమాచారం. ఆపై అది వెస్ట్ ఆఫ్రికా కోటోనౌ పోర్టు(Port of Cotonou)కు చేరుకోనుంది. ఇందుకు సంబంధించిన క్లియరెన్స్ ఈపాటికే లభించినట్లు సమాచారం.పశ్చిమ ఆఫ్రికా తీరంలోని బెనిన్(Benin) దేశ వాణిజ్య కేంద్రం కోటోనౌ పోర్టుకు.. కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి బియ్యం నిల్వలు దీని ద్వారా చేరవేయాల్సి ఉంది. ఇందుకోసం హల్దియా నుంచి కాకినాడ తీరానికి నవంబర్ 11న ‘స్టెల్లా’ నౌక వచ్చింది.ఇంపీరియల్ ఏజెంట్ ద్వారా నౌకలో 52,200 టన్నుల బియ్యం ఎగుమతి చేసేలా 28 ఎగుమతి సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 32,415 టన్నులు లోడ్ చేశారు. అయితే నవంబర్ 27న కలెక్టర్ తనిఖీలు చేసి 640 టన్నుల పేదల బియ్యం గుర్తించి నౌకను అదుపులోకి తీసుకున్నారు.ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. రెండ్రోజుల తర్వాత కాకినాడ తీరంలో పర్యటించారు. స్వయంగా బోటులో షిప్ దగ్గరకు వెళ్లి మరీ సీజ్ ద షిప్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అక్కడి టీడీపీ ఎమ్మెల్యే కొండబాబుతో (వనమాడి వెంకటేశ్వరరావు)పాటు ఎస్పీ, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ అధికారులపైనా ఆయన సీరియస్ అయ్యారు.అయితే.. విదేశీ నౌకను సీజ్ చేసే అధికారం లేకపోవడంతో అధికార యంత్రాంగం తర్జనబర్జన పడింది. అంతర్జాతీయ అంశాలతో ముడిపడి ఉండడం.. దేశాల మధ్య ఎగుమతి- దిగుమతుల సమస్య కావడం కారణాలు. అందుకే స్టెల్లా షిప్ సీజ్ చేయడం అంత సులువు కాదని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ తేల్చేశారు. కావాలంటే నౌకలోని రేషన్ బియ్యం అన్లోడ్ చేశాక ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ఇష్యూ నుండి బయట పడేందుకు మల్టీ డిసిప్లెయినరీ కమీటీ కూడా ఏర్పాటు చేశారు. ఆపై వాస్తవ పరిస్థితిని పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెండ్ల మనోహర్‌కు పరిస్థితి వివరించే ప్రయత్నం చేశారు. ఈలోపు ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రకరకాల కారణాలతో రేషన్ బియ్యాన్ని దించడం కాస్త ఆలస్యమైంది. చివరకు.. తాజాగా నౌకలో గుర్తించిన 1,320 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని ఆన్ లోడ్ చేసి పోర్ట్ గోడౌన్లకు అధికారులు తరలించారు. ఆ వెంటనే షిప్ వెళ్లిపోయేందుకు క్లియరెన్స్ ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి.. పవన్ సీజ్ ద షిప్ వ్యవహారం సోషల్ మీడియా రీల్స్ కే పరిమితమైందన్నమాట!.ప్చ్..కొసమెరుపు..కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాకు అక్రమంగా తరలించే వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. దీనిని కూటమి అనుకూల మీడియా ఘనంగా ప్రచారం చేసుకుంది. ఇందులోనూ వైఎస్సార్సీపీ ప్రస్తావన తెచ్చి బద్నాం చేయజూసింది. అయితే.. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. ఆ సిట్ అధికారులు ఇప్పటిదాకా కాకినాడ ముఖం చూడలేదు. అదే సమయంలో పట్టుబడిన రేషన్ బియ్యం తాలుకా 6ఏ కేసులు నమోదు అయినప్పటికీ సివిల్ సప్లై అధికారులు మాత్రం క్రిమినల్ కేసులు పెట్టకపోవడం గమనార్హం.ఇదీ చదవండి: పవన్‌కు చంద్రబాబుతోనే పోటీ! -
తనిఖీలు చేయకుండానే వెళ్లిపోయిన 'పున్నీ' షిప్
-
మంత్రి గారి బంధువు చెప్పారు.. వదిలేయండి
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఆ ఓడ మనోళ్లదే.. వదిలేయండి. బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ బియ్యం ఎందుకు కలుస్తాయి? తనిఖీలు చేసి నిర్ధారించాల్సింది ఏముంటుంది? ఓడ పోర్టులో నిలిచిపోయి చాలా రోజులైంది. తక్షణం ఎగుమతికి అనుమతిచ్చి ఓడను వదిలేయండి’ అంటూ మూడు వారాలుగా కాకినాడ పోర్టులో నిలిపివేసిన నౌకకు కూటమి నేతలు ఆఘమేఘాలపై అనుమతిచ్చేశారు. మంత్రిగారి బంధువుకు చెందిన ఎక్స్‌పోర్టు కంపెనీ తరలిస్తున్న బియ్యం ఇందులో ఉందని, అందువల్లే బ్రోకెన్ రైస్ కాబట్టి అందులో పీడీఎస్ బియ్యం కలవలేదని ఎలా నిర్ధారిస్తారన్న మిగతా ఎగుమతిదారుల ప్రశ్నలకు సమాధానం రాకుండానే ఆ నౌక విదేశాలకు తరలిపోయిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో చక్రం తిప్పిన మంత్రిమరోపక్క మంత్రి బంధువుల కన్సైన్మెంట్లు ఉండటంతో బ్రోకెన్ రైస్ అంటూ కాకినాడ నుంచే పున్నీ నౌకను పంపించేశారు. ఆఫ్రికా ఖండంలోని డక్కర్ దేశానికి కాకినాడ పోర్టు నుంచి 40 వేల మెట్రిక్ టన్నుల బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఇటీవల కేంద్రం అనుమతించింది. ఈ ఎగుమతి హక్కులను పట్టాభి ఆగ్రోస్, కేఎన్ రిసోర్సెస్, మురళీమోహన్, సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకున్నాయి. డక్కర్‌కు బ్రోకెన్ రైస్ ఎగుమతి కోసం ఎంవీక్యూ పున్నీ నౌక గత నెల 28న కాకినాడ వచ్చింది. అదే సమయానికి కాకినాడ పోర్టులో ఉన్న స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో పీడీఎస్ బియ్యంపై రాద్ధాంతం మొదలైంది. ఈ నౌకను పోర్టులో నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పున్నీ నౌకను కూడా పోర్టులో మూడు వారాలుగా నిలిపివేశారు. ఈ నౌకను పంపించేయడానికి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కాకినాడ పోర్టు ద్వారా బియ్యం ఎగుమతుల్లో కీలకంగా ఉన్న ఒక ఎక్స్‌పోర్టర్ నేషనల్ కో–ఆపరేటివ్ ఎక్స్‌పోర్టు లిమిటెడ్ ద్వారా లాబీయింగ్ చేశారని సమాచారం. ఇందుకోసం ఆయన తన బంధువైన రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కేబినెట్ మంత్రి ద్వారా కేంద్రంలో చక్రం తిప్పినట్లు సమాచారం. సహజంగా రా రైస్ లేదా బ్రోకెన్ రైస్‌లో పోర్టిఫైడ్ రైస్‌లోని కేర్నల్స్ (పేదలకు పంపిణీ చేసే బియ్యంలో పౌష్టికాహారం కలిపే ప్రక్రియ) ఒక శాతం అనుమతిస్తారు. అంతకు మించి ఉంటే 6ఏ కేసు అవుతుంది. డక్కర్ దేశానికి ఎగుమతికి సిద్ధం చేసిన బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ కలిసి ఉండవచ్చుననే అనుమానంతో ఇన్ని రోజులూ నిలిపివేశారు. అయినా నౌకలో తనిఖీలు లేకుండా అనుమతివ్వడం పలు సందేహాలకు తావిస్తోంది. పైగా, స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో గుర్తించిన పీడీఎస్ బియ్యం మొత్తం సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్ట్సు ప్రైవేట్ లిమిటెడ్దేనని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ స్వయంగా ప్రకటించారు. పున్నీ నౌకలో బ్రోకెన్ రైస్ ఎగుమతికి ఆర్డర్ పొందిన నాలుగు సంస్థలో సత్యం బాలాజీ రైస్ ఎక్స్‌పోర్ట్సు కూడా ఉంది. అటువంటప్పుడు బ్రోకెన్ రైస్‌లో పీడీఎస్ కలవలేదని ఎలా నిర్థారిస్తారని, కనీసం శాంపిళ్లు తీయకుండా, కెమికల్ టెస్ట్ చేయకుండా ఎగుమతికి ఎలా అనుమతిస్తారని ఎక్స్‌పోర్టర్లు ప్రశ్నిస్తున్నారు.కాకినాడ పోర్టుపై నానాయాగీకూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి సీఎం చంద్రబాబు డైరెక్షన్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ పీడీఎస్ బియ్యం విదేశాలకు తరలిపోతోందంటూ కాకినాడ పోర్టులో యాగీ ప్రారంభించారు. రేషన్ బియ్యాన్ని ఇక్కడి నుంచి నుంచి విదేశాలకు తరలించేసి కోట్లు కొల్లగొట్టేశారని గత ప్రభుత్వంపై విషం చిమ్మారు. ఆఫ్రికా ఖండానికి స్టెల్లా ఎల్–1 పనామా నౌకలో పీడీఎస్ బియ్యం ఉన్నాయని, సినిమా స్టైల్లో ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ పెద్ద బిల్డప్పే ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి నాదెండ్ల విశాఖ పోర్టుకు వెళ్లి, అక్కడ కూడా పీడీఎస్ బియ్యం తరలిపోతోందంటూ హడావుడి చేశారు. అయితే, ఆ బియ్యం టీడీపీ నేతల అనుచరులదేనని తెలియడంతో మారు మాట్లాడలేదు. -
Seize The Ship డైలాగ్ మాత్రమే.. సినిమా టైటిల్ వేరు.. రోజుకో డ్రామాతో బాబు, పవన్
-
సీజ్ ద పోర్ట్
ఎన్నికల హామీలను అమలు చేయడం మాట దేవుడెరుగు. ప్రజల దైనందిన సమస్యలను కూడా పెడచెవిన పెడుతున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చూస్తున్నాము. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని రాశులు పోసుకున్న రైతుల కళ్లల్లో దైన్యాన్ని చూస్తున్నాము. మద్దతు ధర లభించక దారుణంగా నష్టపోతున్న రైతన్నల దుఃస్థితి ప్రతి గ్రామానా కనిపిస్తున్నది. ప్రభుత్వం మాత్రం రైతును దగా చేస్తున్న దళారుల కళ్లల్లో ఆనందాన్ని చూస్తున్నట్టున్నది. రైతు సేవా కేంద్రాలు ఆచరణలో దళారీ సేవా కేంద్రాలుగా మారాయని రైతులు విమర్శిస్తున్నారు.నిబంధనలకు తిలోదకాలిచ్చి తేమ శాతాన్ని అధికంగా చూపెట్టి బస్తాకు 400 నుంచి 500 రూపాయల వరకు దళారులు లాగేస్తున్నారని సమాచారం. రైతుకు లభించవలసిన మద్దతు ధరలో టన్నుకు కనీసం 6 వేల రూపాయల చొప్పున దళారులు మింగేస్తున్నారని రైతు సంఘాల నేతలు చెబుతున్నారు. ఈ సంవత్సరం 37 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రభుత్వం జీవో ఇచ్చింది. రైతులు పండించిన మొత్తం ధాన్యం 84 లక్షల టన్నులని అంచనా.ప్రభుత్వం చెప్పుకున్న లక్ష్యం ప్రకారం 37 లక్షల టన్నుల లెక్కనే తీసుకుందాం. టన్నుకు ఆరువేల చొప్పున ఈ మొత్తం ధాన్యంలో దళారీల దోపిడీ విలువెంత? 2,200 కోట్లు! రైతు సేవా కేంద్రాల్లోనే తిష్ఠవేసిన గాదె కింది పందికొక్కులు అప్పనంగా 2,200 కోట్ల రూపాయల రైతుల శ్రమ ఫలాన్ని లాక్కుంటూ ఉంటే మన సర్కార్ వారు ఏం చేస్తున్నారో తెలుసా?ఉపముఖ్యమంత్రి, మరో మంత్రి కలిసి రేషన్ బియ్యం అక్రమ రవాణా దొంగలను పట్టుకుంటామంటూ సముద్రంలోకి వెళ్లి ‘సీజ్ ద షిప్’ అని గర్జిస్తున్నారు. ఇంతకూ ఆ మంత్రివర్యులు సీజ్ చేయమన్న షిప్పులో ఏమున్నది? 38 వేల మెట్రిక్ టన్నుల బియ్యం లోడ్‌చేసి ఉన్నాయట! అందులో మన రేషన్ బియ్యం మాత్రం 640 టన్నులేనని తెలుస్తున్నది.ఈ రేషన్ బియ్యాన్ని సేకరించి ఎగుమతి చేయడానికి కిలోకు 40 రూపాయలు పడుతుందని ఓ లెక్క. టన్నుకు 40 వేలు. ‘సీజ్ ద షిప్’లో ఉన్న 640 టన్నుల విలువ దాదాపుగా రెండున్నర కోట్లు! పెద్ద లెక్కే. ఆ ఓడతోపాటు మరో ఓడలో ఇండోనీషియాకు పెద్ద ఎత్తున రేషన్ బియ్యాన్ని మరో మంత్రిగారి వియ్యంకుడు తరలించారనీ, దాని జోలికి మాత్రం మన డిప్యూటీ వెళ్లలేదని వైసీపీ వాళ్లు విమర్శిస్తున్నారు. ప్రజాపంపిణీ కోసం ఉద్దేశించిన రేషన్ బియ్యం అక్రమ మార్గం పడితే అరికట్టవలసినదే! అభ్యంతరం లేదు. అందుకు మన వ్యవస్థలను సక్రమంగా వినియోగించుకుంటే సరిపోతుంది. ఇంత పెద్ద ఛేజింగ్ సినిమా అవసరం లేదు. ఒకపక్క రైతుల జేబులు కొట్టి వేల కోట్లు లాగేసుకునే పనిలో ఉన్న దళారులను పట్టించుకోని ప్రభుత్వం కాకినాడ రేవుకాడ ఈ డ్రామా వేయడం వెనుక మరేదో మతలబు ఉందనిపించడం లేదా? నిజంగానే చాలా మతలబు ఉన్నది. కాకినాడ రేవు ఇతివృత్తంతో చాలా సన్నివేశాలను వరసగా నడిపించారు. ‘సీజ్ ద షిప్’ ఓ డైలాగ్ మాత్రమే! సినిమా టైటిల్ ‘సీజ్ ద పోర్ట్’ కావచ్చు!!నవంబర్ మొదటి వారంలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన వియ్యంకుడి ఇంట్లో ఫంక్షన్ కోసం పెద్దాపురం వెళ్లారు. ఆ వెంటనే ఓ మంత్రిగారు కాకినాడ పోర్టుకు వెళ్లారనీ, అక్కడ పోర్టు అధినేత కేవీ రావునూ, సీఈఓ మురళీధరన్నూ కలిసి వచ్చారనీ విశ్వసనీయ సమాచారం. అయితే ఈ వివరాలను గోప్యంగా ఉంచారు. నవంబర్ 27న కాకినాడ జిల్లా కలెక్టర్ యాంకరేజి పోర్టులో లోడింగ్ జరుగుతున్న నౌకను తనిఖీ చేశారు. అందులో లోడ్ చేసిన బియ్యంతో 640 టన్నుల పీడీఎస్ బియ్యం కూడా ఉన్నట్టు గుర్తించారు.మరో రెండు రోజులకే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌లు ఢిల్లీ నుంచి వచ్చీరావడంతోనే కాకినాడ పోర్టుకు వెళ్లారు. ‘సీజ్ ద షిప్’ సన్నివేశాన్ని రక్తి కట్టించారు. ఈ పోర్టు ఎవరిది, ఇక్కడ అధికారులెవరంటూ పవన్ ప్రశ్నించారు. వాస్తవానికి బియ్యం ఎగుమతి జరుగుతున్న యాంకరేజీ పోర్టు నూటికి నూరుపాళ్లు ప్రభుత్వానిదే! పోర్టు ప్రభుత్వానిదే, రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల అధికారులపై పెత్తనం ప్రభుత్వానిదే!మరి పౌర సరఫరా బియ్యం అక్రమ రవాణా జరిగితే బాధ్యులు ఎవరవుతారు? ఈ మౌలికమైన అంశాన్ని ఉప ముఖ్యమంత్రి పక్కనబెట్టి హడావిడి చేశారు. ఆయన సహచరుడు నాదెండ్ల మనోహర్ మరో అడుగు ముందుకువేసి కాకినాడ పోర్టు యాజమాన్యంలో 41 శాతాన్ని బలవంతంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు లాగేసుకుని ‘అరబిందో’కు కట్టబెట్టారని ఆరోపించారు.ఇక్కడ అసలు కథ ప్రారంభమైంది. బియ్యం ఎగుమతులు జరుగుతున్న యాంకరేజి పోర్టు వేరు. అరబిందో కంపెనీ వాటాలు కొనుక్కున్న డీప్ వాటర్ పోర్టు వేరు. కాకినాడ పోర్టు అనే పేరుతో ఈ రెండు పోర్టుల మధ్య తేడా తెలియకుండా గందరగోళ పరచడం ఉద్దేశపూర్వకమే. ఎందుకంటే ‘కాకినాడ సీపోర్ట్స్’ పేరుతో ఉన్న డీప్ వాటర్ పోర్టులో అరబిందో కంపెనీ వాటాలు కొనుగోలు చేసినప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఉన్నారు. డీప్ వాటర్ పోర్టు వాటాల కొనుగోలుకూ, యాంకరేజీ పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతి వార్తలకూ లంకె బిగించే వ్యూహం కావచ్చు. చేతిలో మీడియా ఉన్నది కదా!నాదెండ్ల మనోహర్ కథను ప్రారంభించిన మరుసటి రోజే కేవీ రావు అనే సదరు పోర్టు యజమాని వైసీపీకి చెందిన ముఖ్యులపై ఫిర్యాదు చేయడం, ఆ కేసును సీఐడీ చేపట్టడం చకచకా జరిగిపోయాయి. అరబిందో అనేది సుమారు పది బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన ఒక మల్టీనేషనల్ కంపెనీ, ప్రతిష్ఠాత్మక సంస్థ. కాకినాడ సీపోర్ట్స్లో 495 కోట్ల రూపాయలు చెల్లించి 41 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఒకవేళ ప్రభుత్వంలోని ప్రముఖుల్ని ఉపయోగించుకొని బెదిరించి ఉంటే అంత సొమ్ము ఎందుకు చెల్లించాలనేది మొదటి కామన్సెన్స్ ప్రశ్న. ఇంకో పది శాతం రాయించుకుంటే పోర్టు మీద పెత్తనం వారికే వచ్చేది కదా! ఎందుకని వదిలేశారన్నది రెండో కామన్సెన్స్ ప్రశ్న! భయంతో గజగజ వణికిపోయి వాటాలు రాసిచ్చేసిన వ్యక్తే ఇంకా ఆ పోర్టుకు అధిపతిగా, ఆయన నియమించుకున్న మనిషే సీఈవోగా ఎలా కొనసాగుతున్నారనేది ఇంగితజ్ఞానం వేసే ఇంకో ప్రశ్న. ఒక సాధారణ రైస్ మిల్లు యజమాని స్థాయి నుంచి ఎకాయెకిన ఓడరేవు యజమానిగా ఎదగగలిగిన నేర్పరి కేవీ రావు. అటువంటి వ్యక్తి ఓ యువకుడు వచ్చి బెదిరించగానే ఆస్తులు రాసిచ్చేటంతటి అర్భకుడని ఎవరు నమ్మగలుగుతారు? ఒకవేళ అటువంటి బెదిరింపులు ఎదురైవుంటే కేసు పెట్టలేనంత అమాయకుడేం కాదు కదా! సెబీకో, ఎన్సీఎల్టీకో ఫిర్యాదు చేయాలని కూడా తెలియని వ్యక్తి కాదుగదా? కనీసం యెల్లో మీడియా చెవిలో ఊదాలనీ, తనను పోర్టు యజమానిని చేసిన చంద్రబాబుకు చెప్పుకోవాలని కూడా తోచలేదా? ఆ పని చేసివుంటే వాళ్లు అప్పుడే ఒక బడబానలాన్ని సృష్టించి ఉండేవారు కాదా? వాటాలను అమ్మేసిన ఐదేళ్ల తర్వాత మంత్రులు పెట్టిన ముహూర్తానికే కేవీ రావు నిద్ర లేవడం వెనకనున్న రహస్యం గురించి విజ్ఞులైన ప్రజలు అర్థం చేసుకోలేరా?వైసీపీలోని ప్రముఖులను ఏదోరకంగా కేసుల్లో ఇరికించాలి. కాకినాడ సీపోర్టును మళ్లీ కాజెయ్యాలి, జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత ప్రతిష్ఠకు ఇంకొంచెం మసి పూయాలి. ఇదే కదా వ్యూహం? అధికారంలోకి వచ్చి ఆరునెలలు గడుస్తున్నా ప్రభుత్వం వారి ఏకసూత్ర కార్యక్రమంగా ఈ వ్యూహం మారిపోయింది. అసలు కాకినాడ సీపోర్టు కూడా ప్రభుత్వానిదే! ఆసియా అభివృద్ధి బ్యాంకు నుంచి రుణం తెచ్చి మరీ నిర్మించారు. దీన్ని అప్పనంగా పప్పుబెల్లాలకు కేవీ రావుకు కట్టబెట్టింది చంద్రబాబే! పోర్టు పరిసర ప్రాంతాల్లోని భూములను కూడా దేశంలో ఎక్కడా లేనంత కారుచౌకగా ఆయనకు కట్టబెట్టారు. కేవీ రావు మీద ఎందుకింతటి అవ్యాజమైన ప్రేమ? రైస్ మిల్ యజమాని హఠాత్తుగా పోర్టు యజమాని ఎలా అయ్యారు? ఆయన చట్టబద్ధంగా అమ్మేసుకున్న వాటాలను మళ్లీ కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఇంతకూ కేవీ రావు పోర్టు సొంతదారేనా లేక ఎవరికైనా బినామీగా ఉన్నారా? అనే అనుమానాలు కూడా జనంలో ఉన్నాయి. ‘సీజ్ ద పోర్ట్’ సినిమా పూర్తయితే తప్ప యథార్థాలు బయటకు రావేమో!పోర్టుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన కాకినాడ సెజ్ భూములపై కూడా యెల్లో మీడియా పచ్చి అసత్యాలను ప్రచారం చేస్తున్నది. పరిశ్రమలు ప్రారంభించకుండా వదిలేసిన కారణంగా తమ భూములను తమకిచ్చేయాలని దీర్ఘకాలంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆ రైతులను అరెస్టు చేసి సెంట్రల్ జైల్లో నిర్బంధించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కోర్కెను గౌరవించి 2180 ఎకరాల భూములను తిరిగి ఇచ్చేశారు. భారతదేశ చరిత్రలో సేకరించిన భూములను తిరిగి రైతులపరం చేసిన ఏకైక సందర్భం ఇది. వాస్తవాలు ఇలా ఉంటే సెజ్ భూముల్లో జగన్ హయాంలో గోల్మాల్ జరిగిందని యెల్లో మీడియా కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. ఈ వైఖరిని ఆ ప్రాంత రైతు ప్రతినిధులు శనివారం నాడు సమావేశమై మీడియా సమక్షంలో నిర్ద్వంద్వంగా ఖండించారు. కాకినాడ సెజ్ భాగోతాన్ని 2003లో బాబే ప్రారంభించారు. లాభాల్లో ఉన్న పోర్టును 1999లో ఆయనే కేవీ రావుకు కట్టబెట్టారు. ఆ రోజుల నుంచి విచారణ జరిగితే తప్ప దొరలెవరో, దొంగలెవరో వెల్లడి కాదని విజ్ఞుల అభిప్రాయం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
భూములను తిరిగి వెనక్కి ఇవ్వడం తప్పా: Kanna Babu
-
బాబు స్క్రిప్ట్.. పవన్ నటించిన పోర్ట్ లో అక్రమ వ్యాపారం..
-
సీమ రాజాను వదిలే ప్రసక్తే లేదు: Ambati Rambabu
-
చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది
-
దొడ్డిదారిన కేవీరావుకు కట్టబెట్టి.. ఎందుకీ డ్రామాలు?: అంబటి
సాక్షి, తాడేపల్లి: కాకినాడ సీపోర్టుపై చంద్రబాబు తన అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని.. ఏదో జరిగిపోయిందంటూ కట్టు కథలు రాయిస్తున్నారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి రావడం కోసం అనేక వాగ్ధానాలు ఇచ్చారని.. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు.‘‘చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అబద్ధాలతో ప్రజలను నమ్మించాలని ప్రయత్నిస్తునారు. ఈనాడు మోసపూరిత పత్రిక. తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి ఫైనాన్స్‌పై కేసు నడుస్తోంది. చంద్రబాబు బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేస్తున్నారు. వైఎస్ జగన్‌కు సన్నిహితంగా ఉన్నవాళ్లపై కక్ష సాధిస్తున్నారు.’’ అని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.‘‘పవన్ కల్యాణ్ పీడీఎస్ రైస్ పట్టుకుంటానన్నారు.. ఎందుకు పట్టుకోలేదు. పవన్‌ను చంద్రబాబు వాడుకుంటున్నారు. 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు బినామీ కేవీరావు అని పవన్ మాట్లాడారు. చెప్పింది చేయడం బాబుకు అలవాటు లేదు. బెల్టు షాపు తెస్తే బెల్టు తీస్తానన్నాడు.. గాలికొదిలేశాడు. ఏపీలో దోపిడీ రాజ్యం నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దోపిడీ చేయడమే పనిగా పెట్టుకున్నారు. కేవీరావును అడ్డుగా పెట్టుకుని దోపిడీ చేస్తున్నారు. దొడ్డిదారిన కేవీరావుకు పోర్టును కట్టబెట్టింది నిజం కాదా?. ఇప్పుడు కేవీరావును అడ్డంపెట్టుకుని డ్రామాలాడుతున్నారు.’’ అంటూ అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు..రైతాంగ సమస్యలపై కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనెల 11నుంచి 13కి వాయిదా వేశాం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాం. తిరుమల లడ్డూ విషయంలో రద్దాంతం చేసి టీడీపీ అభాసుపాలయింది. ఇప్పుడు కాకినాడ సెజ్ మీద పడ్డారు. వైవీ సుబ్బారెడ్డి కుమారుడు బెదిరించి పోర్టుని లాక్కున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పచ్చమీడియాలో ఇష్టం వచ్చినట్లు రాయించుకుంటున్నారు..కేవీరావు గొంతు మీద కత్తి పెట్టి పోర్టును రాయించుకున్నట్టు ఈనాడు కట్టు కథలు రాసింది. ఈనాడు పత్రిక మోసపూరితంగా పుట్టింది. అవినీతి పుత్రిక ఈనాడు. అలాంటి పత్రికలో సాయిరెడ్డి మీద దారుణమైన వార్తలు రాస్తున్నారు. చంద్రబాబుకు ఆస్తుల సంపాదనపై దాహం తీరలేదు. అందుకే ఇతరుల ఆస్తులను కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు చక్కగా వాడుకుంటున్నారు. గతంలో కేవీరావు గురించి పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ సీజ్ ద షిప్ అంటూ కామెడీ డైలాగు వేశారుచంద్రబాబు తన అధికారంతోపాటు వేలాది కోట్లను లోకేష్ కి అందించాలని చూస్తున్నారు. ఏపీలో అవినీతికి పాల్పడని టీడీపీ ఎమ్మెల్యేనే లేడు. ప్రతిపనిలోనూ అడ్డంగా దోచుకుంటున్నారు. కానీ చంద్రబాబు మాత్రం మీడియా ముందు భీకర మాటలు మాట్లాడుతున్నారు. అవినీతి జరిగితే సహించనంటూ బడాయి మాటలు మాట్లాడుతున్నారు. కానీ జరిగేదంతా అవినీతి, దోపిడీలే. పయ్యావులకేశవ్ వియ్యంకుడు కాకినాడ పోర్టులో రారైస్ బిజినెస్ చేస్తున్నారు. ఆ విషయాన్ని నిరూపించటానికి మేము సిద్ధం. ఆయన చేసే దోపిడీని కప్పిపుచ్చేందుకు పయ్యావుల కేశవ్ ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆయనకు చెందిన షిప్‌ని సైలెంట్‌గా వదిలేశారు..కాకినాడ పీర్టులో అరబిందో షేర్లు చట్టబద్దమైనవి. కానీ పోలీసులతో అక్రమ కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నారు. గంజాయి మీద ఈగల్ దర్యాప్తు, బియ్యం మీద, తిరుపతి లడ్డూల మీద సిట్లు అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. అంతకుమించి రాష్ట్రంలో ప్రజాపాలనే జరగటం లేదు. లోకేష్ డబ్బులు లెక్కలేసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మీడియా ముందు హడావుడి చేస్తున్నారు. పోలీసులతో ప్రభుత్వాన్ని నడపటం కలకాలం జరగదు’’ అని అంబటి రాంబాబు నిలదీశారు. -
AP: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్
సాక్షి, విజయవాడ: బియ్యం అక్రమ రవాణా కేసుల విచారణకు సిట్ ఏర్పాటైంది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో ఏపీ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అయితే, ‘సీజ్ ది షిప్’ ఎపిసోడ్‌పై విచారణను మాత్రం సిట్‌కి అప్పగించలేదు. గత నెల, ఈ నెలలో జరిగిన బియ్యం అక్రమ రవాణా అంశాలను సిట్ పరిధికి ప్రభుత్వం అప్పగించలేదు.స్టెల్లా, కెన్ స్టార్ షిప్‌లలో బియ్యం రవాణా అంశాన్ని సిట్‌కి అప్పగించని ప్రభుత్వం.. జూన్, జులైలో నమోదైన రేషన్ బియ్యం రవాణా కేసుల విచారణను మాత్రమే సిట్‌కి అప్పగించింది. 13 ఎఫ్ఐఆర్లు నమోదైన కేసులు సిట్‌కి అప్పగించింది. సిట్ జీవోలో ఎక్కడా కూడా సీజ్ ది షిప్ ఎపిసోడ్ ప్రస్తావన లేదు.ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు -
ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు
పవన్ కళ్యాణ్‌ను సరిగా వాడుకోవడం ద్వారా కాకినాడ పోర్టును సైతం కబ్జా చేయొచ్చని నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు ఆ దిశగా చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నారు. నౌకలో బియ్యం విదేశాలకు ఎగుమతి అయిపోతున్నాయి... నేను కనిపెట్టేశాను.. సీజ్ ది షిప్ అంటూ రీల్స్ చేసి సెల్ఫ్ ఎలివేషన్ ఇచ్చుకున్న పవన్ కళ్యాణ్ ఆ ఎపిసోడ్ వెనుక చంద్రబాబు నడిపిస్తున్న కథకు ఇరుసుగా మారారు.ఎన్నికల హామీల అమలులో వైఫల్యం... కూటమి నేతల అరాచకాలపై ప్రజల్లో వ్యతిరేకత వెల్లువెత్తుతున్న తరుణంలో ఆ అంశాన్ని డైవర్ట్ చేసేందుకు నెలకో అంశాన్ని తీస్తున్న చంద్రబాబు ఇప్పుడు తాజాగా ఈ కాకినాడ పోర్టు అంశాన్ని అందుకున్నారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను లాక్కునేందుకు చంద్రబాబు పన్నిన కుట్రలో భాగంగానే కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు.అంతా చంద్రబాబు ప్లాన్ ప్రకారమేఅందులో భాగంగానే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. అనంతరం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్దకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రికార్డ్ చేస్తూ డ్రామా పండించారు. పౌరసరఫరాల శాఖ, పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తమ నాటకాన్ని టీడీపీ కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేసేందుకు యత్నించారు. వాస్తవానికి కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాల్సిన పవన్ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై ఆరోపణలు చేస్తున్నారు. అరబిందో సంస్థ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటి నుంచే బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని దుష్ప్రచారం చేశారు.చట్టబద్ధంగా కొనుగోలు చేసిన అరబిందోఇందులో భాగంగా చంద్రబాబు తన సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్‌పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు చేయించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన ఆరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన ఇప్పుడు ఫిర్యాదు చేసారు. ఆ వెంటనే సీఐడీ కేసు కూడా నమోదు చేసేసింది.వాస్తవానికి కేవీ రావు 2020లో పోర్టులో తన 41 శాతం వాటాలను అరబిందో సంస్థకు రూ. 494 కోట్లకు అమ్ముకున్నారు. అప్పట్లో ఆ అమ్మకం తనకు ఇష్టం లేనిపక్షంలో ఆనాడే అయన దాన్ని వ్యతిరేకించి అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్స్ ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికీ ఫిర్యాదు చేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రాగానే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో అరబిందో సంస్థ వాటాలను అక్రమంగా కొల్లగొట్టేందుకు కేవీ రావు మళ్ళీ స్క్రీన్ మీదకు వచ్చారన్నది తెలుస్తోంది.అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అరబిందో సంస్థ కెవిరావు నుంచి 41 శాతం వాటాలను కొనుగోలు చేసాక పోర్ట్‌ను ఆనుకుని ఉన్న జీఎంఆర్ సెజ్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్‌లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. దాంతో ఆ సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే మేలని భావించిన అరబిందో సంస్థ భవిష్యత్‌లో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా ఉన్న అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన (రైట్ టు ఫస్ట్ రెఫ్యూజల్) ఒప్పందంలో ప్రధానాంశం. దాంతో రెండు పోర్టులను నిర్వహించవచ్చన్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగానే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అరబిందో సంస్థ వాటాలు కొనుగోలు చేసింది.పోర్టును కారుచౌకగా అమ్మేసింది చంద్రబాబేవాస్తవానికి 1999లో అధికారంలో ఉన్న చంద్రబాబు రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా తన సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టారు. నిజం సుగర్స్ వంటి సంస్థలను అమ్మేసింది చంద్రబాబేనన్నది అందరికి తెలిసిందే. అదే క్రమంలో లాభాల్లో ఉన్న ఆ పోర్టును సైతం కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్ పోర్టును కారు చౌకగా చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావుకు కట్టబెట్టేశారు. అదే కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా మరోసారి కుట్రకు చంద్రబాబు తెర తీశారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు ప్రస్తుతం తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.-సిమ్మాదిరప్పన్న -
భేతాళ కథ.. అంతా బాబు కుట్ర!
-
పవన్ మరో కొత్త డైవర్షన్ డ్రామా
-
Big Question: డిసెంబర్ డైవర్షన్.. కాకినాడ పోర్టును అక్రమాలకు అడ్డాగా మార్చిందెవరు ?
-
భేతాళ కథ.. అంతా బాబు కుట్ర!
ముఖ్యమంత్రి చంద్రబాబు అసలు కుట్ర బట్టబయలైంది! తన పార్ట్నర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో కాకినాడలో చేయించిన బియ్యం హైడ్రామా వెనుక పన్నాగం బయటపడింది. ‘సీజ్ ద షిప్’ అంటూ పవన్ కళ్యాణ్, నాదెండ్ల ద్వయం చేసిన రాజకీయ రాద్ధాంతం అంతా చంద్రబాబు కుట్ర సినిమా టీజర్ అన్నది స్పష్టమైంది. సీఐడీ అక్రమ కేసులతో బెదిరించి కాకినాడ డీప్ వాటర్పోర్ట్లో వాటాలను కొల్లగొట్టాలన్నదే అసలు కుట్ర అన్నది నిగ్గు తేలింది. భారీ ఆర్థిక దోపిడీ ధ్యేయంగా చంద్రబాబు అల్లిన భేతాళ కథ వెనుక కుట్ర బట్టబయలైంది. పవన్, నాదెండ్ల ద్వారా వీధి నాటకం... అనంతరం తనకు అత్యంత సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు ...సీఐడీ అక్రమ కేసు నమోదు ...ఇలా చంద్రబాబు పక్కా పన్నాగంతో పావులు కదిపారన్నది స్పష్టమైంది. ఎన్నికల హామీల అమలులో వైఫల్యం... టీడీపీ కూటమి పెద్దల దోపిడీతో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు నెలకో డైవర్షన్ కుట్రను తెరపైకి తెస్తున్న చంద్రబాబు పన్నాగంలోని తాజా అంకమే ఈ అక్రమ కేసు. రాష్ట్రంలో ప్రైవేటు ఆస్తులను కొల్లగొట్టడమే ఏకైక అజెండాగా సాగుతున్న పచ్చ నాటకం ఇదిగో ఇలా ఉంది. – సాక్షి, అమరావతిఅంతా బాబు కుట్ర స్క్రిప్టేబియ్యం రాద్ధాంతం డ్రామానేకాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాలను అడ్డగోలుగా హస్తగతం చేసుకునేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు. ఈ క్రమంలో కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. జనసేనలోని తన కోవర్ట్, మంత్రి నాదెండ్ల మనోహర్ కొద్ది నెలలుగా కాకినాడలో పర్యటిస్తూ చంద్రబాబు పన్నాగానికి రంగం సిద్ధం చేశారు. ఇక కుట్రను వేగవంతం చేయాలని నిర్ణయించిన తరువాత చంద్రబాబు ఇందుకు పవన్ కళ్యాణ్‌ను పైలట్‌గా వాడుకున్నారు. ఆయన డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ గత నెల 29న ఢిల్లీ నుంచి హఠాత్తుగా రాజమహేంద్రవరం చేరుకుని కాకినాడలో వాలారు. అనంతరం కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్దకు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారంటూ డ్రోన్ కెమెరాలతో రికార్డ్ చేస్తూ డ్రామా పండించారు. పౌరసరఫరాల శాఖ, పోర్టు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడం ద్వారా తమ నాటకాన్ని టీడీపీ కూటమి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో హడావుడి చేసేందుకు యత్నించారు. అసలు విషయం ఏమిటంటే... బియ్యం ఎగుమతి చేసే యాంకరేజ్ పోర్ట్‌ను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. మరి అక్కడ నుంచి రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి కదా! దీన్ని విస్మరిస్తూ కాకినాడ డీప్ వాటర్ పోర్టుపై పవన్ కల్యాణ్ ఆరోపణలు చేయడం గమనార్హం. అరబిందో సంస్థ కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో మైనారిటీ వాటాలు కొనుగోలు చేసినప్పటి నుంచే బియ్యం స్మగ్లింగ్ జరుగుతోందని దుష్ప్రచారం చేశారు. అనంతరం ఈ నెల 2న (సోమవారం) పవన్ ఉండవల్లిలో చంద్రబాబుతో సమావేశమై తాను డ్రామాను ఎలా పండించిందీ వివరించారు. కేవీరావు తప్పుడు ఫిర్యాదు... వెంటనే సీఐడీ అక్రమ కేసుతమ కుట్ర సీన్ పండిందని భావించిన చంద్రబాబు అసలు పాత్రధారిని తెరపైకి తెచ్చారు. తనకు అత్యంత సన్నిహితుడైన కాకినాడ డీప్ వాటర్‌పోర్ట్ ప్రమోటర్ కేవీ రావుతో ఈ నెల 2న సీఐడీకి ఫిర్యాదు ఇప్పించారు. 2020లో తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో 41శాతం వాటాను అరబిందో సంస్థకు చెందిన ఆరో రియాల్టీ సంస్థ కొనుగోలు చేసిందని ఆయన తాపీగా నాలుగేళ్ల తరువాత ఫిర్యాదు చేయడం చంద్రబాబు పక్కా కుట్రను స్పష్టం చేస్తోంది. విచిత్రం ఏమిటంటే... అదే రోజు సీఐడీ కేసు నమోదు చేసేయడం గమనార్హం. అంతా కట్టు కథ... ఇదీ బాబు కుట్రకేవీ రావు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా కట్టు కథే! పోర్టులో 41 శాతం వాటాలను అరబిందో సంస్థకు కేవీ రావు 2020లో విక్రయించారు. ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలు విక్రయించబట్టే అరబిందో సంస్థ చెల్లించిన ఆ వాటాల విలువ రూ.494 కోట్లను స్వీకరించారు. ఆ మొత్తాన్ని మరో సంస్థలో పెట్టుబడిగా పెట్టారు కూడా. కాకినాడ పోర్ట్‌లో వాటాల విక్రయంపై ఆయనకు ఏమాత్రం అభ్యంతరం ఉన్నా ఆ మొత్తాన్ని తిరస్కరించేవారు.అప్పుడే రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, స్టాక్ ఎక్సŠచ్ంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) తదితర సంస్థలకు ఫిర్యాదు చేసేవారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించేవారు. కానీ కేవీ రావు ఈ నాలుగున్నరేళ్లలో ఎవరికి ఫిర్యాదు చేయలేదు. కేవీ రావుకు అభ్యంతరం ఉంటే వాటాల బదిలీ పూర్తయ్యేలోగా వివిధ దశల్లో ఎప్పుడైనా సరే ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. కానీ ఆయన ఏ దశలోనూ ఫిర్యాదు చేయలేదు. అంటే ఆయన పూర్తి సమ్మతితోనే వాటాలను విక్రయించారన్నది స్పష్టమవుతోంది. ఆ వాటాల విక్రయం కోసం మంతనాలు, అనంతరం ఒప్పందం, విక్రయం అంతా హైదరాబాద్ కేంద్రంగా సాగాయి. మరి తెలంగాణలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో లేదు కదా! హైదరాబాద్‌లో పోలీసులకుగానీ సీఐడీకి గానీ అప్పుడే ఎందుకు ఫిర్యాదు చేయలేదు ? కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో అరబిందో సంస్థ వాటాలను అక్రమంగా కొల్లగొట్టేందుకు చంద్రబాబు కుట్రలో కేవీ రావు పాత్రధారన్నది స్పష్టమవుతోంది. అంతర్జాతీయస్థాయి సంస్థపై దుష్ప్రచారంఅరబిందో సంస్థ 150 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తూ అంతర్జాతీయంగా విశేష గుర్తింపు పొందిన గ్రూప్. ఏటా రూ.72 వేల కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. అరబిందో సంస్థ ఏటా రూ.3 వేల కోట్ల నికర లాభం చూపుతోంది. ఎంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించే అరబిందో సంస్థ పూర్తి స్థాయిలో విశ్లేషించిన అనంతరం సహేతుకంగా, చట్టబద్ధంగానే కొత్త సంస్థల్లో పెట్టుబడి పెడుతుంది. అదే రీతిలో కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో కూడా వ్యూహాత్మక పెట్టుబడిగానే 41 శాతం వాటాలను కొనుగోలు చేసింది. పోర్ట్‌ను ఆనుకుని ఉన్న జీఎంఆర్ సెజ్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. ఆ సెజ్‌లో కొత్త పోర్టును నిర్మిస్తోంది. దాంతో ఆ సెజ్‌ను ఆనుకుని ఉన్న కాకినాడ డీప్ వాటర్ పోర్టులో కూడా తమకు వాటాలు ఉంటే వ్యూహాత్మకంగా ప్రయోజనకరమని అరబిందో సంస్థ భావించింది. భవిష్యత్‌లో కాకినాడ డీప్ వాటర్ పోర్టులోని తన మెజార్టీ వాటాలను ప్రమోటర్ కేవీ రావు విక్రయించాలని భావిస్తే ముందుగా అప్పటికే వాటాదారుగా ఉన్న అరబిందో సంస్థకే అవకాశం ఇవ్వాలి. ఆ నిబంధన (రైట్ టు ఫస్ట్ రెఫ్యూజల్) ఒప్పందంలో ప్రధానాంశం. దాంతో రెండు పోర్టులను నిర్వహించవచ్చన్న వ్యాపార విస్తరణ ప్రణాళికలో భాగంగానే కాకినాడ డీప్ వాటర్ పోర్టులో అరబిందో సంస్థ వాటాలు కొనుగోలు చేసింది. అది పూర్తిగా ఆ సంస్థ వ్యాపార ప్రణాళిక. అరబిందో, కేవీ రావు మధ్య ప్రైవేట్ ఒప్పందం. దాంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వానికిగానీ ఇతరులకుగానీ ఎలాంటి సంబంధం లేదు. ప్రభుత్వ పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది చంద్రబాబే కాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసింది గతంలో చంద్రబాబు ప్రభుత్వమేనన్నది అసలు వాస్తవం. రాష్ట్రంలోని ప్రభుత్వ సంస్థలను కారుచౌకగా తన సన్నిహితులు, బినామీలకు కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబు సొంతం. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ఓ మలేషియా కంపెనీని ముందు పెట్టి కాకినాడ డీప్‌వాటర్ పోర్టును కారు చౌకగా చంద్రబాబు సన్నిహితుడు కేవీ రావుకు కట్టబెట్టేశారు. అదే కేవీ రావుతో తప్పుడు ఫిర్యాదు చేయించడం ద్వారా మరోసారి కుట్రకు చంద్రబాబు తెర తీశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మొదలు పెట్టిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూడా చంద్రబాబు ప్రస్తుతం తన బినామీలకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుండటం గమనార్హం.ప్రైవేటు లావాదేవీలకు వక్రభాష్యం... అదే బాబు ప్రభుత్వ పన్నాగంకాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని భావిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రైవేటు ఆస్తుల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దందా సాగిస్తుండటం విభ్రాంతికరం. రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తలదూరుస్తుండటం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతకుముందు జరిగిన ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. ఎందుకంటే పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది? పోర్టు విలువపైఅవాస్తవ ప్రచారం కాకినాడ పోర్టు వాటాలను తక్కువగా విలువ కట్టారన్న కేవీ రావు ఫిర్యాదులో నిజం లేదు. వాటాల విక్రయం కోసం దాదాపు ఐదేళ్ల క్రితం అరబిందో సంస్థతో ఆయన ఒప్పందం చేసుకున్నారు. అప్పటి మార్కెట్ విలువ వేరు. ప్రస్తుతం ఐదేళ్ల తరువాత మార్కెట్ విలువ వేరు. ఆ రెండూ ఒకటే అన్నట్టుగా ఫిర్యాదులో పేర్కొనడం ప్రజల్ని తప్పుదోవ పట్టించడమే. మరి అదే విధానమైతే... ఈనాడు రామోజీరావు కుటుంబం ఫిల్మ్ సిటీ కోసం 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివార్లలో దాదాపు 2 వేల ఎకరాలు కారుచౌకగా కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆ భూముల విలువ పెరిగింది కాబట్టి... ఆనాడు భూములు అమ్మిన రైతులు వచ్చి ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేస్తారా? ఆ భూములను తిరిగి రైతులకు ఇచ్చేస్తారా? మరి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి కేవీ రావు, అరబిందో సంస్థ మధ్య జరిగిన ప్రైవేటు లావాదేవీని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం విష ప్రచారం చేస్తుండటం రాజకీయ కుట్రే.బెదిరించి ఉంటే ఫ్రీగానే తీసుకునేవారు కదా..!ఏకంగా 51 శాతం వాటా దక్కించుకునేవారు తనను బెదిరించి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో వాటాలను అరబిందో సంస్థ కొనుగోలు చేసిందని కేవీ రావు చేసిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేరిట నిజంగా బెదిరించి ఉంటే అరబిందో సంస్థ వాటాలను ఎందుకు కొనుగోలు చేస్తుంది? ఫ్రీగానే వాటాలను తీసేసుకునేది.ఒకవేళ బెదిరించి కొనుగోలు చేయాలన్నా కేవలం 41 శాతం వాటానే ఎందుకు కొనుగోలు చేస్తుంది ? కనీసం 51 శాతం వాటాను కొనుగోలు చేస్తుంది కదా! 41 శాతం వాటా అంటే పోర్టులో మైనారిటీ భాగస్వామే అవుతుంది. అంటే నిర్ణయాధికారం ఉండదు. కనీసం 51 శాతం వాటా ఉంటేనే నిర్ణయాధికారం ఉంటుంది. కానీ కేవీ రావుకే 59 శాతం వాటా ఉంది. అంటే పోర్టుపై నిర్ణయాధికారం ఇప్పటికీ కేవీరావుకే ఉంది. అందుకే ఆయనే కాకినాడ డీప్ వాటర్ పోర్ట్ ఎండీగా కొనసాగుతున్నారు. సీఈవో, ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్నారు. -
కాకినాడ పోర్టులో ‘పట్టాభి’ బియ్యం లారీలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా స్టెల్లా–ఎల్ నౌకను తనిఖీ చేసి రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందంటూ హడావుడి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడే సముద్ర జలాల్లో ఉన్న కెన్‌స్టార్ నౌకను కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక అసలు నిజాలు బయటకు వస్తున్నాయి. కెన్‌స్టార్ నౌకలో బియ్యాన్ని ఎగుమతి చేస్తున్న కంపెనీ స్వయంగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిది కావడమే దీనికి కారణం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పట్టాభి ఆగ్రో ఫుడ్స్ అధినేత కేవీ కృష్ణారావు బియ్యాన్ని కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఆర్థిక మంత్రి పయ్యావుల తన వియ్యంకుడు కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే ఎగుమతి చేస్తున్నాడని, ముడి బియ్యం ఎగుమతి చేయడంలేదని మంగళవారం చెప్పారు. మూడు తరాలుగా ఈ వ్యాపారంలో ఉన్న తన వియ్యంకుడు అసలు ఇప్పుడు ఇక్కడ వ్యాపారం చేయడం లేదన్నారు. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే వ్యాపారం చేస్తున్నారని చెప్పారు. అయితే తన వియ్యంకుడి సంస్థ గురించి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పిన మాటలన్నీ ‘పచి్చ’ అబద్ధాలని తాజాగా తేలిపోయింది. పోర్టులో పట్టాభి బియ్యం లారీలు.. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి కార్యకలాపాలను బుధవారం పరిశీలించగా మంత్రి పయ్యావుల మాటలు పచ్చి బూటకమని తేలిపోయింది. పట్టాభి ఆగ్రోఫుడ్స్ లిమిటెడ్ పేరుతోనే ఆ లారీలు రా రైస్‌ను పోర్టులో దిగుమతి చేస్తున్నాయి. ఓమ్ సాయి–2 ఏపీ ఏవీ కే 0024 బార్జ్‌లో పట్టాభి ఆగ్రోఫుడ్స్ పచ్చి బియ్యాన్ని ‘బిరస్ బుల్లోగ్’ ప్యాకింగ్‌తో పోర్టులో ఉన్న ఎంవీడీడీఎస్ మెరీనా అనే నౌకకు తరలిస్తున్నారు. 12 వేల మెట్రిక్ టన్నుల పచ్చి బియ్యాన్ని ఇండోనేషియాకు ఎగుమతి చేసేందుకు పట్టాభి ఆగ్రోఫుడ్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతుల్లో మంత్రి పయ్యావుల వియ్యంకుడి సంస్థ పట్టాభి ఆగ్రో ప్రైవేటు లిమిటెడ్ చురుగ్గా వ్యవహరిస్తోంది. వాస్తవాలు ఇలా ఉండగా మంత్రి పయ్యావుల తన వియ్యంకుడికి వత్తాసు పలుకుతూ పచ్చి అబద్ధాలు వల్లించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పచ్చ మీడియాకే అనుమతి.. కాకినాడ యాంకరేజ్ పోర్టులో నిలిపివేసిన స్టెల్లా–ఎల్ నౌకలో పీడీఎస్ బియ్యం తనిఖీల కోసం నియమించిన అధికారుల కమిటీ బుధవారం నౌకను పరిశీలించింది. టీవీ–5, ఈటీవీ, ఈనాడు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతిని మాత్రమే తనిఖీల సందర్భంగా కమిటీ తమ వెంట తీసుకెళ్లడం గమనార్హం. నౌకలో తనిఖీకి వెళుతున్నట్లు ఎల్లో మీడియాకు మాత్రమే సమాచారం ఇచ్చి గుట్టుగా వ్యవహరించారు. -
ఆ ఎఫ్ఐఆర్ బాబు సర్కార్ చౌకబారు ఎత్తుగడ.. విజయసాయి ట్వీట్
సాక్షి, ఢిల్లీ: కులవాది కేవీ రావు తనపై పెట్టిన ఎఫ్ఐఆర్ చంద్రబాబు సర్కార్ చౌకబారు ఎత్తుగడ అంటూ వైఎస్సార్సీపీ రాజ్యసభ పక్ష నేత విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా దుయ్యబట్టారు. రాష్ట్రంలోని వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి వెన్నుపోటుదారుడు చంద్రబాబు చేస్తున్న ప్రయత్నం. అబద్ధాలు చెప్పేందుకు కేవీ రావు నాలుగు సంవత్సరాల ఆరు నెలలు ఎందుకు వేచి చూశారు?. నేను కాల్ చేశానని, బెదిరించానని నిరూపించడానికి ఆధారాలు ఉన్నాయా?’’ అంటూ విజయసాయిరెడ్డి నిలదీశారు.‘‘వాల్యుయేషన్ ఎప్పుడు చర్చలకు లోబడే ఉంటుంది?. నాకు ఆ రెండు సీఏ సంస్థలతో ఎలాంటి సంబంధం లేదు. ఈ సంస్థల భాగస్వాములెవరో నాకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియదు. కేవీ రావు చంద్రబాబు రాజకీయ తొత్తు. 1997లో ఏడిబీ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ పోర్టును ఏర్పాటు చేసింది. కానీ ఆ తర్వాత విదేశీ పెట్టుబడిదారులకు అమ్మేసి ప్రైవేటీకరణ చేశారు. దొడ్డిదారిన కేవీ రావును చైర్మన్‌గా నియమించారు. చంద్రబాబు, కేవీ రావు ఇద్దరు కులవాదులే’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.1/2: Who is this liar KV Rao? He is nobody, I haven't met him or seen him. He is a stooge propped up by TDP to file a false case against me. The FIR is a script of some masala Telugu Movie. I will go behind liar KV Rao for malicious prosecution and defamation.Further his money…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 4, 2024కిమ్ జోన్ ఉన్‌లా చంద్రబాబు..చంద్రబాబు నియంతృత్వ ధోరణితో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై కక్ష సాధింపులకు దిగుతున్నారంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. ‘‘దక్షిణ భారత కిమ్ జోన్ ఉన్‌లా చంద్రబాబు తయారయ్యారు. చంద్రబాబు విధానాలకు ఎల్లో మీడియా వంత పాడుతోంది. ప్రతిపక్ష పార్టీల నాయకుల కార్యకర్తల జీవితాలను, స్వేచ్ఛను ప్రమాదంలో పెట్టారు. ఏపీ పోలీసులు వాగ్నర్ గ్రూప్ తరహాలో ప్రైవేటు సైన్యంలో చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు. ఏపీ పోలీసులు రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి తప్ప టీడీపీ రాజ్యాంగం ప్రకారం కాదు...చంద్రబాబు ప్రభుత్వం అణిచివేత చర్యలు ఆయన పిరికితనానికి నిదర్శనం. ఆయన చేస్తున్న రాజకీయ ప్రతీకారానికి ఎలాంటి జస్టిఫికేషన్ లేదు. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల సంబరాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలు తమ జీవితాలను భయం భయంగా గడుపుతున్నారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా అణిచివేశారు. జీవించే హక్కును అధికార పార్టీ దయదాక్షిణ్యల పైన ఆధారపడేలా చేశారు’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.1/2 : The oppression by AP Govt. under @ncbn of thousands of people shows how scared he is. It shows his cowardice, his insecurity and his inferiority complex. Chandrababu is resorting to political vengence that even he cannot justify. He cannot look at himself in the mirror.…— Vijayasai Reddy V (@VSReddy_MP) December 4, 2024 -
డైవర్షన్ డ్రామా అట్టర్ ఫ్లాప్..
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత వెల్లువెత్తుతుండటంతో బెంబేలెత్తుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పదును పెడుతున్నారు. ఓవైపు ఎన్నికల హామీలు గాలికి వదిలేసి మరోవైపు యథేచ్ఛగా దోపిడీకి తెర తీసిన ప్రభుత్వ పెద్దలు.. ప్రజల్ని మభ్యపెట్టేందుకు దుష్ప్రచార కుతంత్రాలు పన్నుతున్నారు. అందులో తాజా అంకమే ‘కాకినాడ పోర్ట్ వద్ద బియ్యం రాద్ధాంతం’! చంద్రబాబు పార్ట్నర్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీలో తన కోవర్టు, మంత్రి నాదెండ్లను ముందుపెట్టి పక్కా పన్నాగంతో సాగించిన డైవర్షన్ రాజకీయ కుట్ర ఇది. మోకాలికి, బోడుగుండుకూ ముడిపెడుతూ చంద్రబాబు డైరెక్షన్లో పవన్, నాదెండ్ల ద్వయం చేసిన రాజకీయ రాద్ధాంతం కూటమి పెద్దల కుట్రను బట్టబయలు చేసింది. పూర్తిగా అవాస్తవాలు, దుష్ప్రచారంతో సాగిన ఈ హైడ్రామా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకరేజ్ పోర్ట్ నుంచే ఎగుమతి కాకినాడ సీవాటర్ పోర్ట్‌పై నిరాధార ఆరోపణలతో డ్రామా రేషన్‌బియ్యం అక్రమ రవాణాపై చంద్రబాబు ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని కాకినాడ హైడ్రామా ఎపిసోడ్ తేల్చి చెబుతోంది. ఎందుకంటే.. కాకినాడ డీప్‌వాటర్ పోర్ట్ వేరు... కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వేరు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోంది. ఆ పోర్ట్ నుంచే బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మరి ఆ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారని పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భావిస్తే రాష్ట్ర ప్రభుత్వాన్నే నిలదీయాలి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశ్నించాలి. కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన తమను తాము నిలదీసుకోవాలి. కానీ పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ మాత్రం కాకినాడ సీ పోర్ట్‌ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కన్షార్షియాన్ని నిలదీయడం విడ్డూరంగా ఉంది. అదికూడా కేవలం 41 శాతం వాటా మాత్రమే ఉన్న మైనారిటీ షేర్ హోల్డర్ అరబిందో సంస్థపై అసత్య ఆరోపణలు చేయడం మరో విచిత్రం. సమగ్ర తనిఖీల తర్వాతే షిప్పుల్లోకి లోడింగ్ దేశంలో అన్ని పోర్టుల నుంచి బియ్యం సహా వివిధ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. షిప్పుల్లోకి లోడింగ్ చేసేముందు సమగ్రంగా తనిఖీలు చేసే వ్యవస్థ ఉంది. కేంద్రానికి చెందిన కస్టమ్స్, పోర్ట్ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తారు. అందుకోసం నిర్దిష్ట కస్టమ్స్ ప్రోటోకాల్ ఉంది. ఎగుమతులకు సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడంతోపాటు ఎగుమతి చేసే సరుకును కూడా పరీక్షిస్తారు. అంతా సక్రమంగా ఉందని నిర్ధారించిన తరువాతే ఎగుమతి కోసం షిప్పుల్లోకి లోడ్ చేసేందుకు అనుమతిస్తారు. రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి చేసేందుకు యత్నిస్తే వారు ముందుగానే పోర్టుల వద్దే నిలిపివేస్తారు కదా! అటువంటిది కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని టీడీపీ కూటమి ప్రభుత్వంలోని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిరాధార ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది. అన్ని వ్యవస్థలు చంద్రబాబు చేతిలోనే..రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అవుతోంది. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు, రెవెన్యూ వ్యవస్థలు, పౌర సరఫరాల శాఖ, వివిధ చెక్ పోస్టులు... అన్నీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలోనే పని చేస్తున్నాయి. ఇక స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోర్టుల వద్ద కేంద్రీకృతమైన కస్టమ్స్, షిప్పింగ్ శాఖలు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్నాయి. కేంద్రంలో ఉన్నది కూడా టీడీపీ, జనసేన భాగస్వామిగా ఉన్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వమే కదా! మరి రాష్ట్రం నుంచి రేషన్ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారంటే బాధ్యత చంద్రబాబు ప్రభుత్వానిదీ... టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్న కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానిదీ అవుతుంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగితే పవన్ కళ్యాణ్ నిలదీయాల్సింది ఎవరిని? ముందుగా తన పారీ్టకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను... తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును...! ఇంకా కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజి పోర్ట్ వద్దకు వెళ్లి హైడ్రామా చేయడం కేవలం ప్రజల్ని మభ్యపెట్టేందుకేనన్నది సుస్పష్టం. కూటమి నేతలే రేషన్ మాఫియా లీడర్లు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే రాష్ట్రంలో రేషన్ బియ్యం మాఫియా దోపిడీ యథేచ్ఛగా సాగుతోంది. టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు తమ నియోజకవర్గాల నుంచి రేషన్ బియ్యాన్ని భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. చెక్ పోస్టుల వద్ద కనీసం తనిఖీలు చేయకుండా రేషన్ బియ్యం అక్రమ రవాణాకు రాచబాట పరుస్తున్నారు. అలా అక్రమంగా భారీస్థాయిలో తరలించిన రేషన్ బియ్యాన్ని పయ్యావుల కేశవ్ వియ్యంకుడు, ఇతర టీడీపీ పెద్దల సన్నిహితులకు చెందిన సంస్థల ద్వారా విదేశాలకు స్మగ్లింగ్ చేస్తూ భారీ దోపిడీకి పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో రేషన్ బియ్యం మాఫియాను అడ్డుకోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ వద్ద రాజకీయ డ్రామాతో ప్రజల్ని మభ్య పెట్టేందుకు యత్నించారు. పౌరసరఫరాలు, రవాణా, రెవెన్యూ, హోం, విజిలెన్స్ శాఖలే రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవాలి. మరి అక్రమ రవాణా సాగుతోందంటే పవన్ కళ్యాణ్ ముందుగా నిలదీయాల్సింది తన పార్టీకి చెందిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌నే! ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ కుట్రే హామీల అమల్లో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్ కుట్రలకు పాల్పడుతోంది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌తో కనికట్టు చేసేందుకు యత్నిస్తోంది. ధాన్యం కొనుగోలులో వైఫల్యంపై రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ఆర్బీకేల ద్వారానే ధాన్యం సకాలంలో కొనుగోలు చేసి రైతులను ఆదుకుంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ఆర్బీకేల వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో రైతుల గోడు పట్టించుకునే నాథుడే లేకుండాపోయారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు 75 కిలోల బస్తాను రూ.400 తక్కువకే దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. ఈ–క్రాప్ అమలు చేయడం లేదు. మరోవైపు మిల్లర్ల నుంచి చంద్రబాబు ప్రభుత్వం భారీ కమీషన్ల డీల్ కుదుర్చుకుంది. మిల్లర్లకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించేందుకు 8 శాతం కమీషన్ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వ పెద్దలు బేరం పెట్టారు. అనంతరమే మొదట విడతగా ఇటీవల రూ.200 కోట్లు విడుదల చేశారని మిల్లర్లే చెబుతున్నారు. ఈ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ‘బియ్యం’ డ్రామను మొదలెట్టారు.మద్యం.. ఇసుకలో దోపిడీ ఇతరులెవరూ మద్యం టెండర్లు దాఖలు చేయకుండా పోలీసులతో బెదిరించి అడ్డుకుని మరీ టీడీపీ పెద్దలు దోపిడీకి రాచబాట పరిచారు. వేలం పాటలు నిర్వహిస్తూ మరీ బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. ఉచిత ఇసుక విధానం ముసుగులో టీడీపీ పెద్దలు ఇసుక రీచ్‌లను ఏకపక్షంగా దక్కించుకుని భారీ దోపిడీకి తెగించారు. ఓ వైపు ప్రభుత్వం ఏటా రూ.750 కోట్ల ఆదాయం కోల్పోతోంది. మరోవైపు ఇసుక రేట్లు భారీగా పెంచేసి సాగిస్తున్న దోపిడీతో టీడీపీ కూటమి పెద్దల సొంత ఖజానా నిండుతోంది. వలంటీర్ల జీతం నెలకు రూ.10 వేలకు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే అసలు వలంటీర్ల వ్యవస్థే లేదని ప్రకటించి వారిని రోడ్డున పడేశారు. ఇక పోలవరం ప్రాజెక్ట్‌లో నీటినిల్వను కేవలం 41.15 మీటర్లకే పరిమితం చేయాలన్న నిర్ణయంతో కేంద్రంలోని ఎన్డీయే, రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వాలు రాష్ట్రానికి తీవ్ర ద్రోహానికి పాల్పడ్డాయి. ఈ వ్యవహారాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాకినాడలో సాగించిన రాజకీయ డ్రామా అందులో భాగమేనన్నది తేటతెల్లమవుతోంది. పయ్యావుల కేశవ్ వియ్యంకుడి సంస్థ బియ్యం తరలిస్తున్న షిప్‌ను ఎందుకు తనిఖీ చేయలేదు? కాకినాడ యాంకరేజి పోర్ట్ వద్ద లంగరు వేసి ఉన్న స్టెల్లా షిప్ వద్ద హైడ్రామా చేసిన పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్... ఆ సమీపంలోనే లంగరు వేసి ఉన్న ఎంవీ కెన్స్టర్ అనే షిప్ వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడం విడ్డూరంగా ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడికి చెందిన సంస్థ ఆ షిప్ ద్వారానే బియ్యాన్ని నైజీరియాకు ఎగుమతి చేస్తోంది. ఆయనకు చెందిన పట్టాభి ఆగ్రో సంస్థ కాకినాడ పోర్ట్ నుంచి నైజీరియాకు 42,500 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తోందన్నది బహిరంగ రహస్యమే. ఆ షిప్‌ను మాత్రం పవన్ కళ్యాణ్, నాదెండ్ల తనిఖీ చేయలేదు. కేవీ రావు సంస్థ చేతిలోనే కాకినాడ పోర్ట్ యాజమాన్యంఅరబిందో బెదిరించి ఉంటే ఏకంగా 51శాతం వాటా తీసుకునేవారు కదాబెదిరిస్తే ఫ్రీగానే వాటాలు తీసుకునేవారు కదాకాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌లో వాటాల అమ్మకాలు, కొనుగోలు పూర్తిగా ప్రైవ్రేటు వ్యవహారం. పోర్ట్ ప్రమోటర్ కేవీ రావు నుంచి 41శాతం వాటాను మాత్రమే అరబిందో సంస్థ కొనుగోలు చేసింది. మిగిలిన 59 శాతం వాటా కేవీ రావు సంస్థ వద్దే ఉన్నాయి. అంటే కాకినాడ డీప్‌వాటర్ పోర్ట్‌పై యాజమాన్య హక్కులు ఇప్పటికీ కేవీ రావు సంస్థ చేతిలోనే ఉన్నాయి. పోర్ట్ వ్యవహరాల్లో నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకే ఉంది. పోర్ట్ ఎండీగా కేవీ రావే ఉండగా... సీఈవో, ఇతర కీలక స్థానాల్లో ఆయన సన్నిహితులే ఉన్నారు. అలాంటిది అరబిందో సంస్థ బెదిరించి పోర్ట్‌లో వాటాలు కొనుగోలు చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అసత్య ఆరోపణలు చేయడం మరీ విడ్డూరంగా ఉంది. అంతగా బెదిరించి వాటాలు కొనుగోలు చేసి ఉంటే... డబ్బులు ఇచ్చి ఎందుకు వాటాలు కొంటారు..? ఫ్రీగానే తీసేసుకునేవారు కదా. కనీసం మెజార్టీ వాటాలు అంటే 51శాతం వాటాను దక్కించుకునేవారు కూడా. దాంతో పోర్ట్ వ్యవహారాల్లో నిర్ణయాధికారం కూడా అరబిందో సంస్థకే దక్కేది. అంతేగానీ పోర్టుపై నిర్ణయాధికారం కేవీ రావు సంస్థకు ఎందుకు విడిచిపెడతారు...! కానీ అరబిందో సంస్థ 41శాతం వాటానే కొనుగోలు చేసి పోర్టులో మైనార్టీ పార్టనర్‌గానే ఉంది. మిగిలిన 59శాతం వాటా కలిగిన కేవీ రావు సంస్థే పోర్ట్‌పై నిర్ణయాధికారాన్ని అట్టిపెట్టుకుంది. వాస్తవాలు ఇవీ...కానీ వాటిని వక్రీకరిస్తూ టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల్ని మభ్యపెట్టేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రైవేటు లావాదేవీల్లో చంద్రబాబు ప్రభుత్వ జోక్యం ఎందుకో...! కాకినాడ డీప్ వాటర్ పోర్టులో వాటాల విక్రయం అన్నది పూర్తిగా రెండు ప్రైవేటు సంస్థల మధ్య వ్యవహారం. ఐదేళ్ల తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఆ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని భావిస్తుండటం వెనుక పక్కా కుట్ర ఉందని స్పష్టమవుతోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంతో నిర్వర్తించాల్సి బాధ్యతలు ఎన్నో ఉన్నాయి... కానీ వాటిని విస్మరించి రెండు సంస్థల మధ్య ప్రైవేటు వ్యవహారంలో టీడీపీ కూటమి ప్రభుత్వం తలదూరుస్తుండటం వెనుక మర్మం ఏమిటి? ప్రభుత్వం మారగానే అంతుకుముందు ప్రైవేటు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటామంటే రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఓ దుష్ట సంప్రదాయానికి తెరతీసినట్టు అవుతుంది. ఎందుకంటే పరస్పర అంగీకారంతో ప్రైవేటు ఆస్తుల కొనుగోలు అమ్మకాలు సాగుతుంటాయి. ఐదేళ్ల తరువాత సహజంగానే ఆ ఆస్తుల మార్కెట్ విలువ పెరుగుతుంది. మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి ఐదేళ్ల క్రితం తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ఫిర్యాదు చేస్తామంటే ఎలా..? వాటిలో ప్రభుత్వం జోక్యం చేసుకుంటే పరిస్థితి ఎంతవరకు వెళుతుంది ? ఐదేళ్ల తరువాత మార్కెట్ విలువ పెరిగింది కాబట్టి గతంలో తనను బెదిరించి ఆస్తిని అమ్మేలా చేశారని ప్రతి ఒక్కరూ ఆరోపిస్తే పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్మించిన పోర్టును కారుచౌకగా కట్టబెట్టింది చంద్రబాబే అసలు కాకినాడ డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసిందే గతంలో చంద్రబాబు ప్రభుత్వమేననే వాస్తవాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంకు, ఏడీబీ రుణాలతో ఏపీ ప్రభుత్వం కాకినాడ డీప్ వాటర్ పోర్ట్‌ను 1997లో నిర్మించింది. లాభాల్లో ఉన్న ఆ పోర్టును 1999లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే కారు చౌక ధరకు ప్రైవేటుపరం చేశారు. ప్రస్తుతం కూడా చంద్రబాబు అదే కుట్రతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను తన బినామీలపరం చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇలా ప్రభుత్వ పోర్టులను కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు గతంలో ధారాదత్తం చేసిన... ప్రస్తుతం మరో మూడు పోర్టులను కట్టబెట్టేందుకు సిద్ధపడుతున్న చంద్రబాబు అసలు కుంభకోణానికి పాల్పడినట్టు అవుతుంది కదా..! నిలదీయాల్సింది చంద్రబాబునే కదా...! -
షిష్‌లోకి ఎలా వచ్చాయో తేలుస్తాం.. రేషన్ రైస్‌పై కలెక్టర్ రియాక్షన్
సాక్షి, కాకినాడ జిల్లా: పోర్టు అధికారి ఆదేశాలతోనే స్టెల్లా షిప్ సీజ్ చేశామని కాకినాడ కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత నెల 27న స్టెల్లా షిప్లో రేషన్ బియ్యం దొరికాయి. రేషన్ బియ్యం ఎవరు సప్లై చేశారనేది విచారణ చేస్తున్నాం.’’ అని వెల్లడించారు.‘‘రేషన్ బియ్యం విషయంలో జిల్లా అధికారుల వైఫల్యం ఉంది. షిప్ ఆపే అధికారం కస్టమ్స్ అధికారులకు ఉంటుంది. షిప్లో స్టాక్‌పై పోర్ట్ అధికారులకు అధికారం ఉంటుంది. షిప్ సీజ్ చేయాలంటే హైకోర్టుకు వెళ్లాల్సిఉంటుంది. గోడౌన్ నుంచి షిప్ వరకు రైస్ ఎలా చేరిందో తేలాలి. కెన్‌స్టార్ షిప్లో బాయిల్డ్ రైస్‌ను గుర్తించాం. రేపు, ఎల్లుండి(బుధ,గురు) టీంలు క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారు’’ అని కలెక్టర్ చెప్పారు.ఇదీ చదవండి: పవన్ ‘న్యూట్రల్’ గేర్! -
‘నాదెండ్ల వాస్తవాలు తెలుసుకో.. పీడీఎస్ బియ్యం మంత్రి వియ్యంకుడిదే’
సాక్షి, గుంటూరు: కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే.. మంత్రి నాదెండ్ల మనోహార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ..‘సీజ్ చేసిన షిప్‌నే మళ్లీ సీజ్ చేయడమేంటి?. కాకినాడ పోర్టు నుంచి పెద్ద ఎత్తున బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి కాకినాడ పోర్టుకు బియ్యం వస్తుంది. కాకినాడ యాంకరేజ్ పోర్టుపై వేల కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ బియ్యం తరలివెళ్లడం ఈనాటిది కాదు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టు గురించి అభద్రతా భావంతో మాట్లాడుతున్నారు.అక్రమాలను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబు హాయాంలోనే అక్రమాలు జరిగాయి. వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పవన్, నాదెండ్ల మనోహర్ చేతకాని మాటలు మాట్లాడుతున్నారు. చెక్‌పోస్టులు ఉండగా.. పీడీఎస్ బియ్యం ఎలా తరలిపోతుంది?. అధికారం పవన్ కల్యాణ్ చేతిలోనే ఉంది కదా?. వైఎస్ జగన్‌పై బురద జల్లడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. కాకినాడలో పట్టుకున్న పీడీఎస్ బియ్యం మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడిదే. మంత్రి నాదెండ్ల మనోహార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. పట్టాభి ఆగ్రో సంస్థ ద్వారా బియ్యం తరలి వెళ్తోంది. జనసేనకు చెందిన వారంతా పౌర సరఫరాల శాఖలోనే ఉన్నారు. జనసేన నేతలు కుమ్మకైపోయి అవినీతికి పాల్పడుతున్నారు’ అని ఆరోపించారు. -
‘పవన్.. రాజకీయాల కోసం పోర్టును దొంగగా చిత్రీకరిస్తారా?’
సాక్షి, కాకినాడ: ఏపీలో కూటమి నేతల రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును ఒక దొంగగా చిత్రీకరించడం కరెక్ట్ కాదన్నారు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు. ఇదే సమయంలో కాకినాడ పోర్టును దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోందన్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆయన లేఖ రాశారు.కాకినాడ పోర్టు వద్ద డిప్యూటీ సీఎం పవన్ చేసిన హంగామాపై రాజకీయ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పోర్టు విషయమై పవన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో సీపీఐ నేత మధు.. కాకినాడ యాంకరేజ్ పోర్టును దెబ్బ తీయడానికి కుట్ర జరుగుతోంది. రాజకీయాల కోసం పోర్టును నాశనం చేయాలనుకుంటున్నారా?. పోర్టును నమ్ముకుని 30 వేల మంది కార్మికులు ఉన్నారు.రాష్ట్రంలో పీడీఎస్ బియ్యం ఎవరైతే అక్రమంగా రవాణా చేస్తున్నారో వారిని అరెస్ట్ చేసి అండమాన్ జైలుకి పంపండి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం కాకినాడ పోర్టును ఒక దొంగగా.. స్మగ్లింగ్ డెన్‌గా చిత్రీకరించకండి. కాకినాడ ప్రజలు మానసికంగా బాధపడుతున్నారు. వారి మనోభావాలు దెబ్బతింటున్నాయి. పోర్టు ద్వారా అక్రమ వ్యాపారాలు జరిగితే సీబీఐ విచారణ జరపండి. పోర్టు గౌరవాన్ని దెబ్బ తీయకండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘కెన్‌స్టార్’ షిప్పును పవన్ ఎందుకు వదిలేశారు: పేర్నినాని
సాక్షి,మచిలీపట్నం:డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఇటీవలి కాకినాడ పోర్టు పర్యటనపై మాజీ మంత్రి,వైఎస్సార్సీపీ సీనియర్ నేత పేర్నినాని సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయమై మచిలీపట్నంలో పేర్నినాని సోమవారం(డిసెంబర్2) మీడియాతో మాట్లాడారు.స్టెల్లాషిప్‌ను తనిఖీ చేసిన పవన్ కల్యాణ్ కెన్‌స్టార్‌షిప్‌ను ఎందుకు వదిలేశారని మాజీ మంత్రి పేర్నినాని ప్రశ్నించారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి వియ్యంకుడు అందులో బియ్యం తరలిస్తున్నారని తమకు సమాచారం ఉందన్నారు. తన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లేందుకు అనుమతి లేదంటున్నారని, అక్కడే ఉన్న అధికారులు కాకుండా ఇంకెవరు అనుమతి ఇవ్వాలో స్పష్టం చేయాలన్నారు. కెన్‌స్టార్‌షిప్‌లోకి వెళ్లకూడదని పవన్‌కల్యాణ్‌కు చంద్రబాబు చెప్పారా అని పేర్నినాని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం పోర్టు ఓనర్ అయితే అరబిందో కంపెనీ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చెప్పాలన్నారు. -
సీజ్ ది షిప్ పేరుతో సోషల్ మీడియాలో పవన్, జనసేన హంగామా
-
సీజ్ చేసిన బియ్యం మళ్ళీ బయటకు ఎలా వచ్చాయి.. పవన్ బండారం బయటపెట్టిన కన్నబాబు
-
రేషన్ బియ్యం తరలింపు వెనుక టీడీపీ మాఫియా
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ‘పేదలకు అందాసన బియ్యాన్ని కొందరు స్మగ్లింగ్ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్రమ ఎగుమతులు జరుపుతున్న నౌకల యజమానులెవరో కనుక్కుంటాను. కేసును సీఐడీకి ఇవ్వాలా, సీబీఐకి అప్పగించాలా అన్నది కేబినెట్లో నిర్ణయం తీసుకుంటాం’ శుక్రవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి కాకినాడు పోర్టులో బియ్యం అక్రమ ఎగుమతులను పరిశీలించాక డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెప్పిన మాటలివి. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చాక రేషన్ బియ్యాన్ని పేదల నుంచి అక్రమంగా సేకరిస్తూ విదేశాలకు రవాణా చేస్తున్న టీడీపీ నేతలను అడ్డుకోవాలి.మాఫియా వెనుక చక్రం తిప్పుతున్న కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులను కట్టడి చేయాలి. అవన్నీ వదిలేసి పోర్టుకెళ్లి బియ్యం అక్రమ రవాణా అంటూ పవన్‌కళ్యాణ్ హంగామా చేయడాన్ని చూసి టీడీపీ నేతలు నవ్వుకుంటున్నారు. పేదల నోటికాడి బియ్యాన్ని కాజేస్తున్న పచ్చనేతల సంగతి వదిలేసి తమ పార్టీ అధినేత కాకినాడ పోర్టులో చేసిన విన్యాసాలు అర్థంగాక జనసేన శ్రేణులు తలలు పట్టుకుంటున్నారు.నియోజకవర్గాల వారీగా సేకరించి..పర్చూరు నియోజకవర్గంలో ఇంకొల్లుకు చెందిన ఇద్దరు నేతలు నియోజకవర్గ వ్యాప్తంగా బియ్యాన్ని సేకరించి ఇడుపులపాడు ప్రాంతంలోని ఒక రైస్ మిల్లులో రీసైక్లింగ్‌చేసి అక్కడి నుంచి బియ్యాన్ని అద్దంకి కేంద్రంగా ఉన్న మాఫియాకు అందిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో ఒంగోలుకు చెందిన వ్యక్తి మొత్తం బియ్యాన్ని సేకరించి వాటిని మంత్రి అనుచరులకు అప్పగిస్తున్నారు. బాపట్ల నియోజకవర్గం వెదుళ్లపల్లి, రైల్‌పేట, అప్పికట్లకు చెందిన కొందరు రైస్ మిల్లుల యజమానులే నియోజకవర్గ వ్యాప్తంగా బియ్యం సేకరించి రీసైక్లింగ్ చేసి బియ్యాన్ని అద్దంకి మాఫియాకు అప్పగిస్తున్నారు.వేమూరు నియోజకవర్గంలో భట్టిప్రోలుకు చెందిన నేత రేషన్ బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రతి గ్రామానికి ఇద్దరు చొప్పున పచ్చనేతలకు బియ్యం సేకరణ బాధ్యతలు అప్పగించారు. రేపల్లె నియోజకవర్గంలో నిజాంపట్నం మండలానికి చెందిన మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచరుడు బియ్యం మాఫియాను నడిపిస్తున్నాడు. పల్నాడు జిల్లా నుంచి సైతం చౌక బియ్యాన్ని సేకరించి అద్దంకికి తరలిస్తున్నారు. రీసైక్లింగ్ అనంతరం కృష్ణపట్నం పోర్టుకు తరలిస్తున్నారు.మంత్రి ఇలాకా నుంచే..బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పేదలకు ఇస్తున్న రేషన్ బియ్యాన్ని టీడీపీ నేతలే అక్రమంగా సేకరిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రధాన అనుచరుడితోపాటు అద్దంకి నియోజకవర్గానికి చెందిన మరో టీడీపీ నేత కలిసి అక్రమ బియ్యం వ్యాపారాన్ని సాగిస్తున్నట్టు సమాచారం. కొన్నిచోట్ల కార్డుదారులకు కిలోకు రూ.10 చొప్పున చెల్లించి బియ్యాన్ని సేకరిస్తున్న మాఫియా చాలా నియోజకవర్గాల్లో కార్డుదారులకు పైసా ఇవ్వకుండా కొందరు పౌరసరఫరాల శాఖ అధికారుల సహకారంతో స్టాక్ పాయింట్ల నుంచే బియ్యాన్ని తరలిస్తున్నారు. బియ్యం సేకరిస్తున్న పచ్చ నేతలకు కిలోకు రూ.4 నుంచి రూ.5 ఇస్తుండగా.. నియోజకవర్గ స్థాయి నేతలకు రూ.లక్షల్లో ముట్టజెపుతున్నారు.బియ్యం ప్రస్తావన తెస్తే కార్డులు రద్దు చేస్తామని బెదిరింపులకు దిగుతుండటంతో చాలామంది పేదలు బియ్యం అందకపోయినా నోరు మెదపడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఈ బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. ఇలా సేకరించిన బియ్యాన్ని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న అద్దంకి నియోజకవర్గ పరిధిలోని రేణంగివరం, కోనంకి, కశ్యాపురం ప్రాంతాల్లో లీజుకు తీసుకున్న కొన్ని రైస్ మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి బస్తాల్లో నింపి గోడౌన్లలో స్టాక్ పెడుతున్నారు. అక్కడి నుంచి కృష్ణపట్నం పోర్టుకు తరలించి రూ.కోట్ల అక్రమార్జనకు పాల్పడుతున్నారు. -
‘కలెక్టర్ వెళ్లిన షిప్‌లోకి పవన్‌ను ఎందుకు వెళ్లనివ్వలేదు?’
సాక్షి, కాకినాడ జిల్లా: దొంగ సొత్తు దొరికినప్పుడు ఎందుకు ఆపలేదు?.. సీజ్ చేసిన బియ్యాన్నే మళ్లీ ఎందుకు రిలీజ్ చేశారంటూ కూటమి సర్కార్‌ను మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.‘‘పవన్ ఆవేదన గమనించాను. ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు అవుతోంది. పోర్టుకు వస్తానంటే ఆరు నెలలు నుంచి ఆపేస్తున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక బియ్యం ఎగుమతులపై దృష్టి పెట్టారు. సివిల్ సప్లయి శాఖ మంత్రి తనిఖీలు చేసి పీడీఎస్ బియ్యాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు...సివిల్ సప్లయి శాఖ నుండి పోర్డు వద్ద రెండు చెక్ పోస్టులు పెట్టారు. సివిల్ సప్లయి ఛైర్మన్ తోట సుధీర్ కూడా రేషన్ బియ్యం లారీలను పట్టుకున్నట్లు చూశాను. గతంలో మంత్రి మనోహర్ పట్టుకున్న బియ్యమే.. మళ్లీ బిజీ ఇచ్చి బియ్యాన్ని విడుదల చేశారు. బియ్యాన్ని విడుదల చేసినప్పుడు సివిల్ సప్లయి శాఖ షరతులు ఏంటి అని అడుగుతున్నాను. సివిల్ సప్లయి చెక్ పోస్టులు దాటి ఈ బియ్యం పోర్టులోకి ఎలా వెళ్లాయి’’ అంటూ కన్నబాబు నిలదీశారు.‘‘బియ్యం ఉన్న షిప్‌లోకి వెళ్తానంటే నన్ను వెళ్ళనీయడం లేదని పవన్ అంటున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్‌ను ఎవరూ ఆపి ఉంటారని సామాన్యులలో ప్రశ్నలు తలెత్తున్నాయి. డిప్యూటీ సీఎం పై స్ధాయిలో వ్యక్తే పవన్‌ను షిప్పులోకి ఎక్కకుండా ఆపారా?. అక్రమాలు జరుగుతున్న పోర్టు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనిదే?. కాకినాడ పోర్టు దేశ భద్రతకు ముప్పు ఉందని పవన్ ఆందోళన చెందారు. ఒకవేళ కసాబ్ లాంటి వాళ్లు వస్తే తప్పు రాష్ట్ర ప్రభుత్వానిదే కదా?’’ అంటూ కన్నబాబు దుయ్యబట్టారు.‘‘కలెక్టర్ వెళ్లిన షిప్పులోకి డిప్యూటీ సీఎంను ఎందుకు ఆపారు? ఎవరూ ఆదేశాల మేరకు ఆపి ఉంటారు. ఇప్పటీకి రేషన్ బియ్యం దందా జరుగుతుందని ఎల్లో మీడియాలోనే వస్తుంది? దానిని అడ్డుకోవాలి. సిస్టమ్‌లో ఉన్న లోపాలను సరిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, పవన్ ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. పవన్ దేశ భద్రత కోసం మాట్లాడారు.. దానికి రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలి. సివిల్ సప్లయి శాఖ చాలా పటిష్టం అవ్వాల్సిన అవసరం ఉంది. ..ఇవాళ పేపర్ చూస్తే షాక్ కొట్టింది.. బాబు ష్యూరిటీ.. బాదుడు గ్యారెంటీ. విద్యుత్ ఛార్జీలతో చంద్రబాబు ప్రజలను బాదేశారు. యూనిట్ మీద రూ.2.19 పైసలు అదనపు భారాన్ని వేశారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు చెప్పారు. ప్రజల మీద భారం వేసి జగన్ సంపద సృష్టించలేదు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికలకు మందు అనేక సభల్లో చంద్రబాబు చెప్పారు. ఇది చంద్రబాబు పర్మినెట్ స్టేట్మెంట్. ఐదు నెలల్లో మాట మార్చేశారు’’ అని కురసాల కన్నబాబు మండిపడ్డారు. -
పవన్ ‘న్యూట్రల్’ గేర్!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు.. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలం కావడం.. వరుసగా చిన్నారులపై అఘాయిత్యాలు, మహిళలపై హత్యాచారాల ఘటనల సమయంలో ఉలకని పలకని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీడీపీ పెద్దలు ఇరకాటంలో పడ్డప్పుడల్లా రంగంలోకి దిగుతున్నారు. కూటమి సర్కారు వైఫల్యాలకు బాధ్యత వహించకుండా.. తాను ప్రభుత్వంలో భాగం కాదనే రీతిలో తమపై విమర్శలకు దిగడంపై అధికార యంత్రాంగం విస్తుపోతోంది. శాంతి భద్రతల అంశం నేరుగా ముఖ్యమంత్రి చేతిలోనే ఉందన్న విషయం పవన్‌కు తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా పవన్ తాను తటస్థుడినని చిత్రీకరించుకుంటూ ప్రత్యేకత చాటుకునే యత్నాల్లో భాగమని పేర్కొంటున్నారు. బియ్యాన్ని చూపించకుండా తనను ఓడ చుట్టూ తిప్పారని.. అధికారుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని.. కాకినాడ పోర్టు కార్యకలాపాల వెనుక పెద్ద స్మగ్లింగ్, మాఫియానే నడుస్తోందని పవన్ వ్యాఖ్యలు చేయడం పవన్ ‘న్యూట్రల్ గేర్’లో భాగమేనని పేర్కొంటున్నారు. తాజాగా కాకినాడ పోర్టులో పర్యటన సందర్భంగా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు అక్కడ లేకపోవడంపై పవన్ మండిపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే తన పార్టీకే చెందిన మంత్రి మనోహర్‌తో చర్చించకుండా.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి హడావిడి చేయాల్సిన అవసరం ఏముందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ ఆయన పార్టీకి చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేస్తున్నారు.ఇటీవల హోంమంత్రి అనితను లక్ష్యంగా చేసుకుని ఆయన విమర్శలు చేయటాన్ని గుర్తు చేస్తున్నారు. తాను తటస్థుడిననే ముద్ర కోసం తాపత్రయపడుతున్నట్టు కలరింగ్ ఇవ్వడంతో పాటు.. రాష్ట్రంలో జరిగే సంఘటనల్లో తన పాత్ర లేదని చెప్పుకోవడానికి ఇలా హైడ్రామాలకు తెరలేపారనే చర్చ జరుగుతోంది.సీజ్ చేసి విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే!కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలి రెండు రోజుల క్రితం కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి విదేశాలకు స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఎగుమతికి సిద్ధం చేసిన 640 టన్నుల బియ్యాన్ని పీడీఎస్‌గా గుర్తించినట్లు వెల్లడించారు. నౌకలోని ఐదు హేచర్లకు 52 వేల టన్నుల బియ్యం లోడింగ్ సామర్థ్యం ఉండగా 38 వేల టన్నులు లోడింగ్ చేశారు. ఇందులో బాయిల్ రైస్‌తో పాటు 640 టన్నులు పీడీఎస్ ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించారు. పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ రెండు నెలల క్రితం సీజ్ చేసిన పీడీఎస్ బియ్యాన్ని బ్యాంక్ గ్యారెంటీ తీసుకుని కొంత విడుదల చేశారు. అలా విడుదల చేసిన పీడీఎస్ బియ్యమే కలెక్టర్ నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో స్టెల్లా ఎల్ పనామా నౌకలో ఉండటం గమనార్హం. పౌరసరఫరాల అధికారి సరెండర్ ఉత్తర్వులుకాకినాడ జిల్లా పౌరసరఫరాల అధికారి ఎంవీ ప్రసాద్‌ను సరెండర్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పీడీఎస్ బియ్యం వ్యవహారాన్ని సక్రమంగా నిర్వహించనందున ఆయన పౌరసరఫరాలశాఖ కమిషనరేట్‌లో రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సాక్షి కథనంతో కలకలం..కలెక్టర్ స్వయంగా పోర్టుకు వెళ్లి పరిశీలించాక అదే బియ్యాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కూడా తాజాగా కాకినాడ పోర్టుకు వెళ్లి పరిశీలించారు. తన వెంట ఉన్న కాకినాడ సిటీ టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)పై పవన్ అసహనం వ్యక్తం చేయడం గమనార్హం. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) చేసిన మిల్లర్లకు ప్రభుత్వం ఇటీవల రూ.200 కోట్లు బకాయిలు విడుదల చేసింది. ఈ బకాయిలు విడుదల చేసినందుకు కూటమికి చెందిన ఒక నేతకు 8 శాతం కమీషన్లు ముట్టినట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ‘కమీషన్ల కోసం కపట నాటకం’ శీర్షికన ఈ నెల 27న ‘సాక్షి’ ప్రధాన సంచికలో కథనం వెలువడటం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. -
కాకినాడ పోర్టుపై కక్ష
బియ్యం ఎగుమతుల్లో కాకినాడ పోర్టు దేశంలోనే రికార్డులు తిరగరాసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ వేధింపులతో కుదేలవుతోంది. విదేశాలకు బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మోకాలడ్డుతోంది. ఎగుమతిదారుల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులున్నారన్న ఏకైక సాకుతో ఈ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ దాదాపు 20 వేల మంది పొట్టుకొట్టి వారిని రోడ్డున పడేస్తోంది. ఈ నేపథ్యంలో బియ్యం ఎగుమతిదారులు ఈ పోర్టులో కార్యకలాపాలకు ఫుల్స్టాప్ పెడుతున్నారు. ప్రత్యామ్నాయంగా కాండ్లా పోర్టు వైపు అడుగులేస్తున్నారు.మంత్రి నాదెండ్ల హడావుడిఎగుమతిదారుల్లో వైఎస్సార్సీపీ సానుభూతిపరులున్నారన్న ఏకైక కారణంతో కాకినాడ పోర్టులో ఎగుమతులను దెబ్బదీసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. సార్వత్రిక ఎన్నికల ముందు నుంచే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఈ పోర్టుపై విషం కక్కుతూ వచ్చారు. ఈ పోర్టు ద్వారా విదేశాలకు పీడీఎస్ బియ్యం దొడ్డిదారిన ఎగుమతి చేస్తున్నారంటూ నిందలు వేశారు. రెండు తరాలుగా రైస్ ఇండస్ట్రీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కుటుంబాన్ని, వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన ఎగుమతిదారులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేసింది. గత నెలలో కాకినాడ పోర్టు ఆధారిత ఎగుమతిదారుల గోడౌన్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో అధికారులు దాడులు చేసి సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల బియ్యంతో పాటు నూకలను సీజ్ చేసి ఎగుమతిదారుల్లో భయానక వాతావరణాన్ని సృష్టించారు. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా సీజ్ చేసిన సరుకులో 28 వేల మెట్రిక్ టన్నుల సరుకు సీజ్ ఎత్తేసి ఇటీవలే విడుదల చేశారు. ఆ తర్వాత ఎగుమతులకు పలు విధాలుగా ప్రతిబంధకాలు సృష్టిస్తున్నారు. చెక్‌పోస్టుల ద్వారా రోజుల తరబడి ఎగుమతులు నిలిచిపోయేలా చేస్తున్నారు. కావాలనే పనిగట్టుకుని జరుగుతున్న ఈ వేధింపుల కారణంగా ఎగుమతిదారులు కాకినాడ పోర్టులో కార్యకలాపాలను నిలిపివేస్తున్నారు. ప్రత్యామ్నాయంగా కాండ్లా పోర్టు వైపు తరలిపోవాలనే నిర్ణయంతో సెప్టెంబర్ నుంచి ఇక్కడ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.సాక్షి ప్రతినిధి, కాకినాడ : బియ్యం ధరలను నియంత్రించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ముడి బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. అత్యవసర అవసరాల దృష్ట్యా ఆఫ్రికా దేశాల విజ్ఞప్తితో కేంద్రం మానవతా దృక్పథంతో ప్రభుత్వ రంగ సంస్థల పర్యవేక్షణలో బియ్యం, నూకలు కలిపి 1.5 మెట్రిక్ టన్నుల ఎగుమతికి అనుమతించింది. ఇవి కాకుండా ఆఫ్రికా దేశం సెనగల్‌కు 5 లక్షల టన్నుల నూకల ఎగుమతికి అనుమతి వచ్చింది. గత జూలై నెలాంతానికి 2.5 లక్షల టన్నుల ఎగుమతి పూర్తి చేశారు. ఇవన్నీ డైరెక్టర్ జనరల్ ఫారెన్ ట్రేడ్ పర్యవేక్షణలో జరుగుతాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్, ఎన్సీఈఎల్(నేషనల్ కోపరేటివ్ ఎక్స్‌పోర్ట్సు లిమిటెడ్), ఎన్సీసీఎఫ్(నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్), క్రిబ్కో నిర్వహించిన వేలంలో ఎక్స్‌పోర్టు కంపెనీలు ఎగుమతి హక్కులు దక్కించుకున్నాయి. దుబాయ్, స్విట్జర్లాండ్ లిమిటెడ్ కంపెనీలతో పాటు సింగపూర్ కేంద్రంగా నిర్వహించే ఓలం ఆగ్రో, అంతర్జాతీయంగా పేరున్న లూయీస్ బ్రూఫిన్, ఢిల్లీ, రాయ్‌పూర్, రాజస్థాన్ ప్రాంతాలకు చెందిన డీఆర్ కమోడిటీస్, బాలాజీ రైస్ ఇండస్ట్రీస్, శ్రీరామ్ఫుడ్స్, పట్టాభి ఇంటర్నేషనల్, సరళ ఫుడ్స్ వంటి కంపెనీలు కాకినాడ పోర్టు నుంచి నూకలు, బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేయడానికి సిద్ధమయ్యాయి. దాదాపు 150 ఎగుమతి కంపెనీలు ది రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సభ్యత్వంతో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేయడంలో క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ.. కేంద్రం బియ్యం ఎగుమతులపై నిషేధం విధించక మునుపు లెటర్ ఆఫ్ క్రెడిట్(ఎల్సీ)లు ఉన్నవే కావడం గమనార్హం. కేంద్రం అనుమతించినా రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డడాన్ని ఎగుమతిదారులు ఆక్షేపిస్తున్నారు. అంతర్జాతీయంగా బియ్యం ఎగుమతిలో ట్రాక్ రికార్డు ఉన్న కాకినాడ పోర్టు ప్రతిష్టను దెబ్బతీస్తే వేలాది మంది రోడ్డున పడతారు.కుట్రలతో కుదేలుగడచిన ఐదేళ్లలో కోటీ 47 లక్షల 55 వేల 837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు ఒక్క కాకినాడ పోర్టు నుంచే జరిగాయి. ఈ స్థాయిలో మరే పోర్టు నుంచి ఎగుమతి జరిగిన దాఖలాల్లేకపోవడం గమనార్హం. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కాకినాడ పోర్టుకు చంద్రగ్రహణం పట్టుకుంది. గద్దెనెక్కిన దగ్గర నుంచి కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు ఈ పోర్టు కార్యకలాపాలను దెబ్బతీస్తున్నాయి. నిన్నమొన్నటి వరకూ దేశంలోనే రికార్డు స్థాయిలో బియ్యం ఎగుమతులు జరిపిన కాకినాడ పోర్టు భవితవ్యం కూటమి ప్రభుత్వ వేధింపులతో ప్రశ్నార్థకంగా మారింది. దీని ప్రభావంతో కాకినాడ పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ సుమారు 20 వేల మంది రోడ్డున పడే పరిస్థితి ఖాయంగా కనిపిస్తోంది. -
కూటమి కక్ష.. ఎగుమతిదారులకు శిక్ష
సాక్షి ప్రతినిధి, కాకినాడ: బియ్యం ఎగుమతిదారులపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. పీడీఎస్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారన్న పేరుతో మొత్తం ఎగుమతులనే దెబ్బతీసే చర్యలకు దిగింది. ఈ ప్రభావం బియ్యం ఎగుమతిలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న కాకినాడ పోర్టుపైనా పడింది. ఈ పోర్టుకు విదేశాల్లో ఉన్న విశ్వసనీయతను దెబ్బ తీస్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాందెడ్ల మనోహర్ రెండు రోజులు కాకినాడలోనే తిష్ట వేసి గోడౌన్లపై దాడులు, పీడీఎస్ బియ్యం సీజ్ అంటూ ఎగుమతిదారులను భయపెట్టి, వారిలో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఎగుమతిదారులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అంటున్నారు. బియ్యం ఎగుమతులపై మంత్రికి అవగాహన లేనందువల్లే వాటిని దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. గొడౌన్లపై దాడుల కారణంగా పోర్టులో ఎగుమతులపై నీలినీడలు కమ్ముకొన్నాయని చెబుతున్నారు. వాస్తవానికి మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోతుండటంతో ముడి బియ్యం ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళ క్రితమే నిషేధించింది. ఎగుమతులను కఠినతరం చేసింది. అయితే ప్రత్యేక అనుమతులతో ప్రభుత్వ పర్యవేక్షణలో దక్షిణాఫ్రికా, ఫిలిప్పీన్స్, సోమాలియా వంటి ఆఫ్రికా దేశాలకు మాత్రమే బియ్యం ఎగుమతి చేస్తున్నారు. సింగపూర్ కేంద్రంగా పనిచేసే ఓలం ఆగ్రోతోపాటు అంతర్జాతీయంగా మంచి పేరున్న లూయీస్ బ్రూఫిన్ వంటి దాదాపు 150 కంపెనీలు ది రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ సభ్యత్వంతో కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు బియ్యం ఎగుమతి చేస్తున్నాయి. విశాఖ, కృష్ణపట్నం రేవులకంటే కాకినాడ రేవులో నిర్వహణపరంగా ఉన్న వెసులుబాటుతో 80 శాతం ఎగుమతులు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. గత ఐదేళ్లలో ఒక్క కాకినాడ నుంచే 1,47,55,837 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి అయింది. ఈ స్థాయిలో మరే పోర్టు నుంచి ఎగుమతి జరగలేదు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న ఈ పోర్టు భవితవ్యాన్ని ప్రశ్నార్థకంలో పడేసే పరిస్థితి కలి్పంచవద్దని ఎగుమతిదారులు కోరుతున్నారు. 2014–19 మధ్య టీడీపీ హయాంలో ఎగుమతులపై లేని ప్రతిబంధకాలు ఇప్పుడే ఎందుకు ఎదురవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు.అంతా పథకం ప్రకారమే.. సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి ఒక పథకం ప్రకారం కాకినాడ పోర్టు, ఇక్కడి బియ్యం లావాదేవీలు, తరతరాలుగా రైస్ మిల్లింగ్ రంగంలో ఉన్న కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం లక్ష్యంగా టీడీపీ, జనసేన నేతలు తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ద్వారంపూడి కుటుంబం బియ్యం ఎగుమతులను శాసిస్తోందంటూ రాజకీయ లబ్థి కోసం ఆరోపణలకు దిగారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాకినాడ పోర్టుపై కక్ష సాధింపు చర్యలకు దిగి, కోట్లు పెట్టుబడులు పెట్టిన ఎగుమతిదారులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ వచ్చి యాంకరేజ్ పోర్టు, డీప్‌వాటర్ పోర్టులలోని పలు గోడౌన్లను రెండు రోజులు తనిఖీ చేశారు. తొలి రోజు 7,615 మెట్రిక్ టన్నులు, రెండో రోజు అశోక గోడౌన్లో 2,800 మెట్రిక్ టన్నులు, హెచ్‌ఒన్ గోదాముల్లో 2,500 మెట్రిక్ టన్నులు బియ్యం, స్టాక్ రిజిస్టర్లను సీజ్ చేశామని మంత్రి నాదెండ్ల ప్రకటించారు. సింగపూర్‌కు చెందిన ఓలం, విశ్వప్రియ తదితర కంపెనీల గోడౌన్లలో సీజ్ చేసిన బియ్యంలో బాయిల్డ్ రైస్, బ్రోకెన్ రైస్ (నూకలు) ఉండటం గమనార్హం. ఇవన్నీ పీడీఎస్ బియ్యం అనే అనుమానంతో సీజ్ చేశారు. కానీ రాష్ట్రంలో ఎక్కడా బాయిల్డ్, నూకలను పీడీఎస్‌కు వినియోగించరు. అటువంటప్పుడు సీజ్ చేసిన బియ్యం పీడీఎస్ అని ఎలా నిర్ధారిస్తారని ఎగుమతిదారులు ప్రశ్నిస్తున్నారు. మార్కెట్లో బియ్యం ధరకంటే నూకల ధర తక్కువ. అటువంటప్పుడు పీడీఎస్ బియ్యం నూకలుగా మార్చి ఎగుమతి చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుందని, బియ్యంలో నూకలు ఉంటే అవి పీడీఎస్ అని ఎలా అంటున్నారని ఎగుమతిదారులు నిలదీస్తున్నారు.కాకినాడ నుంచి తరలిపోనున్న ఎగుమతిదారులు!కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులతో ఎక్స్‌పోర్టర్లు ఇక్కడి రేవు ద్వారా ఎగుమతులకు స్వస్తి పలికేందుకు సిద్దమవుతున్నారు. కాకినాడ రేవును వదిలి కాండ్లా, పరదీప్ ఓడæరేవుల నుంచి ఎగుమతులకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే జరిగితే పోర్టుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ 10 వేల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. ఈ విషయమై కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని వివరణ కోరగా బియ్యం ఎగుమతులతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అయితే ఇక్కడి ఎగుమతిదారులను ఇబ్బందులకు గురి చేసేలా దాడులకు పాల్పడి ఈ ప్రాంత రేవు ప్రతిష్టను దెబ్బ తీయడం ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. -
కాకినాడలో కాస్ట్లీ చేప.. వేలంలో రికార్డు ధరకి!
సాక్షి, కాకినాడ: కుంభాభిషేకం రేవు వద్ద అరుదైన చేప సందడి చేసింది. ఔషధ గుణాలుండే కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 10 వేలు ధర పలికింది. ఈ వేలంలో మధ్యవర్తికి రూ.25 వేల రూపాయలు దక్కింది. సముద్రంలో అరుదుగా లభిస్తుంది ఈ కచ్చిడి చేప. మత్స్యకారులు దీన్నొక వరంగా భావిస్తారు. ఈ చేప లోపల ఉండే బ్లాడర్కి డిమాండ్ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుంటుంది. అందుకే.. పాతిక కేజీల బరువున్న చేపను అత్యధికంగా మూడు లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. గతంలోనూ ఇదే తరహాలో అమ్ముడుపోయినా.. ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారు. పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లడర్ ఎక్కువ ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. -
మీకు ఆ హక్కు లేదు.... చంద్రబాబు పై వై.ఎస్.ఆర్ ఫైర్
-
కాకినాడ పోర్టు బకాయిలపై గట్టిగా నిలదీసిన వై.ఎస్.ఆర్
-
Agent Movie: సముద్ర తీరాన ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ (ఫొటోలు)
-
Agent Movie: సముద్ర తీరాన ఏజెంట్ మూవీ స్పెషల్ ఇంటర్వ్యూ (ఫొటోలు)
-
పోర్టుల ద్వారా ఆదాయం రూ.265 కోట్లు
సాక్షి, అమరావతి: ఓ పక్క కరోనా భయం వెంటాడుతున్నప్పటికీ రాష్ట్ర పోర్టులు సరుకు రవాణాలో గణనీయమైన ప్రగతిని కనపర్చాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం 2021–22లో 5 పోర్టులు (విశాఖ పోర్టు కాకుండా) ద్వారా 87.54 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగ్గా, రాష్ట్ర ప్రభుత్వం రూ.265.44 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. కరోనా ముందుకాలం 2019–20 ఆదాయంతో పోలిస్తే ఆదాయంలో 17 శాతం వృద్ధి నమోదైంది. 2019–20లో ఈ అయిదు పోర్టుల ఆదాయం రూ.226.82 కోట్లు. రాష్ట్రంలో విశాఖపట్నం మేజర్ పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, గంగవరం, కృష్ణపట్నం పోర్టులు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయి. ఇందులో కాకినాడ వద్ద ఉన్న మూడు పోర్టులు యాంకరేజ్, డీప్ వాటర్, రవ్వ పోర్టుల ద్వారా ఏపీ మారిటైమ్ బోర్డుకు రూ.185.26 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా 100 శాతం వాటా కలిగిన యాంకరేజ్ పోర్టు, రవ్వ పోర్టుల ఆదాయం గతేడాదితో పోలిస్తే పెరిగింది. కాకినాడ యాంకరేజ్ పోర్టు ద్వారా ప్రభుత్వానికి రూ.60.10 కోట్లు, రవ్వ పోర్టు ద్వారా రూ.4.59 కోట్లు వచ్చింది. ప్రైవేటు రంగంలో ఉన్న పోర్టుల ఆదాయంలో స్వల్ప క్షీణత నమోదయ్యింది. అదానీ గ్రూపు కొనుగోలు చేసిన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల ద్వారా రూ.80.18 కోట్ల ఆదాయం వచ్చింది. గంగవరం పోర్టు ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.25.29 కోట్లు, కృష్ణపట్నం పోర్టు ద్వారా రూ.54.89 కోట్ల ఆదాయం సమకూరింది. స్పల్పంగా తగ్గిన సరుకు రవాణా అంతకుముందు ఏడాదితో పోలిస్తే రాష్ట్ర పోర్టుల సరుకు రవాణాలో స్వల్ప క్షీణత నమోదైంది. 2020–21లో 5 పోర్టుల ద్వారా 89.24 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరగ్గా 2021–22లో 87.54 మిలియన్ టన్నుల రవాణా జరిగింది. కోవిడ్ వల్ల ప్రపంచ ఆర్థిక లావాదేవీలు నెమ్మదించడం దీనికి కారణమని మారిటైం బోర్డు అధికారులు తెలిపారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా కృష్ణపట్నం పోర్టు నుంచి 40.124 ఎంటీల సరుకు రవాణా అయింది. గంగవరం నుంచి 30.04 ఎంటీలు, కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి 2.91 ఎంటీలు, డీప్‌వాటర్ పోర్టు నుంచి 13.61 ఎంటీలు, రవ్వ నుంచి 0.86 ఎంటీల సరుకు రవాణా జరిగింది. -
కాకినాడ నుంచి శ్రీలంకకు బియ్యం
సాక్షి, కాకినాడ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పొరుగు దేశం శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం అందించింది. నిత్యావసరాల కొరతతో అల్లాడుతున్న లంకకు మానవతా సాయం కింద 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కాకినాడ పోర్టు నుంచి పంపనుంది. ఇందులో అత్యవసరంగా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయనుంది. ఇప్పటికే 7,500 మెట్రిక్ టన్నులను చెన్‌గ్లోరీ–1 నౌకలో లోడ్ చేశారు. ఈ నౌక మరో రెండు రోజుల్లో కాకినాడ పోర్టు నుంచి బయలుదేరి శ్రీలంక చేరుకుంటుంది. సరుకుల సరఫరాలో కీలకంగా పోర్టు.. శ్రీలంకకు బియ్యం తరలించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించింది. ఆఫ్రికా దేశాలకు భారత్ నుంచి బియ్యం ఎగుమతి చేయడానికి దేశంలో 22 మేజర్, 205 నాన్ మైనర్ పోర్టులు ఉన్నాయి. వీటిలో కాకినాడ యాంకరేజ్ పోర్టు మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ప్రస్తుతం శ్రీలంకకు సైతం ఇక్కడి నుంచే బియ్యం తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాపారపరంగానే కాకుండా మానవతా సాయం కింద పంపే సరుకుల సరఫరాలోనూ కాకినాడ పోర్టు కీలక భూమిక పోషిస్తోంది. కాగా.. ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన బియ్యాన్ని శ్రీలంకకు పంపుతున్నారు. ఇందులో తూర్పుగోదావరి జిల్లాకి చెందిన స్వర్ణ రకం బియ్యం కూడా ఉన్నాయి. రవాణా ప్రక్రియ వేగవంతం వాస్తవానికి.. ముందుగా 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం కోసం శ్రీలంక ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. కాకినాడకు చెందిన ఓ ప్రైవేటు సంస్థ టెండరు దక్కించుకుంది. ఆ సంస్థ బియ్యం సరఫరాకు సిద్ధమవుతున్న సమయంలో శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఫలితంగా బియ్యానికి నిధులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మానవతా సాయం ప్రకటించింది. బియ్యం సరఫరాకు అయ్యే ఖర్చుకు తాము పూచీగా ఉంటామని, ఆర్థిక భారం భరిస్తామని.. ఆలస్యం కాకుండా వెంటనే బియ్యం ఎగుమతి చేయాలని సదరు సంస్థను ఆదేశించింది. దీంతో బియ్యం ఎగుమతులకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో రవాణా ప్రక్రియను వేగవంతం చేశారు. 40,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి చేయాల్సి ఉండగా.. అత్యవసరంగా 11,000 మెట్రిక్ టన్నులను రెండు రోజుల్లో పంపేందుకు కాకినాడ పోర్టులో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పటికే 7,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని చెన్‌గ్లోరీ–1 నౌకలో లోడ్ చేశారు. మిగిలిన 3,500 మెట్రిక్ టన్నులను శుక్రవారం, శనివారంలోగా లోడ్ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీలంకకు నౌక బయలుదేరనుంది. ఈ బియ్యాన్ని నేరుగా శ్రీలంకలోని చౌకధరల డిపోలకు సరఫరా చేస్తారు. శ్రీలంక ప్రజలకు త్వరగా బియ్యం అందడంలో ఆలస్యాన్ని నివారించాలనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.. శ్రీలంకకు కేంద్ర ప్రభుత్వం అందజేయనున్న బియ్యం ఎగుమతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే 7,500 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని నౌకలోకి లోడ్ చేశాం. మిగిలిన 3,500 మెట్రిక్ టన్నులను కూడా త్వరితగతిన లోడ్ అయ్యేలా చూస్తున్నాం. – రాఘవరావు, కాకినాడ యాంకరేజ్ పోర్టు అధికారి -
కాకినాడ రేవు ప్రతిష్టను దెబ్బతీయొద్దు
కాకినాడ: బియ్యం ఎగుమతుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న కాకినాడ రేవు ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని కోరుతూ పోర్టు ఆధారిత వర్గాలు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు శనివారం లేఖ రాశాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్సార్సీపీ సహా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఎటువంటి మచ్చా లేకుండా పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. కొద్దిరోజులుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు తమను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్, ఆలిండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్, బార్జి ఓనర్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు శనివారం మీడియాతో మాట్లాడారు. కాకినాడ రేవు నుంచి ఆఫ్రికాతో పాటు ఇతర దేశాలకు కూడా బియ్యం రవాణా అవుతున్నాయన్నారు. ఇక్కడి నుంచి వెళ్లే బియ్యమంతా ఆంధ్రప్రదేశ్‌లో పండించినదేనన్న అపోహలతో పాటు, అనేక అంశాలకు ముడిపెడుతూ వస్తున్న కథనాలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. వాస్తవానికి 60 నుంచి 70 శాతం బియ్యం పొరుగు రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి, కాకినాడ నుంచి ఎగుమతి అవుతోందన్న వాస్తవాన్ని గుర్తించాలని వారు కోరారు. రాజకీయ పరమైన వివాదాలకు కాకినాడ రేవును కేంద్రంగా చేయవద్దని విజ్ఞప్తి చేశారు. అక్రమాలకు ఆస్కారం లేదు కస్టమ్స్ వంటి ఎన్నో కేంద్ర శాఖల పర్యవేక్షణలో ఇక్కడి కార్యకలాపాలు జరుగుతుంటాయని, రేవులో అక్రమాలకు ఎటువంటి ఆస్కారమూ ఉండదని ఆ ప్రతినిధులు స్పష్టంచేశారు. ఇక్కడి నుంచి బాయిల్డ్, రా, బ్రోకెన్ రైస్‌తో పాటు బొగ్గు, జొన్న వంటి మరెన్నో ఎగుమతులు కూడా నిరంతరాయంగా సాగుతున్నాయన్నారు. టీడీపీ నేత పట్టాభి తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయా పోర్టు ఆధారిత వర్గాలు వేర్వేరుగా మాజీ సీఎం చంద్రబాబునుద్దేశించి ఈ లేఖలు రాశాయి. సమావేశంలో కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు వారణాసి రాఘవులు (రఘు), ఆలిండియా రైస్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డీవీ కృష్ణారావు, కార్యదర్శి వినోద్ అగర్వాల్, ఉపాధ్యక్షుడు చిట్నీడి శ్రీనివాస్, కోశాధికారి కె. భాస్కరరెడ్డి, బార్జి ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బంధన హరి, లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ఎస్ రాజు పాల్గొన్నారు. -
మంత్రాలమర్రి చెప్పిన బియ్యం కథ!
పూర్వకాలంలో సేవాతత్పరత కలిగిన ఒక సంపన్నుడు ఉండేవాడట. ఆయన గుణగణాలు నచ్చిన ప్రజలు తమ అధినేతగా ఎంపిక చేసుకున్నారట. అదే సమయంలో అదే రాజ్యంలో ఒక పేద యువకుడు తీవ్రమైన ధనాశ, అధికార వ్యామోహంతో రగిలిపోతూ ఉండేవాడు. రాచబాటలో పయనిస్తే వాటిని సంపాదించడం అసాధ్యమని గట్టి నిర్ణయానికి వచ్చాడు. అడ్డదారులు తొక్కనారంభించాడు. తాంత్రిక విద్యల్ని, కనికట్టు శాస్త్రాన్ని నిష్ఠగా అభ్యసించాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా భ్రమింపజేసే నైపుణ్యం అలవడింది. తన ఇంద్రజాల ప్రదర్శనలతో అధినేత దృష్టిలో పడ్డాడు. కుతాంత్రిక విద్యా రహస్యం తెలియని సదరు అధినేత ఇంద్రజాలికుణ్ణి మెచ్చి తన కుమార్తెల్లో ఒకరినిచ్చి పెళ్ళి జరిపించాడు. ఆశబోతు యువకుడు ఇక ఒక్క క్షణం ఆలస్యం చేయలేదు. తంత్రాంగం మొదలుపెట్టాడు. ఒక మంత్రించిన మర్రి మొక్కను నాటించాడు. ఈ మర్రి చెట్టుకు భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పగలిగే దివ్యదృష్టి ఉందని చాటింపు వేయించాడు. ప్రజలకు ఏదైనా సందేశాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు మంత్రాల మర్రి ఒక ఆకును రాలుస్తుందనీ, ఆకు మీద ఉండే సందేశాన్ని అక్షరాలా పాటిస్తే ప్రజలకు పుణ్యం ప్రాప్తిస్తుందనీ, వచ్చే జన్మలో సుఖ సంతోషాలతో బతుకుతారనీ ప్రచారం చేయించాడు. ప్రజలు నెమ్మదిగా ఆకు కథల్ని నమ్మడం మొదలుపెట్టారు. జనం తన దారిలో పడ్డారన్న గురి కుదరగానే ఒక సంచలన హెచ్చరికతో కూడిన ఆకు రాలింది. అధినేతను తక్షణం గద్దె దింపి ఖైదు చేయాలనీ, లేకపోతే దేశానికి అరిష్టం దాపురిస్తుందనీ రాలిపడ్డ ఆకులో రాసి ఉంది. ఇంద్రజాలం తెలిసిన ఆయన అల్లుడిని గద్దెనెక్కిస్తే ప్రజలు భోగభాగ్యాలతో తులతూగుతారని కూడా సదరు మర్రి ఆకు జోస్యం చెప్పింది. జనం కొంత కలవరపడ్డారు. వెర్రి వెంగళప్ప లయిన అధినేత సంతానం మాత్రం బావగారి వశీకరణ మంత్రానికి దాసోహమన్నారు. వారే ముందుండి తండ్రిని ఖైదు చేయించి, బావను కుర్చీలో కూర్చోబెట్టారు. మంత్రాల మర్రి ఆకు రాతల సాయంతో చాలాకాలంపాటు ఇంద్రజాలికుడు పెత్తనం చలాయించాడు. కొన్నాళ్లకు బండారం బయటపడి జనం బడితె పూజ చేసి దేశ బహిష్కారం చేశారట! వాస్తవాలను పోలిన కథలున్నట్టే కథల్ని పోలిన వాస్తవాలు కూడా ఉంటాయి. వర్తమాన ఆంధ్ర రాజకీయాలకు ఈ కథకు చాలా దగ్గరి పోలికలుంటాయి. మంత్రాల మర్రి కాన్సెప్టుకు అచ్చు గుద్దినట్టు సరిపోయే మీడియా మాత్రం పలు చానెళ్లు, పత్రికలు, సోషల్ విభాగాలతో ఊడలు దిగి విస్తరించి ఉంది. గిట్టనివాళ్లు దీన్ని ‘ఎల్లో మీడియా’ అని విమర్శిస్తుంటారు. కథలోని ఇంద్రజాలికుడి అభీష్టం మేరకు మంత్రాల మర్రి ఆకులు రాల్చినట్టే చంద్రబాబు ప్రయోజనాల కోసం ఈ మంత్రాల మర్రి మీడియా కూడా పనిచేస్తున్నది. మిగిలిన విషయాల్లో పోలికలు ఉన్నాయో లేదో తెలియదు గానీ, ఆ మంత్రాల మర్రి – ఈ మీడియా మంత్రాల మర్రి మధ్య, వాటి స్వామిభక్తి పరాయణతల మధ్య మాత్రం స్పష్టమైన పోలికలున్నాయి. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రత్యర్థులు అధికారంలో ఉన్నప్పుడు మరో కోణంలో ఆకు కథల్ని రాల్చడం ఈ మంత్రాల మర్రి ప్రత్యేకత. దీంతోపాటు చంద్రబాబుకు మరికొన్ని అదనపు సౌలభ్యా లున్నాయి. తన సొంత పార్టీ కాకుండా ఇతర పార్టీల్లో కూడా ఆయనకు కొందరు అద్దె ‘మైకు టైసన్’లున్నారు. బాబు క్యాంపు నుంచి సిగ్నల్ అందిన వెంటనే బాబు ప్రత్యర్థి, ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ టార్గెట్‌గా వ్రాయించి ఇచ్చిన పంచ్ డైలాగ్‌లను చదివేస్తారు. స్వయంగా చంద్రబాబు లేదా ఆయన పార్టీవారు రోజుకు రెండో మూడో పంచ్‌లు విసురుతారు. ఆ పంచ్‌లు పాచిపోయే దాకా మీడియా మంత్రాల మర్రి వాటిని ప్రతిధ్వనింపజేస్తుంది. స్వయంగా మంత్రాలమర్రి ఊడ్చు కొచ్చిన స్వీయరచనలు ఈ పంచ్‌లకు అదనం. ముప్పేట దాడి వ్యూహంతో ఎల్లో మీడియా రాల్చుతున్న ఆకు కథనాలు వారానికి డజన్ దాటుతున్నాయి. ఆకు కథల్లో ఏముంది? దాని అసలు సంగతేమిటి? అని శోధించి చూసి నప్పుడు దిగ్భ్రాంతికి లోనవుతాము. సమాచార విప్లవ విస్ఫోటనం తర్వాత కూడా ఈ మంత్రాల మర్రి కథలు ఎలా రాజ్యం చేయగలుగుతున్నాయని కలవరం కలుగుతుంది. తాంత్రిక సేద్యంతో పెరిగి పెద్దదైన ఈ వృక్షం సమాజంలోకి తంత్రాంగాన్నే ప్రాణవాయువుగా విడుదల చేస్తూ, నాగరిక జీవనంలో కాలుష్యానికి కారణమవుతున్నది. ఈ వారం రోజుల్లోనే ఒక డజన్‌కు పైగా కాలుష్యకారక కథనాలను మంత్రాలమర్రి మీడియా విడుదల చేసింది. అందులో మచ్చుకు ఒక ఆకు కథనాన్ని, దాని అసలు విషయాన్ని పోల్చి చూద్దాం. మతులు పోగొట్టే ఒక మాయా ప్రపంచపు గుట్టుమట్లు కొద్ది కొద్దిగానైనా అర్థమవుతాయి. ఒక ఆకు కథ: కాకినాడ బియ్యం కాకినాడ రేవు నుంచి 2020–21 సంవత్సరంలో 30 లక్షల టన్నుల (గ్రాండ్‌గా ఉండేందుకు 3 కోట్ల క్వింటాళ్లని రాశారు) బియ్యాన్ని ఎగుమతి చేశారు. రాష్ట్రంలో బియ్యం ధర కేజీ 40 రూపాయలు వుంటే 25 రూపాయల చొప్పునే ఎగుమతి చేశారు. స్థానిక వినియోగదారులను మోసగిస్తూ తక్కువ ధరకే ఎగుమతి చేయడం ఎలా సాధ్యమైంది! కేవలం రెండే రెండు కారణాల వల్ల ఇది సాధ్యమవుతుంది. ఒకటి: పేదల సబ్సిడీ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి దారి మళ్లించే స్కామ్ ద్వారా ఎగుమతి చేసి ఉండాలి. రెండు: రైతులకు మద్దతు ధర ఎగవేసి ఉండాలి. ఎందుకంటే 1,900 రూపాయల చొప్పున మద్దతు ధర చెల్లిస్తే 25 రూపాయలకు కిలో వర్కవుట్ కాదు. ఆ ధరకు ఎగుమతి చేయాలంటే రైతులకు ధాన్యం ధర మద్దతు కంటే తక్కువగా రూ.1,400 మాత్రమే చెల్లించి ఉండాలి. ఈ రకంగా పండించిన రైతుకూ, వినియోగదారునికీ, సబ్సిడీ బియ్యం అందవలసిన పేదవారికీ అన్యాయం జరిగింది. చదివితే స్క్రీన్‌ప్లే బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది. కాని మూలకథకూ, స్క్రీన్‌ప్లేకూ ఎటు వంటి సంబంధం లేకపోవడమే ఇక్కడ విశేషం. అసలు కథ: ఇక్కడ స్క్రీన్‌ప్లే రచయిత నిర్ధారణ చేసుకోవలసిన కొన్ని ప్రాథమిక విషయాలను గాలికొదిలేశారు. 1. కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే బియ్యం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలోనే సేకరించారా? 2. ఎన్ని రాష్ట్రాల నుంచి ఎగుమతి బియ్యం కాకినాడ రేవుకు వస్తుంది? 3. మొత్తం ఎగుమతిలో ఏపీ బియ్యం వాటా ఎంత శాతం? 4. ఇందులో ఏపీ ఎగుమతి దారులు స్వరాష్ట్రం నుంచి సేకరించినదెంత – ఇతర రాష్ట్రాల నుంచి సేకరించినదెంత? 5. ఏరకమైన లేదా ఎన్నిరకాల బియ్యాన్ని కాకినాడ రేవు ఎగుమతి చేస్తున్నది. 6. అందులో మన రాష్ట్ర ప్రజలు వినియోగించే రకాలు ఉన్నాయా? 7. ఆ సంవత్సరంలో ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించిన బియ్యం పరిమాణమెంత? 8. మద్దతు ధర కంటే ఎక్కువకు రైస్ మిల్లర్లు సేకరించినదెంత? 9. రైతులే నేరుగా అధిక ధరకు ఇతర రాష్ట్రా లకు పంపించింది ఎంత? కాకినాడ పోర్టులో గానీ, బియ్యం ఎగుమతిదారుల సంఘం దగ్గర గానీ, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ దగ్గర గానీ ఈ వివరాలన్నీ దొరుకుతాయి. కానీ, ఆ వివరాల సేకరణ కోసం స్క్రీన్‌ప్లే రచయిత ప్రయత్నించలేదని ఈ కథనం చూసిన తర్వాత భావించవలసి వస్తున్నది. కాకినాడ నుంచి 2020–21 సంవత్సరం 30 లక్షల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసిన మాట వాస్తవం. ఇందులో ఉప్పుడు బియ్యం, నూక బియ్యం కలిపి 80 శాతం వాటా. మార్కెట్లో 40 రూపాయలకు దొరికే బియ్యాన్ని 25 రూపాయలకే ఎలా ఎగుమతి చేసేవారన్న ప్రశ్నకు జవాబు ఇక్కడ దొరుకుతుంది. ఉప్పుడు బియ్యాన్ని, నూక బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్ వినియోగ దారులు ఉపయోగించరు. ఇంతకంటే తక్కువ ధరకే బయట రాష్ట్రాల్లో సేకరించి ఎగుమతి చేస్తున్నారు. నూక బియ్యం, ఉప్పుడు బియ్యం పోను కాకినాడ నుంచి ఎగుమతి అయ్యే పచ్చిబియ్యం మొత్తం కూడా పొడుగు బియ్యమే. పొడుగు బియ్యాన్ని ఆంధ్ర రైతులు పండించరు. కనుక ఎగుమతి చేసిన ఉప్పుడు బియ్యం, నూక బియ్యం, పొడుగు రకం పచ్చి బియ్యాల్లో ఏ రకం కూడా ఆంధ్రప్రదేశ్‌లో సేకరించినవి కావు. కాకినాడ నుంచి ఎగుమతి చేసే బియ్యం 80 శాతాన్ని ఇతర రాష్ట్రాల ఎగుమతిదారులే చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఎగుమతిదారులు సేకరించే మిగిలిన 20 శాతం బియ్యంలో తొంభై శాతాన్ని బెంగాల్, ఒడిషా, బిహార్ రాష్ట్రాల నుంచి సేకరిస్తున్నారు. ఈ లెక్క ప్రకారం 2020–21లో కాకినాడ పోర్టు ఎగుమతి చేసిన 30 లక్షల టన్నుల బియ్యంలో ఆంధ్రప్రదేశ్ ఎగుమతి దారులు సేకరించింది (20 శాతం) 6 లక్షల టన్నులు. ఇందులో ఇతర రాష్ట్రాల్లో సేకరించింది (90 శాతం) 5 లక్షల 40 వేల టన్నులు. ఇక మిగిలింది 60 వేల టన్నులు. అంటే మొత్తం ఎగుమతిలో రెండు శాతం! హతవిధీ! ఈ రెండు శాతం ఎంత పని చేసింది? మంత్రాల మర్రి కథనం ప్రకారం రైతుల గిట్టుబాటు ధరలో క్వింటాల్ 500 రూపాయలను కొల్లగొట్టింది ఈ రెండు శాతమే. వినియోగదారులకు మార్కెట్లో 25 రూపాయలకు కిలో బియ్యం దొరక్కుండా చేసింది ఈ రెండు శాతమే. సబ్సిడీ బియ్యాన్ని అందుకునే నిరు పేదల కడుపు కొట్టింది కూడా ఈ రెండు శాతమేనని ఈ కథనం సారాంశం. ఈ లెక్కలన్నీ బియ్యం ఎగుమతిదారుల సంఘం వారు విడుదల చేసినవే. ఆంధ్రప్రదేశ్ రైతులు 2020–21లో 1 కోటి 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడిని సాధించారు. ఇందులో 82 లక్షల 68 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు సేకరించింది. మేలురకం ధాన్యాన్ని నేరుగా రైస్ మిల్లర్లే మద్దతు ధరకంటే ఎక్కువకు రైతుల నుంచి కొనుగోలు చేశారు. మిగిలిన ధాన్యాన్ని రైతులు కుటుంబ అవసరాల కోసం తమవద్దే ఉంచుకున్నారు. ఇదీ లెక్క. మరి మంత్రాల మర్రిచెట్టు చెప్పిన 30 లక్షల టన్నుల బియ్యం లెక్క ఎక్కడిదో విజ్ఞులు ఆలోచించాలి. ఈ వారం రోజుల్లో మంత్రాల మర్రి రాల్చిన ఆకు కథలన్నీ ఇటువంటి మాయ కథలే. సినిమారంగ సమస్యలపై చర్చించ డానికి కొందరు హీరోలు, దర్శకులు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంపై కూడా చంద్రబాబు అసంగతమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి సినీ ప్రముఖులను అవమా నించారని ఈయన ఆవేశం వెళ్లగక్కారు. ఆయన ఆవేశానికి మంత్రాల మర్రి సుడిగాలినిచ్చి ఎగదోసింది. ముఖ్యమంత్రిని గురించి ఆయనను కలిసిన తర్వాత ఆ సినీప్రముఖులు ఏమని చెప్పారనే ఇంగితాన్ని వదిలేశారు. ముఖ్యమంత్రి వ్యక్తిత్వం మీద చినజీయర్ స్వామి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు ఈ తరహా ప్రచారానికి చెంపపెట్టు లాంటివి. ప్రత్యేక హోదా ఎపిసోడ్ నిజానికి చంద్రబాబు కూటమి సిగ్గుతో తలదించుకోవలసిన విషయం. సాంకేతికంగా రెండు రాష్ట్రాల మధ్య జరిగే చర్చల ఎజెండా నుంచి రాష్ట్రానికే ప్రత్యేకమైన అంశాలను తొలగించి ఉండవచ్చు. కానీ, చంద్రబాబు స్వహస్తాలతో ఖననం చేసిన అంశానికి వైఎస్ జగన్ తిరిగి ప్రాణం పోసి నిలబెట్టారని ఈ ఎపిసోడ్ నిరూపించింది. కానీ మన మంత్రాల మర్రి దీన్ని జగన్ ప్రభుత్వ వైఫల్యంగా ప్రచారం చేయడానికి నానాపాట్లు పడింది. గౌతమ్ సవాంగ్ వ్యవహారం ఇలాంటిదే. చంద్రబాబు హయాంలో ఒక డీజీపీ సగటున 15 నెలలు పనిచేశారు. 30 నెలల తర్వాత సవాంగ్‌ను మార్చడం మంత్రాల మర్రికి విడ్డూరంగా తోచింది. ఉద్యోగుల సంఘ నాయకుడిగా ఉన్న అశోక్‌బాబు తన సర్వీస్ రిజిస్టర్‌ను ట్యాంపర్ చేసి లేని విద్యార్హతలను చేర్చుకున్నారు. నేరం బయటపడడంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. దొంగతనం చేస్తే మాత్రం అరెస్టు చేస్తారా? ఇది వేధింపు కాదా అని ప్రతిపక్షం ఎదురుదాడికి దిగింది. నిజంగానే జగన్ ప్రభుత్వం తన వ్యతిరేకులను వేధిస్తున్నదని మంత్రాల మర్రి చర్చాగోష్ఠులు నడిపింది. ఒక్క వారంలో ఇన్ని వక్రీకరణలకు పాల్పడిన మంత్రాల మర్రి కథల పట్ల జనం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. వర్ధెల్లి మురళి vardhelli1959@gmail.com -
టీడీపీ హయాంలో ఈనాడు ఎందుకు మాట్లాడలేదు..
-
టీడీపీ హయాంలో ఈనాడు ఎందుకు ప్రశ్నించలేదు: కురసాల కన్నబాబు
సాక్షి, తూర్పుగోదావరి: ఎల్లో మీడియా కథనాలపై వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాకినాడ కేంద్రంగా కిలో బియ్యం రూ.25 లకే విదేశాలకు రిసైకిల్ చేసి ఎగుమతి చేస్తున్నారని ఈనాడులో కథనం వచ్చిందన్నారు. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాకనే కాకినాడ నుంచి బియ్యం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయా అని ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి శుక్రవారం మాట్లాడుతూ.. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బియ్యం ఎగుమతి అయ్యాయా లేదా అంటూ ఈనాడు పత్రికను నిలదీశారు. అప్పుడెందుకు ఈ అనుమానం రాలేదని ప్రశ్నించారు కనీసం వివరణ తీసుకుని వార్త రాయాలన్న జర్నలిజం నైతిక విలువలు పాటించడం లేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళ్ళు మూసుకుపోయి వార్తలు రాయొద్దన్నారు. లాంగ్ గ్రేయిన్ రైస్ ఏ రాష్ట్రం నుంచి ఎంత మొత్తంలో ఎగుమతి చేశారో అధ్యయనం చేయాలని సూచించారు. కాకినాడ పోర్టు నుంచి ఎగుమతి అయ్యే బియ్యాన్ని అధికారులు ముందుగా పరీక్షిస్తారని తెలుసుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు బయటకు వచ్చి రాజకీయంగా నడవలంటే రెండు ఊత కర్రలు.. ఒక త్రీవీల్ ఛైర్ కావాలని, రాజకీయంగా కదలలేని స్ధితిలో మూలన పడిపోయారని విమర్శించారు. చదవండి: చంద్రబాబు రివర్స్ డ్రామా.. ఇదీ వాస్తవం -
కాకినాడ యాంకరేజి పోర్టు: ఎక్స్‌పోర్ట్‌లో నెంబర్ 1
Kakinada Anchorage Port బియ్యం ఎగుమతులకు కాకినాడ యాంకరేజ్ పోర్టు కేరాఫ్ ఆడ్రస్‌గా నిలించింది. ఆఫ్రికా దేశాలకు ఎగుమతుల విషయంలో దేశ వ్యాప్తంగా ఉన్న 22 మేజర్, 205 నాన్‌మేజర్ పోర్టుల్లో ఈ పోర్టు మొదటి స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. కలకత్తా, నెల్లూరు, వైజాగ్ తదితర పోర్టుల నుంచి కొంత మేర ఎక్స్పోర్ట్ అవుతున్నా.. 90 శాతం ఎగుమతి అవుతున్న జాబితాలో కాకినాడ పోర్ట్ నిలించింది. ఇక్కడి నుంచి ఏటా రూ.వందల కోట్లు విలువ చేసే సరుకు (బియ్యం, సిమెంట్) ఎక్స్పోర్ట్ అవుతుంటాయంటే అతిశయోత్తి కాదు. వ్యాపారులకు అవసరమైన రవాణా, గోడౌన్, లోడింగ్, అన్లోడింగ్ సదుపాయం, కార్మికులు అందుబాటులో ఉండటంతో ఇక్కడి నుంచి ఎగుమతులు చేసేందుకు ఉత్సాహం చూపుతుంటారు. – సాక్షి, కాకినాడ ఇదీ సంగతి తూర్పు గోదావరి జిల్లాలో సుదీర్ఘ సాగతీరం ఉంది. సముద్ర రవాణాకు అత్యంత అనుకూలమైన ప్రాంతం. ఇక్కడి తీరంలో రెండు పోర్టులున్నాయి. కాకినాడ యాంకరేజి పోర్టు ఆంధ్రప్రదేశ్ పోర్టుల శాఖ పర్యవేక్షణలో ఉంది.కాకినాడ డీప్ వాటర్ పోర్టు(సీ పోర్టు) ప్రైవేటు యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తోంది. వీటిలో యాంకరేజి పోర్టు నుంచి బియ్యం దక్షిణాఫ్రికా దేశాలకు, సిమెంటు పోర్డుబ్లెయిర్, అండమాన్‌కు ఎగుమతి చేస్తుంటారు. సీ పోర్టు నుంచి గ్రానైట్ బ్లాకులు, సిమెంటు, పంచదార, లాటరైట్ తదితర నిల్వలు విదేశాలకు ఎగుమతి అవుతాయి. బొగ్గు, ఎరువులు, అల్యూమినియం, పాస్పరిక్ యాసిడ్, వంటనూనెలు దిగుమతి అవుతుంటాయి. ఏటా రూ.కోట్లలో ఎగుమతులు కాకినాడ యాంకరేజి పోర్టు నుంచి ఏటా కోట్ల రూపాయల విలువ చేసే సరుకు సౌతాఫ్రికన్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.5,104 కోట్లు విలువ చేసే 28,21,222 మెట్రిక్ టన్నుల సరుకు ఎగుమతి చేశారు. ఫలితంగా ప్రభుత్వానికి రూ.49.87 కోట్ల ఆదాయం సమకూరింది. ఎగుమతి సరుకులో ఒక్క బియ్యమే 27,91,769 మెట్రిక్ టన్నులు. సిమెంట్ 29,453 మెట్రిక్ టన్నులు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు నెలల వ్యవధిలోనే 11,20,140 మెట్రిక్ టన్నుల బియ్యం, 23,610 మెట్రిక్ టన్నుల సిమెంట్ ఎగుమతి చేశారు. తద్వారా ప్రభుత్వానికి రూ.11.02 కోట్ల ఆదాయం వచ్చినట్లు పోర్టు అధికారులు వెల్లడించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలోని ఐదు మైనర్ పోర్టుల ద్వారా ప్రభుత్వానికి రూ.285.60 కోట్లు ఆదాయం రాగా.. అందులో కాకినాడలో పోర్టు నుంచే రూ.179.73 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వ ప్రోత్సాహం గతేడాది కరోనా కారణంగా ఎగుమతులు భారీగా తగ్గాయి. రోజుకు 10 వేల మంది కూలీలు పోర్టులో పని చేయాల్సి ఉండగా 3 వేల మంది మాత్రమే హాజరయ్యేవారు. వెరసి ఎగుమతులు, దిగుమతులకు విఘాతం ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి బియ్యం రవాణాకు అవరోధం ఏర్పడింది. ఈసారి ప్రభుత్వం వ్యవసాయం, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగకుండా మినహాయింపు ఇవ్వడంతో బియ్యం ఎగుమతులు ఊపందుకున్నాయి. అనుకూల వాతావరణం ∙జిల్లాలో బియ్యం ఎగుమతులు చేసే వ్యాపారులకు అనుకూల వాతావరణం ఉంది. ∙ఎక్కువ శాతం బియ్యం ఛత్తీస్గడ్ నుంచి కాకినాడ పోర్టుకు సరఫరా అవుతాయి. అక్కడి నుంచి పోర్టుకు రవాణా చేసేందుకు అవసరమైన రైల్వే వ్యాగన్ సదుపాయం ఉంది. ∙సరుకు లోడింగ్, అన్‌లోడింగ్‌కు అవసరమైన హమాలీలు అందుబాటులో ఉంటారు. ∙ముడిసరుకు ఉత్పత్తి చేసేందుకు (ధాన్యం ఆడించేందుకు) అవసరమైన బాయిల్డ్ రైస్ మిల్లులు పుష్కలంగా ఉన్నాయి. ∙ఎక్కడా లేని విధంగా 117 మిల్లులు పదుల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ∙బియ్యం ఆడిన తర్వాత ఎగుమతికి జాప్యం జరిగినా సరుకు నిల్వకు వేల సంఖ్యలో గోదాములున్నాయి. ప్రధానంగా సముద్రంలో స్టీమర్‌కు లంగరు వేస్తే నెల రోజులైనా.. అక్కడే సురక్షితంగా ఉంచే సౌకర్యం ఉండటం అనూలించదగ్గ విషయం. ∙సరుకు రవాణాకు లారీలు ఉన్నాయి. -
కాకినాడ బీచ్‌లో యుద్ధ విమాన మ్యూజియం ..
సాక్షి,కాకినాడ రూరల్: యుద్ధ విమాన మ్యూజియం కాకినాడ బీచ్‌లో త్వరలోనే ప్రారంభం కానుంది. సంబంధిత పనులు వేగం అందుకున్నాయి. సూర్యారావుపేట బీచ్‌లో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యాన అభివృద్ధి చేస్తున్న పార్కులో రూ.5.89 కోట్ల కాకినాడ పట్టణాభి వృద్ధి సంస్థ (కుడా) నిధులతో టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు కానున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నానికి చెందిన తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సంస్థ ఈ పనులు చేపడుతోంది. ఈ పనులను తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ శనివారం స్వయంగా పరిశీలించారు. ఆయనకు కలెక్టర్ సి.హరికిరణ్, నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి కుమార్, వైస్ చైర్మన్ కె.సుబ్బారావు, జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు, ఆర్డీఓ చిన్నికృష్ణ తదితరులు స్వాగతం పలికారు. యుద్ధ విమానాన్ని పరిశీలించిన వైస్ అడ్మిరల్ అజేంద్ర ప్రజా సందర్శనకు వీలుగా చేపట్టబోయే పనుల గురించి కలెక్టర్ హరికిరణ్, తనేజా సంస్థ ప్రతినిధి శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నంలో మాదిరిగా సందర్శకులు చూసేందుకు ప్రవేశ ద్వారం ఏర్పాటు చేయాలని సూచించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయాలన్నారు. డిసెంబర్ 4న ప్రారంభోత్సవం జరిగేలా చూడాలన్నారు. మ్యూజియం, పార్కు అభివృద్ధి పురోగతి, పెండింగ్ పనులపై సమీక్షించారు. పనులపై వైస్ అడ్మిరల్ సంతృప్తి మ్యూజియం పనులపై కలెక్టర్ హరికిరణ్, కుడా వీసీ సుబ్బారావులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైస్ అడ్మిరల్‌కు వివరించారు. బహదూర్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ త్వరితగతిన మ్యూజియం పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్న జిల్లా అధికారులను అభినందించారు. పనులు పూర్తయ్యాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ మ్యూజియాన్ని ప్రారంభిస్తారన్నారు. కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ యూటీ–142 యుద్ధ విమాన మ్యూజియం పనులు త్వరిగతిన జరుగుతున్నాయన్నారు. వీటని 60 నుంచి 90 రోజుల్లో పూర్తి చేస్తామని తనేజా సంస్థ ప్రతినిధి తెలిపారన్నారు. కోల్‌కతా, విశాఖపట్నం తర్వాత కాకినాడలో మాత్రమే యుద్ధ విమాన మ్యూజియం ఉందన్నారు. ఏపీ టూరిజం విభాగం స్నాక్స్ బార్, ఇంటర్‌ప్రెటేన్ సెంటర్ ఏర్పాటుతో పాటు రూ.1.50 కోట్లతో పచ్చదనం ఉండేలా పార్కును అభివృద్ధి చేస్తుందన్నారు. కుడా పీఓ సత్యనారాయణమూర్తి, ఏపీలు సూర్యనారాయణ, కృష్ణ, శాంతిలత, తహసీల్దార్ మురళీకృష్ణ, రాగిరెడ్డి బన్నీ, సిద్ధార్ధ తదితరులు పాల్గొన్నారు. సమీపంలోని నేవల్ ఎన్క్లేవ్ వద్దకు వెళ్లిన వైస్ అడ్మిరల్ అక్కడి సిబ్బందితో భేటీ అయ్యారు. -
కాకినాడ పోర్టులో ఎల్ఎన్జీ టెర్మినల్
సాక్షి, అమరావతి: కాకినాడ డీప్ వాటర్ పోర్టులో లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ) టెర్మినల్ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ముంబైకి చెందిన హెచ్.ఎనర్జీ సంస్థ అనుబంధ సంస్థ ఈస్ట్‌కోస్ట్ కన్సెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈసీపీఎల్) దీనిని నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. ఆ సంస్థ రెండు దశల్లో సుమారు రూ.5,400 కోట్ల పెట్టుబడి అంచనాతో భారీ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రిమండలి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తొలి దశ పనులు చేపట్టేందుకు ఈసీపీఎల్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. దీర్ఘకాలం కొనసాగేలా.. ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మాణానికి భారీ వ్యయం కానుండటంతో.. టెర్మినల్‌ను దీర్ఘకాలం కొనసాగించాల్సి ఉంటుంది. కాకినాడ డీప్‌వాటర్ పోర్టు (కేఎస్పీఎల్)ను 50 ఏళ్లపాటు నిర్వహించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వంతో కేఎస్పీఎల్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ పైన పదేళ్లపాటు పొడిగించే అవకాశం ఉంది. అయితే, కేఎస్పీఎల్ ఏర్పాటై 23 ఏళ్లు గడిచిపోగా.. ఇక 27 ఏళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ఈస్ట్‌కోస్ట్ కన్సెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వెనుకంజ వేస్తోంది. కేఎస్పీఎల్ కన్సెషన్ సమయం అయినపోయిన తర్వాత కూడా టెర్మినల్ కొనసాగించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డు లేదా కన్సెషన్ పీరియడ్ తర్వాత వచ్చే కొత్త ఆపరేటర్‌తో కొనసాగించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపడంతో ఎల్ఎన్జీ టెర్మినల్ తొలి దశ పనులను చేపట్టడానికి ఈసీపీఎల్ ముందుకొచ్చింది. తొలి దశలో రూ.1,800 కోట్ల పెట్టుబడులు కాకినాడ డీప్ వాటర్ పోర్టులో తొలి దశలో రూ.1,600 కోట్ల ఎల్ఎన్జీ టెర్మినల్, రూ.200 కోట్లతో ఎల్‌సీఎన్‌జీ స్టేషన్స్ నిర్మించే విధంగా ఏపీ మారిటైమ్ బోర్డుకు ఈస్ట్‌కోస్ట్ సంస్థ ప్రతిపాదనలు పంపింది. రెండో దశలో మరో రూ.3,600 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కన్సెషన్ అగ్రిమెంట్‌పై స్పష్టత రావడంతో వర్షాకాలం తర్వాత ఈసీపీఎల్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్ ‘సాక్షి’కి వివరించారు. 5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేస్తుండగా.. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉపాధి లభిస్తుంది. ఏటా 1 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ సరఫరా చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాట్ రూపంలో ఏటా రూ.1,200 కోట్ల ఆదాయంతో పాటు కాకినాడ డీప్ వాటర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటా రూపంలో మరో రూ.100 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ మధ్యనే గంగవరం పోర్టులో అత్యధిక వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూపు కూడా అక్కడ భారీ ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు మురళీధరన్ తెలిపారు. ఈ రెండు టెర్మినల్స్ అందుబాటులోకి వస్తే రాష్ట్ర ఖజానాకు వచ్చే15 ఏళ్లలో వ్యాట్ రూపంలో రూ.50 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. -
ఎక్స్‘పోర్ట్స్’ ఆదాయం అదరహో
సాక్షి, అమరావతి: గడచిన ఆర్థిక సంవత్సరంలో పోర్టుల ద్వారా రాష్ట్ర ఖజానాకు రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 5 మైనర్ పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.285.60 కోట్ల ఆదాయం లభించింది. కరోనా కాలంలోనూ ఎగుమతులను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆదాయాన్ని పొందగలిగింది. విశాఖ పోర్టు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండగా.. కాకినాడ యాంకరేజ్ పోర్టు, రవ్వ పోర్టు, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కృష్ణపట్నం పోర్టు, గంగవరం పోర్టు నుంచి ఏపీ మారిటైమ్ బోర్డుకు ఈ ఆదాయం వచ్చింది. అంతకుముందు ఏడాది (2019–20)లో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.226.82 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది గంగవరం పోర్టు డివిడెండ్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.37.61 కోట్లు ఇవ్వడం కూడా ఆదాయం పెరగడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు. 2020–21లో ఈ ఐదు పోర్టులు 89.238 మిలియన్ టన్నుల సరకు రవాణా నిర్వహించడం ద్వారా రూ.3,556.62 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. అంతకుముందు సంవత్సరం 99.44 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా 5 పోర్టులు రూ.3,639.81 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. కాకినాడ నుంచే 63 శాతం ఆదాయం రాష్ట్రంలోని 5 మైనర్ పోర్టుల ద్వారా ప్రభుత్వానికి రూ.285.60 కోట్ల ఆదాయం రాగా.. అందులో ఒక్క కాకినాడ పోర్టు నుంచే రూ.179.73 కోట్ల ఆదాయం సమకూరింది. అంటే ఒక్క కాకినాడ నుంచే 62.93 శాతం ఆదాయం వస్తోంది. కొత్తగా కాకినాడ గేట్‌వే పోర్టు అందుబాటులోకి వస్తే ఈ ఆదాయం మరింత పెరిగే అవకశాం ఉందని మారిటైమ్ అధికారులు పేర్కొంటున్నారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో కాకినాడ డీప్ వాటర్ పోర్టు 14.77 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.575 కోట్ల ఆదాయం ఆర్జిస్తే అందులో ప్రభుత్వానికి రూ.126.50 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే పూర్తిగా 100 శాతం వాటా కలిగిన యాంకరేజ్ పోర్టు ద్వారా రూ.49.88 కోట్లు, రవ్వ క్యాపిటివ్ పోర్టు ద్వారా రూ.3.55 కోట్ల ఆదాయం ఖజానాకు వచ్చింది. ఇదే సమయంలో గంగవరం పోర్టు 32.83 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా రూ.1,056.46 కోట్ల ఆదాయం ఆర్జించగా.. ప్రభుత్వ వాటాగా రూ.59.8 కోట్లు (డివిడెండ్‌తో కలిపి) వచ్చింది. అలాగే కృష్ణపట్నం పోర్టు 38.18 మిలియన్ టన్నుల సరకు రవాణా ద్వారా రూ.1,871.93 కోట్ల ఆదాయం సమకూర్చుకోగా.. రాష్ట్ర ఖజానాకు రూ.46.07 కోట్లు వచ్చాయి. -
కాకినాడ యాంకరేజ్ పోర్టు.. కొత్త రికార్డులు
సాక్షి, అమరావతి: కరోనాతో ఒకపక్క అంతర్జాతీయ లావాదేవీలు నిలిచిపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కాకినాడ యాంకరేజ్ పోర్టు రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. పోర్టు చరిత్రలో తొలిసారిగా 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.49.87 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి రికార్డు సృష్టించింది. యాంకరేజ్ పోర్టులో 100 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానికే ఉండటంతో ఈ మొత్తం రాష్ట్ర ఖజానకు వచ్చి చేరింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఆదాయంలో 37.61 శాతం వృద్ధి నమోదయ్యింది. 2019–20లో కాకినాడ యాంకరేజ్ పోర్టు రూ.36.24 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. 2019–20 కాలంలో కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి రూ.2,420 కోట్ల విలువైన 11,68,730 టన్నుల సరుకు ఎగుమతి కాగా 2020–21లో రికార్డు స్థాయిలో రూ.5,104 కోట్ల విలువైన 28,21,222 టన్నుల సరుకు ఎగుమతులు జరిగాయి. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే యాంకరేజ్ పోర్టు కార్గో నిర్వహణ సామర్థ్యంలో 141 శాతం వృద్ధి నమోదయితే, విలువ పరంగా 110 శాతం వృద్ధిని నమోదు చేసింది. బియ్యం ఎగుమతులకు భారీ డిమాండ్ లాక్‌డౌన్‌తో కొంతకాలం పోర్టు లావాదేవీలు నిలిచిపోయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారిగా బియ్యానికి డిమాండ్ పెరగడంతో యాంకరేజ్ పోర్టుకు కలిసొచ్చింది. రాష్ట్రంలో పంటలు సంవృద్ధిగా పండటం, దక్షిణాఫ్రికా దేశాల నుంచి బియ్యానికి డిమాండ్ రావడంతో ఈ ఏడాది బియ్యం ఎగుమగుతులు బాగా జరిగినట్లు పోర్టు అధికారులు వెల్లడించారు. కాకినాడ యాంకరేజ్ పోర్టు ఏడు నుంచి 8 ఓడలు లోడింగ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే పోర్టుకు వెలుపుల ఏకంగా 12 నుంచి 15 ఓడలు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.82 మిలియన్ టన్నుల సరుకులు యాంకరేజ్ పోర్టు నుంచి ఎగుమతి కాగా అందులో 2.78 మిలియన్ టన్నుల బియ్యం ఎగుమతులు జరగడం గమనార్హం. -
పోర్టులో నిలిచిపోయిన సేవలు
-
సముద్రంలో మునిగిపోయిన స్టీల్ బార్జి
కాకినాడ క్రైం: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి ఆఫ్రికాకు వెళ్లే ఓడలోకి బియ్యం లోడ్ చేసేందుకు వెళ్తున్న స్టీల్ బార్జి ఆదివారం ఉదయం సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదం నుంచి 12 మంది కళాసీలు తృటిలో తప్పించుకున్నారు. రూ.5 కోట్ల మేర నష్టం సంభవించి ఉంటుందని పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మెస్సర్స్ లోటస్ మెరైన్ కంపెనీ ఇచ్చిన ఆర్డర్ మేరకు కాకినాడ పోర్టు నుంచి ఆఫ్రికా వెళ్లే ఓడలోకి 600 టన్నుల బియ్యం లోడ్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో మేళం తాండవకృష్ణకు చెందిన బి–81వ నంబర్ స్టీల్ బార్జిలోకి శనివారం రాత్రి బియ్యం లోడ్ చేశారు. ఆదివారం ఉదయమే ఓ బోటుతో ఈ బార్జిని ఓడ వద్దకు చేర్చారు. ఓడ సమీపంలోకి వెళ్లేసరికి బలమైన గాలులు వీయడంతో ముందుకెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో బార్జిపై 12 మంది కళాసీలున్నారు. ప్రమాదాన్ని గుర్తించిన కళాసీలు బార్జిని తిరిగి యాంకరేజ్ పోర్టుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఒక్కసారిగా పెనుగాలులు వీచాయి. దీంతో అలలు ఎగసిపడి బార్జిలోకి నీరు ప్రవేశించింది. అది మునిగిపోతుండడాన్ని గమనించిన కళాసీలు కేకలు పెట్టారు. దీంతో బార్జిని తీసుకెళ్తున్న బోటులోని వారు వెంటనే స్పందించి బార్జికి, బోటుకు ఉన్న రోప్‌ను కట్ చేశారు. లేకుంటే బోటు కూడా మునిగిపోయేదని బార్జిలో ఉన్న సరంగు దుర్గారావు చెప్పారు. బార్జి మునిగిపోతుండటంతో దానిలో ఉన్న 12 మంది కళాసీల్లో 8 మంది బోటు ఎక్కేశారు. మరో నలుగురు కళాసీలు బోటు ఎక్కే ప్రయత్నంలో సముద్రంలో పడిపోయారు. వారిని బోటులోని వారు రక్షించారు. దీంతో వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారు చూస్తుండగానే 600 టన్నుల బియ్యంతో బార్జి సముద్రంలో మునిగిపోయింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి వాతావరణంలో మార్పులొచ్చి, వర్షం కూడా పడింది. అయినా పోర్టు అధికారుల ఒత్తిడి మేరకే బార్జిని సముద్రంలోని ఓడ వద్దకు తీసుకెళ్లినట్టు కొందరు కళాసీలు చెబుతున్నారు. ప్రమాదంలో బార్జి యజమానికి రూ.3 కోట్ల వరకూ నష్టం వాటిల్లి ఉంటుందని, అందులోని బియ్యం విలువ మరో రూ.2 కోట్లు ఉండొచ్చని పోర్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంపై బార్జి యజమాని మేళం తాండవకృష్ణ పోర్టు అధికారులకు ఫిర్యాదు చేశారు. కాకినాడ మెరైన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తరుముకొస్తున్న తుపాను
ఫొని తుపాను జిల్లా వాసులను హడలెత్తిస్తోంది. కొంతమంది రైతుల పొలాల్లో కోసిన వరి పనలుండిపోయాయి. మరికొంతమంది రైతుల కళ్లాల్లో నూర్పులకు సిద్ధం చేసిన వరి కుప్పలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఓ వైపు తుపాను ఎటు పయనిస్తోందో...తుపాను ముప్పు తప్పినా భారీ వర్షాలు జిల్లాలో కురిస్తే చేతికొచ్చిన పంటల పరిస్థితేమిటోనని ఆందోళన చెందుతున్నారు. వేట నిషేధం కారణంగా మత్స్యకారులు వేటకు దూరంగా ఉండడం కొంత ఊరట. కానీ సముద్రం అలలు ఉవ్వెత్తున లేవడం, సముద్రం కొన్ని మీటర్ల ముందుకు వచ్చేస్తుండడంతో తీరప్రాంతవాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటోంది. తూర్పుగోదావరి ,కాకినాడ సిటీ: ‘ఫొని’ తుపాను ప్రభావం ఫలితంగా అలలు ఉవ్వెత్తున లేస్తుండడంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రతీరం కోత కు గురవుతోంది. తుపాను తీవ్రతను తెలియజేస్తూ కాకినాడ పోర్టులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నానికి ఆగ్నేయంగా 870 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై... ఇది క్రమేపీ ఆ రాష్ట్ర తీరంవైపు కదులు తోందని, 1, 2 తేదీల్లో ఒడిశా తీరాన్ని తాకుతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాపై ప్రభావం ఉంటుందని ముందుగా భావించినప్పటికీ వాయవ్య దిశగా పయనిస్తోందని అంచనా వేయడంతో జిల్లాకు ప్రమాదం ఏమీ ఉండదని అధికారులు చెబుతున్నారు. అయినా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, పల్లపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మత్స్యకార గ్రామాల్లో టాంటాం, మైకుల ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే తీరప్రాంత మండలాలుగా ఉన్న 14 మండలాల్లో ప్రత్యేక అధికారులను నియమించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అన్ని ఆర్డీవో కార్యాలయాలతోపాటు తహసీల్దార్ కార్యాలయాల్లోనూ ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ఒడిశా ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించడంతో ఆ ప్రభావంతో జిల్లాలో పెద్ద ఎత్తున వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాకినాడ తీరంలో పది మీటర్ల ముందుకు... కాకినాడ తీరంలోని సముద్రం పది మీటర్లు ముందుకు చొచ్చుకువచ్చిందని మత్స్యకారులు చెబుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున పర్యాటకులు బీచ్‌కు తరలి వచ్చారు. పోలీసులు బీచ్‌కు వచ్చే పర్యాటకులను సముద్రతీరానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రధాన ద్వారాలను బారికేడ్లతో మూసివేశారు. సముద్రంలో స్నానాలు చేస్తున్న పర్యాటకులకు తుపాను హెచ్చరికలు తెలియజేస్తూ సముద్ర తీరం నుంచి బయటకు పంపే కార్యక్రమాలు చేపట్టారు. తుపాను గమనం రోజురోజుకూ మారుతుండడంతో అధికారులు కూడా ఫొని తుపానుపై కచ్చితమైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. బుధవారం మధ్యాహ్నానికి స్పష్టత వచ్చే అవకాశం ఉందని కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి. తుపాను ప్రభావంతో తీరప్రాంతాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. తీరంలో అప్రమత్తత... గత మూడు రోజులుగా సముద్రంలో అలజడి పెరి గింది. జిల్లాలో తీరప్రాంత మండలాలుగా ఉన్న 14 మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. స ముద్ర వేటపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్యకారులు ప్రస్తుతం ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు సముద్రంలో వేటపై నిషేధం ఉండటంతో సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారు. గత మూడు రోజులుగా సముద్రంలో చోటుచేసుకుంటున్న మార్పుల నేపథ్యంలో పడవలు, వలలు తీరం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు మత్స్యకారులు చేపట్టారు. అలల తీవ్రత పెరిగి మూడు మీటర్ల ఎత్తులో ఎగిసి పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ముందస్తు హెచ్చరికలతో తీరప్రాంత గ్రామాలను అప్రమత్తం చేశారు. ప్రత్యేక అధికారులు తహసీల్దార్లతో తీరప్రాంత గ్రామాల పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 39 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావడంతో వడగాలులు కూడా మొదలయ్యాయి. వేగం తగ్గిన ఫొని పయనం... బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఫొని తుపాను వేగం తగ్గిందని కాకినాడ పోర్టు అధికారులు తెలిపారు. ఇది ఒడిశా వైపు పయనిస్తుందని, రాష్ట్రం మీదుగా పయనించే సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇది బుధ, గురువారాల్లో ఒడిశా తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు తెలిపారు. నేడు, రేపు వర్ష సూచన... బుధ, గురువారాల్లో జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. అవసరమైతే పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని పోలీస్ అధికారులతో మాట్లాడి సముద్రతీర ప్రాంతాల్లో మెరైన్ పోలీసులతో గస్తీ ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే రైతులు పండించిన పంట ను రక్షించుకునే చర్యలు ముమ్మరంగా చేపట్టారు. కళ్లాల్లోనే ధాన్యం ఉండిపోవడంతో వాటిని ఒబ్బిడి చేసుకునే పనిలో తలమునకలయ్యారు. వర్షాలు రాకపోతే వడగాలులు... తుపాను దిశను మార్చుకొని వేరే ప్రాంతానికి తరలితే జిల్లాలో బుధవారం నుంచి వడగాలులు వీచే అవకాశముందని, ఎవరికీ వడదెబ్బ తగలకుండా వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. -
‘రేషన్’ దొంగల కొత్త మార్గాలు!
- క్వింటా బియ్యం మించకుండా రైళ్లలో మూటల తరలింపు - రైల్వేస్టేషన్లపై దాడులు చేస్తున్న ‘సివిల్ సప్లైస్’ - పటిష్టమైన చర్యలతో కాకినాడపోర్టుకు బందైన అక్రమ బియ్యం లారీలు సాక్షి, హైదరాబాద్: రేషన్ బియ్యం పక్కదారి పట్టించేం దుకు అక్రమార్కులు కొత్త మార్గాలు కనిపెట్టారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా రేషన్ దొంగలు తమ అక్రమాలను యథేచ్ఛగా సాగిస్తున్నారు. ఇటీవల వరసగా జరిగిన సంఘటనలు చౌకధరల బియ్యం అక్రమార్కుల వ్యూహాన్ని బయటపెట్టింది. ఏభై కేజీలు, క్వింటా పరిమాణంలో మూటలు కట్టి బియ్యాన్ని రైళ్లలో రాష్ట్రసరిహద్దులు దాటిస్తున్నారు. ఇన్నాళ్లూ రోడ్డు మార్గంలో లారీలు, వ్యాన్లు, ఆటోల్లో మాత్రమే బియ్యాన్ని అక్రమంగా తరలించేవారు. కేవలం నెల వ్యవధిలోనే నాంపల్లి స్టేషన్లో 8 క్వింటాళ్లు, కాచిగూడ స్టేషన్లో 22 క్వింటాళ్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 18.50 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసకున్నారు. పట్టుబడిన ఈమొత్తం కలిసినా 48.50 క్వింటాళ్లే అయినా, ప్రతీ నిత్యం చిన్న, చిన్న మూటలుగా పెద్ద మొత్తంలోనే తరలిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలకు బియ్యాన్ని అక్రమం గా తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో అన్ని రైల్వే స్టేషన్లపై దృష్టి పెట్టాలని పౌర సరఫరాల శాఖల అధికారులను ఉన్నతాధికారులు అప్రమత్తం చేశారు. దాడులు కూడా నిర్వహిస్తున్నారు. ఏటా రూ.25 వందల కోట్ల సబ్సిడీలు రాష్ట్రంలోని 2.70కోట్ల మంది లబ్ధిదారుల కోసం ప్రతీ నెలా 1.75 లక్షల టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం సరఫరా చేస్తోంది. దీనికోసం ఏటా రూ.2 వేల నుంచి రూ.2500కోట్ల సబ్సిడీనీ ప్రభుత్వం భరిస్తోంది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని రేషన్ బియ్యం అక్రమ వ్యాపారాన్ని అరికట్టేందుకు సివిల్ సప్లైస్ కమిషనర్ సి.వి.ఆనంద్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అన్ని జిల్లా కార్యాలయాలను, బియ్యం గోదా ములను, బియ్యం రవాణా చేసే వాహనాలను ఈ కేంద్రం తో అనుసంధానించారు. సుమారు 13వందల రవాణా వాహనాలకు జీపీఎస్ అమర్చగా, మండల స్థాయి నిల్వ కేంద్రాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఇరవై మందితో ఎన్‌పోర్స్‌మెంటు విభాగాన్ని నెల కొల్పారు. దీంతో బియ్యం అక్రమార్కులకు చెక్ పెట్టిన ట్టయింది. ప్రధానంగా కాకినాడ పోర్టుకు రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించే లారీలను కట్టడి చేశారు. రేషన్ బియ్యాన్ని ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేస్తున్న వ్యాపా రులను గుర్తించి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. దీంతో కాకినాడ పోర్టుకు తరలిపోయే రేషన్ బియ్యం దాదాపు బందైనట్లు పేర్కొం టున్నారు. ఈ కారణంగానే బియ్యం వ్యాపారులు కొత్త మార్గాల అన్వేషణలో పడినట్లు తెలుస్తోంది. -
కాకినాడ పోర్ట్ నుంచి భారీ ఆదాయం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ పోర్టు 2020 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో ఉంటుందని కస్టమ్స్ కమిషనర్ ఎస్.కె. రెహ్మాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కస్టమ్స్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాకినాడ సహా పలు పోర్టుల్లో ఎగుమతి, దిగుమతులకు కేంద్ర బడ్జెట్ మరింత ఊపునిస్తోందన్నారు. సాగరమాలలో కాకినాడ పోర్టు ఆణిముత్యంగా నిలుస్తుందన్నారు. ప్రపంచ పోర్టుల ప్రగతి జాబితాలో గతంలో 54వ స్థానంలో ఉన్న మన దేశం ప్రస్తుతం 37వ స్థానానికి చేరుకుందన్నారు. గంట, రెండు గంటల్లోనే అనుమతి ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడంతో ఎగుమతులు, దిగుమతులు పెరుగుతున్నాయన్నారు. కాకినాడ కస్టమ్స్ గత ఏడాది రూ.1208 కోట్ల ఆదాయం సాధించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1390 కోట్లు లక్ష్యంగా నిర్ణయించామని రెహ్మాన్ చెప్పారు. -
కాకినాడ పోర్ట్ డెరైక్టర్‌గా ప్రసన్న
కాకినాడ పోర్ట్స్ డెరైక్టర్‌గా ప్రసన్న వెంకటేష్‌ను నియమిస్తూ రాష్ట్ర మౌలిక వసతులు, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ సోమవారం జీవో జారీ చేశారు. ప్రస్తుతం ఈయన పార్వతీపురం ఐటీడీఏ పీవోగా ఉన్నారు. పోర్ట్స్ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్‌ను బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. -
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత
► కనకదుర్గమ్మ వారిధి చెక్‌పోస్టు వద్ద ► ఆకస్మిక తనిఖీలు ► 220 క్వింటాళ్లు స్వాధీనం.. అదుపులోకి ముగ్గురు విజయవాడ(కృష్ణలంక) : అక్రమంగా తరలిస్తున్న 220 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వై.టి.నాయుడు ఆదేశాల మేరకు డీఎస్పీ ఆర్.విజయ్‌పాల్ శనివారం కనకదుర్గమ్మ వారధి సమీపంలోని చెక్‌పోస్టు దగ్గర ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నుంచి అక్రమంగా తరలి వెళుతున్న లారీని తనిఖీ చేసి రేషన్ బియ్యంను పట్టుకుని కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం దాచేపల్లిలో ఏపీ05టిఎ4 417 లారీలో నల్గొండ తిప్పర్తికి చెందిన పలువురు ఆటోల్లో తీసుకువచ్చిన రేషన్ బియ్యంను 445 సంచుల్లో 220 క్వింటాళ్ల లోడు ఎక్కించారు. గుంటూరు జిల్లా పొందుగల, కొండముడు చెక్‌పోస్ట్‌లను దాటుకుని వారధికి చేరుకుని విజిలెన్స్ తనిఖీకి చిక్కింది. ఈ మేరకు డ్రైవర్ దారపడ శ్రీను, క్లీనర్ మట్టా శ్రీను, బియ్యం తరలించే మధ్యవర్తి కదిమళ్ల నరేష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. దాచేపల్లి నుంచి కాకినాడ పోర్టుకు వెళ్లి అక్కడ నుంచి షిప్‌పై రాయపూర్‌కు తరలించనున్నట్లు అధికారులు తెలుసుకున్నారు. విజిలెన్స్ సీఐ ఎన్.ఎస్.అపర్ణ, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, ఆర్ఐలు శర్మ, మున్వర్ ఈ దాడిలో పాల్గొన్నారు. -
పోర్టులో అక్రమార్కుల లంగరు
- పెరుగుతున్న చోరీలు - గ్యాంగ్ ఫైల్స్ తెరచినా ఫలితం శూన్యం కాకినాడ క్రైం : తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పోర్టులో అక్రమార్కులు లంగరు వేశారు. ప్రతి నిత్యం రూ. కోట్ల విలువైన బియ్యం, మొక్కజొన్న, బొగ్గు, గ్రానైట్, వంట నూనె తదితరాలు కాకినాడలోకి యాంకరేజ్, డీప్‌వాటర్ పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. విలువైన రసాయనాలను దిగుమతి చేస్తున్నారు. యాంకరేజ్ పోర్టు నుంచి బియ్యం ఎగుమతికి అనుమతి లభించడంతో బార్జిల ద్వారా బియ్యాన్ని ఓడల్లోకి ఎక్కిస్తున్నారు. ఈ ఎగుమతి దిగుమతుల నేపథ్యంలో కొందరు ముఠాలుగా ఏర్పడి భారీ ఎత్తున చోరీలకు పాల్పడుతున్నారు. సుమారు నెలా పదిరోజుల క్రితం ఏటిమొగకు చెందిన కొందరు బార్జి సిబ్బందిని భయపెట్టి వారి నుంచి బియ్యం బస్తాల చోరీకి పాల్పడగా పోర్టు పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సుమారు పదిరోజుల కిందట తిమ్మాపురంలో పోలీసులు ఒక ఇంట్లో తనిఖీలు నిర్వహించగా పోర్టు నుంచి చోరీ చేసిన 20 క్వింటాళ్ల బియ్యం దొరికాయి. ఇలా ప్రతి నెలా పోర్టు, తిమ్మాపురం, సర్పవరం పోలీస్ స్టేషన్ల పరిధిలో పోర్టుకి సంబంధించిన సుమారు 10 చోరీ కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పనక్కర్లేదు. యూరియా, వంటనూనె, ఇతర రసాయనాలను ఏకంగా లారీలతో సహా అపహరిస్తున్నా నిరోధించే నాథులు కరువయ్యారు. కంపెనీల ప్రతినిధుల ప్రమేయంతోనే.. పోర్టులో సుమారు 20 కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఓడల్లో రవాణాకు గాను సరుకును ఏకమొత్తంలో ఇక్కడికి తీసుకువస్తుంటారు. ఇదే అదనుగా కొందరు చోరీలకు పాల్పడతున్నారు. ఈ చోరీలకు కొన్ని సందర్భాల్లో ఆయా కంపెనీల ప్రతినిధుల సహకారం కూడా లభిస్తుండడంతో అక్రమార్కుల పని సులువవుతోంది. గత ఏడాది జీఎస్పీసీలో రూ. 5 కోట్ల విలువైన యంత్ర సామగ్రిని ఎత్తుకుపోయారు. గొడౌన్లో ఉన్న సామగ్రిని దొంగిలించడంలో వారికి సెక్యూరిటీ సిబ్బంది సహకరించారని పోలీసు దర్యాప్తులో వెల్లడైంది. కాకినాడ పోర్టులో ఇటువంటి చోరీలకు పాల్పడే ముఠాలు ఎనిమిది ఉన్నాయని భావిస్తున్నారు. కొన్ని ముఠాల సభ్యులు ఇతర జిల్లాల్లో కూడా చోరీలకు పాల్పడుతున్నారని అనుమానిస్తున్నారు. వారిపై ఇప్పటికే గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ పరిస్థితుల్లో మార్పు కనిపిం చడం లేదు. పోర్టులో చోరీల అదుపునకు గతంలో ఏర్పా టైన చెక్‌పోస్టులు ఇప్పుడు సరిగా పనిచేయకపోవడంతో మళ్లీ చోరీలు ఊపందుకున్నాయి. పోర్టు కేంద్రంగా అక్రమార్కులు రూ. కోట్ల విలువైన సరుకు దోచుకుని పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగిస్తున్నారు. -
కాకినాడ పోర్టు ఆఫీసర్ గా రవికుమార్
తూర్పుగోదావరి: కాకినాడ పోర్టు అధికారిగా రవికుమార్ నియమితులయ్యారు. ఆయనను ఈ పదవిలో నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఆయన కాకినాడ మున్సిపల్ కమిషనర్, డీఆర్ డీఏలో పీడీగా విధులు నిర్వర్తించారు. -
టీడీపీ ద్వంద్వ వైఖరి
పెట్రో కారిడార్‌పై మాటమార్చడం తగదు ఏపీ రైతు సంఘం ధ్వజం అనకాపల్లి టౌన్, న్యూస్‌లైన్ : ప్రతిపక్షంలో ఉండగా పెట్రో కారిడార్ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మాటమార్చడం వారి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎ.బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, మత్స్యకారుల జీవితాలను సమూలంగా నాశనం చేసే ఈ ప్రతిపాదనలను తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా కార్యవర్గం రౌండ్ టేబుల్ సమావేశం గురువారం అనకాపల్లిలోని సీఐటీయూ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో బాలకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విశాఖ జిల్లా గంగవరం నుంచి కాకినాడ పోర్టు వరకు ప్రతిపాదించిన కారిడార్ కోసం 10 మండలాల పరిధిలోని 1.5 లక్షల ఎకరాల పంట భూముల్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వామపక్షాలతో కలిసి తీవ్రంగా వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అనుకూలంగా మాట్లాడడం సరికాదన్నారు. పీసీపీఐఆర్ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వేలాది రైతు కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయన్నారు. మత్స్యకారులు వేట లేక వీధిన పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం ఈ ప్రతిపాదనలను వెనక్కి తీసుకోకుంటే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి కర్రి అప్పారావు, సీనియర్ నాయకులు పి.జగన్నాథం, కె.రామ సదాశివరావు, వై.సీతారామ్, నాగిరెడ్డి సత్యనారాయణ, సత్తిబాబు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కాకినాడ ఓడరేవులో 3వ ప్రమాద హెచ్చరిక
తూర్పుగోదావరి జిల్లాలో శుక్రవారం అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని తీరం వెంబడి 13 మండలాల్లో అధికారులు ముందస్తుగా సహయక చర్యలు చేపట్టారు. కాకినాడ ఓడరేవులో 3వ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దాంతో సముద్రంలో వేటకు వెళ్లరాదని మత్స్యకారులను జిల్లా యంత్రాంగం హెచ్చరించింది. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫైలిన్ తుపాన్ వల్ల ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 08856 233100కు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు.