
సాక్షి, కాకినాడ: కుంభాభిషేకం రేవు వద్ద అరుదైన చేప సందడి చేసింది. ఔషధ గుణాలుండే కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 10 వేలు ధర పలికింది. ఈ వేలంలో మధ్యవర్తికి రూ.25 వేల రూపాయలు దక్కింది.
సముద్రంలో అరుదుగా లభిస్తుంది ఈ కచ్చిడి చేప. మత్స్యకారులు దీన్నొక వరంగా భావిస్తారు. ఈ చేప లోపల ఉండే బ్లాడర్‌కి డిమాండ్ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుంటుంది. అందుకే.. పాతిక కేజీల బరువున్న చేపను అత్యధికంగా మూడు లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. గతంలోనూ ఇదే తరహాలో అమ్ముడుపోయినా.. ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారు. పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లడర్ ఎక్కువ ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment