Kachidi Fish
-
కాకినాడలో కాస్ట్లీ చేప.. వేలంలో రికార్డు ధరకి!
సాక్షి, కాకినాడ: కుంభాభిషేకం రేవు వద్ద అరుదైన చేప సందడి చేసింది. ఔషధ గుణాలుండే కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 10 వేలు ధర పలికింది. ఈ వేలంలో మధ్యవర్తికి రూ.25 వేల రూపాయలు దక్కింది. సముద్రంలో అరుదుగా లభిస్తుంది ఈ కచ్చిడి చేప. మత్స్యకారులు దీన్నొక వరంగా భావిస్తారు. ఈ చేప లోపల ఉండే బ్లాడర్కి డిమాండ్ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుంటుంది. అందుకే.. పాతిక కేజీల బరువున్న చేపను అత్యధికంగా మూడు లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. గతంలోనూ ఇదే తరహాలో అమ్ముడుపోయినా.. ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారు. పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లడర్ ఎక్కువ ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. -
దివ్య ఔషధం.. 'కచిడి'.. 25 కిలోల చేప ఖరీదు రూ.4 లక్షలు
సాక్షిప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘కచిడి’.. నిజంగా బంగారం లాంటి చేపే.. వలలో పడిందా లక్షల రూపాయలు వచ్చినట్టే. ఆహారంగా ఆడ చేపలు అద్భుతమైన రుచిని అందిస్తే.. ఇక మగ చేపలు ఔషధాల తయారీలో, ఖరీదైన వైన్‌ను శుభ్రం చేయ డంతోపాటు అనేక రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో కచిడి చేపకు విపరీతమైన డిమాండ్ ఉంది. గోదావరి జిల్లాల్లో కనిపించే ఈ చేప మత్స్యకారులకు సిరులు కురిపిస్తోంది. అదృష్టవంతులకే ‘గోల్డ్ ఫిష్’ తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి, అద్దరిపేట నుంచి సఖినేటిపల్లి, పల్లిపాలెం, పశ్చిమగోదావరి జిల్లాలోని పేరుపాలెం, నరసాపురం తదితర ప్రాంతాల నుంచి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులలో అదృష్టవంతుల వలకే కచిడి చేప చిక్కుతుందంటుంటారు. ఈ కచిడి చేపను బ్లాక్ స్పాటెడ్ (క్రోకర్) లేదా సీగోల్డ్, గోల్ ఫిష్‌గా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం.. ప్రోటోనిబియా డియాకాన్తస్. ఇండో ఫసిఫిక్, బంగాళాఖాతంలోని లోతు జలాల్లో మాత్రమే కచిడీ జీవిస్తోంది. ఈ రకం చేపలకు ప్రకృతి ప్రసాదించిన వాయుకోççశం (ఎయిర్ బ్లాడర్) ఉండటంతో సముద్రాలను ఈదడంలో ఇవి మహా నేర్పరులు. కచిడీ కోసం ఎగుమతిదారుల క్యూ.. ఈ చేపలను కాకినాడ, ఓడలరేవు, ఉప్పాడ, పల్లిపాలెం తదితర ప్రాంతాల్లో స్థానిక మార్కెట్‌కు తీసుకువస్తున్నారు. ఈ చేపలకున్న డిమాండ్ దృష్ట్యా వీటి కొనుగోలుకు అటు ఉత్తరాంధ్ర.. ఇటు నెల్లూరు జిల్లా నుంచి ఎగుమతిదారులు స్థానిక మార్కెట్ల్లకు క్యూ కడుతున్నారు. ఈ చేప 40 కిలోల వరకు బరువు ఉంటోంది. 10 కిలోలు దాటితే రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు పలుకుతోంది. బాగా తక్కువలో తక్కువగా అంటే రూ.50 వేలు ఉంటుంది. 25 కిలోల మగ చేప రూ.4 లక్షలకు అమ్ముడుపోయిందంటే వీటికి డిమాండ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. శస్త్రచికిత్సల్లోనూ.. కచిడీ చేపలో కొలాజిన్ ఎక్కువగా ఉంటుంది. దీనికి రుచి, వాసన ఉండదు కానీ ఘనపదార్థాలను ఎక్కువ కాలం పాడవకుండా కాపాడుతుంది. దీనిని ప్రాసెస్ చేయడం ద్వారా వచ్చే శ్రేష్టమైన జెలాటిన్‌ను ఆహార ఉత్పత్తులు, మందుల తయారీ, కాస్మెటిక్స్, విలువైన పదార్థాల ప్యాకింగ్‌లో వినియోగిస్తున్నారు. అలాగే కాప్యూల్స్ (మందు గొట్టాలు) పైన ఉపయోగించే ప్లాస్టిక్‌లాంటి పదార్థంలోనూ వీటిని ఉపయోగిస్తున్నారు. విదేశాల్లో పొట్ట భాగంలో శస్త్రచికిత్స అనంతరం కుట్లు వేసేందుకు వినియోగించే దారం తయారీ, ఖరీదైన వైన్‌ను శుభ్రం చేసేందుకు కూడా వినియోగిస్తున్నారు. మగచేప కండ, శరీర భాగాలు, పొట్ట భాగం, పొలుసుకు కూడా విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. చెన్నై, కోల్‌కతాల నుంచి విదేశాలకు ఎగుమతి కచిడీ చేపలను మన రాష్ట్రం నుంచి చెన్నై, కోల్‌కతా రేవులకు తరలించి.. అక్కడ ప్రాసెసింగ్ చేసి యూరప్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, జపాన్, చైనా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. వివిధ రంగుల్లో ఆకర్షణీయంగా ఉండే ఈ చేపల విక్రయాలకు ముందే (ఆడ, మగ) గ్రేడింగ్ చేస్తారు. మగ చేప పొట్ట భాగాలను ఎగుమతికి అనుగుణంగా ప్యాకింగ్ చేస్తారు. మగ చేప చిన్న రెక్కలతో గరుకుగా, బంగారు రంగులో ఉండటంతో వాటిని విదేశాలకు పంపుతారు. పొట్ట భాగం ఆడ చేప కంటే మగ చేపకు గట్టిగా ఉంటుంది. ఈ లక్షణాలున్న చేపలను ఎగుమతి కోసం వేరు చేస్తారు. ఔషధ గుణాలతోనే డిమాండ్ కచిడీ చేపకు విదేశాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంది. దీనిలో ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటంతో యూరప్ తదితర దేశాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ చేప సముద్రపు లోతుల్లో ఎక్కువగా ఉంటుంది. కచిడీలో సహజంగా ఉండే కొలాజిన్తోపాటు పొట్ట, వాయుకోశాలను పలు ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. మగ చేపల్లో వాయుకోశం పెద్దవిగా ఉండటంతో కచిడీ చేపలకు డిమాండ్ ఎక్కువ. – చిట్టూరి గోపాలకృష్ణ, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, కోనసీమ పులసలను మించి.. గోదావరి జిల్లాల్లో వరదలప్పుడు సీజనల్‌గా వచ్చే పులస చేపలను ఈ కచిడి చేప అధిగమిం చేస్తోంది. అద్భుతమైన రుచిని ఇచ్చే కచిడి చేపను ధనవంతులు కూడా కొనలేరంటే అతిశయోక్తి కాదు. ఇక మగ చేప ఖరీదు వింటే గుండె గుభేల్మనడం ఖాయం. మగ చేపలో ఉన్న అద్భుతమైన ఔషధ గుణాలు అటువంటివి మరి. అందుకే విదేశాల్లో ఈ చేపకు విపరీతమైన డిమాండ్. ఎన్ని లక్షలైనా లెక్క చేయకుండా మగ చేపను కొనుక్కుపోతున్నారు. మగ, ఆడ చేపల మధ్య ధరల్లో, డిమాండ్‌లో చాలా వ్యత్యాసం ఉంది. సముద్రపు లోతులే కచిడి చేపల ఆవాసం. -
వామ్మో: 25 కిలోల కచ్చిడి చేప రూ. 2.90 లక్షలా?
తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం చేపల రేవులో 25 కేజీలున్న మగ కచ్చిడి చేపను నర్సాపురానికి చెందిన పాటదారుడు రూ.2.90 లక్షలకు దక్కించుకున్నాడు. మగ చేప బంగారు వర్ణంతో ఉండటంతో దీనిని బంగారు చేప అని కూడా పిలుస్తారు. ఈ చేప గాల్‌బ్లాడర్‌ను ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం తయారీలో, బలానికి వాడే మందులు తయారీలోనూ ఉపయోగిస్తారు. అందుకే ఈ చేపకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ చేప శరీర భాగాలను వినియోగిస్తారట. అందుకే ఈ కచ్చిడి చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. – సఖినేటిపల్లి -
Kachidi Fish: తగ్గేదేలే.. కచ్చిడి కచ్చిడే!.. ధర ఎంతంటే?
కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): కాకినాడ తీరంలో మత్స్యకారుల వలకు శనివారం కచ్చిడి చేప చిక్కింది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చేపను ఓ వ్యక్తి రూ.4 లక్షలకు కొనుగోలు చేశాడు. ఇదే తీరంలో ఈ నెల 5న ఓ కచ్చిడి చేపను రూ.4.30 లక్షలకు ఓ వ్యాపారి కొన్నాడు. నెల వ్యవధిలోనే మరో చేప అదే స్థాయిలో ధర పలకడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు. చదవండి: Hyderabad: కదులుతున్న బస్సులో మహిళపై అత్యాచారం -
18 కిలోల కచ్చిడి చేప.. రూ.1.50 లక్షలకు కొని.. ఆపై
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 18 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దీనిని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవు వద్ద సోమవారం అమ్మకానికి పెట్టగా.. నరసాపురానికి చెందిన వ్యాపారి నంద్యాల శ్రీనివాసరావు రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. మంగళవారం దీనిని కోల్‌కతాలోని ఓ చేపల ఎగుమతి కేంద్రానికి రూ.2 లక్షలకు విక్రయించాడు. అక్కడి నుంచి ఈ చేపను చైనాకు ఎగుమతి చేస్తారని శ్రీనివాసరావు తెలిపాడు. మోటారు బావిలో చిక్కుకున్న పునుగు పిల్లి తోట్లవల్లూరు: ఎక్కడనుంచి వచ్చిందో కానీ ఓ పునుగుపిల్లి మోటారుబావిలో చిక్కుకుంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామానికి చెందిన రైతు మర్రెడ్డి కేశవరెడ్డి తన పొలంలోని మోటారుబావిలో పునుగుపిల్లి చిక్కుకుని ఉండటాన్ని గుర్తించి మంగళవారం గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. -
గోల్డెన్ ఫిష్ @ రూ.2.60 లక్షలు
సఖినేటిపల్లి: తూర్పు గోదావరి జిల్లా పల్లిపాలెం చేపల మార్కెట్‌కు శనివారం 21 కేజీల బరువుగల కచిడి మగ చేప వచ్చింది. దీన్ని బంగారు చేపగా కూడా పిలుస్తారు. స్థానిక పాటదారుడు దీన్ని రూ.2.60 లక్షలకు చేజిక్కించుకున్నాడు. కచిడి రకం చేపల్లో ఆడ చేప కంటే మగ చేపకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. చేప పొట్ట భాగంలోని గాల్‌బ్లాడర్‌ను బలానికి వాడే మందుల తయారీలో వినియోగిస్తుంటారు. సర్జికల్ సమయాల్లో కుట్లు వేసే దారాన్ని తయారు చేయడంలో కూడా దీని గాల్‌బ్లాడర్‌ను వాడుతుంటారు. -
అది నిజంగా 'బంగారు' చేపే!
సఖినేటిపల్లి (తూర్పుగోదావరి జిల్లా): బంగారు వర్ణంలో నిగనిగలాడుతున్న భారీ చేప నిజంగా ‘గోల్డ్’ ఫిష్సే. ఎందుకంటే దీని ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు ! సాధారణంగా ఎంత పెద్ద చేప అయినా వందల్లో రేటు పలుకుతుంది. మరీ అరుదైనదైతే వేలల్లో పలుకుతుంది. కానీ, 28 కిలో బరువున్న ఈ చేప చాలా ఖరీదైనది. ఈ చేపలను కచిడీలని పిలుస్తారు. వీటిలో మగ కచిడీలు బంగారు వర్ణంతో ఉంటాయి. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం పల్లిపాలెం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు శనివారం చిక్కింది మగ కచిడీ. ఎన్నో ప్రయోజనాలున్న ఈ చేపను నర్సాపురానికి చెందిన ఒక వ్యాపారి వేలం పాటలో లక్ష రూపాయలకు పాడుకున్నాడు. ఈ చేపలకు గరుకుగా ఉండే చిన్ని రెక్కలతో పాటు పొట్ట భాగం గట్టిగా ఉంటుందని మత్స్యకారులు చెప్పారు. దీని పొట్ట భాగాన్ని బలానికి వాడే మందుల్లో ఉపయోగిస్తారన్నారు. ఈ చేప పొట్ట భాగం విలువే 85 వేల రూపాల వరకు ఉంటుందని తెలిపారు.