అది నిజంగా 'బంగారు' చేపే! | The fish cost is one lac | Sakshi
Sakshi News home page

అది నిజంగా 'బంగారు' చేపే!

Published Sat, Mar 28 2015 8:31 PM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

మగ కచిడీ చేప ఇదే.

మగ కచిడీ చేప ఇదే.

సఖినేటిపల్లి (తూర్పుగోదావరి జిల్లా): బంగారు వర్ణంలో నిగనిగలాడుతున్న  భారీ చేప నిజంగా ‘గోల్డ్’ ఫిష్సే. ఎందుకంటే దీని ఖరీదు అక్షరాలా లక్ష రూపాయలు ! సాధారణంగా ఎంత పెద్ద చేప అయినా వందల్లో రేటు పలుకుతుంది.  మరీ అరుదైనదైతే వేలల్లో పలుకుతుంది. కానీ, 28 కిలో బరువున్న ఈ చేప చాలా ఖరీదైనది. ఈ చేపలను కచిడీలని పిలుస్తారు. వీటిలో మగ కచిడీలు బంగారు వర్ణంతో ఉంటాయి.   తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం పల్లిపాలెం వద్ద సముద్రంలో మత్స్యకారుల వలకు శనివారం చిక్కింది మగ కచిడీ.  

 ఎన్నో ప్రయోజనాలున్న ఈ చేపను నర్సాపురానికి చెందిన ఒక వ్యాపారి వేలం పాటలో లక్ష రూపాయలకు పాడుకున్నాడు. ఈ చేపలకు గరుకుగా ఉండే చిన్ని రెక్కలతో పాటు పొట్ట భాగం గట్టిగా ఉంటుందని మత్స్యకారులు చెప్పారు. దీని పొట్ట భాగాన్ని బలానికి వాడే మందుల్లో ఉపయోగిస్తారన్నారు. ఈ చేప పొట్ట భాగం విలువే 85 వేల రూపాల వరకు ఉంటుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement