
తూర్పుగోదావరి జిల్లా పల్లిపాలెం చేపల రేవులో 25 కేజీలున్న మగ కచ్చిడి చేపను నర్సాపురానికి చెందిన పాటదారుడు రూ.2.90 లక్షలకు దక్కించుకున్నాడు. మగ చేప బంగారు వర్ణంతో ఉండటంతో దీనిని బంగారు చేప అని కూడా పిలుస్తారు.
ఈ చేప గాల్‌బ్లాడర్‌ను ఆపరేషన్ సమయంలో కుట్లు వేసే దారం తయారీలో, బలానికి వాడే మందులు తయారీలోనూ ఉపయోగిస్తారు. అందుకే ఈ చేపకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఖరీదైన వైన్ తయారీలోనూ ఈ చేప శరీర భాగాలను వినియోగిస్తారట. అందుకే ఈ కచ్చిడి చేపను గోల్డెన్ ఫిష్ అని కూడా పిలుస్తారు.
– సఖినేటిపల్లి
Comments
Please login to add a commentAdd a comment