rare fish
-
వరించిన అదృష్టం..రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన మత్స్యకారుడు!
చేపల వేటతో జీవనం సాగించే మత్స్యకారులకు ఒక్కోసారి అదృష్టం వరించి అరుదైన చేపలు వలలో చిక్కుతాయి. దీంతో లక్షాధికారులుగా మారిన పలు సందర్భాలు ఉన్నాయి. అలాంటి అదృష్టమే పాక్‌లోని ఓ మత్స్యకారుడిని వరించింది. దెబ్బతో ఒక్కరాత్రిలో ఊహించని రీతిలో అతని తలరాత మారిపోయింది. అతడికి లక్ అలా ఇలా లేదు. వివరాల్లోకెళ్తే...పాక్‌లోని కరాచీ నౌకాశ్రయం సమీపంలో ఉన్న అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఇబ్రహి హైదరీ వలలో అరుదైన చేపలు పడ్డాయి. ఆ చేపలను మాండలికంలో గోల్డెన్ ఫిష్, లేదా సోవా అని పిలుస్తారు. ఇవి చాలా అమూల్యమైనవి, అరుదుగా దొరుకుతాయి. వీటిలో మంచి ఔషధగుణాలు ఉండటంతో వైద్యంలో ప్రముఖంగా వాడతారు. అలాగే వీటిలో దారం లాంటి పదార్థాన్ని శస్త్ర చికిత్స విధానాల్లో వినయోగిస్తారు. ఈ చేప ఒక్కొకటి ఏకంగా 7 మిలియన్లు(దాదాపు 70 లక్షలు) పలికాయి. దీంతో మొత్తం చెప్పలు సుమారు రూ. 7 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో అతను ఓవర్ నైట్‌లో కోటీశ్వరుడు మారిపోయాడు. ఈ చేప సుమారు 20 నుంచి 40 కిలోల బరువు ఉండి దాదాపు 1.5 మీటర్ల వరకు పెరుగుతుంది. వీటిని స్థానిక వంటకాల్లోనే కాక ఔషధాల్లోనూ ఎక్కువుగా ఉపయోగిస్తారు.కాగా, ఇంత పెద్ద మొత్తంలో అమ్ముడుపోవడంతో మత్స్యకారుడు హైదరీ ఆనందానికి అవధులు లేవు. ఇవి సంతానోత్పత్తి కాలంలోనే తీరాని వస్తాయని, అప్పుడే వలకు చిక్కుతాయని చెబుతున్నాడు హైదర్. తాను ఈ సొమ్ముని తన సిబ్బందితో కలిసి పంచుకుంటానని ఆనందంగా చెబుతున్నాడు. ఏదైన టైం రావలిగానీ ఒక్క క్షణంలో మీ జీవితం అందనంత ఎత్తులోకి వెళ్లిపోతుందంటే ఇదే కదా!. (చదవండి: పేషెంట్‌కి చికిత్స అందిస్తూ..అంతలో వైద్యుడు..) -
కాకినాడలో కాస్ట్లీ చేప.. వేలంలో రికార్డు ధరకి!
సాక్షి, కాకినాడ: కుంభాభిషేకం రేవు వద్ద అరుదైన చేప సందడి చేసింది. ఔషధ గుణాలుండే కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 10 వేలు ధర పలికింది. ఈ వేలంలో మధ్యవర్తికి రూ.25 వేల రూపాయలు దక్కింది. సముద్రంలో అరుదుగా లభిస్తుంది ఈ కచ్చిడి చేప. మత్స్యకారులు దీన్నొక వరంగా భావిస్తారు. ఈ చేప లోపల ఉండే బ్లాడర్కి డిమాండ్ ఉండడంతో ధర ఎక్కువగా వస్తుంటుంది. అందుకే.. పాతిక కేజీల బరువున్న చేపను అత్యధికంగా మూడు లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. గతంలోనూ ఇదే తరహాలో అమ్ముడుపోయినా.. ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారని చెబుతున్నారు. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారు. పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లడర్ ఎక్కువ ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. -
ఆస్ట్రేలియా తీరంలో వింతచేప.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు..
కాన్బెర్రా: ఆస్ట్రేలియాలోని విక్టోరియా నైరుతి తీరానికి భారీ పరిమాణంలోని వింత చేప ఒకటి కొట్టుకు వచ్చింది. దీనిని కేత్ రాంప్టన్, టామ్ రాంప్టన్ అనే దంపతులు తొలుత గుర్తించారు. చేప దాదాపు రెండు మీటర్ల పొడవు ఉంది. వీరిద్దరూ వెటర్నరీ డాక్టర్లే అయినా, ఇదివరకు ఎప్పుడూ ఇలాంటి చేపను వారు చూసి ఉండలేదు. ఒడ్డుకు కొట్టుకొచ్చిన చేప అప్పటికే మరణించి ఉంది. రాంప్టన్ దంపతులు ఈ చేప ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు దీని గురించి కొంత అధ్యయనం చేయడంతో ఆసక్తికరమైన విశేషాలు బయటపడ్డాయి. ఇది ‘ఓషన్ సన్‌ఫిష్’ అని తేలింది. ‘ఓషన్ సన్‌ఫిష్’ జాతికి చెందిన చేపలు సైజులో భారీవే అయినా, సముద్రాల్లో వీటి సంఖ్య చాలా తక్కువ. అరుదైన చేపలు కావడంతో వీటి గురించి చాలామందికి తెలీదు. ఇవి పూర్తిగా ఎదిగితే, నాలుగు మీటర్ల పొడవు, రెండున్నర మీటర్ల వెడల్పు వరకు పెరుగుతాయని, దాదాపు రెండున్నర వేల కిలోల బరువు ఉంటాయని మెరైన్ బయాలజిస్టులు చెబుతున్నారు. ఇవి ఉష్ణమండల తీరాల వద్ద అప్పుడప్పుడు కనిపిస్తుంటాయని వారు అంటున్నారు. చదవండి: చెరువులో వింత జీవి.. ఒకటి, రెండు కాదు ఏకంగా ఇరవైనాలుగు కళ్లు! -
వేలంలో రూ. 3 లక్షలు పలికిన స్పెషల్ చేప.. ఎందుకో తెలుసా.?
భువనేశ్వర్: ఎన్నో ఔషధ, పోషకాలతో కూడిన క్రోకర్ చేప ఒడిషాలోని భద్రక్ జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కింది. ధామ్రా నదీ సంగమ తీరంలో శుక్రవారం మత్స్యకారుడు హఫీజ్ ఉల్లా వేసిన వలలో 32కిలోలు ఉన్న ఈ భారీ జలపుష్పం లభ్యమైంది. దీనిని చాంద్‌బాలి చాందినిపాల్ చేపల వేలం కేంద్రంలో వేలం వేయగా, ముంబైకి చెందిన ఔషధాల కంపెనీ రూ.3 లక్షల 10 వేలకు దక్కించుకుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో లభించే ఈ చేప భద్రక్ ధామ్రా తీరంలో చిక్కడం విశేషం. దీనిని ఘోల్ చేప కూడా అంటారు. స్థానిక భాషలో తెలియా అని వ్యవహరిస్తారు. ఈ చేపలను ఎక్కువగా సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, హాంగ్‌కాంగ్, జపాన్ దేశాల వారు దిగమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతుంటారు. క్రోకర్ చేప గుండెను సీ గోల్డ్‌గా కొనియాడతారు. దీనిని ఎయిర్ బ్లాడర్‌తో తయారు చేసిన ప్రత్యేక దారం మనిషి గుండె శస్త్రచికిత్సలో కుట్లు వేసేందుకు వినియోగించడంతో గిరాకీ విపరీతంగా ఉంటుంది. క్రోకర్ మొప్పలతో తయారు చేసిన దారం సాధారణ పరిస్థితుల్లో శరీరంపై కుట్లు వేసేందుకు వినియోగిస్తారు. సుమారు మూడేళ్ల క్రితం జగత్సింఘ్పూర్ జిల్లా పారాదీప్ తీరంలో క్రోకర్ చేప వలకు చిక్కగా.. దీని ధర రూ.లక్షా 10 వేలకు పరిమితమైంది. ఇది కూడా చదవండి: వరదలో కొట్టుకువచ్చిన పులి.. బ్యారేజ్ గేట్ల వద్ద బతుకు పోరాటం -
18 కిలోల కచ్చిడి చేప.. రూ.1.50 లక్షలకు కొని.. ఆపై
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు 18 కిలోల కచ్చిడి చేప చిక్కింది. దీనిని తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది రేవు వద్ద సోమవారం అమ్మకానికి పెట్టగా.. నరసాపురానికి చెందిన వ్యాపారి నంద్యాల శ్రీనివాసరావు రూ.1.50 లక్షలకు కొనుగోలు చేశాడు. మంగళవారం దీనిని కోల్‌కతాలోని ఓ చేపల ఎగుమతి కేంద్రానికి రూ.2 లక్షలకు విక్రయించాడు. అక్కడి నుంచి ఈ చేపను చైనాకు ఎగుమతి చేస్తారని శ్రీనివాసరావు తెలిపాడు. మోటారు బావిలో చిక్కుకున్న పునుగు పిల్లి తోట్లవల్లూరు: ఎక్కడనుంచి వచ్చిందో కానీ ఓ పునుగుపిల్లి మోటారుబావిలో చిక్కుకుంది. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు గ్రామానికి చెందిన రైతు మర్రెడ్డి కేశవరెడ్డి తన పొలంలోని మోటారుబావిలో పునుగుపిల్లి చిక్కుకుని ఉండటాన్ని గుర్తించి మంగళవారం గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. -
చీరమేను: ఆహా అద్భుత రుచి.. తినండి మైమరిచి..ధరెంతో తెలుసా?
యానాం: పులస చేప సీజన్ తర్వాత వచ్చే చీరమేను రుచి చూడడం కోసం గోదావరి జిల్లాల వాసులు ఎదురుచూస్తుంటారు. శీతాకాలం ప్రారంభంలోనే దొరికే చీరమేను చేప ఎక్కువగా దసరా నుంచి నాగులచవితి వరకు లభ్యమవుతుంది. అయితే ప్రస్తుతం తూర్పుగాలులు వీస్తున్నప్పటికీ మత్స్యకారులకు చీరమేను లభ్యత గగనమై పోవడంతో ధర ఆకాశాన్ని అంటుతోంది. సాధారణంగా శేరు రూ.1,500 నుంచి రూ.2,000కి దొరకుతుంది. చదవండి: పాపికొండలకు చలోచలో సోమవారం సాయంత్రం యానాం మార్కెట్లోకి వచ్చిన చీరమేను శేరు ధర రూ.4వేలు పలికింది. చిత్రంలో కన్పించే ఒక్కొక్క స్టీలు క్యారేజీలోని చీరమేను ధర రూ.4వేలు, పసుపు రంగుప్లేటులో ఉన్న చీరమేను ధర రూ.1600 పలికింది. ప్రస్తుతం గ్లాసు, సోల, కొలతల్లో అమ్ముతున్నారని అదే బిందెల్లో అమ్మకం జరిపితే రూ.లక్ష వరకు ఉంటుందని అంటున్నారు. కార్తికమాసంలో మాంసాహారాన్ని తీసుకునేవారు తక్కువగా ఉండటంతో ఈ ధర ఉంది. అదే మామూలు రోజుల్లో అయితే ఇంకా అధిక ధర ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి చీరమేను గోదావరిలో లభ్యత తక్కువగా ఉందని, దీంతో రేటు సైతం అధికంగా ఉంటోందని వేలం పాటలో పాడుకున్న మత్స్యకార మహిళలు చెబుతున్నారు. నది ముఖ ద్వారం వద్ద లభ్యత సముద్రం, నదీ కలిసే ముఖద్వారాల (సీమౌత్) వద్ద చీరల సహాయంతో పట్టే చీరమేను ప్రస్తుతం లభ్యమవుతోంది. ఆ విధంగా యానాం, కోటిపల్లి, మసకపల్లి తదితర ప్రాంతాల నుంచి యానాం మార్కెట్‌కు చీరమేనును తీసుకువచ్చి మార్కెట్లోనే వేలం పాటను నిర్వహిస్తున్నారు. వాటిని మత్స్యకార మహిళలు కొనుగోలు చేసి కొంత లాభం వేసుకుని చిల్లరకు అమ్ముతున్నారు. అనేక రకాలుగా వంటలు: చీరమేనును మసాలా తో ఇగురుగానే కాకుండా గారెలు, చింత చిగురు, మామిడికాయ, గోంగూర ఇలా కూరల్లో నోరూరించేలా ఇక్కడి మహిళలు వండుతుంటారు. చమురు తవ్వకాల వల్ల దొరకడం లేదు గోదావరిలో ఇదివరలా చీరమేను దొరకడం లేదు. నదీముఖద్వారాల వద్ద చమురు తవ్వకాలు జరుపుతుండటంతో చీరమేను వేరే ప్రాంతాల వైపు మళ్లుతోంది. తక్కువగా వస్తుండటంతో మార్కెట్లో అధిక ధరలకు అమ్మాల్సి వస్తోంది. – నాటి పార్వతి, మత్స్యకార మహిళ -
జగిత్యాలలో దెయ్యం చేప.. ఇది వేరే చేపల్నిబతకనివ్వదు!
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని అన్ని చెరువులు దాదాపు నిండుకుండను తలపించాయి. చెరువుల్లో చేపలు పట్టేందుకు మత్య్సకారులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో ఓ అరుదైన చేప వలకు చిక్కింది. చేపలు పట్టడానికి వెళ్లిన జాలరు గొల్లపెళ్లి రాజనర్సకు అరుదైన వింత చేప తన వలలో పడింది. ఈ విషయాన్ని జిల్లా మత్య్సశాఖ అధికారులకు తెలుపగా.. దీనిని డెవిల్(దెయ్యం) చేప అంటారని, ఇది ఎక్కువుగా సముద్ర జల్లాల్లో మాత్రమే కనిపిస్తుంటుందని అధికారులు తెలిపారు. మన తెలంగాణలోని వాగులో దొరకడం చాలా అరుదు అని పేర్కొన్నారు. కాగా ఈ రకపు డెవిల్ ఫిష్ పై నల్లటి మచ్చలు, ముళ్లు ఉంటాయి. ఈ చేప సుమారు అరకేజీకి పైగానే బరువు ఉంది. తాను ఎన్నో ఏళ్ల నుంచి చేపలు పడుతున్నా ఇలాంటి చేప ఎప్పుడూ చూడలేదని జాలరు రాజనర్సు తెలిపాడు. ఒంటినిండా జీబ్రా రకం గీతలతో కనిపించే ఈ చేపలో తినేందుకు మాంసం ఉండదు. పైగా చేప నిండా ముళ్లు, చర్మం కప్పబడినట్లు ఉంటుంది. సముద్రజాతికి చెందిన ఈ చేప నోరు అడుగు భాగంలో ఉంటుంది. చర్మం అంతా దుప్పటి కప్పబడినట్టు కన్పిస్తుంది. ఈ చేప ఉన్నచోట వేరే చేపలు బతకడం కష్టమని.. తన చుట్టూ ఉన్న మత్స్యాలను ఇది ఆహారంగా తీసుకుంటుందన్నారు. డెవిల్ ఫిష్‌కు పదునైన దంతాలు ఉండటం వల్ల వలలను సైతం కొరికి వేస్తుందని మత్య్సశాఖ అధికారులు చెబుతున్నారు. -
రెండు టన్నుల బరువు.. వలకు చిక్కిన అరుదైన చేప
మహారాణిపేట (విశాఖ దక్షిణ): భీమిలి తీరంలో ఓ మత్స్యకారుడికి పులిబొగ్గాల సొర్ర అనే అరుదైన చేప చిక్కింది. సుమారు టన్నున్నర నుంచి రెండు టన్నుల బరువు ఉండే ఈ చేపను తినరు. పులిచారలు పోలి ఉంది. భీమిలి తీరంలో లభ్యమైన ఈ చేపను ఎన్నో వ్యయప్రయాసలకోర్చి విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆ చేప మృతి చెందింది. దీంతో మరో బోటులో తరలించి సముద్రంలో పడేసినట్టు రాష్ట్ర మరపడవల సంఘం కార్యవర్గ సభ్యుడు గణగళ్ల రాజేష్ తెలిపారు. -
పవన సరస్సులో అరుదైన చేప లభ్యం!
సాక్షి, ముంబై : పుణె సమీపంలో గల పర్యాటక ప్రాంతం పవన సరస్సులో అరుదైన మాంసాహార చేపను కనుగొన్నట్లుగా పవన డ్యామ్ అధికారులు తెలిపారు. ఉత్తర అమెరికాలోని సముద్ర జలాల్లో ఎక్కువగా కనిపించే ఈ చేప పేరు ‘అలిగేటర్ గార్’ అని పేర్కొన్నారు. వివరాలు.. స్థానిక జాలర్లు కొన్ని రోజుల క్రితం పవన సరస్సు(కృత్రిమమైనది)లో చేపలు పట్టేందుకు వెళ్లగా అరుదైన చేప వారి గాలానికి చిక్కింది. దీంతో జాలర్లు ఫిషసరీస్ సంస్థ నిపుణుల వద్దకు తీసుకువెళ్లారు. ఈ క్రమంలో ఈ చేపను పరిశీలించిన అధికారులు మాంసాహార చేపగా గుర్తించారు. 17 సెంటీమీటర్ల పొడవు, రెండున్నర కిలోల బరువు ఉన్న ఈ చేప ఇతర చేపలను, సముద్ర జీవులను తినడం ద్వారా మనుగడ సాగిస్తుందని తెలిపారు. ఇటువంటి చేపల వల్ల సముద్ర జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అయితే ఉత్తర అమెరికాలో లభించే ఈ చేప పవన సరస్సులోకి ఎలా వచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. బహుషా ఎవరైనా బయటి వ్యక్తులు అక్వేరియంలో పెంచుకునేందుకు ఈ చేపను తెచ్చుకుని ఉంటారని, వారే దీనిని సరస్సులో వదిలి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇతర సముద్ర జీవులకు హాని కలిగే అవకాశం ఉంది గనుక ఇటువంటి చేపల జాడ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని జాలర్లకు సూచించారు. -
వాహ్.. బ్లాక్ ఫిష్
పహాడీషరీఫ్ : మృగశిర కార్తెను పురస్కరించుకొని జల్పల్లి పెద్ద చెరువులో మత్స్యకారులు వేసిన వలలకు అరుదైన చేపలు చిక్కాయి. వాటిని చూసి మత్స్యకారులు, ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పటివరకు ఇలాంటి చేపలను చూడలేదని పేర్కొన్నారు. నలుపు రంగు చారలు, అధిక సంఖ్యలో ముళ్లు కలిగి ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. తాము ఇలాంటి చేప పిల్లలను చెరువులో వదలలేదని, ఈ జాతి మొదటి నుంచే ఉండొచ్చని మత్స్యకారులు పేర్కొన్నారు. -
మత్స్యం.. బీభత్సం..
విఠలాచార్య సినిమాల్లోని చేప కాదు.. నిజమైనదే.. సోమవారం మహారాష్ట్రలోని సింధు దుర్గ్ ప్రాంతంలో మత్స్యకారులకు చిక్కిందీ చిత్రమైన చేప.. రంపంలాంటి పళ్లతో ఈ మత్స్యం.. బీభత్సంగా ఉంది కదూ.. భారీ ధరకు అమ్ముడుపోయిన దీనిని చూసేందుకు జనం, మీడియా విపరీతమైన ఆసక్తి కనబర్చారు. -
రూ.30వేలు పలికిన అరుదైన కలిచా చేప
అరుదుగా దొరికే కలిచా (ఎర్రపండు చేప) ఆదివారం చీరాల వాడరేవులో మత్స్యకారుల వలకు చిక్కింది. శనివారం ఉదయం వేటకు వెళ్లిన గంగులు తన బృందంతో వేట చేస్తుండగా 25 కిలోల బరువున్న ఈ చేప గాలానికి చిక్కిందని మత్య్సకారులు తెలిపారు. క్యాన్సర్, మొదడు సంబంధ వ్యాధులను నయం చేసే ఔషధాల తయూరీలో కోల్‌కతా, ముంబాయి నగరాల్లో ఈ కలిచా చేపను ఎక్కువగా వినియోగిస్తుంటారని పేర్కొన్నారు. తీరం ఒడ్డున నిర్వహించిన వేలంలో బెంగళూరుకు చేపలను ఎగుమతి చేసే వాడరేవుకు చెందిన వ్యాపారి నాగేంద్ర ఈ చేపను రూ.30,000 వేలకు దక్కించుకున్నాడు. -
మత్స్యకారుల వలలో అరుదైన చేపలు
మలికిపురం: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది పల్లిపాలెంలో మత్స్యకారులకు మంగళవారం సముద్రంలో అరుదైన సముద్ర శీలావతి, కచ్చా గొరక చేపలు లభించాయి. సముద్ర శీలావతి చేప సుమారు నాలుగు అడుగుల పొడవుంది. వెన్నుపై రంగురంగులతో ఉన్న ఈ చేప స్థానికులను ఆకర్షించింది. కచ్చా గొరక చేప సుమారు 12 కిలోల బరువుంది. సముద్ర శీలావతి అరుదుగా లభిస్తుందని, కచ్చా గొరక సాధారణంగా ఇంత బరువు ఉండదని మత్స్యకారులు చెప్పారు. -
జాలర్ల వలలో అరుదైన చేప
గుమ్మిడిపూండి(తమిళనాడు): జాలర్ల వలలో అరుదైన చేప చిక్కుకుంది. తమిళనాడు రాష్ట్రం పొన్నేరి సమీపంలోని అలంగాకుప్పానికి చెందిన దేశాస్పన్ నేతృత్వంలో జాలర్ల బృందం వారం రోజులుగా సముద్రంలో చేపల వేట సాగిస్తోంది. వారు వేసిన వలలో రెండు రోజుల క్రితం రాక్షసజాతికి చెందిన ఓ అరుదైన చేప పడింది. బుధవారం దీన్ని జాలర్లు సముద్ర తీరానికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే అది మృతి చెందింది. చాలా విచిత్రంగా ఉన్న ఈ చేప బరువు 150 కిలోలు ఉంది. ఈ చేప జాతిని కొనుగొనేందుకు, దీన్ని చెన్నై మత్స్యశాఖ పరిశోధన కేంద్రానికి తరలించారు.