రూ.30వేలు పలికిన అరుదైన కలిచా చేప | Kalicha rare fish fetches Rs 30 thousand | Sakshi
Sakshi News home page

రూ.30వేలు పలికిన అరుదైన కలిచా చేప

Aug 7 2016 6:55 PM | Updated on Sep 4 2017 8:17 AM

అరుదుగా దొరికే కలిచా (ఎర్రపండు చేప) ఆదివారం చీరాల వాడరేవులో మత్స్యకారుల వలకు చిక్కింది.

అరుదుగా దొరికే కలిచా (ఎర్రపండు చేప) ఆదివారం చీరాల వాడరేవులో మత్స్యకారుల వలకు చిక్కింది. శనివారం ఉదయం వేటకు వెళ్లిన గంగులు తన బృందంతో వేట చేస్తుండగా 25 కిలోల బరువున్న ఈ చేప గాలానికి చిక్కిందని మత్య్సకారులు తెలిపారు. క్యాన్సర్, మొదడు సంబంధ వ్యాధులను నయం చేసే ఔషధాల తయూరీలో కోల్‌కతా, ముంబాయి నగరాల్లో ఈ కలిచా చేపను ఎక్కువగా వినియోగిస్తుంటారని పేర్కొన్నారు. తీరం ఒడ్డున నిర్వహించిన వేలంలో బెంగళూరుకు చేపలను ఎగుమతి చేసే వాడరేవుకు చెందిన వ్యాపారి నాగేంద్ర ఈ చేపను రూ.30,000 వేలకు దక్కించుకున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement