nagendra
-
ఆ రైతు కుటుంబాలకు రూ.20లక్షల పరిహారం ఇవ్వాలి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా సింహాద్రిపురంలో కుటుంబంతో సహా కొమ్మర నాగేంద్ర ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఏపీ రైతు సంఘం(సీపీఎం) అధ్యక్ష, కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.ఇదే రోజున నంద్యాల జిల్లా ఎం.లింగాపురానికి చెందిన చిమ్మె నడిపి మారెన్న ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమన్నారు. వీరి కుటుంబాలకు రూ.20 లక్షలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలను నివారించడంలో టీడీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ రైతు సంఘం(సీపీఐ) రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య మరో ప్రకటనలో విమర్శించారు. -
విద్యుత్ షాక్‌కు నలుగురు యువకులు బలి
ఉండ్రాజవరం: తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై నలుగురు యువకులు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తాడిపర్రు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణపై స్థానికంగా రెండు సామాజికవర్గాల మధ్య 18 నెలలుగా వివాదం నెలకొంది. కలెక్టర్, ఆర్డీవో వంటి ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఇటీవల వివాదాన్ని పరిష్కరించారు. ఈ నేపథ్యంలో సోమవారం గౌడ సామాజికవర్గం వారు పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణకు, అన్నసమారాధనకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా సోమవారం తెల్లవారుజామున కొందరు యువకులు 25 అడుగుల భారీ ఫ్లెక్సీ కడుతుండగా వారికి 11కేవీ విద్యుత్ వైరు తగిలింది. తీవ్ర విద్యుదాఘాతానికి గురై బొల్లా వీర్రాజు (25), కాసగాని కృష్ణ (23), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (29) అక్కడికక్కడే మృతిచెందారు. కోమటి అనంతరావు అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. మృతిచెందినవారిలో కాసగాని కృష్ణకు పెళ్లి కాగా, మిగిలిన ముగ్గురు అవివాహితులు. తీవ్రంగా గాయపడిన కోమటి అనంతరావును తొలుత పశి్చమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ యువకులు అందరూ కొబ్బరి ఒలుపు కారి్మకులుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ ఘటనతో తాడిపర్రు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. -
భార్యను కిరాతకంగా.. అతడిని ఎన్కౌంటర్ చేయాలి
-
బెదిరించిన విలేకరితో వాదించడమూ తప్పేనా?
సాక్షి, నరసరావుపేట: నిత్యం ప్రభుత్వంపై విషం చిమ్మే పచ్చ పత్రిక ఈనాడులో బుధవారం ప్రచురితమైన ‘పత్రికలపై పగబట్టిన వైకాపా’ వార్త పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో రాసిందే. అందులో పల్నాడు జిల్లా అమరావతి మండల న్యూస్‌టుడే విలేకరి పరమేశ్వరరావుపై దాడి చేశారని, చంపబోయారంటూ కట్టుకథలు అల్లారు. వాస్తవానికి ఆ విలేకరి సంఘ విద్రోహశక్తిగా పేరున్న టీడీపీ నేత దండా నాగేంద్రతో సాన్నిహిత్యంగా ఉంటూ అతని కనుసన్నల్లో ఇసుక సరఫరాపై నిత్యం తప్పుడు కథనాలు వండి వారుస్తున్నాడు. నాగేంద్ర పీడీ యాక్ట్‌పై జైలుకెళ్లి ఇటీవల విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ప్రశాంతంగా ఉన్న పెదకూరపాడు నియోజకవర్గంలో రాజకీయంగా అల్లర్లు సృష్టించేందుకు ఆ టీడీపీ నేత గత కొన్ని నెలలుగా కుట్రలు చేస్తున్నాడు. పరమేశ్వరరావు ఒక పత్రికలో విలేకరిగా పనిచేస్తూ అక్రమాలకు పాల్పడడంతో అతన్ని తొలగించారు. ఈ క్రమంలో అతనికి ఏడాది క్రితం నాగేంద్ర సిఫార్సుతో ఈనాడు విలేకరిగా అవకాశం కల్పించారు. అప్పటినుంచి స్వామిభక్తి చాటుకుంటూ ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా తప్పుడు కథనాలు రాస్తున్నాడు. దౌర్జన్యంగా ప్రవేశించి బెదిరింపులు.. ఈ నెల 13న పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి స్వయంగా మల్లాది ఇసుక రీచ్‌కు వచ్చి పరిశీలించివెళ్లారు.ఇసుక తవ్వకాలు ఆపమని జిల్లా, మండల స్థాయి అధికారుల నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవటంతో మరుసటి రోజు యథావిధిగా ఇసుక తవ్వకాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఉదయం 10.30 గంటలకు తహసీల్దార్ కార్యాలయం నుంచి గ్రామస్థాయి అధికారులు వచ్చి వెంటనే ఇసుక తవ్వకాలు ఆపేయాలని నిర్వాహకులకు తెలిపారు. అప్పటికే పది ఇసుక వాహనాలకు లోడ్ చేయటానికి బిల్లులు రాశారు. బిల్లులు రాయకుండా ఉన్న 15 వాహనాలను వెనుకకు పంపారు. బిల్లులు రాసి లోడైన ఆరు వాహనాలు బయటకు వెళ్లాయి. ఈ సమయంలో మల్లాది గ్రామానికి చెందిన ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుకరీచ్లోకి వచ్చి నదిలో ఇసుక లోడ్ అవుతున్న నాలుగు వాహనాల ఫొటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో రీచ్‌లో కూలీకి పనిచేస్తున్న మల్లాది యువకులు తమ ఊరు వాడే కదా అనే చనువుతో ఏంటబ్బాయి ఫొటోలు, వీడియోలు తీస్తున్నావని అడగగా.. నేను ఈనాడు విలేకరిని, మాకు మా యాజమాన్యం నుంచి ఆదేశాలు అలాగే ఉన్నాయి, అయినా మీకు చెప్పాలా, మీ పర్మిషన్ తీసుకుని రావాలా ఏంటీ, అన్ని వాహనాలు సీజ్ చేయిస్తానంటూ దురుసుగా మాట్లాడాడు. అక్కడ పనిచేస్తున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈనాడు విలేకరి కవ్వింపు చర్యలకు పాల్పడటంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో అక్కడే ఉçన్న ఇసుక తవ్వకాలు జరిపే కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు వారిని విడదీసి విలేకరిని ద్విచక్రవాహనంపై దగ్గరుండి పంపించారు. కిందపడ్డ పరమేశ్వరరావు సెల్‌ఫోన్‌ను తరువాత అక్కడకు చేరుకున్న సీఐ బ్రహ్మం తీసుకు వచ్చి అతనికి అప్పగించారు. సంఘటన జరిగిన తరువాత విజిలెన్స్ అధికారి మీడియాకు ఈ విషయాన్ని వివరించారు. వాస్తవాలు దాచిపెట్టి ఈనాడు కథనం సంఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నానని, అయితే జరిగింది ఒకటైతే ఈనాడు పత్రికలో వచ్చింది మాత్రం మరొకటని ఇసుక కంపెనీ విజిలెన్స్ అధికారి రాంబాబు తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఈనాడు కంట్రిబ్యూటర్ పరమేశ్వరరావు ఇసుక రీచ్‌లోకి ప్రవేశించి అక్కడ ఉన్న వారితో వాగ్వివాదానికి దిగాడన్నారు. దీంతో ఈ విషయంపై ఇద్దరి మధ్య తోపులాట జరిగిందన్నారు. అంతేగాని పెట్రోల్ తీసుకురండి.. తగలెట్టేద్దాం వంటి మాటలు అనటం, దాడి చేసి నిర్బంధించినట్లు రాయడం అవాస్తవమన్నారు. ఇసుక రీచ్‌కి సంబంధించిన సిబ్బంది ఎక్కడా వైఎస్సార్ సీపీ, ఎమ్మెల్యే శంకరరావు పేరు ప్రస్తావించలేదని చెప్పారు. దాడి జరిగిన వెంటనే మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ వచ్చి పరామర్శించి, దీనికి రాజకీయ రంగు పులిమారు. అమరావతి నుంచి దండా నాగేంద్ర కారులో పరమేశ్వరరావు గుంటూరు ఈనాడు కార్యాలయానికి చేరి.. అక్కడ అల్లిన కట్టుకథే ఈనాడులో ప్రచురితమైంది. -
తమ్ముడి బాటలోనే అన్న నాగేంద్ర
-
రెండు వారాల గ్యాప్‌లో రెండు హిట్లు
‘‘నేను మాటలు అందించిన ‘కోట బొమ్మాళి’ (నవంబర్ 24), ‘హాయ్ నాన్న’ (డిసెంబరు 7) చిత్రాలు రెండు వారాల గ్యాప్‌లో విడుదలై సక్సెస్ అవడం సంతోషంగా ఉంది. ‘కోట బొమ్మాళి’ ΄పోలిటికల్ థ్రిల్లర్. ‘హాయ్ నాన్న’ ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు విభిన్నమైన కథలకు మాటలు అందించిన నాకు మంచి పేరొచ్చింది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, డైరెక్టర్ సుకుమార్గార్లు ప్రత్యేకంగా అభినందించడం మరచిపోలేను’’ అన్నారు. మాటల రచయిత నాగేంద్ర కాశీ. ఇంకా తన కెరీర్ గురించి నాగేంద్ర మాట్లాడుతూ– ‘‘నాది కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న నాగేశ్వరరావు, అమ్మ సత్యవతి. రచన, సాహిత్యంపై ఇష్టంతో ఇంటర్ చదివే రోజుల నుంచే కథలు రాయడం మొదలుపెట్టాను. నేను రాసిన కథలతో ‘నల్ల వంతెన’ అనే తొలి పుస్తకం పబ్లిష్ చేశాను. దీనికి నాలుగు అవార్డులు వచ్చాయి. తొలిసారి ‘పలాస 1978’ సినిమాకి కో రైటర్‌గా పని చేశా. ఆ తర్వాత ‘తోలు బొమ్మలాట’ మూవీకి రచనా సహకారం చేశాను. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాకి కథ ఇచ్చాను. నా ‘నల్ల వంతెన’లో ఓ కథ నచ్చడంతో నాకు ‘సుకుమార్ రైటింగ్స్‌లో’ చాన్స్ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్‌గారు. ‘విరూపాక్ష’కి రైటింగ్ విభాగంలో చేశా. ఆ తర్వాత రామ్‌చరణ్– బుచ్చిబాబుగార్ల మూవీకి బుచ్చిబాబుగారితో కలిసి మాటలు రాస్తున్నాను. ‘పుష్ప 2’ సినిమాకి రచయితల విభాగంలో చేస్తున్నాను. అలాగే రష్మిక నటిస్తున్న ‘రెయిన్బో’కి మాటలు అందిస్తున్నాను. సుకుమార్‌గారి వద్ద పని చేసే చాన్స్ రావడం నా లక్. భవిష్యత్తులో డైరెక్టర్ కావాలని ఉంది. ఐదు కథలు సిద్ధం చేసుకున్నాను’’ అన్నారు. -
జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా నాగేంద్ర
సాక్షి,బళ్లారి: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న రాష్ట్ర యువజన, క్రీడా, ఎస్టీ వర్గాల సంక్షేమ శాఖా మంత్రి బీ.నాగేంద్రకు బళ్లారి జిల్లా ఇన్చార్జ్ మంత్రి పదవిని కూడా కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆయా జిల్లాలకు ఇన్చార్జ్ మంత్రి పదవులు కేటాయించగా, బళ్లారి గ్రామీణ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి శ్రీరాములుపై భారీ మెజార్టీతో గెలుపొందిన నాగేంద్రకు జిల్లా ఇన్చార్జ్ మంత్రి పదవి కూడా దక్కడం ఆయన అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఇక అభివృద్ధిని పరుగు పెట్టిస్తా: మంత్రి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మంత్రి పదవితోపాటు జిల్లా ఇన్చార్జ్ మంత్రి బాధ్యతలు కూడా సీఎం అప్పగించడంపై హర్షం వ్యక్తం చేశారు. తనపై సీఎం పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాను అభివృద్ధిలో మరింత పరుగులు పెట్టిస్తానన్నారు. జిల్లాకు డీఎంఎఫ్ తదితర నిధులతో అభివృద్ధి విషయంలో రాజీ లేకుండా జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. అంతర్జాయ స్టేడియం నిర్మాణం చేపట్టడంతో పాటు జిల్లాను రాష్ట్రంలోనే అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళతానన్నారు. మంత్రి అభిమానుల సంబరాలు బళ్లారిఅర్బన్: బళ్లారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్రను శుక్రవారం జిల్లా ఇన్చార్జ్జ్ మంత్రుల నియామకంలో బళ్లారి జిల్లాకు ఇన్చార్జ్ మంత్రిగా నియమించడంతో అభిమానులు రాయల్ సర్కిల్లో బాణసంచాను పేల్చి స్వీట్లను పంచి పెట్టి కాంగ్రెస్ జెండాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అభిమానుల సంఘం అధ్యక్షులు ఎంజీ కనక, పార్టీ నాయకులు చాగనూరు శ్రీనివాస్, బీ.మారుతీ, వై.అరుణ్‌కుమార్, అల్లీపుర్ ఆనంద్, తిప్పేరుద్ర, ఆంజనేయ, అరుణ్, నాగరాజ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అధికారంలోకి వస్తే అఖండ బళ్లారి’
సాక్షి, బళ్లారి అర్బన్(కర్ణాటక): వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే విడిపోయిన విజయనగరను తిరిగి కలిపి అఖండ బళ్లారిగా ఒకే జిల్లాను చేస్తామని ఎమ్మెల్యే నాగేంద్ర తెలిపారు. ఆదివారం స్థానిక మోకా రోడ్డు ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన విధాన పరిషత్ ఎన్నికల బళ్లారి గ్రామీణ ప్రచార సభను ప్రారంభించి మాట్లాడారు. అనుభవజ్ఞుడైన అభ్యర్థి కేసీ కొండయ్యను గెలిపించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు అల్లం వీరభద్రప్ప తదితరులు పాల్గొన్నారు. -
నాగేంద్ర అరెస్ట్‌కు కౌంట్‌డౌన్ మొదలు
సాక్షి, విజయవాడ : ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్ర అరెస్ట్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. 45 మందిని విచారించిన పోలీసులు వారం క్రితమే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసారు. అరెస్ట్‌కు వైద్యపరమైన చిక్కులు ఎదురవడంతో ఆటంకం ఏర్పడింది. వైద్యుల నుంచి సానుకూల సంకేతాలు వచ్చే అవకాశం ఉండటంతో అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు డీసీపీ హర్షవర్ధన్ సాక్షి టీవీతో మాట్లాడారు. వైద్యులు క్లారిటీ ఇచ్చిన వెంటనే నాగేంద్రను అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వెల్లడించారు. కస్టడీకి తీసుకొని హత్యకు గల కారణాలు రాబడతామని డీసీపీ పేర్కొన్నారు. చదవండి: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవగానే అరెస్ట్ చదవండి: దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు -
నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం
-
దివ్య కేసు: నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం
సాక్షి, విజయవాడ : ఇంజనీరింగ్ విద్యార్థిని దివ్య హత్య కేసులో చిక్కుముడులు వీడాయి. నిందితుడు నాగేంద్ర వాదనలో నిజం లేదని పోలీసులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో నాగేంద్ర అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. దీనిపై సీపీ బత్తిన శ్రీనివాసులు సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘దివ్య తేజస్విని హత్య కేసులో విచారణ పూర్తి చేశాము. అన్ని కోణాల్లో దర్యాప్తు చేశాము. ఫోరెన్సిక్, మెడికల్ రిపోర్టులు కూడా వచ్చాయి. దివ్య.. నిందితుడి నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే ఆమె చేతులకు కత్తిగాట్లు పడ్డాయి. ( వాడికి బతికే అర్హత లేదు ) గొంతు కోసి, కడుపులో బలంగా పొడవటం వల్లే దివ్య చనిపోయింది. శాస్త్రీయ ఆధారాలు నివేదికల్లో ఉన్నాయి. కత్తి పోట్లపై నిపుణుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నాము. నాగేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నందు వల్ల అరెస్ట్ చేయలేకపోతున్నాం. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి చేసి, డిశ్చార్జ్ అవగానే అరెస్ట్ చేస్తాము. కోర్టులో హాజరు పరిచాక న్యాయమూర్తి అనుమతితో కస్టడీలోకి తీసుకొని వివరాలు రాబడతామ’’న్నారు. -
వాడికి బతికే అర్హత లేదు
సాక్షి, విజయవాడ: తమ ఇంటి దీపాన్ని ఆర్పేసిన ఉన్మాది నాగేంద్రకు బతికే అర్హతలేదని, నేరాన్ని సాక్ష్యాధారాలతో నిరూపించి అతడికి ఉరిశిక్ష పడేలా చూడాలని దివ్య తేజస్విని తల్లితండ్రులు అన్నారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దివ్యది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. ఈ సందర్భంగా దివ్య తల్లితండ్రులు శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నిజం నిప్పులాంటిదని దాన్ని బయటకు రాకుండా ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. (ఎవరి గొంతు వాళ్లే కోసుకున్నాం: నాగేంద్ర) తమ బిడ్డను కిరాతకంగా హత్య చేయటమే కాక మార్ఫింగ్ ఫోటోలు పెట్టి అందరినీ నాగేంద్ర తప్పుదారి పట్టించాడని వాపోయారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికల్లో దివ్యది హత్యే అని తేలిందని, తాము మొదటినుంచీ చెబుతున్నదే నిపుణుల రిపోర్టులో వచ్చిందని తెలిపారు. అబద్దం చెప్పి తప్పించుకొనేందుకు నాగేంద్ర కట్టుకథలు చెబుతున్నాడన్నారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందన్న నమ్మకం తమకు ఉందని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్న దివ్య తేజస్విని ఈ నెల 15న నాగేంద్ర జరిపిన కత్తి దాడిలో ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నాగేంద్ర తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు. అయితే దివ్యను తాను చంపలేదని, ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పుకొచ్చాడు. తమ పెళ్లిని పెద్దలు అంగీకరించపోవడంతో ఇదంతా చేశామన్నాడు. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ నివేదికలు రావడంతో అతడు చెప్పింది అబద్ధమని తేలిపోయింది. చదవండి: దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు -
అంపశయ్యపై నాన్న!
నేను పోతేనే ఇంట్లో అన్నం: మా పరిస్థితి దయనీయంగా ఉంది. మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను పెంచి పెద్దచేసింది. నేను ఊరికి పోతేనే ఇంట్లో అన్నం వండుకుంటుంది. లేదంటే కూలి పనులకు వెళ్లిన చోట ఎవరైనా ఏదైనా పెడితే తింటుంది. లేకపోతే పస్తులుంటుంది. ఇంతకాలం మా బాగోగులు పట్టించుకోని నాన్న ఉన్నా లేనట్లే అనుకున్నాం. ఒక్క రోజు కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎక్కడున్నాడో, ఏమయ్యాడో కూడా తెలియలేదు. 12 ఏళ్ల తర్వాత ఆయన దీనావస్థ నాకు కన్నీళ్లు పెట్టిస్తోంది. – ‘సాక్షి’తో కన్నీటి పర్యంతమైన శివశంకరయ్య కుమారుడు నాగేంద్ర నాన్న.. ఓ నమ్మకంతల్లి నవమాసాలుమోస్తే.. తండ్రి జీవితాన్నిస్తాడు.. చేయిపట్టి నడిపిస్తాడు..తడబడే అడుగులనుసరిచేస్తాడు..తను కరిగిపోతూ..ప్రతిరూపానికి దారి చూపుతాడు.పిల్లల కంట్లో నలుసుపడినా..ఆ తండ్రి కంట్లో సుడులు,కష్టాల్లో సుఖాల్లో..తోడూనీడ.. ఆ బంధం.ఇంట్లో దీపం పెట్టిన ఇల్లాలికిఅన్నీ తానవుతూ..ఇంట్లో వెలుగులు నింపినపిల్లలకు సర్వస్వం ధారపోసేప్రత్యక్ష దైవం తండ్రి. – ఇదీ సమాజంలో నాన్నకు నిర్వచనం ఏడడుగుల బంధం.. ఎన్నో ఆశలతో మెట్టినింట్లో అడుగు పెట్టిన ఇల్లాలు.భర్త చాటు భార్యగానలుగురికీ తలలో నాలుకగా..ఓ పిల్లాడికి తల్లిగా..ఈ సంతోషంఎంతో కాలం నిలువలేదు..ఎగ‘తాళి’చేసి భార్య చేయి వదిలాడు..బాధ్యత మరిచి తిరిగాడు..ఏళ్ల తరబడి ఇల్లు కాదనుకున్నాడు..జీవిత చరమాంకంలో,నా అనే పిలుపునకు నోచుకోక..అనాథలా బతుకీడుస్తున్నాడు.మృత్యువు ముంగిట రోజులు లెక్కిస్తున్నాడు. – దారి తప్పిన తండ్రి దీనావస్థ ఇది అనంతపురం, హిందూపురం: బలిజ శివశంకరయ్య.. వయస్సు 80 ఏళ్లు. సొంతూరు రాయచోటి సమీపంలోని మాసాపేట. లారీ డ్రైవర్‌గా పనిచేసే ఇతనికి సుమారు 35 ఏళ్ల క్రితం వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం చిట్లూరుకు చెందిన మహిళతో వివాహమైంది. వీరి దాంపత్య జీవితానికి గుర్తుగా ఇద్దరు సంతానం. కుమార్తె, కుమారుడు. ఇంతవరకు సంసారం సాఫీగానే సాగింది. ఆ తర్వాత అతను బాధ్యత మరిచిపోయాడు. మాసాపేటలో ఉండలేక భార్య ఊరికి మకాం మార్చాడు. అక్కడా ఇమడలేకపోయాడు. కుటుంబాన్ని గాలికొదిలేశాడు. తన జీవితం, తన ఇష్టమనుకున్నాడు. దొరికిన చోటల్లా అప్పులు చేసి ముఖం చాటేశాడు. అప్పటి నుంచి ఆ ఇంటి నిండా కష్టాలే. తినేందుకు తిండి లేక.. పిల్లల బాగోగులు చూసే స్థోమత కరువై ఆ ఇల్లాలు పడిన వేదన అంతాఇంతా కాదు. భర్త చాటు భార్యగా మెలిగిన ఆమెకు జీవితం శూన్యంగా కనిపించింది. ఓ వైపు ఎదిగి వస్తున్న పిల్లలు.. మరోవైపు చేతిలో చిల్లిగవ్వ లేదు. కళ్ల నుంచి ఉబికి వచ్చే నీళ్లతో తనకు తానే ధైర్యం చెప్పుకుంది. ఇంటి నుంచి కాలు బయటపెట్టి బతకడం నేర్చుకుంది. కూలి పనులతో జీవనం భర్త వస్తాడు.. కుటుంబాన్ని చక్కదిద్దుతాడని నిరీక్షించింది. రోజులు.. నెలలు గడిచిపోయాయి. ఇక లాభం లేదనుకొని ఊళ్లోనే కూలి పనులకు వెళ్లింది. పొలం పనులకు వెళ్లిన సమయంలో తోటి కూలీలు పెట్టిన ముద్ద తిని కడుపు నింపుకుంది. పైసా పైసా కూడబెట్టి పిల్లలను ప్రయోజకులను చేసేందుకు ఎంతో శ్రమించింది. కుమార్తెకు వివాహం చేసింది. కుమారుడు ఎంటెక్ పూర్తి చేసేందుకు ఆమె పడిన కష్టం ఆ ఊరంతటినీ కంటతడిపెట్టిస్తుంది. చదవండి: నాకు నాన్న అవసరం లేదు... చికిత్స కోసం కుమారుని వద్దకు.. వయస్సులో ఉండగా శివశంకరయ్యకు భార్య, పిల్లలు గుర్తుకు రాలేదు. సుమారు పదేళ్లు గడిచాక, కాలుకు పుండు కావడంతో చికిత్స కోసం డబ్బు అవసరమై కుటుంబ సమాచారాన్ని సేకరించాడు. కుమారుడు హైదరాబాద్‌లో బ్యాంకు కోచింగ్ తీసుకుంటున్న విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత వచ్చిన తండ్రిని చూసి ఆ కుమారుడు చలించిపోయాడు. గతాన్ని పక్కనపెట్టి స్నేహితుల వద్ద తలకు మించిన అప్పులు చేసి తండ్రి కాలికి చికిత్స చేయించాడు. తన అద్దెకు ఉంటున్న రూములోనే తండ్రికి ఓ మంచం ఏర్పాటు చేసి తన లక్ష్యాన్ని పక్కనపెట్టి సపర్యలు చేశాడు. ఆరోగ్యం కాస్తకుదుటపడగానే చెప్పాపెట్టకుండా శివశంకరయ్య అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హిందూపురంలో ప్రత్యక్షం ఎక్కడున్నాడో తెలియదు.. ఏం చేశాడో తెలియదు.. మూడు రోజుల క్రితం హిందూపురం ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఓ స్వచ్ఛంద సంస్థకు తారసపడ్డాడు. కుడి కాలుకు ఏర్పడిన గాయం పెద్దదై పురుగులు పట్టిన స్థితిలో ఉన్న శివశంకరయ్యను ఆసుపత్రిలో చేర్పించారు. రెండు రోజులుగా ముస్లిం నగారా ట్రస్టు వ్యవస్థాపకుడు ఉమర్‌ఫరూఖ్, సభ్యులు అన్నీ తామై సపర్యలు చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీరట, బయటకు నెట్టేశారట! చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న సమయంలోనూ ఆ తండ్రి కుటుంబ పరువును బజారుకీడ్చాడు. తన కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని, తన డబ్బునంతా లాక్కొని భార్య, పిల్లలు బయటకు నెట్టేశారని నిందలు మోపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కుమారునికి ఫోన్ చేసి తమదైన శైలిలో ప్రశ్నించగా బెదిరిపోయిన ఆ యువకుడు సరైన సమాధానం చెప్పలేకపోయాడు. మీ ఇష్టం సార్, మేము ఆయన వల్ల చాలా కోల్పోయాం, ఇక ఆయనను భరించలేమని కన్నీటి పర్యంతమయ్యాడు. ఎంతైనా నాన్న.. జన్మనిచ్చిన తండ్రి తనను గాలికొదిలేసినా.. ఆ యువకుడు బాధ్యతగా భావించాడు. ఇన్నేళ్లు రెక్కలు ముక్కలు చేసుకున్న తల్లిని కనీసం జీవిత చరమాంకంలోనైనా సుఖపెట్టాలనే ఆశ ఒకవైపు. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తండ్రిని కాపాడుకోవాలనే తాపత్రయం మరోవైపు. ఇప్పటికీ జీవితంలో కుదురుకోలేదు. ఎంటెక్ పూర్తి చేసి నాలుగేళ్లయినా ఉద్యోగం లేదు. ఈ పరిస్థితుల్లో హిందూపురానికి వచ్చి తండ్రిని కాపాడుకునేందుకు ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. పరిస్థితి ఆందోళనకరం ప్రస్తుతం శివశంకరయ్య కాలు కుళ్లిపోయింది. ఇది హైరిస్కు కేసు. షుగర్ కూడా ఉంది. కాలును మోకాలు వరకు తొలగించాలి. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తే వారి అంగీకారం మేరకు ఆపరేషన్ నిర్వహిస్తాం. వాళ్లు ఎవరూ స్పందించకపోతే రెండు రోజుల్లో మానవతా దృక్పథంతో మేమే ఆపరేషన్ చేస్తాం. – డాక్టర్ కేశవులు,ఆసుపత్రి సూపరింటెండెంట్ చదవండి: నాకు నాన్న అవసరం లేదు... -
నాకు నాన్న అవసరం లేదు...
సాక్షి, హిందూపురం: చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న తండ్రిని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిర్దయగా వదిలేసిన ఘటన అనంతపురం జిల్లా హిందూపురంలో చోటు చేసుకుంది. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన బలిజ శివశంకరయ్య (80) హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నాడు. కాలుకు పుండు కావడంతో ఆ ప్రదేశం కుళ్లిపోయింది. వార్డులోని మిగిలిన రోగులు ఆయన స్థితిని చూసి అక్కడ ఉండలేకపోవడంతో ముస్లిం నగారా ట్రస్టు వ్యవస్థాపకుడు ఉమర్‌ఫరూఖ్, సభ్యులు.. రోజూ స్నానం చేయించి దుస్తులు మార్చి సపర్యలు చేస్తున్నారు. అతని ద్వారా వివరాలు సేకరించి వన్‌టౌన్ ఎస్ఐ బాలమద్దిలేటికి సమాచారమిచ్చారు. అతని వద్ద ఉన్న ఆధార్‌కార్డు ఆధారంగా వైఎస్సార్ జిల్లాలోని చెనిక్కాయలపల్లి రామాపురం చిట్లూరు వాసిగా గుర్తించారు. కుమారుడు నాగేంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఉమర్‌ఫరూక్ ట్రస్ట్ సభ్యులు, సీఐ అతన్ని ఫోన్లో సంప్రదించగా ‘నాకు నాన్న అవసరం లేదు. నన్ను ఆయన సాకలేదు. నేనేమీ ఆయన ఆస్తులు తీసుకొని బయటకు గెంటేయలేదు. ఆయన ఎక్కడకు పోయాడో కూడా తెలియదు. ఇప్పుడు నాకు ఆయన్ను చూడటం కష్టం. మీ ఇష్టం, ఏమైనా చేసుకోండి’ అని సమాధానం ఇచ్చాడు. కుమారుని ప్రవర్తనతో కలత చెందిన శివశంకరయ్య కేసు పెట్టేందుకు సిద్ధమని సీఐతో చెప్పడం గమనార్హం. జీవిత చరమాంకంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వృద్ధుడిని చూసి స్థానికుల మనసు ద్రవిస్తోంది. -
కొత్త కొత్తగా...
సుజియ్, మధుప్రియ, నాగేంద్ర సి.హెచ్, వెంకట్ ప్రధాన తారలుగా ఓ చిత్రం ప్రారంభమైంది. రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా డా.పర్వతరెడ్డి, నవీన్ కుమార్‌రెడ్డి, సనారెడ్డి, జనార్ధన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలుగు ఫిలించాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు సాయివెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు భానుచందర్ క్లాప్ ఇచ్చారు. డైరెక్టర్ వీరభద్రం చౌదరి గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘ఇటీవల వస్తున్న సినిమాలకు భిన్నంగా కొత్త కథతో మా సినిమా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. లక్ష్మీ పిక్చర్స్ అధినేత బాపిరాజు, నిర్మాత శేఖర్‌రెడ్డి, డైరెక్టర్ బి. వేణు, హైకోర్టు న్యాయవాది లక్ష్మీపతి, శ్రీనివాస్‌గౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కిట్టు, సంగీతం: ఉదయ్‌కిరణ్. -
కేఈ వర్సెస్ తుగ్గలి
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీలో ఉన్న కేఈ, తుగ్గలి నాగేంద్ర మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. రైల్వే కాంట్రాక్టు పనుల విషయంలో విభేదాలు ముదిరి, ఏకంగా దాడులు చేసుకునే దాకా పరిస్థితి వెళ్లింది. రైల్వే కాంట్రాక్టు పనులు చేస్తున్న ప్రాంతంలోకి కేఈ శ్యాంబాబు స్టిక్కరు తగిలించుకున్న వాహనంలో ఆయన అనుచరులు వచ్చి.. కాంట్రాక్టు సంçస్థకు చెందిన లారీలు, జేసీబీలపై దాడులు చేశారని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. లింగనేనిదొడ్డి నుంచి గుంతకల్లు వరకు మొత్తం 50 కిలోమీటర్ల మేర రూ.78 కోట్లతో రైల్వే లైన్ డబ్లింగ్ పనులు జరుగుతున్నాయి. వీటిని తుగ్గలి నాగేంద్ర అండదండలతో కాంట్రాక్టర్లు చేస్తున్నారనేది కేఈ వర్గం భావన. కాంట్రాక్టు చేయొద్దని తుగ్గలిని వారించినప్పటికీ వినకపోవడం వల్లనే ఈ ఘటనలు జరుగుతున్నాయన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. తమను బెదిరించేందుకు చేస్తున్న ఈ ఘటనలకు భయపడబోమని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. కేఈ శ్యాంబాబు ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజా సంఘటనలోనూ ఆయనపై సొంత పార్టీ నేతనే ఆరోపణలు చేయడం గమనార్హం. మరోవైపు దీనిపై కేఈ వర్గం ఇంకా అధికారికంగా స్పందించలేదు. మొదటి నుంచి ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు ఏకంగా దాడుల దాకా వెళ్లడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు జరిగిన సంఘటనకు సంబంధించి గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మొదటి నుంచీ అదే తీరు! వాస్తవానికి ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు మొదటి నుంచీ నడుస్తోంది. అయితే, చంద్రబాబు కుటుంబానికి తుగ్గలి నాగేంద్ర దగ్గర కావడంతో కేఈ వర్గం ఆయన్ను ఏమీ చేయలేకపోతోందన్న అభిప్రాయం ఉంది. ఇక ఏటా నిర్వహించే సామూహిక వివాహ మహోత్సవానికి జిల్లాలోని అందరు నేతలను పిలిచిన తుగ్గలి నాగేంద్ర.. కేఈ కుటుంబాన్ని మాత్రం దూరంగా ఉంచారు. అలాగే వివిధ కార్పొరేషన్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలో కేఈ వర్గం వారికే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ మండల కార్యాలయంలో హల్చల్ చేశారు. తమ వర్గానికి కూడా కార్పొరేషన్ రుణాలు అందేలా జాబితా రూపొందించాలంటూ ఉద్యోగులపై చిందులు వేశారు. దీంతో నాగేంద్రపై కేసు పెట్టేదాకా పరిస్థితి వెళ్లింది. ఇక రైల్వే కాంట్రాక్టు విషయంలో ఎవ్వరూ టెండరు వేయవద్దని కేఈ వర్గం నుంచి హెచ్చరికలు వెళ్లాయి. ఈ కాంట్రాక్టు పనులను వారే తీసుకోవాలని భావించారు. అయితే, దీన్ని ఖాతరు చేయని తుగ్గలి నాగేంద్ర టెండర్లో పాల్గొనడమే కాకుండా పనులు సైతం దక్కించుకున్నారు. ఇది కేఈ వర్గానికి మింగుడుపడని వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలోనే రైల్వే పనులు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి.. లారీలు, జేసీబీల అద్దాలు పగలగొట్టి, పనులు చేయవద్దంటూ బెదిరింపులకు దిగారు. వారు కేఈ శ్యాంబాబుకు చెందిన స్టిక్కర్లు అతికించిన వాహనాల్లో వచ్చారని తుగ్గలి నాగేంద్ర అంటున్నారు. దీనిపై పోలీసు స్టేషన్లోనూ ఫిర్యాదు చేశారు. అయితే, ఇప్పటివరకు కేఈ కుటుంబంపై ఎటువంటి కేసు నమోదు కాలేదు. -
కర్నూలు టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
సాక్షి, కర్నూలు : జిల్లాలోని పత్తికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకుల మధ్య వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దుండగులు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తుగ్గలి నాగేంద్రకు సంబంధించిన ఆస్తుల మీద దాడి చేశారు. నాగేంద్ర రైల్వే పనులకు ఉపయోగిస్తున్న రెండు టిప్పర్లు, నాలుగు హిటాచీ వాహనాలను ధ్వంసం చేయడమే కాక పని వారి మీద కూడా దాడి చేశారు. డిప్యూటి సీఎం కొడుకు అనుచరులే తన మీద దాడి చేశారని ఆరోపిస్తున్నారు నాగేంద్ర. దాడి చేయడానికి వచ్చిన మనుషులు సీఎం కొడుకు శ్యాంబాబు వాహనంలోనే వచ్చారని తెలిపారు. తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని నాగేంద్ర ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సోషల్ మీడియా ఆర్గనైజర్‌పై పోలీసుల వేధింపులు
పామర్రు: సోషల్ మీడియా ఆర్గనైజర్ నాగబాబుపై పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయి. అమరావతిలో జరుగుతున్న అక్రమాలు, అధికార పార్టీ నేతల అవినీతిపై సోషల్ మీడియాలో పోస్టింగ్ చేయడం వారికి కోపం తెప్పించాయి. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన పోలీసులపై ఒత్తిడి తేవడంతో నాగబాబుపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నాగబాబును అదుపులోకి తీసుకోవడంతో సోషల్ మీడియా ఆర్గనైజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు కేసులు నమోదు చేయడంపై వైఎస్సార్సీపీ విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను, కె. పార్ధసారథి, పామర్రు ఇన్చార్జి కైలా అనీల్ కుమార్‌లు మండిపడ్డారు. పామర్రు పోలీసుల తీరుపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్సీపీ తెలిపారు. అక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండేందుకు సోషల్ మీడియా గొంతు నొక్కేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యం
రైల్వేకోడూరు : రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమని వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాజ్, ఆ పార్టీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి పేర్కొన్నారు. ఓబులవారిపల్లె మండలం వైకోట గ్రామానికి చెందిన సీడీ నాగేంద్ర పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా కువైట్‌లో ఉన్న మహేష్ యాదవ్, వైకోట గ్రామ ప్రజలు కువైట్‌లోని పార్వానియా ఒమేరియా పార్క్‌లో అభినందన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముమ్మడి బాలిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజన్న రాజ్యం రావాలంటే జగన్‌ను ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. జగన్ చేస్తున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. మహేష్ యాదవ్ మాట్లాడుతూ సీడీ నాగేంద్రను పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా నియమించి, గౌరవించడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో పార్టీ పలు విభాగాల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు గోవిందు నాగరాజు, ఎంవీ నరసారెడ్డి, పీ రెహమాన్, నాయని మహేష్‌రెడ్డి, జగన్ యూత్ ఫోర్స్ కమిటీ సభ్యులు, కువైట్ యాదవ్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
పిచ్చికుక్కల దాడి: బాలుడు మృతి
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ నగర్ చెరువు సెంటర్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి ఆరేళ్ల బాలుడుపై దాడి చేశాయి. ఇంటి వద్ద ఆడుకుంటున్న నాగేంద్రపై కుక్కలు గుంపు దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. నాగేంద్ర స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే కుక్కలు ఒక్కసారిగా మీద పడడంతో భయపడిన నాగేంద్ర కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో బాలాజీ నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. కుక్కల దాడిపై స్థానికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతన్నాయని ఆరోపిస్తున్నారు. -
కాకినాడలో దారుణం: పిచ్చికుక్కల దాడిలో బాలుడు మృతి
-
మినీ మహానాడులో రచ్చకెక్కిన విభేదాలు
-
టీడీపీలో రచ్చ : మహానాడులో కేఈ, తుగ్గలి మాటల యుద్ధం
సాక్షి, తుగ్గలి : టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. ఆదివారం తుగ్గలిలో టీడీపీ నియోజవర్గ ఇన్చార్జ్ కేఈ శ్యాంబాబు అధ్యక్షతన జరిగిన మినీ మహానాడు అందుకు వేదికైంది. కార్యక్రమం ప్రారంభం కాగానే ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ స్టేజి మీద ఆశీనులయ్యారు. కొంతసేపటి తర్వాత శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ నాగేంద్ర తన భార్య జెడ్పీటీసీ సభ్యురాలు వరలక్ష్మితో కలిసి తప్పెట్ల హంగామాతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇదంతా చూస్తున్న ఎమ్మెల్సీ కేఈ.. తన ముందుగా వెళుతున్న నాగేంద్రను ఏదో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. కేఈ ఘాటుగా మాట్లాడడంతో ప్రతిగా నాగేంద్ర..‘‘ఏయ్ మాట్లాడే విధానం నేర్చుకో భూస్థాపితం అవుతావు’’ అని హెచ్చరించారు. ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసు కోవడంతో కొద్ది సేపు అక్కడ ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఈ తతంగం అంతా టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఎదుటే జరగడంతో అక్కడున్న వారంతా విస్తుపోయారు. సోమిశెట్టి, శ్యాంబాబు, పోలీసులు, వేదిక మీద ఉన్న నాయకులు ఇద్దరికీ సర్ది చెప్పాల్సి వచ్చింది. అంతటితో ఆగకుండా సమావేశం ముగిసే వరకు మధ్యమధ్యలో వారి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ఎమ్మెల్సీ ప్రభాకర్ మాట్లాడుతూ.. పత్తికొండలో ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని ఇక్కడికి ఎవరూ రారని, కేఈ శ్యాంబాబే పోటీ చేస్తారన్నారు. రక్తమోడైనా విజయం కోసం పని చేస్తానన్నారు. తుగ్గలిలో 2009 సార్వత్రిక ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు టీడీపీకి 23 ఓట్లు మాత్రమే మెజార్టీ వచ్చిందని, 2014లో వైఎస్సార్సీపీకి 240 ఓట్లు మెజార్టీ వచ్చిందని ఇక్కడ ఎవరూ ఏమీ పొడిచింది లేదంటూ పరోక్షంగా కేఈ నాగేంద్రను అనడంతో మరోసారి వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మొదటి నుంచి రికార్డులు చూసుకోవాలని నాగేంద్ర వాదించారు. ఇలా ఇద్దరి మధ్య పలుమార్లు మాటల తూటాలు పేలాయి. వీరి మధ్య విభేదాలు ఇప్పటివి కావని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. -
జాతరకు వెళ్లి ఉన్నా నువ్వు బతికే వాడివి కదరా!
‘ఒరే నాగేంద్ర.. నంద్యాలలో మీ అక్క చేసే జాతరకు వెళ్లి ఉన్నా నువ్వు బతికే వాడివి కదరా. దేవుడా.. మాకు ఎంత పెద్ద శిక్ష వేశావయ్యా. నిన్ననే పోరా అంటే మంగళవారం దినం బాగుంది ఇంటికి వాకిలి నిలిపి వెళ్తానమ్మా అని తిరిగి రాని లోకాలకు వెళ్లి పోయావా నాయనా’ అంటూ తల్లి రోదించిన తీరు చూపరులను కలచివేసింది. గుత్తి రూరల్: నిర్మాణం జరుగుతున్న ఇంటికి నీటితో క్యూరింగ్ చేసే క్రమంలో విద్యుత్ తీగలు తగిలి ఆటో డ్రైవర్ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. ఊబిచెర్లకు చెందిన బోయ నాగేంద్ర (30) ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఇంటిపై మరో ఇల్లు నిర్మాణం చేపట్టాడు. వాకిలి నిలిపి సిమెంట్ ప్లాస్టింగ్ చేయడంతో వాటి క్యూరింగ్‌కు మంగళవారం నీళ్లు పెడుతున్నాడు. పైన ఉన్న విద్యుత్ తీగలను గమనించక వాటిని తాకడంతో విద్యుదాఘాతానికి గురై మిద్దెపై నుంచి కిందకు పడ్డాడు. భార్య కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి అతడిని వెంటనే గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే నాగేంద్ర మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్సీపీనాయకులపరామర్శ నాగేంద్ర మృతదేహాన్ని వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ హుస్సేన్‌పీరా, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి మల్లయ్యయాదవ్, మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, సీనియర్ నాయకులు రామరంగారెడ్డి, రామకృష్ణ, రామచంద్రలు ఆస్పత్రిలో సందర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. -
10న కాంగ్రెస్‌లోకి కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్ర
బొమ్మనహళ్లి: బళ్ళారి జిల్లా బీజేపీకి మరో ఎదురుదెబ్బ. జిల్లా హసపేట బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, కూడ్లిగి నియోజకవర్గం బీజేపీ నాగేంద్ర కూడా అదే బాటలో ఈ నెల 10వ తేదిన కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య శనివారం మీడియాతో తెలిపారు. శనివారం నాగేంద్ర సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి ఈ విషయమై చర్చలు జరిపారు. 10వ తేదీన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బళ్లారి జిల్లాలో పర్యటిస్తారు. ఆ సమయంలో నాగేం«ద్ర కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. ఒకేజిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను బీజేపీ కోల్పోవడం పార్టీ నాయకులను కలవరపరుస్తోంది. -
ఇంటెలిజెన్స్ ‘రిపోర్టర్’
కోవెలకుంట్ల: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా జర్నలిస్టులతో బేతంచెర్ల సమీపంలో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఇంటెలిజెన్స్ పోలీసు నాగేంద్ర.. ఈ కార్యక్రమానికి హాజరై ప్రతి విషయాన్నీ నమోదు చేసుకున్నారు. ఆ వివరాలను పాదయాత్ర నేపథ్యంలో ఇంటెలిజెన్స్ విభాగం ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని గమనించిన జర్నలిస్టులు సదరు పోలీసును ప్రశ్నించడంతో అక్కడి నుంచి జారుకున్నారు. -
'లెజెండ్'కు 9అవార్డులు వస్తాయని నిరూపిస్తారా!
సాక్షి, హైదరాబాద్ : హింసాత్మక ప్రవృత్తితో కూడిన మూవీలు చేసే దర్శకుడు బోయపాటి శీనుకు బీఎన్ రెడ్డి అవార్డు ఇవ్వడం దారుణమని చిరంజీవి రాష్ట్ర యువత అధికార ప్రతినిధి నాగేంద్ర అన్నారు. సుప్రసిద్ధ వ్యక్తి బీఎన్ రెడ్డి ఎన్నో విలువలతో కూడిన సినిమాలు తీశారు. ఇక్కడ బోయపాటికి బీఎన్ రెడ్డి గురించి తెలుసా. బోయపాటి ఏం చేశారని, ఆయన సినిమాలలో ఏం చూపించారని బీఎన్ రెడ్డి అవార్డు ఇచ్చారంటూ ఆయన ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల వివాదంపై ఆయన మాట్లాడారు. 'మెగా హీరోలకు, వారి సినిమాలకు అవార్డులు ఇవ్వలేదని మేం చెప్పడం లేదు. అవార్డులు కావాలని అడగలేదు. కానీ, అసలు లెజెండ్ సినిమాకు తొమ్మిది అవార్డులు వస్తాయని ఎవరైనా నిరూపించగలరా. ప్రజా క్షేత్రంలోకి వచ్చి ఒపినియన్ పోల్ లాంటిది పెడితే.. ఆ సినిమాకు ఎన్ని అవార్డులొస్తాయన్న వాస్తవం బయటపడుతుంది. మనం సినిమా ఎంతో మంచి మూవీ. అందులో ఎన్నో విలువలున్నాయి. ఉత్తమ చిత్రం సహా పలు విభాగాల్లో అవార్డులు రావాల్సిన మనం మూవీకి కేవలం 'ద్వితీయ ఉత్తమ చిత్రం' అవార్డుతోనే సరిపెట్టారు. చివరిశ్వాస ఉన్నంతవరకూ నటిస్తానని చెప్పిన మహానటుడి చివరి చిత్రం 'మనం'. మనం చిత్రానికి ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వకపోవడం మహానటుడు ఏఎన్నార్ ను అవమానించడమే అవుతుంది. రుద్రమదేవి కోసం నటి అనుష్క ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు. తెలుగువాడి చరిత్రను తెలియజెప్పే ఆ మూవీకి సరైన గుర్తింపు దక్కలేదు. 'రుద్రమదేవి'లో నటనకుగానూ ఉత్తమ నటి అవార్డు అందుకోవాల్సిన అనుష్కకు 'సైజ్ జీరో'కు గానూ ఇవ్వడంలో అర్థం లేదు. ఎన్నో మంచి చిత్రాలు తీసిన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు బీఎన్‌రెడ్డి పురస్కారం ఇచ్చారు. ఎందుకంటే ఆయన మూవీలకూ సరైన గుర్తింపు ఇవ్వకపోవడమే అందుకు ప్రధాన కారణమని' నాగేంద్ర అభిప్రాయపడ్డారు. మరోవైపు గుణశేఖర్, నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా అవార్డులపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. స్టార్ హీరోకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవార్డు ఇవ్వడం అల్లు అర్జున్ను అవమానించమేనని గుణశేఖర్ పేర్కొన్నారు. 'అవార్డుల ఎంపికలో అవకతవకలను ప్రశ్నిస్తే మూడేళ్లు నిషేధిస్తారట. ఏపిలో గుత్తాధిపత్యం నడుస్తోందంటూ' ఆవేదన వ్యక్తం చేశారు. 'నంది అవార్డుల ఎంపికలో ఒక వర్గానికి అనుకూలంగా లాబీయింగ్ జరిగింది. ఉత్తమ నటుడు అవార్డును ప్రభాస్ కు ఎందుకివ్వలేదు..? రుద్రమదేవి సినిమాకు ఎందుకు అన్యాయం చేశారని' నిర్మాత బుజ్జి ప్రశ్నించారు. -
విధి నిర్వహణలో డ్రైవర్‌కు గుండెపోటు
అనంతపురం న్యూసిటీ : విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుకు గురయ్యారు. పుట్టపర్తి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్లు నాగేంద్ర, ఖాన్ విజయవాడ డ్యూటీకి బుధవారం బయలుదేరారు. బస్సు బత్తలపల్లి సమీపానికి రాగానే టికెట్లు కొడుతున్న నాగేంద్రకు ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే ఆయన్ను తోటి డ్రైవర్ ఖాన్ హుటాహుటిన అనంతపురం బస్టాండ్‌కు తీసుకువచ్చారు. విషయాన్ని డ్యూటీలో ఉన్న రాయదుర్గం డిపో మేనేజర్ మద్దిలేటి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన, అనంతపురం డీఎం బాలచంద్రప్ప కలసి వెంటనే నాగేంద్రను 108లో సర్వజనాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అబ్జర్వేషన్లో ఉంచాలంటూ సూచించారు. -
రోడ్డు ప్రమాదంలో వైఎస్సార్ సీపీ నాయకుడు మృతి
తనకల్లు (కదిరి) : అమడగూరు మండలం కొట్టువారిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పి.నాగేంద్రరెడ్డి (40) తనకల్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగేంద్రరెడ్డి పూలకుంట పంచాయతీలో మంగళవారం జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మిత్రుడు ప్రసాద్‌రెడ్డికి చెందిన కారు తీసుకుని ఒంటరిగా తనకల్లు వైపు బయల్దేరారు. బుధవారం తెల్లవారుజామున బిళ్లూరివాండ్లపల్లి సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. మెడభాగంలో తీవ్రమైన గాయాలు కావడంతో నాగేంద్రరెడ్డి కారులోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, కుమార్తెలు మేఘన, కీర్తన ఉన్నారు. ఎస్ఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కదిరి ప్రభుత్వాస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించి, నాగేంద్రరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. -
పింఛన్లు పాత పద్ధతిలో ఇవ్వాలి
అనంతపురం అర్బన్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పింఛను పంపిణీ విధానంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందిపడే పరిస్థితి నెలకొందని సీపీఎం నగర కార్యదర్శి నాగేంద్రకుమార్ ధ్వజమెత్తారు. పింఛను పాత విధానంలో ఇవ్వాలంటూ శుక్రవారం నగర కమిటీ ఆధ్వర్యంలో నాయకులు, పింఛనుదారులు స్థానిక ప్రెస్ క్లబ్ నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడి కార్పొరేషన్ కాంప్లెక్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాగేంద్రకుమార్ మాట్లాడుతూ నల్లధనం అరికట్టెందుకు పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. అయితే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకుండా ఈ చర్యతో సామాన్యులు, ఉద్యోగులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాచే దుస్థితి కల్పించారని మండిపడ్డారు. ఇదే క్రమంలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ బ్యాంకులకు అనుసంధానం చేయడంతో డబ్బులు అందక పింఛనుదారుల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని పింఛనుదారులకు పాత పద్ధతిలో పింఛను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు చండ్రాయుడు, ప్రకాశ్, వలి, నాగప్ప, రామిరెడ్డి, ఓబులేసు, గఫూర్, నూరుల్లా, ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మిదేవి, సావిత్రి, పింఛనుదారులు పాల్గొన్నారు. -
హస్తకళలను ప్రోత్సహించాలి
మంకమ్మతోట : హస్తకళలను ప్రోత్సహించాలని జిల్లా అదనపు జేసీ డాక్టర్ నాగేంద్ర అన్నారు. నగరంలోని శ్రీరాజరాజేశ్వరి కళ్యాణ మండపంలో తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హస్తకళలు, చేనేత వస్త్రాల ప్రదర్శన శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ఏజేసీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. హస్తకళలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కళాకారులకు శిక్షణ ఇస్తోందన్నారు. అంతరించిపోతున్న వివిధ కళలను ప్రభుత్వం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలోని సుమారు మూడు లక్షల మంది హస్తకళాకారులు తయారుచేసిన ఉత్పత్తులను గోల్కోండ హస్తకళా విక్రయశాలలు, ఎక్స్‌పోలు, క్రాఫ్ట్ బజార్‌తోపాటు ఇతర ప్రదర్శనతో మార్కెట్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. కరీంన గర్‌లో శుక్రవారం నుంచి వచ్చే నెల 4 వరకు 70 మంది హస్త కళాకారులు ప్రదర్శన నిర్వహిస్తారని వెల్లడించారు. సూపర్వైజర్ మల్లికార్జున్ మాట్లాడుతూ ప్రదర్శనలో చేతివృత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాల స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు సరసమైన ధరలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. సిల్వర్ ఫిలిగ్రీ, హైదరాబాద్ ముత్యాల నగలు, బంజారా ఎంబ్రాయిడరీ వస్త్రాలు, కళంకార కాటన్ డరీస్, చేర్యాల పెయింటింగ్స్, నిర్మల్ కొయ్యబొమ్మలు, పెయింటింగ్స్, అద్దకం చేనేత వస్త్రాలు, బెంగాల్ కాటన్ చీరలు, వెంకటగిరి, మంగళగిరి, కశ్మీర్, గద్వాల్ సిద్దిపేట కాటన్ చీరలు, చీరాల డ్రెస్ మేటీరియల్‌తో పాటు కాటన్ షర్టులు, బెడ్‌షీట్స్, కీ చైన్స్, లెదర్ పర్సులు నాణ్యమైన వస్తువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ అరుణ తదితరులు పాల్గొన్నారు. -
పాముకాటుకు విద్యార్థి బలి
గుత్తి రూరల్: పొలంలో కలియతిరుగుతున్న విద్యార్థికి పాముకాటు వేయడంతో మృతి చెందాడు. వివరాల్లోకెళితే.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడ్రాయి గ్రామానికి చెందిన సిద్ధరామప్ప, బాలమ్మ దంపతుల కుమారుడు ఎం.నాగేంద్ర (17) అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఎంఎస్ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. మంగళవారం తల్లిదండ్రులతో కలిసి సజ్జ పంటను పరిశీలించేందుకు పొలానికి వెళ్లిన నాగేంద్రకు పాము కాటు వేసింది. బాధతో బిగ్గరగా కేకలు వేయగానే తల్లిదండ్రులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.30వేలు పలికిన అరుదైన కలిచా చేప
అరుదుగా దొరికే కలిచా (ఎర్రపండు చేప) ఆదివారం చీరాల వాడరేవులో మత్స్యకారుల వలకు చిక్కింది. శనివారం ఉదయం వేటకు వెళ్లిన గంగులు తన బృందంతో వేట చేస్తుండగా 25 కిలోల బరువున్న ఈ చేప గాలానికి చిక్కిందని మత్య్సకారులు తెలిపారు. క్యాన్సర్, మొదడు సంబంధ వ్యాధులను నయం చేసే ఔషధాల తయూరీలో కోల్‌కతా, ముంబాయి నగరాల్లో ఈ కలిచా చేపను ఎక్కువగా వినియోగిస్తుంటారని పేర్కొన్నారు. తీరం ఒడ్డున నిర్వహించిన వేలంలో బెంగళూరుకు చేపలను ఎగుమతి చేసే వాడరేవుకు చెందిన వ్యాపారి నాగేంద్ర ఈ చేపను రూ.30,000 వేలకు దక్కించుకున్నాడు. -
పోలీస్ కస్టడీ నుంచి దొంగ పరారు
వివిధ నేరాలకు పాల్పడి పోలీసుల అదుపులో ఉన్న ఓ పాత నేరస్తుడు పోలీస్‌స్టేషన్ నుంచి తప్పించుకుపోయాడు. కర్నూలు జిల్లా కేంద్రంలోని నాలుగో పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ధర్మపేటకు చెందిన నాగేంద్ర(35) వివిధ నేరాలకు పాల్పడి మూడు నెలల క్రితం జైలు నుంచి విడుదలయ్యాడు. అయితే, అటుతర్వాత కూడా అతడి తీరు మారలేదు. తిరిగి నేరాలకు పాల్పడుతుండటంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఇటీవల అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంగళవారం రాత్రి సెంట్రీ కానిస్టేబుల్ ఏమరుపాటుగా ఉన్న సమయంలో నాగేంద్ర పరారయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బైక్, ప్రైవేట్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన మంగళవారం ఉదయం జీడిమెట్ల - నర్సాపూర్ రహదారిపై మైలాన్ కంపెనీ సమయంలో చోటుచేసుకుంది. జీడిమెట్లలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగులుగా పనిచేస్తున్న బాలకృష్ణ(25), నాగేంద్ర(26) బైక్‌పై వెళ్తుండగా బస్సు ఢీకొంది. ఈ ఘటనలో బాలకృష్ణ అక్కడికక్కడే చనిపోగా నాగేంద్ర తీవ్ర గాయాలపాలయ్యాడు. వీరి స్వస్థలం ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణం. -
టీడీపీ ఎమ్మెల్యే బోండా కుమారుడు అరెస్ట్
-
టీడీపీ ఎమ్మెల్యే బోండా కుమారుడు అరెస్ట్
గుంటూరు: విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన కారు రేసు కేసులో సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పట్నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిన సిద్ధార్ధ్ ను పోలీసులు తాజాగా అరెస్ట్ చేసి చిలకలూరిపేట కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ప్రమాదంలో విద్యార్థి విజయ్ నాగేంద్ర ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే కార్ల రేసింగ్ వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. ఆ విషయాన్ని దాచి పెట్టే యత్నం చేస్తున్నారు. -
పరారీలో ఎమ్మెల్యే తనయుడు!
-
పరారీలో ఎమ్మెల్యే బొండా ఉమ తనయుడు!
విజయవాడ : విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారిపై జరిగిన కారు రేసు కేసులో సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సిద్ధార్థ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరోవైపు పోలీసులు కూడా ఎమ్మెల్యే కుమారుడు అనే ఉద్దేశ్యంతోనే ఈ కేసులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా కారు రేసు ఘటనలో ఇంజినీరింగ్ విద్యార్థి నాగేంద్ర (22) మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యే బోండా ఉమ తనయుడిపై కేసు నమోదు
-
ఎమ్మెల్యే బోండా ఉమ తనయుడిపై కేసు నమోదు
గుంటూరు : కారు రేస్‌లపై గుంటూరు జిల్లా యడ్లపాడు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. 304 (A), 337 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు యడ్లపాడు పోలీసులు తెలిపారు. విజయవాడ సెంట్రల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు సిద్ధార్థతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కారు అత్యంత వేగంగా నడపటం వల్లే ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో గాయపడ్డ వారు ఎక్కడ ఉన్నారో తమకు తెలియదని పోలీసులు తెలిపారు. కాగా వేగంగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి అంతే వేగంతో వెళ్తున్న మరో కారును ఢీకొన్న సంఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. కార్లు పల్టీలు కొట్టే సమయంలోనే ఇంజినీరింగ్ విద్యార్థి నాగేంద్ర (22) జాతీయ రహదారిపై పడి మృతి చెందాడు. ఇక ఎమ్మెల్యే కుమారుడు రేస్‌లో పాల్గొనటం ఇది తొలిసారి కాదు. కొద్ది నెలల కిందట విజయవాడ తాడిగడప వద్ద బైక్ రేస్‌లో పాల్గొనగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఎమ్మెల్యే తన పలుకుబడిని ఉపయోగించి పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కుమారుడిపై కేసు లేకుండా మాఫీ చేసుకున్నారని, అప్పుడే పోలీసులు చర్య తీసుకుని ఉంటే ఇప్పుడు ఓ విద్యార్థి బలయ్యేవాడు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
విద్యార్థిని బలిగొన్న అతివేగం
ఏపీలో రోడ్డు ప్రమాదం ఒకరి మృతి, ఎనిమిది మందికి గాయాలు కార్ల రేసింగ్ వల్లే దుర్ఘటన రేసింగ్‌ల వెనుక టీడీపీ ఎమ్మెల్యే కుమారుడు! యడ్లపాడు (గుంటూరు): వేగంగా వస్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి అంతే వేగంతో వెళ్తున్న మరో కారును ఢీకొన్న సంఘటనలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దుర్మరణం పాలయ్యాడు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం పరిధిలో జాతీయ రహదారిపై ఆదివారం ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పది మంది విద్యార్థులు రెండు కార్లలో ఆదివారం చిలకలూరిపేటకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. అత్యంత వేగంగా రెండు కార్లు పక్కపక్కనే వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు ఓ కారు అదుపుతప్పి రెండో కారును ఢీ కొంది. దీంతో అవి పల్టీలు కొడుతూ వెళ్లి ఒకటి హైవే అంచున బోర్లాపడగా, రెండోది పక్కనే ఉన్న కాలువలోకి దూసుకువెళ్లింది. కార్లు పల్టీలు కొట్టే సమయంలోనే అందులో ఉన్న నాగేంద్ర(22) జాతీయ రహదారిపై పడి మృతిచెందాడు. మిగిలిన వారిలో నలుగురికి తీవ్ర గాయాలవగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, విజయవాడకు చెందిన ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కుమారుడు సిద్ధార్థ ఒక కారును, కొప్పుల శివరాం మరో కారు నడుపుతున్నారని ఎస్ఐ ఉమామహేశ్వర్ విలేకరులకు తెలిపారు. ప్రమాదానికి కారకుడైన సిద్ధార్థ పరారీలో ఉన్నాడని చెప్పారు. మరోవైపు ఇది కచ్చితంగా కార్ల రేస్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడకు చెందిన శాసనసభ్యుడి కుమారుడు ఈ రేస్ నిర్వహించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సంఘటనలో ఆయన కూడా గాయపడినప్పటికీ పోలీసులు రహస్యంగా ఆయన్ను విజయవాడకు తరలించి చికిత్స చేయిస్తున్నారని సమాచారం. పోలీసుల అత్యుత్సాహం ఈ ఘటనను ప్రమాదంగానే చిత్రీకరించి, దీనికి కారకుడైన టీడీపీ ఎమ్మెల్యే కమారుడిని తప్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. క్షతగాత్రుల్లో ఆరుగురిని మాత్రమే అంబులెన్సులో ఎక్కించి మిగిలిన ఇద్దరినీ పోలీసు జీపులో తీసుకెళ్లారు. వారిలో ఒకరు టీడీపీ ఎమ్మెల్యే కుమారుడని తెలుస్తోంది. -
ఈ పోస్టు మాకొద్దు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఆ పోస్టు పేరు చెబితేనే అధికారులు హడలిపోతున్నారు. మాకొద్దు బాబోయ్ ఈ కుర్చీ అని పరుగు లంకించుకుంటున్నారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగంలోనే హాట్‌సీటుగా పేరున్న రాజేంద్రనగర్ ఆర్డీఓ పీఠం తాజా పరిస్థితి ఇది. ప్రభుత్వ భూమిని ప్రైవేటుకు కట్టబెట్టిన కేసులో ఇక్కడ పనిచేస్తున్న ఆర్డీఓ నాగేందర్‌ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పటివరకు కాసులు కురిపించే ఈ పోస్టంటే రెవెన్యూ వర్గాల్లో యమక్రేజ్ ఉండేది. ఈ కుర్చీని దక్కించుకునేందుకు సచివాలయ స్థాయిలో లాబీయింగ్ నెరిపేవారు. సీఎం, రెవెన్యూ మంత్రుల సిఫార్సులతో ఈ పదవిని ఎగరేసుకుపోయేవారు. ఇదంతా గతం.. ఇప్పుడు ఈ పోస్టు కోసం పైరవీలు ఆగిపోయాయి. ఖాళీగా ఉంది కదా! అని నామ్‌కే వాస్తేగా అర్జీ పెట్టుకున్నా.. సీరియస్‌గా మాత్రం ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. ఇక్కడ పనిచేసే అధికారి బదిలీ కానున్నారనే సంకేతాలు వెలువడిన మరుక్షణమే ఈ సీటును చేజిక్కించుకోవడానికి పావులు కదిపే అధికారులు.. ఇప్పుడు మాత్రం అటువైపు కన్నెత్తి చూడడంలేదు. శేరిలింగంపల్లి మండలం రాయదుర్గ నవ్ఖల్సాలోని సర్వే నంబరు 66లోని ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిన వ్యవహారంపై విచారణ జరిపిన కలెక్టర్ అప్పటి ఆర్డీఓపై వేటుకు సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం ఖాళీ అయిన ఈ పదవిని చేపట్టేందుకు ఎవరూ ఆసక్తి చూపడంలేదు. గతంలో ఈ పీఠం కోసం విశ్వప్రయత్నాలు చేసిన అధికారులు కూడా ఈసారి ఆ దిశగా ఆలోచన చేయకపోవడం గమనార్హం. భూ ఆక్రమణ లపై జిల్లా కలెక్టర్ బి.శ్రీధర్ కఠినంగా వ్యవహరిస్తున్నారనే సంకేతాలు వెలువడిన నేపథ్యంలో కూడా ఈ పోస్టంటే భయపడేందుకు కారణమై ఉండొచ్చు. ఇదిలావుండగా.. ఒకరిద్దరు పాత కాపులు ఈ సీటుపై కన్నేసినట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల ఆర్డీఓగా వ్యవహరించిన రవీందర్‌రెడ్డి సహా యూఎల్‌సీలో పనిచేస్తున్న అశోక్ కూడా ఈ కుర్చీ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత డీఆర్ఓ వెంకటేశ్వర్లు కూడా ఈ పోస్టును ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే వీరు ఈ పోస్టు కోసం సీరియస్‌గా దృష్టి సారించడం లేదని, వస్తే సరి.. రాకున్నా పరవాలేదనే ధోరణిలో ఉన్నారని రెవెన్యూ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఒకప్పుడు పోస్టు కోసం లక్షలు ముట్టజెప్పి సచివాలయంలో సీఎం, మంత్రుల పేషీల చుట్టూ ప్రదక్షిణలు చేసిన అధికారులు ఇప్పుడు మాత్రం అటువైపే వెళ్లడం లేదని తెలుస్తోంది.