10న కాంగ్రెస్‌లోకి కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్ర | Karnataka: BJP MLA accused of illegal mining joins Congress | Sakshi
Sakshi News home page

10న కాంగ్రెస్‌లోకి కూడ్లిగి ఎమ్మెల్యే నాగేంద్ర

Published Sun, Feb 4 2018 8:59 AM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

Karnataka: BJP MLA accused of illegal mining joins Congress - Sakshi

బొమ్మనహళ్లి: బళ్ళారి జిల్లా బీజేపీకి మరో ఎదురుదెబ్బ. జిల్లా హసపేట బీజేపీ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్‌ ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరగా, కూడ్లిగి నియోజకవర్గం బీజేపీ నాగేంద్ర కూడా అదే బాటలో ఈ నెల 10వ తేదిన కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ మేరకు సీఎం సిద్ధరామయ్య శనివారం మీడియాతో తెలిపారు. శనివారం నాగేంద్ర సిద్ధరామయ్య నివాసానికి వెళ్లి ఈ విషయమై చర్చలు జరిపారు. 10వ తేదీన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బళ్లారి జిల్లాలో పర్యటిస్తారు. ఆ సమయంలో నాగేం«ద్ర కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారు. ఒకేజిల్లా నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలను బీజేపీ కోల్పోవడం పార్టీ నాయకులను కలవరపరుస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement