
ప్రెస్‌మీట్‌లో కపిల్, ఆజాద్, తదితరులు
న్యూఢిల్లీ/తిరువనంతపురం: నోట్లరద్దు అనంతరం ఓ బీజేపీ నేత 40 శాతం కమీషన్ తీసుకుని పాత నోట్లు మార్చారని ఆరోపిస్తూ అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను పలు ఇతర విపక్షాలతో కలిసి కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసింది. 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో అహ్మదాబాద్‌లో చిత్రీకరించినదనీ, కొందరు జర్నలిస్టులు ఈ వీడియో తీశారని పేర్కొంది. టీడీపీ, ఎన్‌సీ, ఆర్జేడీ, లోక్‌తాంత్రిక్ జనతా దళ్ తదితర పార్టీల నేతలతో కలిసి కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఈ వీడియోను విడుదల చేశారు.
అయితే ఆ వీడియో నిజమైనదే అనడానికి, అందులోని వ్యక్తి బీజేపీ మనిషేననడానికి కాంగ్రెస్ ఎలాంటి ఆధారాలనూ చూపలేదు. మరోవైపు ఆ వీడియో నకిలీదనీ, పార్టీ పరిస్థితి దిగజారి నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఇలా రోజుకో నకిలీ సమాచారంతో ప్రజలను మోసగించాలని చూస్తోందని బీజేపీ ఎదురుదాడి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ నకిలీ పనులు మరీ విపరీతంగా నవ్వు తెప్పించేలా ఉంటున్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment