notes change
-
40 శాతం కమీషన్‌కు పాత నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: నోట్లరద్దు అనంతరం ఓ బీజేపీ నేత 40 శాతం కమీషన్ తీసుకుని పాత నోట్లు మార్చారని ఆరోపిస్తూ అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను పలు ఇతర విపక్షాలతో కలిసి కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసింది. 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో అహ్మదాబాద్‌లో చిత్రీకరించినదనీ, కొందరు జర్నలిస్టులు ఈ వీడియో తీశారని పేర్కొంది. టీడీపీ, ఎన్సీ, ఆర్జేడీ, లోక్తాంత్రిక్ జనతా దళ్ తదితర పార్టీల నేతలతో కలిసి కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఈ వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియో నిజమైనదే అనడానికి, అందులోని వ్యక్తి బీజేపీ మనిషేననడానికి కాంగ్రెస్ ఎలాంటి ఆధారాలనూ చూపలేదు. మరోవైపు ఆ వీడియో నకిలీదనీ, పార్టీ పరిస్థితి దిగజారి నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఇలా రోజుకో నకిలీ సమాచారంతో ప్రజలను మోసగించాలని చూస్తోందని బీజేపీ ఎదురుదాడి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ నకిలీ పనులు మరీ విపరీతంగా నవ్వు తెప్పించేలా ఉంటున్నాయని అన్నారు. -
డీకే ఆప్తుల ఇళ్లపై సీబీఐ దాడులు
సాక్షి, బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ సన్నిహితుల ఇళ్లు, ఆఫీసులపై గురువారం సీబీఐ దాడులు చేపట్టింది. బెంగళూరు, రామనగర ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో అక్రమంగా నోట్లను మార్చినట్లు డీకేపై ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. 2016 నవంబర్ 14న కొందరు రూ.10 లక్షల పాత నోట్లను అక్రమంగా రామనగరలోని కార్పొరేషన్ బ్యాంకులో మార్చారని సీబీఐ ఆరోపిస్తోంది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలను చూపించకుండా కొత్త రూ.2 వేలు, రూ.500 నోట్లను డీకే సోదరుల ఆప్తులు మార్చుకున్నట్లు 2017లో కేసు దాఖలైంది. దీనిపై కోర్టు వారెంటుతో వచ్చిన సీబీఐ అధికారులు డీకే సోదరుల సన్నిహితులైన శివానంద, నంజప్ప, పద్మనాభయ్యల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేశారు. సీబీఐ సోదాలపై ఎమ్మెల్యే డీకే శివకుమార్ మాట్లాడుతూ ఇలాంటి వాటికి భయపడనన్నారు. తనను, తన కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసి లొంగదీసుకోవాలని కేంద్రం చూస్తోందని ఆరోపించారు. ఏ ప్రభుత్వం శాశ్వతం కాదని, ఎవరూ ఎక్కువ కాలం అధికారంలో ఉండబోరని చెప్పారు. -
నోట్ల మార్పిడి వేగవంతం
బ్యాంకర్లకు సూచించిన కలెక్టర్ కోన శశిధర్ అనంతపురం అర్బన్ : నోట్ల మార్పిడి ప్రక్రియ వేగవంతం చేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కలెక్టర్ కోన శశిధర్ బ్యాంకర్లకు సూచించారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. 34 బ్యాంకులకు సంబంధించి జిల్లాలో 454 శాఖలు ఉన్నాయని, అందుబాటులో ఉన్న నగదు, నోట్ల మార్పిడిలో ప్రజలకు అందిస్తున్న సేవలపై సమీక్షించారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులు, జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసులు, ఎస్బీఐ, ఎస్‌బీహెచ్‌ల నుంచి కరెన్సీ చెస్ట్‌ని పంపించాలని ఆదేశించారు. బ్యాంకుల వద్ద సమాచార కేంద్రాలు, షామియానాలు, తాగునీటి సౌకర్యం తప్పక కల్పించాలన్నారు. క్యూలో ఉన్న వారికి ఇబ్బంది కలుగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో ఎల్డీఎం జయశంకర్, ఎస్బీఐ ఏజీఎం, చీఫ్ మేనేజర్ శ్రీనివాస్, హరిబాబు, సిండికేట్ బ్యాంక్ డీసీఎం ఆశీర్వాదం, ఏపీజీబీ ఆర్ఎం జయశంకర్, కెనరా బ్యాంక్ చీఫ్ మేనేజర్ శశికుమార్, ఆంధ్రా బ్యాంక్ బ్రాంచి చీఫ్ మేనేజర్ బాలయ్య, ఎస్బీహెచ్ సీనియర్ మేనేజర్ సాయికృష్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టొద్దు పెద్ద నోట్లను ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో వాటిని మార్చుకునేందుకు వచ్చే ప్రజలను ఇబ్బంది పెట్టవద్దని బ్యాంక్ సిబ్బందికి జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మికాంతం సూచించారు. ఈ నెల 24 వరకు పాత నోట్లను తీసుకోవాలని మీ సేవ కేంద్రం సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన రాంనగర్‌లోని ఆంధ్ర బ్యాంక్, మీసేవ కేంద్రాన్ని సందర్శించారు. నోట్ల మార్పిడి ప్రక్రియను ఏ విధంగా నిర్వహిస్తున్నారనేది పరిశీలించారు. తొందరపాటు లేకుండా జాగ్రత్తగా నోట్లను మార్చుకోవాలన్నారు. -
ఎస్ఐపై చేయిచేసుకున్న వ్యక్తిపై..
అనంతపురం: అనంతపురం నగరంలోని సాయినగర్ స్టేట్ బ్యాంక్ వద్ద ఆదివారం ఉద్రిక్తత ఏర్పడింది. పాత నోట్లు మార్చుకునేందుకు, ఖాతాల నుంచి డబ్బులు తీసుకునేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో బ్యాంకుకు వచ్చారు. రద్దీ కారణంగా క్యూలో చాలా సేపు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. భద్రత కోసం బ్యాంకు వద్దకు వచ్చిన ఎస్ఐ జనార్దన్ పక్కకు జరగాల్సిందిగా సూచించగా, ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆ వ్యక్తిని చితగొట్టారు. పోలీసులు అతన్ని పట్టుకుని లాఠీలతో కొట్టుకుంటూ, కాలితో తన్నుతూ లాక్కెళ్లారు. ఆ వ్యక్తిని జీపులోకి ఎక్కించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి పంపాలని, కక్షసాధింపు చర్యలకు పాల్పడరాదని అక్కడున్న వారు అభిప్రాయపడ్డారు. ఎస్ఐపై చేయి చేసుకోవడం తప్పేనని, పోలీసులు ఆ వ్యక్తిని దారుణంగా కొట్టడం బాధాకరమన్నారు. -
కరెన్సీ కోసం వెళితే చితకబాదారు !