Kapil Sibal
-
అలహాబాద్ హైకోర్టు జడ్జి శేఖర్ యాదవ్‌పై వేటు తప్పదా?
న్యాయ్యవస్థలో అత్యంత కీలమైన వారు న్యాయమూర్తులు. రాగద్వేషాలకు అతీతంగా వీరు వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల కాలంలో కొంతమంది న్యాయమూర్తులు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వివాదంలో చిక్కుకున్నారు. ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) మద్దతుగా వ్యాఖ్యానించి చిక్కుల్లో పడ్డారు. దీంతో ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తొలగిచేందుకు కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. రాజ్యసభలో అభిశంసన తీర్మానం పెట్టేందుకు యత్నిస్తున్నాయి.అసలేంటి వివాదం?ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం (డిసెంబర్ 8) అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై మాట్లాడుతూ.. మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యమని అన్నారు. బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలు ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. దేశంలోని పౌరులందరినీ సమానంగా చూడాలన్నదే యూసీసీ లక్ష్యమని చెప్పుకొచ్చారు.పదవి నుంచి తొలగించాల్సిందేజస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. మతసామరస్యాన్ని భంగపరిచేలా ఆయన మాట్లాడారని ధ్వజమెత్తాయి. న్యాయమూర్తి పదవి నుంచి ఆయనను తప్పించేందుకు పార్లమెంట్లో అభిశంసన తీర్మానం పెట్టేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ ముందుగా ఈ ప్రతిపాదన చేయగా సీనియర్ లాయర్లు కపిల్ సిబల్, వివేక్ తఖ్కా బలపరిచారు. రాజ్యసభలో విపక్ష సభ్యుల నుంచి బుధవారం నాటికి 38 మంది సంతకాలు సేకరించారు. న్యాయమూర్తులు రాజకీయ ప్రకటన చేయడం పట్ల ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మైనారిటీల పట్ల వ్యతిరేకతను బహిరంగంగా వ్యక్తపరిచిన జస్టిస్ శేఖర్ యాదవ్.. తాను విచారించే కేసులలో నిష్పక్షపాతంగా వ్యవహరించలేరని, ఆయనను న్యాయమూర్తి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు సుప్రీంకోర్టు కూడా జస్టిస్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యలపై స్పందించింది. అలహాబాద్ హైకోర్టు నుంచి వివరణ కోరింది.అంత ఈజీ కాదు..హైకోర్టు జడ్జిని పదవీచ్యుతుడిని చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి చాలా పెద్ద వ్యవహారమే ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124, ఆర్టికల్ 218లో దీని ప్రస్తావన ఉంది. న్యాయమూర్తిని తొలగించాలన్న తీర్మానాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలంటే 100 మంది లోక్‌సభ సభ్యులు లేదా 50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకాలు చేయాలి. ఈ పిటిషన్‌ను లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్‌ను అందజేయాలి. పార్లమెంట్లో తీర్మానం ఆమోదం పొందాలంటే మూడింట రెడింతల మెజారిటీ తప్పనిసరి. పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన తీర్మానాన్ని అదే సెషన్లో రాష్ట్రపతికి సమర్పించాలి. తర్వాత రాష్ట్రపతి ప్రకటన చేయడం ద్వారా న్యాయమూర్తిని పదవి నుంచి తొలగిస్తారు.చదవండి: మందిర్- మసీదు పిటిషన్లపై ‘సుప్రీం’ సంచలన ఆదేశాలుఅయితే ఇదంతా మనం చెప్పుకున్నంత సులభమేమీ కాదు. పార్లమెంట్లో తీర్మానాన్ని చర్చకు అంగీకరించడానికి ముందు చాలా తతంగం ఉంటుంది. ఒకవేళ తీర్మానం ప్రవేశపెట్టేందుకు అంగీకరించిన పక్షంలో లోక్‌సభ స్పీకర్ లేదా రాజ్యసభ చైర్మన్ ముగ్గురు సభ్యులతో కమిటీని నియమిస్తారు. ఇందులో సుప్రీంకోర్టు జడ్జి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు ప్రముఖ న్యాయనిపుణుడు సభ్యులుగా ఉంటారు. కమిటీ నివేదిక ఆధారంగానే పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానాన్ని చర్చకు పెడతారు. తర్వాత తీర్మానంపై ఓటింగ్ జరుపుతారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకు ఇంత సుదీర్ఘ ప్రక్రియ నిర్వహిస్తారు. తీవ్రమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగానే న్యాయమూర్తి పదవీత్యుడయ్యారనేలా ఈ వ్యవహారం సాగుతుంది. కాగా, తాజా వివాదం నుంచి జస్టిస్ శేఖర్ యాదవ్ బయటపడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అధికార ఎన్డీఏ కూటమి పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.గతంలోనూ తీర్మానాలుహైకోర్టు న్యాయమూర్తులపై గతంలోనూ పార్లమెంట్లో అభిశంసన తీర్మానాలు ప్రవేశపెట్టిన దాఖలాలు ఉన్నాయి. 1993లో జస్టిస్ వి రామస్వామికి వ్యతిరేకంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఓడిపోయింది.2011లో కలకత్తా హైకోర్టు జడ్జి సౌమిత్రా సేన్‌కు వ్యతిరేకంగా రాజ్యసభ తీర్మానం ఆమోదించడంతో ఆయన రాజీనామా చేశారు. 2015లో రాజ్యసభ తీర్మానంతో గుజరాత్ హైకోర్టు జడ్జి జస్టిస్ జేబీ పార్దివాలా పదవీచ్యుతుడయ్యారు.2016-17లో ఏపీ-తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డిపై రెండుసార్లు పెట్టిన తీర్మానం వీగిపోయింది. 2017లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై పెట్టిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించారు. -
నందిగం సురేష్ కేసు.. పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
సాక్షి, ఢిల్లీ: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.మాజీ ఎంపీ సురేష్ బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నందిగం సురేష్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ..‘ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేరు. దర్యాప్తు అధికారి ఫేవర్ చేశారని స్థానిక జడ్జి ఎలా చెబుతారు. 2020లో రాయి తగిలి మృతిచెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడుగా చేర్చి సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం సురేష్‌పై కేసులు బనాయిస్తోంది. ఇతర కేసులు పెట్టి మాజీ ఎంపీని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాదనల అనంతరం, ధర్మాసనం పోలీసులకు నోటీసులు ఇచ్చింది.మరోవైపు.. సురేష్ బార్య బీబీ లత మాట్లాడుతూ..‘టీడీపీ ప్రభుత్వం మాపైన అక్రమ కేసులు బనాయిస్తోంది. దళితుడు ఎదగడాన్ని ఓర్చలేక అసూయతో కేసులు పెడుతున్నారు. నాలుగేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపోరాటంలో మేము గెలుస్తాం. దేవుడు, మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మాకు అండగా ఉన్నారని అన్నారు. -
ఈవీఎంలపై సందేహాలను ఈసీ నివృత్తి చేయాలి: ఎంపీ కపిల్ సిబల్
న్యూఢిల్లీ: హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలలో తేడాలపై కాంగ్రెస్ లేవనెత్తిన సందేహాలను ఎన్నికల సంఘం (ఈసీ) నివృత్తి చేయాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ గురు, శుక్రవారాల్లో ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈసీకి ఆధారాలు అందజేస్తున్నామని, తమ సందేహాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాల్సి ఉందని కపిల్ సిబల్ అన్నారు. ‘ఈవీఎంల దుర్వినియోగం జరుగుతోందనే భావిస్తున్నా. అయితే అది ఏమేరకు జరుగుతోందనేది నేను చెప్పలేను. ఈవీఎంల వాడకానికి నేను మొదటినుంచి వ్యతిరేకమే. పారదర్శకత లేనిదేనైనా ఆమోదయోగ్యం కాదు’ అని కాంగ్రెస్ మాజీ నాయకుడు సిబల్ అన్నారు. హరియాణాలో అనూహ్య ఫలితాలు వెలువడ్డాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈవీఎంల బ్యాటరీలు 80 శాతం కంటే తక్కువ ఉన్నచోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబర్చారని, 99 శాతం చార్జింగ్ ఉన్న ఈవీఎంలలో బీజేపీకి అనుకూల ఫలితాలు వచ్చాయనేది కాంగ్రెస్ ఆరోపణ. -
ఆర్జీ కర్ కేసు విచారణ లైవ్ స్ట్రీమ్ చేయొద్దు : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి అత్యాచార ఘటన కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసు విచారణను లైవ్ స్ట్రీమ్ చేస్తామని, ఆ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది.మంగళవారం సుప్రీం కోర్టు ఆర్జీ కర్ ఆస్పత్రి జూనియర్ వైద్యురాలి ఘటన కేసును విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా .. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదిస్తున్నందుకు తన మహిళా లాయర్లకు బెదిరింపులు వస్తున్నాయని, ఈ సున్నితమైన అంశంలో విచారణను ప్రత్యక్ష ప్రసారం చేయోద్దని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.కపిల్ సిబల్ విజ్ఞప్తిపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందించారు. కేసు విచారణ ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేయలేమని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కేసు విచారణ లైవ్ స్ట్రీమ్ లో కొనసాగుతుందని స్పష్టం చేశారు.‘నా ఛాంబర్లోని మహిళా న్యాయవాదులకు బెదిరింపులు వస్తున్నాయి. వారిపై యాసిడ్ దాడులు చేస్తామని, హత్యాచారం చేస్తామని చెదిరిస్తున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారని అన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి బదులిస్తూ.. మహిళ న్యాయవాదుల భద్రతకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
రిటైరయ్యేలోపు తీర్పివ్వండి
న్యూఢిల్లీ: ఆధార్ వంటి సాధారణ చట్టాలను ద్రవ్య బిల్లులుగా ఎన్డీఏ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెడుతున్న విధానాన్ని తప్పుబడుతూ ఈ విధానం చట్టబద్ధతను తేల్చేందుకు రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. సుప్రీంకోర్టు చీఫ్‌జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం సంబంధిత పిటిషన్‌ను సోమవారం విచారించింది. కాంగ్రెస్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ‘‘ ఏడుగురు సభ్యులతో రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటుచేశాక ఈ అంశాన్ని పరిశీలిస్తాం’ అని సీజేఐ చంద్రచూడ్ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ‘ఎక్స్’లో స్పందించారు. ‘‘ రాజ్యాంగంలోని ఆరి్టకల్ 110 కింద ఎన్నో సాధారణ బిల్లులను ద్రవ్యబిల్లులుగా పేర్కొంటూ మోదీ సర్కార్ లోక్‌సభలో ఆమోదింపజేసుకుంటోంది. ఈ రాజ్యాంగ అతిక్రమణకు 2016నాటి ఆధార్ చట్టం చక్కని ఉదాహరణ. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తే కోర్టు కూడా ‘ఇది రాజ్యాంగపరంగా మోసమే’ అంటూ సమరి్థంచింది. 2014 నుంచి ఆర్టికల్110 దుర్వినియోగంపై విచారణకు రాజ్యాంగ బెంచ్ ఏర్పాటుచేస్తానని సీజేఐ తీర్పుచెప్పడం హర్షణీయం. ఈ ఏడాది నవంబర్‌లో సీజేఐ చంద్రచూడ్ రిటైర్ అయ్యేలోపు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం’ అని పోస్ట్ చేశారు. ఆధార్ చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్టం(సవరణ) వంటి కీలక బిల్లులను ద్రవ్యబిల్లుగా మోదీ సర్కార్ లోక్‌సభలో ప్రవేశపెట్టింది. పెద్దలసభలో మెజారిటీ లేని కారణంగా అక్కడ బిల్లులు వీగిపోకుండా, తప్పించుకునేందుకు ప్రభుత్వం ఇలా చేస్తోందని చాన్నాళ్లుగా విపక్షాలు ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టడం తెల్సిందే. -
విచారణ జరిపించాలి: కపిల్ సిబల్
న్యూఢిల్లీ: నీట్ అవకతవకల ఆరోపణల్లో నిగ్గు తేల్చేందుకు అధికారులతో కమిటీని నియమించాలని రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరారు. భవిష్యత్తులో నీట్‌ను మరింత మెరుగ్గా నిర్వహించే అంశంపై రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. నీట్‌ను నిర్వహించే ఎన్టీఏ వ్యవస్థలోనే అవినీతి నెలకొన్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ మౌనంగా ఉండటం ఏమాత్రం మంచిదికాదన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నీట్లో అక్రమాలను ప్రముఖంగా ప్రస్తావించాలని సిబల్ అన్ని రాజకీయ పారీ్టలను కోరారు. -
ఈవీఎం ట్యాంపర్ అయిందా? లేదా?.. చెక్ లిస్ట్‌తో చూసుకోండిలా..
ఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ఆరు విడతల పోలింగ్ పూర్తి అయింది. మరో విడత జూన్ 1తో ముగుస్తుంది. దేశ వ్యాప్తంగా జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ, సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ అన్ని రాజకీయ పార్టీ, సంబంధిత పోలింగ్ ఏజెంట్లు ఫలితాల రోజు తనిఖీ చేయాల్సిన అంశాల చెక్ లిస్ట్ విడుదల చేశారు. ఫలితాల రోజు ఓట్ల లెక్కింపు కోసం ఈవీఎం మిషన్లను తెరిచే క్రమంలో పాటించాల్సిన సూచనలకు సంబంధించి ఓ చార్ట్ తయారు చేసినట్లు తెలిపారు. ‘‘చాలా మంది ఈవీఎం ట్యాంపర్ అవడానికి అవకాశం ఉందని అంటున్నారు. నేను కచ్చితంగా చెప్పగలను ఈవీఎంలు ట్యాపర్ కావు. ప్రపంచంలో ఈవీఎం మిషన్ ఎక్కడా ట్యాంపర్ కాదు. అందుకే ఈ చెక్ లిస్ట్‌ను విడుదల చేశాం’’ అని కపిల్ సిబల్ అన్నారు.చెక్ లిస్ట్ చార్ట్‌లోని తనిఖీ చేసే అంశాలు ఇవే..1. చార్ట్‌లో కంట్రోల్ యూనిట్ నంబర్, బాలెట్ యూనిట్ నంబర్, వీవీప్యాట్ (VVPAT)ఐడీ ఉంటాయి.2. చార్ట్‌లో మూడో కాలమ్ చాలా ముఖ్యమైంది.4 జూన్2024 అని మూడో కాలమ్‌లో రాసి ఉంటుంది. ఈవీఎం మిషన్ తెరిచిన సమయాన్ని మూడో కాలమ్ కింద రాయాలి.3. ఒక ఒకవేల సమయంలో తేడా వస్తే.. ఆ ఈవీఎం మిషన్ అప్పటికే ఎక్కడో ఒక తెరిచినట్లుగా నిర్ధారణకు రావాలి. కంట్రోల్ యూనిట్(CU) సీరియల్ నంబర్ రాసి ఉన్న ఫార్మాట్లో ఉంటుంది. అక్కడ ఉన్న నంబరల్ మ్యాచ్ చేసుకోవాలి.4. మొత్తం పోలైన ఓట్ల లెక్కింపును జాగ్రత్తగా చూసుకోవాలి. లేదంటే కౌంటింగ్ సమయంలో ఓట్లు తేలితే సమస్య ఎదురవుతుంది.5. రెండు అంశాలు గుర్తుపెట్టుకోవాలి.. పై కాలమ్‌లో వెరిఫికేషన్ పూర్తి అయ్యే వరకు రిజల్ట్ బటన్ నొక్కకూడదు. సమయంలో తేడా వస్తే.. వెలువడిన రిజల్ట్ సమయం కూడా తప్పు అవుతుంది.6. అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అక్కడ కూర్చన్న తర్వాత జాగ్రత్తగా చెక్ లిస్ట్‌లోని మొదిటి కాలమ్‌ను పరిశీలించిన అనంతరం ఈవీఎంలను తెరవాలని కోరకుంటున్నాను.#WATCH: Kapil Sibal's EVM ADVICE To Political Parties, Candidates Ahead Of June 4 COUNTING Kapil Sibal Explains What Polling Agents and Leaders of #IndiaAlliance should do before EVM Machines are Opened For Counting.!🎯IMPORTANT UPDATES:▪️I have made a chart for all the… pic.twitter.com/WigELsaH7W— Gururaj Anjan (@Anjan94150697) May 26, 2024 -
ఈసీ గోయెల్ రాజీనామా.. కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామాపై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ రాజీనామా నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ) నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అని సిబల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సిబల్ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరపడం ఎన్నికల కమిషన్ విధి. అయితే గత పదేళ్లలో ఈసీ కేంద్ర ప్రభుత్వ మరో విభాగంలా తయారైంది’అని సిబల్ విమర్శించారు. దీనికి తోడు సిబల్ ఆదివారం ఎక్స్(ట్విటర్)లోనూ గోయెల్ రాజీనామాపై ఒక పోస్టు పెట్టారు. ‘దారి క్లియరైంది. కమిషన్ మొత్తం ఎస్ చెప్పే వ్యక్తులతో నింపండి. అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థలకు ఇది వర్తిస్తుంది’ అని గోయెల్ రాజీనామాను ఉద్దేశించి సిబల్ సెటైర్లు వేశారు. కాగా, లోక్‌సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ కొద్దిరోజుల్లో వెలువడుతుందనగా ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామా సంచలనం రేపింది. ఈయన రాజీనామా దేశంలో రాజకీయ దుమారానికి దారి తీసింది. ఇదీ చదవండి.. ఎన్నికల వేళ ఈడీ దూకుడు.. లాలూ సన్నిహితుడి అరెస్టు -
నిర్మలా సీతారామన్‌కు కపిల్ సిబల్ కౌంటర్
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన విమర్శలను రాజ్యసభ ఎంపీ కపిల్ సిబాల్ తప్పుపట్టారు. డిసెంబర్ 19న జరిగిన విపక్షాల ‘ఇండియా కూటమి’ సమావేశంలో పాల్గొన్న సీఎం స్టాలిన్‌పై నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. ఇటీవల భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయిందని ఇటువంటి సమయంలో ప్రజల మధ్య ఉండాల్సింది పోయి.. సీఎం స్టాలిన్ ‘ఇండియా కూటమి’ హాజరుకావడం ఏంటని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో వర్షం, వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సీఎం స్టాలిన్ ఎందుకు సానుకూలమైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సీఎం స్టాలిన్‌ను టార్గెట్ చేయడంపై తాజాగా కపిల్ సిబల్ నిర్మలా సీతారామన్‌పై మండిపడ్డారు. దేశంలో ఉన్న నిరుద్యోగ సమస్య, పెరుగుతున్న దేశ అప్పులు, పోషకాహార లోపం ఉన్న పిల్లలు, ఆకలి, పేదరికం వంటి సమస్యలు చాలా ఉన్నాయని అన్నారు. సీఎం స్టాలిన్‌పై విమర్శలకు చేయడానికి బదులు దేశంలో ఉన్న ఈ సమస్యలపై దృష్టి సారించాలని కపిల్ సిబాల్ కౌంటర్ ఇచ్చారు. యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ గతేడాది మేలో కాంగ్రెస్‌ను వీడి సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో స్వతంత్ర సభ్యుడిగా రాజ్యసభకు ఎన్నికకైన విషయం తెలిసిందే. చదవండి: వచ్చే ఎన్నికల్లో 50 శాతం ఓట్లు రావాలి: మోదీ -
‘చరిత్ర తెలియకపోతే మాట్లాడొద్దు.. అస్సాం సీఎం ఫైర్’
గౌహాతి: అస్సాంకు సంబంధించి సీనియర్ నాయ్యవాది కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విమర్శించారు. అస్సాం రాష్ట్ర చరిత్ర గురించి తెలియకపోతే అసలు మాట్లాడొద్దని మండిపడ్డారు. 1955 పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై బుధవారం వాదిస్తూ.. అస్సాంకు సంబంధించి కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో అస్సాం రాష్ట్రం.. మయన్మార్(బర్మా)లో భాగంగా ఉండేదని పేర్కొన్నారు. అయితే సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్పై సీఎం హిమంత్ బిశ్వ శర్మ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అస్సాం చరిత్రపై అవగాహన లేనివారు మాట్లాడొద్దని ఘాటుగా విమర్శించారు. అస్సాం ఎప్పుడూ మయన్మార్‌లో భాగంగా లేదని అన్నారు. కేవలం ఒక సమయంలో ఇరువురికి ఘర్షణలు జరిగినట్లు తెలిపారు. అది ఒక్కటి మాత్రమే ఆ దేశానికి.. అస్సాంకి ఉన్న ఒక సంబంధమని పేర్కొన్నారు. అంతేకానీ, అస్సాం మయన్మార్‌లో భాగంగా ఉన్నట్లు ఎక్కడా చరిత్రలో రాసినట్లు ఉన్నట్లు తాను చూడలేదని మండిపడ్డారు. ఇక మణిపూర్‌లో అల్లర్లు జరగటానికి మయన్మార్ నుంచి వచ్చిన వలసదారులు కూడా ఓ కారణమని అనుమానాలు వ్యక్తమైన విషయం తెలిందే. ఇది చదవండి: ‘నేను సంతకం చేయలేదు.. కేంద్రమంత్రి క్లారిటీ’ -
పొలిటికల్ మైలేజి కోసమే బిల్లు పెట్టారు: కపిల్ సిబాల్
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ఉద్దేశ్యంతో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టింది కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పార్లమెంటులో చర్చ కంటే ముందే బిల్లుపై కాంగ్రెస్ బీజేపీ నేతలు పరస్పర విమర్శలకు తెరతీశారు. దీనిపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ స్పందిస్తూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే బీజేపీ ఈ స్టంట్ చేసిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీ హయాంలో ఏంచేశారని అన్నారు. ఈసారైనా.. చాలా కాలంగా మరుగునపడిపోయిన బిల్లుకు మోక్షం కలిగిస్తూ బీజేపీ ప్రభుత్వ కేబినెట్ సోమవారమే బిల్లును ఆమోదించి మంగళవారం కొత్త పార్లమెంటు భవనంలో బిల్లును ప్రవేశపెట్టింది. గతంలో కూడా అనేక సార్లు ఈ బిల్లు తెరపైకి వచ్చినప్పటికీ బిల్లుకు మాత్రం ఆమోదం పొందలేదు. ప్రస్తుత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి సంఖ్యాబలం కూడా బాగానే ఉన్న నేపథ్యంలో ఈ బిల్లు ఈసారి గట్టెక్కే అవకాశాలు ఉన్నాయంటున్నాయి రాజకీయ వర్గాలు. కొత్త పార్లమెంట్ భవనంలో ఈ బిల్లుపై బుధవారం చర్చలు జరగనున్నాయి. ఎన్నికల వేళ.. ఇదిలా ఉండగా బిల్లుపై చర్చ జరగక ముందే పాలక ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి తెర తీశారు. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ బిల్లును ప్రవేశపెట్టి పొలిటికల్ మైలేజీ పొందాలని చూస్తోందంటూ కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యానించారు. మేము చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నది వారి ఆలోచన అన్నారు. వారికి ఏ బిల్లుపై అంట చిత్తశుద్ధే ఉంటే బిల్లును 2014లోనే ప్రవేశ పెట్టి ఉండాల్సిందన్నారు. ఈ బిల్లుకంటే ముందే వారు జనగణన చేపట్టాల్సి ఉందని అన్నారు. మీరు చేసిందేంటి.. కపిల్ సిబాల్ వ్యాఖ్యలకు అనురాగ్ ఠాకూర్ బదులిస్తూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా 2008లో మొట్టమొదటిసారి ఈ బిల్లును ప్రవేశ పెట్టినప్పుడు మీరు న్యాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు మీరు చేసిందేంటి? ఆ తర్వాత ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ బిల్లుని ప్రవేశపెట్టినట్టు నటిస్తోందన్న విషయం మీకు కూడా తెలుసు కదా అని ప్రశ్నించారు. ఏదైతేనేం అప్పట్లో బిల్లును ఆమోదించకుండా ముసాయిదా చట్టాన్ని స్టాండింగ్ కమిటీకి పంపించారు. అసలు కాంగ్రెస్ పార్టీకి అప్పుడు, ఇప్పుడు ఈ బిల్లు పాస్ అవ్వాలన్న ఉద్దేశ్యమే లేదని అన్నారు. నేహరూ పరిపాలనలో గాని, ఇందిరా గాంధీ హయాంలో గాని, రాజీవ్ గాంధీ పాలనలో గానీ చివరికి సోనియా గాంధీ హయాంలో కూడా మహిళలకు వారు ప్రాధాన్యతనిచ్చిందే లేదని అన్నారు. ఇది కూడా చదవండి: వారిది 'జన ఆశీర్వాద యాత్ర'.. వీరిది 'జన ఆక్రోశ యాత్ర'.. -
‘ఇన్సాఫ్ కె సిపాహి’కి కేజ్రీవాల్ మద్దతు
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ దేశంలో జరిగే అన్యాయాలపై పోరాటానికి ఏర్పాటు చేసిన ‘ఇన్సాఫ్ కె సిపాహి’వేదికకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మద్దతు ప్రకటించారు. ‘సిబల్ ప్రకటించిన ఇన్సాఫ్ సిపాహి చాలా ముఖ్యమైంది. అన్యాయంపై కలిసికట్టుగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ఇందులో చేరాలి’అని ఆదివారం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ‘ఇన్సాఫ్’కు శివసేన ఉద్ధవ్ వర్గం, ఆర్జేడీ చీఫ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మద్దతు దక్కింది. -
అన్యాయంపై పోరాటానికి ‘ఇన్సాఫ్’
న్యూఢిల్లీ: దేశంలో అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలపై పోరాడేందుకు ‘ఇన్సాఫ్’అనే వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ లాయర్, రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ప్రకటించారు. తన ప్రయత్నానికి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్యమంత్రులు, నేతలు సహా ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. దేశంలో పౌరులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రభుత్వం అధికారంలో ఉందని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీని సంస్కరించడమే తప్ప, విమర్శించడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయం సమకూరాలని రాజ్యాంగం చెబుతున్నా, అన్ని చోట్లా అన్యాయమే జరుగుతోందన్నారు. -
రాజకీయ విరాళాల స్వీకరణకు సరైన విధానమే
న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల విధానం లోపభూయిష్టంగా ఉందంటూ, వాటి కొనుగోళ్లను ఆపాలంటూ గతంలో సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై శుక్రవారం కేంద్రప్రభుత్వం స్పందించింది. ‘ రాజకీయ పార్టీలు విరాళాలు స్వీకరించేందుకు వినియోగిస్తున్న ఈ బాండ్ల వ్యవస్థ అత్యంత పారదర్శకమైంది. లెక్కల్లో లేని, నల్లధనం ఎంత మాత్రం ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు చేరబోదు’ అని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టులో స్పష్టంచేశారు. ‘ ప్రతిసారి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు బాండ్ల తంతు మొదలవుతోంది. తమకు వచ్చిన విరాళాల ఖాతాల ప్రతీ లావాదేవీ సమగ్ర సమాచారాన్ని రాజకీయ పార్టీలు స్పష్టంగా వెల్లడించట్లేవు. బాండ్ల విక్రయం ఆపండి’ అని పిటిషన్ వేసిన అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్ ఎన్జీవో తరఫున హాజరైన లాయర్ ప్రశాంత్ భూషణ్ వాదించారు. విస్తృత ధర్మాసనం ఈ అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని మరో పిటిషనర్ తరఫున వాదిస్తున్న లాయర్ కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. దీంతో బాండ్ల ద్వారా పార్టీలు విరాళాలు పొందేందుకు అనుమతిస్తున్న చట్టాలను సవాల్ చేస్తున్న అంశాన్ని విస్తృత ధర్మాసనానికి సిఫార్సు చేయాలా వద్దా అనేది డిసెంబర్ ఆరో తేదీన ఖరారుచేస్తామని సుప్రీం బెంచ్ పేర్కొంది. దాతల పేర్ల విషయంలో గోప్యత పాటించాలని కేంద్ర ప్రభుత్వం, పేర్లు బహిర్గతం చేయాల్సిందేనని కేంద్ర ఎన్నికల సంఘం.. సుప్రీంకోర్టులో గతంలో భిన్న వాదనలు లేవనెత్తాయి. -
అదే జరిగితే గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం!
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నియమావళిలో అమలవుతున్న లోధా కమిటీ సిఫార్సుల సవరణ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో వాడి వేడి వాదనలు జరుగుతున్నాయి. బోర్డు ప్రధానంగా 70 ఏళ్ల గరిష్ట వయో పరిమితి, పదవుల మధ్య విరామం నిబంధనల్ని సవరించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది. బీసీసీఐ తరఫున మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. మంగళవారం నాటి విచారణ సందర్భంగా బోర్డు పరిపాలనలో విశేష అనుభవజ్ఞుల అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. 70 ఏళ్ల వయో నిబంధన తొలగించాలని జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హిమ కోహ్లిలతో కూడిన బెంచ్‌ను కోరారు. దీనిపై స్పందించిన బెంచ్ ‘మరి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ), క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)ల్లోనూ 70 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఉన్నారా? ఉంటే ఆ వివరాలు సమర్పించండి’ అని కోరింది. పదవుల మధ్య విరామం విషయంలో 12 ఏళ్లు ఏకధాటికి కొనసాగాలని బోర్డు కోరుకోవట్లేదని అయితే ఆరేళ్లు బీసీసీఐలో పనిచేశాక, తిరిగి రాష్ట్ర సంఘంలో పని చేసేందుకు వెసులుబాటు ఇవ్వాలని కోరారు. కానీ కోర్టు మాత్రం మూడేళ్ల చొప్పున రెండు దఫాలు వరుసగా కొనసాగిన ఆఫీస్ బేరర్‌కు విరామం ఉండాల్సిందేనని భావిస్తోంది. ఇదే జరిగితే ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్ష కార్యదర్శులుగా వ్యవహరిస్తున్న గంగూలీ, జై షా పదవులు ఊడటం ఖాయం! అందుకే బీసీసీఐ తరఫున కపిల్ సిబాల్‌ను రంగంలోకి దించింది. దీనిపై మంగళవారం సుదీర్ఘ వాదనలు జరిగాయి. అనంతరం కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది. -
ఇది ఆమోదయోగ్యం కాదు! బలవంతపు ఏకపక్షవాదం!
కోల్‌కతా: కపిల్ సిబల్ ఇటీవల పార్లమెంట్ హౌస్‌లో ఎంపీలు ఎలాంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదంటూ జారీ చేసిన ఉత్తర్వులను ఖండిస్తూ...ఇది ఆమోదయోగ్యం కాదన్నారు . బీజేపీ పాలనలో దేశం సహకార సమాఖ్య విధానం నుంచి బలవంతపు ఏకపక్షవాదానికి మారిందని కాంగ్రెస్ మాజీ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. స్వతంత్ర రాజ్య సభ ఎంపీ కపిల్ సిబల్ దేశంలో సమాఖ్య నిర్మాణం తగ్గిపోయిందని, కేవలం అధికారమే కనిపిస్తోందన్నారు. అధికారం కోసం రాజ్యాంగాన్ని పాడు చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రాలు తమ అభిప్రాయాలు, డిమాండ్లను తెలిపే ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ వచ్చిందన్నారు. చర్చలు ప్రకక్రియ పూర్తిగా లేదని, తాము సహకార ఫెడరలిజం నుంచి బలవంతపు ఏకపక్షవాదానికి మారాం అని కపిల్ సిబల్ వ్యాఖ్యనించారు. అంతేకాదు గవర్నర్ కార్యాలయాలు, కేంద్ర ఏజెన్సీలు దీర్ఘకాలిక ప్రభుత్వాలుగా మారాయి. పార్లమెంట్లో నిరసనలు నిషేధించడాన్ని విమర్శించారు. దేశవ్యాప్తంగా నిరసనలు ఆపాలని అడిగే రోజు కూడా వస్తుందంటూ గట్టి కౌంటరిచ్చారు. రాజ్యసభ సెక్రటేరియట్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం..పార్లమెంట్ ఆవరణలో ప్రదర్శనలు, ధర్నాలు, మతపరమైన వేడుకలు నిర్వహించరాదు. ఈ విషయమై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చాలా కాలంగా నోటీసులు జారీ చేస్తునే ఉన్నారు. దీంతో విపక్షాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. (చదవండి: బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ.. ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఖరారు!) -
అందుకే కాంగ్రెస్‌ను వీడాల్సి వచ్చింది: కపిల్ సిబల్
న్యూఢిల్లీ: ముప్ఫై ఏళ్ల బంధాన్ని తెంచుకుంటూ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు సీనియర్ నేత కపిల్ సిబల్. సమాజ్ వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ నామినేషన్ దాఖలు చేసి.. తాను కాంగ్రెస్‌కు రాజీనామా చేసి చాలారోజులైందని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే భవిష్యత్తులో తాను ఎస్పీతో పాటు ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేస్తూ.. కాంగ్రెస్‌ను వీడడంపై కపిల్ సిబల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి పరిణామాలు కష్టంగా అనిపించొచ్చు. కానీ, ప్రతి ఒక్కరూ స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరమూ ఉంది. ఇప్పుడు నా సమయం వచ్చింది. పార్లమెంట్లో స్వతంత్రంగా గళం వినిపించాలనుకుంటున్నా. ఏ పార్టీ కొర్రీలు తగిలించుకోవాలనుకోవట్లేదు. సుదీర్ఘకాలంగా ఓ పార్టీకి కట్టుబడి ఉండడం, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం చాలా చాలా కష్టమైన విషయం. ప్రతీ ఒక్కరూ వాళ్ల వాళ్ల గురించి ఆలోచించాలి. ఆ ఆచరణను అమలు చేయాలంటే కొత్తగా ఆలోచించాలి. అందుకే బయటకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి.. అని కపిల్ సిబల్ ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు. కాంగ్రెస్‌ను వీడడం అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదని, తానేమీ తమాషా చేయదల్చుకోలేదని, సంకేతాలు ఇచ్చినా ముందస్తుగా ఎవరికీ తెలియకపోవడం అనేది తనను కూడా ఆశ్చర్యపరిచిందని ఆయన అన్నారు. ఇదిలా కాంగ్రెస్ రెబల్ గ్రూప్ జీ-23లో కపిల్ సిబల్ కూడా ఉండేవారు. గాంధీ కుటుంబ నాయకత్వానికి వ్యతిరేకంగా గళం కూడా వినిపించారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా వ్యవహరించిన కపిల్ సిబల్.. సీనియర్ లాయర్‌గా, న్యాయ నిపుణుడిగా కాంగ్రెస్ లీగల్ వింగ్‌ను పర్యవేక్షించారు కూడా. ఆయన నిష్క్రమణతో ఒకరకంగా కాంగ్రెస్ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చదవండి: అంతా ఒక్కతాటిపైకి రావాలి-కాంగ్రెస్‌ను వీడాక కపిల్ సిబల్ -
Kapil Sibal: కాంగ్రెస్‌కు కపిల్ సిబల్ గుడ్ బై
లక్నో: గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, జి–23లోని కీలక సభ్యుడు కపిల్ సిబల్ (73) కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. మే 16వ తేదీనే పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అంతేగాక సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతో రాజ్యసభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు ఈ సందర్భంగా ఆయనతో పాటున్నారు. నామినేషన్ అనంతరం సిబల్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌తో తనది మూడు దశాబ్దాల సుదీర్ఘ అనుబంధమని గుర్తుచేశారు. రాజ్యసభ ఎన్నికల్లో మద్దతు ఇస్తున్నందుకు అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ నెల 16వ తేదీనే కాంగ్రెస్‌కు రాజీనామా చేశా. నేనిక ఆ పార్టీ నాయకుడిని కాదు’’ అని తేల్చిచెప్పారు. అంతా ఒక్కతాటిపైకి రావాలి ‘‘కాంగ్రెస్‌తో నాకు లోతైన అనుబంధముంది. 30–31 ఏళ్లు ఒకే పార్టీలో కొనసాగడం మాములు విషయం కాదు. నేను కాంగ్రెస్‌లో చేరడానికి ముఖ్య కారణం దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. 31 సంవత్సరాల తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానంటే ఏం జరిగిందో ఆలోచించండి. అందుకే కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు (పార్టీకి రాజీనామా) తీసుకోకతప్పదు. అయితే నా సిద్ధాంతం కాంగ్రెస్‌తో ముడిపడి ఉంటుంది. కాంగ్రెస్ సిద్ధాంతానికి నేను దూరం కాలేదు. నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. కాంగ్రెస్ మళ్లీ పుంజుకుంటుందని ఆశిస్తున్నా. పార్టీలో క్రమశిక్షణ పాటించాలి. అదేసమయంలో స్వతంత్రంగా గొంతుక వినిపించే అవకాశం ఉండాలి. మీరు గొంతెత్తినప్పుడు మరో పార్టీతో కుమ్మక్కయ్యారని విమర్శలు వచ్చే పరిస్థితి ఉండకూడదు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి వ్యక్తిగతం కృషి చేస్తా. అన్ని సిద్ధాంతాలను కలుపుకొని ముందుకెళ్తాం. సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్, మమతా బెనర్జీ (బెంగాల్ సీఎం), స్టాలిన్ (తమిళనాడు సీఎం).. ఇలా ఎవరైనా కావొచ్చు. అందరూ చేతులు కలపాలి. 2024 ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టడానికి ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి వేదికపైకి రావాలి’’ అని కపిల్ సిబల్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ విశాలమైన పార్టీ: కె.సి.వేణుగోపాల్ కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్ నిష్కృమణపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ స్పందించారు. కాంగ్రెస్ విశాలమైన పార్టీ అని, అందులో చాలామందికి చోటు ఉందని వ్యాఖ్యానించారు. హరియాణాలో రెండు రోజుల క్రితం 8 మంది మాజీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరారని, దానికి మీడియాతో తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని ఆక్షేపించారు. అజంఖాన్ సిఫార్సుతోనే.. సిబల్ రాజ్యసభ అభ్యర్థిత్వానికి సమాజ్‌వాదీ మద్దతు వెనక ఆ పార్టీ సీనియర్ నేత అజంఖాన్ మద్దతుందని చెప్తున్నారు. ఆయనకు బెయిల్ ఇప్పించడంలో సిబల్ కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయన్ను రాజ్యసభకు పంపాలని ఎస్పీ నాయకత్వాన్ని అజంఖాన్ కోరినట్లు తెలిసింది. ఎస్పీకి యూపీ నుంచి ముగ్గురిని రాజ్యసభకు పంపింత సంఖ్యాబలం ఉంది. సిబల్ వంటి సీనియర్ నేత, లాయర్ రాజ్యసభలో ఉండడం దేశానికి మంచిదని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. సిబల్ రాజ్యసభ పదవీ కాలం జూలై 4తో ముగియనుంది. సిబల్ కొంతకాలంగా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా గళమెత్తి వార్తల్లోకెక్కారు. గాంధీయేతర వ్యక్తిని కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని డిమాండ్ చేశారు. సునీల్ జాఖడ్, హార్దిక్ పటేల్ ఇటీవలే కాంగ్రెస్‌ను వీడటం తెలిసిందే. #WATCH | Uttar Pradesh: Congress leader Kapil Sibal files nomination for Rajya Sabha election, in the presence of Samajwadi Party (SP) chief Akhilesh Yadav, in Lucknow. pic.twitter.com/8yRDoSwE3g — ANI UP/Uttarakhand (@ANINewsUP) May 25, 2022 -
Sakshi Cartoon: ‘గాంధీలు’ స్వయంగా వైదొలగాలి: కపిల్ సిబల్
‘గాంధీలు’ స్వయంగా వైదొలగాలి: కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ -
గాంధీలు స్వచ్ఛందంగా తప్పుకుంటేనే కాంగ్రెస్‌కి మనుగడ!
న్యూఢిల్లీ: గత నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. ఎన్నో ఏళ్ల చారిత్రక నేపథ్యం ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊహింని విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రలోనూ సరియైన మెజార్టీతో గెలవలేకపోయింది. దీంతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గత ఆదివారం ఐదు గంటల పాటు పెద్ద సమావేశాన్ని నిర్వహించింది. కానీ ఈ సమావేశంలో పార్టీ సభ్యులు సోనియా గాంధీ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటించడంతో యథాతథ స్థితి నుంచి వైదొలగకూడదని నిర్ణయించుకున్నారు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ అన్నారు. గాంధీలు నాయకత్వ పదవుల నుంచి తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. గాంధీలు స్వచ్ఛందంగా వెళ్లిపోతేనే మంచిది ఎందుకంటే వారు నామినేట్ చేసిన పార్టీ సభ్యులు అధికార పగ్గాలను కొనసాగించకూడదని వారికి ఎప్పటికీ చెప్పలేరు అని చెప్పారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకుడు కాకపోయినప్పటికీ వాస్తవ అధ్యక్షుడిలా నిర్ణయాలు తీసుకుంటారని విమర్శించారు. " అంతేకాదు రాహుల్ గాంధీ పంజాబ్ వెళ్లి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. అతను ఏ హోదాలో ఈ పని చేశారు? ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు, అన్ని నిర్ణయాలూ ఆయనే తీసుకుంటారు. ఆయన ఇప్పటికే వాస్తవ అధ్యక్షుడిగా ఉన్నారు. అలాంటప్పుడు ఆయనను తిరిగి అధికార పగ్గాలు చేపట్టాలని అడగడం అర్థం లేని విషయంగా అభివర్ణించారు. తాను ఘర్ కీ కాంగ్రెస్"కి విరుద్ధంగా "సబ్ కీ కాంగ్రెస్"ని కోరుకుంటున్నట్లు చెప్పారు. పైగా ఆయన తన చివరి శ్వాస వరకు ‘సబ్ కీ కాంగ్రెస్’ కోసం పోరాడతానని అన్నారు. అంతేకాదు కాంగ్రెస్‌లోని చాలామంది నేతు సీడబ్ల్యూసీకి విరుద్ధమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. సీడబ్ల్యూసీ వెలుపల కాంగ్రెస్ ఉందని దయచేసి మీరు వారి అభిప్రాయాలను వినండి అని విజ్ఞప్తి చేశారు. 2020లో 23 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు పార్టీలో పెద్ద మార్పులు చేయాలని సోనియా గాంధీకి రాసిన లేఖపై కపిల్ సిబల్ కూడా సంతకం చేశారు. (చదవండి: నువ్వు సినిమాల్లోనే హీరోవి.. నేను పొలిటికల్ హీరోని) -
కాంగ్రెస్ కి రాహువు పట్టింది: నిర్మలా సీతారామన్
-
"అభినందనలు మోదీ జీ" అంటూ వ్యంగ్యాస్త్రాలు
న్యూఢిల్లీ: గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 116 దేశాలు జాబితాలో భారత్ 101వ స్థానంకు పడిపోయింది. గతేడాది పాకిస్తాన్‌తో సహా ఇతర పొరుగు దేశాల కంటే మెరుగ్గా భారత్ 94వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రతిపక్ష పార్టీ నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్.. ప్రధాని నరేంద్ర మోదీ పై ధ్వజమెత్తారు. పేదరికం, ఆకలి నిర్మూలన కంటే కూడా భారతదేశాన్ని గొప్ప ప్రపంచ శక్తిగా మార్చే పనిలోనే ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. (చదవండి: "నా స్టార్ట్ప్ బిజినెస్‌కి పెట్టుబడి పెట్టండి ప్లీజ్") 'అభినందనలు మోదీజీ' భారత్ దేశం చాలా గొప్ప స్థాయిలో ఉందంటూ మోదీ పై వ్యంగ్యాస్త్రాలు కురిపించారు. ఈ మేరకు భారత్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ స్కోరు కూడా పడిపోయినట్లు నివేదిక తెలిపింది. ఈ క్రమంలో నేపాల్ (76), బంగ్లాదేశ్ (76), మయన్మార్ (71) పాకిస్తాన్ (92) స్థానాల్లో ముందంజలో ఉన్నప్పటికీ ఆయా దేశాలు ఆందోళనకర స్థాయిలో ఆకలి ఉన్నట్లు వెల్లడించింది. అయితే భారత్ కోవిడ్ -19 దృష్ట్య తీసుకున్న కఠిన ఆంక్షల ఫలితంగా పిల్లల మరణాల రేటు తగ్గడమే కాక పోషకాహార లోపాన్ని కూడా మెరుగుపర్చిందని నివేదిక పేర్కొంది. (చదవండి: ‘పీపీఈ’ డ్యాన్స్ చూశారా.. భలే ఉందే!) -
పంజాబ్ కాంగ్రెస్ సంక్షోభంతో ఢిల్లీలో ప్రకంపనలు
-
పెగసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ
-
పెగాసస్ స్పైవేర్‌పై విచారణ: సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసన సెగలు రేపుతున్న పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో గురువారం ప్రారంభమైంది. పెగాసస్ స్పైవేర్ స్కాంపై దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన 9 పిటిషన్లను గురువారం సుప్రీం విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడి ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పలువురు రాజకీయ ప్రముఖులు, రాజ్యాంగ అధికారులు, జర్నలిస్టులు, జడ్జిలు, హక్కుల నేతలే టార్గెట్‌గా చేసిన ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేయకపోవడాన్ని పిటిషన్ల తరపు వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది కబిల్ సిబల్ ప్రశ్నించారు. స్పైవేర్‌ను కొనుగోలు చేసింది ఎవరు, హార్డ్‌వేర్ ఎక్కడ ఉంచారో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇది తమ వ్యక్తిగత స్వేచ్ఛ, గౌరవానికి భంగకరమని సిబల్ వాదించారు. ఈవ్యవహారంలో కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులివ్వాలన్నారు. మరోవైపు ఈ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పెగాసస్ గురించి మీడియా నివేదిక నిజమైతే, ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవన్నారు. వీటిపై లోతైన విచారణ జరగాల్సి ఉందని పేర్కొన్నారు. కానీ తమ వాదనలకు అనుకూలమైన మెటీరియల్‌ని అందించలేకపోవడం దురదృష్టకరమన్నారు. ఎంతో పరిజ్ఞానం ఉన్న వ్యక్తులై వుండీ వివరాలు సేకరించడానికి అంతగా ప్రయత్నించలేదన్నారు. అలాగే దీనివల్ల తాము ప్రభావితమయ్యామని చెప్పుకుంటున్న వారు, ఇంతవరకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. అంతేకాదు రెండేళ్ల తర్వాత ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తుతున్నారని ప్రశ్నించారు. . ఫోన్లు హ్యాక్ అవుతున్న విషయంపై ఫిర్యాదు చేశారా.. చేస్తే ఎఫ్ఐఆర్ నమోదు అయిందా అని సీజేఐ ప్రశ్నించారు. తదుపరి విచారణను ఆగస్టు 10కి(మంగళవారం) వాయిదా వేశారు. కాగా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, రాజ్యసభ ఎంపీ, న్యాయవాది పెగాసస్ అంశంపై విచారణకు సుప్రీంకోర్టు పిటిషన్లను దాఖలు చేశారు. సీనియర్ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్, సీపీఎం రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిటాస్, న్యాయవాది ఎంఎల్ శర్మ ఇందులో ఉన్నారు. దాదాపు 300 మందికిపైగా ప్రముఖులపై నిఘా పెట్టి గూఢచర్యానికి పాల్పడిన కుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ జర్నలిస్టులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అలాగే ఈ వ్యవహరాంపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ను ఏర్పాటు చేయాలని ఎడిటర్స్ గిల్డ్ మరో పిటిషన్ దాఖలు చేసింది. మరోవైపు పెగాసస్ వివాదం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తోంది. దీనిపై చర్చ జరపాలని, ప్రభుత్వం సమాధానం చెప్పి తీరాలని ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ నిరసనలు, వాగ్వాదాల నడుమ పెగాసస్ నిఘాపై చర్చకు అంగీకరించేది లేదని సర్కార్ ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం. -
కాంగ్రెస్ సంక్షోభం.. పొమ్మంటే పోతాం: కపిల్ సిబాల్
న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడైన జితిన్ ప్రసాద, బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ నాయకత్వ సంక్షోభం మళ్లీ తెర మీదకు వచ్చింది. పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండొచ్చనే చర్చల నడుమ.. మరికొందరు కాంగ్రెస్ సీనియర్ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇంకోవైపు పార్టీలో సమూలమైన మార్పులు చేయాల్సిందేనని సోనియా గాంధీకి జీ-23 అసమ్మతి నేతలు గతంలోనే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీతోనే తాము ఉంటామని, ఒకవేళ అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో మాత్రం చేరబోనని, తాను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకమని కపిల్ సిబాల్ పేర్కొన్నారు. ‘‘బీజేపీలో చేరడమంటే నేను చచ్చిపోయినట్లే లెక్క’ అని ఘాటుగా వ్యాఖ్యానించారాయన. ఇక బీజేపీలో జితిన్ ప్రసాద చేరికపైనా సిబాల్ స్పందించారు. అది 'ప్రసాద రామ' రాజకీయాలు. సిద్ధాంతాలను పక్కనబెట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని మండిపడ్డారు. అయితే ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయిందని ఆయన బాధపడ్డారు. ఇక పార్టీని వీడడంలో జితిన్ కారణాలు.. జితిన్ ఉండొచ్చని, అయితే పార్టీని వీడినందుకు కాకుండా.. వీడేందుకు జతిన్ చెప్పిన కారణాలనే విమర్శించాలని కాంగ్రెస్ నేతలకు ఆయన హితవు పలికారు. కాంగ్రెస్‌కూ అల్టిమేటం పార్టీ తమ వాదన వినడంలో విఫలమైతే తామంతా విఫలమైనట్లేనని సిబాల్ వ్యాఖ్యానించారు. పార్టీలో సంస్కరణలకు సమయం ఆసన్నమైందని, సీనియర్ల మాటల్ని నాయకత్వం ఇకనైనా వినాలని కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అది నిజం. అవి పరిష్కారం అయ్యే వరకు వేలేత్తి చూపుతూనే ఉంటాం. నాయకత్వం విఫలమైతే పార్టీ నేతలందరూ విఫలమైనట్లే అని కపిల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అధిష్ఠానం మేల్కోవాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని లేకుంటే పార్టీ తీవ్ర సంక్షోభానికి గురవుతుందని కపిల్ తేల్చి చెప్పారు. చదవండి: కాంగ్రెస్ తీరు మారినట్లేనా? -
వాట్సాప్: కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేం!
ఢిల్లీ: మే 15 నుంచి అమల్లోకి వచ్చిన తమ కొత్త ప్రైవసీ పాలసీని వాయిదా వేయలేమని వాట్సాప్ ఢిల్లీ హైకోర్టుకు సోమవారం తెలిపింది. మొబైల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్లు తమ కొత్త విధానాలను అంగకరించకపోతే.. దశల వారిగా వారి ఖాతాలను నిలిపివేస్తామని పేర్కొంది. ఈ మేరకు సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ దిల్లీ హైకోర్టులో సోమవారం వాదనలు వినిపించారు. "మా గోప్యతా విధానం ఐటి నిబంధనలను అతిక్రమించలేదు అని చాలా స్పష్టమైన ప్రకటన చేశాం, మేము అన్నీ నిబందనల ప్రకారం వెళ్తున్నాం" అని సిబల్ కోర్టుకు చెప్పారు. ఈ విధానాన్ని అంగీకరించని యూజర్లు యాప్‌ను వాడేందుకు అనుమతించట్లేదంటూ వినిపించిన వాదనలను వాట్సాప్ ఖండించింది. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. ఈ కొత్త విధానం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్(2000) లోని కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయని చెప్పారు. అలాగే దీనిపై కేంద్రం సంస్థ వాట్సాప్ ఉన్నతాధికారులకు లేఖ రాసిందని, సమాధానం కోసం వేచిచూస్తున్నామని తెలిపారు. మే 15 నుంచి అమల్లోకి వచ్చిన వాట్సాప్ కొత్త విధానంపై న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై తమ వైఖరిని కోరుతూ ప్రధాన న్యాయమూర్తి డిఎన్ పటేల్, జస్టిస్ జ్యోతి సింగ్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, రెండు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు గతంలో నోటీసులు జారీచేసింది. ఇదిలా ఉంటే..వాట్సాప్ యథాతథ స్థితిని కొనసాగించాలని చేతన్ శర్మ, పిటిషనర్లు కోరగా.. ఢిల్లీ హైకోర్టు ఈ విచారణను జూన్ 3కి వాయిదా వేసింది. చదవండి: అలర్ట్: నెఫ్ట్ సేవలకు అంతరాయం -
వాట్సాప్ కొత్త పాలసీపై కేంద్రం ఆగ్రహం
న్యూఢిల్లీ: నూతన వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఇండియన్ యూజర్లు విచారం వ్యక్తం చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ పాలసీ తీసుకొచ్చాక చాలా మంది వాట్సాప్ వినియోగదారులు సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసెంజర్ యాప్ లకు తరలివెళ్తున్నారు. చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలో వాట్సాప్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ సమయంలో వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఓ న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణ సందర్బంగా కేంద్రం వాట్సాప్ ప్రైవసీ పాలసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది.(చదవండి: ఇండియాలో 5జీ ఎప్పుడు రానుంది?) యూరోపియన్ వినియోగదారులు, భారతీయ వినియోగదారులను వాట్సాప్ వేర్వేరుగా చూస్తుందని కేంద్రం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. కొత్త పాలసీ నిబంధనలకు సంబందించిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వాట్సాప్ కు లేఖ పంపినట్లు విచారణ సందర్భంగా అడిషిషనల్ సోలిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ భారతీయ వినియోగదారుల గోప్యతా విషయంలో "ఏకపక్షంగా" వ్యవహరిస్తుందని ఇది ఆందోళన కలిగించే విషయమని కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.(చదవండి: ఇండియన్ పబ్జీ(ఫౌజీ) విడుదల రేపే!) మళ్లీ మార్చి 1కి వాయిదా యూరోపియన్ లో వ్యక్తిగత సమాచారం షేర్ చేసుకోవడం నేరం కావడంతో అక్కడ తప్పనిసరిగా వాట్సాప్ నిబంధనలను అంగీకరించాలనే నిబంధన లేదు.. కానీ ఇండియాలో అందుకు విరుద్దంగా వాట్సాప్ యూజర్లు తప్పనిసరిగా నిబంధనలు తీసుకురావడం ఆందోళన కలిగిస్తోందని చేతన్ శర్మ కోర్టుకు తెలిపారు. ఈ అంశం వినియోగదారుల సమాచారం భద్రత, గోప్యతకు భంగకరమని కోర్టుకు నివేదించారు. అయితే ప్రభుత్వం కోరిన వివరాలపై త్వరలోనే స్పందిస్తామని వాట్సాప్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ఈ విచారణను మార్చి 1కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. -
కాంగ్రెస్ తీరు మారినట్టేనా?
పార్టీ సీనియర్ నేతలు రాసిన లేఖపై గత నాలుగు నెలలుగా మౌనంగా వుండిపోయిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఎట్టకేలకు ‘సరైన విధానం’లో స్పందించినట్టు కనబడుతోంది. శనివారం మొదలుపెట్టి వరసగా కొన్ని రోజులపాటు సీనియర్ నాయకులతో ఆమె చర్చిస్తారని... వారిలో లేఖరాసిన నాయకులు కూడా వుంటారని ఆమె సన్నిహిత వర్గాలు చెప్పడాన్ని గమనిస్తే ఈ అభిప్రాయం కలుగుతుంది. రైతు ఉద్యమం, పార్లమెంటు శీతాకాల సమావేశాల రద్దు వంటి సమ స్యల్ని చర్చించడానికని చెబుతున్నా అసమ్మతిని చల్లార్చడమే దీనిలోని ఆంతర్యమని వస్తున్న ఊహా గానాలు కొట్టివేయదగ్గవి కాదు. సమస్య తలెత్తినప్పుడు, సంక్షోభం ఏర్పడినప్పుడు అందరినీ పిలిచి మాట్లాడటం సరైందే. కానీ ఇందుకామె సుదీర్ఘ సమయం తీసుకున్నారు. అంతేకాదు...తన విధేయు లతో లేఖ రాసినవారికి వ్యతిరేకంగా ప్రకటనలిప్పించారు. వారిపై జీ–23గా ముద్ర కొట్టి ఒక ముఠాగా చిత్రించే ప్రయత్నం చేశారు. ఆ నేతల పార్లమెంటరీ పార్టీ పదవులను ఊడబెరికి విధేయు లతో నింపారు. అదే సమయంలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకుంటానంటూ ఆమె ప్రకటన చేశారు. వెనువెంటనే పార్టీ అత్యున్నత స్థాయి సంఘం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమా వేశమై సోనియా అధ్యక్ష పదవిలో కొనసాగాల్సిందేనని తీర్మానించింది. సీనియర్ నేతలు అడిగిం దేమిటి? నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ పరాభవం చవిచూశాక అందుకు నైతిక బాధ్యతవహిస్తూ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్‌గాంధీ స్థానంలో ఒక ‘ఫుల్ టైం’ నాయకత్వం వుండేలా చూడమని విన్నవించుకున్నారు. ‘పార్టీ భవిష్యత్తు పెను ప్రమాదంలో పడింది. దేశం కూడా సంక్షోభంలో వుంది. అందుకే దాపరికం లేకుండా, నిర్మొహమాటంగా వాస్తవా లేమిటో తేటతెల్లం చేస్తున్నామ’ని చెప్పారు. రాహుల్ మళ్లీ వచ్చి పార్టీ అధ్యక్ష పదవిలో కూర్చుంటా నంటే వీరిలో చాలామంది కాదనకపోవచ్చు. వారి అభ్యంతరమల్లా ఆ పదవిని పూర్తికాలం బాధ్య తగా పరిగణించమనే! అధ్యక్ష పదవినుంచి వైదొలగిన సందర్భంలో తన సోదరి ప్రియాంకపై ఒత్తిళ్లు తీసుకురావడాన్ని గమనించి ఆమె కూడా బాధ్యతలు స్వీకరించే ప్రశ్నే లేదని రాహుల్ కుండ బద్దలు కొట్టారు. తెరవెనక ఆయన్ను ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాక చివరకు సోనియాగాంధీయే తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు సిద్ధపడ్డారు. ఏడాదిన్నర గడిచినా పూర్తికాలం బాధ్యతల్ని ఎవరికీ అప్పగించలేదు. లేఖకులంతా ఇన్నాళ్లూ సోనియాకు వీర విధేయులు. పార్టీ ఈ స్థితికి దిగజారడంలో వీరిలో కొందరి పాత్ర కూడా కాదనలేనిది. వివిధ రాష్ట్రాల్లో చురుగ్గా పనిచేస్తూ, కొత్త ఆలోచనలతో ముందుకొస్తూ పార్టీని పటిష్టపరిచేవారిపై అధిష్టానానికి చాడీలు చెప్పి ఇబ్బందులు సృష్టించడంలో, నిష్క్రమించేలా చేయడంలో కొందరు కీలకపాత్ర పోషించారు. క్షేత్ర స్థాయిలో బలగంలేని తమ అనుయాయులకు చోటిచ్చి ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీనపడటానికి దోహదపడ్డారు. ఇప్పుడు పుట్టి మునిగాక తమను తాము వేరుపరుచుకుని తప్పంతా అధినాయకత్వానిదేనంటున్నారు. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో పరాజయ పరంపర కొనసాగుతుంటే... ఓడినచోటల్లా నాయకత్వ స్థానాల్లో వున్నవారు తప్పుకుంటుంటే... వాటి ప్రభావంతో వేరే రాష్ట్రాల్లో పార్టీ పునాదులు కదలబారుతుంటే స్వీయ రాజకీయ భవిష్యత్తుపై బెంగ పట్టుకుని ఆ లేఖ రాశారు. ఇది రాశాక కూడా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో, గోవా, కేరళ రాష్ట్రాల్లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. ఉప ఎన్నికల ఫలితాలు సరేసరి. లేఖ రాసినవారి ఉద్దేశం ఏమైనా ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నడపదల్చుకున్న అధినాయకత్వం చేయాల్సిన పని ఆ నాయకుల్ని పిలిచి మాట్లాడటమే. పార్టీ తమ సొంత జాగీరుగా భావించడం, ప్రశ్నించినవారిని ద్రోహులుగా ముద్రలేయడం, నిష్క్రమించక తప్పని స్థితి కల్పించడంవంటివి ఎంతోకాలం సాగ బోవని గుర్తించడం అవసరం. అయితే సీనియర్ నేతలతో మాట్లాడటానికి ఎంచుకున్న సమయం సంశయాలు రేకెత్తిస్తోంది. పార్టీ సంస్థాగత ఎన్నికలు త్వరలో జరగాల్సివుంది. లేఖకుల అసంతృప్తిని ఏదో మేరకు చల్లార్చ కుండా పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహిస్తే అది కొత్త సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. వారిలో ఎవరైనా బరిలో నిలిస్తే, కాంగ్రెస్‌ను రక్షించడానికే ప్రయత్నిస్తున్నామని మీడియాలో హోరెత్తిస్తే పార్టీ మరింత బజారున పడుతుంది. వర్కింగ్ కమిటీకి ఎంపిక కాకుండా ఎన్నిక జరగాలని వారు ఎప్పటినుంచో కోరుతున్నారు. అది కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. సాధారణంగా మంచి టీమ్‌గా అక్కరకొస్తారని భావించినవారిని వర్కింగ్ కమిటీకి ఎంపిక చేయడం కాంగ్రెస్ అధి నేతల సంప్రదాయం. దానికి విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరితే జవాబు చెప్పుకోవడం పార్టీకి కష్టమవుతుంది. అయితే లేఖరాసినవారు ఇంతవరకూ సోనియాకు వ్యతిరేకంగా మాట్లాడ లేదు. తమ నాయకురాలు ఆమేనని ఇప్పటికీ చెబుతున్నారు. పరిస్థితి ఇలావున్నప్పుడే ఆ నాయకు లను మచ్చిక చేసుకోవడం అవసరమని సోనియా భావించి వుండొచ్చు. అయితే వారిలో ఎందరు ఆమె చెప్పినట్టు విని దారికొస్తారన్నదాన్నిబట్టి సంస్థాగత ఎన్నికల తేదీలపై తుది నిర్ణయం వుంటుం దని మీడియా కథనాలు చెబుతున్నాయి. ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన తమ నిర్వాకమే పార్టీని ఈ స్థాయికి తెచ్చిందని, ఈ తీరును మార్చుకోనట్టయితే భవిష్యత్తు వుండదని ఇప్పటికైనా సోనియా గాంధీ గ్రహిస్తే మంచిదే. ఎల్లకాలమూ తాత్కాలిక ఏర్పాట్లతో బండి లాగించవచ్చుననుకుంటే అది అనర్థదాయకమే అవుతుంది. పార్టీకి జవసత్వాలు కల్పించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నించడం, సంస్థ కోసం నిజంగా కష్టపడేవారిని గుర్తించి బాధ్యతలు అప్పజెప్పడం వంటివి చేస్తేనే జనం ఏదో మేరకు ఆ పార్టీని విశ్వసిస్తారు. -
నిరసన స్వరం: హస్తంకు అధికారం కష్టమే
సాక్షి, న్యూఢిల్లీ : ఘోర పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీలో రోజుకో కొత్త సమస్య వచ్చిపడుతోంది. ఇప్పటికే ప్రజల్లో ప్రాభల్యం కోల్పోతూ నానాటికీ కృషించి పోతున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీలో సీనియర్ల నిరసన స్వరాలు మరింత తలనొప్పిగా మారియి. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీరుపై కేంద్రమాజీ మంత్రి కపిల్ సిబల్ ఇటీవల చేసిన ఘాటు వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు రేపిన విషయం తెలిసిందే. నాయకత్వ తీరులో మార్పులు రాకపోతే ఇక ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీని విజయవంరించదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు హస్తం పార్టీలో పుట్టించిన వేడి చల్లారకముందే మరోనేత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన కేంద్రమాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ పార్టీ నేతల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో 5స్టార్ సాంప్రదాయం ఎక్కువగా పెరిగిపోయిందని, నేతలు ప్రజల్లో కన్నా ఏసీ రూముల్లోనే ఎక్కువగా గడుపుతున్నారని సొంత పార్టీ నేతలపై విమర్శలు గుప్పించారు. (కాంగ్రెస్ పార్టీని వదిలిపోండి) ఆదివారం ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఇంటర్వ్యూలో గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘ పార్టీలో ఇంతకుముందు ఉన్న పరిస్థితులు ఇప్పడు లేవు. నాయకుల్లోచాలా మార్పులు వస్తున్నాయి. పార్టీ టికెట్ రావడమే ఆలస్యం 5 స్టార్ హోటల్స్‌లో ప్రత్యక్షమవుతున్నారు. ప్రజల్లో కంటే ఏసీ రూముల్లోనే ఎక్కువగా సమయం వెచ్చిస్తున్నారు. ప్రజా సమస్యలపై ఏమాత్రం పోరాటం చేయకుండా కేవలం ప్రెస్‌నోట్ రిలీజ్ చేయగానే ఇక తమ పని పూర్తి అయ్యిందనే భ్రమలో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి పోయే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టం. ఈ తీరు వెంటనే మార్చుకోవాలి. జాతీయ నాయకత్వం కిందస్థాయి నేతలకు ఆదర్శంగా ఉండాలి. (లేఖ: యూపీ కాంగ్రెస్ నేతపై చర్యలు!?) గతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో పార్టీ చాలా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తాను బాధ్యుడిగా ఉంటూ పార్టీని పటిష్టస్థితికి చేర్చగలిగాను. ఆ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురాగలిగాను. ఆ సమయంలో పార్టీ ఇంఛార్జికి పూర్తి అధికారాలు ఉండేవి. అధిష్టానం ఎలాంటి విషయాల్లోనూ జోక్యం చేసుకునేది కాదు. 2004, 2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. 7 స్థానాలు ఉన్న పార్టీకి 35 స్థానాల వరకు రాబట్టడంతోనే అధికారంలోకి వచ్చాయు. ఏపీలో వైఎస్సార్ నేతృత్వంలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాము. ఆ తరువాత పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రావాలంటే నేతలు ఏసీ రూములు వదిలి ప్రజల్లోకి వెళ్లాలి. లేకపోతే ఎప్పటికీ అధికారంలోకి రాలేము. కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. పార్టీని పునాదుల నుంచి పునర్నిర్మించాలి. అధ్యక్షుడెవరని అడిగితే రెబెలియన్ అంటూ ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీలో రెబెలియన్ అంటూ ఎవరూ ఉండరు. లోక్‌సభలో కాంగ్రెస్‌కు కనీసం విపక్ష నేత పోస్టు కూడా దక్కట్లేదు’ అని అన్నారు. ఆజాద్ వ్యాఖ్యలతో పలువురు నేతలు విభేదిస్తుండగా.. మరికొందరి ఏకీభవిస్తున్నారు. -
రాయని డైరీ : కపిల్ సిబల్ (కాంగ్రెస్)
‘‘ఉన్నారా?’’ అని ఫోన్ చేశారు చిదంబరం! ‘‘ఉన్నాను చెప్పండి చిదంబరం జీ’’ అన్నాను. ‘‘మీరూ నేను ఎక్కడికి పోతాం చెప్పండి సిబల్ జీ. ‘ఉన్నారా’ అని నేను అడిగింది ‘మీరు ఉన్నారా’ అని కాదు. ‘మీ పక్కన ఎవరైనా ఉన్నారా’ అని’’ అన్నారు చిదంబరం. నాకూ ఆ సందేహం వచ్చింది. నాకు ఫోన్ చేసి నన్నే ‘ఉన్నారా’ అని చిదంబరం ఎందుకు అడుగుతారు.. ఎంత నాకన్నా మూడేళ్లు పెద్దవారైతే మాత్రం! ఆ మాటే చిదంబరంతో అన్నాను. పెద్దగా నవ్వారు. కాంగ్రెస్‌లో వయసుడిగేవారు, వయసడిగేవారు ఉండరు. ‘‘సో, ఎవరూ లేరు మీ పక్కన. ఉంటే మీరు మీ వయసు గురించి కానీ, నా వయసు గురించీ కానీ ఆలోచించేవారు కాదు కదా..’’ అని మళ్లీ నవ్వారు. నవ్వి, ‘‘ఎక్కడున్నారు?’’ అని అడిగారు. ఒక్క క్షణం ఆగాను. నేనున్నది ఢిల్లీలో. ఢిల్లీలో ఉన్నాను అని చెబితే.. ఢిల్లీలో కాంగ్రెస్ లేదని తెలిసీ ‘విషయాలేంటి?’ అని అడుగుతారు. కొన్నిసార్లు నేను జలంధర్‌లో కూడా ఉంటాను. జలంధర్‌లో ఉన్నానని చెబితే పంజాబ్‌లో ఉన్నది కాంగ్రెస్సే కనుక ‘విషయాలేంటి?’ అని అడగరు. ఓసారి ఇలాగే జలంధర్‌లో ఉన్నానని చెబితే టప్మని ఫోన్ పెట్టేశారు. ‘ ఫోన్ పెట్టేశారేమిటి?’ అని వెంటనే ఫోన్ చేసి అడిగాను. ‘ఢిల్లీలో ఉన్నారేమో విషయాలేంటి అని అడుగుదామనుకున్నాను. జలంధర్‌లో ఉన్నానన్నారు కనుక విషయాలేముంటాయ్ లెమ్మని పెట్టేశాను’ అన్నారు. అది గుర్తొచ్చి, జలంధర్‌లో ఉన్నాను అని అబద్ధం చెప్పాను. విషయాలు అడగరని. ‘‘జలంధర్‌లో ఉన్నారా.. ఢిల్లీ ఎప్పుడు వెళ్తారు?’’ అన్నారు. ‘‘ఎందుకు చిదంబరం జీ?’’ అని అడిగాను. ‘‘ఏం లేదు, మీరు ఢిల్లీ వెళ్లాక ‘విషయాలేంటి?’ అని అడుగుదామనీ..’’ అన్నారు! ఒక గంటలో ఢిల్లీలో ఉంటాను. నేనే మీకు ఫోన్ చేస్తాను’’ అన్నాను. గంట తర్వాత ఆయనే చేశారు! ‘‘ఉన్నారా?’’ అని అడిగారు! ‘చేరుకున్నారా?’ అని అడగాలి. ‘ఉన్నారా?’ అని అడిగారు! తెలిసిపోయిందా నేను ఢిల్లీలోనే ఉన్నట్లు?! ‘‘చిదంబరం జీ, ‘ఢిల్లీ చేరుకున్నారా?’ అని కదా మీరు నన్ను అడగవలసింది, ‘ఉన్నారా?’ అని అడిగారేమిటి?’’ అని అడిగాను, ‘‘చేరుకుని ఉంటారని ఊహించి.. ‘ఉన్నారా?’ అని అడిగాను’’ అన్నారు! ‘ఉన్నాను..’ అని మళ్లీ నన్ను చెప్పనివ్వకుండా.. ‘‘మీ పక్కన ఎవరైనా ఉన్నారా?’’ అని అడిగారు. ‘‘లేరు చిదంబరం జీ, నా పక్కనెవరూ లేరు చెప్పండి’’ అన్నాను. ‘‘ఎక్కడున్నారు?’’ అని అడిగారు!! ‘‘ఢిల్లీలోనే చిదంబరం జీ.. మీకెందుకు డౌటొచ్చిందీ’’ అన్నాను. ‘‘ఎక్కడున్నారు అని అడిగింది మిమ్మల్ని కాదు సిబల్ జీ, మీ పక్కన లేనివారు ఇప్పుడెక్కడున్నారూ అని..’’ అన్నారు! చిదంబరం అడుగుతున్నది సోనియాజీ గురించని నాకు అర్థమైంది. ‘‘మీరెక్కడున్నారు చిదంబరం జీ’’ అని అడిగాను. నా పక్కన లేని వారు ఆయన పక్కన ఉండి, వారిపై నా మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారేమోనని సందేహం వచ్చి అలా అడిగాను. చిదంబరం పెద్దగా నవ్వారు. ‘‘సిబల్ జీ, మీ ధైర్యాన్ని చూస్తుంటే కాంగ్రెస్ ఇంకో నూటా ముప్పై నాలుగేళ్లు అక్బర్ రోడ్డులోనే పటిష్టంగా ఉంటుందనిపిస్తోంది. గోవాలో రెస్ట్ తీసుకుంటున్న సోనియాజీ కనుక చెన్నైలో కూడా కొన్నాళ్లు ఉండేందుకు వస్తారేమో ముందే తెలిస్తే, నేను ఢిల్లీ వద్దామని మీకు ఫోన్ చేశాను. అంతే.’’ అన్నారు. ధైర్యంలో ఆయన నాకంటే ఏం తక్కువో నాకు అర్థం కాలేదు!! - మాధవ్ శింగరాజు -
తప్పంతా నాదే.. బలంలేని చోట పోటీకి దిగాం
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌లో బిహార్ ఎన్నికల ఫలితాల ఎపిసోడ్ చివరి అంకానికి చేరినట్లు కనపడుతోంది. తాజాగా రాజ్యసభ సభ్యుడు బిహార్ కాంగ్రెస్ సీనియర్ నేత అఖిలేష్ ప్రసాద్ తెర ముందుకొచ్చారు. తన వల్లే పార్టీ రాష్ట్రంలో పరాజయం పాలైందని ఒప్పుకున్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను ఆయన నిర్వర్తించారు. ఓటమి గల కారణాలను వివరించేందుకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారు. గత 20 ఏళ్లలో ప్రత్యర్థులు గెలుస్తున్న సీట్లను తమకు కేటాయించడం వల్లే ఈ పరాజయం పొందామని, దానికి పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. పూర్తి స్థాయిలో అధ్యయనం చేయకుండా తమకు బలంలేని చోట పోటీకి దిగామని, పరాజయంపై రాహుల్ గాంధీతో చర్చిస్తానని అన్నారు. వ్యూహాత్మకంగా బలహీనంగా ఉన్న చోట సరిచేయాలని అధినేతతో చెప్తానని అన్నారు. బ్లాక్, జిల్లా స్థాయిలో పార్టీ చాలా బలహీనంగా ఉందని ఆయన అంగీకరించారు. ఏ రాష్ట్ర ఎన్నికల్లో అయిన గెలవాలంటే పార్టీలో భారీ సంస్కరణలు అమలు చేయాలని అన్నారు. ఇంతకు ముందే కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్.. పార్టీని అనుభవజ్ఞులైన రాజకీయ నాయకుల చేతిలో పెట్టాలని పరోక్షంగా రాహుల్‌ని ఉద్ధేశించి బహిరంగంగా విమర్శించారు. కాంగ్రెస్ నానాటికీ బలహీన పడుతుందని, వ్యవస్థాగతంగా మార్పులు చేయాలని మరో సీనియర్ నేత చిదంబరం సూచించారు. అంతేకాకుండా బిహార్‌లో సీట్ల ఎంపికలో సరిగా వ్యవహరించలేదని, ప్రతిపక్షాలు గత 20 ఏళ్లలో గెలుస్తున్న 25 సీట్లను అంటగట్టారని అన్నారు. అన్ని స్థానాల్లో కాకుండా 45 సీట్లలో పోటీకి నిలిపితే బాగుండేదని చిదంబరం అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన అఖిలేష్ ప్రసాద్ స్పందిస్తూ.. తనకు కపిల్ సిబల్ అంటే చాలా గౌరవమని అన్నారు. పరాజయంపై బహిరంగంగా మాట్లాడకుండా ఉండాల్పిందని అన్నారు. బిహార్‌లో కొన్ని సీట్లలో పోటీ చేసి ఉంటే విజయానికి దగ్గరలో ఉండేదన్న వ్యాఖ్యలపై మిత్రపక్షాల నుంచి కాంగ్రెస్ విమర్శలు ఎదుర్కొంటోంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉప ఎన్నికల్లోనూ పరాజయం తరువాత ఇవి తీవ్రమయ్యాయి. (చదవండి: కాంగ్రెస్ పార్టీపై చిదంబరం ఘాటు వ్యాఖ్యలు) -
కాంగ్రెస్ పార్టీని వదిలిపోండి.
న్యూఢిల్లీ: సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ మాటలు కాంగ్రెస్ పార్టీలో మంటలు రేపుతున్నాయి. పార్టీకి పూర్వవైభవం రావాలంటే నాయకత్వ మార్పు అవసరమన్న సిబల్పై లోక్‌సభ కాంగ్రెస్ పక్షనేత అధిర్ రంజన్ చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిబల్‌కు అంత ప్రగతిశీల భావాలు ఉంటే కాంగ్రెస్ పార్టీని వీడి పోవచ్చని, లేదంటే వేరే పార్టీలో చేరవచ్చని సూచించారు. పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడుస్తున్నారని, విశ్వసనీయతను దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహూల్ గాంధీ సీనియర్లకు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇచ్చారని, అయినప్పటికి బహిరంగంగా చెప్పటం మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. సరైన వేదికపై తమ సూచనలు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ పార్టీని ప్రజల్లో చులకన అయ్యేలా వ్యవహరిస్తున్నారని అన్నారు. బిహార్ ఎన్నికల సమయంలో ఈ నాయకులు ఎక్కడ ఉన్నారని చౌదరి ప్రశ్నించారు. "అటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడం పట్ల అంత తపన ఉంటే, వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. బిహార్ ఎన్నికల సందర్భంగా వారు పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారా" అని ఆయన అడిగారు. సోమవారం, కపిల్ సిబల్ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ క్షీణించిందని, ఆత్మపరిశీలన చేసుకునే సమయం సైతం లేదని సొంత పార్టీపై విమర్శలు సంధించడం తెలిసిందే. (చదవండి: కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు) -
కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు మరోసారి పార్టీ అధినాయకత్వంపై విమర్శలు ఎక్కు పెడుతున్నారు. పార్టీకి పునరుత్తేజం రావాలంటే అనుభవంతో కూడిన ఆలోచనలు చేస్తూ, పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించ గల సామర్థ్యంతో పాటు రాజకీయాల్లో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకునే వ్యక్తి అవసరమని మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. పార్టీ అధినాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బీహార్‌తో పాటు గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవి చూసిన విషయం తెలిసిందే. తాము ఆశించిన స్థాయిలో తమ పార్టీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తించడం లేదని కపిల్ సిబల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలివైనదని, ప్రస్తుతం పార్టీ ఏ పరిస్థితుల్లో ఉందో తప్పకుండా గుర్తిస్తుందన్నారు. పార్టీ అధినాయకత్వంపై అసమ్మతి వ్యక్తం చేస్తూ గత ఆగస్టులో లేఖ రాసిన 23 మందిలో కపిల్ సిబల్ కూడా ఉన్నారు. ఈ అంశంపై పార్టీ సీరియస్ అయిన విషయం తెలిసిందే. అయితే తన అభిప్రాయాలు తీసుకోవడానికి ఇప్పటికీ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేయడంలేదని, బహిరంగంగా వ్వక్తపరచకుండా తనను పార్టీ నిర్భందించిందని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా నాయకత్వ మార్పు చేసి దేశ ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలు మనతో కలిసి రావాలనుకోవడం సరైంది కాదని మనమే ప్రజల ప్రజల పక్షాన పోరాటం చేయాలన్నారు. అనుభవం ఉన్నవారిని ప్రోత్సహించాలని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. బిహార్‌తో పాటు ఉప ఎన్నికల్లో ఓటమిని సాధారణ విషయంగానే భావిస్తున్నట్లు ఉందని, ప్రస్తుతం పరిస్థితి అంతా బాగానే ఉన్నట్లు పార్టీ భావిస్తున్నట్లు ఉందేమోనని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పార్టీ అధినాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని పార్టీ ఎంపీ కార్తి చిదంబరం ట్వీట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
లేఖ: యూపీ కాంగ్రెస్ నేతపై చర్యలు!?
న్యూఢిల్లీ: పార్టీలో సంస్కరణలు, నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల తీరుపై అసమ్మతి రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఇప్పటికే లేఖ విషయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీని వెనుక బీజేపీ హస్తం ఉందంటూ సందేహాలు లేవనెత్తారు. ఇక తాజాగా.. లేఖపై సంతకం చేసిన ఉత్తరప్రదేశ్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాదపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక నాయకులు తీర్మానం చేయడం కలకలం రేపింది. గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా వ్యవహరించిన జితిన్ తీరును ఖండిస్తూ ప్రకటన విడుదల చేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.(చదవండి: ‘తల్లిలాంటి వారు.. మనసును బాధపెట్టి ఉంటే క్షమించండి’) ‘‘ఉత్తరప్రదేశ్ నుంచి కేవలం జతిన్ ప్రసాద ఒక్కరే ఆ లేఖపై సంతకం చేశారు. ఆయన కుటుంబ చరిత్రను గమనిస్తే.. వాళ్లు గాంధీ ఫ్యామిలీకి ఎంత వ్యతిరేకులో అర్థమవుతుంది. సోనియా గాంధీకి పోటీగా నిలబడిన ఆయన తండ్రి జితేంద్ర ప్రసాద్ ఈ విషయాన్ని ఎప్పుడో స్పష్టం చేశారు. కానీ సోనియాజీ మాత్రం జితిన్ ప్రసాదకు లోక్‌సభ టికెట్ ఇచ్చి మంత్రిని చేశారు. ఇందుకు ప్రతిగా ఆయన ఏం చేశారో మనం చూస్తూనే ఉన్నాం. క్రమశిక్షణ ఉల్లంఘించినందుకు ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కాంగ్రెస్ కమిటీ తీర్మానం చేసింది. జితిన్ ప్రసాద తీరును తీవ్రంగా ఖండిస్తోంది’’ అని ప్రహ్లాద్ పటేల్ పేరిట ఉన్న ఓ లేఖ మీడియాలో చక్కర్లు కొడుతోంది.(చదవండి: అప్పుడే కాంగ్రెస్ కొత్త సారథి ఎన్నిక!?) ఇక ఈ విషయంపై మరో సీనియర్ నేత, లేఖపై సంతకం చేసిన వారిలో ఒకరైన కపిల్ సిబల్ ఘాటుగా స్పందించారు. ‘‘యూపీ కాంగ్రెస్ జితిన్ ప్రసాదను టార్గెట్ చేయడం దురదృష్టకరం. ఇలా సమయం వృథా చేయడం కంటే బీజేపీ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయడం మంచిది’’అని ట్వీట్ చేశారు. ఇందుకు మరో నేత మనీశ్ తివారి మద్దతూ పలుకుతూ జితిన్‌కు అండగా నిలిచారు. కాగా గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ, మనీశ్ తివారి, జితిన్ ప్రసాద తదితర 23 మంది నాయకులు పార్టీ అధినాయకత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం భేటీ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తాత్కాలిక చీఫ్‌గా సోనియా గాంధీ కొనసాగాలని తీర్మానించింది. వాడివేడి చర్చల అనంతరం అసంతృప్త నేతలపై ఎలాంటి చర్యలు ఉండవని సోనియా స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
పార్టీ కోసమే మా లేఖాస్త్రం
న్యూఢిల్లీ: నాయకత్వ మార్పు కోరుతూ లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లలో పలువురు మంగళవారం పలు వివరణలతో ముందుకు వచ్చారు. పార్టీలో తాము అసమ్మతివాదులం కాదని, పార్టీ పునరుత్తేజాన్ని కోరుకుంటున్న వాళ్లమని స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వాన్ని తాము సవాలు చేయలేదని, అధ్యక్ష పదవిలో సోనియాగాంధీనే కొనసాగాలని కోరుకుంటున్నామని వివరణ ఇచ్చారు. లేఖను ఇప్పుడు తప్పుబడుతున్న వారు త్వరలో ఆ లేఖలో పేర్కొన్న అంశాల ప్రాముఖ్యతను గుర్తిస్తారని మాజీ కేంద్ర మంత్రి ముకుల్ వాస్నిక్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకువెళ్లే స్థితిలో, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే స్థితిలో ప్రస్తుతం పార్టీ లేదన్నది అంగీకరించిన వాస్తవమని సీనియర్ నేత వీరప్ప మొయిలీ పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు, దేశంలో జరగనున్న ఇతర ఎన్నికలకు పార్టీని సమాయత్తపర్చడమే తాము రాసిన లేఖ ప్రధాన ఉద్దేశమన్నారు. ‘ఇది పదవికి సంబంధించిన విషయం కాదు.. దేశానికి సంబంధించిన విషయం. అదే మాకు ముఖ్యం’అని మరో సీనియర్ నేత కపిల్ సిబల్ నర్మగర్భ ట్వీట్ చేశారు. పార్టీకి క్రియాశీల, పూర్తిస్థాయి నాయకత్వం అవసరమంటూ 23 మంది సీనియర్లు పార్టీ చీఫ్ సోనియా గాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో.. ఏఐసీసీ భేటీ జరిగేవరకు పార్టీ అధ్యక్షురాలిగా సోనియానే కొనసాగాలని సోమవారం సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం చేసిన విషయం తెలిసిందే. ‘మిత్రులారా.. మేం అసమ్మతివాదులం కాదు. పార్టీ పునరుత్తేజాన్ని కోరుతున్నవాళ్లం. ఆ లేఖ నాయకత్వాన్ని సవాలు చేస్తూ రాసింది కాదు.. పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ రాసింది. చరిత్ర ధైర్యవంతులనే గుర్తుంచుకుంటుంది. పిరికివారిని కాదు’అని లేఖపై సంతకం చేసిన మరో నేత, ఎంపీ వివేక్ తాన్ఖా ట్వీట్ చేశారు. తాన్ఖా ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. సీనియర్ నేత ఆనంద్ శర్మ మరో ట్వీట్ చేశారు. ‘పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆ లేఖ రాశాం’అని అందులో పేర్కొన్నారు. సీడబ్ల్యూసీ భేటీ ఫలితంతో తాము సంతృప్తి చెందామని పేరు చెప్పడానికి ఇష్టపడని నేత ఒకరు అన్నారు. సోనియా, రాహుల్ నాయకత్వంపై తమకెలాంటి అనుమానాలు లేవని, వారి నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని పేర్కొన్నారు. సోనియా పార్టీకి అమ్మ వంటిది గాంధీ కుటుంబం త్యాగానికి పేరుగాంచిందని వీరప్ప మొయిలీ వ్యాఖ్యానించారు. సోనియా నాయకత్వం పార్టీకి అవసరమని, అధ్యక్షురాలిగా కొనసాగేందుకు ఆమె అంగీకరించడం స్వాగతించదగిన అంశమన్నారు. తమ లేఖతో ఆమెకు బాధ కలిగించి ఉంటే క్షంతవ్యులమన్నారు. పార్టీకి సోనియా అమ్మలాంటి వారని, శ్రేణులకు స్ఫూర్తినిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన తాను.. అన్ని సంక్షోభ సమయాల్లో పార్టీ నాయకత్వం వెంటనే నడిచానని గుర్తు చేశారు. పార్టీ వ్యవస్థీకృత పునరుత్తేజం కోసమే లేఖ రాశామని మొయిలీ స్పష్టం చేశారు. పార్టీ అంతర్గత అవసరాల కోసం రాసిన లేఖ బహిర్గతం కావడం సరికాదని, అందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని కోరారు. లేఖపై సంతకం చేసిన 23 మంది సీనియర్ నేతల్లో ఎవరికీ పార్టీని వీడి వెళ్లే ఆలోచన లేదన్నారు. బీజేపీ వల్ల దేశంలో ప్రజాస్వామ్య మౌలిక విలువలైన లౌకికత్వం, సమానత్వం, బహుళత్వం ప్రమాదంలో పడ్డాయన్నారు. కాగా, సీడబ్ల్యూసీ భేటీ అనంతరం సోమవారం రాత్రి కపిల్ సిబల్, శశి థరూర్, ముకుల్ వాస్నిక్, మనీశ్ తివారీ తదితరులు ఆజాద్ ఇంట్లో సమావేశమవడం గమనార్హం. -
కెమెరాకు అడ్డంగా దొరికిపోయారు..
జైపూర్: న్యాయస్థానాల్లో ఎంతో మర్యాదగా మెలగాలి. ఎంత పెద్ద నాయకుడైనా, సెలబ్రిటీ అయినా సరే కోర్టు వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. అసలు కోర్టు హాల్లో సెల్‌ఫోన్ కూడా మోగకూడదు. అంత క్రమశిక్షణగా ఉండాలి. ఇక లాయర్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ప్రస్తుతం ఓ సీనియర్ న్యాయవాది ప్రవర్తన పట్ల దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కారణం ఏంటంటే ఓ కేసు విచారణ జరుగుతుండగా.. సదరు లాయర్ తాపీగా హుక్కా పీల్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలవ్వడంతో అతడి మీద ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఆ వివరాలు.. రాజస్తాన్ రాజకీయాలకు సంబంధించిన ఓ ముఖ్యమైన కేసును ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం ఆన్లైన్లో విచారణ జరిపింది. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ హుక్కా(సిగరెట్ లాంటి) సేవించారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రాజస్తాన్‌లో బీఎస్పీ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న విషయం తెలిసిందే. దీన్ని సవాలు చేస్తూ కోర్టులో కేసు దాఖలైంది. ఈ రోజు కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది. ఈ సమయంలో సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ హుక్కా పీలుస్తూ కనిపించారు. కాగితాలు అడ్డం పెట్టుకుని మరి ఈ పని హుక్కా పీల్చారు. విచారణలో కాంగ్రెస్ పార్టీ తరఫున కపిల్ సిబాల్ వాదించారు. కాగా అశోక్ గహ్లోత్ సారథ్యంలోని రాజస్తాన్ సర్కార్‌పై యువనేత సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అయితే హైకమాండ్‌తో చర్చల అనంతరం ఆయన తిరిగి సొంతగూటికి చేరారు. చదవండి: పైలట్ తొందరపడ్డారా!? There is no smoke without fire: #Rajasthan High Court hearing on disqualification of the 6 BSP MLAs who later merged with #Congress. That's Sr Adv Rajeev Dhavan, using a hookah. He is also the lawyer for adv Prashant Bhushan in the latter's contempt case. pic.twitter.com/iF0FmeUuaV — Utkarsh Anand (@utkarsh_aanand) August 12, 2020 -
సొంత గూటికి వచ్చే ఆలోచన ఉందా..లేదా?
జైపూర్: రాజస్తాన్ రాజకీయాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ ఏదో ఒక వ్యాఖ్య చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన మరోసారి తిరుగుబాటు నేత సచిన్ పైలట్‌ని ఎద్దేవా చేస్తూ ఓ ట్వీట్ చేశారు. బీజేపీలో చేరబోవడం లేదంటూ పైలట్ చేసిన ప్రకటనపై కపిల్ సిబాల్ స్పందిస్తూ.. ‘ప్రత్యర్థులు నా ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి (పైలట్ బీజేపీలో చేరతారంటూ) ప్రచారం చేస్తున్నారు అన్నావ్.. బీజేపీలో చేరడం లేదు అన్నావ్ కానీ హరియాణా మనేసర్‌లోని ఓ హోటల్లో శాసనసభ్యులతో కలిసి సెలవులు ఎంజాయ్ చేస్తున్నట్లున్నావ్.. అది కూడా బీజేపీ కనుసన్నల్లో.. మరి సొంత గూటికి తిరిగి వచ్చే ఆలోచన ఉందా లేదా’ అంటూ కపిల్ సిబాల్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. (‘అందంగా ఉంటే సరిపోదు’) False rumours spread to malign Pilot : “ I am not joining BJP “ I guess then legislators at a hotel in Manesar is merely a vacation in Haryana’s comfort zone under BJP’s watchful eye What about “ ghar wapsi “? — Kapil Sibal (@KapilSibal) July 16, 2020 పైలట్, అతని అనుచరులు హరియాణాలోని మనేసర్‌లో ఓ హోటల్లో బస చేస్తున్నారనే వార్తలు వచ్చిన తర్వాత కపిల్ సిబాల్ ఈ ట్వీట్ చేశారు. హరియాణాలో బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. పైలట్ తన అనుచరులతో హరియాణాలో మకాం పెట్టడంతో.. బీజేపీ అండతోనే సచిన్.. పార్టీకి ఎదురు తిరిగాడని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. బీజేపీ తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తుందని అశోక్ గహ్లోత్ పేర్కొన్న తర్వాత రాష్ట్రంలో ఈ సంక్షోభం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గహ్లోత్ ప్రభుత్వం పైలట్‌తో సహా మరికొందరికి నోటీసులు జారీ చేసింది. అయితే పైలట్ శిబిరం ఈ నోటీసులను జోక్‌గా వర్ణించింది. ఆ తర్వాత పైలట్ తన అనుచరులతో రాజస్తాన్ నుంచి వెళ్లిపోయి.. గహ్లోత్ ప్రభుత్వం మైనార్టీలో ఉందని పేర్కొన్నాడు. -
గుర్రాలు తెంచుకున్నాకే మనం మేల్కొంటామా!
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితిపై కాంగ్రెస్ అదిష్టానం తన మౌనాన్ని వీడి అసమ్మతిని అంగీకరించింది. అశోక్ గెహ్లోత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది. రాజస్థాన్‌లో పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నా అదిష్టానం స్పందికపోవడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్లో.. 'కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరిపై ఆందోళన చెందుతున్నాను. కట్టేసిన కొయ్యల నుంచి గుర్రాలు తెంచుకున్న తర్వాత మాత్రమే మనం మేల్కొంటామా' అంటూ రాజస్తాన్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభంపై ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ ట్వీట్‌పై స్పందించిన కాంగ్రెస్ నాయకుడు వివేక్ టాంకా ఇలాంటి ఆందోళనల వల్ల పార్టీ బలహీనపడుతుందని అంగీకరించారు. మరో కాంగ్రెస్ లీడర్ ఆల్కా లాంబా 'ఇలాంటి సమయంలో సహనమే విజయానికి కీలకం' అని పేర్కొన్నారు. చదవండి: రాజస్ధాన్ సంక్షోభం : కాంగ్రెస్ సర్కార్‌కు షాక్! -
కేంద్రానికి కాంగ్రెస్ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: లాక్డౌన్ విషయంలో కేంద్రం మరోసారి ఆలోచించాలని కాంగ్రెస్‌నేత కపిల్ సిబల్ సూచించారు. విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కరోనావైరస్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి జాతీయ ప్రణాళికను రూపొందించాలని కాంగ్రెస్ పార్టీ శనివారం కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... లాక్డౌన్ విధానంపై ప్రభుత్వం పునరాలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. దేశంలో ఒక వైపు ప్రజలను లాక్డౌన్ చేయడం, మరోవైపు ఆర్థిక వ్యవస్థను లాక్అవుట్ చేయడం ఉండకూడన్నారు. (తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాం) లాక్డౌన్ విధించే ముందు కేంద్రం రాష్ట్రాలతో ఎందుకు సంప్రదింపులు జరుపలేదు అని కపిల్ ప్రశ్నించారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు రోడ్ల మీద ఉన్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. తమ పార్టీ మంచి సలహాలనే ఇస్తోందని, కరోనా విపత్కర పరిస్థితుల్లో తాము ప్రభుత్వంతోనే ఉన్నామని కపిల్ స్పష్టం చేశారు. అదేవిధంగా ఇటువంటి సంక్షోభ సమయంలో జస్టిస్ డెలివరీ వ్యవస్థను తప్పనిసరి సేవగా చేస్తూ ఒక విధానాన్ని రూపొందించాలని ఆయన న్యాయవ్యవస్థకు పిలుపునిచ్చారు. ఇక దీంతో పాటు లాక్డౌన్ సమయంలో గ్రౌండ్ రియాలిటీల గురించి ఎటువంటి అవగాహన లేని అధికారులు ప్రభుత్వ పాలసీలను రూపొందిస్తున్నారని కపిల్ సిబల్ ఆరోపించారు. ఇదిలా ఉండగా వచ్చేవారంతో లాక్డౌన్ ముగుస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సోమవారం సమావేశం కానున్నారు. (‘ఆ నూనెతో కరోనా చనిపోతుంది’) -
భాషన్ కాదు రేషన్ ఇవ్వండి : కపిల్ సిబాల్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్‌సిబాల్ కేంద్రంపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. వలస కార్మికులు సరిహద్దు ప్రాంతాల్లో అల్లాడిపోతున్నారని , వారిపట్ల లాఠీచార్జ్ చేయడం సరైంది కాదన్నారు. ఎక్కడివారు అక్కడే ఉండాలంటూ బాషన్ (సుధీర్ఘ ప్రసంగాలు )ఇచ్చే బదులు వారికి అవసరమైన రేషన్, డబ్బు సహాయం అందించి ఈ కష్టకాలంలో వారికి తోడ్పాడునందించాలని అన్నారు. లాక్డౌన్ కారణంగా ఎక్కడివారు అక్కడే ఉండాలన్న ప్రభుత్వ సూచనను పాటిస్తున్నప్పుడు, ప్రజల బాగోగులు చూసే బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందన్నారు. ఇక 21 రోజుల లాక్డౌన్ కాస్తా మే3 వరకు ప్రకటించడంతో ముంబైలోని వలసకార్మికులు తమను స్వస్థలాలకు పంపాలంటూ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేయగా, పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ కష్టకాలంలో వలస కార్మికులు, నిరుపేదలకు ఆహారం అందించేందుకు తమ వంతు కృషిచేస్తున్న వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థలను కపిల్ సిబాల్ అభినందించారు. COVID 19 We salute who feed : Migrants and the poor Gurdwaras Mandirs NGO’s with community support Our people ready to support government Government must also be ready to support people Not by lathi charges Not by “ bhashans “ But by “ rations “ and Cash for survival — Kapil Sibal (@KapilSibal) April 16, 2020 గత 24 గంటల్లో 941 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,380కు చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. వీరిలో 10,477 ఆక్టివ్ కేసులుండగా, 1,489 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లోనే కరోనా కారణంగా 37 మంది మృత్యువాత పడ్డారు.దీంతో కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన వారి సంఖ్య 414కు చేరింది. -
‘ట్రంప్ బెదిరించారు.. మీరు ఇచ్చేశారు’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ మెతక వైఖరి వల్లే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ట్రంప్ బెదిరింపులకు లొంగి హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రల ఎగుమతిపై నిషేధాన్ని పాక్షికంగా సడలించిందని ఆరోపించింది. ‘మోదీజీ, చైనీస్ చొరబాట్లపై యూపీఏ మీ సలహాను గుర్తుంచుకుంటుంది. మీరు వారి కళల్లో చూడండి అన్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ కళ్లలో చూడాల్సిన సమయం వచ్చింది. కానీ ఆయన బెదిరించారు. మీరు అనుమతి ఇచ్చేశారు. 56 అంగుళాల ఛాతీ ఎక్కడ ఉంది?’ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. కరోనా నివారణలో సమర్థవంతంగా పనిచేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మాత్రలను భారత్ తమకు ఇవ్వకపోతే వాణిజ్యపరంగా ప్రతీకారం తప్పదని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ బెదిరింపులను కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, శశిథరూర్, జైవీర్ షెర్గిల్ ఖండించారు. తన రాజకీయ జీవివంతో ఒక దేశాధినేత లేదా ప్రభుత్వం ఇలాంటి బెదిరింపులకు దిగడం ఎప్పుడూ చూడలేదని శశిథరూర్ పేర్కొన్నారు. భారత్ తనకు ఇష్టమైనప్పుడే హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రలను అమెరికాకు ఎగుమతి చేస్తుందని స్పష్టం చేశారు. ప్రాణాలను రక్షించే మందులు మొదట భారతీయులకు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉంచాలని, తర్వాతే మిగతా దేశాలకు సరఫరా చేయాలని రాహుల్ గాంధీ అన్నారు. (అలా అయితే భారత్‌పై ప్రతీకారమే: ట్రంప్) -
రాజధర్మంపై ఆగని రగడ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ హయాంలో రాజధర్మాన్ని పాటించామని అన్ని వర్గాల ప్రజలను రక్షించామని ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చుకు కారణమయ్యాయి. కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు రాజధర్మం వ్యాఖ్యలపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ శనివారం కౌంటర్ ఇచ్చారు. గుజరాత్ విషయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పాయ్ మాటలనే మీరు పెడచెవిన పెట్టారు. ఇక.. మా మాటలను ఎందుకు వింటారు అంటూ కపిల్ సిబాల్ ఎద్దేవా చేశారు. వినడం, నేర్చుకోవడం, ఆచరించడం రాజధర్మంలో భాగమని.. ఇవేవీ కేంద్ర ప్రభుత్వం అనుసరించడం లేదని కపిల్ సిబాల్ విమర్శించారు. చదవండి: ఢిల్లీ అల్లర్లు : కాంగ్రెస్ నిజ నిర్ధారణ కమిటీ అయితే.. గురువారం రోజున ఈశాన్య ఢిల్లీలో మతపరమైన అల్లర్లను అదుపుచేయడంలోనూ, తన విధులను నిర్వర్తించడంలోనూ విఫలమైన కేంద్ర హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోనియా నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు రాష్ట్రపతి కోవింద్‌కు ఓ వినతిపత్రం అందజేశారు. తమ ప్రభుత్వ హయాంలో రాజధర్మాన్ని పాటించామని, దేశంలోని అన్ని వర్గాల ప్రజల విశ్వాసాలను గౌరవించి వారిని రక్షించామని గుర్తుచేశారు. దీనిపై కేంద్ర మంత్రి రవిశంకర్ స్పందిస్తూ.. సోనియా గాంధీ, దయచేసి రాజధర్మం గురించి మాకు బోధించొద్దు. మీ చరిత్ర అంతా తప్పులతడక అని అన్నారు. కాంగ్రెస్ ఏదైనా చేస్తే అది మంచిది. అదే మేంచేస్తే ప్రజలను రెచ్చగొడతారు.ఇది ఎలాంటి రాజధర్మం? అని ప్రశ్నించిన విషయం తెలిసిందే. Law Minister to Congress : “ Please don’t preach us Rajdharma “ How can we Mr. Minister ? When you did not listen to Vajpayeeji in Gujarat why would you listen to us ! Listening , learning and obeying Rajdharma not one of your Government’s strong points ! — Kapil Sibal (@KapilSibal) February 29, 2020 -
‘ఎయిర్ ఇండియా విక్రయంపై కోర్టుకెళ్తా’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ప్రభుత్వ రంగ ఎయిర్‌లైనర్ ఎయిర్ ఇండియా విక్రయంపై విపక్షాలకు తోడు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సైతం మోదీ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఎయిర్ ఇండియాలో నూరు శాతం వాటా విక్రయానికి పూనుకుంటే తాను న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తానని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి హెచ్చరించారు. ఎయిర్ ఇండియా అమ్మకం ప్రక్రియపై స్వామి స్పందిస్తూ ఇది జాతి వ్యతిరేక నిర్ణయమని ట్వీట్ చేశారు. మరోవైపు ఈ నిర్ణయంపై విపక్ష కాంగ్రెస్ మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. (ఎయిర్ ఇండియా దక్కేది వీరికే..?) ‘ప్రభుత్వం వద్ద డబ్బు లేకుంటేనే ఇలాంటివి చేస్తుంటారు..భారత ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవ్..వృద్ధి 5 శాతానికి దిగజారింది. జాతీయ ఉపాథి హామీ పథకం కింద రూ కోట్లు బకాయిలు పేరుకుపోయాయి..ఇలాంటి పరిస్ధితుల్లో ఉన్న ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టా’రని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. కాగా నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ఇండియా అమ్మకానికి సంబంధించి ప్రభుత్వం సోమవారం ప్రిలిమనరీ బిడ్లను ఆహ్వానించింది. మార్చి 17లోగా ఆసక్తి వ్యక్తీకరణను తెలపాలని ఈ ప్రకటనలో ప్రభుత్వం బిడ్డర్లను కోరింది. చదవండి : 'కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి బొమ్మ ముద్రిస్తే మేలు' -
సుప్రీంకోర్టు చెప్తే.. రాష్ట్రాలు వ్యతిరేకించడం అసాధ్యం
తిరువనంతపురం: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేరళ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ కేరళలోని కొజికోడ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్ఆర్సీకి రాష్ట్రాలు సహకరించేది లేదని చెబుతున్నాయంటే కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర అధికారులు సహకరించరని చెప్పడమేనని ఇది అంత సులువు కాదని ఆయన అన్నారు. చదవండి: అహంకారం.. అనిశ్చితి.. డోలాయమానం! రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అనుసరించాల్సిందేనని.. కాదని చెప్పడం సాధ్యమయ్యే పని కాదని ఆయన పేర్కొన్నారు. సీఏఏ అనేది జాతీయ అంశమని.. దీన్ని జాతీయ స్థాయిలోనే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సిబాల్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోణంలో దీన్ని చూడరాదని కాంగ్రెస్ నేతృత్వంలో అన్ని పార్టీలు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. సీఏఏ అనేది రాజ్యాంగ విరుద్ధమని ఈ ఉదయం ఆయన మరో ట్వీట్ చేశారు. సీఏఏను విరమించుకోవాలంటూ తీర్మానం చేసే రాజ్యాంగబద్దమైన హక్కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఉంటుందని చెప్పారు. అయితే సీఏఏ రాజ్యాంగబద్దమైనదేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం దాన్ని వ్యతిరేకించడం అసాధ్యమవుతుందని సిబాల్ పేర్కొన్నారు. I believe the CAA is unconstitutional Every State Assembly has the constitutional right to pass a resolution and seek it’s withdrawal When and if the law is declared to be constitutional by the Supreme Court then it will be problematic to oppose it The fight must go on ! — Kapil Sibal (@KapilSibal) January 19, 2020 -
చిదంబరానికి ఇంటి భోజనం నో
న్యూఢిల్లీ: ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో తీహార్ జైలులో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిదంబరానికి ప్రత్యేక ఆహారం ఇవ్వడం కుదరదనీ, జైలులో అందరికీ ఒకే రకమైన ఆహారం ఉంటుందనీ హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం బెయిల్ పిటిషన్ విచారణలో చిదంబరంకి ఇంటి నుంచి తెప్పించిన ఆహారాన్ని జైలులో అనుమతించాల్సిందిగా ఆయన తరఫున కపిలి సిబాల్ కోర్టుని కోరడంతో జస్టిస్ సురేష్ కుమార్ కైత్ ‘‘జైలు లో అందరికీ ఒకే రకమైన ఆహారం అందుబాటులో ఉంటుంది’’అని తేల్చి చెప్పారు. అయితే తన క్లయింట్ 74 ఏళ్ళ వయస్సువారనీ, అందుకే ఇంటిభోజనాన్ని అనుమతించాలనీ సిబల్ వాదించగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కలుగజేసుకుంటూ ‘‘ఓమ్‌ప్రకాష్ చౌతాలా ఇంకా ఎక్కువ(84 ఏళ్ళు) వయస్సువారు, రాజకీయ ఖైదీ కూడా అయినప్పటికీ ఆయనకు జైలులో సాధారణ భోజనమే అందుతోంది. రాజ్యం ఎవ్వరి పట్లా భేదం పాటించదు’’ అని వ్యాఖ్యానించారు. -
‘లోక్‌సభ స్పీకర్‌గా ఉన్నారని గౌరవిస్తున్నాం’
న్యూఢిల్లీ: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ ఘాటుగా స్పందించారు. రాజస్తాన్‌లోని కోటాలో జరిగిన బ్రాహ్మణ సామాజిక వర్గ ఐక్యత సమావేశానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరైన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మనమంతా (బ్రాహ్మణ) ఐక్యంగా ఉండాలి. అప్పుడే ఉన్నత స్థాయిలోకి చేరుకుంటాం. ప్రస్తుతం దేశంలో మనమే అందరికన్నా ముందున్నాం. సమాజాన్ని శాసించే స్థాయికి చేరుకోవాలి’ అంటూ వ్యాఖ్యానించిన సంగతి విధితమే. ఈ వ్యాఖ్యలపై కపిల్ సిబాల్ ‘పుట్టుకలోనే బ్రాహ్మణులకు గౌరవం ఉంటుంది. కానీ మీరు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వారని గౌరవం ఇవ్వడం లేదు. దేశంలోనే గౌరవప్రదమైన లోక్‌సభకు స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారని గౌరవం ఇస్తున్నామని’ ట్విటర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. బ్రాహ్మణ కులంలో పుడితే మాత్రమే భారతదేశాన్ని గొప్పగా తీర్చిదిద్దగలమని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఓం బిర్లా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఓం బిర్లా ఈ ఏడాది జూన్‌లో లోక్‌సభ స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజస్థాన్ నుంచి 2003, 2008, 2013 వరుసగా మూడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. -
అహంకారం.. అనిశ్చితి.. డోలాయమానం!
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్న ఎన్డీయే ప్రభుత్వ పాలనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. అహంకారం, రాజకీయ ప్రచారం, అనిశ్చితి, ఆందోళన, డోలాయమానంగా బీజేపీ పాలన సాగిందంటూ ఆరోపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్లమెంట్ గత బడ్జెట్ సమావేశాల్లో 39 బిల్లులను ప్రవేశపెట్టి 28 బిల్లులను ఆమోదించుకున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఏ ఒక్క బిల్లును కూడా పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీకి గానీ, స్టాండింగ్ కమిటీకిగానీ పంపలేదన్నారు. గత వంద రోజుల్లో ప్రతిపక్ష నేతలే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పిందని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు బీజేపీ నేతలు తప్పించుకొనేలా మార్గ్గం సుగమం చేస్తున్నాయని ఆరోపించారు. జమ్మూకశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి రద్దు, అస్సాంలో ఎన్ఆర్సీతో దేశంలో అనిశ్చితి సృష్టించిందన్నారు. ఆటోమొబైల్ రంగం తిరోగమనంలో ఉందని, 3.50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. తయారీ, నిర్మాణ రంగాల్లో వృద్ధి తగ్గి, చేనేత, బంగారం ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని పేర్కొన్నారు. -
చిదంబరానికి స్వల్ప ఊరట
సాక్షి, న్యూఢిల్లీ : ఐఎన్ఎక్స్ మీడియా మనీల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వయసు రీత్యా తీహార్ జైలుకు పంపవద్దన్న ఆయన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. చిదంబరం తరపున వాదనలు వినిపించిన కపిల్ సిబల్ ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బెయిల్ మంజూరు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో గృహ నిర్భంధానికైనా ఆదేశించాలన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం ఈ విషయాన్ని ట్రయల్ కోర్టులో ప్రస్తావించాలని సూచించింది. సిబల్ విజ్ఞప్తిని అంగీకరించిన కోర్టు చిదంబరాన్ని జైలుకు పంపొద్దని, బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలో మరో మూడు రోజులు కస్టడీని కొనసాగించాలని ఆదేశించింది. విదేశీ పెట్టుబడులను ఐఎన్ఎక్స్ మీడియాలోకి తరలించారనే ఆరోపణలతో చిదంబరాన్ని అరెస్టు చేసిన విషయం విదితమే. ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఐఎన్ఎక్స్ మీడియా స్థాపకులు పీటర్ ముఖర్జీ, ఇంద్రాణి ముఖర్జీలు తన కూతురు షీనా బోరా హత్యకేసులో నిందితులుగా జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. -
క్రికెటర్‌గా అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ (66) మృతి పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మృతికి సంతాపం తెలుపుతూ.. ఆయనకు సంబంధించిన ఓ అరుదైన ఫోటోను ట్వీట్ చేశారు కపిల్ సిబల్. ‘క్రికెట్లో మేమిద్దరం’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ఫోటోతో పాటు.. ‘అరుణ్ జైట్లీ మరణించారనే వార్త నన్ను తీవ్రంగా కలిచి వేసింది. నా పాత స్నేహితుడు.. ప్రియమైన సహోద్యోగి. రాజకీయాల్లో గానీ, దేశ ఆర్థిక రంగానికి ఆయన చేసిన సేవలు కలకాలం నిలిచి ఉంటాయి. అరుణ్ జైట్లీ పార్టీలకతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. తన స్నేహితుల కోసం, పార్టీ కోసం స్థిరంగా నిలబడ్డారు’ అంటూ కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. Very sorry to learn that Arun Jaitley is no more . An old friend and a dear colleague will be remembered for his seminal contributions to the polity and as FM of India . As Leader of Opposition he was without match . He always stood steadfastly for his friends and for his party . — Kapil Sibal (@KapilSibal) August 24, 2019 అంతేకాక అరుణ్ జైట్లీతో కలిసి గ్రౌండ్లో క్రికెట్ ఆడిన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు కపిల్ సిబల్. ఈ సందర్భంగా అరుణ్ జైట్లీతో కలిసి దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. అరుణ్ జైట్లీ క్రికెట్‌కు వీరాభిమాని అనే సంగతి అందరికి తెలిసిందే. ఓ దశాబ్దం పాటు ఆయన ఢిల్లీ, డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డీడీసీఏ)కు అధికారిగా ఉన్నారు. ఆ సమయంలో క్రీడాకారులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జైట్లీ తీవ్రంగా కృషి చేశారు. అయితే క్రికెట్ నిర్వహకుడిగా అరుణ్ జైట్లీ కొన్ని వివాదాల్లో కూడా చిక్కుకున్నారు. -
‘నేడు నిజంగానే కశ్మీర్‌ను కోల్పోయాం’
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కృషి వల్ల కశ్మీర్‌ను సంపాదించుకోగలిగాం. కానీ నేడు దాన్ని శాశ్వతంగా కోల్పోయాం అన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం చర్యతో నేడు నిజంగానే కశ్మీర్‌ను కోల్పోయామన్నారు కపిల్ సిబల్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ ఉండటంతో బిల్లు పాస్ అయ్యింది. కానీ బిల్లుపై బీజేపీ.. విపక్షాలతో, కశ్మీర్ నాయకులతో చర్చించలేదు. కనీసం మాకు సమాచారం కూడా ఇవ్వలేదు. సభలో కూడా బిల్లు గురించి చర్చించడానికి తగిన సమయం ఇవ్వలేదు. ఈ రోజు ఉదయం 11 గంటల ప్రాంతంలో బిల్లుకు సంబంధించిన చర్చ ప్రారంభించారు. కానీ చర్చకు సిద్ధం కావడానికి ప్రతిపక్షాలకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. సంఖ్యా బలం మూలంగానే బీజేపీ ఇలా చేసింది’ అన్నారు కపిల్ సిబల్. అంతేకాక ఈ నిర్ణయం చారిత్రాత్మకమో, కాదో కాలమే నిర్ణయిస్తుందన్నారు కపిల్ సిబల్. చరిత్రలో ఏం జరిగింది.. చట్టంలో ఏం ఉందో మాట్లాడటానికి మనం ఇక్కడ లేమన్నారు కపిల్ సిబల్. ప్రజాస్వామిక దేశంలో మన పాత్ర ఏంటనే అంశాల గురించి ఈ రోజు మనం పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు కపిల్ సిబల్. -
‘ఇప్పుడు ఓడినా మళ్లీ గెలుస్తాం’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరంలో ఓటమిపాలైన కాంగ్రెస్ నేతలకు ఉచిత సలహాలు ఇస్తున్న వారిపై ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ మండిపడ్డారు. అవన్నీ తాము గతంలో గెలిచిన స్ధానాలేనని..తమ వారసులు భవిష్యత్‌లో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ ఓటమిపై సంబరాలు చేసుకోవద్దని..కసితో తమ పోరాటం కొనసాగిస్తామని..ఈ క్రమంలో తాము విజయవంతం కాకుంటే భవిష్యత్‌లో విజయాలకు బాటలు వేస్తామని కపిల్ సిబల్ ట్వీట్ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించి సొంతంగా 303 స్ధానాలను గెలుపొందిన సంగతి తెలిసిందే. విపక్ష కాంగ్రెస్ కేవలం 52 స్ధానాలకే పరిమితమైంది. -
ఈవీఎంలను హ్యాక్ చేయలేం!
సాక్షి, హైదరాబాద్: ఈవీఎంలను హ్యాకింగ్/ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని ఐటీ నిపుణుడు సందీప్ రెడ్డి స్పష్టం చేశారు. కొందరు కావాలనే పనికట్టుకుని ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎం)ను డీ–కోడ్ చేయడం కష్టతరమని, వీటిలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్‌ను ఇన్స్టాల్ చేయలేరని సందీప్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల సంఘం వివిధ దశల్లో ఈవీఎంల సెక్యూరిటీని పరిశీలించిన తర్వాతే వినియోగిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ‘కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు ముఖ్యమైన వ్యక్తులు.. అభద్రతాభావంతో ఈవీఎంలపై దుష్ప్రచారం చేస్తున్నారు. నేనో ఎంబేడెడ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా క్రిప్టాలజీ, ఎన్క్రిప్టింగ్ మీద 15ఏళ్లుగా పనిచేస్తున్నాను. నా అనుభవం ద్వారా తెలుసుకున్న వాస్తవాలను యావదాంధ్ర రాష్ట్ర ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దలు ఆరోపణలు చేస్తున్నట్లుగా ఓ ఈవీఎంను ట్యాంపర్ చేయాలంటే దానికి హార్డ్‌వేర్, కమ్యూనికేషన్ రేడియోస్, సపోర్టింగ్ సాఫ్ట్వేర్ కీలకం. ఒకవేళ ఈవీఎంని నెట్వర్క్ వీడియోస్‌తో అనుసంధానం చేయాలంటే చాలా ఖరీదైన పని. ఈవీఎంలలో ఎలాంటి డివైజ్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయలేరు. ఒకసారి ఫర్మ్‌వేర్ కంపైల్ చేసిన తర్వాత ఈవీఎంపైన ఫ్లాష్చేస్తే.. రెండోసారి రీ–ఫ్లాష్చేసే అవకాశం ఉండదు. అదే విధంగా బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్ యూనిట్ మధ్య జరిగే కమ్యూనికేషన్ ప్రొపరేటరీ సెక్యూర్ ప్రొటోకాల్ ద్వారానే జరుగుతుంది. ఏజెంట్ సమక్షంలో సమక్షంలో బ్యాటరీ స్విచాఫ్ చేస్తారు. దీంతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా కట్ అయిపోతుంది. దీంతో అటోమెటిక్‌గా ఈవీఎంలో మెమరీ అలాగే ఉన్నప్పటికీ.. బయటి వారు యాక్సెస్ చేసేందుకు వీలుండదు. ఈవీఎంలను హ్యాక్ చేయాలని ప్రయత్నించి చాలా మంది విఫలమయ్యారు’అని సందీప్ రెడ్డి వెల్లడించారు. మన ఈవీఎంలను చాలా దేశాల్లో వినియోగిస్తున్నారని.. కానీ కావాలనే కొందరు మన దేశంలో దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇలాంటి వారిపై కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఓ హ్యాకర్ ఈవీఎంలను హ్యాక్ చేస్తానంటూ సవాల్ విసిరి భంగపడ్డారని సందీప్ తెలిపారు. ఈ ఏడాది కూడా సయ్యద్ షుజా అనే వ్యక్తి యూకే నుంచి ఈవీఎంలను హాక్ చేస్తానని, గతంలో తాను ఈసీఐఎల్‌లో పనిచేస్తున్న సమయంలో హ్యాకింగ్ చేశానని చెప్పుకున్నారు. దీంతో మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబల్, మరికొందరు మీడియా, రాజకీయ ప్రముఖులు లండన్ వెళ్లొచ్చారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అవాస్తవమని వారు తెలుసుకున్న విషయాన్ని కూడా సందీప్ రెడ్డి గుర్తుచేశారు. వీవీప్యాట్‌కు, బ్యాలెట్ యూనిట్‌కు మధ్య మార్పు జరిగే సమయంలో ట్యాంపర్ (మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్) జరుగుతుందంటూ కొందరు చేస్తున్న వాదన అర్థరహితం అన్నారు. ఏపీ ఎన్నికల సమయంలో 36 చోట్ల ఈవీఎంలు మోరాయించాయని.. అది కూడా ఆపరేటర్ అసమర్థత ద్వారానే జరిగిందన్నారు. ఇందులో ఈవీఎంల తప్పిదమేమీ లేదన్నారు. -
40 శాతం కమీషన్‌కు పాత నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ/తిరువనంతపురం: నోట్లరద్దు అనంతరం ఓ బీజేపీ నేత 40 శాతం కమీషన్ తీసుకుని పాత నోట్లు మార్చారని ఆరోపిస్తూ అందుకు సాక్ష్యంగా ఓ వీడియోను పలు ఇతర విపక్షాలతో కలిసి కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసింది. 30 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో అహ్మదాబాద్‌లో చిత్రీకరించినదనీ, కొందరు జర్నలిస్టులు ఈ వీడియో తీశారని పేర్కొంది. టీడీపీ, ఎన్సీ, ఆర్జేడీ, లోక్తాంత్రిక్ జనతా దళ్ తదితర పార్టీల నేతలతో కలిసి కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఈ వీడియోను విడుదల చేశారు. అయితే ఆ వీడియో నిజమైనదే అనడానికి, అందులోని వ్యక్తి బీజేపీ మనిషేననడానికి కాంగ్రెస్ ఎలాంటి ఆధారాలనూ చూపలేదు. మరోవైపు ఆ వీడియో నకిలీదనీ, పార్టీ పరిస్థితి దిగజారి నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ ఇలా రోజుకో నకిలీ సమాచారంతో ప్రజలను మోసగించాలని చూస్తోందని బీజేపీ ఎదురుదాడి చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ నకిలీ పనులు మరీ విపరీతంగా నవ్వు తెప్పించేలా ఉంటున్నాయని అన్నారు. -
చాయ్‌వాలాలను మర్చిపోతున్నారు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ చౌకీదార్లను గుర్తు చేసుకుంటూ తన తోటి చాయ్‌వాలాలను మర్చిపోతున్నారని, తదుపరి రాజకీయ ప్రయోజనాల కోసం మరొకరిని గుర్తు చేసుకుంటూ చౌకీదార్లను మర్చిపోతారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ఎద్దేవా చేశారు. ప్రధాని ‘మై భీ చౌకీదార్’ ప్రచారానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘చౌకీదార్ చోర్ హై’ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోందని ఆయన చెప్పారు. ‘గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్, ఉరి, బారాముల్లా, పుల్వామాల్లో ఉగ్రదాడులు జరిగినప్పుడు చౌకీదార్ (మోదీ) ఏం చేస్తున్నారు. నిద్రపోతున్నారా? అప్పుడు ‘మై భీ చౌకీదార్’ నినాదం ఏమైంది?’ అని కపిల్ సిబల్ పీటీఐకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అన్నారు. బాలాకోట్‌లో జరిపిన వైమానిక దాడులను మోదీ రాజకీయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ‘బీజేపీ బహిరంగ ప్రకటనలు చేయడం ద్వారా వైమానిక దాడులను రాజకీయం చేయడంలో ముందే ఉంటుంది. ప్రధాని ప్రసంగాలు ఇచ్చే సమయంలో వెనుక అమర వీరుల ఫొటోలుంటాయి. పదే పదే తన ప్రసంగాల్లో వైమానిక దాడులను ప్రస్తావిస్తూ ప్రజల్లో కూడా అదే భావన ఉందంటున్నారు’ అని సిబల్ విమర్శించారు. వ్యవసాయ సంక్షోభం, విద్య, ఆరోగ్యం, ఆకలి వంటి సగటు మనిషి జీవితానికి సంబంధించిన విషయాల్లో బీజేపీ ప్రభుత్వానికి కనీస ఆందోళన లేదని ఆరోపించారు. అలాగే నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ వంటి వారు దేశం విడిచి పారిపోయి నప్పుడు చౌకీదార్ ఉద్యమం ఏమైందని ఎద్దేవా చేశారు. ‘బాలాకోట్‌పై వైమానిక దాడులు చేయడం తప్పేమీ కాదు దాన్ని మేము స్వాగతిస్తున్నాం. అయితే దాన్ని రాజకీయం చేయడమే సరికాదు’ అని అన్నారు. -
వ్యవస్థలను అవమానించారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధికారంలో ఉండగా పార్లమెంటు, న్యాయ వ్యవస్థ, మీడియా, సైన్యం ఇలా ఏ ఒక్కదాన్నీ వదలకుండా అన్ని వ్యవస్థలనూ ఆ పార్టీ అవమానించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో బాగా ఆలోచించి ఓటేయాలని ప్రజలను ఆయన బుధవారం కోరారు. కాంగ్రెస్ తర్వాత వచ్చిన తమ ప్రభుత్వం పరిస్థితులను మార్చేసిందని మోదీ ఓ బ్లాగ్‌పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ‘మీరు ఓటేయడానికి వెళ్లినప్పుడు గతాన్ని గుర్తు తెచ్చుకోండి. అధికారం చేపట్టాలన్న ఒక్క కుటుంబం ఆరాటం దేశానికి ఎంత నష్టం కలిగించిందో మనసులో పెట్టుకుని ఓటేయండి. ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ అలాగే చేస్తారు’ అని మోదీ అన్నారు. ‘ప్రెస్ నుంచి పార్లమెంటు వరకు, సైనికుల నుంచి వాక్ స్వేచ్ఛ వరకు, రాజ్యాంగం నుంచి కోర్టుల వరకు, వ్యవస్థలను అవమానించడమే కాంగ్రెస్ నైజం. అందరూ తప్పు, కాంగ్రెస్ మాత్రమే ఒప్పు అనేది వారు నమ్మే సిద్ధాంతం’ అంటూ మోదీ కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. వంశపారం పర్యంగా పాలన సాగించే పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పార్లమెంటు సమావేశాలు సరిగ్గా జరిగేవి కాదనీ, అదే వారసత్వ రాజకీయాలు చేయని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు పని ఎక్కువ జరిగిందనడానికి గణాంకాలే నిదర్శనమని మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన తొట్టతొలి రాజ్యాంగ సవరణ వాక్స్వాతంత్య్రాన్ని హరించేందుకు ఉద్దేశించినదనీ, స్వేచ్ఛగా పనిచేసే మీడియా ఉండటం వారసత్వ పార్టీలకు నచ్చలేదని ఆరోపించారు. బీజేపీవీ వారసత్వ రాజకీయాలే: కాంగ్రెస్ వారసత్వాల గురించి మాట్లాడటం, కాంగ్రెస్‌ను దూషించడం తగ్గించి మోదీ అసలైన ప్రజా సమస్యలపై ప్రసంగాలు చేస్తే మంచిదని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అన్నారు. ‘ ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబం ఆరెస్సెస్. ఆరెస్సెస్ ఓ కుటుంబమైనప్పుడు, ఆ కుటుంబంలోని వారికే పదవులు దక్కుతున్నప్పుడు వారివి వారసత్వ రాజకీయాలు కావా? అని ప్రశ్నించారు. వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగిత ఇలా ఎన్నో సమస్యలు దేశాన్ని పీడిస్తున్నాయనీ, మోదీ వాటి గురించి ఏ సభలోనూ ప్రస్తావించకుండా కేవలం కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ ఆరోపణలు చేస్తారని దుయ్యబట్టారు. కాపలాదారుడు దేశభక్తుడితో సమానం గతంలో మోదీ చాలా సార్లు తనను తాను దేశానికి కాపలాదారుడినని (చౌకీదార్) చెప్పుకోవడం, అనంతరం రఫేల్ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ‘కాపలాదారుడే దొంగ’ అని ప్రచారం చేయడం తెల్సిందే. అలా ప్రచారం చేసి కాపలాదారులను కాంగ్రెస్ అవమానించిందని మోదీ అన్నారు. నేరుగా తన పేరు చెప్పే దమ్ము లేక కాంగ్రెస్ పార్టీ కాపలాదారులను అడ్డం పెట్టుకుని తనపై ఆరోపణలు చేస్తోందన్నారు. 25 లక్షల మంది కాపలాదారు(వాచ్మెన్)లను ఉద్దేశించి మోదీ ఆన్లైన్ ద్వారా బుధవారం ప్రసంగించారు. అందులో ఆయన మాట్లాడుతూ కాపలాదారుడు అనే పదం నిజాయితీపరుడికి, దేశ భక్తుడికి పర్యాయపదంగా మారిందన్నారు. ఎన్నికల కోసం మోదీ ఇటీవలే ‘నేనూ కాపలాదారుడినే’ అనే ప్రచార కార్యక్రమం ప్రారంభించడం తెలిసిందే. -
‘చంపుతామంటూ కాల్స్ వస్తున్నాయి’
సాక్షి, న్యూఢిల్లీ : తనను చంపుతామంటూ ఇంటర్నెట్ ద్వారా ఇస్లామిక్ దేశాల నుంచి కాల్స్ వస్తున్నాయంటూ బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడ్డానంటూ ఆరోపణలు చేసిన భారత హ్యాకర్ సయ్యద్ షుజాను పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ‘11 మందిని హత్య చేశానని సయ్యద్ షుజా, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపణలు చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్ల ద్వారా బీజేపీ 2014లో గెలిచిందన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని రాజ్‌నాథ్‌ను కోరారు’ అని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం కూడా దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి : ‘నాపై కేసు ఎందుకు పెట్టలేదు’ పరువు నష్టం దావా వేస్తా.. ‘సయ్యద్ షుజాను శిక్షించాలి. నాకు విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నా పరువుకు భంగం కలిగించారు. దీనిపై పరువు నష్టం కేసు వేస్తా. రఫెల్ తరహాలో నాపై కాంగ్రెస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సీబీఐ ద్వారా ఈ కేసుపై దర్యాప్తు చేయాలి. ఈ విషయం గురించి దర్యాప్తునకు పరిశీలన చేయాలని హోం శాఖ కార్యదర్శిని రాజ్‌నాథ్ సింగ్ ఆదేశించారు’ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా తనపై ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్, సయ్యద్ షుజాలపై కిషన్ రెడ్డి తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చదవండి : 2014లో రిగ్గింగ్ జరిగింది! -
ఆధారాలు కావాలా.. బాలాకోట్ వెళ్లండి!
సాక్షి, న్యూఢిల్లీ: వైమానిక దాడులపై కట్టుకథలతో బీజేపీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తోందని కాంగ్రెస్ చేస్తోన్న ఆరోపణలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం చేసిన దాడులకు ఆధారాలు చూపించాలన్న కాంగ్రెస్ సీనియర్‌నేత కపిల్ సిబాల్ వ్యాఖ్యలపై కేంద్ర సమాచారమంత్రిత్వ శాఖమంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. భారత వైమానిక దళం జైషే మహ్మద్ ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసేందో లేదో తెలియాలంటే పాకిస్తాన్‌లోని బాలాకోట్‌కు వెళ్లిచూడండి అని ఘాటుగా బదులిచ్చారు. దీనిపై వారిద్దరి మధ్య ట్విటర్ వేదికగా మాటల యుద్ధం సాగింది. ‘‘గత పార్లమెంట ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయని కాంగ్రెస్ నేతలు బ్రిటన్ వెళ్లి అక్కడ ఆధారాలు ఉన్నాయంటూ తమపై ఆరోపణలు చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా బాలాకోట్ వెళ్లి పరిశీలించి దాడులు జరిగాయో లేదో చెప్పండి. అక్కడే సరైన ఆధారాలు దొరుకుతాయి’’ అని రాథోడ్ సమాధానమిచ్చారు. బాలాకోట్ దాడులకు సరైన అధారాలు లేవని అంతర్జాతీయ మీడియా చేస్తున్న ప్రచారం మీకు (కాంగ్రెస్) చాలా ఆనందాన్ని కలిగిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. భారత సైన్యంపై కంటే విదేశీ మీడియాపైనే కాంగ్రెస్‌కు ఎక్కువ నమ్మకమని అన్నారు. కాగా వైమానిక దళ దాడులపై అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరగుతోంది. బాలాకోట్ దాడులపై న్యూయార్స్ టైమ్స్, వాషింగ్టన్ డీసీ ప్రచురించిన కథనాలకు ప్రధాని మోదీ సమాధానం ఇవ్వాలని కపిల్ సిబాల్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. Kapil Sibal ji: You believe international media over own Intelligence agencies? You seem happy when media quoted by you says “no losses in strike”? ..and sir, for us you went to london🤦🏽♂️ to find evidence against EVMs, will you please also go to Balakot to check? https://t.co/JefbNnGdqP — Rajyavardhan Rathore (@Ra_THORe) 5 March 2019 -
‘ఆ అధికారులను గమనిస్తున్నాం’
సాక్షి,న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ పట్ల మితిమీరిన విధేయత చూపుతున్న అధికారులపై తాము కన్నేసి ఉంచామని, ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అవి మారుతుంటాయని వారు గుర్తెరగాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. ఎన్నికల ప్రక్రియలో తాము కొన్నిసార్లు విపక్షంలో ఉంటే మరికొన్నిసార్లు అధికారంలో ఉంటామని, ప్రభుత్వ అధికారులు ఈ విషయం గమనించాలన్నారు. ప్రధాని పట్ల అతివిధేయత కనబరుస్తున్న అధికారులపై తాము కన్నేసి ఉంచామని, రాజ్యాంగం అన్నింటికంటే పెద్దదన్న సంగతి అధికారులు గుర్తుపెట్టుకోవాలన్నారు. కాగా గవర్నర్ కార్యాలయలు, వర్సిటీ వీసీలు, మీడియా సహా అన్ని వ్యవస్ధలపైనా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం దాడి చేస్తోందని ఇటీవల కపిల్ సిబల్ ఆరోపించారు. కళాకారులు, రచయితలపై దేశద్రోహం అభియోగాలు మోపుతున్నారని, కొందరు మాట్లాడుతుంటే అడ్డుకుని భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
‘నాపై కేసు ఎందుకు పెట్టలేదు’
సాక్షి, హైదరాబాద్ : గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తాను హత్యా రాజకీయాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి స్పందించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని అన్నారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్, భారత హ్యాకర్ సయ్యద్ షుజాలపై డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే కుట్రపూరితంగా రాహుల్ గాంధీ, సిబల్, షుజా ఈ ఆరోపణలు చేశారని కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ సమక్షంలోనే షుజా మాట్లాడారని, ఈవీఎంల్లో లోపాలు ఉంటే రుజువు చేయాలని ఆయన సవాల్ చేశారు. కాకిరెడ్డి అనే వ్యక్తి ఎవరో తనకు తెలియదని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. 11 మందిని హత్య చేయిస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేసు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు.చనిపోయిన వాళ్లపై మిస్సింగ్ కేసులు ఎక్కడ నమోదయ్యాయో, షుజా చెప్తున్న గెస్ట్ హౌజ్ ఎక్కడెక్కడ ఉందో తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం వల్లే బీజేపీ 2014 లోక్ సభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని భారత హ్యాకర్ సయ్యద్ షుజా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో గొడవ జరగడంతో బీజేపీ నేత కిషన్ రెడ్డి తమపై గన్ మెన్లతో కాల్పులు జరిపించారనీ, ఈ ఘటనలో 11 మంది చనిపోయారని ఆరోపించారు. 2014 మే13 తెల్లవారుజామున 13 మందితో గెస్ట్‌హౌస్‌కు వెళ్లామని సుజా తెలిపారు. అక్కడే ఉన్న కిషన్ రెడ్డి.. తమను చంపేయమంటూ గన్మెన్లకు ఆదేశించారని చెప్పారు. వాళ్లు జరిపిన కాల్పుల్లో తమ వాళ్లు 11 మంది చనిపోయారని సయ్యద్ షుజా వెల్లడించారు. మృతుల్లో సమావేశం నిర్వహించిన కమల్‌రావు కూడా ఉన్నారని, తాను తప్పించుకుని అమెరికా వెళ్లిపోయానని సుజా తెలిపారు. ఆ తర్వాత వాటిని మతకలహాల మరణాలుగా మార్చారని ఆరోపించారు. ఇది చదవండి : 2014లో రిగ్గింగ్ జరిగింది! -
అది కాంగ్రెస్ ప్రాయోజిత కుట్ర
న్యూఢిల్లీ: 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల రిగ్గింగ్ జరిగిందని లండన్‌లో సైబర్ భద్రతా నిపుణుడు ఆరోపించడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ ఆరోపణలు కాంగ్రెస్ ప్రా యోజిత కుట్రలో భాగమని మంగళవారం తిప్పికొట్టింది. భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘానికి తలవంపులు తేవడానికే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టింది. రాబోయే ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న కాంగ్రెస్ ఇప్పటి నుంచే సాకులు వెతకడం ప్రారంభించిందని ఎద్దేవా చేసింది. షుజా పాల్గొన్న లండన్ ఈవీఎం హ్యాకథాన్ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ ఎందుకు వెళ్లారని ప్రశ్నించింది. ఈవీఎంలను హ్యాకింగ్ చేసి గత ఎన్నికల్లో బీజేపీ ప్రయోజనం పొందిందని సయ్యద్ షుజా అనే నిపుణుడు వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఈవీఎం హ్యాకింగ్ ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. షుజాపై కేసు నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులకు లేఖ రాసింది. ప్రజలను భయాందోళనలకు గురిచేసే, వదంతులు వ్యాపింపజేసేలా ఉన్న ఆయన వ్యాఖ్యలపై వెంటనే విచారణ జరపాలని కోరింది. సిబల్‌కు అక్కడేం పని? కపిల్ సిబల్ ఏ హోదాతో లండన్ కార్యక్రమంలో పాల్గొన్నారని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. ‘సిబల్ అక్కడ ఏం చేస్తున్నారు? ఏ హోదాతో ఆయన అక్కడికి వెళ్లారు? భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ స్పాన్సర్ చేసిన కుట్ర ఇది. అంతా కాంగ్రెస్ రచించిన ప్రణాళిక ప్రకారమే జరిగింది’ అని ఆరోపించారు. వ్యక్తిగత కారణాలతోనే లండన్ కార్యక్రమానికి వెళ్లానన్న సిబల్ వివరణను రవిశంకర్ కొట్టిపారేశారు. ఆ కార్యక్రమానికి హాజరైతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో తెలియనంత అమాయకుడు సిబల్ కాదని అన్నారు. సమాచార, సాంకేతిక శాఖ మంత్రిగా సైబర్ భద్రతా రంగంలో వస్తున్న మార్పులపై నిత్యం నిపుణులతో మాట్లాడతానని, కానీ తాను సయ్యద్ షుజా అనే పేరును ఎప్పుడూ వినలేదని చెప్పారు. లండన్‌లో జరిగిన ప్రెస్ మీట్ ఒక డ్రామా అని, ఎలాంటి ఆధారాలు లేకుండా వ్యక్తిగతంగా మీడియా ముందుకు రాకుండానే షుజా పెద్దపెద్ద ఆరోపణలు చేశారని అన్నారు. షుజా మా ఉద్యోగి కాదు: ఈసీఐఎల్ షుజా చెప్పుకున్నట్లుగా ఆయన తమ సంస్థలో ఉద్యోగి కాదని ప్రభుత్వ రంగ సంస్థ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) స్పష్టతనిచ్చింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను రూపొందించిన ఈసీఐల్ నిపుణుల బృందంలో తానూ ఒకడినని షుజా తెలిపిన సంగతి తెలిసిందే. ఈవీఎంల రూపకల్పనకు షుజాకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన తమ సంస్థలో ఉద్యోగి కూడా కాదని ఈసీఐఎల్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సుదీప్ జైన్‌కు లేఖ రాసింది. రేడియో ఫ్రీక్వెన్సీతో చొరబడలేం: ఈసీ ఈవీఎంలు రిగ్గింగ్‌కు గురయ్యాయన్న ఆరోపణల్ని కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఈవీఎం యంత్రాలను ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమని వాటిని రూపొందించిన నిపుణుల కమిటీ పునరుద్ఘాటించిందని తెలిపింది. ఈవీఎం యంత్రాలు..బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్లకు మాత్రమే అనుసంధానమై ఉంటాయని, ఏదైనా రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వైర్లెస్ కమ్యూనికేషన్ మార్గం లో వాటిలోకి చొరబడటం సాధ్యం కాదని నిపుణుల కమిటీని ఉటంకిస్తూ ఈసీ పేర్కొంది. నిర్వాహకుడు కాంగ్రెస్ మనిషి లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ స్వయం ప్రకటిత సైబర్ భద్రతా నిపుణుడు షుజా చేసిన వ్యాఖ్యలు రాజకీయ సెగను రేపాయి. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. లండన్‌లో షుజా పాల్గొన్న మీడియా సమావేశం నిర్వహించిన ఇండియన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ చీఫ్ ఆశిష్ రే కాంగ్రెస్ మనిషని అన్నారు. చాన్నాళ్లుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని పొగుడుతున్న రే...కాంగ్రెస్ పత్రిక నేషనల్ హెరాల్డ్‌కు వ్యాసాలు రాస్తున్నారని గుర్తుచేశారు. సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్‌కు అనుకూలంగా ప్రచారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీని తరచూ విమర్శించారని ప్రస్తావించారు. గతంలో లండన్‌లో రాహుల్ గాంధీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారని తెలిపారు. బీజేపీ ఆరోపణలపై రే స్పందించలేదు. -
వికారాబాద్ ఎస్పీపై బదిలీ వేటు
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణపై బదిలీ వేటు పడింది. ఆమెను బదిలీ చేయాల ని ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. దీంతో వెంటనే ఆమె హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాల ని ఆదేశిస్తూ డీజీపీ ఉత్తర్వులి చ్చారు. కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆయన స్వగృహంలో అర్ధరాత్రి సమయంలో బలవం తంగా అరెస్టు చేయడాన్ని తప్పుపడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ జాతీయ నాయకులు కపిల్ సిబాల్ తదితరులు ఫిర్యాదు చేశారు. అరెస్టు చట్టవిరుద్ధం అంటూ రేవంత్ తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు కూడా ఈ విషయంపై వివరణివ్వాలని డీజీపీ ని ఆదేశించిన సంగతి తెలిసిందే. రేవంత్ అరెస్టు వ్యవహారంలో అ న్నపూర్ణ అత్యుత్సాహం ప్రదర్శించారని, అవసరం లేకున్నా ఆయనను అరెస్టు చేసినందుకు ఆమెను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులను ఆమెకు అప్పగించరాదని కమిషన్ ఆదేశించింది. కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతి... వికారాబాద్ జిల్లా కొత్త ఎస్పీగా అవినాశ్ మహంతిని నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ వేటుపడిన ఎస్పీ అన్నపూర్ణ స్థానంలో ఆయనను నియమించా రు. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయన్నారు. -
డిసెంబర్ 11న కేసీఆర్ ఓటమి ఖాయం: కపిల్
హైదరాబాద్: డిసెంబర్ 11న కేసీఆర్ ఓటమి ఖాయమని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ జోస్యం చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కపిల్ సిబల్ మాట్లాడుతూ.. కేసీఆర్ దళిత సీఎం మాట మరిచారని, కేబినేట్లో మహిళలకు స్థానమే కల్పించలేదని అన్నారు. తెలంగాణలో కనీసం మహిళా కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. కాళేశ్వరం, క్యాంప్ ఆఫీసులు ఇలా అన్నీ రీడిజైన్‌లే చేసి ప్రభుత్వ ధనాన్ని దుబారా చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కు అవకాశం ఇస్తే ఆయన ప్రజల్ని మోసం చేశారని అన్నారు. విద్య గురించి ఆలోచన చేయని మనిషి రాష్ట్రం గురించి ఏం ఆలోచన చేస్తారని ప్రశ్నించారు. విద్య విషయంలో తెలంగాణ గ్రాఫ్ దారుణంగా పడిపోయిందని వ్యాఖ్యానించారు. రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక 4 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసేశారని చెప్పారు. కేసీఆర్ నయా నిజాం అని, బ్రిటీష్ రూల్ మళ్లీ వచ్చిందా అన్నట్లుగా ఆయన పాలన సాగుతోందని అన్నారు. చంద్రశేఖర్ రావు కో హఠావో..తెలంగాణ కో బచావో అని ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. -
ఎన్నికల ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించిన కపిల్ సిబాల్
లండన్ : ఇండియా ఓవర్సీస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన చర్చాగోష్ఠి కార్యక్రమంలో టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ యూకే అండ్ యూరోప్ ఎన్నికల ప్రచార కరపత్రాన్ని మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కపిల్ సిబాల్ మాట్లాడుతూ..దేశంలో అన్ని వ్యవస్థలను బీజేపీ దిగజారుస్తుందని మండిపడ్డారు. అర్ధరాత్రి నిర్ణయాలు దేశ ప్రజలను చీకట్లోకి నెట్టేస్తున్నాయన్నారు. రాఫెల్ కుంభకోణం దేశ ప్రజలకు చేరవేయాలని కోరారు. ఈవీఎం యంత్రాల పని తీరుపై ప్రజల సందేహాలను పరిగణలోకి తీసుకొని పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్, టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు గంప వేణుగోపాల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యులు సుధాకర్ గౌడ్, మంగళరపు శ్రీధర్, అడ్వైజరీ బోర్డు సభ్యులు గంగసాని ప్రవీణ్ రెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ రెడ్డి మడెలవిడు, వేముల మణికంఠ, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సీనియర్ ఉపాధ్యక్షురాలు గుర్మిందర్‌లు పాల్గొన్నారు . -
సంకటంలో ‘సంఘటన్’!
కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకార మహోత్సవంలో బీజేపీని వ్యతిరేకించే 12కిపైగా పార్టీల అధినేతలంతా ఒకే వేదికను పంచుకున్నారు. చేయిచేయి కలిపారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటూ ఒకరినొకరు పొగుడుకున్నారు. ఆ దృశ్యాలను చూసిన వారంతా అదిగదిగో మహాకూటమి ఏర్పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఓటమే లక్ష్యంగా విపక్షాలన్నీ చేతులు కలుపుతున్నాయని భావించారు. కానీ ఆరు నెలలు తిరక్కుండానే మహాకూటమిపై అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. అన్ని పార్టీలనూ ఏకతాటిపైకి తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైనట్టే కనిపిస్తోంది. కాంగ్రెస్ మహాకూటమి ఆశలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి నీళ్లు చల్లారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ప్రసక్తే లేదని ఆమె తేల్చిచెప్పారు. బీజేపీని ఓడించడానికి కాంగ్రెస్ వీసమెత్తు ప్రయత్నం కూడా చేయకుండా భాగస్వామి పార్టీలను ఓడించడానికే కంకణం కట్టుకుందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావించే మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయేతర పక్షాలు ఒక్కతాటిపైకి రాకుండా ఎవరికి వారే యమునా తీరేగా పోటీకి దిగుతుండటంతో దీని ప్రభావం లోక్‌సభ పొత్తులపై ఎలా ఉంటుందోనన్న విశ్లేషణలు మొదలయ్యాయి. – సాక్షి, నాలెడ్జ్ సెంటర్ ఎందుకిలా జరిగింది? ‘‘సైద్ధాంతిక విభేదాలున్న ప్రాంతీయ పార్టీలన్నింటినీ జాతీయ స్థాయి ఎజెండాతో ఒక ఉమ్మడి వేదికపైకి తీసుకురావడం సాధ్యం కాదు. ఎన్నికల తర్వాత కూటమి ఏర్పడవచ్చు కానీ, ముందే మహాకూటమి అనుకుంటే అయ్యే పనికాదు’’ అని మాయావతి తమతో పొత్తుకు రాంరాం చెప్పేశాక కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ స్పందన ఇది. రాజకీయంగా విభిన్నమైన పరిస్థితులు, భిన్న ఎజెండాలు కలిగిన పార్టీల మధ్య పొత్తుకి రాజకీయ, కార్యాచరణ అంశాలను కొలిక్కి తీసుకురావల్సి ఉంటుంది. ముఖ్యంగా సీట్ల సర్దుబాటు వంటివి అత్యంత కీలకంగా మారతాయి. అలాంటి అంశాల్లో ఒక అవగాహనకు రాకుండానే, బీజేపీని ఓడించాలన్న ఏకైక లక్ష్యంగా అన్ని పార్టీలు కలుస్తాయనుకోవడం ఒట్టి భ్రమ అవుతుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. సీట్ల పంపకంపై ఏకాభిప్రాయానికి రాలేక మాయావతి మహాకూటమి నుంచి తప్పుకున్నారు. మధ్యప్రదేశ్‌లో 50 సీట్లు కావాలని బీఎస్పీ పట్టుబడితే, 20కి మించి ఇవ్వలేమని కాంగ్రెస్ తేల్చేసింది. బీఎస్పీ పోటీ చేయతలపెట్టిన సీట్ల జాబితాలో చాలావరకు ఆ పార్టీ గెలిచే ఆస్కారం లేనివే ఉన్నాయి. గెలవగలిగే సీట్లను ఆ పార్టీ కోరుకోలేదని ఎంపీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ చెబుతున్నారు. ఎన్నికల పొత్తు విషయంలో బీఎస్పీ వైఖరిపై ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మాయావతి హఠాత్తుగా కాంగ్రెస్‌కు ఎదురుతిరగడం వెనుక బీజేపీ ఒత్తిడి ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్ని బూచిగా చూపించి బీజేపీ ప్రాంతీయ పార్టీలను బెదరగొడుతోందని, కాంగ్రెస్‌తో కలవకుండా అడ్డకుంటోందనే ప్రచారం కూడా జరుగుతోంది. మాయాకు అసంతృప్తి ఎందుకు? మధ్యప్రదేశ్, రాజస్తాన్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో దళితుల ప్రాబల్యం ఎక్కువ. వారి ఓట్లే అత్యంత కీలకం. అందుకే బీఎస్పీతో పొత్తుకు కాంగ్రెస్ తుదివరకు ప్రయత్నించింది. కానీ సీట్ల పంపకం విషయంలో మాయావతి తీవ్రమైన అసంతృప్తికిలోనయ్యారు. రాజస్తాన్‌లో 9, మధ్యప్రదేశ్‌లో 15–20, ఛత్తీస్‌గఢ్‌లో 5–6 సీట్లే ఇస్తానని కాంగ్రెస్ తేల్చేయడంతో మాయావతి యూ టర్న్ తీసుకున్నారు. ఎందుకంటే మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో బీఎస్పీ 6.3% ఓట్లను సాధించింది. బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం కంటే కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు వచ్చిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే తమకు నష్టం జరుగుతుందనే అంచనాతో మహాకూటమికి మాయావతి గుడ్‌బై చెప్పేశారు. రాజస్తాన్... కాంగ్రెస్, బీఎస్పీ ఒకదానితో మరొకటి అన్ని స్థానాల్లోనూ తలపడనున్నాయి. లెఫ్ట్ ఫ్రంట్ కూటమిలో సమాజ్‌వాదీ పార్టీ చేరింది. మరికొన్ని చిన్నాచితకా పార్టీలు కూడా వామపక్ష కూటమితోనే జత కలిశాయి. అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా ఈ కూటమితోనే కలసి పోటీ చేసే అవకాశాలున్నాయి. మధ్యప్రదేశ్... బీఎస్పీ ఒంటరిపోరాటానికే సిద్ధమైంది. 230 అసెంబ్లీ స్థానాల్లోనూ పోటీ చేయాలని నిర్ణయించింది. లెఫ్ట్ పార్టీలు కూడా ఇతర పార్టీలతో జతకట్టలేదు. ఇక సమాజ్‌వాదీ పార్టీ గోండ్వానా గణతంత్ర పార్టీతో కలసి పోటీ చేయనుంది. ఛత్తీస్‌గఢ్... కాంగ్రెస్ నుంచి విడిపోయి వేరుకుంపటి పెట్టిన అజిత్ జోగి జనతా కాంగ్రెస్‌తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంది. లెఫ్ట్ పార్టీలు, సమాజ్‌వాదీ పార్టీ ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యాయి. మాయావతి అజిత్ జోగితో చేతులు కలపడం వల్ల ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి లాభం చేకూరే అవకాశాలున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌కే నష్టమా? ఈ పరిణామాలన్నీ కాంగ్రెస్‌కు నష్టం తీసుకువస్తాయని, ఓట్లు చీలిపోవడం వల్ల బీజేపీకి లాభం కలుగుతుందనే విశ్లేషణలు అప్పుడే మొదలయ్యాయి. ‘‘మధ్యప్రదేశ్‌లో బీఎస్పీకి అంతో ఇంతో పట్టు ఉంది. బీజేపీ వ్యతిరేక ఓట్లను కూడగట్టే సమర్థత మాయావతికి ఉంది. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావించాం. కానీ మాయావతి అత్యాశతో ఏకంగా 50 సీట్లు డిమాండ్ చేశారు. అన్ని సీట్లు ఇచ్చి రాజీపడాల్సిన అవసరమేముంది. ఆమె తొందరపడకపోతే మరో మార్గం ఏదైనా ఉందేమో ఆలోచించేవాళ్లం’’ అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్‌లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్న 35 నియోజకవర్గాల్లోనూ, ఛత్తీస్‌గఢ్‌లో అజిత్ జోగి పార్టీతో జతకట్టడంతో ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో బీఎస్పీ పైచేయి సాధించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లోనైనా పొత్తు పొడుస్తుందా? అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో మహాకూటమి ఏర్పడకపోయినా లోక్‌సభ ఎన్నికల సమయానికి పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వస్తాయని కాంగ్రెస్ ఆశాభావంతో ఉంది. లోక్‌సభ ఎన్నికల నాటికి యూపీ, బిహార్లలో పొత్తులు కుదిరితే చాలని, మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇతరుల అవసరమేమీలేదని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పీఠానికి దగ్గర దారిగా చెప్పుకునే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ హవాకు చెక్ పెట్టాలంటే విపక్షాల ఐక్యత అత్యంత ముఖ్యం. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బహిరంగంగానే చెబుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ వైఖరిపట్ల అసంతృప్తితో ఉంది. ‘‘పొత్తులు పొడవాలంటే కాంగ్రెస్ వంటి పార్టీలకు పెద్ద మనసు ఉండాలి. ఇతర రాష్ట్రాల్లో మా అవసరం లేదన్నట్టు కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ఆ పార్టీ యూపీలో స్థాయికి మించి సీట్లు అడిగితే మా ధోరణి కూడా అలాగే ఉంటుంది’’ అని సమాజ్‌వాదీ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రాల స్థాయిలో బీజేపీయేతర పార్టీల మధ్య విభేదాలు వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి సర్దుకుంటాయా అన్నది అనుమానమే. -
‘మోదీ కాళ్లు కడిగి.. ఆ నీళ్లు తాగు’
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే కాళ్లను కడిగి ఆ నీటిని పవన్ అనే కార్యకర్త తాగిన విషయం తెలిసిందే. అ వీడియోను దుబే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఎంపీ తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబాల్ ఘాటుగా స్పందించారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లని కడిగి.. ఆ మురికి నీళ్లను నువ్వు తాగు. దాని ద్వారా నువ్వు కూడా మోదీపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయ్యవచ్చు’’ అని ట్వీట్లో చేశారు. జార్ఖండ్‌లోని గొడ్డా నియోజకర్గంలో ఆదివారం ఓ కార్యక్రమంలో నిశికాంత్ దుబే పాల్గొన్నారు. ఆ సమయంలో అక్కడున్న బీజేపీ కార్యకర్త పవన్ ఓ ప్లేట్లో ఎంపీ కాళ్లు కడిగి ఆ నీటిని తాగాడు. తనపై ఉన్న ప్రేమను పవన్ ఆ విధంగా వ్యక్తపరిచాడని దుబే సమర్ధించుకున్నాడు. ప్రజా ప్రతినిధివై ఉండి కార్యకర్తతో కాళ్లు కడిగించుకుంటావా అంటూ అతనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. Supporter of Nishikant Dubey washes his feet and then drinks the dirty water Dubey says it is an expression of the supporter’s love for him Will Dubeyji wash Modiji’s feet and drink the dirty water ? If not , does it mean he does not love Modi — Kapil Sibal (@KapilSibal) September 17, 2018 ఎంపీ కాళ్లు కడిగి.. ఆ నీటినే తాగి.. -
‘అదొక జాతి వ్యతిరేక, అసహజ పొత్తు’
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్లో పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ)తో పొత్తు తెంచుకుంటున్నట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రకటించిన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు బీజేపీ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. పీడీపీతో పొత్తు విరమించుకున్నట్లు బీజేపీ కశ్మీర్ ఇంచార్జి రాం మాధవ్ ప్రకటించగానే బీజేపీ మిత్రపక్షం శివసేన తనదైన శైలిలో స్పందించింది. శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ.. ‘అదొక జాతి వ్యతిరేక, అసహజ పొత్తు అంటూ’ వ్యాఖ్యానించారు. ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఎక్కువకాలం నిలవదని ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడో చెప్పారన్నారు. ఒకవేళ పీడీపీతో కలిసి ఉంటే 2019 ఎన్నికల్లో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియకనే బీజేపీ ఈవిధంగా వ్యవహరించిందంటూ ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీర్లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై స్పందించిన.. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కేవలం రాజకీయ లబ్ది కోసమే పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుందంటూ విమర్శించారు. ‘అవకాశవాది బీజేపీ... ముందు పీడీపీతో జతకట్టింది. ఇప్పుడు వైదొలిగింది. రెండూ కూడా రాజకీయ లబ్ది కోసమే... ఇలా అయితే దేశం ఎలా మారుతుందని’ ఆయన ట్వీట్ చేశారు. పీడీపీతో జతకట్టే ఆలోచన లేదని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. An opportunistic BJP First an opportunistic alliance with PDP Now an opportunistic breakaway Both acts of political immorality Kaise Desh badlega ? — Kapil Sibal (@KapilSibal) June 19, 2018 -
అభిశంసన పిటిషన్ ఉపసంహరణ
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోసం ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ చైర్మన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌ను కాంగ్రెస్ ఎంపీలు ఉపసంహరించుకున్నారు. దాంతో ఆ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ప్రకటించింది. కాంగ్రెస్ ఎంపీల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదిస్తూ.. ఈ అంశాన్ని రాజ్యాంగ ధర్మాసనం చేపట్టాలని ఎవరు ఆదేశించారో వెల్లడించాలని, ఆ ఉత్తర్వుల ప్రతుల్ని తమకు ఇవ్వాలని కోరారు. అప్పుడే ఈ పిటిషన్‌పై ముందుకెళ్లాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోగలమని సిబల్ కోర్టుకు చెప్పారు. ధర్మాసనం అందుకు సంసిద్ధత తెలపకపోవడంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆయన కోర్టుకు తెలిపారు. దాదాపు 45 నిమిషాల పాటు జస్టిస్ ఏకే సిక్రీ, జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్‌ల ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు కొనసాగాయి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు ప్రతాప్ సింగ్ బజ్వా, అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్ తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. ఐదుగురు జడ్జీల ధర్మాసనం ఏర్పాటుపై పలు సందేహాల్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ జోక్యం చేసుకుంటూ.. బజ్వా, యాజ్ఞిక్ల పిటిషన్లను తోసిపుచ్చాలని ధర్మాసనాన్ని కోరారు. ’అభిశంసన తీర్మానంపై 60 మందికిపైగా సభ్యులు సంతకం చేస్తే కేవలం కాంగ్రెస్ మాత్రమే సుప్రీంను ఆశ్రయించింది. దీనిని బట్టి రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన నోటీసును తిరస్కరించడాన్ని సవాలు చేయాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని మిగతా పార్టీలు సమర్ధించడం లేదని అర్థమవుతోంది. మిగతా ఎంపీల తరఫున పిటిషన్ దాఖలు చేయడానికి వారికి అధికారం లేదు’ అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతకుముందు సిబల్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘తనకే సంబంధించిన అంశంపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వుల్ని జారీ చేయలేరు. అయితే అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ ద్వారా మా పిటిషన్‌ను ఐదుగురు జడ్జిల ధర్మాసనానికి కేటాయించారు. ఎవరు ఆ ఉత్తర్వుల్ని జారీ చేశారు? ఒకవేళ ప్రధాన న్యాయ మూర్తి ఆదేశిస్తే ఆ విషయం తెలుసుకునే హక్కు పిటిషనర్లకు ఉంటుంది. అందువల్ల ఉత్తర్వుల ప్రతిని మాకు ఇవ్వాలి. రాజ్యసభ చైర్మన్ నిర్ణయాన్ని సవాలు చేయాలా? వద్దా ? అని నిర్ణయించుకునేందుకు ఆ కాపీ మాకు అవసరం’ అని వాదనలు వినిపించారు. బెంచ్ ఏర్పాటు నిర్ణయం సీజేఐదే! మాస్టర్ ఆఫ్ రోస్టర్‌గా వ్యవహరిస్తున్న సీజేఐనే ఐదుగురు జడ్జీల బెంచ్‌కు కేసును కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు తనపైనే కావడంతో వ్యూహాత్మకంగా సీజేఐ వ్యవహరించారు. సీనియారిటీలో ఆరోస్థానంలో ఉన్న జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. సిబల్ వాదించడంపై న్యాయవాదుల అభ్యంతరం రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తూ సీజేఐ జారీ చేసిన ఉత్తర్వుల కాపీని ఇవ్వడం వల్ల మీకేమైనా ప్రయోజనం ఉంటుందా? అని ధర్మాసనం పదే పదే సిబల్‌ను ప్రశ్నించింది. అయితే ఉత్తర్వుల కాపీ పొందాకే.. రాజ్యసభ చైర్మన్ నిర్ణయాన్ని సవాలు చేయాలా? లేదా? అనేది నిర్ణయిస్తామని ఆయన సమాధానమిచ్చారు. అందుకు ధర్మాసనం ఆసక్తి చూపకపోవడంతో.. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సిబల్ నిర్ణయించారు. అభిశంసన నోటీసుపై సంతకం చేసిన కపిల్ సిబల్ ఈ కేసును వాదించడంపై వాదనలు ప్రారంభానికి ముందు న్యాయవాదులు ఆర్పీ లూధ్రా, ఏకే ఉపాధ్యాయ అభ్యంతరం తెలిపారు. వారి వాదనతో కోర్టు ఏకీభవించలేదు. -
రాత్రికి రాత్రే మార్పులు; సుప్రీంకోర్టులో హైడ్రామా
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై అభిశంసన వ్యవహారం ఊహించని మలుపులు తిరుగుతోంది. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. సీజేఐపై అభిశంసన తీర్మానం నోటీసులను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కాంగ్రెస్ పార్టీ అనూహ్యరీతిలో ఉపసంహరించుకుంది. రాత్రికే రాత్రే ధర్మాసనాన్ని మార్చేయడం, ఆర్డర్ కాపీలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడం, అసంతృప్తితో కాంగ్రెస్ వెనుకడుగు వేయడం తదితర పరిణామాలు సుప్రీంకోర్టు వద్ద హైడ్రామాను తలపించాయి. అసలేం జరిగింది?: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా అభిశంసన కోరుతూ రాజ్యసభ చైర్మన్‌కు ఇచ్చిన తీర్మానాన్ని తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఇద్దరు కాంగ్రెస్ ఎంపీలు(ప్రతాప్ సింగ్ బజ్వా, అమీ హర్షద్రాయ్ యాజ్ఞిక్‌లు) సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణార్హమా, కాదా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు సోమవారమే ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. జస్టిస్ ఏకే సిక్రీ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఏకే గోయల్‌ల ధర్మాసనం.. రెండో నంబర్ కోర్టులో విచారణ జరుపుతుందని సుప్రీంకోర్టు రిజిష్ట్రార్ ప్రకటించారు. కానీ.. రాత్రికి రాత్రే మార్పులు: కాగా, సోమవారం నాటి రిజిస్ట్రార్ ప్రకటనకు విరుద్ధంగా.. మంగళవారం ఉదయం 6వ నంబర్ కోర్టులో, వేరొక ధర్మాసనం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పిటిషన్‌పై విచారణను ప్రారంభించారు. దీంతో పిటిషనర్ తరఫు న్యాయవాదులు కపిల్ సిబాల్, ప్రశాంత్ భూషణ్‌లు ఆశ్చర్యానికి గురయ్యారు. ధర్మాసనం మార్పునకు సంబంధించిన ఆర్డర్ కాపీలను సిబల్ కోరగా, కోర్టు నిరాకరించింది. దీంతో అసహనానికి గురైన సిబల్.. సదరు ధర్మాసనం ముందు వాదించబోమని, పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు అంగీకరించాలని చెప్పారు. ధర్మాసం అంగీకారం మేరకు కాంగ్రెస్ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ‘మాస్టర్ ఆఫ్ రోస్టర్’ సీజేఐనే కాబట్టి ఏ నిమిషంలోనైనా ధర్మాసనాలను మార్చే అధికారం చీఫ్ జస్టిస్‌కు ఉంటుందని తెలిసిందే. ఆశ్యర్యంగా ఉంది: ‘‘రాత్రికి రాత్రే ధర్మాసనాన్ని మార్చే అధికారం సీజేఐకి ఉంది. అయితే, సంబంధిత ఆదేశాల కాపీని ఇవ్వబోమని చెప్పడం మాత్రం ఆశ్యర్యం కలిగించింది. ‘ఆర్డర్ కాపీ లేకుండా, దాన్ని చదవకుండా మేం చాలెంజ్‌కు ఎలా వెళ్లగలం? అని సిబర్ అడిగారు. అప్పుడు కోర్టు.. ‘మెరిట్స్ ఆధారంగా ముందుకు వెళ్లండి’ అని సూచించింది. విచారణపై నమ్మకం సడలిన పరిస్థితిలో సిబాల్ కాంగ్రెస్ ఎంపీల పిటిషన్‌ను వెనక్కితీసుకున్నారు’’ అని ప్రశాంత్ భూషణ్ మీడియాకు చెప్పారు. -
ఎన్డీఏ సర్కారుకు కపిల్ సిబల్ చురకలు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) భావజాలాన్ని దేశ వ్యాప్తంగా వ్యాప్తి చేయడమే నరేంద్ర మోదీ సర్కార్ తమ అజెండాగా పెట్టుకున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. ఇప్పటికే పలు విద్యాసంస్థల్లో ఆరెస్సెస్ ప్రచారక్‌లను కీలక స్థానాల్లో నియమించి బాధ్యతలు అప్పగించడాన్ని గుర్తుచేశారు. ప్రతి వ్యవస్థలో ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యాప్తిచేస్తూ తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలన్నది కేంద్రం పన్నిన కుట్ర అని పేర్కొన్నారు. నేడు విద్యాసంస్థలతో పాటు న్యాయవ్యవస్థ, పరిపాలన విభాగాల్లోనూ ఆరెస్సెస్ నేతలు, ప్రచారక్‌లను ఎన్డీఏ ప్రభుత్వం అధికారాలు కట్టబెట్టడం సబబు కాదన్నారు కపిల్ సిబల్. దేశంలోని ప్రతిసంస్థపై కేంద్ర ప్రభుత్వం తమ ప్రభావం ఉండాలని తాపత్రయ పడుతోందని, వాటి సాయంతో మీడియాను, న్యాయవ్యవస్థతను నియంత్రించాలని దుర్బుద్ధితో ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఒకవేళ న్యాయ విభాగంలోనూ ఆరెస్సెస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ప్రచారక్‌లకు బాధ్యతలు అప్పగిస్తే న్యాయవ్యవస్థ చాలా బలహీనం కావడం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డ మెహుల్ చౌక్సీతో ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న సంబంధాల గురించి స్మృతి స్పష్టతనివ్వాలని కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. ముందు సీబీఎస్ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి దృష్టిసారించాలంటూ కపిల్ హితవు పలికిన విషయం తెలిసిందే. -
రాహుల్ ఇలాంటివి ఆమోదిస్తారా..?
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండు పార్టీల నాయకులు వ్యంగ్యాస్త్రాలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా సమాచార శాఖ మంత్రి స్మృతి ఇరానీ, మాజీ మంత్రి కపిల్ సిబల్‌ను టార్గెట్ చేశారు. యూపీఏ ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా పనిచేసిన కపిల్ సిబల్ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డ వ్యక్తితో సంబంధాలు కలిగి ఉన్నారంటూ స్మృతి ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇలాంటి వాటిని ఆమోదిస్తారా అని ప్రశ్నించారు. స్మృతి ఇరానీ ఆరోపణలకు స్పందించిన కపిల్ సిబల్ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. పీఎన్బీలో భారీ కుంభకోణానికి పాల్పడ్డ మెహుల్ చౌక్సీతో ప్రధానికి ఉన్న సంబంధాల గురించి స్మృతి స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ‘సమాచార శాఖ మంత్రి ప్రెస్మీట్లు పెడతారు గానీ నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సీలతో ప్రధానికున్న సంబంధాల గురించి అడగరు. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం’ అంటూ ఎద్దేవా చేశారు. ముందు సీబీఎస్ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై మంత్రి దృష్టిసారించాలంటూ కపిల్ హితవు పలికారు. దక్షిణాఫ్రికాకు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ, మీడియాలో వచ్చిన నివేదికలను ఉటంకిస్తూ స్మృతి పలు ఆరోపణలు చేశారు. ‘మనీల్యాండరింగ్‌కు పాల్పడిన వ్యక్తి నుంచి రూ. 45.21 కోట్ల విలువైన భూమిని కపిల్ సిబల్ కేవలం లక్ష రూపాయలకే కొన్నారు. సిబల్, ఆయన భార్య గ్రాండ్ కాసిలా కంపెనీ యజమానులుగా ఉన్నారు. ఈ కంపెనీ కోసం వారు వడ్డీ లేని రుణాలు పొందా’రని అన్నారు. కంపెనీ పేరు మీద ఒకసారి భూమి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత విలువ ఒక్కసారిగా రూ. 89 కోట్లకు చేరింది. ఈవిధంగా విలువ రెండింతలవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. 2013లో యూపీఏ ప్రభుత్వం పీయూష్ గోయల్ అనే వ్యాపారిపై అక్రమాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై దర్యాప్తునకు ఆదేశించింది. గోయల్ నుంచే కపిల్ సిబల్ ఈ కంపెనీని కొనుగోలు చేశారని స్మృతి ఇరానీ ఆరోపించారు. -
ఐ యామ్ వెరీ సారీ
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన మరో ఇద్దరు ప్రత్యర్థులకు తాజాగా క్షమాపణలు చెప్పారు. వాస్తవాలు తెలుసుకోకుండా, ఆధారాల్లేకుండా ఆరోపణలు చేశాననీ, తనను క్షమించాలని కోరుతూ కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ కొడుకు అమిత్ సిబల్‌లకు ఆయన లేఖలు రాశారు. దేశంలోనే తొలి 20 మంది అత్యంత అవినీతిపరుల్లో గడ్కారీ ఒకరంటూ గతంలో కేజ్రీవాల్ ఓ జాబితాను ప్రచురించారు. అమిత్ సిబల్పై కూడా అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో వారు కేజ్రీవాల్‌పై వేర్వేరుగా పరువునష్టం కేసులు వేయగా ప్రస్తుతం విచారణ నడుస్తోంది. కేజ్రీవాల్ క్షమాపణ లేఖలను ఆయన తరఫు న్యాయవాదులు సోమవారం అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌కు సమర్పించారు. అమిత్ సిబల్‌కు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా క్షమాపణలు చెప్పారు. అనంతరం పరువునష్టం కేసులను ఉపసంహరించుకుంటున్నట్లు గడ్కారీ, కేజ్రీవాల్ సంయుక్తంగా ఒక దరఖాస్తును, కేజ్రీవాల్, అమిత్ సిబల్‌లు మరో దరఖాస్తును కోర్టుకు సమర్పించారు. దీంతో ఈ రెండు కేసుల నుంచి కేజ్రీవాల్‌కు కోర్టు విముక్తి కల్పించింది. కాగా, కోర్టు కేసుల నుంచి బయటపడటానికి కేజ్రీవాల్ న్యాయవాదులు అమలు చేస్తున్న వ్యూహం ఇదని విశ్లేషకులు అంటున్నారు. సిసోడియా మాట్లాడుతూ ప్రజల కోసం పనిచేయాల్సిన సమయాన్ని అహంభావంతో కోర్టుల చుట్టూ తిరిగి వృథా చేయకూడదనే ఉద్దేశంతోనే క్షమాపణలు చెప్పామన్నారు. ‘మా వ్యాఖ్యలతో ఎవరైనా బాధకు గురైతే మేం క్షమాపణలు చెప్తాం. అహంకారంతో దాన్ని వైరంగా మార్చం. ప్రజల కోసం పనిచేయడానికి మేం ఇక్కడున్నాం. కోర్టుల చుట్టూ తిరగడానికి కాదు’ అని ఆయన అన్నారు. మరోవైపు తనపై ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వేసిన రెండో పరువునష్టం కేసును కేజ్రీవాల్ కోర్టులో వ్యతిరేకించారు. కేజ్రీవాల్ సూచనల మేరకే ఆయన న్యాయవాది రాం జెఠ్మలానీ తనను అభ్యంతరకర పదాలతో దూషించాడంటూ జైట్లీ ఈ కేసు వేశారు. మూడు పోయి.. మరో 30 ఉన్నాయి కేజ్రీవాల్‌పై ఇంకా 30 పరువునష్టం కేసులున్నాయి. శిరోమణి అకాలీదళ్ నేత విక్రమ్ సింగ్ మజీథియాకు మాదక ద్రవ్యాల ముఠాతో సంబంధాలు ఉన్నాయని కేజ్రీవాల్ ఆరోపించడంతో ఆయన పరువునష్టం కేసు వేయడం, ఇటీవలే ఆయనకూ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పి కేసును ఉపసంహరించుకునేలా చేయడం తెలిసిందే. కేజ్రీవాల్ వైఖరిని ఆప్ నేతలే కొందరు వ్యతిరేకిస్తున్నారు. కేజ్రీవాల్ క్షమాపణ కోరడంతో ఆప్ పంజాబ్ చీఫ్ పదవికి ఎంపీ భగవంత్ మన్ రాజీనామా కూడా చేశారు. గడ్కారీ, సిబల్‌లకు కేజ్రీ క్షమాపణ చెప్పడంతో మరో రెండు కేసుల నుంచి ఆయన బయటపడనున్నారు.అయినా మరో 30 పరువునష్టం కేసులు ఆయనపై ఉన్నాయి. ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? 20 మంది అత్యంత అవినీతిపరుల జాబితాను ప్రచురించిన కేజ్రీవాల్ ఇప్పుడు ఎందుకు వెనక్కు జారుకుంటున్నారని ఆప్ మాజీ నాయకురాలు అంజలీ దమానియా ప్రశ్నించారు. గడ్కారీ అవినీతిపరుడే అనేందుకు తన వద్ద ఉన్న ఆధారాలను అప్పుడే కేజ్రీవాల్‌కు ఇచ్చాననీ, అవినీతిపరులకు శిక్ష పడేలా చేయకుండా ఆయన ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారన్నారు. అంజలీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ తరఫున గడ్కారీపై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2015లో పార్టీలో అంతర్గత విభేదాలు తలెత్తిన సమయంలో ఆమె ఆప్‌ను వీడారు. -
కపిల్‌ను టార్గెట్ చేసిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. సుప్రీంకోర్టులో అయోధ్య వ్యవహారాన్ని మరింత ముందుకు జరపాలని కోరిన కపిల్ సిబల్పై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. మణిశంకర్ అయ్యర్‌ను తొలగించినట్లుగా కపిల్ సిబల్‌ను ఎందుకు తొలగించరని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టులో రామ్ మందిర్ విషయం విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ కేసును 2019 సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఇరుకున పడిన కాంగ్రెస్ ఆయనను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కలోల్ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న మోదీ ఎందుకు సిబల్ ఎన్నికలకు రామ్‌మందిర్‌కు ముడిపెట్టారని ప్రశ్నించారు. మణిశంకర్ మీద తీసుకున్న చర్యలే సిబల్పై ఎందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని ప్రశ్నించారు. -
ప్లీజ్.. మీరు ప్రచారానికి వెళ్లకండి
సాక్షి, న్యూఢిల్లీ : రామ్ జన్మభూమి కేసు విషయంలో వివాదాన్ని రాజేసి కాంగ్రెస్ పార్టీని ఇబ్బందుల్లో పెట్టిన ఆ పార్టీ సీనియర్ నేత, న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్ సిబల్‌ను గుజరాత్ ఎన్నికల ప్రచారం నుంచి కాంగ్రెస్ పార్టీ దూరం పెట్టింది. గుజరాత్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆయన ప్రచారానికి దూరంగా ఉండాలని సూచించింది. మంగళవారం సుప్రీంకోర్టులో రామజన్మభూమి కేసు విచారణ జరుగుతుండగా సున్నీ వక్ఫ్ బోర్డు తరుపున వాదనలు వినిపిస్తున్న సిబల్.. ఈ కేసును 2019 జులై వరకు వాయిదా వేయాలని, ఆలోగా సాధారణ ఎన్నికలు పూర్తవుతాయని అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలను తమకు అనుకూలంగా తీసుకున్న బీజేపీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో తమకు అస్త్రంగా వాడుకుంది. బుధవారం అక్కడ ప్రచారంలో పాల్గొన్న మోదీ విమర్శల వర్షం కురిపించారు. ఎన్నికలకు రామజన్మభూమికి ఎందుకు సంబంధం అంటగడుతున్నారని ప్రశ్నించారు. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ప్రచారానికి సిబల్ వ్యవహారం ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉందని ఆయనను దూరంగా పెట్టినట్లు తెలుస్తోంది. -
రాముడు కోరుకున్నప్పుడే ఆలయం
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస సీనియర్ నేత కపిల్ సిబల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నరేంద్ర మెదీ అనుకున్న సమయంలో అయోధ్యలో రామాలయం నిర్మించలేరని ఆయన పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం శ్రీరాముడు కోరుకున్నప్పుడు వస్తుందని.. మోదీ అనుకున్నపుడు రాదని ఆయన చెప్పారు. ‘శ్రీరాముడిని బీజేపీ నేతలు, నరేంద్ర మోదీ నమ్ముకున్నారు.. అయితే రాముడు మాత్రం వారిని నమ్మడం లేదు’ అని సిబల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్నిన్యాయవ్యవస్థ కూడా నిరూపించింది అని ఆయన చెప్పారు. దేశంలో 2019 లోక్‌సభ ఎన్నికల తరువాత అయోధ్య-బాబ్రీ వివాదాన్ని విచారించాలన్న కపిల్ సిబల్ వాదనతో కోర్టు ఏకీభవించిన విషయం తెలిసిందే. అయితే సుదీర్ఘంగా వాయిదా వేయాలని సిబల్ కోరినా.. కోర్టు మాత్రం విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న వరకూ వాయిదా వేసింది. -
‘అయోధ్య’పై రాజకీయమా?
లక్నో/ధంధుక: రామజన్మ భూమి–బాబ్రీ మసీదు కేసు విచారణను 2019 సార్వత్రిక ఎన్నికలయ్యే వరకు వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ సుప్రీంకోర్టును కోరడంపై రాజకీయ దుమారం రేగుతోంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కపిల్ సిబల్, కాంగ్రెస్‌లపై బుధవారం తీవ్ర విమర్శలు చేశారు. ఇలాంటి సున్నితమైన విషయాలను రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ వాడుకోవడం తగదని మోదీ హితవు పలికారు. అహ్మదాబాద్ జిల్లాలోని ధంధుకలో మోదీ మాట్లాడుతూ ‘సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు విచారణను వాయిదా వేయాలని కోరడం తప్పు. కాంగ్రెస్ ఎన్నో చిక్కులను పరిష్కరించకుండా ఎందుకు వదిలేసిందో నాకు ఇప్పుడు అర్థమౌతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం వారు ఇలా చేయడం సహేతుకం కాదు’ అని అన్నారు. ముస్లిం మతంలో తక్షణం విడాకులిచ్చే ముమ్మారు తలాక్ విధానాన్ని సుప్రీంకోర్టులో వ్యతిరేకిస్తే యూపీ ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తప్పదని అప్పట్లో అందరూ హెచ్చరించారనీ, అయినా ముస్లిం మహిళల శ్రేయస్సు కోసం తాము వెనకడుగు వేయలేదని మోదీ చెప్పారు. కాగా, తొలిదశ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగియనుంది. అవి మా వాదనలు కావు: వక్ఫ్‌బోర్డు సిబల్ కోర్టులో తమ సంస్థ తరఫున వాదించలేదని యూపీ సున్నీ వక్ఫ్‌బోర్డు చైర్మన్ జాఫర్ ఫరూఖీ స్పష్టం చేశారు. ‘ఈ కేసులో కక్షిదారు అయిన హసీం అన్సారీ కొడుకు తరఫున మాత్రమే సిబల్ వాదించారు. విచారణను వాయిదా వేసేలా కోర్టును కోరమని సున్నీవక్ఫ్‌బోర్డు ఆయనకు చెప్పనేలేదు’ అని అన్నారు. కాగా, సుప్రీంకోర్టులో తాను ఎవరి తరఫున వాదనలు వినిపిస్తున్నానన్న దానికన్నా, దేశం ముందున్న సవాళ్లపై మోదీ దృష్టి పెట్టాలంటూ సిబల్ ఎదురుదాడి చేశారు. -
బాబ్రీ మసీదుపై సున్నీ వక్ఫ్ బోర్డు కొత్త ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సున్నీ వక్ఫ్ బోర్డు కొత్త ట్విస్ట్ ఇచ్చింది. బాబ్రీ మసీదు విచారణను వాయిదావేయాలన్న ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్‌తో సున్నీ వక్ఫ్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికే సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ వివాదానికి సత్వరమే ముగింపు పలకాలని సున్నీ వక్ప్ బోర్డు సభ్యుడు హాజీ మెహబూబ్ కోరారు. ఎన్నికల కారణంగా విచారణను 2018 ఫిబ్రవరికి వాయిదా వేయించడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు. మందిర్ - మసీదు కేసులో కపిల్ సిబల్ కాంగ్రెస్ నాయకుడిగానే సుప్రీంకోర్టులో వాదించారని, ఆయనతో వక్ఫ్ బోర్డుకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. మంగళవారం రామజన్మ భూమి-మసీదుపై సుప్రీంలో విచారణ జరగాల్సి ఉండగా.. సున్నితమైన అంశం అంటూ ఫిబ్రవరి వరకూ వాయిదా వేయాలని సిబల్ సుప్రీంలో వాదించారు. అంతేకాక 2019 లోక్‌సభ ఎన్నికల వరకూ ఈ విచారణ వాయిదా వేయాలని ఆయన సుప్రీంను కోరారు. అయోధ్య వివాదం పూర్తిగా రాజకీయం అయిందని.. ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేస్తుందని కోర్టుకు సిబల్ తెలిపారు. బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని చేర్చిందని ఆయన కోర్టుకు తెలిపారు. -
అయోధ్య వివాదానికి.. ఎన్నికలకు సంబంధమేంటి?
ధన్‌ధుకా : అయోధ్య భూ వివాదానికి, 2019 లోక్‌సభ ఎన్నికలకు మధ్య సంబంధం ఏంటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశ్నించారు. రామ మందిరం కేసులో సున్నీ వక్ఫ్ బోర్డు తరఫున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించిన కాంగ్రెస్ నాయకుడు, లాయర్ కపిల్ సిబల్.. 2019 ఎన్నికలు ముగిసే వరకూ కేసును వాయిదా వేయాలని ముగ్గురు జడ్జిల ధర్మాసనానికి విన్నవించిన విషయం తెలిసిందే. దీనిపై బుధవారం గుజరాత్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన మోదీ.. 2019 వరకూ కేసును వాయిదా వేయాలని లాయర్ కోరడం అసమంజసం అని అన్నారు. ఎన్నికల వరకూ కేసును వాయిదా వేయాలని కోరడం వెనుక ఉన్న లాజిక్ ఏంటని సిబల్‌ను ప్రశ్నించారు. ముస్లిం కమ్యూనిటీ తరఫున సిబల్ పోరాడటంపై ఎలాంటి అభ్యతరం లేదని చెప్పారు. కానీ, వచ్చే ఎన్నికలు ముగిసే వరకూ అయోధ్య కేసును ఎటూ తేల్చొద్దని ఎలా చెప్తారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను రామ మందిరం కేసుతో లింక్ చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. దేశం ఎలా పోయినా కాంగ్రెస్‌కు ఫర్వాలేదని అన్నారు. కాగా, అయోధ్య భూవివాదం కేసు తుది విచారణను ఫిబ్రవరి 8, 2018కి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ.. కేసులో సిబల్ స్టాండ్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది. -
‘మోదీ హిందువు కాదు’
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ దేవాలయ సందర్శన వివాదాస్పదమైన క్రమంలో తాజాగా ప్రదాని నరేంద్ర మోదీ నిజమైన హిందువు కాదని సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. మోదీ అనుసరించేది హిందుత్వమని, హిందూయిజానికీ..హిందుత్వకూ వ్యత్యాసం ఉందని అన్నారు.మోదీ తరచూ దేవాలయాలకు వెళుతుంటారా అని ప్రశ్నించిన సిబల్ ఆయన నిజమైన హిందువు కాదని వ్యాఖ్యానించారు. ప్రతి భారతీయుడిలో సోదరుడు, సోదరి, తల్లిని చూసేవాడే నిజమైన హిందువని అన్నారు. మరోవైపు బుధవారం రాహుల్ సోమ్‌నాథ్ ఆలయం సందర్శించిన సందర్భంగా రిజిస్టర్లో రాహుల్ పేరు రాయడంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ రిజిస్టర్‌ను చూపుతూ రాహుల్ హిందువు కాదంటూ వ్యాఖ్యానించిన విషయం విదితమే. కాగా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్, మోదీ వరుస ర్యాలీలతో హోరెత్తిస్తున్నారు. -
తలాఖ్ తీర్పు చాలా స్పష్టంగా ఉంది
న్యూఢిల్లీ: వివాదాస్పద ట్రిపుల్ తలాఖ్ కు ఇస్లాం సాంప్రదాయాలకు వ్యతిరేకమన్న సుప్రీం కోర్టు ఆరు నెలలో అందుకు అవసరమైన చట్టం చేయాలంటూ పార్లమెంట్‌కు సూచించిన విషయం తెలిసిందే. అయితే ధర్మాసనం ఇచ్చిన తుది తీర్పు కాపీలో స్పష్టత కొరవడిందంటూ సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ గురువారం మరోసారి అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం ముందుకు తీసుకెళ్లారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున వాదనలు వినిపించిన సిబల్ తీర్పు కాపీలోని చివరి పేజీ(395వ) ప్రతిని సమర్పించి తీర్పుపై స్ఫష్టత కోరారు. బెంచ్ లోని మెజార్టీ సభ్యుల అభిప్రాయం విషయంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని చెప్పారు. అయితే తామిచ్చిన తీర్పు చాలా స్ఫష్టంగా ఉందని, ఎలాంటి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ బదులిచ్చారు. ఒకవేళ దీనిపై మరింత వివరణ కావాలంటే మాత్రం దరఖాస్తు చేసుకోవచ్చంటూ సిబల్ కు సూచించింది. ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనంలో 3;2 నిష్పత్తిలో ట్రిపుల్ తలాఖ్ పై తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ప్రధాన న్యాయమూర్తి ఖేహర్‌తోపాటు మరో జడ్జి నజీర్ అది ప్రాథమిక హక్కేనని తేల్చగా, మిగతా ముగ్గురు జడ్జిలు జోసెఫ్, నారీమన్, లలిత్ లు మాత్రం ఇస్లాం సాంప్రదాయానికి వ్యతిరేకమంటూ అభిప్రాయం వెలిబుచ్చారు. -
అన్‌ఫాలో: కాంగ్రెస్‌కు సీనియర్ నేత ఝలక్!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత దాదాపు ఝలక్ ఇచ్చారు. ఆయన ఆదివారం అనుకోకుండా ట్విట్టర్లో పార్టీ అధికారిక పేజీని, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేజీని 'అన్‌ఫాలో' కొట్టడం దుమారం రేపింది. కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చిందా? ఆయన కూడా హస్తానికి గుడ్‌బై చెప్పబోతున్నారా? అన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి వివరణ ఇచ్చారు. తన సిబ్బంది అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ, రాహుల్‌గాంధీ ట్విట్టర్ పేజీలను 'అన్‌ఫాలో' కొట్టారని, వెంటనే జరిగిన పొరపాటును గుర్తించి తిరిగి ఆ పేజీలను అనుసరించడం మొదలుపెట్టారని సిబల్ తెలిపారు. మరో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పీ చిదంబరం కూడా కాంగ్రెస్, రాహుల్ అధికారిక పేజీల (@INCIndia, @OfficeOfRG)ను 'అన్‌ఫాలో' కొట్టినట్టు వార్తలు వచ్చాయి. సోమవారం ఉదయం చూస్తే చిదంబరం ట్విట్టర్ ఖాతాలు ఈ రెండు పేజీలను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నది. గుజరాత్లో కాంగ్రెస్ సీనియర్ నేత శంకర్‌సిన్హ్ వాఘేలా ఇదేవిధంగా రాహుల్‌గాంధీ ట్విట్టర్ పేజీని మే నెలలో 'అన్‌ఫాలో' కొట్టారు. గత నెలలో ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. -
ఈ శతాబ్దిలో అతిపెద్ద స్కాం
రూ. 500, రూ. 2,000 నోట్లను రెండు రకాలుగా ముద్రించారు రాజ్యసభలో కాంగ్రెస్ ఆరోపణ న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు మంగళవారం విపక్షాల నిరసనలు, నినాదాలతో దద్దరిల్లాయి. రూ. 500, రూ. 2,000 నోట్లను పెద్దసైజులో, చిన్నసైజులో రెండు రకాలుగా ముద్రించారని, ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద కుంభకోణమని రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. గుజరాత్లో రాహుల్ గాంధీ వాహనంపై జరిగిన రాళ్ల దాడిపై లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపింది. అధికార విపక్షాల వాగ్యుద్ధంతో రెండు సభలు పలుసార్లు వాయిదా పడ్డాయి. అధికార పార్టీ కోసం అచ్చేశారు: సిబల్ రాజ్యసభ ఉదయం 11 గంటలకు మొదలవగానే కపిల్ సిబల్(కాంగ్రెస్) నోట్ల అంశాన్ని లేవనెత్తారు. ‘అధికార పార్టీ సభ్యుల కోసం ఒక రకాన్ని, ఇతరుల కోసం మరో రకాన్ని ముద్రించారు.. పాత రూ. 500, రూ. 1,000 నోట్లను ప్రభుత్వం ఎందుకు రద్దు చేసిందో ఇప్పుడు అర్థమైంది. నోట్ల రద్దుతో నల్లధనం, అవినీతి, నకిలీ కరెన్సీకి అడ్డుకట్ట వేయడంలో విఫలం అయ్యారు’ అన్నారు. ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద కుంభకోణమని విపక్ష నేత గులాం నబీ ఆజాద్ అభివర్ణించారు. చెలామణిలోని కరెన్సీ విశ్వసనీయతకు భంగం కలిగిందని ఆనంద్ శర్మ, ఇది హేయమైన నేరమని ప్రమోద్ తివారీ ధ్వజమెత్తారు. ఏ దేశంలోనూ ఒక నోటు రెండు సైజుల్లో లేదని ఎన్డీఏ కూటమిలోని జేడీయూ సభ్యుడు శరద్ యాదవ్ కూడా అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రియాన్ సహా పలువురు విపక్ష సభ్యులు రెండు సైజుల్లో ముద్రించిన రూ. 500 నోట్లను సభలో ప్రదర్శించారు. అయితే జైట్లీ ఈ ఆరోపణలపై వివరణ ఇవ్వలేదు. మీకు ఎక్కడ దొరికాయి?: నక్వీ విపక్ష ఆరోపణలను మంత్రులు రవిశంకర్ ప్రసాద్, ముక్తార్ అబ్బాస్ నక్వీలు ఖండించారు. నోట్ల రద్దు వల్ల అవినీతిపరులు ఇబ్బందిపడడంతో కాంగ్రెస్ గందరగోళం సృష్టిస్తోందని నక్వీ ఎదురుదాడి చేశారు. రెండు రకాల నోట్లు విపక్ష సభ్యులకు ఎక్కడ లభించాయని ప్రసాద్ ప్రశ్నించారు. చర్చకు ప్రత్యేక నోటీసు ఇవ్వాలని డిప్యూటీ చైర్మన్ కురియన్ విపక్ష సభ్యులకు సూచించారు. గందరగోళం సద్దుమణగకపోవడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. తర్వాత సిబల్ విలేకర్లతో మాట్లాడుతూ.. ‘ఆర్బీఐ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. రూ. 500 నోటు ప్రామాణిక వెడల్పు, పొడవు కొలతలు 66 ఎంఎం గీ 150ఎంఎం. అయితే కొన్ని నోట్లు పొడవు 151ఎంఎం, 153 ఎంఎంగా ఉంది. ఆర్బీఐ ప్రకారం.. రూ. 2,000 నోటు సైజు 66ఎంఎం గీ 166 ఎంఎం కాగా కొన్ని నోట్ల పొడవు 167 ఎంఎంగా ఉంది. ఎడమ, కుడి, పైభాగం, కిందిభాగం సైజుల్లో, డిజైన్లలోనూ తేడాలు ఉన్నాయి’ అని వెల్లడించారు. ఆ నోట్లవి ప్రత్యేక కొలతలు: ప్రభుత్వం పెద్ద నోట్ల సైజులు ప్రత్యేకమైనవని ఆర్థిక శాఖ సహాయ మంత్రి మేఘ్వాల్ రాజ్యసభకు బదులిచ్చారు. ‘ఒక్కో విలువ గల బ్యాంకు నోటుకు ప్రత్యేక కొలతలు ఉన్నాయి. రూ.500 నోటు కొలతలు 66ఎంఎం గీ 150 ఎంఎం కాగా రూ. 2,000 నోటు సైటు కొలతలు 66ఎంఎంగీ 166 ఎంఎం’ అని తెలిపారు. రాహుల్ చనిపోయేవారు: కాంగ్రెస్ గతవారం గుజరాత్ పర్యటనలో తమ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడిలో ఆయనకు రాయి తగిలి ఉంటే చనిపోయేవారని లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. ‘రాహుల్‌పై హత్యాయత్నాలు జరిగాయి. ఆయనకు భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశారా? కశ్మీర్లో ఉగ్రవాదులు రాళ్లు రువ్వుతారని అంటారు. మరి గుజరాత్‌లోని బీజేపీ కార్యకర్తలు ఉగ్రవాదులుగా మారారా?’ అని ప్రశ్నించారు. హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇస్తూ... ‘రాహుల్ తన 121 పర్యటనలకు గాను 100 పర్యటనల్లో బుల్లెట్ ప్రూఫ్ కారు వాడలేదు.. విదేశీ పర్యటనల్లోనూ ప్రొటోకాల్ ఉల్లంఘించారు. భద్రత లేకుండా ఆయన ఎక్కడికి వెళ్లారు, ఏం దాచాలనుకుంటున్నారు? రాహుల్ తన భద్రతను తానే నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని చెప్పారు. -
దేశంలో ఇదే అతిపెద్ద స్కాం...
న్యూఢిల్లీ : రూ 500 నోట్ల డిజైన్లు రెండు రకాలుగా ఉండటంపై రాజ్యసభలో మంగళవారం ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. ఆర్బీఐ రెండు డిజైన్లు, సైజ్‌లతో రూ 500 నోట్లను ముద్రించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది దేశంలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొంది. కేంద్రం నోట్ల రద్దు ఎందుకు చేపట్టిందో తమకు ఇప్పుడు అర్ధమైందని, ఆర్బీఐ రెండు డిజైన్లలో రూ 500 నోట్లను ముద్రించడం దారుణమని సభలో ఆయా డిజైన్లను ప్రదర్శిస్తూ సీనియర్ కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ ఆరోపించారు. పార్టీ కోసం ఒకటి, ప్రభుత్వం కోసం మరొకటి అంటూ తాము రెండు రకాల నోట్లను ఎన్నడూ ముద్రించలేదని మరో నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. కాంగ్రెస్ లేవనెత్తిన అంశానికి తృణమూల్, జేడీయూ సభ్యులు మద్దతుగా నిలిచారు.కాంగ్రెస్ సభ్యుల వాదనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. కరెన్సీపై బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. భారీస్ధాయిలో నోట్లు ముద్రించే క్రమంలో ఒకటీ అరా నోట్లు డిజైన్, సైజ్‌లో చిన్నపాటి వ్యత్యాసాలు ఉండటం సహజమేనన్నారు. -
'ఇంత జరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నారు?'
న్యూఢిల్లీ: వర్షాకాల పార్లమెంటు సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీపై ఉమ్మడి దాడి మొదలుపెట్టాయి. గురువారం నాటి రాజ్యసభ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు దళితులపై జరుగుతున్న దాడులను, గోసంరక్షణ పేరిట ముస్లింలను కొట్టి చంపుతున్న సంఘటనలపై పలువురు నేతలు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జేడీయూ సీనియర్ నేత శరద్ యాదవ్ మాట్లాడుతూ మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకు మంచిని చేయండి. గోసంరక్షణ పేరిట చేస్తున్న నాటకాలన్నీ ఆపేయండి. ధనవంతులు మాత్రమే స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తున్నారు. పేదలకు, ఆదివాసీలకు అది అందడం లేదు. ఈ దేశంలో ఇక ఏ మాత్రం రైతుల ఆత్మహత్యలు జరగనివ్వకూడదు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం వ్యవసాయ రంగంపై బాగా పడింది. చేతుల్లో డబ్బు లేక అప్పులు చేయలేక రైతన్న ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దళితులపై దాడులు (ఈసమయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రోహిత్ విషయం గుర్తుచేశారు) జరుగుతుంటే ఏం చేస్తున్నారు. ఓ వ్యక్తిపై మూకపడి కొట్టి చంపడానికి తాలిబన్‌కు పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు. అలాగే, కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ గోసంరక్షణ పేరిట దాడులు జరుగుతుంటే తమకు సంబంధం లేదని బీజేపీ నేతలు అంటున్నారని, అయితే, గో సంరక్షక దళాన్ని విశ్వహిందూపరిషత్ నియమిస్తోందని, వారికి భజరంగ్దల్వాళ్లు శిక్షణ ఇస్తున్నారని దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న ప్రధాని ఏం చేస్తున్నారని, ఎందుకు బీజేపీ నేతలు సీరియస్‌గా స్పందిండచం లేదని మండిపడ్డారు. ఇక సీపీఐ నేత డీ రాజా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పౌరులకు రక్షణ ఇవ్వడంలో ఉమ్మడిగా విఫలమయ్యామని అన్నారు. 70ఏళ్ల తర్వాత వ్యక్తులపై దాడి చేసి కొట్టడం అనే అంశాన్ని సభలో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, దీనిని చూసి సిగ్గుపడాల్సిన అవసరం ఉందన్నారు. దళితులకు, మహిళలకు ఇక మనపై ఎలాంటి సానుభూతి చూపించే ఉద్దేశం లేకుండా పోయిందని, ప్రతినిధులుగా వారికి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. -
‘సంతోషంగా అంగీకరిస్తా’
న్యూఢిల్లీ: కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) స్టే విధించడాన్ని కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ స్వాగతించారు. ఈ కేసు విచారణలో పాకిస్తాన్ అనుసరించిన విధానం సవ్యంగా లేదని ఆయన విమర్శించారు. కులభూషణ్.. భారత రాయబారిని కలిసిన తర్వాత అతడికి విధించిన మరశిక్షపై అప్పీలు చేసుకునే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. అతడికి అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. జాధవ్ కుటుంబానికి సాయం చేసేందుకు సంతోషంగా అంగీకరిస్తానని చెప్పారు. కులభూషణ్ జాధవ్‌కు విధించిన మరణశిక్షపై ఐసీజే స్టే విధించడం పట్ల దేశం చాలా సంతోషంగా ఉందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి పీపీ చౌధరి వ్యాఖ్యానించారు. జాధవ్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ వద్ద ఎటువంటి ఆధారాలు లేవన్నారు. అతడికి వ్యతిరేకంగా సాగిన విచారణ చట్టవిరుద్ధమని, దుర్మార్గమని పేర్కొన్నారు. -
అబద్ధాల్లో పోటీపడుతున్న మోదీ, కేసీఆర్
- డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడ: కపిల్ సిబల్ - మోదీది నకిలీ హిందూయిజం సాక్షి, హైదరాబాద్: ఆచరణ సాధ్యంకాని హామీలు, అబద్ధాలతో అటు ప్రధాని మోదీ, ఇటు కేసీఆర్ పోటీపడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ విమర్శించారు. శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్వి జయ్సింగ్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి, మల్లు భట్టివిక్రమార్క, ఆర్.సి.కుంతియాతో కలసి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతులకు మద్దతు ధర ఇస్తామని హామీని ఇచ్చి, ఇప్పుడు పంట ను కొనుగోలు చేసేవారు లేకున్నా ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని కపిల్ సిబల్ ఆరోపించారు. రుణాలు, ఇన్పుట్ సబ్సిడీలు అందక, పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ రైతులను పట్టించుకోవడం లేదన్నారు. ఏడాదికి కోటి ఉద్యోగాలని మోదీ, లక్ష ఉద్యోగాలని కేసీఆర్ చెప్పారని.. ఇప్పటిదాకా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌వన్నీ ఉత్త మాటలే... రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మాటలే తప్ప చేతలు లేవని కపిల్ సిబల్ విమర్శించారు. రాష్ట్రంలో రెండు పడక గదుల ఇళ్లు ఎక్కడ నిర్మించారో, ఎంతమంది పేదలకు ఇచ్చారో చెప్పాలన్నా రు. దళితులకు మూడెకరాల భూ పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు ఇస్తామంటూ మోసం చేస్తున్నా రని.. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీం తీర్పు ఉందని, అయినా షెడ్యూల్ 9లో చేర్పిస్తా, రాష్ట్రపతికి పంపిస్తా అంటూ మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీయే దీనిని వ్యతిరే కిస్తుంటే ముస్లింలకు రిజర్వేషన్లు ఎలా సాధ్య మని ప్రశ్నించారు. దేశ పరిస్థితి దిగజారింది... కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీతో దేశంలో ఏ ఒక్క వర్గమూ సంతోషంగా లేదని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. బ్యాంకులు కనీసం రుణాలిచ్చే పరిస్థితుల్లో లేవన్నారు. పేదరికం, ద్రవ్యోల్బణం పెరిగాయని, ఆర్థిక స్థితి దిగజారిందని పేర్కొన్నారు. ఇదేనా మోదీ హయాంలో జరిగిన అభివృద్ధి అని ప్రశ్నిం చారు. నిజమైన హిందువు అయితే సత్యం, అహింసలను ఆచరిస్తారని.. మోదీ మాత్రం హింసను నమ్ముతున్నారని ఆరోపించారు. మోదీది నకిలీ హిందూయిజమని, ఆయన నకిలీ హిందువని సిబల్ విమర్శించారు. సామాన్యుడు ఏం తినాలో, ఏం తినద్దో, ఏ వ్యాపారం చేయాలో నిర్ణయించడాన్ని ఏ ఇతిహాసం నేర్పిందని ప్రశ్నించారు. -
అక్కడ మోదీ.. ఇక్కడ కేసీఆర్
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాగానే కేసీఆర్ కూడా అబద్ధపు వాగ్దానాలు ఇస్తూ తిరుగుతున్నాడని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ విమర్శించారు. ఆయనిక్కడ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ రైతులకు మద్దతు ధర ఇస్తానని ఇపుడు మరిచిపోయారని అన్నారు. కేంద్రంలో మోదీ, ఇక్కడ కేసీఆర్ రైతులకు చేసిందేమీ లేదన్నారు. మోదీ ప్రతి ఏడాది కోటి ఉద్యోగాలు అన్నాడు.. కేసీఆర్ ఏడాదికి లక్ష ఉద్యోగాలన్నాడు.. ఎక్కడ ఇస్తున్నారో చెప్పాలన్నారు. ఎన్నికల వాగ్దానాలు ఇవ్వడం తేలికే కానీ.. నెరవేర్చడం కష్టమన్నారు. కేసీఆర్ మాటలు చెబుతున్నాడు కానీ చేతల్లో చూపడం లేదని అన్నారు. రెండు పడకల గదులు ఎక్కడ ఉన్నాయి..3 ఎకరాల భూ పంపిణీ ఏమైందని ప్రశ్నించారు. 12 శాతం ముస్లిం రిజర్వేషన్ అన్నారు..50 శాతం మించకూడదు అని సుప్రీం తీర్పు ఉన్నా.. షెడ్యూల్ 9 ద్వారా చేస్తా.. రాష్ట్రపతికి పంపిస్తా అనడం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. కాశ్మీర్లో ఓటింగ్ తగ్గింది అంటే.. పీడీపీ, బీజేపీ పార్టీల కలయిక ప్రజలకు ఇష్టం లేదని.. ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోయిందన్నారు. ఈ సర్కార్ వల్ల ఏ ఒక్క వర్గం అయినా సంతోషంగా ఉందా అని కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు. బ్యాంక్‌లు కనీసం లోన్లు ఇచ్చే పరిస్థితుల్లో లేవని.. పేదరికం, ద్రవ్యోల్బణం పెరిగడమే మోదీ చేశారన్నారు. దేశం మారుతోందని.. ప్రధాని నినాదం ఇస్తున్నారు..అసలు ఏం మారిందో చెప్పాలన్నారు. దేశంలో ఆర్థిక స్థితి దిగజారిందని..ప్రైవేటు సెక్టార్లో పెట్టుబడులే లేవన్నారు. నిజమైన హిందూ..సత్యం, అహింస ఆచరిస్తారని, కానీ మోదీ హింసను నమ్ముతున్నారని మండిపడ్డారు. ఏం తినాలి..ఏం తినోద్దు..ఏం వ్యాపారం చేయాలో నిర్ణయించడం ఏ ఇతిహాసం నేర్పిందని ఆయన ప్రశ్నించారు. -
‘దేశం ఇప్పటికే క్యాష్ లెస్ అయింది’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ క్యా‘ష్ లెస్’ డ్రీమ్ పై కాంగ్రెస్ వాగ్బాణాలు ఎక్కుపెట్టింది. నగదు రహిత లావాదేవీల దిశగా ముందుకెళ్లాలన్న మోదీ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేసింది. మోదీ సర్కారు అనాలోచితంగా పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో దేశం ఇప్పటికే ’నగదు రహితం’గా మారిందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ వ్యంగ్యంగా అన్నారు. ముందస్తు సన్నాహాలు, సంస్థాగత కసరత్తు చేయకుండా పెద్ద నోట్లను రద్దు చేశారని విమర్శించారు. సామాన్యులను కష్టాలకు గురిచేసి దేశాన్ని నగదు రహితంగా మారుస్తారా అని ప్రశ్నించారు. ‘నోట్ల కష్టాలు లేకుండా ముందు సన్నాహాలు చేయండి. దేశంలో 70 శాతం మంది ప్రజలు నెలకు 10 వేల రూపాయల సంపాదనతో బతుకుతున్నారు. వీరు తమ డబ్బును బ్యాంకులో డిపాజిట్ చేసుకోలేరు. వీళ్లంతా ఏం చేయాలి? ప్రజలు నగదు కోసం 20 కిలోమీటర్ల వరకు వెళ్లాల్సి వస్తోంది. పాత పెద్ద నోట్ల రద్దుతో ప్రజల దగ్గర డబ్బు లేకపోవడంతో దేశం ఇప్పటికే నగదు రహితంగా మారింద’ని సిబల్ వ్యాఖ్యానించారు. -
ఆర్థిక పరిస్థితిపై మోదీకి అవగాహన లేదు
కాంగ్రెస్ అధికార ప్రతినిధి కపిల్ సిబల్ లక్నో: దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీకి సరైన అవగాహన లేదని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ కేంద్రమంత్రి కపిల్ సిబల్ విమర్శించారు. పెద్ద నోట్లు రద్దవడంతో పేదలు నిద్రల్లేని రాత్రులు గడుపుతుంటే మోదీ మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం ఆయన లక్నోలో మీడియాతో మాట్లాడారు. నల్లధనాన్ని అరికట్టడంలో మోదీ తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. పేద ప్రజల దగ్గరున్న పెద్ద నోట్లను కూడా మోదీ నల్లధనంగా భావిస్తున్నారని మండిపడ్డారు. నోట్ల రద్దు వెనుక రాజకీయ కోణం దాగి ఉందని ఆరోపించారు. భారత్‌లో 125 కోట్ల మంది ప్రజలు ఉండగా, వారిలో 60 కోట్ల మందికే బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని, అందులో 32 కోట్ల మంది ఖాతాల్లో కొన్ని సంవత్సరాల నుంచి అసలు లావాదేవీలే జరగడం లేదని గణాంకాలతో వివరించారు. స్విస్ బ్యాంక్‌లో ఖాతాలున్న భారతీయు ల వివరాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రజల డబ్బుని ప్రజలు విత్ డ్రా చేసుకోవద్దా
-
ఆర్మీ విజయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోంది
న్యూఢిల్లీ: భారత ఆర్మీ విజయాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ విమర్శించారు. సర్జికల్ దాడులను బీజేపీ తమ ఖాతాలో వేసుకుని లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. 1965, 1971ల్లో భారత్ సాధించిన విజయాలను బీజేపీ మరచిపోతోందని సిబల్ అన్నారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు దేశం కోసం ప్రాణత్యాగం చేశారని పేర్కొన్నారు. మసూద్ అజహర్ వంటి ఉగ్రవాదులను విడిచిపెట్టిన ఘనత బీజేపీదేనని విమర్శించారు. భదత్ర దళాలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. -
గాంధీ హత్యను ఆరెస్సెస్‌కు ఆపాదించలేదు
సుప్రీం కోర్టులో రాహుల్ వివరణ న్యూఢిల్లీ: మహాత్మా గాంధీని ఆరెస్సెస్ సంస్థ హత్య చేసిందని తాను నిందించలేదని, ఈ ఘాతుకం వెనుక ఆర్ఎస్ఎస్ వ్యక్తులున్నారని మాత్రమే వ్యాఖ్యానిం చానని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. గాంధీ హత్యలో ఆరెస్సెస్ పాత్రపై రాహుల్ వ్యాఖ్యలపై వేసిన పరువు నష్టం కేసులో బుధవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి. రాహుల్ తరఫున ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. దీనిపై విచారించిన ధర్మాసనం స్పందిస్తూ.. నిందితుడు గాంధీని ఆరెస్సెస్ హత్య చేసినట్లు వ్యాఖ్యానించలేదని, ఆ సంస్థతో సంబంధం ఉన్న వ్యక్తులు చేసినట్లు అన్నారని భావిస్తున్నట్లు పేర్కొంది. పిటిషనర్ సంతృప్తి చెందితే కేసును కొట్టివేస్తామంది. -
సృతి, కపిల్ సిబల్ ల డాక్యుమెంట్లు లేవు
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సృతి ఇరానీ, కాంగ్రెస్ పార్టీ నేత కపిల్ సిబల్ 2004 ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్ లు, డాక్యుమెంట్లు కనిపించడం లేదని ఢిల్లీ ఎలక్షన్ కమిషన్ కోర్టుకు తెలిపింది. వీరిరువురు 2004 సార్వత్రిక ఎన్నికల్లో ఛాందినీ చౌక్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేశారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను, సమాచారాన్ని తమవెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఎలక్షన్ కమిషన్ కోర్టుకు వెల్లడించింది. సృతి విద్యార్హతలు అసలైనవి కావని వాటిని పరిశీలించాలని కోర్టులో అహ్మర్ ఖాన్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న కోర్టు కేసును అగస్టు 27 కు కేసును వాయిదా వేసింది. -
'సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు'
న్యూఢిల్లీ: భారత దేశచరిత్రలో ఈ రోజును సువర్ణ అక్షరాలతో లిఖించాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్దరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ స్వాగతించింది. అరుణాచల్ ప్రదేశ్ లో రాజకీయ సంక్షోభానికి కారణమైన గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజఖోవా తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకున్న కేంద్ర మంత్రులు తమ పాత్రపై వివరణ ఇచ్చి, క్షమాపణ చెప్పాలన్నారు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా నబం తుకీ కొనసాగుతారని ఆయన స్పష్టం చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తమకు ఎదురుదెబ్బ కాదని, అది రాష్టానికి సంబంధించిన అంతర్గత వ్యవహారమని బీజేపీ పేర్కొంది. -
సినీ పాటల రచయితగా కపిల్ సిబల్
ముంబై: కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సినీ గేయ రచయితగా మారారు. త్వరలో విడుదలయ్యే షోర్గుల్ సినిమా కోసం ‘తేరే బినా’, ‘మస్త్ హవా’ పాటలకు సాహిత్యాన్ని అందించారు. ‘మస్త్ హవా’ పాటను హృషితా భట్, జిమ్మి షెర్గిల్‌పై చిత్రీకరించగా ప్రతిభా సింగ్ బాఘెల్ ఆలపించారు. తాను రొమాంటిక్ వర్గానికి చెందినవాడినని సిబల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
సర్జరీ పార్టీలో కాదు రాజకీయాల్లో చేయాలి
న్యూఢిల్లీ: కేంద్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుపున్న ఉత్సవాలపై కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ విరుచుకుపడ్డారు. ఓ వైపు దేశంలో వ్యవసాయ రంగం కుంటుపడుతోంటే ప్రభుత్వం కళ్లు మూసుకుందని విమర్శించారు. తాజాగా రాష్ట్రాల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీలో సర్జరీ చేసుకోవాలన్న విమర్శకుల మాటలపై స్పందించిన ఆయన సర్జరీ చేయించుకోవాలని కానీ అది దేశ రాజకీయాల మీదని అన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా కపిల్ సిబాల్ పేరును ప్రకటించారు. -
రెండేళ్ల పాలనలో మోదీ ఏం సాధించారు..?
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనలో ఏం సాధించారని, అసలు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఈ రెండేళ్ల పాలనే అత్యంత దారుణమైన పాలన అని ఆయన అభిప్రాయపడ్డారు. రెండేళ్లు వాగ్దానాలతోనే సరిపెట్టారని, వాటిని ఎప్పుడు అమలు చేస్తారో అర్థం కావడం లేదన్నారు. ఆర్ధికాభివృద్ధి, విదేశీ వ్యవహారాలు, ఉద్యోగాల కల్పన, మొదలైన విషయాలలో మోదీ సాధించినదేమీ లేదని వ్యాఖ్యానించారు. కేవలం ప్రకటనలతోనే ప్రభుత్వాలను నడిపిస్తున్నారని, చర్చకు రావడానికి సిద్ధమేనా అంటూ కాంగ్రెస్ నేత సవాల్ విసిరారు. దమ్ముంటే మీ క్యాబినెట్ లోని ఏ మంత్రయినా సరే రెండేళ్ల పాలనపై చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నారా అని మాట్లాడారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని నరేంద్ర మోదీకి అసలు పోలికే లేదన్నారు. మన్మోహన్ మాటలు చెప్పే రకం కాదు.. కేవలం చేతల మనిషి అని, అయితే మోదీ మాత్రం మాటలకోరు.. చేతల్లో ఆయన శూన్యమని వ్యాఖ్యానించారు. అంతేందుకు కనీసం మీ నియోజకవర్గం వారణాసి అయినా సరిగా ఉందా, రైతుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేశారా.. యువతకు ఉద్యోగాలు కల్పించారా అని మోదీ పాలనపై సిబల్ తీవ్రంగా మండిపడ్డారు. -
'సలహా ఇచ్చిన మంత్రిని సాగనంపండి'
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలన విధించమని సలహా ఇచ్చిన మంత్రిని తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఉత్తరాఖండ్ లో భంగపాటు గురైన మోదీ.. పార్లమెంట్ లో క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. బీజేపీ రాజకీయ బేరాలు ఫలించలేదని అన్నారు. 'కాంగ్రెస్ రాజకీయ బేరసారాలు సాగించిందని బీజేపీ ఆరోపిస్తోంది. అలా అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీ చెంతకు ఎందుకు చేరార'ని సిబల్ ప్రశ్నించారు. అధికార దాహంతోనే ఆర్టికల్ 356ను మోదీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. గత రెండేళ్లుగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని ఆరోపించారు. 33 శాతం మంది ప్రజలు కరువుతో అల్లాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మోదీ అబద్దపు వాగ్దానాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. -
హెరాల్డ్ కేసులో ఐటీ శాఖకు జైట్లీ పరోక్ష సూచనలు: సిబల్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేషనల్ హెరాల్డ్ కేసు అంశాన్ని ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం నేరంగా అభివర్ణిస్తూ.. కాంగ్రెస్‌కు ఐటీ శాఖ నోటీసులివ్వాలని పరోక్షంగా సూచించారని కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ శనివారమిక్కడ ఆరోపించారు. హెరాల్డ్ అంశంలో కాంగ్రెస్ మోసం చేసిందని, ధనాన్ని మళ్లించిందని చేస్తున్న ఆరోపణలన్నింటిని తోసిపుచ్చారు. కాగా, కాంగ్రెస్ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని జైట్లీ ఆరోపించారు. ఈ కేసులో ప్రధానమంత్రి కార్యాలయంపై అనవసరంగా బురద చల్లుతున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెన్నైలో ఆరోపించారు. -
ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా
పార్లమెంట్లో ఏం జరిగింది -26 విభజన బిల్లుపై 20-02- 2014న రాజ్యసభలో చర్చ కొనసాగింపు. అరుణ్‌జైట్లీ(నిన్నటి తరువాయి) : న్యాయమంత్రి గారు చెప్పిన ఒక విషయం మీద నేను మాట్లాడాలి. మనకి ఈ దేశంలో ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ప్రకారం ప్రభుత్వాలు నడుస్తాయి. శాంతిభద్రతలు, పోలీసులు రాష్ట్ర పరిధిలోని అంశాలు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. మాకభ్యంతరం లేదు. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ సీమాంధ్ర ప్రభుత్వం కిందగాని, తెలంగాణ ప్రభుత్వం కిందగాని ఉండకూడదు. న్యూట్రల్ ఏజెన్సీగా గవర్నర్ చేతుల్లో ఉంటుంది. దానికి మా అభ్యంతరంలేదు. ప్రశ్న ఏమిటంటే, గవర్నర్‌కి ఇద్దరు సలహాదారులుంటారు. వారిని కేంద్రం నియమిస్తుంది. గవర్నర్ కూడా కేంద్ర ప్రతినిధి. అంటే, గవర్నర్ ద్వారా శాంతిభద్రతలు కేంద్రం చేతుల్లోకి తీసుకుంటోంది. ఇది మన ఫెడరల్ విధానానికి వ్యతిరేకం. సిబల్‌గారు ఇది సప్లిమెంటల్, ఇన్సిడెంటల్, కాన్‌సీక్వెంటల్ అంటున్నారు. ఈ విషయం అనుబంధమో, ఆకస్మికమో అనుకునేంత చిన్న విషయం కాదు. నా భయం ఏమిటంటే, ఇది మన ప్రభుత్వాల పనితీరుల్లో ప్రధానమైన మార్పు. అందుకే రాజ్యాంగ సవరణ, ఏదో ఒక స్థాయిలో తప్పనిసరి. మేము రాజ్యాంగ సవరణకు మద్దతిస్తాం. ఇప్పుడే, ఇక్కడే చట్టబద్ధంగా తెలంగాణ ఏర్పరచమంటున్నాం. రేపు ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు వస్తే ఏమవుతుంది? మళ్లీ పార్లమెంట్ సమావేశమై రాజ్యాంగ సవరణ చెయ్యాలి. కపిల్ : అప్పోజిషన్ లీడర్ కొన్ని నిమిషాల క్రితం గవర్నర్ న్యూట్రల్ ఏజెన్సీ అన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్ అంటున్నారు. సీమా్రంధ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడే గవర్నర్‌కు ఇలా ఏజెంట్ బిరుదు కట్టబెట్టడం సమంజసం కాదు. గవర్నర్‌ను న్యూట్రల్‌గా భావించి అధికారాలిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా, తెలంగాణ మంత్రిమండలి సలహామేరకే ఆయన నడుచుకుంటారు. కాని ఆఖరుగా నిర్ణయాధికారం మాత్రం గవర్నర్దే. 371-హెచ్ ఆర్టికల్ కూడా ఇదే చెప్పింది. ప్రధానమంత్రి : అధ్యక్షా! ప్రతిపక్ష నాయకుడు, ఇతర ప్రతిపక్ష సభ్యులు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సభ్యుల ఉపన్యాసాలు శ్రద్ధగా విన్నాను. ఇప్పటికే, ప్రభుత్వం చేపట్టనున్న ప్రత్యేక చర్యల గురించి, ముఖ్యంగా సీమాంధ్ర గురించి రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల గురించి హోంమంత్రి ప్రస్తావించారు. నేను మరికొన్ని ప్రకటనలు చేయదలిచాను. మొదటిగా, కేంద్ర సహాయం అందించే నిమిత్తం, పదమూడు జిల్లాలు కలిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో సహా, ఐదేళ్లపాటు ‘స్పెషల్ కేటగిరి స్టేటస్’ ఇవ్వబడుతుంది. ఈ చర్య రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పటిష్టం చేస్తుంది. రెండవది, బిల్లులో ఇప్పటికే ప్రస్తావించిన అంశం, అవసరమైన ఆర్థిక చర్యలతోపాటు, పన్ను మినహాయింపులు వంటి పారిశ్రామికాభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి అవసరమైన చర్యలు కూడా రెండు రాష్ట్రాల్లో చేబడ్తాం. కొన్ని రాష్ట్రాలకు ఎలాగైతే ఇటువంటి వెసులుబాట్లు కల్పించామో, అదే ప్రాతిపదికన ఈ ప్రోత్సాహకాలు అమలు చేస్తాం. మూడవది, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ‘డెవలప్మెంట్ ప్యాకేజీ’ని బిల్లులో పొందుపర్చాం. ఈ ప్యాకేజీ ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కోరాపుట్- బొలంగీర్ - కలహంది, బుందేల్ ఖండ్ తరహాలో ఉంటుంది. ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాసకర్త పార్లమెంటు మాజీ సభ్యుడు: a_vundavalli@yahoo.com -
సారీ చెప్పనంతే!
సుప్రీం కోర్టు సూచనకు రాహుల్ నో న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ హత్యకేసులో ఆరెస్సెస్ పాత్ర ఉందం టూ చేసిన ఆరోపణలకు క్షమాపణ చెప్పేది లేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఆరెస్సెస్‌కు క్షమాపణ కోరితే కేసు ముగుస్తుంద ని సుప్రీం చేసిన సూచనను రాహుల్ తిరస్కరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాహుల్ వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేసే ప్రసక్తే లేదని.. కేసులో వాదించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబల్ కోర్టుకు తెలిపారు. గురువారం ఈ కేసు విచారణ సమయంలో.. రాహుల్ క్షమాపణ చెబితే కేసు వెనక్కు తీసుకుంటామని.. పరువునష్టం దావా వేసిన ఆరెస్సెస్ భీవండి శాఖ కార్యదర్శి రాజేశ్ కుంతే సుప్రీం కోర్టుకు తెలిపారు. దీనికి కపిల్ సిబల్ ససేమిరా అన్నారు. దీంతో.. ఈ కేసులో మధ్యంతర స్టేను పొడిగిస్తూ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి పంత్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు వెలువరించింది. రాహుల్ గాంధీ ఈ కేసులో తన ప్రతిస్పందన నాలుగువారాల్లో తెలియజేయాలని ఆదేశించింది. -
హార్దిక్ పటేల్ తరపున కపిల్ సిబాల్
రాజద్రోహం కేసు ఎదుర్కొంటున్న హార్దిక్ పటేల్ తరపున కాంగ్రేస్ నాయకుడు, ప్రముఖ లాయర్ కపిల్ సిబాల్ సుప్రికోర్టులో వాదనలు విన్పించనున్నారు. పటేల్ వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ఓ సభలో హార్దిక్ పటేల్ మాట్లాడుతూ.. రిజర్వేషన్లకై పిరికివాళ్లలా ఆత్మహత్య చేసుకోవడానికి బదులుగా అవసరమైతే పోలీసులను చంపాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలకు గాను హార్దిక్ పటేల్‌పై రాజద్రోహం కేసు నమోదైంది. అంతేగాక ఇండియా, దక్షిణాఫ్రికా వన్డే మ్యాచ్ సందర్భంగా చేపట్టిన నిరసనలో.. తలకిందులుగా ప్రదర్శించి జాతీయ జెండాను అవమానించాడనే కేసు కూడా హార్దిక్ పటేల్‌పై నమోదైంది. మంగళవారం హార్దిక్ పటేల్‌కు విధించిన రిమాండ్ గడువు తీరడంతో ఆయన్ని అహ్మదాబాద్ క్రైం బ్రాంచ్ పోలీసులు మరో కేసులో విచారణకై సూరత్ పోలీసులకు అప్పగించారు. హార్థిక్ పటేల్‌కు అహ్మదాబాద్ కోర్టు మూడురోజులు రిమాండ్ విధించగా అతన్ని విచారించలేదని లాయర్ మంగూకియా తెలిపారు. హార్దిక్ తండ్రి ఈ కేసును సుప్రీం కోర్టులో సవాల్ చేశారనీ, దీనిపై కపిల్ సిబాల్ వాదనలు విన్పించనున్నారని ఆయన తెలిపారు. -
ఏసీబీకి సుప్రీంకోర్టులో చుక్కెదురు
రేవంత్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏసీబీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుల నుంచి స్టేట్మెంట్లు రికార్డు చేశారని, సీఆర్పీసీ సెక్షన్ 164 కింద కేసు విచారణ పూర్తి చేశారని కోర్టు భావించింది. ఇప్పుడు మళ్లీ కస్టడీకి తీసుకుని ఏం విచారిస్తారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ప్రధాన నిందితుడు కేసును ప్రభావితం చేస్తాడని ఏసీబీ వాదించినా, ఆ వాదనలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ మీద జోక్యం చేసుకోడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. (చదవండి- రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ప్రారంభం) ఏసీబీ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పులో పలు లోపాలు ఉన్నాయని సిబల్ అన్నారు. కానీ, ఆయన వాదనతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. భోస్లే ఏకీభవించలేదు. ఇప్పటికే నెల రోజుల పాటు రేవంత్ రెడ్డి జైల్లో ఉన్నారని అన్నారు. విచారణ పూర్తయినందున ఇక ఆయన బెయిల్ రద్దుచేయాల్సిన అవసరం లేదని భావించారు. కాగా, బెయిల్ షరతులను రేవంత్ ఉల్లంఘించారని, జైలు నుంచి విడుదలైన సమయంలోనే బెదిరింపు ధోరణిలో ముఖ్యమంత్రిపై మాట్లాడారని న్యాయవాదులు అంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తిరస్కరించడంతో ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లాలని, మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశముంది. -
రేవంత్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ ప్రారంభం
ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికి, హైకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకున్న టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సహా.. ముగ్గురి బెయిల్‌ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో తెలంగాణ ఏసీబీ దాఖలుచేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహాల బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ ఏసీబీ కోరుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం మధ్యాహ్నం ఈ పిటిషన్‌పై వాదనలు మొదలయ్యాయి. రేవంత్ రెడ్డి సహా ముగ్గురి బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ఏసీబీ రెండు స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసింది. రేవంత్ రెడ్డి తరఫున రాంజెఠ్మలానీ వాదిస్తుండగా.. ఏసీబీ తరఫున ముగ్గురు ప్రముఖ న్యాయవాదులు వాదిస్తున్నారు. కపిల్ సిబల్, దుష్యంత్ దావే, హరీన్ రావెల్ ముగ్గురూ ఏసీబీ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి తదితరులు చేసినది కేవలం ఒక ఎమ్మెల్యేను కొనేందుకు చేసిన ప్రయత్నం కాదని, అది రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు చేస్తున్న కుట్ర అని ఏసీబీ తరఫు న్యాయవాదులు చెబుతున్నారు. పది మంది ఎమ్మెల్యేలను కొనాలని, తద్వారా ప్రభుత్వాన్ని పడగొట్టాలని అనుకున్నారని సుప్రీంకోర్టుకు విన్నవించనున్నారు. రేవంత్ రెడ్డి విచారణలో వాస్తవాలను వెల్లడించలేదని, 50 లక్షలు ఎక్కడినుంచి వచ్చాయో తెలియాల్సి ఉందని అంటున్నారు. ఎమ్మెల్యే జైలు నుంచి విడుదలైనప్పుడు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారని చెప్పడమే కాక.. అందుకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తున్నారు. -
సుప్రీంకోర్టుకు శ్రీనివాసన్ బేషరతు క్షమాపణ
న్యూఢిల్లీ: బీసీసీఐ చైర్మన్ ఎన్ శ్రీనివాసన్ సుప్రీంకోర్టుకు బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఫిబ్రవరి 8 వ తేదీన జరిగిన వర్కింగ్ కమిటీ సమావేశంలో శ్రీనివాసన్ పాల్గొనడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆయన బేషరతుగా క్షమాపణలు తెలిపారు. ఆయన తరఫున వాదిస్తున్న ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ సుప్రీంకు శ్రీనివాసన్ తరఫున క్షమాపణలు తెలియజేశారు. మార్చి 2వ తేదీన జరిగే బీసీసీఐ సమావేశానికి శ్రీనివాసన్ హాజరుకాబోరని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత వర్కింగ్ కమిటీ సమావేశంలో శ్రీనివాసన్ పాల్గొనడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆయన ఇలా చేసి ఉండాల్సింది కాదు... విరుద్ధమైన ప్రయోజనాలేవో మాకు కనిపిస్తున్నాయంటూ సుప్రీం అప్పట్లో వ్యాఖ్యానించింది. -
పట్టణ సమస్యలు పరిష్కరించండి
సీఎంతో భివండీ ప్రముఖుల భేటీ భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ను ఎంపీ కపిల్ సిబాల్, మేయర్ ప్రతిభాపాటిల్ కోరారు. ఈ మేరకు వారు ఆదివారం సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన భివండీకి నిత్యం వేల సంఖ్యలో ట్రాన్స్పోర్ట్ వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయని, ప్రస్తుతం రోడ్ల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి సమస్యలను కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, భివండీ తూర్పు నియోజకవర్గంలో పవర్లూమ్ పరిశ్రమపై ఆధారపడి అధిక సంఖ్యలో తెలుగువారు ఆధారపడి జీవిస్తున్నారని, వారికి ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అందే విధంగా చొరవ తీసుకోవాలని కోరారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను తమ ప్రభుత్వం తప్పకుండా తీరుస్తుందని సీఎం వారికి హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో ఎంపీ, మేయర్‌తోపాటు భివండీ పడమర ఎమ్మెల్యే మహేష్ చౌగులే, నాయకులు సంతోష్ ఎం శెట్టి, మాజీ మేయర్ విలాస్ పాటిల్ తదితరులు ఉన్నారు. -
సిబల్ ఇంటి అద్దె 16 లక్షలు
ఢిల్లీలోనే అత్యంత భారీ అద్దె చెల్లించే ఇల్లు ఇదే! న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, న్యాయవాది కపిల్ సిబల్ ఢిల్లీలోని లీఫీ లత్యెన్స్ జోన్లో ఉన్న రాజప్రాసాదం లాంటి అద్దె భవనంలోకి త్వరలో మారనున్నారు. ఈ భవనం అద్దె నెలకు రూ. 16 లక్షలు. ఢిల్లీలోని ప్రముఖ వ్యాపారి సిద్ధార్థ్ శరీన్కు చెందిన ఈ భవనాన్ని అద్దెకు తీసుకోవడానికి ఒప్పందం ఇప్పటికే పూర్తయినట్టు శరీన్ సన్నిహితుల ద్వారా తెలిసింది. అద్దెను నెలకు రూ.18 లక్షలుగా అనుకున్నప్పటికీ మధ్యేమార్గంగా రూ. 16 లక్షలు చెల్లించేందుకు సిబల్ అంగీకరించారన్నారు. కాగా, ఢిల్లీ నగరంలో అత్యంత భారీస్థాయిలో అద్దె చెల్లించే భవనం ఇదే కావడం విశేషం. ఆగస్టు 1కి ముందే ప్రస్తుతం నివాసముంటున్న తీన్ మూర్తి రోడ్డులోని ప్రభుత్వ బంగ్లా నుంచి ఖాళీ చేయనున్నట్టు సిబల్ వెల్లడించారు. 1250 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మించిన అద్దె భవనంలో సిబల్ లా ప్రాక్టీస్ చేసుకునేందుకు ఒక కార్యాలయం కూడా ఉంది. -
కపిల్ ఇంటి కిరాయి అక్షరాలా రూ. 16 లక్షలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ మారనున్న ఇంటి అద్దె ఎంతో తెలుసా. అక్షరాలా రూ. 16 లక్షలట. యూపీఏ సర్కారులో పదేళ్లు కేబినెట్ మంత్రిగా ఉన్న సిబల్.. తీన్‌మూర్తి రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి అన్ని సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన అద్దె ఇంటికి మారనున్నారు. జోర్‌బాగ్ ప్రాంతంలోని ఈ ఇంటికి ఆయన త్వరలో మారనున్నారు. నగరంలో అత్యంత అధిక అద్దె పలుకుతోన్న భవనాల్లో ఇదొకటని అంటున్నారు. చాందినీచౌక్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయిన కపిల్ సిబల్ ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి ఆగస్టు ఒకటో తేదీన అద్దె ఇంటికి మారనున్నారు. ఎమ్మార్ ఎంజీఎఫ్ ప్రమోటర్ శ్రవణ్ గుప్తా బావమరిది సిద్ధార్థ్ సరీన్ బంగ్లాను ఆయన అద్దెకు తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త అయిన సరీన్త్ ఈ ఇంటికి నెలకు 18 లక్షల రూపాయల అద్దె డిమాండ్ చేశారని, పదహారు లక్షలకు అద్దె ఒప్పందం కుదిరిందని అంటున్నారు. దేశంలోని ప్రముఖ న్యాయవాదులలో ఒకరైన కపిల్ సిబల్ ఈ ఇంట్లో నుంచి లా ప్రాక్టీసు చేయాలనుకుంటున్నారు. ఆయన లా ఆఫీసు కూడా ఇదే భవనంలో ఏర్పాటుచేసుకోనున్నారు. కార్పొరేట్, రాజ్యాంగ వ్యవహారాలలో దిట్ట అయిన కపిల్ సిబల్ అనేక ప్రముఖ కేసులలో తన సత్తా చూపారు. మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో సభ్యుడయ్యాక ఆయన తన న్యాయవాద వృత్తిని పక్కనపెట్టారు. లుట్యెన్స్ జోన్లో బంగ్లాలు తక్కువగా, డిమాండ్ ఎక్కువగా ఉన్నందువల్ల ఎక్కువ అద్దెలు పలుకుతున్నాయని రియల్టర్లు అంటున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన 265 మంది ఎంపీలు ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయాల్సి ఉంది. వారిలో పలువురు లుట్యెన్స్ జోన్‌లోని ప్రైవేటు భవనాలకు మారాలనుకుంటున్నారు. ప్రధాన నివాసం, పార్లమెంట్, ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు నెలవైన లుట్యెన్స్ జోన్లో నివసిం చడం తమకు హోదాకు అనుగుణంగా ఉంటుందని పలువురు రాజకీయవేత్తలు, వాణిజ్య వేత్తలు భావిస్తుంటారు. లుట్యెన్స్ జోన్లో 1000 పైగా బంగ్లాలు ఉన్నాయి. అయితే ఇందులో కేవలం 10 శాతం మాత్రమే ప్రయివేటు బంగ్లాలు, ఈ బంగ్లాలో కొన్ని దేశంలోని ప్రముఖ వాణిజ్యవేత్తలకు చెందినవి. ఎల్ఎన్ మిట్టల్, కేపీసింగ్ , సునీల్ మిట్టల్, నవీన్ జిందాల్ వంటి వాణిజ్యవేత్తలకు ఈ ప్రాంతంలోనే సొంత భవనాలున్నాయి. -
‘మోడీ నిఘా’పై దర్యాప్తు వద్దు!
* సుప్రీంకోర్టును ఆశ్రయించిన గుజరాత్ మహిళ * స్నూప్‌గేట్ వివాదంలో కొత్త మలుపు న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాల మేరకు ఆ రాష్ట్ర పోలీసులు ఓ మహిళపై నిఘా ఉంచి నట్లు చెబుతున్న ‘స్నూప్‌గేట్’ వివాదం మరో కొత్త మలుపు తిరిగింది. ఈ నిఘా వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించిన కమిషన్లు దర్యాప్తును నిలిపివేసేలా ఆదేశించాలంటూ స్నూప్‌గేట్ వివాదంలో కేంద్ర బిందువైన మహిళ తన తండ్రితో కలిసి మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమిషన్లు స్నూప్‌గేట్ అంశంపై దర్యాప్తులో ముందుకు పోకుండా నిరోధించాలంటూ ఆమె తండ్రితో కలిసి సంయుక్త పిటిషన్ దాఖలు చేశారు. బాధితులు ఫిర్యాదు చేయకుండానే ఇతర కారణాల వల్ల కొందరు వారి హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. అయితే ఈ నిఘా వ్యవహారంపై సంబంధిత పక్షాల వాదనలు వినకుండానే ప్రస్తుతం దర్యాప్తును నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తులు జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ ఎన్వీ రమణలతో కూడిన సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై వివరణ కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సదరు మహిళ పేరును వెల్లడించరాదని మీడియాకు సూచించింది. * కోర్టుకు పిటిషన్‌దారుల విజ్ఞప్తి ఇదీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లను నియమించడం అన్యాయం. ఇది మా ప్రాథమిక హక్కులైన వ్యక్తిగత గోప్యత, హుందాగా జీవించే హక్కులను ఉల్లంఘించడమే. * ఈ నిఘా వివాదం వార్తలను ప్రచురించకుండా, ప్రసారం చేయకుండా మీడియాను నిరోధించండి. * నా ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు గుజరాత్ సర్కారు తీసుకున్న చర్యలపై నేను సంతృప్తి చెందాను. * ఆ అంశంపై నేను ఫిర్యాదు చేయకుండానే నన్ను, నా కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు దుష్ర్పచారం సాగిస్తున్నారు. * నిర్ధారించుకోకుండా, అనధికారిక అంశాలతో వెబ్ పోర్టళ్లు కథనాలు వెలువరించడంపై సీబీఐ దర్యాప్తు జరిపించండి. * నేను గుజరాత్, జాతీయ మహిళా కమిషన్లను సంప్రదించినా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దర్యాప్తు కమిషన్లు ఏర్పాటు చేసి ముందుకు వెళ్లడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రతీకారం అనే భావన కలిగించరాదనే: కాంగ్రెస్ స్నూప్‌గేట్ వ్యవహారంపై దర్యాప్తు కమిషన్‌కు నేతృత్వం వహించే న్యాయమూర్తి పేరు ప్రకటించాలన్న నిర్ణయాన్ని విరమించుకోవడంపై కాంగ్రెస్ మంగళవారం స్పందించింది. రాజకీయ ప్రతీకారం కోసమే ఇలాంటి చర్యలు తీసుకున్నారన్న భావన కలిగించరాదనే మిత్రపక్షాల సలహాల ప్రకారం వెనక్కి తగ్గినట్లు మంగళవారం ఏఐసీసీ సమావేశం సందర్భంగా ఆ పార్టీ నేత, న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ తెలిపారు. మహిళపై మోడీ నిఘా వివాదంపై కేంద్రం నియమించిన దర్యాప్తు కమిషన్‌కు నేతృత్వం వహించే న్యాయమూర్తి పేరును ప్రకటించాలని భావించిన కేంద్రం.. మిత్రపక్షాల అభ్యంతరంతో దానిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. -
మోడీపై విరుచుకుపడ్డ కపిల్ సిబాల్
-
'ఆవిడ' కంపెనీల మాటేంటి?
న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ఉద్దేశపూర్వకంగానే తన భార్య పేరిట ఉన్న కంపెనీల వివరాలను ఎన్నికల అఫిడవిట్లో చెప్పలేదని బీజేపీ నాయకుడు సుబ్రమణ్యం స్వామి ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ప్రతిష్ఠాత్మక చాందినీ చౌక్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సిబల్పై ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే, సిబల్ ఈ ఆరోపణలను ఖండించారు. తన భార్య పేరిట ఉన్న మూడు కంపెనీలకు చెందిన ఆస్తులు, అప్పుల వివరాలను సిబల్ కావాలనే దాచిపెట్టారని ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మకు ఇచ్చిన ఫిర్యాదులో స్వామి ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను ఖండించిన కపిల్ సిబల్, తాను బయటపెట్టకుండా ఉన్న ఆస్తులు ఏమైనా ఉంటే, వాటిని ఉచితంగా స్వామికి ఇచ్చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చారు. -
కపిల్ సిబల్ డబ్బులు పంచారు
సాక్షి, న్యూఢిల్లీ: చాందినీచౌక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మనుషులు డబ్బులు పంచారని ఆయన ప్రత్యర్థి, ఆప్ నేత అశుతోష్ ఆరోపించారు. కపిల్ సిబల్ మనుషులు డబ్బు పంచడాన్ని తన భార్య స్వయంగా చూసిందని ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో తక్షణం జోక్యం కలిగించుకోవాలని సిబల్ అభ్యర్ధిత్వాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆశుతోష్ తనపై నిరాధార ఆరోపణలు చేశారని కపిల్ సిబల్ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. దానిపై ఎన్నికల కమిషన్ ఆశుతోష్‌కు నోటీసు జారీ చేసింది. ఏ ఆధారాలతో సిబల్పై ఆరోపణలు చేశారో తెలపాలని ఎన్నికల కమిషన్ అశుతోష్‌ను ఆదేశించింది. కపిల్ సిబల్ డబ్బులతో ఓట్లు కొనడానికి ప్రయత్నిస్తున్నారని, ఎన్నికల కమిషన్ సిబల్ పై కేసు నమోదుచేసి, ఎన్నికల్లో పోటీచేయకుండా సిబల్పై నిషేధం విధించాలని అశుతోష్ ట్విటర్లో పేర్కొన్నారు. తనకు డిపాజిట్ కూడా దక్కద న్న విషయాన్ని కపిల్ సిబల్ గుర్తించారని, అందుకే డబ్బులతో గెలవాలనుకుంటున్నారని కానీ ప్రజలు మేల్కొన్నార ని ఆశుతోష్ ట్వీట్లో పేర్కొన్నారు. డబ్బుతో ఓట్లు కొనగలమని అనుకునే సిబల్ వంటి కొందరు నేతల వల్ల భారత ప్రజాస్వామ్యానికి చెడ్డపేరు వస్తోందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ కపిల్ సిబల్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని అశుతోష్ తెలిపారు. ఇది అధికారానికి, నిజాయతీకి మధ్య జరుగుతోన్న ఎన్నిక అని, నిజాయతీ గెలుస్తుందని ఆయన ట్వీట్ చేశారు. సిబల్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలని అశుతోష్.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహా ఇచ్చారు. మంగళవారం చాందినీచౌక్‌లో తన భార్య ప్రచారం చేస్తున్నప్పుడు కపిల్ సిబల్ మనుషులు డబ్బులు పంచడం చూసిందని ఆయన తెలిపారు. కపిల్ సిబల్ ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో ఎన్నికల కమిషన్ అశుతోష్‌కు నోటీసు జారీ చేసి సంజాయిషీ కోరింది. కపిల్ సిబల్ తనపై అశుతోష్ చేసిన ఆరోపణలను తోసిపుచ్చారు. ప్రజల మద్దతు కోల్పోయినవారు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తుంటారని ఆయన అన్నారు. ఇది రాజకీయాలలో కొత్తగా వచ్చినవారు చేసే ఆరోపణలని ఆయన కొట్టివేశారు. అశుతోష్ ఇంకా నేర్చుకోవలసింది ఎంతో ఉందని, అతణ్ని చూస్తే తనకు జాలేస్తోందన్నారు. ఆరోపణల్లో నిజం ఉంటే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. -
హాట్‌టాపిక్: ప్రతిష్టాత్మక చాందినీచౌక్
చాందినీచౌక్ చరిత్రాత్మక ప్రదేశం. మొఘల్ చక్రవర్తి షాజహాన్(1628-1658) తన రాజధానిని ఆగ్రా నుంచి ఢిల్లీకి మార్చాలనుకున్నప్పుడు యమునా నది తీరాన ఎర్రకోటను నిర్మించారు. ఎర్రకోటలో నివసించే వారి కోసం ఒక బజారు అవసరమని భావించిన షాజహాన్ కుమార్తె జంహా ఆరా చాందినీ చౌక్ బజార్‌కు రూపకల్పన చేశారు. చంద్రుడి వెన్నెల ప్రతిబింబించేలా అప్పట్లో ఈ బజారు మధ్యలో ఓ కొలను ఏర్పాటు చేశారు. కాలక్రమంలో కొలను పూడుకుపోయినా బజారు పేరు చాందినీ చౌక్ చిర స్థాయిగా నిలిచిపోయింది. ఢిల్లీలో ప్రసిద్ది చెందిన చాందినీచౌక్ పేరును మార్చి, సచిన్ టెండూల్కర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదన మూడేళ్ల క్రితం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌కు వచ్చింది. దానిని అందరూ తీవ్రంగా వ్యతిరేకించారు. చాందినీచౌక్ పేరు మార్చడమంటే దేశ సాంస్కృతిక వారసత్వాన్ని అవమానించినట్లుగా భావించారు. చాందినీచౌక్‌ను షాజహాన్ నిర్మించాడని, ఈ పేరును మార్చడం ఈ నగరానికి ఉన్న చరిత్రను కించపర్చడమే అవుతుందని పలువురు పేర్కొన్నారు. దేశరాజధానిలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన చాందినీచౌక్‌లోని అన్ని వ్యాపార సంస్థలను ఆన్లైన్లో పెట్టినట్లు గూగల్ ఇండియా తెలిపింది. ఇక్కడ వివిధ కేటగిరీలకు సంబంధించి మొత్తం 2500 వ్యాపార సంస్థలున్నాయి. వీటన్నింటికి ప్రత్యేకంగా ఒక్కో వెబ్‌సైట్‌ను కూడా రూపొందించారు. చాందినీ చౌక్ ప్రాంతంలో వ్యాపారస్తులే అధికం. అందుకే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుంచి వ్యాపారులు లేదా ఆ వర్గానికి చెందిన వారే గెలుస్తూ ఉంటారు. ఇంతటి చారిత్రక ప్రాముఖ్యత గల ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఈ సారి ముగ్గురు హేమాహేమీలు పోటీపడుతున్నారు. ఈ నెల10న ఇక్కడ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్ తరపున కేంద్ర న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్, బిజెపి నుంచి పార్టీ సీనియర్ నేత హర్షవర్థన్, ఆమ్ అద్మీ పార్టీ నుంచి ప్రముఖ జర్నలిస్ట్ టీవీ యాంకర్ అషుతోష్ పోటీ చేస్తున్నారు. కపిల్ సిబల్: పంజాబ్‌కు చెందిన కపిల్ సిబల్ గత ఎన్నికలలో ఇక్కడ నుంచే గెలుపొందారు. సాదారణంగా ఇక్కడ నుంచి వ్యాపారులు లేక ఆ వర్గానికి చెందినవారే గెలుస్తూ ఉంటారు. చాందినీ చౌక్ ప్రాంతంలో పంజాబీల సంఖ్య అధికం. తన రాష్ట్ర ఓటర్ల బలంతోనే గతంలో ఆయన ఇక్కడ నుంచి విజయం సాధించారు. అయితే ప్రస్తుత పరిస్థితులలో సిబల్ మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఇష్టపడలేదు. పంజాబ్‌లోని ఏదో ఒక లోకసభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని ఆయన కాంగ్రెస్ అధిష్టానికి చెప్పారు. ఫలితంలేదు. ఆయన మాట అధిష్టానం వినలేదు. విధిలేని పరిస్థితులలో సిబల్ మరోసారి చాందినీ చౌక్ నుంచి పోటీకి సిద్ధపడ్డారు. హర్షవర్థన్: వ్యాపార వర్గానికి చెందిన హర్షవర్ధన్ బిజెపి సీనియర్ నేత. హర్షవర్థన్ ఇటీవల ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచారు. బిజెపికి తగిన సంఖ్యాబలం ఉంటే ఆయనే ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి ఉండేవారు. స్థానికుడైన హర్షవర్థన్‌కు ఓటర్లతో సన్నిహిత సంబంధాలున్నాయి. వృత్తిపరంగా వైద్యుడైన ఆయనను మిత్రులు, ప్రత్యర్థులు కూడా ‘డాక్టర్ సాబ్’ అని పిలుస్తారు. అషుతోష్: ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అషుతోష్ ప్రముఖ టీవీ చానల్లో పనిచేసి ఢిల్లీ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఆ టీవీ చానల్లో యాంకర్‌గా పని చేసినంత కాలం వైశ్య కులాన్ని సూచించే పేరు ‘గుప్తా’ను పెట్టుకోలేదు. ఇప్పుడు నామినేషన్ వేసే సమయంలో మాత్రం తన పేరు చివర ‘గుప్తా’ను తగిలించుకున్నారు. చాందీనీ చౌక్‌లో గణనీయ సంఖ్యలో ఉన్న వైశ్యుల మద్దతు సంపాదించేందుకే ఆయన ‘గుప్తా’గా పరిచయం చేసుకున్నారు. ఈ ముగ్గురిలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. బిజెపి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ఉన్న వ్యతిరేకత వల్ల ముస్లిం ఓట్లు తనకే పడతాయని కపిల్ సిబల్ ఆశ. వ్యాపార వర్గం ఓట్లు తనకే పడతాయన్నది హర్షవర్థన్ అభిప్రాయం. ఇక మిగిలిన సామాన్య ఓటర్ల మద్దతు తనకేనన్నది అశుతోష్ గుప్తా అంచనా. -
హోరెత్తిన చాందినీచౌక్
న్యూఢిల్లీ: కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల ప్రచారంతో నగరంలోని చాందినీచౌక్ బుధవారం హోరెత్తిపోయింది. ఈ నియోజకవర్గం నుంచి హేమాహేమీలు బరిలోకి దిగడంతో ఇక్కడి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. బీజేపీ నుంచి డాక్టర్ హర్షవర్ధన్, కాంగ్రెస్ నుంచి కపిల్ సిబల్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి అశుతోష్ పోటీ పడుతున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పరిస్థితి హర్షవర్ధన్, అశుతోష్‌లు బరిలోకి దిగడంతో ముక్కోణపు పోటీగా మారిపోయింది. ఎవరికివారే తమ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో ఆయ పార్టీల అధిష్టానాలు కూడా ఇక్కడి గెలుపుపై దృష్టిసారించాయి. కాంగ్రెస్ నుంచి సీనియర్ మంత్రిగా కొనసాగుతున్న కపిల్ సిబల్ ఇక్కడ పరాజయం పాలైతే అది పార్టీకే చెడ్డపేరు తెస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన ముద్రవేసిన డాక్టర్ హర్షవర్ధన్ గెలుపును కూడా ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటోంది. ఇక సినియర్లపై గెలిచి సత్తాచాటాలని భావిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అశుతోష్‌ను గెలిపించి, మరోసారి కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలనుకుంటోంది. ఇలా ఎవరికివారే ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని, అదే స్థాయిలో ప్రచారానికి దిగుతుండడంతో ఈ నియోజకవర్గంలోని ప్రతి వీధి పార్టీల నినాదాలతో హోరెత్తిపోతోంది. ముస్లింలదే కీలక పాత్ర.. దాదాపు 14 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో ముస్లిం జనాభా సుమారు 20 శాతం ఉంటుంది. దీంతో ముగ్గురు అభ్యర్థులు కూడా ముస్లిం ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నంలో కాంగ్రెస్ కాస్త ముందున్నా, ఆప్ రంగప్రవేశంతో ముస్లిం ఓట్లు చీలే అవకాశముందని, ఇది పరోక్షంగా బీజేపీకి అనుకూలిస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ మాత్రం ముస్లిం ఓట్లపై పెద్దగా ఆశపెట్టుకోకున్నా హర్షవర్ధన్ ఇమేజ్‌తోపాటు మోడీ చరిష్మాతో కొన్ని ముస్లిం ఓట్లు కూడా బీజేపీకి పడే అవకాశముందని చెబుతున్నారు. -
ఏడు స్థానాలకు 206 నామినేషన్లు
న్యూఢిల్లీ: రాజధానిలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 10 జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 206 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శనివారంతో నామినేషన్ల గడువు ముగిసే సరికి 206 మంది నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కపిల్ సిబల్, హర్షవర్ధన్, రాజ్‌మోహన్ గాంధీ వంటి ప్రముఖులు బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అన్ని పార్టీల నుంచి నువ్వా-నేనా అనే స్థాయిలోనే అభ్యర్థులు బరిలోకి దిగారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో కూడా ఏ పార్టీ గెలుపు ఖాయమని చేప్పేందుకు వీలులేకుండా అభ్యర్థుల జాబితా కనిపిస్తోందన్నారు. బీజేపీ నేతలు హర్షవర్ధన్, మీనాక్షి లేఖీ, కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, ఆప్ నేతలు అశుతోష్, రాజ్‌మోహన్ గాంధీ వంటి ప్రముఖుల గెలుపు కొంతవరకు ఖాయంగానే కనిపిస్తున్నా ఢిల్లీ ఓటరు ఎప్పుడూ ఊహించని రీతిలో తీర్పునిస్తున్నాడని చెబుతున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 221 మంది నామినేషన్లు వేసినప్పటికీ ఉపసంహరణ తర్వాత 160 మంది మాత్రమే బరిలో నిలిచారని, ఈసారి కూడా ఉపసంహరణ తర్వాత అసలైన అభ్యర్థుల సంఖ్య ఖరారవుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, మరో నటుడు విశ్వజీత్ చటర్జీ, సిట్టింగ్ ఎంపీ కృష్ణాతీరథ్, రమేశ్ కుమార్ వంటి ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఇక తృణముల్ కాంగ్రెస్ కూడా ఢిల్లీలో సత్తాచాటాలని పరితపిస్తోంది. ఈ పార్టీ అభ్యర్థులు చివరిరోజైన శనివారం నామినేషన్లు వేశారు. ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలోకి దిగుతున్న భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, ఆప్ నేత ఆనంద్‌కుమార్‌ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముందంటున్నారు. ఇక కేంద్ర మంత్రి కృష్ణాతీరథ్‌కు కూడా ఆప్ నేత రాఖీ బిర్లా, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన ఉదిత్‌రాజ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక తృణముల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న విశ్వజీత్ చటర్జీకి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, బీజేపీ నేత మీనాక్షి లేఖీ, ఆప్ నేత ఆశిష్ కేతన్ నుంచి పోటీ ఎదురుకానుంది. ఇలా ఏడు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల బలాబలాలు పోటాపోటీగా ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నవారికి స్థానికంగా హర్షవర్ధన్‌కు ఉన్న మంచిపేరు, ప్రధాని అభ్యర్థిగా మోడీ చరిష్మా కలిసివచ్చే అంశంకాగా ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమాలు, 49 రోజుల పాలనలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆప్ అభ్యర్థుల విజయానికి అనుకూలాంశాలుగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం పార్టీ పేరుమీదే గెలుస్తామని చెబుతున్నారు. -
సిబల్ సహా పలువురి నామినేషన్ల సమర్పణ
న్యూఢిల్లీ: చాందినీచౌక్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్రమంత్రి కపిల్ సిబల్ గురువారం నామినేషన్ వేశారు. ఇక న్యూఢిల్లీ నుంచి పోటీ కోసం ఆప్ అభ్యర్థి ఆశిష్ ఖేతాన్, ఈశాన్యఢిల్లీలో పోటీ కోసం ఆనంద్‌కుమార్ కూడా నామినేషన్లు సమర్పించారు. బీజేపీ అభ్యర్థి మహేశ్ గిరి తూర్పుఢిల్లీ స్థానం కోసం నామినేషన్ పత్రాలను సమర్పించారు. రాష్ట్రంలోని ఏడు స్థానాలకు వచ్చే నెల 10 నిర్వహించే ఎన్నికల కోసం గురువారం వరకు 34 మంది నామినేషన్ పత్రాలను అందజేశారని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. వీటిలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఒకటి చొప్పున, ఆప్ నుంచి రెండు, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి మిగతావి వచ్చాయి. ఈ నెల 22 వరకు నామినేషన్ పత్రాలు సమర్పించవచ్చు. 26వ తేదీ వరకు వాటిని ఉపసంహరించుకునేందుకు అవకాశముంది. -
ముస్లింలే కీలకం..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఏడు లోక్‌సభ నియోజకవర్గాల్లో అతిచిన్న నియోజకవర్గమైన చాందినీచౌక్‌లో రాజకీయ దిగ్గజాల మధ్య పోటీ జరుగనుంది. కేంద్ర మంత్రి, సిట్టింగ్ ఎంపీ కపిల్ సిబల్ కాంగ్రెస్ అభ్యర్థిగా, ఆమ్ఆద్మీ పార్టీ తరఫున మాజీ టీవీ జర్నలిస్టు ఆశుతోష్ , బీజేపీ అభ్యర్థిగా ఢిల్లీ శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ పోటీచేస్తున్నారు. హేమాహేమీలు తలపడుతోన్న ముక్కోణపు పోరులో విజేతను నిర్ధారించడంలో ముస్లిం ఓటర్లు కీలకపాత్ర పోషించనున్నారు. ఇటీవ లి అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలోని పది అసెంబ్లీ నియోజకవర్గాలలో కాంగ్రెస్ రెండింటిని, ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగింటిని, బీజేపీ మూడింటిని గెలుచుకున్నాయి. జేడీయూకు చెందిన షోయబ్ ఇక్బాల్ ఒక సీటును గెలుచుకున్నారు. కాంగ్రెస్ గెలిచిన రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు-చాందినీ చౌక్, బల్లీమారన్లతో పాటు మటియా మహల్ అసెంబ్లీ స్థానాలలో ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు పరిస్థితిలో తేడా ఉండడం వల్ల లోక్‌సభ ఎన్నికల ఫలితాలు భిన్నంగా ఉండే అవకాశముంది. కాంగ్రెస్ అభ్యర్థి కపిల్ సిబల్ మూడవసారి ఈ నియోజకవర్గం నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో విజయలక్ష్మి కపిల్ సిబల్‌ను సులువుగా వరించింది. కానీ అప్పటికీ ఇప్పటికీ మారిన పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల్లో గెలవడం సిబల్‌కు అంత సులభం కాదు. కేంద్రంలో యూపీఏ సర్కారుకు వ్యతిరేకంగా వీస్తోన్న పవనాలు సిబల్ గెలుపుపై కూడా ప్రభావం చూపనున్నాయి. ి సబల్ వంటి అగ్రనేత తమకు చేయవలసినంత మేలు చేయలేదని ముస్లింలు అసంతృప్తితో ఉన్నారు. ఆయనస్థానికులకు అందుబాటులో ఉండరన్న అభిప్రాయం చాలామంది ఓటర్లకు ఉంది. నరేంద్ర మోడీని అడ్డుకోవడం కాంగ్రెస్ వల్ల కాదని, ఇందుకు ఆమ్ ఆద్మీ పార్టీయే తగినదని కొందరు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ నియోజకవర్గం నుంచి తమకు విజయం తథ్యమన్న ఉద్దేశంతో ఆశుతోష్‌ను బరిలోకి దింపింది. అయితే పార్టీలో కొత్తగా చేరిన బయటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఆప్ కార్యకర్తలకే మింగుడు పడలేదు. ఆశుతోష్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు కూడా నిర్వహించారు. అయితే ఆప్‌కున్న జనాదరణతో పాటు నరేంద్ర మోడీ వ్యతిరేక ముస్లిం ఓట్లు ఆప్‌కు అనుకూలించవచ్చని అంటున్నారు. ఆశుతోష్ కావడం కూడా కలిసివచ్చే అవకాశముంది. అయితే 49 రోజుల్లోనే అధికారం వదిలి పారిపోయిందన్న మచ్చ ఆప్‌ను వేధిస్తోంది. ఢిల్లీ బీజేపీ నేతలందరికల్లా ఎక్కువ ప్రజాదరణ కలిగిన నేతగా ముద్రపడిన డాక్టర్ హర్షవర్ధన్‌ను చాందినీచౌక్ నుంచి అభ్యర్థిగా నిలబెట్టి ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ఆ పార్టీ చిత్తు చేసిందనే చెప్పాలి. కానీ అంతటి బలమైన అభ్యర్థికి సైతం చాందినీచౌక్‌లో విజయం సాధించడం అంతసులువుగా లేదు. చాందినీచౌక్లోనే తాను 15 ఏళ్లు పెరిగానని హర్షవర్ధన్ చెప్పుకుంటునప్పటికీ ముస్లిం ఓటర్లు ఆయనను అక్కున చేర్చుకోవడానికి వెనుకాడుతున్నారు. ముఖ్యంగా నరేంద్రమోడీ భయం వారిని వేధిస్తోంది. ముస్లిం ఓటర్ల వ్యతిరేకత హర్షవర్ధన్‌కు మైనస్ పాయింట్ కాగా బీజేపీకి అనుకూలంగా ఉన్న లోక్‌సభ ఎన్నికల వాతావరణం, విశ్వసనీయుడైన నేతగా హర్షవర్ధన్కున్న పేరు, వైశ్యుడు కావడం ఆయనకు ప్లస్ పాయింట్లని అంటున్నారు. చరిత్ర: ఢిల్లీ సిటీ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని రెండుగా విభిజించడంతో 1957లో నియోజకవర్గంగా ఆవిర్భవించిన చాందినీచౌక్ 2004 వరకు దేశంలోనే అతి చిన్న లోక్‌సభ నియోజకవర్గంగా గుర్తింపు పొందింది. అప్పట్లో ఈ నియోజకవర్గం పరిధిలో నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉండేవి. అయితే ఇప్పుడీ నియోజకవర్గం పరిధి పాత ఢిల్లీని దాటిపోయింది. పలు పునరావాస కాలనీలు, మురికివాడలు ఇప్పుడీ నియోజకవర్గం పరిధిలోకి చేరాయి. ఈ నియోజకవర్గంలోని వైశ్యులు, పంజాబీలు సంప్రదాయకంగా బీజేపీ ఓటర్లుగా ఉండేవా రు. కానీ కాలక్రమేణా వారు పొరుగున ఉన్న ఘజియాబాద్, నోయిడా, షహిబాబాద్ గుర్గావ్, ఫరీదాబాద్‌లకు వలస వెళ్లడంతో బీజేపీ పరిస్థితి ఇరుకునపడింది. ఇప్పటికీ ఈ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. పాత ఢిల్లీ వెలుపలి ప్రాంతాల్లో ఓబీసీ, దళిత ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలోని 14 లక్షల ఓటర్లలో 35 శాతం మంది వైశ్య ఓటర్లు కాగా, 12 శాతం మంది పంజాబీ ఓటర్లున్నారు. ముస్లిం ఓటర్లు 21 శాతమున్నారు. షెడ్యూల్డు కుల ఓటర్లు 26 శాతముండగా, 9 శాతం బ్రాహ్మణ ఓటర్లున్నారు. -
రాజస్థాన్ నుంచి అజారుద్దీన్ పోటీ
న్యూఢిల్లీ: 58 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేసింది. పలువురు కేంద్ర మంత్రులకు సీట్లు ఖరారు చేశారు. కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో జైలుకు వెళ్లొచ్చిన సురేష్ కల్మాడీకి మొండిచేయి చూపారు. ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న పూణె స్థానాన్ని విశ్వజీత్ కదంకు కేటాయించారు. చాందినీచౌక్ నుంచి కపిల్ సిబల్, న్యూఢిల్లీ నుంచి అజయ్‌మాకెన్, వాయవ్య ఢిల్లీ నుంచి క్రిష్టతీర్థ్ పోటీ చేయనున్నారు. మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ ఈసారి రాజస్థాన్‌లోని టోంక్ సావా మధోపూర్ నుంచి బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మొర్దాబాద్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సీనియర్ నేత అజిత్జోగీకి ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ సీటు కేటాయించారు. మోడీపై వారణాసిలో పోటీ చేసే అభ్యర్థి పేరును త్వరలో ప్రకటిస్తామని కాంగ్రెస్ తెలిపింది. -
బీజేపీ అభ్యర్థుల జాబితా విడుదల సిబల్‌తో హర్షవర్ధన్ ఢీ
న్యూఢిల్లీ:భారతీయ జనతా పార్టీ ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థుల జాబితా ఎట్టకేలకు శనివారం రాత్రి విడుదలయింది. రాష్ట్రంలోని మొత్తం ఏడు స్థానాలకూ పేర్లను వెల్లడిచేసింది. ఇటీవలే పార్టీలో చేరిన మహేశ్ గిరి, భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, దళిత నాయకుడు ఉదిత్‌రాజ్‌కు సీట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. చాందినీచౌక్ ఎంపీ, కేంద్రమంత్రి కపిల్ సిబాల్‌పై బీజేపీ ఢిల్లీశాఖ అధ్యక్షుడు డాక్టర్ హర్షవర్ధన్ పోటీ చేస్తారని వెల్లడించింది. న్యూఢిల్లీ స్థానాన్ని పార్టీ జాతీయస్థాయి నాయకుల్లో ఒకరికి కేటాయించవచ్చన్న పుకార్లు నిజమయ్యాయి. ఇక్కడి నుంచి మీనాక్షి లేఖీని బరిలోకి దింపింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చే అవకాశాలు లేవని హర్షవర్ధన్ ఇది వరకే ప్రకటించారు. అయితే పశ్చిమఢిల్లీ, దక్షిణ ఢిల్లీ స్థానాల లోక్‌సభ టికెట్లను ఎమ్మెల్యేలు ప్రవేశ్ శర్మ, రమేశ్ బిధూరీకి కేటాయించారు. గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతోనే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల తరువాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం వల్ల పార్టీకి నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాంగ్రెస్ అన్ని స్థానాలకు అధికారికంగా పేర్లను ప్రకటించలేదు. ఎవరు ఎక్కడి నుంచి.. డాక్టర్ హర్షవర్ధన్ : చాందినీచౌక్ ఈసారి హర్షవర్ధన్‌కు చాందినీచౌక్‌లో భారీ పోటీ తప్పకపోవచ్చు. కపిల్ సిబాల్‌కు ఇక్కడ జనాదరణ ఎక్కువేనని చెబుతారు. ఢిల్లీలో ఆప్ బలమైన శక్తిగా ఎదిగిన నేపథ్యంలో ఇక్కడ ఆ పార్టీ జర్నలిస్టు ఆశుతోష్‌ను నిలబెట్టింది. పైగా చాందినీచౌక్‌లో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో హర్షవర్ధన్ గెలుపు కోసం విపరీతంగా శ్రమించాల్సి ఉంటుంది. మైనారిటీల ఓట్లు ఆప్, కాంగ్రెస్ మధ్య చీలుతాయి కాబట్టి అంతిమంగా తమకే ప్రయోజనం ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. మీనాక్షి లేఖీ : న్యూఢిల్లీ బీజేపీ ఈ సీటును తన సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖీకి కేటాయించింది. కాంగ్రెస్ ఇక్కడి నుంచి ఐఏసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్మాకెన్ను, ఆప్ జర్నలిస్టు ఆశిష్ ఖేతాన్‌ను బరిలోకి దింపాయి. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో న్యూఢిల్లీ నుంచి కాంగ్రెస్‌కు చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే ప్రధానపోరు బీజేపీ, ఆప్ మధ్య ఉంటుంది. ఉదిత్‌రాజ్ : వాయవ్య ఢిల్లీ ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి బీజేపీ తరఫున దళిత నాయకుడు ఉదిత్ రాజ్ పోటీ చేస్తారు. కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రి కృష్ణాతీరథ్ పోటీలో ఉంటారు. ఆప్ నుంచి మహేందర్ సింగ్ పోటీలో ఉన్నారు. ఈ ముగ్గురి మధ్య భారీ పోటీకి అవకాశం ఉంది. రాజ్‌కు దళితవర్గాల్లో పేరు ఉంది కాబట్టి బీజేపీకే గెలుపు అవకాశాలు ఎక్కువని ఈ పార్టీ నాయకులు చెబుతున్నారు. మనోజ్ తివారీ : ఈశాన్య ఢిల్లీ పార్టీలో ఇటీవలే చేరిన భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి బీజేపీ ఈశాన్యఢిల్లీ సీటు ఇచ్చింది. కాంగ్రెస్ దిగ్గజం, సిట్టింగ్ ఎంపీ, డీపీసీసీ మాజీ అధ్యక్షుడు జైప్రకాశ్ అగర్వాల్‌తో ఆయన పోటీ పడుతున్నారు. ఇక ఆప్ ప్రొఫెసర్ ఆనంద్‌కుమార్‌ను ఇక్కడి నుంచి నిలబెట్టింది. కుమార్ స్థానికుడు కారని, తాము మద్దతు ఇవ్వబోమంటూ కొందరు ఆప్ అసమ్మతులు ప్రకటించడం ఆయనకు ఇబ్బంది కలిగించవచ్చు. ప్రవేశ్ వర్మ : పశ్చిమ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడు అయిన ప్రవేశ్‌వర్మ పశ్చిమ ఢిల్లీ నుంచి బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ మహాబల్ మిశ్రా, ఆప్ అభ్యర్థి, జర్నలిస్టు జర్నైల్ సింగ్ ఆయన తలపడతారు. వర్మ మెహ్రౌలీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహేశ్ గిరి : తూర్పుఢిల్లీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ అధిపతి శ్రీశ్రీ రవిశంకర్ శిష్యుడిగా పేరున్న మహేశ్‌గిరి ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేస్తారు. మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, ఇది వరకే మూడుసార్లు ఎంపీగా విజయం సాధించిన సందీప్ దీక్షిత్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి. గాంధీ మనవడు, ప్రొఫెసర్ రాజ్‌మోహన్ గాంధీ ఆప్ నుంచి పోటీలో ఉన్నారు. తూర్పుఢిల్లీ వాసులు చాలాకాలంగా నిర్లక్ష్యానికి గురవుతున్నారని, ఇక్కడి వారి ఆకాంక్షలను నెరవేర్చడానికి తాను ప్రయత్నిస్తానని గిరి అన్నారు. రమేశ్ బిధూరి : దక్షిణ ఢిల్లీ సిట్టింగ్ ఎమ్మెల్యే రమేశ్ బిధూరికి దక్షిణ ఢిల్లీ ఎంపీ సీటు టికెట్ ఇస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. కల్నల్ దేవేంద్ర సెహ్రావత్ ఆప్ అభ్యర్థి. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ రమేశ్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అన్ని కులాలు, వర్గాల ఓట్లు వచ్చేలా అభ్యర్థులను బీజేపీ ఎంపిక చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పూర్వాంచలీయుల ఓట్లు కీలకం కాబట్టి తివారీకి సీటు దక్కిందని చెబుతున్నారు. -
అజాంఘర్ నుంచి ఎందుకు పోటీ చేయకూడదు?
న్యూఢిల్లీ: సురక్షితమైన లోక్‌సభ స్థానం ఎందుకు చూసుకుంటున్నారని గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి కేంద్ర మంత్రి కపిల్ సిబల్ ప్రశ్నాస్త్రం సంధించారు. దేశమంతా మోడీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని చెబుతున్నారని, అలాంటప్పుడు సులభంగా గెలిచే స్థానం కోసం ఎందుకు వెదుకులాడుతున్నారని ప్రశ్నించారు. "నిజంగా మోడీ సానుకూల పవనాలు బలంగా వీస్తుంటే సురక్షితమైన స్థానం కోసం ఆయన వెతకాల్సిన పనివుందా? తనకు ముస్లింల మద్దతు ఉందని చెబుతున్న మోడీ... అజాంఘర్ నుంచి ఎందుకు పోటీ చేయకూడదు?" అని సిబల్ ట్వీట్ చేశారు. గుజరాత్‌లోని ఒక స్థానం నుంచి మోడీ పోటీ చేస్తారని బీజేపీ నాయకులు అంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి కూడా ఆయన పోటీ అవకాశం లేకపోలేదంటున్నారు. -
సామాన్యుడి సేవలో పోస్టల్
న్యూఢిల్లీ: సామాన్యుల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలను చేపడుతోందని కేంద్రమంత్రి కపిల్ సిబాల్ తెలిపారు. నగరంలోని రెండు ప్రాంతాల్లో పోస్టల్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాదారుల కోసం ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ (ఏటీఎం) సేవలను పోస్టల్ శాఖ శనివారం ప్రారంభించింది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ (సీబీఎస్) ప్రాజెక్టులో భాగంగా 2015 మార్చి వరకు దేశవ్యాప్తంగా 2,800 ఏటీఎంలను ప్రారంభించనున్నారు. దేశంలో ఉన్న మొత్తం 1.6 లక్షల పోస్టాఫీస్‌ల ఆధునికీకరణలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కమ్యూనికేషన్స్ అండ్ ఐటీ మంత్రి క పిల్ సిబాల్ తెలిపారు. ఆయన ఐటీవో పోస్టాఫీస్ వద్ద ఏటీఎంను శనివారం ప్రారంభించారు. మరో ఏటీఎం కాశ్మీరీ గేట్ పోస్టాఫీస్ వద్ద ప్రారంభమైంది. ‘ఇది చాలా దూర ప్రయాణం. అయితే ప్రయాణం ప్రారంభించాం. 2015 మార్చివరకు దేశవ్యాప్తంగా 2,800 ఏటీఎంలను ఏర్పాటుచేయాలని నిర్ణయించాం..’ అని సిబాల్ వివరించా రు. ‘కొందరు సామాన్యుల గురించి మాట్లాడతారు అంతే.. మేం నిశ్శబ్దంగా సామాన్యుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం.. ఈ ఏటీఎంలు సామాన్యుల కోసమే.. వారికి నా అభినందనలు..’ అని సిబాల్ వ్యాఖ్యానించారు.‘ఈ ఏటీఎంలు మొ దటి 6-8 నెలల వరకు కేవలం పోస్టాఫీస్ వినియోగదారులకు మాత్రమే సేవలందిస్తా యి. తర్వాత వీటిని ఇతర బ్యాంకుల ఏటీఎంలకు అనుసంబంధానం చేస్తాం..దీనిద్వారా ఏ బ్యాంక్ వినియోగదారుడైన వీటినుంచి డబ్బులు తీసుకోవచ్చు..అలాగే పోస్టాఫీస్ వినియోగదారులు కూడా ఏ బ్యాంక్ ఏటీఎంనుంచైనా డబ్బులు తీసుకోగలిగే సౌలభ్యం ఏర్పడుతుంది..’ అని ఢిల్లీ సర్కిల్ ప్రధా న పోస్ట్ మాస్టర్ జనరల్ వసుమిత్రా తెలిపారు. ఈ నెలాఖరువరకు ఢిల్లీలో మరో 86 ఏటీఎంలను ఏర్పాటుచేయనున్నామన్నారు. 2015 మార్చి కల్లా 600 ఏటీఎంలు నగరవాసులకు అందుబాటులోకి వస్తాయని వివరిం చారు. ‘ఇండియా పోస్ట్ దేశంలోని ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, అస్సాం, ఆంధ్రప్రదేశ్ వంటి ఏడు రాష్ట్రాల్లో ఉన్న 64 లక్షల పొదుపుఖాతాలను ఈ సీబీఎస్‌తో అనుసంధానం చేసింది. దీనికి తోడు ఇండియా పోస్ట్ కూడా బ్యాం కింగ్ లెసైన్సు కోసం దరఖాస్తు చేసుకుంద’ని సిబాల్ వివరించారు. -
రూ. 50 వేల కోట్లకు స్పెక్ట్రం బిడ్డింగ్
న్యూఢిల్లీ: తాజా టెలికం స్పెక్ట్రం వేలానికి భారీ డిమాండ్ లభిస్తోంది. మూడో రోజున ఏకంగా రూ. 50,000 కోట్ల మేర బిడ్లు దాఖలయ్యాయి. ఇప్పటిదాకా మొత్తం 21 రౌండ్లు పూర్తయ్యాయని టెలికం శాఖ కార్యదర్శి ఎంఎఫ్ ఫారుఖి తెలిపారు. మొత్తం మీద 900 మెగాహెట్జ్ బ్యాండ్ స్పెక్ట్రం కోసం రూ. 20,000 కోట్లు, 1800 మెగాహెట్జ్ కోసం రూ. 30,000 కోట్ల మేర బిడ్లు వచ్చాయని ఆయన వివరించారు. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి కనీసం రూ. 15,000 కోట్లయినా రాగలవని అంచనా వేస్తున్నట్లు ఫారుఖి చెప్పారు. కీలకమైన టెలికం స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా, రిలయన్స్ జియో ఇన్ఫో సహా 8 కంపెనీలు స్పెక్ట్రం కోసం పోటీపడుతున్న సంగతి తెలిసిందే. -
నిరూపించు లేదా తప్పుకో.. కేజ్రీవాల్‌కు సిబల్ సవాల్
కేజ్రీది చౌకబారుతనం: వెంకయ్య సాక్షి, న్యూఢిల్లీ: పలు పార్టీల నేతలు, కేంద్ర మంత్రులు అవినీతిపరులని, వారిపై ఎన్నికల్లో పోటీ చేస్తామని పేర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన జాబితాపై విమర్శలు వెల్లువెత్తాయి. తనపై చేసిన ఆరోపణలను రెండు రోజుల్లో నిరూపించాలని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ సవాల్ చేశారు. నిరూపించలేకపోతే రాజీనామా చేయాలని శనివారం డిమాండ్ చేశారు. తాను దోషినని రుజువు చేస్తే రాజీనామా చేయడమే గాక రాజకీయాల నుంచే తప్పుకుంటానన్నారు. కేజ్రీవాల్ జాబితాను చౌకబారు ప్రచారంగా బీజేపీ నేత వెంకయ్యనాయుడు అభివర్ణించారు. అవినీతి కాంగ్రెస్ మద్దతుతో సర్కారు నడుపుతున్న ఆయనకు తమ పార్టీ నేతలైన రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కారీలను అవినీతిపరుల జాబితాలో చేర్చే నైతిక హక్కు లేదన్నారు. ఇక కేజ్రీవాల్ వీధి నేతలా దిగజారి మాట్లాడారని సమాజ్‌వాదీ నేత రాజేంద్ర చౌదరి విమర్శించారు.మరోవైపు తమను అవినీతిపరులన్నందుకు బీజేపీ నేత అనంత్‌కుమార్, కాంగ్రెస్ ఎంపీ అవతార్‌సింగ్ భదానా శనివారం కేజ్రీవాల్‌కు లీగల్ నోటీసులు పంపారు. ఆరోపణలను వెనక్కు తీసుకోవాలని, మూడు రోజుల్లోగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆప్‌లో చేరిన ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ (చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్) వి.బాలకృష్ణన్ శనివారం బెంగళూరులో ఆప్‌లో చేరారు. అంతకుముందు ఆయన పార్టీకి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు. ఆ వెంటనే బెంగళూరు దక్షిణ లోక్‌సభ స్థానం టికెట్‌ను ఆయనకు ఖరారు చేసినట్టు తెలిసింది. ఒంటరి పోరే: ఆప్ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు, తెలంగాణ డిమాండ్‌కు ఆప్ అనుకూలమని ఆ పార్టీ అధికార ప్రతినిధి యోగేంద్ర యాదవ్ చెప్పారు. అయితే తెలంగాణపై నిర్ణయం తీసుకునేటప్పుడు సీమాంధ్ర హక్కులను పరిగణనలోకి తీసుకోవాలని, హైదరాబాద్ ప్రత్యేకతను గౌరవించాలని సూచించారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయ పార్టీలతో పొత్తుల యోచన లేదని యాదవ్ తేల్చిచెప్పారు. ఒంటరిగానే పోటీ చేస్తామని పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సత్తాతో పొత్తుపై ప్రశ్నించ,గా జయప్రకాశ్‌నారాయణ అంటే తమకు గౌరవముందని, అయినా లోక్‌సత్తాతో పాటు ఏ పార్టీతోనూ పొత్తులుండబోవని చెప్పారు. -
దండం పెడతాం.. గుజరాత్‌లా చేయొద్దు
న్యూఢిల్లీ/దావోస్: ‘2002 అల్లర్ల వల్ల గుజరాత్లో సౌభ్రాతృత్వం, మత సామరస్యం దారుణంగా దెబ్బతిన్నాయి. చేతులు జోడించి మోడీని వేడుకుంటున్నాం. మరే ఇతర రాష్ట్రాన్ని గుజరాత్‌లా చేయాలనుకోవద్దు. రాజకీయ ప్రత్యర్థులపై బురదజల్లడం వల్ల జాతినిర్మాణం జరగదు. నిర్మాణాత్మక కార్యక్రమాలు, పథకాలతో ముందుకురావాలి. యూపీ నుంచి గుజరాత్లో ప్రవేశించగానే రైలు ప్రయాణికులు సురక్షితంగా భావిస్తారని మోడీ అంటున్నారు. గతంలో అయోధ్య నుంచి వచ్చిన రైలు(గోద్రా) ప్రయాణికులపై జరిగిన దారుణాన్ని ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ‘అవినీతిపై మాట్లాడే మోడీ.. తన మంత్రివర్గ సహచరుడు బాబూలాల్ బొఖారియా దోషిగా తేలితే.. ఆయనను కనీసం పదవి నుంచి తొలగించలేదు. యడ్యూరప్పను తిరిగి బీజేపీలో చేర్చుకోవడంపై కూడా స్పందించలేదు’. - కపిల్ సిబల్ మోడీది అత్యంత వివాదాస్పద గతం. దాన్ని మర్చిపోవడం అంత సులభం కాదు. అది ఎవరికీ సాధ్యం కాదు. గత చరిత్రను మర్చిపోమని ప్రజలకు చెప్పలేం. దాని ఆధారంగానే మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు’. - కేంద్రమంత్రి చిదంబరం -
పరమ్ సూపర్ కంప్యూటర్
న్యూఢిల్లీ: భారత శాస్త్రవేత్తలు రూపొందించిన పరమ్ యువ- 2 సూపర్ కంప్యూటర్ ప్రపంచంలో విద్యుత్‌ను సమర్థంగా వినియోగించుకునే కంప్యూటర్ సిస్టమ్‌లలో ఒకటిగా నిలిచింది. అమెరికాలోని డెన్వర్‌లో జరిగిన సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్(ఎస్సీ 2013)లో ఈ మేరకు ‘గ్రీన్500’ జాబితా విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ-డాక్) తయారు చేసిన పరమ్ యువ-2 సూపర్ కంప్యూటర్ దేశంలో మొదటి స్థానంలో.. ఆసియాలో 9వ స్థానంలో, ప్రపంచంలో 44వ స్థానంలో నిలిచింది. విద్యుత్‌ను తక్కువగా వినియోగించుకునే కంప్యూటర్లకు ‘గ్రీన్-500’ ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది. -
ఆకాశ్ 4 ఉత్పత్తి వచ్చే నెల నుంచి
న్యూఢిల్లీ: ఆకాశ్ ట్యాబ్లెట్లో తర్వాతి వెర్షన్, ఆకాశ్ 4 ఉత్పత్తి వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుందని టెలికాం మంత్రి కపిల్ సిబల్ గురువారం తెలిపారు.ప్రపంచంలోనే అత్యంత చౌకైన ట్యాబ్లెట్గా ప్రాచుర్యం పొందిన ఈ ఆకాశ్ ట్యాబ్లెట్ల ధర ప్రస్తుతం రూ. 2,500 అని, ఏడాది కాలంలో రూ. 1,000 తగ్గి రూ.1,500కు చేరగలదని అంచనాలున్నాయని పేర్కొన్నా రు. ఇక్కడి మోడర్న్ స్కూల్ విద్యార్థ్ధులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఆకాశ్ 4 ట్యాబ్లెట్ల తయారీ కోసం ప్రభుత్వం బిడ్లను ఆహ్వానించిందని, ఈ బిడ్లను నేడు (శుక్రవారం) తెరుస్తామని సిబల్ పేర్కొన్నారు. 5 నుంచి 7 ఏళ్లలో స్కూల్‌కు వెళ్లే ప్రతి విద్యార్థికి ఆశాశ్ ట్యాబ్లెట్లు అందుబాటులోకి వస్తాయని వివరించారు. భవిష్యత్తులో చదువు నేర్చుకోవడాన్ని ఆకాశ్ వంటి పరికరాలు, అధునాతన టెక్నాలజీలు సమూలంగా మార్చివేస్తాయని కపిల్ సిబల్ అభిప్రాయపడ్డారు. విద్యార్థులు వివిధ నెట్‌వర్క్‌ల నుంచి విజ్ఞానం పొందగలరని పేర్కొన్నారు. కాగా ఆకాశ్ 4లో 7 అంగుళాల కెపాసిటివ్ టచ్ స్క్రీన్, 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ చేసుకోవడానికి మెమెరీ కార్డ్ స్లాట్, బ్లూటూత్, వైఫై, ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి. 2జీ, 3జీ, 4జీలను సపోర్ట్ చేస్తుంది. -
మేం నేరస్తులం కాదు
న్యూఢిల్లీ: స్వలింగ సంపర్కంపై విధించిన నిషేధాన్ని ఎత్తేయాలని ఎల్జీబీటీ (స్వలింగ సంపర్కులు, ద్విలింగ సంపర్కులు, లింగమార్పిడి చేయించుకున్నవారు) కార్యకర్తలు, సభ్యులు డిమాండ్ చేశారు. దీనిపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పున:సమీక్షించాలని కోరారు. ‘మేం నేరస్తులం కాదు’, ‘మరొక వ్యక్తిని ప్రేమించడమనేది నేరం కాదు’ తదితర ప్లకార్డులు, బ్యానర్లు చేతబూని జంతర్ మంతర్‌లో ఆందోళన చేశారు. స్వలింగ సంపర్కం నేరమన్న సుప్రీం తీర్పుని మళ్లీ ఒకసారి పరిశీలించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛ, మానవ హక్కులకు వ్యతిరేకంగా వచ్చిన ఈ తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సొసైటీ ఫర్ పీపుల్స్ అవేర్నెస్, కేర్ అండ్ ఎంపవర్మెంట్ (స్పేస్)అనే సంస్థ వ్యవస్థాపక సభ్యుడు అంజన్ జోషి అన్నారు. ఇతర వర్గాల ప్రజల నుంచి మాకు భారీ మద్దతు లభిస్తోందని, దీన్ని ప్రభుత్వం, న్యాయవ్యవస్థ పరిగణనలోకి తీసుకోవాలని జోషి విలేకరులకు తెలిపారు. స్వలింగ సంపర్కంపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వారంపాటు ఆందోళనకు దిగనున్నామని హెచ్చరించారు. ‘ఒక పిల్లర్‌ను ఏర్పాటుచేసి మాకు మద్దతిచ్చే వారి సంతకాలను దానిపై తీసుకుంటాం. అన్ని ప్రాంతాలకు ఈ పిల్లర్‌ను తీసుకెళ్లి అందరి మద్దతు కూడగడతాం. ఆ తర్వాత దాన్ని న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌కు బహూకరిస్తామ’ని జోషి వెల్లడించారు. స్వలింగ సంపర్కంపై నిషేధాన్ని 2009లో సడలించిన ఢిల్లీ హైకోర్టు తీర్పును కొట్టేసిన సుప్రీంకోర్టు అది ముమ్మాటికీ నేరమేనని ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. -
స్వలింగ సంపర్కులకూ హక్కులుంటాయి.. వాటిని కాపాడాలి: సోనియా
స్వలింగ సంపర్కుల హక్కుల విషయంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. వారి హక్కులపై ఇచ్చిన తీర్పు బాధ కలిగించిందని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో ఎల్జీబీటీల విషయంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేయడం బాధాకరమని, సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛకు, పౌరుల హక్కులకు భంగం కలిగే ప్రమాదం ఉందని సోనియా అన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మీద పార్లమెంటు ఇప్పటికైనా స్పందించి, పౌరుల హక్కులను కాపాడే విధంగా చర్యలు తీసుకుంటుందని తాను ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. అదే సమయంలో, గే హక్కుల మీద కేంద్ర మంత్రి కపిల్ సిబల్ కూడా స్పందించారు. ఆయన కూడా దాదాపు సోనియాగాంధీ వెల్లడించిన అభిప్రాయాలనే తెలిపారు. స్వలింగ సంపర్కాన్ని నేరం కాదని నిర్ణయించేందుకు ఉన్న అన్ని అవకాశాలనూ ప్రభుత్వం పరిశీలిస్తోందని సిబల్ అన్నారు. పరస్పర అంగీకారం ఉన్న అన్ని రకాల సంబంధాలనూ నేర రహితం చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. -
కొత్త సీఐసీగా సుష్మాసింగ్
న్యూఢిల్లీ: కొత్త ప్రధాన సమాచార కమిషనర్(సీఐసీ)గా సీనియర్ సమాచార కమిషనర్, మాజీ ఐఏఎస్ అధికారి సుష్మాసింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీఐసీ దీపక్ సంధు పదవీకాలం త్వరలో ముగియనున్న నేపథ్యంలో తదుపరి సీఐసీగా సుష్మాసింగ్ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, లోక్‌సభలో విపక్షనేత సుష్మాస్వరాజ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్‌లతో కూడిన ప్యానెల్ ఆమెను ఏకగ్రీవంగా ఎంపిక చేసింది. సంధు తర్వాత సీఐసీగా బాధ్యతలు చేపట్టనున్న రెండో మహిళ సుష్మాసింగ్ కావడం గమనార్హం. ఐఏఎస్ అధికారిగా 2009 మే 31న ఉద్యోగ విరమణ చేసిన సింగ్.. కేంద్ర సమాచార కమిషన్‌లో సమాచార కమిషర్‌గా 2009 సెప్టెంబర్ 23న నియమితులయ్యారు. జార్ఖండ్ కేడర్‌కు చెందిన ఆమె భారత ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు. -
మూడు దేశీయ మొబైళ్లను ఆవిష్కరించిన సిబల్
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు కార్బన్, లావా ఇంటర్నేషనల్, మ్యాక్స్ మొబైల్స్... తయారు చేసిన స్మార్ట్, ఫీచర్ ఫోన్లను టెలికం మంత్రి కపిల్ సిబల్ గురువారం ఇండియా టెలికం 2013 సదస్సు సందర్భంగా ఆవిష్కరించారు. కార్బన్ టైటానియం ఎక్స్ స్మార్ట్‌ఫోన్(ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, ధర రూ.18,490)ను అందుబాటులోకి తెచ్చింది. లావా రూ.5,499, రూ.9,999 రేంజ్‌ల్లో రెండు స్మార్ట్ఫోన్లను అందిస్తోంది. మ్యాక్స్ మొబైల్స్ అందిస్తున్న ఫీచర్ ఫోన్ ధర రూ.1,932. ఈ ఫోన్లో డ్యుయల్ సిమ్, కెమెరా, 16 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, జీపీఆర్ఎస్, ఎల్ఈడీ టార్చ్ వంటి ప్రత్యేకతలున్నాయి. -
మొరాయించిన ఈవీఎం
న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కె కామరాజ్ మార్గ్‌లోని పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు మాజీ రాష్ట్రపతి వెళ్లిన సమయంలోనే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మొరాయించడంతో ఆయన తన వంతు కోసం గంటసేపు ఎదురుచూశారు. ‘‘తన ఓటు వేయడం కోసం చాలా సమయం వేచి చూసిన మాజీ రాష్ట్రపతి ఈవీఎం పని చేయడం లేదని తెలియడంతో ఇంటికి వెళ్లి తిరిగి వచ్చి ఓటు వేశారు’’ అని ఎన్నికల అధికారి తెలిపారు. ఇదే కేంద్రంలో రాష్ట్రపతితో పాటు, సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, నావిక, సైనిక దళాలకు చెందిన అధికారులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎం మొరాయించే సమయానికి అందులో 412 ఓట్లు పోలయ్యాయి. అనేక మంది సుప్రీం కోర్టు న్యాయమూర్తులతో పాటు నావికా దళాధిపతి డీకే జోషి, కేంద్రమంత్రి కపిల్‌సిబల్ తదితరులు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. మధ్యాహ్నం ంటి గంట సమయానికి 112 ఈవీఎంలను మార్చాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. సాంతికేక సమస్యలు తలెత్తడం వల్లనే వీటిని మార్చాల్సి వచ్చిందని ఎన్నికల కమిషన్ అధికారి ఒకరు వివరించారు. -
'తేజ్ పాల్, తెహల్కాతో సంబంధాలు లేవు'
తరుణ్ తేజ్ పాల్ తో ఎలాంటి సంబంధాలు లేవని కేంద్ర న్యాయశాఖ మంత్రి కపిల్ సిబాల్ స్పష్టం చేశారు. తెహల్కా మ్యాగజైన్ లో తనకు వాటాలు ఉన్నట్టు వస్తున్న ఆరోపణల్ని సిబాల్ ఖండించారు. తేజ్ పాల్ తల్లి సిబాల్ చెల్లెలు అనే సందేశాలు సోషల్ మీడియా వెబ్ సైట్ లో విహారం చేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్, బీజేపీలు తనపై దుష్ఫ్రచారం మానుకోవాలని సిబాల్ విజ్క్షప్తి చేశారు. రాజకీయంగా తనపై దాడి చేసుకోవచ్చు. కాని తన కుటుంబాన్ని తేజ్ పాల్ వ్యవహారంలోకి లాగకూడదు. తేజ్ పాల్ తల్లి తనకు చెల్లెలు కాదు అని సిబాల్ అన్నారు. తెహల్కా వ్యవస్థాకులు, వాటాదారుడైన ఓ కేంద్ర మంత్రి తరుణ్ తేజ్ పాల్ ను రక్షిస్తున్నారంటూ ప్రతిపక్ష నాయకులు సుష్మా స్వరాజ్ చేసిన వ్యాఖ్యలపై సిబాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ, బీజేపీలపై తాను విమర్శిస్తున్నందునే తనపై దుష్ర్షచారాన్ని చేస్తున్నాయి అని ఆయన అన్నారు. తనకు తేజ్ పాల్ కు మధ్య ఉన్న సంబంధాలను బహిరంగపర్చాలని సిబాల్ సవాల్ విసిరారు. అంతేకాక కోట్లాది రూపాయల మైనింగ్ కుంభకోణానికి కారణమైన రెడ్డి బ్రదర్స్ ( గాలి జనార్ధన్ రెడ్డి, కరుణాకర రెడ్డి)లను సుష్మా స్వరాజ్ కాపాడుతోంది అని సిబాల్ ఆరోపించారు. -
నేరాభియోగాలు ఉంటే పోటీకి అనర్హత!
న్యూఢిల్లీ: నేరస్థులను రాజకీయాలకు దూరంగా ఉంచే లక్ష్యంతో.. తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తూ చట్టం చేయాలని కేంద్ర న్యాయ మంత్రి కపిల్ సిబల్ కొత్త బిల్లును ప్రతిపాదించారు. దోషులుగా నిర్ధారితులైన ప్రజాప్రతినిధులకు తక్షణమే అనర్హత వర్తిస్తుందని, జైలు శిక్ష అనుభవించిన వారు ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును నిర్వీర్యం చేయటానికి కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురాగా.. రాహుల్‌గాంధీ ఆ ఆర్డినెన్స్ ఓ చెత్తకాగితమని, చించిపారేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేయటం, ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను, బిల్లును ఉపసంహరించుకోవటం విదితమే. అయితే.. హత్య, అత్యాచారం, అపహరణ వంటి తీవ్రమైన నేరాభియోగాలు (ఏడేళ్లు, అంతకన్నా ఎక్కువ శిక్ష పడగల నేరాలు) ఎదుర్కొంటున్న వారిని సైతం ఎన్నికల్లో పోటీచేయటానికి అనర్హులను చేస్తూ కొత్త చట్టం చేయాలని సిబల్ తాజాగా ప్రతిపాదిస్తుండటం విశేషం. -
డిసెంబర్ నాటికి స్పెక్ట్రమ్ వేలం: సిబల్
న్యూఢిల్లీ: తదుపరి స్పెక్ట్రమ్ వేలం డిసెంబర్ ఆఖరు నాటికి జరిగే అవకాశం ఉందని టెలికం మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. దీనికి సంబంధించి రిజర్వ్ ధర.. క్రితం విడత రేటు కన్నా మరింత తక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు. శుక్రవారం జరిగిన సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ (సీవోఐఏ) కార్యక్రమం సందర్భంగా సిబల్ ఈ విషయాలు తెలిపారు. స్పెక్ట్రమ్ వేలం అంశంపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం నిర్ణయం తీసుకుంటుందని ఆయన తెలిపారు. తమ శాఖ అభిప్రాయాలను సాధికారిక మంత్రుల బృందానికి(ఈజీవోఎం) నివేదిస్తామని, ఈజీవోఎం సిఫార్సులపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుందని సిబల్ వివరించారు. రిజర్వ్ ధరను 62% దాకా తగ్గించాలన్న సిఫార్సులపై మరింత స్పష్టత ఇవ్వాలంటూ ట్రాయ్‌కి టెలికం కమిషన్ సూచించింది. టెలికం కమిషన్ ఈ నెల 29న మళ్లీ భేటీ కానుంది. స్పెక్ట్రమ్ వేలం రిజర్వ్ ధరను తగ్గించినా.. ఇప్పటికీ ప్రపంచ దేశాలతో చాలా ఎక్కువగానే ఉందని సీవోఏఐ అంటోంది. -
ఉల్లిపాయకు ఒళ్లు మండింది
-
ఉల్లిపాయకు ఒళ్లు మండింది
ఉల్లిపాయకు మళ్లీ ఒళ్లు మండింది. ఒక్కసారిగా నెత్తికెక్కి కూర్చుంది. నిన్న మొన్నటి వరకు కూడా సామాన్యులెవ్వరికీ అందుబాటులో లేకుండా చెట్టెక్కి కూర్చున్న ఉల్లిపాయల ధరలు ఏదో.. కాస్త అదుపులోకి వస్తున్నాయని సంతోషించినంత సమయం పట్టలేదు. మళ్లీ అవి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నాయి. మనకు ప్రధానంగా మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు వస్తుంటే, అక్కడే కొండెక్కేశాయి. నాసిక్ మార్కెట్లో కిలో 70 రూపాయల చొప్పున ఉల్లిపాయలు అమ్ముతున్నారట. ముంబై మార్కెట్లోకి వచ్చిన ఈజిప్టు ఉల్లి కూడా ధరలపై ప్రభావం చూపించలేకపోయింది. ఈ ఉల్లి కేజీ రూ.47కు లభిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం రూ.50-52 చొప్పున విక్రయిస్తున్నారు. ఆగస్టు నెలలో ద్రవ్యోల్బణం ఆరు మాసాల గరిష్ఠ స్థాయికి చేరడానికి ఉల్లి ప్రధాన దోహదకారి. హైదరాబాద్‌లోనూ, ఢిల్లీలో కూడా కిలో ఉల్లి చారిత్రక రికార్డు 80 రూపాయలు పలికింది. హైదరాబాద్ టోకు మార్కెట్లో క్వింటాలు ఉల్లి ధర 6,100 పలుకుతున్నదని, ఇంత ధర ఎప్పుడూ లేదని వ్యాపారులంటున్నారు. రిటైల్ మార్కెట్లో 70 - 80 మధ్యన విక్రయిస్తున్నారు. హైదరాబాద్ కు ఉల్లి ప్రధానంగా కర్నూలు జిల్లా నుంచి వస్తుంది. భారీ వర్షాల ధాటికి ఉల్లి పంట నీట మునిగిపోయి సరఫరా తగ్గిపోయింది. కర్నూలు నుంచే హైదరాబాద్ మార్కెట్‌కు రోజుకు 50 నుంచి 60 లారీలు ఉల్లి రావలసి ఉండగా ఇప్పుడది పంట నష్టం కారణంగా 20 నుంచి 30 లారీలకు పడిపోయింది. మహారాష్ట్ర నుంచి కూడా సరఫరా తగ్గడంతో ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది. సాధారణ ప్రజల కోసం మార్కెటింగ్‌శాఖ అధికారులు రైతు బజార్లలో సబ్సిడీ ధరలకే కిలో ఉల్లిని 32 రూపాయలకూ విక్రయిస్తామని ప్రకటించినప్పటికి, పెరుగుతున్న ధరలను చూసి వారు కూడా చేతులెత్తేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ మహానగరం విషయం చెప్పనే అక్కర్లేదు. అక్కడైతే ఏకంగా కిలో వంద రూపాయలు దాటేసింది. కానీ, ఇంత జరుగుతున్నా పాలకులకు మాత్రం ఈ విషయం పడితే ఒట్టు. గతంలో దీనివల్ల ప్రభుత్వాలే తలకిందులైనా కూడా ఇప్పటికీ వీళ్లకు బుద్ధి రావట్లేదు. ఎందుకంటే, కేంద్ర మంత్రులకు ఉల్లిపాయ ఘాటు ఇంకా సరిగ్గా తగల్లేదు. ఇక్కడి మార్కెట్లలో ఉల్లిపాయలు కేజీ 100 రూపాయిల చొప్పున అమ్ముతున్నారని ప్రజలు లబోదిబోమంటూ కేంద్రమంత్రివర్యుడు కపిల్ సిబల్ గారికి మొర పెట్టుకుంటే ఆ మహాశయుడు మాత్రం, ‘‘దానికి నేనేం చెయ్యను? వెళ్లి ఎక్కువ ధరలకు అమ్మేవాళ్లనడగండి ’’ అని చిర్రుబుర్రులాడారట. కానీ మరోవైపు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో మాత్రం ఉల్లిపాయ మీద బీభత్సంగా సెటైర్లు నడుస్తున్నాయి. ‘రాఖీ కట్టిన చెల్లికి ఉల్లిపాయలు గిఫ్ట్‌గా ఇవ్వండి.. ఆమె కళ్లలో ఆనంద బాష్పాలు చూడండి..’ ‘బ్రేకింగ్ న్యూస్... ఆనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ‘ఆనియన్ లోన్స్’పై వడ్డీ రేట్లు తగ్గించింది.’ ‘కారు కొంటే.. కేజీ ఉల్లిపాయలు ఫ్రీ’ ‘డాలర్ ఎస్కలేటర్ పైన.. రూపాయి వెంటిలేటర్ పైన... ఉల్లిపాయలు షోరూంలో.. మనం కోమాలో... ఈ దేశాన్ని దేవుడే కాపాడాలి..’ ఇలాంటి కామెంట్లు ఫేస్ బుక్, ట్విట్టర్లలో వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరి మధ్యా ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ నుంచి గల్లీ దాకా నడుస్తున్న ఉల్లి లొల్లి ట్విట్టర్, ఫేస్‌బుక్‌లకూ విస్తరించింది. ‘ఉల్లిపాయలకు... ఎన్నికలకు ఏదో సంబంధం ఉన్నట్లుంది. ఎందుకంటే ఎన్నికలొచ్చిన ప్రతిసారీ ఉల్లి ధరలు మండుతున్నాయి’ అంటూ కిరణ్‌బేడీ ట్విట్టర్లో స్పందించారు. ఈ ఏడాది చివర్లో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫేస్బుక్లో పెద్ద సంఖ్యలో ఉల్లి ధరలపై కార్టూన్లూ షేర్ చేసుకుంటున్నారు. ‘ఉంగరంలో డైమండ్ బదులు ఉల్లిపాయని అమర్చిన ఫోటో’ ‘దేవుడు ప్రత్యక్షమై ఉల్లిధరలు తగ్గించమనీ.. రూపాయి విలువ పెంచటం లాంటి పిచ్చిపిచ్చి కోరికలు కాకుండా మంచివి కోరమంటూ భక్తుడి మీద చిరాకుపడతాడు’ ఈ రెండు ఫోటోలు ఫేస్బుక్లో బాగా పాపులర్. వీటితో పాటు బోలెడు ఉల్లిజోకులతో కూడిన కార్టూన్లు సోషల్ సైట్స్‌లో హల్చల్ చేస్తున్నాయి. ట్విట్టర్లో ఉల్లి కోసం ప్రత్యేకంగా అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. ‘మరో సారి యూపీఏని గెలిపించండి..‘రైట్ టు ఆనియన్’ యాక్ట్ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెడతారు.’ ‘ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా.. అయితే ఉల్లినారు తీసుకెళ్లి ఇవ్వు.. స్వంతంగా పెరట్లో ఉల్లిపాయల పెంపకం ఎలా పుస్తకం కూడా ఇవ్వచ్చు.’ ‘ఒకటి కంటే ఎక్కువ కిలోల ఉల్లిపాయలు కలిగి ఉండటం నేరం. త్వరలోనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టనున్నారు.’ ‘రుచిని బట్టి ఉప్పు... జీతాన్ని బట్టి ఉల్లిపాయలు..’ ‘వంటకు ఉల్లిపాయలు వాడే వారు జాగ్రత్త.. సీబీఐ గానీ చూసిందంటే.. ఇంట్లో ఐటీ రైడ్లు చేసే అవకాశం ఉంది.’ ‘ఉల్లిపాయలు కొనాలి లోన్ ఇస్తారా..’ ఇన్ని రకాలుగా సర్కారును విమర్శిస్తున్నా, పాలకులు మాత్రం యథాప్రకారం చేద్దాం, చూద్దాం అంటూ నిమ్మకుంటున్నారు -
నోకియా ‘ఉర్దూ’ మొబైల్
న్యూఢిల్లీ: టెలికాం శాఖ మంత్రి కపిల్ సిబల్ ఆవిష్కరిస్తున్న నోకియా ఉర్దూ మొబైల్ ఇది. దేశంలో 15 కోట్ల మంది ఉర్దూ మాట్లాడే ప్రజలు లక్ష్యంగా నోకియా కంపెనీ ఉర్దూ భాషను సపోర్ట్ చేసే నోకియా 114ను అందిస్తోంది. రూ.2,579 ధర ఉండే ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ద్వారా ఉర్దూ భాషలో మెసేజ్‌లు, ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చని నోకియా ఇండియా కంపెనీ ఎండీ పి. బాలాజీ చెప్పారు. ఉర్దూతో పాటు హిందీ, ఇంగ్లీష్‌తో సహా మొత్తం 9 భాషలను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని వివరించారు. 0.3 మెగా పిక్సెల్ కెమెరా, ఎఫ్ఎం రేడియో, వీడియో స్ట్రీమింగ్ వంటి ఫీచర్లున్న 2జీ నెట్‌వర్క్‌పై పనిచేసే ఈ ఫోన్ టాక్‌టైమ్ 10.5 గంటలని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఫోన్‌ను అందుబాటులోకి తెస్తున్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జమ్మూ అండ్ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, కర్నాటకల్లో ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని వివరించారు. -
సిబల్‌కు న్యాయ బిల్లు తెచ్చిన తంటా!
న్యూఢిల్లీ: కొలీజియం వ్యవస్థను రద్దు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు విషయంలో న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ఇరకాటంలో పడ్డారు! లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టకుండానే రాజ్యసభలో పెట్టి ఆమోదింపజేయడంతో ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. బిల్లును స్థాయీసంఘానికి పంపాలని బీజేపీ డిమాండ్ చేసినా.. చివరికి రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఇంతవరకు బాగానే ఉందికానీ.. అసలు ఆ బిల్లు లోక్‌సభకే రాలేదు. శుక్రవారమే లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. దీనిపై శనివారం రాజ్యసభలో బీజేపీ సభ్యుడు రవిశంకర్ ప్రసాద్.. సిబల్‌ను నిలదీశారు. ‘అర్జెంట్ అని చెప్పి మంత్రి రాజ్యసభలో ఆ బిల్లును ఆమోదింపచేశారు బిల్లును స్థాయీసంఘానికి పంపాలని కోరినా వినలేదు. తీరా ఆ బిల్లును లోక్‌సభ చేపట్టనేలేదు. సభను తప్పుదోవ పట్టించారు. దీనిపై సిబల్ క్షమాపణ చెప్పాల్సిందే’ అని డిమాండ్ చేశారు. దీంతో సిబల్ సభకు క్షమాపణ చెప్పారు. -
‘న్యాయం’ బలపడుతుందా?!
న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై గత కొన్నేళ్లుగా సాగుతున్న చర్చ ఒక కొలిక్కి వచ్చింది. గత రెండు దశాబ్దాలుగా అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో న్యాయ నియామకాల కమిషన్ (జేఏసీ) ఏర్పాటుకు వీలుకల్పించే రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు లోక్‌సభలో కూడా మూడింట రెండువంతుల మంది ఆమోదం పొందాక రాష్ట్రాల అసెంబ్లీల ముందుకె ళ్తుంది. వాటిల్లో కనీసం సగం అసెంబ్లీలు బిల్లును ఆమోదిస్తే అటు తర్వాత జేఏసీ విధివిధానాలతో కూడిన మరో బిల్లును పార్లమెంటు ఆమోదించాల్సి ఉంటుంది. చర్చ సందర్భంగా న్యాయవ్యవస్థ పనితీరుపై అధికార పక్షం నుంచీ, విపక్షం నుంచీ వచ్చిన విమర్శలనూ, వ్యాఖ్యలనూ గమనించినా... అటు తర్వాత బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు 131 మంది అనుకూలంగా, ఒకే ఒక్కరు వ్యతిరేకంగా ఓటేయడాన్ని చూసినా న్యాయవ్యవస్థ పనితీరుపై మన రాజకీయ నాయకుల అంతరాంతరాల్లో అసంతృప్తి ఏ స్థాయిలో గూడుకట్టుకుని ఉన్నదో అర్ధమవుతుంది ఆ ఒక్కరూ న్యాయకోవిదుడు రాంజెఠ్మలానీ. ఈ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమైందని ఆయనంటున్నారు. అయితే, ఏ వ్యవస్థ అయినా విమర్శలకు అతీతమైనది కాదు. న్యాయవ్యవస్థ సైతం అందుకు మినహాయింపు కాదు. సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు ఏ విధంగా ఉండాలో రాజ్యాంగంలోని 124, 217 అధికరణాలు స్పష్టం చేస్తున్నాయి. హైకోర్టు న్యాయమూర్తుల బదిలీలకు సంబంధించి 222వ అధికరణం ఉంది. చర్చ సందర్భంగా మాట్లాడిన కేంద్ర న్యాయమంత్రి కపిల్ సిబల్ 124వ అధికరణానికి 1993లో సుప్రీంకోర్టు కొత్త భాష్యం చెప్పి రాజ్యాంగాన్ని తిరగరాసిందన్నారు. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో బయటివారి ప్రమేయంలేకుండా చేసిన ఆ తీర్పు న్యాయ, కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల మధ్య ఉన్న అధికారాల సమతూకాన్ని దెబ్బతీసిందని ఆరోపించారు. ఇన్ని మాటలు మాట్లాడిన సిబల్... ఈ రెండు దశాబ్దాలుగా దేశాన్ని ఏలినవారంతా దాన్ని సాధారణ స్థాయికి తీసుకురావడంలో ఎందుకు విఫలమయ్యారన్నది మాత్రం చెప్పలేదు. చెప్పాలంటే ఈ దేశ ప్రజానీకానికి ఇతర వ్యవస్థలపై ఉన్నంత అసంతృప్తిగానీ, ఆగ్రహంగానీ న్యాయవ్యవస్థపై లేదు. ఏ ఘటన జరిగినా న్యాయవిచారణ జరిపించాలని సాధారణ ప్రజానీకం సైతం డిమాండ్ చేయడం, న్యాయస్థానాల మాటను వేదవాక్కుగా భావించడం ఇంకా పోలేదు. అందుకు కారణం ఆ వ్యవస్థలో పనిచేసి ఉన్నత ప్రమాణాలను నెలకొల్పిన ఉద్దండులైన న్యాయ కోవిదులేనని వేరే చెప్పనవసరం లేదు. కానీ, ఇతర వ్యవస్థల పరిస్థితి వేరు. అవి తమ కార్యాచరణతో రాను రాను విశ్వసనీయతను దిగజార్చుకున్నాయి. అందువల్లే న్యాయమూర్తుల నియామక ప్రక్రియను ప్రశ్నించే నైతిక స్థైర్యాన్ని ప్రదర్శించలేకపోయాయన్నది నిజం. నిజానికి న్యాయవ్యవస్థలో అవినీతి గురించి అయినా, ఇప్పుడున్న కొలీజియం వ్యవస్థ లోటుపాట్ల గురించి అయినా బయటి వారి కంటే ఎక్కువగా లోపలి వారే మాట్లాడారు. న్యాయపీఠంపై ఉన్న వారిలో 20 శాతం అవినీతి పరులున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వెంకటాచలయ్య ఒక సందర్భంలో అన్నారు. అవినీతికి న్యాయవ్యవస్థ అతీతమని తాను చెప్పడంలేదని ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి. సదాశివం పదవీ బాధ్యతలు స్వీకరించేముందు తెలిపారు. అలహాబాద్ హైకోర్టు విషయంలో సుప్రీంకోర్టు ఒక కేసు విచారణ సందర్భంగా ఎలాంటి కటువైన వ్యాఖ్యలు చేసిందో అందరూ చూశారు. ఎందరో న్యాయమూర్తులు దిగజారుతున్న ప్రమాణాలపై అనేక సందర్భాల్లో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతూనే ఉన్నారు. న్యాయమూర్తుల నియామకాల విషయంలో విలువలకు పాతరేసింది నిజానికి కార్యనిర్వాహక వ్యవస్థే. జడ్జీల నియామకంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాను రాష్ట్రపతి తప్పనిసరిగా పాటించాలని ఏమీ లేదని, తగిన కారణాలు చూపి నిరాకరించవచ్చని 1981లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చాక పుష్కరకాలం పాటు ‘రాజకీయ నియామకాలు’ జోరందుకున్నాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటకు విలువే లేకుండాపోయింది. ఈ అరాచకానికి 1993లో జస్టిస్ జేఎస్ వర్మ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం అడ్డుకట్టవేసింది. నియామకాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాకే ప్రాముఖ్యతనివ్వాలని, కార్యనిర్వాహక వ్యవస్థకు సమాన ప్రతిపత్తి ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై మరో ఐదేళ్లకు రాష్ట్రపతి నివేదన ద్వారా కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించినప్పుడు దానికి చుక్కెదురైంది. కొలీజియం వ్యవస్థ మరింత దృఢంగా పాతుకుపోయింది. అయితే, కొలీజియం వ్యవస్థ దుర్వినియోగం అవుతున్నదని తన మరణానికి ముందు జస్టిస్ వర్మ వాపోయారు. ఏ వ్యవస్థ అయినా లోపరహితంగా పనిచేయాలంటే దానికి జవాబుదారీ తనం, పారదర్శకత చాలా ముఖ్యం. ఆ రెండూ లేకపోబట్టే కొలీజియం వ్యవస్థపై ఇన్ని విమర్శలొచ్చాయి. అయితే, ఇప్పుడు దీన్ని మార్చతలపెట్టిన యూపీఏ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అనుమానమే. న్యాయ నియామకాల కమిషన్‌లో విపక్ష నేతకు చోటిస్తామని తొలుత చెప్పినా బిల్లులో ఆ మాట లేదు. ఈ కమిషన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఉన్నా అందులో సభ్యులుగా న్యాయమంత్రి, ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉంటారు. న్యాయశాఖ కార్యదర్శి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఏతావాతా కార్యనిర్వాహక వర్గానిదే పైచేయి అవుతుందన్నమాట. అధికారాలనేవి పెత్తనం చేయడానికి కాక ప్రజలకు సేవ చేసేందుకు, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేసేందుకన్న గ్రహింపు ఉన్నప్పుడే ఏ అమరికైనా విజయవంతమవుతుంది. ఆ సంగతిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంది. -
‘కొలీజియం’తో పారదర్శకతకు పాతర
న్యాయ వ్యవస్థ తీరుపై సర్కారు, విపక్షాల విమర్శలు సుప్రీం, హైకోర్టు జడ్జిల నియామకంలో పారదర్శకత లేదు: సిబల్ జడ్జిల బంధువులుహైకోర్టులో ప్రాక్టీసు చేయడం బాధాకరం {పభుత్వ విధానాల్లో కోర్టుల జోక్యం ఏమిటి: అరుణ్‌జైట్లీ న్యూఢిల్లీ: న్యాయ వ్యవస్థ పనితీరుపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాలు మూకుమ్మడిగా విమర్శలు గుప్పించాయి. కోర్టులపై తమకు అపార గౌరవం ఉందంటూనే న్యాయ వ్యస్థలో లోపాలను ఎత్తిచూపాయి. సుప్రీంకోర్టు, హైకోర్టులో జడ్జిల నియామకంలో ఏమాత్రం పారదర్శకత లేదని, న్యాయ వ్యవస్థలో బంధుప్రీతి కొనసాగుతూనే ఉందని, దీన్ని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాయి. జడ్జిల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం విధానాన్ని మార్చాల్సిందేనని స్పష్టంచేశాయి. కొలీజియం వ్యవస్థను రద్దు చేస్తూ ‘న్యాయ నియామకాల కమిషన్’ను తీసుకువచ్చే ఉద్దేశంతో గురువారం రాజ్యసభలో రాజ్యాంగ (120వ సవరణ) బిల్లు-2013ను న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా స్వతహాగా న్యాయవాది అయిన సిబల్‌తోపాటు ప్రతిపక్ష నేత అరుణ్‌జైట్లీ (ఈయన కూడా ప్రముఖ న్యాయవాది), వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతూ.. కొలీజియం విధానం, న్యాయ వ్యవస్థ పనితీరుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ముందుగా సిబల్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగంలోని 124వ ఆర్టికల్‌కు 1993లో సుప్రీం కోర్టు సరికొత్త భాష్యం చెబుతూ కొలీజియంకు అంకురార్పణ చేసింది. ఒకవిధంగా రాజ్యాంగాన్ని తిరగరాసింది. కొలీజి యంతోన్యాయ, కార్యనిర్వాహక, శాసనవ్యవస్థల మధ్య ఉన్న సున్నితమైన అధికారాల సమతూకం దెబ్బతింది’ అన్నారు. జడ్జిని ఎలా నియమిస్తారో ఎలా తెలుస్తుంది? ప్రభుత్వానికి, కార్యనిర్వాహక వ్యవస్థకు జవాబుదారీతనం ఉండాలని న్యాయవ్యవస్థ చెబుతుందని, అయితే అదే సూ త్రం న్యాయవ్యవస్థకు ఎందుకు వర్తించదని సిబల్ ప్రశ్నిం చారు. కొలీజియంలో న్యాయమూర్తుల నియామకంలో పారదర్శకత ఎక్కడుందని ప్రశ్నించారు. ‘ఒక జడ్జిని ఎలా నియమిస్తారు? మనకు తెలియదు. సమాచార చట్టం కూడా వర్తిం చదు. అలాంటప్పుడు అక్కడ పారదర్శకత ఉంటుందని ఎలా చెప్పగలం’ అని ఆయన ప్రశ్నించారు. కొలీజియం విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఇతర న్యాయమూర్తులను సంప్రదించి హైకోర్టు జడ్జిలను నియమిస్తారని, ఇది హైకోర్టుల స్వతంత్రను దెబ్బతీస్తుందన్నారు. న్యాయ వ్యవస్థ స్వతంత్రను కాపాడాలని భావించినప్పుడు సుప్రీంకోర్టు అదే విధానాన్ని హైకోర్టులకు ఎందుకు వర్తింపజేయదు అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా న్యాయవ్యవస్థలో బంధుప్రీతిని కూడా ఆయన ప్రస్తావించారు. ‘‘జడ్జిల బంధువులే హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. మామ, మేనమామ లేదా మరొకరో కోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు? ఇంకెన్నాళ్లు ఈ బంధుప్రీతి ఇలా కొనసాగాలి?’’ అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ నిర్ణయాల్లో హేతుబద్ధతను కోర్టులు నిర్ణయిస్తున్నప్పుడు కోర్టుల నిర్ణయాలకు కూడా అదే వర్తిస్తుందని అని పేర్కొన్నారు. వేరే వ్యవస్థలోకి ఎందుకు చొచ్చుకురావడం? ప్రజాస్వామ్యంలోని ఇతర వ్యవస్థలు న్యాయ వ్యవస్థలోకి చొచ్చుకువెళ్లనప్పుడు న్యాయ వ్యవస్థ మాత్రం ఇతర వ్యవస్థలను అతిక్రమించడం ఏమిటని బీజేపీ నేత అరుణ్‌జైట్లీ ప్రశ్నించారు. మీరు అది చేయండి.. ఇది చేయండి అని కోర్టులు ప్రభుత్వాలను ఆదేశించడం, చివరికి ఆర్థిక విధానాలను కూడా నిర్దేశించడం ఏమిటని నిలదీశారు. ఇనుప ఖనిజం ఎగుమతులపై నిషేధం విధిస్తూ కోర్టు వెలువరించిన ఉత్తర్వులు ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయని, ఒకవిధంగా కరెంటు ఖాతా లోటు పెరగడానికి, రూపాయి పతనానికి పరోక్ష కారణమయ్యాయని చెప్పారు. న్యాయ నియామకాల సవరణ బిల్లుకు ఆమోదం న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామకాల కోసం ప్రస్తు తం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థ స్థానంలో జ్యుడీషియల్ నియామకాల కమిషన్ (జేఏసీ) ఏర్పాటుకు వెసులుబాటు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును గురువా రం రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లును న్యాయ వ్యవహారాలపై పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపాలన్న తమ డిమాండ్‌ను పట్టించుకోకపోవడంతో బీజేపీ సభ్యు లు వాకౌట్ చేశారు. దీంతో ఈ బిల్లుకు అనుకూలంగా 131 ఓట్లు పడగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు మాత్రమే పడటంతో ఆమోదం పొందింది. కొలీజియం వ్యవస్థను రద్దుచేసి జ్యుడీషియల్ నియామకాల కమిషన్‌ను ఏర్పాటుకు బీజేపీ మద్దతు పలికింది. అయితే, తమ వాదనను పట్టిం చుకోకపోవడంతో వాకౌట్ చేసింది. ఈ అంశంపై న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్, బీజేపీ నేత అరుణ్ జైట్లీల మధ్య హోరాహోరీగా వాదన జరిగింది. కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయకుండా, కొలీజియం వ్యవస్థను రాజ్యాంగ సవరణ ద్వారా రద్దుచేస్తే, అది రాజ్యాంగ సంక్షోభానికి దారితీయగలదని జైట్లీ అభ్యంతరం వ్యక్తం చేశారు. -
పార్లమెంటుకు‘న్యాయ కమిషన్’ బిల్లు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టులకు న్యాయమూర్తులను నియమించే కొలీజియం వ్యవస్థను రద్దు చేసి.. న్యాయ నియామకాల కమిషన్ (జ్యుడీషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్- జేఏసీ)ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. న్యాయవ్యవస్థ నుంచి ఎదురైన వ్యతిరేకతను అధిగమించి ప్రభుత్వం ‘న్యాయ నియామకాల కమిషన్ బిల్లు - 2013’ను తీసుకువచ్చింది. దీనిని అమలు చేయటానికి రాజ్యాంగ సవరణ అవసరమవుతుంది. సంబంధిత బిల్లును న్యాయమంత్రి కపిల్ సిబల్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియలో పాల్గొనే వారిని ఈ కమిషన్ జవాబుదారులుగా చేస్తుందని, ఎంపిక ప్రక్రియలో పారదర్శకతను తీసుకువస్తుందని బిల్లు పేర్కొంటోంది. ప్రతిపాదిత కమిషన్ ఏర్పాటుతో.. ఉన్నత న్యాయస్థానాల్లో సభ్యుల నియామకంలో కార్యనిర్వాహక విభాగానికి కూడా పాత్ర లభిస్తుంది. ప్రస్తుతం న్యాయమూర్తులను న్యాయమూర్తులే నియమించే ఏకైక దేశం బహుశా భారత్ ఒక్కటే కావచ్చు. కొలీజియం పద్ధతిని మార్చేందుకు 2003లో చేసిన ప్రయత్నం ఫలించలేదు. తాజా బిల్లు ప్రకారం.. సీనియర్ న్యాయమూర్తుల నియామకం, బదిలీల కోసం భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. -
రాజ్యసభకు ‘అనర్హత’ తిరస్కరణ బిల్లు
న్యూఢిల్లీ: జైల్లో ఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయకూడదని, ఎంపీలు, ఎమ్మెల్యేలు దోషులుగా తేలినప్పటినుంచే పదవులకు అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇచ్చిన రెండు తీర్పులను తిరస్కరించడానికి ప్రభుత్వం సోమవారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టింది. ప్రజాప్రాతినిధ్య చట్ట సవరణ బిల్లు-2013 పేరుతో న్యాయ శాఖ మంత్రి కపిల్ సిబల్ దీన్ని ప్రవేశపెట్టారు. 1951 నాటి ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించిన ఈ బిల్లును కేంద్ర కేబినెట్ గత వారం ఆమోదించింది. జైల్లో ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు, దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ అప్పీలు పైకోర్టులో పెండింగ్‌లో ఉన్నంతకాలం ఓటేయకుండా, జీతాలు పుచ్చుకోకుండా పదవుల్లో కొనసాగేందుకు దీన్ని తెచ్చారు. దోషిగా ప్రకటించాక 90 రోజుల్లోపల అప్పీలు చేసుకున్నా, దోషిత్వంపై స్టే ఉన్నా అనర్హత వర్తించదని ఇందులో పేర్కొన్నారు. బిల్లును పార్లమెంటు ఆమోదిస్తే సుప్రీం కోర్టు తీర్పు వెలువడిన ఈ ఏడాది జూలై 10 నుంచి అమల్లోకి వ స్తుంది. -
ముంబై అత్యాచారాన్ని ముక్తకంఠంతో ఖండించిన పార్టీలు
పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముంబైలో పాత్రికేయురాలిపై జరిగిన సామూహిక అత్యాచారాన్ని ముక్త కంఠంతో ఖండించారు. ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తామని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ చెప్పగా, దీన్ని ఏమాత్రం సహించలేని సంఘటనగా బీజేపీ అభివర్ణించింది. ''ఈ కేసును అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నాం. దుండగుల చేతుల్లో మన మహిళలు, పిల్లలు అభద్రతతో కొట్టుమిట్టాడటాన్ని మన దేశం ఏమాత్రం సహించలేదు'' అని కేంద్ర మంత్రి కపిల్ సిబల్ పార్లమెంటు వెలుపల చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన అని, దీని గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువేనని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. ఢిల్లీలో డిసెంబర్ 23న సామూహిక అత్యాచారం జరిగినప్పుడు నిర్భయ చట్టాన్ని ప్రవేశపెట్టారని, కనీసం ఇప్పటికైనా దాన్ని అమలుచేస్తారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. కాగా, ఈ సంఘటనపై మహారాష్ట్ర సర్కారు సమాధానం చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. అత్యాచార ఘటన ఏమాత్రం భరించలేనిదని, ఫొటో జర్నలిస్టు విధి నిర్వహణ కోసం వెళ్లినా ఆమెకు భద్రత లేకపోతే ఇంక అసలు ఎవరికి భద్రత కల్పిస్తున్నారని, అసలు ప్రజాభద్రత అంశంపై ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పి తీరాలని బీజేపీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలని బీజేపీ ఎంపీ స్మృతి ఇరానీ కూడా ప్రశ్నించారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన చట్టం అత్యాచారం నిర్వచనాన్ని మార్చిందని, అయినా ఇప్పటికీ మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.