మూడు దేశీయ మొబైళ్లను ఆవిష్కరించిన సిబల్ | Kapil Sibal launches mobile phones made by domestic players | Sakshi
Sakshi News home page

మూడు దేశీయ మొబైళ్లను ఆవిష్కరించిన సిబల్

Published Fri, Dec 6 2013 2:20 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

Kapil Sibal launches mobile phones made by domestic players

 న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు కార్బన్, లావా ఇంటర్నేషనల్, మ్యాక్స్ మొబైల్స్... తయారు చేసిన స్మార్ట్, ఫీచర్ ఫోన్‌లను టెలికం మంత్రి కపిల్ సిబల్ గురువారం ఇండియా టెలికం 2013 సదస్సు సందర్భంగా ఆవిష్కరించారు. కార్బన్ టైటానియం ఎక్స్ స్మార్ట్‌ఫోన్(ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, ధర రూ.18,490)ను  అందుబాటులోకి తెచ్చింది. లావా రూ.5,499, రూ.9,999 రేంజ్‌ల్లో రెండు స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తోంది. మ్యాక్స్ మొబైల్స్ అందిస్తున్న ఫీచర్ ఫోన్ ధర రూ.1,932. ఈ ఫోన్‌లో డ్యుయల్ సిమ్, కెమెరా, 16 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, జీపీఆర్‌ఎస్, ఎల్‌ఈడీ టార్చ్ వంటి ప్రత్యేకతలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement