mobile phones
-
పాత మొబైల్ ఫోన్లతో సైబర్ నేరాలు
సాక్షి, హైదరాబాద్: డబ్బులు, ప్లాస్టిక్ వస్తువులు ఇచ్చి ప్రజల నుంచి పాత, వినియోగంలో లేని మొబైల్ ఫోన్లను కొనుగోలు చేసి సైబర్ నేరాలకు వాడుతున్న కేటుగాళ్ల ముఠాను రామగుండం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీ సీఎస్బీ) అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన ముగ్గురు నిందితుల వద్ద నుంచి ఏకంగా 4 వేల పాత మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్లను బిహార్‌లోని కొందరికి ఎగుమతి చేస్తున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. సేకరించిన పాత మొబైల్ ఫోన్లను రిపేర్ చేసి వాటిని జామ్‌తార, దియోగఢ్‌లోని సైబర్ నేరగాళ్లకు సరఫరా చేస్తున్నట్టు నిందితులు వెల్లడించారు. వారిని బిహార్‌కు చెందిన మహ్మద్ షమీమ్, అబ్దుల్ సలామ్, మహ్మద్ ఇఫ్తికర్గా గుర్తించారు. నిందితులపై రామగుండం సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఐటీ యాక్ట్ 66 డీ, బీఎన్ఎస్ఎస్లోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు టీజీ సైబర్ సెక్యూరిటీ డైరెక్టర్ శిఖాగోయల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇలా చిక్కారు..బిహార్‌కు చెందిన కొందరు వ్యక్తులు పట్టణంలో తిరుగుతూ పాత మొబైల్ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు రామగుండం సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్ సిబ్బందికి విశ్వసనీయ సమాచారం అందింది. వారు గోదావరిఖనిలో తనిఖీ చేయగా ముగ్గురు అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించారు. వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 4 వేల పాత మొబైల్ ఫోన్లు పట్టుబడ్డాయి. గత నెల రోజులుగా రామగుండంతో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పాత మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసి బిహార్‌లోని తమ ముఠాలకు చేరవేసినట్టు నిందితులు అంగీకరించారు. కాగా అపరిచిత వ్యక్తులకు పాత మొబైల్ ఫోన్లను విక్రయించవద్దని శిఖాగోయల్ సూచించారు. సైబర్ నేరాలు జరిగినప్పుడు మొబైల్ ఫోన్ పాత యజమాని డివైస్ ఐడెంటీనే పోలీసుల దర్యాప్తులో బయటకు వస్తుందని, దీనివల్ల చిక్కుల్లో పడతారని హెచ్చరించారు. -
ఇకపై తగ్గనున్న మొబైల్ ఫోన్ ధరలు.. ఎందుకంటే?
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో సాంకేతిక రంగానికి ప్రోత్సాహకాలను అందించింది. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, పీసీబీఏ సుంకాలను 20 నుంచి 15 శాతానికి తగ్గించారు. దేశంలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దేశం నుంచి ఎగుమతులు కూడా విరివిగా జరుగుతున్నాయి.గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి ఏకంగా మూడు రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మొబైల్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందటంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ విడిభాగాల దిగుమతి సుంకాలను కూడా 15 నుంచి 10 శాతానికి తగ్గించింది.యాపిల్, ఒప్పో, వివో మొదలైన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ టారిఫ్ స్లాబ్ హేతుబద్ధీకరణ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. దిగుమతి సుంకాలు తగ్గించడంతో భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గుతాయని స్పష్టమవుతోంది. -
వద్దమ్మా.. తప్పూ!
ఈ మధ్య ‘గైడింగ్ హ్యాండ్స్’ అంటూ ఒక వీడియో వచ్చింది. అది వెక్కిరింత వీడియో. ఫోన్ చూసుకుంటూ తల ఎల్లవేళలా కిందకు దించి ఉండేవారిని చేయి పట్టి చేరవలసిన చోటుకు చేర్చే‘సహాయక చేతులను’ భవిష్యత్తులో ఉపాధిగా చేసుకోవచ్చని అందులో చూపుతారు. అంటే అంధులను చేయి పట్టి నడిపించేవారికి మల్లే ఈ ఫోన్ బానిసలను చేయి పట్టి నడిపించి చార్జ్ తీసుకునే వ్యక్తులు భవిష్యత్తులో వస్తారన్న మాట. మనం ఫోన్‌కు శ్రుతి మించి ఎడిక్ట్ అయ్యామని చెప్పేందుకు ఈ వీడియో చేశారు. బండి మీద వెళుతూ ఫోన్ మాట్లాడితే ప్రమాదం అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ వినడం లేదు. కొందరు హెల్మెట్‌లో దూర్చి మరీ ఫోన్ మాట్లాడుతూ ప్రమాదం బారిన పడతారు. మరికొందరు హెడ్‌ఫోన్స్‌తో మాట్లాడుతూ వెనకొచ్చే వాహనాల హారన్ వినక ప్రమాదంలో పడుతున్నారు. మొన్నటి మార్చి 26న బెంగళూరు విద్యారణ్యపురలో ఒక మహిళ ఇలా ఫోన్ బిగించి కట్టి మాట్లాడుతూ ఒక వ్యక్తి కెమెరాకు చిక్కింది. అతను షూట్ చేసి ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. అందరూ ఇలా చేయడం ప్రమాదం అన్నారు. ఈ ఎండల్లో ఫోన్ వేడెక్కి పేలినా ప్రమాదమే అని మరికొందరు హెచ్చరించారు. పోలీసులు ఏం చేస్తున్నారని కొందరు ప్రశ్నించారు. చివరకు వీడియో పోలీసుల వరకూ వెళ్లింది. బండి నంబర్ ఆధారంగా ఆ మహిళను గుర్తించి యలహంక ట్రాఫిక్ స్టేషన్ వారు 5 వేల రూపాయల ఫైన్ వేశారు. అవసరమా ఇదంతా? -
ఏపీ పోలీస్: చోరీ అయిన ఫోన్ల రికవరీ.. యజమానులకు అందజేత (ఫొటోలు)
-
పిల్లలకి పోన్లు ఇచ్చి మీ పనుల్లో బిజీగా ఉంటున్నారా?
‘స్విగ్గి, జొమాటోల ఫుడ్డు తెప్పించి చేతులు దులుపుకోవద్దు. పిల్లల్ని అమ్మ చేతి రుచికరమైన వంట తిననివ్వండి’ అని కేరళ హైకోర్టు హితవు పలికింది. ఒక మొబైల్ ఫోన్ కేసులో బుధవారం తీర్పు వెలువరిస్తూ ‘సాయంత్రం ఆడుకుని వచ్చిన పిల్లలు ఇంట్లో వంట ఘుమఘులకు ఉత్సాహపడాలి. అన్నం అడగాలి. అలాంటి స్థితి నేడు ఉన్నదా?’ అని ప్రశ్నించింది. పిల్లల పెంపకంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి.కాని, పిల్లల ఆటలు, ఆహారం విషయంలో కేరళ హైకోర్టు హెచ్చరికలు చాలా ముఖ్యమైనవి. ‘మైనర్ పిల్లల చేతికి తల్లిదండ్రులు సెల్ఫోన్లు ఇచ్చి వారిని సంతోషపెట్టవద్దు. పిల్లల చేతికి ఫోన్లు ఇచ్చి వారు ఏం చూస్తున్నారో పట్టించుకోకుండా తల్లిదండ్రులు ఇంటి పనులో సొంత పనులో చేసుకోవద్దు. పిల్లలు సెల్ఫోన్లలో చూడకూడనివి చూస్తే వాటి దుష్ఫలితాలు సుదీర్ఘకాలం ఉంటాయి’ అని కేరళ హైకోర్టు బుధవారం తల్లిదండ్రులకు హితవు చెప్పింది. కేరళలోని అలవు ప్రాంతంలో ఒక వ్యక్తి బహిరంగ ప్రదేశంలో ఫోన్లో పోర్న్ వీడియోలు చూస్తున్నాడని పోలీసులు పెట్టిన కేసును కొట్టి వేస్తూ (ఐపిసి సెక్షన్ 292 చెల్లదని) జస్టిస్ కున్హి కృష్ణన్ తల్లిదండ్రులకు సెల్ఫోన్ల గురించి హెచ్చరించారు. ‘పిల్లలు సెల్ఫోన్లలో విజ్ఞాన, వినోదానికి సంబంధించి వీడియోలు చూడాలి... అదీ తల్లిదండ్రుల సమక్షంలో. తల్లిదండ్రుల అజమాయిషీ లేకుండా వారు మొబైల్ చూడకూడదు. పిల్లలు ఆడుకునే సమయాల్లో ఆడుకోవాలి. వారిని ఫుట్బాలో, క్రికెట్టో ఆడేలా చేయండి. శారీరకంగా దృఢంగా ఎదిగేలా చేసి దేశ భవిష్యత్తు కోసం ఆశ పెట్టుకునేలా తీర్చిదిద్దండి’ అని కున్హి కృష్ణన్ అన్నారు. తల్లి చేసేదే రుచికరం అదే సమయంలో పిల్లల ఆహారం గురించి ఇటీవల వచ్చిన మార్పును కూడా జస్టిస్ వ్యాఖ్యానించారు. ‘పిల్లలకు స్విగ్గి, జొమాటోల నుంచి ఆహారం తెప్పించి ఇస్తున్నారు. కాని పిల్లలు తల్లి చేసిన రుచికరమైన తిండినే తినాలి. పిల్లలు సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లి ఇంట్లో వంట ఘుమఘుమలు మొదలయ్యే సమయానికి చేరుకుని అన్నం కోసం ఎదురు చూడాలి. అలా జరిగితే ఎంత బాగుంటుంది? మేం చెప్పాల్సింది చెప్పాం. ఇక తల్లిదండ్రుల విచక్షణ’ అని కున్హి కృష్ణన్ అన్నారు. మేధో ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం కేరళ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు స్థూలంగా నేటి పిల్లల పెంపకాన్ని వ్యాఖ్యానిస్తున్నాయి. పరిశీలించి చూస్తే అవి పిల్లల మేధో, భౌతిక ఆరోగ్యం గురించి హెచ్చరిక చేస్తున్నాయి. ఇవాళ రేపు స్కూళ్లు, తల్లిదండ్రులు పిల్లల శారీరక వ్యాయామానికి వీలు ఇవ్వడం లేదు. ఆటలాడమని ప్రోత్సహించడం లేదు. ఆడుకునే వీలు కూడా కల్పించడం లేదు. దాంతో పిల్లలు కదలికలు మందగించి బద్దకం, స్థూలకాయం వంటి సమస్యలతో బాధ పడుతున్నారు. మరోవైపు ఆ సమయాన్ని సెల్ఫోన్లలో అనవసరమైన విషయాలు చూస్తూ బుర్ర పాడుచేసుకుంటున్నారు. ఫిల్టర్లు పెడితే తప్ప సెల్ఫోన్లలో పోర్నోగ్రఫీ, వయొలెంట్ వీడియోలు మీట దూరంలో ఉంటాయి. తెలిసీ తెలియని వయసులో వాటిని గంటల కొద్ది చూస్తే తీవ్ర మానసిక ప్రభావాలకు లోనవుతారు. జరగవలసిన నష్టం జరిగే వరకు తల్లిదండ్రులకు విషయం తెలియడం లేదు. ఇంకోవైపు వంటకు సమయం లేకనో లేదా పిల్లలు అడుగుతున్నారనో చీటికి మాటికి స్విగ్గీలో టిఫిన్లు, భోజనాలు తెప్పించే తల్లిదండ్రులు పెరిగారు. హోటల్ తిండి పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. ఒకప్పుడు ఎప్పుడో తప్ప బయటి తిండి తిననివారు ఇవాళ ప్రతి రెండో రోజు ఏదో ఒకటి తెప్పిస్తున్నారు. తల్లి చేసే ఒకటి రెండు కూరలైనా ఎంతో శుచిగా, రుచిగా ఉంటాయి. వంట పని భారం కాకుండా భర్త, పిల్లలు సాయం చేస్తే శుభ్రమైన ఇంటి భోజనం చేయవచ్చు. కలిసి కూచుని భోంచేయడం ద్వారా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం పెరుగుతుంది కూడా. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. (చదవండి: కుక్కలా మారిన వ్యక్తి..ఆడ కుక్కతో ప్రేమలో..) -
‘లొకేషన్’తో ప్రైవసీ చిక్కులు!
సాక్షి, హైదరాబాద్: ‘లొకేషన్ పంపు.. నేను వచ్చేస్తా..’ ఎవరినైనా కలవడానికి వెళ్తేనో, కొత్త ప్రదేశానికి వెళ్తేనో ఈ మాట తప్పకుండా వినిపిస్తుంది. ఎవరికైనా మనం ఎక్కడున్నామో అడ్రస్ చెప్పాలన్నా.. కొత్త ప్రాంతంలో నిర్దిష్టమైన ప్రాంతానికి వెళ్లాలన్నా ఈ లొకేషన్ ఫీచర్ ఎంతో ప్రయోజనకరం. పెద్దగా తికమక పడాల్సిన అవసరం లేకుండానే అవసరమైన ప్రదేశానికి చేరుకోవచ్చు. కానీ ఇది ఎంత సౌకర్యవంతమో అంతే స్థాయిలో ఇబ్బందికరం కూడా అని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మన ప్రైవసీని దెబ్బతీస్తుందని.. మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఎంత సేపు ఉన్నామనే ప్రతి అంశం ఈ లొకేషన్‌తో తెలిసిపోతుందని స్పష్టం చేస్తున్నారు. ఉదాహరణకు మనం ఏదైనా షాపింగ్ మాల్‌కు వెళ్లామా? సినిమా థియేటర్లో ఉన్నామా? ఏదైనా పర్యాటక ప్రాంతానికి వెళ్లామా? అన్న వివరాలు గూగుల్‌తో పాటు మన ఫోన్లోని వివిధ యాప్ సంస్థలకు చేరిపోతాయి. ఇది మన వ్యక్తిగత అంశాలను బహిరంగం చేయడమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందువల్ల అవసరమైనప్పుడు మాత్రమే మన మొబైల్ ఫోన్లలోని లొకేషన్‌ను ఆన్ చేసుకోవాలని.. తర్వాత ఆఫ్ చేసి పెట్టడం వల్ల మనపై ఎవరూ నిఘా పెట్టకుండా ఉంటుందని వివరిస్తున్నారు. నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలివీ.. మొబైల్ ఫోన్లలోని అన్ని అప్లికేషన్స్ (యాప్‌ల)కు లొకేషన్ సర్వీసెస్ అనుమతులు (పర్మిషన్) ఇవ్వొద్దు. అపరిచిత, అనుమానాస్పద యాప్‌లకు మన లొకేషన్ యాక్సెస్ ఇస్తే.. అది మన వ్యక్తిగత భద్రతకు ముప్పుగా మారుతుంది. కొన్ని యాప్‌లకు మనం ఇచ్చే పర్మిషన్లతో.. మన లొకేషన్ వివరాలు తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే అవకాశం, మన కదలికలపై నిఘా పెట్టేందుకు ఆస్కారం ఉంటుంది. లొకేషన్ ఆన్‌లో ఉండటంతో మనం ఎప్పుడు ఎక్కడ ఉంటున్నామన్న సమాచారం ఇతరులకు సులువుగా తెలిసే అవకాశం ఉంది. లొకేషన్‌ను ఆధారంగా చేసుకుని కొందరు ఆకతాయిలు వేధింపులకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. మొబైల్లో ఎప్పుడూ లొకేషన్ ఆన్‌లో ఉండటం వల్ల బ్యాగ్రౌండ్లో ఈ యాప్ పనిచేస్తూ, బ్యాటరీలో చార్జింగ్ త్వరగా తగ్గుతుంది. మొబైల్లో డేటా కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. -
ఆన్లైన్ + ఆఫ్‌లైన్ పండుగలకు ‘హైబ్రిడ్ షాపింగ్’
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పండుగల సీజన్లో... ‘హైబ్రిడ్ షాపింగ్’నకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ‘రాఖీ బంధన్’తో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్లో హైబ్రిడ్ షాపింగ్నకే అధికశాతం మొగ్గుచూపుతున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు మరీ ముఖ్యంగా నవ, యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో...ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్లైన్లోనూ షాపింగ్‌కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చి న మార్పుచేర్పులతో... షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 84 శాతం వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్‌ను గణనీయంగా పెంచినట్టు అడ్వర్టయిజ్మెంట్ యూనికార్న్ సంస్థ ‘ఇన్మోబీ’తాజా నివేదికలో వెల్లడైంది. నివేదికలో ఏముందంటే... చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లతోనే షాపింగ్ చేయడం, సంస్థల సైట్లను ఆన్లైన్లోనే వీక్షించి, సమీక్షించుకునే సౌలభ్యం ఉన్నందున పలువురు ఆన్లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఐతే...ఆన్‌లైన్‌తో పాటు స్వయంగా షాప్‌లకు వెళ్లి వివిధరకాల వస్తువులు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్టుగా... అ రెండింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ షాపింగ్ చేసే వారు 54 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొబైల్ఫోన్లను వినియోగించే వారి నుంచి వివిధ అంశాల వారీగా ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది. ఆఫర్ల సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు? మొబైల్లో సెర్చింగ్, ప్రకటనల ద్వారా.. 46% బ్రాండ్ వెబ్సైట్లు/ వివిధ యాప్‌ల ద్వారా.. 15% ప్రత్యక్షంగా షాపులకు వెళ్లి తెలుసుకునేవారు.. 11% కుటుంబం, స్నేహితుల ద్వారా.. 7% టీవీ ప్రకటనలు, ఇతర రూపాల్లో.. 7% వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా.. 6% ఈమెయిళ్లు, బ్రాండ్ల నుంచి న్యూస్లెటర్లతో.. 4% వాట్సాప్‌లో బ్రాండ్ల ద్వారా వచ్చే సమాచారంతో.. 3% తదనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు... ‘తమ స్మార్ట్ఫోన్ల ద్వారానే షాపింగ్ చేయాలని 78 శాతం మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వివిధ కంపెనీలు, సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రస్తుత పండుగల సీజన్లో కస్టమర్లను ఆకర్షించేందుకు, వారు కోరుకున్న విధంగా ఆయా వస్తువులను అందించేందుకు, వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము’ - వసుత అగర్వాల్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కన్జ్యూమర్ అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్, ఇన్మోబీ -
తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కావాలా? ఎంచుకో ఓ మంచి ఆప్షన్..
Best Mobile Phones Under 15,000: భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త ఉత్పత్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందులో స్మార్ట్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఖరీదైనవి కాగా.. మరికొన్ని బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. ఆగష్టు నెలలో రూ. 15,000 కంటే తక్కువ ధర కొనుగోలుచేయదగిన టాప్ 5జీ మొబైల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రెడ్మీ 12 5జీ (Redmi 12 5G).. ఆధునిక మార్కెట్లో రెడ్మీ మొబైల్స్‌కి డిమాండ్ భారీగా ఉంది. దీనికి కారణం తక్కువ ధర వద్ద వినియోగదారునికి కావలసిన ఫీచర్స్ లభించడమే. మన జాబితాలో బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో రెడ్మీ 12 5జీ ఒకటి. దీని ధర రూ. 10,999 మాత్రమే. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ కలిగి మంచి కెమెరా సెటప్ కూడా పొందుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ (Samsung Galaxy M14 5G).. శాంసంగ్ కంపెనీకి చెందిన 'గెలాక్సీ ఎమ్14 5జీ' రూ. 15,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్. రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా గేమింగ్ వంటి వాటికి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉండే ఈ మొబైల్ 93Hz డిస్ప్లే పొందుతుంది. మంచి డిజైన్, అద్భుతమైన బ్యాటరీ పర్ఫామెన్స్ కలిగి వినియోగదారులకు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! రియల్మీ నర్జో ఎన్53 5జీ (Realme Narzo N53).. చూడటానికి ఐఫోన్ మాదిరిగా కనిపించడమే కాకుండా వినియోగదారులను ఒక్క చూపుతోనే ఆకట్టుకునే ఈ 'రియల్మీ నర్జో ఎన్53 5జీ' మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌ఫోన్. ఇది ప్రత్యేకంగా గేమింగ్ ఫోన్ కానప్పటికీ.. గేమ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ బ్యాక్ ప్యానెల్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇదీ చదవండి: ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి.. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G).. మన జాబితాలో తక్కువ ధరలో లభించే మరో మొబైల్.. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ. ఇది ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్ కలిగి, మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంటుంది.అంతే కాకుండా ఇందులో 50 మెగా పిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా ఉంటుంది. -
అన్నీ మొబైల్లోనే.. ఆఖరికి కాపురాలు కూడా ఆన్లైన్లోనే!
మా ఊరు రాయికల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకుంటున్న రోజుల్లో ( 1956-68) కే వీ రాజు గారుమా తెలుగు సారు. మంచి జోకులు వేస్తూ పాఠాలు చెప్పేవాడు కాబట్టి ఆయన క్లాస్ ఎప్పుడూ నిండుగా ఉండేది. 'పిచ్చి సన్నాసి' అన్నది ఆయనకు ఊతపదం. మీరు మా అందరినీ పిచ్చోళ్ళనే అంటున్నారు మాలో అసలు పిచ్చోడు ఎవడు సార్!అని అడిగాం ఒక రోజు. 'ఎవడైతే ఒంటరిగా కూర్చొని తనలో తాను నవ్వుకుంటూ, తనతో తాను మాట్లాడుకుంటాడో, చేసిన పనే మళ్ళీ మళ్ళీ చేస్తాడో వాడేరా ఏక్ నెంబర్ పిచ్చోడు!' అన్నాడాయన. ఇది దాదాపు అరవై సంవత్సరాల నాటి విషయం. మా మాస్టారు చెప్పిన లక్షణాలనుబట్టి చూస్తే ఇప్పుడు అలాంటివాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందనే చెప్పాలి. రోడ్లమీద,బస్‌స్టాప్ ల దగ్గర,పార్కులు పబ్లిక్ స్థలాల్లో, కార్యాలయాల్లో ఇందుగలరందు లేరన్నట్లుగా ఎక్కడ చూసినా ఒంటరిగా పరిసరాలను, చేయాల్సిన పనులను కూడా మరిచిపోయి చెవి పుల్ల తగిలించుకొని, చూపుడు వెలుతో ప్రపంచాన్ని చుట్టేస్తూ తమలో తామే నవ్వుకుంటూ, తమతో తామే గంటలు గంటలు మాట్లాడుకుంటున్నట్లు కనబడే సెల్ ఫోన్ పిచ్చిగాళ్ళు విచ్చలవిడిగా కనబడుతున్నారు, ఎవరి పిచ్చి వారికానందం ! మొబైల్ వ్యసనంగా మారిన తర్వాత వచ్చిన దుష్పరిణామాలు 1. జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోయింది (గతంలో కనీసం 50 లాండ్‌లైన్ నెంబర్లు గుర్తుండేవి), ఇప్పుడు దేనికయినా కాంటాక్ట్స్‌లోకి వెళ్లి పేరు, ఫోటో చూసి నొక్కడమే. 2. మెదడుకు మేత అసలే లేదు ఇప్పుడు ఏదయినా మొబైలే. కాలిక్యులేటర్ మొబైల్లోనే, క్యాలెండర్ మొబైల్లోనే, పెయింట్, ఆర్ట్, ఎడిటింగ్ అన్నీ AI సహకారంతోనే. అంటే నీ మెదడుకు పని చెప్పడమే లేదు. మేత వేయనప్పుడు.. మెదడు కూడా పని చేయడం మానేస్తుంది. 3. సృజనాత్మకత ప్రదర్శించే అవకాశమే లేదు మనిషి అన్నాక కాసింత కళాపోషణ ఉండాలన్నది నాటి మాట. జీవితాల్లోకి మొబైల్ ఎంటరయ్యాక.. మరొకరిని చూసి ఫాలో కావడమే తప్ప మనలో జ్ఞానం వికసించేది చాలా తక్కువ. కోటిలో ఒకరు బాగుపడితే.. మిగతా అంతా దానికి బానిసలవుతున్నారు. 4. రుచిని గ్రహించే సమయం లేదు ఏం తింటున్నామన్నా స్పృహనే లేదు, తింటున్నంత సేపు చేతిలో మొబైల్, తల తీసుకెళ్లి స్క్రీన్‌లో పెట్టడమా. మన ముందున్న ప్లేట్లో ఏముంది, దాని రుచి ఏంటీ? అది ఎలా తినాలి? ఏం తెలియట్లేదు. నోట్లోకి నెట్టడం, కడుపులోకి కుక్కడం.. 5. సెల్‌కు జై, బంధుత్వాలకు బై బై గతంలో సెలవులు వస్తే.. ఊళ్లకు వెళ్లి బంధువులతో, మిత్రులతో గడిపేవాళ్లు. ఇప్పుడిది బాగా తగ్గింది. ఎవడి సెల్ వాడికి లోకం. సినిమాలు, క్రికెట్, చాటింగ్‌లు అన్నీ మొబైల్లోనే.. 6. సర్వం సెల్ మయం తినాలంటే మొబైల్లో ఆర్డర్, చదువుకోవాలంటే మొబైల్లో ఆన్లైన్ క్లాస్‌లు, ఆఫీస్ మీటింగ్‌లు మొబైల్లో వర్చువల్, ఇంకా రేపు స్పర్శ కూడా తెస్తారట. అప్పుడు కాపురాలు కూడా ఆన్లైన్లో ఉంటాయేమో. పోయేకాలం.. మొబైల్ రూపంలో దాపురిస్తే.. ఎవరేం చేయగలరు. కే వీ రాజు గారు పిచ్చి సన్నాసి అన్నది ప్రత్యేకంగా ఇప్పుడు ఒకరిని ఉద్దేశించే అవసరమే లేదు. వేముల ప్రభాకర్, హైదరాబాద్ -
పబ్లిక్ కి లక్షల విలువ చేసే మొబైల్ ఫోన్స్ పంచిన పోలీసులు
-
సీఈఐఆర్‌తో 2,43,875 మొబైల్ ఫోన్లు గుర్తించాం
సాక్షి, హైదరాబాద్/రాంగోపాల్‌పేట్: చోరీకి గురైన, కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్లను గుర్తించేందుకు అమల్లోకి తెచ్చిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2,43,875 మొబైల్ ఫోన్లను గుర్తించినట్టు టెలికాం స్పెషల్ డైరెక్టర్ జనరల్ అశోక్‌కుమార్ తెలిపారు. ప్రపంచ టెలీ కమ్యూనికేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నుంచి సంచార్ సాథీ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు వెల్లడించారు. మంగళవారం సికింద్రాబాద్‌లోని సీటీఓ భవనంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ పోర్టల్‌లోని టాప్‌కాఫ్ (టీఏఎఫ్‌సీఓపీ) మాడ్యుల్ ద్వారా ఒక ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్‌కార్డులు వాడుతున్నారనేది తెలుస్తుందని చెప్పారు. దీనివల్ల మన గుర్తింపు కార్డుతో ఎవరైనా సిమ్‌లు వాడుతుంటే గుర్తించవచ్చన్నారు. అదే పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేసి, సిమ్‌లను బ్లాక్ చేయవచ్చని చెప్పారు. టాప్‌కాఫ్‌ను ఏపీఎల్‌ఎస్‌ఏ విజయవాడ బ్రాంచ్ తయారు చేయగా ఏడాదిన్నరగా ఉపయోగిస్తున్నామని ఇప్పుడు జాతీయ స్థాయిలో అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 40.87లక్షల అనుమానాస్పద కనెక్షన్లను గుర్తించి, అందులో 36.61 కనెక్షన్లు రద్దుచేసినట్లు చెప్పారు. సైబర్‌క్రైమ్, బ్యాంకింగ్ మోసాలను నిరోధించేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పారు. -
Google Pixel 7a: విడుదలకు ముందే లీకైన వివరాలు
ఎప్పటికప్పుడు కొత్త మొబైల్స్ వాడకానికి అలవాటుపడ్డ జనం కోసం గూగుల్ మిడ్ రేంజ్లో 'పిక్సెల్ 7ఏ' విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఈ ఏడాది మేలో జరిగే గూగుల్ ఐ/ఓ 2023 (Google I/O 2023) ఈవెంట్లో కంపెనీ దీనిని లాంచ్ చేయనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న గూగుల్ పిక్సెల్ 6ఏ కంటే కూడా 7ఏ చాలా అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ప్రాసెసర్ నుంచి కెమెరాల వరకు చాలా విభాగాల్లో పిక్సెల్ 7ఏ అప్‌గ్రేడ్ పొందినట్లు సమాచారం. ఈ మొబైల్ ఫోన్ 6.1 ఫుల్ హెచ్డీ+ 90హెర్ట్జ్ OLED డిస్ప్లే పొందుతుంది. అంతే కాకుండా గూగుల్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ కూడా ఇందులో ఉంటుంది. త్వరలో విడుదలకానున్న గూగుల్ పిక్సెల్ 7ఏ వెనుక 64 మెగాపిక్సెల్ సోనీ IMX787 ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉంటాయని సమాచారం. అయితే కంపెనీ ఈ మొబైల్ ఫ్రంట్ కెమెరా గురించి ఎటువంటి సమాచారం వెల్లడించలేదు. ఇది వైర్లెస్ చార్జింగ్కు సపోర్ట్ చేసే అవకాశం ఉంది. అయితే ఛార్జింగ్ కెపాసిటీ గురించి తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: దెబ్బకు 17 కార్లు డిస్కంటిన్యూ: జాబితాలో ఉన్న కార్లు ఏవంటే?) గూగుల్ పిక్సెల్ 7ఏ మొబైల్ ధరల గురించి కూడా కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గత సంవత్సరం విడుదలైన 6ఏ ధర రూ. 30,000 కంటే తక్కువ. కావున కొత్త ఏ7 దీని కంటే కొంత ఎక్కువ ధర వద్ద విడుదలయ్యే అవకాశం ఉంది. -
సెల్ రోగం..అధికమవుతున్న టెక్స్ట్ నెక్ సిండ్రోమ్
ప్రస్తుత పరిస్థితుల్లో సెల్‌ఫోన్ లేకపోతే ఏ ఒక్క పని జరగని పరిస్థితి. సెల్‌ఫోన్ వల్ల జరిగే మంచిని అటుంచితే... ఇప్పటికే చాలామంది ఎక్కువగా మొబైల్ఫోన్లు వినియోగిస్తూ రకరకాల రుగ్మతల బారిన పడుతున్నారు. కంటి సమస్యలతో కొందరు, గేమింగ్‌కు బానిసలై మరికొందరు, మానసిక సమస్యలతో కూడా ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. తాజాగా ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్’ (మెడకు సంబంధించిన నొప్పి) పట్టిపీడిస్తోంది. ఉరవకొండకు చెందిన ఓ యువతి హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో బీటెక్ చదువుతోంది. తల ఓవైపునకు వంచినట్టు ఉందని బాధపడుతుంటే తల్లిదండ్రులు డాక్టర్‌కు చూపించారు. ఈమె ఎక్కువగా సెల్‌ఫోన్ వాడటం వల్ల ఇలా జరిగిందని న్యూరో వైద్యులు చెప్పారు. ఇప్పుడామె నొప్పి భరించలేక ఆక్యుపేషనల్ థెరఫీ చేయిస్తోంది. అనంతపురానికి చెందిన అనీల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అమెరికాలో కూడా పదేళ్లు పనిచేసి వచ్చారు. మొబైల్ ఫోన్ వాడకం పెరిగి ఆయనకు మెడనొప్పితో పాటు నడుమునొప్పి వచ్చింది. నగరంలోనే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంత జిల్లాలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న వారిలో ఎక్కువ మంది ‘టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ ’కు గురవుతున్నట్లు తేలింది. దీనివల్ల మెడ వంకర్లు పోవడం, మెడనొప్పి రావడం, తలెత్తుకు తిరగలేకపోవడం జరుగుతోంది. ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ ఎర్గొనోమిక్స్ అనే జర్నల్ టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ పెద్ద భూతంలా వేధిస్తోందని వెల్లడించింది. ఈ సిండ్రోమ్ కారణంగా నాడీ వ్యవస్థ దెబ్బతింటోందని వైద్యులు చెబుతున్నారు. ఏమిటీ టెక్ట్స్ నెక్ సిండ్రోమ్? టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ అనేది వైరసో, బాక్టీరియానో కాదు. తదేకంగా సెల్‌ఫోన్‌ను వాడుతున్న వారికి వచ్చే ప్రత్యేక జబ్బు. స్మార్ట్ఫోన్లు వాడుతున్న వారిలో ఈ పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా టెక్ట్స్ మెసేజ్‌లు ఎక్కువ సేపు చూస్తూండటం వల్ల మెడ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తేలింది. దీంతో మెడ కండరాలు, నరాలు ఒత్తిడికి గురై నాడీ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నాయి. దీనివల్ల విపరీతమైన తలనొప్పి, భుజాల నొప్పి రావడం, ఇది ఇలాగే కొనసాగి, తొడ నుంచి పాదం వరకూ జాలుగా నొప్పిరావడం వంటివి జరుగుతున్నాయి. నిద్రలేమి, మానసిక ఒత్తిడి కూడా ఎదుర్కొంటున్నారు. టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ నుంచి బయట పడండిలా... రెండు, మూడు నిముషాలకు కంటే ఎక్కువగా మెడలు వంచి సెల్ఫోన్లో మెసేజ్‌లు చూడకూడదు. స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారు పదే పదే మెడను రొటేట్ అంటే కుడి నుంచి ఎడమకు ఎడమ నుంచి కుడికి తిప్పుతూ ఉండాలి. ప్రతి గంటకోసారి రెండు మూడు సార్లు తలను పైకెత్తి మళ్లీ కిందికి బలవంతంగా వంచాలి. మెసేజ్‌ను చదవాలనుకున్నప్పుడు కుర్చీలో వెనక్కు వాలి ఫోన్‌ను ముఖంపైకి తెచ్చుకుని చదువుకోవాలి. పెద్ద పెద్ద మెసేజ్‌లు ఉన్నప్పుడు అంతా ఒకేసారి చదవకుండా మధ్యలో విరామం తీసుకుని మెడ వ్యాయామం చేయాలి. రోజూ యోగాసనాలు చేస్తే కండరాలు, నరాల వ్యవస్థ సానుకూలంగా మారి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. వ్యాయామమే పరిష్కారం చాలామంది టెక్ట్స్ నెక్ సిండ్రోమ్ గురై మెడనొప్పి తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు. ఇది కరెక్టు కాదు. దీనివల్ల తాత్కాలికంగా నొప్పి తగ్గచ్చుగానీ, భవిష్యత్‌లో ప్రమాదం ఎక్కువ. తలకు, మెడకు సంబంధించి వ్యాయామం మంచిది. యోగా వల్ల చాలా వరకు నొప్పిని నియంత్రించుకోవచ్చు. – జె.నరేష్‌బాబు, మెడ, వెన్నుపూస వైద్య నిపుణులు తక్కువ సేపు వాడాలి మొబైల్ ఫ్లోన్లు చిన్నతనం నుంచే అలవాటు పడిన చాలామంది పిల్లలు ఇప్పటికే దృష్టిలోపంతో బాధపడుతున్నారు. గంటల తరబడి ఫోన్ చూడటం వల్ల సున్నితమైన కంటికి సంబంధించి అవయవాలు దెబ్బతింటున్నాయి. వీలైనంత తక్కువ సేపు వాడటం మంచిది. – పల్లంరెడ్డి నివేదిత, కంటివైద్య నిపుణురాలు ఉచ్చులో ఇరుక్కుపోయారు ఓ వైపు మెడనొప్పి, నడుమునొప్పులే కాదు.. రాత్రిళ్లు ఎక్కువగా మొబైల్ వాడి గేమింగ్, బెట్టింగ్‌ల కారణంగా వ్యసనాలకు లోనయ్యారు. నిద్రలేమి కారణంగా మెంటల్ కండీషన్ ఇన్‌బ్యాలెన్స్ అవుతోంది. చాలా మందికి చదువుమీద దృష్టి పోతోంది. మానసిక బలహీనతల వల్ల డ్రగ్స్ వైపు దృష్టి సారిస్తున్నారు. – డా.విశ్వనాథరెడ్డి, మానసిక వైద్యనిపుణులు -
అధీకృత సంస్థగా ఎంఈడీఈపీసీ
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచెస్, మానిటర్స్, మొబైల్స్ విడిభాగాల ఎగుమతికై ఎగుమతి కంపెనీలకు కావాల్సిన రిజిస్ట్రేషన్/మెంబర్షిప్ సర్టిఫికేట్ జారీ చేయడానికి.. మొబైల్, ఎలక్ట్రానిక్ డివైసెస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌కు (ఎంఈడీఈపీసీ) ప్రభుత్వం అధికారం ఇచ్చింది. ప్రొజెక్టర్లు, టీవీలు, ప్రింటర్లు, ఫోటోకాపీయింగ్ మెషీన్స్ వంటి ఇతర ఉత్పత్తులకూ ఎంఈడీఈపీసీ ధ్రువీకరణ పత్రం జారీ చేయనుంది. ఎగుమతి కంపెనీలు ఫారెన్ ట్రేడ్ పాలసీ కింద ప్రయోజనాలు పొందాలంటే ఈ సర్టిఫికేట్ తప్పనిసరి. -
ఫాక్స్‌కాన్‌కు రూ.357 కోట్లు.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్లకు సంబంధించి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం కింద (పీఎల్ఐ).. యాపిల్ ఉత్పత్తుల కాంట్రాక్ట్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ ఇండియాకు రూ.357 కోట్లు చెల్లించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. అలాగే, డిక్సన్ టెక్నాలజీస్ సబ్సిడరీ అయిన పాడ్గెట్ ఎలక్ట్రానిక్స్‌కు రూ.58 కోట్ల ఉత్పత్తి ప్రోత్సాహకాల మంజూరునకు సైతం ఆమోదం తెలిపింది. పాడ్గెట్ ఎలక్ట్రానిక్స్‌కు మొబైల్ ఫోన్ల విభాగంలో తయారీ ప్రోత్సాహకాలు రావడం ఇది రెండో విడత కావడం గమనార్హం. ఈ విభాగంలో ప్రోత్సాహకాలను అందుకోనున్న తొలి కంపెనీ ఫాక్స్‌కాన్ కానుంది. చదవండి: కొత్త సంవత్సరంలో టీవీ ప్రేక్షకులకు ఊహించని షాక్! -
స్మార్ట్‌గా అతుక్కుపోతున్నారు.. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే!
సాక్షి, అమరావతి: ప్రస్తుతం మనిషి బాహ్య ప్రపంచానికి దూరంగా ఆన్లైన్లో గడుపుతున్నాడు. పక్కవాడిని కూడా చాటింగ్‌లోనే పలకరిస్తున్నాడు. సుఖదుఃఖాలన్నీ కూర్చున్నచోటునే అనుభవిస్తున్నాడు. గంటల కొద్దీ స్మార్ట్‌ఫోన్, టీవీ, ఇంటర్నెట్ స్క్రీనింగ్‌లో మునిగిపోతున్నాడు. దైనందిన జీవితంలో చాలామంది మేల్కొని ఉండే సమయంలో ఏకంగా 44 శాతం సమయాన్ని స్క్రీనింగ్ కోసమే కేటాయిస్తుండటం (40 శాతం ఇంటర్నెట్లో) ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు సగటు స్క్రీనింగ్ రేటు 6.58 గంటలుగా ఉంది. ఇది 2013తో పోలిస్తే 49 నిమిషాలు పెరగడం గమనార్హం. అత్యధికంగా దక్షిణాఫ్రికాలో 10.46 గంటలు, అమెరికాలో అయితే 7.04 గంటలు, భారత్‌లో అయితే 7.18 గంటలుగా నివేదికలు చెబుతున్నాయి. ఇక్కడ తల్లిదండ్రులతో కలిసి 0–2 ఏళ్లలోపు పిల్లలు 49 శాతం మంది సెల్ఫోన్లలో ఉంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2019లో సగటున 2.56 గంటల పాటు మొబైల్ స్క్రీన్ చూసిన వాళ్లు ఇప్పుడు 4.12 గంటలు చూస్తున్నారు. దేశంలో టీనేజర్లు అయితే ఏకంగా 8 గంటలకు పైగా ఆన్లైన్లోనే బతికేస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా సగటు స్క్రీనింగ్ సమయం కంటే ఎక్కువ. కళ్లు పొడారిపోతాయి ఎక్కువసేపు మొబైల్స్, టీవీ, కంప్యూటర్లు చూడటంవల్ల కళ్లు పొడారిపోతాయి. దీంతో కళ్లు ఎర్రగా మారి దురదలు, మంటలు వస్తుంటాయి. క్రమేణా నల్లగుడ్డు సమస్యలకు దారితీస్తాయి. వీటితో పాటు నిద్రలేమి, మానసిక సమస్యలకు దారితీస్తాయి. విద్యార్థులైతే చదువుపై దృష్టి సారించలేక పోవడం, చదివినవి మర్చిపోవడం వంటి సమస్యలకు గురవుతారు. అవసరమైన మేరకే టీవీలు, కంప్యూటర్, మొబైల్స్‌ను చూడాలి. – ఈఎస్ఎన్ మూర్తి, నేత్ర వైద్య నిపుణులు, జీజీహెచ్, విజయవాడ చిన్నారుల కోసం నిర్ణీత సమయం.. అమెరికన్ టీనేజర్లు అయితే కేవలం 3 గంటలు మాత్రమే టీవీ, వీడియోలు చూడటానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. చైనాలో వారానికి మూడు గంటలు మాత్రమే చిన్నారులకు స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయాలని ఆ దేశం లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రోజుకు 26 నిమిషాలు మాత్రమే నచ్చిన పరికరంలో నచ్చిన అంశాలను వీక్షించవచ్చు. ఇదే దారిలో జపాన్, రష్యా కూడా 30 నిమిషాలు, ఇజ్రాయెల్ 19 నిమిషాలు చాలంటూ పెద్దఎత్తున అవగాహన కల్పిస్తున్నాయి. ఆరోగ్యానికి హానికరం గంటల కొద్దీ తదేకంగా టీవీలు, ఫోన్లు, ఇంటర్నెట్కు అతుక్కుపోతే తీవ్ర అనారోగ్య పరిస్థితులు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నారులు, యుక్త వయస్కులకు స్మార్ట్‌ఫోన్ వ్యసనంగా మారింది. దీనిని నోమోఫోబియాగా పిలుస్తారు. ఫోన్ లేకుండా వారు ఉండలేరు. చిన్నారుల్లో మానసికంగా, భావోద్వేగాలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎలిమెంటరీ స్కూల్ స్థాయి పిల్లలు రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు స్క్రీనింగ్‌లో ఉంటే వారికి మెల్లగా స్థిరత్వాన్ని, నిర్ణయించుకునే శక్తి కోల్పోతారు. పలు దేశాల్లో 5–17 ఏళ్ల మధ్య వయసు చిన్నారుల్లో ఊబకాయం పెరిగింది. 9–10 ఏళ్ల వయసు పిల్లల్లో 3 గంటలకు పైగా స్క్రీన్‌ను చూస్తే టైప్–2 డయాబెటిస్ వచ్చినట్లు, గ్రహణశక్తిలో వెనుబడినట్లు గుర్తించారు. పెద్దల్లో అయితే నిద్రలేమికి దారితీస్తుంది. కంటి చూపును తీవ్రంగా దెబ్బతీస్తుంది. శరీరం పనితీరులో మార్పులొస్తాయి. వీటిని అరికట్టేందుకు సోషల్ మీడియా వాడకాన్ని ప్రతిఒక్కరూ రోజుకు 30 నిమిషాలకు పరిమితం చేయాలని పరిశోధకులు సూచిస్తున్నారు. తక్కువ ఆదాయం ఉన్నవాళ్లే ఎక్కువ సమయం స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్‌టీవీలు.. స్క్రీనింగ్‌కు ఎక్కువగా కారణమవుతున్నాయి. అయితే, వార్షిక ఆదాయం తక్కువ ఉన్న వాళ్లే ఎలక్ట్రానిక్ స్క్రీనింగ్‌లో ఎక్కువసేపు లీనమవుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశంలో 97.2 శాతం మంది టీవీ, 92 శాతం మంది వీడియో గేములు ఆడుతున్నట్లు సర్వేల్లో తేలింది. ఇక్కడ 74 శాతం తల్లిదండ్రులు ఏడేళ్ల వయసు పిల్లలతో కలిసి ఎక్కువగా టీవీలు చూస్తున్నారు. -
ఫోన్ల వినియోగంలో ఢిల్లీదే అగ్రస్థానం
సాక్షి, అమరావతి: ఫోన్ల వినియోగంలో దేశంలోనే ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. అక్కడ ప్రతి వంద మందికి 267.63 ఫోన్లు వినియోగిస్తున్నట్టు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆ తరువాత కోల్‌కత్తాలో ప్రతి వంద మంది జనాభాకు 143.38 ఫోన్లు వినియోగిస్తుండగా.. ముంబైలో 139.95, హిమాచల్ ప్రదేశ్‌లో 138.44 చొప్పున ఫోన్లు వినియోగంలో ఉన్నాయి. ఈ మేరకు ఆర్బీఐ నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2022 మార్చి నాటికి దేశంలో ప్రతి వంద మంది జనాభాకు ల్యాండ్ ఫోన్లు, సెల్ ఫోన్లు, ఇతర ఫోన్లు అన్నీ కలిపి 84.87 ఉన్నట్టు స్పష్టమైంది. ఏపీలో 93.63% వినియోగం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి వంద మందికి 93.63 ఫోన్లు ఉన్నట్టు ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. దేశంలోనే అత్యల్పంగా ఫోన్లను వినియోగిస్తున్న రాష్ట్రంగా బిహార్ స్థానం దక్కించుకుంది. అక్కడ ప్రతి వంద మందికి 52.87 ఫోన్లు వినియోగిస్తున్నారు. 2019 నాటికి దేశవ్యాప్తంగా ప్రతి వంద జనాభాకు 90.10 ఫోన్లు ఉండగా.. 2022 మార్చి నాటికి ఆ సంఖ్య 84.87కు తగ్గడం గమనార్హం. -
కబళిస్తోన్న స్మార్ట్ ఫోన్.. పౌరుల భవిష్యత్తుపై వైద్య నిపుణుల ఆందోళన
సాక్షి, నిజామాబాద్ : కొన్నేళ్ల క్రితం క్రీడా మైదానాలు పిల్లలతో కిటకిటలాడేవి.. ఎక్కువ సేపు మైదానంలో గడిపితే ఇళ్లకు రావాలని తల్లిదండ్రులు మందలించేవారు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. విద్యార్థులు ఆన్లైన్ గేమ్స్ పట్ల మక్కువ చూపుతూ మైదానాలకు, ఆటలకు దూరమవుతున్నారు. దీంతో తల్లిదండ్రులు పిల్లలను మైదానాలకు వెళ్లి ఆడుకోవాలని సూచిస్తున్నారు. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి రావడం, కోవిడ్ కాలంలో ఆన్లైన్ పాఠా లు చెప్పడం తదితర కారణాలలో విద్యార్థులు ఆన్లైన్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఆన్లైన్ గేమ్‌లు వ్యసనంగా మారాయి. అనేక కొత్త అంశాలు తెలుసుకునేందుకు, ప్రాజెక్టు వర్క్‌లు సృజనాత్మకంగా చేసేందుకు ఇంటర్నెట్ ఉపయోగపడుతున్నప్పటికీ.. ఎక్కువ మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లకు బానిసలుగా మారుతుండడంతో రేపటి పౌరుల భవిత ఏమిటనే ఆందోళనను పలువురు మనస్తత్వ శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బాలల దినోత్సవం నేపథ్యంలో జిల్లాలోని బోధన్, బాల్కొండ, ఆర్మూర్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాల్లోని 3 ప్రభుత్వ, 3 ప్రైవేటు పాఠశాలల్లోని 9, 10 తరగతులకు చెందిన 120 మంది విద్యార్థులపై ‘సాక్షి’ సర్వే నిర్వహించింది. వారి అభిప్రాయాలను సేక రించింది. ఇందులో 60 మంది బాలురు, 60 మంది బాలికలు ఉన్నారు. జాతిపితపై అభిమానం.. ఆసక్తిలేని రాజకీయాలు స్వాతంత్య్ర సమర యోధుల్లో జాతిపిత మ హాత్మా గాంధీ అంటే అభిమానమని ఎక్కువ మంది విద్యార్థులు మనోభిప్రాయం వ్యక్తం చేశారు. తర్వాత స్థానం భగత్ సింగ్‌కు దక్కింది. రాజకీయాల పట్ల ఆసక్తి కనబర్చలేదు. ఇంజినీరు, వైద్య వృత్తిపై మక్కువ చూపారు. తల్లిదండ్రుల్లో అమ్మకే ఎక్కువ ఓటేశారు. బాల్యం తమ అభిరుచుల మేరకు గడుస్తోందని, చదువును ఇష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గణిత శాస్త్రానికి ప్రాధాన్యత ఇచ్చారు. సాఫ్ట్వేర్ వైపే మొగ్గు మంచి వేతనంతో కూడిన ఉద్యోగాలతో దేశ, విదేశాల్లో స్థిరపడవచ్చనే ఆలోచనతో డాక్టర్ చదువుల కంటే సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గణితంతో కూడిన ఎంపీసీపై శ్రద్ధ పెడుతున్నారు. – ఖాందేశ్ రాజేశ్వర్‌రావు, విద్యార్థి తండ్రి, ఆర్మూర్ అవసరానికే వాడాలి కోవిడ్‌కు ముందు పిల్లలు సెల్ఫోన్లు ముడితే కోపగించిన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కోవిడ్ అనంతరం ఆన్లైన్ తరగతుల కారణంగా సెల్ఫోన్ల వినియోగాన్ని ప్రోత్సహించాల్సి వచ్చింది. సెల్‌ఫోన్ వల్ల మంచి ఎంత ఉందో చెడు అంతే ఉంది. విద్యార్థుల చదువుల అవసరానికి మాత్రమే సెల్‌ఫోన్, ఇంటర్నెట్ ఉపయోగించేలా అవగాహన కల్పించాలి. మా పాఠశాలలో అవగాహన కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయి. – ప్రవీణ్ పవార్, ప్రధానోపాధ్యాయుడు, విద్య హైస్కూల్, ఆర్మూర్ రోగగ్రస్త యువతగా రేపటి పౌరులు విద్యార్థులు స్మార్ట్ ఫోన్‌కు బానిసలవుతున్నారు. శారీరక శ్రమ లేకుంటే మానసిక ధృఢత్వం ఉండ దు. విద్యార్థులను జంక్ ఫుడ్‌కు అలవాటు చేయ డంతో ఊబకాయం, శక్తి, యుక్తి, ఉత్తేజం లేని యువత తయారవుతోంది. స్మార్ట్ ఫోన్లలో పో ర్నోగ్రఫీతో మానసిక రోగగ్రస్తులుగా మారుతున్నారు. తలనొప్పి, కంటిచూపు దెబ్బతినడం, కోపం, చికాకు చిన్నవయస్సులోనే వస్తున్నాయి. ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి తల్లి,దండ్రుల హత్యకు తెగిస్తున్నారు. ఆత్మహత్యలు చేసు కుంటున్నారు. – డాక్టర్ కేశవులు, మానసిక వైద్య నిపుణులు బాల్యం మీ అభిరుచుల మేరకు గడుస్తోందా? ►అవును 99, కాదు 21 చదువును ఇష్టంగా భావిస్తున్నారా..? ►అవును 98, కష్టంగానా ? : కాదు 22 ఇష్టమైన పని ►చదవడం 58, ఆన్లైన్ గేమ్ ఆడడం 36, మైదానంలో ఆడడం 26 పెద్దయ్యాక ఏమవుతారు ►డాక్టర్ 38, ఇంజినీర్ 42, పోలీస్ 17, కలెక్టర్ 14, సాప్ట్వేర్ 2, ఆర్మీ 2, టీచర్ 3, సీఏ 1, రాజకీయం 1 అమ్మానాన్నల్లో ఎవరంటే ఇష్టం ►అమ్మ 55, నాన్న 30, ఇద్దరు 35 ఇష్టమైన సబ్జెక్టు ►ఆంగ్లం 25, గణితం 43, రసాయన శాస్త్రం 10, భౌతికశాస్త్రం 11, సోషల్ 20, తెలుగు 11 స్వాతంత్య్ర పోరాట యోధుల్లో ఇష్టమైనవారు ►గాంధీ 53, నెహ్రూ 13, సర్దార్ పటేల్ 19, భగత్‌సింగ్ 20, సుభాష్ చంద్రబోస్ 15 తల్లిదండ్రుల ప్రభావం ఉంటోంది విద్యార్థుల ఆలోచనలపై తల్లిదండ్రులు, కుటుంబాల ప్రభావం ఎంతో ఉంది. సెల్ఫోన్లు, టీవీ ల వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు. పాఠశాల ల్లో కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారా క్రీడలపై ఆసక్తి పెంచాలి. తల్లిదండ్రులు పిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వడం మానుకోవాలి. ఒక వేళ ఇచ్చినా కొంత సమయమే గడిపే విధంగా వ్యవహరించాలి. –అజారుద్దీన్, తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం ఇబ్బందికరంగా సెల్ఫోన్లు సెల్ఫోన్లు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. చదువుపై శ్రద్ధ తగ్గుతోంది. కోవిడ్ అనంతరం ఈ పరిస్థితి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో కొంత మార్పు వచ్చింది. చదవాలనే పట్టుదల పెరిగింది. బాలుర కంటే బాలికలే ఉంతో ఉత్సాహంగా చదువులో ముందుంటున్నారు. –శేఖర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ముబారక్‌నగర్ ఉన్నత పాఠశాల, నిజామాబాద్ క్రీడలను ప్రోత్సహించాలి పిల్లలు ఇంటి బయట ఆడు తుంటే ఇంట్లోకి పిలిచి బయటకు వెళ్లకుండా టీవీ చూస్తూ ఆడుకో అనే తల్లిదండ్రుల సంఖ్య కూడా పెరిగిపోయింది. దీంతో పిల్లలు మానసిక, శారీరక సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలల్లో గేమ్స్ పీరియడ్‌ను విధిగా నిర్వహిస్తూ మైదానంలో క్రీడలు ఆడించాలి. – జాదె శ్రీనివాస్, విద్యార్థి తండ్రి, ఆర్మూర్ తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలి ఆన్లైన్ తరగతులతో ప్రతి విద్యార్థి మొబైల్ వాడాల్సి వచ్చింది. క్లాసుల తరువా త పిల్లలు మొబైల్ ఫోన్ల లో గేమ్స్‌కు అలవాటు పడ్డారు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైనప్పటికీ ఇష్టంగా చదవలేకపోతున్నారు. తల్లిదండ్రులు శ్రద్ధతో విద్యార్థులు చదువుకునేలా చూడాలి. –బచ్చు రవి, ఉపాధ్యాయుడు, ఘన్పూర్, డిచ్పల్లి మండలం ప్రాథమిక స్థాయి నుంచే .. ప్రాథమిక పాఠశాల దశ నుంచి పిల్లలు సెల్‌ఫోన్‌కు అలవాటు పడుతున్నారు. పిల్లల సెల్‌ఫోన్ వియోగంపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి.తరగతి గదిలో కాకుండా ఇంటి వద్ద పాఠ్యాంశాలను చదవటంపై ఆసక్తి కనబర్చేందుకు పిల్లలపైప్రత్యేక దృష్టిపెట్టాలి. –మధుకుమార్, టీచర్, ఇందూర్ హైస్కూల్, బోధన్ అభిరుచులు మారుతున్నాయి విద్యార్థుల అభిరుచులు రోజుకో విధంగా మారుతున్నాయి. కొంత మంది అపారమైన జ్ఞానం కలిగి ఉంటే మరి కొందరికి బద్దకం ఎక్కువ. భవిష్యత్తులో ఏమి కావాలో నిర్ణయించుకుని కృషి చేస్తున్నవారూ ఉన్నారు. –శ్యామ్, పీఈటీ, తిమ్మాపూర్, మోర్తాడ్ మండలం మొబైల్ ఫోన్లకే ప్రాధాన్యత పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకంపై కౌన్సెలింగ్ ఇవ్వాలి. తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థులను గాడిలో పెట్టాలి. ప్రభుత్వం మెరుగైన విద్యను అందించడానికి కృషి చేయాలి. – అబ్దుల్ హఫీజ్, ఘన్పూర్, డిచ్పల్లి మండలం సెల్‌ను దూరం చేయలేని పరిస్థితి ఆన్లైన్ పాఠాల వల్ల పిల్లలకు సెల్ ఫోన్ వాడకం ఎక్కువైంది. బడి నుంఇ ఇంటి రాగానే తల్లిదండ్రుల వద్ద ఉన్న సెల్ ఫోన్లను తీసుకుంటున్నారు. చదవటం, హోం వర్క్ చాలా వరకు పాఠశాలల్లోనే సాగుతోంది. ఇంటి వద్ద చదవటం గతం కంటే తగ్గింది. పిల్లలను సెల్ ఫోన్ నుంచి దూరం చేయలేని పరిస్థితి ఉంది. –మంజుల, విద్యార్థి తల్లి, బోధన్ -
బాత్రూమ్లో ఫోన్ వాడుతున్నారా.. ఈ సమస్యలు తప్పవా?
అరచేతిలో ఇమిడిపోయే స్మార్ట్ ఫోన్ ఇప్పుడు మన జీవితంలో అంతర్భాగమై పోయింది. గత దశాబ్దంన్నర కాలం నుంచి వ్యక్తులతో కమ్యూనికేట్ అవ్వడం దగ్గర నుంచి , కాలు కదపకుండా హోటల్ నుంచి ఫుడ్ ఇంటికి తెప్పించుకోవడం, ఆన్లైన్ షాపింగ్ వరకూ ఇలా అన్నింట్లో సహాయ పడుతుంది. అయితే దాని వల్ల ఎంత లాభం ఉందో అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉందని సైంటిస్ట్‌లు హెచ్చరిస్తున్నారు. ఇటీవల అరిజోనా యూనివర్సిటీ సైంటిస్టులు జరిపిన ఓ అధ్యయనంలో మనం వినియోగించే స్మార్ట్ ఫోన్లలో 17 వేల బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించారు. సాధారణంగా వినియోగించే టాయిలెట్ సీటు మీద ఉండే బ్యాక్టీరియా కంటే స్మార్ట్ ఫోన్ల మీద 10 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ► టీనేజర్లు వినియోగించే ఫోన్లమీద బ్యాక్టీరియా ఎక్కువగా ఉన్నట్లు అరిజోనా సైంటిస్ట్‌లు చెబుతున్నారు. ఎందుకంటే వారిలో ఎక్కువ మందికి బాత్రూంకు మొబైల్ తీసుకొని వెళ్లే అలవాటు ఉందని , ఎక్కువ సమయం బాత్రూంలో మొబైల్ వినియోగించడం వల్ల ఫోన్‌పై బ్యాక్టీరియా ఏర్పుడుతుందని హెచ్చరిస్తున్నారు. ► 2016లో సోనీ సంస్థ జరిపిన సర్వేలో 41 శాతం మంది ఆస్ట్రేలియన్లు టాయిలెట్లో ఫోన్ వినియోగిస్తుండగా.. 75శాతం మంది అమెరికన్లు వాడుతున్నారు. అయితే అలా ఫోన్ వినియోగిస్తున్న వారు టైం వేస్ట్ చేయకుండా మల్టీ టాస్కింగ్ చేస్తున్నామని అనుకుంటున్నట్లు తేలింది. కానీ టాయిలెట్లో మొబైల్ వినియోగించడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నామనే విషయాన్ని మరిచిపోతున్నారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ► డాక్టర్ కర్మాకర్ సలహా మేరకు.. ఫోన్‌ను బాత్రూంలోకి లేదంటే పబ్లిక్ ఏరియాల్లో వినియోగించకపోవడం ఉత్తమం. ఆహారం తీసుకునేటప్పుడు కూడా చాలా మంది తమ ఫోన్‌ని ఉపయోగిస్తుంటారు. నోటి ద్వారా ఇన్ఫెక్షన్లు సంక్రమించే అవకాశం ఉంది. కాబట్టి, ఫోన్లోని బ్యాక్టీరియా వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదాల్ని పెంచుతుంది. చదవండి👉 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం ఫోన్‌ను బాత్రూంలో వినియోగిస్తే వాటిల్లే ప్రమాదాలు ►►ఫోన్ వినియోగిస్తూ బాత్రూంలో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పెద్ద ప్రేగుల్లో ఒత్తిడి పెరిగిపోతుంది.తద్వారా రెక్టల్ (మల ద్వార) సమస్యలు ఎక్కవుగా ఉత్పన్నమవుతాయి. ►► పెద్ద ప్రేగుల్లో ఒత్తిడి పెరిగితే జీర్ణాశయాంతర ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించాలి ►► బాత్రూంలో ఫోన్ వినియోగిండం వల్ల టైం దుర్వినియోగం అవుతుంది. చేయాల్సిన వర్క్ ఆగిపోతుంది. మనకు తెలియకుండా మన లోపలి శరీరం ఒత్తిడికి గురవుతుంది. ►► మీరు ఉదయం పూట నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూం వెళ్లే సమయంలో ఫోన్‌ను వెంట తీసుకొని వెళుతున్నారా? అయితే మీరు ఉదయం పూట బాత్రూంలో ఫోన్ వినియోగించే సమయం కంటే.. ఫోన్ లేనప్పుడు బాత్రూంలో గడిపే సమయం ఎక్కువగా ఉంటుందని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. అందుకే ఉదయం టాయిలెట్లోకి ఫోన్ తీసుకొని వెళ్లకపోవడమే ఉత్తమం. ►► వెడ్ఎమ్డి హెల్త్ జర్నల్ ప్రకారం..ఈ బాక్టీరియాలో సాల్మొనెల్లా, ఇ.కోలి, షిగెల్లా, క్యాంపిలో బాక్టర్ అనే బ్యాక్టీరియాలు మన శరీరంలో ప్రవేశించి అనారోగ్యానికి గురి చేస్తాయి. ►► ఒకరి నుంచి మరొకరికి వైరస్‌ను వ్యాప్తి చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే ఈ ఫోన్‌ను టాయిలెట్లో వినియోగిస్తే గ్యాస్ట్రో, స్టాఫ్ వంటి వైరస్ల ఇతరకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. చదవండి👉 యాపిల్ లోగోను టచ్ చేసి చూడండి.. అదిరిపోద్దంతే..! ఫోన్ నుంచి సురక్షితంగా ఉండాలంటే ►► నిపుణుల అభిప్రాయం ప్రకారం 60% నీరు, 40% శానిటైజర్లతో ఫోన్‌ను శుభ్రం చేసుకోవాలి. మీ ఫోన్‌ను నేరుగా లిక్విడ్‌తో శుభ్రం చేయడం వల్ల డిస్ప్లే చెడిపోతుందని స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు చెబుతున్నాయి. ►► ఫోన్ నుంచి సురక్షితంగా ఉండాలంటే బాత్రూమ్లోకి తీసుకొని వెళ్లిపోకూడదు. తినేటప్పుడు ఫోన్‌ను వినియోగించపోవడం ఉత్తమం ►► టచ్స్క్రీన్లను శుభ్రం చేయడానికి నిర్దిష్ట స్ప్రేలను కొనుగోలు చేయవచ్చు. స్క్రీన్ ప్రొటెక్ట్ చేసేందుకు సహాయ పడతాయి. ►► బాత్రూమ్ నుండి బయటకు వచ్చినప్పుడు లేదా ఇతరుల స్మార్ట్‌ఫోన్‌ను తాకినప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. చదవండి👉 ‘ఆఫీస్‌కు రండి.. లేదంటే గెట్ ఔట్’! -
డీవీడి రైటర్లో రూ. 40 లక్షలు ఖరీదు చేసే బంగారం
చెన్నై: అంతర్జాతీయ విమానాశ్రయంలో రెండు వేర్వేరు ఘటనల్లో దాదాపు 40 లక్షలు ఖరీదు చేసే బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారలు తెలిపారు. ఈ మేరకు అక్టోబర్ 29న దుబాయ్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడు బ్యాగ్‌లో ఉంచిన పోర్టబుల్ డిజిటల్ వీడియో డిస్క్(డీవీడీ) రైటర్లో దాచిన బంగారు కడ్డీలను అధికారులు గుర్తించారు. ఆ బ్యాగ్‌ను మరింతగా చెక్ చేయగా సుమారు 15 మొబైల్ ఫోన్లు, దాదాపు 9 వేల విదేశీ సిగరెట్లు లభించినట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మరోక ఘటనలో దుబాయ్ నుంచి వచ్చిన మరో ప్రయాణికుడు ఏకంగా పేస్ట్ రూపంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా ఇద్దరు ప్రయాణకుల నుంచి దాదాపు రూ. 40 లక్షలు విలువ చేసే 900 గ్రాముల బంగారం, మొబైల్ ఫోన్లు, సుమారు రూ. 3.15 లక్షలు విలువ చేసే విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు. (చదవండి: యమునా నదిపై ఎంపీ సంచలన వ్యాఖ్యలు... ప్రూవ్ చేసిన అధికారి) -
పేపర్‌పై రాసిస్తే చాలు.. పోగొట్టుకున్న మొబైల్.. మీ ఇంటికే!
మొబైల్ మిస్సయిందా..? బస్సులో కూర్చున్న వ్యక్తి చోరీ చేశాడా..? అయితే ఎలాంటి బెంగ అవసరం లేదు. ఎందుకంటే పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ఫోన్లను చిత్తూరు పోలీసుశాఖ ట్రాక్ చేసి.. దేశంలో ఎక్కడ ఉన్నా వాటిని రూపాయి ఖర్చులేకుండా తీసుకొచ్చి బాధితులకు అందజేస్తోంది. ఇందుకోసం టెక్నికల్ అనాలసిస్ వింగ్ (టీఏడబ్ల్యూ) పేరిట ఓ ప్రత్యేక సాంకేతిక బృందం పని చేస్తోంది. సాక్షి, చిత్తూరు: ఇటీవల ఫోన్ చోరీ కేసులు పెరిగాయి. ఏదో ఒక చోట తరచూ మొబైల్ ఫోన్లు కనిపించకుండా పోతున్నాయి. పోలీస్ స్టేషన్లకు ఇలాంటి కేసులు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుండడంతో ఈ కేసులు ఛేదించడం తొలుత పోలీసులకు పెను సవాల్‌గా మారింది. అయితే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చోరీకి గురైన మొబైల్ ఫోన్లను కనిపెడుతూ మాయమైన ఫోన్లను ఇట్టే పట్టేస్తున్నారు. చోరీ చేసిన వ్యక్తి పట్టుబడితే వారిని పోలీసులు కటకటాలపాలు చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఓ చోట్ల మొబైల్ ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. మరికొన్నిసార్లు ఫోన్లు పోగొట్టుకుంటారు. ఇలాంటి మొబైల్స్ ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయి..? ఎక్కడ ఉన్నాయి..? పోగొట్టుకున్న ఫోన్ ఎవరు వాడుతున్నారు..? అనే వివరాలను ఛేదించడానికి చిత్తూరు పోలీసు శాఖలో టీఏడబ్ల్యూ విభాగం పనిచేస్తోంది. ఇక్కడ 30 మంది వరకు పోలీసులు పనిచేస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బిహార్, కేరళ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో వినియోగిస్తున్న మొబైల్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. వీటిని బాధితులకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నారు. మొబైల్స్ రికవరీ చేయడంలో టీఏడబ్ల్యూ బృందం ఇప్పటికే పలు రివార్డులు, అవార్డులు అందుకుంది. ►గతేడాది డిసెంబరు నెలలో రూ.75 లక్షల విలువ చేసే 506 సెల్ఫోన్లను చిత్తూరు పోలీసులు పలు ప్రాంతాల నుంచి తెప్పించారు. వీటిలో కొన్ని చోరీకి గురైనవిగా నిర్ధారించి 17 మందిని అరెస్టు చేశారు. మరికొన్ని పోగొట్టుకోగా, వాటిని ఉపయోగిస్తున్న వాళ్లకు ఫోన్‌చేసి చిత్తూరుకు తెప్పించి బాధితులకు అందజేశారు. ►అదే ఏడాది మే నెలలో రూ.60 లక్షలు విలువ చేసే 405 సెల్ఫోన్లను చిత్తూరుకు తెప్పించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో చలామణి అవుతున్న మిస్సింగ్ మొబైల్స్‌ను మన పోలీసులు ఎలాంటి ఖర్చులేకుండా తీసుకొచ్చి వాటి యజమానులకు అప్పగించారు. ►2020లో రూ.40 లక్షలు విలువచేసే 277 సెల్ఫోన్లను సైతం పలు ప్రాంతాల నుంచి తెప్పించగలిగారు. ►తాజాగా రెండు రోజుల క్రితం రూ.30 లక్షల విలువైన 300 మొబైల్ ఫోన్లను సీజ్ చేసిన చిత్తూరు పోలీసులు వాటిని యజమానులకు అప్పగించారు. ఇలా చేస్తే సరి.. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఆలస్యం చేయకుండా బిల్లు, మొబైల్ కొన్నప్పుడు ఇచ్చిన బాక్సును తీసుకెళ్లి సమీపంలో ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ప్రతి స్టేషన్లో ఇలాంటి ఫిర్యాదులు వస్తే తప్పనిసరిగా రసీదు ఇస్తారు. స్టేషన్‌కు వెళ్లలేనివాళ్లు పోలీస్ సేవా యాప్ ద్వారా కూడా ఫిర్యాదులు ఇవ్వొచ్చు. ఐఎంఈఐ నంబర్ ఆధారంగా ఫోన్ ఎక్కడుంది..? ఎవరు ఉపయోగిస్తున్నారో పోలీసులు తెలుసుకుంటారు. వాళ్లతో మాట్లాడి ఫోన్లు తెప్పించి.. బాధితులకు సమాచారం ఇచ్చి ఫోన్లను అందచేస్తున్నారు. పేపర్‌పై రాసిస్తే చాలు.. మొబైల్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా ఓ పేపర్‌పై ఫిర్యాదు రాసి స్టేషన్లో ఇస్తేచాలు. 90 శాతం కేసుల్లో ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందచేస్తున్నాం. మిగిలినవి తప్పక కనిపెడతాం. కొద్దిగా సమయం పడుతుంది. మీరు ఫిర్యాదు ఇవ్వకుంటే ఆ ఫోన్లతో ఏదైనా క్రైమ్ చేసినపుడు పోలీసుల విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందనే విషయం గుర్తించుకోండి. –వై.రిషాంత్‌రెడ్డి, ఎస్పీ, చిత్తూరు -
స్వాతంత్ర భారతి: 1995/2022 మొబైల్ ఫోన్ల శకారంభం
జన్‌ధన్, ఆధార్ ఔర్ మొబైల్ అన్నది ఇప్పుడైతే ఆచరణీయ నినాదంలా ధ్వనిస్తోంది కానీ, సెల్ ఫోన్లు రంగ ప్రవేశం చేసిన కొత్తలో అవి ధనికుల ఆట వస్తువుల్లానే ఉండేవి. ఈ పరిస్థితి 1999 వరకు కొనసాగింది. అసలు 1999 కి కొన్నేళ్ల ముందు వరకు కూడా సాధారణ టెలిఫోన్ సైతం కొద్దిమందికే సంక్రమించిన ప్రత్యేక హక్కులా ఉండేది. పరిమితంగా పంచవలసిన ఆస్తిగా ఉండేది. అలాంటిది నేడు దాదాపు 100 కోట్ల మందికి పైగా భారతీయులు చేతిలో సెల్‌ఫోన్ లేకుండా గడప దాటడం లేదంటే... అది రెండు విధాన నిర్ణయాల ఫలితమేనని చెప్పాలి. 1990 దశకం మధ్యలో టెలికామ్ రంగంలో ప్రైవేట్ సంస్థల ప్రవేశాన్ని అనుమతించడంతో అనేక సర్వీస్ ప్రొవైడర్లు వినిమయదారులకు నాణ్యమైన సేవలు అందించడం ప్రారంభించారు. అప్పటి వరకు సొంత ఇల్లు సంపాదించుకోవడం కన్నా సాధారణ టెలిఫోన్ సంపాదించడమే కష్టమన్న పరిస్థితి ఉన్న మన దేశంలో ఎట్టకేలకు ఒక్క ఫోన్ చేస్తే చాలు బేసిక్ టెలిఫోన్ కనెక్షన్ వచ్చి వాలిపోవడం మొదలైంది. ఆ పైన, 1999లో లైసెన్స్ ఫీజుల శకం అంతరించి ప్రభుత్వం, టెలికామ్ ఆపరేటర్లు ఆదాయన్ని పంచుకునే యుగం అవతరించింది. దీంతో ఒకప్పుడు నిముషానికి రు.16 రూపాయలు ఉన్న ఫోన్ చార్జీలు ఇప్పుడు పైసల్లోకి పడిపోయాయి. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు డబ్ల్యూ.టి.ఓ. (వర ల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) లో భారత్ చేరిక. ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ స్థాపన. గ్యాంగ్‌స్టర్ ఆటో శంకర్‌కు తమిళనాడు సేలంలోని కేంద్ర కారాగారంలో ఉరి. దేశంలో ఇంటర్నెట్ను లాంఛనంగా ఆరంభించిన వి.ఎస్.ఎన్.ఎల్. (టాటా కమ్యూనికేషన్స్) (చదవండి: దేశం రెండు ముక్కలైంది నేడే!) -
పాక్... మరో శ్రీలంక
ఇస్లామాబాద్: శ్రీలంక మాదిరిగానే పాకిస్తాన్ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. దేశంలో గంటల కొద్దీ విద్యుత్ కోతలు అమల్లో ఉండటంతో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయే ప్రమాదం ఉందని పాకిస్తాన్ ప్రభుత్వమే ప్రజలను హెచ్చరించింది. విద్యుత్ కోతల కారణంగా ఇప్పటికే మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని శుక్రవారం నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బోర్డ్ (ఎన్ఐబీటీ) ట్విట్టర్లో తెలిపింది. దేశ అవసరాలకు సరిపోను ద్రవీకృత సహజ వాయువు(ఎల్ఎన్జీ) అందకపోవడంతో జూలైలో ఈ సమస్య మరింత తీవ్రం కావచ్చని ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా ఇటీవల పేర్కొన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్ ఒక వైపు పెరుగుతుండగా జూన్‌లో దిగుమతులు తగ్గిపోయినట్లు జియో న్యూస్ పేర్కొంది. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కరాచీ తదితర నగరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీల్లో పని గంటలను కుదించారు. ఇంధన కొరతను అధిగమించేందుకు ఖతార్‌తో చర్చలు జరుగుతున్నాయి. విదేశీ కరెన్సీ నిల్వలు పడిపోవడంతో దేశంలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా రెట్టింపయింది. -
శామ్సంగ్కు 75 కోట్ల జరిమానా
మెల్బోర్న్: ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ శామ్సంగ్కు ఆస్ట్రేలియా ఫెడరల్ కోర్టు ఝలకిచ్చింది. మొబైల్ ఫోన్లు వాటర్ ప్రూఫ్ అంటూ తప్పుదోవ పట్టించినట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపిన కోర్టు శామ్సంగ్కు రూ.75 కోట్ల మేర జరిమానా విధించిందని ప్రభుత్వ నియంత్రణ సంస్థ వెల్లడించింది. 2016 మార్చి నుంచి 2018 అక్టోబర్ మధ్య ఎస్7, ఎస్8 సిరీస్ చెందిన 31 లక్షల గ్యాలెక్సీ ఫోన్లను శామ్సంగ్ ఆస్ట్రేలియా విక్రయించింది. ఈ ఫోన్లు నీళ్లలో తడిచినా పాడవవంటూ ప్రకటనలు ఇచ్చింది. అయితే, నీళ్లలో తడిచిన తర్వాత తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాదిగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి 2019లో నమోదైన కేసులపై కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. సంబంధిత ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులు శామ్సంగ్ను సంప్రదించాలని సూచించింది. -
టీసీఎల్ ద్వారా 2వేల మందికి ఉపాధి లభిస్తోంది: సీఎం వైఎస్ జగన్