దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్‌పై బంపర్ బొనాంజ సేల్‌ను ప్రారంభించింది. నేటి నుంచి ప్రారంభించిన ఈ సేల్‌ను, మార్చి 15 వరకు నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, కార్డు ప్రయోజనాలను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్‌లో హైలెట్‌గా లెనోవో కే8 ప్లస్, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్ స్మార్ట్‌ఫోన్లు నిలుస్తున్నాయి. లెనోవో కే8 ప్లస్‌ను రూ.7,999కే డిస్కౌంట్ ధరలో అందిస్తుండగా.. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్‌ఎల్‌ను రూ.49,999కు ఆఫర్ చేస్తోంది. అదనంగా ఈ రెండు ఫోన్ల కొనుగోలుపై ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు దారులకు 5 శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది.
లెనోవో కే8 ప్లస్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజ సేల్‌లో ‘హీరో ఆఫర్’ కింద అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్‌పై రెండు వేల రూపాయల మేర ధర తగ్గి, రూ.7,999కే అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా ఒప్పో ఎఫ్3(4జీబీ) స్మార్ట్‌ఫోన్ ధర కూడా 16,990 రూపాయల నుంచి 11,990 రూపాయలకు తగ్గింది. బడ్జెట్ ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్(16జీబీ) స్మార్ట్‌ఫోన్ 9,499 రూపాయలకు, గెలాక్సీ ఆన్5 స్మార్ట్‌ఫోన్ 6,290 రూపాయలకు, ఎల్‌జీ కే7ఐ స్మార్ట్‌ఫోన్ 4,999 రూపాయలకు, ఐఓమీ ఐ1 స్మార్ట్‌ఫోన్ 5,999 రూపాయలకు, మోటో ఈ4 ప్లస్(3జీబీ) స్మార్ట్‌ఫోన 8,999 రూపాయలకు అందుబాటులోకి వచ్చాయి.
శాంసంగ్ గెలాక్సీ ఎస్7(4జీబీ) స్మార్ట్‌ఫోన్ ధర 29,990 రూపాయల నుంచి 22,990 రూపాయలకు తగ్గింది. మోటో జడ్2 ప్లే(4జీబీ) స్మార్ట్‌ఫోన్ కూడా 19,999 రూపాయలకు మార్చి 13 నుంచి మార్చి 15 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. హానర్ 9 లైట్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు, రెడ్‌మి నోట్ 5, రెడ్‌మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్లు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్‌లో అందుబాటులోకి రానున్నాయి. రెడ్‌మి 5ఏ కూడా మార్చి 15న ఫ్లాష్ సేల్‌కు వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment