Mobile sales
-
భారత్‌లో యాపిల్ నాలుగు స్టోర్లు..? ఎక్కడంటే..
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్‌లో తన రిటైల్ స్టోర్లను విస్తరించాలని యోచిస్తోంది. ఇప్పటికే ఢిల్లీ, ముంబయిలో రిటైల్ స్టోర్లను ప్రారంభించిన యాపిల్ మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.ప్రపంచవ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. అందుకు అనుగుణంగా ఉత్పాదకతను పెంచేలా కంపెనీ ఏర్పాట్లు చేస్తోంది. దేశీయంగా యాపిల్ ఉత్పత్తుల తయారీ కోసం ఫాక్స్‌కాన్, టాటా వంటి కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. సెప్టెంబర్ 20న యాపిల్ ఐఫోన్ 16 సిరీస్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దాంతో దేశంలోని ముంబయి, ఢిల్లీ స్టోర్‌ల్లో భారీగా వినియోగదారుల రద్దీ నెలకొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థను ఆసరాగా చేసుకుని కంపెనీ రెవెన్యూ పెంచుకోవాలని ఆశిస్తుంది. దేశంలో కొత్తగా బెంగళూరు, పుణె, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబయిలో రిటైల్ స్టోర్లు ప్రారంభించాలని యోచిస్తోంది. దాంతోపాటు ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను స్థానికంగా తయారు చేయాలనే ప్రతిపాదనలున్నట్లు కంపెనీ అధికారులు పేర్కొన్నారు.ఇదీ చదవండి: కేంద్రం కొత్త పథకాలు ప్రారంభం.. ఎవరికంటే..ఆపిల్ రిటైల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెయిడ్రే ఓబ్రియన్ మాట్లాడుతూ..‘భారత్‌లో సంస్థ రిటైల్ స్టోర్లు విస్తరించాలని యోచిస్తోంది. అందుకు అనుగుణంగా మెరుగైన టీమ్‌ను సిద్ధం చేస్తున్నాం. మా కస్టమర్ల సృజనాత్మకత, అభిరుచికి అధిక ప్రాధాన్యం ఇస్తాం. వారి ఇష్టాలకు అనువుగా సరైన ఉత్పత్తులను అందించడం సంస్థ బాధ్యత. స్థానికంగా స్టోర్లను పెంచడం ద్వారా మరింత ఎక్కువ మంది వినియోగదారులకు సేవలందించే అవకాశం ఉంటుంది’ అన్నారు. -
ఆ సెగ్మెంట్లో మోస్ట్ పాపులర్ స్మార్ట్ ఫోన్లు ఇవే..?
భారత్‌లో ఎక్కువగా రూ.10 వేలు నుంచి రూ.20 వేల ధర ఉన్న మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఉందని ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్ తెలిపారు. గత రెండేళ్లుగా మొబైల్ మార్కెట్లోని స్తబ్దత తొలగిపోయిందన్నారు. 5జీ ట్రెండ్ కొనసాగుతుండడంతో చాలా మంది కస్టమర్లు అందుకు అనువుగా ఉంటే ఫోన్లను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..‘భారత మార్కెట్లో రూ.10,000-రూ.20,000 మధ్య ధర కలిగిన స్మార్ట్ఫోన్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మొత్తం అమ్మకాలు 40% పైగా పెరిగాయి. ఇటీవలి కాలంలో 5జీ ఫోన్లకు డిమాండ్ అధికమైంది. గతంలో రూ.10,000 లోపు ఫోన్లకు ఎక్కువ మార్కెట్ ఉండేది. 5జీ రావడంతో రూ.10,000 కంటే అధిక ధర మొబైళ్లకు డిమాండ్ పెరిగింది. గత రెండేళ్లుగా మార్కెట్లో ఉన్న స్తబ్దత తొలగిపోయింది. ఫీచర్లు అప్‌గ్రేడ్ చేయడం, తాజా ట్రెండ్‌కు తగిన లేటెస్ట్ టెక్నాలజీ అందించడం ద్వారా వీటికి మరింత గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: ‘బహిరంగ విచారణ జరగాలి’ -
శాంసంగ్ గెలాక్సీ 5జి మొబైల్స్‌పై మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్: ఈ రోజే లాస్ట్
భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ, ఏ34 5జీ మొబైల్స్ ఎట్టకేలకు సేల్కు వచ్చాయి. కంపెనీ ఇప్పుడు ఈ మొబైల్ ఫోన్స్ మీద ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా తీసుకువచ్చింది. ఈ 5జి మొబైల్స్ మునుపటి మోడల్స్ కంటే కూడా ఆధునిక ఫీచర్స్ పొందుతాయి. కొత్త శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ & ఏ43 5జీ రెండూ కూడా ఈ రోజు (మార్చి 23) నుంచి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఏ54 5జీ 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ వేరియంట్ ధర రూ. 38,999, కాగా 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ కలిగిన టాప్ వేరియంట్ ధర రూ. 40,999. శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ ధరల విషయానికి వస్తే, ఇందులో 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన బేస్ మోడల్ ధర రూ. 30,999 కాగా, టాప్ వేరియంట్ (8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్) ధర రూ.32,999. వీటిని ఇప్పుడు కంపెనీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలు చేయవచ్చు. లేదా ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ సైట్లలో కూడా తీసుకోవచ్చు. (ఇదీ చదవండి: భయం గుప్పెట్లో ఉద్యోగులు.. నీటి బుడగలా ఉద్యోగాలు: భారత్‌లోనూ..) శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ 6.4 ఇంచెస్ డిస్ప్లే కలిగి వెనుక 50 మెగాపిక్సెల్ ప్రైమరీ, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాలు పొందుతుంది. అదే సమయంలో ఏ34 5జీ మోడల్ 6.6 ఇంచెస్ డిస్ప్లే కలిగి, 48 మెగాపిక్సెల్ ప్రైమరీ, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు పొందుతుంది. (ఇదీ చదవండి: ఇది కదా సక్సెస్ అంటే: ఒకప్పుడు ట్యూషన్ టీచర్.. ఇప్పుడు వంద కోట్లకు అధిపతి!) కంపెనీ ఈ లేటెస్ట్ మొబైల్స్ కొనుగోలు మీద ఆఫర్స్ కూడా అందిస్తోంది, ఇందులో భాగంగానే శాంసంగ్ వెబ్సైట్లో కొనుగోలు చేస్తే రూ.1000 వోచర్, ICICI క్రెడిట్ లేదా డెబిట్ కార్డు ద్వారా రూ. 3,000 డిస్కౌంట్ పొందవచ్చు. అంతే కాకుండా సుమారు రూ. 5,999 విలువైన గెలాక్సీ బడ్స్ లైవ్ టీడబ్ల్యూఎస్ను కేవలం రూ. 999కే సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్స్ అన్నీ కూడా కేవలం ఈ రోజు అర్ధరాత్రి (మార్చి 24) వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. -
ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా..! మొబైల్స్‌పై భారీ తగ్గింపు..!
కరోనా మహమ్మారి రాకతో పలు ఈ-కామర్స్ వెబ్సైట్లు కస్టమర్లకు అందించే ఫెస్టివల్ సేల్స్‌ను నిలిపివేశాయి. దేశ వ్యాప్తంగా కరోనా కేసుల కాస్త తగ్గముఖం పట్టడంతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా ఫెస్టివల్ సేల్స్‌ను కస్టమర్లకు అందించాయి. తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లకోసం మొబైల్ సేవింగ్ డేస్ సేల్‌ను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. కాగా మరో దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అదే బాటలో నడుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తన కస్టమర్లకోసం ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బోనాంజా సేల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. (చదవండి:WhatsApp:మీరు అనుకుంటే వాట్సాప్‌లో కనిపించకుండా చేయవచ్చు.!) ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్స్ నేటితో ప్రారంభమై ఐదు రోజుల పాటు ఆగస్టు 23 వరకు కొనసాగనుంది. ఈ సేల్స్‌లో భాగంగా పలు మొబైల్స్‌పై , మొబైల్ యాక్సేసరిస్‌పై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఐఫోన్ 12 మినీ, పోకో ఎం 3, మోటో జి 60 , ఇన్ఫినిక్స్ హాట్ 10 ఎస్ వంటి స్మార్ట్ఫోన్లపై భారీ డీల్స్, డిస్కౌంట్లను ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. ఐఫోన్ 12, రియల్మీ సి 20, ఒప్పో ఎఫ్ 19 వంటి మోడళ్లపై ప్రీపెయిడ్ డిస్కౌంట్ ఆఫర్లను కూడా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో భాగస్వామ్యమై ఎంపిక చేసిన ఫోన్లపై తక్షణ డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్ మార్కెట్లో అందుబాటులోని ప్రముఖ ఫోన్లకు నో-కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ బొనాంజా సేల్స్‌లో ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న పలు ఆఫర్ల వివరాలు..! ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ ఐఫోన్ 12 మినీ స్మార్ట్‌ఫోన్‌ను ధర రూ. 59,999 అందిస్తోంది. ఐఫోన్ ఎస్ఈ (2020) స్మార్ట్‌ఫోన్ ధర రూ. 34,999 అందుబాటులో ఉండనుంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 48,999 అందించనుంది. ఐఫోన్ ఎక్స్ ఆర్‌ను రూ. 41,999, ఐఫోన్ 11 ప్రోను రూ. 74,999 కు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. మోటో జీ60 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 16,999 అందిస్తుంది. పోకో ఎమ్3ను రూ. 10,499 కాగా, ఇన్ఫినిక్స్ స్మార్ట్ 5 ను రూ. 6,999 అందించనుంది. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) -
ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్
మొబైల్ ప్రియుల కోసం మొబైల్స్ బొనాంజా సేల్ ను ఫ్లిప్‌కార్ట్ తీసుకోని వచ్చింది. ఈ మొబైల్ బొనాంజా సేల్ నేటి(ఫిబ్రవరి 24) నుంచి ఫిబ్రవరి 28 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో ప్రముఖ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్‌తో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లను కూడా తీసుకొచ్చింది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజా సేల్ లో ఆపిల్, మోటరోలా, పోకో, రియల్మీ, శామ్సంగ్, వివో, షియోమీతో పాటు ఇతర బ్రాండ్ల మీద ఆఫర్లు ఉన్నాయి. రియల్మీ నార్జో 20ఏ స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.10,999కాగా ఆఫర్ కింద ధర రూ.8,499కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు పొందవచ్చు. పోకో సీ3 స్మార్ట్‌ఫోన్ 3జీబీ+32జీబీ వేరియంట్ అసలు ధర రూ.7,499కాగా ఆఫర్ కింద ధర రూ.6,999కు లభిస్తుంది. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు, బ్యాంక్ ఆఫ్ బరోడా మాస్టర్ కార్డ్ డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపు పొందవచ్చు. పోకో ఎక్స్3 స్మార్ట్‌ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ అసలు ధర రూ.17,999 కాగా ఆఫర్ కింద రూ.16,999కు లభిస్తుంది. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ 64జీబీ వేరియంట్ అసలు ధర రూ.54,900కాగా ఆఫర్ కింద రూ.49,999కు లభిస్తుంది. ఇలా మొత్తం 25 స్మార్ట్ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ లో భారీ డిస్కౌంట్ అందిస్తుంది. చదవండి: ఏడు స్క్రీన్ల ల్యాప్‌టాప్‌ను చూశారా! గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త ఫీచర్ -
ఫ్లిప్‌కార్ట్ బొనాంజా సేల్ : భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: ప్రముఖ ఆన్లైన్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు శుభవార్త అందించింది. డిస్కౌంట్ ధరల్లో స్మార్ట్‌ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ’మొబైల్స్ బొనాంజా’ సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ ఫిబ్రవరి 17 న ప్రారంభమై ఫిబ్రవరి 21న ముగియనుంది. ఆపిల్, శాంసంగ్, వివో, రియల్మీ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లను తగ్గింపుధరల్లో అందుబాటులో ఉంచనుంది. ముఖ్యంగా ఫ్లాగ్షిప్, మిడ్-రేంజ్, బడ్జెట్ ఇలా స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపుల ధరలను ప్రకటించింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ డెబిట్ , క్రెడిట్ కార్డులతో చేసిన అన్ని లావాదేవీలపై 10 శాతం తగ్గింపుదీనికి అదనం. రూ.15 వేల కేటగిరిలో శాంసంగ్ గెలాక్సీ ఏ50, వివో జెడ్1 ప్రొలు రూ.12,999 నుంచి రూ.11,990ధరలలో లభ్యం కానున్నాయి. వివోజెడ్1. రియల్‌మి ఎక్స్‌టీ రూ.13,990, రూ,14,999 వద్ద తగ్గింపు ధరలలో లభ్యం కానున్నాయి. దాదాపు అన్ని రకాల మొబైల్స్ తగ్గింపు ధరలలో ఈ సేల్‌లో అందుబాటులో ఉంటాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. వివో జెడ్ 1 ఎక్స్ , రియల్ మి ఎక్స్‌టీ స్మార్ట్ఫోన్లు రూ. 13,990, 14,999 రూపాయల నుండి లభిస్తాయి. నోకియా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 7.2 ధరను తగ్గించి రూ .15,499 కే లభ్య. ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఎడిషన్ రూ. రూ .26,990 దీని అసలు రూ. 40వేల నుంచి భారీ తగ్గింపు ఒప్పో రెనో 10 ఎక్స్ జూమ్ ఫ్లాగ్షిప్ కిల్లర్ రియల్మీ ఎక్స్ 2 ప్రో రూ .27,999 తగ్గింపు రూ. 2వేలు బ్లాక్ షార్క్ 2 గేమింగ్ స్మార్ట్‌ఫోన్ రూ .29,999 పిక్సెల్ 3 ఎ సిరీస్ రూ .27,999 కంటే తక్కువకు లభించనుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్ 9 సిరీస్ కూడా రూ .22,999 నుండి లభిస్తుంది. రూ. 10, 000 లోపు స్మార్ట్ఫోన్లు ఒప్పో కె 1 రూ .9,990 ఐఫోన్లపై తగ్గింపు ఆండ్రాయిడ్ నుంచి ఐవోస్‌కు మారాలనుకుంటున్న వారికి కూడా ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్లపై కూడా భారీ తగ్గింపును అందిస్తోంది. ఐఫోన్ ఎక్స్ఎస్ ధర రూ. 54,999 నుండి ప్రారంభం ఐఫోన్ 8 ను రూ .35,999 కు పొందవచ్చు. చదవండి : లేటెస్ట్ ఐఫోన్‌పై డిస్కౌంట్ ఆఫర్ -
మంత్ ఎండ్ సేల్ : ఐఫోన్‌పై రూ.25వేలు తగ్గింపు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ వివిధ మొబైల్ ఫోన్స్ భారీ ఆఫర్లను ప్రకటించింది. మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్ సేల్ పేరుతో ఐ ఫోన్, నోకియా, హానర్ బ్రాండ్స్ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో అందుబాటులోకి తెచ్చింది. మే 31 వరకు సేల్ నిర్వహిస్తోంది. బిగ్ షాపింగ్ సేల్ మిస్ అయినవారికి ఈ మంత్ ఎండ్‌సేల్ ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ భావిస్తోంది. ఈ సేల్‌లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ కస్టమర్లు వారి డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా నిర్వహించే ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే రెగ్యులర్ డిస్కౌంట్‌తోపాటు ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం కూడా ఉంది. కేవలం రూ.99కే మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ పొందొచ్చు. నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యం ఉంది. ఆపిల్ ఐఫోన్ ఎక్స్ (64జీబీ స్టోరేజ్) : రూ.66,499కు కొనుగోలు చేయవచ్చు. అసలు ధర రూ.91,900. సుమారు రూ.25 వేల భారీ తగ్గింపు నోకియా 5.1 ప్లస్ : (3 జీబీ ర్యామ్/32 జీబీ స్టోరేజ్) ధర రూ.8,199కే అందుబాటులో ఉంది. అసలు ధర. 13,199 నోకియా 6.1 : రూ.12,999. అసలు ధర రూ.17,600 హానర్ 9ఎన్ : ధర రూ.8,499. అసలు ధర. 13,999 హానర్ 10 లైట్ (4 జీబీ ర్యామ్/64 జీబీ మెమరీ) : రూ.11,999, అసలు ధర రూ. 16, 999 ఎంఐ ఏ2 ఫోన్‌ను రూ.9,999 ప్రారంభ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇంకా శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 రూ. 36,990 (రూ.74,000) అలాగే గెలాక్సీ ఎ 20పై 1500 రూపాయల ఎక్స్చేంజ్ ఆఫర్. -
వరుస ఫ్లాష్ సేల్స్ : హాట్‌కేకుల్లా రెడ్మి నోట్ 6ప్రో
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి నోట్ సిరీస్‌లో కొత్త ఫోన్ రెడ్మి నోట్ 6ప్రో ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు (నవంబరు 23) న స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 12, 3, 6, 9 గంటలకు వరుసగా స్పెషల్ సేల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 12 గంటల ఫ్లాష్‌సేల్‌లో తమ స్మార్ట్‌ఫోన్ నిమిషాల్లో ఐట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించిన షావోమీ చీఫ్ మను జైన్ వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లతో ఆసక్తి పుట్టించారు. అప్డేట్ 1: ఫ్లాష్‌సేల్ తర్వాత సుమారు ఒంటి గంటకు షావోమీ ఇండియా ఛీఫ్ మను జైన్ ట్విటర్లో 6 లక్షల యూనిట్ల సేల్ జరిగిందని పోస్ట్ చేశారు. కానీ కొద్ది నిమిషాల్లోనే దాన్ని డిలీట్ చేశారు. అప్డేట్2: మొదటి సేల్‌లో 6 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు మను జైన్ మరలా ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సెకండ్ సేల్‌లో కూడా అదే స్థాయిలో కొనుగోలు జరిగే అవకాశం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అప్డేట్3: మొదటి రెండు సేల్స్ మాత్రమే కాక సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు మరో రెండు సేల్స్ ఉంటాయని తెలిపారు. ఒకే రోజు నాలుగు ఫాష్సేల్స్ ఉండడంతో మొదటి రోజే మొబైల్ కొనాలనుకునే వారికి ఇదో సువర్ణావకాశమే అని చెప్పాలి. అదీ ఈ ఒక్క రోజే స్పెషల్ ధరలో ఈ స్మార్ట్ఫోన్లను విక్రయిస్తోంది. మరి మొదటి సేల్‌లోనే ఈ డివైస్‌లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతే.. మిగిలిన మూడు సేల్స్‌లో ఇంకెన్ని యూనిట్ల సేల్స్ నమోదవుతాయో అనిటెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్‌పై బంపర్ బొనాంజ సేల్‌ను ప్రారంభించింది. నేటి నుంచి ప్రారంభించిన ఈ సేల్‌ను, మార్చి 15 వరకు నిర్వహించనున్నట్టు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు, కార్డు ప్రయోజనాలను అందించనున్నట్టు ప్రకటించింది. ఈ సేల్‌లో హైలెట్‌గా లెనోవో కే8 ప్లస్, గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లు నిలుస్తున్నాయి. లెనోవో కే8 ప్లస్‌ను రూ.7,999కే డిస్కౌంట్ ధరలో అందిస్తుండగా.. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ఎల్ను రూ.49,999కు ఆఫర్ చేస్తోంది. అదనంగా ఈ రెండు ఫోన్ల కొనుగోలుపై ఎస్బీఐ క్రెడిట్ కార్డు దారులకు 5 శాతం ఇన్స్టాంట్ డిస్కౌంట్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. లెనోవో కే8 ప్లస్ 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్ మొబైల్స్ బొనాంజ సేల్‌లో ‘హీరో ఆఫర్’ కింద అందుబాటులో ఉంది. దీంతో ఈ ఫోన్‌పై రెండు వేల రూపాయల మేర ధర తగ్గి, రూ.7,999కే అందుబాటులోకి వచ్చింది. అదేవిధంగా ఒప్పో ఎఫ్3(4జీబీ) స్మార్ట్‌ఫోన్ ధర కూడా 16,990 రూపాయల నుంచి 11,990 రూపాయలకు తగ్గింది. బడ్జెట్ ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ ఆన్ నెక్ట్స్(16జీబీ) స్మార్ట్‌ఫోన్ 9,499 రూపాయలకు, గెలాక్సీ ఆన్5 స్మార్ట్‌ఫోన్ 6,290 రూపాయలకు, ఎల్జీ కే7ఐ స్మార్ట్‌ఫోన్ 4,999 రూపాయలకు, ఐఓమీ ఐ1 స్మార్ట్‌ఫోన్ 5,999 రూపాయలకు, మోటో ఈ4 ప్లస్(3జీబీ) స్మార్ట్‌ఫోన 8,999 రూపాయలకు అందుబాటులోకి వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్7(4జీబీ) స్మార్ట్‌ఫోన్ ధర 29,990 రూపాయల నుంచి 22,990 రూపాయలకు తగ్గింది. మోటో జడ్2 ప్లే(4జీబీ) స్మార్ట్‌ఫోన్ కూడా 19,999 రూపాయలకు మార్చి 13 నుంచి మార్చి 15 వరకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చింది. హానర్ 9 లైట్ ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు, రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్లు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్ సేల్‌లో అందుబాటులోకి రానున్నాయి. రెడ్మి 5ఏ కూడా మార్చి 15న ఫ్లాష్ సేల్కు వస్తోంది. -
మొబైల్స్ రిటైల్‌లోకి ‘హ్యాపీ’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ విక్రయంలోకి సరికొత్త బ్రాండ్ ‘హ్యాపీ’ రంగ ప్రవేశం చేసింది. తొలి స్టోర్‌ను అనంతపూర్‌లో నటి సమంత అక్కినేని చేతుల మీదుగా సోమవారం ప్రారంభించింది. తొలి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో స్టోర్లను విస్తరిస్తామని హ్యాపీ మొబైల్స్ ఎండీ కృష్ణ పవన్ ఈ సందర్భంగా తెలిపారు. ‘కస్టమర్లు, ఉద్యోగులు, భాగస్వాములు, ఈ రంగంతో ముడిపడి ఉన్న అందరూ సంతోషంగా ఉండాలన్న ప్రధాన విలువతో హ్యాపీ బ్రాండ్ కొనసాగుతుంది. తొలి ఏడాదే 150–200 ఔట్లెట్లను తెరవాలన్నది మా ప్రణాళిక. మొదటి సంవత్సరం రూ.500 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నాం. 1,000 మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తాం. ప్రతి స్టోర్‌లో లైవ్ డెమో జోన్స్ ఏర్పాటు చేస్తాం. కస్టమర్‌కు వినూత్న అనుభూతి కల్పించేందుకు వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికత పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. అంతర్జాతీయ బ్రాండ్లతో 200ల దాకా మోడళ్ల డిస్ప్లే ఉంటుంది. వినియోగదార్ల కోసం బెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తున్నాం’ అని వివరించారు. టాప్ కంపెనీల యాక్సెసరీస్‌కు ప్రత్యేక ఏర్పాటు ఉంటుందని కంపెనీ ఈడీ కె.సంతోష్ తెలిపారు. రిపేర్ వస్తే స్టాండ్ బై ఫోన్‌ను కస్టమర్‌కు ఇస్తామని ఈ సందర్భంగా చెప్పారు. -
న్యూ ఇయర్లో డిస్కౌంట్లే డిస్కౌంట్లు
ఫ్లిప్‌కార్ట్ కొత్త ఏడాది సందర్భంగా నిర్వహిస్తున్న 2018 మొబైల్స్ బొనాంజ సేల్‌ను ప్రకటించింది. దేశీయ కొనుగోలుదారులు కొత్త స్మార్ట్‌ఫోన్‌తో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతో ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌ను ప్రారంభించబోతుంది. జనవరి 3 నుంచి జనవరి 5 మధ్యలో ఈ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్ సందర్భంగా షావోమి ఎంఐ ఏ1, గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్, మోటో జీ5 ప్లస్, రెడ్మి నోట్4, లెనోవో కే5 నోట్, శాంసంగ్ గెలాక్సీ ఎస్7 స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన డీల్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తుంది. అంతేకాక పలు 4జీ హ్యాండ్సెట్లను డిస్కౌంట్ ధరలో విక్రయించనున్నట్టు తెలిపింది. స్వల్ప ఛార్జీతో బైబ్యాక్ గ్యారెంటీ, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, పలు ఎక్స్చేంజ్ ఆఫర్లు ఈ సేల్‌లో ఉండనున్నాయి. మొబైల్స్‌పై సేల్ ఆఫర్స్... షావోమి ఎంఐ ఏ1 డిస్కౌంట ధర రూ.12,999కే అందుబాటు(ఎంఆర్పీ రూ.13,999) గూగుల్ పిక్సెల్ 2, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ అత్యంత తక్కువ ధర రూ.39,999కే లభ్యం( అసలు రూ.61వేల నుంచి ధర ప్రారంభం), దీనిలోనే హెచ్డీఎఫ్సీ క్రెడిట్ ఈఎంఐ లావాదేవీలపై ఆఫర్ చేసే రూ.8000 డిస్కౌంట్ అందుబాటులో ఉండనుంది. మోటో జీ5 ప్లస్ రూ.9999కు విక్రయం(ఎంఆర్పీ రూ.16వేలు) రెడ్మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్ కొత్త ధర రూ.10,999(అసలు ధర రూ.12,999). ఈ డిస్కౌంట్ ధర 4జీబీ ర్యామ్, 64జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వేరియంట్‌కు మాత్రమే అమలు. లెనోవో కే5 నోట్ 4జీబీ వేరియంట్ రూ.11,481కి లిస్ట్ అయింది. దీని అసలు ధర రూ.13,499. మోటో సీ ప్లస్ రూ.5,999కే సేల్(ఎంఆర్పీ రూ.6,999) ప్యానాసోనిక్ ఎలుగా ఏ3 3జీబీ ర్యామ్ వేరియంట్ రూ.6,999 డిస్కౌంట్ ధరలో అందుబాటు. ఈ ఫోన్ అసలు ధర 11,490 రూపాయలు. గెలాక్సీ ఎస్ 7 రూ.26,990కి అందుబాటు(అసలు ఎంఆర్పీ రూ.46వేలు) లెనోవో కే8 ప్లస్ ధర రూ.8,981 నుంచి ప్రారంభం -
స్మార్ట్ఫోన్ల రంగంలోకి పెప్సీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: శీతల పానీయాలు, ఆహారోత్పత్తుల తయారీ దిగ్గజం పెప్సి స్మార్ట్ ఫోన్ల విపణిలోకి ప్రవేశిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. చైనాలోని వీబో సోషల్ మీడియా సైట్లో పెప్సి ఫోన్ బ్యానర్ ప్రత్యక్షమైంది. ఇదే వెబ్సైట్లో పెప్సి విడుదల చేయనున్న తొలి మోడల్ సైతం దర్శనమిస్తోంది. వెబ్సైట్ వివరాల ప్రకారం ‘పెప్సి పి1’ పేరుతో రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల స్క్రీన్, 1.7 గిగాహెట్జ్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ, 13 ఎంపీ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఫీచర్లుగా ఉన్నాయి. బీజింగ్‌లో అక్టోబరు 20న ఇది విడుదల కానున్నట్టు సమాచారం. ధర 200 డాలర్లుగా ఉంది. ఈ స్మార్ట్ఫోన్లను హువావె తయారు చేయనున్నట్టు తెలుస్తోంది. మొబైల్స్‌తోపాటు యాక్సెసరీస్‌లోకి పెప్సి ప్రవేశిస్తోంది. స్మార్ట్ఫోన్ల రంగం ప్రపంచవ్యాప్తంగా కొత్త పుంతలు తొక్కుతోంది. రిటైల్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను సాధించిన పెప్సీకి ఈ అంశమే ఆకట్టుకుంది. మొబైల్స్ విక్రయాలు చైనాకు పరిమితం కానున్నాయని పెప్సి ప్రతినిధి ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు వెల్లడించారు. -
మైక్రోమాక్స్ ప్రమోటర్లకు జాక్‌పాట్!
మొబైల్ అమ్మకాల్లో దూసుకెళుతున్న దేశీ దిగ్గజం మైక్రోమాక్స్.. త్వరలో చేతులు మారనుందా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలిస్తున్నాయి. కంపెనీ ప్రస్తుతం టాప్‌గేర్‌లో ఉండటంతో ఇదే అవకాశంగా మంచి రేటుకు విక్రయించి బయటపడేలా ప్రమోటర్లు ప్రణాళికలు వేస్తున్నారు. కంపెనీకి ప్రస్తుతం రూ.21,000 కోట్ల వేల్యుయేషన్ లభించినట్లు సమాచారం. కేవలం మొబైల్స్‌ను అసెంబుల్ చేసి విక్రయించే దేశీ కంపెనీకి ఇంత భారీ విలువ రావటం... మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ⇒వాటా విక్రయానికి తహతహ.. ⇒కంపెనీ విలువ రూ. 21 వేల కోట్లుగా అంచనా ⇒సాధ్యమైతే పూర్తిగా కంపెనీని అమ్మేసే ప్రణాళిక! ⇒అలీబాబా, సాఫ్ట్‌బ్యాంక్‌లతో చర్చలు దేశీ మొబైల్స్ మార్కెట్లో మైక్రోమాక్స్ ఒక కెరటం. శామ్సంగ్ లాంటి దిగ్గజాలతో పోటీగా సెల్ఫోన్లను హాట్‌కేకుల్లా అమ్మేస్తున్న ఈ కంపెనీ ప్రమోటర్లు... సరైన భాగస్వామి లభిస్తే కొంత వాటాను విక్రయించాలని, లేదంటే పూర్తిగా వేరొకరికి అమ్మేసి కంపెనీ నుంచి వైదొలగాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికోసం ఇప్పటికే ప్రపంచ ఈ-కామర్స్ అగ్రగామి అలీబాబా, జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్‌లతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం కంపెనీ విలువను ప్రమోటర్లు 3-3.5 బిలియన్ డాలర్లుగా (గరిష్టంగా రూ.21,000 కోట్లు) లెక్కగట్టారు. ఇది 2013-14లో మైక్రోమాక్స్ ఆదాయానికి 2.5-2.9 రెట్లు కావడం గమనార్హం. ఐదేళ్లలో 14 రెట్లు జూమ్... మైక్రోమాక్స్ వాటా విక్రయంతో అటు ప్రమోటర్లతో పాటు పెట్టుబడిపెట్టిన ప్రైవేటు ఈక్విటీ(పీఈ) ఇన్వెస్టర్లకు కూడా లాభాల పంట పండనుంది. ప్రస్తుతం ప్రమోటర్ల తర్వాత మైక్రోమాక్స్‌లో టీఏ అసోసియేట్స్ 15 శాతంతో అతిపెద్ద వాటాదారుగా ఉంది. 2010లో ఈ కంపెనీ రూ.225 కోట్లను పెట్టుబడిగా పెట్టి బోర్డులో చోటు దక్కించుకుంది. అప్పటి ఇన్వెస్ట్మెంట్ ప్రకారం మైక్రోమాక్స్ వేల్యుయేషన్ రూ.1,500 కోట్లు మాత్రమేనని అంచనా. ఇప్పుడు ఏకంగా దీనికి 14 రెట్ల విలువను ప్రమోటర్లు ఆశిస్తుండటం గమనార్హం. సెకోయా క్యాపిటల్, శాండ్‌స్టోన్ క్యాపిటల్‌తో పాటు మాడిసన్ ఇండియా క్యాపిటల్‌కు స్వల్ప వాటాలున్నాయి. చైనాకు చెందిన స్ప్రెడ్ట్రమ్ కమ్యూనికేషన్స్ కోటి డాలర్లను ఇన్వెస్ట్ చేసింది. ప్రమోటర్ల అంచనా ప్రకారం సంస్థ అమ్ముడుపోతే ఇన్వెస్టర్లకు బొనాంజా తగిలినట్లే. పదిహేనేళ్ల ప్రస్థానం... 2000వ సంవత్సరంలో నోకియా కంపెనీకి మొబైల్ విడిభాగాల సరఫరాదారుగా మైక్రోమాక్స్ ప్రస్థానం మొదలైంది. రాహుల్ శర్మ, రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్... ఈ నలుగురూ దీన్ని ఏర్పాటు చేశారు. 2008లో హ్యాండ్సెట్ విక్రయాల్లోకి అడుగుపెట్టింది. అనేక ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ హ్యాండ్సెట్లను చౌక రేటుకు అందించడంతో మైక్రోమాక్స్‌కు విశేష ఆదరణ లభించింది. తర్వాత స్మార్ట్ఫోన్లలోనూ వేగంగా కొత్త మోడళ్లను పరిచయం చేయడం కంపెనీకి కలిసొచ్చింది. ప్రస్తుతం నెలకు 30 లక్షలకుపైగా హ్యాండ్సెట్లను విక్రయిస్తోంది. ఇందులో స్మార్ట్ఫోన్ల వాటా 45 శాతంగా ఉంది. ప్రస్తుతం కంపెనీలో ప్రమోటర్ల వాటా దాదాపు 80 శాతం. అంటే తాజా వేల్యుయేషన్ ప్రకారం ఈ నలుగురికీ రూ.16,000 కోట్లకుపైగా లభిస్తాయి. మరోవంక మొబైల్స్ రంగంలో ఉద్ధండులైన ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకోవడం ద్వారా వాటా విక్రయానికి ముందు బ్రాండ్ విలువను మరింత పెంచుకునేలా కంపెనీ ప్రణాళికలు వేస్తోంది. భారతీ ఎయిర్టెల్ సీఈఓ సంజయ్ కపూర్, శామ్సంగ్ ఇండియా మొబైల్ హెడ్ వినీత్ తనేజా తదితరులు గతేడాది మైక్రోమాక్స్‌లో చేరారు. ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3,100 కోట్లను సమీకరించేందుకు సన్నాహాలు కూడా చేశారు. అయితే, ఇప్పుడు ప్రమోటర్లు ఐపీఓ కంటే వ్యూహాత్మక భాగస్వామి లేదా పూర్తి వాటా విక్రయంపైనే దృష్టిపెడుతున్నట్లు సమాచారం. భవిష్యత్తు వృద్ధి పథంలో కంపెనీని ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్(కంపెనీ) చేతికి అప్పగించాలనేది ప్రమోటర్ల వ్యూహంగా చెబుతున్నారు. ⇒ భారత్‌లో బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తొలి మొబైల్ ఫోన్ కంపెనీగా... డ్యుయల్ సిమ్ ఫోన్లను దేశంలో ప్రవేశపెట్టిన తొలి హ్యాండ్సెట్ సంస్థగా మైక్రోమాక్స్ నిలిచింది. ⇒ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతాపం చూపిస్తున్న తరుణంలో సైనోజెన్ ఓఎస్‌తో(యురేకా బ్రాండ్) తొలిసారిగా చౌక 4జీ ఫోన్‌ను ప్రవేశపెట్టి సంచలనం సృష్టించింది. ⇒ భారత్‌లో పెట్టుబడులకు ఉరకలేస్తున్న అలీబాబా... ఇటీవలే ఎం-కామర్స్ దిగ్గజం పేటీఎంలో 55 కోట్ల డాలర్లను ఇన్వెస్ట్ చేయడం ద్వారా దేశీ మార్కెట్లోకి నేరుగా అడుగుపెట్టింది. ⇒ సాఫ్ట్‌బ్యాంక్ కూడా వచ్చే కొన్నేళ్లలో భారతీయ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఆధారిత కంపెనీల్లో 10 బిలియన్ డాలర్లను వెచ్చించే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే స్నాప్‌డీల్, హౌసింగ్.కామ్, ఓలా క్యాబ్స్ తదితర కంపెనీల్లో బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులుపెట్టింది. ⇒ దాదాపు ఏడాది క్రితం భారత్‌లోకి అడుగుపెట్టిన చైనా ‘యాపిల్’ షియోమి ప్రస్తుత వేల్యుయేషన్ 45 బిలియన్ డాలర్లుగా అంచనా. 2012లో దీని విలువ 4 బిలియన్ డాలర్లే.