![Mobile phones priced Rs 10,000-20,000 dominate the smartphone industry](/styles/webp/s3/article_images/2024/08/12/infinix01.jpg.webp?itok=SqWiOLjO)
భారత్‌లో ఎక్కువగా రూ.10 వేలు నుంచి రూ.20 వేల ధర ఉన్న మొబైల్ ఫోన్లకు భారీగా డిమాండ్ ఉందని ఇన్ఫినిక్స్ ఇండియా సీఈఓ అనీష్ కపూర్ తెలిపారు. గత రెండేళ్లుగా మొబైల్ మార్కెట్‌లోని స్తబ్దత తొలగిపోయిందన్నారు. 5జీ ట్రెండ్ కొనసాగుతుండడంతో చాలా మంది కస్టమర్లు అందుకు అనువుగా ఉంటే ఫోన్లను విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం..‘భారత మార్కెట్‌లో రూ.10,000-రూ.20,000 మధ్య ధర కలిగిన స్మార్ట్‌ఫోన్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే మొత్తం అమ్మకాలు 40% పైగా పెరిగాయి. ఇటీవలి కాలంలో 5జీ ఫోన్లకు డిమాండ్ అధికమైంది. గతంలో రూ.10,000 లోపు ఫోన్లకు ఎక్కువ మార్కెట్ ఉండేది. 5జీ రావడంతో రూ.10,000 కంటే అధిక ధర మొబైళ్లకు డిమాండ్ పెరిగింది. గత రెండేళ్లుగా మార్కెట్‌లో ఉన్న స్తబ్దత తొలగిపోయింది. ఫీచర్లు అప్‌గ్రేడ్ చేయడం, తాజా ట్రెండ్‌కు తగిన లేటెస్ట్ టెక్నాలజీ అందించడం ద్వారా వీటికి మరింత గిరాకీ ఏర్పడే అవకాశం ఉంది’ అన్నారు.
ఇదీ చదవండి: ‘బహిరంగ విచారణ జరగాలి’
Comments
Please login to add a commentAdd a comment