వరుస ఫ్లాష్‌ సేల్స్‌ : హాట్‌కేకుల్లా రెడ్‌మి నోట్‌ 6ప్రో | Over 6 lakh Redmi Note 6 Pro Units Sold in First Sale | Sakshi
Sakshi News home page

వరుస ఫ్లాష్‌ సేల్స్‌ : హాట్‌కేకుల్లా రెడ్‌మి నోట్‌ 6ప్రో

Published Fri, Nov 23 2018 5:40 PM | Last Updated on Fri, Nov 23 2018 6:46 PM

Over 6 lakh Redmi Note 6 Pro Units Sold in First Sale - Sakshi

షావోమి రెడ్‌మి నోట్‌ 6ప్రో

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షావోమి నోట్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌ రెడ్‌మి నోట్‌ 6ప్రో ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు (నవంబరు 23) న  స్పెషల్‌ సేల్‌  నిర్వహిస్తోంది. మధ్యాహ‍్నం 12, 3, 6, 9 గంటలకు వరుసగా స్పెషల్‌ సేల​ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే  12 గంటల ఫ్లాష్‌సేల్‌లో  తమ స్మార్ట్‌ఫోన్‌ నిమిషాల్లో  ఐట్‌ ఆఫ్‌ స్టాక్‌గా నిలిచిందని కంపెనీ ప్రకటించింది.  ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా వెల్లడించిన షావోమీ  చీఫ్‌ మను జైన్‌ వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా  వరుస ట్వీట్లతో  ఆసక్తి పుట్టించారు.

అప్‌డేట్‌ 1: ఫ్లాష్‌సేల్‌ తర్వాత సుమారు ఒంటి గంటకు షావోమీ ఇండియా ఛీఫ్‌ మను జైన్‌ ట్విటర్‌లో 6 లక్షల యూనిట్ల సేల్‌ జరిగిందని పోస్ట్‌ చేశారు. కానీ కొద్ది నిమిషాల్లోనే దాన్ని డిలీట్‌ చేశారు. 

అప్‌డేట్‌2: మొదటి సేల్‌లో 6 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు మను జైన్‌ మరలా ట్వీట్‌ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సెకండ్‌ సేల్‌లో కూడా అదే స్థాయిలో కొనుగోలు జరిగే అవకాశం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 

అప్‌డేట్‌3: మొదటి రెండు సేల్స్‌ మాత్రమే కాక సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు మరో రెండు సేల్స్‌ ఉంటాయని తెలిపారు. 

ఒకే రోజు నాలుగు ఫాష్‌సేల్స్‌ ఉండడంతో మొదటి రోజే మొబైల్‌ కొనాలనుకునే వారికి ఇదో సువర్ణావకాశమే అని చెప్పాలి. అదీ ఈ ఒక్క రోజే స్పెషల్‌ ధరలో ఈ స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తోంది. మరి మొదటి సేల్‌లోనే   ఈ  డివైస్‌లు  హాట్‌  కేకుల్లా అమ్ముడు పోతే.. మిగిలిన మూడు సేల్స్‌లో ఇంకెన్ని యూనిట్ల  సేల్స్‌ నమోదవుతాయో అనిటెక్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement