Xiaomi Company
-
అమ్మకాల్లో షావోమీ ఎలక్ట్రిక్ కార్ సరికొత్త రికార్డ్‌లు
చైనా టెక్ దిగ్గజం షావోమీ ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కార్లు ఊహించని విధంగా అమ్ముడు పోతున్నట్లు తెలుస్తోంది. షావోమీ గతేడాది ఎస్‌యూ7 (ఎస్‌యూ అంటే స్పీడ్ ఆల్ట్రా) ను ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ కారును గత నెల చివరి వారంలో విడుదల చేసింది. టెస్లా, బీవైడీ కార్లను తట్టుకుని నిలబడేందుకు ధర 2,15,900 యువాన్లు (సుమారు రూ.24,90లక్షలు)గా నిర్ణయించింది. ఇప్పుడు ఈ మోడల్ కార్లను విడుదల చేసిన మొదటి నెలలో సుమారు 70వేల ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా సంస్థ సీఈఓ లీ జున్ మాట్లాడుతూ.. ఎస్‌యూ 7ను ఈ ఏడాది మొత్తం లక్ష యూనిట్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. కాగా షావోమీ ఎస్‌యూ7 సెడాన్ మూడు వేరియంట్ ధరల్లో లభ్యమవుతుంది. స్టాండర్డ్ ధర 215,900 యువాన్లు, హై ఎండ్ ఎస్‌యూ7 ప్రో 245,900 యువాన్లు, ఎస్‌యూ 7 మ్యాక్స్ 299,900 యువాన్లుగా ఉంది. -
షావోమీ దూకుడు: బిగ్ టీవీ, బడ్జెట్ ధర
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌టీవీ సెగ్మెంట్లో రారాజులో ఏలుతున్న చైనా స్మార్ట్‌ఫోన దిగ్గజం షావోమి ఎంఐ తాజాగా కొత్త ఎల్ఈడీ టీవీలను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 4కె పేరుతో వీటిని విడుదల చేసింది. వీటితోపాటు ఎంఐ సౌండ్ బార్నుకూడా ఆవిష్కరించింది. 20 వాట్ల స్టీరియో స్పీకర్లు, గూగుల్ వాయిస్ సెర్చ్, షావోమి సొంతమైన ప్యాచ్ వాల్ ప్రధాన ఫీచర్లుగా కంపెనీ పేర్కొంది. ఇంకా ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత ఆండ్రాయిడ్ టీవీ ఓఎస్‌ను ఈ టీవీలలో అందిస్తున్నారు. ప్లే స్టోర్, క్రోమ్ క్యాస్ట్‌కు సపోర్ట్, హాట్ స్టార్, హంగామా, సోనీ లివ్, వూట్, ఈరోస్ నౌ, జీ5, హూక్, ఎపిక్ ఆన్ వంటి యాప్‌లు ఇన్‌బిల్ట్‌గా ఈ స్మార్ట్ టీవీల్లో పొందుపర్చింది. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎక్స్ ప్రొ 55 అంగుళాల టీవీలో 3840 x 2160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ, యూఎస్బీ, హెచ్డీఎంఐ పోర్టులు, డీటీఎస్ ఫీచర్లు ప్రధానంగా ఉన్నాయి. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ 43 ఇంచ్ టీవీలో 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, వైఫై, హెచ్డీఎంఐ, యూఎస్బీ పోర్టులు తదితర ఫీచర్లను అందిస్తోంది. ధరలు: 43 ఇంచుల టీవీ ధర రూ.22,999 55 ఇంచుల టీవీ ధర రూ.39,999 సౌండ్‌బార్ ధర : రూ. 4999 ఈ నెల 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఎంఐ ఆన్లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ టీవీలు విక్రయానికి విక్రయానికి అందుబాటులో ఉంటాయి. -
‘ఎంఐ ఏ 2’ ధరపై భారీ తగ్గింపు
షావోమి తీసుకొచ్చిన ఎంఐ ఏ 2 స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ఈ మేరకు షావోమి ట్విటర్లో వివరాలను షేర్ చేసింది. ఇంతకుముందెన్నడూ లేని తగ్గింపును ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. ఎంఐ ఏ2 స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లపై ఈ తగ్గింపును వర్తింప చేయనుంది. ఎంఐ ఏ2 4జీబీ ర్యామ్, 64 జీబీ ధరను రూ. 13, 999లకే అందిస్తోంది. ఎంఆర్పీ ధర రూ.17,999. 6జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ధర 15,999 కే లభ్యమవుతోంది. అసలు ధర ధర రూ. 20,500. అమెజాన్, ఎం.కామ్ అన్లైన్ స్టోర్లతోపాటు, ఎంఐహోమ్ ఆఫ్‌లైన్ ద్వారా ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు సేల్ ప్రారంభం. ఇదే అతి పెద్ద హై ఫై (5) ప్రకటన అని షావోమి ఇండియా ట్వీట్ చేసింది. ఇంకా ఇలాంటి ఆఫర్లను ఇంకా నాలుగు ప్రకటించనుంది. Mi fans! Here's the 1st BIG #High5 announcement! Get #MiA2 at a never before price. Massive discount of ₹4,500! Get yours starting 12 noon from https://t.co/D3b3Qt4Ujl, @amazonIN, Mi Home & offline stores! RT if you're getting one & stay tuned for 4 more amazing announcements. pic.twitter.com/uNP2cmOl82 — Mi India (@XiaomiIndia) January 7, 2019 -
బడ్జెట్ ధరల్లో శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు త్వరలో
సౌత్ కొరియాఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ బడ్జెట్ ధరలో మొబైల్ ఫోన్లను తీసుకురానుంది. తద్వారా భారతీయస్మార్ట్‌ఫోన్ మార్కెట్లో నెంబర్ వన్ స్థానంలో పాగావేసిన చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షావోమిని సవాల్ చేయనుంది. ఎం సిరీస్ గెలాక్స్ ఫోన్లపై గత ఏడాది డిసెంబరులోనే న్యూస్ ఏజెన్సీ ఐఏఎన్ఎస్ నివేదించడం గమనార్హం. తక్కువ ధరలకే అద్భుతమైన ఫీచర్లతో సరికొత్తగా గెలాక్సీ స్మార్ట్ఫోన్లను తీసుకురావాలని శాంసంగ్ ప్రణాళికలు రచిస్తోంది. మధ్య స్థాయి ధరల శ్రేణిలో ‘శాంసంగ్ గెలాక్సీ ఎం’ (ఎం=మిలినియల్స్) సిరీస్‌లో ఫోన్లను లాంచ్ చేయనుంది. అంటే లక్షలమందిని కస్టమర్లను ఆకర్షించాలనేది ప్లాన్. ముఖ్యంగా గెలాక్సీ ఎం సిరీస్‌లో ఎం10, ఎం20, ఎం30 పేరుతో మూడుస్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తేనుంది. ఇన్ఫినిటీ వినాచ్ డిస్ప్లేతో ఈ నెలలోనే వీటిని లాంచ్ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. ఎం10ను (6 అంగుళాల డిస్ప్లే) రూ.9500, ఎం20 (6.3 అంగుళాల డిస్ప్లే), ఎం30 ధరతో సుమారు రూ.12 నుంచి రూ.15వేల ధరకు తీసుకొచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎం30 డివైస్‌లో ట్రిపుల్ కెమెరా మెయిన్ ఫీచర్‌గా ఉండనుందట. భారత్‌లోనే గ్లోబల్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించనుండటం మరో విశేషం. శాంసంగ్ సొంత ఎక్సినాస్ 7885 ప్రాసెసర్‌తో పాటు, 4జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.1ఓరియో, భారీ డిస్ప్లే, ఆకర్షణీయమైనకెమెరా, భారీబ్యాటరీతో ఈ ఫోన్లు మార్కెట్లో త్వరలోనే హల్చల్ చేయనున్నాయి. వీటి ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. ఎం10 : 6 అంగుళాల డిస్ప్లే, 8 ఎంపీసెల్పీ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్; 7870 ఆక్టాకోర్ ప్రాససర్, ఆండ్రాయిడ్ ఓరియో, 3జీబీ ర్యామ్, 16/32జీబీ స్టోరేజ్, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ ఎం 20 : 60.3 ఇంచెస్‌డిస్‌ప్లే, 3జీబీ ర్యామ్, 32జీబీ/64 స్టోరేజ్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 13+5 డ్యుయల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎం 30 : 6.3 ఇంచెస్‌డిస్‌ప్లే 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 16 ఎంపీ సెల్పీ కెమెరా, 13+5+5 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ -
షావోమీ టీవీ ధరలు తగ్గాయ్!
సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో భారత్‌లో టాప్ నిలిచిన చైనా కంపెనీ టీవీ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంఐ స్మార్ట్‌టీవీల పేరుతోబడ్జెట్ ధరల్లో వీటిని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చి స్మార్ట్‌టీవీల్లో కూడా నెం.1 బ్రాండ్‌గా నిలిచింది. తాజాగా షావోమి తన కస్టమర్లకు నూతన సంవత్సర కానుకను అందించింది. ఎంఐ టీవీలపై ధరలను తగ్గించినట్టు ప్రకటించింది. ఎంఐ టీవీల ధరలను తగ్గించినట్టు షావోమి వెల్లడింది. వెయ్యి నుంచి 2వేల రూపాయల దాకా ఈ తగ్గింపు ఉండనుంది. 32 అంగుళాల ఎంఐ టీవీ 4ఏ ధర రూ.1500 తగ్గింపుతో ప్రస్తుతం రూ.12,499లకు అందుబాటులో ఉంది. 32 అంగుళాల ఎంఐ టీవీ 4సీ ప్రొ ధర. రూ.13,999గా ఉంది. రూ.2 వేలను తగ్గించింది. 49 అంగుళాల ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఏ ప్రొ రూ.1000తగ్గి రూ. 30,999లకే అందుబాటులో ఉంది. Mi fans! There couldn't be a better beginning. Get your hands on TVs from India's #1 Smart TV Brand at an unbeatable price, starting today. How's this for a New Year gift? RT to spread happiness. pic.twitter.com/9ZWb2dYlyw — Mi India (@XiaomiIndia) January 1, 2019 -
ఇల్లంతా ‘ఎంఐ’ మయం..!
న్యూఢిల్లీ: చేతిలో ఎంఐ ఫోన్... హాల్లో ఎంఐ ఫ్రిజ్... కిచెన్‌లో ఎంఐ వాటర్ ప్యూరిఫయర్... బాల్కనీలో ఎంఐ వాషింగ్ మెషిన్... బెడ్ రూమ్‌లో ఎంఐ ఏసీ... భవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం!. చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఐ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లతో భారతీయులకు చేరువైన చైనా కంపెనీ ‘షావోమీ’... భారత మార్కెట్లో మరింతగా పాతుకుపోయే ప్రణాళికలను రచిస్తోంది. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నుంచి పూర్తి స్థాయి కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీగా అవతరించనుంది. షావోమీ ఉన్నత స్థాయి ఉద్యోగ బృందం ప్రస్తుతం ఇదే పనిలో ఉంది. భారత మార్కెట్లో భారీ వృద్ధికి అవకాశం ఉన్న ఎయిర్‌కండిషనర్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ల్యాప్‌టాప్‌లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, వాటర్ ప్యూరిఫయర్ల విభాగాల్లో ఉత్పత్తులను తీసుకురావడంపై షావవోమీ దృష్టి సారించినట్టు సమాచారం. అన్ని ఉత్పత్తులను కూడా ఇంటర్నెట్ ఆధారితంగా నియంత్రించేందుకు (ఐవోటీ) వీలుండే స్మార్ట్‌గానే ఉంటాయని, రిమోట్‌గా వీటిని నియంత్రించుకోవచ్చని కంపెనీ ఉద్యోగులు తెలిపారు. వృద్ధి అవకాశాలు... భారత మార్కెట్లో షావోమీ ఏటా 100 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేస్తూ వస్తోంది. కొత్త విభాగాల్లోకి ప్రవేశించడం ద్వారా మరింత వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవాలన్నది కంపెనీ ఆలోచన. స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తీవ్ర పోటీ కారణంగా ఈ ఒక్క విభాగమే శాశ్వతం కాదనుకుని అదనపు వృద్ధి అవకాశాలపై కంపెనీ దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. నిజానికి షావోమీ ఇప్పటికే భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, టీవీలతోపాటు మరికొన్ని గ్యాడ్జెట్లను కూడా విక్రయిస్తోంది. స్మార్ట్ టెలివిజన్ల విభాగంలో వచ్చే ఏడాది మరిన్ని ఉత్పత్తులను తీసుకురానుంది. షావోమీ ప్రస్తుతం తన ఉత్పత్తులను తొలుత ఆన్లైన్లో విడుదల చేసి, తర్వాత ఎంఐ స్టోర్లలో అందుబాటులోకి తెస్తోంది. ఇకపై పెద్ద ఎలక్ట్రానిక్, మొబైల్ రిటైల్ స్టోర్లలోనూ తన ఉత్పత్తులను అందుబాటులోకి తేనుందని పరిశ్రమకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఆఫ్‌లైన్‌లో భారీ విస్తరణ... షావోమీ దేశవ్యాప్తంగా కొత్తగా 500 పట్టణాల్లోకి వచ్చే ఏడాది తన కార్యకలాపాలను విస్తరించే ప్రణాళికతో ఉంది. ప్రస్తుతం కంపెనీ దేశంలోని టాప్ 50 పట్టణాలపైనే ప్రధానంగా దృష్టి సారించింది. షావోమీ ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశ స్మార్ట్ టెలివిజన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ప్రధాన కంపెనీలైన శామ్సంగ్, సోనీ, ఎల్జీ ఉత్పత్తులతో పోలిస్తే 30–50 శాతం చౌక ధరలకే ఆఫర్ చేయడం ద్వారా వాటికి గట్టి సవాల్ విసిరింది. తొలుత ఆన్లైన్లో ఆరంభించిన విక్రయాలను తర్వాత ఎంఐ స్టోర్లకు విస్తరించింది. స్థానిక కంపెలతో తయారీ ఒప్పందాలను చేసుకుంది. ఇదే తరహాలో హోమ్ అప్లయన్సెస్ విభాగంలోనూ మరిన్ని ఉత్పత్తులతో చొచ్చుకుపోవాలన్నది కంపెనీ వ్యూహం. ప్రధాన కంపెనీలకు దీటుగా ఫీచర్లన్నింటినీ ఇస్తూ, ధరల పరంగా చౌకగా అందుబాటులోకి తీసుకురావడం ఎంఐ విజయసూత్రంగా ఉంది. -
షావోమి ఎంఐ ఫ్యాన్ షేల్ షురూ!
సాక్షి,న్యూఢిల్లీ: చైనా మొబైల్ దిగ్గజం షావోమి నెం.1 ఎంఐ ఫ్యాన్ సేల్ పేరుతో డిస్కౌంట్ అమ్మకాలను ప్రారంభించింది. నేటి (డిసెంబరు19వ తేదీ నుంచి 21వ తేదీ ) నుంచి మూడు రోజుల పాటు ఈ సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, ఎంఐ ఎల్ఈడీ టీవీలు, ఇతర ఉత్పత్తులపై ఆకట్టుకునే ఆఫర్లతోపాటు రాయితీలను కూడా అందిస్తోంది. ఎంఐ ఆన్లైన్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా రెడ్ మీ నోట్ 5 ప్రొ, ఎం ఏ2, రెడ్ మీవై2 స్మార్ట్ఫోన్లతో పాటు ఎంఐటీవీలపై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. ఎంఐ ఎ2 6జీబీర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.16,999లకే లభ్యం. ఎంఐ ఎ2 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.14,999 ధరకు అందుబాటులో ఉంది. రెడ్మీ నోట్ 5 ప్రొ 6జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.14,999 ధరకు లభ్యమవుతోంది. 4జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.12,999 ధరకు విక్రయిస్తోంది. రెడ్మీ వై2 4జీబీ ర్యామ్ వేరియెంట్ వెయ్యి రూపాయల తగ్గింపుతో రూ.10,999లభ్యం. 3జీబీ ర్యామ్ వేరియెంట్ రూ.8,999 ధరకు లభ్యం. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ ప్రొ (49 ఇంచెస్) రూ.1వేయి తగ్గింపుతో రూ.30,999 ధరకు లభ్యం కానుంది. అలాగే ఎంఐ ఎల్ఈడీ టీవీ 4ఎ (43 ఇంచెస్) రూ.21,999 ధరకు, ఎంఐ ఎల్ఈడీ టీవీ 4సి ప్రొ (32 ఇంచెస్) రూ.14,999 ధరకు లభ్యం కానున్నాయి. అంతేకాదు ఈ సేల్‌లో భాగంగా ప్రతి రోజూ సాయంత్రం 4 గంటలకు ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే రూ.50, రూ.100, రూ.200, రూ.500 విలువైన కూపన్లు ఇస్తారు. మొబిక్విక్ యూజర్లకు 10 శాతం ఇన్స్టంట్ సూపర్ క్యాష్ వస్తుంది. గూగుల్ పే యూజర్లు రూ.500, . పేటీఎం యూజర్లు రూ.300 క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అలాగే మొబిక్విక్ యూజర్లు 10శాతం దాకా డిస్కౌంట్ పొందే అవకాశం. Smartphone or a smart device, choose your pick. Because we've offers on your favourite products in #1MiFanSale. Check out for more offers here: https://t.co/uhKAPsvyYj pic.twitter.com/Qw9cjGQHLX — Mi India (@XiaomiIndia) December 17, 2018 -
48 ఎంపీ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్!
పదేళ్ల క్రితం నోకియా తన మొబైల్స్‌లో కెమెరాలను అప్డేట్ చేస్తూ మొబైల్ మార్కెట్‌ను శాసించిన పరిస్థితులను చూశాము. గత కొద్ది నెలలుగా రిలీజవుతున్న మొబైల్స్‌ను గమనిస్తే ఈ ట్రెండ్ మళ్లీ ప్రారంభమైనట్లు అనిపిస్తోంది. ప్రతీ మొబైల్ కంపెనీ తమ ఫ్లాగ్షిప్ ఫోన్లలో కెమెరాలను అప్డేట్ చేస్తున్నాయి. గతవారం హువావే 40 ఎంపీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా ఫోన్ రిలీజ్ చేసింది. ఇదే క్రమంలో తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను అందిస్తూ ఇండియాలో భారీ మార్కెట్‌ను సాధించిన చైనా మొబైల్ దిగ్గజం షావోమీ జనవరిలో బెస్ట్ కెమెరాతో దుమ్మురేపే మొబైల్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. 48 మెగాపిక్సెల్ భారీ కెమెరాతో ఈ ఫోన్‌ను తయారు చేయనున్నట్లు షావోమీ ప్రెసిడెంట్ లిన్ బిన్ తెలిపారు. ప్రముఖ చైనా టెక్నాలజీ వెబ్సైట్ వీబోలో ఈ మేరకు వార్త వెలువడింది. తాను కొద్దివారాల పాటు ఈ మొబైల్‌ను ఉపయోగించినట్లు లిన్ వెల్లడించారు. 48 ఎంపీ సెన్సార్‌గా సోనీ ఐఎయ్‌ఎక్స్ 586ని గానీ శాంసంగ్ ఐసోసెల్ బ్రైట్ జీఎం1ని గానీ అమర్చే అవకాశముందని తెలిపారు. సోనీ సెన్సార్ సూపర్ స్లో మోషన్‌ను సపోర్ట్ చేయడం లేదని, అయితే ఏదో ఒకటి చేసి దానినే అమర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. ఈ కెమెరాలు రెండూ నాలుగు రెట్ల వరకూ దూరాన్ని జూమ్ ద్వారా స్పష్టంగా తీయగలవు. ఇప్పటివరకూ షావోమీ ఈ స్థాయి కెమెరా కలిగిన ఫోన్ తయారు చేయలేదు. ఇది ఎంతవరకు విజయం సాధించగలదో చూడాలంటే జనవరి వరకూ ఆగక తప్పదు. -
ఎంఐ స్పెషల్ సేల్ : భారీ డిస్కౌంట్లు
ఎంఐ ఫ్యాన్స్‌కు శుభవార్త. షావోమి ఇండియా ప్రమోషనల్ ఆఫర్‌ను అందుబాటులోకి తెస్తోంది. డిసెంబరు 6నుంచి 8వతేదీవరకుఈ స్పెషల్ సర్ప్రైజ్ సేల్‌ను నిర్వహించనుంది. అమెజాన్‌లో ప్రత్యేకంగా ఈ సేల్ ఉంటుంది. ముఖ్యంగా ఎంఐ ఏ2, రెడ్ మి వై2 స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఎంఐఏ 2: 4జీబీ ర్యామ్ /64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 14,999లకే అందిస్తోంది. ఎంఆర్పీ ధర రూ. 17,499. ఎంఐఏ 2 6జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 16,999లకే లభ్యం. ఎంఆర్పీ ధర రూ. 20,500. రెడ్మి వై2 ( 3/2జీబీ) వేరియంట్ రూ.8999కే లభ్యం కానుంది. ఎంఆర్పీ ధర రూ. 10,499. రెడ్మి వై2 ( 4జీబీ/64జీబీ) వేరియంట్ రూ.10,999కే లభ్యం కానుంది. ఎంఆర్పీ ధర రూ.13,499. వీటితోపాటు రెడ్ మి 6ఏ స్మార్ట్‌ఫోన్ డిస్కౌంట్ అనంతరం రూ.5999 లకే అందిస్తోంది. Mi fans! It is Selebration time. I ❤️ Mi sale on @amazonIN begins on December 6th. We have got huge discounts on your favourite Mi smartphones. 🎊🎉🎈 RT if you're excited! pic.twitter.com/EZr6zBjnvR — Mi India (@XiaomiIndia) December 4, 2018 -
పోకో ఎఫ్1 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: షావోమీ సబ్ బ్రాండ్ లాంచ్ చేసిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ పోకో ఎఫ్1 భారీ డిస్కౌంట్ ధరలో లభిస్తోంది. ఫ్లాష్ సేల్‌లో రికార్డు విక్రయాలను నమోదు చేసిన పోకోఎఫ్1 పై లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో 5వేల రూపాయల తగ్గింపు ధరలో లభిస్తోంది. డిసెంబరు ఆరునుంచి 8వ తేదీవరకు ఎంఐ.కాం, ఫ్లిప్‌కార్ట్‌లోఈ ఆఫర్ లభించనుంది. ట్విటర్ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని కంపెనీ వెల్లడించింది. ట్వీట్ల ద్వారా వినియోగదారులను గత కొన్ని రోజులుగా ఊరిస్తున్న కంపెనీ ఎట్టకేలకు మొత్తం అన్ని వేరియంట్ల మీద ఈ డిస్కౌంట్లను అందిస్తున్నట్టు ప్రకటించింది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 ఇంచ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ POCO community is live! Yes, you read it right. We are launching POCO community, a place where POCO fans from around the globe can come together and feel at home. So what are you waiting for? Log on to https://t.co/d1eeZRKzSi and be a part of POCO community now! 🤟 pic.twitter.com/V7FgM9RmrT — POCO India (@IndiaPOCO) December 4, 2018 -
షావోమీ బడ్జెట్ ఫోన్ ఫ్లాష్ సేల్
షావోమీ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ' రెడ్మి 6ఎ' ఫోన్లకు బుధవారం (నవంబరు 28) మరోసారి ఫ్లాష్‌సేల్ నిర్వహించనుంది. అమెజాన్, ఎంఐ.కామ్ వెబ్సైట్లలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లాష్‌సేల్ ప్రారంభం. బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్లు లభ్యం కానున్నాయి. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా ఫోన్ కొనుగోలుపై 5 శాతం ఇన్స్టెంట్ డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే జియో వినియోగదారులకు ఈ ఫోన్ కొనుగోలుపై రూ.2,200 ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్‌తోపాటు, షరతులతో 100 జీబీ జియో 4జీ డేటా ఉచితం. ఇక ఈ ఫోన్ ధరల విషయానికొస్తే.. 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.600 పెరిగి రూ.6,599గా ఉంది. 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.500 పెరిగి రూ.7,499 వద్ద లభ్యం. రెడ్మీ 6ఎ ఫీచర్లు 5.45 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లే 18:9 యాస్పెక్ట్ రేషియో ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10 హీలియో ఏ 22 2జీబీ ర్యామ్,16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రెడ్మి నోట్ 6 ప్రో సెకండ్ ఫ్లాష్ సేల్ నేడే
మొదటి సేల్‌లో రికార్డు స్థాయిలో అమ్ముడు బోయిన రెడ్మి నోట్ 6ప్రో రెండవసారి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ రోజు (నవంబరు 28) మధ్యాహ్నం 12గంటలనుంచి ఫ్లాష్‌సేల్ ప్రారంభం. ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ సేల్ ఉంటుంది. చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి నోట్ సిరీస్‌లో కొత్త ఫోన్ రెడ్మి నోట్ 6ప్రోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనవంబరు 23న మధ్యాహ్నం 12, 3, 6, 9 గంటలకు వరుసగా స్పెషల్ సేల్ నిర్వహించింది. ఈ సందర్భంగా రికార్డు స్థాయిలో తమ స్మార్ట్‌ఫోన్ నిమిషాల్లో ఔట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచిందని షావోమీ చీఫ్ మను జైన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రెడ్మి నోట్ 6ప్రో ఫీచర్లు 6.26 ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
వరుస ఫ్లాష్ సేల్స్ : హాట్‌కేకుల్లా రెడ్మి నోట్ 6ప్రో
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి నోట్ సిరీస్‌లో కొత్త ఫోన్ రెడ్మి నోట్ 6ప్రో ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు (నవంబరు 23) న స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 12, 3, 6, 9 గంటలకు వరుసగా స్పెషల్ సేల నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 12 గంటల ఫ్లాష్‌సేల్‌లో తమ స్మార్ట్‌ఫోన్ నిమిషాల్లో ఐట్ ఆఫ్ స్టాక్‌గా నిలిచిందని కంపెనీ ప్రకటించింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించిన షావోమీ చీఫ్ మను జైన్ వినియోగదారులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వరుస ట్వీట్లతో ఆసక్తి పుట్టించారు. అప్డేట్ 1: ఫ్లాష్‌సేల్ తర్వాత సుమారు ఒంటి గంటకు షావోమీ ఇండియా ఛీఫ్ మను జైన్ ట్విటర్లో 6 లక్షల యూనిట్ల సేల్ జరిగిందని పోస్ట్ చేశారు. కానీ కొద్ది నిమిషాల్లోనే దాన్ని డిలీట్ చేశారు. అప్డేట్2: మొదటి సేల్‌లో 6 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు మను జైన్ మరలా ట్వీట్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే సెకండ్ సేల్‌లో కూడా అదే స్థాయిలో కొనుగోలు జరిగే అవకాశం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అప్డేట్3: మొదటి రెండు సేల్స్ మాత్రమే కాక సాయంత్రం 6 గంటలకు, రాత్రి 9 గంటలకు మరో రెండు సేల్స్ ఉంటాయని తెలిపారు. ఒకే రోజు నాలుగు ఫాష్సేల్స్ ఉండడంతో మొదటి రోజే మొబైల్ కొనాలనుకునే వారికి ఇదో సువర్ణావకాశమే అని చెప్పాలి. అదీ ఈ ఒక్క రోజే స్పెషల్ ధరలో ఈ స్మార్ట్ఫోన్లను విక్రయిస్తోంది. మరి మొదటి సేల్‌లోనే ఈ డివైస్‌లు హాట్ కేకుల్లా అమ్ముడు పోతే.. మిగిలిన మూడు సేల్స్‌లో ఇంకెన్ని యూనిట్ల సేల్స్ నమోదవుతాయో అనిటెక్ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
షావోమి వేగం : మరో బిగ్ టీవీ లాంచ్
సాక్షి,ముంబై: మొబైల్స్ తయారీదారు షావోమీ టీవీ సెగ్మెంట్లో శరవేగంగా దూసుకుపోతోంది. ఇటీవీల టీవీ మార్కెట్‌పై దృష్టి పెట్టిన షావోమి వరుసగా లాంచ్‌లతో వినియోగదారులకు ఆకట్టుకుంటోంది. తాజాగా 75 ఇంచులఎంఐ టీవీ 4ఎస్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది, ఈ రోజు నుంచే సేల్స్‌ను ప్రారంభించింది. దీని ధరను రూ.82,100గా నిర్ణయించింది. ఇక ఈ టీవీ ప్రధాన ఫీచర్ల విషయానికి వస్తే క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్, డీటీఎస్ హెచ్డీ డాల్బీ ఆడియో, బ్లూటూత్, వైఫై తదితరాలు లభిస్తున్నాయి. -
అదిరే ఫీచర్లతో రెడ్మి నోట్ 6 ప్రో
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లను పొందుపరుస్తూ చైనా మొబైల్ తయారీదారు షావోమీ వినియోగదారుల ఆదరణను పొందింది. ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన రెడ్మి నోట్ 5ప్రో కి కొనసాగింపుగా రెడ్మి సిరీస్‌లో మరో అద్భుతమైన ఫోన్ ‘రెడ్మి నోట్ 6ప్రో’ ను తీసుకొస్తోంది. ముందూ, వెనుక నాలుగు కెమెరాలతో ఈ డివైస్‌ను ఈ నెల 23న మార్కెట్లో విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా దీనిని మార్కెట్లో రిలీజ్ చేయనున్నారు. దీని ఫీచర్లు ప్రధానంగా ఇలా ఉండనున్నాయి. 6.26 ఫుల్హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ 256 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 20+2 ఎంపీ రియర్ కెమెరాలు 12+2 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర వివరాలు అధికారికంగా ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయితే సుమారు రూ.15వేల లోపు ధరను నిర్ణయించే అవకాశం ఉందని అంచనా. -
షావోమి సరికొత్త ల్యాప్టాప్స్ లాంచ్
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి రెండుకొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసింది. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ ప్రొడక్ట్‌తో ల్యాప్‌టాప్ విభాగంలోకి కూడా ప్రవేశించిన షావోమీ తాజాగా ఈసిరీస్‌లో భాగంగా రెండు డివైస్‌లను చైనాలో విడుదల చేసింది. 13.3 అంగుళాలు , 15.6-అంగుళాల డిస్ప్లేలతో రెండు డివైస్‌లను ప్రారంభించింది. 8న జనరేషన్ ఇంటెల్ ప్రాసెసర్లను, గ్లాస్ టచ్‌ప్యాడ్, బ్యాక్లిట్ కీ బోర్డు ఈ కొత్త ల్యాప్‌టాప్‌ల్లో అమర్చింది. 1. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 13.3 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1920x1080 పిక్సెల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఇంటెల్ యూహెచ్డీ గ్రాఫిక్స్ 620 కార్డు 8జీబీ ర్యామ్,128జీబీ స్టోరేజ్ ఫ్రంట్ఫేసింగ్ కెమెరా 40వాట్స్బ్యాటరీ ధర రూ. 41,500 2. ఎంఐ నోట్‌బుక్ ఎయిర్ 15.6 అంగుళాల డిస్ప్లే 1080x1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ 4జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ 1 టీబీ దాకా విస్తరించుకునే అవకాశం ధర : సుమారు రూ .35,500 భారతీయ మార్కెట్లో ఈ పరికరాలు ఎపుడు లాంచ్ అయ్యేది ఇంకా ప్రకటించలేదు. -
షావోమి మరో స్మార్ట్‌టీవీ లాంచ్
సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఇంటా బయటా దూసుకుపోతున్ చైనా కంపెనీ షావోమి ఇటీవల టీవీ మార్కెట్‌పై కూడా కన్నేసింది. ఈ నేపథ్యంలో సరసమైన ధరల్లో అద్భుతమైన ఫీచర్లను అందిస్తూ ఎంఐ స్మార్ట్ టీవీలను తీసుకొచ్చింది. ఎంఐ టీవీ4 సిరీస్‌లో తాజాగా 65 ఇంచుల 4కె అల్ట్రా హెచ్డీ , ఏఐ ఆధారిత ఎంఐ టీవీ4ను చైనా మార్కెట్లో తాజాగా విడుదల చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, డాల్బీ ప్లస్ డీటీఎస్, 2జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్ ప్రధాన ఫీచర్లు ఇందులో ఉన్నాయి. సుమారు రూ.63,300 దీని ధరను నిర్ణయించింది. అయితే బారత మార్కెట్లో ఈ టీవీని ఎపుడు లాంచ్ చేసేదీ స్పష్టత లేదు. -
రెండున్నర రోజుల్లో 25 లక్షల డివైజ్‌లు అమ్మకం
చైనా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం షావోమి రికార్డులు బ్రేక్ చేసింది. కేవలం రెండున్నర రోజుల్లో 25 లక్షలకు పైగా ఎంఐ డివైజ్‌లను విక్రయించింది. ఈ డివైజ్‌ల్లో ఎంఐ ఎల్ఈడీ టీవీలు, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ పవర్ బ్యాంక్‌లు, ఎంఐ ఇయర్ఫోన్లు, ఎంఐ రూటర్లు, ఎంఐ ఎకో సిస్టమ్ డివైజ్‌లు, యాక్ససరీ ప్రొడక్ట్‌లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్, ఎంఐ సూపర్ సేల్ల్లో భాగంగా షావోమి ఈ రికార్డులను బ్రేక్ చేసింది. ఫెస్టివల్ కానుకగా నిర్వహిస్తున్న ఈ మూడు సేల్స్‌లో అమేజింగ్ డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్లను అందిస్తున్నాయి. షావోమి ఈ రికార్డును అక్టోబర్ 9వ తేదీ రాత్రి 12 గంటల నుంచి అక్టోబర్ 11వ తేదీ రాత్రి 7 గంటల మధ్యలో సాధించినట్టు షావోమి ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, గ్లోబల్ వీపీ మను కుమార్ జైన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఈ అనూహ్యమైన స్పందనకు, ప్రేమకు ఎంఐ అభిమానులందరికీ మను కుమార్ జైన్ కృతజ్ఞతలు తెలిపారు. ఫెస్టివల్ సేల్స్‌లో భాగంగా షావోమి ప్రొడక్ట్‌లపై అందిస్తున్న ఆఫర్లు.... రెడ్మి నోట్ 5 ప్రొ రూ.2000 డిస్కౌంట్లో లభ్యమవుతుంది. హెచ్డీఎఫ్సీ కార్డులపై 10 శాతం తగ్గింపు లభిస్తోంది. దీంతో మొత్తంగా ఈ ఫోన్ రూ.11,699కే అందుబాటులోకి వస్తోంది. రెడ్మి వై2(3జీబీ+32జీబీ) ఫోన్, రెడ్మి వై2(4జీబీ+64జీబీ) స్టోరేజ్ ఫోన్ రూ.1000, రూ.2000 డిస్కౌంట్లో విక్రయానికి వచ్చింది. ఎంఐ మిక్స్ 2 ధర రూ.7000 తగ్గింది. దీంతో ఇది రూ.22,999కే లభ్యమవుతుంది. ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(43) ధరలు రూ.500, రూ.2000 మేర తగ్గాయి. డిస్కౌంట్ అనంతరం ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(32), ఎంఐ ఎల్ఈడీ స్మార్ట్ టీవీ 4ఏ(43)లు రూ.13,499కు, రూ.20,999కు విక్రయానికి వచ్చాయి. 10000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2ఐ రూ.699కే విక్రయిస్తున్నాయి. 20000 ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ 2ఐ రూ.1399కు లభ్యమవుతోంది. -
మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన షావోమి
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం.. ‘స్మార్ట్ లివింగ్’ పోర్టుఫోలియోలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్స్‌ను, స్మార్ట్ సెక్యురిటీ సిస్టమ్‌ను, ఫిట్నెస్ బ్యాండ్లను, స్మార్ట్ టీవీలను ప్రవేశపెడుతూ.. కస్టమర్లను మరింత ఆకట్టుకుంటోంది. నేడు కూడా షావోమి ఐదు సరికొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవేమిటంటే.. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ సిరీస్‌లను, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్, ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360, ఎంఐ లగేజీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. షావోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ- సిరీస్.... గురువారం షావోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ రేంజ్లో మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన టీవీలకు సక్సెసర్‌గా వీటిని తీసుకొచ్చింది. 32 అంగుళాలు, 49 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజ్‌లో ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొలు మార్కెట్లోకి వచ్చాయి. 32 అంగుళాల టీవీ ధర 14,999 రూపాయలు కాగ, 49 అంగుళాల మోడల్ ధర 29,999 రూపాయలు, 55 అంగుళాల మోడల్ ధర 49,999 రూపాయలు. ఈ కొత్త టీవీల ప్రత్యేకత పునరుద్ధరించిన సాఫ్ట్వేర్. ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో ప్యాచ్‌వాల్ యూఐ రిఫ్రెస్తో ఈ టీవీలు పనిచేస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్ లేదా ప్యాచ్‌వాల్ ఏ విధంగానైనా టీవీ మోడ్‌లోకి వెళ్లవచ్చు. ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త టీవీలకు క్రోమోకాస్ట్ సపోర్టు కూడా ఉంది. రిమోట్‌లోనే వాయిస్ సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 55 అంగుళాల టీవీ 4కే ప్లస్ హెచ్డీఆర్ సపోర్ట్‌తో వచ్చింది. ప్రపంచంలో పలుచైన టీవీ ఇదే. డోల్బే ప్లస్ డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, 3 హెచ్డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్బీ 3.0 పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్ 5.0, 2జీబీ ర్యామ్, 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వీటిలో ఫీచర్లుగా ఉన్నాయి. ఎంఐ బ్యాండ్ 3... షావోమి కొత్త ఫిట్నెస్ బ్యాండ్ ఇది. దీని ధర 1,999 రూపాయలు. ఎంఐ బ్యాండ్ 3 అతిపెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎస్ఎంఎస్లు, ఇతర మెసేజింగ్ అప్లికేషన్ల కంటెంట్‌ను ఇది చూపిస్తోంది. రిజెక్ట్ అయిన కాల్స్‌ను కూడా దీని స్క్రీన్‌పై చూడొచ్చు. హార్ట్-రేటు మానిటర్‌ను ఇది కలిగి ఉంది. 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెంట్ పవర్, 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. ఎంఐ ప్యూరిఫైయర్ 2ఎస్..... షావోమి నేడు తన సరికొత్త ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్ డిజిటల్ డిస్ప్లే, లేజర్ సెన్సార్, 360 డిగ్రీల ట్రిపుల్ లేయర్ ఫిల్టర్‌తో ఈ డివైజ్ రూపొందించింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ అమెజాన్ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్‌ను ఆఫర్ చేస్తుంది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ తొలి సేల్‌ను సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది షావోమి కంపెనీ. దీన్ని ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఐ హోమ్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్‌అందుబాటులోకి రానుంది. ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360.... టూ-వే ఆడియోతో 360 డిగ్రీలు చూసే యాంగిల్లో ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరాను షావోమి తీసుకొచ్చింది. ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్, ఐదు రోజుల వరకు ఫుటేజీ స్టోరేజ్, ఇన్ఫ్రారెడ్ నైట్ వ్యూ, ఏఐ మోషన్ డిటెక్షన్, 64జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ దీనిలో ఉన్నాయి. ఎంఐ హోమ్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారానే సెక్యురిటీ కెమెరాను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంఐ లగేజ్... 20 అంగుళాలు, 24 అంగుళాల సైజుల్లో షావోమి ఎంఐ లగేజ్‌ను లాంచ్ చేసింది. చిన్న దాని ధర 2,999 రూపాయలు కాగా, 24 అంగుళాల మోడల్ ధర 4,299 రూపాయలు. గ్రే, బ్లూ, రెడ్ రంగుల్లో ఇది మార్కెట్లోకి వచ్చింది. -
ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ వచ్చేసింది..
న్యూఢిల్లీ : షావోమి నేడు మరో సరికొత్త ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్ డిజిటల్ డిస్ప్లే, లేజర్ సెన్సార్, 360 డిగ్రీల ట్రిపుల్ లేయర్ ఫిల్టర్‌తో ఈ డివైజ్ రూపొందించింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ అమెజాన్ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్‌ను ఆఫర్ చేస్తుంది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ తొలి సేల్‌ను సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది షావోమి కంపెనీ. దీన్ని ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఐ హోమ్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్‌అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం షావోమి ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ను కూడా రూ.8,999కే విక్రయిస్తున్నారు. -
రెడ్మి నోట్ 6 ప్రొ ధర లీక్
షావోమి స్టార్ పర్ఫార్మర్ రెడ్మి నోట్ 5 ప్రొకు సక్సెసర్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతుంది. రెడ్మి నోట్ 6 ప్రొ పేరుతో దీన్ని షావోమి రూపొందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గత కొన్ని వారాలుగా ఆన్లైన్లో రిపోర్టులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇన్ని లీకేజీలు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నా దాని అధికారిక లాంచ్ తేదీని మాత్రం ఇంకా రివీల్ కాలేదు. తాజాగా ఓ అంతర్జాతీయ రిటైల్ వెబ్సైట్లో రెడ్మి నోట్ 6 ప్రొ మరోసారి స్పాట్ అయింది. పాపులర్ ఇండియన్ టెక్ యూట్యూబర్ కూడా ఈ హ్యాండ్సెట్ వీడియోను అప్లోడ్ చేశాడు. తాజా రిపోర్టుల్లో రెడ్మి నోట్ 6 ప్రొ ధర లీకైంది. అంతర్జాతీయ ప్రముఖ వెబ్సైట్ పేర్కొన్న వివరాల ప్రకారం 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో వస్తున్న బేస్ వేరియంట్ ధర సుమారు రూ.25వేలుగా ఉండబోతుందని తెలిసింది. అంటే ప్రస్తుతమున్న రెడ్మి నోట్ 5 ప్రొ కంటే ఎక్కువే. ఈ లిస్టింగ్‌లోనే రెడ్మి నోట్ 6 ప్రొ అంతర్గత స్పెషిఫికేషన్లను కూడా పొందుపరిచింది. రెడ్మి నోట్ 6 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 1.8 గిగాహెడ్జ్ అక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ఎస్ఓసీ, వెనుక వైపు డ్యూయల్ కెమెరా(12 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్), ముందు వైపు డ్యూయల్ కెమెరా(20 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్, 6.26 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో సాఫ్ట్వేర్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, 256జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డు సపోర్టు ఉన్నాయని తెలుస్తోంది. మరోవైపు టెక్నికల్ గురుజి ఛానల్ నడుపుతున్న, భారత్ అతిపెద్ద యూట్యూబర్లలో ఒకరైన గౌరవ్ చౌదరి కూడా ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ వెర్షన్‌ను లీక్ చేశాడు. అధికారిక లాంచింగ్ కంటే ముందే ఈ స్మార్ట్‌ఫోన్ దుబాయ్‌లో విక్రయానికి వచ్చిందని పేర్కొన్నాడు. వెనుక, ముందు డ్యూయల్ కెమెరాలు, 6.26 అంగుళాల డిస్ప్లే, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఉన్నాయని వీడియో రివీల్ చేస్తుంది. అదేవిధంగా దుబాయ్‌లో విక్రయానికి వచ్చిన ఫోన్ ధర మన దేశ కరెన్సీ ప్రకారం రూ.14,800గా ఉందని యూట్యూబర్ చెప్పాడు. -
మరోసారి సేల్కు వచ్చిన షావోమి పోకో ఎఫ్1
మొబైల్ రంగంలో దూసుకెళ్తున్న చైనీస్ దిగ్గజం షావోమి. ఈ కంపెనీ తన సబ్‌బ్రాండ్ పోకో కింద పోకో ఎఫ్1 పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే నాలుగుసార్లు విక్రయానికి వచ్చి అదరగొట్టింది. నేడు కూడా ఈ స్మార్ట్‌ఫోన్ మరోసారి విక్రయానికి వచ్చింది. పోకో ఎఫ్1 స్మార్ట్‌ఫోన్ మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్‌లో విక్రయానికి ఉంచింది షావోమి కంపెనీ. మూడు వేరియంట్లు ఒకటి.. 6జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ మోడల్(ధర రూ.20,999), రెండు... 8జీబీ ర్యామ్, 256 స్టోరేజ్ ఆప్షన్(రూ.28,999), మూడు.. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ స్పెషల్ ఎడిషన్(ధర రూ.29,999)ను అందుబాటులో ఉంచింది. గ్రాఫైట్ బ్లాక్, స్టీల్ బ్లూ వేరియంట్లు ఫ్లిప్‌కార్ట్, షావోమి అధికారిక స్టోర్‌లో అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ప్రకటించింది. 6జీబీ ర్యామ్, 128జీబీ వేరియంట్ ఓపెన్ సేల్‌లో అందుబాటులో ఉంది. పోకో ఎఫ్ 1 ఫీచర్లు 6.18 అంగుళాల డిస్ప్లే 1080x2160 పిక్సెల్స్‌రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్ఓసీ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 12+5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ మాస్టర్ ఆఫ్ స్పీడ్ గా ఎఫ్1 స్మార్ట్‌ఫోన్‌ను పేర్కొన్నకంపెనీ ఐఆర్ ఫేస్ అన్‌లాక్, 1.4 మైక్రాన్ పిక్సెల్ అండ్ డ్యూయల్ పిక్సెల్ ఆటోఫోకస్ సెన్సార్ తదితర ఫీచర్లతో పోకోఫోన్ ఎఫ్1 అందుబాటులోకి తీసుకొచ్చింది షావోమి కంపెనీ. -
స్పెషల్ ఫీచర్లతో షావోమి స్మార్ట్ఫోన్లు
చైనా మొబైల్ మేకర్ షావోమీ కూడా ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వైపు మొగ్గు చూపింది. ఒప్పో, వివో స్మార్ట్ఫోన్ల తరహాలోనే ఐఆర్ ఫేస్ అన్‌లాక్ ప్రధాన ఫీచర్‌గా నూతన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. భారీ స్క్రీన్, ఐఆర్ ఫేస్ అన్‌లాక్, ప్రెషర్ సెన్సిటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఆకట్టుకునే ఫీచర్లతో ఎంఐ 8 ఫ్యామిలీ కొనసాగింపుగా ఎంఐ 8ప్రొ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో భారత్‌లోనూ ఈ ఫోన్‌ను విడుదల చేయనుంది. రూ.33,945 ప్రారంభ ధరకు ఈ ఫోన్ లభ్యం కానుంది. హై ఎండ్ వేరియంట్ ధర 38,000 రూపాయలుగా ఉండనుంది. దీంతోపాటు ఎంఐ 8 లైట్‌ను యూత్ ఎడిషన్ కూడా విడుదల చేసింది. ఎంఐ8 ప్రొ ఫీచర్లు 6.21 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2248 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 2.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్, 845 ప్రాసెసర్, 6/8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 12+ 12ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 20 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఎంఐ8 లైట్(యూత్ ఎడిషన్) ఫీచర్లు 6.26 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 660 సాక్ 12 +5 ఎంపీ ద్వంద్వ వెనుక కెమెరా 24ఎంసీ సెల్ఫీ కెమెరా 3,350 ఎంఏహెచ్‌బ్యాటరీ 4జీబీ /64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సుమారు 15వేలు, అలాగే 6జీబీ/64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 18,000. అలాగే 6జీబీ /128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. సుమారు 21, 000 -
రెడ్ మి 6 ఫ్లాష్ సేల్ నేడే
సాక్షి, న్యూఢిల్లీ: చైనా మొబైల్ మేకర్ షావోమి భారత మార్కెట్లో ఇటీవల లాంచ్ చేసిన రెడ్మి 6 స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ సేల్ నేడు ప్రారంభం కానుంది. రెడ్ మి 6 సిరీస్‌లో భాగంగా విడుదల చేసిన రెడ్ మి 6 సేల్ సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభం. ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కాం ప్లాట్ ఫాంలలో ఈ ఫ్లాష్‌సేల్ షురూ అవుతుంది. ధరలు : 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజి వేరియంట్ ధర రూ.7,999గా ఉండగా, 3జీబీ, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 9,499గా ఉంది. కాగా మొదటి రెండు నెలలు మాత్రమే ఈ ధరలు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. రెడ్మి 6 ఫీచర్లు : 5.45 అంగుళాల ఫుల్ స్క్రీన్ హెచ్డీ డిస్ప్లే, 12+5 ఎంపీ డ్యూయల్ కెమెరా, 5ఎంపీ సెల్ఫీ కెమెరా, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ తదితర ఫీచర్లున్నాయి. -
రెడ్ కలర్లో రెడ్మి నోట్ 5 ప్రొ
రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్ ఇన్ని రోజులు లేక్ బ్లూ, బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్ రంగుల్లోనే అందుబాటులో ఉండేది. తాజాగా మరో కలర్ వేరియంట్ కూడా కస్టమర్ల ముందుకు వచ్చింది. రెడ్మి నోట్ 5 ప్రొ రెడ్ కలర్ వేరియంట్‌ను షావోమి లాంచ్ చేసింది. దీంతో మొత్తంగా ఐదు రంగుల్లో రెడ్మి నోట్ 5 ప్రొ లభ్యమవుతుంది. ఈ డివైజ్ ప్రస్తుతం షావోమి అధికారిక సైట్లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఈ ఫోన్ త్వరలోనే లభ్యం కానుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే రెడ్మి నోట్ 5 ప్రొ లాంచ్ అయింది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 చిప్సెట్ ఫీచర్‌తో వచ్చిన తొలి డివైజ్ ఇదే. షావోమి లాంచ్ చేసిన రెడ్మి నోట్ 5 ప్రొ.. 6జీబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 6జీబీ ర్యామ్‌తో వచ్చిన తొలి నోట్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం. 4జీబీ ర్యామ్+64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజ్ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది షావోమి. వీటి ధరలు రూ.14,999గా, రూ.16,999గా ఉన్నాయి. ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌ను కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌తో షావోమి తన యూజర్లకు ప్రవేశపెట్టింది. 20 మెగాపిక్సెల్‌తో సెల్ఫీ షూటర్ కలిగి ఉండగా.. వెనుకవైపు 12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది.