రెడ్‌మి ఎస్2
షావోమి ఇటీవల చైనాలో లాంచ్ చేసిన అఫార్డబుల్ సెల్ఫీ సెట్రిక్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి ఎస్2. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇప్పుడు భారత్ మార్కెట్‌లోకి తీసుకొచ్చేస్తోందట. కానీ ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి వై2 పేరుతో భారత మార్కెట్‌లోకి లాంచ్ చేస్తుందని తెలుస్తోంది. తన తర్వాత స్మార్ట్‌ఫోన్ లాంచింగ్‌ను షావోమి తన ట్విటర్ అకౌంట్ ద్వారా ధృవీకరించింది. కొత్త రెడ్‌మి హ్యాండ్‌సెట్ లాంచింగ్ గురించి సోషల్ మీడియా ఛానల్స్‌లో టీజ్ చేసింది. బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్’ ను జూన్ 7న మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు షావోమి టీజర్ పోస్టు చేసింది. కానీ మిగతా వివరాలను వెల్లడించలేదు.
కంపెనీ టీజర్‌లో జూన్7న న్యూఢిల్లీలో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ లాంచ్ ఈవెంట్ ఉందని పేర్కొంది. అంతేకాక #ఫైండ్‌యువర్‌సెల్ఫీ, #రియల్‌యూ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ టీజర్‌ను పోస్టు చేసింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌ల్లో ‘వై’ను హైలెట్ చేసింది. దీంతో షావోమి జూన్ 7న తీసుకొచ్చే డివైజ్ రెడ్‌మి వై2 అని తెలుస్తోంది. కానీ కంపెనీ ఇటీవల చైనాలో లాంచ్ చేసిన స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి ఎస్2. ఇదే కంపెనీకి బెస్ట్ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌గా షావోమి అభివర్ణించింది. దీంతో రెడ్‌మి ఎస్2 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి రెడ్‌మి వై2 పేరుతో లాంచ్ చేయనుందని సమాచారం.
రెడ్‌మి వై1, రెడ్‌మి వై1 లైట్ స్మార్ట్‌ఫోన్లకు కొనసాగింపుగా రెడ్‌మి ఎస్ 2 వచ్చింది. రెడ్‌మి ఎస్2 అచ్చం ఎంఐ 6ఎక్స్ మాదిరిగానే ఉంది. అయితే ఎంఐ 6ఎక్స్ కంటే రెడ్‌మి ఎస్2నే తక్కువ. ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎం1, హానర్ 9 లైట్ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.
రెడ్‌మి ఎస్2 ధర..
3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజ్ ధర సీఎన్‌వై 999(సుమారు రూ.10,600). 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర సీఎన్‌వై 1299(సుమారు రూ.13,700). ఈ రెండు వేరియంట్లు గోల్డ్, ప్లాటినం సిల్వర్, రోజ్ గోల్డ్ రంగుల్లో అందుబాటు. అయితే భారత్‌లో వీటి ధరలు ఎంత ఉంటాయన్నది ఇంకా రివీల్ కాలేదు.
రెడ్‌మి ఎస్2 స్పెషికేషన్లు
ఆండ్రాయిడ్ ఆధారిత ఎంఐయూఐ 9
5.99 అంగుళాల హెచ్డీ ప్లస్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 625 ఎస్‌ఓసీ
12 మెగాపిక్సెల్, 5 మెగాపిక్సెల్ సెన్సార్లతో వెనుకవైపు రెండు కెమెరాలు
ముందు వైపు 16 మెగాపిక్సెల్ కెమెరా
256జీబీ వరకు విస్తరణ మెమరీ
3080 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment