రెడ్‌మి నోట్‌ 6 ప్రొ ధర లీక్‌ | Xiaomi Redmi Note 6 Pro Price Leaked Again | Sakshi
Sakshi News home page

రెడ్‌మి నోట్‌ 6 ప్రొ ధర లీక్‌

Published Thu, Sep 27 2018 9:37 AM | Last Updated on Thu, Sep 27 2018 12:55 PM

Xiaomi Redmi Note 6 Pro Price Leaked Again - Sakshi

షావోమి స్టార్‌ పర్‌ఫార్మర్‌ రెడ్‌మి నోట్‌ 5 ప్రొకు సక్సెసర్‌ త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతుంది. రెడ్‌మి నోట్‌ 6 ప్రొ పేరుతో దీన్ని షావోమి రూపొందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి గత కొన్ని వారాలుగా ఆన్‌లైన్‌లో రిపోర్టులు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఇన్ని లీకేజీలు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నా దాని అధికారిక లాంచ్‌ తేదీని మాత్రం ఇంకా రివీల్‌ కాలేదు. 

తాజాగా ఓ అంతర్జాతీయ రిటైల్‌ వెబ్‌సైట్‌లో రెడ్‌మి నోట్‌ 6 ప్రొ మరోసారి స్పాట్‌ అయింది. పాపులర్‌ ఇండియన్‌ టెక్‌ యూట్యూబర్‌ కూడా ఈ హ్యాండ్‌సెట్‌ వీడియోను అప్‌లోడ్‌ చేశాడు. తాజా రిపోర్టుల్లో రెడ్‌మి నోట్‌ 6 ప్రొ ధర లీకైంది. అంతర్జాతీయ ప్రముఖ వెబ్‌సైట్‌ పేర్కొన్న వివరాల ప్రకారం 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో వస్తున్న బేస్‌ వేరియంట్‌ ధర సుమారు రూ.25వేలుగా ఉండబోతుందని తెలిసింది. అంటే ప్రస్తుతమున్న రెడ్‌మి నోట్‌ 5 ప్రొ కంటే ఎక్కువే. 

ఈ లిస్టింగ్‌లోనే రెడ్‌మి నోట్‌ 6 ప్రొ అంతర్గత స్పెషిఫికేషన్లను కూడా పొందుపరిచింది. రెడ్‌మి నోట్‌ 6 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు... 1.8 గిగాహెడ్జ్‌ అక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 636 ఎస్‌ఓసీ, వెనుక వైపు డ్యూయల్‌ కెమెరా(12 మెగాపిక్సెల్‌+5 మెగాపిక్సెల్‌), ముందు వైపు డ్యూయల్‌ కెమెరా(20 మెగాపిక్సెల్‌+5 మెగాపిక్సెల్‌, 6.26 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో సాఫ్ట్‌వేర్‌, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 256జీబీ వరకు మైక్రోఎస్డీ కార్డు సపోర్టు ఉన్నాయని తెలుస్తోంది. 

మరోవైపు టెక్నికల్‌ గురుజి ఛానల్‌ నడుపుతున్న, భారత్‌ అతిపెద్ద యూట్యూబర్లలో ఒకరైన గౌరవ్‌ చౌదరి కూడా ఈ స్మార్ట్‌ఫోన్‌ గ్లోబల్‌ వెర్షన్‌ను లీక్‌ చేశాడు. అధికారిక లాంచింగ్‌ కంటే ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌ దుబాయ్‌లో విక్రయానికి వచ్చిందని పేర్కొన్నాడు. వెనుక, ముందు డ్యూయల్‌ కెమెరాలు, 6.26 అంగుళాల డిస్‌ప్లే, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఈ స్మార్ట్‌ఫోన్‌కు ఉన్నాయని వీడియో రివీల్‌ చేస్తుంది. అదేవిధంగా దుబాయ్‌లో విక్రయానికి వచ్చిన ఫోన్‌ ధర మన దేశ కరెన్సీ ప్రకారం రూ.14,800గా ఉందని యూట్యూబర్‌ చెప్పాడు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement